Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, October 18, 2021

భర్తని నమ్మి ..

ఆమెకు పెళ్లి అయ్యి ఐదు ఏళ్లయ్యింది. ఆమె భర్త ఆమెతో ఇద్దరు ఆడపిల్లలని కనిపించాడు. ఆమె అత్త ( భర్త తల్లి) విద్య హీనురాలు. మొగ్గురు మగపిల్లలని కన్నదని అహంకారం. ఆడపిల్లలని కన్న తల్లితండ్రులన్నా, ఆడపిల్లలన్నా చాలా చులకన. పాపం చేస్తే ఆడపిల్లలు పుడతారని చెపుతుంటుంది. కొడుకు తల్లి చేతులో మర బొమ్మ. ఈ పరిస్థితి చూసి రెండవ పిల్ల వద్దని చెప్పాను. వినలేదు. రెండవసారి ఆడపిల్ల పుట్టింది.

పిల్ల పుట్టిన తరువాత అతడి తల్లి ( అత్త )సాధింపులు, అవమానాలు పెరిగిపోయాయి. ఆమె తట్టుకోలేకపోయింది. 13రోజుల పురిటికందుతో, కన్నీళ్లతో అత్తారిల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యని తీసుకురమ్మని ఆమె భర్తకి చెప్పాను. కుదరదు అన్నాడు. తల్లి అతడి తలలో కూర్చుంది. హేళనగా నవ్వి మరిన్ని అవమానకరమైన మాటలు అన్నాడు.

ఆమె విడిపోడానికి నిర్ణయించుకుంది. భర్తని నమ్మి పిల్లలని కంటే ఆడదాని బ్రతుకు ఇంతే. వివాహం విచ్చిన్నం అయితే పిల్లల భారం తల్లిదే అవుతోంది. పది సంవత్సరాలు భర్త ప్రవర్తన చూస్తే కానీ ఆడది పిల్లలజోలికి వెళ్ళకూడదు.

సనాతన ధర్మం పేరుతో ఆత్మాభిమానానికి శిలువ వేసే స్త్రీలకు ఇతరుల మెప్పుకోసం జీవితాన్నిచితిమంటలకు ఆహుతి చేసి ఇతరులు ఏమనుకుంటారో అని జీవితాన్ని చీకట్లో గడిపేసే వారికి, కూర్చుని కుటుంబ విలువలు చెప్పేవాళ్లకి, పెళ్లాలమీద జోకులేసే పనికిమాలిన కార్టూనిస్టులకి, అది చూసి నవ్వుకునే మగాళ్ళకి ఈ పోస్టు అంకితం.



3 comments:

  1. Women are sentimental fools. They are emotional. If she left the children with him, what he and his mother can do? She didn't come to his house with the children. But as a mother, she can not do it. That's why they can play with her.

    ReplyDelete
  2. You are right. Life is equally precious either for a man or fora woman. Woman should care for her own life too.

    ReplyDelete
  3. Exactly it is not correct. Where as women must stay rather the children may feel orphen. Mostly man keeps another.
    Because women is devil to another women. This is sin.

    ReplyDelete