Thursday, December 10, 2020

Bharatavarsha 89

నిగనిగ లాడు పసిమి దేహము, నవనవ లాడు పూరేకుల పెదవులు, దంతములు మిలమిల మెరియు ముత్యాల సరులు, గలగల పారు సెలయేరు నగవులు, మిరపపండు రవిక, కుంభస్తనద్వయము, చూచుకములును దాచలేని జాలువారు పారదర్శక రజత శ్వేత చేలము, చిత్తిని చిట్టిచేఁతలు మేని మెరుపులు చూడ నీలాకాశము నేల వాలినట్లున్నది. 

ఘనస్తనముల జంబునేత్రి మీనాక్షి దీర్ఘ కుంతలములను సడలించ కీకారణ్యమును తలపించు యా నిబిడ కేశములు సైకత పిరుదులపై బడి నర్తించుచుండగా ఆ గజయాన మంద గమనమున మిద్దెపై హిరణ్య సమయమున సంచ రించు చుండెను. 

 స్వతంత్ర మంత్ర తంత్ర సంగీత ప్రపంచ రాజు, ఇందిరమందిర సున్దరాకారుడు విపుల మానస శతానందుడు, జనమా నస చోరుడు ప్రఫుల్ల నామధేయుడు వెనక నుంచి మీనాక్షిని సమీపించి ఉఫ్ అని చెవిలో గాలి ఊదగా మీనాక్షి అదిరి పడి ప్రఫుల్లపై త్రుళ్ళి పడి  సిగ్గుతో " ఈ చిన్న పిల్లవాడి చేష్టలు ఇంకెంతకాలం చేసెదవు ?" అనుచున్న ఆమె చేతిలో ఒక ఖంఠ హారమునుంచెను. “ఇట్టి బహుమతులు వలదని మీ కు పలుమార్లు చెప్పిననూ వినరు కదా!”

అని త్రిప్పి ఇచ్చుచుండగా “అదిగో మరల నన్ను మీరు అనుచున్నావు మనమిద్దరమూ ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా ము, ఎన్ని గంటలు కలిసి సాధన చేసి, ఎన్ని గంటలు ప్రయాణము చేసినాము ఇంకనూ మనమధ్య మీరు అవసరమా? ఈ చిరు కానుక స్వీకరింపుము.

ఉమ్ , సరే , ఇంతకీ ఇప్పుడు ఈబహుమ తెందుకు తెచ్చినావు ?

మన సంస్థ  ప్రతినిధి కార్యక్రమ నిర్వాహకుడు  మీనన్ మన విదేశీ కార్యక్రమ పరంపరను ఏర్పాటు చేయుటలో సఫల తనొందెను. ఇకపై మన విదేశ కార్యక్రమములు మొదలు కాబోవుచున్నవి.  కువైట్ , బెహ్రెయిన్ , దుబాయ్ , లండన్ , మారిషస్ , సిషెల్ల్స్ బ్రుక్లిన్ నందు కూడా మనము   ప్రదర్శనలివ్వబోవుచున్నాము. మన ఆఖరి దేశీ ప్రదర్శన రేపు ముంబై పాటిల్ స్టేడియం నందు కలదు ఒక సారి మన స్థూడియోకి పోయి రావలెను.

ఇందు నేను చేసినది ఏమున్నది ? నా పియానో వాదనము నేను చేసినాను.

 సంగీత తిలకమై మన మ్యూజిక్ బ్యాండ్ కి తలమాణికమై వెలుగొందు కంపోసర్ పియానిస్ట్ వి,మన మ్యూజిక్ బ్యాండ్ ఇట్లు వెలుగొందుచున్నదన్న దానికి కారణము నీవే. నీకుగాక ఇంకెవరికి ఇవ్వవలెను బహుమతులు!

ఏ పట్టణము ప్రదర్శనకి పోయిననూ  అచ్చట వస్త్రములు కొని ఇచ్చుచున్నావు , మొన్న భోపాల్ ప్రదర్శనకు నేను రాకున్ననూ నాకు ఈ వెండి వెలుగు చీరను ఎర్ర రవికను కొని ఇచ్చినావు

ఒక కర్మాగారమందు బహిరంగ రంగస్థలమును  ఏర్పాటుచేసి నారు. అది చిన్న రంగస్థలం నీవంటి వనితకు నప్పునది కాదు. 

వట్టి మొద్దు బుర్ర నీవు ఇచ్చిన  చీర రవికను ధరించినాను ఎట్లున్నది ?

సంధ్య కాంతులందు సేదతీరుచున్న పడుచందములను మించు మీనాక్షి ప్రౌఢ అందములు కాంచిన గుండెలు గండెలు పడుచుండెను.   

మీనా ఇట్లు మాట్లాడిన నీ చెవులు మెలి పెట్టెదను నీవు మా అగస్త్య వంటి వాడవు అని ప్రఫుల్ల చెవి అందుకొనెను. 

 ఒక వారము నుండి అహోరాత్రములు శ్రమించి కొత్త పాటలుకు స్వర కల్పన జేసి అలసి  చిక్కిననూ నీ చక్కదన మెచ్చటికి పోవును ఈ చీరయందు అప్సరస వలే నున్నావు.

  కానీ ఇప్పుడు మనము స్టూడియోకి వెళ్లవలెను . మన కొత్తగా ఆల్బమ్ విడుదల కార్యక్రమమున్నది. కానీ నిన్ను రమ్మనుటకు మనసొప్పకున్నది. 

స్టూడియో చెంతనే యున్నది కదా, ఈ కార్యక్రమము లేకున్ననూ ఇప్పుడు సంద్యాసమయము కావున నిద్రించ తగదు. పదపోయెదము అనుచూ మీనాక్షి మిద్దె దిగుచుండగా ప్రఫుల్ల ఆమె వెంట నడిచెను. కదులుచున్న ఆమె జఘన లయ యందు చిక్కిన కనులు సోపానములను గమనించకుండుటవల్ల నడక లయ తప్పి జారిపడెను. 

మీనాక్షి అతడిని లేవనెత్తి మెల్లగా తన భుజముపై అతడి చేతినుంచి క్రిందకు తీసుకుపోవు చుండెను. " నీవిట్లు హత్తుకు తీసుకుపోయినచో  ఎన్నిసార్లయినా పరవశమే " యని వినిపించినట్లు మెల్లగా అనెను. ఇద్దరూ క్రిందకు మీనాక్షి ఇంటిలోనికేగినారు.

 ప్రఫుల్లని మీనాక్షి సోఫాలో కూర్చొండబెట్టెను. ప్రఫుల్ల తలయెత్తి చూడగా ఎదురుగా చదువుకొనుబల్లవద్ద  యమున ఒక డజను పుస్తకములను పెట్టుకొని చదువు కొనుచున్నది.

ప్రఫుల్ల ఆమెను చూచి నవ్వెను యమున  అతడిని చూచి పళ్ళికిలించి " హ హ హ .. చూసుకొని నడుచుట చేతకాదా ఎత్తుకొని మెట్లు దింపవలెనా ?" అనెను . లేడి  డిటెక్టివ్ వలే నున్నావే  నాప్రాణమునకు ఇదెక్కడ దాపురించెనో అని ప్రఫుల్ల అనుచుండగా” సమయమున్న కేరళ పోరాదా మీఅమ్మ వద్ద గడపరాదా, ఆమె మాటి మాటికీ ఇక్కడికి ఫోను చేయుచున్నది మీనాక్షిగారి  వెంట పడుచున్నావని  ఆవిడకి కూడా తెలియవలెనా?

ఆవిడకెప్పుడో తెలిసెను. ఇక మీనాని తీసుకెళ్లి ఆమెకు చూపవలెను.  నీవు ఎప్పుడూ ఇక్కడే గబ్బిలమువలె చూరు పట్టుకొని వెళ్లడుచున్నావెందుకు మీ ఇల్లు పక్కనే కదా పోరాదూ.

నన్ను గబ్బిలమందువా నీవే గబ్బిలము, నీవే జాగిలము అని యమున ప్రఫుల్లను దూషించ సాగెను “అవును నేను జాగిలము నీవు బిడాలము అందులకే నీకూ నాకూ ఈ వాదులాట” టులిద్దరిమధ్య వాదముపెరిగి తారాస్థాయికి పోయినది.

