Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, January 10, 2021

Bharatavarsha 110

ముంబాయి:  లకుమ నివాసం: 

కశ్యప్: చుమ్ ఛుమ్ తరువాత సరిగ్గా నాలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి తరువాత ఆగిపోయాయి. ఎందుకు ?  నీ ఒంటెత్తు పోకడలవల్లే. సినిమా స్టార్ సినిమా స్టార్ ఉండాలి. 

లకుమ: సినిమా స్టార్ లా లేనా? రోజూ జిమ్ కి  వెళ్లి  ఫిట్నెస్ మెయింటేన్ చేస్తున్నాను కదా?

షిట్! నేను అందం గురించి మాట్లాడడం లేదు ఏటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. నీ లైఫ్ స్టైల్ ఒక సినిమా తార లైఫ్ స్టైల్ కాదు. ఒంటి పిల్లి రాకాసి లాఎక్కడో ఉంటావు , పార్టీ కల్చర్ కి దూరంగా మడి కట్టుకుకూర్చుంటే ఎలా ? 




లకుమ:పార్ట్ కల్చర్ కి దూరంగా ఉన్నానా?! నిత్యం  పార్టీలలో ములిగి తేలుతున్నాము కదా!

కశ్యప్: కమాన్ బేబ్ , మునిగి తేలడం అంటే నా ఒక్కడితో  కాదు. జుహు బీచ్ లో ఇల్లు తీసుకో  తారలంతా అక్కడే ఉంటారు,  మింగిల్ విత్ పీపుల్ టేక్ ఆ షాట్ అండ్ … 

లకుమ: టేక్ ఆ షాట్ అంటే తాగడం హైద్రాబాద్ లో నీతో కూడిన ప్పటి  నుంచే మొదలెట్టాను

కశ్యప్: ఈ రోజు సాయింకాలం స్వింగర్ కపుల్ పార్టీ ఉంది మనం వెళుతున్నాం  “నేను రాను” 

కశ్యప్: అయితే మిడ్ నైట్ రేవ్ పార్టీ ఉంది దానికి పోదాం టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్  పరిచయమయ్యేది ఇలాటి చోటే. ఇలా తిరిగేవంటే వచ్చే వారంలోగా మరో నాలుగు సినిమాలు నీ చేతిలో ఉంటాయి . త్వరలో నిన్ను టాప్ స్టార్ని చేస్తాను. 

లకుమ: రేవ్ పార్టీ అంటారు బౌన్సుగర్ లాంటి డ్రగ్స్ తాగి చెలరేగిపోతారు , స్వాప్ పార్టీ అంటారు ఆడవాళ్లను మార్చు కుంటారు. అందుకే రేవ్ పార్టీలు, స్వాప్  పార్టీలు నాకు నచ్చవు అని తెగేసి చెప్పేను.   ఇంకొక్క సారి వాటి ఊసెత్తద్దు. 

ఒకే ..చిల్ బేబ్.. చిల్… రేవ్ పార్టీలకి వెళ్లొద్దు కానీ   సంజయ్ భాయ్ దగ్గరకి వెళ్ళు ఈరోజు. అని కశ్యపుడు లకుమ దగ్గరగావచ్చి ఆమె గులాబీ పెదవుల పై  చూపుటి వేలుతో రాస్తుండగా లకుమకి కంపరం పుట్టి " ఛీ .. వెళ్ళు " అని అరిచింది. “యువర్ లైఫ్ , యువర్ కెరీర్  అప్ టు యు” అని కశ్యపుడు  నవ్వుతూ వెళ్ళిపోయాడు. కశ్యప్ వెళ్లి పోయాక తలతిరిగిపోతోంది సాయంకాల పార్టీ లో కాదు ఇప్పుడే తాగాలి తప్పదు అనుకుని కబోర్డ్ లో బాటిలు కోసం చూసింది ఒక్కటీ కనిపించలేదు కోపంతో అరచింది   " రోహిత్ , రోహిత్ " “యస్ మేడం.” ఒక్క బోటిల్ కూడా లేదు ఏంచేస్తున్నావ్ . “అయిపోయాయి మేడం. కొని తేవాలి,  తెస్తాను. ఇప్పుడు ఇంకా ఉదయమే కదా, సాయంకాలం తీసుకొస్తాను.”  ఆ సమాధానంతో లకుమకి మరీ  పిచ్చెక్కిపోయింది రోహిత్  చెంప పేలి పోయింది. “బాటిల్స్ అవ్వకముందే ముందే తెచ్చి ఉంచాల్సిందిపోయి, అయిపోయిన తరువాత కూడా కొని తేడానికి ముహూర్తం కావాలా యూ ఇనెఫిషెన్ట్ రోగ్!”  “మాఫ్ కర్నా మేంసాబ్” 

