Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, July 9, 2020

Bharatavarsha - 2

విశాఖపట్నం - జగదంబ

 

పల్లవి తన స్నేహితులు సంధ్య, హైమలతో కలిసి జగదాంబ జంక్షన్‌లో షికారు చేయుచుండెను. పండ్ల రసాల అంగడివద్ద  ఆగి తన స్నేహితు లకు ద్రాక్ష రసం జెప్పెనుశ్రావణి ఆమె స్నేహితురాండ్రు గాయత్రి, పూర్ణిమలతో  అచ్చటకు వచ్చెను. పల్లవి శ్రావణికి  ద్రాక్షరసమునివ్వగా  "పండ్ల రసములు త్రాగుటకు పిల్లలమా"అనిశ్రావణి అనెను.“నీ విచ్చటికి వచ్చిన ఉద్దేశమేదియో ఉన్నది, అది జెప్పుమ”ని గాయత్రి అనెను. “వసతిగృహమునుండి మనకు బయటకు వెళ్ళటక వకాశములరుదు. అందుచే అచ్చట దొరకనివి తాగవలెను కదా" యని శ్రావణి అనెను.

 

“అచ్చట దొరకానిదా, ఏమద?”ని హైమ అనెను.  లకుమ వచ్చుట చూచి  అందరు ఆమెనడుగుటకు నిర్ణయించుకొనిరి.ఆమె వడిగల వాడిగల  ఆధునిక యువతి, ఆమె ఏమి జెప్పునో  చూచెదమ”ని హైమ అనెను.  అందరూ నవ్వుకొనిరి. గాయత్రి “మనకు వసతి   గృహమందు దొరకని పానీయమేదనడిగెనుబాదంపాల”ని లకుమ ఠక్కని  జెప్పగా అమ్మాయిలందరూ పగలబడి నవ్వినారు.

 

“అది ఎదో చూపెదను. తెగువగలవారు నాతో రండు. నేను కొనిపోయెద”ననుచూ శ్రావణి విసవిసా నడవసాగెను. లకుమతో సహా అమ్మాయిలందరూ ఆమెను అనుసరించిరి. ఆమె ఒక సన్నవీధిలోకి ప్రవేశించెను. అమ్మాయిలంతా ఆమె వెనుకే నడుచుచుండిరి. శ్రావణి ముందుకి సాగి పానశాల ముందాగెను. యువతులందరూ  మ్రాన్పడి చూచుచుండిరి. శ్రావణి వారి  వైపు కోపంగా చూచుచూ  "త్వరలో ఇంజినీరింగ్ చివరి  సంవత్సరంలోకి వెళ్లుచున్ననూ ఇంత  చిన్న విషయమునకు భయపడు చున్నారు  సిగ్గులేదా? మరల  మీరే వీర వనితలవలె మాట్లాడుచుందురు.” అనెను.

శ్రావణి అట్లనుటతో వారందరూ లోనికి ప్రవేశించి బల్ల వద్దకూర్చినిరి. అందరూ బల్లపై డబ్బులు పెట్టుచుండగా హైమ"చిన్నపిల్లల వలే యున్నారే డబ్బు తిరిగి లోపల  పెట్టుకొనుడు. ఎవరైనా స్వేచ్ఛ తెచ్చినచో బల్లపై ఉంచవలె”ననెను. లకుమ జేబులోంచి  పొగౘుట్టల పెట్టెను తీసి "దీని వల్లనే ఆలస్య మాయె” ననెను.

