Monday, February 2, 2026

ఏదేశమేగినా కథ టూకీగా...

 MAIN CHARACTERS 


రోసేలితో  ఎలెనా అనే ఉన్నత వంశానికి చెందిన దంపతులకి జులియన్, సెవెరో అనే  ఇద్దరు కొడుకులుంటారు. వారు హిదాల్గో లు  అంటే ఉన్నత వంశానికి చెందినవారు.  అంటే మన బ్రిటిష్ ఇండియాలో జమీందారులుతో సమానం. మాద్రిద్ శివార్లలో గ్వాదారమా పర్వతశ్రేణికేసి చూస్తోన్న పెద్దజార్జియన్ భవంతికాసా దే వేగాస్  వారి ప్యాలస్.

అలాన్ సో కొడుకు ఎర్నెస్తో  అప్పుడప్పుడే పైకొస్తున్న రచయిత  అతడి తండ్రి అకస్మాత్ గా చనిపోతాడు. బంధువులు ఎవరూ అతడిని పట్టించుకోరు  ఎర్నెస్తో   వంటరివాడైపోతాడు.  చనిపోయిన అలాన్ సో   జూలియన్  స్నేహితుడు. .

జులియన్  మాడ్రిడ్ లో పెద్ద జ్యుయెలర్స్  తన  భార్య  థియోడరా   తో  మాద్రిద్ శివార్లలో గ్వాదారమా పర్వత శ్రేణికేసి చూస్తోన్న పెద్ద జార్జియన్ భవంతి  కాసా దే వేగాస్  లో నివసిస్తుంటారు.    కాసా దే వేగాస్ . కాసా అంటే ఇల్లు అని అర్థం,   అంటే ఆ ఇల్లు వేగా అనే ఇంటిపేరు గల కుటుంబానికి చెందింది.

జార్జియన్ ఇల్లు పెద్ద ప్రహరీ , పెద్ద గేట్లు  కలిగి పచ్చిక తో  తోటలతో పెద్ద రాచ గృహం  లా  ఉంటుంది. ఆనాటి ఇల్లు పెద్దవి , కుటుంబాలు పెద్దవి.  బస్సు కారు వంటి వాహనాలు లేకపోడంతో  తయారు రోడ్లు ఉండేవికావు.  సినిమా టీవీ లేవు కాబట్టి మానవ సంబంధాలు ఎక్కువ గాఉండేవి.   

 వేగాస్ అంటే చాలా డబ్బు పలుకుబడి ఉన్న నోబుల్స్ కుటుంబం.. ఎర్నెస్తో కి వారితో  ఉండలేననిపిస్తుంది. కానీ  జులియన్ భార్య థియో చాలా మంచి ఇల్లాలు.ఎర్నెస్తో ని కుటుంబం లో మనిషిలా చూసుకుంటుంది.  జులియన్ థియోడోరా ల మధ్య  వయో వ్యత్యాసం చాలా ఎక్కువ. అప్పట్లో  స్పెయిన్లో  బాల్య వివాహాలు ఎక్కువ గా ఉండేవి.   వరకట్నం ఆచారం కూడా ఉండేది  స్పెయిన్ ను పరిపాలించిన రాజుల్లో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోడం అరుదు 

స్పెయిన్ కు చెందిన  హెన్రీ వన్  కి  11 సంవత్సరాలు. ఎలియనోర్ 9 సంవత్సరాలు.

మరియా ఇసాబెల్లా 13 సంవత్సరాలు  అల్ఫోన్సో VIII 14 

ఇంగ్లాండ్ కి చెందిన  ఆర్థర్ 15 కేథరీన్ 16.   హెన్రీ VIII వయస్సు  17  కేథరీన్ వయస్సు: 23. 

ఆమె  తలిదండ్రులు  ఫెర్డినాండ్ 17   ఇసాబెల్లా 18. 

 థియో  కి మంచి మనసుంది బాగా డబ్బు ఉంది  డబ్బు ఉన్నా ఎదో క చింత పెడతాడు కదా  దేవుడు.  థియో కి భర్తకి వయసు వ్యత్యాసం ఎక్కువ , పిల్లలు ఉండరు. ఎర్నెస్తో ని బాగా  చూసుకుంటుంది.  అన్న తమ్ముడు అని వరస లు కలపదు.


IMPORTANT CHARACTERS - SEVERO - MERCIDES - PEPITO

 జులియన్ కి సేవారో అనే అన్న య్య ఉంటాడు. సేవరో భార్య మెర్సీ డెస్.   కొడుకు పేపితో.  

పెపితో కి 16 ఏళ్ళు. మాద్రిడ్ యూని వర్సిటీ లో మెడిసన్ చదువుకుంటున్నాడు. యూనివర్సిటీ 12 వ శతాబ్దం లోనే స్థాపించబడినా 1836 లోనే మాడ్రిడ్ కి మార్చబడింది. మాడ్రిడ్ కి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్దె మోరో అనే చిన్న పట్టణం లో మెర్సిడెస్ ఉంటోంది. జిప్సిం మైనింగ్ లో ఉన్న పారిశ్రామిక కుటుంబం వారిది. అతడికి ఒక ఆమెతో సంబంధం ఉంటుంది. డబ్బులున్నవారికి ఆరోజుల్లో అయినా ఈ రోజులూ అయినా ఇది మామూలే కదా .  అంటే ఆరోజుల్లో సమాజం పట్టించుకునేది కాదు. మగాణ్ణి  చట్టం గట్టిగా  పట్టించుకునేది కాదు . అదే స్త్రీ చేస్తే  శిక్ష ఉండేది. అహల్య ఇంద్రుడు కాల నుంచి ఇది ఉంది. భారత దేశంలో నే అనుకోకండి.  మగాడికి ఇది మామూలే  ఆడది సద్దుకుపోవాలి అనేది ప్రపంచం,  పురుష ప్రపంచం. ఈ మధ్య కాల వరకు మన  సినిమాల్లో కూడా అంతే. 


మంచి నాటిక రాసి జనాదరణ పొందుతాడు ఎర్నెస్తో  ఆ నాటిక  వేగాస్ థియేటర్  లో ఆడుతూ ఉంటుంది.  అప్పటిలో  సినిమాలు లేవుకదా అంతా  నాటికలు చూసేవారు.  ఆ నాటిక ప్రదర్శన శాల  వేగా కుటుంబానికి చెందింది.   నాటిక ప్రదర్శన శాలల్లో కూడా డబ్బులున్నవారికి  ప్రత్యేక  కుర్చీలు క్యూబికల్స్  ఉండేవి.   సామాజిక స్థాయిని బట్టి సీట్లు కేటాయింపు ఉండేది. కొన్ని సార్లు  డబ్బులుం డడం స్థాయి ని నిర్ణ యిస్తుంది . కొన్ని సార్లు  వర్గాన్ని బట్టి స్థాయి వస్తుంది. నోబుల్స్  అంటే ఉన్నత వర్గం. స్పానిష్ నోబుల్స్ ని హిదాల్గో లేదా హిదాల్గా అంటారు   ఉన్నత  వర్గాలకు ప్రత్యేక హోదా లభించేది. 

లిమ్పి యేజ దే సాన్గ్రే అంటే ప్యూరిటీ అఫ్ బ్లడ్ అని స్పెయిన్ లో ఒక నమ్మకం ఆచారం ఉండేది. (ఇప్పటికీ ఉంది.) దాని ప్రకారం రాచ కుటుంబాలకు చెందిన వాళ్ళను ఉన్నత వంశస్తులను స్పానిష్‌లో హిదాల్గో అంటారు. స్త్రీలను హిదాల్గా అంటారు. 


ఒక హిడాల్గో తన గొప్ప స్థితిని తన పిల్లలకు రక్తంతో అందించగలడు. అతడికి ప్రత్యేక మైన చట్టబద్దమైన గౌరవం లభిస్తుంది. హిడాల్గోస్ కు పన్నులు చెల్లించడం నుండి మినహాయింపు కలిగి ఉండడం, ఆయుధాలు ధరించే హక్కు కలిగి ఉండటం, కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని అంటే తుపాకీ కలిగిన అంగ రక్షకుడిని కలిగి ఉండటం, ప్రత్యేక న్యాయ మరియు న్యాయస్థాన వ్యవస్థను కలిగి ఉండటం వంటి హక్కులను పొందారు. వారిని న్యాయమూర్తులు విచారించలేరు. రాజు మాత్రమే విచారించ గలడు.  హిదాల్గోలకి ఎందుకింత గౌరవం అంటే రక్త స్వచ్ఛత.  రక్త స్వచ్ఛత ఏంటి?  ఏంటి ఈ చట్టాలు అనుకుంటున్నారా ?  మన భారత దేశం లో చట్టాలు ఇలానే ఉన్నాయి . మైనారిటీస్ హక్కులు , మైనారిటీస్  , కులం బట్టి  పేదరికాన్ని నిర్ణయించి , రిజర్వేషన్ కల్పించడం        

మంచి నాటిక రాసి జనాదరణ పొందిన ఎర్నెస్తో గొప్ప  డైరెక్టర్ అవ్వాలని కలలు కంటుంటాడు.  

ఆ  సమయంలో బావగారింటికి  (కాసావేగాస్ కి) వస్తుంది మెర్సిడెస్. ఆమెకు 36 భర్తకు 50.  భర్తతో సంతృప్తి చెందక ఆమె బాధపడుతుంటుంది. పైగా భర్తకి మరో చిన్న ఇల్లు.  విడాకులు తీసుకుని  తన దారి తాను చూసుకోవాలను కుంటుంది. అది దాదాపు అసాధ్యం. 

Divorce was completely banned in Spain throughout the Franco regime (1939–1975) as part of a national-Catholic, conservative social order that deemed marriage indissoluble.

By the early 1970s, some intellectuals began to challenge this, but the law remained until after Franco's death.

లేచింది మహిళా లోకం నిద్ర లేచింది మహిళా లోకం .. అని పాటలో  ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చర్ లెన్నో దంచింది విడాకు చట్టం తెచ్చింది అని విన్నారు కదా భారత దేశంలో కూడా ఇంతే జరిగింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పులతో  ఆడవాలాడే పై చెయ్యి అయ్యింది మగవాడి మెడలో కుక్క బెల్టు పడింది. ఆడవాళ్లు ఆడుకుంటున్నారు.  దాంతో పురుష ప్రపంచం దద్దరిల్లుతోంది. 

అప్పట్లో కోర్టు విడాకులు  ఇచ్చేది కాదు. కోర్టు ఇచ్చినా చర్చ్ ఇచ్చేది కాదు.  దాంతో ఆమె ఎర్నెస్తో మీద దృష్టి పెడుతుంది. ఒక్క  సారి ప్రయత్నించి భంగపడి, అవమాన పడి తన దారి మార్చుకుంటుంది.  

ఎర్నెస్తో కి అభినందనలు తెలియజేసి  నీకు మంచి భవిష్యత్ ఉంది అంటూ చెయ్యి నొక్కుతుంది. ధన్యవాదాలు అక్కా అంటాడు ఎర్నెస్తో. "అక్కఅని పిలవకుండా ఆంటీ అని పిలిస్తే బాగుంటుంది." అంది. “మీ అబ్బాయి నన్ను అంకుల్ అని పిలుస్తుంటే నేను మిమ్మల్ని .. “అంటుండగా మెర్సిడెస్ "చూడు నువ్వు నాటకాలు రాసుకో నాదగ్గర నాటకాలు ఆడకు. నువ్వు థియో తో ఆడుతున్న రాసలీలల మాటేంటి? అంది. 

అయ్యో! ఆమె నాకు అక్కతో సమానం. అన్నాడు ఎర్నెస్తో చెవులు మూసుకుం టూ. "అక్కా తిక్కా? ఏం నటిస్తున్నావు. ఈ వూరిలో మూడొంతుల జనాభా మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? " అంది మెర్సిడెస్. అయ్యో అంత దారుణంగా ఉందా పరిస్థితి? అన్నాడు ఎర్నెస్తో. 

ఆ రోజుల్లో ఇటువంటి  పుకార్లు , గాసిప్ సమాజంలో ఎక్కువగా ఉండేవి అనేక మంది  అప్పటిలో మనోవ్యధతో ఆత్మ హత్యలు చేసుకునేవారు. ఇదే కారణం తో  ఎచే గరే అనే స్పానిష్ రచయిత ఈ నాటిక రాసాను అనిచెప్పేరు.  ప్రాచీన సమాజం అలా ఉండేది. ఆడదాని బతకానిచ్చేది కాదు.  ఈ రోజు మనం మారిపోయామా ? అంతకన్నా దారుణంగా తయారయ్యాం. ఏదైనా అక్రమ సంబంధం వీడియో పెడితే మనవాళ్లకు పండగే. లక్షల వ్యూస్, వేలాది కామెంట్స్ , అందులో అన్నీ నీతులు బూతులు. 

“పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకం అంతా చీకటి అనుకుందట. అలా ఉంది నీ పరిస్థితి. నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదే కానీ నేనే ఈ విషయం జులియన్ కి చెప్పదని నా భర్త తో చెప్పాను” అంది మెర్సిడెస్. 

కానీ ఈ విషయంతన తోటికోడలుకి థియో కి చెప్పేస్తుంది  ఆమె తన భర్త జులియన్ కి  చెపుతుంది.  ఈ పుకార్లు ఎవరు చెప్పారు నీకు అన్నాడు జులియన్ తీవ్రంగా. ఇందాకా తోటలో ఆమే చెప్పింది. అంది థియో. జులియన్ మ్రాన్పడి పోయాడు.   మీరైనా కొంచెం చెప్పండి అంది థియో. నేను చెప్పడం చాలా సార్లు అయ్యింది చాలా మంది ఉన్నత స్థాయి వారు చెప్పారు. వాడికి ఎవ్వరు చెప్పినా దండగ.  అన్నాడు జూలియన్.  పోనీ రాజుగారి తో చెప్పిస్తే అంది థియో. జూలియన్ మెత్తగా నవ్వాడు. థియో అయోమయంలో పడింది. ఇలాటి విషయాల్లో రాజులేంచేస్తారు? రాజుగారు ఉన్నతుడే కానీ ఉత్తముడు కాదు. ఆయనకూడా ... అంటుండగానే థియో " “అతడు మగాడే కదా! " అంది థియో కసిగా. 


