Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, August 3, 2021

పెద్ద రచనల వెనుక ప్రేరణ ప్రేమే సుమా

  ఫ్రాన్సిస్కో  పెట్రార్క్ 1304 న టుస్కాన్  వద్ద జన్మించాడు.  డాంటే అలిఘేరీ అతని తండ్రికి స్నేహితుడు. పెట్రార్క్ తన బాల్యాన్ని ఫ్లోరెన్స్ సమీపంలోని ఇన్సిసా గ్రామంలో గడిపాడు.   బోలో న్యా లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అతని తండ్రి న్యాయవాద వృత్తిలో (నోటరీ) ఉన్నందున, పెట్రార్క్ మరియు అతని సోదరుడు కూడా న్యాయశాస్త్రాన్ని చదవాలని పట్టుబట్టారు. అయితే, పెట్రార్క్  ప్రధానంగా లాటిన్ సాహిత్యంపై ఆసక్తి కలిగి ఉన్నాడు, తండ్రి బలవంతంపై  న్యాయశాస్త్రం చదివినా ఏడు సంవత్సరాలు వృధాగా భావించాడు.  అతను న్యాయవ్యవస్థను న్యాయాన్ని విక్రయించే కళగా భావించినందున, "నేను నా మనస్సు తో వ్యాపారం చేయలేను " అని నిరసించాడు.


తల్లిదండ్రుల మరణం తరువాత, పెట్రార్క్ మరియు అతని సోదరుడు  అవిగ్నాన్‌కు వెళ్లారు, అక్కడ అతను  చర్చ్ కొరకు పనిచేశాడు. ఇక్కడే అతడికి  తన సమయాన్ని  రచనకు అంకితం చేయడానికి అతనికి వీలు చిక్కింది.  అతడు రాసిన మొదటి  గొప్ప ఐతిహాసిక గ్రంధం ఆఫ్రికనస్. దీన్నతడు ప్రాచీన భాష లాటిన్ లో వ్రాసి  యూరోపియన్ ప్రముఖుడిగా ఎదిగారు. పెట్రార్క్ రోమ్ కాపిటల్ పవిత్ర మైదానంలో పట్టాభిషేకం చేయబడ్డారు.  నేడతడు గొప్ప ప్రాచీన ఐతిహాసిక కవిగా పరిగణింపబడతాడు.

పెట్రార్క్ ఇటాలియన్ కవిత్వానికి ప్రసిద్ధి చెందాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన  షేక్స్ పియర్ వ్రాసిన వి 154 సొనెట్స్ కాగా  పెట్రార్క్ 366 సొనెట్స్ రచించాడు. ప్రపంచంలో రెండవస్థానంలో నిలిచాడు. పెట్రార్క్ సొనెట్స్ లిరిక్ కవితల వలె చాలా శ్రావ్యంగా ఉంటాయి. షేక్స్పియర్ సొనెట్స్ లో ఈ శ్రావ్యత ఉండదు .


పెద్ద రచనల వెనుక ప్రేరణ ప్రేమే సుమా

Laura de Noves  పెట్రార్క్ జీవిత ప్రేమ. అతను ఆమె కోసం పరితపిస్తూ సొనెట్‌ను రాసాడు. పెట్రార్క్ మొదటిసారి ఆమె ఆమెను అవిన్యాన్ (Avignon)నగర చర్చ్ లో 1327చూసాడు. ఆమెకు 1325 లో పెళ్లి అయిపోయింది  అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలే. వారి చూపులు కలిసి మనసులు కలిసినా వివాహ వ్యవస్థ సామాజిక పరిస్థితులు  వారికి అడ్డు గోడలుగా నిలిచాయి. ఆమె చర్చికి వచ్చేటప్పుడు చూడడానికే అతడు అక్కడ చర్చిలోనే  ఉండిపోయాడు. పెట్రార్క్  అంతర్జాతీయ పండితుడు మరియు కవి, దౌత్యవేత్త వేరొక చోటకి  వెళ్లగలిగిన సమర్థుడే కానీ అవిన్యాన్ నే జీవితం గడిపేశాడు. చర్చి కెరీర్ అతన్ని వివాహం చేసుకోవడానికి అనుమతించలేదు. అతను ఒక మహిళ  ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. ఒక కుమారుడు, జియోవన్నీ, 1337 లో జన్మించాడు, మరియు ఒక కుమార్తె, ఫ్రాన్సిస్కా, 1343 లో జన్మించారు. తరువాత అతను  వారు తన పిల్లలని ప్రకటించి చట్టబద్ధం చేశాడు.

ఇటాలియన్  రచయితలనగానే అందరికీ డాంటే  గుర్తొస్తాడు. డాంటే 1265 లో ఫ్లోరెన్స్ లో పుట్టాడు. డాంటేకు 12 సంవ త్సరాల వయస్సు ఉన్నప్పుడు అతని తల్లి మరణించింది.  అతను కుటుంబ స్నేహితుడి కుమార్తె గెమ్మ దొనాతిని వివాహం చేసుకున్నాడు.   డాంటే బీట్రైస్ అనే  అమ్మాయి  ప్రేమలో పడ్డాడు.   బీట్రైస్  డాంటేపై చాలా  ప్రభావం చూపుతుంది  ఆమె పాత్ర డాంటే యొక్క డివైన్ కామెడీకి వెన్నెముకగా ఉంటుంది.

తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు డాంటే  బీట్రైస్ను కలుసుకున్నాడు,  అతనిది చూపులోనే ప్రేమ. వేరొక రితో  పెళ్లి జరిగిపోయినప్పటికీ డాంటే తన ప్రేమను చంపుకోలేక పోయాడు . 1290 లో బీట్రైస్ అనుకోకుండా మరణిం చింది,  డాంటే మానసికంగా ఆస్తిమితుడైయ్యాడు. తరువాత డాంటె వీట న్యోవ  (ది న్యూ లైఫ్) అనే గ్రంధం వ్రాసాడు.  ఇది బీట్రైస్ పట్ల అతని విషాద ప్రేమను వివరిస్తుంది. డాంటే డివైన్ కామెడీ , మరియు పెట్రార్క్  సొనెట్స్  ప్రపంచంలో గొప్ప రచనలు కాదని మనం అనలేము. నా భారతవర్ష గొప్ప రచన కాకపోవచ్చుకానీ  ఏదో దివ్య శక్తి నా రచనకు  కూడా ప్రేరణ గా ఉందేమో!!!



2 comments:

  1. ప్రేమ చాలా బలమైనది
    ప్రేమ ప్రభావితం చేయగల శక్తి శాలి

    ReplyDelete
  2. No doubt love is an inspiration. Falling in love is not in our hands. It happens naturally. The feel of love can not be justified. It must be experienced. Whether the couple may be or may not be live together, but true love lasts until the cremations.

    ReplyDelete