విశాఖపట్నం - జగదంబ
పల్లవి తన స్నేహితులు సంధ్య, హైమలతో కలిసి జగదాంబ జంక్షన్‌లో షికారు చేయుచుండెను. పండ్ల రసాల అంగడివద్ద ఆగి తన స్నేహితు లకు ద్రాక్ష రసం జెప్పెను. శ్రావణి ఆమె స్నేహితురాండ్రు గాయత్రి, పూర్ణిమలతో అచ్చటకు వచ్చెను. పల్లవి శ్రావణికి ద్రాక్షరసమునివ్వగా "పండ్ల రసములు త్రాగుటకు పిల్లలమా"అనిశ్రావణి అనెను.“నీ విచ్చటికి వచ్చిన ఉద్దేశమేదియో
ఉన్నది, అది జెప్పుమ”ని గాయత్రి అనెను. “వసతిగృహమునుండి మనకు బయటకు వెళ్ళటక వకాశములరుదు. అందుచే అచ్చట దొరకనివి తాగవలెను కదా" యని శ్రావణి అనెను.
“అచ్చట
దొరకానిదా, ఏమద?”ని హైమ అనెను. లకుమ వచ్చుట చూచి అందరు ఆమెనడుగుటకు నిర్ణయించుకొనిరి. “ఆమె వడిగల వాడిగల ఆధునిక యువతి, ఆమె ఏమి జెప్పునో చూచెదమ”ని హైమ అనెను. అందరూ నవ్వుకొనిరి. గాయత్రి “మనకు వసతి గృహమందు దొరకని పానీయమేదన”డిగెను “బాదంపాల”ని లకుమ ఠక్కని జెప్పగా అమ్మాయిలందరూ పగలబడి నవ్వినారు.
“అది ఎదో చూపెదను. తెగువగలవారు నాతో రండు. నేను కొనిపోయెద”ననుచూ శ్రావణి విసవిసా నడవసాగెను. లకుమతో సహా అమ్మాయిలందరూ ఆమెను అనుసరించిరి. ఆమె ఒక సన్నవీధిలోకి ప్రవేశించెను. అమ్మాయిలంతా ఆమె వెనుకే నడుచుచుండిరి. శ్రావణి ముందుకి సాగి పానశాల ముందాగెను. యువతులందరూ మ్రాన్పడి చూచుచుండిరి. శ్రావణి వారి వైపు కోపంగా చూచుచూ "త్వరలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలోకి వెళ్లుచున్ననూ ఇంత చిన్న విషయమునకు భయపడు చున్నారు సిగ్గులేదా? మరల మీరే వీర వనితలవలె మాట్లాడుచుందురు.” అనెను.
శ్రావణి అట్లనుటతో వారందరూ లోనికి ప్రవేశించి బల్ల వద్దకూర్చినిరి. అందరూ బల్లపై డబ్బులు పెట్టుచుండగా హైమ"చిన్నపిల్లల వలే యున్నారే డబ్బు తిరిగి లోపల పెట్టుకొనుడు. ఎవరైనా స్వేచ్ఛ తెచ్చినచో బల్లపై ఉంచవలె”ననెను. లకుమ జేబులోంచి పొగౘుట్టల పెట్టెను తీసి "దీని వల్లనే ఆలస్య మాయె” ననెను.
"ఓహ్! ఇది అడుగుటకకింత బిడియమెందులకు…హ హ!" అని శ్రావణి నవ్వెను. అమ్మాయిలందరూ. ఆమెవలె నవ్వినారు. "ఇదేనా స్వేచ్ఛ?" అని పల్లవి అడిగెను. సేవకుడు ఏడు బీర్లు దెచ్చి ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కటి బెట్టెను. శ్రావణి ఒక్కొక్కటిగా మూతలనెగరగొట్టెను. సీసాలన్నీ తెరిచిన పిదప "మీలో ఎంతమంది “స్వేచ్ఛ” చిత్రమును చూచినారు?” అనడిగెను. లకుమ తప్ప అందరు అమ్మాయిలు చేతులెత్తగా సేవకుడు నవ్వుతూ వెడలినాడు. “లకుమ, నీవు సెవకుని వద్దనుండి నేర్చు కొనుట చాలా అవమానకర మ”ని పల్లవి ఈసడించెను. శ్రావణి. "నోరు మూసుకొనుము, వాడు ఏడుకొండలు, మన కళాశాల పూర్వ విద్యార్ధి. గత సంవత్సరమె ప్రేమ కొరకు చదువు మానేసి ఇచ్చట జేరినాడు. మన మతడిని గౌరవించ వలెన."నెను. శ్రావణి హైమ బీరును చషకము లలో నింపి అందించినారు. అందరూ చీర్స్ చెప్పి బీరు త్రాగుట మొదలుపెట్టిరి.
