వారిద్దరూ అట్లు నడుచుచుండగా అకస్మాతుగా ఉరుములేని పిడుగువలె బైరెడ్డి అతడి అనుచరులతో ఎదురుపడెను. తత్తరపాటుతో అగస్త్య పక్కనున్న సందులో నక్కబోయి బైరెడ్డికి చిక్కిపోయెను. బైరెడ్డి వాడివాహనమును అగస్త్యుని ముందు నిలిపెను. అతడి వెనుక మరొక రెండు ద్విచక్రవాహనములున్నవి. వాటిపై బైరెడ్డి స్నేహితులు నలుగురు కూర్చొని ఉండిరి. వారు జై భీం తో పాటు జై బుద్ధ అనిరి. బసవడు వారందరికీ జై భీమ్ అని వందనములు చేసెను. అగస్త్యుడు అట్లేమీ అనక మౌనముగా ఉండిపోయెను. వారగస్త్యను చూచి ముఖము చిట్లించిరి.
"ఏరా అగ్గి ( అగస్త్య ) జైభీమ్ అనకున్న, జై బుద్ధ అనుటకు కూడా నోరురాకున్నదే! అవునులే గబ్బు వేదాలని పట్టుకువేలాడు గబ్బిలాలకి..".అని బైరెడ్డి అనుచుండగా "పొట్ట పొడిచిన అక్షరము రాని నీవా వేదాలనాడువాడవు, ఆక్షేపించువాడవు!! "అని అగస్త్యుడనెను. వేదాలు చదువుకున్నామని పొగరురా మీకు! త్వరలో విప్లవం తీసుకు వచ్చి వేదాలను తెగులబెట్టి మీ అందరినీ తరిమికొట్టకున్న...అని బైరెడ్డి అనుచుండగా
"ఏరా బైరీ పోలీసులు వదిలేశారా?" అని అగస్త్య అడిగెను. అది విని బైరెడ్డి ముఖము ఎర్రబారెను. "ఏరా బొల్లి గ్రద్దనో నల్ల పిల్లిని చూసినట్లు నన్ను చూచినంతనే సందులో దూరుచున్నావే"అని బైరెడ్డి అగస్త్యుని ఆక్షేపించెను. "నీవంటి వారితో నావంటి సామాన్యుడు తూగలేడు అందుకే తప్పుకొనుచున్నాను." అని అగస్త్యుడు అనగా బైరెడ్డి నువ్వుకొని సరే సరే " బసవడితో మాట్లాడవలెను నీవు కొంచుకు ముందుగా నడుచుచుండుము" అనెను. అగస్త్య "మీ రహస్యములు వినవలెనని కోరిక నాకు లేద"ని వడివడిగా నడుచుకొని ముందుకు పోయెను.
బైరెడ్డి బసవడితో మాట్లాడ సాగెను. "ఈ బ్రాహ్మడితో స్నేహమేల చేయుచున్నావని మందలించెను. ఎందులకని బసవడడుగగా బైరెడ్డి " పెరియార్ బ్రాహ్మణుడి గూర్చి ఇట్లనెను. పాము బ్రాహ్మడు ఒకే సారి కనిపించినచో పామును వదిలి బ్రాహ్మణుడిని చంపవలెననెను" బసవడు మ్రాన్పడెను.
రేపు మన విద్యార్థిసంఘము తరుపున రాలీ కలదు. నీవు పాల్గొన వలెను. అని బైరెడ్డి అనగా బసవడు "నాకు వాహనము లేదు కదా!" అని వాపోయెను వెనకనున్న అహమద్ రేపటికి నా వాహనము తీసుకొనుము. అనెను. అట్లైనచో అగస్త్యుడు కూడావచ్చును అని బసవడు అనుచుండగా " బెరైడ్డి అహమద్ జాన్, ప్రమోద్ ఒక్కసారిగా " నేటికీ వాడిని ఒదిలి మాతో రమ్ము భారత వర్ష ఇంటికి పోకున్న వచ్చు నష్టమేమి ?" అనిరి. బసవడు నాకు అచ్చట ఉచితముగా బిర్యానీ లభించును అనెను. "ఆ బిర్యానీ మేము పెట్టించెదము. ఇప్పుడు నష్టమేమియూ లేదుకదా!" అని వారు అనగా బసవడు ముందుగా నడుచుచున్న అగస్త్యునికడకు బోయి"అగస్త్యా నేను తరువాత వచ్చెదను నీవు పొమ్మ"ని చెప్పెను. అగస్త్యుడు వడివడిగా నడుచుకుని వెడలిపోయెను.
