Saturday, July 11, 2020

Bharatavarsha 3 bairreddy - basava

రెండులక్షల యాబదివేల జనాభాగల  ఎం వీ పీ కాలనీ ఆసియాలో అతిపెద్ద జనావాసము.  అందు  ఆనంద నిలయము  చెంతన బసవ నిలయము  అను  మధ్యతరగతి ఆవాసమొకటి కలదు.  దూరము నుండి సబ్బు పెట్టె వలె  దగ్గరనుండి రైలు పెట్టవలె నుండి ఆ మిద్దె ఇల్లు పై డాబా డాబుకొరకు మాత్రమే యని  చూచువారికి చక్కగా బోధపడును. ముఖమునకు రెండు కళ్ళు వలె ఆ ఇంటికి రెండు దీర్ఘ చతురస్త్ర పు  కిటికీలు మధ్యలో పొడవాటి ముక్కువలే ఆ రెండు కిటికీల మధ్య  ఒక ఎత్తైన ద్వారము కలవు  ఇంతోటి అందమునకు దిష్టి ఎక్కడ తగులునో యన్నట్టు  ఆ ఇంటివారు  ఆ గుమ్మమునకు ఒక బూడిది గుమ్మడి కాయ వేళ్ళాడదీసినారు   

ఆ ఇంటికి ప్రహరీ గోడ దానికి రెండు ఇనప తలుపులు అమర్చబడినవి  ద్వారము  పక్కనే మిద్దెపైకి సోపానములు కలవు. ఆ ఇంటినందు బిగ్గరగా సంవాదము జరుగుచుండెను.  పై నుంచి చూచి   ఆ ఇంటి గలవారు  ఎంతో పద్దతి గలవారిని అనుకొనువారికి  ఆ సంవాదము వినినతరువాత ఎంత పద్దతి గలవారో  వారో  అర్థమగును.  

"బైక్ కొనలేక పోయావు, థూ! కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కూడా కొనలేకపోయావ్, మా కాలేజీకొచ్చి చూడు ప్రతీ ఎర్రిపప్పకి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అందరూ బైక్ల మీద కాలేజీకి వస్తుంటే నేను మాత్రం మూడేళ్లనుంచి బస్సులలో తిరుగుతున్నాను.   చేతగానప్పుడు పిల్లల్ని  కనకూడదు." అన్నాడు బసవయ్య తండ్రితో. 

"ఏం  కూసావురా! నేను చేతకానోడినైతేనేనా, లక్షలు తెగలేసి  నిన్ను పెద్దకాలేజిలో ఇంజినీరింగ్లో జేర్చేను!  సోకుల మీదే నీఫోకస్ అందుకే నీకన్నిబేక్ లాగ్స్,  నువ్వు చదువు  మీద  కాన్సెన్ట్రేట్ చెయ్యి  బేక్ లాగ్స్ క్లియర్ చెయ్యి  అన్నాడు తండ్రి సర్రాజు. 



 బసవ తల్లి బుచ్చమ్మకి అది  తెలుగా ఆంగ్లమా తెలియకున్నది.   ఆమెకు అట్టి ఆంగ్లమస్సలు నచ్చదు. కొడుకు ఎదో చెప్పబోవుచుండగా   తల్లి బుచ్చమ్మ అతడిని ఆపి, బసవా మీనాన్న చేయుచున్నది  ఆర్ టీ  సి లో గుమస్తా పని. అది గుర్తుంచుకొనుము. ఇప్పటికే శక్తికి మించి పరిగెత్తుచున్నాము .  ఆ చిన్న దాన్ని  చూచైననూ  బుద్ధి తెచ్చు కొనుము , దానిని చూడుము  డబ్బుఖర్చుపెట్టి ఆ పెద్ద బడి (కార్పొరేట్ స్కూల్)లో వేసినందుకు ఎంత మంచి మార్కులు తెచ్చుకొనుచున్నదో !" అని బుచ్చమ్మగారు అనగా బసవడికి వొళ్ళు మండెను  "దీనమ్మ బేక్ లాగ్స్ , ఎప్పుడు బండి కొనమని  అడిగినా , సెల్ కొనమని అడిగినా నాన్న   బేక్ లాగ్స్ అంటాడు , నువ్వు  చెల్లిని చూబెట్టి  నాకు దొబ్బులు పెడతావు . మీరు నాకేమిచ్చారు, కని పడేసారు , ఆఖరికి పేరుకూడా బసవయ్య అట, చెప్పుకోడానికే సిగ్గేస్తోంది, అందుకే బన్నీ అని చెప్పుకుని తిరుగుతున్నాను, అన్నాడు బసవయ్య. 

తాతగారిపేరుని ఎందుకురా అలా అంటావు , ఆయన చాలా గొప్పవారు తెలుసా ? అంది బసవయ్య చెల్లి. "ఏం గొప్ప, మొత్తం డబ్బులంతా దాన ధర్మాలు చేసి చిప్ప చేతికిచ్చాడు." అన్నాడు బసవయ్య. అదే సమయమునకు బుచ్చెమ్మ  బసవయ్య స్నేహితుడు  అగస్త్య ను ద్వారము వద్ద చూచెను.  "చందన, ఆ త్రాష్టుడితో వాదించక నువ్వు లోపలి పోయి చదువుకోమ్మా , అని కుమార్తెకు  జెప్పి   గుమ్మదగ్గర నిలబడి ఉన్న  అగస్త్య ను చూపి , నువ్వు కాస్సేపు బైటికి పో నీ స్నేహితుడు వచ్చాడు" అని కొడుకుని నెట్టెను. లిప్తపాటులో జరగరానిది  జరిగిపోయెను   బసవ తల్లి చెంప చెళ్లు  మనిపిం చెను.తల్లి కళ్ళల్లో నీరు తిరిగుచుండెను, గుమ్మం వద్ద నుండి వెనుదిరుగుతున్న అగస్త్య ను చూసి బసవయ్య తండ్రి "చూడయ్యా అగస్త్య, చూడు!  వీడీని కన్నందుకు నేను చేతకానోడినట!  చూసేవా తల్లిని కొట్టేడు, ఈ ఇంటికి శనిలా దాపురించాడు " అన్నాడు.

 

అగస్త్యకి ఏమి మాట్లాడ వలెనో  తెలియక మౌనంవహించెను.

"  నేను చస్తే మీకు నాశనివదిలిపోతుంది." అని చెప్పులు వేసుకుంటున్న కొడుకుని చూసిన తల్లి "వాడు నన్ను కొట్టడం ఏంటి ? నన్నెవరూ కొట్టలేదు లేనిపోని అబాండాలు వేయకండి."అనెను.  కొడుకు ఏ అఘాయిత్యము చేసుకొనునో యని ఆ పిచ్చితల్లి ఆరాటం   "భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్ళకునాన్నా! అని గెడ్డంపుచ్చుకొనెను.

 "మళ్ళీ వస్తానండీ" అని అగస్త్య వెను తిరిగెను. బుచ్చెమ్మగారు "ఆగు బాబు, లోపలికి రా, ఇప్పుడేమయ్యిందని, ఇల్లన్న తర్వాతత గొడవలు ఉండవా, మనుషులన్నతర్వాత మాటా మాట అనుకోరా? మధ్యాన్నాము భోజనం వేళ అవుతుండగా వచ్చావు నువ్వు కూడా భోజనం చేసి వెళ్ళవలెను."అనెను 

అదివిని అగస్త్యుడు  "భోజనమునకు వీలు పడదు,  భారతవర్ష ఇంటికి పోవుచున్నాను, అచ్చట అవధాన కార్యక్రమమున్నది భోజనముకూడా అక్కడే. నేను పృచ్చకుడిగా పోవుచున్నాను. బసవయ్య వచ్చునేమోయని ఇటువచ్చితిని."అనెను. అగస్త్య.  అగస్త్య కూడా బసవయ్య అన్నందుకు బసవయ్య నొచ్చుకుని “బన్నీయని పిలిచిన నీ సొమ్ములేమైనా పోవునా? అనెను. బసవయ్య అనునది చక్కటిపేరు అని అగస్త్యుడు సద్ది చెప్పుచుండగా   "నాకు గిట్టని మాటలేల ఆడెదవు ?" అనెను


 "బసవయ్య అను పేరునే ఆక్షేపింతువా? కావలిసిన నేను బసవా యని పిలుతును."  అని అగస్త్య అనగా "నీకు పుణ్యముండును అట్లు నన్నెప్పుడు పిలువప్రయత్నించ వలదు  పనివానిని పిలిచినట్లు మిక్కిలి వెగటుగా వుండున"ని బసవయ్య అనగా, నటులను ఇలవేలుపుగా కొలుచువానికి  వానికి బన్నీ, చెర్రీయను పేర్లు గాక ఇంకేమియు నచ్చును. అని అగస్త్య అనెను “నన్ను ఆక్షేపించిన సరిపుచ్చు కొందును గానీ , నా అభిమాన నటులను ఏమైనా అన్నచో యూరకొనను” అనెను.


ఇదేమి మా వాడి భాష ఇట్లు మారిపోయెను   అన్నట్టు చూచుచున్న  తలిదండ్రులతో బసవ ఇట్లనెను, “ఛీ ఛీ ఈ భారత వర్ష ప్రభావమున, అదే ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా స్నేహితులు చాలామంది అచ్చతెలుగు మాట్లాడుచున్నారు, ఛీ అదే మాట్లాడు తున్నారు.” ఈవూర్లో అచ్చతెలుగు మాట్లాడే వెధవలంతా వాడి స్నేహితులు కానీ, స్నేహితుల స్నేహితులు కానీ తప్పక అగుదురు, అని  నాలిక కరుచుకుని అయ్యి ఉంటారు. అని తల్లిదండ్రులతో అని, అగస్త్యవైపు తిరిగి నువ్వెళ్ళరా బాబూ నేను ఇలాటి పోగ్రాంలకి దూరంగా ఉంటాను, మీతో తిరుగుతుంటే ఆ దరిద్రం అంతా నాకంటుకుంటున్నది. అనెను . 

బుచ్చెమ్మగారు వర్షుడింటికి  పోకున్ననూ  , భోజనం చేసి వెళ్లవలెనని  అని కొడుక్కి చెప్పి, అగస్త్యు నితో  "వాడికి ఆంగ్లమనిన   ప్రాణము  బాబూ, మీరంతా  తెలుగు మానేసి ఆంగ్లమున వాడు  మాట్లాడినచో మిమ్మలిని అంటుకొని తిరుగును,  తెలుగుదేనికి  పనికొచ్చునని ఇప్పుడంతా ఆంగ్లమే మాట్లాడు చున్నారు కదా!"   

"మీరునూ  ఆ మ్లేచ్ఛ భాషనే మెచ్చుచున్నారా ? యని   అగస్త్య  నవ్వుచూ నిష్క్రమించెను. బసవడు  "అమ్మా నాన్న  మీరు ఎన్ని చెప్పినా  నేను ఈరోజు ఇంట్లో భోజనం చేయను, నాకొక ఐదువందల ఇచ్చినచో (నాలిక కరుచుకుని ) ఇస్తే  నేను హోటలుకి వెళ్లి బిర్యానీ తింటాను. అని డబ్బు పుచ్చుకుని బసవడు బైటకు పోయెను.  మరుక్షణము గోడకి కొట్టిన బంతి వలే వెనుకకు వచ్చి నీవు ఆ ఆనంద నిలయమునకు పోవుట అదే  మాలిని గారి ఇంటికి  పోవుట  తగ్గించుము. అని బైటకు సుడిగాలి తాకినా విస్తరివలె ఎగిరిపోయెను. 