శ్రావణి పొగగొట్టము వెలిగించెను మిగతా అమ్మాయిలందరూ కూడా ఆమెను అనుసరించిరి. లకుమ పెదవుల మధ్య పెట్టుకోగా సంధ్య వెలిగించెను. హైమ లకుమ వైపు చూస్తూ “శ్రావణి వలయాలు ఊదుచున్నది. మనమునూ యత్నించెదమ”నెను రెండుసార్లూది భంగపడిననూ అనతికాలంలోనే హైమ సంధ్యలు విజయంసాధిం చినారు. లకుమ దప్ప అందరూ వలయములూదుచూ ఆనంద డోలికలలో తెలియాడిరి. “చలన చిత్రములందు రౌడీలు త్రాగుచుందురు. అది చూచి ఎట్లుండునో అనుకొనుచుండెడిదానను. ఇప్పుడు దెలిసెన” నని లకుమ అనెను. గది పొగమయమాయెను.
“లకుమా
నీ కల ఏమి?” అని శ్రావణి అనడిగెను. “ఆమె
తల్లి నటి. కాబట్టి ఆమె నటి అగును ఇంకేమి అగున?"ని పూర్ణిమనెను. “చిత్రరంగమందు
చేరవలెనన్న మధ్య ధూమ పానములు ప్రాధిమిక విద్యార్హతలు.
ఆ పొగ గొట్టమిటు దెమ్ము ఎట్లు కాల్చవలెనో చూపెదనని దీసుకొని పూర్ణిమ పొగను వలయాకారంలో
వదులు చుండెను. "ఓహ్! పూర్ణిమ మొదటిసారి పెదవులు విప్పెను. ఆమెకు నాలుక కూడా ఉందే." అని శ్రావణనెను.
"ప్రియుని
గలిగుండుట అతిశయమా?" అని లకుమ అడిగెను.
“మీ
అమ్మకి ఆరాధకులు అనగా ఫేన్స్ ఉన్నటు నీకు కూడా ఉండవలెను కదా!” అని శ్రావణి అనగా “ప్రియుడు అన్న మాట నాకు నచ్చకున్ననూ
ఆరాధకుడన్న మాట నచ్చినది, అంతకంటే ఫేన్స్ అను
మాట ఇంకనూ నచ్చినది.” “మీ అమ్మ వలే నీవును
అందగత్తెవేకదా నీ వెనుక నలుగురబ్బాయిలుండవలెను కదా!” అని హైమ అనగా శ్రావణి
నలుగురేమి ఖర్మ చలనచిత్ర రంగమందు ప్రవేశించిన లక్షలాదిమంది జనులు ఆరాధింతురు.
మీ అమ్మ రాష్ట్రమును ఒక ఊపు ఊపినది కదా అట్లే
నీవునూ…. అని శ్రావణి ముగించక మునుపే
“ఆమె నాట్య తార. ఆమె భరత నాట్యముతో రాష్ట్రమును
ఒక ఊపు ఊపినది. మనకిచ్చట ఏమున్నద?”ని పల్లవి లకుమను ప్రశ్నించెను.
“అందరూ నాట్యగత్తెలు కావలెనా అందమున్న చాలదా అది
లకుమకు మందముగానున్నదనుచూ లకుమతో “అసూయాపరుల
మాటలు నమ్మకుము. కళాశాల అందగత్తెవని నిన్ననుటతో పల్లవి ఓర్వ లేకున్నది. నిజము జెప్పవలెనన్నమాఅందరి
దృష్టిలో నేవే అందగత్తెవ” వని సుధ అనెను. “నువ్వు సాయంత్రం బైటకు వచ్చినచో కళాశాలలో సగం మంది నీ వెనకే ఉందురు. అప్పుడు నిజము
బైటపడును. కానీ నీవెన్నడూ బైటకు రావు. నీ సమస్య ఏమియో తెలియకున్నద”ని పూర్ణిమనెను.
