విశాఖపట్నము - ఆనందనిలయము
సర్రాజుగారు " రాత్రి చాలా పొద్దు పోయినది ! " అనుచూ కునుకు తీయుచుండగా
బుచ్చమ్మగారు: ఈ రాత్రి కెట్లు నిద్రింతుము? రాత్రి మహావేగముగా నడుపుచూ పిల్లవాడిట్లున్నాడో? ఆ ప్రమాదకరమైన ప్రయాణమునూహించిన వణుకు పెట్టుచున్నది ఈయనకు కునుకెట్లు వచ్చుచున్నదో!
మంజూష: అగస్త్యుడు క్షేమముగా రావలెను
నందిని : సుందరి ఎట్లున్నదో ? వారేమి చేయుచున్నారో ?
పార్వతి : బసవడు తోడుగా పోయినచోబాగుండెడిది. బసవడికి బల్లిపాడంతయూ కొట్టిన పిండి.
బుచ్చమ్మగారు : బాగున్నాదమ్మా నీవరస , రెండు రోజులలో మీ పెళ్లిళ్లు జరగబోవుచున్నవి కుదురుగానుండక సాగర తీరమునకు పోయి ప్రాణములమీదకి తెచ్చినారు. ఇప్పుడు ఆ కుర్రవాడు ప్రాణములకు తెగించి అగ్నిగుండమందు దూకినాడు. నాకొడుకుని కూడా దూకమందువా ? కాబోవువానిని బసవడని పేరుపెట్టి పిలుచుచున్నావే!
మాలినిగారు: అయ్యో! అగ్ని గుండమా! ప్రాణాలతో వచ్చునా బిడ్డ , ఈ రాత్రి ఎట్లు తెల్లవారునో ! మీనాక్షి విన్నచో గుండెపగిలి మరణించును. అని మాలినిగారు పెద్ద పెట్టున ఏడుపు లంగించుకొనగా
వర్షుడు : అబ్బబ్బ ! ఆపవమ్మా !! అగస్త్యునికి ఏమియునూ కాదు! పోలీసులు ఉన్నారన్న విషయము మరిచి బెంబే లెత్తిపోవుచున్నారు .
బుచ్చమ్మగారు: ఈ పోలీసులను నముకొన్నచో ఏమియునూ జరగదు! పోలీసులు దేముళ్ళలా, నాయినా, పిల్లకు అపకారము జరిగిన పిదప వారిని జైలుకి పంపినచో మనకేమి వొరుగును?
బసవ : అమ్మా నిశిరాత్రి కీడు మాటలాపవమ్మా తల్లీ!
మాలినిగారు : మనసు కీడు శంకించి భాద పడుచున్న తల్లినట్లు కసుర వచ్చునా!
ఆ శివుని, దుర్గ మాతను నమ్మిన వారికి అపకారము జరగదు అనుచూ భారతవర్ష శివ దుర్గలను ప్రార్ధించెను.
జయ జయ పురంజయ హర హర నాథహరి నాథ జగన్నాథ
అతిమతి సతి గతి జూడ వెడలె కావవయ్య నాథ పశుపతి నాథ
రజనీచర, చరాచర అస్త్ర శస్త్రాదుల నుండి నాథ ప్రమథ నాథ
భవదీయ భజనీయ కమనీయ రమణీయ మంత్ర మహిమ
నొసగునయ్య రక్ష దక్ష మీనాక్షి సుతునకు నొసగవయ్య బిక్ష
పాహిపాహి వారాహి త్రాహి మహిమాన్విత వాహిని
రక్షమాం రక్షమాం దక్షజా శిక్షాకర మొరాలకించవమ్మ.
అనుచూ హృద్యముగా పలు గీతములనాలపించెను.