వడివడిగా నడుచుకు వెళ్లుచున్న  అగస్త్య కి వెనకనుంచి బసవయ్య గొంతు వినిపించెను" అగస్త్యా అని పిలుచుచూ అతడు అగస్త్యుని సమీపించెను.   "అక్కడ ప్రోగ్రాం అయిపోయాక బిర్యాని పెడతారా?" పక్కనుంచి నడుస్తూ  అన్నాడు బసవయ్య. "ముందే పెడతారని"  అగస్త్య అనగా బసవయ్య మరి మారు మాటాడక వెంట నడిచెను. 



వారిద్దరూ అట్లు నడుచుచుండగా అకస్మాతుగా ఉరుములేని పిడుగువలె బైరెడ్డి అతడి అనుచరులతో ఎదురుపడెను.  తత్తరపాటుతో అగస్త్య   పక్కనున్న సందులో నక్కబోయి బైరెడ్డికి చిక్కిపోయెను. బైరెడ్డి వాహనమును అగస్త్యుని ముందు నిలిపెను. అతడి వెనుక మరొక రెండు ద్విచక్రవాహనములున్నవి. వాటిపై బైరెడ్డి స్నేహితులు నలుగురు  కూర్చొని ఉండిరి. వారు జై భీం తో పాటు జై బుద్ధ అనిరి. బసవడు  వారందరికీ జై భీమ్ అని వందనములు చేసెను.  అగస్త్యుడు అట్లేమీ అనక  మౌనముగా ఉండిపోయెను. వారగస్త్యను చూచి ముఖము చిట్లించిరి. 

"ఏరా అగ్గి ( అగస్త్య ) జైభీమ్ అనకున్న, జై బుద్ధ అనుటకు కూడా నోరురాకున్నదే! అవునులే గబ్బు  వేదాలని పట్టుకువేలాడు గబ్బిలాలకి..".అని బైరెడ్డి    అనుచుండగా "పొట్ట పొడిచిన అక్షరము రాని  నీవా వేదాలనాడువాడవు,  ఆక్షేపించువాడవు!! "అని అగస్త్యుడనెను.  "వేదాలు చదువుకున్నామని పొగరురా మీకు! త్వరలో  విప్లవం తీసుకు వచ్చి వేదాలను తెగులబెట్టి  మీ అందరినీ తరిమికొట్టకున్న..".అని బైరెడ్డి అనుచుండగా   

 "ఏరా బైరీ విప్లవం ఉద్యమాలు అంటున్నావు పోలీసులు వదిలేశారా?" అని అగస్త్య అడిగెను. అది విని  బైరెడ్డి ముఖము ఎర్రబారెను. "ఏరా బొల్లి గ్రద్దనో నల్ల పిల్లిని చూసినట్లు నన్ను చూచినంతనే సందులో దూరుచున్నావే"అని బైరెడ్డి అగస్త్యుని ఆక్షేపించెను.  "నీవంటి వారితో నావంటి సామాన్యుడు తూగలేడు అందుకే తప్పుకొనుచున్నాను." అని అగస్త్యుడు అనగా బైరెడ్డి నువ్వుకొని సరే సరే " బసవడితో మాట్లాడవలెను  నీవు కొంచము  ముందుగా నడుచుచుండుమ"నెను.  అగస్త్య "మీ రహస్యములు వినవలెనని కోరిక నాకు లేద"ని వడివడిగా నడుచుకొని ముందుకు పోయెను. 

బైరెడ్డి బసవడితో మాట్లాడ సాగెను.  "ఈ బ్రాహ్మడితో స్నేహమేల చేయుచున్నావని మందలించెను. ఎందులకని  బసవడడుగగా బైరెడ్డి " పెరియార్ బ్రాహ్మణుడి గూర్చి ఇట్లనెను.  పాము   బ్రాహ్మడు ఒకే సారి కనిపించినచో  పామును వదిలి బ్రాహ్మణుడిని చంపవలెననెను" బసవడు మ్రాన్పడెను.      

 రేపు మన విద్యార్థిసంఘము తరుపున రాలీ కలదు. నీవు పాల్గొన వలెను. అని బైరెడ్డి అనగా  బసవడు "నాకు వాహనము లేదు కదా!" అని వాపోయెను  వెనకనున్న అహమద్ రేపటికి నా వాహనము తీసుకొనుము. అనెను.  అట్లైనచో అగస్త్యుడు కూడావచ్చును అని బసవడు అనుచుండగా " బెరైడ్డి అహమద్, అక్తర్,  జాన్, ప్రమోద్  ఒక్కసారిగా " నేటికి వాడిని ఒదిలి మాతో రమ్ము భారతవర్ష ఇంటికి పోకున్న వచ్చు నష్టమేమి?" అనిరి. బసవడు నాకు అచ్చట ఉచితముగా బిర్యానీ లభించును అనెను.  "ఆ బిర్యానీ మేము పెట్టించెదము. ఇప్పుడు నష్టమేమియూ లేదుకదా!"  అని వారు అనగా బసవడి ముఖము వెలిగెను. వాడు ముందుగా నడుచుచున్న అగస్త్యునికడకు బోయి"అగస్త్యా నేను తరువాత వచ్చెదను నీవు పొమ్మ"ని చెప్పెను. అగస్త్యుడు వడివడిగా నడుచుకుని వెడలిపోయెను.      

పిమ్మట వారు  బసవని  ఫలహారశాల కొని బోయిరి. అచ్చట బిర్యాని చెప్పి అది వచ్చునంతలో వారు  మరునాటి  కార్యక్రమమును ముచ్చటించుకొనుచుండిరి. 

అగస్త్యుడు మంచివాడు వాడు కూడా ఉండిన బాగుండునని బసవడనెను. వాడికి ఎంతచెప్పిననూ ఆధునిక భావములు తలకెక్కకున్నవి.  అని ప్రమోద్ జాన్ అనిరి.  "ఆ అగస్త్య ఆధునిక భావములను అసహ్యించుకొనును. వాడు జీన్స్ ధరించుట ఎన్నడైనా చూచితివా? వాడికి వాహనము అవసరము లేదు, ఎక్కడికి పోయిననూ నడుచుకునే పోవుచుండును.   కళాశాలలో   కుంటి  సీత కూడా వాడి వైపు  కన్నెత్తి చూడద"ని అహ్మద్ బైరెడ్డి అనిరి. అందరూ పగలబడి నవ్విరి.  

  జాన్  "వాడికి పాతచింతకాయ పచ్చడి రుచించును.వాడికి పెద్దలను ధిక్కరించుట చేతకాదు.   కొత్తగా ఆలోచించుట చేతకాదు. పనికిమాలిన వేదములవెంట పడు వెర్రి కుక్క.   వేదములు రాసి బ్రాహ్మణులు సమాజమును నాశనము చేసినారు." అనెను . 
"వేదములు  పనికి మాలినవా?  మా అమ్మ నాన్న కూడా వేదములు చదువుచున్నార"ని బసవడు అనగా ప్రమోద్ "పిచ్చివాడా బుద్ధుడంతటివాడే వేదముల ను ఖండించలేదా " అనగా బైరెడ్డి  "వేదములు, పద్యములు, అచ్చ తెలుగు అనుచూ  భారతవర్ష  తిరుగుచుండగా  అగస్త్యుడు వాడి వెనుక  తిరుగుచున్నాడు. భారతవర్ష ని  అందరూ పిచ్చి వాడి వలే చూచుచున్నారు.  వాడి పిచ్చి  వీడికెక్కినది. నీవునూ వాడితో తిరిగె దవా? " అని అడిగెను 

భారతవర్ష మనదరికంటే పెద్దవాడు చదువు పూర్తి చేసుకుని  ఉపన్యాసకుడిగా పనిచేయుచున్నాడు.  ఆయన సద్బుద్ధిని పాండిత్యాన్ని మెచ్చనివారు లేరు. ఆయన నీకు నచ్చకున్నా నీవు మెచ్చకున్నా వాడు వీడు అన్నచో నేను సహించజాలను. అని బసవడు తెగేసి చెప్పెను. 

జాన్  చేతిలో చరవాణి తీసి ఏమి వాడి పాండిత్యము వేదములు గొప్పవి అనువాడు వెధవ. ఇదిగో ముఖపుస్తకమునందు నా సమూహమును చూడుము." అని  చూపెను  "వేదములన్నియూ చెత్త" అని ఒకరు  వ్రాసిరి.  "బ్రహ్మ కి సరస్వతి ఏమగును?" అని మరొకరు వ్రాసిరి . "రాముడు కృష్ణుడు దేవుళ్ళు కారు.   ఏసు ఒక్కడే దేముడు " అని రాసి యున్నది." దానిని జాన్ నొక్కి వక్కాణించెను  

అంతవరకూ నిశ్శబ్దముగా యున్న అహ్మద్ కి  గొంగళి  పురుగు ప్రాకినట్లయ్యెను . అప్పుడతడు " కామ్రేడ్! లా ఇలాహ  ఇల్లల్లాహు  ముహమ్మదుర్  రసూలుల్లా " దీని అర్థం తెలుసా ? ఈ సృష్టి కి కారణం అల్లాహు. అల్లాహు  ఒక్కడే పూజ్యనీయుడు. మా మసీదులలో నిత్యము ఇదే విషయమును ఐదు సార్లు మైకులలో చెప్పెదరు" అనెను. 

అహ్మద్ అట్లనుటతో   జాన్ కి జిల్లేడు పాలు కంటిలో   పోసినట్లయ్యెను  ఐదు సార్లు కాదు యాభై సార్లు చెప్పిననూ అది నిజము కాదు  "ఆది యందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; అగాధ జలము మీద చీకటి కమ్మియుండెను. దేవుడు ఆరు రోజుల్లో ఆకాశాలను మరియు భూమిని సృష్టించెను, ఏడవ రోజు విశ్రాంతి తీసుకుకొనెను. అని ఆదికాండము చెప్పుచున్నద"ని అతడు  బల్ల గుద్ధి చెప్పుచుండగా బిర్యాని ఆలస్యమైనందుకు అతడికి కోపము వచ్చెనని భావించిన ఆ ఫలహారశాల యజమాని తానె స్వయముగా  పరుగుపరుగున బిర్యాని పళ్ళెములు తెచ్చి పెట్టెను . 

 అందరు దేవుళ్ళూ ఒక్కటే కదా ఎందుకలా కాట్లాడుకుంటారు.  అని బసవడు అనెను .  బైరెడ్డి జాన్ ని వెనకేసుకొచ్చెను .   'కామ్రేడ్ ఏసు నిజదేవుడని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. " అంటూ బైరెడ్డి  ఎదో చెప్పబోయెను.    కొత్తగా  నిన్నకాక మొన్న   మతం మారిన వాడివి నీతో నాకేంటి.   నీ చర్చ్ కి వచ్చే గొర్రెలకు చెప్పు. లేదా వాడికి చెప్పు అని బసవడిని చూపించెను .  

