Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, July 9, 2020

Bharatavarsha Lakuma - Bairreddy- 2

విశాఖపట్నం - జగదంబ

విశాఖపట్టణ కేంద్ర స్థానమగు జగదాంబ కూడలి వద్ద ప్రపంచ ప్రతిష్టాత్మకమై, సర్వ లౌకిక కేశాలంకరణ చిహ్నమైన (గ్లోబల్ హెయిర్ డ్రెస్సింగ్ బ్రాండ్) టోనీ అండ్ గై యను  కేసకర్తన శాల (సలూన్) అందమునకు చిహ్నమైన ఐరావత శోభను పుణికి పుచ్చుకొనిఅచ్చటికి విచ్చేయువారి కన్నులను వెలిగించుచుండెను 

 మంద దీపోపచార  ( డెకొరేటెడ్ విత్  డల్ లైటింగ్)  విశాల మందిరము,  దార్వ ఉత్కీర్ణ ప్తిరూప (కార్వ్డ్ వుడెన్ పేటర్న్స్) రసాలంకారములతో, వర్ణపత్ర రూప లావణ్యముతో ఇంద్రుని వజ్రాయుధపు తళుకుని  చంద్రుని  బెళుకుని  కొని పాలపుంతకే పులకింతలు కలిగించుచుండెను. 

మోహిని మరో రూపమువలె నున్న యా  కేశాలంకరణశాల  యందు, శృంగార విదుషీ మణులు కేశాలంకరణ,  ముఖాలంకరణ చేయించు కొనుచుండిరి.  

లకుమ తన స్నేహితురాండ్రు, సంధ్య, హేమలతో కలిసి అలసట ఎరుగని ఆ వాతానుకూల మందిర మందు, దర్పణముల ముందు ఆవర్తమాన ఆసన మందు కూర్చొని ముఖ కేశ  సౌందర్యమును  చూచి ముచ్చట పడుచుండిరి.  

వారెల్లరూ నీలి బిర్రబిగుతు స్యూత ఉరూకములు (జీన్స్ పేంట్స్)  ధరించిరి.   అచ్చోటికి  కొందరు  తమ పిల్లతో మరికొందరు శునకములతో  వచ్చి తమ వంతు కొరకు వేచి చూచుచుండిరి. శ్రావణి ఆమె స్నేహితురాండ్రు సుధ, జయతో వచ్చెను, ఇది కుబేరమందిరమువలే నో లేక మయసభవలెనో యున్నది తప్ప  కేసకర్తన శాల (సలూన్)  వలె లేదని  శ్రావణి అనెను.  "సంపన్నులు వేంచేయు  ప్రసాద గృహము(బ్యూటీ పార్లర్ )లకు అలంకరణే ప్రాణము."అని దీప నవ్వుచూ చెప్పెను. సంధ్య జుట్టు కురచ చేయించుకొనెను, హేమ ఉంగరములు తిప్పించుకొనెను. లకుమ పింగళ వర్ణమబ్బునట్లు స్వేతన (బ్లీచ్) గావించుకొనెను. అట్లు అందరూ ఆధునిక  కేశాలంకరణ గావించుకుని జుట్లు విరబోసుకొని బొట్లు లేని ముఖములతో బిర్రబిగుతు స్యూత ఉరూకముల (జీన్స్ పేంట్స్) లో  బైటకు వచ్చిరి. వారిని చూచిన పెద్దలు "హరి హరీ!  ఇది ఏమి ఆధునికత! "యనుచూ ముక్కున వేలిడి సాగిరి.  

చెంతనున్న మరొక త్వచోత్కిరణ (పచ్చబొట్టు) మందిరములో కొందరు పడుచులు  వివిధ కళాకృతులను తమ శరీరములపై  వ్రాయించు కొనుచుండిరి.  లకుమ తన స్నేహితురాండ్రతో అచ్చటాగి నాకునూ ఇట్లు పచ్చ బొట్టు పొడిపించుకొనవలెనని యున్నది.  కానీ మాయింట ఊరుకొనరు అని వాపోయెను.  శ్రావణి ఊరువులపైనా , జయ స్తనములపైనా , సుధ పిరుదులైన  పచ్చబొట్లు పొడిపించుకొనిరి. 

పిదప వారందరూ ఆ ప్రక్కనున్న  పండ్ల రసములమ్ము అంగడి వద్ద కు జేరిరి. 

సంధ్య అందరికీ ద్రాక్ష రామునిమ్మని జెప్పగా   "పండ్ల రసములు త్రాగుటకు పిల్లలమా" అని సుధ నవ్వెను. “నీ విచ్చటికి వచ్చిన ఉద్దేశమేదియో  జెప్పుమ”ని హేమ అనెను. “వసతిగృహము నుండి మనకు బయటకు వెళ్ళటకవకాశములరుదు. అందుచే అచ్చట దొరకనివి తాగవలెను కదా" యని సుధ అనెను.

 మనకు వసతి   గృహమందు దొరకని పానీయమేదన”శ్రావణి అడిగెను. అందరు  లకుమను  అడుగుటకు    నిర్ణయించుకొనిరి ఆమె వడిగల వాడిగల  ఆధునిక యువతిఆమెఏమిజెప్పునోచూచెదమ”నిసంధ్యఅనెనుబాదంపాల"ని లకుమ ఠక్కనిజెప్పగా అమ్మాయిలందరూ పగలబడి నవ్వినారు. 

శ్రావణి “అది ఎదో చూపెదను. తెగువగల  వారు  నాతో రండు.  నేను కొనిపోయెదననుచూ విసవిసా నడవసాగెను. లకుమతో సహా అమ్మాయిలందరూ ఆమెను అనుసరించిరి. వారిని చూచి లంగా ఓణీ ధరించిన పదాహారణాల తెలుగుపడుచొక్కతె   "బిర్రబిగుతు స్యూత ఉరూకములు (జీన్స్ పేంట్స్)  ధరించిన  నారీమణులు బజంత్రీ మేళమువలె ఆంగ్ల సంస్కృతికి హారతులిచ్చుచూ  ఎచ్చటికి సాగుచుండిరి?అని హాస్య మాడెను. "ఆవకాయ జాడీ వచ్చెనండీ ఆక్షేపించుటకు !" అని హేమ అనగా   "ఏ దుస్తులుధరించిననూ మేము నీకంటే కళగానే ఉన్నాము." అని సుధ అనెను. 

