భారతవర్ష కళాశాలకేగుటకు సిద్ధమగుచుండగా మంజూష వర్షునితో " అత్యవసర ముగా నేడు సబ్బవరం పోవలెను. నీవు తప్పక రావలెను." అని అన్న మార్గమునకడ్డముగా నిలిచెను "నీవు విదిష వద్దకు పోవుటకు, కూడా నేనెందులకు అమ్మ ఉన్నది కదా? పడతుల ఉత్సవములకు పురుషులు పోయిన ఎబ్బెట్టుగనే కాక దేశాతీతముగా నుండును. వలసినచో కేశవుని గొనిపొమ్మ"ని భారతవర్ష అనగా కేశవుడు " నేను సిద్ధమని చెప్పెను.
"విందు సమావేశమైనచో నిన్నెందుకు పిలిచెదను, అని చెప్పుచుండగా మంజూష చెప్పుచుండగా మాలినిగారు చొరకుని, " నాయినా! బైరెడ్డి మొన్న సభలో విదిషను జూచి మోహించి వారించిననూ వినక వెంటపడు చున్నాడు. అని చెప్పిరి. “పెళ్లాడనిశ్చయించుకొనెనట.” యని మంజూష చెప్పెను.
ఓ అటులనా సరి సరి విషయము అర్థమైనది ఇప్పుడు మనమిద్దరము “సబ్బవరం” బయలుదేరుచున్నాము. నా ప్రయాణమును రద్దు పరుచుకొందును. అట్లు వారిరువురు సబ్బవరం బయలుదేరిరి.
ఇరు వరు సబ్బవరం జెరుసరికి మధ్యాన్నమాయెను. బస్సు దిగి వారు విదిష ఇంటికై నడుచు చుండిరి. అట్లు కొలది సేపు నడిచిన పిదప వారొక మట్టి దారి చేరిరి చిన్న పల్లె లో మట్టిదారి యందు నడక. కొద్దిసేపు నడిచిన పిదప పొలములందు నడవసాగిరి. విదిష ఇల్లు పొలములో పొదరిల్లువలె నున్నది. చుట్టూ పచ్చని ప్రకృతి , కొండలు బాగుగానే యున్నవి కానీ బస్సు దిగి కొంచెము దూరము నడువవలెను అని మంజూష అనెను. వారిరువురు ఇల్లు చేరిరి. వారిని కలుసుకొనుటకు బయటకు వచ్చుచుండెను. " విదిష బయటకు వచ్చు చున్నది నీవు స్థిమితముగానుండుము నేను మెల్లగా సమస్యను తెలుసుకొని తగువిధముగా బైరెడ్డికి నచ్చ జెప్పు విధమును, వినకున్న బుద్ధి జెప్పు విధమును యోచించెదను." అని మంజూష చెవిలో చెప్పెను.
లంగావోణీలో ఎదురొచ్చి విదిష వారికి స్వాగతము పలికెను. విదిష తల్లి అహల్యగారు కూడా వెంట యుండి రండి రండి అనుచూ కాళ్ళుకడుగుకొనుటకు నూతివద్ద స్థలమును చూపిరి. అరటిచెట్లు , వాటిపక్కన నాపరాళ్ళు , గోలెము నందలి నీరు కనిపించెను . కాళ్ళు కడుగుకొనుచు భారతవర్ష ఇంటిని చూసెను, పెంకుటిల్లు అయిననూ పెద్దదే, బహు విశాలముగా నున్నది, మాఇంటికంటే మీ ఇల్లే బాగున్నదనెను. తరువాత మంజూష కూడా కాళ్ళు కడుక్కొనగా వారిరువురు లోపలకి ప్రవేశించిరి విశాలమైన మండువా గది నందు ఒక పొడవాటి చెక్క బల్ల పై అన్న చెల్లెళ్ళనుకూర్చొనబెట్టి విదిష లోపలి బోయెను. అహల్యగారు కాపీ ఇచ్చిరి.