“అబ్బబ్బ ఎప్పుడు చూచినా కుక్క పిల్లిలా ఈ కొట్లాటలు,  ప్రపుల్లకి వేడి నీరు   కాపడము పెట్టవలెను.” అని మీనాక్షి అనగా “ఇట్లు ఇచ్చిన నేను పెట్టెదను” అని యమున మీనాక్షి చేతినుండి గిన్నె అందుకొని సోఫావద్ద నున్న బల్లపై పెట్టి కాపడము పెట్టసాగెను. 

మీనాక్షి బల్లపై నున్న పుస్తకములను చూచుచూ కూర్చుండెను. అవన్నియూ భారతవర్ష వ్రాసిన పుస్తకములు ఇన్ని పుస్తకములు వ్రాసెనా?  తెలుగు ఇంగ్లిష్  పద్యముల సంకలనములు , పౌరాణిక నాటకములు , హాస్య కథలు , మూన్ లైట్ స్టోరీస్ - ఇంగ్లీష్ చిన్న కథలు , తెలుగు  చిన్న పిల్ల కథలు , సేవ్ ఎర్త్  , సైన్స్ ఫిక్షన్   జానపదములు , బుర్రకథలు ,వ్యాసములు , వ్యాకరణము  చివరిగా  ప్రౌఢ శృంగార కథలు, అవన్నీ చూచుచూ మీనాక్షి" మావర్షుడు  ఇటువంటి కథలు కూడా వ్రాయనా ?  అనుచూ ప్రౌఢ శృంగార కథల పుస్తకమును తరువాత చదువుటకు కొంగు క్రింద దాచి యుంచెను. వెంటనే యమున " ఆ పుస్తకము అడుగుటకు సిగ్గుగానున్నదా?" అని వెనుకకి తిరగకనే అనగా “ఇది మనిషా లేక కర్ణ పిశాచమా అని సందేహము కలుగుచున్నది” అని ప్రఫుల్ల అనెను. “ ఛీ ఛీ   నాకే మీ వలదమ్మా” అని మీనా ఆపుస్తకమును బల్లపై పెట్టి వంటగదిలోకి పోయెను.

ఆ పుస్తకమును పట్టుకుని వంటగదిలోకి వెళ్లిన యమున మీనాక్షి తో " శృంగారమనిన విషము కాదు చదివిన వారు వెలయాళ్లు కారు ఏల ఇప్పటికే మీరు వివాహము చేసుకొని యుండవలసినది , మీకున్న ఆస్తి అందము చూసి వలచి వచ్చువారు అనేకులుందురు. ప్రఫుల్ల ఇచ్చటికి ఎందుకు వచ్చుచున్నాడో తెలియునా?

మందమతిని కాదు లేవమ్మా , అతడి మనసు ఈ మధ్యనే గ్రహించితిని. కానీ 

 మీ భర్త కు మీకు విడాకులయినవి, మీ భర్త కానీ  కొడుకు కానీ   మీగురించి  పట్టించుకొనక ఎవరి దారి వారు చూచుకొనుచున్నారు, మీరు సంస్కృతి సంప్రదాయములని మీన మేషములు లెక్కించుచున్నారు. 

 అది  కాదమ్మా ఒకనాడు స్టూడియో లో అతడి కంప్యూటర్ నందు అతడి కుటుంబ చిత్రములు రెండు  బైటపడినవి. 

మొదటిచిత్రమందు   మాకు అత్యంత ఆప్తులైన అరుణతార నల్ల చొక్కా వేసుకున్నఒక వ్యక్తి తో బహుశా తన భర్తతో దిగిన ఫోటో కావచ్చు. రెండవ చిత్రమందు అదే నల్ల చొక్కా వ్యక్తి  వేరొక యువతితో కనిపించెను. ఆ రెండవ యువతిని ప్రఫుల్ల మా అమ్మ అని అనుచున్నాడు

యమున “ఆమె భర్త రెండవ వివాహము చేసుకొని యుండవచ్చు. అతడు    ఏమి చేయుచుండివారు?” 

మీనాక్షి “ఒకప్పుడు చిత్ర సీమయందు  దర్శకత్వము చేయుచుండివారు.”

వెంటనే యమున “ప్రఫుల్ల మీ  నాన్నగారు ఏమి చేయుచున్నారు? అని వంటగది లోంచి అరిచెను. “పోలీసు శాఖ యందు పనిచేయవలసినదానవు”   అని మీనా మెచ్చుకొనెను.

“ప్రస్తుతము ఇంటిలో వంట చేయుచున్నారు. ఒకప్పుడు చిత్ర సీమయందు డైరక్షన్ చేయుచుండివారు.” అని ప్రఫుల్ల బదులు పలికెను. కొలది సేపటికి వారు ముగ్గురు  నీలి ఆడి వాహనమందు స్టూడియోకి పోవుచున్నారు " రామే శ్వరము పోయిన శనేశ్వరం తప్పదన్నట్టు "అని ప్రఫుల్ల తన ప్రక్కన కూర్చొన్న యమునను చూచుచూ అనెను " హి హి హి అని యమున పండ్లు ఇకిలించెను.

Wednesday, December 9, 2020

Bharatavarsha - 88

 రాఘవ సందీపులు క్షేత్ర గృహమునందు తామర కొలను వద్ద చెట్ల క్రింద కూర్చొని యుండిరి . సూర్యుడు నడి నెత్తికి చేరుచుండెను. చెరువులో తామరాలన్నీ ఎర్రని కాంతులీనుచున్నవి. చెరువు లో నీరు తెమ్మెర తాకిడికి అల్లన కదులుచూ సూర్య ప్రభావమును పరావర్తించుచూ  మిరిమిట్లు గొలుపుచున్నది. రాఘవుఁడడిగిన ప్రశ్నకు సాందీపుని కి మెదడు స్థంభించెను, గాలి కూడా స్థంభించెను. నిశ్శబ్ధమావరించెను.  రాఘవుని మొఖము చూడలేక  సందీపుడు  ప్రక్కకు  చూచుచుండెను. అచ్చటి పచ్చిక బైలునందు కేకిలి యొకటి మందగమనమున తిరుగుచూ వారివద్దకొచ్చెను.

 రాఘవుడు “ ఆహా ఈ నీలగ్రీవము (నెమలి) ఎంత ముచ్చట గొలుపుచున్నది. నీ క్షేత్ర గృహము మైమరపు కలిగించు చున్నది.” సందీపుడు  “ఈ నెమలి నా చెల్లి నెచ్చెలి. ఆమెకు నెమలి యన్న నెమలి పించదారి యన్న ప్రాణము. ఈ ప్రాణమునొదిలి నందినెచ్చటికి పోయెనో తెలుసా! మంజూష వద్దకి , ఆమె ఇప్పుడు వదినను విడిచి ఉండుటలేదు. రాఘవుడు “ఇంతకూ నేనడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చినావు కాదు.” సందీపుడింకనూ సిగ్గు పడుచుండగా  “ఇప్పుడు పెండ్లి కుదిరినది కదా ఇంక బెరుకేలా?” అనెను.

నీవు సోలార్ పేనల్స్ ఉతిపాదన గూర్చి అడిగినావు కదా దాని పోజెక్ట్ రిపోర్ట్ తయారు చేయుచున్నాను. భారత దేశము నందు సోలార్ పేనల్స్ వ్యాపారము 163 బిలియన్ డాలర్స్  వరకు విస్తరించింది. కానీ పేనల్స్  కంటే సోలార్ పత్రములు  , (ఫోల్డబుల్ సోలార్ పేనల్స్)  భవిష్యత్తులో ఊపందుకొనును 

 నేనడిగినది నీవు మంజూషనెట్లు వశపరుచుకొంటివి? మీరెక్కడకలిసినారని నీవు తెలివిగా మాటమార్చి వ్యాపారము గూర్చి చెప్పుచున్నావు.   బెంగళూరు నందుండి వ్యాపారవిషయములతో బుర్రపిచ్చెక్కించుకొనుటయే తప్ప నాకింకొ కటి తెలియదు. ఈ ప్రశాంత వాతావరణము నందైననూ కొలదీసేపు వ్యాపారవిషయములు ప్రక్కనపెట్టి జీవితము నకు శోభగూర్చు ప్రణయ శృంగారముల గూర్చి మాట్లాడుము.