“భర్తమీజ్,  తుం కిస్ లియే  ఇదర్ మేనేజర్? మేరే సర్ ఫొడ్ రహాహై!! గెట్ అవుట్!!!.”

 చెంపమీద చేతితో బాటిల్ తేవడానికి రోహిత్ పరిగెడుతుండగా అక్కడే నిలబడి చూస్తున్న ఆషా కిసుక్కున నవ్వింది. “దాని సంగతి చూస్తానే!” అన్న రోహిత్ కళ్ళలో మంటలు చూసింది.

                                                               ***

ఇందిరానగరం లో ఇంద్రాగ్నిని తలపించు ఇంద్రభవన మందు ప్రశాంత చంద్రికలు పరుచుకొని యున్నవి. మీనాక్షి పాలనురుగులాంటి తెల్లని దుప్పటి గప్పిన శయ్య పై పరుండి పుస్తకమును చదువుండెను. యమున మండువా గదిలో పెద్ద కిటికీవద్ద కూర్చొని వర్షుడు వ్రాసిన భక్తి విజయమందలి రుక్మిణీ శృంగార పద్యములను చదువుచూ, “ఆహా! ఎంత ఆహ్లాదంగాయున్నవీ పూలదండలవంటి పద్యములు, ఆ భావ పరిమళము లందునా మనసు ఊయలలూగుచున్నది కదా!” అనుకొని కిటికీ నుండి బైటకు చూచెను. మబ్బు దొంతరల తెలియాడు రేరాజు నింగినేలుచుండెను. ఆభవంతిని నిశ్శబ్దమేలు చుండెను. ఆమె హృదయమును శృంగార మేలు చుండెను. 

పక్కనే వర్షుడు వ్రాసిన తెలుగు  ఆంగ్ల కవితల పుస్తకములు బంతి చామంతుల వలె గుభాళించుచున్నవి. ఇటువంటి భావములు తాకిన స్త్రీల మనసులు పుష్పములవలె వికసించును కదా. ఈ కవితలు వెన్నెలను చూచుచూ కాక వెన్నెలయందు  కూర్చొని చదివినచో ఎంత రమ్యముగా నుండునో  అనుకొనుచూ గడియారం వంక చూచెను. 9 గంటలు   అయ్యెను. అయ్యో పనివారందరూ వెడలినారు  పిచ్చితల్లి ఏమి చేయుచున్నదో పిలచి బువ్వ పెట్టనిచో తినని పసిపిల్ల తల్లివలె యమున చకచకా మీనాక్షి శయన గృహమునకు పోయెను.  26 గదులు గల ఆ భవనమందు ఆమెకు 6 శయన మందిరములు  కలవు. క్రిందనున్న రెండు గదులయందు ఆమె లేకుండుటచే యమున పైకి పోయెను. అచ్చట రెండు మందిరముల తలుపులు మూసి యున్ననూ   ఒక మందిరమందు తలుపు దగ్గరగా చారవేసి యున్నది . యమున ఆ తలుపు వద్ద నిలిచి టక టక తలుపు కొట్టెను. 