పార్వతి: అగస్త్యుడను పేరు నందే విషాదయోగము కలదో! అగస్త్యుని పేరు కలవారి జీవితమందు గతుకులే కనిపించుచుండును. మాబల్లిపాడు నందు ఇట్లే అగస్త్యుడను పేరు గలవ్యక్తి…
నందిని: ఆపవమ్మా అగస్త్య అను పేరు శుభప్రదమైనదేకాక పరమ పావనమైనది. సప్త ఋషిలలో ఒకడైన పులస్త్య కుమారుడగు అగస్త్యుని పేరు రిగ్వేదమందనేక శ్లోకముల కర్తగా కనిపించు చుండును. అతడి పునర్జననము వరుణుడు(ఇంద్రుడు), మిత్రుడు( సూర్యుడు)చేయు యజ్ఞమందు అప్సర ఊర్వశి వలన సంభవించెను. ఊర్వశి అసాధారణ లైంగిక లక్షణము చూచి వరుణ మిత్రులిరువు వరికి స్ఖలన మాయెను. ఆడిన మాటకు, చేసిన ప్రతిజ్ఞకు నాటి కాలమున విలువ ఉన్నట్లే ఇంద్రియము కూడా అమూల్యము గా భావించెడివారు. కావున వారి వీర్యమునొక మట్టి కుండలో భద్రపరచినారు . ఆ కుండనుండి ఇద్దరు కవల పిల్లలు జన్మించి నారు. వారే అగస్త్య విశ్వామిత్రులు.
ఉత్తర భారతము నుండి నుండి దక్షిణ భారతమునకు వలసవచ్చి గోదావరి తీరమందు స్థిరపడ్డ అగస్త్యుడు మహా శక్తివంతుడు. వింధ్య పర్వతముల ఎత్తు తగ్గించుటలోను, దేవతలను ఇక్కట్ల పాలుచేయుచూ సముద్రమందు నక్కిన దానవులను సముద్రములలో నీరంతటినీ ఔపౌసన పట్టుటద్వారా వెలికి తీయుటలోనూ తన శక్తి సామర్ద్యములను చూపిన మహిమాన్వితుడు. తమిళనాట అగస్త్యుని ప్రథమ సిద్ధుని (కార్య సాధకుడు)గా పిలచి పూజింతురు. అనుచూ ఋషీశ్వరుడైన సమర్థ అగస్త్యుని కీరించుచూ పరాజితుడైన కలియుగ అగస్త్యుని గెలిపించమని సంస్కృతపద పూరిత ప్రార్ధ నా గీతమునాలపించెను
అప్సర పుత్ర అగస్త్య కుంభ సంభవ ప్రశస్త్య
ఉత్తరతః దక్షిణగత పర్వత జిత అగస్త్య
దైవ పరిజన పయోధపాన అగస్త్య ప్రశస్త్య
నిష్రష్ట శ్రేష్ఠ ఔషధ ద్రష్ట అగస్త్య ప్రశస్త్య
అవశ్యక మభిసేన్యతి అగస్త్య పరాస్తః
కుంభ సంభవ సమర్థ అగస్త్య ప్రశస్త్య
అవశ్యక మభిసేన్యతి అగస్త్య పరాస్తః
యంత్రగమనమున వాయు వేగమున
వెడలెను సైనిక సమర కృషి
కావుము దయతో రిగ్వేద ఋషి
మహతీ రణ దారుణ నివారణ చేయుము
పరవశత్వమును కోరెను నాడు
పరాసత్వముకు వెరవక నేడు
అస్త గమనమును మస్తకమందిడి
అస్త్యవ్యస్తమగు బ్రతుకును దిద్ద
వెడలెను సైనిక సమర కృషి
కావుము దయతో రిగ్వేద ఋషి
అప్సర పుత్ర అగస్త్య కుంభ సంభవ ప్రశస్త్య
***
కట్ట: సోదరా కొల్లాయి సింగమా! కత్తి వంటివాడవు మెత్త బడిపోతివి గదా! నిదానముగా నడుపుచున్నావు. సమయము మూడు గంటలు దాటినది
కొల్లాయి : నేను నిదానముగా నడుచుచుచున్ననూ నాలోచనలు పరిగెత్తు చున్నవి. మనకి నక్కజిత్తులుండవలెను సోదరా సింగపు చిన్నెలు మనకేల?
కట్ట: లెస్స పలికితివి సోదరా! మనకి జరుగుబాటయినదే నీతి. బల్లి పాడు చేరుసరికి తెల్లవారునేమో. బల్లిపాడు పోయినచో మన కేమాత్రమూ క్షేమము కాదు. పోలీసులకు మన ఇల్లు వాకిళ్లు తెలుసుకొనుట సులభ సాధ్యమే.