అట్లయిన నీవు నీ ప్రేయసి గూర్చి చెప్పినచో నీవడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పెదను. అని సందీపుడనెను. నా ప్రేయసి ఎవరూ లేరని రాఘవుడు మొదట బుకాయించిననూ పిదప "నన్ను యమున అనొక యువతి ప్రేమించు చున్నది కానీ నేనామెను ప్రేమనుంచుటలేదు. దానికి కూడా రెండు కారణములున్నవి. అందు పెద్ద రహస్యము దాగియున్నది. కానీ  ఆరహస్యము చెప్పవలెనన్న నేనడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్పుము అనెను.

నీ క్షేత్ర గృహము ఈ ప్రశాంత వాతావరణము మైమరపు కలిగించుచున్నదంటివి కదా, ఇచ్చటనే నేను మంజూష కలిసి నాము. “ఇది నందినికి తెలిసిన ప్రమాదమే” అని రాఘవుడనుచుండగా ఇదొక చిదంబర రహస్యము కలదు అని సందీపు డనెను. 

“నీకునూ రహస్యము కలదా అది ఏదో త్వరగా చెప్పుము” అని రాఘవుడనెను

ఇందు నందిని హస్తము కలదు అనగా ఆమె నాకు ప్రోత్సాహము తో పాటు సహకారము కూడా లభించినది. “కానీ మంజూష కు నేనన్నచో పిచ్చి మోజు కలదు అందు నందిని పాత్ర ఏమియునూ లేదు.” 

అది నిన్న పెళ్లి చూపులయందే తెలిసెను. కానీ పెళ్ళికి ముందే సంగమమందు ఎవరి పాత్ర కలదు ? మంజూష పూర్తిగా నీవశమైనది ఏ మంత్రము వేసినావో! 

నీవా మంత్రమునిప్పుడు బెంగుళూరు నందెవరిపై ప్రయోగించవలెను? ప్రకృతి ప్రేరణ తప్ప మంత్రమేదియునూ లేదు. ఒకరి ఒడిలో ఒకరు ఒదిగి ఇచ్చటనే  వెచ్చని ముచ్చటలాడుకొను చుండగా స్త్రీ ప్రేరణను కాదను శక్తి ఎవరికుండును!

అట్లయిన మంజూషయే మంత్రము వేసెనన్నమాట,  

మంత్రము సంగతటుండనిమ్ము ముందు నీ  సంగతి చెప్పుము. 

యమున నేను ప్రయోజకుడినని సంస్థను వృద్ధిలోకి తీసుకు వచ్చెదనని ముచ్చటపడుచున్నది. అనగా నాకంటే నా నైపుణ్యమందు ఆమెకు ఆసక్తి ఎక్కువ.  సంస్థ  వ్యాపారము తగ్గుచున్నదన్నమాట వాస్తవము. అందుకు కారణముకంపెనీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో లేకుండుటయే. నాకు నీపై నమ్మకమున్నది. నీవొచ్చిన ఆ సమస్య అధిగమించవచ్చు. ఆమెకు నాయందు ఎంత ఆసక్తి యున్నదో తెలుసుకొనుటకు సంస్థ పతనము సమీపించుచున్నది అని చెప్పితిని. నేను ఇచ్చటికి వచ్చుటకు ముందు యమున తన ఇంటికి పిలచి ఆమె అత్తకు పరిచయము చేసెను, ఆమెఅత్త అంద చందములు చూచినపిమ్మట నాకు మతి పోయినది. ఈ సారి బెంగుళూరు పోయిన పిదప ఆమెను పెండ్లి యాడుటకు అడిగెదను.  

ఆమె వయసులో సగముండునా నీకు, ఆమెను వలచినావు ! పైగా పెండ్లి ఆడె దనానుచున్నావు.  

ఆమెకు సుమారు ఒక నలభై ఐదు యాబది సంవత్సరము లుండవచ్చును. ఆమె అందము నన్ను కట్టి పడవేచినది , నావిషయమందు నీవన్నదే - స్త్రీ ప్రేరణ - అధికముగా నున్నది. అమెరికాలో నేనున్నప్పుడు లేత ప్రాయమునున్న యువకులు పెక్కురు పెద్ద స్త్రీలను పెండ్లి యాడుట చూచితిని.  మన మిచ్చట ఈ పురుషాధిక్య ప్రపంచమందు ముసలి హీరోలు లేత హీరోయిన్లను ప్రేమించుట చూచి  ఇచ్చట మనకది వింతగా తోచుచుండును.

నీవామెనొ దులున్నట్లు లేవు. నీ ప్రేమయందు రాజీ పడునట్లు లేవు.

ప్రేమయందు నీవు రాజీ పడినావా?  బసవడు పార్వతి కొరకు బల్లిపాడు పరిగెత్తలేదా? వాడు రాజీ పడినాడా? నేనేల రాజీ పడవలెను? ఆమె గూర్చి యమునా ద్వారా నేనంతయూ విచారించితిని. ఆమె భర్తనుండి విడాకులు పొంది చాలా ఏండ్ల నుండి వంటిరి జీవితమును గడుపుచున్నది. ఆమె అందము ఎంత గొప్పదో మనసంత కంటే గొప్పది.

 అది నీకెట్లు తెలియును? ఆమె మనసును బూతద్దమందు చూచితివా?  ఇంకనూ  ఆమెకు కోరికలే ముండును? 

నందిని నాగూర్చి ఆమెకంతయూ తెలిపెను.  ఆమె నాకు పెద్దమొత్తములో ధన సాయము చేసెను. ఆమె మనసు వెన్న అని తెలుపుటకింకేమి కావలెను? ఆమె మనసును బూతద్దమందు చూచితివా అని అడిగినావు, ఆమెకు కోరికలింకే ముండుననుచున్నావు ఆమె కోరికలను నీవు బూతద్దమందు చూచితివా ? రాఘవుడు ముఖము ఖండించుకుని అట్లు చెప్పుచుండగా సందీపుడు వాడి ఉక్రోషమును చూచి పడి పడి నవ్వుచుండెను.

అప్పుడు రాఘవుడు " అవునురా నీకు లడ్డు లాంటి పిల్ల దొరికెను  సమ్మందం కుదిరెను. ఇతరులను చూచి నవ్వకేమి చేసెదవు. సందీపుని నవ్వింకనూ పెరిగెను. " హ హ హ్హ హ్హ ఇంతకీ బసవడు రేపు మరలివచ్చునా బల్లిపాడునందే స్థిరపడునా? వెడలి పోవుచున్న రాఘవుని " విమానములో పోరా , నీవు రెక్కలు కట్టుకొని ఎగిరెదవేమో?" నా పెండ్లికి తప్పక రావలెను "   అనుచూ రాఘవుని ఆట పట్టించి  అతడిని కారులో వదిలి పెట్టుటకు విశాఖ పట్టణము  విమానాశ్రయము తీసికొనిపోయెను. మార్గమద్యములో ఎన్  ఏ డీ  కూడలి వద్ద ఇద్దరూ కలసి భోజనము చేసిన పిదప విమానము వచ్చువరకూ సందీపుడు రాఘవునితో గడిపి రాఘవుడు విమానమెక్కుటకు బోవుచుండగా " రేపు ఢిల్లీ పోవు పనియున్నది,  అచ్చట రవీంద్ర భవన్ లో బావగారికి సాహిత్య అకాడమీ పురస్కారం కలదు.   లేనిచో నీతో బెంగళూరు  వచ్చెడి వాడనే.  రెండురోజులలో బెంగుళూరు నందు వాలెదను. కంపెనీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగును. అందుకు ఎంత శ్రమ ధనాదు లైననూ వెచ్చింతును అని అతడికి భరోసా ఇచ్చి " ఇంతకూ నీవు వలచిన ఆమె పేరేమి ?" " మీనాక్షి " అనిచెప్పి రాఘవుడు వెడలెను  

Sunday, December 6, 2020

Bharatavarsha - 87

సంజ కెంజాయలింకనూ మడక ముందే జి ఎం హెక్టార్ వచ్చి ఆనందనిలయం ముంగిట నిలిచెను. బసవ రాఘవులు దామిని రాధాకృష్ణులు అందునుండి దిగగా భారతవర్ష వారికి  నమస్కరించి స్వాగతించెను. పక్కనే ఉన్న తళుకులీను వస్త్రములందు నిలచిన  నీలోత్పల దేహి కేశిని, పొడవాటి వాల్జెడ  పిరుదులపై బడి యాడుచుండ, ఆ నితంబి  కూడా  ఇంటి కోడలివలె అతిధులను ఆహ్వానించుటయందు పాలుపంచుకొనుచుండెను. మధ్యాన్నమే వచ్చి తనకు  మాలినిగారిచ్చిన వీణ నిరుపయోగముగా యున్నదని వచ్చునప్పుడు  తెచ్చిఇచ్చి అత్తతో ముచ్చటలాడి  పిదప వర్షుని కూడి ఇప్పుడు ప్రవేశ ద్వారమువద్ద ప్రియ సేవనము  మొదలు బెట్టెను. మాలినిగారు వచ్చి దామినిని తోడ్కొని పోయినారు.  వారు లోని కేగుచుండగా మెర్సిడెస్ వాహనమొచ్చి ఆనందనిలయం ముంగిట నిలిచెను.  