ఇంతలో విదిష ఒక చిత్రపటమును తీసుకొనివచ్చెను. అది భారత వర్ష సాహితీ రూపక సభనందు వీణ వాయించు చున్న దృశ్యము. పంచె కట్టులో వీణావాయించు భారత వర్ష ముఖ కవళికలు అద్భుతముగా చిత్రించెను. ఈ చిత్రమును చూచి మాటరాక చకితుడై చేష్టలుడిగిన భారతవర్షను “చిత్రమెట్లున్నద”ని యడుగగా " చిత్రముత్తమము, చిత్తమత్యుత్తమని ఆశువుగానొక పద్యమును చెప్పెను. ఆ కందపద్యమందందమంతయూ మంచి గంధము పూచినట్లయ్యి విదిషకు వేదాశీర్వచన అనుభూతిని కలిగించెను. మధ్యాన్నసమయ మయినందువల్ల సంధ్యావందనము చేయవలెనని చెప్పి భారతవర్ష బయటకు పోయి ఋగ్వేద సంధ్యావందనమొనర్చి వచ్చెను. విదిషకిదంతయూ కొత్తగా దోచుచున్ననూ, మంజూషకిదంతయూ పాతయే" సంధ్యావందనము అన్నగారి నిత్యకృత్యమని వింతగా చూచుచున్న విదిషకు చెప్పెను సంద్యావందనము మధ్యాన్నాము ఎన్ని గంటలకు చేయవలెనని అహల్యగారు అడిగిరి “సూర్యోదయమైన 12 ఘడియలు తరువాత చేయుట ఉత్తమము.” అని భారతవర్ష జెప్పెను.
పిదప విదిష మంజూష ,వర్షలను తన గదిలోకి తీసుకుపోయెను ఆ గదియందు వివిధ పరిమాణములలో అనేక చిత్రపటములున్నవి. అది మనసుని ఉల్లాసపరుచు సుందర కళాలోకము. "ఎప్పుడు నేర్చినావు? ఈ కళ ఎక్కడదాచినావు? అని భారతవర్ష అడుగుచూ ఒక చిత్రము వ్రాయుటకు ఎంత సమయము తీసుకొనెదవు?" అని అడిగెను, రేఖాచిత్రములకు ఎక్కువ వ్యవధి అక్కరలేదని, కొద్ది నిమిషములు నుండి గంట వ్యవధి చాలునని చెప్పి చిన్న బొమ్మలైన ఒక రోజు , పెద్దవైన వారము రోజులు సమయము కావలెనని చెప్పెను. " వారం రోజులా , అంత వ్యవధి కావలెనా !" అని మంజూష అనగా వారంరోజులు వర్ణ చిత్రములకు చాలా తక్కువ సమయము. పూర్తి నిడివి చిత్రములకు తైలవర్ణములద్దుటకు నెలలు కూడా సరిపడవు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు డావించి మోనా లిసా ను చిత్రించుటకు పట్టినకాలము నాలుగు సంవత్సరములు. గొప్పచిత్రకారులెవ్వరు ఇంత త్వరగా చిత్రములను వ్రాయలేదు. సార్జెంట్ అను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికా చిత్రకారుడు గౌత్రో అను అందాలరాశిని చిత్రించుటకు రెండు సంవత్సరములు చాలా అవస్థలు పడెను.
