Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, January 25, 2021

Bharatavarsha 119

 మధ్యాన్నాము 3. 00 గంటలు అందరూ మండువా గదిలో కూర్చొని విశ్రాన్తి తీసుకోను చుండిరి. వలదు మొర్రో అని మొత్తుకొనుచున్ననూ వినక జానకిగారు మాటి మాటికీ ఏదో ఒకటి పళ్లెములలో పెట్టి నోటికి అందించుచున్నారు. ఆమె పళ్లెములతో వచ్చుట చూసి యమునకు చమటలు పట్టుచున్నవి. మధ్యానమునకు ఇదే ఆఖరు అనుచూ జానకిగారు కేరళ పిండివంటలు ఉన్ని అప్పము, చట్టి పతిరి, ముత్తమాల లతో అతిధులను సత్కరించిరి. ఇంకా రాత్రి కేమి చేయు చున్నదో తల్లి అని మీనాక్షికి గుండె కొట్టుకొనుచుండగా “కేరళ ప్రత్యకతలెట్లున్నవి అని జానకి గారు అడిగిరి.  "కేరళ కుత్తుకలో ఉన్నది అని మీనాకి బదులు పలికెను. 

మీనాక్షి చుట్టూ గోడలు చూచుచుడెను. “కేరళ వంటలవలె కేరళ గృహ అలంకరణలు కూడా మనమును ఆహ్లాద పరుచున్నవి.” అని యమునతో మెల్లగా అనెను.  ఆమె పక్కకు చూచు చుండగా జానకి గారు మరిన్ని ఉన్ని అప్పములు వడ్డించిరి. 

నీటితో నిండిన ఉత్తురిలి కుండిక నేలపై ఒక మూలగా అమర్చబడెను, గుమ్మానికి కట్టిన వస్త్ర తోరణములు గాలికి వూగుచుండెను, వ్రేలాడుచున్న ఇత్తడి పంచములు, టేకు ధీరఘోత్పీఠిక పై (rectangular desk) నుంచబడిన ముచ్చట గొలుపు లలితాంబిక రాతి విగ్రహము, రఘువరన్ గారి గది ప్రవేశ ద్వారము వద్ద చెరువైపులా నెత్తి పట్టములను మీనాక్షి ఆసక్తిగా తిలకిచుచుండెను.  

వాటిగురించి వివరించుచూ జానకి గారు పిండి వంటలు రెండు విడతలు వడ్డించినారు. మూడవ విడత వడ్డించుచుండగా మీనాక్షి గ్రహించి "ఏవమ్మా పక్కకి చూచుచుండగా ఇట్లు వడ్డించి తినమనుచున్నావే అని గయ్ మనెను. యమున మీనాక్షి కోపమును చూచి కిసుక్కున నవ్వెను. అయినచో తినును అనుచూ మీనాక్షి తన పళ్ళెములో అప్పచ్చిలను యమున పళ్ళెములో వేయగా యమున ముఖము కళ తప్పినది. 

ఆ ప్రక్కనే ఉన్న ప్రఫుల్ల గది ప్రవేశద్వారం పై మోహినియట్టం కిరీటము ధరించిన ముఖము ఒక వంక గోడకు వేల్లాడు చుండెను. అప్పచ్చిలు తిన్న పిదప ప్రఫుల్ల మోహినీ యట్టం ముఖము ధరించి ఆ నాట్యమును ప్రదర్శించుచుండెను. “ఆంధ్రాలో కూచిపూడివలె ఈ నాట్యము జనాదరణ పొందినది.” అని జానకిగారు అనగా, “ఎవరు కనిపెట్టినారో గానీ ఈ నాట్యము అద్భుతముగా నున్నది అని యమున అనెను.