పైడమ్మ పెంచలయ్యలను కూడివచ్చిన సందీపుడు నందిని లకు భారతవర్ష నమస్కరించి స్వాగతించుచుండగా పెంచలయ్య పైడమ్మ వర్షుని పలకరించి ముందుకు సాగుచుండగా మాలినిగారు వారిని లోనికి తోడ్కొని పోయిరి  సందీపుడు వారితో వెడలి పోయిననూ నందినిని మాత్రము లోనికి పోక “బావగారు మీరు మాకు ఆంగ్లమును భోదించునపుడు పంచెలు ధరించలేదు. కానీ మీరు పంచెగట్టిన తెలుగు భాషకు రూపమువలె నుందురు అని  నేను మీ ఆంగ్ల విద్యార్థినిని కావున నాకాభాగ్యము దక్కలేదు. కానీ నుదుట బొట్టు పెట్టిన మీ మూర్తికి  మరింత   శోభనిచ్చును పెట్టమందురా అని ఆట పట్టించుచుండెను.

 అది చూచిన  విదిష   మిరపకాయల ధూపము వేసినట్టు ధుమ ధుమలాడుచూ ఆడిన మాటలు చాలును లోపాలకి వెళ్ళవమ్మా నీ తల్లి తండ్రులు వెళ్ళినారు కదా." అనగా నందిని వర్షునితో " ఈమె ఎవరు బావగారు ?" సహాయకురాలి వలె నున్నది అన్యులకు ఇంత చనువివ్వరాదు అని వర్షుడి చెవిలో చెప్పు చుండగా  ఉక్రోషము పట్టలేని విదిష ఆమె జబ్బపై చరిచి పరపురుషులపై పడుట ఏమది ఇంకనూ వచ్చుచువారిని మేముస్వాగతించవలెను నీవు లోపాలకి పో అమ్మా  అని  అనగా  "ఆపని  వర్షుని కూడి నేను చేసెదను."  అని నందిని బదులు పలికెను.

"ఇదిగో అమ్మాయి పెద్ద చిన్న లేక  గురువు అని చూడక పేరు పెట్టి పిలుచుచున్నావా " అని గద్దించుచూ  వర్షుడు మిన్న కుండుట   చూచి విదిష కు అరికాలి మంట నెత్తికెక్కెను. భారతవర్ష వైపు మిర్రి మిర్రి చూచుచూ "నీకు చెప్పుట చేతకాని వారుండుటచే నీవిట్లు రేగుచున్నావు” అనెను.  “నన్ను పొమ్మనుటకు నీవెవరివే నేనిచ్చటనే  ఉండెదను” అని నందిని విదిష పక్కనే నిలిచెను. వర్షుడు మెల్లగా ఇంటిలోకి జారుకొనెను. చల్లగా చంద్రోదయము అగుచుండెను, మసకచీకట్లలుముచుండగా రాధామనోహర పుష్పములు పిల్లగాలికి తలలు ఊపుచూ  పిళ్ళారిగీతమేదియో  పాడుచుండెను. 

 చ. సితక   రకాంతు లందల రుజోడు  హయమ్ము లవోలె ముంగిటన్

        అతివ    లునిల్వ  గాజల   రుహమ్ము  లబోలి   నమేని   కాంతులే 

        మతుల  నుచిక్క  బట్టమ   రిపెళ్ళి  కళొ చ్చె  నుచూడ  సందడే   

        రతుల   ను పోలి  భామలు పురిప్పి  చలించ   మయూర  శోభలన్.


       సితకర   కాంతు లందలరు  జోడు  హయమ్ములవోలె ముంగిటన్

        అతివలు  నిల్వగా  జలరుహమ్ము లబోలిన  మేని   కాంతులే 

       మతులను   చిక్కబట్టమ   రిపెళ్ళి  కళొ చ్చెను  చూడ  సందడే   

        రతులను   పోలి  భామలు పురిప్పి  చలించ   మయూర  శోభలన్.

చంద్రు కాంతిలో జోడు గుఱ్ఱములవలె ఇంటి ముంగిట  ఇరువరు అతివలు (నందిని విదిషలు) నిలువగా జలరు హ మ్ముల (కలువపువ్వుల)ను పోలి వారి మేని కాంతులు మెరియుచుండగా   వారి అందము మతులు పోగొట్టు చుండగా ఆ ఇంటికి పెళ్లి కళ వచ్చెను. రతులను పోలిన ఆ ఇంటి కోడళ్ళు పురిప్పి చలించు చుండగా చూడ సందడే కదా. 

కొలది సమయము తరువాత వారునూ ఇంటిలోకి ప్రవేశించిరి. వారందరి సందడితో ఆ మండువా లోగిలి పెండ్లి పందిరి వలె నగుపించసాగెను. పురుషు లందరు తెల్లని పంచెలుగట్టి  తారలల్లె   తళ తళ మెరియుచుండ  సందీపుడొక్కడే  నీలి సూటు లో చుక్కలందు చంద్రుడి వలె వెలుగుచుండెను.సోఫాల పై వరుని తల్లి తండ్రులు సందీపుడు నందిని కూర్చొని యుండగా మంజూష వారికెదురుగా తివాచీపై కూర్చొని యుండెను.  మాలిని  దామిని విదిష నిలుచొని యుండిరి.  రాఘవ రాధాకృష్ణ  కుర్చీలపై కూర్చొనిరి,  బసవ కేశవులు  మంజూష వద్ద నిలుచుని యుండిరి.   సందీపుని మనసున రణము జరుగుచున్న చిత్ర మింకనూ తిరుగుచుండుటచే  భారతవర్ష కళ్ళలోకి సూటిగా చూడలేకుండెను.

 “సందమామ లాటి  పిల్ల కాసి సూడకుంట దిక్కులు సూత్తావేటిరా!” అని పైడమ్మ అనెను. రాఘవుడు " సందీపు నిలో  ఎందుకో ఆందోళన కనిపించుచున్నది, అని వర్షుని వైపు చూచెను .  వర్షుడు విషయము అర్ధము చేసుకొని  బావగారు  అని సాందీపుని సంబోధించి " మా చెల్లిని చూచినచో మీ ఆందోళన తగ్గును." అని సాందీపుని  దగ్గరికి పోయి  భుజముపై చేయి వేసి చెప్పెను .  పిల్ల కూడా అట్లే యున్నది  ఇదంతయూ మా ఆయన పనే , ఈ పెండ్లి చూపుల తతంగమేలనో మనసులు కలిసినవి మాటలు ఇచ్చి పుచ్చుకొనినారుకదా నేరుగా ముహూర్తము పెట్టుకొనిన పిల్లలకీ శ్రమ తగ్గునుకదా అని దామిని అనెను, విదిష  కూడా  అట్లు చేసిన బాగుండెడిదని  అనెను. 

స్త్రీలే అన్ని విషయములూ నిర్ణయించినచో పురుషులము మేమెందులకు అని రాకి అనుచుండగా కేశవుడు "పెట్టెలు మోయుటకు" అని చమత్కరించెను. అందరూ ఘొల్లుమని నవ్వినారు. ఎట్టకేలకు వాతావరణము తేలిక పడినది. ప్రేమించుకొనుట , తదుపరి ఘర్షణలు  ఎట్లో  జరిగి పోయినవి. వాటి ప్రభావమింకనూ పసి మనసులపైనున్నది. ఈ పెండ్లి అంతయూ  పెండ్లి చూపులనుండి అన్ని యదా విధిగా   సజావుగా జరిపించిన యెడల పిల్లల మనసులతో పాటూ పెద్దల మనసులు కూడా కుదుట పడును. అని చెప్పి విదిషవైపు చూచి నీవింకనూ చిన్నపిల్లవేకదా ఎన్నిపెళ్లిలు చేయించినావు నీవిట్లు మాట్లాడతగదమ్మా అని చెప్పెను.

విదిష  జింకపిల్ల వలె బెదురుకళ్ల  నాడించుచూ మాలినిగారివద్దకు పోయి ఆమె భుజము పై వాలెను . మాలినిగారు ఆమె తలనిమిరి ఓదార్చుచుండగా సోఫా పై నుండి నందిని కూడా లేచి మాలిని గారివద్దకు పోయి మరొక భుజముపై తలపెట్టుకొనెను. మాలినిగారు ఆమె తలను కూడా ప్రేమగా నిమిరి. మీరిద్దరూ నాకు రెండు కళ్లు అని ముద్దాడిరి. విదిష వెంటనే విసవిసా పోయి మంజూష ప్రక్కనే కూర్చొనెను , నందినికూడా మంజూషవద్దకే పోయి మరొక ప్రక్క కూర్చొనెను. ఒకరినొకరు కొరకొరా చూచుకొనుచుండగా కేశవుడు “వారిమురిపెములు చూచుటకింకనూ సమయము కలదు ముందు చెల్లాయి (మంజూష) సంగతి చూడవలెను.” అనెను. హాస్యము వెల్లివిరిసెను.

 మంజూష విదిషకంటే ఎక్కువ సన్నిహితముగా మాట్లాడుచూ  నందినితోనే మెలగ  సాగెను. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములువాడి కదా. వెంటనే విదిష వర్షునివద్దకుపోయి కొలది దూరములో నిలిచి తన పుష్పాలంకృత   ద్రాష్టిగ కేశములను పొడవాటి పూల జెడను చేతపూని నిలవగా నందిని కూడా తన నాజూకు కౌనును త్రిప్పుకొనుచూ పోయి అతడికి మరొకప్రక్క నిలిచెను. పెళ్లి చూపులు మంజూషకి  వలే కాక వీరిద్దరికి (పెళ్లి చూపులు) వలే తోచుచున్నవి  అని దామిని అనగా పెంచలయ్య సందీపుని  మంజూషను ఏమైనా మాట్లాడుకొనవలసినదేమైననూ ఉన్నదా లేనిచో పెద్దలము  మాట్లాడుకొనవలసినవి ఇంకనూ యున్నవి అనెను. 

పైడమ్మ “మా కోడలు వీణ వాగించుతాది అని ఇన్నాను , ఒక ఈన పాట అనుచుండగా సందీపుడు తల్లివైపు " ఇప్పు డెందుకు పెండ్లి అయినా పిదప వాయించునులే " అని అనగా అందరూ నవ్వు చుండిరి .  అబ్బో కాబోవు పెళ్లా మనిన ఎంత అపురూపమో  అని రాఘవువుడనగా , మా ముంగీస కూడా ఎంత బుద్ధిమంతురాలయిపోయెనో అని రాకి అనెను. " మాలినిగారు " పిల్లకి వీణావాదనము బాగుగా రాదు ఈ ఇంట వీణ వాయించునది మా పిల్లవాడు " అని చెప్పగా   బాగుగా రావలసిన పనియేమున్నది పిల్ల వాయించవలెను కానీ పిల్లవాడు వాయించుటకు సందర్భము కాదుకదా అని రాఘవుడనెను .

వీణావాదనముతో పని ఏమున్నది మంజూష పాడిననూ చాలునని   బసవడు ఒక ఆసు  కవితను దొర్లించెను.   

వంటి మెరుపులోనే వేయి రాగాలు, కంటి కొసలలోనే వెలుగు దీపాలు 

తీగవంటి పిల్ల తీగమీటనేలా సాహితీ వరపుత్రుని సరస గిరసము

వీడి వరుసకూడి సరసముగా పాటపాడ విన్నవారి వీనుల తేనె కురియు. 

అన్నింటికీ సందర్భమున్నది కానీ నీ ఆసుకవితలకు సందర్భము లేకుండెను అని అగస్త్యుడు చమత్కరించెను. మరల నవ్వులు విరుపూచి వాకిటనున్న విరులనల్లుకొన్నవి.  మంజూష ముందు వీణ యుంచబడినది. మంజూష బేలగా వర్షుని వైపుచూచి పిదప సందీపుని వైపు చూడగా అతడి  మనసు ద్రవించి "పాటపాడిన చాలుకదా వీణా వాదనమెందులక"ని కాబోవు ఇల్లాలికి ఇక్కట్లు తప్పించుటకు ప్రయత్నించుచుండగా రాఘవుడు "  అత్తగారు కోరినారు కోడలు ఆమె కోరిక తీర్చవలెను మధ్యలో నీవెందులకు గింజుకొనుచున్నావు?” అని తీక్షణముగా అడిగెను.  "మంజూష నీవు పాట పాడుచూ వీణా వాదనము చేయవలెను. పాట నీకిష్టము" అని రాకి అనగా దామిని రాకివైపు తీవ్రముగా చూచెను. నందిని  "ఎదో ఒక పాట  అయినా ఎట్లు కుదురును మా కులదైవం గోపాలుని కీర్తించుచూ గానము చేయవలెను" అని నిబంధనను జేర్చెను.

కేశవుడు " చెల్లికి కంగారుగానున్నది కావున గోపాలుని పై పాట నేను పాడెదన"ని ముందుకు వచ్చుచుండగా " పోవయ్యా నీ డ్రామా గానములిచ్చట కుదరవు ఇవి పెండ్లి చూపుల"ని నందిని  కొట్టి పారవేసెను నందిని పాడుట   మొదలు పెట్టు చుండగా ఏసు ప్రబువు పై గానము చేయరాదా యని పెంచలయ్య అడిగెను.   పైడమ్మ సివంగివలె లేచి " ఆల్ల కాడ నీ మతం  ఊసెత్తనని,  ఆల్ల పద్దతి పకారంగా (హిందూ వివాహము ) పెల్లి సేత్తానని మాటిచ్చినావా , నాను కూడా ఆవిసయం ఒట్టేయించుకొన్నానా ?  ఒట్టేసి సెప్పేవా నేదా?  అవిటవిటికి సెప్పాలేటి ? మడిసివికాదేటి ?? " అనగా కొలది సేపు నిశ్శబ్ధమావరించెను.  

ఆ నిశ్శబ్దమును చీల్చుకొని వీణానాదము గంగా ప్రవాహము వలె అందరి చెవులను తాకినది. మంజూష గానము లేకనే వీణ  వాయించు చుండగా ఆమె ప్రక్కనే కూర్చొని నందిని తాను వ్రాసిన సంస్కృత గీతము నాలపించెను    

ప్రాతః కాలే  నంద నందనే పూజా సమయే వందిత గురుః 

విద్యాసమయే ముకుంద మురారీ సంధ్యా సమయే నంద నంద 

క్రీడాసమయే గోపికా ప్రియా మానసచోరా గోపాల గోపాల

ఉత్తిష్ఠ యావత్ శయన పర్యంతం సతతము తవ నామస్మరణే కృష్ణా

గానము , వాదనమూ ముగిసిన పిదప అందరూ నందినిని కొనియాడిరి. పైడమ్మకీ విషయము తెలిసిననూ భర్త ఎప్పుడూ కుమార్తె సంస్కృత రచనా ప్రతిభను వినియుండ కపోవుటచే సంబ్రమాశ్చర్యములకు లోనయ్యేను.