స్పందన లేకుండుటచే మెల్లగా తలుపు తెరిచి లోపలకు తొంగి చూచెను. పాలనురుగులాంటి తెల్లని దుప్పటి గప్పిన శయ్య పై  ధవళ కాంతులీను కువలాయాక్షి చేత ఘంటము పూని గువ్వలవంటి తెల్లని కాగితముల పై లిఖించు చుంచుండ యమునకు  సరస్వతి వలే కనిపించెను. ఇట్లు వచ్చుటకు సిగ్గులేదు అని మీనాక్షి కోపము చూపగా మిక్కిలి అదురుచూ  యమున వెనుకకు పోయెను. మీనాక్షి యమునను చిలిపిగా చూచి నవ్వి పక్కన కూర్చొమ్మని కనుసైగ చేసెను. యమున పోయి ఆమె ప్రక్కనే కూర్చొనిన  పిదప " నీవు పనివారివలె  తలుపు తట్ట పని యున్నదా ? నేరుగా తలుపు తీసుకొని రమ్ము అని వాలిన ఆమె చుబుకమును ఎత్తి కళ్ళలోకి చూచి మరల చిలిపిగా నవ్వెను. ఈ సారి యమునా కూడా నవ్వెను.

  “భోజనమునకు పిలుచువరకూ రాకున్నవే మీ అమ్మ నీకు వేళ కు భోజనము చేయుట కూడా నేర్పలేదా? "ఇప్పుడిప్పుడే నేర్పుచున్నది.” "హి హి హి హి , సంతోషించితిని భోజనమునకు లెమ్ము" మీనాక్షి మూతి బిగించెను. నావద్ద ఈ మూతి బిగింపులేమియూ పనికిరావు. లేవనిచో పెద్దదానివని చూడక ఇచ్చట రెండు వడ్డించెదను అని దిండుతో కొట్టసాగెను , మీనాక్షి నవ్వుచూ రెండు చేతులతో అడ్డుకొనుచుండగా , యమున దృష్టి ఎగిరిపోవుచున్న సంగీత సంకేతములున్న కాగితములపై పడెను. పూరెక్కల వలే నున్న ఆ కాగితములను చూచి పూవులు నోరు తెరచి పాడుచున్నట్లనిపించి యమున ఆమెలో సరస్వతికి మనసులో నమోవాకములర్పించుచూ శిల్పం వలె నిలిచిపోయెను.  

మీనాక్షి కది యెంత మాత్రము నచ్చలేదు అప్పుడు ఆమె మరొక దిండు తీసుకొని యమునను కొట్టసాగెను. ఆ పెద్ద శయన మందిరమంతయూ తిరుగుచూ వార్ అట్లాడుకొను చుండగా యమునా దృష్టి రెండవ తలగడ క్రింద నున్న పుస్తకంపై పడెను , వెంటనే దిండు పారవేసి ఆ పుస్తకము వైపు పోవుచుండగా మీనాక్షి అది గ్రహించి ఆమె ఆ పుస్తకమును దక్కించుకొనుటకు పోయెను. ఇద్దరూ ఆ పుస్తకమును సగము సగము దక్కించుకొనిరి. మీనాక్షి శతవిధములు ప్రయత్నించినను ఆ పుస్తకమును యమున లాగి చేజిక్కించుకొనెను. 

ప్రౌఢ శృంగార కథలు అని బిగ్గరగా చదివి ఆమెను ఓరకంట చూచుచూ పుస్తకమును చుంబించెను. మీనాక్షి  సిగ్గుతో కళ్ళు మూసుకొనెను. యమున పుస్తకమును మీనాక్షి  చే తులకు తాకించగా కనులు తెరిచేను. వెంటనే యమున ఆ పుస్తకమును మీనాక్షి చేతులో పెట్ట ఆమెను నుదుటిపై చుంబించెను. ఇంకనూ ఆటపట్టించునేమో అని అనుకొన్న మీనాక్షికి ఆశ్చర్యము కలిగెను. ఇంకానూ  చదవలేదా, నీకెప్పుడూ సంగీతమే,  పోనీ నన్ను చదివి వినిపించమందువా ? అని అడుగగా.   మీనాక్షికి  మరల సిగ్గు ముంచుకొచ్చెను. నిన్నని ఏమి  లాభము ఆ వర్షుడి ననవలెను. అతడు గుండెలు తీసిన బంటు వలే నున్నాడు. ఏమి వ్రాసేనో కదా. ఒక్క సారి చూబింతువా? అని యమున చేయి జాపగా మీనాక్షి తన బెత్తముతో ఒక్క దెబ్బ కొట్టెను. యమున చిన్నపిల్లవలె గెంటి అల్లరి చేయుచుండగా మీనాక్షి ఆమె బుగ్గపై ముద్దిడి. పద పోయి తినవలెను అనెను. నే రాను నన్నేల కొట్టితివి ! అని మారాం చేయసాగెను .  మీనాక్షికి కూడా కోపమొచ్చెను. ఇరువురి కోపములు అలుకగా మారెను. 