 మహారాజ రామవర్మ 18 వ శతాబ్దం లో  ట్రావెన్కోర్ రాజ్యాన్ని పరిపాలించిన  రాజు. అతను అద్భుతమైన సంగీత స్వరకర్త   కర్ణాటక మరియు హిందూస్థానీ శైలిలో 400 కి పైగా శాస్త్రీయ స్వర కల్పనలు చేసి ఘనత కెక్కిన పండితుడు  అతని కాలమందు ఈ మోహినీయాట్టం సృజించబడినది. అని జానకి గారు చెప్పగా. ఈ విషయములన్నీ మీ కెట్లు తెలియును అని యమున అడిగెను. మాతాత ముత్తాతలు ఆ కొలువులో నాట్యాచార్యులుగా నుండి రాచ కన్యలకు అంతఃపురకాంతలకు నాట్యమును నేర్పెడివారు. అదే కాలమందు మీనాక్షి పూర్వీకులు కూడా ట్రావంకోరు రాజులవద్ద నున్న పండితులు అగుటచే యమున  మీనాక్షి ఆమె వైపు విడ్డూరంగా చూచిరి. కానీ ఆమె మరొక విధముగా అర్ధము చేసుకొనిఆమె ఎదో చెప్పుచుండగా ప్రఫుల్ల తన నాట్యమును మీనాక్షి చూచుటలేదని వగచు చుండుటతోమీనాక్షి ప్రఫుల్లను సముదాయించి నాట్యము చేయమనెను. 

అప్పుడు ప్రఫుల్ల చక్కటి భంగిమలతో కదలికలతో లాస్యముపై దృష్టి నిలిపి నృత్త సౌదర్యమును చూపెను. ఆ నాట్యమును చూచిన అందరి హృదయములు గెంతులువేయుచున్నవి. ఇంతలో రఘువరన్ గారికి ఫోను వచ్చెను. 

ఎల్లుండి కొత్తచిత్రము ఆడియో విడుదలకు ఆహ్వానించుచున్న దర్శకుడు రాజేంద్రన్ కు మీనాక్షి గూర్చి తెలిపి ఆమె స్వరములు నీ చిత్రమునకు మెరుగులు దిదునని చెప్పి ముగించెను. కొలది సేపు తరువాత రాజేంద్రన్ జానకి నిలయం నందుండెను.

ఎల్లుండి విడుదల అనగా నేడు కొత్త గీతము పెట్టుట కష్టమేమో అని మీనాక్షి అనుచుండగా రాజేంద్రన్ "ఒక్కటేమి మీరు సంగీతము సమకూర్చిన దానికి తగ్గ పాట వ్రాయించి పెట్టుకొందును, ఒక్కటని పరిమితేమియునూ లేదు, మీరు నాలుగు ఇచ్చిననూ, పది ఇచ్చిననూ పదిలంగా దాచుకొని తదుపరి చిత్రములో వాడుకొందును అని వత్తిడి చేయుచుండగా మీనాక్షి ఇంకనూ అంగీకరించ కుండెను.

ఇంతలో కృష్ణన్ తప్పదు మీనా అని తన ప్రేమికవలె ఊహించుకొని " మా కేరళకు కూడా నే స్వరములు రుచి చూపవలెను, తప్పదు, నీ మాట నేను నామాట నీవు విన్నచో అద్భుతములు జరుగును అని చెప్పుచుండగా మీనాక్షి " నేనిచ్చిన బహుమతి జీవిత కాలము ." అను చుండగా " ఎంద గురువాయూరప్పనే !  అని పొంగిపోవుచూ యు నాటీ గర్ల్ అని ఆమె చేతినందుకొని బయలుదేరెను . మీనాక్షి నవ్వుతూ అతడితో సాగు చుండెను.    భుజము భుజము రాసుకొనుచూ సాగుచున్న వారి జంటను చూసిన ప్రపుల్లకు తలలో మెరుపులు మెరిసినవి. మామయ్య కంసుని వలే కీచకుని వలే రావణుని వలే వికట్టహాసము చేయుచున్నట్టు అనిపించెను. మీనాక్షి చేతిని అతడు తన చేత పట్టుకొన్న దృశ్యమును చూసి ప్రఫుల్ల కూలబడెను. మీనాక్షి కృష్ణన్ కారులో కూర్చొనెను, యమున క్షణము ఆలస్యము చేయక వారి వెనుక కూర్చొనెను. కారు బయలుదేరెను.   