FRIEND - ALEHANDRA

మెర్సిడెస్ తన స్నేహితురాలు అలెహాంద్ర ( అలె) ని పిలిపించి  తన భాధ చెప్పుకుంటుంది డబ్బు అందం తో పాటు దండం కూడా ఉన్న నువ్వే ఇలా మాట్లాడుతు న్నావా? అంది అలె. "దండం అంటే?"  అంది మెర్సిడెస్ “శిక్షించే అధికారం" అంది అలె. అది నాకెక్కడుంది అంది. మెర్సిడెస్. 

నిన్ను న్యాయమూర్తులెవ్వరూ విచారించలేరు అది మరిచిపోయావా?  నీ మీద రాజుకి పిర్యాదు చేయడం అనేది అంత సులభం కాదు. మెర్సిడెస్ మనసు సంతోషంతో నిండిపోయింది   అద్దం ముందుకు వెళ్లి చూసుకుంది.  ఇక తన మొగుడు గురించి, ఎర్నెస్టో గురించి అంతా చెప్పింది.  తర్వాత “ఎంత అందంగా ఉన్నా ఏంలాభం? ఎర్నెస్టో బాగానే ఉన్నాడనుకుంటే వాడు ఇలా తగలడ్డాడు. అని వగచింది అయినా మొగుడే ఇలా ఉంటే ఎవరినని ఏంలాభం.  నా మొగుడే ఇంతా మగ చచ్చినాళ్ళు అంతా ఇంతేనా?  అని ప్రశ్నలు సంధించింది మెర్సిడెస్. నైట్ ని పంపించి వాడిని పిలిపించని సలహా ఇస్తుంది అలె  కానీ ఎర్నేస్తో ని బాధించదు పగ  సాధించదు. ఎర్నేస్తో కి థియో తో సంబంధం ఉంటె ఆపమని కుటుంబం పరువు తీయద్దని చెప్పి ఎర్నేస్తో ని వదిలేస్తుంది మెర్సిడెస్. 

IN LAWS - ROSELEO -  ELINA

రోజెలియో, ఎలెనా కూడా ఉన్నారు. అత్తా మామలువస్తారు. ఏమైనా శుభవార్త ఉందా పెద్ద కోడలు థియో ని అడుగుతారు. పిల్లలు కోసం వాళ్ళు అలా అడుగుతుంటే థియో కి ఎంసమాధానం చెప్పాలో తెలీదు  పుకార్లు గురించి విన్న ఎర్నెస్టో  బ్యూనస్ ఏరస్ లో తన మిత్రుడుతో కలిసి నాటకాలు ప్రదర్శించుకోవాలని అనుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.

DOMINGO - CO -TRAVELER

ఎర్నెస్టో చేతిలో బేగ్ ని భుజం మీదకి మార్చుకుని నడుస్తున్నాడు. మార్చుకోడానికి మరోజత కాళ్ళుంటే బాగుండును. కాళ్లు పీకుతున్నాయి చలికి దేహం గడ్డకట్టింది. ఇక్కడ ఆగాలి తప్పదు. అనుకున్నాడు. కొంచెం దూరంలో నది ఒడ్డున ఇసుకలో చలిమంట కనిపించింది. అక్కడ గుంపుగా మనుషులు ఉన్నారు. అటు వైపు నడిచాడు. నడుస్తున్న కొద్దీ వాళ్ళ ముఖాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వాళ్లంతా గితానోలు అంటే జిప్సీలు. ఒక వ్యక్తి గిటార్ వాయిస్తున్నాడు. అతడు గితానో కాదు. కొంత మంది డాన్స్ చేస్తున్నారు. కొంచెం దగ్గరకి వెళ్ళగానే సంగీతం వినిపిస్తున్నది. ఎవరో బతికి చెడ్డవాడిలా ఉన్నాడు. అనుకున్నాడు. అతడు ఎర్నెస్టోని చూసి నవ్వాడు. ఎర్నెస్టో కూడా నవ్వేడు. కానీ ఆ నవ్వులో జీవ లేదు . గిటార్ వాలా మాత్రం అందంగా నవ్వుతున్నాడు "అల్ మాల్ తిఎంపో బోన కారా" అని హుషారుగా పాడుతున్నాడు. అంటే పరిస్తితులు బాగోలేనప్పుడే నవ్వుతూ ఉండాలనే గీతం. నిజానికి అది స్పెనిష్ ఇడియమ్. నవ్వుతూ హుషారుగా ఉన్నారు అంతా.  నీపేరేంటీ అన్నాడు ఎర్నెస్టో గిటార్ వాద కుడిని దొమింగో అన్నాడు గిటార్ వాదకుడు "దొమింగో అంటే ఆదివారం అని అర్థం చాలా నవ్వుతాలు గా ఉంది." అన్నాడు ఎర్నెస్టో. మరైతే నవ్వు, నీలాటి ఏడుపు ముఖం వాళ్ళకి నవ్వు పుట్టించడానికే నాకీ పేరు పెట్టారు." ఎర్నెస్టో నవ్వలేదు

కొంతమంది హోరుహచ్చ తాగుతున్నారు. (అప్పటికి స్పెయిన్ లోకి టీ రాలేదు. 1906 లో విక్టోరియా టీ ని స్పానిష్ కోర్ట్ కి ప్రవేశపెట్టిన తరువాత జనాదరణ పొందింది. కొంతమంది స్త్రీలు నీళ్లు బాగా కలిపిన వైన్ తాగుతున్నారు.  ఎర్నెస్టో రాత్రే వెళ్లిపోయాడని వార్త తెలిసి థియో బావురుమంది. 

 SOCIETY - CULTURE

జెంటిల్మెన్ క్లబ్ లు , బార్లు, టావెర్న్ లు ఏవీ కనబడవేం అన్నాడు ఎర్నెస్టో టీ వీ ఫోను రోడ్డు కారు కెమెరా కరెంటు లేని రోజుల్లో అవే ఫోన్ , క్లబ్ సినిమా సోషల్ ఇంటరాక్షన్ సెంటర్లు. అలా నడుచుకు ముందుకి సాగారు. మధ్యాహ్నం చుట్టుకింద విశ్రాంతి దొరికింది గానీ తిండి దొరకలేదు. సమయానికి అన్నం పెట్టే దేవత థియో గుర్తొచ్చి ఎర్నెస్టోకి ఏడుపొచ్చేసింది. తిండి కోసం ఇంత ఏడిచేవాడివి ఇల్లొదిలి ఎందుకొచ్చే సేవ్ అని దొమింగో దొబ్బులు పెట్టేడు. అప్పుడు తిండి కోసం ఏడవటం లేదని తన కథ అంతా చెప్పేసేడు ఎర్నెస్టో. 


ANTONIO - INTRO 

నాటక కర్త ఆంటోనియో ని పరిచయం చేస్తానన్నావు. అంది మెర్సిడెస్. అదిగో మాటల్లో నే వచ్చాడు అంది అలె. “యితడు చాలా జనాదరణ పొందిన నాటకకర్త. ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారు. అని ఆంటోనియోని పరిచయం చేసింది. తరువాత మెర్సిడెస్ ని ఇలా పరిచయం చేసింది. "ఈమె మెర్సిడెస్ వేగా. వేగా కుటుంబం నుంచి వచ్చారు." అంది అలె పరిచయాలైన తర్వాత అలె అంది " రెండు రోజుల్లో నీ రెండు నాటకాలు చూసింది మెర్సి. అంది అలె . 


"ఎలా వున్నాయి నాటకాలు. రెండిటిలో ఏందీ నచ్చింది? అన్నాడు ఆంటోనియో. రెండూ బాగున్నాయి, కానీ మీరు హిస్టారికల్ డ్రామా లే వేస్తారా? అంది.  అవునండీ, జరిగిన కథలు మాత్రమే వేస్తాము. అదే మానాటక సమాజం ప్రత్యేకత. అన్నాడు ఆంటోనియో. వాళ్ళు నాటకాలు ఆడేది ఎందుకో తెలుసా? అంది అలె. ఎందుకు సమాజహితంకోసమా? అంది. అవునండీ సమాజ హితం కోసమే ఒట్టు, మా నాటక సమాజహితం కోసం అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. " 


ఆంటోనియో స్త్రీ సంక్షేమం కోసం కంకణం కట్టుకున్నాడు." అంది అలె. "సంక్షేమం కోసం కాదు స్వేచ్ఛకోసం కంకణం కట్టుకున్నాము." అన్నాడు ఆంటోనియో.


"రెండిటికీ తేడా ఏంటో?" అంది అలె. చాలా తేడా ఉంది డబ్బులేనివారికి సాయం చేస్తే అది సంక్షేమం, డబ్బు ఉండి స్వేచ్ఛలేని స్త్రీలు ఎందరో ఉన్నారు. వారికి సాయం చేయడమే నా లక్ష్యం అన్నాడు ఆంటోనియో. మీరు చెప్పింది నిజమే డబ్బు ఉంది స్వేచ్ఛలేని వారు ఎందరో ఉన్నారు. కానీ మీరు వాళ్లకి ఎలా సాయపడతారు. అంది మెర్సీ. సమాజంలో మార్పు తీసుకు రాయడం, చట్టాలలో మార్పులు తీసుకు రాయడం స్త్రీ స్వేచ్చకీ దోహదం చేస్తాయి. చూడండి మన స్పానిష్ సమాజంలో లింగ వివక్ష. పురుషుడైతే నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు, అక్రమసంబంధాలు పెట్టు కోవచ్చు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న పురుషులను వదిలేసి స్త్రీలను శిక్షిస్తారు. స్త్రీలకి విడాకులు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. మరో మగాడితో మాట్లాడకూడదు. దీన్ని మార్చాలి. ఏమంటారు అన్నాడు ఆంటోనియో. 

ఏం మాట్లాడలేకపోయింది మెర్సిడెస్. ఉపన్యాసం బాగానే ఉంది కానీ మెర్సీ ఏంచేయాలో అడగకుండా ఇలా అడిగితే నీకేం ప్రయోజనం?” అంది అలె. "మా నాటక సమాజానికి కొంచెం ఆర్ధిక సాయం చేస్తే … ' అన్నాడు ఆంటోనియో. 

.

అవునే ఎర్నెస్టో కి మీ కుటుంబం ఏంతో సాయం చేసింది. అతడికి కృతజ్ఞత లేక పోయింది. ఇతను అలాకాదు." అంది అలె. “చూడండి ఎర్నెస్టో కి మీరు సాయపడితే వ్యక్తిగతంగా అతడికి సాయపడడం అవుతుంది కానీ మాకు సాయం చేస్తే స్త్రీ లందరికీ మహోపకారం చేసినట్టే. స్త్రీలకు అన్యాయం జరుగుతున్నది అని నమ్మితే స్త్రీలకు స్వేచ్ఛ అవసరం అనుకుంటే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి.” అని ఆంటోనియో సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 


HISTORIC PLAY - ANTONIO

ఎదురుగా వేదికను కప్పిన తెరలేచింది. తాళ్లతో వేలాడదీసిన తెల్లని పెద్ద తెర కనిపిస్తోంది. దాని వెనుక మరో తెర దానివెనుక మరో తెర ఇలా అనేక తెరలు ఒకడిని వెనుక మరొకటి వేలాడుతున్నాయి. తాడు లాగితే చుట్టుకుంటూ పైకి పోతాయి. వేదికపై ఒక మూలగా సంగీతకారులు కనిపిస్తున్నారు. 

18వ శతాబ్దపు ఫ్రెంచ్ చక్రవర్తి బోనపార్టీ పేరు విననివారుండరు. ఆయన చెల్లి పేరు పౌలిన్ అని తెలిసినవారు తక్కువ ఆవిడ కథ తెలిసినవారు ఇంకా తక్కువ. ఆవిడ అంత గొప్పదా అంది అడిగితే గొప్పతనం స్వేచ్ఛ గా జీవించడంలో ఉంటుంది అనుకుంటే ఆవిడ గొప్పదే.  గొప్పతనం మాటకి చేతకి తేడాలేకుండా ఉండడంలో ఉంటుంది అనుకుంటే ఆవిడా గొప్పదే. గొప్పతనం తాను ప్రేమించిన వారు దురవస్థలో ఉన్నప్పుడు తన యావదాస్తిని అమ్మి సాయం చేయడంలో ఉంది అనుకుంటే ఆమె గొప్పదే. ఈ ప్రారంభ వాక్యాలతో తెరలేచింది. 


నీకు జీవితంలో స్థిరపడాలని లేదా? అన్నాడు ఎర్నెస్టో. నేను స్థిరపడిపోయా నులే, దానిగురించి చింతలేదు.” అన్నాడు. దొమింగో. అర్థం కాక అయో మయం గా చూసాడు ఎర్నెస్టో. “నేను రోడ్డు మీద స్థిరపడిపోయాను.” అంటూ నవ్వాడు దొమింగో “అయ్యో! ఇదా స్థిరపడడం అంటే” అన్నాడు ఎర్నెస్టో.  నాసంగతి అలాఉంచు నీదృష్టిలో స్థిరపడడం అంటే ఏంటి డ్రామాలు వేసుకోడమే కదా! అన్నాడు దొమింగో

 “పెద్ద పేరు సంపాదించడం కూడా.” అన్నాడు ఎర్నెస్టో "తరువాత పెళ్లి కూడా చేసుకుంటావా?" అని వ్యంగ్యంగా అడిగాడు. "ఏం చేసుకుంటే తప్పా?" అని దొమింగో మీద అరిచాడు. “ఐతే నీకు ఆందోళన తప్పదు. గౌతమ బుద్ధుడు కోరికలే బాధలకి కారణం అని చెప్పేడు కదా!"అన్నాడు. " బుద్ధుడు చెప్పేదాని ఎవరు పాటిస్తున్నారు. కోరికలు లేకుండా ఎవరు బ్రతుకు తున్నారు నీకు లేవా ఆశలు?” అన్నాడు ఎర్నెస్టో. 

నాకు ఏ ఆశలు లేవు. నేను స్థిరపడిపోయాను - నేను రోడ్డు మీద స్థిరపడి పోయాను. నాకు నచ్చిన పని చేస్తూ పోతాను. ఫలితం ఆశించను. భారతదేశ కృష్ణగీతలో ఇదే ఉంది.” అన్నాడు దొమింగో. ఇవేవీ ఆచరించేవి కాదు. భారతదేశంలో, కృష్ణుడు పుట్టిన ఊరిలో కూడా, ఆ ఊరి పేరు నాకు తెలియదు కానీ, ఎవరూ ఫలితం ఆశించకుండా పనిచెయ్యరు. నిజం చెప్పాలంటే పురాణాల్లో వేదాల్లో ఎన్నో నీతులు ఉంటాయి. వాటి అన్నిటినీ పట్టుకుని వేళ్లాడరు.” అన్నాడు ఎర్నెస్టో 

చాలా మంచి మాట చెప్పావు. మరి నువ్వెందుకు దగ్గరకొచ్చిన మెర్సిడెస్ కి నీతులు చెప్పావు. అన్నాడు దొమింగో. వాళ్లు నోబుల్స్ బాగా సంపన్నులు. నీతిగా పోయాము కాబట్టి కొరడా దెబ్బలతో సరిపోయింది. ఆమె చెయ్యి అందుకుంటే వాళ్ళాయన తుపాకీ అందుకుంటాడు. ఇవన్నీ నాచేత చెప్పిస్తావెందుకు, చారెడు జ్ఞానం ఉంది చిటికెడు బుద్ధిలేదా? "అని అరిచాడు ఎర్నెస్టో. బాగా బ్రతక నేర్చినవాడివే. అన్నాడు దొమింగో.

                                                                                   ***






గది లోంచి బైటకి వచ్చి చూస్తే అత్తా మామ తోటలో బల్లపై కూర్చొని ఉన్నారు. అంత వయసువచ్చినా ఎప్పుడూ కలిసే తిరుగుతారు. అరవై దాటినా ఇద్దరూ ఆరోగ్యంగా నాజూకుగానే ఉన్నారు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఊసులాడు కుంటు న్నారు. దేనికైనా అదృష్టం ఉండాలి అనుకుని తన గదిలోకి వెళ్లి పడుకుంది. కాసీపు తరువాత మల్లె బైటికి వచ్చింది అత్తమామల గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. కొంచెం దొంగతనంగానే తలుపు దగ్గరికి వెళ్లి చూస్తోంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు కౌగిలించు కున్నారు. రోజెలియో చటుక్కున ఎలెనా పెదవులు  అందు కున్నాడు. నోట్లో నోరు పెట్టేసాడు. ఆపైన మెల్లగా చేతులు ఆమె నడుం పై వేసాడు. క్రింద కూర్చుని ఆమె నాభిని ముద్దాడాడు. ఆమెను రెండు చేతులలోకి తీసుకుని పసిబిడ్డను ఎత్తు కున్నట్టు ఎత్తిపక్క మీద పడేసాడు. ఇంకా చూడ్డం బాగోదని తన గదికి వెళ్ళిపోయింది. వంటరి గా అనిపించింది. 

సెవరో ఈ రోజు వస్తాడు కదా ఎలాగైనా ముగ్గులోకి దింపాలి. 

రాయల్ ప్యాలస్ అంతా రాజుగారి పుట్టిన రోజు వేడుకలతో సందడిగా ఉంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన సింగపూర్ ఇన్డోర్ స్టేడియం అంత ఆడిటోరియంలో డ్యూక్ లు బిషప్ లు ఆర్చ్ బిషప్ లు, నోబుల్స్ ఇతర ఉన్నతాధికారులు కూర్చొని ఉన్నారు.

 

స్పెయిన్ జానపద కళలకు నిలయం. జాన పద కళాకారులు ప్రదర్శనలతో అందరినీ రంజింప జేస్తున్నారు. నోబుల్స్ కి ఏర్పాటు చేసిన వరుసలో రోజెలియో ఎలెనా కూర్చుని కార్యక్రమాలని చూస్తున్నారు.

జూలియన్ కూడా తల్లి తండ్రులకి కనిపించకుండా చివరివరుసలో కూర్చున్నాడు. సెవరో కూడా వచ్చి జూలియన్ ప్రక్కనే కూర్చున్నాడు. 

జూలియన్ తమ్ముడిని చూసి ఆశ్చర్య పడ్డాడు. తరువాత తల్లి తండ్రుల పెళ్లిరోజు మర్చిపోయి తప్పుచేశానని అందుకే వారిని ఆశ్చర్య పరచడానికి ఆంటోనియో చేత ఒక కార్యక్రమం ఏర్పాటు చేసాను. "ఆంటోనియో చేత కార్యక్రమమా? ఏ కార్యక్రమం వాడుతప్ప ఇంకెవరూ దొరకలేదా?" అన్నాడు. వాడే కదా ప్రస్తుతం చాలా జనాదరణ పొంది పెద్ద స్థాయిలో ఉన్నాడు. వాడి కంటే పైన ఎవరైనా ఉన్నారా? అన్నాడు జులియన్. అది కాదు .. అని ఎదో చెప్పబోయి సరేలే .. ఇంతకీ వాడేం చేయబోతున్నాడు అన్నాడు. జులియన్ అది సర్ప్రైజ్ అన్నాడు. 

నేను సర్ప్రైజ్ లు తీసుకునే స్థితిలో లేను. నాన్చక విషయం చెప్పేయ్.” అన్నాడు సెవరో. “సరే చెపుతానుగానీ నువ్వెందుకు ఇంటికి రాడం లేదు. మెర్సిడెస్ ఎంత బాధ పడుతోందో తెలుసా?” అన్నాడుజులియన్. ఎందుకు బాధ పడడం ఉన్నాడుగా ఆంటోనియో ఆ నాటకాల రాయుడు." అన్నాడు సెవరో. “ఓ అదా! ఆంటోనియో చాలా మంచి వాడని విన్నాను. వాడు అలాటివాడు కాదు.” అన్నాడు జూలియన్. “వాడిసంగతి పక్కనుంచు మెర్సిడెస్ ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఆమెకి కోరికలు ఎక్కువ. అందుకే వాడి వెంట పడుతోంది” అన్నాడు సెవరో.


  “చూడకుండా మాట్లాడకూడదు” అన్నాడు జూలియన్ 

"చూడడం అంటే నేనే చూడాలా? అది వాడితో ఎక్కడెక్కడికి వెళుతున్నాదో కూడా నాకు తెలుసు. “డియాగో ఆమెని అనుసరిస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు డియాగోని (అశ్వకుడిని) మెర్సిడెస్ పై గూఢచర్యంకిపెట్టావని. ఆవిషయం ఆమెకు కూడా తెలిసిపోయింది.” అన్నాడు జులియన్. “తెలిసిపోతే తనతప్పు తెలుసుకుని తిన్నగా మసలుకోవాలి.” అన్నాడు సెవరో. “నువ్వు మిస్ట్రెస్-లనివదిలి భార్యని సమంగా చూసుకో ఏ సమస్యా ఉండదు. అన్నాడు.

 “ఇంత సిరి సంపదలు ఉన్నది అనుభవించకుండా ఏంచేసుకోడానికి?” అన్నాడు సెవరో. “ఆవిషయానికొస్తే మెర్సిడెస్ డ్యూక్ కుమార్తె మన కన్నా డబ్బు హోదా రెండూ ఎక్కువే, ఆవిడ నీలా ఆలోచిస్తే?” అన్నాడు. “స్త్రీ తన హద్దులు తాను తెల్సుకోవాలి. లేకుంటే నష్టపోయేది తనే!” అన్నాడు సెవరో 

డ్యూక్ అఫ్ ల ఆల్బా హువాన్ వచ్చి వారిని డ్యూక్ ల కొరకు నిర్దేశించబడిన ముందువరుసలో తనపక్కన కూర్చో బెట్టుకున్నాడు. అంతవరకూ జరిగిన జానపద నృత్యాలు ముగిసి నాటిక మొదలైంది. 

అంటొనియా టావెర్న్” అనే సత్రం వద్ద దొమింగో ఎర్నెస్తోలకు శాంటియాగో అనే షిప్ ఇంజనీర్ పరిచయం అవుతాడు . డబ్బు ఎక్కువలేదు! ఆకలేస్తున్నాది అన్నావుకదా ముందు తిందాం. తర్వాత గది సంగతి చూదాం “అన్నాడు దొమింగో మరి రాత్రికి బస ఎలాగ అన్నాడు ఎర్నెస్టో. ఇద్దరూ ఫెయిర్ ప్లేస్ దగ్గర కూర్చొని తిన్నారు. అందరికీ దొమింగో సంగీతం బాగా నచ్చింది. మరో పాట వాయించమని కోరారు. అంతే దొమింగో గిటార్ తీగలపై అతడి వేళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆహా మనసు పై ఎదో మత్తు జల్లుతు న్నాడు. 


రోజెలియో, ఎలెనా కూర్చున్నారు. ఆంటోనియో వేదిక ఎక్కగానే చప్పట్లు, హర్షనాదాలు తో ఆడిటోరియం మారుమ్రోగింది. అంటా సద్దుమణిగాక  "చిరకాలం కలిసి ఉన్న భార్య భర్తలని సన్మానించే గీతం పాడబోతున్నాన"ని ప్రకటించి పాట మొదలుపెట్టాడు. పాట అద్భుతంగా అందరికీ అనిపించింది. కానీ రోజెలియో ఎలెనాకి తమ గురించే పాడుతున్నట్టు అనిపించింది. భార్య భర్తకి ఎలా అనుకూలంగా ఉంటుందో, భర్త భార్యకి ఏం తీసుకువస్తాడో ఎలా చూసుకుంటాడో అన్నీ ఆ గీతంలో వివరిస్తున్నాడు. అవన్నీ తమ జీవితాల్లో జరిగినవే. 


ఆ గీతం తమ జీవితం అని అర్థమైయ్యి వారి హృదయం ఉప్పొంగి వారి కళ్ళు ఆర్ద్రమయ్యాయి. కళ్ళు తుడుచుకుని చూసేసరికి ఆంటోనియో " ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక అద్భుతమైన జంట గురించి విన్నారు అటువంటి జంట మన ముందే ఉన్నారు. నేడు వారి పెళ్లి రోజు. వారిని ఇప్పుడు చూపిస్తాను." అని ప్రకటించాడు. రోజెలియో, ఎలెనా లను వేదిక పైకి రమ్మని ఆహ్వానించాడు ఆంటోనియో. ఇంకెవ్వరూ మాట్లాడలేదు. ఆ విశిష్ట వ్యక్తి వేదిక మీదకి రావాలి అని ప్రకటించగానే వాళ్ళ పెద్ద కుమారుడు జూలియన్. వారిని సెవరో మామగారు డ్యూక్ హువాన్ వేదికపైకి తీసుకు వెళ్ళాడు. “ఇప్పుడు ఒక విశిష్ట వ్యక్తి వారికి పెళ్లిరోజు కానుక అందిస్తారు. వారెవరో ఈ దంపతులు ఊహించగలరేమో చూద్దాం" అన్నాడు ఆంటోనియో రోజెలియో, ఎలెనా తో. 

సమస్యలన్నీ మరచి మనసు పాడుతోంది అనుకు న్నాడు ఎర్నెస్టో. అతడిని చూసి డొమింగో నవ్వేడు. ఎర్నెస్టో నవ్వేడు కానీ మనసులో అసూయ పొంగింది. "ఈ వెధవకి అందుకే సమస్యలు పట్టవు, భవిష్యత్ కూడా పట్టదు అనుకున్నా డు ఎర్నెస్టో. గిటార్ బాది పారేస్తున్నాడు దొమింగో రాత్రి బసకి గదులు కావాలి దానిగురించి ఆలోచించు అన్నాడు డొమింగో చెవిలో. విని నవ్వాడు గిటార్ ఆపలేదు. అందరూ పరవసించి పాడుతున్నారు. అదే సమయానికి శాంటియాగో గదిలోంచి గిటార్ పట్టుకుని వచ్చాడు. అందరూ అతడినే చూస్తున్నారు. అతడు దొ మింగో పక్కనే కూర్చున్నాడు. 

వావ్! మీరు వాయిస్తారా గిటార్ అన్నాడు దొమింగో. ఎర్నెస్టో తలపట్టుకున్నాడు. ఒకడే ఇలా రెచ్చి పోతుంటే రెండోవాడు కూడానా అనుకున్నాడు. నేను మీముందు గిటార్ వాయిచడం హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే. అన్నాడు శాంటియాగో. నా గిటార్ పాడైపోయిందండీ! అంతబాగా పలకదు నాగిటార్ అన్నాడు దొమింగో తన గిటారులో చీలిక చూపిస్తూ.  “అయ్యో! నా గిటార్ తీసుకోండి!” అన్నాడు శాంటియాగో. “వద్దులెండి అది చాలా ఖరీదైనది కదా!” అన్నాడు అన్నాడు దొమింగో. 

 “పర్వాలేదుతీసుకోండి! వాలెన్సియాలో మరోటి కొనుక్కుంటా ను నేను అక్కడికే వెళుతున్నాను. అక్కడ గిటార్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. తెలుసా?” అన్నాడు శాంటియాగో.  సెంచోర్ది బ్రదర్స్ 1881 లో వెలేసియాలో స్థాపించిన గిటార్ తయారీ వర్క్ షాప్ (కర్మాగారం) యూరోప్ అంతా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆరోజుల్లో ప్రచార సాధనాలు తక్కువ కనుక సమాచారం అందడం అంత సులభం కాదు.  మొట్ట మొదటిసారిగా ప్యాసింజెర్ షిప్ వాలెన్సియా నుంచి బయలుదేరుతున్నాది అందులో నేను నేను యంత్ర విభాగంలో పనిచేస్తున్నాను. అన్నాడు శాంటియాగో. 

డొమింగో ఎర్నెస్టో వైపు చూసాడు ఎర్నెస్టో కి పిచ్చెక్కింది. షిప్ ఎంత దాకా వెళుతుందండీ అన్నాడు. శాంటియాగోతో. బ్యోనస్రె ఏరెస్ దాక వెళుతుంది అన్నాడు అతడు. ఎర్నెస్టో కి బుర్రతిరిగి కింద పడిపోయాడు

అప్పుడు డ్యూక్ "రాజు గారే వస్తారు. నేను తీసుకొస్తాను ఎవరూ కదలొద్దు." అని అని వడివడిగా వెళ్ళిపోయాడు. 

అంతః పురం లోకి వెళ్ళాడు. ఆల్ ఫోన్ సో రాజు తన అంతః పురంలో పుట్టిన రోజు దుస్తులలో ప్రకాశిస్తూ చిరునవ్వులు దొరలిస్తూ సంగీతం వింటున్నాడు. ఇంతలో ఒక వయ్యారి భామ హంసలా నడుచుకుంటూ వచ్చింది. ఆమె రాడంతో సంగీత కారుడు సద్దుకుని లేచి వెళ్ళిపోయాడు.

