చరిత్రను పునరావృతం చేసిన ఆదర్శ దంపతులు
గాయత్రీ విద్యాసంస్థల సంచాలకులు శ్రీ అభిలాష్ దంపతులు
కచ్ఛపి తంత్రులై మ్రోగి - వాగ్దేవి వైభవాన్నిఎలా చూపారంటే...
మోడీగారికి దేశానికి పూర్వవైభవం తీసుకురావాలని ఉంటుంది
భారతదేశాన్నివిశ్వగురు చేయాలని ఉంటుంది. ఆయన దేశాన్నిఎంత అభివృద్ధి పథంలో నడిపించి నా చాలా మంది ఆయన్ని నమ్మరు. ఆయన దేశభక్తిని కూడా శంకిస్తారు. సనాతన సంప్రదాయాలని నమ్మని వారిని మోడీగారిని నమ్మనివారిని పక్కన పెట్టి నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నమ్మిన వాళ్ళు కూడా పంచలు కట్టుకుని తిరగడంలేదు. జీన్ పేంట్స్ వేసుకుని తిరుగుతూ , సినిమా వాళ్ళకి భజనచేస్తూ పాశ్చాత్త్య నాగరికతలో ములిగితేలుతూ వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడుతూ, తెలుగు భాషకి పూర్వ వైభవాన్ని తీసుకు రావడం గురించి పోస్ట్లు పెడితే సరిపోతుందా ?
మార్కులకోసమే చదువు, లైకులు కోసమే పోస్ట్ అంటే చర్చే లేదు. నిజాయతీగా మాట, చేత ఉండే వారే ముఖ్యం. నిజాయతీగాఉండే వారే కష్టించి పనిచేసేవారే హిస్టరీని రిపీట్ చేయగలరు. డబ్బు కోసం నిజాయతీ గా కష్టించి పనిచేసేవారు చాలా మందే ఉంటారు.
.
భాష సంస్కృతి పట్ల నిజాయతీ గా ఉండేవారు కష్టించి పనిచేసేవారే చాలా తక్కువ . ఆ తక్కువ మందిలో రచయిత పూలబాల ఒకరు. సినిమా మరియు పాశ్చాత్య సంస్కృతి కి వ్యతిరేకదిశలో అందమైన కమ్మని తెలుగు భాషకోసం ఆయన పడేశ్రమ లో నిజాయతీ ఉంది. అది ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో భారతవర్ష లాంటి ప్రబంధాలు , వన శృంగారం లాంటి పద్యకావ్యాలు, సరస్వతీ శతకం వంటి భక్తి కావ్యాలు రాసి ముద్రించి అందరికీ అందజేయాలని ప్రాణాలు హరించే పని చేస్తున్నారు. ఆయనపడే బాధ అర్ధంచేసుకునేవారు మహాను బావులు.
ఆ కోవలోకి చెందిన వారే గాయత్రీ విద్యాలయం సంచాలకులు ఆకుల అభిలాష్ గారు వారి సతీమణి మంజూషగారు. 125 సంవత్స రాల క్రితం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో 1900 వ సంవత్సరంలో చేబ్రోలు సరస్వతి గారిచే సరస్వతీ శతకం రచించి బడింది. ఈ నాడు 2025 లో అంటే 125 సంవత్స రాల తరువాత పూలబాలచే మరల సరస్వతీ శతకీర్తనావళి లిఖించబడింది.
.
గురుపూజోత్సవంనాడు రచయితను తమ గాయత్రీ విద్యాలయానికి ఆహ్వానించి గురుపూజోత్సవ వేడు కలు అత్యంత వైభవంగా జరిపించి తమ చేతులమీదుగా సరస్వతీ శతకీర్తనావళి పుస్తకావిష్కరణ గావించి ఆ మాధుర్యాన్ని పిల్లలకి పంచారు. ఆ గానాన్ని విద్యార్థులు ఆస్వాదించారు. వాగ్దేవి వైభవాన్ని విద్యార్థి లోకానికి రుచి చూపించిన పుణ్య మూర్తులు.
గరిమ సాహిత్య సంస్థ అధ్యక్షులు శ్రీ నర సింహంగారు విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చి పుస్తకా విష్కరణలో పాల్గొని రచయత మీద సాహిత్యం మీద ప్రేమను తెలియజేసుకుని చిన్నారులను ఆశీర్వ దించారు. ఉన్నారండీ మహాను బావులు - ఇంకా ఉన్నారు.
.
ఇలాంటి వారితోనే భారత దేశానికి పూర్వవైభం సాధ్యం.