"అవునే అందరూ బొట్టులేని ముఖములతో బ్రహ్మ జెముడు మొక్కల వలే  కళకళ లాడుచున్నారు." అనుచూ లంగా వోణీ ధరించిన పదహారణాల తెలుగమ్మాయి పూర్ణిమ చురక వేసెను. 

 


అందరూ అట్లు నడుచుచుండిరి 

ఆమె ఒక సన్నవీధిలోకి ప్రవేశించెను. అమ్మాయిలంతా ఆమె వెనుకే నడుచుచుండిరి. శ్రావణి ముందుకి సాగి పానశాల ముందాగెను.  యువతులందరూ  మ్రాన్పడి చూచుచుండిరి. శ్రావణి వారి  వైపు కోపంగా చూచుచూ  "త్వరలో ఇంజినీరింగ్ చివరి  సంవత్సరంలోకి వెళ్లుచున్ననూ ఇంత  చిన్న విషయమునకు భయపడు చున్నారు  సిగ్గులేదా? మరల  మీరే వీర వనితలవలె మాట్లాడుచుందురు. ప్రవేశించవలెనన్న తెగువ కావలెను ” అనెను. ఆవకాయ జాడీలకు ఆ తెగువ ఎచ్చటనుండి వచ్చును? అని హేమ అనెను. పూర్ణిమ లోనకు ప్రవేశించెను. తక్కిన వారు బిలబిల మని లోనికి ప్రవేశించిరి. వారి ముఖములు పాలిపోయినవి   పూర్ణిమ వారి వైపు చూచి నవ్వెను 

అచ్చటనే మరొక  బల్ల వద్ద కూర్చొన్నవారిలో  ఒకడు గోతాము గుడ్డ పంటలాము వంటిపై పెట్టి కుట్టెనా యన్నట్లు న్నది. ఈ పంటలాము విప్పుచున్నప్పుడు చిరిగిపోవునేమో" అనెను . అందరూ పక్కున నవ్విరి  లకుమ వారి వైపు కోపముగా చూచెను.  ఆమె ముఖమున కందిగింజంత  ఎర్ర  బొట్టు కనిపించుచున్నది. సంధ్య ఆమె బొట్టువైపు తేరిపార చూచుచుండగా   లకుమ దానిని పీకి పారవేసి నల్లని చిన్న పెసరగింజంత అంటింపు బొట్టును జేబులో నుండి తీసి పెట్టుకొనెను. 

"  పూర్ణిమ  ముఖమున చిట్టి చామంతి పరిమాణములో ఎర్రని బొట్టు కనిపించెను. ఆమె ముళ్ళ కంపల మధ్య  బంతి పువ్వు వలె సాతానుల మధ్య అప్సర వలెకనిపించెను. హేమ  ఆమె ముఖమున బొట్టును పీకివేయుచుండగా పూర్ణిమ ఆమె చేతిని బలముగా తోసివేసెను.  "లకుమ తన బొట్టును ఎట్లు తీసివేసినదో చూడుము. నలుగురితో పాటు మనమూ  ఉండవలెను.  ఆధునిక భావములున్న పిల్లలు బొట్లు పెట్టుకొనుట నగుబాటుగా ఉండున"ని  సంధ్య  పూర్ణిమకు హితవు పలికెను.

"సంధ్య  జోసెఫ్!!! మొగుడు పోయిన విధవరాలు బొట్టు తీసివేసిన చాదస్తమగును, అదే మతం మారి బొట్టు తీసివేసినచో  ఆధునికత అగును, అంతే  కదూ!  అని పూర్ణిమ అనగా  తనను పూర్తి పేరుతో పిలుచుట తో హతాశురాలైన పల్లవి  పూర్ణిమ గొంతు లో వ్యంగంచూచి సరైన సమాధానం దొరకక తల్లడిల్లెను.  "నా పూర్తి పేరు తెలుసుకొంటివి సరే! ఇప్పుడు చెప్పవలసిన పనేమికలద"ని సంధ్య  మండి పడెను. "దాచవలసిన అవసరము మాత్రము ఏమున్నది అని పూర్ణిమ చల్లగా బదులిచ్చెను. 

"బొట్లు, ముగ్గులు  వ్రతములు ఉపవాసములు అన్నియూ మూఢనమ్మకములే!  ఆంగ్ల విద్య వచ్చి భారతీయుల్ని బ్రతికించగా మీ  సనాతన వాదులు ఇంకనూ  మూఢనమ్మకములతో చంపుచున్నార"ని హేమ  పూర్ణిమను ఎద్దేవా చేసి "నీవు లకుమ వంటి ఆధునిక యువతివి ఎన్నడూ కాలేవు." అనెను.  

 "2016లో జపనీస్ శాస్త్రవేత్త  యోషినోరి ఓహ్సుమి, ఉపవాసం  ద్వారా  శరీరం  అనవసర కణాలను తినే  విధానం (ఆటోఫాగి )పొంది ఆరోగ్యం చేకూర్చుకొనునని  నిరూపించి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకొనెను.  మూఢనమ్మకమన్న ఇదేనా?  అని పూరిమ చు ర్రని   చూచుచూ అనెను.     

పూర్ణిమతో   వాదించుటకు తగిన విషయజ్ఞానము వారివద్దలేదని గ్రహించిన  "పూర్ణిమ పనికి మాలిన సంప్రదాయములని పట్టుకొని వేలాడు  గబ్బిలము. ఎడ్డెం అంటే తెడ్డెం  అను రకము అది ఆవుపేడ అమృతమని వాదించును.  దానితో వాదన అనవసరం" అని సుధ, హేమ  పరిస్థితిని చక్కజేసిరి. 