  ఇరువురూ మండువా గది యందు  దూరదర్శనము ముందు   కూర్చొనిరి. యమున దూర నియంత్రణను నొక్కగా  వర్షుడు తెరపై ప్రత్యక్షమయ్యెను. వార్తా ప్రసారము వెలువడు చుండెను.  " లూయీ విల్ లో గౌరవ పొరసత్వమును పొందిన      తొలి తెలుగు కవి భారతవర్షకు నగర మేయర్ నగర  తాళాలను అప్పగించారు. భారదేశము రాబోతున్న భారతవర్షకు వచ్చే వారము స్వదేశమందు ఘన సన్మానము ఏర్పాట్లు.. అమెరికాలో లూయీ విల్ యందు స్లగ్గర్ ప్రదర్శన శాలవద్ద వర్షుని చిత్రములను, గ్రెగ్ ఫిషర్ భారతవర్షకు తాళములిచ్చుచున్న చిత్రములను పదే పదే చూపు చుండిరి. యమునా మీనాక్షిలు ఒకరినొకరు చూచుకొని నవ్వుకొనిరి , క్షణములో వారికి అలకలు గుర్తుకువచ్చి మొఖములు తిప్పుకొనిరి.

కొలది సేపు తరువాత  మీనాక్షి " యమునా నాకు హృదయము నిండి పోయినది నాకు ఆకలి లేదు అదియునూ కాక నాకు వేరొక ప్రత్యేక కారణము కలదు . నీవు పోయి అన్నము తినమ్మా " అని అనుచుండగా, "నేను తినను......" అని యమున మొండి కేసెను ." 

"నేను తినిపించినచో ..."  "నీవు తినిపించిననూ తినను" 

నీ అభిమాన రచయిత భారతవర్ష తినిపించినచో ? ఆమాట విన్న యమున మొఖం విప్పారెను.  మరుక్షణము  మొఖం మాడ్చుకొని " భారతవర్ష ఎందులకు వచ్చును ?

“మా యమున ఆకలి తీర్చుటకు అతడిని పంపమని నేను దేవుని ప్రార్ధింతును అని మీనాక్షి దేవునికి దణ్ణము పెట్టుకొనుచుండగా "వంకాయ్" అని యమున మూతి మూడు వంకలు తిప్పెను. ఇంతలో రక్షక గృహమునుండి వచ్చిన రక్షణ సిబ్బంది “ అమ్మ ఎవరో భారతవర్ష అట మీకొరకు వచ్చి గేటువద్ద ఉన్నారు పంపమందురా.” “వలదు అచ్చటనే ఉండమనుము.” అనగా వారు వెడలిపోయిరి. “ఏమే  వంకాయ్ లోనికి తీసుకు రావలెను నాతో  వచ్చెదవా ఇచ్చటనే వుందువా?” 

ఇద్దరూ ప్రవేశద్వారం వద్దకు పోయి వర్షుని గౌరవంగా లోనికి తీసుకువచ్చిరి. మీనాక్షి వర్షునికి దృష్టి తీసెను. మండువాగదిలోకి ప్రవేశించిన పిదప అమ్మాఎంత చిక్కిపోయినావు! అని మీనాక్షిని ముఖమును చేతులలోకి తీసుకొని చూచుచుండెను.   పుత్రవాత్సల్యమును చూ పుచూ  మీనాక్షి అతడిని కౌగిలించుకొనెను. 

నా కొడుకు కి చదువు అబ్బకున్ననూ జ్ఞానసంపన్నుడు గుణ సంపన్నడూ  అయినచో నీవలె నన్ను చూచుకొనెడివాడు. అని మీనాక్షి పొగిలి  వెక్కి వెక్కి ఎడ్వసాగెను.  