"ఓహ్! ఇది అడుగుటకకింత బిడియమెందులకు…హ హ!" అని శ్రావణి నవ్వెను. అమ్మాయిలందరూ. ఆమెవలె నవ్వినారు. "ఇదేనా స్వేచ్ఛ?" అని పల్లవి అడిగెను.  సేవకుడు ఏడు బీర్లు దెచ్చి ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కటి బెట్టెను. శ్రావణి  ఒక్కొక్కటిగా మూతలనెగరగొట్టెను. సీసాలన్నీ తెరిచిన పిదప "మీలో ఎంతమంది “స్వేచ్ఛ” చిత్రమును చూచినారు?” అనడిగెను. లకుమ తప్ప అందరు అమ్మాయిలు చేతులెత్తగా సేవకుడు నవ్వుతూ వెడలినాడు.  “లకుమ, నీవు సెవకుని వద్దనుండి నేర్చు కొనుట చాలా అవమానకర మ”ని పల్లవి ఈసడించెను. శ్రావణి. "నోరు మూసుకొనుము, వాడు ఏడుకొండలు, మన కళాశాల పూర్వ విద్యార్ధి.  గత సంవత్సరమె ప్రేమ కొరకు చదువు మానేసి ఇచ్చట జేరినాడు. మన మతడిని గౌరవించ వలెన."నెను. శ్రావణి హైమ బీరును చషకము లలో నింపి అందించినారు. అందరూ చీర్స్ చెప్పి బీరు త్రాగుట మొదలుపెట్టిరి.

శ్రావణి  పొగగొట్టము వెలిగించెను మిగతా అమ్మాయిలందరూ కూడా ఆమెను అనుసరించిరి. లకుమ పెదవుల మధ్య పెట్టుకోగా  సంధ్య వెలిగించెను. హైమ లకుమ వైపు చూస్తూ “శ్రావణి వలయాలు ఊదుచున్నది. మనమునూ యత్నించెదమ”నెను రెండుసార్లూది భంగపడిననూ అనతికాలంలోనే హైమ సంధ్యలు విజయంసాధిం చినారు. లకుమ దప్ప అందరూ వలయములూదుచూ ఆనంద డోలికలలో తెలియాడిరి. “చలన చిత్రములందు రౌడీలు త్రాగుచుందురు. అది చూచి ఎట్లుండునో అనుకొనుచుండెడిదానను. ఇప్పుడు దెలిసెన” నని  లకుమ అనెను.  గది పొగమయమాయెను.

“లకుమా నీ కల ఏమి?” అని శ్రావణి అనడిగెను. “ఆమె తల్లి నటి. కాబట్టి ఆమె నటి అగును ఇంకేమి అగున?"ని పూర్ణిమనెను. “చిత్రరంగమందు చేరవలెనన్న మధ్య ధూమ పానములు  ప్రాధిమిక విద్యార్హతలు. ఆ పొగ గొట్టమిటు దెమ్ము ఎట్లు కాల్చవలెనో చూపెదనని దీసుకొని పూర్ణిమ పొగను వలయాకారంలో వదులు చుండెను. "ఓహ్! పూర్ణిమ మొదటిసారి పెదవులు విప్పెను. ఆమెకు నాలుక కూడా ఉందే." అని   శ్రావణనెను.

 నాకు చెలికాడు కూడా ఉన్నాడు. కానీ నేను మీ వలె ముదర బెండకాయ మాటలు జెప్పక చల్లగా పనులు కానిత్తున"ని పూర్ణిమ బదులిచ్చెను. ఆ దేశముదురును జూచి నేర్చుకొనుడని హైమ అందరికి హితవు పలికెను. ప్రియుణ్ణి కలిగి ఉండటం విషయంలో శ్రావణి, పూర్ణిమ మధ్య గొడవ జరిగెను.  “ప్రియుణ్ణి  కలిగి ఉండటం గొప్ప విషయమా? నేతలుచుకున్నచో  వచ్చే వారం పది మంది అబ్బాయిలు నావెనక ఉందుర"ని  శ్రావణి సవాల్ విసిరెను.  

           

"ప్రియుని  గలిగుండుట అతిశయమా?" అని లకుమ అడిగెను.