‘నా సంరక్షకురాలు దామినియే పెద్ద సమస్య. నిజము
చెప్పవలెనన్న మా అమ్మ కూడా ఒక సమస్యగామారినది. చలన చిత్ర రంగము చెత్త అని, అందడుగిడిన అడుసులో
కాలిడినట్టేయని ఎప్పుడూ జెప్పు చుండును. దామినికి ఆడపిల్లలు పైన తిరుగుటనిన గిట్టదు. ఆడపిల్లలు పైన
తిరుగుట మంచిది కాదని జెప్పుచుండున"ని లకుమ వగచెను. “మేము కూడా వసతి గృహమందున్నవారమే కదా!
మేం తిరుగుటలేదా? పెద్దలట్లే అందురు. వారనేకము జెప్పుచుందురు అవన్నియూ మనము పట్టించుకొనరాద”ని పూర్ణిమ అనెను. అందరూ త్రాగుట ముగించి లేచినారు "మీ
వసతి గృహ సంరక్షకురాలిని ఎట్లు వంచవలెనో నేను
చెప్పెదన"ని శ్రావణనెను. “అదే స్వేచ్ఛ చిత్రం లో జూపినారు. ఆ చిత్రం చూసినచో పరిపూర్ణ స్వేచ్ఛ అనిన ఏమో అర్థమగున”ని సంధ్య అనగా
“స్వచ్చాభిలాషులైన మగువలకు తెగువుండవలెన”ని శ్రావణి నొక్కి జెప్పెను.
“ఒక్కొక్క చిత్రము ఒక్కొక తరమును తయారు చేయున”ని చదువుకు తిలోదకములిచ్చి మధుశాలలో జేరిన ఏడుకొండలు ముక్తాయింపు పలకగా మధుశాలకరతాళ ధ్వనులతో మారు మ్రోగెను.
హా హా ప్రస్తుత సమాజంలో యువత పోకడనీ వాళ్ళ తల్లిదండ్రు పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించారు.తన దాక వస్తే గానీ ఎవరికీ అర్ధం కాదు
ReplyDeleteIn home Fitness Training Company
ReplyDeleteకలముకి చేకూరె బలము. ప్రియముగ నవ్వగ సాహిత్యము కలమాయె శరము నవ్వే కలలకు, వరము నవ్వే ఇహము పరము
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఒకప్పుడు మహానగర్రాల్లో వున్న సంస్కతి ఇప్పుడు చిన్న పట్టణాలలోకి కుడా పాకింది
ReplyDeleteనేను ఈ నవలని ఇష్టపడుతున్నాను.ఇది స్వచ్ఛమైన తెలుగును అందిస్తుంది. స్వచ్ఛమైన తెలుగుతో ఇటీవలి కాలంలో ఇది ఉత్తమ నవల ఇది నా అభిప్రాయం
ReplyDeleteSir mana pata samskruthe Mottam marepointhe sir eppudu jarugutunna vate gurenche baga chepparu sir
ReplyDeleteమీరు మా యువకుల గురించి బాగా చెప్పారు కాలక్రమేణా తెలుగుని మర్చిపోతావ్ ఏమో మేము కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు! ఏ భాష అంటాము ఏంటో
ReplyDeleteమా యువకుల బలహీనతల కూడా బాగా చెప్పారు.
ReplyDeleteతప్పు ఎవరు చేసినా తప్పే.....! కాని ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే స్థితిలో మన సమాజం లేదు. చాల బాగా చెప్పారు sir
ReplyDeletebhayamkaramayina vastavalanu andamayina padajalam tho chepparu sir
ReplyDeletesuper sir
ఈ కథ జీవితానికి ఒక మంచి పాఠం లా కన్న మంచి గుణపాఠం లా అర్థం అవుతుంది సార్...
ReplyDelete
ReplyDeleteఅచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు