Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, July 21, 2020

Bharatavarsha 12

భోజనములు ముగిసి అందరూ రహదారిపై నడక సాగించు చుండిరి. రాత్రి పది గంటలు అయినది. బుచ్చమ్మ , సర్రాజు లను దామిని తన రధము నందు తోడ్కొని పోయెను.   మంజూష , తల్లి మరియు స్నేహితురాండ్రతో గూడి నడుచుచుండెను. బసవడు, భారతవర్ష పంచెకట్లలో నడుచుచుండ, అగస్త్య  రాఘవ కలిసి నడుచు చుండిరి. రాఘవ తోపాటుగా  అతడి మిత్రులు బైరిరెడ్డి , సందీప్ చౌదరి కూడా నడుచుచుండిర.  కేశవ కూడా తెల్ల పంచె కట్టు కొనెను.  పదే పదే జారిపోవుచుండుటవల్ల , కేశవుడు కార్యక్రమము అయినా పిదప పంచెను లుంగీ వలె కట్టుకొనెను. మృదంగము పట్టుకొని వారి వెంట నడుచుచుండెను. రాఘవ కేశవుడు తనప్రక్కన మృదంగముతో లుంగీ ధరించి నడుచుట చూచి వీని వాలకము తట్టలుమోయు వానివలె నున్నదని తన ఇద్దరి మిత్రులు తో మెల్లగా చెవిలో జెప్పెగా వారు వారు నవ్వి కేశవునితో విడివడి నడుచుచుండిరి. అది బసవడి కంట పడెను.  “త్రి చక్ర వాహనంలో పోయెదము ఈ రాత్రి సమయమందు నడుచుటెందులకు” అని మాలినిగారు అనగా స్త్రీలందరూ అట్లే అనిరి. “మన  వాహనమున్నచో బాగుండెడిదికదా” యని బసవడనెను. 

మంజూష "త్రిచక్రవాహనమేమికర్మము నీకొడుకు  కారుని రప్పింపగలడు.  తెలుగు ఉపన్యాసకునిగా బాగానే జీతమందుకొనుచున్నాడు కదా" అనెను. "అయినచో త్రిచక్రవాహనమునేమి జేసినారు అని అగస్త్య అనగా, “నీకొరకట్టే బెట్టినాడు” అని కేశవుడు  చమత్కరించెను. ఇంతలో ఒక కారు వారికి లభించెను అది భారతవర్ష పనిచేయుచున్న కళాశాలకి చెందినది. ఆ కారులో స్త్రీ లందరు సర్దుకొనిరి. 

కారు వెడలిన తరువాత " మనమెట్లు బోవలెనని అగస్త్య అడిగెను.  “After lunch rest a while , after dinner walk a mile” నడుచుట ఆరోగ్య హేతువు అని తెల్లవాడు చెప్పెనుకదా వినలేదా యని రాఘవ అనగా అతడి మిత్రులిద్దరు సై  అనుటయేగాక తెల్లవాడి తెలివితేటలను మెచ్చుకొనిరి. "బాబులారా , మీకు జెప్పువాడను కాను గానీ, మీకు తెల్లవాడు జెప్పినవేకాని మన పెద్దలు జెప్పినవేమియునూ గుర్తుకురావా ?" అని ప్రశ్నించెను. దీనితో అహం దెబ్బతిన్న ఆంగ్లాను అనురక్తులు " ఏమైననూ చెప్పినచో కదా, గుర్తుకు వచ్చును అని వెక్కిరించుటయేకాక, మీకేమైననూ గుర్తున్నచో మీరు సందర్భోచితముగా చెప్పరాదా అని గెలిచేసిరి.  బసవడు, కేశవుడు  నీళ్లు నములు చుండ భారతవర్ష " భుక్త్వా శత పదం గత్వా , శయనేషు వామభాగంచ , ఔషధం కిమ్ప్రయోజనం " అని జెప్పి  ఎదురుగా వచ్చుచున్న వాహనమును నిలుపుటకు ప్రయత్నించుచూ ముందుకి కదిలెను  ఇది ఘోరం, స్వయముగా అవధానే దిగిన యెడల ఎట్లు అనివాపోయిరి. ఎవరునూ నిలపకున్నారే నేడేల వాహనములు పలుచబడినవి సమయమంత మించిపోయినదా! అని భారతవర్ష అనగా బసవడు "ఇదియునూ ఒకందుకు మంచిదే అనుకొని “నీవు వాహనముకొరకు విచారించవలదు మనము నడిచే వెళ్ళెదము” అనెను. అయిననూ భారత వర్ష వాహనముకొరకు ప్రయత్నించుచునే యుండెను. 

