ఏవండే వండన్నారంటే  దొరగారో 
మిమ్మెన్నడైన
మరువమండో  దొరగారో
మంచిగంధం
సెట్టు లాంటి దొరగారో 
మా
మనసులోని మడిసివయ్యా దొరగారో
ఏవండే వండన్నారంటే  దొరగారో 
మిమ్మెన్నడైన
మరువమండో  దొరగారో
నువ్వు
పొగడసేట్టు నీడలోన దొరగారో 
పంచి
గట్టి నవ్వుతుంటే దొరగారో 
పొగడపూల
వర్షమొచ్చి  దొరగారో
నా వొళ్ళు
ఘల్లు మన్నాదయ్యో  దొరగారో
 
ఏవండే వండన్నారంటే  దొరగారో 
మిమ్మెన్నడైన
మరువమండో  దొరగారో
నీ  మోటార్
సైకిల్ సప్పుడైతే దొరగారో
 నా గుండె సప్పుడాగుతాది
దొరగారో 
నువ్వు
నాకే సూసి నవ్వితే దొరగారో
నే టుంకిరి
బింకిరి అయిపోతాను  దొరగారో
ఊసులాడ
వత్తు పోయే దొరగారో
మా
మంచి సెడ్డ సూసుకుంటా దొరగారో
మా
సామాసగాడివైతివి దొరగారో 
మంచిగంధం
సెట్టు లాంటి దొరగారో 
మా
మనసులోని మడిసివయ్యా దొరగారో
పనిలోకొచ్చిన
పడుచులంతా దొరగారో  
నీ
 ఉంగరాల
జుత్తు సూసి దొరగారో 
గింగిరాలు
తిరుగుతారు దొరగారో  
మంచిగంధం
సెట్టు లాంటి దొరగారో 
మా
మనసులోని మడిసివయ్యా దొరగారో
కాలిబాట నడుసుకుంటా
నే సారవకోట 
పోతావుంటే
 పగటాటకి నే పోతావుంటే
నువ్వు బండి
మీద దింపుతావు దొరగారో.
నేను పచ్చాసీర
కట్టుకొని దొరగారో 
పచ్చనిసెల్లో
పనిసేస్తుంటే దొరగారో 
నా పంట పండి
పాము వచ్చిదొరగారో
మడిగట్ల
ఎమ్మట  నడుసుకుంటా
దొరగారో 
నన్నాసుపత్రికి
మోసుకెళ్లితె  దొరగారో
మాయమ్మ నాకు
గుర్తుకొచ్చే దొరగారో.
నాకు విసమెక్కిందని
విలవిలా లాడితే 
ఆ పాము మీద
కచ్చి పుట్టే దొరగారో 
నువ్వు కంటిశుక్క
రాలిత్తే  దొరగారో 
నేపామును
కరిసి సత్తానయ్యా  దొరగారో.
ఇదినా ఆకరిపాట
కావాలయ్యా దొరగారో
నామనసులోమాట
సెప్పలయ్యో దొరగారో  
నీ సేతిమీద
సావలయ్య దొరగారో.
దీప  అనే  20 ఏళ్ల పల్లె పడుచు కి తల్లి తండ్రి రైతు చనిపోతారు రాజా తమ్ముడు మాత్రం మిగులుతాడు.  దీప నాట్యం బాగా చేస్తుంది . ఊరి జాతరకు ఇతర పండగలకు నాట్యం చేస్తూ ఉంటుంది.  దీప అందం చూసి ఆమెను అనేక మంది ఇష్టపడతారు.  తండ్రికి ఆశ ఆశయం కొడుకుని డాక్టర్ చదివించాలని దీపకు పెళ్లి చేయాలని .  కామందు , అతడి కొడుకు ఇద్దరికీ  దీప అంటే ఇష్టం. ఒకరిది కామం మరొకరిది ప్రేమ.   ఆమె తండ్రి సత్యం సన్నకారు రైతు తల్లి  సావిత్రి . సావిత్రి  ముత్తాతలు  ఇంద్రజాలికులు . గడకర్రపై ఎక్కి పొగమంచుతో  మాయ మవ్వడం  లాటి  అద్భుత  ఇంద్రజాల ప్రదర్శన ఇచ్చి బహుమతులు రాష్ట్రపతి  గుర్తింపు పొందినవారు . దీప అమ్మమ్మ దేవత పూనుతూ ఉంటుంది.  ఆవిడ భవిష్యత్ చెపుతూ ఉంటుంది.  మంచి పేరు పలుకుబడి ఉండడంతో  దీపని పొందాలంటే  అమ్మమ్మ అండ ఉండకూడదని ఆ ఊరినుంచి తరిమేస్తారు    పెద్ద వారి ఇల్లు తెగలేసేస్తాడు. గ్రామ పెద్ద దీపని వశపరుచుకోడానికి ప్రయత్నించి తప్పించుని పోడంతో ఆ రాత్రి దీప ఇంటికి వచ్చి గోశాల తెగలేస్తాడు. గోమాతని రక్షించి మంటల్లో చిక్కుని మరణిస్తుంది సావిత్రి. వారికున్న ఒక్క ఎకరం పొలంతోనే ఆకుటుంబం బ్రతుకుతుంటుంది. మెడిసన్ లో జాయిన్ చేయడానికి కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసేటప్పటికే పోలమీద అదే  ఊరిలో కామందు దగ్గర అప్పుచేయాల్సొ స్తుంది. చనిపోయిన తల్లి ఆత్మ కనిపిస్తుంది దీపకు. అది ఆమె మాన సిక  పరిస్థితి చెడిపోడం  వల్ల  అనుకుని  కొద్దీ రోజులు చూస్తారు.  రోజు రాత్రి ఒక పాటలో జరగబోయే విషయాన్ని   పాడుతుంది . అందరూ నవ్వుకుంటారు కానీ మరుసటిరోజు అదే జరుగుతుంది. సైకాల జస్ట్ దగ్గరకి  తీసుకెళతారు. సైకాలజిస్ట్ నివ్వెర పోతాడు 
I have enjoyed a lot while singing this song. It's really touched my heart
ReplyDelete