ఆవుపేడపై అమెరికా హక్కులు ( పేటెంట్) తీసుకొన్నదెందుకో?   ఎరువులలో భవన నిర్మాణ పదార్ధములలో  ఆవు పేడను విరివిగా వాడుచున్నారు.    ఆ విషయము మీకు తెలియదు. పరీక్షకు ముందు అత్యవసరమగు ప్రశ్నలను మాత్రమే  చదువు మీరు నిజమైన గబ్బిలములు, నూతిలో కప్పలు.  నిజముగా ప్రపంచముగురించి మీకేమీ తెలియదని మీరు నోరు విప్పిన తెలిసిపోవును. ఇక లకుమ విషయము జెప్పవలెనన్న  లకుమ ఆధునికత అజ్ఞానమునకు పరాకాష్ట.  ఆధునికతకొరకు  మన సంస్కృతి సంప్రదాయాల నొదులు కొనుట కొయ్యకాలు కొరకు ఉన్న కాలు నరుకుకొనుటే!!  లకుమ మత్తులో జోగు సమాజమునకు ప్రతినిధి. నేను లకుమవంటి ఆధునికతను ఊహలలోకైననూ రానివ్వను అని పూర్ణిమ బదులు పలికెను.

"ఎందుకె నీకు మన సంస్కృతి సంప్రదాయములన్న అంత  మోజు అని హేమ  అడగగా  " అరువు తెచ్చుకున్న  ఆంగ్ల   సంప్రదాయములపై  కెందుకంత మోజు హేమ డేవిడ్ ? " అని పూర్ణిమ నిగ్గ దీసెను. "ఆంగ్ల విద్యతో ఎంత అభ్యున్నతి సాధించితిమి!  ఆంగ్లేయులు రాకున్నచో మన దేశము గతి ఎట్లుండునో యోచింపుము?" హేమ 

వారి పాలిపోయిన ముఖములలో  కత్తి వేటుకు నెత్తురు కానరాలేదు. కొలది సేపు అంతా  నిశ్శబ్దము అలుముకొనెను. 

అప్పుడు పూర్ణిమ నువ్వుచూ "నేను చెప్పుల దుకాణమునకు వచ్చితిని ఇంకనూ గృహోపకరణములు కూడా కొనవలెను. ఊరకనే  లకుమను కలిసిపోవుటకు వచ్చితిని. పోయివత్తునని పూర్ణిమ వెడలిపోయెను.

సంధ్య హేమ , శ్రావణి  అంతా ఊపిరి పీల్చుకొనిరి.  అందరూ బల్లపై డబ్బులు పెట్టుచుండగాఈ రోజు డబ్బులు నేనే చెల్లింతును అని సంధ్య  ప్రకటించెను.  హేమ "చిన్నపిల్లల వలే యున్నారే డబ్బు తిరిగి లోపల  పెట్టుకొనుడు. ఎవరైనా స్వేచ్ఛ తెచ్చినచో బల్లపై ఉంచవలె”ననెను. లకుమ జేబులోంచి  పొగౘుట్టల  (సిగరెట్ పెట్టెను) తీసి పెట్టి " ఇది అడుగుటకు నిత్యమూ ఇబ్బందిగా యున్నద”నెను.

లకుమ బిడియము చూచి  శ్రావణి నవ్వెను. అమ్మాయిలందరూ. ఆమెవలె నవ్వినారు. "ఇదేనా స్వేచ్ఛ?" అని పల్లవి అడిగెను.  అచ్చటి సేవకుడు పొడవాటి సీసాలు దెచ్చి   ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కటి బెట్టెను. శ్రావణి  ఒక్కొక్కటిగా మూతలనెగరగొట్టెను. సీసాలన్నీ తెరిచిన పిదప "మీలో ఎంతమంది “స్వేచ్ఛ” చిత్రమును చూచినారు?” అనడిగెను. లకుమ తప్ప అందరు అమ్మాయిలు చేతులెత్తగా సేవకుడు "నేను పది సార్లు చూచితిని" అనుచూ నవ్వుతూ వెడలినాడు.  

“లకుమ, నీవు సేవకుడి  వద్దనుండి నేర్చు కొనుట చాలా అవమానకరమ”ని పల్లవి ఈసడించెను. శ్రావణి. "నోరు మూసుకొనుము, వాడు ఏడుకొండలు, మన కళాశాల పూర్వ విద్యార్ధి.  గత సంవత్సరమె ప్రేమ కొరకు చదువు మాని ఇచ్చట జేరినాడు. మన మతడినిగౌరవించవలెన"నెను. శ్రావణి, హేమ బీరును చషకములలో నింపి అందించినారు. అందరూ ఉల్లాస నాదముతో (చీర్స్ చెప్పి) త్రాగుట మొదలుపెట్టిరి.

శ్రావణి  పొగగొట్టము (సిగరెట్టు) వెలిగించెను మిగతా అమ్మాయిలందరూ కూడా ఆమెను అనుసరించిరి. లకుమ  పొగచుట్టను పెదవుల మధ్య పెట్టుకొనగా   సంధ్య వెలిగించెను. హేమ లకుమ వైపు చూస్తూ “శ్రావణి వలయాలు ఊదుచున్నది. మనమునూ యత్నించెదమ”నెను రెండుసార్లూది భంగపడిననూ అనతికాలంలోనే హైమ సంధ్యలు విజయంసాధిం చినారు. లకుమ దప్ప అందరూ వలయములూదుచూ ఆనంద డోలికలలో తెలియాడిరి. “చలన చిత్రములందు రౌడీలు త్రాగుచుందురు. అదిచూచి ఎట్లుండునో అనుకొనుచుండెడిదానను.ఇప్పుడు దెలిసెన”ని లకుమదీర్ఘ నిట్టూర్పు విడిచెను.   గది పొగమయమాయెను.

“లకుమా నీకల ఏమి?” అని శ్రావణి అనడిగెను. “ఆమె తల్లి నటి. కాబట్టి ఆమె నటి అగును ఇంకేమి అగున?"ని హేమ అనెను. “చిత్రరంగమందు చేరవలెనన్న మధ్య ధూమ పానములు  ప్రాథమిక విద్యార్హతలు. ఆ పొగచుట్ట  నిటు దెమ్ము. ఎట్లు కాల్చవలెనో చూపెదనని దీసుకొని సుధ   పొగను వలయాకారంలో వదులు చుండెను. "ఓహో!  మొదటిసారి సుధ పెదవులు విప్పెను. ఆమెకు నాలుక కూడా యున్నదే !" అని  శ్రావణనెను.