కొల్లాయి : ఇంకెచ్చట నున్ననూ అంతకంటే ప్రమాదము. బల్లిపాడు చేరుటకు ఇంకొక గంట సమయము కలదు. అప్పటికి ఇంకనూ చీకటి ముసిరి యుండును. చెరువు గట్టు పై వేను నిలిపి కాలి నడకన ముత్యాలు (చాకలి) ఇంటికి పోయి.. కట్ట నవ్వు చుండెను.
కొల్లాయి: కట్టా ఎందుకురా నవ్వుచున్నావు !
కట్ట : దాని మొగుడిని దానికి చెప్పకుండా నీవు పైకి పంపినావు ఆ కథ గుర్తుకొచ్చినది
చెప్పితిని అది ఒప్పుకొనలేదు. అట్టి కథలు తలుచుకొని నవ్వుకొను చుండగా
కట్ట: పిల్ల కదులుచున్నది , మత్తుమందు నిండుకొన్నది, ఇప్పుడేమి సాధనము !
కొల్లాయి : నోట కుక్కిన గుడ్డలు తీసి నీవు వెనుకకు పోయి దానిని పట్టుకొనుము
కట్లు కూడా విప్పికొలది సేపు ఉంచవలెను లేనిచో నడువజాలదు.
కట్ట : వెనుకకుపోయి నోటినుండి గుడ్డలు తొలగించి పడుకొన్న సుందరిని లేపి కూర్చొండబెట్టి ,తాకుచుండగా బుర్రతో ఒక్క గుద్దుగుద్దెను. కట్ట బుర్ర ఠంగ్మని మ్రోగి దిమ్మెక్కిపోవుచుండగా వెనుకనే వచ్చు ద్విచక్రిక కాంతి కళ్ళలో పడి కళ్ళు చెదిరెను. సోదరా ఏనుగు వలే నున్న ఈ అసాధారణ ద్విచక్రికను గంట క్రితమే చూచి నాను. లైటు అప్పు డప్పుడూ వేయుచూ , పిదప ఆర్పివేయుచూ మనని గమనించుచున్నాడు. ఆ యువకుడెవరో మనని అనుస రించుచున్నాడని సందేహము గా యున్నది
మరొకసారి లైటు వెలిగి ఆరినది క్షణ కాలము కాంతి పుంజము సుందరిని తాకి ఆరినది. అగస్త్యుడు సుందరి రూపము ను స్పష్టముగా చూచినాడు. కొద్ది క్షణములలో వారికి వ్యతిరేక దశలో పోవుచున్న ఒక పెద్దవాహన కాంతి లో సుందరి అగస్త్యుని రూపమును కాంచెను.
బల్లిపాడు సార్వభౌమా చిన్నగౌడరాయ ఆయుధమందుకొనుము , రుణ శేషము శత్రు శేషము ఉంచరాదు , ఈ సారి కనిపించినచో తూటమును పేల్చి అరి భంజనమొనర్చుము అని వాహనమును నడుపుచున్న కొల్లాయిగౌడ వెనుక నున్న కట్ట గౌడకు తుపాకీ అందించెను. కానీ ఎంత వెతికిననూ ద్విచక్రిక మరల కానరాకుండెను. బల్లిపాడు వచ్చుచున్నది.
***
ముత్యాలు ఇదుంచవే అరగంటలో నా మనుషులర డజను మందిని తీసుకొచ్చేవు అనుచూ ముత్యాలు మెడలో బంగారు గొలుసును అలంకరించెను
ముత్యాలు : నాకు గొలుసెందు కండీ, నాకాడే నాలుగున్నాయి.
కట్ట : నమ్మిన బంటు వలే నున్న నీకు గొలుసులేల పెంకుటిల్లు ఇచ్చెదను
ముత్యాలు : ఇల్లివ్వవ్వడమే కాదండి వత్తా పోతా ఉండాలండీ
కొల్లాయి: అది మళ్ళీ చెప్పాలటే అని ముత్యాలు నడుం గిల్లి , ఇంతకీ ఆ పిల్ల కట్లు గట్టిగా ఉన్నవా ?