“మీ మేనల్లుడు నేను చిత్రరంగము నందు ప్రవేశించుట పెద్ద తప్పిదమనుచున్నాడు” మీరిప్పుడు అంతకంటే మంచి పని చేయుచున్నారు మ్యూజిక్ బ్యాండ్ ద్వారా వేల మంది, ప్రజలకు చేరువయ్యిన మీరు నేడు చిత్ర సంగీతము ద్వారా కోట్ల మంది ప్రజల హృదయములలో గూడు కట్టుకొనుచున్నారు.

90 ల చివరి వరకు, చిత్రనిర్మాతలు ప్రధానంగా చెన్నై స్టూడియోలపై ఆధారపడి యుండిరి   చిత్ర నిర్మాతలను చెన్నై నుండి కేరళకు మార్చుటకు సహాయపడిన ఉదయ వంటి స్టూడియోల పేర్లను ప్రస్తావించకున్నచో  మలయాళ చలన చిత్ర చరిత్ర అసంపూర్ణముగా మిగిలి పోవును. లాల్ మీడియా మరియు విస్మయల ఏర్పాటుతో మళయాళ చిత్రపరిశ్రమ సొంత కాళ్లపై నిలిచెను.   ఈమధ్య కాలంలో ప్రారంభమైన వి వి ఎం స్టూడియో మీరు తప్పక చూచి తీరవలెను.  అని కృష్ణన్ చెప్పు చుండగా “రఘువరన్ కి మీరు ఏమాత్రము తీసిపోరు” అని మీనాక్షి కృష్ణను మెచ్చుకొనెను. 

గ్రీన్ మాట్-ఎనేబుల్డ్ షూటింగ్ నిర్వహించడానికి భారీ అంతస్తుల తో విశాలమైన  మల్టీ-లెవల్ స్టూడియో మరియు క్రోమా కీ కంపోజింగ్ సదుపాయాలతో  కొత్తగా   కొచ్చిలో ప్రారంభించబడిన  వివిఎం స్టూడియో నిర్మాణము 14000 అడుగులలో  గల కొచ్చిలో అతిపెద్ద స్టూడియోఅని రాజేంద్రన్ మీనాక్షిని తీసుకొని పోయి. ఆర్కెస్ట్రా గదిలోకి తీసుకు పోయెను యమునా, కృష్ణన్ అద్దముగుండా విశాలమైన ఆర్కెస్ట్రా గదిలో కూర్చొన్న మీనాక్షిని చూచుచుండిరి. కృష్ణన్ అద్దము వద్దకు పోయి విజయ సంకేతముగా బొటన వేలు చూపి చిరునవ్వు నవ్వి మరల వచ్చి యమునా ప్రక్కన సోఫాలో కూరోనెను. 

