ప్రస్తుతం మనం పురుషాధిక్య సమాజం అనే మాట ఎక్కువగా వింటుంటాము. అది ఎంతవరకు నిజమో తెలుసా ? అంతకంటే ముందు పురుషాధిక్య సమాజాం ఎలా ఏర్పడిందో తెలుసా ?
ఆ తెలియకేం మనుధర్మమే దానికి కారణం అని స్త్రీ వాదులు మానవతావాదులు తయారవుతారు మనదేశాన్ని ఆడిపోసుకోడానికి. బాల్య వివాహాలు అనగానే మనదేశాన్ని ఆడిపోసుకుంటారు.
బాల్య వివాహాలు ప్రతి దేశంలో నూ ఉన్నాయి. ఉదాహరణకు క్వీన్ ఎలిజబెత్ భర్త ఎనిమిదవ హెన్రి కథ తెలిస్తే ఇలా మాట్లాడరు. ఏడవ హెన్రి కి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఆర్థర్, చిన్న కొడుకు ఎనిమిదవ హెన్రి . ఆర్థర్ పెళ్లి కి అతడి వయసు 7 సంవత్సరాలు , ఎనిమిదవ హెన్రి పెళ్ళికి అతడి వయస్సు 15 ఏళ్ళు. ఎనిమిదవ హెన్రి ఆరుగురి భార్యలని వాహం చేసుకుని , ఇద్దరికీ శిరచ్చేదం , ఇద్దరికీ విడాకులు ఇవ్వగా ఒకామె ( జే న్ సెమూర్ ) పురిటిలో చనిపోతుంది. చివరి కి కేథరీన్ పార్ అనే మరో ఆమెను చనిపోయే ముందు చేసుకుని రాజ్యాన్ని ఆమె హస్తగతం చేస్తాడు. మగ సంతానాన్ని ఇవ్వ నందుకు శిరచ్చేదం చేయిస్తాడు . బాల్య వివాహాలు వరకట్నాలు మగపిల్లలని కనన్నందుకు మరణ దండన ఇవన్నీ ఇంగ్లాండ్ రాజకుటుంబాల లో ఉన్నవే.
పురుషాధిక్య సమాజం కేవలం భారతదేశంలోనే లేదు , ప్రపంచం అంతటా ఉన్నది అదే. గ్రీకు మైథాలజీ చదివితే దీని మూలాలు పురుషాధిక్యత ఎలావచ్చిందో కొంత తెలుస్తుంది.
గ్రీకు మైథాలజీలో మానవజాతిని పెని ట్రేటర్ ( పెట్టువాడు ) పెనిట్రేటెడ్ ( పెట్టించుకునేది ) గా విభజించి పెని ట్రేటర్ కే విలువ ఇచ్చేవారు. మన సినిమాల్లో కూడా తన్నే వాడికి విలువ ఎక్కువ తన్నులు తినే వాడికి విలువ ఉండదు. బాగా తన్నే వాడినే హీరోయిన్ కోరుకుంటుంది .
యుద్ధాలలో స్త్రీల పాత్ర ఏంటి అనే ప్రశ్న ఎప్పుడైనా తట్టిందా?
