మార్కాపురం సాహిత్య ఖని. ఒక్క తెలుగు పండితుడిని కలిస్తేనే నాహృదయం శరీరంలోంచి బైటకు గెంతేస్తుంది, ఆపై కవితాకాశంలో విహరిస్తుంది. అలాటిది పదిమంది తెలుగు పండితులు రచయితలు, అసమాన ప్రతిభావంతులు, భాషాభిమానులు ఒకే వేదికపై ఒక సభలో కనిపిస్తే ... ఆ అతులిత ఆనంద మహిమ ఒక భాషా దుర్గం, మరో స్వర్గం.
డాక్టర్ కప్పగెంతుల మధుసూదన్ గారు ఎం ఏ తెలుగు, ఎం ఏ సంస్కృతం పిఎహ్ డి. , అవధాన కళ లో పి. హెచ్. డి చేసిన ఆయన సామాన్యుడిలా కనిపించే అసామాన్యులు, మాతృ భాషానురక్తులు. డాక్టర్ కప్పగెంతుల భారతవర్ష గ్రంధాన్నిఅద్భుతంగా వర్ణించారు. "కప్పగెంతుల ", "పూలబాల" అనే పదాలకి నిజమైన అర్ధాలు మన ఊహకు కూడా అందవు. పూలబాల అనే పేరుకి ఆయన చెప్పిన భాష్యం కలకాలం నామనసులో నే కాదు ఎవరి మనసులో నైనా నిలిచిపోతుంది. ఎందుకంటే వారినిజమైన వ్యుత్పత్తులు తెలుసుకుంటే నిజమైన అర్థాలు మనకు బోధపడతాయి.
కప్పగెంతుల అనే ఇంటిపేరు కప్పగొంతుల నుంచి వచ్చింది. వారి పూర్వీకులు వేదాన్ని కప్పగొంతుతో చదివేవారు. కప్పగొంతుల కాలక్రమేణా కప్పగెంతులుగా మారిపోయింది. ఇంకా పూలబాల అనే పదంలో పూలు అతి తక్కువ కాలం జీవించినా జీవితాన్ని అత్యంత ప్రయోజనాత్మకంగా అర్థవంతంగా జీవిస్తాయి , బాల అనే మాట ఎప్పుడూ వయసుని మాత్రమే సూచించే మాటకాదు. బాల అంటే బాల వ్యాకరణం , అంటే చిన్నపిల్లలకి వ్యాకరణ అని అర్ధం కాదు. చిన్నయ్య సూరి వ్రాసిన బాల వ్యాకరణం అంటే చిన్నపిల్లలకి వ్రాసిన వ్యాకరణం కాదు. బాల అంటే విషయ జ్ఞాన సంపన్న అని అర్థం అని చెప్పేరు. పండితుల కసాధ్యమేమీలేదు కదా!
విద్యశాఖలో అనేక ఉన్నత పదవుల్లో ప్రకాశించిన డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డిగారు తెలుగు ఇంగ్లిష్ సైకాలజీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన భాషా ప్రేమికులు. వారు భారతర్ష గ్రంధాన్ని వేయిపడగల గ్రంధం తో అనేకసార్లు పోల్చారు. పూలబాలని చూస్తే విశ్వనాధ సత్యనారాయణ గుర్తుకొస్తున్నారని అన్నారు. విశ్వనాథ పూలబాల రచనల మధ్య పోలికలను చెపుతూ ఇరువురి భార్యల పేర్లు కూడా ఒకటే ( వరలక్ష్మి) అని చెప్పారు. కొంత గ్రంధాన్ని చదివి అందులో అంశాలను ప్రస్తుతించారు. ఇలాటి గొప్పవారి (రివ్యూ) అభిప్రాయం తో మాజీ ఎం ఎల్ ఏ శ్రీ జక్కిరెడ్డి గారి అభినందనలతో సాగుతుండగా తటాలున తరలివచ్చిందో నాట్యరాణి , అసమాన ప్రతిభావంతురాలు , జితకాసిని , ( గెలుపు తో వెలుగొందెడి) 250 తో 48 గంటలునాట్యం చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించిన ప్రతిమ గారు. ప్రపంచ రికార్డుని కైవసం చేసుకున్న ప్రతిమగారి ప్రతిభ గురించి తెలుసుకుంటే మనకు ఎవరెస్టు ఎక్కినా ఆనందం కలుగుతుంది జీవితంలో అడ్డంకులు హాస్యాస్పదంగా కనిపిస్తాయి.
Poolabala presenting Bharatavarsha to Mrs. Pratima, Head Sneha Dance Academy
అలా అనేక మంది గొప్పవారి పరిచయంతో, గొప్ప నాట్యంతో, దుర్లభమైన గాత్ర మాధుర్యాన్ని, కీర్తిని ప్రతిష్టలను ఆర్జించిన చిరంజీవులు ఋగ్వేదం పద్మశ్రీ , కృష్ణ శ్రీ ల గొప్ప గాత్రంతో 28 వ తేదీ రాత్రి మార్కాపురంలో జరిగిన భారతవర్ష సాహిత్య కార్యక్రమం స్వర్గ తుల్యమై మరుపురాని అనుభూతిని మిగిల్చింది. ఈ గొప్పతనం అంతా నా జర్మన్ విద్యార్థి శ్రీ సోమశేఖరుగారిది. ఈ కార్య క్రమ నిర్వహణకు ఆయన సహాయం మరుపురానిది ఆయన శ్రమ మాటలకందనిది ఆయనే లేకపోతే భారతవర్ష సాహిత్య పరిచయం అసంభవం
|
నా జర్మన్ విద్యార్థి సోమశేఖర్ గారికి జర్మన్ పుస్తకాన్ని అందజేస్తూ |
అల మార్కాపురిలో
ReplyDeleteమాటల, బహుభాషా పలుకుల రేడు కు సమున్నత సన్మానము