Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, March 29, 2024

కోట్ల వ్యాపారానికి తెర లేపిన ఫ్రెంచ్ ప్రతిభ

 


ఉన్నత విద్యకోసం, వ్యాపారం కోసం   విదేశీ భాషలు నేర్చుకుని తమ అవసరం తీర్చుకుంటారు  కొంతమంది . ఇంకొక్క మెట్టు ఎక్కి ఆ భాషలను ఇతరులకు బోధిస్తారు కొంతమంది. మరొక్క మెట్టు ఎక్కి విదేశీ కంపెనీలలో దుబాషీలగా  పని చేస్తారు కొంతమంది. ఆ పై మెట్టు  ఎక్కి రచనలు కూడా చేస్తారు కొద్ది మంది.  ఆ  అతికొద్ది మందిలో ఏ ఒక్కరో అత్యున్నత శిఖరం చేరి  ప్రపంచరికార్డు నెలకొపుతారు, ప్రతిభా పురస్కారాలను అందుకుంటారు దేశ విదేశాల్లో వ్యాపార వైజ్ఞానిక రంగాలలో జరిగే చర్చలలో సేవలందించి  ప్రతిభకు ఎల్లలు లేవు అని నిరూపిస్తారు. ఆ ఒక్క వ్యక్తే  వెంకట  పూలబాల. 


 తెలుగు మధ్య తగరతి కుటుంబంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకుని  భాష సోపానాలు ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించిన బహుభాషి  పూలబాల. 

ఫ్రెంచ్‎లో నవల రాసిన తెలుగు రచయత వెంకట్ పూలబాల. ఒక్క ఫ్రెంచ్‎లోనే కాక ఆరు విదేశీభాషలతో అత్యధికంగా పుస్తకాలు రచించిన ఎక్స్ ఫోనిక్ రైటర్‎గా పేరుతెచ్చుకున్నారు. ఈయన సాహిత్య ప్రస్థానం రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పేదాకా సాగింది. పూర్తి తెలుగులో ఒక్క ఇంగ్లిష్ మాట వాడకుండా  రెండు లక్షల యాభై  వేల  పదాలతో 1265 పేజీలు  అతిపెద్ద గ్రంధం  “భారతవర్ష”  ను అతి తక్కువకాలం ఎనిమిది  నెలల్లో రచించి పూలబాల  మొదటి ప్రపంచ రికార్డును సాధించారు.  ఈ టీ వీ పూలబాల “భారతవర్ష”  పై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యాశాఖామంత్రి చేతులమీదుగా రాష్ట్ర అధికార భాషా సంఘం వారి మాతృభాషసేవా శిరోమణి బిరుదు పొందారు.  రెండువందల ఇంగ్లిష్ సోనెట్స్ గల ఇండియన్ సోనెటీర్  అనే ఆంగ్ల పద్యకావ్యాన్ని   అతి తక్కువ కాలం, నాలుగు నెలల్లో రచించి రెండవ ప్రపంచ రికార్డు సాధించారు. అందుకుగాను ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడెమీ పూలబాలకు మీడియా పురస్కారాన్ని అందజేసింది.    జపనీస్ లిపి పై పట్టు సాధించి జాపనీస్ లో పుస్తకం రాయడమే కాకుండా ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో జపనీస్ భాషను బోధిస్తున్నారు. 


ప్రభుత్వ అనువాదకుడిగా    

ఫ్రాన్స్ తునిసియా జింబాబ్వేలతో పాటూ ఇతర దేశాల నుంచి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సహజ వ్యవసాయం ద్వారా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను పరిశీలించేందుకు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ రైతులతో సంభాషిచే సమయంలో అటు ఫ్రెంచ్ వారికి ఇటు తెలుగు వారికి వారధిగా నిలిచారు పూలబాల. ఈయన ఫ్రెంచ్‎ను తెలుగులోకి.. తెలుగును ఫ్రెంచ్‎లోకి అనువదించడానికి ప్రభుత్వ అనువాదకుడిగా తన సేవలు అందించారు. అగ్రి కల్చర్ రీసెర్చ్ మీద సరికొత్త విషయాలను తెలియజేయడానికి బెంగళూరులో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. తన ఫ్రెంచ్ భాషతో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇదంతా పాత కథ 


బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికా లో ఒక చిన్న దేశం. కానీ ప్రపంచంలో అత్యుత్తమ పత్తి ని  పండించే దేశం. ఈ దేశం ఎప్పుడూ ముడి పత్తిని అమ్ముతూ ఉండేది.  ఇప్పుడు వస్త్ర పరిశ్రమకు కావలసిన దారాలు తయారుచేయాలని నిర్ణయించుకుంది. 


బుర్కినా ఫాసోకు భారతదేశంలో పూణేలో  ఉన్న గోద్రాజ్ అనే సంస్థను సలహా సాంకేతిక సహాయం కోసం సంప్రదించింది. ఈ సందర్భంలో ఫ్రెంచ్ అనువాదకుడు అవసరం పడింది  ఫ్రెంచ్  అనువాదం మరియు వాయిస్ ఓవర్ ద్వారా అంతర్జాతీయ వస్త్ర వ్యాపార అనుసంధానంలో పూలబాల ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. ఈ ఒప్పందంవిజయవంతంకావడంతో కొట్లావ్యాపారా నికి తెరలేస్తుందని వ్యాపారం నాది కానప్పటికీ చాలా సంతోషంగా ఉందని "ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి ఆనందించే శాస్త్రవేత్తలా ఎంతో ఆనందం గాఉందని" చెప్పారు. పూలబాల

No comments:

Post a Comment