 బసవడు అది పట్టించుకొనక బిర్యాని మెక్కుచుండెను. అది చూసి వారు  బసవడు మతసంబంధము లేని మనిషని అని   ఆదర్శప్రాయుడని  జనోద్ధారకుడని మెచ్చుకొని బిర్యానీ ఆరగించిరి.  ఒక నిమిషము పిదప  బసవడు "సరస్వతి జ్ఞానానికి రూపము.  ఆ జ్ఞానముతోనే బ్రహ్మ సృష్టి కార్యము జరిపెను"  అనెను. "అని ఎచ్చట చెప్పబడెన"ని అహ్మద్-వెటకారంగా అడిగెను. బసవడు "నాకది  తెలియద " నెను. అదివిని జాన్  "వచ్చిన పని ముగిసినది కదా ఇక పొమ్ము"  అనెను . 

అతడి గొంతులో వెటకారము  బసవడి కి కారము రాసినట్టు తోచి  బిర్యాని పై  మమకారము నశించి  వికారము జనించినది. అతడు లేచి చేయి కడుగుకొనుటకు పోయెను.  "చూసేవా వాడికి తెలియని ప్రశ్న అడిగి వాడిని ఎట్లు నోరు మోయించితినో !" అని  జాన్ అనగా అహ్మద్  వాడికి తెలియదని ఖచ్చితముగా నీకెట్లు తెలియును ? అనెను.     హిందువుల ఇళ్లలో  తల్లిదండ్రులు  చదువులో ఒక్క మార్కు తగ్గినా చంపి పాతివేతురు విదేశములు పోవలెనని తపన తప్ప స్వదేశము స్వధర్మము  వారికి పట్టవు.  వారికి చదవ సమయమెచ్చటున్నది వారు చదువువారు కాదు ఎవరుచెప్పిననూ వినువారు కాదు. వారికి సినిమాలు తప్ప ఏవీ తలకెక్కవు  ఒక్క ప్రశ్నతో వారి నోరు మూయించుచవచ్చు.  వారు ఆడు మాటలు.  చేతులు కడుగుకొనుచూ బసవడు వినుచుండెను. బసవడు బల్లవద్దకు బోయి  యజమానికి అందరి తిండికీ డబ్బు చెల్లించే వెడలెను. "కూతురైన సరస్వతిని పెండ్లాడి  గొప్ప సృష్టి కార్యమే నడిపెను." అని అందరూ  హేళన చేసిరి.

                                                                    ***

వారు ఇరువురు ఆనందనిలయం చేరుసరికి ఒక గుడ్డపందిరి (షామియానా)  కింద సుమారు ఒక యాబది మంది గుంపు కనిపించెను. వారిరువురూలోపలికి పోవుచుండగా ఎవరో ఇరువురు సంభాషించుకొనుచున్నారు.

ఒకటవ వ్యక్తి  రెండవ వ్యక్తితో ఇచ్చట అన్నసంతర్పణ ఎందులకు జరుపుచున్నారు ఏ సందర్భమున  జరుపుచున్నారు? అనెను  అందులకు రెండవ వ్యక్తి నవ్వి  నిర్వాహకుడు భారతవర్ష యని తెలియును. ఎందుకు జరుపుచున్నారో తెలుసుకొనవలెననెడి ఆశక్తి అడుగంటెను, మొదటిసారి వచ్చినపుడు నీవలె నేను కుతూహలంతో అడుగగా " తన మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిచినందుకు భారతవర్ష సంతోషముతో అన్న సంతర్పణము చేయుచున్నాడని ఎవరో తెలిపిరి. మరొక సారి భారత వర్షను అడగగా ఇటువంటిదేదో సాకు చెప్పినాడు. ఎదో ఒక వంకన అన్నసంతర్పణ చేయుచున్ననూ వీరి ఉద్దేశ్యము తదుపరి కార్యక్రమమున  గమనించవచ్చు. అని తెలిపెను. ఆ కార్యక్రమమేదో నేను చూచియే పోయెదను అని మొదటి వ్యక్తి అనెను.   

భోజనములు ముగిసిన  పిదప , పక్కనే ఉన్నపెద్ద  గదిలో ఏర్పాటు చేయబడి ఉన్న వేదిక పై  అర్ధ చంద్రాకారముగా అమరచిన కుర్చీలలో  తెలుగు ఉపన్యాసకుడు రామకృష్ణ,  ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు భానుమూర్తి, సిద్ధాంతి చంద్రశేఖర్ శర్మ  ప్రజాదరణ పొందిన రచయత సూర్య, దామిని,  అంతర్జాల పత్రికాధి పతి మాధవరావు,  తెలుగు భాషాభిలాషకుడు అగస్త్య పృచ్ఛకులుగా వేదికపై యుండిరి. మధ్యలో అవధాన కృషీవలుడు భారతవర్ష కూర్చుండెను. 

ఎనిమిదవ వ్యక్తి ఎవరా యని అందరూ ఆసక్తిగా చూచుచుండ లంగా ఓణీలో తెల్లని పొడవాటి  పిల్ల వచ్చి వేదిక నలంకరించెను. ఆ అమ్మాయి  ఆలస్యమునకు క్షమాపణ చెప్పుచుండ గా , సిద్ధాంతి గారు ,రచయత తో ఈమె పేరు మంజూష అవధాని సోదరి, నేటి అష్టావధాన ప్రక్రియ లో అసందర్భ ప్రసంగం జేయును  అని చెవిలో చెప్పెను. అవధాన ప్రక్రియ మొదలగు సమయానికి  వేదిక చుట్టూ  వేసిన కుర్చీలు నిండినవి.

 భారతవర్ష తల్లి మాలిని మొదటివరుసలో కూర్చొండెను, పక్కనే పొరుగువారు, కొద్దిమంది పెద్దవారు కూర్చొనిరి , వారి పక్కన ఒక పది మంది విద్యార్థులు, మంజూష మిత్రులు కూడా కూర్చొని ఉండిరి. అందులో పూర్ణిమకూడా ఉండెను. బసవడు గుమ్మము వద్ద నిలుచుని లోనికి పోవలెనా వద్దా అని తటపటాయించుచుండగా  భారతవర్ష కంట పడెను " బన్నీ కథానాయకునివలె చూడముచ్చటగా నున్నావుకదా! నీ వెలుగెవడికి కలదోయి. లోపలి వచ్చి కూర్చొనుము." అని భారతవర్ష బసవడిని ఆహ్వానించెను. బన్నీ యని పిలుచుట, అట్లు అహ్వానించుట బసవడికి అమితా నందముము కలిగించెను. 

అష్టావధాన కార్యక్రమానికి అధ్యక్షత స్థానిక తెలుగు సంఘం కోటేశ్వర రావు స్వాగత వచనం పలుకుతూ భారతవర్ష కి శుభాకాంక్షలు తెలియజేసారు, చిన్నపటినుంచి  అనేక సాంఘిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని  మెడల్స్ అందుకున్న భారతవర్ష, ఈ సాహిత్య సేవ చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చించుచున్నాడని ప్రశంసించెను. పంచ పాషాణ పద్యములని వినిపించమని కోరగా   పాల్కురికి సోమనాధుడు వ్రాసిన 

డమరుగజాత డండడమృడండ మృడండ మృడండ                                    
మృండమృం డమృణ మృడండడండ మృణడండడ 
డండ మృడం డమృం డమృం డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ర్పమథన తాండవాటన
“డ”కారనుత బసవేశ పాహిమాం!  

పద్యముతో బారతవర్ష కార్యక్రమమునకు శ్రీకారం చుట్టెను, కొందరు   మను స్మృతి, వక్ఫ్ వంటి విషయములను కూడా   ప్రశ్నలుగా ఇచ్చి ఉత్పలమాల పద్యములు చెప్పమనిరి.  భారత వర్ష  అట్టి పద్యములను  పూరించిన పిదప , బసవడు కృష్ణ , అర్జున్ వంటి చిత్ర కథానాయకుల పేర్లను ఇచ్చి వాటితో పద్యము చెప్పమనెను. వర్షుడు భారతములో శ్రీకృష్ణార్జనుల నుద్దేశించి పద్యము చెప్పెను. కానీ అది బసవని నిరుత్సాహపరిచినది.    అనేక చిక్కుప్రశ్నలమధ్యలో మంజూష అన్నగారి దృష్టి  మరలింప ఎంత యత్నించిననూ ఆమె సఫలము కాలేదు. అష్టావధానము ప్రక్రియ దిగ్విజయమాయెను. కార్యక్రమము పూర్తి అయిన పిదప మంజూష చేత తేనీటికప్పుతో తళుక్కుమనెను. ఒక విద్యార్ధి "వక్ఫ్ అనగానేమి?" అని అడిగెను. 

భారతవర్ష బసవడి  వైపు  నీ వద్ద సమాధానమున్నదా అని చూచెను.  మీరు సెక్కులర్ కాదా అని మరొక పెద్దాయన ప్రశ్నించెను. అగస్త్యుడు సమాధానము ఇచ్చుచుండగా  భారతవర్ష  వారించి మరల బసవడి  వైపు చూచెను.  ఇట్లనేక ప్రశ్నలు అడుగుచున్ననూ భారతవర్ష సమాధానమీయక బసవడి వైపు చూచుచుండెను.     అయ్యా!  మీరెందులకు ఆ అబ్బాయి వైపు చూచుచున్నారో కానీ ఆ అబ్బాయికి లోక జ్ఞానము ఏమీయో కానరాదు. అని నవ్వసాగెను.

హిందువులకి చదువు అంటే మార్కులు, జీవితం అంటే విలాసాలు, విజయం అంటే విదేశాలు.  సినిమాయే  వారి ప్రపంచం. అది తప్ప మిగితా ప్రపంచం వాళ్ళకి అర్థం కాదు. నేను సెక్కులర్ అవునా కాదా అని అడిగారు అసలు ప్రభుత్వాలు ఏవీ కూడా సెక్కులర్ కావు. ప్రజలని ప్రజలుగా చూసే ప్రభుత్వాలు ఎక్కడున్నాయి 


జెరూసెలం వెళ్ళడానికి ఒక్కొక్క క్రిష్టియన్కి ప్రభుత్వం73,500 ఉచితం గా ఇచ్చుచున్నది. సెక్కులర్ ప్రభుత్వం ఎక్కడైనా మతయాత్రలకి డబ్బిచ్చి ప్రోత్సహిస్తుందా ? 

మక్కా వెళ్ళడానికి ఒక్కొక్క ముస్లిం కి ప్రభుత్వం 73, 500 ఉచితం గా ఇచ్చుచున్నది . సెక్కులర్ ప్రభుత్వం ఎక్కడైనా మతయాత్రలకి డబ్బిచ్చి ప్రోత్సహిస్తుందా ?

