కామాక్షీ నాకూతురికి ఉత్తమ పైలెట్ గా ప్రధమ బహుమతి వచ్చినదే. బారామతి యందు ఆ బహుమతి తీసుకొను నప్పుడు నేనుండవలెనని పట్టుబట్టగా నేను ఇచ్చటకి వచ్చినాను. కాకినాడ నందు లేను. దగ్గరకి వచ్చు కూతురిని చూసి “మరల మాటలాడెదను” అని దూరవాదన నిలిపివేసెను.
సు : అమ్మా నాశిక్షణ సంస్థ యందు ఉత్తమ వైమానిక విద్యార్థినిగా ఎంపికచేసి సత్కరించి నారు అంతే కానీ నాకింకనూ ఉజ్జోగము రాలేదు నేను పైలట్ కానూలేదు. రేపు ఇంకా నూ పరీక్ష కలదు
తు: మొన్ననే ఇంటర్వ్యూ పరీక్ష జరిగెను కదా మరల మరియొక పరీక్షా?
సు : అమ్మా ఇండిగో విమానయాన సంస్థ నందు వైమానికురాలు కావలెనన్న మూడేమి ఖర్మము ముప్పది పరీక్షలైననూ , ముప్పతిప్పలు పెట్టిననూ తప్పవు గాక తప్పవు.
తు: అయినచో ఇంకనూ రెండు పరీక్షలు కలవా?
సు : భారతదేశమున అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో నందు అవకాశము వచ్చుట పెద్ద దృష్టము గా భావించ వలెను. ఇచ్చట ఎంపిక పరీక్షలు మూడు వలయములలో నుండును. మొదటి పరీక్ష అయినది. రెండవ పరీక్ష గురుగాం లోగల కేంద్ర కార్యాలయమందు నిర్వహించ బడును , పిదప ముంబై లో చివరి పరీక్ష.
తు: ఈ పరీక్షలు చూచి చూచి వెగటగుచున్నది!
సు : ఈ మూడు పరీక్షలే వెగటయినచో మొత్తము పరీక్షలు గూర్చి విన్నచో ఏమందువో!
మొదటి పరీక్ష క్లాస్ 2 తరువాత క్లాస్ 1 మెడికల్స్ పరీక్షలందు నెగ్గి అనంతరము గ్రౌండ్ స్కూల్లో సుమారు 8 నెలలు కూర్చుని 7 వ్రాత పరీక్షలందు గెలుపొంది ఆ తరువాత అన్ని వాతావరణ పరిస్థితులలో 200 గంటలు ఎగరి అన్ని ప్రమాణములు పూరించగా ఇండిగో పరీక్షకు హాజరగు అవకాశము వచ్చినది. నియామక ప్రక్రియ మూడు వలయములు నాలుగు భాగములుగాయుండును అన్నిటా గెలుపొందిన పిదప 2 కోసంవత్సరాలు పైలట్గా ఇత్తురు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు నాకిచ్చు లైసెన్స్ కొరకు 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత నొందవలెను ఇండిగో ఉత్తీర్ణత శాతం దాని కంటే చాలా ఎక్కువ.
తు: ఇంతకీ నీకిచ్చునది సహ వైమానికురాలిగానా?
సు : అమ్మా తులశమ్మ! ఊరకనే పైలట్ ఉజ్జోగ మిత్తురా? భారతదేశంలో సుమారు 7000 మంది నిరుద్యోగ సిపిఎల్ కలవారు ఉన్నారని నీకు తెలియునా? సంవత్సరంలో నియామకాలు 30-40 మాత్రమే అని నీకు తెలియునా?
తు: అవన్నీ నాకు తెలియవు నాకూతురు తెలివియందు సరస్వతి, ధైర్యమందు దుర్గ అందమందు అపరంజి బొమ్మ అని తెలియును అని అనుచుండగా “వెవ్వె వెవ్వె” అనుచున్న కూతురిని ఆలింగనము జేసుకొని ముద్దిడెను.
సు : నేడు నేను గురుగావ్ పోయివత్తును
తు: అది ఇచ్చట కలదా, బారామతి బొంబాయి వద్ద , గురుగావ్ ఢిల్లీ వద్ద నున్నవి. కనీసము 1400 కిలోమీటర్ల దూరముండును. ఈరోజే ఎట్లు పోయెదవు?
సు : సుందరి ప్రయాణము లన్నియూ నాటికల్ మెయిల్స్ లో నే యుండును అని కన్ను కొట్టెను.
తు: అనగా నీవు రైలులో పోవుటలేదా?
సు : సుందరి ఎచ్చటికి పోయిననూ ఆకాశమార్గమునే నని తలంచవలెను.
తు: నీకు దూకుడెక్కువగుచున్నది బల్లిపాడు పోయి అక్కడ ముక్కుతాడు వేయ వలెను.
సు : అరుణమ్మ బల్లిపాడు పోవలెనని చెప్పినది. ఎంపికయ్యి, ఉద్యోగమున జేరుటకు సమయమివ్వనున్నచో ఏమి చేయవలెను. బల్లిపాడు ఎందులకు పోవలెనని నాకు బెంగగా యున్నది.
తు:ఈ కీళ్ల వాతముతో ఎట్లు పోవలెనో యని నాకు బెంగగా యున్నది. కాకినాడలో ఉన్నచో బాగుండెడిది బల్లిపాడచ్చటికి దగ్గర కానీ ఇప్పుడు జూడుము బారామతి నుండి బల్లిపాడు పోవలెనన్నా ఎన్ని గంటలు కూర్చొనవలెనో? కానీ ఉత్సవము కనుల వైభవముగా జరుగునని అరుణమ్మ చెప్పెను. ఒక్క సారైననూ చూచి తీరవలెనని ఆమె చెప్పెను
సు :అట్లయిన నేను నందినిని పిలుతును , ఆమె కూడా అందరిని కలువ వచ్చును
వైమానికురాలు గా ఎంపిక పొందుటకు ఎన్ని అంచలు దాటవలెనో గదా అని కించిత్ నిరాసక్తత గ ఉన్నను సుందరి ఉత్సాహము ముందు తేలికయైనది
ReplyDeleteThank for your feedback, hopefully coming episodes will entertain you more.
ReplyDelete