పిదప తన బిడ్డలు గొప్పవారని చెప్పుకొనుచు మురిసి పిదప పెంచలయ్య కట్నము విషయమై నసిగి నసిగి పలు పలు సంభందములు లక్షల కట్నము ఇవ్వజూపినారని చెప్పెను. పరోక్షంగా అతడికి పెద్ద కట్నము పై మనసున్నదని ఎరిగించెను . మాలినిగారు పైడమ్మతో " ఎంతనుకునుచున్నారో తెలిపిన ఒక మాటనుకొనవచ్చునని తన కొడుకు  పది లక్షలు వరకు సర్దుబాటు చేయున"ని చెప్పగా పెంచలయ్య " కోట్లలో సంపాదించువానికి ఇంటివ్వవలెనో నేను చెప్పవలెనా " అని సాగ దీసెను . వర్షుడు "ఒక యాబది లక్షలు  ఇచ్చెదనని"  చెప్పగా " కోటి యని పెంచలుడు బిగించెను. అందరూ  మిక్కిలి ఆశ్చర్యమునొంది పెంచలయ్య తెంపరితనమును  గర్హించుచుండగా భారతవర్ష తల్లి వైపు చూచెను. సందీపుడు నందిని వారించిననూ ప్రయోజనము లేకుండెను. అందుచేత కొంత విలంబ మగుచుండెను. ఇంతలో సిద్దాంతిగారు విచ్చేసినారు. విషయము తెలిసి పెంచలయ్యకు హితము చెప్పుచుండగా  మంజూష కళ్ళలో నీళ్లు తిరిగినవి " మంజూష  మూతిముడిచి మొఖం మాడ్చెను . ' పెంచలయ్య కన్నీరు పెట్టుకొని "మా కోడలుచే  కంట నీరు పెట్టించుచున్నారు , నాకంట నీరు పెట్టించుచున్నారు. వాడిపై నేను పెట్టుకొనిన ఆశలడియాసలయినచో నాజీవితమంతయూ దుఃఖింతును." అని మర్యాద భాషలో మన్ననగా అడుగుచుండగా భారతవర్ష ఒక కోటి కట్నమిచ్చి చెల్లి పెళ్లి చేయుటకు సమ్మతించి  చెక్కు వ్రాసి ఇచ్చెను. మరుసటినెలలో మూర్తము  నిర్ణయించబడెను. సిద్ధాంతి గారు పంచాంగం చూసి ముహుర్తమును నిర్ణయించి శుభలేఖ వ్రాసి ఇచ్చినారు అది వర్షుని చదవమనగా " స్వస్తిశ్రీ చాంద్రమానేనా విళంబినామ సంవత్సర మాఘ మాస బహుళ దశిమి బుధవారం రాత్రి 7. 40 నిమిషాలకు హస్తా  నక్షత్ర యుక్త మిధున లగ్నమందు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మంజూషను  .." చదువుచుండగా మంజూష మొఖం కళ్యాణ కాంతులతో  వెలిగెను.  వారి ఇరుహృదయములలో  భజంత్రీలు మ్రోగుచుండెను   అట్లు మంజూష వివాహము నిశ్చయమయ్యెను 

Friday, December 4, 2020

Bharatavarsha - 86

కైలాసగిరి పై పరమేశ్వుడు పార్వతిని కూడి కొలువు తీరి చూచుచుండ ఆదిదంపతుల ప్రమోదమంద ఇనుడు చిరునగవులు చిందించుచుండె. నిహారస్నాన మాచరించిన ప్రకృతి  కాంత  ఆ లోకచక్షు పసిడి మయూఖ రేఖలందు తన అందముల నారబెట్టుకొని  నిగనిగలాడు మెరియుచున్నవి. "ఆర్యాణి, కల్యాణి, కాత్యాయణి,నీహారమే, నిహారమై, ప్రకృతికిహారమై, జీవులకు ఆహారమై నొప్పుచున్నదికదా!" అని బసవడు మిద్దె పైనుండి కైలాసగిరి కొండను చూచుచూ ప్రకృతిని వర్ణించ విఫల యత్నము చేయుచున్నఅగస్త్యునికి చెప్పగా అతడి మది పులకించెను.  చందన మేడపైకి వచ్చి " అమ్మ పిలుచుచున్నది " అని క్రిందకు వెడలెను. 

“అబ్బా! చందన ఎంత పొడవు ఎదిగిపోయెను. కుందనపు బొమ్మవలె యున్నది.” అని రాఘవుడనెను  "అవును అదిప్పుడు డిగ్రీ చదువుచున్నది"  అని బసవడనెను.  క్రిందకు దిగిన అగస్త్య బసవ రాఘవలతో బుచ్చెమ్మగారు " అల్పాహారం సిద్దము గానున్నది స్నానములు ముగించి రావలెన”ని చెప్పగా “ఇంత తొందరగా అల్పాహారమెందులకని అగస్త్యుడనెను. బసవడు "స్నానము ముగియుసరికి ఆలస్యమగును పండ్లు తోముకొని వెంటనే ఉదర పూజ గావించవలెన"ని తొందరపడుచుండగా బుచ్చెమ్మగారు " చూడునాయినా ఎట్లు వేపుకు తినుచున్నాడో రేపు పండ్లు తోముకొనక ముందే తినుటకు పెట్టమనునేమో !" అని తల  పట్టుకొనిరి.  

ఓరి తిండి బోతా రాత్రి అమ్మచేతి వంట  ఇద్దరమూ బాగానే మెక్కితిమిగదరా. “అవునురా నేను తిండి  బోతువు నీవు నిద్ర  బోతువు కాదన్నదెవరు!” అని ఆగమేగాలమీఁద పండ్లు తోముకొని వచ్చి తిండికి కూర్చొనెను . అగస్త్యుడి కూడా వానికి తోడుగా కూర్చుని తినసాగెను  బుచ్చమ్మగారు ఇడ్లీలు చేసి కొబ్బరి చెట్నీ కూడా  చేసినారు. "రాత్రి చేసిన రవ్వపులుసు లేదా?" అని  బసవడు  ఆగం చేయుచుండగా చందన నవ్వు చుండెను.  “ఎట్లు భరించుచున్నావమ్మా ఈ బిడ్డని?” అని అగస్త్యుడు అనగా “నాకేమినాయనా పడ్డంతకాలము పడక్కరలేదు ఆ వచ్చునది వీడితో ఎట్లు వేగునో అన్నదే నా విచారము” అని బుచ్చెమ్మగారు అనగా అగస్త్యుడు బసవడి  కళ్ళలోకి బుచ్చెమ్మగారి కళ్ళలోకి మార్చి మార్చి చూచి అడగలేక నసుగుచుండగా " పార్వతి గురించి వారికి తెలియును" అని బసవడు అగస్త్యునితో మెల్లగా అనెను. అట్లు మెల్లగా అను టే ల గట్టిగానే చెప్పరాదూ అని బుచ్చమ్మగారు “తల్లి తండ్రుల అంగీకారము కావలెనని అరుణతారగారు అనుకున్న మా మాసన్నాసి అక్కడే తాళి కట్టి ఇదిగో నీకోడలని ఆపిల్లని ఇంటికి తెచ్చెడివాడే, ఆయన (సర్రాజుగారు) ఎప్పుడూ ఊహించలేదు ఇట్లు జరుగునని తల్లడిల్లిపోయినారు. 

“మెల్లగా మాట్లాడమ్మా నాన్నఇప్పుడే నిద్ర లేచినట్లున్నది అని చందన అనుచుండగా సర్రాజుగారు. బయటకువచ్చి "మాకు దగ్గర సమ్మందములున్ననూ కాదని వీడికొరకు ఆ పిల్ల ఇంటికి పోయినాము. బల్లిపాడు పోయిన తరువాత ఆ చంద్రమ్మ పిల్లని ఇచ్చుటకు వీలు పడదని చెప్పినది ఛీ ఛీ వీడివల్ల మరల కాళ్ళీడ్చు కొని వచ్చినాము.” చందన " చంద్రమ్మ కాదు నాన్నగారు చంద్రమతి" అని కిసకిస నవ్వ సాగెను. బుచ్చెమ్మగారు చందన పళ్ళెములో చెట్నీ వేయుచూ ఆమె నెత్తిన  గరిటె తో  ఒక్కటి మొట్టినారు అయిననూ ఆమె నవ్వు ఆపకుండెను. నాకిటువంటి కుటుంబముండిన ఎంతబాగుండునని అగస్త్యుడు మనసులో అనుకొనెను.

