Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, December 11, 2021

అనునిత్యం ఆనందం

I have added  some 20 poems to BHARATAVARSHA final version and improved the conversations with the mention of great poets and great books.  *newly added stuff is in blue letters.

జతపరిచిన పద్యాలు - ఉదాహరణ 

పుణ్యము  చేయగా  దొరుకు   మోక్షము  నమ్మిక  జేతురే  మరే   

పుణ్యము   జేయకే  ఇచటె    మోదము   కల్గును  తెల్గునా డలా

వణ్యము   కప్పురం  బువలె   వాసన     లీనును  పాపమే లనో   

అణ్యము  పుణ్యమే ఎరుగ       రాపసి     పాపల    కాంగ్లమే  లనో 

మోక్షం దక్కుతుందని పుణ్యం చేస్తూ మాతృభాషని చంపే పాపం మనకేలనని చెప్పే పద్యం ఇది 

మోక్షం దక్కుతుందని పుణ్యం చేస్తారు మరి ఏ పుణ్యము చేయకపోయినా  

మోదము (మోక్షము) కల్గు తెలుగునాడ (తెలుగు మాట్లాడగా) 

లావణ్యము కర్పూరమువలె వాసనలీనును. అయినా పాపము  ఎందుకో 

(పెద్దలు పిల్లలకి ఈ ఆనందాన్ని దక్కనివ్వరు) అన్నెము పున్నెమెరుగని

 పసిపాపలు ఆంగ్లమెందుకో. (అలా లాక్కునే హక్కు మనకుందా?) 

మెరుగు పరచిన సంభాషణలు  - ఉదాహరణ 

అరుణ: దేవుని ఉత్సవము నీకు భారంగానున్నదా లేక నావద్దనే అహంకారం చూపుచున్నావా? నేను ఆలయ ధర్మకర్తగానుండగా నీవిట్లు మాట్లాడ తగదు. నాతరువాత నీవే ఈ బాధ్యత స్వీకరించి ఈ  పుణ్యకార్యములను నడపవలెను. “నేనా  బాధ్యతలను చేపట్టవలెనా?” అని లకుమ సందేహించుచుండగా  అరుణతార  “వాల్మీకి రామాయణమును రంగనాథ రామాయణముగా  తెలుగున గోనబుద్ధారెడ్డి యుద్ధకాండవరకు రచించగా  అతడి మరణా నంతరము అతడి కుమారులు దానిని సంపూర్ణ మొనర్చినారట.  అట్లాశించుటకు ఇదేమైననూ నాటికాలమా! నేటి కాలమున ఆస్తులకు వారసులిట్టే పుట్టుకొత్తరు కానీ బాధ్యతలకు వారసులొత్తురా?” 

నిత్యమూ ఆనందాన్ని అనుభవించడమే మోక్షము. వాద్య సంగీతము నేర్చుకోడం ద్వారా లేదా గాత్ర సంగీతం నేచుకోడం ద్వారా  వాయిస్తూ లేదా పాడుతూ ఆనందం పొందేవాళ్లు లేరా?  కవిత్వం కళాకాదా ? తెలుగు భాష కాదా?  తెలుగు లో ఆనందంలేదా ?  ఇలాటి పద్యాలు మంచి సంభాషణలతో నిండిన భారతవర్షకి తెలుగు సాహిత్యంలో ఒక చిన్న స్తానం  ఉంటుందని  మీ మనసులో కూడా స్తానం ఇస్తారని  ఆశిస్తూ సెలవు

 -  మీ సాహిత్య మిత్రుడు పూలబాల 


2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. భారతవర్షకు పెళ్ళి కూతురికి అద్దినట్లు అలంకారాలు అద్దుతున్నారు.భారతవర్ష సాహిత్య చరిత్రలో నిలిచిపోతుంది.మీరు సాహిత్య ప్రియుల గుండెల్లో
    కలకాలం నిలిచిపోతారు.రాధామనోహరం పరిమళిస్తూనే ఉంటుంది.

    ReplyDelete