Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, November 4, 2020

Bharatavarsha 63

 నందిని తన రాజ్ఞీవాసమందు  నిశిరాత్రి  తామర  చెరువు  గట్టుపై నులక మంచము పై పడుకొని తారలతో దోబూచులాడు చంద్రుని, తారలను, తామరలను మార్చి మార్చి చూచుచుండెను.  వలతి బంగాళా లో నిద్రించుచుండెను. “ఆహా!.. ఏమి చల్లని వెన్నెల! ఎంత హాయి గొల్పు చున్నది!  ఈ పున్నమి వెన్నెల నా తాపమును దిగ్విణీ కృతము చేయుచున్నది కదా!” అని తామరకొలను నీటిలో చంద్ర బింబమును చూచిన  నందినికి తన వర్షుడు గుర్తుకొచ్చెను.

ఉక్కు కళా క్షేత్ర మందు ప్రదర్శించిన తులాభారం నాటికమును జూచి వెనుదిరిగిన ఆమె హృదయము గాయపడినది.   “ఆమె ప్రక్కనే కూర్చున్నది    విదిష అని చెప్పక వలతి ఎంత మోసము చేసినది! ఒకే వరుసలో విదిష, వలతి  నేను కూర్చుని యున్నామని ఎంత ఆలస్యముగా తెలిసెను. వలతి తో వర్షుని పై  నా ప్రేమ భావములను ఎరింగించు చుండగా నంగనాచి వలే విదిష అన్నీ వినియె యుండును. విదిష గూర్చి వినుటయే తప్ప  దగ్గరనుంచి చూడలే అయిననూ మారు వేషమున వచ్చు దానినెట్లు కనిపెట్టగలను. ఛీ ఛీ  చల్లని  వేళ దయ్యము ఊసేల!  అని ఎంత సర్ది చెప్పుకున్ననూ  మనస్తాపమును నివారించలేకుండెను. 

వనమాలి తిన్నడు తెచ్చిన తాలకి కనిపించెను. అతిథు లందరికీ  వెనుకాడక తిన్నడు తాలకి తెచ్చి ఇచ్చును.  చెట్టునుంచి దింపిన తాలకి   అది.    వారిదృష్టిలో అది పండ్లరసముతో సమానము. తన తండ్రికి తల్లికి మేనమామలకి ఈ అలవాటున్నది. అనుకొని   రుచి  మరిగినవారితో  రుచి ఎరుగని వారికి పోలికేలా అని కుంభమును  అందుకొనెను చషకములోనికి తాలకి తీసుకొనెను.     

ఉ. తాలము తాగువే     ళతన      తాపము  దించగ   నెంచెనో  మదిన్   

తేలని  చిక్కులన్  మరచి  ధీమతి    నెమ్మది  పొందగో రెనో 

తాలము తాగక     కుదర     దాపగ      తప్పదు  తప్పులెం చగన్   

కీలము  నాపగ      కడకు      గీరథు      డైనను  చేయకుం  డునా   

రాత్రంతయూ తన ప్రియుని తలచుకొని  పరితపించుచూ, తాలకి  గొనుటవల్ల  ప్రియుని పరిష్వంగ భ్రాంతిని,  స్వప్నమున సుఖమును పొందుచూ ఆదమరచి నిద్రించెను

సీతామర  కూమము దాపున తాలకి

సేవించి మత్తుగొన సోలి వాలి 

నులకమం చాననూ నూఁగుకాం తనిదుర  

పోయెనా  దమరచి డుచు పసిడి  

అందాలు ఎగసిల్ల ఆచ్చాద నతొలగి 

స్వప్నప  రంప     సాగె రమ్య

రతి రా  గాలక  రిగి రాత్రి  రవళించె.

మదన  పోటుతో  మగువ నలిగె   

తామర చెరువు వద్ద నులక మంచము మీద తాటికల్లు త్రాగి నూనూగు అందాల కాంత (కోరికతో రగులు స్త్రీ) ఆదమరిచి నిదురపోయెను , ఆచ్చాదనా తొలగగా ఆమె పసిడి అందాలు ఎగసిల్లెను , ఆమె స్వప్న మందు ప్రియుని సంగమమును కలఁగాంచి ప్రణయ సుఖమును పొందెను.

సీ.కొలనువీ  డికలువ  గట్టున పవళించె

ననితల  చికలువ నాధు డుతన   

కిరణము లతడమ గసుఖమ గుసలుపు

నొందిను లకమీద నలిగి  ఊల

మాలలు గుడుచుచు రతికూజ ములుపల్క

లీలావ నమంత రగిలె మరుని

తేజము  తాకగ  తాలకి తోడవ్వ

పారవ   శ్యతనంద  పాలు గారె 

కొలనువీడి  కలువ  గట్టున పవళించెనని తలచి కలువనాధుడు  తన  కిరణముల తో ఆమెను తడమగ  సుఖమగు సలుపు నొంది నులకమీద నలిగి  ఊలమాలలు గుడుచుచు రతికూజ ములుపల్క లీలావనమంత రగిలె మరుని తేజము  తాకగ  తాలకి తోడవ్వ  పారవశ్యతనంద  పాలు గారెను   

సీ.ప్రణయ  పుష్పప  రాగము  లుగ్రోలు

తుమ్మెద  మిధ్యనొం  దిప్రి  యాప్రి      

యాయని    పిలచుచు  యాతని  బిగియార      

కౌగిట   భందించకలత  నొందె    

తెమ్మెర  చొరుటకు  దారిలే  కరగిలె

తొగరాజు చేలము తొలగ వక్ష 

రంభాని  భాకృతి  రాజిల్లు తొడలలో

నతనాభి    లోబడి చిక్కు  కొనెను

ప్రణయ పుష్పప రాగములు  గ్రోలు తుమ్మెద  మిధ్య నొంది ( నందిని ప్రియుడు వచ్చినట్టుగా భ్రమ నొందెనుప్రియా.. ప్రియా..యని  పిలచుచు (కలవరించుచూయాతని  బిగియార  కౌగిట  భందించ, తెమ్మెర కలత  నొంది   చొరుటకు  దారిలేక రగిలె. తొగరాజు (చంద్రుడు) చేలము(వస్త్రములు) తొలగ వక్ష  మరియు  రంభాని  భాకృతి  రాజిల్లు తొడలలో మరియు నతనాభి లోబడి చిక్కు  కొనెనుఆమె అపురూప రూప లావణ్యము ఎంత ఉన్నతులనైనా చిత్తు చేయును.

సీ తెల్లవా  రెమోజు  తీరిన మేలుకో 

సుప్రభా  తమునీకు సుంద రాంగి  

జింకక  న్నులదాన జిగిబిగి  ఎదదాన

రవివచ్చి  తికలేచి   రవిక సద్దు   

కొనుము కొమరాల నగుమోము వడలను 

పసిడి కాంతుల పసికాను కములు లెమ్ము

పైరగా  లిపయిట  పావడ తొలగించె

చైలము  సవరించు కమల నయన   

రేరాజుకలువ రేడు  వలే కాముకుడు కాక వాత్సల్యమును చూపెను. తెల్లవారె  మోజు  తీరిన చో  మేలుకో సుప్రభాతము  నీకు సుందరాంగి  జింకకన్నుల  దాన జిగిబిగి  ఎదదాన రవి  వచ్చితిక  లేచి   రవిక సద్దు  కొనుము కొమరాల నగుమోము వడలను పసిడి కాంతుల పసికాను ( లేత నడుము) కములు (మాడిపోవును) లెమ్ముపైరగాలి పయిట  పావడ తొలగించె.   చైలము (వస్త్రములుసవరించు  కమల నయన  

సీ.చలచల కదిలెను చేష్టలు వచ్చెను     

బంగరు బొమ్మకు  వెలుగు  తగల

ఒళ్ళువి  రచితన  ఓలము గాంచెను

కదిలాడ గకాంత గాజు లుగల గల

గాజులు బంగరు గాజులు గలగల   

చేలము తొలగ  చెక్క దిద్ది   

చెంతన చెరువును చూచెను కేశిని                                                            

కేశిని చూడగ కలువ లువల వల


గలగల గలగల గాజులు గలగల
వలవల వలవల కలువలు వలవల

చలచల కదిలెను  బంగరు బొమ్మకు చేష్టలు వచ్చి కదిలినచో  చూచుటకు ఎంత ముచ్చట గా నుండును!  వెలుగు తగల నందిని ఒళ్ళువిరచి తన ఓలము (శరీరమును) గాంచెను. ఆమె కదిలాడగ గాజు లుగల గల సవ్వడి చేయు చుండెను బంగరు గాజులు గలగల మను చుండగా చెంతన చెరువు నందున్న కలువలు నందిని అందమును చూచి కలువలు వల వల మని విలపించినవి. 

సీ. అరవిరి  అపురూప అందాల  అపరంజి

కోరె  అడచి    ఆలింగ  నముజేయి

అరగొన   కలమున  అతివను అడచేసి 

ఆము ధీర్చు   అలిగిన    అపరంజి

అరవిరి అందాల అపురూప  లావణ్య 

మంత   అలిసె  అరవాసి నొదిలిటు                

 చూడతె  లియునా  సరసా వెంగలి        

శృంగార ముననాకు సాటి కాదు   

అరవిరి (మొగ్గ) అపురూప, అందాల అపరంజి కోరె అడచి (అదిమి) ఆలింగనము జేయి, అరగొనకల  మున (అరగొనక+అలమున),  (అరగొనక -సందేహించక)  అలమున (బలంగా ఆక్రమించు)అతివను,  అడచేసి (ముద్ద చేసి ) ఆము (కోర్కె)   ధీర్చు, అలిగిన అపరంజి అందాల  అపురూప లావణ్య మంత  అలిసె. అరవాసి (సగము నాణ్యత ) ఆ విదిష  నటువొది  లిటువాలి  నందు కొనుము (అందు కొనుము లేక నందిని ని కొనుము. శృంగార భావాల  సరిసాటి కాదది. ఆమె నా కంటే శృంగార మందు అధికు    రాలు కాదు.

సీ .ఆసత్య  చేసేను అతికర్షణ ఆకర్షణ 

కలిగించ  రంగాన కదిలె జతగ 

ఆహార్య మునుదాల్చి  ఆనాట్య మునుజేసి 

నినురంజి ప నేర్చి నటన, చెలగి 

రంగాన  రంగేసి రాజిల్ల  నాసత్య  

నేనయ్యె  చేకొందు  నీక  రమును

న్యాయమ్ము ననునమ్ము  నీవేము రారివి

మురారి  నాకుల దైవము నిజము

ఆసత్య  (నాటకమునందుపాత్రధారిణి) చేసేను అతికర్షణ( గొప్ప ప్రయత్నము) ఆకర్షణ కలిగించ  రంగాన (రంగ స్థలము పై) కదిలె జతగ. ఆహార్యమును దాల్చి( ఆ దుస్తులు  ధరించి) నేను ఆనాట్య మును  జేసి నిను  రంజిప నటన కూడా నేర్చి యున్నాను,  చెలగి రంగాన  రంగేసి రాజిల్ల  నేనే  ఆ సత్యను అగుదును.  నిన్ను  చేకొందును. నన్నునమ్ము ఇదే న్యాయము. నీవేమురారి వై పేరుకెక్కిన నావు.  ఆ మురారి మరెవరో కాదు. యాదవ కుల దైవము.  

సీపత్రిక   లన్నీగో   పాలటీ  వీలందు

గోపాల   గోపాల   గరిమ  పడగ  

 లోకాన   గోపాల   గోపాల   గోపాల

 నీనామ  మువెలిగె    నంద బాల

 యదుకుల  భూషణ యాదవ కన్యను

వలపును తెలిపిన  వనిత   నుకని

మనసును మరిమరి మురిపిం చకరావ

అందాల అపరంజి నేలు కోవా!!


4 comments:

  1. this episode tells us the beautiful description of a simple girl with strong individuality

    ReplyDelete
  2. నందిని మనస్సులో భావాలను పద్యం రూపంలో చాలా బాగా వివరించారు.

    ReplyDelete
  3. కథ ఉత్కంఠ భరితంగా సాగుతుంది

    ReplyDelete
  4. Following classic Telugu and poetry shows your inner strength and love of language. It's almost impossible in Andrapradesh. Thank you very much for your response.

    ReplyDelete