“మీ అమ్మకి ఆరాధకులు అనగా ఫేన్స్ ఉన్నటు నీకు కూడా ఉండవలెను కదా!” అని శ్రావణి అనగా “ప్రియుడు అన్న మాట నాకు నచ్చకున్ననూ ఆరాధకుడన్న మాట నచ్చినది,  అంతకంటే ఫేన్స్ అను మాట ఇంకనూ నచ్చినది.”  “మీ అమ్మ వలే నీవును అందగత్తెవేకదా నీ వెనుక నలుగురబ్బాయిలుండవలెను కదా!” అని హైమ అనగా శ్రావణి  నలుగురేమి ఖర్మ చలనచిత్ర రంగమందు ప్రవేశించిన లక్షలాదిమంది జనులు ఆరాధింతురు. మీ అమ్మ  రాష్ట్రమును ఒక ఊపు ఊపినది కదా అట్లే నీవునూ…. అని శ్రావణి ముగించక మునుపే “ఆమె నాట్య తార.  ఆమె భరత నాట్యముతో రాష్ట్రమును ఒక ఊపు ఊపినది. మనకిచ్చట ఏమున్నద?”ని పల్లవి లకుమను ప్రశ్నించెను.

 

 “అందరూ నాట్యగత్తెలు కావలెనా అందమున్న చాలదా అది లకుమకు మందముగానున్నదనుచూ  లకుమతో “అసూయాపరుల మాటలు నమ్మకుము. కళాశాల అందగత్తెవని నిన్ననుటతో పల్లవి ఓర్వ లేకున్నది. నిజము జెప్పవలెనన్నమాఅందరి దృష్టిలో నేవే అందగత్తెవ” వని  సుధ అనెను.  “నువ్వు సాయంత్రం బైటకు వచ్చినచో  కళాశాలలో సగం మంది నీ వెనకే ఉందురు. అప్పుడు నిజము బైటపడును. కానీ నీవెన్నడూ బైటకు రావు. నీ సమస్య ఏమియో తెలియకున్నద”ని పూర్ణిమనెను. ‘నా సంరక్షకురాలు దామినియే పెద్ద  సమస్య. నిజము చెప్పవలెనన్న మా అమ్మ కూడా ఒక సమస్యగామారినది. చలన చిత్ర రంగము చెత్త అని, అందడుగిడిన అడుసులో కాలిడినట్టేయని ఎప్పుడూ జెప్పు చుండును. దామినికి  ఆడపిల్లలు పైన తిరుగుటనిన గిట్టదు. ఆడపిల్లలు పైన తిరుగుట మంచిది కాదని జెప్పుచుండున"ని లకుమ వగచెను. “మేము కూడా వసతి  గృహమందున్నవారమే కదా!

 

మేం తిరుగుటలేదా? పెద్దలట్లే అందురు. వారనేకము జెప్పుచుందురు  అవన్నియూ మనము పట్టించుకొనరాద”ని పూర్ణిమ అనెను. అందరూ త్రాగుట ముగించి లేచినారు "మీ వసతి గృహ సంరక్షకురాలిని ఎట్లు వంచవలెనో  నేను చెప్పెదన"ని శ్రావణనెను. “అదే స్వేచ్ఛ చిత్రం లో జూపినారు. ఆ చిత్రం చూసినచో  పరిపూర్ణ స్వేచ్ఛ అనిన ఏమో అర్థమగున”ని సంధ్య అనగా “స్వచ్చాభిలాషులైన మగువలకు తెగువుండవలెన”ని శ్రావణి నొక్కి జెప్పెను.  

“ఒక్కొక్క చిత్రము ఒక్కొక తరమును తయారు చేయున”ని చదువుకు తిలోదకములిచ్చి మధుశాలలో జేరిన ఏడుకొండలు ముక్తాయింపు పలకగా మధుశాలకరతాళ ధ్వనులతో మారు మ్రోగెను. 


