Friday, October 23, 2020

Bharatavarsha 56

త.నము  నందున  సత్యతి  య్యగపా  డిచేడి    యగూడి వా   

నము    చేసిము   రారినే    చెఱదె   చ్చుమార్గ   ముకోరు చూ    

నము  నందున  నందుని  తలబో  యుచూవి   రిబోడి  యా  

వినుతు  నేకని   సంతసం   బునము ద్దుగావ   లపించె నే. 

తెర తీయగానే ఒక పెద్ద ఉద్యానవనము  కనిపించుచుండును .  సుందర వనము పచ్చనిచెట్లు పూలమొక్కలతో  నిండియుండి వసంత ఋతుకళలను చూపుచుండెనుసత్యభామ పాత్రధారిణి  వనమున అప్సరస వలె కని పించుచుండెను.  సత్యభామహారికంఠకోకిల,వలే ఆమనియందు తన ఆమునుకోర్కెతియ్యగా పాడుచున్నదిఆమె చేడియ నళిని  గానమాధుర్యమున విని పులకరించుచున్నది.

ఇటురాడేలఈవేళ గోపాలుడూ!ఇక జాగేల ననుజేర గోపాలుడూ              ఇటురాడేల  నే వేగ గోపాలుడూ ఇక జాగేల కౌగిలిచేర గోపాలుడూ

అని విరహముతో గానము చేయుచూ చేడియతో నర్తించుచుండును. ఒకరి చేతులొకరు పట్టుకొని తిరుగుచుండిరి. సత్యభామలో మదనోత్సాహము తొంగిచూచుచుండునురెండవ వరుసలో కూర్చొన్న వృద్ధు లిద్దరుఈమె కన్నాంబ వలె మంచి సొగసరి పొడుగరి. మరి కృష్ణ వేషధారి ఎట్లుండునో?”  “అవును ఈమె మత్తజగమువలె నున్నదికానీ సామాన్యముగా కృష్ణ వేషధారి మధ్యవయస్కుడో , ముదుసలో అయి ఉండునుఅని అనుకొనుచుండగా మాటలు విదిష మంజూష, మాలిని అరుణతారల  చెవిన బడెను.

రంగస్థలమున రాగమతిశయించిన సత్యభామ నర్తించుచుండ గాసత్య  ఒయ్యారామెల్ల ఆమె నాట్యమంద గుపించు చుండెను. ఈమె మంచి నర్తకి వలే నున్నదిఅబ్బ! ఏమి శృంగారభావములను చూపుచున్నదిఅని అరుణతార అనెను. “మీరే ఇట్లనిన కొత్తగా పెళ్లయినవారు ఏమనుకొనుచున్నారో!” యని మాలిని అనెను. మంజూషవిదిశలకిది వినిపించగా ముసిముసినవ్వులు నవ్వుకొనిరి. వారు ప్రక్కకు తల త్రిప్పగా  మసకచీకటోలో కన్నె చేతిని రాముడు పరిగ్రహించెనుఅప్పుడు కన్నె సిగ్గిలుచూ  

పక్కనున్నది  పిల్ల వాండ్రని, గమనింపుము నవ్వులు  

అయ్యో సరిగాదీ నడత తొలగింపుము చేతిని రామా

గమనించితి  నా కర్మను బాగుగ భామాచీకటింట

చేతిన చేయిడ నేరమా రంగస్థలమున చూడుమా!

కన్నె తలయెత్తి రంగస్థలమును కాంచగా కృష్ణుడ గుదెంచు చున్నాడు.


. దిలె  వర్షుడు  కాంతులీనుచు ట్టి ఛాతి యు, కాయమున్  

      ముదము గొల్పగ, పాడుచూ అసముడై నిల్వగ  ఎల్లెడ  

      పొదలె హర్షము వాడి చూపుల భా వర్షుని  తాక గా

     విదిష ఉల్లము  జిల్లనెన్  మదత్సరంబును మూర్కొ నెన్

ఆజానుబాహుడరవింద నేత్రుడు, వర్షుడరుదెంచెను రంగస్థలం పైకిదృఢమైన ఛాతి యవ్వన కాంతులీను దేహముతో చూచువారికి ముదము గొల్పుచూ, ఎదురుచూచుచున్న సత్యను వెనుకనుంచి  మెల్లగా గజగమనముతో సమీపించి ఆమె కళ్ళు మూసి కొద్దీ క్షణములలో వదిలివేసి శ్రావ్యముగా పద్యమునాల పించి, చివరిలో ఉచ్చ స్వరమున కంఠమును నిలిపి  రెండు నిమిషములట్లే యుంచగా కళాభవనము చప్పట్లతో మారు మ్రోగెను. అసముడై (అసమానుడై) పొడగరియైన వర్షుడు సత్యభామ వద్ద నిల్వగా, ఆమెకంటే ఎత్తుగా నున్న అతడిని (కృషుని) భామ వాడిగా వేడిగా చూసెనుఆపై శ్రీకృష్ణ సత్యభామలు కలసి రసరమ్యముగా నాట్యమా డెదరుఅది చూచి విదిష ఉల్లము ఈర్ష్యతో చలించెనుఅందరు వారిని మంచి జోడి యని కొనియాడు చుండగా ఆమె మాత్రము ఎగ్గుగొని నేను సరిజోడుకానేమో యని న్యూనతనొందెను

ఆపై సత్యభామ ఇచ్ఛను వెల్లడించ సత్య చాలా కొంటెపిల్లవలె అల్లరిచేయుచూ దుముకు స్వరము వసంత కాలమహిమను చాటు పద్యమునాలపించి, ప్రేమ కంటే  గొప్పదేమియునూ లేదని జెప్పగా  అంతకంటే భక్తి భావము గొప్పదని కృష్ణుడు సూచించు గానమును జేయును.  

ఇంతలో కృష్ణుని మిత్రుడు వసంతుడరుదెంచి ఆకలి ఆకలి యని ఘోషించుచుండ కృష్ణుడు అతడిని భోజనమునకు గొనిపోవుచుండును.  అప్పుడు రుక్మిణి  గోపాలుని నామము గానము చేయుచూ ప్రవేశించును. ఆమె అచ్చటకు వచ్చుటతో వసంతుడు ఖంగుతినును. ఆమెను చూడగానే సత్య కన్నులెరుపెక్కును. కృష్ణుడు తికమక పడి సత్యకి సర్ది చెప్పి పంపుటకు యత్నించుచుండగా అతడిని సత్య విదిలించును.  

త. నకు  కావలె  నాటబొ  మ్మవి  మ్ము గాన  డి చేటి సా

    మి,నర హరైన   నామె కడ్డుగ మాటజెప్పగ నొప్పు నే

    దినదినమ్ము రివాజుగా  మరితామరంబు  నొసంగు చూ

     నువు గామణి   ఇంటనుం  డగ నేమితక్కు  వభామకున్.

ఎనమండ్రు భార్యలందు సత్యభామ ప్రత్యేకం. వైదర్భి కూడా ఆమె వలే కృష్ణుని ప్రేమించిననూ ఆమెది భక్తి ప్రేమ. భామది విలాస ప్రేమ. అనుదిన మెనిమిది బారువుల బంగారమునిచ్చు శ్యమంతకమామె సొంతం, మురారి సతతము తనమందిరమందే యుండవలెనని పంతం. అందము, ధనము ఉన్నచో ఒక రవ్వ అహంకారము సహజమే కానీ భామ అహంకారము పరిధిదాటి పతినే ఆజ్ఞాపించుచున్నది.  

కళామందిరములో ఎవరో ఇద్దరు ప్రేక్షకులు మాట్లాడు కొనుచున్నారు.

“కృష్ణుడామెను ఇంకనూ సముదాయించుచుండెను.  ఆమె ఒడ్డు,  పొడవు హావ భావములు అద్భుతముగా నున్నవి. సత్యభామ పాత్రకీమె అతికినట్లున్నది. సత్యభామ యనిన పోతపోసిన జాణతన మేకదా.” “పాత్రధారిణి పేరేమోకానీ ఈ పాత్రకు ఖచ్చితముగా సరిపోయినది.  “ఆమె ప్రక్క యితడు తప్ప ఎవరు నిలువ జాలరు. ఇప్పు దర్దమైనది కృష్ణునిగా ఎందుకు ఇతడిని  ఎంపిక జేసుకొనిరో”  

 మరునాడు తన పుట్టిన దినమని,  రావలెనని కృష్ణుని ఆహ్వానించగా,   సత్య కూడా  అదే దినమున తన  మెట్టిన  దినమని రుక్మిణిని పరిహాసము జేయును. ఆ దృశ్యము అంతమగును. సత్య, నళిని కృష్ణుడు , వసంతుడు ఉద్యానవనం నుండి నిష్క్రమించెదరు. రుక్మిణి వెడలును. 

ఇప్పుడు  తెరనొకపరి  దింపి లేపిరి వెనుకభాగమున  ఆకాశము మబ్బులు కనిపించుచుడెను నారదుడు చక్కని గానము చేయుచూ కనిపించకుండా ఏర్పాటు చేసిన తాళ్ల సాయముతో ఒక మబ్బుపై దిగి  గానము చేయుచుండెను. ఇటువంటి అధునాతన సాంకేతిక ఏర్పాట్లున్న నాటకములు  చలన చిత్రములకేమియో తీసి పోవు అని లకుమ అనెను.

అచ్చట నారదుడు పాడుచుండగా రుక్మిణి(రంజని) తెరపక్కనుండి చూచుచుండెను. వర్షుడు అలంకార గృహమందు కూర్చెనేను. కొద్దిసేపటిలో వచ్చి తరువాత దృశ్యము ఐదు నిమిషములలో నుండునని అది  మీదే యని సిద్ధముగా యుండుమని , సత్యకు వర్షకు చెప్పెను.

కేశవుడు మొదటిసారైననూ చక్కగా గానము చేయుచున్నాడు. ఇతడికి కళాశక్తి యున్నచో హైద్రాబాదునందే యుంచుకొనవలెను అని రంజిని ( రుక్మిణి ) అలంకార గృహము వద్దున్న భానోజీరావుగారితో అనెను. 

కోపముగా వనము నుండి  వైదొలగిన సత్యభామ లికత్తెతో గృహమున కృష్ణునెట్లైననూ  తన చెప్పుచేతలలో ఉంచుకొనవలెనని తపించుచూ అన్ని సౌఖ్యములూ సంపదలూ ఉన్ననూ మగడు లేక స్త్రీ జన్మకు  అర్ధములేదని వాపోవుచుండును. 

నారదుడు గానముచేయుచూ ప్రవేశించును. పెద్దసంవాదము జరిగిన పిమ్మట  నారదుడు వ్రతోపదేశము చేయుట తరువాత సత్యభామ ఆనందముతో రెచ్చిపోయి " మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధాన మహిమన్ " అని పాడుటచూసి మాలినిగారు  ముచ్చటపడి ఆమెతో గొంతు (మెల్లగా)  కలపగా , అరుణతారకూడా పాడుచుండెను. అది జూచి మంజూష “పాతతరంవారికి శృంగారభావములె”ట్లు కలుగునో అర్ధమయ్యి ముసిముసిగా నవ్వుచుండెను. విదిశకు మాత్రము ఇదంతయూ కంటగింపుగా యున్నది. “నన్ను ఇచ్చటికిపిలుచుటకు కూడా ఇష్టములేని మీ అన్నకు ఆమె అనిన ఎంత విదేయతో” యని మంజూషతో అని వాపోవుచుండగా  “రంగస్థలంపై కృష్ణుడు సత్య భామ సంభాషణ రసవత్తరం గా నున్నది. 

ఈ కృష్ణ పాత్రధారి ఏ ఢిల్లీ కో చెందిన యువకుడు వలే నున్నాడు. ఆర్యుని వలే వర్చస్సు కల్గి , రాజపుత్ వలె దేహదారుఢ్యమును కల్గి యున్నాడు. “మన తెలుగువారి కళలు ఇట్లుండవు వీరిద్దరూ ఒకరికొకరు చక్కగా పొసఁగి యున్నారు. నాటకములలో  చాలామందికి  స్త్రీ పురుషులకు సంబంధములు ఏర్పడును అటులనా అయ్యేయి యుండవచ్చును వీరిరువురూ కలసి సంభాషణలను అభ్యసింతురు కదా అప్పుడు  ..”

విదిష ముఖ ము జేగురించెను” నన్ను పిలవనైనా పిలిచి నాడు కాదు కదా పిలవని పేరంటమునకు వచ్చితిని. ఇప్పుడు అందరు వారి జంట బాగుందని అనుచున్నారు నాకు తగిన శాస్తి జరిగెను”  అది విని మంజూష 

అమ్మా చిన్ననాటి స్నేహితుడిని ఇదేనా నువ్వు అర్ధము చేసుకొన్నది అని విదిష  అడిగెను. "నిన్ను ఏమని పిలవగలడు  నాటిక విశాఖపట్నమున జరుగుటలేదుకదా పొరుగూరులో జరుగుచున్నది, వాడు నీ మొగుడు కాదు నిన్ను తనతో  పొరుగూరు పంపమని నీ తండ్రినడుగుటకు.” అని సర్ది చెప్పెను. అయిననూ సత్యభామ పై ఆమె కోపము తగ్గలేదు . మరియొక అందగత్తె వచ్చిన వర్ష తనను పట్టించుకొనడేమో యను అబద్రతాభావమున కు గురిఅయ్యి విదిష ప్రాణముసూరనుచున్నది  “సత్యభామపై చాలాకోపముగా యున్నది” అనెను.  “చాలించు మమ్మా!  ఆమె నాటకము లో పాత్రధారిణి ,  నీకంత అపనమ్మకమైనచో రంగస్థలం దిగినంతనే ముడిపెట్టమందును, నీవునూ అసత్యవలే మా అన్నను కొంగున కట్టుకు తిరగవచ్చు అని మంజూష హాస్యమాడెను. 

సత్య పేరెత్తు వరకూ సంతోషముతో వెలిగి ఆమె పేరు  వినగానే విదిష మొఖ మొక్కసారి మాడిపోయెను.  “ఆమె పై నీకెందులకు కోపము?”  “ఎందులకా ఆమె మనసున చెడ్డ తలపులున్నవి, అవి నాకవగతమగుచున్నవి”  హూ సరే , అయిననూ ఏమిచేయగలవు ? అని అడిగెను. “నేను తలుచుకొన్నచో ఆమెకు మెదడుకు  సంకేతములు పంపి ఆమెను ఆపగలను. ఆమెను ఇప్పుడే రంగస్థలం దిగమని ఆదేశించనా?” అని అడిగెను. మంజూష "నీవట్లు జేయగలిగిననూ చిక్కే యగును కదా” అని మంజూష అనెను. అయినచో చూడుము అని " ఆమెను రెండు నిమిషములు పొర్ల వలసినదిగా ' సంకేతము పంపినాను” అని విదిష అనెను.

అప్పటికి  “మీరజాలగలడా నాయానతి  వ్రతవిధాన మహిమన్  సత్యాపతి” అను పాట ముగియుచుండెను. రంగస్థలంపై కేవలము సత్యభామ మాత్రమే యున్నది. పాట  ముగియగానే సత్య భామ రంగస్తలము పై  రెండు నిమిషములట్లే పొరలుచుండెను.  సంతోష  మతిశయించిన  సందర్భమున అట్లు చేయుట ప్రేక్షకులకు  సహజమే అనిపించెను. ఇంతలో ఆమె మరల లేచెను మంజూష నిర్ఘాంతపోవుచూ తన ప్రక్కన ఎదో మహాశక్తి కూర్చుని ఉన్నట్టుగా అనుభూతి  చెంది వణికెను.

ఇంతలో వర్షుడు రంగస్థలమున ప్రవేశించెను. అతడిని చూచి సత్యభామ నారదుడు ఉపదేశించిన  వ్రతము జేయుటకు అతడిని ఒప్పించవలెనని  అలక  నటించుచుండెను  కృష్ణుడు  సత్యను ఓదార్చు పద్యము నందుకొనెను. మరల నాటకము ఊపందుకొనెను.

  కృష్ణుడు ఓదార్చుచున్ననూ  మెత్తబడక సత్య పెద్ద జగడమే సృష్టించెను.

 సీ. మోసము  జేసినా వునెరన మ్మితినిను     

గొంతుకో  సినావుర  గీత  దాట     

నంచుగీ  తేదాటి  నావు నిన్న  

ఆడినే  డుమరచి రుక్మిణి తోకూడి

నన్నెన్ని మార్లువం చించ నెంచి 

తివి ప్రేమమోసము  తలపుల దోషము

చాలు చాలు  జాలము  వీడుము     

పొమ్ముపొ  మ్మునాశన మయి పొమ్మిక పోరా!

పాట పూర్తి అయిన పిదప పానుపు పై పడుకొన్న సత్యను  కృష్ణుడు కాళ్ళు   నొక్కు  చుండగా సత్య ఒక్క తన్నుతన్నెను. కృష్ణుడి  కిరీటము ఊడిపోయెను. “ఇటువంటి నాటకము నెందుకెన్చుకొంటివిరా వర్షా!”  యని  విదిష పరితపిన్చుచుండెను. 

తల్పముపై సత్యభామ నొక్కవుదుటున ఉరగాంగన వలే లేచి విస్ఫులింగములను కురిపించుచుండెను    ఆమె తళ  తళలాడు వస్త్రములందు రజిత కాంతులీనుచూ తలక్రింద చేయి పెట్టి చూచు చుండ,  వక్ష, నాభీ రమ్భోరువుల అందము వర్షమై కురియుచున్నది. ఇంతలో అయ్యో  శిల వంటి నా శిరమును తాకి నీపాదము కందెనేమోయని వర్షుడు ఆమె పాదములొత్తు చుండెను ప్రముఖ వార్తాపత్రికల పాత్రికేయుల సమూహము అచ్చట    మోహరించి ఛాయా  చిత్రములు గ్రహించుచుండిరి.

కృష్ణుని గాన మాధుర్యము సత్యభామ సౌందర్యమున రసహృదయములు తడిసి ముద్దయినవి కదా! అని ఒక పాత్రికేయుడు ప్రశంసించ బసవడు  లేచి తన ఆశుకవితా ప్రతిభను  చూపి గట్టిగా పద్యమును పాడెను. 

రంగస్థల మంతయూ  బహుళ కాంతులు  

భాసిల్లు చుండ గా నొక్క కాంతయే కాంతి 

నంతయూ గొని  కుందన చందము తుల 

కరించ కన్నార్ప మరిచె కళామందిరము 

 అదిచూచి అగస్త్య కూడా సత్య అందమును పొగిడెను బసవడు ఒంటిగాడు  అతడెట్లు  పాడిననూ పట్టిం చుకొనువాడు లేడు. సత్యభామ అందమును పొగిడిన అగస్త్యకు తగిన బహుమతి లభించెను. లకుమ అతడి పాదమును తన కాలితో గట్టిగా  అడిచెను. అది గమనించిన రాఘవుడు బసవడితో “పచ్చడైపోయి ఉంటాది నాకొడుక్కి కామన్  సెన్స్ లేకపోతే  ఇలాగే ఉంటాది మరి. అని నాలిక కరుచుకొని " ప్రియురాలివద్ద పరస్త్రీని పొగడరాదని ఇంగితముండవలెను " అని భాషాప్రక్షాళ న  గావించెను.

కన్నె తన రాముడితో గుసగుసలాడు చున్నది. అని అరుణతార కనిపెట్టి మాలినిగారికి జెప్పిరి. " వారు శోభనం మధ్యలో వచ్చినారు. వారికి ఒక విరామము నడుచుచున్నది అని మాలినిగారు అనిరి.  డయానాకు ఇదంతయూ చోద్యము వలె  ఉన్నది. 

మాలినిగారు అనేకమందిని రంజింపజేయు తనకొడుకు నటనని చూసి , శృంగార రసమును ఆస్వాదించుచున్నారు " ఇది చూసిన నా పెళ్లి అయినా కొత్త రోజులు గుర్తుకొచ్చుచున్నవి. వారు చాలా మెత్తన.  చిన్న తప్పు జేసినా దండించువరకూ ఊరుకొనువారు కాదు వారిని నేనునూ ఇట్లే దండించితిని " యని సిగ్గుపడుతూ చెప్పెను. మా వారిదంతయూ మోటు సరసము , మీ ఆయన వాలే మెత్తని మనిషి కాదు . మూడు రాత్రులు మాత్రము  నాదే పైచేయి గానుండెను.  

విదిషకు   అస్థిమితముగా  నున్నది  " ఇట్లాటి నాటకములుతప్ప ఇంకేవీయూ లేవా ?" అనెను " మంజూష నవ్వుచుండెను. అప్పుడు కృషుని నారదుడు విపణికి కొనిపోవు దృశ్యము నడుచుచున్నది. 

“భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు త్వరన్ గొనుడు సుజనులార” యను పద్యమునఆలాపించుచూ కేశవుడు  (నారదుడు) వర్షను (కృష్ట్నుని)  సంతలో అమ్ముటకు  కొనిపోవుచుండెను. మాలినిగారికి అది జూడకన్నుల పండుగగాయున్నది. “ఈ పద్యములన్నీ  వర్షుడు ఒక్కనెలలో వ్రాసెను” అనిరి. అప్పుడు అరుణతార “ఈ నాటికను కేశవదాసు గారు నాలుగు సంవత్సరములు వ్రాసినారు. వర్షుడు ఒక నెలలో వ్రాయుట అద్భుతము. ఎంత కమ్మని పద్యమో కదా! గానము కూడా అద్భుతముగా నున్నది. కేశవుడికి లభించిన శిక్షణ అత్యద్భుతముగానున్నది. వర్షుడు కేశవునిశిల్పమువలె తీర్చి దిద్దెను.  నాతొ గొనిపోవలెనని యోచించుచున్నాను” అని మాలినితో అనెను. అతడికేమైననూ చేయవలెనని .. అని అరుణతార అనుచుండగా మాలిని వలదని సైగ చేసిరి “అనేక మంది జీవితములకు పూల బాట వేసిన అతడికి ఏమీ చేయలేకున్నాము.” “అతడు తన కాళ్లపై నిలబడువాడే కానీ ఇతరుల సాయము తో తన జీవితమును నిలబెట్టుకొనుటకు ఇష్టపడడు.”  

అట్లు నారదుడు కృష్ణుని తరలించుకు పోయిన  పిదప సత్య భామ  చింతించూ విలపించుచుండును.   చూడుము రంగ స్థలమున  సత్యభామా విలాపము. ఈ దృశ్యము ఐదు నిమిషములుండును. పిదప రుక్మిణిని పిలుచుకొచ్చు దృశ్యము అనగా పది నిమిషములు వర్షుడు  అలాకారాగృహమందుండును. అని మంజూష విదిష తో అనెను.  ఆ మాటలు కన్నె చెవిన పడినవి.

రంగస్థలమున జరుగు  దృశ్యములకు  సమాంతరంగా తెరవెనుక రెండు దృశ్యములు జరిగినవి 

అగస్త్యునకు గుద్దులు , వర్షునికి ముద్దులు

డయానా అగస్త్యుని కవ్వించి  అలంకార గృహమువద్దకు కొనిపోయెను.  అచ్చట ఒక గదిలో వర్షుడుండెను మరియొక గాడి ఖాళీగా యున్నది. అందు డయానా ప్రవేశించెను.  అంతక ముందే  గదిలో  రోమి  కన్నె ఉండిరి.  కన్నె తలుపులుమూ యగా  అగస్త్య డయానా వైపు అయోమయముగా చూచు చుండెను " ఇటు చూడుము అనుచూ కన్నె " నీ తల్లి రోయపురము మురికివాడనందు కడు   దయనీయ పరిస్థితులలో నుండగా నీవు విలాసజీవితము గడుపుచున్నావు.” అనెను. “అటులనా? అది చెప్పుటకు  ఇంత దూరము రావలెనా ?” అని  ఇంకనూ పని యున్నది అని చెప్పుచూ కన్నె సివంగివలె పైబడి పిడిగుద్దులు గుద్దెను. ఆ శబ్దములు బైటికి వినిపించుచున్నవి. 

 పక్కనే వున్న వర్షుని గదిలోకి విదిష  ప్రవేశించుచుండగా మంజూష “కసితో చెలరేగుచున్నట్లున్నావు  ప్రక్కగది నుండి  గుద్దులు వినిపించు చుండగా  అటు చేయి చూపుచూ  అటువంటి  పని ఏమైనా చేతువేమో .. 

 ఉ. పొచ్చెము లెన్నడే  యతడు  వీగియు   కోపము   చూపడె  ప్పుడూ

 ముచ్చట   దాచిలో  కమున    భాసము    పంచుచు  ధర్మబు   ద్ధితో

  చ్చగ    లోకమే   వెలుగు   మార్గము    కోరుచు    సాగుసూ  రిన్

  వెచ్చగ    బేటము   తొలగ     ముద్దిడు    నచ్చిన    మెచ్చులా డివే!

బయట  నిలచిన  మంజూషకి రెండు గదుల నుండి వచ్చు శబ్దములు వినిపించుచున్నవి. ఒక గదినుండి ముద్దుల శబ్దములు మరొక గది నుండి గుద్దుల శబ్దములు వినిపించుచున్న మంజూషకు ప్రేమానురాగములు ముప్పిరిగొన్నవి. ఇంతలో రెండు దృఢ హస్తములు ఆమె నడుము పై వాలినవి. ఉలిక్కపడిన మంజూష వెనక్కితిరిగి అది తన ప్రియుని చూసి అతడి కౌగిట వొదిగెను. అతడు మంజూష కుసుమ లావణ్యములను తడుముచుండ ఆమె సిగ్గిల్లి అతడి నల్లుకొనెను. ఆమెను బిగి కౌగిట బంధించి  ఆమె ఆధార సుధలను గ్రోలెను.  కొలది  సమయము తర్వాత విదిష బైటకు రాగా వారిద్దరూ తిరిగి తమ స్థానములు జేరుకొనిరి. 

అగస్త్యుడు క్రింద పడిపోగా రోమి కూడా రెండు తగిలించెను. వారు తిరిగి పోవుచుండిరి " నేను అగస్యుని కొట్టుటకు కారణముంది మరి  నీవెందులకు కొట్టినావు అని కన్నె రోమినడిగెను " నా శోభనం సర్వనాశనము జేసినతడిని కొట్టక ముద్దాడ మందువా?" 

అనెను " నామనసిప్పుడు ప్రశాంతత నొందెను,  హోటల్కి పోయెదము పదము." అని కన్నె అనగా దంపతులిరువురూ నిష్క్రమించిరి. డయానా మాత్రము వెనుదిరిగి వచ్చి తన స్థానమందు కూర్చొని అడిగిన వారికి  " వారు అత్యవసర మైన పనిబడుటతో    హోటల్కు బోయినారు" అని చెప్పగా వారు అర్ధము చేసుకొని  నవ్వుకొనిరి.   

Tuesday, October 20, 2020

Bharatavarsha -55

 యశోద ఆసుపత్రి  సమీపంలో సికింద్రాబాదులో పెరేడ్ గ్రౌండ్స్ కి ఎదురుగా హరిహరా కళాభవన్ యను భువనమును తలపించు, పెద్ద కళామందిరము సాంస్కృతీ వర్జితారణ్యమున గర్జించు సాహిత్య మేఘము వలే నొప్పుచుండెను. 

త.వన  మేయద    శోకచ    క్ర సము    న్నత మే   ఆహో! మహా 

   భువన  దర్శన     భాగ్యమీ  తలబో     యనాట   కశాలయే

   వన   జాల క      లాపమో యనికాం   చిబిత్త     రపోదురో

   వన మందున    డాలు కొంచు ఆ  యశస్సు    గ్రహింతురో 

అశోక చక్ర వలె  సమున్నత  కీర్తి కాంతి గల  భవనమును చూచిన గగనమునకెగసిన  కీర్తి తరంగము వలె,  తాకిన ఆ  ప్రకంపనలు సాహిత్య వనమున కీరవాణి రాగమున పాడు కీరము వలె నుండును.  జంటనగర  సాహిత్య పిపాసా పిపీలకములకు క్షీరము వలె, గరకొను  హృదయములను గరిగించ నృత్య సంగీత సాహిత్య హవనములు జరిపించు సోమయాజివలె భావితరముల భావములను గను తల్లి వలె, జగన్మాతవలె నున్నది.  

త. జతలు    ఆరుగ   గూ డి రిం  తులు చొ క్కమేవి   రజి మ్మె  యా

   లతిక     లందరు     కూడ గా   విరుల   న్నిపాడు   సరాగ   మే   

   వతను    గాజడ   పూల చీ   రల మా  టలే వి     మలాత్మ లా 

   సుతను   లందరు    చేరికా   యిరిసా    మరస్య    తకల్గ    గా 



మొదటి వరుసలో  పన్నెండు మంది కూర్చొనిరి  మాలిని,  మంజూష  విదిష లు ముదిత లొకదరి , లకుమ తారలు వారి నంటి , నవ దంపతులా ప్రక్కనే డయానా తదుపరి పురుషులు అగస్త్య, సందీప బసవ రాఘవుల్ రంగ స్థలము వద్ద ముందు వరుసలో కూర్చొనగా  ఒక పెద్ద కుటుంబమువలె కనిపించుచుండెను. వారు జడలు , పూలు, చీరలు గూర్చి అనేక విషయముల గూర్చి మాట్లాడుకొనుచూ విరులన్నీ సరాగము ( స్నేహము) పాడునట్లు కనిపించుచుండిరి. విమలాత్ములైన అనగా  స్వచ్ఛమైన మనస్సుగల సుతనులు అనగా సుకుమారదేహముగల వారందరు చెలిమిని పొందిరి.   భానోజీ రావుగారు వేదికనధిరోహించి మొదటి వరుసలో నున్న ఈ పన్నెండు మందికి  ఒక ఛాయాచిత్రమును తీసి చూపగా వారందరూ చూచుచూ సంతోషిచుచుండిరి. నాటకము మొదలగుటకు ఇంకనూ సమయమున్నది యని వెంట వచ్చిన సేవకుడు పళ్ళెమునుండి మొదటి వరుసనున్న అందరికి పానీయములు అందించెను

ఒకప్పుడీ కళా భవనము  కళా విహీనంగా నుండెడిది. ఫ్రెంచ్ చలన చిత్రోత్సవం , బాలల చిత్రోత్సవం , ఇంద్రజాల ప్రదర్శనలు అప్పుడప్పుడూ జరుగుచుండెడివి.  ఈ మధ్యనే ఈ కళామందిరము ఆధునీకరణ జరిగెను.  ఇది నగరమందు అతిపెద్ద కళామందిరము.

రవీంద్రభారతి కంటే పెద్దదా? యని ఎవరో  అడిగిరి

అవునండీ, రవీంద్రభారతి యందు వేయి మంది కూర్చొని  చూచు అవకాశము కలదు. ఈ హరిహరా కళామందిరమునందు పదునాలుగు వందలమంది ప్రేక్షకులు కూర్చొని చూచు అవకాశము కలదు.  యని వారు పానీయములు సేవించుచుండగా  వారి వద్ద కూర్చుని మాట్లాడు చుండెను.   ఇంతలో 30 సం వయసుగల ఒక అందాల భామ  అచ్చటికి వచ్చెను. ఆమె అరుణతారకి నమస్కరించి  ఎదురుగా నున్న కుర్చీలో కూర్చొనెను. భానోజీరావుగారు " ఈమె నా మేనకోడలు  డాక్టర్ రంజని.  ఈమె రుక్మిణీ పాత్రధారిణి.

రంజిని:     మొదట   సారస్వత పరిషత్ లో ఈ తులాభారము ను ప్రదర్శించ వలెనని యోచించినాము కానీ 250 మంది ప్రధాన మందిరంలో , 100 మంది పై అంతస్థులో కూర్చొనే వీలుంది ,  ఈ నాటకమునకు  విశేష జనాదరణ ఉండునని ఊహించి ఇక్కడ ఏర్పాటు చేసినాము. అద్దె ఎక్కువైననూ ఇచ్చట ఏర్పాటు చేసినాము. 

ఆ భవనమా  అచ్చట ప్రదర్శించిన నెవ్వడూ  బోడు  అను చుండగా అరుణతార ఆమె వైపు కోపముగా చూసెను  

1961లో  రవీంద్రభారతి ప్రారంభమయ్యెను ఇది అంతకంటే పాతధమ్మా

15 శతాబ్దం కాకతీయుల పాలన పోయి న తరువాత    తెలుగు వెలుగులు నశించుచుండెను నిజాం పాలనలో  ఉర్దూ అధికారభాషగా, రాజభాష గా  మారిపోయింది     నిజాం  రాజుల పాలనలో నిరాదరణకు గురైన తెలుగు ఉనికిని కాపాడడానికి  1923 లో హనుమంతరావు పంతులు ఆధ్వర్యంలో  ఆంద్ర జన కేంద్రం , 1923  లో  ప్రారంభమైన  అనేక శాఖలు గావిస్తారించి . ఇందుకు  అనేక వందలాది సాహితీయోధుల కృషి యున్నదమ్మా. కలక్టరు గారు , అప్పటి తాసిల్దారుగారు కూడా తెలుగు భాషాప్రియులు వారందూ చెమటోడ్చి నిధులు పోగుచేసినారు. 1951 లో 2 గదులతో ప్రారంభమైన కళాపరిషద్ ఎం పీ గా ఉన్న సి నారాయణ రెడ్డి గారు 25 లక్షలు ఎం ఫై లాడ్స్ నుంచి నిధులుసమకూర్చారు.  ఇప్పుడు రెండంతస్తుల భవన ముగా మారెను. అని భానోజీరావు గారు చెప్పుచుండగా  

ఇప్పుడు ఆధునిక హంగులు లేనియెడల కష్టమని లకుమ చెప్పుచున్నది. అది నిజమే కదా చరిత్ర చెప్పుకొని  మురియుటవల్ల లాభమేమి ఆధునికంగా ఆలోచించవలెను అని లకుమకు వంత పాడుచుండగా  కన్నె డయానాలకు వెగటు పుట్టెను.  

భానోజీరావుగారు మాటమార్చి అనుకున్నట్టుగానే ఇంకనూ ప్రేక్షకులు వచ్చుచున్నారు. కళామందిరము దాదాపు నిండిపోయెను.  భారతవర్ష పేరు ప్రజలకి బాగా  ప్రాకి యుండుటచే.. అను చుండగా “యితడు సురభి సంస్థ కు చెందిన సీనియర్ కళాకారుడు యని చెప్పి ఇంకా

 మేము పోయివత్తుమని మేనకోడలు రంజనితో లేచి పోయెను. రంజనిగారు కూడా జనాదరణ పొందిన సినీనటీ అని అక్కడ నిలబడి వినుచున్న " మంచి కళలు" సంస్థ వ్యవస్థాపకుడు  చెప్పెను. 

లకుమ అగస్త్యతోమెల్లగా  “జనాదరణ .. హు..  మొత్తము నాలుగు చిత్రములలో చేసి మూల కూర్చొనెను. అనుచుండగా ఇప్పుడు నీ చేతులో ఉన్న చిత్రములే నాలుగు. అని అగస్త్యుడనెను. అది విన్న రాఘవ  " మత్తుగొల్పు ఆమె  అందమటువంటిది"  అని సం దీపునితో అనెను. " ఏమున్నది దానిలో పొడవుగా , బలిష్టంగా యుండును నాకు లకుమ  మనతో చదువుకున్న పిల్లవలే కనిపించును." అని సందీపుడు అనగా రాఘవుడు " అందని ద్రాక్ష పళ్ళు పుల్లన " అనెను. బసవడు నవ్వెను.  సందీపునకు అరికాలిమంట నెత్తికెక్కెను.    అప్పుడు  సందీపుడన్న మాటలు విని బసవడు , రాఘవుడు అవాక్కయ్యిరి. 

మాలినిగారు " మీరు సురభి సంస్థలో సీనియర్ నటులుగా చేయుచున్నారా? చాలా మంచి సంస్థ అని అమాయకంగా అనుచుండగా, “నన్ను సురభి నారాయణ అందురు. భానోజీరావుగారు గౌరవముతో నన్ను సీనియర్ నటుడు అనుటయే తప్ప మాసంస్థ యందు పెద్ద చిన్న భేదముండదు. 130 సంవత్సరాల  చరిత్ర గల సురభి నాటక మండలి యొక్క అసలు పేరు శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి. వారు ఒక పెద్ద కుటుంబం. నేడు, ఐదు తరాలలో ఒక కుటుంబంలో వందకు పైగా సభ్యులు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా  వేదికపై పనిచేస్తున్నారు. వీరంతా ఏ పని లేదా పాత్ర హీనమైనది లేదా ఉన్నతమైనది కాదని భావిస్తారు.  తెరవెనుక కార్మికులు, వీరిలో పెద్ద సంఖ్యలో ఉన్నవారు, పెద్ద నటులకి ఏ వేతనం లభిస్తుందో అతి పిన్న వయస్కుడికి అదే వేతనం లభిస్తుంది.” విద్యుత్ దీపాలు ఆరినవి. తెర లేచుచున్నది.

Monday, October 19, 2020

Bharatavarsha -54

 ఇన్నోవా  శంషాబాద్ విమానాశ్రయము నుండి నాంపల్లి  క్రిమినల్  కోర్టు కాంప్లెక్స్ కు దూసుకొని పోవుచున్నది.  మధ్య వరుసలో   అగస్త్య మరియు న్యాయవాది శరభ లింగముగారు కూరుకొని యుండిరి. లకుమ  అరుణతార వెనుక వరసలో కూర్చొని యుండిరి. హై కోర్టుకు పోవుటలేదా ? అని అగస్త్యుడడిగెను. " హైకోర్టుకు పోవలెనని ఎవరుచెప్పినారు?" అని లింగముగారు అగస్త్యను అడిగిరి. " చలన చిత్రములలో ఎక్కువగా హైకోర్టు చూపుచుందురు. హహ్హ హహ్హ అని అతడు బిగ్గరగా వాహన చోదకుడు నివ్వెరపోవునట్టు నవ్వెను. వాహనము నిదానించెను. " నువ్వు పోవోయి"  అని లింగముగారు  అనగా  చోదకుడు ముందుకి సాగెను. వాహనము నుంచి లకుమ రంగుల బొమ్మలు గోడలపైన కనిపించ సాగెను. 

అగస్త్యుని కి  మిక్కిలి సంతోషమాయెను. “కొంచెము నెమ్మదిగా పొమ్ము” అని వాహన చాలకునితో అనెను.  మరల కొద్ది  దూరము పోయిన పిదప  లకుమ బొమ్మలు గోడలపై  కనిపించెను. " నెమ్మది " అగస్త్యుడు అనెను.  మరల కొద్ది  దూరము పోయిన పిదప ఒక పెద్ద భవంతిపై లకుమ నృత్యభంగిమలో సౌందర్యమంతయూ చూపు బొమ్మ కనిపించెను. అగస్త్యుడు నోరుతెరచి చూచుచుండ " ఆపమందురా ?" అని చోదకుడడుగగా  “శంషాబాద్ నుండి నాంపల్లి మార్గము 30 కి. మీ  దారి పొడవునా  ఈ  బొమ్మలు ఉండును ఇట్లాగుచూ పోయిన యెడల దీని బైలు విచారణ రద్దయి శాశ్వతముగా జైలునందు కూర్చొనవలెను " అని అరుణతార గదుము చుండగా " అబ్బే చట్టప్రకారం  ఈ కేసు నిలువదు, కేసును  కొట్టివేయుట ఖాయము " అనుచూ శరభ లింగముగారు కూడా  ఆరు పదులు వయసు మరిచి ఆ బొమ్మలు చూచుచుండెను. 

"అరుణతార తలవిరపనగా తోచి  ఆ పెద్ద వయసు వకీలు గారిని ఏమీయూ అనజాలక వాహన చాలకుని అదిలించుటతో  వాహనము వేగము పెరిగెను. 11 కి. మీ  పొడవుగల పీ వీ  నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే  మీదుగా వాహనము ఝంఝామారుతముగా సాగుచుండెను. చిరు బాలుడు బల్లపై మెడ బెట్టి నెగబ్రాకుచున్నట్లు యా సమున్నత వారధి పైకి ప్రకటనలు ఫలకములు తలలెత్తి చూచుచున్నవి.  ఇరుదారుల మధ్య గల విశాల  విభాగిని  పై నిడిన  పూల కుండీలు ఆమధ్య గల విద్యుత్ స్తంభములు దూరముగా కనిపించు నగర ఆకాశ భవనక్రమము ఒక అద్భుతమునావిష్కరించుచుండెను.    “ఫిలింనగర్ లో నేరము జరిగిన అది హైకోర్టునకు బోక మరెచ్చటికి పోవును? “ అని అగస్త్యుడు కాలహరణమునకు ఒక తుచ్చ ప్రశ్న వేసెను " నేరపరిధి ఒక పోలీసు స్టేషనుకు లోబడి యుండును, కొన్ని పోలీసుస్టేషను కేసులు  ఒక న్యాయమూర్తిగారి పరిధిలోకి వచ్చును.  అనగా ఫిలింనగరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చును.  ఆకేసులన్నీ    మూడవ అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి గారు చూచెదరు.  మనకేసు వారి పరిధిలోనిదే. అనుచూ “నిదానము నిదానము”  అని కేకలు వేసి వాహనమును నిలిపించెను. అచ్చట లకుమ  అతిపెద్ద పతాకము కనిపించెను.  ఏమి  ఈ  శృంగార లావణ్యము, అత్యంత మనోహరముగా నున్నది! అప్సరసవలే యున్నావు” అని తన మనోగతమును బైటపెట్టి. “రేపు విడుదలగు నని వ్రాసి యున్న ఈ సినిమా తప్పక చూడవలెను” 

అని అనుచుండగా ముందు  కేసు సంగతి చూడండి బాబూ అని మెల్లగా వాహనాచాలకుడు గోణిగి , అతడి దృష్టి మరల్చుటకు రేడియోను ప్రారంభించెను. రేడియోలో  బట్టల సబ్బు, నవరత్న తలనూనె  ప్రకటనలు వచ్చిన పిదప ఒక పాఠశాల ప్రకటన వెలువడెను. తరువాత   " ఐ యాం రెడీ "  అంటూ అందాలు ఆరబోసిన నూతన తార లకుమ , హరీష్ ల  కొత్త ప్రేమ కథా చిత్రం  సునీల్ కుమార్ దర్శకత్వంలో రేపే విడుదల  ఆర్ యు రెడీ? అంటూ  వాచకురాలు వాక్ప్రవాహము నిలవగానే ఐ యాం రెడీ  చిత్రం నుంచి ఒక పాట  అనుచూ  వెలురించెను. 

కొద్దీ క్షణములు నిశ్శబ్దము ఆవహించెను తరువాత అంతకంతకూ పెరుగు మద్దెల ధ్వని వాహనమంతయూ ఆలుముకొనెను.  మంద్ర స్వరమున అపరలయా స్వనమున,  నాడుల వేడెక్కించు  శృంగార సాహిత్య  వినినంతనే దేహము రగులుకొనుచున్నది. చక్కిలిగింతలిడు  ఆ కామగీతమును   చిత్రీకరించు సమయములో   అగస్త్య,  లకుమ  పక్కనే ఉండటంతో అతడికి  ఆ పాట దృశ్యరూపమున  మనో నేత్రము పై కదిలాడుచుండెను.  అతడి మనసు కృష్ణ బిలమున పడి చీకటి లోయలోకి జారుకొనెను.

వాహనము ఒక్క కుదుపుతో నాయస్థానమందు ఆగెను. పాత్రికేయుల సమూహమచ్చట నేర వార్తలను చిత్రించుటకు సిద్ధముగా యున్నది. వారిని నెట్టుకొని లకుమ, వకీలుగారు,  అరుణతార  లోపలకి బోయిరి.   వాహన చాలకుడు అగస్త్య వాహనమందు మిగిలిరి. మూడవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి గారు కేసును కొట్టి  వేస్తూ తీర్పు నిచ్చుటవలన లకుమకు విడుదల లభించెను.

                                                                           ***

 రమదా హోటల్ మనోహర్: కన్నె, రోమి, డయానా అద్దెకారు దిగి  వియత్తలమునేలు శిరముగల హోటల్ భవంతి ముంగిట నిలిచిరి “ పెరేడ్ గ్రౌండ్స్ కు దగ్గరలో ఇంతకంటే దగ్గరలో ఇంతకంటే మంచి వేరొక హోటల్ లేదు” అని అద్దె కారు చాలకుడు తన పైకమును కొనిపోయెను. మువ్వురూ ఇంద్రభవనమును తలపించు హోటల్లోకి ప్రవేశించిరి. వారిని సిబ్బంది గారమున ఆహ్వానస్థలి వద్దకు తోడ్కొనిపోయిరి. 


  గుడ్ ఈవినింగ్ , వెల్కమ్ సర్ !  వెల్కమ్ లేడి!!

 సింగల్ రూమ్ ఫర్ దట్ లేడి ఇన్ ద  సోఫా అండ్ స్వీట్ ఫర్ కపుల్.

8, 900/- ప్లస్, జీ ఎస్ టీ,  ప్లస్ సర్వీస్. స్వీట్ ఫర్ న్యూలీ  వెడ్ కపుల్ ?!!

కుతూహలంతో ఎగసిపడు స్వరమును దాచజూసి దాచలేక. యప్ , యా.. ఉమ్ అని మెలికలు తిరుగుచున్న అతడి ఉత్సాహమును చూచి , కంఠ లంగోటా ధరించిన డాబుసరి  జేష్టుడు “కంగ్రాట్స్ ఆన్ యువర్ వెడ్డింగ్. వుయ్ విష్ యు ఆ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ వెడ్డింగ్ నైట్ ఐ రెకమెండ్  ప్రెసిడెంట్ స్వీట్  విత్  కింగ్ బెడ్ సర్” అంగయారు కన్నె గుండె గుభిళ్లు మన “ ఎన్నంగే , ఒరుతడవు ఇంగ వాంగే” అని సోఫా వద్దకు భర్తను పిలిచెను. డయానా అక్కడే యుండెను “వుంగళకు  పణం  విషయం తెరియాదు” అని డబ్బు మంచినీళ్లవలె ఖర్చు చేయుచున్న  భర్తను “ఇట్లెవరైనా  చేతురా అని హితవు చెప్పుచుండగా “ఎనక్కు ముతల్ ఇరవు , అతి తవిర ఎనక్కు  ఎదుం తెరియాదు.” అనుచూ విసవిసా బోయి పాతికవేలు చెల్లించి  పేర్లు నమోదు చేయించి  గదులు గైకొనెను.   "హరిహరా కళాభవన్ కు ఎట్లు రావలెనో తెలుపు దారి వివరములను  చరవాణి సందేశముగా  అగస్త్యుడు ఇపుడే పంపెనని" కన్నెకు డయానా చూపెను." నిన్ను( డయానా ను)  బుట్టలో వేసుకొనుటకు  గుడ్మార్ణింగ్ , గుడ్ నైట్ లు పంప వలెనని తెలిసిన వానికి తల్లి యోగ క్షేమములు విచారించుట తెలియదా " అని కన్నె అనుచుండగా అంతలోనే మరొక సందేశము " వలసినచో కారు పంపుదు"నని   "అబ్బో! డబ్బులు విరివిగా జల్లుచున్నాడు యువకుడు గ్రంథ సాంగుడే "  కనులను చక్రములవలె త్రిప్పుచూ డయానా అనుచుండగా అగస్త్య సంగతి చూచుట నావంతు  ఆ అడవన్  సంగతి చూచుట నీవంతు. అనగా డయానా తల పట్టుకొని " తల్లీ ముందు శోభనమో శోభనమో యని అల్లాడుచున్న నీ మొగుడు సంగతి చూడుము ఇటే  వచ్చుచున్నాడు." అనెను. 

Bharatavarsha - forecast

 సందర్భము : తులాభారం నాటికకు విదిష ను పిల్లవడు ( మంజూష ఆమెను కొనివచ్చును)  సరికదా పని వత్తిడి లో, కళారాధనలో  ఆమె జన్మదినమని కూడా  మరిచిన భారతవర్షను అలంకార గృహమందు ( గ్రీన్ రూమ్ ) భేటీ అగును. సత్య భామ వేషములో నున్న స్త్రీ పాత్రధారి , భారతవర్షతో చనువుగా నుండుట , కాలితో తన్నుట నాటకమునందు భాగములే అయినప్పటికీ విదిష కు ఆగ్రహమగును. వేరొక దృశ్యము జరుగుచున్నప్పుడు పాత్రధారులు అందరు   అలంకార గృహమందు వేచియుందురు .  కృష్ణుని వేషమున ఉన్న  భారతవర్ష  అలంకార గృహమందు  ఉండగా కసితో చెలరేగుచున్న అలంకార గృహ మునకేగుచున్న  విదిషను అనుసరించుచు   మంజూష చెప్పిన మాటలకు ఉత్పలమాల పద్యరూపమిది. 

 


      ఉ.  పొచ్చెము   లెన్నడే     యతడు    వీగియు      కోపము     చూపడె  ప్పుడూ

        ముచ్చట   దాచిలో      కమున     భాసము     పంచుచు    ధర్మబు   ద్ధితో

        పచ్చగ      లోక మే      వెలుగు     మార్గము    కోరుచు     సాగుసూ  రిన్

        వెచ్చగ          బేటము     తొలగ     ముద్దిడు      నచ్చిన     మెచ్చులా డివే


          పొచ్చెము  - దోషము  లెన్నడే  ;  వీగియు - ఓడిననూ,  కోపము     చూపడె  ప్పుడూ

         ముచ్చట   - కోరిక  దాచి  లోకమున,   భాసము - వెలుగు (అనగా జ్ఞానము)   పంచుచు

         ధర్మబుద్ధితో,   పచ్చగ  లోక మే  వెలుగు  మార్గము  కోరుచు  సాగు  సూరిన్ - పండితుని 

          వెచ్చగ    బేటము -శృంగార  కోరిక , తొలగ  - తొలగిపోవునట్లు   ముద్దిడు - ఒక ముద్దు ఇమ్ము  

          నచ్చిన    మెచ్చులా డివే - ( a woman to be admired) మెచ్చుకొనదగిన స్త్రీ  వే కదా!

రంగస్థలమందు సత్య భామ నటీమణి మాత్రమే. నిత్య జీవితములో సత్యభామ విదిషే  కదా.    సత్యభామ కోపము చవి చూచిన కృష్ణుడు ఎంత మురిసెనో  కదా !  కడకు ఆగ్రహించి తన్న వచ్చిన విదిష ముద్దిచ్చి పోయెను. 


The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...