ముత్యాలు : మంచానికేసి గట్టిగా కట్టీసి నోట్లో గుడ్డలు కూడా కుక్కీసాను. మన మనుషులు చుట్టూ కాపలా ఉన్నారు . వెలుతురొచ్చేసిందంటే మనుసులు మసులుతుంటారు. ఈ లోగా నువ్వు పని కానిచ్చేయ్
కట్ట : పిచ్చిదానా నేనొక్కడినే కాదే , మేమిద్దరమూ
ముత్యాలు : అయ్యబాబోయ్ ఇద్దరా , మీరు గేదెలాగున్నారు , పిల్ల సచ్చిపోతాది
కొల్లాయి : అది బ్రతికి ఉంటె మనకి కష్టమే
ముత్యాలు : అంటే సంపేత్తారా , నేనొప్పుకోను
కట్ట : సరే సరే చంపను, నువ్వెళ్ళి దానికి ఈ విష్కి పట్టించు. అని చిన్న తుపాకి వంటగదిలో పెట్టి వారిరువురూ స్నానాలకు పోయినారు. ముత్యాలు సీసా మూత తీయుచుండగా కిటికీవద్ద అలికిడైనది, ఎవరో లోనికి తొంగి చూచుచున్నారు
ముత్యాలు బైటకు వచ్చి చూడగా ఏదో ఒకా నల్లని ఆకారము కిటికీవద్దనుండి ఆరుబయట ఉన్న స్త్నానాల గదులవద్ద కు పోయి పైన గడియవేసి వచ్చుచుండెను. ముత్యాలు అది గమనించి అరుచునంతలో నోరు మూసి ఇంటిలోపలికి తీసుకు పోయి వంచి వీపుపై ఒక్క గుద్దు గుద్దగా క్రింద పడి పెద్దగా అరవసాగెను , అగస్త్యుడు ఈలోగా సుందరి కట్లు విప్పుచుండెను. గౌడసోదరులు ఇరువురూ స్నానాలగదుల తలుపులు బాదు చుండుటతో
కొలది దూరములో కర్రలతో కాపలా కాయుచున్న యువకు లు పరుగు పరుగున వచ్చి, ఒకడు తలుపులు తీయుచుండెను. అగస్త్యుడు ఇంటి తలుపు గడియ పెట్టుచుండెను. గడియ పెట్టనంతలో నలుగురు లోనికి దూరినారు. వారి చేతులో కర్రలున్నవి వారు బర్రెను బాదినట్లు బాదుతున్ననూ ఓర్చుకొని అగస్త్యుడు సుందరి కట్లు పిప్పుట యందె ద్యాస కలిగి యుండెను. సుందరి కట్లు వీడినవి. అగస్త్యుడు నేలకొరిగెను.
అందొక యువకుడు అగస్త్యుని పీకపై కాలు వేసి వీడికి శిరస్త్రాణము ( హెల్మెట్) ఉండుటచే క్షేమముగా తప్పించుకొనుచున్నాడు అనెను , వేరొకడు అగస్త్య శిరస్త్రాణము ను లాగి వేసెను. సుందరి నీవు నా ద్విచక్రిక నెక్కి పొమ్ము అనుచూ తాళమునామెకు ఇచ్చుచుండగా ముత్యాలు లేచి సుందరి కాలు పట్టుకొనెను . సుందరి ఆమెను ఒక్క తాపు తన్ని తలుపువద్దకు పోయి తలుపు తీసి పక్కకు తప్పుకొనెను ఒక్క సారిగా గౌడసోదరులు లోపలకి గెంతుట, సుందరి ఇంటినుండి బయటకు గెంతుట, అగస్త్యుడు ఉప్పెనవలె లేచి తనని చుట్టుముట్టిన నలుగురు యువకులను తోసి వంటగదిలోకి దూరుట జరిగి పోయినవి. వంట గది తలుపులు మూసు కొన్నవి.
కొల్లాయి: లోపల తుపాకీ ఉన్నది. అందరూ శిలా ప్రతిమలవలె నిలిచిపోయినారు. అందరికీ ఊపిరి తీసుకొను శబ్దము స్పష్టముగా వినిపించుచుండెను. ముత్యాలు తలుపు తియ్యవే అని కట్ట ముత్యాలు నాజ్ఞాపించెను.
ముత్యాలు కట్ట మొఖం పై ఉమ్మివేసి దానిని పట్టుకు రమ్మని ఇద్దరిని ఆజ్ఞాపించగా వారు ఆమెను వెంబడించుచుండిరి.