ఆమె ఇవ్వనన్నా మనమూరుకొందుమా అరుణతారాగారితో మాటలాడించకుందుమా ఈ సారి అగస్త్యుడు కూడా పెట్టున నవ్వెను. అందరూ నవ్వుచుండగా బసవడి మొఖమెర్రబారెను. అల్పాహారం పిదప అగస్త్యుడు బసవడుఫెరారీ నెక్కి కాలనీ దాటి ఘంటా పథమున సాగుచుండిరి. వారు పాత డైరీ ఫారం ప్రదేశమును దాటుచుండగా ఎవరో   చేతిని వూపుచుండ అగస్త్యుడు వాహనమును నిలిపెను. రాఘవా, నీవా డైరీఫారము వద్ద ఇచ్చటమిచేయుచున్నావు? “బర్రెలు కాయుచున్నాను!( ముగ్గురూ నవ్వుకొనిరి ) మా ఇల్లు ఇచ్చటనే! నేను సబ్బవరం పోవుచున్నాను. నిన్న సందీపుని కలిసినాను నేడు సందీపునకు  మంజూషకు  పెళ్లి చూపులు.   మీరు తప్పక రావలెను అని జరిగిన విషయమునెఱిగించగా వారు నిర్ఘాంత పోయినారు “సాయింత్రము ఐదు గంటలకు వర్షుని ఇంటికి  రావలెనని” తెలిపి రాఘవుడు వెడలెను.

అగస్త్య ఫెరారీ గరిష్ట వేగమెంతో  తెలియునా ?  "280 కి. మీ . ఐదు గేరులు  కలవు." 

దీనికొరకు ఇన్ని కోట్లేలపోయవలెను ? ఈ మాదిరి కార్లు వారు మొత్తము 36 మాత్రమే చేసినారు అన్నీ ఇంకనూ అద్భుతముగా తిరుగుచున్నవి.  ఫెరారీ గమ్యమును చేరెను. 

కలుఉప్పాడ: ఇది ఇల్లా పర్వతమా ఏమీ అందము ఏమీ రాజసము, సర్దారు పటేలు   విగ్రహమంత ఎత్తున్నదే. అనుచూ ఆ భవనంపై ఒక ఆసుకవితా శరమును ప్రయోగించెను. "శిరము మబ్బులందు సరము మిద్దెనందు గల రాజగృహము ను కాంచిన ఈ రాజహంస ఏల నేల వాలె నని చూచుచుండ   చుట్టె  శిశిరము,  ఏమో! మన మేనమామ,  చందమామ ముక్కొకటి  తెగిపడెనేమో!  ఏమో! కలేమో!! అని కవితా లతలు జల్లి ముందు అగస్త్యని లోనికి పొమ్మని కొలది సేపాగి   బసవడువచ్చెను. 

మయ నిర్మితమువలె నున్న ఆ భవంతి ఐదవ అంతస్తు లో అడిగిడి  అగస్త్య తండ్రి  దక్షిణామూర్తి గారి గదిలోకి ప్రవేశించుచుండగానే బసవడు అగస్త్య ఎదురెళ్లి బసవని కలుసుకొనగా ఆ అంతస్తులోగల  నలుగురు పనివారిని నాలుగు అత్యవసరమైన  పనులపై బైటికి పంపెను. ఆ గదిలో గల కెమెరాను  ఆపుజేసెను. నాన్నగారు , నా బాల్య స్నేహితుడు బసవడని  చెప్పుచూ మంచము పైనున్న దక్షిణ మూర్తిని బసవని కి  పరిచయం చేయగా బసవడు నమస్కరించెను. "కొద్దినెలలుగా గుండెపోటు వచ్చి ఆరోగ్యము చెడుటవల్ల  మంచము పట్టినానని దక్షిణామూర్తి చెప్పుచుండగా, అగస్త్యుడు "గ్రెస్ ఏదని ఆడిగెను. "ఆమె కార్యాలయమునకేగెను, ఆమిప్పుడు భాగస్వామి మరియు డైరెక్టరుకూడా.  రేపు వార్షిక  జనరల్ బాడీ మీటింగ్ సమావేశముకలదు. ఆ ఏర్పాట్లు చేయుచున్నది” అని దక్షిణ మూర్తి చెప్పెను.  ఇంత  కాలమూ  లేనిది ఇప్పుడు ప్రత్యేకముగా  ఈ మీటింగు లేల   అని అగస్త్యుడు అడగగా "ఇప్పుడు మన సంస్థ ప్రయివేట్ లిమిటెడ్ కాదు పబ్లిక్ లిమిటెడ్ గా మారినది ,పోయి చూచి రమ్ము  రెండు వారములనుండి చెప్పుచున్నాను  సంస్థ వంకకు పోలేదు సరికదా కనీసము కన్నెత్తి నామ ఫలకమైననూ చూడలేదు  మన సంస్థ కు నలుగురు భాగస్తులు గ్రేస్ , శ్యామ్ , సుందర్ అని చెప్పగా  ఇంతకూ ఆ నాల్గవ భాగస్తుడు ఎవరు? అని అగస్త్యుడు అడిగెను.  బసవడు "తెలివి తక్కువ సన్నాసి , మీ నాన్నారా అని బసవడు అనెను.  అప్పుడు అగస్త్యుడు “నాన్నా! ఏమది సంస్థనే భాగస్తుల పణము చేసినావా! ఎంత చేటు తెచ్చినారు. ఆమె పై మీకెంత నమ్మకము”  దక్షిణామూర్తి " పోరా ఇదంతయూ నీ నిర్వాకమే!" అనుచుండగా వారు  కర్మాగారమునకు  బయలు దేరినారు. 

                                          ***

"పని వారందరూ మారిపోయినారు గేటు వద్ద రక్షణ సిబ్బంది కి కూడా నేనెవరో చెప్పుకొన  వలసి వచ్చెను."  "నీవిట్లు ప్రతి విషయమునకు వగచినచో ఇక మన పని అయినట్లే. రక్షణ సిబ్బంది ఎప్పుడూ మారుచునే యుందురు." అగస్త్యుడు ఫెర్రారీను కార్యాలయ భావన ముంగిట ఉన్న వసారాలో ఆపుచుండగా వాహన శాల యజమాని వచ్చి " మీరు వాహనము నిచ్చట నిలపరాదు సిబ్బందికి అధికారులకు వాహన ములు నిలుపుటకు వేర్వేరు గా వాహన శాలలున్నవి." అని చెప్పెను. నేనెన్నడూ  వాహనమును అచ్చట నిలపలేదు , నేనెవరో మీకు తెలియదు " అని అగస్త్యుడు అనుచుండగా వాహన శాల యజమాని " ఇచ్చట అమ్మగారు తప్ప మరెవరూ వాహనములు నిలపరాదు . " అని గట్టిగా చెప్పెను. వాదన మొదలవుచుండగా బసవడు " అగస్త్య వాహనమును పోనిమ్ము , వాహనశాలకే పోయెదము " అని మిత్రుని ముందుకి పొమ్మనెను. 

 వాహనమును నిలిపి కార్యాలయములో అడుగుపెట్టిన అగస్త్యకి  తెలిసిన ఒక్క మొఖం కూడా కనిపించక పోవుటచే సంభ్రమము కలిగినది. బసవడికి అన్ని విభాగములు చూపవలెనని అగస్త్యుడు భావించిననూ ప్రతి విభాగము వద్ద నిలిచి చెప్పుకొనుట కష్టముగా నే కాక అవమానముగా  కూడా  తోచెను.  బసవడు " ఓరీ  మొద్దూ , నీ కొక గుర్తింపు కార్డు లేకపోయెను ఇచ్ఛట  అంతా కొత్తవారివలె నున్నారు . మీ నాన్నని ఇచ్చట నిర్వహణాధికారి ని కలిసి నీ వెవరో  తెలుపుము వలసినచో  మీనాన్నగారితో మాట్లాడించిన ఈ కష్టములు తొలగును. అగస్త్యుడు విసవిసా నిర్వహణాధికారి గది వైపు దూసుకుపోయెను  కానీ అచ్చట కుర్చీ ఖాళీ గా ఉన్నది  చివరిగా అగస్త్యుడు తండ్రితో  దూరవాణి యందు సంభాషిచుటకు ప్రయత్నించు చుండగా " హలో ఇచ్చట  రాకి అచ్చట ఎవరు ?" అని అడగగా అగస్త్యునికి అరికాలిమంట నెట్టి కెక్కెను. " ఏమయ్యా నీ ముద్దుపేర్లు చెప్పక అసలుపేరు చెప్పవయ్యా !" అని అనగా నీ పేరు చెప్పక నన్ను దబాయించుచున్నావు. వలసినచో నీవునూ ముద్దు పేరే చెప్పవు " 

ఏవయ్య నాపేరు అగస్త్య నేను మానాన్నతో మాట్లాడవలెను. మానాన్న పేరు దక్షిణామూర్తి, నీవెవరు మాఇంట ఏమిచేయుచున్నావు. నాపేరు రాధాకిష్ణ  నేను    హృదయాలజిస్ట్ ను మీనాన్నకి  డాక్టరును . " తిక్కవాని వలె ఉన్నావే , నేనటువంటి డాక్టరుండునని ఎచ్చట వినలేదే అనుచుండగా సైకాలజిస్ట్ దూరవాణి సాధన మందుకొని  చూడుబాబు  మీ నాన్నగారికి ఇప్పుడే సూదిమందిచ్చినారు. మరల ఛాతిలో నొప్పి వచ్చినది.  ఆయనకు  విశ్రాంతి  అవసరము  ఇప్పుడు  మాట్లాడించకున్న  మంచిది."  