నాకు చెలికాడు కూడా ఉన్నాడు. కానీ నేను మీ వలె ముదర బెండకాయ మాటలు జెప్పక చల్లగా పనులు కానిత్తున"ని సుధబదులిచ్చెను. ఆ దేశముదురును జూచి నేర్చుకొనుడని హేమ అందరికి హితవు పలికెను. అది విని శ్రావణికి మండెను. ప్రియుడి విషయంలో శ్రావణి, గాయత్రి మధ్య గొడవ జరిగెను.  “ప్రియుణ్ణి  కలిగి ఉండటం గొప్ప విషయమా? నేతలుచుకున్నచో  వచ్చే వారం పది మంది అబ్బాయిలు నావెనక ఉందుర"ని  శ్రావణి సవాల్ విసిరెను.   "ప్రియుని కలిగి యుండుట  అంత గొప్పగా చూచుచున్నారా?" అని లకుమ అడిగెను.

“మీ అమ్మకి ఆరాధకులు అనగా ఫేన్స్ ఉన్నటు నీకు కూడా ఉండవలెను కదా!” అని శ్రావణి అనగా “ప్రియుడు అన్న మాట నాకు నచ్చకున్ననూ ఆరాధకుడన్న మాట నచ్చినది,  అంతకంటే ఫేన్స్ అను మాట ఇంకనూ నచ్చినది.”  “మీ అమ్మ వలే నీవును అందగత్తెవేకదా నీ వెనుక నలుగురబ్బాయిలుండవలెను కదా!” అని హేమ  అనగా శ్రావణి  నలుగురేమి ఖర్మ చలనచిత్ర రంగమందు ప్రవేశించిన లక్షలాదిమంది జనులు ఆరాధింతురు. మీ అమ్మ  రాష్ట్రమును ఒక ఊపు ఊపినది కదా అట్లే నీవునూ…. అని శ్రావణి ముగించక మునుపే “ఆమె నాట్య తార.  ఆమె భరత నాట్యముతో రాష్ట్రమును ఒక ఊపు ఊపినది. మనకిచ్చట ఏమున్నద?”ని సంధ్య  లకుమను ప్రశ్నించెను.

 లకుమ అందముగా ఉన్నది అన్నచో సంధ్య  ఊరుకొనదు. అని అందరూ మనసులో అనుకొనిరి  “అందరూ నాట్యగత్తెలు కావలెనా అందమున్న చాలదా అది లకుమకు మందముగానున్నదనుచూ  లకుమతో “అసూయాపరుల మాటలు నమ్మకుము. కళాశాల అందగత్తెవని నిన్ననుటతో పల్లవి ఓర్వ లేకున్నది. నిజము జెప్పవలె నన్నమాఅందరి దృష్టిలో నేవే అందగత్తెవ” వని  సుధ అనెను.  

“నువ్వు సాయంత్రం బైటకు వచ్చినచో  కళాశాలలో సగం మంది నీ వెనకే ఉందురు. అప్పుడు నిజము బైటపడును. కానీ నీవెన్నడూ బైటకు రావు. నీ సమస్య ఏమియో తెలియకున్నద”ని  శ్రావణి  అనెను. 

‘నా ఆవాస సంరక్షకురాలు దామినియే పెద్ద  సమస్య. నిజము చెప్పవలెనన్న. ఆసంగంతి మాకెందుకు చెప్పెదవు మీ అమ్మకు చెప్పిన చూచుకొనును అని శ్రావణి అనెను. "వారిరువురూ చిన్ననాటి స్నేహితులు నన్ను దామిని కడ నుంచి  క్రమశిక్షణ నేర్పమని  మా అమ్మేచెప్పినది. దామినిపై ఏమైనా చెప్పినచో నా దవడ పగులును"ని లకుమ అనెను.  

" మీ అమ్మే నీ కొక సమస్యగామారినది, అయ్యో!!" అని పల్లవి దొంగ ఓదార్పు మూటల హాస్యోక్తులు పలికెను.  అందుకు లకుమ ముఖం మాడ్చుకుని "చలన చిత్ర రంగము చెత్త అని, అందడుగిడిన అడుసులో కాలిడినట్టేయని మా అమ్మ కనిపించిన అందరికీ చెప్పుటయే కాక ఫోనులో కూడా నాకు వినపడునట్లు అవే మాటలు చెప్పుచుండును." అని వాపోయెను.  

"మీ అమ్మ అంత  చాదస్తురాలా! మరి దామిని ఎట్లుండునో?" అని సుధ అడిగెను. అది సూదైనచో ఇది గున్నపము. గున్నఏనుగు వలే నుండును.  దామినికి  ఆడపిల్లలు పైన తిరుగుటనిన గిట్టదు. ధ్యాస అంతా చదువుపైనే నిలపవలెనని ఆడపిల్లలు సాయంత్రము బైటకి పోరాదని, దుస్తులు నిండుగా వేసుకొనవలెనని, సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించవలెనని" ఇట్లు వినువారున్నచో లక్ష జెప్పును అని నీరస స్వరముతో లకుమ అనెను.    

 "వినువారు లేకనేమి నీవు ఉంటివి కదా అని  తన చతురతను  చాటుకొను చూ పల్లవి హాస్య గుళికను చప్పున రువ్వెను.  అది  పటాసు వలే పేలి పెద్ద నవ్వుల శబ్దము  సృష్టించగా  ఆ  నిశ్శబ్ద పాన మందినమంతయూ దద్దరిల్లెను 


 “మేము కూడా వసతి  గృహమందున్నవారమే కదా! మేం తిరుగుటలేదా? పెద్దలట్లే అందురు. వారనేకము జెప్పుచుందురు  అవన్నియూ మనము పట్టించుకొనరాద”ని పూర్ణిమ అనెను. అందరూ త్రాగుట ముగించి లేచినారు "మీ వసతి గృహ సంరక్షకురాలిని ఎట్లు వంచవలెనో  నేను చెప్పెదన"ని శ్రావణనెను. “అదే స్వేచ్ఛ చిత్రం లో జూపినారు. ఆ చిత్రం చూసినచో  పరిపూర్ణ స్వేచ్ఛ అనిన ఏమో అర్థమగున”ని సుధ అనగా “ స్వేచ్చాభిలాషులైన మగువలకు తెగువుండవలెన”ని శ్రావణి నొక్కి జెప్పెను.  “ఒక్కొక్క చిత్రము ఒక్కొక తరమును తయారు చేయున”ని చదువుకు తిలోదకములిచ్చి మధుశాలలో జేరిన ఏడుకొండలు ముక్తాయింపు పలకగా మధుశాలకరతాళ ధ్వనులతో మారు మ్రోగెను. 