ప్రేమ గీతము ఒకటి అనుకొనుచున్నాము అని పక్కనున్న ఆర్కెస్ట్రేటర్  మీనాక్షితో అనెను. కొలది నిమిషములు నిశ్శబ్దము రాజ్యమేలెను. మీనాక్షి వేళ్ళు పియానోపై మందగమనమున అటుఇటు నడయాడినవి. ఒక్కసారిగా ఊపందుకొని చెలరేగుచున్నవి ఆర్కెస్ట్రేటర్ మొఖం వెలిగిపోవుచున్నది. పదినిమిషముల తరువాత   మీనాక్షి సంగీత సంకేత లిపి వ్రాసి ఇచ్చెను. ఈ సారి సంగీతకారులు కూడా తోడయ్యిరి. కచేరి మొదలయ్యెను. పది నిమిషముల తరువాత ధ్వనిగ్రహణము  (రికార్డింగ్) పూర్తి అయ్యెను మీనాక్షి వెలుపలికి వచ్చెను. రాజేంద్రన్ ఆమె ప్రక్కనే నిలుచొని యుండగా గ్రహించిన శబ్దధారను వెలువరించిరి.   సంగీతము వెల్లువవలె శబ్ధకారిణు  (స్పీకర్)ల ద్వారా వచ్చుచున్నది.  మధ్య మధ్యలో టడ  ..  టడ అని మ్రోగుచుండగా అందరూ టడ  ..  టడ యని  కాళ్ళు ఊపుచూ వినుచుండిరి. పంప  రంప ... పమ్పటకట  పంపరంప పమ్ప... టకట..  ట్రోమ్బోన్ లు జాజ్ మద్దెల దరువులు జతపడినవి, సంగీతము ఇంకనూ వేగము పెరిగెను, శ్రోతలు చేతులు వూపుచుండిరి. తరువాత ట్రంపెట్, ఫ్రెంచ్ హార్న్ , ట్యూబా ఇట్లు  మొత్తం బ్రాస్ కుటుంబమంతటినీ మీనాక్షి రంగములోనికి దింపెను. రెండు నిమిషములు ఉదృతం స్థాయికి చేసరిన బ్రాస్ కుటుంబము ఒక్కసారిగా మూగబోయి బాస్ డ్రమ్స్ మాత్రము మ్రోగుచుండెను మద్యమద్యలో టడ  టడ అని మీనాక్షి సంగీత ఫలకము  (కీబోర్డు) పలుకుచుండెను.

 సునామీ కెరటం వలే పైకెగసి క్రింద పడుచూ  సభామందిరమును వెల్లువవలె ముంచెత్తి నవి    పోటెత్తిన ప్రవాహమందు చిరు నావల వలే,    సుడిగాలికి చిక్కిన చిరు కాగితపు ముక్కలు  సుళ్ళు తిరుగుచూ సంగీత  తరంగములుర్రూతలూపుచుండగా  నాట్యమాడుచుండిరి.   రాజేంద్రన్ , కృష్ణన్ నిలువరింప జాలక లయాజ్ఞానుసారులై  చెలరేగుచుండ  వారిని చూచి చిరునవ్వులు చిందించుచున్న  ఆ లయజ్ఞానికి యమున మనసులో వందనమొనర్చెను.  మరొక్క నిమిషము తరువాత  యమున కూడా   వివశమంది నాట్యమునందు వారితో చేరెను. అదే సంగీతమును మరల మరల విని నర్తించుచుండిరి.   జేను స్వరరాగిణి, మీనాక్షి సోఫాలో కూర్చొని చిద్విలాసముగా చూచుచుండెను. కాలు బెణికి మీనాక్షి పై తూలిపడిన యమున ప్రక్కన కూర్చొని “ఎట్లు కల్పింతువే ఇట్టి సంగీతమును అని యమున ఆమె మెడలో వ్రేల్లాడుచుండగా ఒక వ్యక్తి వచ్చి పాదములకు నమస్కరించి పాటగాడినని పరిచయము చేసుకొని " మీ బృందమందు పాడవలెనని మిక్కిలి కోరికతో యున్నాను, నాగొంతు విని బాగున్నచో నాకు ఒక అవకాశమిమ్మని ఒక టేప్ రికార్డర్ ఆమె చేతిలో పెట్టి ఇందు నేను పాడిన పాట  కలదు అని వేడుచుండగా అక్కడి వారు అతడిని క్షణములలో బైటకు తరిమి వేసినారు, యమున  టేప్ రికార్డర్ ను మీనాక్షి నుండి తీసుకొనెను. యమున కాలు నొప్పిచే అచ్చటనే కూర్చొని యుండగా కృష్ణన్ మీనాక్షిని కొనిపోయి స్టూడియో చూపి తీసుకువచ్చెను.  పిదప వారు ఇంటికి బయలుదేరిరి.   

