Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, January 30, 2021

Bharatavarsha121

సుందరి అపహరణ నాటి రాత్రి : 

సుందరి అపహరణకు దిగ్భ్రాంతిని పొందిన యవతులు ఏమి చేయవలెనో పాలుపోకుండెను. సాగర తీరమంతయూ జల్లెడ పట్టుట పూర్తి అయిన పిదప సుందరి ఇక దక్కదని నైరాశ్యము పొందిన, పిదప మంజూష "వదిన నీవు అంగీకరించినచో అందరమూ పోయి విదిష ను వేడెదము, కానీ నీవు ఆమెను మాత వలే చూచి  పదములంటినచో .. " అని మంజూష అంచుండగా   ఆమె నాకు మాత ఎట్లగును ?   హు ! నిన్నని ఏమి లాభము ఆ దేవుడే నన్ను ఇట్లు ఆడించుచున్నాడు , అయిననూ నేను దాని కంటే అందముగా ఉన్నానని దానికి ఈర్ష్య , నన్ను తన వద్దకు రప్పించుకొనుటకు ఆ మాయలాడి యే ఇట్లు చేసేనేమో ! అయిననూ  అందరిని విహారమునకు కొనిపోయినది నేను కనుక సుందరి బాధ్యత నాకే ఎక్కువ ఉండవలెను . ఉష్ ఏమిఖర్మము!   ఒక సారి పోయి వచ్చెదము.  

పిదప వారందరూ సబ్బవరం పోయి ఆశ్రమ లోకి ప్రవేశించిరి. కొండల మధ్య నున్న ఆ ఆశ్రమము నిశీధి యందు దీపము వలె, ఒక చిరు ద్వీపము, వలె బిక్కు బిక్కు మనుచున్నది. మొక్కలు పెరిగి చెట్లాయెను. పొదలు రంగ వల్లికలవలె అల్లుకొని ముచ్చట గొల్పుచుండెను. అచ్చటంతయూ నిశ్శబ్దము ఆవరించి యుండెను.  వృక్షములన్నియూ శిశువు తల్లిని కౌగిలించుకొన్నట్టుగా నిశ్శబ్దమును కౌగిలించుకొని నిద్రించుచుండెను. 

వనము గుండా పోవు పార్వతి, నందిని, మంజూష, బసవ   ఆ నిశ్శబ్దమునకు మంత్రం ముగ్దులయ్యిరి.  ఆశ్రమములో నున్న కోవెల వద్ద వారు శేషాచలముగారిని కలిసి విదిషను చూడవలెనని విషయమును శేషాచలముగారికి తెలపగా బసవడితో " విదిష జరిగిన విషయమును తెలుపగా అతడు విచారించి “రెండు దినములనుండి మాత భవనములోనికి రాలేదు, ఆమె సమాధిలో నున్నది ఆమె ఏ చెట్టుక్రిందనున్నదో చూడవలెను. ఈ నాటి వరకు మాత సమాధిలో నుండగా నేను దగ్గరికి కూడా పోయి చూడలేదు. అని సుందరి విషమై పోలీసులను సంప్రదించవలసినదని సలహా చెప్పెను.  ఆమెనెట్లైనా కలవవలెను లేనిచో సుందరిని వారు ఏమి చేసెదరో ఊహించుకొన్నచో వెన్నులో చలి పుట్టుచున్నది. అని నందిని అనెను. సమాధినుండి వారంతట వారు రావలెను గానీ మనము సమాధి స్థితికి భంగము కలిగించరాదు” అని అతడు వెడలిపోయెను.

చేయునది లేక వారు వెనుకకు మరలిరి. ఆ తోట లో కొంత వరకు దీపముల కాంతి కనిపించు  చుండెను. గాలి ఉదృతి పెరిగెను.  నందిని " దీపముల కాంతి చేరని చీకటి  భాగమును చూచిన భీతి  కలుగు చున్నది."  బయటకు పోవుచూ వారు ఆ చీకటి లోకి చూచినారు.  పార్వతి "దూరముగా చిన్న దీపము వెలుతురు కనిపించుచున్నది " అని చెప్పాగా . మంజూష " అది దీపము వలే  లేదు , దీప మయినచో  ఈ  గాలికి   నిలువజాలదు.  బసవడు " పోయి చూచెదము "  మంజూష " అది విదిష వలే అనిపించుచున్నది . మా అన్న వచ్చినచో విదిష తనంతట తానె లేచివచ్చును. 

 నందిని " అయినచో వర్షుడు వచ్చినాడని   గట్టిగా చెప్పుము " సమాధిలో ఉన్నవారికి వినపడు అవకాశము లేదు, వారి ఏకాగ్రత దీనిపై యున్న అది వారికి మనము తెలపకున్ననూ అవగతమగును. " అంత శక్తిమంతురాలయినచో చూచెదము నేనుపోయి తాకి లేపెదను " అని నందిని ముందుకు వడివడిగా పోవుచుండగా అందరూ ఆమెను అనుసరించిరి. కొలది దూరము పోయిన అందరూ అచ్చట చకితులై నిలిచిరి.

విదిష ఒక చెట్టు క్రింద ధ్యానములో కూర్చొనెను . ఆమె నుండి సన్నని వెలుతురు  వచ్చుచున్నది. ఒక జంట ( యువతి యువకులు ) అచ్చట పొదల వెనుక నిలిచి ఆమెను గమనించు చుండిరి. వారు గొడగూచి వలతి.  వలతి " నందిని ఇటురమ్ము అని ప్రక్కకి లాగెను " అప్పుడే   ఒక పెద్ద సర్పము వారిని దాటుకొని విదిష  వైపుకు పోయెను. నందినికి అంత చల్ల గాలిలోకూడా చమటలు పట్టినవి. గొంతు తడారెను, వారు చూచుచుండగానే పాము జరాజరా ప్రాకి విదిషభుజముపై ప్రాకుచుండెను. మంజుషకి ఆ పాము తన పై ప్రాకుచున్నట్టుగా వళ్ళు కంపరము పుట్టెను.

విదిష ఆ పామును తలవద్ద పట్టుకొని చెవికానించుకొని " విమానాశ్రయమునకు పోవుచున్నావా ? నాకొరకు ఏదో కొని దాచుచున్నావు కదా  అది చెప్పవూ ? నాకు తెలిసిననూ నీవుచెప్పినచో ఆనందించెదను. కష్టపడి సంపాదించినది అంతయూ ఇట్లు ఖర్చు చేయుచున్నావే , పాతిక లక్షలా ? మోటార్ సైకిల్ పై నన్ను తిప్పవలెనని నీ కోరిక తీరుటకు సమయము పట్టును  " ఇట్లు మాట్లాడు చుండగా వారు అచ్చట నుండి కదలినారు , ప్రహరీ  బైటకు పోయిన తరువాత  గొడగూచి "ఆమె తన ప్రేమికునితో మాట్లాడుచున్నది , ఇదంతయూ యోగ నిద్రలో నుండి చేయుచున్నది. " వలతి " ఆమె బాహ్య స్మృతిలోకి రాకున్ననూ, చేతిలో చరవాణి లేకున్ననూ  తన ప్రేమికునితో ఇట్లే సంభాషించును. " అని చెప్పెను . గాఢముగా ప్రేమించుకొన్నవారు ఎంత కాలమైననూ  ఇట్లే ఒకరి మనసులో ఒకరుందురు. వారు ఒకే ఆలోచనా తరంగములపై ఉంది ఒకరి భావములనొకరు గ్రహింతురు. " అని ఆమె తన పరిశోధనా జ్ఞానమును వెల్లడించెను. ఎవ్వరికీ నోటా మాట లేకుండెను. మత్తు మందు ఇచ్చిన వారివలె అచేతముగా అందరూ నిష్క్రమించిరి

                                                                  ***

ఆనందనిలయము చేరి సుందరి అపహరించబడిన విషయమును మాలిని గారికి తెలియజేసిరి. మాలినిగారు నిర్ఘాంతపోవుట అరుచుట విలపించుట చేసిన పిదప వగచుచుండిరి. వగచుట వాదనలుగా, వాదనలు రోదనలుగా మారి కడకు నందిని పోలీసులకు విషయము నెఱింగించెను.  అయిననూ  నందినికి కాళ్ళూ చేతులు ఆడ కుండెను. విషయమును మానాన్నకు ఇంకనూ తెలపలేదు, ఆయన  పోలీసు సూపరింటెండెంట్ గార్కి తెలిపినచో ప్రయోజన ముండును. అని నందిని అనుచుండగా మాలినిగారు దూరవాణి యందు  అరుణ తారతో " అరుణా !! ఒక పెద్ద ప్రమాదం జరిగినది , నీ బిడ్డ  సుందరిని అపహరరించుకు పోయినారు. అరుణ శిరమునందు తపంచా ప్రేలినది. 

అరుణ తార ప్రియ పుత్రిక  సుందరి గూర్చి దుర్వార్త విని తల్లడిల్లి " ఎచ్చట, ఎట్లు జరిగెను? ఎవరు చేసి యుండవచ్చు? రేపు తులసీగారు వచ్చిన ఏమి చెప్పవలెను? నేటి కాలమందు దుండగులు తోడేళ్లవలె పొంచి యుండి ఆడపిల్లలను అపహరించుచున్నారు. ఎచ్చట చూచిననూ ఇట్లే యున్నది. ఆడపిల్లలను కంటికి రెప్పలా చూచుకొనవలెను. 