                                                                     ***

వసతి గృహమున దూరవాణి మ్రోగుచుండ  వసతిగృహ సంరక్షకురాలు దామిని దూరవాణిలో మాట్లాడి, దానిని  తెరచి ఉంచి , గంట మోగించగా అక్కడ పనిచేయు ఒక స్త్రీ వచ్చి  ఆమె ముందు నిలిచెను. పిలుపు వచ్చెనని,దూరవాణి తెరిచియున్నదని వెళ్లి లకుమకి తెలిపిరమ్ము అనెను.  పిలుపు చేరిన తక్షణమే మెరుపువేగమున దూసుకువచ్చి, పిడుగుపాటువలె బల్లపై పడి గ్రెద్ద  కోడిపిల్లనెత్తుకు బోయినట్లు దూరవాణి నొకప్రక్కకు నెత్తుకుపోయి, దూరవాణిని హత్తుకుపోయి , చలిజ్వరం వచ్చి వణుకుచున్న స్వరమున " హాయ్ వెంకీ  డియర్ ఆ యాం పింకీ హియర్  హేపీ వేలంటైన్స్ డే"యని లకుమ సంభాషిచుచుండ, దామిని శిరమును చేతబుచ్చుకుని  "ఆ మూలకు పోయి ఓప్రా (ఆంగ్ల  సంగీత నాటకము) నందు యకారకరణం (యోడలింగ్) జేయు స్వరమున ఏల మాట్లాడవలెనో నాకర్ధము కాదు. ఇది విడ్డురముగాక మరియేమి  యని వగచుచుండ  పనిపిల్ల  "అమ్మా !  నాకఆంగ్లము రాదు మీరు చెప్పిన ముక్కలకు నాకర్దము తెలియదు. పెద్ద పెద్ద బడులకుబోయి ఆంగ్లము చదువుకొనిన తెలియవచ్చు. నాకు ఆమెస్వరము నత్తకురింజి రాగమున ఆరోహణ అవరోహణ జెయినట్లున్నది." అనెను.