 ఆడపిల్లల దండు అంతయూ అందరూ బైటకు వచ్చెను.  వారు కొనుట ముగించి ఇంటికి మరలుతున్న పూర్ణిమను చూచిరి. లకుమ పూర్ణిమను చూచి పిలువగా  "నేను ఇంటికి పోవుచున్నాను. మా అమ్మ నాకొరకు ఎదురు చూచుచుండును" అని చెప్పెను.  :నేను కూడా ఇక వసతి గృహమునకు  పోవలెను అని లకుమ అనగా " నేడు పల్లవి  జన్మ దినము. ఆమె   చర్చలో కేకు కత్తిరించును. నీవు కూడా ఉండవలెను " అని సుధ అనెను. 

సంధ్య నిజముగా నీవు కిరస్థానము స్వీకరించినావా? అని లకుమ ఆశ్చర్యపోయేను. "నేనే కాదు పూర్ణిమ తప్ప ఇచ్ఛట  అందరూ కిరస్తానీయులే.   ఆ పానశాలలో ఏడుకొండలు కూడా.  దేవుని మహిమ తెలుసుకుని  ఆయన కృప వల్ల... "  అని పల్లవి చెప్పుచుండగా " చదువుకు సున్న చుట్టి  పానశాల లో పనిచేసుకు బ్రతుకుచున్నాడు. అని పూర్ణిమ ముగించెను. పల్లవి అహము దెబ్బతినెను.  

"నీ కెంత పొగరే  ప్రభువునే లోకువచేసి మాట్లాడెదవా? రాళ్లను  చెట్లను పూజించువారు  విగ్రహారాధకులందరూ నరకమునకు పోయెదరు అని అంతటితో ఆగక  ఆవాగుడుకాయ  "మీరే కాదు మీ భారతీయులంతా క్రీస్తు రక్షణ లేనిచో సర్వనాశనమగుదుర"ని శాపనార్థములు పెట్టసాగెను. 

 సెక్కులర్ అను పదమును  రాజ్యాంగమునుండి తొలగించవలెనన్నచో కల్లు  తాగిన కోతి వలె మీరు ఎందుకు చిందులు వేసెదరు  రాజ్యాంగ రక్షణ లో క్రైస్త్యము నడుచుచుండెను. ఇంకొక్క మాట విగ్రహారాధకులందరూ నరకమునకు పోయెదరంటివి గదమ్మా  మీరు మాత్రము చెక్కసిలువను, విగ్రహములను మొక్కుటలేదా మీరు చేసినచో సంసారం, మేము చేసినచో   సానితనము  ఎడారి మతాల తీరే ఇంత, వాడు కాబలో  మొక్కేది అరేబియా రాయి, ఇక్కడ  హిందువులు మొక్కేది ఈ దేశపు రాయి, వాడి సిలువ చెక్క జెరూసలేంది, ఇచ్చట చెక్క మన దేశానిది. అంతకు మించి బేధమేమున్నది. పరదేశమన్న ఎందులకంత మోజు స్వదేశమన్న ఎందులకంత ద్వేషము?" అని పూర్ణిమ నిగ్గ దీసెను. 

'మీకంటే మాకు దేశభక్తి ఎక్కువే!!! దేశమును అభివృద్ధి చేయువారము  మేమే ననెరుంగుము. అని పల్లవి అనగా పూరిమ లెస్స పలికితివి సిలువధారి  కిరస్థానము స్వీకరించిననేకులు కోట్లకు పడగలెత్తి భారతదేశ జెండాను ఒక గుడ్డ ముక్కని ఒక చిత్తూ కాగితమని అవమానించలేదా యని యూ గొట్టము నందొక  ఒక సుందరాంగు డు చెప్పెడి మాటలను తన చేతి చరవాణి నందు చూపెను. వారు విభ్రమనుండి తేరుకోనులోపే " మతము మారిన వారి  దేశభక్తి కి మరొక చిన్న ఉదాహరణ ఇచ్చెదను అని    పూరిమ అనగా   సుధ పల్లవిని  శ్రావణిని లకుమని పక్కకుగొనిపోయి వారి చెవుల్లో "ఇదియునూ అగస్త్య వలె  భారతవర్ష బంటు, ఆ బాపనోడు దీనికి అన్నియూ నూరి పోయుచున్నాడని చెప్పగా  "" ఆ!! పంచె కట్టు బాపనోడు తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలనుచూ యువకులను చెడగొట్టుచున్నాడు" అని శ్రావణి  అనగా అందరూ పెట్టున నవ్వసాగిరి   లకుమకు ఆ మాటలు రుచించక   వారి జట్టునుంచి వైదొలగి బైటకు వచ్చి నిలిచెను.

                           

                                         సంధ్య  లకుమ, సుధ, పూర్ణిమ మరియు శ్రావణి


"బ్రాహ్మణులను అవమానించుట పడదేమో! అయ్యో ఎంత పని ఐపోయినది." అని సంధ్య  పూర్ణిమను  చూసి వేళాకోళమాడెను. వారు సమాజమును కులములకింద విభజించిరి. వారివలనే సమాజము నాశనమైనదని మన కళాశాలలో విద్యార్థులు నుంచి విద్యార్ధి సంఘాలవరకు అందరూ ఘోషించు చున్నారు అని శ్రావణి అనెను.  పూర్ణిమ బదులు చెప్పు నంతలో "విద్యార్థులేకాదు చలనచిత్ర ములలో కూడా వారినట్లే చూపుచున్నారు వారినేమి  చేసెదవ?ని సంధ్య  అనెను.  

