Indian Sonneteer is a collection of 200 sonnets written by Polyglot Poolabala on diverse themes with rich imagery, that reflects the Indian emotions. Following the rules of English Sonnet Rhyme scheme Poolabala wrote 200 sonnets on themes such as Desire, Death, Dreams, Love, Lust, Philosophy . They are mines of poetry admired by connoisseurs. The 200 poems are divided into 20 sections according to their themes, with 10 poems in each section.
Sunday, February 8, 2026
Indian Sonneteer Review
Monday, February 2, 2026
Mahakavi in the hands of Palnadu S.P.
Palnadu police superintendent said that " Maha Kavi defines Urban Naxalism, shows the real face of Revolution in a high voltage Telugu poetry meant for gen Z. "
The foreword tells the story of Urban Naxalism Starting with revolutionary poetry - Virasam (Revolutionary Writers' Association), Then about establishing the People's War Group. The foreword says that the urban naxals are the forest naxal leaders who were sending their children to America but inciting innocent people to go into the forests – This is what urban Naxals have been doing for generations. says Poolabala the polyglot poet who wrote 50 verses in this Telugu poetry book Mahakavi.
Naxalism began in 1967 with an armed peasant revolt led by communist leaders against local landlords and the government in the Naxalbari village of West Bengal. Inspired by the teachings of Mao Zedong, this movement attempted to overthrow the state through a "people's war."
Varavara Rao, who wrote revolutionary works, is a Maoist leader with Maoist connections who was arrested in 2018 under the UAPA Act in the Koregaon case. K.G. Satyamurthy, the founder of the CPI People's War Party, encouraged revolutionary movements and wrote poems, which Varavara Rao published in his magazine. Influenced by the Naxalbari movement, Satyamurthy, along with K. Seetharamaiah, founded the People's War Group in 1968. Revolution is a tool to overthrow the government. Rebellion against injustice and public interest are just a facade.
Revolution is not about weapons or forests. It is a revolution only as long as there is a pen in hand. It is a revolution only as long as the person is among the people. When a gun falls into a man's hands, and he abandons the people to hide in the forest behind the trees, the revolution dies.
The true revolution is the Polish revolution. Lech Wałęsa, the electrician who became a politician, was the first democratically elected president of Poland. His leadership played a crucial role in ending communist rule.
The true revolution is the Polish revolution. A revolution that didn't involve taking up arms or fleeing into the forests, but instead garnered popular support and achieved victory through elections. A true people's revolution.
ఏదేశమేగినా కథ టూకీగా...
MAIN CHARACTERS
రోసేలితో ఎలెనా అనే ఉన్నత వంశానికి చెందిన దంపతులకి జులియన్, సెవెరో అనే ఇద్దరు కొడుకులుంటారు. వారు హిదాల్గో లు అంటే ఉన్నత వంశానికి చెందినవారు. అంటే మన బ్రిటిష్ ఇండియాలో జమీందారులుతో సమానం. మాద్రిద్ శివార్లలో గ్వాదారమా పర్వతశ్రేణికేసి చూస్తోన్న పెద్దజార్జియన్ భవంతికాసా దే వేగాస్ వారి ప్యాలస్.
అలాన్ సో కొడుకు ఎర్నెస్తో అప్పుడప్పుడే పైకొస్తున్న రచయిత అతడి తండ్రి అకస్మాత్ గా చనిపోతాడు. బంధువులు ఎవరూ అతడిని పట్టించుకోరు ఎర్నెస్తో వంటరివాడైపోతాడు. చనిపోయిన అలాన్ సో జూలియన్ స్నేహితుడు. .
జులియన్ మాడ్రిడ్ లో పెద్ద జ్యుయెలర్స్ తన భార్య థియోడరా తో మాద్రిద్ శివార్లలో గ్వాదారమా పర్వత శ్రేణికేసి చూస్తోన్న పెద్ద జార్జియన్ భవంతి కాసా దే వేగాస్ లో నివసిస్తుంటారు. కాసా దే వేగాస్ . కాసా అంటే ఇల్లు అని అర్థం, అంటే ఆ ఇల్లు వేగా అనే ఇంటిపేరు గల కుటుంబానికి చెందింది.
జార్జియన్ ఇల్లు పెద్ద ప్రహరీ , పెద్ద గేట్లు కలిగి పచ్చిక తో తోటలతో పెద్ద రాచ గృహం లా ఉంటుంది. ఆనాటి ఇల్లు పెద్దవి , కుటుంబాలు పెద్దవి. బస్సు కారు వంటి వాహనాలు లేకపోడంతో తయారు రోడ్లు ఉండేవికావు. సినిమా టీవీ లేవు కాబట్టి మానవ సంబంధాలు ఎక్కువ గాఉండేవి.
వేగాస్ అంటే చాలా డబ్బు పలుకుబడి ఉన్న నోబుల్స్ కుటుంబం.. ఎర్నెస్తో కి వారితో ఉండలేననిపిస్తుంది. కానీ జులియన్ భార్య థియో చాలా మంచి ఇల్లాలు.ఎర్నెస్తో ని కుటుంబం లో మనిషిలా చూసుకుంటుంది. జులియన్ థియోడోరా ల మధ్య వయో వ్యత్యాసం చాలా ఎక్కువ. అప్పట్లో స్పెయిన్లో బాల్య వివాహాలు ఎక్కువ గా ఉండేవి. వరకట్నం ఆచారం కూడా ఉండేది స్పెయిన్ ను పరిపాలించిన రాజుల్లో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోడం అరుదు
స్పెయిన్ కు చెందిన హెన్రీ వన్ కి 11 సంవత్సరాలు. ఎలియనోర్ 9 సంవత్సరాలు.
మరియా ఇసాబెల్లా 13 సంవత్సరాలు అల్ఫోన్సో VIII 14
ఇంగ్లాండ్ కి చెందిన ఆర్థర్ 15 కేథరీన్ 16. హెన్రీ VIII వయస్సు 17 కేథరీన్ వయస్సు: 23.
ఆమె తలిదండ్రులు ఫెర్డినాండ్ 17 ఇసాబెల్లా 18.
థియో కి మంచి మనసుంది బాగా డబ్బు ఉంది డబ్బు ఉన్నా ఎదో క చింత పెడతాడు కదా దేవుడు. థియో కి భర్తకి వయసు వ్యత్యాసం ఎక్కువ , పిల్లలు ఉండరు. ఎర్నెస్తో ని బాగా చూసుకుంటుంది. అన్న తమ్ముడు అని వరస లు కలపదు.
IMPORTANT CHARACTERS - SEVERO - MERCIDES - PEPITO
జులియన్ కి సేవారో అనే అన్న య్య ఉంటాడు. సేవరో భార్య మెర్సీ డెస్. కొడుకు పేపితో.
పెపితో కి 16 ఏళ్ళు. మాద్రిడ్ యూని వర్సిటీ లో మెడిసన్ చదువుకుంటున్నాడు. యూనివర్సిటీ 12 వ శతాబ్దం లోనే స్థాపించబడినా 1836 లోనే మాడ్రిడ్ కి మార్చబడింది. మాడ్రిడ్ కి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్దె మోరో అనే చిన్న పట్టణం లో మెర్సిడెస్ ఉంటోంది. జిప్సిం మైనింగ్ లో ఉన్న పారిశ్రామిక కుటుంబం వారిది. అతడికి ఒక ఆమెతో సంబంధం ఉంటుంది. డబ్బులున్నవారికి ఆరోజుల్లో అయినా ఈ రోజులూ అయినా ఇది మామూలే కదా . అంటే ఆరోజుల్లో సమాజం పట్టించుకునేది కాదు. మగాణ్ణి చట్టం గట్టిగా పట్టించుకునేది కాదు . అదే స్త్రీ చేస్తే శిక్ష ఉండేది. అహల్య ఇంద్రుడు కాల నుంచి ఇది ఉంది. భారత దేశంలో నే అనుకోకండి. మగాడికి ఇది మామూలే ఆడది సద్దుకుపోవాలి అనేది ప్రపంచం, పురుష ప్రపంచం. ఈ మధ్య కాల వరకు మన సినిమాల్లో కూడా అంతే.
మంచి నాటిక రాసి జనాదరణ పొందుతాడు ఎర్నెస్తో ఆ నాటిక వేగాస్ థియేటర్ లో ఆడుతూ ఉంటుంది. అప్పటిలో సినిమాలు లేవుకదా అంతా నాటికలు చూసేవారు. ఆ నాటిక ప్రదర్శన శాల వేగా కుటుంబానికి చెందింది. నాటిక ప్రదర్శన శాలల్లో కూడా డబ్బులున్నవారికి ప్రత్యేక కుర్చీలు క్యూబికల్స్ ఉండేవి. సామాజిక స్థాయిని బట్టి సీట్లు కేటాయింపు ఉండేది. కొన్ని సార్లు డబ్బులుం డడం స్థాయి ని నిర్ణ యిస్తుంది . కొన్ని సార్లు వర్గాన్ని బట్టి స్థాయి వస్తుంది. నోబుల్స్ అంటే ఉన్నత వర్గం. స్పానిష్ నోబుల్స్ ని హిదాల్గో లేదా హిదాల్గా అంటారు ఉన్నత వర్గాలకు ప్రత్యేక హోదా లభించేది.
లిమ్పి యేజ దే సాన్గ్రే అంటే ప్యూరిటీ అఫ్ బ్లడ్ అని స్పెయిన్ లో ఒక నమ్మకం ఆచారం ఉండేది. (ఇప్పటికీ ఉంది.) దాని ప్రకారం రాచ కుటుంబాలకు చెందిన వాళ్ళను ఉన్నత వంశస్తులను స్పానిష్లో హిదాల్గో అంటారు. స్త్రీలను హిదాల్గా అంటారు.
ఒక హిడాల్గో తన గొప్ప స్థితిని తన పిల్లలకు రక్తంతో అందించగలడు. అతడికి ప్రత్యేక మైన చట్టబద్దమైన గౌరవం లభిస్తుంది. హిడాల్గోస్ కు పన్నులు చెల్లించడం నుండి మినహాయింపు కలిగి ఉండడం, ఆయుధాలు ధరించే హక్కు కలిగి ఉండటం, కోట్ ఆఫ్ ఆర్మ్స్ ని అంటే తుపాకీ కలిగిన అంగ రక్షకుడిని కలిగి ఉండటం, ప్రత్యేక న్యాయ మరియు న్యాయస్థాన వ్యవస్థను కలిగి ఉండటం వంటి హక్కులను పొందారు. వారిని న్యాయమూర్తులు విచారించలేరు. రాజు మాత్రమే విచారించ గలడు. హిదాల్గోలకి ఎందుకింత గౌరవం అంటే రక్త స్వచ్ఛత. రక్త స్వచ్ఛత ఏంటి? ఏంటి ఈ చట్టాలు అనుకుంటున్నారా ? మన భారత దేశం లో చట్టాలు ఇలానే ఉన్నాయి . మైనారిటీస్ హక్కులు , మైనారిటీస్ , కులం బట్టి పేదరికాన్ని నిర్ణయించి , రిజర్వేషన్ కల్పించడం
మంచి నాటిక రాసి జనాదరణ పొందిన ఎర్నెస్తో గొప్ప డైరెక్టర్ అవ్వాలని కలలు కంటుంటాడు.
ఆ సమయంలో బావగారింటికి (కాసావేగాస్ కి) వస్తుంది మెర్సిడెస్. ఆమెకు 36 భర్తకు 50. భర్తతో సంతృప్తి చెందక ఆమె బాధపడుతుంటుంది. పైగా భర్తకి మరో చిన్న ఇల్లు. విడాకులు తీసుకుని తన దారి తాను చూసుకోవాలను కుంటుంది. అది దాదాపు అసాధ్యం.
Divorce was completely banned in Spain throughout the Franco regime (1939–1975) as part of a national-Catholic, conservative social order that deemed marriage indissoluble.
By the early 1970s, some intellectuals began to challenge this, but the law remained until after Franco's death.
లేచింది మహిళా లోకం నిద్ర లేచింది మహిళా లోకం .. అని పాటలో ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చర్ లెన్నో దంచింది విడాకు చట్టం తెచ్చింది అని విన్నారు కదా భారత దేశంలో కూడా ఇంతే జరిగింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పులతో ఆడవాలాడే పై చెయ్యి అయ్యింది మగవాడి మెడలో కుక్క బెల్టు పడింది. ఆడవాళ్లు ఆడుకుంటున్నారు. దాంతో పురుష ప్రపంచం దద్దరిల్లుతోంది.
అప్పట్లో కోర్టు విడాకులు ఇచ్చేది కాదు. కోర్టు ఇచ్చినా చర్చ్ ఇచ్చేది కాదు. దాంతో ఆమె ఎర్నెస్తో మీద దృష్టి పెడుతుంది. ఒక్క సారి ప్రయత్నించి భంగపడి, అవమాన పడి తన దారి మార్చుకుంటుంది.
ఎర్నెస్తో కి అభినందనలు తెలియజేసి నీకు మంచి భవిష్యత్ ఉంది అంటూ చెయ్యి నొక్కుతుంది. ధన్యవాదాలు అక్కా అంటాడు ఎర్నెస్తో. "అక్కఅని పిలవకుండా ఆంటీ అని పిలిస్తే బాగుంటుంది." అంది. “మీ అబ్బాయి నన్ను అంకుల్ అని పిలుస్తుంటే నేను మిమ్మల్ని .. “అంటుండగా మెర్సిడెస్ "చూడు నువ్వు నాటకాలు రాసుకో నాదగ్గర నాటకాలు ఆడకు. నువ్వు థియో తో ఆడుతున్న రాసలీలల మాటేంటి? అంది.
అయ్యో! ఆమె నాకు అక్కతో సమానం. అన్నాడు ఎర్నెస్తో చెవులు మూసుకుం టూ. "అక్కా తిక్కా? ఏం నటిస్తున్నావు. ఈ వూరిలో మూడొంతుల జనాభా మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? " అంది మెర్సిడెస్. అయ్యో అంత దారుణంగా ఉందా పరిస్థితి? అన్నాడు ఎర్నెస్తో.
ఆ రోజుల్లో ఇటువంటి పుకార్లు , గాసిప్ సమాజంలో ఎక్కువగా ఉండేవి అనేక మంది అప్పటిలో మనోవ్యధతో ఆత్మ హత్యలు చేసుకునేవారు. ఇదే కారణం తో ఎచే గరే అనే స్పానిష్ రచయిత ఈ నాటిక రాసాను అనిచెప్పేరు. ప్రాచీన సమాజం అలా ఉండేది. ఆడదాని బతకానిచ్చేది కాదు. ఈ రోజు మనం మారిపోయామా ? అంతకన్నా దారుణంగా తయారయ్యాం. ఏదైనా అక్రమ సంబంధం వీడియో పెడితే మనవాళ్లకు పండగే. లక్షల వ్యూస్, వేలాది కామెంట్స్ , అందులో అన్నీ నీతులు బూతులు.
“పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకం అంతా చీకటి అనుకుందట. అలా ఉంది నీ పరిస్థితి. నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదే కానీ నేనే ఈ విషయం జులియన్ కి చెప్పదని నా భర్త తో చెప్పాను” అంది మెర్సిడెస్.
కానీ ఈ విషయంతన తోటికోడలుకి థియో కి చెప్పేస్తుంది ఆమె తన భర్త జులియన్ కి చెపుతుంది. ఈ పుకార్లు ఎవరు చెప్పారు నీకు అన్నాడు జులియన్ తీవ్రంగా. ఇందాకా తోటలో ఆమే చెప్పింది. అంది థియో. జులియన్ మ్రాన్పడి పోయాడు. మీరైనా కొంచెం చెప్పండి అంది థియో. నేను చెప్పడం చాలా సార్లు అయ్యింది చాలా మంది ఉన్నత స్థాయి వారు చెప్పారు. వాడికి ఎవ్వరు చెప్పినా దండగ. అన్నాడు జూలియన్. పోనీ రాజుగారి తో చెప్పిస్తే అంది థియో. జూలియన్ మెత్తగా నవ్వాడు. థియో అయోమయంలో పడింది. ఇలాటి విషయాల్లో రాజులేంచేస్తారు? రాజుగారు ఉన్నతుడే కానీ ఉత్తముడు కాదు. ఆయనకూడా ... అంటుండగానే థియో " “అతడు మగాడే కదా! " అంది థియో కసిగా.
FRIEND - ALEHANDRA
మెర్సిడెస్ తన స్నేహితురాలు అలెహాంద్ర ( అలె) ని పిలిపించి తన భాధ చెప్పుకుంటుంది డబ్బు అందం తో పాటు దండం కూడా ఉన్న నువ్వే ఇలా మాట్లాడుతు న్నావా? అంది అలె. "దండం అంటే?" అంది మెర్సిడెస్ “శిక్షించే అధికారం" అంది అలె. అది నాకెక్కడుంది అంది. మెర్సిడెస్.
నిన్ను న్యాయమూర్తులెవ్వరూ విచారించలేరు అది మరిచిపోయావా? నీ మీద రాజుకి పిర్యాదు చేయడం అనేది అంత సులభం కాదు. మెర్సిడెస్ మనసు సంతోషంతో నిండిపోయింది అద్దం ముందుకు వెళ్లి చూసుకుంది. ఇక తన మొగుడు గురించి, ఎర్నెస్టో గురించి అంతా చెప్పింది. తర్వాత “ఎంత అందంగా ఉన్నా ఏంలాభం? ఎర్నెస్టో బాగానే ఉన్నాడనుకుంటే వాడు ఇలా తగలడ్డాడు. అని వగచింది అయినా మొగుడే ఇలా ఉంటే ఎవరినని ఏంలాభం. నా మొగుడే ఇంతా మగ చచ్చినాళ్ళు అంతా ఇంతేనా? అని ప్రశ్నలు సంధించింది మెర్సిడెస్. నైట్ ని పంపించి వాడిని పిలిపించని సలహా ఇస్తుంది అలె కానీ ఎర్నేస్తో ని బాధించదు పగ సాధించదు. ఎర్నేస్తో కి థియో తో సంబంధం ఉంటె ఆపమని కుటుంబం పరువు తీయద్దని చెప్పి ఎర్నేస్తో ని వదిలేస్తుంది మెర్సిడెస్.
IN LAWS - ROSELEO - ELINA
రోజెలియో, ఎలెనా కూడా ఉన్నారు. అత్తా మామలువస్తారు. ఏమైనా శుభవార్త ఉందా పెద్ద కోడలు థియో ని అడుగుతారు. పిల్లలు కోసం వాళ్ళు అలా అడుగుతుంటే థియో కి ఎంసమాధానం చెప్పాలో తెలీదు పుకార్లు గురించి విన్న ఎర్నెస్టో బ్యూనస్ ఏరస్ లో తన మిత్రుడుతో కలిసి నాటకాలు ప్రదర్శించుకోవాలని అనుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.
DOMINGO - CO -TRAVELER
ఎర్నెస్టో చేతిలో బేగ్ ని భుజం మీదకి మార్చుకుని నడుస్తున్నాడు. మార్చుకోడానికి మరోజత కాళ్ళుంటే బాగుండును. కాళ్లు పీకుతున్నాయి చలికి దేహం గడ్డకట్టింది. ఇక్కడ ఆగాలి తప్పదు. అనుకున్నాడు. కొంచెం దూరంలో నది ఒడ్డున ఇసుకలో చలిమంట కనిపించింది. అక్కడ గుంపుగా మనుషులు ఉన్నారు. అటు వైపు నడిచాడు. నడుస్తున్న కొద్దీ వాళ్ళ ముఖాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వాళ్లంతా గితానోలు అంటే జిప్సీలు. ఒక వ్యక్తి గిటార్ వాయిస్తున్నాడు. అతడు గితానో కాదు. కొంత మంది డాన్స్ చేస్తున్నారు. కొంచెం దగ్గరకి వెళ్ళగానే సంగీతం వినిపిస్తున్నది. ఎవరో బతికి చెడ్డవాడిలా ఉన్నాడు. అనుకున్నాడు. అతడు ఎర్నెస్టోని చూసి నవ్వాడు. ఎర్నెస్టో కూడా నవ్వేడు. కానీ ఆ నవ్వులో జీవ లేదు . గిటార్ వాలా మాత్రం అందంగా నవ్వుతున్నాడు "అల్ మాల్ తిఎంపో బోన కారా" అని హుషారుగా పాడుతున్నాడు. అంటే పరిస్తితులు బాగోలేనప్పుడే నవ్వుతూ ఉండాలనే గీతం. నిజానికి అది స్పెనిష్ ఇడియమ్. నవ్వుతూ హుషారుగా ఉన్నారు అంతా. నీపేరేంటీ అన్నాడు ఎర్నెస్టో గిటార్ వాద కుడిని దొమింగో అన్నాడు గిటార్ వాదకుడు "దొమింగో అంటే ఆదివారం అని అర్థం చాలా నవ్వుతాలు గా ఉంది." అన్నాడు ఎర్నెస్టో. మరైతే నవ్వు, నీలాటి ఏడుపు ముఖం వాళ్ళకి నవ్వు పుట్టించడానికే నాకీ పేరు పెట్టారు." ఎర్నెస్టో నవ్వలేదు
కొంతమంది హోరుహచ్చ తాగుతున్నారు. (అప్పటికి స్పెయిన్ లోకి టీ రాలేదు. 1906 లో విక్టోరియా టీ ని స్పానిష్ కోర్ట్ కి ప్రవేశపెట్టిన తరువాత జనాదరణ పొందింది. కొంతమంది స్త్రీలు నీళ్లు బాగా కలిపిన వైన్ తాగుతున్నారు. ఎర్నెస్టో రాత్రే వెళ్లిపోయాడని వార్త తెలిసి థియో బావురుమంది.
SOCIETY - CULTURE
జెంటిల్మెన్ క్లబ్ లు , బార్లు, టావెర్న్ లు ఏవీ కనబడవేం అన్నాడు ఎర్నెస్టో టీ వీ ఫోను రోడ్డు కారు కెమెరా కరెంటు లేని రోజుల్లో అవే ఫోన్ , క్లబ్ సినిమా సోషల్ ఇంటరాక్షన్ సెంటర్లు. అలా నడుచుకు ముందుకి సాగారు. మధ్యాహ్నం చుట్టుకింద విశ్రాంతి దొరికింది గానీ తిండి దొరకలేదు. సమయానికి అన్నం పెట్టే దేవత థియో గుర్తొచ్చి ఎర్నెస్టోకి ఏడుపొచ్చేసింది. తిండి కోసం ఇంత ఏడిచేవాడివి ఇల్లొదిలి ఎందుకొచ్చే సేవ్ అని దొమింగో దొబ్బులు పెట్టేడు. అప్పుడు తిండి కోసం ఏడవటం లేదని తన కథ అంతా చెప్పేసేడు ఎర్నెస్టో.
ANTONIO - INTRO
నాటక కర్త ఆంటోనియో ని పరిచయం చేస్తానన్నావు. అంది మెర్సిడెస్. అదిగో మాటల్లో నే వచ్చాడు అంది అలె. “యితడు చాలా జనాదరణ పొందిన నాటకకర్త. ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారు. అని ఆంటోనియోని పరిచయం చేసింది. తరువాత మెర్సిడెస్ ని ఇలా పరిచయం చేసింది. "ఈమె మెర్సిడెస్ వేగా. వేగా కుటుంబం నుంచి వచ్చారు." అంది అలె పరిచయాలైన తర్వాత అలె అంది " రెండు రోజుల్లో నీ రెండు నాటకాలు చూసింది మెర్సి. అంది అలె .
"ఎలా వున్నాయి నాటకాలు. రెండిటిలో ఏందీ నచ్చింది? అన్నాడు ఆంటోనియో. రెండూ బాగున్నాయి, కానీ మీరు హిస్టారికల్ డ్రామా లే వేస్తారా? అంది. అవునండీ, జరిగిన కథలు మాత్రమే వేస్తాము. అదే మానాటక సమాజం ప్రత్యేకత. అన్నాడు ఆంటోనియో. వాళ్ళు నాటకాలు ఆడేది ఎందుకో తెలుసా? అంది అలె. ఎందుకు సమాజహితంకోసమా? అంది. అవునండీ సమాజ హితం కోసమే ఒట్టు, మా నాటక సమాజహితం కోసం అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. "
ఆంటోనియో స్త్రీ సంక్షేమం కోసం కంకణం కట్టుకున్నాడు." అంది అలె. "సంక్షేమం కోసం కాదు స్వేచ్ఛకోసం కంకణం కట్టుకున్నాము." అన్నాడు ఆంటోనియో.
"రెండిటికీ తేడా ఏంటో?" అంది అలె. చాలా తేడా ఉంది డబ్బులేనివారికి సాయం చేస్తే అది సంక్షేమం, డబ్బు ఉండి స్వేచ్ఛలేని స్త్రీలు ఎందరో ఉన్నారు. వారికి సాయం చేయడమే నా లక్ష్యం అన్నాడు ఆంటోనియో. మీరు చెప్పింది నిజమే డబ్బు ఉంది స్వేచ్ఛలేని వారు ఎందరో ఉన్నారు. కానీ మీరు వాళ్లకి ఎలా సాయపడతారు. అంది మెర్సీ. సమాజంలో మార్పు తీసుకు రాయడం, చట్టాలలో మార్పులు తీసుకు రాయడం స్త్రీ స్వేచ్చకీ దోహదం చేస్తాయి. చూడండి మన స్పానిష్ సమాజంలో లింగ వివక్ష. పురుషుడైతే నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు, అక్రమసంబంధాలు పెట్టు కోవచ్చు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న పురుషులను వదిలేసి స్త్రీలను శిక్షిస్తారు. స్త్రీలకి విడాకులు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. మరో మగాడితో మాట్లాడకూడదు. దీన్ని మార్చాలి. ఏమంటారు అన్నాడు ఆంటోనియో.
ఏం మాట్లాడలేకపోయింది మెర్సిడెస్. ఉపన్యాసం బాగానే ఉంది కానీ మెర్సీ ఏంచేయాలో అడగకుండా ఇలా అడిగితే నీకేం ప్రయోజనం?” అంది అలె. "మా నాటక సమాజానికి కొంచెం ఆర్ధిక సాయం చేస్తే … ' అన్నాడు ఆంటోనియో.
.
అవునే ఎర్నెస్టో కి మీ కుటుంబం ఏంతో సాయం చేసింది. అతడికి కృతజ్ఞత లేక పోయింది. ఇతను అలాకాదు." అంది అలె. “చూడండి ఎర్నెస్టో కి మీరు సాయపడితే వ్యక్తిగతంగా అతడికి సాయపడడం అవుతుంది కానీ మాకు సాయం చేస్తే స్త్రీ లందరికీ మహోపకారం చేసినట్టే. స్త్రీలకు అన్యాయం జరుగుతున్నది అని నమ్మితే స్త్రీలకు స్వేచ్ఛ అవసరం అనుకుంటే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి.” అని ఆంటోనియో సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
HISTORIC PLAY - ANTONIO
స్పెయిన్ జానపద కళలకు నిలయం. జాన పద కళాకారులు ప్రదర్శనలతో అందరినీ రంజింప జేస్తున్నారు. నోబుల్స్ కి ఏర్పాటు చేసిన వరుసలో రోజెలియో ఎలెనా కూర్చుని కార్యక్రమాలని చూస్తున్నారు.
అంటొనియా టావెర్న్” అనే సత్రం వద్ద దొమింగో ఎర్నెస్తోలకు శాంటియాగో అనే షిప్ ఇంజనీర్ పరిచయం అవుతాడు . డబ్బు ఎక్కువలేదు! ఆకలేస్తున్నాది అన్నావుకదా ముందు తిందాం. తర్వాత గది సంగతి చూదాం “అన్నాడు దొమింగో మరి రాత్రికి బస ఎలాగ అన్నాడు ఎర్నెస్టో. ఇద్దరూ ఫెయిర్ ప్లేస్ దగ్గర కూర్చొని తిన్నారు. అందరికీ దొమింగో సంగీతం బాగా నచ్చింది. మరో పాట వాయించమని కోరారు. అంతే దొమింగో గిటార్ తీగలపై అతడి వేళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆహా మనసు పై ఎదో మత్తు జల్లుతు న్నాడు.
రోజెలియో, ఎలెనా కూర్చున్నారు. ఆంటోనియో వేదిక ఎక్కగానే చప్పట్లు, హర్షనాదాలు తో ఆడిటోరియం మారుమ్రోగింది. అంటా సద్దుమణిగాక "చిరకాలం కలిసి ఉన్న భార్య భర్తలని సన్మానించే గీతం పాడబోతున్నాన"ని ప్రకటించి పాట మొదలుపెట్టాడు. పాట అద్భుతంగా అందరికీ అనిపించింది. కానీ రోజెలియో ఎలెనాకి తమ గురించే పాడుతున్నట్టు అనిపించింది. భార్య భర్తకి ఎలా అనుకూలంగా ఉంటుందో, భర్త భార్యకి ఏం తీసుకువస్తాడో ఎలా చూసుకుంటాడో అన్నీ ఆ గీతంలో వివరిస్తున్నాడు. అవన్నీ తమ జీవితాల్లో జరిగినవే.
ఆ గీతం తమ జీవితం అని అర్థమైయ్యి వారి హృదయం ఉప్పొంగి వారి కళ్ళు ఆర్ద్రమయ్యాయి. కళ్ళు తుడుచుకుని చూసేసరికి ఆంటోనియో " ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక అద్భుతమైన జంట గురించి విన్నారు అటువంటి జంట మన ముందే ఉన్నారు. నేడు వారి పెళ్లి రోజు. వారిని ఇప్పుడు చూపిస్తాను." అని ప్రకటించాడు. రోజెలియో, ఎలెనా లను వేదిక పైకి రమ్మని ఆహ్వానించాడు ఆంటోనియో. ఇంకెవ్వరూ మాట్లాడలేదు. ఆ విశిష్ట వ్యక్తి వేదిక మీదకి రావాలి అని ప్రకటించగానే వాళ్ళ పెద్ద కుమారుడు జూలియన్. వారిని సెవరో మామగారు డ్యూక్ హువాన్ వేదికపైకి తీసుకు వెళ్ళాడు. “ఇప్పుడు ఒక విశిష్ట వ్యక్తి వారికి పెళ్లిరోజు కానుక అందిస్తారు. వారెవరో ఈ దంపతులు ఊహించగలరేమో చూద్దాం" అన్నాడు ఆంటోనియో రోజెలియో, ఎలెనా తో.
సమస్యలన్నీ మరచి మనసు పాడుతోంది అనుకు న్నాడు ఎర్నెస్టో. అతడిని చూసి డొమింగో నవ్వేడు. ఎర్నెస్టో నవ్వేడు కానీ మనసులో అసూయ పొంగింది. "ఈ వెధవకి అందుకే సమస్యలు పట్టవు, భవిష్యత్ కూడా పట్టదు అనుకున్నా డు ఎర్నెస్టో. గిటార్ బాది పారేస్తున్నాడు దొమింగో రాత్రి బసకి గదులు కావాలి దానిగురించి ఆలోచించు అన్నాడు డొమింగో చెవిలో. విని నవ్వాడు గిటార్ ఆపలేదు. అందరూ పరవసించి పాడుతున్నారు. అదే సమయానికి శాంటియాగో గదిలోంచి గిటార్ పట్టుకుని వచ్చాడు. అందరూ అతడినే చూస్తున్నారు. అతడు దొ మింగో పక్కనే కూర్చున్నాడు.
వావ్! మీరు వాయిస్తారా గిటార్ అన్నాడు దొమింగో. ఎర్నెస్టో తలపట్టుకున్నాడు. ఒకడే ఇలా రెచ్చి పోతుంటే రెండోవాడు కూడానా అనుకున్నాడు. నేను మీముందు గిటార్ వాయిచడం హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే. అన్నాడు శాంటియాగో. నా గిటార్ పాడైపోయిందండీ! అంతబాగా పలకదు నాగిటార్ అన్నాడు దొమింగో తన గిటారులో చీలిక చూపిస్తూ. “అయ్యో! నా గిటార్ తీసుకోండి!” అన్నాడు శాంటియాగో. “వద్దులెండి అది చాలా ఖరీదైనది కదా!” అన్నాడు అన్నాడు దొమింగో.
“పర్వాలేదుతీసుకోండి! వాలెన్సియాలో మరోటి కొనుక్కుంటా ను నేను అక్కడికే వెళుతున్నాను. అక్కడ గిటార్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. తెలుసా?” అన్నాడు శాంటియాగో. సెంచోర్ది బ్రదర్స్ 1881 లో వెలేసియాలో స్థాపించిన గిటార్ తయారీ వర్క్ షాప్ (కర్మాగారం) యూరోప్ అంతా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆరోజుల్లో ప్రచార సాధనాలు తక్కువ కనుక సమాచారం అందడం అంత సులభం కాదు. మొట్ట మొదటిసారిగా ప్యాసింజెర్ షిప్ వాలెన్సియా నుంచి బయలుదేరుతున్నాది అందులో నేను నేను యంత్ర విభాగంలో పనిచేస్తున్నాను. అన్నాడు శాంటియాగో.
డొమింగో ఎర్నెస్టో వైపు చూసాడు ఎర్నెస్టో కి పిచ్చెక్కింది. షిప్ ఎంత దాకా వెళుతుందండీ అన్నాడు. శాంటియాగోతో. బ్యోనస్రె ఏరెస్ దాక వెళుతుంది అన్నాడు అతడు. ఎర్నెస్టో కి బుర్రతిరిగి కింద పడిపోయాడు
Sunday, February 1, 2026
ఇలాంటి మాస్టారిని నేను చూడలేదు.
లూథరన్ పాఠశాల - శనివారం జనవరి 31, 2026
లూథరన్ పాఠశాలలో - శనివారం జనవరి 31 2026 పిల్లలతో కార్యక్రమం చేయడానికి పాఠశాల వ్యవస్థాపకులు రత్నకుమార్ గారు నిర్ణయించి ఆహ్వానించారు. భాషా నైపుణ్యాల పై పిల్లలకు శిక్షణ ఇవ్వడం నేను జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. చిన్న పెద్ద , ప్రభుత్వ పైవేటు పాఠశాలలు, కాలేజ్ లు యూనివర్సిటీలు దగ్గర దూరం అనకుండా తిరుగుతుంటాను.
నా బ్లాగ్ లు చూస్తే పదేళ్లనుంచి ఇదే పనిలో ఉన్నానని తెలుస్తుంది.
జనవరి 31 , చేస్తున్న పని ఆపి ఉదయాన్నే 7.00 గంటలకు నరసరావుపేట బయలుదేరాము.
విశాలమైన ఆటస్థలం , సాధారణ మైన తరగతిగదుల లూథరన్ పాఠశాల ఆధునికత ముసుగు లేని సహజమైన వాతావరణంతో నేను చిన్నప్పుడు చదువుకున్న బడిలా అనిపించి మనసు పులకరించింది.
విద్యార్థులందరూ విశాలమైన ఆడిటోరియంలో ఆకుపచ్చని తివాచి పై కుర్చీలలో కూర్చున్నారు వర్క్ షాప్ ప్రారంభై అయ్యింది. పిల్లలని ఆనందపరచటానికి ఫారిన్ లాంగ్వేజెస్ లో మాట్లాడేను. కొద్ధి సేపు శిక్షణ అనంతరం పిల్లలు పేదరికంలో ఈదుతూ అజ్ఞానం అనే అలలతో పోరాటం చేస్తున్నారు. శిక్షణ ఎన్ని ప్రశ్నలు అడుగుతూ సమాధానం చెప్పిన వారికి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ పిల్లలని వీలైనంత ప్రోత్సహిస్తూ ముగించాను పాటలు పద్యాలతో అలరిస్తూ ముగించాను. మిగిలిన పుస్తకాలు లైబ్రరీకి బహుమతిగా ఇచ్చేను.
మౌనంగా కూర్చున్న పిల్లలకి స్పందించడం నేర్చుకోవాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు. సినిమా పాటలకి డాన్స్ చేయాలంటే మీరు చాలా ఉత్సాహం చూపిస్తారు ఆ ఉత్సాహం ఇక్కడెందుకు లేదు అన్నారు. నా జీవితంలో ఎప్పుడూ వినని ఒక మాట...నాకు ఆనందం కలిగించే మరొక మాట అన్నారు. అది ఏంటంటే "ఈ స్కూల్ లో సినిమా డాన్స్ లు బంద్ ఇక పై చక్కగా స్టేజ్ ఎక్కి ఏం చదువుకున్నారో ఏం నేర్చుకున్నారో అవి చెప్పండి చాలు. విద్యా ప్రతిభ లేనప్పుడు సినిమా ప్రతిభ ఎందుకు?" ఇలాంటి మాస్టారిని నేను చూడలేదు.
నా పని షరతులు లేని సేవ. సేవాభావంతో బోధన చేస్తే మనసు వికసిస్తుంది. విద్యార్థుల, శ్రేయస్సు కోరి పని చేస్తే ప్రతిఫలం కంటే తృప్తి వస్తుంది. తరచుగా ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఈ విద్యా సేవ చేయడం కోసం సమయం మరియు వనరులను త్యాగం చేయవలసి ఉంటుంది. ఐతే సరస్వతి ఆశీస్సులు, మనుషుల ప్రేమ ప్రతిఫలంగా పొందుతుంటాను.
నటనకు దూరం. నడతే ప్రాధాన్యం ఆయనకు. మాస్టారిని చూస్తే మా నాన్న గారి నడత మాట తీరు గుర్తొస్తాయి లూథరన్ పాఠశాల ను చూస్తే. చిన్నపుడు మాబడి గుర్తుకొస్తుంది . లూథరన్ పాఠశాల నరసరావుపేట నా బాల్యాన్ని గుర్తుచేసింది
టీచర్స లో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. విద్య పట్ల శ్రద్ధ అతిధి పట్ల ఆదరణ వారికి ఆకర్షణ గా నిలిచాయి.
చ . మనిషికి విద్య నిచ్చిన సుమాలకు తావిని జేర్చినట్లగున్
మనమున పుట్టు భావములువాడ నితావులుకావె మాటలన్
వినమరి సేదతీర్చుచుచు వీనుల విందులుచేయు చేతలన్
కనమరి నిండు నీతిగల వాడికి నీడ యె విద్య చూడగన్
మనిషి కివిద్య నిచ్చిన సుమాల కుతావి నిజేర్చి నట్లగున్
మనము నపుట్టు భావము లువాడ నితావు లుకావె మాటలన్
వినుమ రిసేద తీర్చుచు చువీను లవిందు లుచేయు చేతలన్
కనమ రినిండు నీతిగ లవాడి కినీడ యెవిద్య చూడగన్
Friday, January 30, 2026
పూలబాల ఇండియన్ సోనెటీర్ - 200 సోనెట్ల సంకలనం
ఆంగ్ల
చందస్సుని నియమాలని పాటిస్తూ
పూలబాల రాసిన ఇండియన్ సోనెటీర్ 200 సోనెట్ల సంకలనం
200 మణి మాణిక్యాలతో జాతిరత్నాలతో అలంకరించబడిన
ఒక అందమైన ఆంగ్లకవితా శిల్పం. ఈ
రెండు వందల పద్యాలు
20 వర్ణాల కాంతులీను సుసంపన్న మణులు. ఘనులు మెచ్చిన
కవితా గనులు. 200 పద్యాలు
భావానుగుణంగా 20 భాగాలు ప్రతి
భాగం లోనూ 10 పద్యాలు ఉన్నాయి.
మొదటి భాగం
శిల్ప పాద పీఠం వద్ద అందమైన
ముద్దు లొలికే పదాలలో
మురిపించే జీవితానికి స్పూర్తి నిచ్చే, భావాలలో నేసిన కాశ్మీరు తివాచిలా ఆహ్వానం పలికే అడోరబుల్.
ఇందులో డిజైర్
డెత్ డ్రీమ్స్ ప్రోబ్లమ్స్ ఆశనిరాశల
పోరాటం వంటి పద్యాలు కనిపిస్తాయి.
వాటిపైన “మై వెర్స్ “ అనే
పద్యం నీ
వారందరూ వదిలేసినా
నేనున్నాను అని అభయ హస్తం లా కనిపిస్తుంది.
2 భాగం రొమాంటిక్ కోవకు చెందినది ఇందులో కూడా పది పద్యాలు ఉన్నాయి ఇవి Love on Train Silver Fish, Happy birds , Flower of Love , Honey moon ఇవి పిల్లగాలిలా మనసును తాకి గిలిగింతలు పెడతాయి.
3 వ భాగం కింగ్స్
అండ్ బేటిల్స్ : పల్లవులు, చోళులు, కలింగులు,
కంబల్ ఘర్ ఫోర్ట్, విజయనగరం ఫోర్టు, రెడ్ ఫోర్ట్.
బేటిల్ ఆఫ్ పద్మనాభం, అనే చరిత్ర మట్టిలో లోకప్పబడిన అనేక విషయాలని కోటల కట్టాడాలని యుద్దాలని తవ్వితీసేభాగం.
4 భాగం పాషన్ అంటే మోహం. భ్రారతీయ పురాణ సాహిత్యం లో శకుంతల విశ్వామిత్రుడు గ్రీకు సాహిత్యం లో లిడా, Swan జియస్ Head God వంటి
వారి మొహాల్ని ఇందులో కవి వర్లిస్తాడు. మోహాన్ని దాటడం చాలా కష్టం
అని చెప్పే భాగం ఇది.
“అదుల్తేరియో”
నవల కథా సంగ్రహాన్ని “ఓడ్ టు పాషన్” అనే ఓడ్, రచయిత తన జీవితంలో చూసిన అందమైన స్త్రీ మీద రాసిన
“ఓడ్ టు హర్ డివైన్ బ్యూటీ” కూడా ఈ భాగంలో ఉన్నాయి.
5వ భాగం లౌ ఫిలాసఫీ : ఇందులో పద్యాలు హేతువా దంతో
ప్రేమతత్వాన్ని విశ్లేషిస్తాయి నో లౌ
ఈజ్ ఫిలసాఫికల్ అనే పద్యంలో ప్రేమ భౌతిక మైనది శారీరక మైనదని
అద్భుతమైన విశ్లేషణ ప్రాసలతో రాసాడు హార్డ్ అండ్
మైండ్ అనే పద్యం లో చిన్న చిన్న పదాలలో
పదబంధాలతో దట్టమైన ప్రాసతో శబ్దం వీనులవిందుగా భావం మనసుకి
హత్తుకునే లా రాసాడు , వర్డ్స్ మేక్ లౌ లో అందాన్ని చిత్రాలకంటే
పదాలే బాగా చూపిస్తాయని వర్డ్స్ ఆర్ మోర్ సెడక్టిన్ అని చెరుకు రస ప్రాయంగా చెప్పాడు.
నోవన్ ఈజ్ లో న్ లీ
లో వంటరి వ్యక్తులు మైండ్స్ టార్చ్ తో తమలోకి చూస్తే ప్రేమ కనిపించి
వంటరితనం అంతం అవుతుందని లవ్స్ ప్యూయల్ లో డజ్ రొమాన్స్ హే పెన్ బై ఛాన్స్ అని రూట్స్ ఆఫ్ రొమాన్స్ బాడీ కర్వ్స్ కాదు వర్డ్స్ అని అందమైన శరీరంలో కాక తీయని మాటల్లో రోమాన్స్
దాగి ఉంటుందని రాసాడు . ఈ భాగం కొత్త
దంపతులకి పాతదనం తో గిన వారికి శృంగార
వింజామర. ఈ భాగం 50 వ పద్యం మేరేజ్
తో ముగు స్తుంది.
6వ భాగం : 5
భాగం లో పదాలలోంచి పుట్టే శృంగారం గురించి రాసిన కవి ఇప్పుడు ఎరోటికా లో ఏకంగా ఏక్షన్ లోకి దూకేస్తాడు ఈ భాగం
లస్ట్ అనే పద్యం తో మొదలెడతాడు లస్ట్ అంటే కామం
కామం గొప్పతాన్ని అత్యద్భుతం గా వర్లించిన పద్యాలు కొన్ని ఉంటే అందులో ఈ పద్యం
అగ్రస్తానం లో ఉంటుంది. రతి జీవన గతి
అని జీవిత నౌకకు చుక్కాని
అని గౌరవ స్తానం రతికి ఇచ్చి అంజంతా ఎల్లోరా విరూపాక్ష రతీభంగిమలు కనిపించేలా
చూపుతాడు. ఎరోటికా అంటే రతి శిల్పం.
7వ భాగం : ఐదో
భాగంలో రొమాన్స్ తో కవ్వించి ఆరోభాగంలో మరిగించి ఏడవ భాగంలో నైట్స్ సాంగ్స్ తో చల్లబరుస్తాడు
కవి. రాత్రి నల్లని ముసుగు
ధరిస్తుందని నైట్స్ మేంటల్ లో రాస్తాడు
రాత్రి అందాలను మన మనసుకి పూస్తాడు. డార్క్నెస్ అనే పద్యంలో లో చీకటి చదువరికి పూస్తాడు. క్వయట్ నైట్
పద్యంలో నిశ్శబ్ద రాత్రిలో మనం నడుస్తున్న
ట్టుంటుంది. నైట్ ఈజ్ అ కైట్ లో రాత్రి గారి పటంలా గాలిలో ఎగురుతుందని స్త్రీ మూర్తి
దయతో నిండితే ఎలా ఉంటుందో రాత్రి
చీకటితో నిండితే అలా ఉంటుందని అనేక పోలికలతో
రాత్రి అందాలని వర్లిస్తూ రఫేల్ హార్ట్
అనే పద్యం లో రాత్రి పట్ల తన ప్పదయ స్పందనను తెలియ చేస్తాడు.
ఈ భాగం 70 వ పద్యం సమ్మర్ నైట్ తో ముగుస్తుంది
8వ భాగం
"హార్ప్ స్ట్రింగ్స్" లో తన ఊహలను విచిత్ర అనుభవాలను హృద్యంగా తన అపార్ట్
మెంటలో శబ్దాలకి కారణం దెయ్యం ఉందని అపార్ట్ మెంటు వాళ్ళు కాపలా ఎలా కాసారో వింటర్ మోర్నింగ్ రైడ్ అనే పద్యం లో పొగ మంచు తెరలో తన మోటార్ సైకిల్ ప్రయాణాన్ని ప్రకృతి సౌందర్యాలని ప్రమాదాలని
రాస్తాడు. పామర్రులో తన మిత్రుడి పాఠశాల లో సన్మానాల ను వారి అభిమానాన్ని మంచి పదాలతో ప్రాసతో ది ఎక్ట్రార్డినరీ అనే పద్యం లో
రాసాడు తను డిల్లీ లో ఉండేటప్పుడు ఒక
మోసకారి డంబాచారి జీవనశైలిని హాస్య పూరితంగా
వర్లిస్తాడు.
9వ భాగం కలర్స్ ఆఫ్ ద అర్త్ ఇందులో భూమి ఆభరణాల వర్లన చాలా సున్నితంగా
ఉంటుంది. కొండలు పర్వతాలు కిరీటాలు నదులు జలపాతాలు. కంఠాభర ణాలు మొక్కలు
వృక్షాలు శిరోజాలు ఇలా మేటి సృజనాత్మకతతో మది పులకించే పోలికలతో
భావ ఆభరణా లను పుడమికి చక్కగా అమర్చేడు
కవిరేడు పద్యాల పేర్లన్నీ జంటపదాలే
Hills and
Mountains, Rivers and Fountains, Trees and Plants, Seas and Oceans, the Sun and
the Moon అని రాసాడు. ఈ భాగాన్ని I am the earth, my heroine అనే సుదీర్ఘమైన పద్యంతో
ముగించాడు. ఇక్కడ భూమికి గల ఆభరణాల గురించి రాస్తూ భార్య గురించి ఎందుకు రాసాడు ? తాను భూమి అయితే తన భార్య తనకి ఆభరణం అనా? కవి
చమత్కారం కొంత ఉండొద్దూ
10 వ భాగం రాయల్ ఫ్లేమ్స్ అటవీ సంపదను
ఎలా దోచుకుంటున్నారో అటవీ వృసాలను ఎరాచంపు తున్నారో చూపించే .ఈ ఖండం
ఖండ ఖండాల గా ప్రకృతిని భంజించే ఛండాల మానవ వృత్తిని ప్రవృత్తిని ఎండగట్టే భాగం. ఇందులో
ఆవు చీమ ఏనుగు నది వంటి భారతీయ మనోభావాలను
చూపే పద్యాలు ఉన్నాయి.
11వ భాగం గ్రేవ్
యార్డ్ పోయెట్రీ. 18వ శతాబ్దంలో ఒక చిన్న
ఇంగ్లీష్ కవులు సమూహము జీవితన్ని అధిగమించడం
మృత్యువు ఇందులో సోలిటరీ పోయెట్ అనే పద్యం కాటి దృశ్యాన్ని కళ్లకు చూపిస్తుంది.
ఇందులో ఫేట్స్ పప్పెట్ అర్జెంట్ ఫేర్ వెల్
ఎమ్టీనెస్ జర్నీ లాంటి విషాద మైన పద్యాలున్నాయి. శాశ్వతత్వము వంటి థీమ్స్ పైన విషాద
కవితలల్లే వారు . వీటిని గ్రేవ్ యార్డ్ పోయెట్రి అంటారు. అంటే హరిశ్చంద్రుడి కాటి పద్యాల్లా
అన్నమాట.
12/ 13 వ భాగం
అంతా ఆశ Hope of Love అని ఒక ఆశా శ్రేణి పద్యాలు రాసేడు కవి అయితే ఆ పక్కనే నిరాశ
వాదం చూపిస్తాడు Frustration poems పక్కనే రాసాడు.
జీవిత మంటే వెలుగు నీడలు ఆశనిరాశల కలయికేదా.
14వ భాగం ఫ్రీడం అంటే స్వేచ్చ గురించిన
పద్యాలు. ఫ్రీడం ఆఫ్టర్ మ్యారేజ్ , డేడ్రీమ్ ,
slavery comes in disguise. చదువు తుంటే
పెళ్ళి మీద తిరుగుబాటు పద్యాలని అని పిస్తుంది. హాస్య ధోరిణి లో అందమైన పదాలతో అలంకారాలతో
స్వేచ్చ ప్రాముఖ్యతను గుర్తుండి పోయేలా చెప్పాడు.
Freedom is Life’s thunder అన్నాడు. అంటే స్వేచ్చ
జీవితానికి గొప్పశక్తి అన్నాడు ఫ్రీడం ఈజ్ హెవెన్
స్పిరుట్యువల్ ఫ్రీడం పద్యాలతో ఈ భాగం ముగుస్తుంది.
హి సిట్య్ ఆన్
ఎ రాక్ ఎండ్ కౌంట్స్ నాట్ ద క్లాక్ హి డజంట్ ఈవెన్ ధింకాఫ్ ప్రీడం దటీజ్ ఆబ్ సల్యూట్ ఫ్రీడం అని సర్వోతృష్ట మైనది
స్పిరు ట్యువల్ ఫ్రీడ్రం గా వర్ణిస్తాడు కవి.
15వ “After
13 years” ఈ భాగంలో ఢిల్లీలో తనకి ఆధ్యాత్మిక
గురువైన ఒక ఢిల్లీ స్నేహితుడు 13 సంవత్సరాల తర్వాత విజయవాడ వస్తున్నాడు అని తెలిసినప్పటి
నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ లో విజయవాడ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం మీదకు వచ్చే ట్రైన్ కోసం వెతుకులాట ఎదురుచూపులు స్నేహితుడిని కలవడం వరకు తను మనోభావాల్ని ఇవన్నీ సోనిట్ల
రూపంలో రాశాడు కవి. 13 సంవత్సరాల తర్వాత స్నేహితుని
కలిసినందుకు ఆనందపడి 13 సోనిట్ల రూపంలో అతనితో తనకు గల అనుబంధాన్ని వర్ణించాడు. ఆవగింజ
మీద అరవై పేజీలు కవితలల్లగల ప్రౌఢ కవికి ఇదేం
కష్టం కాదని పూలబాల రాసిన భారత వర్ష అనే తెలుగు గ్రంథం చదివిన వారికి విదితమే. తెలుగు ఆంగ్ల భాషలో
సడలని పట్టుతో ఏకరీతిన చెలరేగిన కవివరేణ్యడు
పూలబాల.
16 వ భాగం మర్మసింగ్ పామ్స్ : పదో శతాబ్దపు కాశ్మీర్ రాణి దిద్దా, 17వ శతాబ్దపు ఢిల్లీ రాణి రజియా సుల్తానా,
17 వ శతాబ్దపు రష్యన్ రాణి కేథరీన్, ఫ్రెంచ్
రాణి ఆంత్వా నెత్ అనేకమంది
పురుషులతో విలాస స్త్రీలుగా పేరు
పడ్డారు. అటువంటి మార్కండ్ రాణి భయానక
కల్పిత కథను సోనెట్స్ రూపంలో వెన్నులోంచి చలిపుట్టేలా చెపుతాడు కవి. మార్కండ్ లో రత్న ఘర్ కోట లో రాణి అందమైన
పండితుణ్ణి చూసి మోహించి దక్కకపోడం తో నింద వేస్తుంది అది భరించలేక
ఆ పండితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు అతడిశాపా నికి గురైన
కోట భూత గృహంగా మారిపోతుంది.
ఊరంతా శ్మశానంగా మారిపోతుంది.
అక్కడున్న తాటి చెట్టు
రివ్వున వీసే గాలీ ఆకథలను పాడుతుంటాయి.
15 వ భాగం పూర్తిగా వాస్తవం దానికి
విరుద్దంగా పూర్తిగా కల్పితమైన 16 వ భాగాన్ని రాసాడు కవి.
17 వ భాగం చెర్రీ
బ్లోసమ్స్ . ఇందులో రైళ్లను రాణులతో పోల్చి , వాటికోసం అందరూ ఎదురుచూడాల్సిందే అని
వాటి హుందాతనాన్ని వర్ణిస్తాడు , రైలు నడక
, పరుగు , కిటికీలోంచి కనిపించే ప్రకృతి మాత్రమే కాక రాల్లో మనుషుల ప్రకృతి కూడా వర్ణిస్తాడు
సామాన్య ఊహకి అందని ఇమేజరీ మనసులని
కవితా ఘరి లో తడిపేస్తుంది.
18 వ భాగం వైల్డ్ థాట్స్ లో మొదటి పద్యం లోనే అమోఘమైన భావనలు
పతాకస్థాయి వర్ణనలు చూపిస్తాడు . అనే పద్యంలో తనని తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు.
మహాకవి అనే విప్లవ కవితల పుస్తకంలో కూడా మొదటి కవిత ఇలాగే చాలా దుడుకుగా ఉంటుంది. చీకటి
కాఫి తాగిన అనుభూతివస్తుంది చదివి తీరాల్సిందే. ఇందులో బర్న్ ది ఫెర్న్ ఐ ఫ్ అనే పద్యాలు జాతీయ భావాలని దేశం పట్ల కవికి
గల ప్రేమని తెలియజేస్తాయి.
19 వ భాగం కవి
బాల్యం చిన్ననాటి అనుభవాలు. పద్యాలలో ప్రాసకంటే ఇమేజరీ కి ప్రాముఖ్యతనిచ్చి , తీపిగురుతులను వెనక్కితోడుతాడు కవి. ఆ కాలానికి
చెందిన వస్తువులు డయోనారా టీ వీ , మర్రి చెట్టు , పిల్లల ఆటలు అప్పటి నాగరికత ను కళ్లకుకట్టినట్టు వర్ణించడం వల్ల ఈ పద్యాలు చదువరులు
అందరినీ ఆకట్టుకుంటాయి
20 వ భాగం ఎన్లైటెన్మెంట్
పద్యాలు 200 వ పద్యం ఫ్రెండ్ . ఇందులో కవి
స్నేహం అనే మాటని వ్యంగ్యంగా ప్రయోగించి మతాల మధ్య చిచ్చు ఉండకూడదని భావిస్తాడు. ఇందులో
హిట్లర్, బుద్ధుడు , వేశ్య , మతాలూ, మానవత్వం , ప్రపంచ చరిత్ర వంటివి వస్తువులు ఉన్నాయి. కవి ఈ విషయాలను మానవత్వం కోణంలో పరిశీలించమంటాడు.
200 అంకెలు
వేయడానికి ఎంత ఓర్పు అవసరమో మనకి తెలుసు. రెండు
వందల పద్యాలు రాయడానికి ఎన్ని పదాలు కావాలి,
ఎన్ని భావాలు కావలి, ఎంత ఓర్పు కావాలి ?
భాషమీద ఎంత
పట్టు ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత ప్లానింగ్ ఉండాలి. కొన్ని పద్యాలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని అనుభవజ్ఞులైన
ఇంగ్లిష్ ప్రొఫెసర్స్ తమ ముందుమాటలో తెలియజేసారు.
పదజాలంతో భావజాలంలో
ఇంగ్లీష్ కవుల కేమాత్రము తగ్గకుండా పూలబాల ప్రయోగించిన వందలాది ప్రాస పదాలు, పదబంధాలు,
కొత్త పద ప్రయోగాలు పాఠకులని వేరే ప్రపంచంలోకి తీసుకుపోతాయి. ఇప్పటికే చరిత్రలో అతిపెద్ద సోనెట్ల సంకలనంగా నిలచిన ఇండియన్ సోనెటీర్ క్రమేపి జన హృదయంలో నిలిచి పోతుంది.
World's First Book on Polyglotism - Poolabala
MR డీమ్డ్ విశ్వవిద్యాలయంలో "పాలిగ్లాటిజం" పై ప్రపంచంలోనే మొదటి పుస్తకం ఆవిష్కరణ తిరుపతి, ఆగస్టు 28 | TPN బ్యూరో మల్లా రెడ్డి...
-
Pune - Girls, Sex and Philosophy How the girls of Pune enjoy their life? What culture does the city and people manifest? How do the p...
-
French has been the second global language. The demand for French is always on the rise. Many young student...
-
Eazy Foreign Languages offers multiple foreign languages under one roof. Six foreign languages - French, German, Spanish, Italian, Japanes...





.jpeg)