ఇంతలో కట్ట " సోదరా , మనమిచ్చట సమయము వృధా చేయక దాని పని పట్టెదము."తుపాకీ ఉన్నవాడికొరకు ఎదురుచూచుట చూచుట మృత్యువు కొరకు ఎదురుచూచుట ఒకటే పద దానిని వదలరాదు అని బయటకు పరుగు తీసి దూరముగా ద్విచక్రిక వద్ద అవస్థ పడుచున్న సుందరిని చూచి " హేర్లి డేవిడ్సన్ , ఇది ప్రారంభించవలెనన్న , నడపవలెనన్న కొంత అనుభవముండవలెను. అని వికట్టహాసము చేయుచుండెను. సుందరి పరుగు లంఘించుకొనెను.
***
అగస్త్యుడు మెల్లగా తలుపు కొద్దీ కొద్దిగా తీసి అచ్చట ఇద్దరే ఉండుట చూసి , తుపాకీ గురిపెట్టి పైకి వచ్చెను , రౌడీ సోదరులిరువురూ వెనుకంజ వేసిరి. అగస్త్యుడు ఆయుధమును చేతపూని సుందరికొరకు పరిగెత్తుచుండెను. ముందు సుందరి, ఆమె వెనుక గౌడసోదరులు , వారి వెనుక చొక్కా చిరిగి, గాయములతో అగస్త్యుడు, అతడి వెనుక రౌడీలు పరిగెత్తుచున్నారు. తెల్లవారినది చీకటి కరిగి వెలుగు వచ్చినది. తుపాకీతో తూటములున్నచో ప్రమాదమనితలచి అగస్త్యుడు “ఆగినచో బ్రతికెదవు అచ్చట నిలువుము “ అని హెచ్చరించి “తుపాకిని గాలిలో కి పేల్చెను. అదివిన్న గౌడసోదరులు ఆగినచో మరింత ప్రమాదమని వేగమును పెంచినారు. తుపాకీ వారిని ఆపలేకున్ననూ గ్రామ జనులను లేపుటకు ఉపయోగపడినది. అగస్త్యుడు వారివెనుక పరిగెడుచూ మిగిలిన ఐదు తూటములను అట్లే గాలిలోకి పేల్చేను. సుందరి తాను మొదటిసారి బల్లిపాడు వచ్చినప్పుడు విమానమును దింపిన పాఠశాల ఆవరణ చేరుకొనెను. ఆమె వెనుకనే గౌడలు కూడా చేరిరి. సుందరి గొళ్ళెము లేని పాఠశాల గదిలోకి ప్రవేశించెను. గౌడలు ఆగదిలోకి దూరి లోపల తలుపు గడియవేసిరి.
అగస్త్యుడు ఆగదివద్దకు చేరగానే తలుపు మూతపడినవి . ఇద్దరు రౌడీలు ఒక్కసారిగా అతడిపైపడి కుమ్ముచుండగా అగస్త్యుడు బంతివలె లేచి ఒకడి తలను పాఠశాల గోడకు కొట్టెను. వెనుకకు తిరిగి వెనుకనుండి వచ్చుచున్న వాడిని ఎగసి తన్నెను. ఇంతలో మరి ఇద్దరు రౌడీలు కర్రలతో వచ్చి చేరినారు . అగస్త్యుడు నిస్సహాయముగా దొరికిపోయెను.
గదిలో నేలపై పడి ఆయాసముతో రొప్పుతున్న సుందరి వక్షం ఎగిసి పడుచున్నది. కట్ట మన కష్టము ఫలించినాదిరా మంచి ప్రదేశము లో దొరికినది , విశాలమైన గది అను చుండెను సుందరి లేచి ఎదుర్కొనుటకు సిద్ధమగుచుండగా గౌడ నడుముకి కట్టిన తోలు పట్టాను తీసెను. సుందరి నిలిచిపోయెను. కట్టా " రెండు తగిలించినచో సులభముగా దారిలోకి వచ్చును మనకు సమయములేదని చెప్పగా కట్టగౌడ సుందరి ని బాదసాగెను . సుందరి గది అంతయూ పరిగెడుచూ బ్లాక్ బోర్డు వద్దకు పోయి కొట్టవలదని చేతులు ఎత్తి నమస్కరించెను. ఆ బ్లాక్ బోర్డు పై నిద్రించుచున్న పెద్ద సింహము చిత్రము గీయబడి యున్నది. కట్ట వికట్ట హాసము చేయుచూ నిలిచెను.