పిమ్మట వారు బసవని ఫలహారశాల కొని బోయిరి. అచ్చట బిర్యాని చెప్పి అది వచ్చునంతలో వారు మరునాటి కార్యక్రమమును ముచ్చటించుకొనుచుండిరి.
అగస్త్యుడు మంచివాడు వాడు కూడా ఉండిన బాగుండునని బసవడనెను. వాడికి ఎంతచెప్పిననూ ఆధునిక భావములు తలకెక్కకున్నవి. అని ప్రమోద్ జాన్ అనిరి. "ఆ అగస్త్య ఆధునిక భావములను అసహ్యించుకొనును. వాడు జీన్స్ ధరించుట ఎన్నడైనా చూచితివా? వాడికి వాహనము అవసరము లేదు, ఎక్కడికి పోయిననూ నడుచుకునే పోవుచుండును. కళాశాలలో కుంటి సీత కూడా వాడి వైపు కన్నెత్తి చూడద"ని అహ్మద్ బైరెడ్డి అనిరి. అందరూ పగలబడి నవ్విరి.
జాన్ "వాడికి పాతచింతకాయ పచ్చడి రుచించును.వాడికి పెద్దలను ధిక్కరించుట చేతకాదు. కొత్తగా ఆలోచించుట చేతకాదు. పనికిమాలిన వేదములవెంట పడు వెర్రి కుక్క. వేదములు రాసి బ్రాహ్మణులు సమాజమును నాశనము చేసినారు." అనెను .
వేదములు పనికి మాలినవా? మా అమ్మ నాన్న కూడా వేదములు చదువుచున్నారు. అని బసవడు అనగా ప్రమోద్ "పిచ్చివాడా బుద్ధుడంతటివాడే వేదముల ను ఖండించలేదా " అనగా బైరెడ్డి "వేదములు, పద్యములు, అచ్చ తెలుగు అనుచూ భారతవర్ష తిరుగుచుండగా అగస్త్యుడు వాడి వెనుక తిరుగుచున్నాడు. భారతవర్ష ని అందరూ పిచ్చి వాడి వలే చూచుచున్నారు. వాడి పిచ్చి వీడికెక్కినది. నీవునూ వాడితో తిరిగె దవా? " అని అడిగెను
భారతవర్ష మనదరికంటే పెద్దవాడు చదువు పూర్తి చేసుకుని ఉపన్యాసకుడిగా పనిచేయుచున్నాడు. ఆయన సద్బుద్ధిని పాండిత్యాన్ని మెచ్చనివారు లేరు. ఆయన నీకు నచ్చకున్నా నీవు మెచ్చకున్నా వాడు వీడు అన్నచో నేను సహించజాలను. అని బసవడు తెగేసి చెప్పెను. ఇంతలో బిర్యానీ వచ్చినది.
బసవడు తినుటకు ఉపక్రమించునంతలో జాన్ చేతిలో చరవాణి తీసి ఏమి వాడి పాండిత్యము వేదములు గొప్పవి అనువాడు వెధవ. ఇదిగో ముఖపుస్తకమునందు నా సమూహమును చూడుము." అని చూపెను "వేదములన్నియూ చెత్త" అని ఒకరు వ్రాసిరి. "బ్రహ్మ కి సరస్వతి ఏమగును?" అని మరొకరు వ్రాసిరి . "రాముడు కృష్ణుడు దేవుళ్ళు కారు. ఏసు ఒక్కడే దేముడు " అని రాసి యున్నది." దానిని జాన్ నొక్కి వక్కాణించెను
అంతవరకూ నిశ్శబ్దముగా యున్న అహ్మద్ కి దుమ్ము ముఖము పైకి చిమ్మినట్ట య్యెను.అప్పుడతడు " కామ్రేడ్! లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లా " దీని అర్థం తెలుసా ? ఈ సృష్టి కి కారణం అల్లాహు. అల్లాహు ఒక్కడే పూజ్యనీయుడు. మా మసీదులలో నిత్యము ఇదే విషయమును ఐదు సార్లు మైకులలో చెప్పెదరు" అనెను. అహ్మద్ అట్లనుటతో జాన్ కి జిల్లేడు పాలు కంటిలో పోసినట్లయ్యెను "ఆదియందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; అగాధ జలము మీద చీకటి కమ్మియుండెను. దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. అని ఆదికాండము చెప్పుచున్నద"ని అతడు బల్ల గుద్దెను బిర్యాని ఆలస్యమైనందుకు అతడికి కోపము వచ్చెనని భావించిన ఆ ఫలహారశాల యజమాని తానె స్వయముగా పరుగుపరుగున బిర్యాని పళ్ళెములు తెచ్చి పెట్టెను .
