Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, November 13, 2020

Bharatavarsha 68

సుందరి గువ్వ వంటి తెల్లకాగితముపై  ఉత్తరమును వ్రాసి  పరుపుపై  పెట్టి స్నానమునకు పోయెను. గాలికి ఆ గువ్వ  ఎగిరి మండువాలోకి వచ్చి అల్లాడుచూ శత్రుదేశపు పావురము మన జవానులకు చిక్కినట్టు అక్కడున్న అరుణతారకు చిక్కెను. అరుణతార " నామొదటిరాత్రి అనుభవము అను మాటలు కనిపించుటతో కలవరపడి ఉత్తరమును కడదాకా ఏకబిగిన చదివి నిట్టూర్చెను. ఆ చివరి వాక్యము మరొకసారి చదినామె కన్నులార్ద్రమాయెను. వెంటనే అరుణతారదూరవాణి నందుకొనెను 

అరుణ: హలొ తులసీగారా నేను అరుణను.

తులసి: అరుణమ్మగారా నమస్కారం ఎట్లున్నారు? మీ అమ్మాయి బాగున్నదా?

అరుణ: నేను బాగున్నాను, నాకు ఇద్దరమ్మాయిలున్నారు. ఏ అమ్మాయి గురించి మీరు అడుగుతున్నారు ? పెద్దమ్మాయి చదువు మాని, చిత్రరంగమందున్నది.  ఆమె గురించి   నేను చేయగలిగినది ఏమియునూ లేదు, వలసినచో డబ్బు పంపుట తప్ప . ఇంక రెండవ అమ్మాయి  చదువు కొనుచు  నా కోరిక తీర్చుచున్నది. 

తులసి: అంతా మా అదృష్టం అమ్మా, సుందరి ఎట్లున్నది ? చివరి పరీక్ష దగ్గరికివచ్చుచున్నదని చెప్పినది . ఆమెలో  ఆందోళన కనిపించుచున్నది . 

అరుణ: పరీక్షలన్న ఆందోళన ఉండుట సహజమేకదా. అది  మంచి విద్యార్థుల లక్షణము. అటువంటి వారిని చూడముచ్చట గా నుండును. 

తులసి: అవునమ్మా, అమ్మాయి చెప్పినది . ఆమె  చదువు కొనుట చూచుటకు కొన్ని రాత్రులు  మెలుకువగా నుండి చూచి ఎంతగానో  సంతోషించెడివారని . 

మరి అమ్మాయి పెళ్లి విషయము మాటలాడవలెన నుకొనుచున్నాను. 

తులసి: కానీ ఇంకనూ  పరీక్షలున్నవి కదా! పరీక్షలో గెలుపొందవలెను  కదా! 

 అరుణ: పరీక్షలయిన పిదపనే, మా అమ్మాయి పరీక్షలో  గెలుపొందుట   ఒక పెద్ద విషయము కాదు.  వచ్చే వారములో  పరీక్ష ముగిసి  పైలట్ లైసెన్స్  కూడా పొందును.  కానీ ఇప్పుడు  చూచుకొని వీలయినంత త్వరలో .. 

తులసి: అటులనే , నమ్మా  మీరు అన్ని భాద్యతలు తీసుకుని దానిని కన్న తల్లివలె సాకుచున్నారు ( కన్నీళ్ల పర్యంతమగుచూ )

అరుణ: మా కేశవుడు చక్కగా ఉంటాడు , అమ్మాయికి తగిన ఒడ్డుపొడవు , రంగు . వాడునూ మా అబ్బాయి వంటి వాడే.  గుణము యందాణి  ముత్యము  వాడికి మీ పిల్లను..... 

తులసి: మీరడగవలెనా తల్లీ , అట్లే చేయుడు , మీ మాట నా మాట. 

అరుణ: అట్లని  మీకు  కాకున్ననూ  పిల్ల కైననూ  వరుని చూపవలెను కదా, వచ్చే వారము బల్లిపాడులో వేణు గోపాల స్వామి  కళ్యాణ ఉత్సవము  జరుగును. ఆ గ్రామ పండుగకు  నేను ప్రతి ఏడు పోయివత్తును. కావున వచ్చేవారం మీరు  అచ్చటకు రావలెను.  అమ్మాయిని నేను తీసుకు వచ్చెదను.  అని అరుణతార అనగా , తప్పక వచ్చెదను. అని తులసి గారు చెప్పి సంభాషణను ముగించినారు.  

3 comments:

  1. సుందరికి వివాహ గడియలు వచ్చినవి అన్నమాట

    ReplyDelete
    Replies
    1. పాత తరం మనిషి , అమ్మ మనసు ఉన్న అరుణతార ఏవయసుకా ముచ్చట అని భావించింది

      Delete