వక్ఫ్ బోర్డు ఏంటి అని అడగండి మన వాళ్ళు తెల్ల మొఖాలు వేస్తారు . ఏదడిగినా అంతే. ఏమీ చదవలేరు. కళ్ళముందు జరుగుతున్నవి కూడా అర్థం చేసుకోలేరు చలన చిత్రాలు  చూసుకుంటూ, ఇంగ్లిష్ నాగరికతను అనుకరిస్తూ  వారి పేర్లను తగిలించుకుంటూ    వెకిలి చేష్టలు తో  బ్రతుకీడుస్తుంటారు.  సినిమావాళ్ళకి సాష్టాంగ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్.  ఇక్కడ సినిమా వాళ్లకి పెద్ద బిరుదులు ఇస్రో శాస్త్రవేత్తలకు  కూడా  లేని పేరు. దేవుడికి కూడా లేనంత భజన. ఆహా ఇది కదా రాష్ట్రం అంటే!    వినోదాన్ని వీపుమీద ఎక్కించుకుంటారు చదువుకి చాప కూడావెయ్యరు.


మన పిల్లలు  చదువు (పుస్తక పఠనము) రాత వృద్ధి చేసుకొని ప్రపంచజ్ఞానమును పెంపొందించుకొనవలెనని దానికి భాష అవసరమని  ఈ కార్యక్రమమును నిర్వహించు చున్నాను.  "చదువు సంస్కారము లేనివాడు దేశానికే కాక తలిదండ్రులకు కూడా భారమే అని అక్క కొచ్చిన తలిదండ్రులు భారతవర్షను మెచ్చుకొని వెడలిరి. బసవడు కూడా వారితో వెడలిపోయెను   

  భారతవర్ష, అగస్త్య ఎదురెదురుగా కూర్చుని త్రాగుచుండిరి. అగస్త్య నీవెందులకో నేడు మిక్కిలి కలత జెంది యున్నట్లు కనబడుచున్నది  కారణమేమి ? అని అడిగెను అటువంటిదేమియునూ లేదని అగస్త్య బదులు పలికెను. 

నీవు దాచదలుచుకొన్నచో అటులనే కానిమ్ము , కానీ రహస్యమైనచో దాచవలియును సమస్య అయినచో నావద్ద దాచపనిలేదు. అని భారతవర్ష పలకగా, "భావనావహన(టెలిపతి) విద్య తెలిసిన వానివద్ద  దాచి ప్రయోజనమేమి? అనెను. "నీ భావములు చదువుటకు  నీ హృదయమెరిగిన మిత్రుడికి ఏ విద్యలు నక్కరలేదు అని భారతవర్ష అనెను. నేను అపరాహ్ణవేళ బసవయ్య  అని మొదలు పెట్టి జరిగినదంతయూ  చెప్పెను. ఈ కార్యక్రమమున నేటి ప్రశ్నలు కాదు విదూరముగా నున్నవి అని అగస్త్యుడనెను  బసవడు వచ్చుట అంతకంటే విడ్డూరంగా నున్నది అని భారతవర్ష బదులు పలికెను 

 వాడిచ్చటకు వచ్చినది తినుటకు మాత్రమే అని అగస్త్య చెప్పెను.  "ఒకడు తిన్నచో మనకు నష్టమేమియునూలేదు కానీ, ఎంతకు చెడినాడోయి, అయ్యయ్యో ! రజోగుణముచే ప్రేరేపితుడయ్యి  లోభమున పాతాళము జేరినాడు కదా.  చిన్న పెద్దల మధ్య అంతరం గమనింపక  తల్లిని గొట్టి  హీనుడయ్యి తమస్సున యాతనపడు జీవి   ఉచ్చ నీచ వ్యత్యాసములు గణింపక ఉచితముగా వచ్చినదేదైనా స్వర్గమని భావించును. వీనికి ఇడుములు కడు బెడిదములు ముందున్నవి. అయిననూ తప్పంతయు బసవడిదిగాదు,తల్లి దండ్రులే వాడినిట్లు తీర్చి దిద్దగా వాడిట్లుగాకింకెట్లుండును? యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా యధా పిత్రా తథా పుత్ర.  అకటా !  తల్లిదండ్రులు ఆఇంటికి ఎంత చేటు తెచ్చినారోకదా!"


 అగస్త్యుడు వర్షుని వైపు అట్లే చూచుచుండెను " సరే పోయిరమ్ము" అని భారతవర్ష లేవబోవుచుండగా నాకొక సలహా కావలెను అని ఇట్లు చెప్పసాగెను.  "మా తండ్రిగారు  ఒక పరస్త్రీ మోజున పడుటచే మా తల్లి తండ్రుల మధ్య విభేదములు తలఎత్తినవి. రాజీ పడియుండమని ఎందరు చెప్పిననూ ఆమె వినకుండుటచే.... అని అగస్త్య చెప్పుచుండగా  వర్షుడు "ఇప్పుడు వారింకనూ కలహించుకొనుచున్నారా?"  అని అడిగెను.  వారిరువరు ఎన్నడో  విడిపోయినారు, త్వరలో విడాకులు తీసుకోబోవనున్నారు.  నా కథ  మొత్తము నీకుతెలియదు, నేను ఏడవవతరగతి, నీవు పదవతరగతిలో నున్నప్పుడు, నేను ఇంటిలో నుంచి  పారిపోవుట మాత్రము నీకు తెలుసు  అని   తన కథ చెప్పదొడగెను . 

 

Thursday, July 9, 2020

Bharatavarsha Lakuma - Bairreddy- 2

విశాఖపట్నం - జగదంబ

విశాఖపట్టణ కేంద్ర స్థానమగు జగదాంబ కూడలి వద్ద ప్రపంచ ప్రతిష్టాత్మకమై, సర్వ లౌకిక కేశాలంకరణ చిహ్నమైన (గ్లోబల్ హెయిర్ డ్రెస్సింగ్ బ్రాండ్) టోనీ అండ్ గై యను  కేసకర్తన శాల (సలూన్) అందమునకు చిహ్నమైన ఐరావత శోభను పుణికి పుచ్చుకొనిఅచ్చటికి విచ్చేయువారి కన్నులను వెలిగించుచుండెను 

 మంద దీపోపచార  ( డెకొరేటెడ్ విత్  డల్ లైటింగ్)  విశాల మందిరము,  దార్వ ఉత్కీర్ణ ప్తిరూప (కార్వ్డ్ వుడెన్ పేటర్న్స్) రసాలంకారములతో, వర్ణపత్ర రూప లావణ్యముతో ఇంద్రుని వజ్రాయుధపు తళుకుని  చంద్రుని  బెళుకుని  కొని పాలపుంతకే పులకింతలు కలిగించుచుండెను. 

మోహిని మరో రూపమువలె నున్న యా  కేశాలంకరణశాల  యందు, శృంగార విదుషీ మణులు కేశాలంకరణ,  ముఖాలంకరణ చేయించు కొనుచుండిరి.  

లకుమ తన స్నేహితురాండ్రు, సంధ్య, హేమలతో కలిసి అలసట ఎరుగని ఆ వాతానుకూల మందిర మందు, దర్పణముల ముందు ఆవర్తమాన ఆసన మందు కూర్చొని ముఖ కేశ  సౌందర్యమును  చూచి ముచ్చట పడుచుండిరి.  

వారెల్లరూ నీలి బిర్రబిగుతు స్యూత ఉరూకములు (జీన్స్ పేంట్స్)  ధరించిరి.   అచ్చోటికి  కొందరు  తమ పిల్లతో మరికొందరు శునకములతో  వచ్చి తమ వంతు కొరకు వేచి చూచుచుండిరి. శ్రావణి ఆమె స్నేహితురాండ్రు సుధ, జయతో వచ్చెను, ఇది కుబేరమందిరమువలే నో లేక మయసభవలెనో యున్నది తప్ప  కేసకర్తన శాల (సలూన్)  వలె లేదని  శ్రావణి అనెను.  "సంపన్నులు వేంచేయు  ప్రసాద గృహము(బ్యూటీ పార్లర్ )లకు అలంకరణే ప్రాణము."అని దీప నవ్వుచూ చెప్పెను. సంధ్య జుట్టు కురచ చేయించుకొనెను, హేమ ఉంగరములు తిప్పించుకొనెను. లకుమ పింగళ వర్ణమబ్బునట్లు స్వేతన (బ్లీచ్) గావించుకొనెను. అట్లు అందరూ ఆధునిక  కేశాలంకరణ గావించుకుని జుట్లు విరబోసుకొని బొట్లు లేని ముఖములతో బిర్రబిగుతు స్యూత ఉరూకముల (జీన్స్ పేంట్స్) లో  బైటకు వచ్చిరి. వారిని చూచిన పెద్దలు "హరి హరీ!  ఇది ఏమి ఆధునికత! "యనుచూ ముక్కున వేలిడి సాగిరి.  

చెంతనున్న మరొక త్వచోత్కిరణ (పచ్చబొట్టు) మందిరములో కొందరు పడుచులు  వివిధ కళాకృతులను తమ శరీరములపై  వ్రాయించు కొనుచుండిరి.  లకుమ తన స్నేహితురాండ్రతో అచ్చటాగి నాకునూ ఇట్లు పచ్చ బొట్టు పొడిపించుకొనవలెనని యున్నది.  కానీ మాయింట ఊరుకొనరు అని వాపోయెను.  శ్రావణి ఊరువులపైనా , జయ స్తనములపైనా , సుధ పిరుదులైన  పచ్చబొట్లు పొడిపించుకొనిరి. 

పిదప వారందరూ ఆ ప్రక్కనున్న  పండ్ల రసములమ్ము అంగడి వద్ద కు జేరిరి. 

సంధ్య అందరికీ ద్రాక్ష రామునిమ్మని జెప్పగా   "పండ్ల రసములు త్రాగుటకు పిల్లలమా" అని సుధ నవ్వెను. “నీ విచ్చటికి వచ్చిన ఉద్దేశమేదియో  జెప్పుమ”ని హేమ అనెను. “వసతిగృహము నుండి మనకు బయటకు వెళ్ళటకవకాశములరుదు. అందుచే అచ్చట దొరకనివి తాగవలెను కదా" యని సుధ అనెను.

 “మనకు వసతి   గృహమందు దొరకని పానీయమేదన”శ్రావణి అడిగెను. అందరు  లకుమను  అడుగుటకు    నిర్ణయించుకొనిరి “ఆమె వడిగల వాడిగల  ఆధునిక యువతి, ఆమెఏమిజెప్పునోచూచెదమ”నిసంధ్యఅనెను. “బాదంపాల"ని లకుమ ఠక్కనిజెప్పగా అమ్మాయిలందరూ పగలబడి నవ్వినారు. 

శ్రావణి “అది ఎదో చూపెదను. తెగువగల  వారు  నాతో రండు.  నేను కొనిపోయెదననుచూ విసవిసా నడవసాగెను. లకుమతో సహా అమ్మాయిలందరూ ఆమెను అనుసరించిరి. వారిని చూచి లంగా ఓణీ ధరించిన పదాహారణాల తెలుగుపడుచొక్కతె   "బిర్రబిగుతు స్యూత ఉరూకములు (జీన్స్ పేంట్స్)  ధరించిన  నారీమణులు బజంత్రీ మేళమువలె ఆంగ్ల సంస్కృతికి హారతులిచ్చుచూ  ఎచ్చటికి సాగుచుండిరి?" అని హాస్య మాడెను. "ఆవకాయ జాడీ వచ్చెనండీ ఆక్షేపించుటకు !" అని హేమ అనగా   "ఏ దుస్తులుధరించిననూ మేము నీకంటే కళగానే ఉన్నాము." అని సుధ అనెను. 