ఈ సంగీతం కంటే నీ స్వరం మధురం గా ఉంటుంది. నీ కవితలు వినడం కంటే సుఖమేమీలేదు అన్నాడు. అనుమతి లేకపోడంతో డ్యూక్ ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. నాకంటే రాజుకి ఎక్కువైందా ఈ ఆడది అని మనసులో అనుకుని ఖంగుతిని ఆ ద్వారం వద్దే నిస్చేస్తుడై నిలబడిపోయాడు. అప్పుడే జూలియన్ సెవరో అక్కడికి వచ్చారు ఇదివరకు రోజెలియో కి జరిగినది అవమానం కాదు ఇప్పుడు డ్యూక్ కి జరిగినది అవమానం. అనుకున్నారు.

జులియన్, సెవరో సేవారో మామగారు డ్యూక్ హువాన్ తలుపు దగ్గర ఎదురు చూస్తున్నారు. కిటికీకి ఉన్న పరదా తొలగి అందాలరాశి అలె రాజుగారి ఎదురుగా సోఫాలో కూర్చొని కనిపిస్తున్నాది. “అవమానం!! అనుమతిలేనప్పుడు ఇంకా ఎందుకు ఇక్కడ? పదండి పోదాం!” అన్నాడు సెవరో. 

“చూడు అల్లుడూ! ప్రజల ముందు ఇలా జరిగితే అవమానం అనుకోవాలి. రాజు గారి దగ్గర ఇలా జరిగితే అవమాన అనుకోకూడదు తెలిసిందా?” అన్నాడు హువాన్. “ఏమో! నాకేమీ అర్థం కావడం లేదు.” అన్నాడు సెవరో. “చూడు నాయనా ఆల్ ఫోన్సో రాజులకి సంగీతం, నాట్యం అంటే చాలా ఇష్టం. వీళ్ళ పూర్వజుడు 13వ శతాబ్దానికి చెందిన అల్ఫోన్సో X గొప్ప కళా పోషకుడులే! 
 
                                                         
ELENA SANZ - ALFONSO - DUKE

ఎల్ సాబియోని సంగీత రచనల కొరకు నియమించడమే కాక సహ రచయితగా పనిచేశాడు. కాంటిగాస్ డి శాంటా మారియా అనే 420 పాటల సమాహారం అల్ఫోన్సో X వ్రాసినవే. ఈ పాటలు మధ్యయుగ సంగీతంలో అత్యంత ముఖ్యమైనవి. తెలిసిందా? రాజే స్వయంగా కవి రచయిత. అల్ఫోన్సో కోర్టు సంస్కృతికి కేంద్రంగా ఉండేది. అలాంటి కళాపోషకుడు ఎక్కడా ఉండరు తెలిసిందా! అన్నాడు డ్యూక్. 

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆంటోనియో "అవును చాలా కళాపోషకు డు!” అన్నాడు. వెటకారంగా. “ఇక్కడికెందు కొచ్చావు వెటకారం ఆడడానికా?” పెద్ద దంపతులని ఏంచేసావు?” అన్నాడు డ్యూక్. 

డ్యూక్ తో గొడవెందుకని ఆంటోనియో "చూడు జులియన్ మీ తలిదండ్రులని సన్మానించడమే నాకు అప్పగించిన పని నేను విజయవంతంగా చేసాను. వాళ్ళు వెళ్ళిపోతా మంటున్నారు నా సమయస్ఫూర్తి తో రోజెలియో ఎలెనా లను రాయల్ లైబ్రరీని సందర్శించమని పంపాను. మీరు రాజుగారిని తీసుకొస్తే త్వరగా తీసుకురండి కాస్సేపటిలో వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు కూడా సేలవిప్పించండి నేను వెళ్ళిపోతాను.” అన్నాడు ఆంటోనియో. 

“ఆంటోనియో! సమయస్ఫూర్తి ఉన్నవాడివి ఈ సమయంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? కొద్ధి సేపు ఉండు నీ సేవలకు నేను ఒప్పుకున్న మొత్తంతో పాటు, ఇక్కడ ఉన్నందుకు కూడా చెల్లిస్తాను." అన్నాడు జులియన్. “ఆబ్బె ఈ కాస్సేపటికీ డబ్బక్కలేదండీ ఉంటాను." అన్నాడు ఆంటోనియో. “ఉంటే ఉన్నావు గానీ వెటకారాలాడకు అన్నాడు డ్యూక్. “అయ్యా వెటకాలాడకున్నానిజం చెప్పచ్చా?” అన్నాడు ఆంటోనియో. 

ఏంటయ్యా నువ్వు చెప్పే నిజం? అన్నాడు డ్యూక్. “15 వ శతాబ్దం లో భారత దేశంలో శ్రీ కృష్ణ దేవరాయలు అని ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన సాహిత్యాన్ని బాగా పోషించాడు, కవులని ఆదరించాడు. అయన ఆస్థానంలో 8 మంది పండితులు ఉండేవారట. ఆయన కూడా కవి, రచయిత. ఆయన ఆస్థానం సాహిత్యానికి సంస్కృతికి కేంద్ర బిందువు గా ఉండేది.” అన్నాడు ఆంటోనియో. 

ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం మాట ఎందుకు. ఈ కాలంలో అలాటివారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అంటే ఈ ఆల్ఫో న్సో రాజుగారే తెలిసిందా? ఈయనకి కవిత్వమంటే ప్రాణం. కవితలు ఎంతసేపు వింటాడు అయిపోవచ్చింది అన్నాడు కిటికీలోంచి చూస్తూ. ఆయనకీ కవితల కంటే స్త్రీలంటే ప్రాణం అండీ అన్నాడు ఆంటోనియో. ఎం మాట్లాడు తున్నావు? అని కళ్లెర్రజేశాడు డ్యూక్. “అయ్యా మీరే కదండీ నిజమైనతే చెప్పచ్చని అన్నారు. ఆయన ఎలెనా సాంజ్ అనే గొప్ప ఓప్రా సింగర్ ని గర్భవతిని చేసి వదిలేసాడు. ఆమె తన ఇద్దరి కొడుకులు ఆల్ఫోన్సో, ఫెర్డినాందోలతో ఫ్రాన్స్ వెళ్లి బ్రతుకు తోంది.” అన్నాడు ఆంటోనియో. “అలాగని కొంప ఎక్కి కుయ్యవయ్యా! లేకపోతే డ్రామా వెయ్యవయ్యా!” అని కసిరేడు 

“ఆ స్త్రీల పరిస్థితి ఏంటో ఒక్క సారి ఆలోచించండి, వారిబిడ్దల గతి ఏంగాను?” అన్నాడు ఆంటోనియో. “అబ్బా! రాజులకి ఇవి మామూలేనయ్యా” అన్నాడు డ్యూక్. మరి అలాటప్పుడు స్త్రీని మాత్రమే శిక్షించే చట్టాలు ఎందుకు చేయాలండీ?” అన్నాడు ఆంటోనియో. ఆంటోనియో మనం చట్టాల గురించి మరికసారి తప్పక చర్చిద్దాము అన్నాడు జులియన్

                                                                  ***

అంతః పురంలో అందాల భరిణి లాంటి అలె బంగారు రంగు ఫ్రాక్ లో మిలమిలా మెరిసే ముత్యంలా మెరుస్తోంది. ఎదురుగా 26 ఏళ్ల నవయవ్వను డైన రాజు. అలె ఫ్రాక్ నిండా పువ్వులు, ఆ పువ్వులలో అలె కూడా ఒక పువ్వులా కనిపిచింది రాజుకి. రాజు మంచి యవ్వనంలో ఉన్నాడు ఆమె కవితాలకంటే ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. బయట ద్వారం దగ్గర డ్యూక్ ఎప్పుడు పిలుస్తాడా అని చాలా అసహనం గా ఉన్నాడు.

రెండువేల కోటలలున్న రాజ్యం, పద్దెనిమిది వందల నదుల తో పూజ్యం. అంటూ స్పెయిన్ మీద ఒక కవిత చెప్పింది. రాజు మెచ్చుకోలుగా చూసాడు

” ఐరోపా లోనే అతిపెద్ద దుర్గం అల్ఫాన్సో సృష్టించిన స్వర్గం. అంటూ రాయల్ పేలస్ మీద ఒక కవిత చెప్పింది. రాజు చప్పట్లు కొట్టాడు. చప్పట్లు విని ద్వారపాలకుడు కంగారు పడి తలుపు తెరిచి లోపలి వెళ్ళాడు. అతడి తో పాటు హువాన్ డ్యూక్ అఫ్ ఆల్బా కూడా లోపలి ప్రవేశించాడు. రాజుకి కోపం వచ్చింది. “ఎందుకు వచ్చావు?” అని ద్వారపాలకుడిని అడిగాడు. “చప్పట్లు కొడితే పిలిచారనుకున్నాను” అన్నాడు. 

డ్యూక్ వైపు చూసి తిట్టకముందే "మహారాజుకి జన్మదిన శుభాకాంక్షలు." అన్నాడు డ్యూక్. ఓహ్! హువాన్ డ్యూక్ అఫ్ ఆల్బా! జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి చాలా తొందరపడుతున్నారే! మరి మాకు ఎం బహుమతి తెచ్చారు?" అన్నాడు ఆల్ఫోన్సో. అయిపోయింది, అంతా అయిపోయింది. డ్యూక్ చేతులో ఏమీ లేదు ఇవ్వడానికి. ద్వారం వైపు చూసాడు. ఆంటోనియో తన తలపై కిరీటం ఉన్నట్టు ఊహించుకుని, ఆ కిరీటాన్ని తీసి జులియన్ పాదాల వద్ద పెట్టి జులియన్ కి మోకరిల్లాడు. అది చూసిన డ్యూక్ మరు క్షణం లో తన తలపై ఉన్న కిరీటాన్ని తీసి రాజుగారి పాదాల వద్ద ఉంచాడు. బ్రతికిపోయాడు అనుకుంది అలెహన్ద్ర. 

మోకరిల్లిన డ్యూక్ ని లేవదీసి ఎదో అత్యవసరమైన పనిమీదే వచ్చునంటారు. విషయం ఏంటో చెప్పండి అన్నాడు. జరిగిన విషయాన్నిమూడు ముక్కలలో చెప్పి తమరు రావాలి నాపరువు కాపాడాలి మహారాజా అన్నాడు. తక్షణం బైటికి పోకపోతే పరువుతో పాటు పదవి కూడా పోతుంది అని అరిచాడు మహారాజు.


అలెకి విషయం అర్థమైంది. డ్యూక్ ని తరిమేయడం ఆమె మనస్సును కలిచివేసింది ఆమె ఆల్ఫోన్సో రాజుల పై ఒక చిన్న కవిత చెప్పింది “అరివీర భయంకరులు ఆల్ఫోన్సో రాజులు. 44 దేశాలను వలసరాజ్యాలుగా చేసుకుని పాలించారు.” అయినా ఆల్ఫోన్సో ముఖం విప్పారలేదు జానపద కళలను పోషించారు. 


ఇంట్లో అత్తా మామ వేలన్సీయా వెళ్లిపోయారు, కొడుకు పెపితో యూనివర్సిటి కి వెళ్ళిపోయాడు. జూలియన్ థియో ని తన నగల దుకాణానికి తీసుకెళ్ళి పోతున్నాడు. కాసా దే వేగాస్ లో ఏడుచిమినీలతో పాటు ఎనిమిదవ చిమిని (పొగగొట్టం)లా తను పడి ఉంటున్నానని పనివాళ్లు కూడా తనని చూసి చెవులు కొరుక్కుంటున్నారు.) 

భర్త వాల్డెమోరో నుంచి నన్ను తీసుకెళ్లడానికి రాలేదని ఆంటోనియోకి చెబితే “ఇందులో ఎదో మర్మం ఉంది. అతడిని కలుసుకోడం కాదు అతడెలాటి వాడో తెలుసుకోవాలి.” అని చెప్పి బుద్ధి కుశలత గలవాడు కనుక నేరుగా వెళితే అది సాధ్యం కాదని అతడి నాటక శాలలో వేషం మార్చి మరియా దెస్ కాంతెస్ అని పేరు తగిలించి పంపించాడు. 

పేరు వేషం మార్చుకుని వాల్డెమోరో వెళ్లి వచ్చాక సేవరో అసలు రంగు బయటపడింది. సెవరో కి ఇద్దరు మిస్ట్రెస్లు ఉన్నారని తేలింది. ఆరు నెలలనుంచి ఇదేవరస. ఇతడిని ఎలా దారిలోకి తేవాలి? ఆలోచిస్తుంటే బుర్ర పిచ్చెక్కు తోంది! హు! డ్యూక్ అఫ్ ఆల్బా కూతురికి వచ్చిన దురవస్థ. మెర్సిడెస్ వంటరిగా గదిలో కూర్చుని తన భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తున్నది. 

పేరు వేషం మార్చుకుని వాల్డెమోరో వెళ్లి వచ్చాక సేవరో అసలు రంగు బయటపడింది. సెవరో కి ఇద్దరు మిస్ట్రెస్లు ఉన్నారని తేలింది. ఆరు నెలలనుంచి ఇదేవరస. ఇతడిని ఎలా దారిలోకి తేవాలి? ఆలోచిస్తుంటే బుర్ర పిచ్చెక్కు తోంది! హు! డ్యూక్ అఫ్ ఆల్బా కూతురికి వచ్చిన దురవస్థ. మెర్సిడెస్ వంటరిగా గదిలో కూర్చుని తన భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తున్నది. 

అలె దగ్గరికి వెళ్ళాలి, కాదు ఆంటోనియో దగ్గరికి వెళ్ళాలి. అతడైతే మంచి సలహా ఇవ్వగలడు. అనిపించింది. “నా భర్త నన్ను బాగా చూసుకోడం లేదు. అతడికి ఉంపుడుగత్తెలు ఉన్నారు. దీనికి ఏంటి పరిష్కారం అని డ్యూక్ అఫ్ ఆల్బా నే అడుగుతాను. అని నిర్ణయించుకుంది.  కాసా దే వేగాస్ లో అందరూ ఎవరిపనిలో వారున్నారు చూస్తే నాకేంటి నా జీవిత సమస్య పరిష్కరించుకునే హక్కు నాకుంది అని నేరుగా మెర్సిడిస్ గుర్రాల శాల దగ్గరికి వెళ్లి ఒక ముస్తాంగ్ (వైల్డ్ హార్స్) తీసుకుని బయలుదేరింది. 