సార్జెంట్ కళానైపుణ్యత నంతయునూ ఒక్క వాక్యమున జెప్పు గొప్ప చిత్రమది. ఒక్క సారి కాక, ఒక వ్యక్తిని అనేక సార్లు కూర్చుండబెట్టి సుదీర్ఘ సమయము చిత్రించుచుండిరి. కాలు చెయ్యి కదప మెడ త్రిప్పక కూర్చొనుటవల్ల వడలు వాచి మెడలు పట్టి తిమ్మిరులెక్కిది. ఆమె ఒక అత్యంత ధనికుడైన వ్యాపారవేత్త భార్య . సార్జెంట్ ఆమె అందమును తనకళాప్రదర్శనకి ఆలంబనముగా జేసుకొనెను. ఒక ఉమ్మడి మిత్రునిద్వారా ఆమెను ఒప్పించి ఆమెను విప్పించి, అనేక రేఖా చిత్రములు గీసిన పిమ్మట ఆమె అసలు తైలవర్ణ చిత్రమును రెండు సంవత్సరముల పాటు గీసి ఆమె ఎవరో తెలియజేయక గోప్యతగా నుంచుటకు Mme *** అని వ్రాసెను. ఆ చిత్రము మదాం ఎక్స్ గా నేటికీ చరిత్రలో నిలిచిపోయెను. మాన్హాటన్ మ్యూజియం లో నున్న ఆమె చిత్రమును శృంగారభరితముగా నున్నదని ఆమె కుటుంబీకులు అభ్యంతరము చెప్పి చిత్రమును వెనుకకు ఇవ్వవలసిందిగా కోరారు. నిజానికా చిత్రము నందు ఆమె నల్ల గౌను ధరించిన పాలరాతి బొమ్మవలె నున్నది. కేవలము భుజముమీదనుండి అతి సన్నని గౌన్ తాళ్లు తప్పుకొని ఉన్నవి.
"ఆమె ధరించిన దుస్తులు, ఆమె రూపము రెండింటి యందు తన ప్రమేయమేమున్నదని" సార్జెంట్ రాజీలేని పోరుసాలిపి తన రెండు సంవత్సరముల కష్టమును నిలుపుకొనెను. అనిన చిత్రకారులకు , రూపసి యైన కోమలాగులకు కాముకుల నుండి బెడద ఎకాలమునైననూ తప్పలేదు. నీవు రూపసియైన చిత్రకారిణివి. నీకునూ ఈబెడదలు తప్పవు. అని చెప్పెను. అడగకనే వృత్తిలో ఇక్కట్లు సాధారణమని చెప్పి పండితస్ఫూర్తితో చక్కగ అనునయించాడు అనుకుంది విదిష. అహల్యగారు ఎంత వద్దని వారించిననూ వినకుండా విస్తళ్ళు వేసి భోజనాలు వడ్డించి మొహమాట పెట్టిరి . భోజనాలు చేయుచుండగా "చిన్నప్పుడు మీరంతా ఒకే బడిలో చదువుకొనుచుకలిసి మెలసి ఆడుకొన్న ఆరోజులు ఇంకనూ నాకళ్ళ ముందు ఇంకనూ కదలాడు చున్నవి." అహల్యగారు కుటుంబం గురించి చెప్పు చుండిరి. " పేదకుటుంబం బాబూ పెద్ద చదువులు చదివించుకోలేమని, పదవతరగతి పాసవ్వగానే చదివినంత వరకు చాలని తానే ఆపేసి అని చెప్పుచుండగా విదిషకు బల్లి ప్రాకినట్లఅయ్యి "అమ్మా ఆవిషయములు వారికి తెలిసినవే కదా, ఎందుకు భోజనములు వద్ద మరల ఆ ప్రస్తావన చేసెదవు." అనెను. "బాగానే ఉన్నది నీవరస , నన్ను చెప్ప నివ్వవే" అనిరి అహల్య గారు. " నీకు బాగానే ఉండును విను వారికే కష్టముగను " అని విదిష అనుచుండగా వర్షుడు " తనని చెప్పనమ్ము , మాకేకష్టము లేదు." అని అనెను మంజూష వర్షునితో ఏకీభవించెను. అహల్య గారు ఒక నిత్తూర్పు విడిచి కొనసాగించిరి. తనకు నచ్చిన చిత్రకళను ఆధారంగా చేసుకుని లతలా ప్రాకుతోంది ఈ పిల్ల. ఈ చిత్ర కళ లో పడి పిల్లకి ఈడొచ్చిన సంగతి మరచితిమి . అయిననూ ఇట్టి సంఘటనలు జరిగి మా బాధ్యతను మాకు గుర్తుచేయుచున్నవి. అని చెప్పుచుండగా వర్షుడు " విదిష మీ నాన్నగారు కనబడరు, ఇంటిలో లేరా ? అని భారతవర్ష అడిగెను. ఒక సంవత్సరం నుంచి కూలీలని పురమాయించి పండ్లతోటలలో పండ్లు కోసే పని చేయిస్తున్నారు. ఇప్పుడు వరంగల్లు లో జామతోటల లో పని ఉండి వెళ్లారు. అన్నది విదిష .