గది బయట అగస్త్య కదలికలు నిలిచిపోయినవి , కర్రలతో తలపై దెబ్బలు పడగానే అగస్త్యకు రక్తము కారు చుండెను . అగస్త్యుడు వారి కర్రలను చేతికి చిక్కించుకొని లాగివేసెను. ఇంతలో గ్రామ ప్రజలు గుమ్మిగూడుచుండిరి. అది చూచి రౌడీలు అగస్త్యను త్రోసివేసి పారిపోయినారు. అగస్త్య క్రింద పడెను. రక్త స్రావము హెచ్చుగా జరుగు చుండెను. క్రింద పడిన అగస్త్య కళ్ళు పడుచుండగా అనేక మంది చుట్టూ చేరినారు. కట్ట గౌడ , గదిలో సింహము చిత్రము లో చిరు కదలిక చూచెను, పిదప స్వల్ప గర్జన వినిపించెను ఆ ఇదంతయూ చిత్త భ్రమ అనుకొనుచుండగా ఒక్కసారిగా ప్రాణమున్న సింహము చిత్రము నుండి దూకి భీకరముగా గర్జించగా వారిరువురూ తలుపు తీసి బైటకు పరుగు తీయుచుండిరి. పూర్తిగా వెలుగు చున్న ఆకాశము క్రింద వేలజనులు చూచుచుండగా వేట ప్రారంభమయ్యెను.
రొప్పుచూ గౌడలిరువరూ పరిగెత్తుచుండగా , వారి గుండెలు అలసి మండుచున్నవి , హరిదాసు గారు చంద్రమతి, ముత్యాలు కూడా కూడా అప్పుడే వచ్చి చేరినారు. సుందరి కూడా బయటకు వచ్చి చూచుచుండెను. ముత్యాలు అందరూ చూచుచుండగా దండోరా వీరాసామి డప్పును తీసుకొని వాయించు చుండగా సింగము గౌడలను చీల్చి చెండాడెను. పూర్తి వెలుగులో ఆ దుష్ట ద్వయము వెలుగు నశించెను. పిదప ఆ సింగము నిదానముగా పంటచేలలోకి పోయి అంతర్ధానమయ్యెను.
విదష పాత్ర మలుచుట పై మీ అభిపా ప్రాయము వ్రాయండి ఈ భాగమున కథనము ఎట్లున్నది ?
ReplyDeleteయాక్షన్ ద్రృశ్యం అద్భుతము.మధ్యలో జోడించిన ప్రార్ధన గీతాలు బాగున్నవి.సింగము ప్రవేశము విదిష లీల అనుకోవచ్చునా! ప్రారంభంలో విదిషను ఒక సామాన్యమైన అమ్మాయిగా చిత్రీకరించారు.ఆమెకున్న దైవబలం ఆమెను ఒక మహాశక్తిగా మార్చెను.ఈ రోజు ఆమె తండ్రిని ఎదురించుట ఆమెకు పెద్ద కష్టమేమీ కాదు.కానీ ఆమె తండ్రి లో పరివర్తన కోరుకుంటుంది.మాతగా మారి బందీఖానాలో పడటం విచిత్రం.
ReplyDeletewho else can do that other than VIDISHA? ఆమెకున్న దైవబలం ఆమెను ఒక మహాశక్తిగా మార్చెను.ఈ రోజు ఆమె తండ్రిని ఎదురించుట ఆమెకు పెద్ద కష్టమేమీ కాదు.కానీ ఆమె తండ్రి లో పరివర్తన కోరుకుంటుంది. These lines are excellent. మాతగా మారి బందీఖానాలో పడటం విచిత్రం but this is not correct. Nobody can imprison a woman. Worthless or helpless women spend their life in captivity. My Vidisha is neither worthless (she is more than a scholar.) Nor she is helpless because VARSHA is behind her. Thank your for your feedback
ReplyDeleteవర్షుడి చెల్లి పెళ్లి సంవత్సరం లో ఉన్న ఆఖరి ముహూర్తానికి పెట్టడంవల్ల మరుసటి సంవత్సరం వారు వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నారు . వారు మానసికంగా భార్యా భర్తల ప్రేమ ను అనుభవిస్తూ , స్నేహితుల అవగాహనా కలిగి యున్నారు. మాలినిగారు ఆమెను ఇంటి కోడలు అని సంభోదిస్తున్నారు. అప్పుడు బందిఖానాలో ఉన్నట్టు అవుతుందా ?
ReplyDelete