సుందరి గువ్వ వంటి తెల్లకాగితముపై ఉత్తరమును వ్రాసి పరుపుపై పెట్టి స్నానమునకు పోయెను. గాలికి ఆ గువ్వ ఎగిరి మండువాలోకి వచ్చి అల్లాడుచూ శత్రుదేశపు పావురము మన జవానులకు చిక్కినట్టు అక్కడున్న అరుణతారకు చిక్కెను. అరుణతార " నామొదటిరాత్రి అనుభవము అను మాటలు కనిపించుటతో కలవరపడి ఉత్తరమును కడదాకా ఏకబిగిన చదివి నిట్టూర్చెను. ఆ చివరి వాక్యము మరొకసారి చదినామె కన్నులార్ద్రమాయెను. వెంటనే అరుణతారదూరవాణి నందుకొనెను
అరుణ: హలొ తులసీగారా నేను అరుణను.
తులసి: అరుణమ్మగారా నమస్కారం ఎట్లున్నారు? మీ అమ్మాయి బాగున్నదా?
అరుణ: నేను బాగున్నాను, నాకు ఇద్దరమ్మాయిలున్నారు. ఏ అమ్మాయి గురించి మీరు అడుగుతున్నారు ? పెద్దమ్మాయి చదువు మాని, చిత్రరంగమందున్నది. ఆమె గురించి నేను చేయగలిగినది ఏమియునూ లేదు, వలసినచో డబ్బు పంపుట తప్ప . ఇంక రెండవ అమ్మాయి చదువు కొనుచు నా కోరిక తీర్చుచున్నది.
తులసి: అంతా మా అదృష్టం అమ్మా, సుందరి ఎట్లున్నది ? చివరి పరీక్ష దగ్గరికివచ్చుచున్నదని చెప్పినది . ఆమెలో ఆందోళన కనిపించుచున్నది .
అరుణ: పరీక్షలన్న ఆందోళన ఉండుట సహజమేకదా. అది మంచి విద్యార్థుల లక్షణము. అటువంటి వారిని చూడముచ్చట గా నుండును.
తులసి: అవునమ్మా, అమ్మాయి చెప్పినది . ఆమె చదువు కొనుట చూచుటకు కొన్ని రాత్రులు మెలుకువగా నుండి చూచి ఎంతగానో సంతోషించెడివారని .
మరి అమ్మాయి పెళ్లి విషయము మాటలాడవలెన నుకొనుచున్నాను.
తులసి: కానీ ఇంకనూ పరీక్షలున్నవి కదా! పరీక్షలో గెలుపొందవలెను కదా!
అరుణ: పరీక్షలయిన పిదపనే, మా అమ్మాయి పరీక్షలో గెలుపొందుట ఒక పెద్ద విషయము కాదు. వచ్చే వారములో పరీక్ష ముగిసి పైలట్ లైసెన్స్ కూడా పొందును. కానీ ఇప్పుడు చూచుకొని వీలయినంత త్వరలో ..
తులసి: అటులనే , నమ్మా మీరు అన్ని భాద్యతలు తీసుకుని దానిని కన్న తల్లివలె సాకుచున్నారు ( కన్నీళ్ల పర్యంతమగుచూ )
అరుణ: మా కేశవుడు చక్కగా ఉంటాడు , అమ్మాయికి తగిన ఒడ్డుపొడవు , రంగు . వాడునూ మా అబ్బాయి వంటి వాడే. గుణము యందాణి ముత్యము వాడికి మీ పిల్లను.....
తులసి: మీరడగవలెనా తల్లీ , అట్లే చేయుడు , మీ మాట నా మాట.
అరుణ: అట్లని మీకు కాకున్ననూ పిల్ల కైననూ వరుని చూపవలెను కదా, వచ్చే వారము బల్లిపాడులో వేణు గోపాల స్వామి కళ్యాణ ఉత్సవము జరుగును. ఆ గ్రామ పండుగకు నేను ప్రతి ఏడు పోయివత్తును. కావున వచ్చేవారం మీరు అచ్చటకు రావలెను. అమ్మాయిని నేను తీసుకు వచ్చెదను. అని అరుణతార అనగా , తప్పక వచ్చెదను. అని తులసి గారు చెప్పి సంభాషణను ముగించినారు.
సుందరికి వివాహ గడియలు వచ్చినవి అన్నమాట
ReplyDeleteపాత తరం మనిషి , అమ్మ మనసు ఉన్న అరుణతార ఏవయసుకా ముచ్చట అని భావించింది
DeleteYou can also visit my website
ReplyDeleteBest Horror Movies On the Netflix