“క్రిష్ట్నుని సులభముగా లైనులో పెట్టితివే.” “ఇట్లు మాట్లాడిన నేను నీతో మాట్లాడను.”అతడిని దారిలో పెట్టుటకే కదా నీవు వచ్చినది. అని యమున తన మాటలను మార్చి చెప్పగా మీనాక్షి కి ఆనందమాయెను. హి హి హి  అని యమున పళ్ళికిలించి మీనాక్షిని వెక్కిరించెను.   అరుణ తారను  ఇంటివద్దనే ఉండవలసినదిగా కోరితిని ఆమె అంగీకరించెను.   రేపు అనుకున్న లక్ష్యము నెరవేరుచున్నది. 

మనము రేపు ఉదయాన్నే ఢిల్లీ బయలు దేరుచున్నాము. ఇతడిని ఆమె చేతిలో పెట్టినచో నాకు ఇంకొక్క భాద్యత మిగిలి యుండును.  అది ఇంత  సులభము కాదు అందము చూచి కరుగుటకు సుందరి పురుషుడు కాదు. వర్షుడే చెప్పుటకు సాహసించనిచో, దేవుడిపై భారము వేయవలెనంతే" అని మీనాక్షి నిట్టూర్చి ఆ టేప్ రికార్డ్ లో పాటగాడి గొంతు వినవలెను పాపము ఎంత దీనంగా వేడినాడు అని   టేప్ రికార్డ్ నొక్కుచుండగా యమున విసురుగా దానిని లాక్కొని " ఇటువంటి విషయములందు జాగ్రత్తగా నుండవలెను” అని టేప్ రికార్డ్ను దూరముగా నుంచి పైట చుట్టిన చేతిని ముఖమునకు అడ్డు పెట్టుకుని మీట నొక్కుచుండగా మీనాక్షి ఆమె భయమును చూచి నవ్వు చుండెను. యమున మీట నొక్కగానే ఒక్క సారిగా పేలుడు సంభవించెను. టేప్ రికార్డ్ తునాతునకలయ్యెను. యమున ఫైట కాలి  పోయెను. మీనాక్షి అవాక్కయ్యెను.

ఇట్లు  చేయనిచో  రేపటి ప్రయాణము రద్దగును నీవు పడిన శ్రమ అంతా  వృధా అగును. శంకర్ గణేష్ అని సంగీత ద్వయం పేరు వింటివి కదా!  1986 లో   పోస్ట్ ద్వారా గణేష్   ఒక అనామక పార్శిల్ అందుకొనెను. అతడికి ఇదే సంఘటన జరిగెను అతని ముఖంలో టేప్ రికార్డర్ పేలి అతని చేతులకు, కళ్ళకు గాయాలయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ చేసి అతని చేతులను పునరుద్ధరించగా. కీబోర్డును వాయించుటకు చేతులు సహకరించెను , కాని అతను దృష్టిని కోల్పోయెను. యమున చెప్పుట ఆపగానే  మీనాక్షి కి  కన్నీరు పెల్లుబుకుచుడెను.  యమున “నీ కంటికి రెప్పను.” అన్న మాటలు గుర్తుకువచ్చి మీనాక్షి బాధ మరింత హెచ్చెను.  “అనేక మంది గాయక గాయనీ మణులను , నర్తకులను , నటులను  కూలదోసిన వారి గూర్చి విని యుంటిని.  చీకటిలో నున్న నీ శత్రువులపట్ల జాగ్రత్త  వహించవలెను.  జేను స్వరరాగిణి! నీవు ఇప్పుడు మామూలు వనితవు కాదు అర్ధమయినదా!” అని యమున  గుండెలకు హత్తుకొనగా మీనాక్షి మొఖంలో చేమంతులు వికసించినవి. క్రమముగా మీనాక్షి భాద కరిగి మనసున  సంతోషము నిండుకొనగా  యమునను  ప్రేమతో ముద్దాడెను.        

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మళయాళ చిత్ర పరిశ్రమ , కేరళ వంటలు, మోహినియట్టం గురించి చక్కగా వివరించారు.మీనాక్షి సంగీత స్వర కల్పన అద్భుతం.

    ReplyDelete