"వారిని అట్లు హీనపరిచి  చూపించిన  కొందరు నటులు కుటుంబకలహాలతో  వీ దెక్కి మన శ్శాంతి లేక అలమటించుచున్నారు. కులమను పదము మనకు పరిచయము చేసినది ఆంగ్లేయుడే మనది వర్ణ వ్యవస్థ మాత్రమే అని చెప్పిననూ తలకెక్కించుకొనక  బ్రాహ్మణులే  సమాజమును పాడు చేసినారని పాడిన పాడే పడుచున్నార" ని పూర్ణిమ  గట్టిగా ప్రతిఘటించు చుండెను.  

"వాదనల నవసరము భారతవర్ష మనదరికంటే పెద్ద, పైగా  గురుస్థానములో నున్నపండితుడు. అతడిని వేళాకోళము చేసినచో నాకు గిట్టదని" లకుమ తెగేసి చెప్పెను. సంధ్య  శ్రావణి  కులముల ప్రస్తావన ఇకపై తీసుకురామని లకుమను బుజ్జగించి చర్చికి కొనిపోయిరి. పూర్ణిమ మాత్రము వారితో పోవుటకు నిరాకరించి వెనుదిరిగెను.     

 

                                                              ***


వసతి గృహమున దూరవాణి మ్రోగుచుండ  వసతిగృహ సంరక్షకురాలు దామిని దూరవాణిలో మాట్లాడి, దానిని  తెరచి ఉంచి , గంట మోగించగా అక్కడ పనిచేయు ఒక స్త్రీ వచ్చి  ఆమె ముందు నిలిచెను. పిలుపు వచ్చెనని,దూరవాణి తెరిచియున్నదని వెళ్లి లకుమకి తెలిపిరమ్ము అనెను.  పిలుపు చేరిన తక్షణమే మెరుపువేగమున దూసుకువచ్చి, పిడుగుపాటువలె బల్లపై పడి గ్రెద్ద  కోడిపిల్లనెత్తుకు బోయినట్లు దూరవాణి నొకప్రక్కకు నెత్తుకుపోయి, దూరవాణిని హత్తుకుపోయి , చలిజ్వరం వచ్చి వణుకుచున్న స్వరమున " హాయ్ వెంకీ  డియర్ ఆ యాం పింకీ హియర్  హేపీ వేలంటైన్స్ డే"యని లకుమ సంభాషిచుచుండ, దామిని శిరమును చేతబుచ్చుకుని  "ఆ మూలకు పోయి ఓప్రా (ఆంగ్ల  సంగీత నాటకము) నందు యకారకరణం (యోడలింగ్) జేయు స్వరమున ఏల మాట్లాడవలెనో నాకర్ధము కాదు. ఇది విడ్డురముగాక మరియేమి  యని వగచుచుండ  పనిపిల్ల  "అమ్మా !  నాకఆంగ్లము రాదు మీరు చెప్పిన ముక్కలకు నాకర్దము తెలియదు. పెద్ద పెద్ద బడులకుబోయి ఆంగ్లము చదువుకొనిన తెలియవచ్చు. నాకు ఆమెస్వరము నత్తకురింజి రాగమున ఆరోహణ అవరోహణ జెయినట్లున్నది." అనెను.


ఈ మధ్యకాలములో దీనికి మగ స్నేహములు పెరిగినవి. ఇదియొక విడ్డూరం కాగా , ఎప్పుడూ పినతండ్రి కొడుకని చెప్పుచూ అనేక మందితో సంభాషించు చుండును, దీనికెంతమంది పినతండ్రులున్నారో?! యని దామిని తలబాదుకొనెను. 

 "పినతండ్రికొడుకైనచో ఈమె మెలికలు ఏల తిరగవలె? అని పని పిల్ల అనెను.  లకుమ  దూరవాణిని బల్లపైనుంచెను. "ఇంతలో కిటికీనుండి బయటకు చూసిన పనిపిల్ల ఎవరో ద్విచక్ర వాహనంపై వేచియున్నారు." అన్నది.

 ఈ వసతి గృహమునకు పరపురుషులు వచ్చుట నిబంధనలకు విరుద్ధమని తెలియదా యని దామిని లకుమను ప్రశ్నించెను.“వచ్చినది రాజేష్ మా పినతండ్రి కొడుకే, ఐననూ లోపలి వచ్చాడా? బయట ఎక్కడో ఉంటె మీకెందులకు? చాదస్తం కాకున్నచో !! అని గొణుగుతూ ప్రధాన ద్వారం వైపు పరుగెడుచున్న లకుమను చూసిదామిని“ఈమె బట్టలు చూడవలెచను. గుబ్బలు,తొడలు,పిరుదులు  కనిపించు నట్టు వస్త్రధారణ చూడుము ఈమెను జూచిన ఆంధ్రదేశమున లంగా ఓణీలు కట్టుకొను ఆడపడుచులు సిగ్గుతో తలదించుకొందురు. అని దామిని ఉరమగా"

అటువంటి వారెక్కడుందురో తెలిపినచో నేనునూ పోయిజూచి వత్తునని  వ్యంగ్యమున పలికి మూతి మూడు వంకరలు త్రిప్పుచూ పనిపిల్ల లోపలి పోయెను.

                                                              ***

లకుమ ఉద్యానవనమున పొదచాటున ప్రేమికునితో  సరస సంభాషణయందు  ప్రేమమాటలు రువ్వుచూ , అప్పుడప్పుడూ  నవ్వుచూ  మద్యమద్యలో   పయో హిమము (ఐస్ క్రీమ్)  నాకుచూ వంకర టింకరలు పోవుచుండ ప్రక్కనుండి  పోవు చున్న  ఇద్దరు  పెద్దమనుషులు  చూచి " చూడవోయి దీని చేష్టలు, దీని తల్లి ఒక రాజకీయపార్టీలో ఒక నాయకుని చెంకలో నుండి  చేయుపనులు  ఈమె ఉద్యానవనములలో చేయుచున్నద"ని ఒక పెద్దమనిషి అనగా   "కూతురు చెడిన  ఆ తప్పు తల్లిదను సామెత కలదు.  ఈమె తల్లి  వెలుగు పార్టీలో చేయు వ్యవహారముల  గూర్చి తెలియనిదెవరికి? తల్లిని మించిన కూతురు ఈమె" అని రెండవ పెద్దమనిషి బదులిచ్చెను. వారి మాటలు విన్న ఉద్యానవన సిబ్బంది ఇరువురు విస్తుపోయిరి. 