మాలిని నీవు వేరు కారమ్మా అన్ని కన్నీరు తుడిచి వర్షుడు మీనాక్షిని గుండెలకు హత్తుకొనెను. ఇదంతయూ ఏమీ అర్ధము కాని యమున పాపము బిత్తరపోయి చూచుచుండగా వర్షుడు ఆమెను " యమునా, ఇట్లు రా అమ్మా ,  " అని యమున తో అనగా యమున తన పేరెట్లు తెలిసెనని ఆశ్చర్యము కలిగిననూ " నీవెంతో బాగాచూచు కొంటున్నావని చెప్పుచుండును." అనుచుండగా “చూడండి సార్ ఈ మీనాక్షి ఎంత మోసము చేసెనో ! " అని వర్షునితో అని   " మోసం, దగా, కుట్ర " అనుచూ మీనాక్షిపై కలియబడెను. అట్లు మీనాక్షి గృహము నవ్వులు పూవు నందనవనముగ మారెను.    పిదప భారతవర్ష వారిద్దరినీ చెరొక వైపు కూర్చోండ బెట్టుకొని ఇద్దరికీ అన్నము తినిపించి తానూ తినెను.  యమునా ఇంకనూ సార్ అనుచుండగా "నన్ను అన్నయ్య అని పిలవ వలెను." అని చెప్పి యముని ఆప్యాయముగా చెల్లెమ్మ అని పిలిచెను. భోజనము లైన పిదప వర్షుడు నిద్రించుచుండగా మీనాక్షి యమునికి, మంజూష కథను వారితో ఆమె బంధమును చెప్పుచుండగా యమున  ఆమె వద్దనే నిద్రించెను.




4 comments:

  1. డియర్ రీడర్స్ మీ ఆనందము ఆరోగ్యమే నాకు బలం.

    ReplyDelete
  2. మీ ఆనందం కోసం రాస్తున్న భారతవర్ష చివరికి వచ్చేస్తోంది కానీ మన బంధాలు పాత్రలతో మన అనుబందాలు మన గుప్పెడు గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతాయి . ఆడ పిల్లలుల పాత్రలో మీకు ఎవరు నచ్చారు? ప్రౌఢల పాత్రలో మీకు ఎవరు నచ్చారు? దయచేసి వ్రాయండి

    ReplyDelete
  3. ఈ కావ్యంలో ప్రతీ పాత్ర రచయిత చెక్కిన శిల్పాలే.మీనాక్షి పాత్ర మొదట్లో బాధ కలిగించిననూ ఆమె కళ ఆమెను కాపాడెను.ఆమె ఇతరులకు వెలుగు పంచే స్థాయికి చేరెను, అరుణ తార, అంగయార్, దామిని, మాలిని ఎవరి ప్రత్యేకత వారిదే.
    యువతులు కూడా ఎవరికి వారు లక్ష్యాన్ని నెరవేరచుకుంటూ, కలలు కంటూ సాగుతున్న సీతాకోక చిలుకలు. బసవడి ప్రేమ గెలిచెను.వర్షుడి లక్ష్యం నెరవేరెను. అగస్త్య, సుందరి, నందిని, రాఘవ,యమునా వీరి కథలు కూడా కంచికి చేరవలెను కదా! వివాహములు జరగవలెను కదా!ఈ భాగం లో లకుమ పరిస్థితి కూడా దయనీయంగా కనిపించెను.ఆమె వెలుగు తగ్గెను.ఆమె గమ్యమెటు?

    ReplyDelete
  4. ఇప్పుడు సంసృతంలో కూడా వ్రాయగలుగుతున్నాను మీ వ్యాఖ్యాన ప్రోత్సాహం సదా సంస్మరణీయం కావ్య ప్రేరణం హృదయానంద కారణంగురు భ్యోనమ:

    బెంగళూరు మహానగర హృదయాస్తానే ఇందిరనగరే ఆస్తి . ఏతద్ ప్రదేశే బాహుదాన సంపత్పూర్ణ విలాస భావనాని సన్తి. తత్ర గృహాణి అన్తరే మీనాక్ష్యాహ నూతన శ్వేత గృహం ఆస్తి. ఇందిరానగరే సర్వత్ర అనేక ఉత్తమ పాశ్చాత్త్య నృత్య, పలహార, పానశాలాయాం సన్తి. ఇదం జీవనం నవ నాగరికం చ బహుసుందరం

    ReplyDelete