మాలిని: వీరు ఆడ పిల్లలా , ఈ మంజూషను కని  తప్పుచేసినాను , దీనికి పెండ్లి చేసి పంపి భారము దించుకొనవలెనని దినములు లెక్కించుచూ గడుపుచున్న నాకు ఇట్టి కష్టము వచ్చినది. నేనే నుయ్యోగొయ్యో చూచుకొనవలెను.  నన్నీ  నరకమునందు వదిలి ఆయన వీర స్వర్గము పొంది సుఖించుచున్నాడు. కొడుకు ఉండి లాభమేమి? దేశదిమ్మరివలె  దేశములు పట్టి తిరుగుచున్నాడు. అని రోదించుట మొదలు పెట్టెను. 

తార: నేనిప్పుడే ఐ జీ గారికి ఫోను చేసి మాటలాడెదను. 24 గంటలలో సుందరి నీ ఇంట ఉండును. నీకు కంగారు పడి ఫోను చేసేదవేమో తులసిగారి ఆరోగ్య మెట్లున్నదో, నీవు ఆందోళన చెందవలసిన పని లేదు అని ఓదార్చి సంభాషణ ముగించెను. 

కొలది సేపటిలో బుచ్చెమ్మగారు “పోలీసులు బసవని తన ఇంటివద్ద విచారించుచున్నారని”  చెప్పుచూ ప్రవేశించి  “నాకోడలికి తృటిలో ప్రమాదం తప్పినది ఈ రెండు దినములు గడిచిన  వివాహము జరిపించి ఇంటికి కొనిపోదుము.” అని కోడలిని అక్కున చేర్చుకొనెను. బల్లిపాడు నందు ఇట్టి ప్రేమకు నోచుకొనని పార్వతికి చారుమతి (తల్లి) గుర్తుకొచ్చి నయనం లశ్రుపూరితములైనవి. కుటుంబమును భావన ఆమెను కుదుపి వేసి ఆమె బుచ్చమ్మనల్లుకొన్నది.

ఇంతలో బసవడు సర్రాజుగారు ప్రవేశించిరి. వారి వెంటనే పోలీసు సూపరింటెండెంట్ గారు తన సిబ్బందితో ప్రవేశించి నారు.  ఇప్పుడు మమ్మల్ని విచారించుటకు వచ్చినారేమో అని మదన పడుచున్న మాలినిగారికి కొండంత ధైర్యము నిచ్చి "మీ అమ్మాయిని క్షేమముగా తీసుకు వచ్చెదను. ఆ గౌడలిద్దరూ  విశాఖ కేంద్ర కారాగార వాసము చేసి వెడలిన వారే.  వారి గూర్చి నాకు బాగా తెలియును.  బల్లిపాడు నందు వారికి గల అష్ట  గృహములను మా పోలీసులు చుట్ట ముట్టినారు. రేపు మీ అమ్మాయిని తెచ్చి మీకు అప్పగించు భాద్యత నాది.” అని చెప్పి వెడలు చుండగా భారతవర్ష ఆనందనిలయములోనికడు గిడెను.

మాలిని: ఏమి నాయనా ఇప్పుడు వేళయినదా, రేపు ఏ దేశమేగవలెను? పెళ్లి వరకూ ఉందువా ఇంకనూ నీ కార్యక్రమములేమైనా యున్నవా? అని విరుచుకు పడుచుండగా. భారతవర్ష మందహాసముచేయుచూ "పోలీసుల కేల కబురు చేసినారు? ఇంత  సదావకాశమును  మనము జార విడవరాదు." అనెను. ఆ మాటవిని మాలినిగారే కాక బుచ్చెమ్మ సర్రాజుగారు కూడా అవాక్కయ్యిరి. “ఇందు సదావకాశమేమి కలదు నాయినా చదివేసిన ఉన్నమతి పోయినట్టు మాట్లాడుచున్నావు అని బుచ్చమ్మగారు నిష్టూరమాడినారు. ఆడపిల్లలందరికీ అంత బాధ లోనూ నవ్వు వచ్చెను, మాలినిగారికి అరికాలిమంట నెత్తికెక్కి వర్షుని రెండు చెంపలను వాయించెను. ఆపై వర్షుడు నవ్వసాగెను. 