ఆల్బా సుమారు రెండువందల కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ తండ్రి వంటరిగా నే ఉంటాడు. అతనిని వంటరి తనం బాధించదా? ఏమో నిత్యం ప్రజాసమస్యలలో ములిగి తేలుతూ ఉంటాడడం వల్ల బాధించడమో... ముస్తాంగ్ పిచ్చ వేగంతో పరిగెట్టేస్తోంది. 

మెర్సిడెస్ ఒళ్ళంతా బిగించి కూర్చుంది. బండిలో హాయిగా కూర్చోవచ్చు. గుర్రం మీద అలా కుదరదు కదా! అలా ఒక గంట పరిగెత్తిన తరువాత మొక్క మోడు చెట్టు చేమా లేని ఒక ఎత్తైన పీఠభూమి వచ్చింది. ఆ ఎత్తైన పీఠభూమి పైకి ముస్తాంగ్-ని ఎక్కించింది. గుఱ్ఱం అలిసి పోయింది. మెర్సిడిస్కి మెడలు పట్టేసాయి. గుర్రం మెల్లగా నడుస్తోంది.

పెద్దరాతి కోటలు అందమైన భవంతులు స్వర్గంలా ఉన్నాయి.  ఒక విశాల మైన భవనం ముందు ఒక చెట్టు ఉంది. మెర్సిడెస్ గుర్రాన్ని ఆపింది. ఇక్కక చెట్టు ఉన్న ఒకే ఒక భవనం ఇదే. నీరు కూడా ఉంటే బాగుండును అనుకుని గుర్రాన్ని నీడలో ఆపింది. 

ఎత్తైన ప్రదేశమేమో దూరంగా చాలా ఇల్లు కనిపిస్తున్నాయి. ఎదురుగా ఉన్న భవనానికి పెద్ద స్తంబాలు అర్ధ చంద్రాకారపు ద్వారాలు కనిపిస్తు న్నాయి. అది మొనాస్టరీ కానీ నన్నరీ కానీ కావచ్చు. మొనాస్టరీ అంటే ఆడ మెగా సన్యాసులు ఉంటారు, నన్నరీ అంటే కేవలం ఆడ సన్యాసులు ఉంటారు. అర్ధ చంద్రాకారపు ద్వారాలు దాటి లోపలకి నడిచింది. 

పెద్ద పెద్ద గదులు ఎత్తైన పైకప్పు. అది ఒక క్రైస్తవ మఠం అని తెలుస్తోంది. ఒక పెద్ద నడవ కి ఇరువైపులా గదులు ఉన్నాయి ఒక గదిలో నలుగురు సన్యాసినిలు ఉన్నారు. మరో వైపు చూసింది అందులో పెద్ద మరియా చిత్రపటాలు ఉన్నాయి. ఏసు చిత్రపటం ఎక్కడాలేదు. అంటే వీరు మరియాని మాత్రమే పూజించే సన్యాసినులు. మరోగదిలోకి చూసింది అక్కడ గోడకు నాలుగు చిన్న చిత్రపటాలు ఉన్నాయి. 

నేలపై కూర్చుని ఒక సన్యాసిని పుస్తకంలో ఎదో రాకుంటోంది. మెర్సిడెస్ ను చూడగానే దారి తప్పి వచ్చిన ప్రయాణీకు రాలని అర్థం చేసుకుని. మంచినీరు ఇచ్చింది. నీళ్లు తాగిన తరువాత ఇది అవిలా అనే గ్రామం అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. నేను మేడ్రిడ్ నుంచి వస్తున్నాను ఆల్బా వెళ్ళాలి అని చెప్పి తన పేరు మరియా దెస్ కాంతెస్ అని చెప్పింది. మెర్సిడెస్. ఏంటి రాస్తున్నారు చూడచ్చా అంది. 

మెర్సిడెస్ పుస్తకం చేతికిచ్చింది ఆ సన్యాసిని. అది ఒక ప్రతీకార గీతం మోసం చేసిన వాడి మీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చాలా అద్భుతంగా రాసి ఉంది. కొరడాతో కొట్టాలని నడ్డి విరగ్గొట్టాలని భలే రాసింది. ఆ పాట చదువుతుంటే సెవరో గుర్తొచ్చాడు. బాగుంది అని ఒక జీవం లేని నవ్వు నవ్వి పుస్తకం ఇచ్చేసింది. 

నా గుర్రానికి గుర్రానికి… అని నసిగింది మెర్సిడెస్. “ఇక్కడ ఒక్క పచ్చటి మొక్క గానీ పచ్చ గడ్డి గానే లేదు. నేటి కరువు ఎక్కువ. అందుకే నన్నిక్కడ పడేసాడు.” అంది ఆ సన్యాసిని. అంటే మీరు సన్యాసిని కాదా అంది మెర్సిడెస్ ఆశ్చర్యపోతూ. నేను సన్యాసినిలా ఉన్నానా? సన్యాసినిలు ఇరవైనాలుగు గంటలూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాక్యాలు వల్లె వేస్తూ ఉంటారు. నేను రాసిన పాట చూసారుగా. అంది సన్యాసిని. 

గుర్రం రోజుకు 20 లీటర్ల నీరు తాగుతుంది. నా రెండు రోజుల కోటా నీ గుర్రానికి పొయ్యాలి పద అని ఒక పెద్ద పాత్రతో నీరు పట్టుకొచ్చి గుర్రం ముందు పెట్టింది. సన్యాసిని. దీని నడక వాటం చూస్తుంటే రౌడీలా ఉంది అని మెర్సిడెస్ అనుకుని అమ్మ మిమ్మల్ని ఇక్కడ పడేసారు అన్నారు కదా ఎవరు? అంది మెర్సిడెస్. భవనంలోకి వెళుతూ చివాలున వెనక్కి తిరిగి చూసింది కొరడాతో కొట్టి నట్టుంది ఆ చూపు. “డ్యూక్ అఫ్ ఆల్బా” అంది. “ఇంకా నయం నేను అతడి కూతురిని అక్కడికే వెళుతున్నాను అని చెపితే చంపి పాతేసేది!”

అనుకుంది మెర్సిడెస్. అప్పటికే ఇద్దరూ ఆమె గదిలోకి చేరారు. ఇంక ఎంతవేగిర వెళ్ళిపోతే అంత మంచిది అని మరి నేను వెళతాను అంది మెర్సిడెస్. ఇదిగో ఆ గుర్రం చచ్చిపోతుంది. నీకేం ఎక్కి కూచుంటావు. నీ సొమ్మేం పోయింది. నోరులేని జీవి నిన్ను లాగద్దూ! అని అరిచింది. ఆడ రాక్షసి గుహలో చిక్కినట్టనిపించి భయం వేసింది మెర్సిడెస్ కి. నీకు కూడా రొట్టె తెస్తాను ఉండు. ఇక్కడ కుర్చీలు సోఫాలు ఉండవు నేలమీద కూర్చోడమే. అని విసుక్కుని రొట్టె తేడానికి వెళ్ళింది ఆమె. మెర్సిడెస్. అప్పుడు చూసింది గోడకేసి తన తండ్రి డ్యూక్ అఫ్ ఆల్బా బొమ్మ. ఆ పక్కనే ఆలేహన్ద్ర, ఆ సన్యాసిని కలిసున్న చిత్రం. మెర్సిడిస్కి తల తిరుగుతొంది. ఇంతలో కొరడా రాణి రొట్టె తెచ్చి తినమని ఇచ్చింది. 


డ్యూక్ ఫే ఆల్బా హువాన్ నిన్ను ఎందుకు ఇక్కడ పడేసాడు?

నీ పేరు ఏంటి? చిత్రం లో నీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు పేరేంటి? అంది.  ఆ వివరాలన్నీ నీకెందుకు గూఢచర్యం చేస్తున్నావా? అని రొట్టె లాక్కుంది కొరడా రాణి. మెర్సిడెస్ నిస్చేస్తురాలై ఉండిపోయింది. వెంటనే రొట్టె వెనక్కిచ్చేసి. రొట్టె తిని వెళ్ళిపో లే అని బయటకు వెళ్ళిపోయింది. మెర్సిడెస్ రొట్టె పక్కన పెట్టి బైటకువెళ్లి ఆమెను బ్రతిమాలి లోపలి తీసుకొచ్చి నా పేరు మెర్సిడెస్ నేను డ్యూక్ హువాన్ కూతురిని. ఆ చిత్రంలో నీ పక్కన నిలబడ్డ అలె నా ప్రాణస్నేహితురాలు. అంది మెర్సిడెస్ కన్నీటితో. 

నాపేరు దోలెరెస్, నాపక్కన ఉన్నది మా అక్క అలెహన్ద్ర. అత్యవసర సమయాల్లో కొంచెం వేషం నాపేరు వాడుతుంది. అంది. డోలొరెస్ నేను మీ అక్కని అమ్మా. ఇక్కడికి రావడం నా అదృష్టం అమ్మా. 

డోలొరెస్, మెర్సిడెస్ ఇద్దరూ ముస్తాంగ్ పై కూర్చున్నారు. వారి సన్నటి నాజూకైన శరీరాలు ముస్తాంగ్ కి కష్టం అనిపించలేదు. విడిచిన బాణంలా దూసుకుపోతోంది. అంతా మట్టి రోడ్లే. అక్కడక్కడా ఎదురైనా గుర్రపు బళ్లవాళ్లు వీళ్ళని వింతగాచూస్తున్నారు. వక్షాలు పైకి క్రిందకి ఎగిరి పడుతు న్నాయి. రాళ్లు లేని మెత్తటి నేల కావడంతో ముస్తాంగ్ పెద్ద దాట్లతో పరిగెడుతోంది దాని పరుగు చూస్తే మెర్సిడెస్కి భయమేసింది. అయినా వేగిర ఇల్లు చేరుకోవాలనే తపనతో వేగాన్ని నియంత్రించటానికి ప్రయత్నించలేదు. 

కొంత దూరం తరువాత పచ్చని పచ్చిక బైళ్ళు కనిపించాయి, నది పాయికూడా కనిపించింది. “ఓ! మంజానారెస్ నది” అంది డోలొరెస్. "ఐతే రాయల్ ప్యాలస్ దగ్గరికి వచ్చేసాము. ఇల్లు దగ్గరికి వచ్చేస్తోంది."అంది మెర్సిడెస్. అప్పటికి చీకటి పడిపోయింది.  దూరంగా స్తంబాల మీద గేస్ లైట్స్ కనిపి స్తున్నాయి. అంటే అక్కడ ఎదో కూడలి టావెర్న్ ఉన్నాయి అని గుర్రాన్ని ముందుకి పోనిచ్చి చూసింది. అది టావెర్న్ కాదు జెంట్లమన్ క్లబ్. 

ఇద్దరూ దిగారు. ఒక కుర్రాడు వచ్చి గుఱ్ఱాన్ని తిండి పెట్టడానికి శాలలోకి తీసుకెళ్లాడు. డోలొరెస్, మెర్సిడెస్ ఇద్దరూ లోపలికి వెళ్లారు. లోపల గోడలకి నిండా పెద్ద అద్దాలు, గ్యాస్ లైట్స్ అమర్చబడి ఉన్నాయి. ఒక రూంలో లైబ్రెరీ ఉంది. కొంత మంది పుస్తకాలు చదువు కుంటున్నారు. పక్క గదిలో కొంత మంది పేక ఆడుకుంటున్నారు. ఆ పక్క గదిలో కొద్ది మంది బిలియర్డ్స్ ఆడుకుంటున్నారు. ఒక పెద్ద హాల్ లో నాలుగు వైపులా గోడలకి వరుసగా కుర్చీలు అమర్చారు. మధ్యలో వారి పిల్లలు ఆడు కుంటున్నారు. 
గెస్ లైట్లు వెచ్చగా ఉన్నాయి. 

ఆ పక్కనే బార్ ఉంది. ఇద్దరూ అందులోకి వెళ్లి పోసెట్ (పాలలో వైన్ కలిపిన వేడిపానీయం, కాఫీలు, టీలు రాక ముందు తాగే డ్రింక్.) తాగుతున్నారు. "లోలా ని ఈ రోజు విడుదల చేశారట తెలుసా?" అన్నాడు ఒకడు. మరొకడు"దానికేం దానికి అందమైన కూతురులు న్నారు. దాన్ని వదిలేస్తారని నాకు రాజుగారి పుట్టిన రోజు వేడుకలప్పుడేతెలుసు"అన్నాడు రెండోవాడు. "ఎలా తెలుసు?" అన్నాడు మొదటివాడు. ఆ డోలొరెస్ కవితలు రాజుకి బాగా నచ్చి ఉంటాయి ఒదిలిపెట్టక ఏంచేస్తాడు?” అన్నాడు. 

దోలొరెస్ కళ్ళ లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పటికే ఇద్దరూ పోసెట్ తాగడం ముగించారు. పదవే ఇక పోదాం అని దోలోరెస్ చెయ్యి పట్టుకుని బైటకు తీసుకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్లి నిలుచున్న ఆమెను చూసి కుర్రవాడు గుర్రాన్ని తెచ్చి ఇచ్చాడు. అప్పుడే అక్కడకి ఒక సైనికాధికారి ఇద్దరు సైనికులు వచ్చారు. డోలొరెస్ ఎదో చెప్పబోతుంటే వద్దని సైగచేసి గుర్రం ఎక్కేసింది. ఆమె వెనుకనే డోలొరెస్. వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయారు అక్క చెల్లెల్లు. 



బార్తెక్ ముందు సీట్లో కూర్చొని బండి నడుపుతున్నాడు. వెనక సీట్లో దొమింగో, ఎర్నెస్టో కూర్చిని ఉన్నారు. దొమింగో గిటార్ తీయని స్వరాలు పలుకుతోంది. ఈ సంగీతం పేరు రికోయెర్దోస్ దె ల అలాహంబ్ర. ఈ స్వరం ఇలాగే వాయించా లంటే ఒక గితానో వల్ల అవ్వదు మీ అసలు పేరు ఏంటి? లేదా పూర్తి పేరు ఏంటి ?” అన్నాడు బార్తెక్. 

ఏం ఎందుకవ్వదు గితానో లు మనుషులు కాదా? వాళ్ళు గిటార్ వాయించ కూడదా? నోబుల్స్ మాత్రమే వాయించాలా? "అని తగులుకున్నాడు ఎర్నెస్టో. "బాబూ! నీకు విషయం అర్థం అవ్వకుండా దూరిపోతున్నావు. ఆయన గితానో కాదు. నువ్వు నోరు మూసుకుంటే ఆయనెవరో తెలుస్తుంది."అన్నాడు బార్తెక్.

ఎందుకు వాయించకూడదు?” అన్నాడు దొమింగో. అయ్యా ఇందులో చాలెంజింగ్ ట్రెమోలో టెక్నిక్ ఉంది. చాలా అడ్వాన్స్డ్ గిటారిస్ట్ లే వాయించగలుగు తయారు. 

దొమింగో: మీకు సంగీతం గురించి ఎలా తెలుసు?

బార్తెక్: ఈ సంగీతం యొక్క A-విభాగం A-మైనర్‌లో వ్రాయ బడింది మరియు B-విభాగం సమాంతర A-మేజర్లో వ్రాయ బడింది. నేను రాయల్ కంజెర్వేటరీ కాలేజ్ లో మ్యూజిక్ నేర్చుకున్నాను. అక్కడ మా ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గారు వాయించేవారు. అన్నాడు బార్తెక్. ఇవన్నీ నీకెలా తెలుసు? అయినా నీ లాజిక్ కి నేను ఒప్పుకోను అన్నాడు ఎర్నెస్టో. శివధనస్సు ఎక్కుపెట్ట గలిగినవాడు శ్రీరాముడు, గాండీవం ఎక్కు పెట్టగలిగేది అర్జునుడు, రికోయెర్దోస్దెల అలాహంబ్ర ఇంత బాగా వాయించ గలిగేది ఫ్రాన్సిస్కో. అన్నాడు బార్తెక్.

“శ్రీ రాముడు శివ ధనుస్సు, గాండీవం అర్జునుడు ఏంటి వన్నీ?” అన్నాడు దొమింగో.  అవి ఇండియన్ డ్రామా వేసే నన్నడగండి అన్నాడు ఎర్నెస్టో
ఏం ఆంటోనియోని అడిగితె తెలియావా? అన్నాడు దొమింగో. వాడొక బీ గ్రేడ్ ఆర్టిస్ట్. వాడెంతసేపు శకుంతల ఊర్వశి లాంటి నాటకాలువేసి స్త్రీ సమస్యల గురించి మాట్లాడతాడు. 

అదే నేనైతే నైతికత విలువలు చూపిస్తాను. నా నాటకం ఉన్నత నైతికత మీద నిలబడుతుంది. నా నాటకం రాజులకి, డ్యూక్స్ వచ్చారు మెచ్చేరు. 

అవును నువ్వు చూపించే స్త్రీ పాతివ్రత్యం రాజులకి, డ్యూక్స్ కి నోబుల్స్ కి కూడా నచ్చుతుంది. ఒక టావెర్న్ వద్దకు చేరింది బండి. బార్తెక్ బండి ఆపు అన్నాడు ఎర్నెస్టో. 

మధ్యాహ్న భోజన సమయమ అవుతోంది. ఇదే చివరి మజిలీ అందరూ బండి దిగండి అన్నాడు బార్తెక్. ఇక్కడ బాగా తినాలి అన్నాడు ఎర్నెస్టో. తినేసి ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం. అన్నాడు దొమింగో. "రాత్రికి ఇక్కడ పడుకోడమెందుకు? భోజనం చేసి విశాంత్రి తీసుకుని బయలుదేరితే సాయం కాలా నికి ఇల్లు చేరిపోతాం కదా" అన్నాడు బార్తెక్. "నాకు ఇళ్లలో ఉండడం ఇష్టం ఉండదు." అన్నాడు దొమింగో. "ఏం మనిషిరా బాబు!" అన్నాడు. బార్తెక్. 

“అక్క చేతివంట తింటే అసలు ఇల్లు వదలవు తెలుసా అన్నాడు ఎర్నెస్టో. అక్క అక్క అంటే చాలు అన్నీ అవే నడుచుకొస్తాయి.” అని ఎర్నెస్టో చెపుతుంటే దొమింగో అసహ్యించుకుని వెళ్ళిపోయాడు. “అక్కడ కూడా చెట్లు ఉన్నాయి చెట్టుకిందే ఉందుగాని. నీ బట్టలు వాలకం చూసి ఇంట్లో ఎవరు పెట్టుకోగలరు నిన్ను అన్నాడు ఎర్నెస్టో. 

ఎర్నెస్టో అలా డోమింగోతో ఆడుకుంటుంటే చూసి బార్తెక్ కి చాలా నిస్పృహ కలిగింది. ఒక చెట్టుకింద నిస్త్రాణంగా కూర్చు న్నాడు. అతడి పరిస్థితి చూసి “డాన్సా మోర్” అనే సంగీతాన్ని గిటార్ పై పలికించాడు దొమింగో. బార్టెక్ మృత సంజీవిని తగిలి లక్ష్మణుడు లేచినట్టు లేచి “అద్భుత సంగీతం. అమోఘమైన స్వీప్ టెక్నిక్” అన్నాడు బార్తెక్. 

స్వీప్ టెక్నిక్ అంటే? క్లియోపాత్ర నాటికలో రిగ్ వేసి ఆమెను దింపుతాము అలాగా అన్నాడు అన్నాడు ఎర్నెస్టో. స్వీప్ పికింగ్ అనేది స్వీపింగ్ మోషన్‌తో ప్రక్కనే ఉన్న స్ట్రింగ్‌లపై వరుస గా పలికించడం ఇది జాలువారుతున్న జలపాతం ధ్వనిని సృష్టిస్తుంది సాధారణంగా ఆర్పెగ్గియోస్‌లో వాడే టెక్నిక్ ఇది. ఫ్రాంక్ గాంబేల్ మరియు జాసన్ బెకర్ వంటి గిటారిస్ట్‌లు స్వీప్ పికింగ్‌లో ప్రసిద్ధి కెక్కినవారు. అన్నాడు దొమింగో. 

మధ్యాహ్న భోజనం చేసేముందు గుర్రానికి ఆహారం పెట్టి, అది తింటుండగా అక్కడే నిలబడ్డారు ముగ్గురూ. తిన్న తరువాత గుఱ్ఱం తప్పనిసరిగా నీరు తాగాలి అని ఎర్నెస్టో గుర్రానికి నీళ్లు తెచ్చాడు. గుఱ్ఱం నీళ్లు తాగుతుండగా

“ఎలెనా అర్మాందా ఆరేళ్ళ వయసు నుంచి గానం నేర్చుకోడం మొదలు పెట్టింది. పదేళ్లవయసులో గాయక బృందంలో చేరింది. తరువాత ఆమె అసమాన ప్రతిభతో మాడ్రిడ్ రాయల్ కన్జర్వేటరీలో స్తానం సంపాదించు కుంది. ఆ ఒపేరా గాయని స్వరం అందం ఒకదానితో ఒకటి పోటీ పడు
తుండేవి. ఆ అద్భుత గాయని ఇప్పుడు ఏది? 

ఫ్రాన్, జర్మనీ, స్విజ్జర్లాండ్, ఈజిప్టు లలో ఎక్కడో ఉండి ఉంటుంది అన్నాడు బార్తెక్. “చాలామంది అలాగే అనుకుంటారు. ఆమె ఎక్కడుందో నాకు తెలుసు అన్నాడు దొమింగో. “ఎవరికీ తెలియనిది నీకెలా తెలుసు? అన్నాడు ఎర్నెస్టో
ఆమె నాకు నన్ను ప్రేమించింది కనుక అనేకమంది ఆమె దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. కానీ ఆమె దృష్టిలో నేను పడ్డాను. ఆ తరువాత ఆమె తో ప్రేమలో పడ్డాను. మాడ్రిడ్‌లోని టీట్రో రియల్‌లో ఒపెరా పాడాలని కలలు కంది. ఆమె ప్రతిభ మరియు అందం ఆమె కలలన్నింటినీ సాకారం చేసింది.

అప్పుడు ఆమె అల్ఫోన్సో కంట్లో పడింది. ఆమె స్వరం మొత్తం యూరప్ జయించింది. ఈజిప్షియన్ దైవత్వం ఆమె అందంలో ఉన్నదని అందరూ అనుకుంటుండేవారు. అది తెలిసి అల్ఫోన్సో చాలా ముచ్చటపడ్డాడు. ఆమె నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి చాలా కోపం తెచ్చుకున్నాడు. నాకు రాయల్ కన్సర్వేటరీ లో పనిచేసే అవకాశం పోయింది. ఆమెకు రాయల్ పేలస్ లో పాడడానికి అవకాశం వచ్చింది. డబ్బు, హోదాలో రాజుని మించినవారు ఎవరున్నారు? ఆమెను అక్కడే ఉండాలని ఙ్ఞాపించాడు. 

“తరువాత ఏంజరిగింది?” అన్నాడు ఎర్నెస్టో “దొమింగో ఒక జీవం లేని నవ్వు నవ్వి, ఆమెకు అల్ఫోన్సోతో ఇద్దరు కుమారులు కలిగారు.” అన్నాడు దొమింగో. అంతా స్మశాన నిశ్శబ్దం ఆవరించింది. బండి బయలుదేరింది.


ట్రైన్ మాడ్రిడ్ నుంచి వేలన్సీయా దూసుకుపోతోంది. డొమింగో ఎర్నెస్టో పక్కపక్కనే పక్క పక్కనే కూర్చున్నారు వారి ఎదురుగా మెర్సిడెస్, థియోదోరా కూర్చున్నారు. మెర్సిడెస్ కళ్ళలోకి దొమింగో చూస్తున్నాడు. మెర్సిడెస్ దృష్టి మరల్చడం లేదు. అలాగే థియో ఎర్నెస్టో ఒకరినొకరు చూసుకుంటున్నారు. రైలంతా ఖాళీ గాఉంది.  వారి ఎదురుగాఉండడం ఇష్టం లేక డొమింగో "మీరు వేరే చోట కూర్చోరాదు? రైలంతాఖాళీయేకదా! " అన్నాడు “ఇంత కాలం జరగనిది ఇప్పుడేం జరుగుతుంది?” అన్నాడు ఎర్నెస్టో మెల్లగా. “మొదటినుంచి నాతొ ఇలాగే వాదించేవు. జీవితంలో అనుకొనివే ఎక్కువ జరుగుతాయి. చెప్పాలంటే మనం కలిసిన మొదటి రోజు .... “అని దొమింగో అంటుండగా. ఒప్పుకుంటాను ఆ సుత్తి అంతా ఇప్పుడు కొట్టకు అన్నాడు ఎర్నెస్టో. “ఒప్పుకుంటే ఇంకా ఇక్కడే ఎందుకున్నావు పో!” అన్నాడు దొమింగో 

థియో ఎర్నెస్టో దూరంగా ఉన్న సీట్లలోకి వెళ్లి కూర్చున్నారు.  ఎందుకు అంది థియో. వాళ్ళకి కొంచెం ఏకాంతం కావలట. అన్నాడు ఎర్నెస్టో ఇంతకాలం జరగనిది ఇప్పుడు ఎం జరుగుతుంది? అంది థియో. "ఏం బార్తెక్ దోలొరెస్ మధ్య ఇంతకాలం ఏంజరిగింది. మరి ఇప్పుడు జరగటం లేదా?" అన్నాడు ఎర్నెస్టో. 

ఆమ్మో! చాలా ఆశావాదివే అంది థియో. నీకు లేదా ఆశ అన్నాడు ఎర్నెస్టో మొదటి సారిగా అతడి కళ్ళలోకి చూసింది. ఆ భావన వేరుగా ఉంది. 
ఎదో వెచ్చటి భావన. " నీకు ఉందా ఆశ? అంది థియో. ప్రేమ గా ఆమె వైపు చూసాడు. రైలు కూడా పెట్టుకుంటూ బ్రిడ్జి పై నుంచి పోతోంది. ఆమె కళ్ళు తిప్పలేదు. మనసులో గోడ తొలగిందా అన్నాడు ఎర్నెస్టో. అపరాధ భావన పోయింది. అన్నాది థియో. ఎర్నెస్టో ఆమె పక్కన కూర్చొని ఎందుకు అన్నాడు ఎందుకంటే నేను నిన్ను తమ్ముడు అని ఎప్పుడూ పిలవలేదు తమ్ముడిగా ఎప్పుడూ భావించుకోలేదుకూడా. అంది. 

                                                               ***


ఆంటోనియో లోపెజ్ షిప్ హార్బర్లో కి మళ్ళీ వచ్చింది. వేలన్సీయా చర్చిలో రెండు జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. బార్తెక్ అక్క బావ రోజెలియో ఎలెనా, లోలా సమక్షంలో బార్తెక్ దోలోరెస్ వివాహం చేసుకున్నారు. అంటొనియా అలెహాన్ద్ర వివాహం చేసుకున్నారు. వాళ్ళు రోజెలియో ఎలెనా ఇంటిలో కొద్దికాలం గడిపి తిరిగి మేడ్రిడ్ వెళ్ళిపోతారు. 

అందరూ పోర్ట్ కి వెళ్లారు శాంటియాగో మిసియను సాగనంప డానికి కాదు మెర్సిడెస్ దొమింగో ను సాగనంపడానికి. ఏడేళ్ల పారిస్ లో వంటరి జీవితం గడిపి వచ్చాను. ఇప్పుడు మెర్సిడెస్ ని పెళ్లి చేసుకుని మెర్సిడెస్ తో జీవిత మకరందం గ్రోలుతాను అన్నాడు దొమింగో. 

“ఈ సమాజాన్ని మనం మార్చలేం. ఇప్పుడు అవునన్నా కాదన్న నేను ఎర్నెస్టో తో అక్రమ సంబంధం ఉన్న దాన్నని ముద్ర పడిపోయింది. అది నిజం చేయక పొతే జీవితాతం బాధ పడాల్సొస్తుంది” అంది థియో. నేను బోనస్ ఎరెస్ వెళ్లడం కల. చట్టాలు ఎప్పుడూ ఒకేలా ఉండిపోవు. నాసిరకమైన భావాలు, చట్టాలు మారతాయి. అప్పుడే మేడ్రిడ్ లో అడుగు పెడతాం. అని థియో చెయ్యి అందుకున్నాడు. ఇద్దరూ షిప్ వైపు సాగిపోయారు.








Sunday, February 1, 2026

ఇలాంటి మాస్టారిని నేను చూడలేదు.

లూథరన్ పాఠశాల - శనివారం  జనవరి 31,  2026 

లూథరన్ పాఠశాలలో   - శనివారం  జనవరి 31 2026  పిల్లలతో  కార్యక్రమం చేయడానికి  పాఠశాల వ్యవస్థాపకులు   రత్నకుమార్ గారు నిర్ణయించి ఆహ్వానించారు.  భాషా  నైపుణ్యాల పై  పిల్లలకు శిక్షణ ఇవ్వడం  నేను జీవిత  లక్ష్యంగా పెట్టుకున్నాను.  చిన్న పెద్ద , ప్రభుత్వ పైవేటు పాఠశాలలు, కాలేజ్ లు  యూనివర్సిటీలు దగ్గర దూరం అనకుండా తిరుగుతుంటాను. 

 నా బ్లాగ్ లు చూస్తే  పదేళ్లనుంచి ఇదే పనిలో ఉన్నానని  తెలుస్తుంది.   

జనవరి 31 , చేస్తున్న పని ఆపి ఉదయాన్నే 7.00 గంటలకు నరసరావుపేట బయలుదేరాము. 

             

విశాలమైన  ఆటస్థలం , సాధారణ మైన  తరగతిగదుల లూథరన్ పాఠశాల   ఆధునికత ముసుగు లేని  సహజమైన వాతావరణంతో  నేను చిన్నప్పుడు చదువుకున్న బడిలా అనిపించి మనసు పులకరించింది.                                      

విద్యార్థులందరూ విశాలమైన ఆడిటోరియంలో ఆకుపచ్చని తివాచి పై కుర్చీలలో కూర్చున్నారు  వర్క్ షాప్ ప్రారంభై అయ్యింది. పిల్లలని ఆనందపరచటానికి ఫారిన్ లాంగ్వేజెస్ లో  మాట్లాడేను. కొద్ధి  సేపు శిక్షణ అనంతరం పిల్లలు పేదరికంలో ఈదుతూ అజ్ఞానం అనే అలలతో పోరాటం చేస్తున్నారు. శిక్షణ ఎన్ని ప్రశ్నలు అడుగుతూ  సమాధానం చెప్పిన వారికి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ పిల్లలని వీలైనంత ప్రోత్సహిస్తూ ముగించాను పాటలు పద్యాలతో అలరిస్తూ ముగించాను. మిగిలిన పుస్తకాలు లైబ్రరీకి బహుమతిగా ఇచ్చేను. 

  మౌనంగా కూర్చున్న పిల్లలకి స్పందించడం నేర్చుకోవాలని    గట్టి వార్నింగ్ ఇచ్చారు. సినిమా పాటలకి డాన్స్ చేయాలంటే మీరు చాలా ఉత్సాహం చూపిస్తారు  ఆ ఉత్సాహం ఇక్కడెందుకు లేదు అన్నారు.   నా జీవితంలో ఎప్పుడూ వినని ఒక మాట...నాకు ఆనందం కలిగించే మరొక మాట అన్నారు.  అది ఏంటంటే "ఈ స్కూల్ లో సినిమా డాన్స్ లు బంద్ ఇక పై చక్కగా స్టేజ్ ఎక్కి ఏం   చదువుకున్నారో  ఏం   నేర్చుకున్నారో అవి చెప్పండి చాలు. విద్యా ప్రతిభ లేనప్పుడు సినిమా ప్రతిభ ఎందుకు?"  ఇలాంటి మాస్టారిని   నేను చూడలేదు. 





నా   పని  షరతులు లేని సేవ.  సేవాభావంతో  బోధన చేస్తే మనసు వికసిస్తుంది.  విద్యార్థుల, శ్రేయస్సు  కోరి పని చేస్తే   ప్రతిఫలం కంటే తృప్తి వస్తుంది.  తరచుగా ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఈ విద్యా సేవ చేయడం కోసం  సమయం మరియు వనరులను త్యాగం చేయవలసి ఉంటుంది. ఐతే సరస్వతి ఆశీస్సులు, మనుషుల ప్రేమ ప్రతిఫలంగా పొందుతుంటాను. 


నటనకు దూరం.  నడతే  ప్రాధాన్యం ఆయనకు. మాస్టారిని చూస్తే  మా నాన్న గారి నడత మాట తీరు  గుర్తొస్తాయి లూథరన్ పాఠశాల ను చూస్తే.  చిన్నపుడు మాబడి  గుర్తుకొస్తుంది .   లూథరన్ పాఠశాల  నరసరావుపేట నా బాల్యాన్ని గుర్తుచేసింది 

టీచర్స లో కొత్త విషయాలు  నేర్చుకోవాలనే ఉత్సాహం  కొట్టొచ్చినట్టు కనిపించింది.  విద్య పట్ల శ్రద్ధ  అతిధి పట్ల ఆదరణ వారికి  ఆకర్షణ గా నిలిచాయి.     


చ . మనిషికి  విద్య  నిచ్చిన  సుమాలకు  తావిని   జేర్చినట్లగున్     

 మనమున  పుట్టు  భావములువాడ నితావులుకావె  మాటలన్     

వినమరి   సేదతీర్చుచుచు   వీనుల   విందులుచేయు  చేతలన్     

కనమరి  నిండు  నీతిగల  వాడికి  నీడ యె  విద్య చూడగన్   



 మనిషి   కివిద్య  నిచ్చిన  సుమాల  కుతావి   నిజేర్చి నట్లగున్     

 మనము నపుట్టు  భావము  లువాడ నితావు   లుకావె  మాటలన్     

వినుమ  రిసేద  తీర్చుచు  చువీను  లవిందు లుచేయు  చేతలన్     

కనమ  రినిండు    నీతిగ     లవాడి   కినీడ   యెవిద్య చూడగన్   

Friday, January 30, 2026

పూలబాల ఇండియన్ సోనెటీర్ - 200 సోనెట్ల సంకలనం

 ఆంగ్ల చందస్సుని నియమాలని  పాటిస్తూ పూలబాల రాసిన ఇండియన్ సోనెటీర్ 200 సోనెట్ల  సంకలనం 200 మణి మాణిక్యాలతో జాతిరత్నాలతో  అలంకరించబడిన ఒక అందమైన ఆంగ్లకవితా శిల్పం.     ఈ రెండు  వందల  పద్యాలు 20 వర్ణాల కాంతులీను సుసంపన్న మణులు. ఘనులు  మెచ్చిన కవితా గనులు.  200 పద్యాలు భావానుగుణంగా 20 భాగాలు  ప్రతి భాగం లోనూ 10 పద్యాలు  ఉన్నాయి.


మొదటి  భాగం శిల్ప పాద పీఠం వద్ద  అందమైన ముద్దు లొలికే  పదాలలో మురిపించే  జీవితానికి స్పూర్తి నిచ్చే, భావాలలో నేసిన కాశ్మీరు తివాచిలా ఆహ్వానం  పలికే  అడోరబుల్.

 

ఇందులో  డిజైర్ డెత్ డ్రీమ్స్ ప్రోబ్లమ్స్  ఆశనిరాశల పోరాటం వంటి పద్యాలు కనిపిస్తాయి. వాటిపైన “మై వెర్స్ “ అనే పద్యం  నీ వారందరూ  వదిలేసినా  నేనున్నాను అని అభయ  హస్తం  లా కనిపిస్తుంది.

 

2 భాగం రొమాంటిక్ కోవకు చెందినది ఇందులో కూడా పది పద్యాలు ఉన్నాయి ఇవి  Love on Train Silver Fish, Happy birds ,  Flower of Love , Honey moon ఇవి పిల్లగాలిలా మనసును తాకి గిలిగింతలు పెడతాయి. 


3 వ భాగం కింగ్స్ అండ్ బేటిల్స్  : పల్లవులు, చోళులు, కలింగులు, కంబల్ ఘర్ ఫోర్ట్,  విజయనగరం ఫోర్టు,  రెడ్ ఫోర్ట్.  బేటిల్ ఆఫ్ పద్మనాభం, అనే చరిత్ర మట్టిలో లోకప్పబడిన అనేక విషయాలని  కోటల కట్టాడాలని యుద్దాలని తవ్వితీసేభాగం.

 

4 భాగం పాషన్  అంటే మోహం. భ్రారతీయ పురాణ సాహిత్యం లో శకుంతల విశ్వామిత్రుడు  గ్రీకు సాహిత్యం లో లిడా, Swan జియస్  Head God వంటి  వారి మొహాల్ని ఇందులో  కవి వర్లిస్తాడు.  మోహాన్ని దాటడం  చాలా కష్టం  అని చెప్పే భాగం ఇది.

“అదుల్తేరియో” నవల కథా సంగ్రహాన్ని  “ఓడ్ టు పాషన్”  అనే ఓడ్,  రచయిత తన జీవితంలో చూసిన అందమైన స్త్రీ మీద రాసిన “ఓడ్ టు హర్ డివైన్ బ్యూటీ” కూడా ఈ భాగంలో ఉన్నాయి.

 

5వ భాగం  లౌ ఫిలాసఫీ :  ఇందులో  పద్యాలు  హేతువా దంతో  ప్రేమతత్వాన్ని  విశ్లేషిస్తాయి     నో లౌ ఈజ్ ఫిలసాఫికల్  అనే పద్యంలో  ప్రేమ భౌతిక మైనది  శారీరక మైనదని  అద్భుతమైన  విశ్లేషణ  ప్రాసలతో రాసాడు   హార్డ్ అండ్  మైండ్  అనే పద్యం లో చిన్న చిన్న పదాలలో పదబంధాలతో  దట్టమైన ప్రాసతో శబ్దం  వీనులవిందుగా భావం  మనసుకి  హత్తుకునే లా రాసాడు , వర్డ్స్ మేక్ లౌ లో అందాన్ని  చిత్రాలకంటే  పదాలే  బాగా  చూపిస్తాయని వర్డ్స్ ఆర్ మోర్ సెడక్టిన్ అని  చెరుకు రస ప్రాయంగా  చెప్పాడు.

 

నోవన్  ఈజ్ లో న్ లీ  లో  వంటరి వ్యక్తులు    మైండ్స్ టార్చ్ తో తమలోకి చూస్తే ప్రేమ కనిపించి వంటరితనం అంతం అవుతుందని    లవ్స్ ప్యూయల్ లో   డజ్  రొమాన్స్  హే పెన్ బై ఛాన్స్ అని  రూట్స్ ఆఫ్ రొమాన్స్   బాడీ కర్వ్స్ కాదు వర్డ్స్  అని అందమైన శరీరంలో  కాక తీయని మాటల్లో  రోమాన్స్  దాగి ఉంటుందని రాసాడు . ఈ భాగం  కొత్త దంపతులకి  పాతదనం తో గిన వారికి  శృంగార  వింజామర. ఈ భాగం 50 వ పద్యం  మేరేజ్ తో ముగు స్తుంది.

 

6వ భాగం : 5 భాగం  లో పదాలలోంచి  పుట్టే శృంగారం గురించి రాసిన కవి   ఇప్పుడు ఎరోటికా లో ఏకంగా  ఏక్షన్ లోకి దూకేస్తాడు  ఈ భాగం  లస్ట్ అనే పద్యం తో మొదలెడతాడు  లస్ట్  అంటే కామం  కామం గొప్పతాన్ని  అత్యద్భుతం గా వర్లించిన  పద్యాలు కొన్ని  ఉంటే  అందులో  ఈ పద్యం  అగ్రస్తానం లో ఉంటుంది. రతి జీవన గతి  అని  జీవిత నౌకకు  చుక్కాని  అని గౌరవ స్తానం రతికి  ఇచ్చి  అంజంతా ఎల్లోరా విరూపాక్ష రతీభంగిమలు కనిపించేలా చూపుతాడు.  ఎరోటికా అంటే  రతి  శిల్పం.

 

7వ భాగం : ఐదో భాగంలో రొమాన్స్ తో కవ్వించి ఆరోభాగంలో మరిగించి ఏడవ భాగంలో నైట్స్ సాంగ్స్ తో  చల్లబరుస్తాడు  కవి.  రాత్రి నల్లని  ముసుగు  ధరిస్తుందని నైట్స్  మేంటల్ లో  రాస్తాడు  రాత్రి అందాలను  మన మనసుకి  పూస్తాడు. డార్క్‌నెస్  అనే పద్యంలో లో చీకటి చదువరికి పూస్తాడు.  క్వయట్ నైట్  పద్యంలో   నిశ్శబ్ద రాత్రిలో మనం నడుస్తున్న ట్టుంటుంది. నైట్ ఈజ్ అ కైట్ లో రాత్రి గారి పటంలా గాలిలో ఎగురుతుందని స్త్రీ మూర్తి దయతో  నిండితే ఎలా ఉంటుందో  రాత్రి  చీకటితో  నిండితే  అలా  ఉంటుందని  అనేక పోలికలతో  రాత్రి అందాలని వర్లిస్తూ  రఫేల్ హార్ట్ అనే పద్యం  లో  రాత్రి పట్ల తన ప్పదయ స్పందనను తెలియ చేస్తాడు. ఈ భాగం 70 వ పద్యం సమ్మర్ నైట్ తో ముగుస్తుంది

 

8వ భాగం "హార్ప్ స్ట్రింగ్స్"  లో  తన ఊహలను విచిత్ర అనుభవాలను హృద్యంగా తన  అపార్ట్  మెంటలో  శబ్దాలకి కారణం  దెయ్యం ఉందని అపార్ట్ మెంటు  వాళ్ళు కాపలా ఎలా కాసారో వింటర్  మోర్నింగ్ రైడ్  అనే పద్యం లో పొగ మంచు తెరలో తన మోటార్ సైకిల్ ప్రయాణాన్ని    ప్రకృతి సౌందర్యాలని   ప్రమాదాలని  రాస్తాడు.  పామర్రులో  తన మిత్రుడి పాఠశాల లో  సన్మానాల ను వారి అభిమానాన్ని మంచి పదాలతో ప్రాసతో  ది ఎక్ట్రార్డినరీ   అనే పద్యం లో  రాసాడు తను డిల్లీ లో ఉండేటప్పుడు  ఒక మోసకారి డంబాచారి జీవనశైలిని హాస్య పూరితంగా  వర్లిస్తాడు.

 

9వ భాగం కలర్స్  ఆఫ్ ద  అర్త్  ఇందులో భూమి ఆభరణాల వర్లన చాలా  సున్నితంగా  ఉంటుంది.  కొండలు పర్వతాలు  కిరీటాలు నదులు  జలపాతాలు. కంఠాభర ణాలు  మొక్కలు  వృక్షాలు శిరోజాలు ఇలా  మేటి  సృజనాత్మకతతో మది పులకించే  పోలికలతో  భావ ఆభరణా లను  పుడమికి చక్కగా  అమర్చేడు  కవిరేడు  పద్యాల పేర్లన్నీ జంటపదాలే

Hills and Mountains, Rivers and Fountains, Trees and Plants, Seas and Oceans, the Sun and the Moon అని రాసాడు. ఈ భాగాన్ని I am the earth, my heroine అనే సుదీర్ఘమైన పద్యంతో ముగించాడు. ఇక్కడ భూమికి గల ఆభరణాల గురించి రాస్తూ భార్య గురించి  ఎందుకు రాసాడు ?   తాను భూమి అయితే తన భార్య తనకి ఆభరణం  అనా?  కవి చమత్కారం  కొంత ఉండొద్దూ

 

10 వ భాగం  రాయల్  ఫ్లేమ్స్  అటవీ సంపదను  ఎలా దోచుకుంటున్నారో  అటవీ వృసాలను  ఎరాచంపు తున్నారో చూపించే  .ఈ ఖండం  ఖండ ఖండాల గా ప్రకృతిని భంజించే ఛండాల మానవ వృత్తిని ప్రవృత్తిని  ఎండగట్టే భాగం.  ఇందులో  ఆవు చీమ ఏనుగు నది వంటి  భారతీయ మనోభావాలను చూపే  పద్యాలు  ఉన్నాయి.

 

11వ భాగం గ్రేవ్ యార్డ్ పోయెట్రీ.   18వ శతాబ్దంలో ఒక చిన్న ఇంగ్లీష్ కవులు సమూహము  జీవితన్ని అధిగమించడం మృత్యువు ఇందులో  సోలిటరీ పోయెట్  అనే పద్యం కాటి దృశ్యాన్ని కళ్లకు చూపిస్తుంది. ఇందులో ఫేట్స్ పప్పెట్  అర్జెంట్ ఫేర్ వెల్ ఎమ్టీనెస్ జర్నీ లాంటి విషాద మైన పద్యాలున్నాయి. శాశ్వతత్వము వంటి థీమ్స్ పైన విషాద కవితలల్లే వారు . వీటిని గ్రేవ్ యార్డ్ పోయెట్రి అంటారు. అంటే హరిశ్చంద్రుడి కాటి పద్యాల్లా అన్నమాట.

 

12/ 13 వ భాగం అంతా ఆశ Hope of Love అని  ఒక  ఆశా శ్రేణి పద్యాలు రాసేడు కవి అయితే ఆ పక్కనే నిరాశ వాదం చూపిస్తాడు  Frustration poems  పక్కనే రాసాడు.  జీవిత మంటే వెలుగు నీడలు ఆశనిరాశల కలయికేదా.

 

 14వ భాగం ఫ్రీడం అంటే స్వేచ్చ గురించిన పద్యాలు. ఫ్రీడం ఆఫ్టర్ మ్యారేజ్ , డేడ్రీమ్ ,  slavery  comes in disguise. చదువు తుంటే పెళ్ళి మీద తిరుగుబాటు పద్యాలని అని పిస్తుంది. హాస్య ధోరిణి లో అందమైన పదాలతో అలంకారాలతో స్వేచ్చ ప్రాముఖ్యతను  గుర్తుండి పోయేలా చెప్పాడు.  Freedom is Life’s thunder అన్నాడు. అంటే స్వేచ్చ జీవితానికి గొప్పశక్తి అన్నాడు ఫ్రీడం ఈజ్ హెవెన్  స్పిరుట్యువల్ ఫ్రీడం పద్యాలతో ఈ భాగం ముగుస్తుంది. 

హి సిట్య్ ఆన్ ఎ రాక్  ఎండ్ కౌంట్స్ నాట్ ద క్లాక్ హి డజంట్  ఈవెన్ ధింకాఫ్ ప్రీడం  దటీజ్ ఆబ్ సల్యూట్ ఫ్రీడం అని సర్వోతృష్ట మైనది స్పిరు ట్యువల్  ఫ్రీడ్రం గా వర్ణిస్తాడు కవి.

 

15వ “After 13 years” ఈ భాగంలో ఢిల్లీలో తనకి  ఆధ్యాత్మిక గురువైన ఒక ఢిల్లీ స్నేహితుడు 13 సంవత్సరాల తర్వాత విజయవాడ వస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ లో విజయవాడ రైల్వేస్టేషన్  ప్లాట్ఫారం మీదకు వచ్చే ట్రైన్ కోసం వెతుకులాట ఎదురుచూపులు  స్నేహితుడిని కలవడం వరకు తను మనోభావాల్ని ఇవన్నీ సోనిట్ల రూపంలో రాశాడు కవి.  13 సంవత్సరాల తర్వాత స్నేహితుని కలిసినందుకు ఆనందపడి 13 సోనిట్ల రూపంలో అతనితో తనకు గల అనుబంధాన్ని వర్ణించాడు. ఆవగింజ మీద అరవై పేజీలు కవితలల్లగల  ప్రౌఢ కవికి ఇదేం కష్టం కాదని పూలబాల రాసిన భారత వర్ష అనే తెలుగు గ్రంథం చదివిన వారికి విదితమే. తెలుగు  ఆంగ్ల భాషలో  సడలని పట్టుతో ఏకరీతిన  చెలరేగిన కవివరేణ్యడు పూలబాల.

 

16 వ భాగం మర్మసింగ్  పామ్స్  : పదో శతాబ్దపు కాశ్మీర్ రాణి దిద్దా,  17వ శతాబ్దపు ఢిల్లీ రాణి రజియా  సుల్తానా,   17 వ శతాబ్దపు  రష్యన్  రాణి  కేథరీన్,  ఫ్రెంచ్  రాణి  ఆంత్వా నెత్  అనేకమంది  పురుషులతో  విలాస స్త్రీలుగా     పేరు  పడ్డారు.  అటువంటి మార్కండ్  రాణి భయానక  కల్పిత  కథను సోనెట్స్   రూపంలో వెన్నులోంచి  చలిపుట్టేలా చెపుతాడు కవి.  మార్కండ్ లో రత్న ఘర్ కోట లో రాణి  అందమైన  పండితుణ్ణి  చూసి మోహించి  దక్కకపోడం తో నింద వేస్తుంది  అది భరించలేక  ఆ పండితుడు  ఆత్మహత్య  చేసుకుని చనిపోతాడు అతడిశాపా  నికి గురైన  కోట  భూత గృహంగా  మారిపోతుంది.   ఊరంతా  శ్మశానంగా  మారిపోతుంది.   అక్కడున్న  తాటి  చెట్టు  రివ్వున వీసే గాలీ  ఆకథలను  పాడుతుంటాయి.      15 వ భాగం పూర్తిగా వాస్తవం దానికి విరుద్దంగా పూర్తిగా కల్పితమైన 16 వ భాగాన్ని రాసాడు కవి.

 

17 వ భాగం చెర్రీ బ్లోసమ్స్ . ఇందులో రైళ్లను రాణులతో పోల్చి , వాటికోసం అందరూ ఎదురుచూడాల్సిందే అని వాటి  హుందాతనాన్ని వర్ణిస్తాడు , రైలు నడక , పరుగు , కిటికీలోంచి కనిపించే ప్రకృతి మాత్రమే కాక రాల్లో మనుషుల ప్రకృతి కూడా వర్ణిస్తాడు సామాన్య ఊహకి అందని ఇమేజరీ మనసులని కవితా ఘరి లో తడిపేస్తుంది.

 

18 వ భాగం  వైల్డ్ థాట్స్ లో మొదటి పద్యం లోనే అమోఘమైన భావనలు పతాకస్థాయి వర్ణనలు చూపిస్తాడు . అనే పద్యంలో తనని తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. మహాకవి అనే విప్లవ కవితల పుస్తకంలో కూడా మొదటి కవిత ఇలాగే చాలా దుడుకుగా ఉంటుంది. చీకటి కాఫి తాగిన అనుభూతివస్తుంది చదివి తీరాల్సిందే. ఇందులో బర్న్ ది ఫెర్న్  ఐ ఫ్ అనే పద్యాలు జాతీయ భావాలని దేశం పట్ల కవికి గల ప్రేమని తెలియజేస్తాయి.

 

19 వ భాగం కవి బాల్యం చిన్ననాటి అనుభవాలు. పద్యాలలో ప్రాసకంటే ఇమేజరీ కి ప్రాముఖ్యతనిచ్చి ,  తీపిగురుతులను వెనక్కితోడుతాడు కవి. ఆ కాలానికి చెందిన వస్తువులు డయోనారా టీ వీ , మర్రి చెట్టు , పిల్లల ఆటలు  అప్పటి నాగరికత ను  కళ్లకుకట్టినట్టు వర్ణించడం వల్ల ఈ పద్యాలు చదువరులు అందరినీ ఆకట్టుకుంటాయి 

 

20 వ భాగం ఎన్లైటెన్మెంట్ పద్యాలు 200 వ పద్యం ఫ్రెండ్  . ఇందులో కవి స్నేహం అనే మాటని వ్యంగ్యంగా ప్రయోగించి మతాల మధ్య చిచ్చు ఉండకూడదని భావిస్తాడు. ఇందులో హిట్లర్, బుద్ధుడు , వేశ్య , మతాలూ, మానవత్వం , ప్రపంచ చరిత్ర వంటివి వస్తువులు ఉన్నాయి.                        కవి ఈ  విషయాలను మానవత్వం కోణంలో పరిశీలించమంటాడు.

 

200 అంకెలు వేయడానికి ఎంత ఓర్పు అవసరమో  మనకి తెలుసు. రెండు వందల పద్యాలు రాయడానికి ఎన్ని పదాలు కావాలి,  ఎన్ని భావాలు కావలి, ఎంత ఓర్పు కావాలి ? 

భాషమీద ఎంత పట్టు ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత ప్లానింగ్ ఉండాలి.  కొన్ని పద్యాలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని అనుభవజ్ఞులైన ఇంగ్లిష్ ప్రొఫెసర్స్ తమ ముందుమాటలో తెలియజేసారు.

పదజాలంతో భావజాలంలో  ఇంగ్లీష్ కవుల కేమాత్రము తగ్గకుండా   పూలబాల ప్రయోగించిన వందలాది ప్రాస పదాలు, పదబంధాలు, కొత్త పద ప్రయోగాలు పాఠకులని వేరే ప్రపంచంలోకి తీసుకుపోతాయి.  ఇప్పటికే  చరిత్రలో అతిపెద్ద సోనెట్ల సంకలనంగా  నిలచిన ఇండియన్ సోనెటీర్ క్రమేపి జన  హృదయంలో నిలిచి పోతుంది.

Wednesday, January 28, 2026

The First Foreign Languages Institute in the State

Which is the first foreign languages institute in Vijayawada and Andhra Pradesh?

Eazy Foreign languages institute is the first foreign languages institute in Vijayawada.


Pooolabala founded "EAZY FOREIGN LANGUAGES INSTITUTE" in 2010.  Eazy Foreign languages Institute is the only Authentic Foreign Languages Institute then and even now. The other institutes in Vijayawada offer German or French language in Vijayawada but not several languages like EFL

  Why is is Eazy Foreign Lnguages Institute is Authentic Foreign Languages Centre because

1. Poolabala was a recource person for French and German at National level seminars.

2. Poolabala was an official French and Spanish translator at International conferences.

3. Poolabala worked as a translator in Endeavour Technologies ( MNC) at Hyderabad

4. Poolabala is the prolific author of foreign languages books in Andhrapradesh. 

5. Poolabala uploads videos on 6 foreign languages periodically in Youtube and Face Book.

6. Poolabala promotes Polyglotism ( six foreign languages) in schools free of cost. 

7. The students trainined by poolabala explain on camera what they have learnt.

8. Poolabala appeared on TV as an expert in Foreign Languages career guidance. 

9. He has young students who learn 6 foreign languages ( Polyglots) 

10. The Polyglot children have performed on national TV channel ANI and Suman TV.

One can undoubetedly say that Eazy Foreign Languages is the First and Authentic Foreign Languages Institute in Vijayawada and Andhrapradesh. 









Sunday, January 25, 2026

German Children Rhymes - poolabala

Poolabala's German Rhymes or Kinder Rhyme book was released by Palnadu District Collector  Smt.  Kritika Shukla IAS on 24th Jan 2026 among school children in Palnadu.

పూలబాల రాసిన జర్మన్ రైమ్స్ ఇతివృత్తాలు ఏమిటి?

పల్నాడు జిల్లా కలెక్టర్ పూలబాలని ఎందుకు అభినందించారు

పూలబాల రాసిన జర్మన్ రైమ్స్ ఎందుకు మెచ్చుకున్నారు.


పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా చేతులమీదుగా పూలబాల రచించి కూర్చిన డోయిచ్చ కిండఱైమా ( జర్మన్ రైమ్స్ ) పుస్తకం జనవరి 24 2026 న పిల్లల సమక్షంలో విడుదల గావించబడింది.

జిల్లా కలెక్టర్ గారు పూలబాల రాసిన జర్మన్ రైమ్స్ ను ఎందుకు మెచ్చుకున్నారంటే

ప్రస్తుతం మన పిల్లలు పాడే ఇంగ్లీష్ రైమ్స్ లో ఇతివృత్తాలు లండన్‌లో ప్లేగు, మధ్యయుగ పన్నులు, మతపరమైన హింస, వ్యభిచారం, శిరచ్ఛేదం మరియు జంతువులను సజీవంగా వండటం ఉన్నాయి. నేటికీ, ఈ నర్సరీ రైమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలు పాడతారు.

“వారి ప్లేగులు, వారి భయాలు, వారి రాణులు ఇంకా పాడటం అవసరమా?"అని పూలబాల ప్రశ్నిస్తాడు

కాబట్టి పూలబాల తల్లి, తండ్రి, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు, ప్రకృతి మరియు సీతాకోకచిలుకలు వంటి భారతీయ నమ్మకాలు మరియు సంప్రదాయాలను కలిగి ఉన్న ఇతివృత్తాలను తీసుకొని భారతీయ భావోద్వేగాలను రేకెత్తించాడు. అతను ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు పాఠశాల వంటి సామాజిక అంశాలను కూడా తీసుకున్నాడు మరియు వాటిని సులభంగా పాడగలిగేలా అద్భుతమైన ప్రాసతో వాటిని కూరుచి పిల్లలతో పాడిస్తున్నాడు.

పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లాగారు ఈ విషయం తెలుసుకుని పూలబాలని అభినందించారు


There are twenty five German Rhymes about Mother, Moon, Rainbow, Wind, Rain etc,   They are 25 German Rhymes with English meaning. 

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...