ఇదియొక విడ్డూరం కాగా , ఎప్పుడూ పినతండ్రి కొడుకని చెప్పుచూ అనేక మందితో సంభాషించు చుండును , దీనికెంతమంది పినతండ్రులున్నారో?! యని దామిని అనగా "పినతండ్రికొడుకైనచో ఈమె మెలికలు ఏల తిరగవలె? అని అనుచుండ లకుమ  దూరవాణిని బల్లపైనుంచెను. ఇంతలో కిటికీనుండి బయటకు చూసిన పనిపిల్ల ఎవరో ద్విచక్ర వాహనంపై వేచియున్నారు అన్నది. ఈ వసతి గృహమునకు పరపురుషులు వచ్చుట నిబంధనలకు విరుద్ధమని తెలియదా యని దామిని లకుమను ప్రశ్నించెను.“వచ్చినది రాజేష్ మా పినతండ్రి కొడుకే, ఐననూ లోపలి వచ్చాడా? బయట ఎక్కడో ఉంటె మీకెందులకు? చాదస్తం కాకున్నచో !! అని గొణుగుతూ ప్రధాన ద్వారం వైపు పరుగెడుచున్న లకుమను చూసి దామిని “ఈమె బట్టలుచూడవలె చనుగుబ్బలు , తొడలు , పిరుదులు కనిపించునట్టు వస్త్రధారణ చూడుము ఈమెను జూచిన ఆంధ్రదేశమున లంగా ఓణీలు కట్టుకొను ఆడపడుచులు సిగ్గుతో తలదించుకొందురు. అని ఉరమగా" అటువంటివారెక్కడుందురో  తెలిపినచో నేనునూ పోయి జూచివత్తునని వ్యంగ్యమున పలికి మూతి మూడు వంకరలు త్రిప్పుచూ పనిపిల్ల లోపలి పోయెను.
                                                              ***
లకుమ ఉద్యానవనమున పొదచాటున ప్రేమికునితో  సరస సంభాషణయందు  ప్రేమమాటలు రువ్వుచూ , అప్పుడప్పుడూ  నవ్వుచూ  మద్యమద్యలో ఐస్ క్రీమ్  నాకుచూ వంకర టింకరలు పోవుచుండ ప్రక్కనుండి  పోవు చున్న  ఇద్దరు  పెద్దమనుషులు  చూచి " చూడవోయి దీని చేష్టలు , దీని తల్లి ఒక రాజకీయపార్టీలో ఒక నాయకుని చెంకలో నుండి  చేయుపనులు  ఈమె ఉద్యానవనములలో చేయుచున్నద"ని ఒక పెద్దమనిషి అనగా   "కూతురు చెడిన  ఆ తప్పు తల్లిదను సామెత కలదు  ఈమె తల్లి  వెలుగు దేశం పార్టీలో చేయు వ్యవహారముల  గూర్చి తెలియనిదెవరికి ? తల్లిని మించిన కూతురు ఈమె" అని రెండవ పెద్దమనిషి బదులిచ్చెను. వారి మాటలు విన్న ఉద్యానవన సిబ్బంది ఇరువురు విస్తుపోయిరి. అందొకడు   " పచ్చకామెర్ల రోగికి లోకమంతయూ పచ్చగా కనిపించునని వినియుంటిని  ఇప్పుడు ప్రత్యక్షముగా చూచుచున్నాను.   ఈమె తల్లి అద్భుత నర్తకి, మంచి చిత్రములలో నటించింది. ప్రస్తుతము ఆమెకు అవకాశములు అడుగంటినవి.  " అనగా  రెండవవాడు "  ప్రస్తుత దర్శకుల పోకడలు సరిపడక అవకాశములు వదులుకొని కేవలము ఆమే చిన్న తెరకు పరిమితము చేసుకొన్నది. ఆమె చిత్రరంగమందు  ఉండవలసినది కాదు.  రాజకీయములలో చేరి మహిళాధ్యక్షురాలి గా పనిచేయుచున్నది. అట్లని రాజకీయములందు కూడా  ఉండవలసినది కాదు కానీ ఎందుకో చిత్ర రంగము కంటే హీనమగు రాజకీయరంగమందు ప్రవేశించెను " అనెను. అందుకు మొదటివాడు నవ్వి " అదియునూ కానిచో మనవలె  ఉద్యానవనమున పనిచేయవలెను. పద పోయి మొక్కలకు నీరు పెట్టవలెను " అనెను. వారిరువురూ అచ్చట నుండి కదిలిపోయిరి.   

ఆ పెద్దమనుషులిరువురూ ఉద్యానవనమున  సంచరించుచూ అచ్చట కొచ్చిన జంటలను పరికించు చుండిరి. నేడు వాలెంటైన్స్ డే అగుటచే ఉద్యానవనం కళకళ లాడు చున్నది.   ఈ పొదల ఈమెను  చూడుము ఇందాక చూచిన దానిని మించిపోయినది అని అనుచుండగా మరుక్షణమే మరొకపోదలో నున్న తన కూతురు కనబడగా పక్కవాడు చూసినాడేమో యని భీతిగొని "ఛీ ఛీ నేటిచదువుననవలెను , పంతుళ్ళననవలెను , ఒక్కతీరున చదువు చెప్పుట రానిచో ఒక మూల ముడుచుకొని  కూర్చునవలె, పద ఇచ్చటనుండి త్వరగాపోవలెననగా, అతడితో వచ్చిన వ్యక్తి మనసులో "ఇటువంటివి చూచుటకై కదా మనము నేడు ఉద్యానవనమునకు వచ్చినాము వీడి కూతురు కనిపించినంతలో వీడి మొగము మాడిపోయినది " అని అనుకొని బయటకు నవ్వుతూ " మన బంగారం మంచిదైనచొ ... అన్నట్లు