“ఆకాశం నిర్మలంగా నున్నది చక్కగా భోజనము జెసివుంటిమి నడుచుకుపోరాదా  వాహనముకొరకు ఈ అగచాట్లేల” అని కేశవుడనగా  సందీప్, బైరిరెడ్డిలు అంగీకరించిరి. భారత వర్షను ప్రయత్నములు విరమింపజేసి అందరూ కొంత దూరము నడిచిరి. అంతట రాఘవకు ఆయాసము మొదలయ్యెను " ఇక నేను నడువజాలను, వాహనము దొరకనిచో  నేను రాత్రి ఈ రహదారి ప్రక్కనున్న చెట్టుక్రింద  విశ్రాంతి తీసుకొందును." అని రాఘవ అనగా “ అచ్చట పాములున్నచో  శాస్వత  విశ్రాంతి అగునేమో?” యని కేశవుడనినంతనే " నీ నోట్లో శని ఉన్నది , చెట్టుక్రింద పడుకొన్నచో పాము పోటు  వేసిననూ వేయవచ్చు నేనీ దీపము క్రింద ఈ గట్టుపైన పడుకొందును” యనుచూ దీపముక్రిందనున్న గట్టుపైన చతికిలబడెను.  

బసవడు గెగ్గిలి కొట్టుచూ ఆంగ్లసాహిత్యమును వంటపట్టించుకొనలేదేమి తెల్లవాడు చెప్పినదేల తుస్సుమనెనని కేశవుని చిన్న చూపు చూసెనని అక్కసుతో ఎకసక్కెము చేయగా. కేశవుడు నవ్వెను , యు డోన్ మేక్ ఆ ఫైన్ పాయిం టాన్   ఇంగ్లిష్ లిట్రేచ యు ఆర్ డెన్సెస్ నింకంపూప్స్ అని రాఘవ చెలరేగిపోయెను” “నీవాడుచున్న మాటలకు నాకర్ధము తెలియకున్ననూ , నీవు మామ్మక్షేపించుచున్నావని అర్ధమగుచున్నది,  మాతృభాషనందు పాము కాటువేయునో , పోటువేయునో తెలియని నీవు మామ్మక్షే పించుచున్నావు” యని కేశవుడనెను  “కేశవుడు వానపామువలె నున్ననూ, నాగసర్పమువలె బుసకొట్టుచున్నాడు” అని బైరి రెడ్డి అనెను.  “తెలుగు సాహిత్యమంతయూ కలిసినా ఆంగ్లమున ఒక్క గ్రంధమునకు సరిరాదని రాఘవ నిష్ఠూరమాడగా భారతవర్ష కలుగజేసుకొని నీవు ఎవరోచెప్పిన మాటలు విని ఇట్లనుచున్నావు గానీ  ఆంగ్లమున నీకు  దెలిసిన కవులెవరు వారు వ్రాసిన గ్రంధములు లేవి , అవి ఏవిధముగా  తెలుగు గ్రంధములకంటే గొప్పవో తెలియజేయమనెను 

రాఘవలో తత్తరపాటు మొదలాయెను. ఏమియునూ తోచక షేక్స్ పియర్ ఊసెత్తగా భారతవర్ష నోరువిప్పకముందే జెఫ్రీ షాజార్  కాంట్రబురీ టేల్స్ అనెను.   ఇది ఆంగ్ల సాహిత్య చరిత్ర లో అత్యంత ప్రాముఖ్యతను కలిగినదిఅనిచెప్పెను. ఇది గ్రంథరాజమని నీవు భావించుచున్నావా ? నీవేమియునూ స్వంతగా చదివి ఆలోచించక ఎవరో చెప్పిన చిలకపలుకులు పునరుచ్చరించు చున్నావు. రెండు నిమిషముల లో మచ్చుకు రెండు కథలు టూకీ గా చెప్పుదును వినుము అని ఇట్లు చెప్పెను    