స్రీలు ఆదిశక్తి పరాశక్తి అని అంటాం. కానీప్రపంచ యుద్ధాలు వచ్చిన ప్పుడు స్త్రీలని కాపాడుకులేక పురుషులు చచ్చేవారు. (ఈరోజుకి కూడా స్త్రీకి రక్షణ ఏర్పాటు చేయడానికి పురుషులు చాలా ఇబ్బందులు పడుతుంటా రు.) స్త్రీలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వాస్తవం చెప్పాలన్నదే నా ఉద్దేశం. స్త్రీ శరీరం అందం మగాణ్ణి వివశుడిని చేస్తుంది. స్త్రీ శరీర ఆకర్షణ బెర్ముడా ట్రైయాంగిల్ లాటిది అనిపిస్తుంది. ఆ ఆకర్షణ తప్పించుకోలేక ప్రాచీన కాలం నుండి, మగాడు స్త్రీని వేటాడాడు, అత్యాచారం చేశాడు. స్త్రీ అందం యుద్ధాలని అత్యాచారాలను ప్రేరేపించింది. మానవ చరిత్రలో యుద్ధాల ఎంత సాధారణమో అత్యాచారాలు కూడా అంతే సాధారణం. యుద్ధంలో సాధారణంగా పురుషులు హత్యకు గురైతే స్త్రీల అత్యాచారానికి గురవుతారు. ఈ సంఘటనలు లక్షలాది గా చరిత్రలో ఉన్నాయి.
బ్రిటీష్ సైనికులు, రష్యన్ సైనికులు లేదా ఎవరైనా, ఏ సైనికులు అయినా ఏ యుద్ధం జరిగినా ముందుగా బాధితురాలు స్త్రీ. 1944లో, మోంటే కాసినో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలి అత్యంత క్లిష్టమైన యుద్ధాలలో ఒకటి. ఇటలీ సైన్యం ఫ్రెంచ్ జనరల్ చార్లెస్ దుగాల్ ఆధ్వర్యంలో ఉన్నాయి.
ఉత్తర ఆఫ్రికాలోని ఫ్రెంచ్ కాలనీల నుండి వస్తున్న ఫ్రెంచ్ సైన్యం. క్రూరమైన హింస ఉన్మాదం లో వేలాది మంది మహిళలు, యుక్తవయస్సు బాలికలు చిన్నారులపై రోజుల తరబడి అత్యాచారాలు జరిపారు వారు ప్రతి పట్టణం మరియు గ్రామంలో 10 నుండి 80 సంవత్సరాల వయస్సు గల ప్రతి మహిళపై అత్యాచారం చేశారు. ఏకకాలంలో ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇలాటి అత్యాచారాలు చేసిన సైనికుల్ని శిక్షించడం కుదరదని రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఆ సమయంలో అత్యాచారాలను తగ్గించే లక్ష్యంతో ఇంపీరియల్ జపనీస్ సైన్యం ఆక్రమిత దేశాలు మరియు భూభాగాల్లో కంఫర్ట్ వుమెన్ లేదా కంఫర్ట్ గర్ల్స్ ని ప్రవేశపెట్టారు. ఇలా లైంగిక బానిసత్వంలోకి నెట్టబడిన మహిళలు మరియు బాలికలు లక్షల్లో ఉండేవారు .
1992లో బోస్నియన్ యుద్ధ సమయంలో మహిళల పై అత్యాచారం అనేది జాతి ప్రక్షాళన లక్ష్యంగా ఒక యుద్ధ నీతి కింద సాగించారు బోస్నియన్ యుద్ధంలో 50,000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు అని రిపోర్ట్ కాని కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ.
రష్యాపైన చైనా పైన జాపనీస్ సైన్యం చేసిన అరాచకాలు, ఇన్ని అన్నీ కావు లక్షల మందిని చంపి లక్షల మందిని రేప్ చేసిపారేశారు. జపాన్ అరాచకాలు
జపాన్ పై అణుబాంబు దాడి జరగడం వల్ల ఆ కేకల్లో జపాన్ చేసిన దురాక్రమణలు, దాడులు, ఆ దాడుల్లో జాపనీస్ సైన్యం చేసిన అరాచకాలు, పైశాచిక కృత్యాలు కప్పడిపోయాయి. తన అమానుషత్వాన్ని సానుభూతి పరదాలు వెనుక దాచి జాపనీస్ అమాయక ముఖాన్ని చూపిస్తుంది లక్షల మందిని చంపి లక్షల మందిని రేప్ చేసిన పెద్దగా పైకి రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు సుమారు కోటిమందిని చంపేసినా పైకి రాకుండా చూసుకుంది. కొరియా కోసమని చైనా మీద, పోర్ట్ ఆర్థర్ కోసమని రష్యా మీద యద్దానికి దిగి గెలిచింది.