భోజనానంతరం భారత వర్ష " బైరెడ్డి ఏమనుచున్నాడు, అతడివలన నీకొచ్చిన ఇబ్బంది ఏమి ?" అని అడిగెను. సాహిత్య రూపకం రెండు రోజుల తరువాత మా ఇంటికి వచ్చి నాచిత్తరువు వ్రాయమని అడిగెను. " అట్లే యని రెండు రోజులు లో వచ్చి డబ్బు ఇచ్చి చిత్రమును తీసుకొని పోయెను. తరువాత తన అక్క బావగారితో వచ్చి మరొక చిత్రమును వ్రాయించుకొనెను. వారము తిరగకముందే మరలా మరొక చిత్రము కొరకు వచ్చెను అప్పటివరకు అతడు చిత్రములకొరకే వచ్చు చున్నాడని అనుకొంటిని. కానీ నా కొరకు వచ్చుచుండెనని అప్పుడర్ధమయ్యెను. అనెను " వచ్చి ఏమనెను? అందరూ చెప్పుమాటలే ఇచ్చకములాడుచూ నిన్ను ప్రేమించు చున్నానని నీవు లేనిచో బ్రతక జాలనని పెండ్లాడేదనని చెప్పుచున్నాడు" అనెను. "కుర్రవాడు మధ్యతరగతి కుటుంబమైననూ చూచుటకు బాగానే ఉన్నాడు రెడ్డి కులస్తుడని చెప్పినాడు." అని అహల్యగారనిరి. మరి అభ్యంతరమేమున్నది, ధనహీనుడనా ? అని భారతవర్ష విదిషను అడిగెను విదిష ధనహీనుడగుటవల్ల కాదు గుణహీనుడగుటవల్ల అని విదిష చెప్పగా అదినీకెట్లు తెలియున అసలు బైరెడ్డికి మీ ఇల్లు ఎట్లు తెలిసెను? వానికి చిరునామా ఎవ్వరిచ్చిరి? అని అడుగగా "నేనే ఇచ్చితినని, మరుసటిరోజు వచ్చి విదిష గురించి తెలుసుకొని ఎంతో ఉదారంగా పేద కళాకారులను ఉద్దరించువాడివలె మాట్లాడెను చిత్రపటము వ్రాయించు కొందునని చిరునామా అడిగెను. నాకు కూడా విదిషకి చెప్పిన మాటలనే జెప్పినాడు." మంజూష చెప్పెను.