జెఫ్రీ షాజర్ కేంట్రబెరి టేల్స్ 24 కథల సంకలనం.  లండన్కు    90 మైళ్ళ దూరంలో ఉన్న సేంట్ థామస్ బెకెట్ (కేంట్రబెరి చర్చి)కు వెళ్లే 31 మంది తీర్ధ యాత్రికులు లండన్ లో టాబార్డ్ సత్రంలో బసచేస్తారు. కాలక్షేపం కోసం అందరూ ఒకొక్క కథ చెప్పాలని జెఫ్రీ షాజర్ ఒక కథల పోటీ పెడతాడు. నెగ్గిన వారికి బహుమతిగా తిరుగు ప్రయాణంలో ఉచితభోజనం లభిస్తుంది అని చెపుతాడు. ముప్పది మంది తీర్ధయాత్రీకులు ఒక్కొక్కరు నాలుగు కథలు ( వెళ్ళు నప్పుడు రెండు, వచ్చునప్పుడు రెండు) చెప్పునని తలచి 120 కథలు వ్రాయవలెనని భావించెను. 

కానీ ఇరువది నలుగురు మాత్రమే కథలు చెప్పిరి. ఇందు అసంపూర్తి కధలు కూడా కలవు. వంటవాడి కథ అసంపూర్తి కథ.  తాగిన మత్తులో గుర్రం మీద నుంచి క్రిందపడిపోడం వల్ల సగం కథే చెప్తాడు. ఈ కథను షాజార్ పూర్తి చేయలేదు.  కాంట్రబెరి కథలు  ఏదో సందేశాన్ని ఇవ్వాలనుకున్నా వెగటు  పుట్టిస్తాయి.  రెండవ సన్యాసిని కథ , వైద్యుడి కథ , యోధుడికథ.   


మొదటిగా వైద్యుడి కథని టూకీగా చెప్పెదను  వినుము అని "వర్జీనియస్ అనువాడు ఒక పెద్దమనిషి. అతని  కుమార్తె వర్జీనియాను, అందము చూసి ఎట్లైననూ ఆమె కావలెనని  అపియస్ అను ఒక గుణహీనుడైన న్యాయమూర్తి ఒక కుట్ర పన్ని  క్లాడియస్ అను నేరస్తుడిని భాగస్వమిని చేయును, క్లాడియస్ వర్జీనియా తన కుమార్తె అని చిన్నప్పుడు  అపహరించుకుపోయెనని న్యాయస్థానంలో తప్పుడుగా  చెప్పును. దుర్మాగుడైన న్యాయమూర్తి  వర్జీనియాను న్యాయస్థానం ముందుకి తీసుకురావాలని తండ్రిని ఆదేశిస్తాడు. తండ్రికి న్యాయమూర్తి కుట్ర  అర్ధంఅయ్యి ఇంటికిపోయి కూతురి తలనరికి న్యాయమూర్తికి ఇస్తాడు. ఇది కథ. ఇందు నీతి ?

