Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, October 2, 2021

ఒక మహాను భావుడికి

ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే ఒక మహాను భావుడికి నిజం తెలియాలని. 

కావ్యం కన్నె లాంటిది అంటే నమ్మలేదు. కన్నెని ఒక అయ్య  చేతిలో పెట్టాలని చెపితే నాకు తలకెక్కలేదు. ఇప్పుడు బుక్ రిలీజ్ కోసం  తిండికి, నిద్రకి కరువై   సెలిబ్రిటీల వెనక తిరుగుతుంటే చుక్కలు కనిపిస్తున్నాయి.  కావ్య రచనకి , దానికంటే ఎక్కువ ప్రింటింగ్ కి, దానికంటే ఎక్కువ పాటలు రికార్డింగుకి మరియు  రిలీజ్ కి శ్రమపడుతున్నాను. ఇందుకు బాధలేదు. కొంత మంది మహానుబావులు నేను వెళ్లిన సలిబ్రిటీస్ కి ఫోన్ చేసి  చెడగొట్టాలని చూస్తున్నారు. 


Let me address you directly. భారతవర్ష నిజంగా ప్రపంచంలో అతిపెద్ద నవల అని నేను ఆంటే చాలా కువివర్శలు చేసావు. భారతవర్ష  పెద్ద నవల కాదని  గుయిన్ సాగ, వెనమురసు, దేవత గురించి చెప్పావు. నువ్వు పేర్లు మాత్రమే చెప్పావు వాటి కథ నేను చెపుతాను నువ్వు విను.

1. గుయిన్ సాగ అనే జాపనీస్ నవల   43,000 పేజీలు నిడివి కలిగి ప్రపంచంలో అతిపెద్ద నవలగా కనిపిస్తుంది. కానీ నిజానికి   గుయిన్ సాగ  ఒక నవల కాదు నవలా శ్రేణి. 143 నవలల సమూహం గుయిన్ సాగ.   కురిమోతో  అనే రచయిత్రి  ఈ  హీరొయిక్ ఫేంటసీ నావెల్ ను  1979 నుండి 2009 వరకు ( 40 సంవత్సరాలు ) రాసింది.  ఒక పుస్తకం లో ఎన్ని పేజీలుంటాయో చూడు 43000 / 143  కేలిక్యులేటర్ ఉంది కదా.  


2.వెనమురసు  22,000 పేజీల  తమిళ నవల ప్రపంచంలో రెండవ స్థానంలో కనిపిస్తుంది.   కానీ  నిజానికి  జేయ మోహన్ అనే తమిళ రచయిత  మహాభారతాన్ని   వెనమురసు గా   (re-narrated) పునః రచించాడు. అది తన రచన కాదు  ఇది కూడా ఒకే నవల కాదు 26 పుస్తకముల  శ్రేణి.   వ్యాస భాగవతం,  దేవి భాగవతం వంటి  పురాణాలు కలిపి రాసిన కథ ఇది. 

3. దేవత  4723 పేజీల ఉర్దూ నవల ప్రపంచములో మూడవ స్థానంలో కనిపిస్తుంది.  ఆల్ పాకిస్తానీ న్యూస్ పేపర్స్ సొసైటీ వారి పత్రిక లో 1977 నుండి 2010 దాకా (33 సంవత్సరాలు) ప్రచురించబడింది. 

4.  లె  జామ్ దు బొంఓలాంతే  ( The people of goodwill) 7892 పేజీల ఫ్రెంచ్ నవల కూడా ఒక్క నవల కాదు 27 పుస్తకాల  నవలా శ్రేణి.   

1970 లో Zettels Traum అనే జర్మన్ పుస్తకం 1536 పేజీల పుస్తకం ప్రచురించబడింది కానీ అదికూడా  అర్నో స్మిట్   సొంత రచన కాదు. అల్లెన్ పో అనే అమెరికన్ రచయిత రచనలన్నీ( అనేక పుస్తకాలు ) అనువాదం మాత్రమే.  

ఇలా చూసుకుంటూ పొతే 1000 పేజీలు దాటిన డైరెక్ట్ నవలలు గత బ్లాగ్లో చెప్పినట్టుగా కొద్దిగానే ఉన్నాయి. కానీ వాటి రచనా కాలం 10 సంవత్సరాలు పైమాటే.  ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే ఇవేవీ తెలియకుండా నువ్వు మాట్లాడావు కనుక.  ఇంకొక విషయం  నీ నాలెజ్ ఏంటో గురువు గారికి తెలిసిపోయింది.  

 అంతటితో ఆగక సులభంగా ఉండే భాష ఉండాలి కానీ  తెలుగు గ్రాంధికం అనవసరం అన్నావు. సులభంగా ఉంటుంది అని నైటీ వేసుకుని పెళ్లి చేసుకుంటారా?  ఆమాటకొస్తే ఇంగ్లిష్ పదాలు తెలుగు కంటే సులభం అనా?  తెలుగు వాడికి తెలుగు బరువయ్యిందా ?   సినిమాల్లో కమెడియన్స్ చేత కూడా ఇంగ్లీష్ డైలాగ్స్ చెప్పిస్తున్నారు ?  

 

డేటాబేస్ దానయ్య కావచ్చు దారిన పోయే దానయ్య కావచ్చు సినిమాల్లో ఏ పాత్ర  చేతైనా ఇలాటి మాటలే పలికిస్తు న్నారు.  ఆ షాడో వల్ల డి విటమిన్  డేఫిషెన్సీ వచ్చిందని ఎఫిషెన్సీ వాడాను. లా లో ఉన్న లూప్ హోల్స్ నాకు ఫుల్ మీల్స్ దానికి ఈ డేటా బేసే సోర్స్. ఈ అమ్మాయి  ఆదికేశవుడి ఓన్లీ డాటర్  ఫాదర్ జైంటు   ఫ్యామిలీ జాయంటు. సెంటిమెంట్ సిమెంట్ లా  పనిచేసి వ్యాపారం స్ట్రాంగ్ అయిపొయింది. Yes she is merciless, ruthless, emotionless, stone -hearted , hardcore business woman.

ఎందుకు అంటే ఆంధ్రులకి స్వచ్ఛమైన తెలుగు  కష్టం అట.  తెలుగు బరువైపోయింది.   కొండలలో కొలువైన కోనేటి రాయడు వాడు తీసేసి  హిల్స్ లో స్టేషన్ అయినా కోనేటి రాయ్ అని మార్చి పాడుకుందాం. ( stationed - past tense of  the verb "to stay" కొలువైయున్న )

భారతవర్ష తొలిపలుకులు రాసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన నాకిచ్చిన అవకాశం కూడా మామూలు అవకాశం  కాదు  అయ్యలకే అయ్య పెద్దయ్య ఆయన తొలిపలుకు చదువుతూనే నీ నోరు మూత  పడుతుంది.  




3 comments:

  1. We are surrounded by jealous people Don't think about such uneducated brutes. We have to do our work and move on. The sincerity and hard work gain a victory.

    ReplyDelete
  2. Sir don't loose your confidence for unnecessary things. Stay on your passion ,the passion and hardwork will pay success one day. Thankyou so much for your writing sir.

    ReplyDelete