Friday, November 7, 2025

నవయుగ వైతాళికుడు" పూలబాలకు ఘనంగా సన్మానం

 తాను పట్టు సాధించిన 6 విదేశీభాషలను శ్రమ, సమయం వెచ్చించి రాష్ట్ర నలుమూలల పర్యటిస్తూ చిన్నపిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్న నిత్య పర్యాట కుడు "నవయుగ వైతాళికుడు" పూలబాల.

 పాటలు పాడుతూ రాజుని మేలుకొలిపే  గాయకుడుని వైతాళికుడు అనేవారు  నవయుగ వైతాళికుడు అంటే కొత్త యుగాన్ని మేలుకొలిపేవాడని అర్థం. 

అక్టోబర్ 27 28 29 తేదీల్లో మూడురోజులపాటు సాగిన గ్లోబల్ కమ్యూనికేషన్ వర్క్ షాప్ లో విజయవాడ కు చెందిన పోలీగ్లాట్  రచయిత, రెండు ప్రపంచ రికార్డుల విజేత  పూలబాల వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్, ఇటాలియన్ , జాపనీస్ , ఇంగ్లిష్ -  6 విదేశీ భాషలలో శిక్షణ ఇచ్చారు.   

ఆటపాటలతో విద్యార్థులకి  వారి భవిష్యత్ కి అవసరమయ్యే  విదేశీ భాషలలో ఆటపాటలతో శిక్షణ ఇచ్చి నేర్పించగా  వారు నేర్చుకున్న భాషల్ని పిల్లలు చక్కగా ప్రదర్శించారు.   ఉపాధ్యాయులు వాటిని వీడియోలు తీసిన ఉపాధ్యాయులు ఇదంతా నమ్మ సఖ్యంగాలేదు అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.   

మూడో రోజు జరిగిన వీడ్కోలు సభలో వాసవి వరల్డ్ స్కూల్ ( నిర్మల్ ) యాజమాన్యం మరియు ఉపాధ్యాయులచే నవయుగ వైతాళికుడు  పూలబాలకు ఘనంగా జరిగింది.  

ఆ సభలో మాట్లాడుతూ "అందరూ ట్రెండ్ ని అనుసరిస్తారు . కొంతమంది రాబోయే ట్రెండ్ ని ముందుగా గుర్తించి అగ్రగామిగా నిలుస్తారు. ఫారిన్ లాంగ్వేజెస్ అవసరాన్ని గుర్తించిన వాసవి వరల్డ్ స్కూల్ ని ఇలా ముందు చూపు కలిగిన విషనరీ."  అన్నారు . పిల్లలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని కోరుకునే తల్లితండ్రులు ఉండడం సహజం. స్కూల్స్ అలా కోరుకోడం అరుదు. అలాటి అరుదైన స్కూల్స్ లో వాసవి వరల్డ్ స్కూల్ ప్రథమంగా నిలుస్తుంది. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.

.

వాసవి వరల్డ్ స్కూల్ లో ప్రతివారిలోనూ,ముఖ్యంగా టీచర్లలో నేర్చుకోవాలనే తపన కనిపించింది. టీచర్ల నన్ను వెన్నంటి ఉండి పిల్లలను కంట్రలో చేస్తూ నేను చెపుతున్న అన్ని విషయాలనూ అర్ధం చేసుకుంటూ వాళ్ళు కూడా నోట్స్ రాసుకు నేవారు. వాసవి వరల్డ్ స్కూల్ నాకు ఆనందాన్ని సంతృప్తిని మిగిల్చింది మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.


సేవచేయడానికి నేనెప్పుడూ సిద్ధం -పూలబాల

డబ్బుకి నో చెప్పి సొంతపనులు పక్కన పెట్టి

సమాజానికి సమయాన్ని శ్రమని వెచ్చించి

భాష నేర్ప ని చదువు చదువు కాదు అంటూ....         

          

విదేశీ భాషల ద్వారా తెలుగు భాష గొప్పతాన్ని సాహిత్య మహాత్యాన్ని నేటి తరానికి చెపుతూ దేశభక్తిని చాటే భాషా సైనికుడు పూలబాల. మన అవసరం లేకపోతే మన ఫోన్ కాల్ కూడా తీయని రోజుల్లో తన సొంత పని పక్కన పెట్టి దూరప్రదేశమైన నిర్మల్ వచ్చారు. వాసవి వరల్డ్ స్కూల్ లోపిల్లలని ఆటపాటలతో అలరిస్తూ భాషానైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. ఏ విద్యలో దేశ ఔౌన్నత్యం ఉండదో అది విద్య కాదు. ఏ నీతిలో దేశభక్తి ఉండదో అది నీతి కాదు. భాష నేర్ప ని చదువు చదువు కాదు. అన్నారు పూలబాల

పిల్లలకి భాషసాహిత్యం రెండూ అవసరమే అన్నారు ఆయన. నేటి చదువులో భాషని అటకెక్కించి ఇంజనీరింగ్ మెడిసన్ కలలు అమ్ముతూ సమాజాన్ని చంపుతున్నారు. మానవ వికాసానికి అవసరమైన భాషని ఉద్యోగ అవకాశాల కోసం అవసరాలకి మాత్రం నేర్పుతుంటే విద్య మార్కులకి పరిమితమై విద్యావంతులు కూడా పిచ్చి సినిమాలు చూస్తూ అమెరికా వెళ్ళినా ఆకు రౌడీల ప్రవర్తనే చూపిస్తూ సినిమాలలో అంట కాగుతూ పుస్తక పఠనాన్ని విలువలని పోగొట్టు కున్నారు. అందుకే ఈ దశలో భాషా సాహిత్యం చాలా అవసరం అన్నారు పూలబాల

మనిషి ఆలోచనలను, అనుభూతులను, భావోద్వేగాలను మలచి మానవతను వెలుగులోనికి తెచ్చేది సాహిత్యం. సమాజం యొక్క ఆత్మ, సంస్కృతి, చరిత్రకు ప్రతిబింబం సాహిత్యం. .

సాహిత్యం మనిషిని చీకటి నుండి వెలుగుకు తీసుకువెళ్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, నీతి బోధిస్తుంది, ఏ నీతిలో దేశభక్తి ఉండదో అది నీతి కాదు. ఏ విద్యలో దేశ ఔౌన్నత్యం ఉండదో అది విద్య కాదు. దేశభక్తిని మానవ హృదయంలో నింపుతుంది.

తెలుగు సాహిత్యంలో నన్నయ నుండి నేటి దాకా అనేక మహానుభావులు తమ రచనలతో సమాజాన్ని మేలుకొలిపారు. వారి రచనలు మన సంస్కృతి, మన చరిత్ర, మన విలువల సాక్ష్యాలు.

అంతిమంగా, సాహిత్యం లేకపోతే జీవితం నిస్సారంగా మారుతుంది. మనిషి ఆత్మను ప్రేరేపించే శక్తి సాహిత్యంలో ఉంది. మనసుకు శాంతి నిచ్చే దివ్య ఔషదం జీవితానికి దిశనీ చూపించే దివ్య దీపం దేశానికి రక్షణ కవచం సాత్యం. అందుకే నేటి ట్రెండ్ అయిన ఫారిన్ లాంగ్వేజెస్ ద్వారా పిల్లలకు మాత్ర భాష మాతృభూమి గొప్పతాన్ని కూడా వివరిస్తున్నాను అన్నారు పూలబాల



Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...