క్రిస్టియానిటీకి పుట్టినిల్లు  రోమ్ అని కొందరు భావిస్తుంటారురెండవ సన్యాసిని కథ చదవటంవల్ల రోమ్ లో క్రిస్టియానిటీ ఎలా ప్రచారం చేశారో తెలుసుకోవచ్చుక్రిస్టియానిటీ రాక ముందు రోమన్ మతం అని వారిమతాన్ని వారు పాటిస్తుండేవారు. 13 శతాబ్దపు  క్రిస్టియన్ కన్వర్షన్స్  -   గురించి నన్స్ పడరాని పాట్లు పడుతుండేవారువారు ఇలాంటి కథలు చెబుతూ అమాయకులని కిరస్తానీ మతంలోకి లాగుతుండేవారు.  అని చెప్పి కాంట్రబురీ టేల్స్ కథలను చెప్పి వాటిని నీతికధలని అనుటకన్నా యూరకుండుట మేలు యని తరువాత భారత్ వర్ష  సెకండ్ నన్ కథను కూడా చెప్పగా   రాఘవ కి  అర్ధమగుటవల్ల మిన్నకుండెను. మిత్ర బృందం  కించిత్తు అయోమయమునకు లోనయ్యిరిఇంతలో ఒక త్రిచక్ర వాహనము వారికి లభించెను. భారతవర్ష  చోదకుని ప్రక్కన కూరోనెను , తక్కిన వారు వెనకన కూరోనిరివాహనము రహదారిపై సాగిపోవుచుండెను.   రాఘవ  బైరిరెడ్డి , సందీప్ లకు భారత వర్ష  భాష కొంచము కష్టము అనిపించగా బసవడు మీకర్ధమగు చలన చిత్ర భాషనందు నేను చెప్పెదనని ఇట్లు చెప్ప దొడిగెను

రోమన్ మగువ సిసిలియాకి వేలేరియన్ తో  కొత్తగా పెళ్లయ్యింది. ఆమెకు పెళ్లి అయిన తరువాత కూడా తన కన్యత్వాన్ని నిలిపుకోవాలనుకుంటుంది ( మరి అలాటపుడు  ఆమె పెళ్లి ఎందుకు చేసుకుంది ?) తొలిరాత్రి గదిలోకొచ్చిన భర్తకు నన్ను మోసగించనని చెపితే  నీకొక విషయం చెబుతాను అని అసలు విషయం చెబుతుంది.  విషయం తెలిసిన మొగుడికి ఫ్యూజులు కొట్టేస్తాయి. అప్పుడు చెబుతుంది చావుకబురు చల్లగా " నా కన్యత్వాన్నిఒక దైవదూత కాపాడుతుంటుంది , నా ఒంటిమీద చెయ్యివేస్తే నీ తలవ్రక్కలు అవుతుంది " అది విన్న మన వెర్రి వెంగళప్ప "  దైవదూతని నాకు చూబిస్తే నమ్ముతాను" అని వీడి పిలక తీసికెళ్ళి దాని చేతులో పెడతాడు .  ఇంతవరకూ బాగానే ఉందిగానీ .. ఇక్కడే పెళ్ళాం ఇస్తుంది అసలైన ట్విస్ట్. " నువ్వు మతం మారితేనే దైవదూత కనిపిస్తుంది అని. చెప్పెను కదా మనవాడు  అలాగే అని ఒప్పుకుని రోమన్ మతం వదిలి కిరస్తానీ మతం పుచ్చుకుంటాడు. వేలేరియన్ అనే వెర్రిపప్పకి ఒక తమ్ముడున్నాడు. వాడు దేశముదురు. వాడికి  ఒకరోజు  వీళ్ల  గది నుంచి మంచి సువాసన తగులుతుంది. ఏంటీ ?.... అని అడుగుతాడు. (ఇక్కడ పడుతుంది కథ , స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ... )   దైవదూత గురించి  మొగుడు పెళ్ళాం ఇద్దరు ( రెండు చెవుల్లో ) చెప్తుంటారు. తమ్ముడు అంతావిన్నాక  అయ్యబాబోయ్ ఇదా మీ స్కీం , బలే వేశారు స్కెచ్. అన్నా బీసెంట్ రోడ్డులో మీఇద్దరికీ చెరో సేంట్ బాటిలు కొనిస్తాను , కుదరకపోతే ఆన్లైన్ లో ఆడర్  పెట్టి కొంటాను.  మతం మారితే తెగల బెట్టేస్తారు(చంపేస్తారు) కదా ! అన్నాడు. (వార్నీ, నేను అడగలేకపోయాను వీడు భలే అడిగేసాడు అని మనసులో అనుకున్నాడు ) ఇప్పుడెలా  అన్నాడు అన్న. సిసిలియా సమస్యని నాకు వదిలేయండి,అది అస్సలు సమస్యేకాదు,మీరు రిలాక్స్ అయిపోండి అంది.  ఇక్కడే ఉంది  మరో ట్విస్ట్ఇప్పుడు ఇంటర్వెల్.                                                                          