1931 లో మంచురియా ని జపాన్ ఆక్రమించుకుంది, 1937 లో షాంగై ని ఆక్రమంచుకోడానికి యుద్దానికి దిగి ఆక్రమించుకుంది. తరువాత చైనా రాజధాని నాన్జింగ్ ని ఆక్రమించుకోమని ఆజ్ఞ రావడంతో యథేచ్ఛగా మారణకాండ కొనసాగించారు. కనిపించిన వారందరిని చంపుకుంటూ పోయారు. వారం రోజుల్లో అందరూ లొంగిపోవాలని ఆశాకా ప్రకటించాడు. లొంగవద్దని చెప్పి చైనా ప్రభుత్వం తమ సైనికులకు చెప్పి తానూ తప్పుకుంది . లొంగిపోయిన చైనా సైన్యాన్ని వారితోనే గోతులు తీయించి వాటిలో వారిని బ్రతికుండగానే పాతేశారు. ఇద్దరు జాపనీస్ సైనికులు పందెం వేసుకుని మరీ చైనా సైనికుల తెగగొట్టారు. మొదట వంద తలలు తెగ్గొట్టటం తరువాత నూట యాభై ఇలా పందేలు వేసుకుని నదిలో నీరంతా ఎర్రగా పారాలని పందేలు వేసుకున్నారు. సరదాగా ల్యాండ్ మైన్స్ పెట్టి కొంతమందిని చంపి , మరికొంత మందిని కిరోసిన్ త్రాగించి పరిగెత్తించి చంపారు. ఆడవాళ్ళని రాత్రంతా రేపే చేసి చంపారు. పాలిస్తున్న తల్లిని స్థానాల్లో టొప్పకీ తో పొడిచి చంపారు. వాటిని ఫోటోలు తీసి పేపర్లలో గొప్పగా రాసుకున్నదేశం జపాన్.
స్త్రీల శారీరక బలహీనత పురుషుల మానసిక బలహీనత ( కోరిక ) వెరసి పురుశాధిక్య సమాజానికి కారణమైంది. కానీ స్త్రీ పురుషులు సమానమే , మనుషులంతా ఒక్కటే అని చెప్పడానికి బాగుంటుంది. పదవిలో ఉన్నవాడు పదవిలో లేనివాడు ఒక్కటే అని కూడా చెప్పవచ్చు. స్త్రీ లు ఒక్కరే కాదండీ బలహీను లందరూ పీడించ బడుతున్నారు. నిజాయతీ పరులు కూడా పీడించబడుతున్నారు. కానీ స్త్రీవాదులు చేసే ఓవరేక్షన్ ఇంతా అంతా కాదు.
చరిత్ర చదివితే తెలుస్తుంది. కానీ చరిత్ర అంటే చిన్న చూపు కలిగించి అటకెక్కించేశారు. టెక్నాల జీ, ఇంగ్లిష్ వాడు మనకు దేవుళ్ళు . మన బాషా మన చరిత్ర మనకి చిన్నతనం. మన పిల్లలకి చదువు రాదు సినిమాలు చూడడం తప్ప. మనపిల్లలు ఎప్పుడూ చదువుతూనే కనిపిస్తారు అనినా ఒక్కడికీ ప్రపంచ జ్ఞానం ఉండదు. అది చదువు కాదు టెక్స్ట్ బుక్స్ తో కుస్తీ. ప్రాణాలు అరచేతు ల్లో పెట్టుకుని పరీక్షలకి బట్టే పట్టడం తప్ప మామూలుగా చదవడం టైం దండగ అనేలా మైండ్ సెట్ చేసేసింది మన విద్యావ్యస్థ.
No comments:
Post a Comment