"అవునే అందరూ బొట్టులేని ముఖములతో బ్రహ్మ జెముడు మొక్కల వలే  కళకళ లాడుచున్నారు." అనుచూ లంగా వోణీ ధరించిన పదహారణాల తెలుగమ్మాయి పూర్ణిమ చురక వేసెను. 

 


అందరూ అట్లు నడుచుచుండిరి 

ఆమె ఒక సన్నవీధిలోకి ప్రవేశించెను. అమ్మాయిలంతా ఆమె వెనుకే నడుచుచుండిరి. శ్రావణి ముందుకి సాగి పానశాల ముందాగెను.  యువతులందరూ  మ్రాన్పడి చూచుచుండిరి. శ్రావణి వారి  వైపు కోపంగా చూచుచూ  "త్వరలో ఇంజినీరింగ్ చివరి  సంవత్సరంలోకి వెళ్లుచున్ననూ ఇంత  చిన్న విషయమునకు భయపడు చున్నారు  సిగ్గులేదా? మరల  మీరే వీర వనితలవలె మాట్లాడుచుందురు. ప్రవేశించవలెనన్న తెగువ కావలెను ” అనెను. ఆవకాయ జాడీలకు ఆ తెగువ ఎచ్చటనుండి వచ్చును? అని హేమ అనెను. పూర్ణిమ లోనకు ప్రవేశించెను. తక్కిన వారు బిలబిల మని లోనికి ప్రవేశించిరి. వారి ముఖములు పాలిపోయినవి   పూర్ణిమ వారి వైపు చూచి నవ్వెను 

అచ్చటనే మరొక  బల్ల వద్ద కూర్చొన్నవారిలో  ఒకడు గోతాము గుడ్డ పంటలాము వంటిపై పెట్టి కుట్టెనా యన్నట్లు న్నది. ఈ పంటలాము విప్పుచున్నప్పుడు చిరిగిపోవునేమో" అనెను . అందరూ పక్కున నవ్విరి  లకుమ వారి వైపు కోపముగా చూచెను.  ఆమె ముఖమున కందిగింజంత  ఎర్ర  బొట్టు కనిపించుచున్నది. సంధ్య ఆమె బొట్టువైపు తేరిపార చూచుచుండగా   లకుమ దానిని పీకి పారవేసి నల్లని చిన్న పెసరగింజంత అంటింపు బొట్టును జేబులో నుండి తీసి పెట్టుకొనెను. 

"  పూర్ణిమ  ముఖమున చిట్టి చామంతి పరిమాణములో ఎర్రని బొట్టు కనిపించెను. ఆమె ముళ్ళ కంపల మధ్య  బంతి పువ్వు వలె సాతానుల మధ్య అప్సర వలెకనిపించెను. హేమ  ఆమె ముఖమున బొట్టును పీకివేయుచుండగా పూర్ణిమ ఆమె చేతిని బలముగా తోసివేసెను.  "లకుమ తన బొట్టును ఎట్లు తీసివేసినదో చూడుము. నలుగురితో పాటు మనమూ  ఉండవలెను.  ఆధునిక భావములున్న పిల్లలు బొట్లు పెట్టుకొనుట నగుబాటుగా ఉండున"ని  సంధ్య  పూర్ణిమకు హితవు పలికెను.

"సంధ్య  జోసెఫ్!!! మొగుడు పోయిన విధవరాలు బొట్టు తీసివేసిన చాదస్తమగును, అదే మతం మారి బొట్టు తీసివేసినచో  ఆధునికత అగును, అంతే  కదూ!  అని పూర్ణిమ అనగా  తనను పూర్తి పేరుతో పిలుచుట తో హతాశురాలైన పల్లవి  పూర్ణిమ గొంతు లో వ్యంగంచూచి సరైన సమాధానం దొరకక తల్లడిల్లెను.  "నా పూర్తి పేరు తెలుసుకొంటివి సరే! ఇప్పుడు చెప్పవలసిన పనేమికలద"ని సంధ్య  మండి పడెను. "దాచవలసిన అవసరము మాత్రము ఏమున్నది అని పూర్ణిమ చల్లగా బదులిచ్చెను. 

"బొట్లు, ముగ్గులు  వ్రతములు ఉపవాసములు అన్నియూ మూఢనమ్మకములే!  ఆంగ్ల విద్య వచ్చి భారతీయుల్ని బ్రతికించగా మీ  సనాతన వాదులు ఇంకనూ  మూఢనమ్మకములతో చంపుచున్నార"ని హేమ  పూర్ణిమను ఎద్దేవా చేసి "నీవు లకుమ వంటి ఆధునిక యువతివి ఎన్నడూ కాలేవు." అనెను.  

 "2016లో జపనీస్ శాస్త్రవేత్త  యోషినోరి ఓహ్సుమి, ఉపవాసం  ద్వారా  శరీరం  అనవసర కణాలను తినే  విధానం (ఆటోఫాగి )పొంది ఆరోగ్యం చేకూర్చుకొనునని  నిరూపించి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకొనెను.  మూఢనమ్మకమన్న ఇదేనా?  అని పూరిమ చు ర్రని   చూచుచూ అనెను.     

పూర్ణిమతో   వాదించుటకు తగిన విషయజ్ఞానము వారివద్దలేదని గ్రహించిన  "పూర్ణిమ పనికి మాలిన సంప్రదాయములని పట్టుకొని వేలాడు  గబ్బిలము. ఎడ్డెం అంటే తెడ్డెం  అను రకము అది ఆవుపేడ అమృతమని వాదించును.  దానితో వాదన అనవసరం" అని సుధ, హేమ  పరిస్థితిని చక్కజేసిరి. 

" ఆవుపేడపై అమెరికా హక్కులు ( పేటెంట్) తీసుకొన్నదెందుకో?   ఎరువులలో భవన నిర్మాణ పదార్ధములలో  ఆవు పేడను విరివిగా వాడుచున్నారు.    ఆ విషయము మీకు తెలియదు. పరీక్షకు ముందు అత్యవసరమగు ప్రశ్నలను మాత్రమే  చదువు మీరు నిజమైన గబ్బిలములు, నూతిలో కప్పలు.  నిజముగా ప్రపంచముగురించి మీకేమీ తెలియదని మీరు నోరు విప్పిన తెలిసిపోవును. ఇక లకుమ విషయము జెప్పవలెనన్న  లకుమ ఆధునికత అజ్ఞానమునకు పరాకాష్ట.  ఆధునికతకొరకు  మన సంస్కృతి సంప్రదాయాల నొదులు కొనుట కొయ్యకాలు కొరకు ఉన్న కాలు నరుకుకొనుటే!!  లకుమ మత్తులో జోగు సమాజమునకు ప్రతినిధి. నేను లకుమవంటి ఆధునికతను ఊహలలోకైననూ రానివ్వను " అని పూర్ణిమ బదులు పలికెను.

"ఎందుకె నీకు మన సంస్కృతి సంప్రదాయములన్న అంత  మోజు అని హేమ  అడగగా  " అరువు తెచ్చుకున్న  ఆంగ్ల   సంప్రదాయములపై  కెందుకంత మోజు హేమ డేవిడ్ ? " అని పూర్ణిమ నిగ్గ దీసెను. "ఆంగ్ల విద్యతో ఎంత అభ్యున్నతి సాధించితిమి!  ఆంగ్లేయులు రాకున్నచో మన దేశము గతి ఎట్లుండునో యోచింపుము?" హేమ 

వారి పాలిపోయిన ముఖములలో  కత్తి వేటుకు నెత్తురు కానరాలేదు. కొలది సేపు అంతా  నిశ్శబ్దము అలుముకొనెను. 

అప్పుడు పూర్ణిమ నువ్వుచూ "నేను చెప్పుల దుకాణమునకు వచ్చితిని ఇంకనూ గృహోపకరణములు కూడా కొనవలెను. ఊరకనే  లకుమను కలిసిపోవుటకు వచ్చితిని. పోయివత్తునని పూర్ణిమ వెడలిపోయెను.

సంధ్య హేమ , శ్రావణి  అంతా ఊపిరి పీల్చుకొనిరి.  అందరూ బల్లపై డబ్బులు పెట్టుచుండగాఈ రోజు డబ్బులు నేనే చెల్లింతును అని సంధ్య  ప్రకటించెను.  హేమ "చిన్నపిల్లల వలే యున్నారే డబ్బు తిరిగి లోపల  పెట్టుకొనుడు. ఎవరైనా స్వేచ్ఛ తెచ్చినచో బల్లపై ఉంచవలె”ననెను. లకుమ జేబులోంచి  పొగౘుట్టల  (సిగరెట్ పెట్టెను) తీసి పెట్టి " ఇది అడుగుటకు నిత్యమూ ఇబ్బందిగా యున్నద”నెను.

లకుమ బిడియము చూచి  శ్రావణి నవ్వెను. అమ్మాయిలందరూ. ఆమెవలె నవ్వినారు. "ఇదేనా స్వేచ్ఛ?" అని పల్లవి అడిగెను.  అచ్చటి సేవకుడు పొడవాటి సీసాలు దెచ్చి   ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కటి బెట్టెను. శ్రావణి  ఒక్కొక్కటిగా మూతలనెగరగొట్టెను. సీసాలన్నీ తెరిచిన పిదప "మీలో ఎంతమంది “స్వేచ్ఛ” చిత్రమును చూచినారు?” అనడిగెను. లకుమ తప్ప అందరు అమ్మాయిలు చేతులెత్తగా సేవకుడు "నేను పది సార్లు చూచితిని" అనుచూ నవ్వుతూ వెడలినాడు.  

“లకుమ, నీవు సేవకుడి  వద్దనుండి నేర్చు కొనుట చాలా అవమానకరమ”ని పల్లవి ఈసడించెను. శ్రావణి. "నోరు మూసుకొనుము, వాడు ఏడుకొండలు, మన కళాశాల పూర్వ విద్యార్ధి.  గత సంవత్సరమె ప్రేమ కొరకు చదువు మాని ఇచ్చట జేరినాడు. మన మతడినిగౌరవించవలెన"నెను. శ్రావణి, హేమ బీరును చషకములలో నింపి అందించినారు. అందరూ ఉల్లాస నాదముతో (చీర్స్ చెప్పి) త్రాగుట మొదలుపెట్టిరి.