పంతుళ్లనని లాభమేమి , మండుటెండ యని జూడక  మగవారు సూట్లు వేసుకొని తిరుగుట , చలికాలమని చూడక ఐస్ క్రీములు తినుట , పొట్టి దుస్తులు ధరించుట , పెద్ద , చిన్న అంతరం మరిచి అందరిని పేరుపెట్టి పిలుచుటయే  కాక  అదియే గొప్పయని నమ్ముట ఇవన్నియూ ఆంగ్లవిద్యద్వారా సంక్రమించినవే , నా అదృష్టమేమనగా  నాకూతురు గుణవంతురాలు" అనెను.  వారు వేగముగా నడుచుచూ ఉద్యానవన ప్రధాన ద్వారమును జేరి నిక్రమించు సమయాన  రెండవ పెద్దాయన కుమార్తె  అప్పుడే జంటగా లోపలి ప్రవేశిస్తూ  తండ్రిని చూసి ఒక పొద చాటున నక్కెను. అది జూచి ఆ పెద్దమనిషి గొంతు తడారి, ముఖకవళికలు మారిపోయినవి . దానితో ఆయన స్వరము కూడా మారి పోయెను. ఈ సినిమాలొచ్చి అందరినీ పాడుచేసెను, ఈ వెలయాళ్లనును ఆదర్శంగా భావించి వారి అడుగుజాడలలో నడుచుచున్నారు. వారే నేటి మన యువతీ యువకులకు గురువులుగా అవతరించారు. వారు జూపిన అర్ధనగ్నతను ఆధునికతయని పొరపడుచున్నారు.  పెడసరం మాటలను నిర్లక్ష్య ప్రవర్తనను ఆధునికతగా భావించుచున్నారు.  ఇది కాలమహిమ అనుచూ తోటి పెద్ద మనిషితో కలసి వనమునుండి నిష్క్రమించెను.  

13 comments:

  1. హా హా ప్రస్తుత సమాజంలో యువత పోకడనీ వాళ్ళ తల్లిదండ్రు పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించారు.తన దాక వస్తే గానీ ఎవరికీ అర్ధం కాదు

    ReplyDelete
  2. కలముకి చేకూరె బలము. ప్రియముగ నవ్వగ సాహిత్యము కలమాయె శరము నవ్వే కలలకు, వరము నవ్వే ఇహము పరము

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ఒకప్పుడు మహానగర్రాల్లో వున్న సంస్కతి ఇప్పుడు చిన్న పట్టణాలలోకి కుడా పాకింది

    ReplyDelete
  5. నేను ఈ నవలని ఇష్టపడుతున్నాను.ఇది స్వచ్ఛమైన తెలుగును అందిస్తుంది. స్వచ్ఛమైన తెలుగుతో ఇటీవలి కాలంలో ఇది ఉత్తమ నవల ఇది నా అభిప్రాయం

    ReplyDelete
  6. Sir mana pata samskruthe Mottam marepointhe sir eppudu jarugutunna vate gurenche baga chepparu sir

    ReplyDelete
  7. మీరు మా యువకుల గురించి బాగా చెప్పారు కాలక్రమేణా తెలుగుని మర్చిపోతావ్ ఏమో మేము కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు! ఏ భాష అంటాము ఏంటో

    ReplyDelete
  8. మా యువకుల బలహీనతల కూడా బాగా చెప్పారు.

    ReplyDelete
  9. తప్పు ఎవరు చేసినా తప్పే.....! కాని ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే స్థితిలో మన సమాజం లేదు. చాల బాగా చెప్పారు sir

    ReplyDelete
  10. bhayamkaramayina vastavalanu andamayina padajalam tho chepparu sir

    super sir

    ReplyDelete
  11. ఈ కథ జీవితానికి ఒక మంచి పాఠం లా కన్న మంచి గుణపాఠం లా అర్థం అవుతుంది సార్...

    ReplyDelete

  12. అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete