వలతి కి విదిష మొఖము కుంపట్లో మాడిన జొన్న కండి వలె కనిపించుచుండ " అయ్యో హార్పర్ కొలిన్ ప్రచురణలు గూర్చి చెప్పకుండిన బాగుండెడిది " అని అనెను. విదిష తోక తొక్కిన త్రాచు వలె లేచి పుస్తక ప్రచురణలు గూర్చి నాకేల చింత " ఆ నందిని ఏమన్నదో చెప్పుము" “ఇప్పటికి పదిసార్లు చెప్పితిని , కంచము లో భోజనముమున్నది తినక ఎందుకిట్లు కలత చెందుచున్నావు ?" "ఆ నందిని ఏమన్నదో చెప్పుము" అని విదిష మరల అదే పాట పాడు చుండెను.
మారెమ్మ : ఇప్పుడాయన ధనికుడైనాడని సంతోషించవలెనుకదా.
విదిష: బల్ల పైనున్న మంచినీటి గ్లాసును తోసి వేసి " బికారి అయిన నేమి కోటీశ్వరుడైననేమి ,నాకేమి ఒరిగెను? ఆ నందినితో ఊరేగి సర్వనాశనమై పోవును గాక నాకేమి ? ఆ నందిని ఏమన్నదో చెప్పుము?
వలతి : అతడికెట్లు సాయపడవలెనో వారెవ్వరికీ తెలియదు.
విదిష: అదికాదు , అటుపిమ్మట ఏమనెను ?
వలతి: నాప్రియు నికొరకు ఏమి జేసినానో, ఇప్పుడేమి చేయ బోవుచున్నానో చూడుము నా మనసు నా ఆడతనము చూపెదను”అని అనెను.
వలతి: ఆపిమ్మట ఏమి జరిగెను?
వలతి: ఈమె నాశిష్యురాలే" యని వర్షుడామెను అభిమానంతో దగ్గరకి తీసుకొనెను.
విదిష: ఆపిమ్మట ఏమి జరిగెను?
వలతి: నందిని కళ్ళు తిరిగి క్రింద పడిపోయెను వర్షుడు ఆమె నెత్తుకొనెను
మారెమ్మ : వలతి తో ఎందుకమ్మా మాత కి అవన్నీ చెప్పినారు
విదిష : ఏమే , నేను మాత వలె కనిపించుచున్నానా? ఆ నందిని అమ్మాయి వలే కనిపించు చున్నదా అని చండ కోపమున లేచెను, మాలిని గారు రాకుండిన ఏమిజరుగునో తెలియదు గానీ ..
మారెమ్మ, వలతి : మీ అత్తగారు వచ్చినారు. మీ అత్తగారు వచ్చినారు అనుచూ పెద్ద గండ ము గడిచెనని జారుకొనిరి.
మాలిని విదిషను గుండెలకు హత్తుకొని నేనొచ్చేసాను కదా అని ముద్దాడి ఓదార్చెను. విదిషకు కన్నీరు ఆగకుండెను "అత్తయ్య మీరు నా కండగా నిలవకున్న నా పరిస్థితి నేడు ఎట్లుండెడిది?" అనుచున్న ఆమెతో " నిన్ను ఎప్పుడో మాఇంటి కోడలనుకొంటిమి" ఇలా కూర్చో అమ్మా అని ముద్దలు కలిపి తినిపించసాగెను.
“ఒకప్పుడు వాడి గూర్చి నాకు చాలా దిగులుండెడిది. ఆకతాయిగా తిరుగు వాడే ఉజ్జోగమ యిననూ జేసుకొని వచ్చు , వర్షుని విషయమెట్లు కాదు. ప్రపంచములోనే పేరెన్నిక గన్న ప్రకాశకులట వారు , మా అబ్బాయి పుస్తకములను ముద్రించుటయేకాక సంపాదకునిగా భాద్యతలు కూడా ఇచ్చినారు. ఆ గోపాలుని దయ వల్ల నా చింతలన్నీ తీరినవి. ఇంక త్వరలో మీ వివాహము జరిపించినచో నాకు , తిండి మానివేయుట ఈ అలకలు ఉండవు.”
విదిష మొఖం వెలిగి పోవుచున్నది. ఏడుపు ఛాయలు మాటు మాయమైనవి " చాలు చాలు కడుపు నిండినది" అని తినుట ఆపివేసెను
మాలిని : ఒక్క మొట్టికాయ పెట్టి , పెళ్లి కూతురనిన ఎట్లుండవలెను ? ఆ నందినిని చూడుము గిత్త వలే నున్నది.
విదిష : దాని దేమున్నది. నేను గజమువలె నుండెదను.
మారెమ్మ : అమ్మాయిగారు , వారు వచ్చుచున్నారు ?
విదిష : వారానిన ఎవరు? పేరు లేదా ?
మారెమ్మ : అదేనమ్మా మిమ్మల్ని కట్టుకోబోయేవారు. మారెమ్మ వెడలెను
విదిష : అయ్యో అత్తయ్యా మీరు తెరవెనుక దాగవలెను
మాలిని : నాకు చేత కాదమ్మా ఈ నక్కు ట దాగుడుమూతలు
విదిష : అయ్యో అత్తయ్యా మీకు మొక్కెదను ఆయన ఎప్పుడోగాని రారు అని మాలినిగారిని తెరవెనుకకి నెట్టి వేసెను.
వర్షుడు: విదిషా!!! భోజనము తినకున్నావని తెలిసెను అలిగితివా !
విదిష మొఖం పక్కకు త్రిప్పుకొని కూర్చొనెను.
నాకు తెలుసు తెలుసు నీ అలక ఎట్లు పోగొట్టవలెనో అని చుబుకం పట్టి ఆమె మొఖమును తనవైపు త్రిప్పుకొనెను. వర్షుని స్పర్శ తగలగానే ఆమె కన్నులు వాలినవి ఊపిరి మందగించి నది. ఒళ్ళు వేడెక్కినది. “అన్నం తినవూ” "ఊహు” బల్లవద్దనుంచి లేచి గోడకున్న అద్దము వద్దకు పోయి చేతులు రెండు వెనుకకు పెట్టి నిలిచెను.
శ్యామల నునుమేను కాంతులీన స్నిగ్ద పెందొడ లందము పిలుచుచుండ కప్పుఁ భాసురమగు బావడ యెడలించి ఊరువుల హత్తుకొనగ, కంభ దృఢ బింకము కనుల కాల్చుచుండ కౌను క్రిందకు జార చేలము చిక్కిన నడుము చక్కదనము రెచ్చగొట్ట , జీరాడు పావడ నత నాభి ని జూప, జిలుగు పైట తొలగి కుందనపు కుటములు జూపె. విటప అధరములు విభుని రాక చూచి వణుకు చుండ భోగ్య లావణ్య మంత కను విందు జేయ నిగ్రహమేపాటి నిలుచు మరుని అవసరము లేక మగతనమును మేలుకొనదా
అట్లు చిరు అంగల ఆ అంగనను సమీపించి ఆమె అందము తడిమి అంగాగమును చుంబిచు చుండ ఆ జవ్వని అడ్డు చెప్పక మెలికల కుంతలములు వలే మెలికలు తిరుగుచుండె. మధుర లాలసనొందుచు మత్తుకనులెత్తి ప్రియుని ఓరకంట చూడ, కనులు కనులు కలిసె. రాజుకొని అగ్గి రగిలే ప్రియుడు. కాంక్ష జ్వాలాలందు సిగ్గు మాడిపోగ మరుని బలముగ లాగి బాహువుల బందించె. మెరుపు తాకిడి వలె తెరచాటునున్న ప్రౌఢ గుర్తుకొచ్చి ఆపమని వారించుచున్న వినక హత్తుకొని వీడాడాయే. శ్వాస స్తంభించి మగువ ఉక్కిరి బిక్కిర గుచు అతడి అధరమును కాటు వేసె, కెవ్వ నరచి వర్షుడు ప్రియురాలి కౌగిలి తొలగె. పిదప ఆమెను తన చేతులలో ఎత్తుకొని బల్లవద్దకు తీసుకొని పోయి భోజనము గోరుముద్దలు చేసి తినిపించెను.
No comments:
Post a Comment