అందొకడు"పచ్చకామెర్ల రోగికి లోకమంతయూ పచ్చగా కనిపించునని వినియుంటిని  ఇప్పుడు ప్రత్యక్షముగా చూచుచున్నాను. ఈమె తల్లి అద్భుత నర్తకి, మంచి చిత్రములలో నటించింది.ప్రస్తుతముఆమెకుఅవకాశములడుగంటినవ "నెను.

 రెండవవాడు " ప్రస్తుత దర్శకుల పోకడలు సరిపడక అవకాశములు వదులుకొని కేవలము ఆమే చిన్న తెరకు పరిమితము చేసుకొన్నది. ఆమె చిత్రరంగమందు  ఉండవలసినది కాదు.  రాజకీయములలో చేరి మహిళాధ్యక్షురాలిగా పనిచేయు చున్నది. అట్లని రాజకీయములందు కూడా  ఉండవలసినది కాదు కానీ ఎందుకో చిత్ర రంగము కంటే హీనమగు రాజకీయరంగమందు ప్రవేశించెను " అనెను. 

అందుకు మొదటివాడు నవ్వి " అదియునూ కానిచో మనవలె  ఉద్యానవనమున పనిచేయవలెను. పద పోయి మొక్కలకు నీరు పెట్టవలెను " అనెను. వారిరువురూ అచ్చట నుండి కదిలిపోయిరి.   

ఆ పెద్దమనుషులిరువురూ ఉద్యానవనమున  సంచరించుచూ అచ్చట కొచ్చిన జంటలను పరికించు చుండిరి. నేడు వాలెంటైన్స్ డే అగుటచే ఉద్యానవనం కళకళ లాడు చున్నది.   ఈ పొదల ఈమెను  చూడుము ఇందాక చూచిన దానిని మించిపోయినది అని అనుచుండగా మరుక్షణమే మరొకపోదలో నున్న తన కూతురు కనబడగా పక్కవాడు చూసినాడేమో యని భీతిగొని "ఛీ..ఛీ.. నేటిచదువుననవలెను , పంతుళ్ళననవలెను , ఒక్కతీరున చదువు చెప్పుట రానిచో ఒక మూల ముడుచుకొని  కూర్చునవలె, పద ఇచ్చటనుండి త్వరగాపోవలెననెను. 

 అతడితో వచ్చిన వ్యక్తి మనసులో "ఇటువంటివి చూచుటకై కదా మనము నేడు ఉద్యానవనమునకు వచ్చినాము. వీడి కూతురు కనిపించినంతలో వీడి మొగము మాడిపోయినద"నుకొని బయటకు నవ్వుతూ " మన బంగారం మంచిదైనచొ ... అన్నట్లు పంతుళ్లనని లాభమేమి , మండుటెండ యని జూడక  మగవారు సూట్లు వేసుకొని తిరుగుట, చలికాలమని చూడక పయో హిమం (ఐస్ క్రీము) తినుట, పొట్టి దుస్తులు ధరించుట, పెద్ద  చిన్న అంతరం మరిచి అందరిని పేరుపెట్టి పిలుచుటయే  కాక  అదియే గొప్పయని నమ్ముట ఇవన్నియూ ఆంగ్లవిద్యద్వారా సంక్రమించినవే , నా అదృష్టమేమనగా  నాకూతురు గుణవంతురాలు" అనెను. 

వారు వేగముగా నడుచుచూ ఉద్యానవన ప్రధాన ద్వారమును జేరి నిక్రమించు సమయాన  రెండవ పెద్దాయన కుమార్తె  అప్పుడే జంటగా లోపలి ప్రవేశిస్తూ  తండ్రిని చూసి ఒక పొద చాటున నక్కెను. అది జూచి ఆ పెద్దమనిషి గొంతు తడారి, ముఖకవళికలు మారిపోయినవి . దానితో ఆయన స్వరము కూడా మారి పోయెను. 

మొదటివాడు "మన బంగారం మంచిదైనచొ.."అతడి మాటనతడికి అప్పగించి వేళాకోళము చేయుచుండగా. రెండవ పెద్దాయనకి చిర్రెత్తు కొచ్చి  ఎవరిననవలెనో తెలియక "ఛీ... ఛీ...ఈ సినిమాలొచ్చి అందరినీ పాడుచేసినవి, ఈ వెలయాళ్లనును ఆదర్శంగా భావించి వారి అడుగుజాడలలో నడుచుచున్నారు. వారే నేటి మన యువతీ యువకులకు గురువులుగా అవతరించారు. వారు జూపిన అర్ధనగ్నతను ఆధునికతయని పొరపడుచున్నారు.  పెడసరం మాటలను నిర్లక్ష్య ప్రవర్తనను ఆధునికతగా భావించుచున్నారు.  ఇది కాలమహిమ అనుచూ తోటి పెద్ద మనిషితో కలసి వనమునుండి నిష్క్రమించెను.  

                                                                 ***

విశాఖపట్నం మూడవ పట్టణ  పోలీస్ స్టేషన్ సముదాయము 

 20 -25 సంవత్సరముల వయసు గల యువకులు తొమ్మిది మంది వరుసగా నిలబడినారు.    విద్యార్థులనుండి విచారించుచున్నాడు.  పాలస్తీనా దేశపు జెండా పట్టుకుని వాహనము మీద ఊరేగుటకు సిగ్గులేదు. అని ఒక రక్షక భటుడు అనగా " ఇది శిక్షార్హమైన నేరము. మీ పై నేరము నమోదు గావించి వలసి యున్నది. అని ఠాణా అధికారి పట్టాభి హుంకరించెను. అయ్యా మేమేమీ ఎరుగము ఆ బైరెడ్డిగాడు మాచే ఇదంతయూ చేయించి ఎచ్చటో  దాగుడు మూతలాడుచున్నాడు. వాడే ముఖ్యుడు వాడిని వదిలి కూలీలను మమ్ము పట్టుకొనినారు మీవారు. అని అందులో పొడవుగా పీలగా యున్నవాడు వ్యాకృచ్చెను. అది విన్నఠాణా అధికారి ఆగ్రహోదగ్రుడై   "గొంతు లేచినచో గొంతు పిసికెదన"ని  వాడి ముఖము పగులగొట్టెను.     