శ్రావణి  పొగగొట్టము (సిగరెట్టు) వెలిగించెను మిగతా అమ్మాయిలందరూ కూడా ఆమెను అనుసరించిరి. లకుమ  పొగచుట్టను పెదవుల మధ్య పెట్టుకొనగా   సంధ్య వెలిగించెను. హేమ లకుమ వైపు చూస్తూ “శ్రావణి వలయాలు ఊదుచున్నది. మనమునూ యత్నించెదమ”నెను రెండుసార్లూది భంగపడిననూ అనతికాలంలోనే హైమ సంధ్యలు విజయంసాధిం చినారు. లకుమ దప్ప అందరూ వలయములూదుచూ ఆనంద డోలికలలో తెలియాడిరి. “చలన చిత్రములందు రౌడీలు త్రాగుచుందురు. అదిచూచి ఎట్లుండునో అనుకొనుచుండెడిదానను.ఇప్పుడు దెలిసెన”ని లకుమదీర్ఘ నిట్టూర్పు విడిచెను.   గది పొగమయమాయెను.

“లకుమా నీకల ఏమి?” అని శ్రావణి అనడిగెను. “ఆమె తల్లి నటి. కాబట్టి ఆమె నటి అగును ఇంకేమి అగున?"ని హేమ అనెను. “చిత్రరంగమందు చేరవలెనన్న మధ్య ధూమ పానములు  ప్రాథమిక విద్యార్హతలు. ఆ పొగచుట్ట  నిటు దెమ్ము. ఎట్లు కాల్చవలెనో చూపెదనని దీసుకొని సుధ   పొగను వలయాకారంలో వదులు చుండెను. "ఓహో!  మొదటిసారి సుధ పెదవులు విప్పెను. ఆమెకు నాలుక కూడా యున్నదే !" అని  శ్రావణనెను.

నాకు చెలికాడు కూడా ఉన్నాడు. కానీ నేను మీ వలె ముదర బెండకాయ మాటలు జెప్పక చల్లగా పనులు కానిత్తున"ని సుధబదులిచ్చెను. ఆ దేశముదురును జూచి నేర్చుకొనుడని హేమ అందరికి హితవు పలికెను. అది విని శ్రావణికి మండెను. ప్రియుడి విషయంలో శ్రావణి, గాయత్రి మధ్య గొడవ జరిగెను.  “ప్రియుణ్ణి  కలిగి ఉండటం గొప్ప విషయమా? నేతలుచుకున్నచో  వచ్చే వారం పది మంది అబ్బాయిలు నావెనక ఉందుర"ని  శ్రావణి సవాల్ విసిరెను.   "ప్రియుని కలిగి యుండుట  అంత గొప్పగా చూచుచున్నారా?" అని లకుమ అడిగెను.

“మీ అమ్మకి ఆరాధకులు అనగా ఫేన్స్ ఉన్నటు నీకు కూడా ఉండవలెను కదా!” అని శ్రావణి అనగా “ప్రియుడు అన్న మాట నాకు నచ్చకున్ననూ ఆరాధకుడన్న మాట నచ్చినది,  అంతకంటే ఫేన్స్ అను మాట ఇంకనూ నచ్చినది.”  “మీ అమ్మ వలే నీవును అందగత్తెవేకదా నీ వెనుక నలుగురబ్బాయిలుండవలెను కదా!” అని హేమ  అనగా శ్రావణి  నలుగురేమి ఖర్మ చలనచిత్ర రంగమందు ప్రవేశించిన లక్షలాదిమంది జనులు ఆరాధింతురు. మీ అమ్మ  రాష్ట్రమును ఒక ఊపు ఊపినది కదా అట్లే నీవునూ…. అని శ్రావణి ముగించక మునుపే “ఆమె నాట్య తార.  ఆమె భరత నాట్యముతో రాష్ట్రమును ఒక ఊపు ఊపినది. మనకిచ్చట ఏమున్నద?”ని సంధ్య  లకుమను ప్రశ్నించెను.

 లకుమ అందముగా ఉన్నది అన్నచో సంధ్య  ఊరుకొనదు. అని అందరూ మనసులో అనుకొనిరి  “అందరూ నాట్యగత్తెలు కావలెనా అందమున్న చాలదా అది లకుమకు మందముగానున్నదనుచూ  లకుమతో “అసూయాపరుల మాటలు నమ్మకుము. కళాశాల అందగత్తెవని నిన్ననుటతో పల్లవి ఓర్వ లేకున్నది. నిజము జెప్పవలె నన్నమాఅందరి దృష్టిలో నేవే అందగత్తెవ” వని  సుధ అనెను.  

“నువ్వు సాయంత్రం బైటకు వచ్చినచో  కళాశాలలో సగం మంది నీ వెనకే ఉందురు. అప్పుడు నిజము బైటపడును. కానీ నీవెన్నడూ బైటకు రావు. నీ సమస్య ఏమియో తెలియకున్నద”ని  శ్రావణి  అనెను. 

‘నా ఆవాస సంరక్షకురాలు దామినియే పెద్ద  సమస్య. నిజము చెప్పవలెనన్న. ఆసంగంతి మాకెందుకు చెప్పెదవు మీ అమ్మకు చెప్పిన చూచుకొనును అని శ్రావణి అనెను. "వారిరువురూ చిన్ననాటి స్నేహితులు నన్ను దామిని కడ నుంచి  క్రమశిక్షణ నేర్పమని  మా అమ్మేచెప్పినది. దామినిపై ఏమైనా చెప్పినచో నా దవడ పగులును"అని లకుమ అనెను.  

" మీ అమ్మే నీ కొక సమస్యగామారినది, అయ్యో!!" అని పల్లవి దొంగ ఓదార్పు మూటల హాస్యోక్తులు పలికెను.  అందుకు లకుమ ముఖం మాడ్చుకుని "చలన చిత్ర రంగము చెత్త అని, అందడుగిడిన అడుసులో కాలిడినట్టేయని మా అమ్మ కనిపించిన అందరికీ చెప్పుటయే కాక ఫోనులో కూడా నాకు వినపడునట్లు అవే మాటలు చెప్పుచుండును." అని వాపోయెను.  

"మీ అమ్మ అంత  చాదస్తురాలా! మరి దామిని ఎట్లుండునో?" అని సుధ అడిగెను. అది సూదైనచో ఇది గున్నపము. గున్నఏనుగు వలే నుండును.  దామినికి  ఆడపిల్లలు పైన తిరుగుటనిన గిట్టదు. ధ్యాస అంతా చదువుపైనే నిలపవలెనని ఆడపిల్లలు సాయంత్రము బైటకి పోరాదని, దుస్తులు నిండుగా వేసుకొనవలెనని, సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించవలెనని" ఇట్లు వినువారున్నచో లక్ష జెప్పును అని నీరస స్వరముతో లకుమ అనెను.    

 "వినువారు లేకనేమి నీవు ఉంటివి కదా అని  తన చతురతను  చాటుకొను చూ పల్లవి హాస్య గుళికను చప్పున రువ్వెను.  అది  పటాసు వలే పేలి పెద్ద నవ్వుల శబ్దము  సృష్టించగా  ఆ  నిశ్శబ్ద పాన మందినమంతయూ దద్దరిల్లెను 


 “మేము కూడా వసతి  గృహమందున్నవారమే కదా! మేం తిరుగుటలేదా? పెద్దలట్లే అందురు. వారనేకము జెప్పుచుందురు  అవన్నియూ మనము పట్టించుకొనరాద”ని పూర్ణిమ అనెను. అందరూ త్రాగుట ముగించి లేచినారు "మీ వసతి గృహ సంరక్షకురాలిని ఎట్లు వంచవలెనో  నేను చెప్పెదన"ని శ్రావణనెను. “అదే స్వేచ్ఛ చిత్రం లో జూపినారు. ఆ చిత్రం చూసినచో  పరిపూర్ణ స్వేచ్ఛ అనిన ఏమో అర్థమగున”ని సుధ అనగా “ స్వేచ్చాభిలాషులైన మగువలకు తెగువుండవలెన”ని శ్రావణి నొక్కి జెప్పెను.  “ఒక్కొక్క చిత్రము ఒక్కొక తరమును తయారు చేయున”ని చదువుకు తిలోదకములిచ్చి మధుశాలలో జేరిన ఏడుకొండలు ముక్తాయింపు పలకగా మధుశాలకరతాళ ధ్వనులతో మారు మ్రోగెను. 



 ఆడపిల్లల దండు అంతయూ అందరూ బైటకు వచ్చెను.  వారు కొనుట ముగించి ఇంటికి మరలుతున్న పూర్ణిమను చూచిరి. లకుమ పూర్ణిమను చూచి పిలువగా  "నేను ఇంటికి పోవుచున్నాను. మా అమ్మ నాకొరకు ఎదురు చూచుచుండును" అని చెప్పెను.  :నేను కూడా ఇక వసతి గృహమునకు  పోవలెను అని లకుమ అనగా " నేడు పల్లవి  జన్మ దినము. ఆమె   చర్చలో కేకు కత్తిరించును. నీవు కూడా ఉండవలెను " అని సుధ అనెను. 

సంధ్య నిజముగా నీవు కిరస్థానము స్వీకరించినావా? అని లకుమ ఆశ్చర్యపోయేను. "నేనే కాదు పూర్ణిమ తప్ప ఇచ్ఛట  అందరూ కిరస్తానీయులే.   ఆ పానశాలలో ఏడుకొండలు కూడా.  దేవుని మహిమ తెలుసుకుని  ఆయన కృప వల్ల... "  అని పల్లవి చెప్పుచుండగా " చదువుకు సున్న చుట్టి  పానశాల లో పనిచేసుకు బ్రతుకుచున్నాడు. అని పూర్ణిమ ముగించెను. పల్లవి అహము దెబ్బతినెను.  

"నీ కెంత పొగరే  ప్రభువునే లోకువచేసి మాట్లాడెదవా? రాళ్లను  చెట్లను పూజించువారు  విగ్రహారాధకులందరూ నరకమునకు పోయెదరు అని అంతటితో ఆగక  ఆవాగుడుకాయ  "మీరే కాదు మీ భారతీయులంతా క్రీస్తు రక్షణ లేనిచో సర్వనాశనమగుదుర"ని శాపనార్థములు పెట్టసాగెను. 

 సెక్కులర్ అను పదమును  రాజ్యాంగమునుండి తొలగించవలెనన్నచో కల్లు  తాగిన కోతి వలె మీరు ఎందుకు చిందులు వేసెదరు  రాజ్యాంగ రక్షణ లో క్రైస్త్యము నడుచుచుండెను. ఇంకొక్క మాట విగ్రహారాధకులందరూ నరకమునకు పోయెదరంటివి గదమ్మా  మీరు మాత్రము చెక్కసిలువను, విగ్రహములను మొక్కుటలేదా మీరు చేసినచో సంసారం, మేము చేసినచో   సానితనము  ఎడారి మతాల తీరే ఇంత, వాడు కాబలో  మొక్కేది అరేబియా రాయి, ఇక్కడ  హిందువులు మొక్కేది ఈ దేశపు రాయి, వాడి సిలువ చెక్క జెరూసలేంది, ఇచ్చట చెక్క మన దేశానిది. అంతకు మించి బేధమేమున్నది. పరదేశమన్న ఎందులకంత మోజు స్వదేశమన్న ఎందులకంత ద్వేషము?" అని పూర్ణిమ నిగ్గ దీసెను. 