ఇంటర్వెల్ తర్వాత అంతా సస్పెన్స్ తో చూస్తుంటారు " మరణించిన తరువాత నీకు మంచి జన్మ వస్తుంది " అని కన్విన్స్ చేస్తుంది. చనిపోయి దేవుని దగ్గరకి వెళ్ళిపోయినట్టు కల చూపిస్తుంది.  లటక్కని పడిపోతాడు. (ఇప్పుడు సిట్యువేషనల్  సాంగ్  .. దారి చూపిన దేవత ) పాటయిపోగానే తమ్ముడు మతం మారిపోతాడు. ఇప్పుడు  ఫెమలీ సెంటిమెంట్ సీన్.  అంతా  జూపిటర్ గుడికి వెళతారునేను జుపిటర్కి మొక్కను అని చెప్తారు ఇద్దరు అన్నదమ్ములు. రాజుకి కాలుతుంది. మాక్సిమస్ అనే తలారిని " వీళ్లిద్దరికీ తలతీసేయ్' అని ఆజ్ఞాపిస్తాడు. రాజు వెళ్ళిపోగానే,   సిసిలియా వాడికి వేరియేషన్ స్టార్లో వేరియేషన్స్ అన్నీ  చూబిస్తుంది. అయినా   వాడు లొంగడు అప్పుడు  బోధన (ప్రీచింగ్మొదలెడుతుంది.   తనలో ఉన్న అపరిచితుడిని చూబిస్తుంది. దెబ్బకి మాక్సిమస్, అతడి పేమలీ మొత్తం కన్వెర్ట్ అయిపోతారు. (ఇక్కడ గ్రూప్ సాంగ్ పెడితే బాగుంటుంది) ఆవిషయం తెలిసిన రాజు   సిసిలియా ని తలతీసేయమంటాడు. 

మూడు వేట్లు వేసినా తల పూర్తిగా తెగదు, సగమే తెగుతుంది. దాంతో తలారి వెళ్ళిపోతాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది . నాలుగో వేటు వేయడానికి లా ఒప్పుకోదు. తెగిపోయిన తలతో ఆమె ప్రీచింగ్స్ మూడురోజులు చేసాక ఒక్కసారిగా కళ్ళు నిలబెట్టేస్తుంది. కాస్సేపు  వైలన్ మ్యూజిక్ , కాస్సేపు వీణ మ్యూజిక్ , కాస్సేపు  వైలన్ మ్యూజిక్ , కాస్సేపు వీణ మ్యూజిక్, కెమెరా 360 డిగ్రీస్  గిరగిరా గిరగిరా తిరుగుతుంటుంది సినిమా అయిపోయింది అనుకుని ప్రేక్షలు లేచిపోతారు , అప్పుడు మొట్టమొదట చూబించిన శోభనం సీన్ చూబించి టైటిల్స్ పడతాయి .

ప్రేక్షకుల కళ్ళు చెమరుస్తాయి. కథ చెప్పుచున్నంత సేపూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఆలకించన మిత్రులందరూ నోళ్లెళ్లబెట్టేరు. భక్తి జ్ఞాన వైరాగ్యములొసగుటకు మతము మార్చుటకు కథలు అత్యంత ఆవశ్యకము    కథలు, పాటలు  లేనిచో  ఏమతము, భక్తి భావము బ్రతకజాలదుదేశభక్తి పెంపోందించవలెనన్ననూ , కథలో పాటలో కావలియును. మీలో చర్చికి పోవువారున్నారా యని అడుగగా సందీప్ చౌదరి , బరిరెడ్డి ఇద్దరు "పోయెదమని" సమాధానము చెప్పిరి. మతము మార్చవలెననా కథలు పాటలు లేక సాధ్యమగునా? అని అడుగగా వారు తెల్ల మొఖములు వేసిరి.