అందరు దేవుళ్ళూ ఒక్కటే కదా ఎందుకలా కాట్లాడుకుంటారు. అన్నాడు బసవడు. బైరెడ్డి జాన్ ని వెనకేసుకొచ్చాడు. 'కామ్రేడ్ ఏసు నిజదేవుడని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. " అంటూ బైరెడ్డి ఎదో చెప్పబోయెను. కొత్తగా నిన్నకాక మొన్న మతం మారిన వాడివి నీతో నాకేంటి. నీ చర్చ్ కి వచ్చే గొర్రెలకు చెప్పు. లేదా వాడికి చెప్పు అని బసవడిని చూపించెను .
బసవడు అది పట్టించుకొనక బిర్యాని మెక్కుచుండెను. అది చూసి వారు బసవడు మతసంబంధము లేని మనిషని అని ఆదర్శప్రాయుడని జనోద్ధారకుడని మెచ్చుకొని బిర్యానీ ఆరగించిరి. తినుట ముగిసిన పిదప బసవడు "సరస్వతి జ్ఞానానికి రూపము. ఆ జ్ఞానముతోనే బ్రహ్మ సృష్టి కార్యము జరిపెను" అనెను. అని ఎచ్చట చెప్పబడెను అని అహ్మద్ వెటకారంగా అడిగెను . బసవడు ఆదినాకు తెలియదనెను. అదివిని జాన్ "వచ్చిన పని ముగిసినది కదా ఇక పొమ్ము" అనెను .
అతడి గొంతులో వెటకారము బసవడి కి కారము రాసినట్టు తోచి బిర్యాని పై మమకారము నశించి వికారము జనించినది. అతడు లేచి చేయి కడుగుకొనుటకు పోయెను. చూసేవా వాడికి తెలియని ప్రశ్న అడిగి వాడిని ఎట్లు నోరు మోయించితినో అని జాన్ అనగా అహ్మద్ వాడికి తెలియదని ఖచ్చితముగా నీకెట్లు తెలియును ? అనెను. హిందువుల ఇళ్లలో తల్లిదండ్రులు చదువులో ఒక్క మార్కు తగ్గినా చంపి పాతివేతురు విదేశములు పోవలెనని తపన తప్ప స్వదేశము స్వధర్మము వారికి పట్టవు. వారికి చదవ సమయమెచ్చటున్నది వారు చదువువారు కాదు ఎవరుచెప్పిననూ వినువారు కాదు. వారికి సినిమాలు తప్ప ఏవీ తలకెక్కవు ఎక్కవు. ఒక్క ప్రశ్నతో వారి నోరు మూయించుచవచ్చు. ఆవి వారు ఆడు మాటలు. చేతులు కడుగుకొనుచూ బసవడు అంతయూ వినుచుండెను.బసవడు బల్లవద్ద యజమానికి అందరి తిండికీ డబ్బు చెల్లించే వెడలెను.
పగలబడి కూతురైన సరస్వతిని పెండ్లాడి గొప్ప సృష్టి కార్యమే నడిపెను." అని అందరూ హేళన చేసిరి.
***
వారు ఇరువురు ఆనందనిలయం చేరుసరికి ఒక గుడ్డపందిరి (షామియానా) కింద సుమారు ఒక యాబది మంది గుంపు కనిపించెను. వారిరువురూలోపలికి పోవుచుండగా ఎవరో ఇరువురు సంభాషించుకొనుచున్నారు.