'మీకంటే మాకు దేశభక్తి ఎక్కువే!!! దేశమును అభివృద్ధి చేయువారము  మేమే ననెరుంగుము. అని పల్లవి అనగా పూరిమ లెస్స పలికితివి సిలువధారి  కిరస్థానము స్వీకరించిననేకులు కోట్లకు పడగలెత్తి భారతదేశ జెండాను ఒక గుడ్డ ముక్కని ఒక చిత్తూ కాగితమని అవమానించలేదా యని యూ గొట్టము నందొక  ఒక సుందరాంగు డు చెప్పెడి మాటలను తన చేతి చరవాణి నందు చూపెను. వారు విభ్రమనుండి తేరుకోనులోపే " మతము మారిన వారి  దేశభక్తి కి మరొక చిన్న ఉదాహరణ ఇచ్చెదను అని    పూరిమ అనగా   సుధ పల్లవిని  శ్రావణిని లకుమని పక్కకుగొనిపోయి వారి చెవుల్లో "ఇదియునూ అగస్త్య వలె  భారతవర్ష బంటు, ఆ బాపనోడు దీనికి అన్నియూ నూరి పోయుచున్నాడని చెప్పగా  "" ఆ!! పంచె కట్టు బాపనోడు తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలనుచూ యువకులను చెడగొట్టుచున్నాడు" అని శ్రావణి  అనగా అందరూ పెట్టున నవ్వసాగిరి   లకుమకు ఆ మాటలు రుచించక   వారి జట్టునుంచి వైదొలగి బైటకు వచ్చి నిలిచెను.

                           

                                         సంధ్య  లకుమ, సుధ, పూర్ణిమ మరియు శ్రావణి


"బ్రాహ్మణులను అవమానించుట పడదేమో! అయ్యో ఎంత పని ఐపోయినది." అని సంధ్య  పూర్ణిమను  చూసి వేళాకోళమాడెను. వారు సమాజమును కులములకింద విభజించిరి. వారివలనే సమాజము నాశనమైనదని మన కళాశాలలో విద్యార్థులు నుంచి విద్యార్ధి సంఘాలవరకు అందరూ ఘోషించు చున్నారు అని శ్రావణి అనెను.  పూర్ణిమ బదులు చెప్పు నంతలో "విద్యార్థులేకాదు చలనచిత్ర ములలో కూడా వారినట్లే చూపుచున్నారు వారినేమి  చేసెదవ?ని సంధ్య  అనెను.  

"వారిని అట్లు హీనపరిచి  చూపించిన  కొందరు నటులు కుటుంబకలహాలతో  వీ దెక్కి మన శ్శాంతి లేక అలమటించుచున్నారు. కులమను పదము మనకు పరిచయము చేసినది ఆంగ్లేయుడే మనది వర్ణ వ్యవస్థ మాత్రమే అని చెప్పిననూ తలకెక్కించుకొనక  బ్రాహ్మణులే  సమాజమును పాడు చేసినారని పాడిన పాడే పడుచున్నార" ని పూర్ణిమ  గట్టిగా ప్రతిఘటించు చుండెను.  

"వాదనల నవసరము భారతవర్ష మనదరికంటే పెద్ద, పైగా  గురుస్థానములో నున్నపండితుడు. అతడిని వేళాకోళము చేసినచో నాకు గిట్టదని" లకుమ తెగేసి చెప్పెను. సంధ్య  శ్రావణి  కులముల ప్రస్తావన ఇకపై తీసుకురామని లకుమను బుజ్జగించి చర్చికి కొనిపోయిరి. పూర్ణిమ మాత్రము వారితో పోవుటకు నిరాకరించి వెనుదిరిగెను.     

 

                                                              ***


వసతి గృహమున దూరవాణి మ్రోగుచుండ  వసతిగృహ సంరక్షకురాలు దామిని దూరవాణిలో మాట్లాడి, దానిని  తెరచి ఉంచి , గంట మోగించగా అక్కడ పనిచేయు ఒక  పనిపిల్ల  ఆమె ముందు నిలిచెను. పిలుపు వచ్చెనని,దూరవాణి తెరిచియున్నదని వెళ్లి లకుమకి తెలిపిరమ్ము అనెను.  పిలుపు చేరిన తక్షణమే మెరుపువేగమున దూసుకువచ్చి, పిడుగుపాటువలె బల్లపై పడి గ్రెద్ద  కోడిపిల్లనెత్తుకు బోయినట్లు దూరవాణి నొకప్రక్కకు నెత్తుకుపోయి, దూరవాణిని హత్తుకుపోయి , చలిజ్వరం వచ్చి వణుకుచున్న స్వరమున " హాయ్ వెంకీ  డియర్ ఆ యాం పింకీ హియర్  హేపీ వేలంటైన్స్ డే"యని లకుమ సంభాషిచుచుండ, దామిని శిరమును చేతబుచ్చుకుని  "ఆ మూలకు పోయి ఓప్రా (ఆంగ్ల  సంగీత నాటకము)నందు యకారకరణం (యోడలింగ్) జేయు స్వరమున ఏల మాట్లాడవలెనో నాకర్ధము కాదు. ఇది విడ్డురముగాకింకేమని వగచుచుండ  పనిపిల్ల  "అమ్మా !  నాకాంగ్లము రాదు మీరు చెప్పిన ముక్కలకు నాకర్దము తెలియదు. పెద్ద పెద్ద బడులకుబోయి ఆంగ్లము చదువుకొనిన తెలియవచ్చు. నాకు ఆమెస్వరము నత్తకురింజి రాగమున ఆరోహణ అవరోహణ జెయినట్లున్నది." అనెను.


 దామిని:ఈ మధ్యకాలములో దీనికి మగ స్నేహములు పెరిగినవి.  నేను గమనించుచున్నాను  

పనిపిల్ల: నేనూ గమనించుచున్నాను.ఎంతమంది ప్రియులను వెంట దిప్పుకొనిన అంత  గొప్పట! 

 ఇదియొక విడ్డూరం కాగా, ఎప్పుడూ పినతండ్రి కొడుకని చెప్పుచూ అనేక మందితో సంభాషించు చుండును, దీనికెంతమంది పినతండ్రులున్నారో?! యని దామిని తలబాదుకొనెను. 

 "పినతండ్రికొడుకైనచో ఈమె మెలికలు ఏల తిరగవలె? అని పని పిల్ల అనెను.  లకుమ  దూరవాణిని బల్లపైనుంచెను. "ఇంతలో కిటికీనుండి బయటకు చూసిన పనిపిల్ల ఎవరో ద్విచక్ర వాహనంపై వేచియున్నారు." అన్నది.

ఈ వసతి గృహమునకు పరపురుషులు వచ్చుట నిబంధనలకు విరుద్ధమని తెలియదా యని దామిని లకుమను ప్రశ్నించెను.“వచ్చినది మా పినతండ్రి కొడుకే, ఐననూ లోపలి వచ్చెనా? బయట ఎక్కడో ఉండిన మీకెందులకు? చాదస్తం కాకున్నచో !! అని గొణుగుతూ ప్రధాన ద్వారం వైపు పరుగెడుచున్న లకుమను చూసిదామిని “ఈమె బట్టలు చూడవలెచను. గుబ్బలు,తొడలు, పిరుదులు  కనిపించునట్టు వస్త్రధారణ చూడుము ఈమెను జూచిన ఆంధ్రదేశమున లంగా ఓణీలు కట్టుకొను ఆడపడుచులు సిగ్గుతో తలదించు కొందురు.  అని దామిని ఉరమగా"

అటువంటి వారెక్కడుందురో తెలిపినచో నేనునూ పోయిజూచి వత్తునని  వ్యంగ్యమున పలికి మూతి మూడు వంకరలు త్రిప్పుచూ పనిపిల్ల లోపలి పోయెను.

                                                              ***



విశాఖపట్నం మూడవ పట్టణ  పోలీస్ స్టేషన్ సముదాయము 

 20 -25 సంవత్సరముల వయసు గల యువకులు తొమ్మిది మంది వరుసగా నిలబడినారు.    విద్యార్థులనుండి విచారించుచున్నాడు.  పాలస్తీనా దేశపు జెండా పట్టుకుని వాహనము మీద ఊరేగుటకు సిగ్గులేదు. అని ఒక రక్షక భటుడు అనగా " ఇది శిక్షార్హమైన నేరము. మీ పై నేరము నమోదు గావించి వలసి యున్నది. అని ఠాణా అధికారి పట్టాభి హుంకరించెను. అయ్యా మేమేమీ ఎరుగము ఆ బైరెడ్డిగాడు మాచే ఇదంతయూ చేయించి ఎచ్చటో  దాగుడు మూతలాడుచున్నాడు. వాడే ముఖ్యుడు వాడిని వదిలి కూలీలను మమ్ము పట్టుకొనినారు మీవారు. అని అందులో పొడవుగా పీలగా యున్నవాడు వ్యాకృచ్చెను. అది విన్నఠాణా అధికారి ఆగ్రహోదగ్రుడై   "గొంతు లేచినచో గొంతు పిసికెదన"ని  వాడి ముఖము పగులగొట్టెను.     

వారందరూ బిక్క చచ్చి  గోడకానుకొని నిలిచిరి. ఇంతలో  పెద్ద పోలీసు అధికారి (సర్కిల్ ఇన్స్పెక్టర్) జాబాలి   ద్వారము వద్ద బైరెడ్డితో కనపడెను.  అతడు యముడి ప్రతిరూపమువలే  నున్నాడు. అతడు   బైరెడ్డిని చొక్కాపుచ్చు కుని  ద్వారము వద్ద నుండి ఒక్కనెట్టు నెట్టెను.  బైరెడ్డి వేగముగా గోడను గుద్దుకొని ఆతొమ్మిది మంది విద్యార్థులతో చేరి పదవ వాడుగా నిలిచెను.  "లెక్క సరిపోయినదా?" అని పట్టాభి అడిగెను.  ఎదో జండా పట్టుకున్నతమాత్రాన అదేదో నేరమన్నట్టు మమ్ము వేదించుచున్నారని బైరెడ్డి ఆక్రోశించెను. అది తప్పు కానిచో రెండురోజులనుంచి ఎందుకు నక్కినావు అని ఠాణా అధికారి గద్దించగా     జాబాలి  నీవు చేసినదేమైననూ చిన్నన్ననేరమా. దేశద్రోహము. రెండురోజులనుంచి మీ పై కఠిన చర్యలు తీసుకొనవలెనని చర్చలతో బుల్లితెరలు బ్రద్దలగుచు న్నవ"ని అరిచెను.