అది చూచి అందరికి పిచ్చి పట్టెను. మా అమ్మ దండనతో  నాకు బాల్యమును గుర్తుకు వచ్చినది. “ఆహా! అమెరికానందు జరగని ఘన సన్మానము ఇదియే కదా” అని రెట్టించిన ఉత్సాహముతో “మీరు లోతుగా ఆలోచించవలెను సుందరిని అపహరించకున్న ఆమెను రక్షించు అవకాశము అగస్త్యునికెట్లు వచ్చును? అగస్త్యుని కథ మీకు తెలియును కదా అతడు తొందరపడుటయే కాక సుందరి దృష్టిలో పాతాళమునకు జారి పడినాడు. జాతీయ కీర్తి సముపార్జించిన సంగీత రాణి, మీనాక్షి సుందరి కాళ్ళు పట్టుకొని అయిననూ సుందరిని తన కోడలిని చేసుకొనవలెనని సిద్దమయినది కానీ ఆమె ఆశ నెరవేరునని నాకు నమ్మకములేదు. పార్వతిని కనుక వారు అపహరించినచో ఇట్టి అవకాశము మనకు వచ్చి యుండెడిది కాదు. అగస్త్యుడు రక్షించి తేకున్నచో సుందరినెటులైననూ పోలీసులు తీసుకువత్తురు. అప్పుడు అగస్త్యుని గుణము గూర్చి  ఎవరైననూ ఏమి చెప్పగలము ?

సర్రాజుగారు : వారు చూచిన ముదిరిన రౌడీలవలె నున్నారు. అగస్త్యుడు అంత  బలవంతుడా?

వర్షుడు " అడవిలో ఏనుగు పెద్ద జంతువు, చిరుత అత్యంత వేగమైన జంతువు  , నక్క తెలివైన జంతువు, జిరాఫి ఎత్తైన జంతువు , ఈ బలములే మియూ లేకున్ననూ ధైర్య గుణ విరాజమానమైన సింగము అడవిరాజుగా వర్ధిల్లును. ప్రమా దములను ఎదుర్కొన వారికి తప్పక జయము కలుగును. వారి జీవితము సుఖమయమగును.  తెగువ లేనివారికి విజయము దక్కదు , దేశము కొరకు నా తండ్రి తెగువ చూపి మరణించెను , తన జీవితము కొరకు తానూ తెగువ చూపకున్న విజయము ఎట్లు దక్కును? అందుచే అగస్త్యుడు సుందరిని రక్షించవలెనని  దేవుని ప్రార్ధించ వలెను.

అందరూ : ప్రార్ధించుటకు  ముందు అతడికి విషయము తెలిపి అచ్చటికి పంపవలెను.

 వర్షుడు వారందరినీ కలియజూసి “నేను, అగస్త్యుని మోటారు సైకిల్ పై బల్లిపాడు పంపి వచ్చుచున్నాను. ఈ పాటికి చేరు చుండును .” అనగా బసవడు "అంతవేగము ఎట్లు పోవును? వాడు పోయినది మోటారు సైకిల్ పైకదా!" అనెను.
వర్షుడు "అది 25 లక్షలు ఖరీదు చేయు ఆరు వేగములు కల హెర్లి డేవిడ్సన్,  ఆ యంత్ర ద్విచక్రికకు గరిష్ఠవేగము గంటకు 220 కిలోమీటర్లు" అని వివరించెను.

4 comments:

  1. ఉత్కంఠ నిలుపుటకు ఈ భాగము ఆలస్యము చేసితిని . కథ యందు ఆసక్తి ఉన్నదా ? కథ ఆసక్తి కరంగా ఉందా? భాష పట్ల అనురక్తి పెరిగినది తలుస్తాను.

    సుందరి అపహరణ జరగపోతే , పాత్రలలో ఔన్నత్యం లోపించి కథ లో హుందాతనం తగ్గిపోవును . అవునంటారా ? మీనాక్షి వేడుకొనుట , దయతో అగస్త్యుని వివాహమాడుట రెండూ మంచివి కావు . సుందరి అపహరణ ఎందుకు జరిగినదో మీకు ఒక కోణమే కనిపిస్తుంది రెండవ కోణము కనిపించినచో తెలియబరచవలెను.
    ఇందులో పాఠకులకు ఉపయోగపడే కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు ఉన్నవి. గ్రహించవలెను. తప్పులున్న క్షమించవలెను . మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురుచూసే సాహితీ సేవకుడు

    ReplyDelete
  2. ఏమీ విదిష లీలలు 🤔గౌడ సోదరులు పార్వతికి బదులుగా సుందరిని ఎందుకు అపహరించితిరా అనిపించెను. అగస్త్యుని ఠధానాయుకుని చేయుటకా🤔ఊహించని మలుపులు.అగస్త్యుని వీరత్వం చూసి తీరాల్సిందే!!

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. విదిష ప్రవర్తన విచిత్రంగా అనిపించిననూ వాస్తవమే

    ReplyDelete