ఒకటవ వ్యక్తి రెండవ వ్యక్తితో ఇచ్చట అన్నసంతర్పణ ఎందులకు జరుపుచున్నారు ఏ సందర్భమున జరుపుచున్నారు? అనెను అందులకు రెండవ వ్యక్తి నవ్వి నిర్వాహకుడు భారతవర్ష యని తెలియును. ఎందుకు జరుపుచున్నారో తెలుసుకొనవలెననెడి ఆశక్తి అడుగంటెను, మొదటిసారి వచ్చినపుడు నీవలె నేను కుతూహలంతో అడుగగా " తన మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిచినందుకు భారతవర్ష సంతోషముతో అన్న సంతర్పణము చేయుచున్నాడని ఎవరో తెలిపిరి. మరొక సారి భారత వర్షను అడగగా ఇటువంటిదేదో సాకు చెప్పినాడు. ఎదో ఒక వంకన అన్నసంతర్పణ చేయుచున్ననూ వీరి ఉద్దేశ్యము తదుపరి కార్యక్రమమున గమనించవచ్చు. అని తెలిపెను. ఆ కార్యక్రమమేదో నేను చూచియే పోయెదను అని మొదటి వ్యక్తి అనెను.
భోజనములు ముగిసిన పిదప , పక్కనే ఉన్నపెద్ద గదిలో ఏర్పాటు చేయబడి ఉన్న వేదిక పై అర్ధ చంద్రాకారముగా అమరచిన కుర్చీలలో స్థానిక కాలేజీలలో పనిచేయు తెలుగు ఉపన్యాసకుడు రామకృష్ణ, పదవీవిరమణలో నున్న ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు ఆంకాలరావు, సిద్ధాంతి చంద్రశేఖర శర్మ, ప్రజాదరణ పొందిన రచయత మారయ్య, వసతి గృహ సంరక్షకురాలు దామిని, అంతర్జాల పత్రికాధిపతి పెంచలయ్య , తెలుగు భాషాభిలాషకుడు అగస్త్య పృచ్ఛకులుగా వేదికపై యుండిరి. మధ్యలో అవధాన కృషీవలుడు భారతవర్ష కూర్చుండెను.
ఎనిమిదవ వ్యక్తి ఎవరా యని అందరూ ఆసక్తిగా చూచుచుండ లంగా ఓణీలో తెల్లని పొడవాటి పిల్ల వచ్చి వేదిక నలంకరించెను. ఆ అమ్మాయి ఆలస్యమునకు క్షమాపణ చెప్పుచుండ గా , సిద్ధాంతి గారు ,రచయత మారయ్య తో ఈమె పేరు మంజూష అవధాని సోదరి, నేటి అష్టావధాన ప్రక్రియ లో అసందర్భ ప్రసంగం జేయును అని చెవిలో చెప్పెను. అవధాన ప్రక్రియ మొదలగు సమయానికి వేదిక చుట్టూ వేసిన కుర్చీలు నిండినవి. భారతవర్ష తల్లి మాలిని మొదటివరుసలో కూర్చొండెను , పక్కనే పొరుగువారు , భారతవర్ష మిత్రులు , మంజూష మిత్రులు కూడా కూర్చొని ఉండిరి. అష్టావధాన కార్యక్రమానికి అధ్యక్షత స్థానిక తెలుగు సంఘం కోటేశ్వర రావు స్వాగత వచనం పలుకుతూ భారతవర్ష కి శుభాకాంక్షలు తెలియజేసారు, చిన్నపటినుంచి అనేక సాంఘిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని మెడల్స్ అందుకున్న భారతవర్ష, ఈ సాహిత్య సేవ చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు ప్రశంసించారు. పాల్కురికి సోమనాధుడు వ్రాసిన
చాల చక్కని తెలుగులో ఎంతో హృద్యంగా యున్నది
ReplyDeleteభరత వర్ష గ్రంథం నిజ జీవితాలకు అద్దం పడుతుంది
ReplyDeleteఈ కథ లో బసవయ్య క్యారెక్టర్ నేటి పిల్లల మనస్తతత్వం లాంటిది అతి గారాబం వలన అతను ఎలా చెడిపోయినాడో మనకు తెలుస్తుంది
ReplyDeleteBharatvarsha Lo Chala baavalu Vinni sir
ReplyDeleteNaku Baga upayoga padthuthundhi sir, ee bharathavarsha
ReplyDeleteBasaweswarudi sthithi vasthavaniki sameepamuga unnadhi ,talli tandrula prabhavam mariyu perigina vathavarana pramayam prathi Manishi Medha mikkili ekkuvuga undunu.
ReplyDeleteఅచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు
ReplyDelete