అందుచే వారి బుర్రలు బద్దలుగొట్టెదరా అని నవ్వుచూ న్యాయవాది ప్రతాప్ ప్రవేశించెను. ఆయన వెనుకనే బైరెడ్డి అన్న నాగిరెడ్డి వారితో పాటు ఎం ఎల్ ఏ సింహాచలం ప్రవేశించిరి. చూడండి ఎం ఎల్ ఏ గారు ఇక్కడ రాజకీయ పలుకుబడి చెల్లదు ప్రథమ సమాచార పత్రం నింపినాము. అని జాబాలి చెప్పగా . మీరు మీ పని చేసినారు అందుకే న్యాయవాదిని తీసుకు వచ్చినాము. అనెను. పెద్ద లందరు జాబాలి గదిలో కి వెడలగా విద్యార్థులందరూ  "మా గతి ఏమని?" బైరెడ్డినడిగిరి  "మీకు కూడా జామీను ఏర్పాటు చేసెదరని చెప్పిననూ  దేశద్రోహం అనునది పెద్ద కేసగునని లోపలనుంచి మాటలు వినిపించుచుండుటతో  బైరెడ్డి ముఖములో ఆందోళన కనిపించెను. అప్పుడే నాగిరెడ్డి  పోలీసుధికారి గదినుండి బైటకు   వచ్చెను.  తన తమ్ముడు బైరెడ్డి వద్దకు పోయి"కేసులు ఉన్నచో మేము చూసుకొందుము మీకేల  భయము. నేను ఎం ఎల్ ఏ గారి కుడి భుజముగా ఉండి అన్ని పనులు చేయుచున్నాను  నాపై నలభై కేసులు ఉన్నవి.  అని నాగిరెడ్డి అను చుండగా అక్కడున్న రక్షక భటుడు ఆ ముఖ్యమైన పనులు (నేరములు) చేయించుటకే మిమ్మల్ని సాకుచుండెను. అనెను. 

నాగిరెడ్డి అతడిని చూసి నవ్వెను ఎం ఎల్ ఏ గారి అండ ఉన్నత వరకూ నిన్ను నన్ను ఎవ్వరూ ఏమియూ చేయలేరని ధైర్యము చెప్పెను. కొలది సేపటి తరువాత విద్యార్థులనందరినీ న్యాయవాది విడిపించుకుని తీసుకుపోయెను.

                                                              ***

ఉద్యానవనమున లకుమ ఒక రాతి బల్లపై కూర్చొని సౌకుమార్యము నొలకబోయుచూ మరులు కొలుపు చుండెను. ఒక చంద్రుడు ఆమె సరసన కూర్చొని మొహసంజాత ప్రియవచనములు పల్కుచు సత్కళా సాంద్రుఁడగుచుండెను. సరస సంభాషణ యందామె అప్పుడప్పుడూ నవ్వుచూ పయోహిమము నాకుచూ వంకర టింకరలు పోవుచుండెను.

ఆమోహినిసౌందర్యమునువర్ణింప పద్య సౌందర్యం వలసినదే సుమా!


శా. అల్ప ప్రా యమునే వనాల తిరిగే నందాలు నిగ్గార గన్ 
స్వల్పశ్వా సముకూ గుఖంక రములే స్వాంతమున్ రంజింప గన్ 
గల్వప్రీ తునిచి త్తమందు మదరా గాలాప నేతట్ట గన్ 
వెల్వరిం చెనుయా మినంద మిలలో వెల్గేటి చంద్రద్యు తిన్.


నితంబి, చిమ్బాదరి, గుబ్బలాడి, లకుమ అందం వెలిగిపోతున్నది. ఆహా ఇట్టి కలహంసలను చూచుటకే కదా ఉద్యానవనము ఎదురు చూచుచున్నదనుచూ ఒకయువకుడు ప్రక్కనుండి పోయెను అచ్చటనే ఆగి దొంగ చూపులు చూచుచున్న ఇద్దరు పెద్దమనుషులో ఒక పెద్దమనిషి "పురుషులుకూడా వచ్చుచున్నారుకదా!" అనెను.

స్రీలు పుష్పములు. పురుషులు బ్రమరములు వారునూ స్త్రీలకొరకే. స్త్రీలు పుష్పములు. పురుషులు బ్రమరములు వారునూ స్త్రీలకొరకే వచ్చుచున్నారు కదా! అనెను అందులకు రెండవవాడేదో చెప్పు చుండగా అతడిని వారించి ఆహా శిల్పములను చూచుటకు అజంతా ఎల్లోరా బోవపని ఏమున్నది. నేడీ వుద్యానవనమంతయూ, కదలాడు అద్భుత శిల్పములతో -కాంతులీనుచున్నది. ఎచ్చట చూసిననూ వివిధ భంగిమలలో రంగుల పుష్పములవలే రమణులు; వారి వెంట జంటగ పురుషులు, పురుషులు నిజముగా బ్రమరములే సుమా! ఉద్యాన వనములో సీతాకోక చిలుకలవలె మెరియుచున్న తరుణుల అందాలను అచ్చటనున్న ఒక కవి కందపద్యాల్లో వర్ణించు చుండెను.


క.పురుషు లమది గొందురు 
కురంగ కన్నుల సొగసులు గులాబి తీరే 
చురకలు పెట్టచు చూపగ 
మరిమరి చూడరె పురుషులు మగువల సౌరే!

క. వంపులు సొంపులు తరుణులు 
ఇంపుగ చూపుచు పురుషుల నెరుకగ నాక 
ర్షింపగ  తేకువ చెడియా 
వంపుల చిక్కిరె పురుషులు వలపే తాకన్  


క. గుబ్బెస లాడుచు తిరుగుచు 
గుబ్బల   సొగసుల  నుచూపి   యామిని  వంగెన్
 గుబ్బెత సొగసులు కుయువకు
డబ్బుర పడతివ  యువాలి  డాబును చూపెన్ 

లకుమ ఉద్యానవనమున పొదచాటున ప్రేమికునితో  సరస సంభాషణయందు  ప్రేమమాటలు రువ్వుచూ , అప్పుడప్పుడూ  నవ్వుచూ  మద్యమద్యలో   పయో హిమము (ఐస్ క్రీమ్)  నాకుచూ వంకర టింకరలు పోవుచుండ ప్రక్కనుండి  పోవు చున్న  ఇద్దరు  పెద్దమనుషులు  చూచి " చూడవోయి దీని చేష్టలు, దీని తల్లి ఒక రాజకీయపార్టీలో ఒక నాయకుని చెంకలో నుండి  చేయుపనులు  ఈమె ఉద్యానవ నములలో చేయుచున్నద"ని ఒక పెద్దమనిషి అనగా   "కూతురు చెడిన  ఆ తప్పు తల్లిదను సామెత కలదు.  ఈమె తల్లి  వెలుగు పార్టీలో చేయు వ్యవహారముల  గూర్చి తెలియనిదెవరికి? తల్లిని మించిన కూతురు ఈమె" అని రెండవ పెద్దమనిషి బదులిచ్చెను. వారి మాటలు విన్న ఉద్యానవన సిబ్బంది ఇరువురు విస్తుపోయిరి. 

అందొకడు"పచ్చకామెర్ల రోగికి లోకమంతయూ పచ్చగా కనిపించునని వినియుంటిని  ఇప్పుడు ప్రత్యక్షముగా చూచుచున్నాను. ఈమె తల్లి అద్భుత నర్తకి, మంచి చిత్రములలో నటించింది.ప్రస్తుతముఆమెకుఅవకాశములడుగంటినవ "నెను.

 రెండవవాడు " ప్రస్తుత దర్శకుల పోకడలు సరిపడక అవకాశములు వదులుకొని కేవలము ఆమే చిన్న తెరకు పరిమితము చేసుకొన్నది. ఆమె చిత్రరంగమందు  ఉండవలసినది కాదు.  రాజకీయములలో చేరి మహిళాధ్యక్షురాలిగా పనిచేయు చున్నది. అట్లని రాజకీయములందు కూడా  ఉండవలసినది కాదు కానీ ఎందుకో చిత్ర రంగము కంటే హీనమగు రాజకీయరంగమందు ప్రవేశించెను " అనెను. 

అందుకు మొదటివాడు నవ్వి " అదియునూ కానిచో మనవలె  ఉద్యానవనమున పనిచేయవలెను. పద పోయి మొక్కలకు నీరు పెట్టవలెను " అనెను. వారిరువురూ అచ్చట నుండి కదిలిపోయిరి.   

ఆ పెద్దమనుషులిరువురూ ఉద్యానవనమున  సంచరించుచూ అచ్చట కొచ్చిన జంటలను పరికించు చుండిరి. నేడు వాలెంటైన్స్ డే అగుటచే ఉద్యానవనం కళకళ లాడు చున్నది.   ఈ పొదల ఈమెను  చూడుము ఇందాక చూచిన దానిని మించిపోయినది అని అనుచుండగా మరుక్షణమే మరొకపోదలో నున్న తన కూతురు కనబడగా పక్కవాడు చూసినాడేమో యని భీతిగొని "ఛీ..ఛీ.. నేటిచదువుననవలెను , పంతుళ్ళననవలెను , ఒక్కతీరున చదువు చెప్పుట రానిచో ఒక మూల ముడుచుకొని  కూర్చునవలె, పద ఇచ్చటనుండి త్వరగాపోవలెననెను. 

అతడితో వచ్చిన వ్యక్తి మనసులో "ఇటువంటివి చూచుటకై కదా మనము నేడు ఉద్యానవనమునకు వచ్చినాము. వీడి కూతురు కనిపించినంతలో వీడి మొగము మాడిపోయినద"నుకొని బయటకు నవ్వుతూ " మన బంగారం మంచిదైనచొ ... అన్నట్లు పంతుళ్లనని లాభమేమి , మండుటెండ యని జూడక  మగవారు సూట్లు వేసుకొని తిరుగుట, చలికాలమని చూడక పయో హిమం (ఐస్ క్రీము) తినుట, పొట్టి దుస్తులు ధరించుట, పెద్ద చిన్న అంతరం మరిచి అందరిని పేరుపెట్టి పిలుచుటయే  కాక  అదియే గొప్పయని నమ్ముట ఇవన్నియూ ఆంగ్లవిద్యద్వారా సంక్రమించినవే , నా అదృష్టమేమనగా  నాకూతురు గుణవంతురాలు" అనెను. 

వారు వేగముగా నడుచుచూ ఉద్యానవన ప్రధాన ద్వారమును జేరి నిక్రమించు సమయాన  రెండవ పెద్దాయన కుమార్తె  అప్పుడే జంటగా లోపలి ప్రవేశిస్తూ  తండ్రిని చూసి ఒక పొద చాటున నక్కెను. అది జూచి ఆ పెద్దమనిషి గొంతు తడారి, ముఖకవళికలు మారిపోయినవి . దానితో ఆయన స్వరము కూడా మారి పోయెను. 

మొదటివాడు "మన బంగారం మంచిదైనచొ.."అతడి మాటనతడికి అప్పగించి వేళాకోళము చేయుచుండగా. రెండవ పెద్దాయనకి చిర్రెత్తు కొచ్చి  ఎవరిననవలెనో తెలియక "ఛీ... ఛీ...ఈ సినిమాలొచ్చి అందరినీ పాడుచేసినవి, ఈ వెలయాళ్లనును ఆదర్శంగా భావించి వారి అడుగుజాడలలో నడుచుచున్నారు. వారే నేటి మన యువతీ యువకులకు గురువులుగా అవతరించారు. వారు జూపిన అర్ధనగ్నతను ఆధునికతయని పొరపడుచున్నారు. పెడసరం మాటలను నిర్లక్ష్య ప్రవర్తనను ఆధునికతగా భావించుచున్నారు.  ఇది కాలమహిమ అనుచూ తోటి పెద్ద మనిషితో కలసి వనమునుండి నిష్క్రమించెను.  

                                                                



Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...