భీమవరంలో పనియుండెటచే నిన్నసాయం సంధ్యలో ద్విచక్ర వాహనము పై భీమవరం పోయినాను. అర్ధరాత్రి ఒంటి గంటకి, ఒంటి నిండా దుమ్ముతో ఇల్లు చేరినాను.
భారతవర్ష ఒకటవ రెండవ మూడవ కథనాలు (వెర్షన్స్ ) పూర్తయినవి. భారతవర్ష చివరి కథనం పూర్తి అగుచున్నది. చివరి కథనమందు అలంకరణలు అనేక సంభాషణలను మెరుగుపరిచబడి పూర్ణ వృత్తాంతముల పొందుపరచబడినవి. భారతవర్ష రాజీనామా కారణాలు, లకుమ నటనా కౌశలము, విదిష వైరాగ్యానికి బలమైన కారణం, రత్న కుమారి పాత్ర ఆమె భక్తి పరాయణత్వము నాగిరెడ్డి, బైర్రెడ్డి, సింహాచలం స్నేహం. కథ ఇట్లు పాత్రల పూర్ణ వృత్తాంత ములు జతపరిచినాను, జ్ఞానాభిలాషులకు విందుచేయటకు లోతైనజ్ఞానమును సంభాషణలకు జతపరిచినాను. సింహాచలం హత్యోదంతమునందు స్పష్టముగా దైవశక్తిని చూపినాను.
నరసింహ దేవాలయ మాన్యాలను పెంచలయ్య ఆక్రమించుకొని సిలువ పాతేసి చర్చ్ కట్టాలని చూస్తుంటాడు అతడికి సింహాచలం మద్దుతుంటుంది. సింహాచలం పెంచలయ్య తోడుదొంగలు. సింహాచలం ప్రోత్సాహంతో మిషేల్ పాఠశాలపై కేసుపెట్టి వారిని పీడిస్తూ సింహాచలం అడ్డుకోటం వల్ల ఆగుతున్నట్టు నటిస్తాడు. దానినడ్డుపెట్టుకొని సింహాచలం మిషెల్ ని వశపరుచుకుంటాడు. అతడి ప్రవర్తన తో మనసు విరిగిన రత్నకుమారి నారసింహ ఆలయానికి వెళ్లి హరికథ వింటూంటుంది. భారతవర్ష హరి కథకుడు
నృసింహ
నరసింహ నారసింహ, నృసింహ నరసింహ నారసింహ
నరమూర్తివిగావు
నారాయణువిగావు అవతారమూర్తివి
నారసింహ
ఆదిమూలము
నీవు ఏకవింశతి
రూప నారసింహ, ఏకవింశతి రూప నారసింహ
చతుర్దావతారము చండప్రచండము నారసింహ బహు ఉగ్ర రూపము నారసింహ
హరిని కీర్తన చేస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యని ఒకపక్క హరికథ నడుస్తుంటుంది
ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, జ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖనఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు. అని భారతవర్ష హరి కథ చెపుతుండగా మిషేల్ సింహాచలాన్ని చంపుతుంది.
శా. శ్రీవాణీ దయచే స్వరాలు పలికెన్ శ్రీగంధ మాధుర్య మున్
శ్రీవత్సాం కుడుమె చ్చిఇచ్చె దయతో శ్రీ సంప్ర దాయంబు లన్
శ్రీవాక్కు సరళం బుగాప లకగా శ్రీరాగ సౌందర్య మున్
ప్రభువుల వైభవమంతయూ చిల్లులు బడి జల్లెడవలె నున్న రహదారులపై కానవచ్చెను. గుంతలు బడిన రహదారులు మృత్యుకూపములవలె నున్నవి. అస్తవ్యస్తముగానున్న రహదారులతీరు తెలిసిననూ ద్విచక్ర వాహనము పైనే పోవలెనని నిర్ణయించుకొంటిని. దానికి కారణమున్నది. పగటిపూట చుక్కలు చూపించెడి ఆ దారులు రాత్రిపూట ప్రత్యక్ష నరకమును చూపించినవి. కానీ నరకము గుండా నేను పోవుచున్నది స్వర్గమునకే కదా. నిజము చెప్పవలెనన్న భరతవర్ష కావ్యము కవచమువలే నన్నంటిపెట్టుకొని నన్ను సతతము ఆనందడోలికలందు తేలాడించుచుండును. కావ్యం మనోకవచం తర్హి దుఃఖం కదాపి స్పృశ్య న శక్నోతి. అనగా కావ్యం మనసుని చుట్టియుండి దుఃఖాన్ని దరిచేరనివ్వదు.
భీమవరంలో సదాచార బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చిఱుతప్రాయమునే నాదోపాసన ప్రారంభించిన చిరంజీవి శ్రీవల్లి స్వరము వరమై సంగీతపారంగతుల నోలలాడించిన సంగతి తెలుగువారందరికీ విదితమే. ఆమె కోవిదుల సరసన పాడి ప్రకాశించిననూ కించిత్తు గర్వమెరగనామె తలిదండ్రులను కలుసుకొనుట నాకు గర్వకారణము. అట్టివారిని కలుసుకొనుటకు విమానమున్ననూ పోరాదని ఋషినిర్మిత సంస్కృతి జెప్పుచున్నది.
చిరంజీవి శ్రీవల్లికి అభినందనలు. కఠోర శ్రామికులు పూలబాల గారికి అభివందనాలు.
ReplyDeleteशुभाभिनंदनानि।
ReplyDelete