“ఈ ఆషాఢభూతిని ఏమనవలెను?ఈ విషయము విదిషవాళ్ళ నాన్నగారికి చెప్పినారా?" అని వర్షుడు అడుగగా అహల్యగారు "ఆయన ముక్కోపి ఆయనకి జెప్పినచో ఇంటిపై గొడవకుబోవురకము అందుకే చెప్పలేదు” అనెను. విదిష “నాపేదరికమును అలుసుగా తీసుకొని నాతొఆటలాడు చున్నాడు” అని వాపోవుచుండెను. వర్షుడు అప్పుడు "లిప్పి అనే ఇటలీ దేశపు చిత్రకారునికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా, చర్చ్ లో పెరిగినాడు. నీవలె అతడుకూడా తనంతట తానూ చిత్రకళను అభ్యసించాడు. అదిజూసి ఆచర్చ్ వారతనిని బడికి పొమ్మని తరమక వదిలి పెట్టిరి. అతడునూ నీవలె అద్భుత చిత్రములను గీయు చుండెడివాడు. 16 ఏండ్ల వయస్సులో సముద్రదొంగలు అతనిని ఎత్తుకుని పోయి బానిసగా ఉంచుకొనిరి. అతని బొమ్మలు చూసి వారు పరివర్తన చెంది లిప్పిను వదిలి పెట్టిరి. నీవు అంతకన్నా పేదరాలవు కాదు అంతకన్నా కస్టాలు నీకు రాలేదు. ధైర్యముగా ఉండుము". అని విదిషకు ధైర్యము చెప్పుచుండగా “కానీ వాడు పోలీసులకేసు పెట్టునని మా అమ్మ చెప్పుచున్నది.” అని విదిష చెప్పెను అదివిని భారత వర్ష ఖంగు తినెను.
నేను పోయి రాఘవతో మాట్లాడిన ఈ సమస్య సమసి పోవును. మీరు విచారించవలదు అని చెప్పి బయలుదేరుచుండ మంజూష గోడపైనున్న చిత్రమును అన్నయ్యకి చూపెను. “ప్రపంచ ప్రఖ్యాత అదృశ్య ఇంద్రజాల ప్రదర్శనా చిత్రమిది.” అని విదిష అనెను. నిజమా అని మంజూష అనుచుండగా "అవును ప్రాచీన ఇన్ద్రజాలికులు
చేసే గారడీ విద్య. ఒక బుట్టనుండి పామువలె లేచి నిలిచియున్న త్రాటిపై ఎక్కి కుర్రవాడు అదృశ్యము అగును. మాపూర్వీకులు ఈ విద్యలో ఉండిరని మా అమ్మమ్మ చెప్పెను." అని విదిష అనెను. "మీ అమ్మమ్మ భవిష్యత్తు చెప్పనని ఆమెకు భవిష్య వాణి పలుకునని వినియుంటిని" అని వర్ష అడగగా అహల్య గారు " ఆమె యోగ సాధనము ధ్యానము చేయును. దేవత అగుపడి భవిష్యత్తు తెలియజేయును. ఆమెను ఇంటితో సహా కాల్చివేసిన తరువాత నేను సాధన చేయుచున్ననూ ఆమెవలె ప్రశ్నలకి సమాధానం చెప్పుట మానివే సితిని. అని అహల్యగారు చెప్పిరి.
unexpected twists. still very interesting.
ReplyDelete
ReplyDeleteప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్రపటాలను వాటిని గీచిన కళాకారుల వివరాలను పొందుపరిచారు.చిత్రకారుల కష్టాలను చాలా బాగా వివరించారు
కలదు కష్టము ప్రతీ వృత్తియందు
కూటి కోసం కోటి విద్యలందురు
కానీ కళలు కూటి కోసం మాత్రమే కాదు మనస్సు తృప్తికోసం
I agree with you, Art is for self satisfaction , inner fulfilment. Your comment are part of this epic
Delete
ReplyDeleteబైరెడ్డి కథ ఎక్కడి దాకా వెల్లునో అని ఆసక్తిగా ఉంది
The twists in the novel is great sir
ReplyDeleteలిప్పి ఉదాహరణగా, ఒక సమాచారంగా ఇలా రెండు విధాలుగా చెప్పడం మీకే చెల్లింది గురుగారు....మీ వర్ణనతో ఒక కొత్త లోకాన్ని చూస్తున్నాం. ధన్యవాదాలు
ReplyDelete