వారందరూ బిక్క చచ్చి  గోడకానుకొని నిలిచిరి. ఇంతలో  పెద్ద పోలీసు అధికారి (సర్కిల్ ఇన్స్పెక్టర్) జాబాలి   ద్వారము వద్ద బైరెడ్డితో కనపడెను.  అతడు యముడి ప్రతిరూపమువలే  నున్నాడు. అతడు   బైరెడ్డిని చొక్కాపుచ్చు కుని  ద్వారము వద్ద నుండి ఒక్కనెట్టు నెట్టెను.  బైరెడ్డి వేగముగా గోడను గుద్దుకొని ఆతొమ్మిది మంది విద్యార్థులతో చేరి పదవ వాడుగా నిలిచెను.  "లెక్క సరిపోయినదా?" అని పట్టాభి అడిగెను.  ఎదో జండా పట్టుకున్నతమాత్రాన అదేదో నేరమన్నట్టు మమ్ము వేదించుచున్నారని బైరెడ్డి ఆక్రోశించెను. అది తప్పు కానిచో రెండురోజులనుంచి ఎందుకు నక్కినావు అని ఠాణా అధికారి గద్దించగా     జాబాలి  నీవు చేసినదేమైననూ చిన్నన్ననేరమా. దేశద్రోహము. రెండురోజులనుంచి మీ పై కఠిన చర్యలు తీసుకొనవలెనని చర్చలతో బుల్లితెరలు బ్రద్దలగుచు న్నవ"ని అరిచెను.

అందుచే వారి బుర్రలు బద్దలుగొట్టెదరా అని నవ్వుచూ న్యాయవాది ప్రతాప్ ప్రవేశించెను. ఆయన వెనుకనే బైరెడ్డి అన్న నాగిరెడ్డి వారితో పాటు ఎం ఎల్ ఏ సింహాచలం ప్రవేశించిరి. చూడండి ఎం ఎల్ ఏ గారు ఇక్కడ రాజకీయ పలుకుబడి చెల్లదు ప్రథమ సమాచార పత్రం నింపినాము. అని జాబాలి చెప్పగా . మీరు మీ పని చేసినారు అందుకే న్యాయవాదిని తీసుకు వచ్చినాము. అనెను. పెద్ద లందరు జాబాలి గదిలో కి వెడలగా విద్యార్థులందరూ  "మా గతి ఏమని?" బైరెడ్డినడిగిరి  "మీకు కూడా జామీను ఏర్పాటు చేసెదరని చెప్పిననూ  దేశద్రోహం అనునది పెద్ద కేసగునని లోపలనుంచి మాటలు వినిపించుచుండుటతో  బైరెడ్డి ముఖములో ఆందోళన కనిపించెను. అప్పుడే నాగిరెడ్డి  పోలీసుధికారి గదినుండి బైటకు   వచ్చెను.  తన తమ్ముడు బైరెడ్డి వద్దకు పోయి"కేసులు ఉన్నచో మేము చూసుకొందుము మీకేల  భయము. నేను ఎం ఎల్ ఏ గారి కుడి భుజముగా ఉండి అన్ని పనులు చేయుచున్నాను  నాపై నలభై కేసులు ఉన్నవి.  అని నాగిరెడ్డి అను చుండగా అక్కడున్న రక్షక భటుడు ఆ ముఖ్యమైన పనులు (నేరములు) చేయించుటకే మిమ్మల్ని సాకుచుండెను. అనెను. 

నాగిరెడ్డి అతడిని చూసి నవ్వెను ఎం ఎల్ ఏ గారి అండ ఉన్నత వరకూ నిన్ను నన్ను ఎవ్వరూ ఏమియూ చేయలేరని ధైర్యము చెప్పెను. కొలది సేపటి తరువాత విద్యార్థులనందరినీ న్యాయవాది విడిపించుకుని తీసుకుపోయెను.

                                                              ***





13 comments:

  1. హా హా ప్రస్తుత సమాజంలో యువత పోకడనీ వాళ్ళ తల్లిదండ్రు పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించారు.తన దాక వస్తే గానీ ఎవరికీ అర్ధం కాదు

    ReplyDelete
  2. కలముకి చేకూరె బలము. ప్రియముగ నవ్వగ సాహిత్యము కలమాయె శరము నవ్వే కలలకు, వరము నవ్వే ఇహము పరము

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ఒకప్పుడు మహానగర్రాల్లో వున్న సంస్కతి ఇప్పుడు చిన్న పట్టణాలలోకి కుడా పాకింది

    ReplyDelete
  5. నేను ఈ నవలని ఇష్టపడుతున్నాను.ఇది స్వచ్ఛమైన తెలుగును అందిస్తుంది. స్వచ్ఛమైన తెలుగుతో ఇటీవలి కాలంలో ఇది ఉత్తమ నవల ఇది నా అభిప్రాయం

    ReplyDelete
  6. Sir mana pata samskruthe Mottam marepointhe sir eppudu jarugutunna vate gurenche baga chepparu sir

    ReplyDelete
  7. మీరు మా యువకుల గురించి బాగా చెప్పారు కాలక్రమేణా తెలుగుని మర్చిపోతావ్ ఏమో మేము కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు! ఏ భాష అంటాము ఏంటో

    ReplyDelete
  8. మా యువకుల బలహీనతల కూడా బాగా చెప్పారు.

    ReplyDelete
  9. తప్పు ఎవరు చేసినా తప్పే.....! కాని ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకునే స్థితిలో మన సమాజం లేదు. చాల బాగా చెప్పారు sir

    ReplyDelete
  10. bhayamkaramayina vastavalanu andamayina padajalam tho chepparu sir

    super sir

    ReplyDelete
  11. ఈ కథ జీవితానికి ఒక మంచి పాఠం లా కన్న మంచి గుణపాఠం లా అర్థం అవుతుంది సార్...

    ReplyDelete

  12. అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete