Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, August 3, 2021

పెద్ద రచనల కు ప్రేరణ ప్రేమే సుమా

  పెద్ద రచనల వెనుక ప్రేరణ ప్రేమే సుమా


                                                    

పెట్రార్చ్ పండితుడు మరియు కవి, దౌత్యవేత్త వేరొక చోటకి  వెళ్లగలిగిన సమర్థుడే కానీ అవిన్యాన్లోనే జీవితం గడిపేశాడు.  

ఫ్రాన్సిస్కో  పెట్రార్చ్ 1304 న టుస్కాన్  వద్ద జన్మించాడు.  డాంటే అలిఘేరీ అతని తండ్రికి స్నేహితుడు. పెట్రార్చ్ తన బాల్యాన్ని ఫ్లోరెన్స్ సమీపంలోని ఇన్సిసా గ్రామంలో గడిపాడు.   బోలో న్యా లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అతని తండ్రి న్యాయవాద వృత్తిలో (నోటరీ) ఉన్నందున, పెట్రార్చ్ మరియు అతని సోదరుడు కూడా న్యాయశాస్త్రాన్ని చదవాలని పట్టుబట్టారు. అయితే, పెట్రార్చ్  ప్రధానంగా లాటిన్ సాహిత్యంపై ఆసక్తి కలిగి ఉన్నాడు, తండ్రి బలవంతంపై  న్యాయశాస్త్రం చదివినా ఏడు సంవత్సరాలు వృధాగా భావించాడు.  అతను న్యాయవ్యవస్థను న్యాయాన్ని విక్రయించే కళగా భావించినందున, "నేను నా మనస్సు తో వ్యాపారం చేయలేను " అని నిరసించాడు.

తల్లిదండ్రుల మరణం తరువాత, పెట్రార్చ్ మరియు అతని సోదరుడు  అవిగ్నాన్‌కు వెళ్లారు, అక్కడ అతను  చర్చ్ కొరకు పనిచేశాడు. లారా దే  నోవెస్ ను  మొదటిసారి  అవిన్యాన్ నగర చర్చ్ లో 1327లోచూసాడు.  అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలే. కానీ  ఆమెకు అప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె ఆడిబర్ట్ డి నోవ్స్ అనే రాజు భార్య.    పెళ్లి అయినస్త్రీ  అని తెలిసినా  ప్రేమను చంపుకోలేక పోయాడు. జీవిత కాలం మౌనంగా ఆమెను ఆరాధకుడిగా మిగిలిపోయాడు. ఆమె చర్చికి వచ్చేటప్పుడు చూడడానికే అతడు అక్కడ చర్చిలోనే  ఉండిపోయాడు. లారా దే  నోవెస్ ను  పెట్రార్చ్ తన జీవితకాలం మౌనంగా ప్రేమించాడు. ఆమె కోసం పరితపిస్తూ 366 సొనెట్స్ వ్రాసాడు.  పెట్రార్చ్  ఆమెను  ఆమె సమీపంలో ఉండటానికి వాక్లూస్‌లో ఒక చిన్న ఎస్టేట్‌ను కూడా కొనుగోలు చేశాడు.  అతను వివాహం చేసుకోవడానికి చర్చి అనుమతించనప్పటికీ, అతను  స్త్రీ తో సంబంధం పెట్టుకుని   ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. అతని పెద్ద కుమారుడు జియోవన్నీ 1337లో జన్మించాడు  అతని రెండవ బిడ్డ ఫ్రాన్సిస్కా 1343లో జన్మించాడు. చనిపోయేముందు తన బిడ్డలని ప్రకటించి చనిపోయాడు.  


ఇటాలియన్  రచయితలనగానే అందరికీ డాంటే  గుర్తొస్తాడు. డాంటే 1265 లో ఫ్లోరెన్స్ లో పుట్టాడు. డాంటేకు 12 సంవ త్సరాల వయస్సు ఉన్నప్పుడు అతని తల్లి మరణించింది.  అతను కుటుంబ స్నేహితుడి కుమార్తె గెమ్మ దొనాతిని వివాహం చేసుకున్నాడు.   డాంటే బీట్రైస్ అనే  అమ్మాయి  ప్రేమలో పడ్డాడు.   బీట్రైస్  డాంటేపై చాలా  ప్రభావం చూపుతుంది  ఆమె పాత్ర డాంటే యొక్క డివైన్ కామెడీకి వెన్నెముకగా ఉంటుంది.

తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు డాంటే  బీట్రైస్ను కలుసుకున్నాడు,  అతనిది చూపులోనే ప్రేమ. వేరొక రితో  పెళ్లి జరిగిపోయినప్పటికీ డాంటే తన ప్రేమను చంపుకోలేక పోయాడు. 1290 లో బీట్రైస్ అనుకోకుండా మరణించింది,  డాంటే మానసికంగా ఆస్తిమితు డైయ్యాడు. తరువాత డాంటె వీట న్యోవ  (ది న్యూ లైఫ్) అనే గ్రంధం వ్రాసాడు.  ఇది బీట్రైస్ పట్ల అతని విషాద ప్రేమను వివరిస్తుంది. డాంటే డివైన్ కామెడీ, మరియు పెట్రార్క్  సొనెట్స్  ప్రపంచంలో గొప్ప రచనలు కాదని మనం అనలేము. 



2 comments:

  1. ప్రేమ చాలా బలమైనది
    ప్రేమ ప్రభావితం చేయగల శక్తి శాలి

    ReplyDelete
  2. No doubt love is an inspiration. Falling in love is not in our hands. It happens naturally. The feel of love can not be justified. It must be experienced. Whether the couple may be or may not be live together, but true love lasts until the cremations.

    ReplyDelete