  
అదియే కదా జీవితము పై సాహిత్య ప్రభావమనిన. మనం ఎలాంటి సాహిత్యాన్ని ఆదరిస్తే  అలాంటి జీవితం మనకి లభించునన్న భారతవర్ష అన్నమాటలు నిజముకాదామీరు క్రీస్తు కథను ఆదరించగలరు అందులకే మీరు కిరస్తానీయులయ్యి  జీవించుచున్నారు.   నిస్సందేహముగా కథలను బట్టి భాష ఉందునుబైబిల్ కి ఒక భాష , చలచిత్రములకు మరొక భాష . ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ నచ్చునట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష  నచ్చునుకథలకు బదులు చలన చిత్రములను ఆదరించిన భాషకే స్పందిచగలమునేడాంధ్ర  దేశమున చలన చిత్రములు దావానలం వలె వ్యాపించినవి.

చలన చిత్రములు ఆంధ్రులకు ఉచ్ఛ్వాస నిశ్వాసముఅన్నచో ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. యోచించి జూచిన మీరు చలనములద్వారా సంక్రమించిన చెత్తను కావలించుకొ కొనియుంటిరన్న విషయము అవగతమగును. వాహనము ఆనంద నిలయమునకు  చేరెను. బసవ ,భారతవర్ష , కేశవుడు దిగిరివెళ్లి వచ్చెదనని జెప్పుచూ బసవడు వాహనమునందున్న బైరెడ్డి , సందీప్ చౌదరిలతో "చివరిగా ఒక్కమాట చలనచిత్రములు తిలకించు పామర మూకలలో నొక్క శాతమైననూ కావ్యములను, గ్రంధములను స్పృశించగలరా?" యని అని  పొరుగునే ఉన్న తన ఇంటికేగెనుభారతవర్ష , కేశవుడు ఆనంద నిలయంలోకి ప్రవేశించగా. మిగిలిన మిత్రులతోవాహనము ముందుకి కదిలెను.   

                 

7 comments:

 1. Nice sir. Everyday we can learn something new

  ReplyDelete
  Replies
  1. Now please give your complete feedback. you can see so many changes that occurred to characters. How is Bharatvarsha transforming the lives of people? Now the story jumps.

   Delete
  2. అరచి వోడెదము వగచి వోడెదము.అక్షరమును ఆయుధముగా చేసుకున్న గెలిచి తీరెదము.సాహిత్యమునకు కలదు బలము.
   భారతవర్ష ఒక విజ్ఞాన ఖని.తనకున్న అపారమైన జ్ఞాన సంపదతో జనులను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు

   Delete
 2. చాల బాగా చెప్పారు కధలు లేకుండా చలన చిత్రములే కాదు జీవితములైనను వ్యర్ధములే. కథలు, పాటలు లేనిచో ఏమతము, ఏ భక్తి భావము బ్రతకలేదు. దేశభక్తి పెంపోందించవలెనన్న కథల గురించి చాల బాగా చెప్పారు సార్ కథలు లేనిదె ఏది లేదు

  ReplyDelete
 3. Interesting facts learning from telugu novels wonderful writings si

  ReplyDelete
 4. ముసలిడైపాయిందని, ఆరోగ్యం చెడిందని.... మూల పడిందని తల్లిని మార్చుకోగాలమా? అలాంటిది తల్లి లాంటి మతాన్ని ఎలా మార్చుకుంటాం? అగ్నికి ఆజ్యం పోసినట్టు నేటి ప్రభువులే అధికార గర్వంతో మత మార్పిడులు ప్రోత్సహిస్తుంటే హిందూ సమాజం కోసం నేటి శివాజీ పోరాడుతుంటే చప్పట్లు కొట్టక అది ఎదో మహాపాపం అన్నట్టు చెంపలు వేసుకునే గొర్రెల్ని చీసే దుస్థితి వచ్చింది. ఏమి ఇది నా బారతమాత కి వచ్చిన కష్టము....!!

  ReplyDelete