విధిలేక అగస్త్యుడు సంభాషణ ముగించి ప్రక్కకు చూచినంతనే పేకింగ్ విభాగము నుండి గ్రేస్   అధ్యక్షుని గదిలోకి పోయి కూర్చొనెను. అది చూసి అగస్త్యుడు ఖంగు తినెను. బసవడికి ఏమీ అర్ధము కాకుండెను " ఇది మానాన్న గది.   నేను మొదటిసారిచ్చటికి  వచ్చినప్పుడు   అనుమతిలేనిదిదే ఆయన  గది లోపలికి ఎవ్వరినీ పోనిచ్చెడివారు కాదు. ఆమెను కూడా ఇప్పుడంతాయో మారి పోయెను.  అనుచుండగా సూట్ వేసుకున్న ఒక పొడుగాటి వ్యక్తి లోపలకి పోయెను. అగస్త్యుడు లోపలి వెళ్ళుటకు ప్రయత్నించగా  గది బైట నున్న కావలి అడ్డుకొనెను.  

బసవడు " ఇప్పుడు ఇచ్ఛట మనము చేయవలసిన పని ముగిసినది పద ఇంటికి పోవలెను. " అని ఇంటికి బయలుదేరినారు. ఇల్లే అనుకొంటిని, సంస్థ మొత్తమూ నీ తల్లి గుప్పిటలో నున్నది  ఇదంతయూ   నీ సవతి తల్లి ఆడించుచున్న నాటకము. చూచుచుండగా ఆమె గురి నీపైనే ఉన్నది. అని బసవడు అనగా అగస్త్యుడులికి పడెను. "మీ  సంస్థలో ఈ మధ్య కాలములో ఎవరైనా ఉన్నతాధికారి తొలగింపబడెనా ?" 

 "తొలగించబడుటయా మా నాన్నను అడగవలెను" అని అగస్త్యుడు అనుచుండగా  బసవడు "అందుకే నిన్ను నిద్రపోతు  అన్నది, నిర్వహణాధికారి జాన్ స్థానము ఖాళీ అయ్యెను. అతడి స్థానమందు మొరొక కొత్త అధికారి త్వరలో వచ్చును , అందుకే అతడి కుర్చీ ఖాళీ అయ్యెను.  "అతడు చాలా మంచివాడు అతడిని ఎందుకు తొలగించవలసి వచ్చెనో!"   అది కూడా చెప్పవలెనా యజమానికి ఎవరు విస్వాస పాత్రుడో వాడు వీరికి శత్రువు. కనుక జాన్ ని కలుసుకొనుట మన తదుపరి  కర్తవ్యము  అని బసవడనగా " మరి మన తక్షణ కర్తవ్యము అని అగస్త్యుడనెను "మార్గమధ్యమములో ఆగి రెండట్లు తిని పోవుట , మీ ఇంటివద్ద (భోజనమునకు ) ఎట్లుండునో యని బసవడు అనగా అగస్త్యుడు ఏడవలేక నవ్వెను. బసవడు  ఒక దోస  కట్టించుకొన్న తరువాత ఇరువురు ఇంటికి బయలుదేరిరి.  

ఫెర్రారీ ఆకాశహర్మ్యము ముందాగెను. బసవడు దిగి   అచ్చట మరొక ఫోక్స్ వాగన్ ఆగియుండుట  గమనించి అగస్త్యుని దగ్గరకి పిలిచి " ఇప్పుడు చిన్న తమాషా చేసెదను చూడుమని ఆ వాహనమువద్ద  వేచి యున్నసారధి తో " మీ యజమాని సుందర్ గారు నిన్ను పైకి తీసుకురమ్మని చెప్పినారు " అనెను  " అందుకు ఆ వాహన సారధి  " సుందరు గారు ఎవరండీ , మా యజమాని శ్యాం గారు అనెను. అగస్త్యుడు బసవడు ఇద్దరూ భవనము ఐదవ అంతస్తు చేరుచుండగా బసవడు పిల్లివలె నడుచుచు దక్షిణామూర్తి గదివద్దకుచేరి  నక్క వలే నక్కి  గోడకు చెవులు ఆయనించి వినుచుండెను.   అగస్త్యుడు " ఏమిరా ఇట్లు గూఢ చారివలె ప్రవర్తించుచూ  పోలీసు అధికారివలె చాకచక్యము చూపుచున్నావు." అనెను. ఉష్ .. నిశ్శబ్దము.... ఈ చిన్న చిన్న కిటుకులతో పెద్ద ఫలితములు సాధించవచ్చు. వారేమి మాట్లాడుకొను చున్నారో వినవలెను. 

 నీకొడుకు వచ్చునప్పుడల్లా లక్షలు లక్షలు దోచిపెట్టి ఆ డబ్బుతో వాడేమి చేయుచున్నాడో ఎన్నడైనా అడిగినారా ? నేడు నేను  ... పై సంతకములు పెట్టమన్నచో  ..  చేయుచున్నారు. ఈ సంస్థ  1000 కోట్ల సంస్థగా  ఎదుగుటకు గ్రేస్ గారి కృషి మీరెరుగనిది కాదు. దక్షిణామూర్తి ఏదో మెల్లగా మాట్లాడు చున్నాడు ఓవర్ సబ్ స్క్రిప్షన్ మొత్తమును  మూడు నెలలలో  తిప్పి ఇవ్వనిచో న్యాయపరమైన చిక్కులలో... 

కొత్త పేక్టరీ కోరకెందుకు  తొందర పడుచున్నావు , జిలేబీ  నేనాడిటరుతో మాట్లాడవలెను. 

 "హు! నన్ను నమ్మలేనివాడు  మంచము మీదనుంచి దిగలేనివాడు నన్ను జిలేబీ అనుచున్నాడు."   

ఆడిటరుతో మాట్లాడి మీరు చేసెడిది ఏమియునూ లేదు , ఆడిటర్ మీకు లెక్కలు వివరించిననూ మామ్మాపలేడు మేము డైరక్టర్స్ అని తెలుసుకొనిన్న మంచిది . 

 శ్యామ్ నాకే మంచి చెడ్డలు చెప్పుచున్నావా!  అదియునూ చూచెదను, నేను సి ఈ ఓ  మరియు బోర్డు ఆఫ్ డైరక్టర్స్ కు చైర్మన్ అని మరిచినారా? నేను రోగినైననూ  నాకొక కొడుకున్నాడు వాడిక్కడే యుండి ఈ వ్యవహారము చెక్కబెట్టి యే పోవును.  అని దక్షిణామూర్తి గది  దద్దరిల్లునట్లు అరిచెను.   గ్రేస్ ఇద్దరూ పగలబడి నవ్వి బయలు దేరినారు. బసవడు  అగస్త్యుడు వారు లిఫ్ట్ లో ప్రవేశించు వరకూ నక్కి వారి కారు బయలుదేరుట మెడపైనుండి చూచి లోపలకి  ప్రవేశించారు. దక్షిణామూర్తికి మరల ఛాతిలో నొప్పి పెరిగెను. బసవడు వెంటనే ఆంబులెన్స్ ను రప్పించి ఆసుపత్రికి తరలించగా అచ్చట హృదయాలజిస్ట్ దక్షిణామూర్తికి వైద్యము చేసి.  అతడు విశ్రాంతి  తీసుకొనుచుండగా బయటకు వచ్చి   బసవడిని చూచి వీణావాయించు న్నట్లు గాలిలో చేతులు మీటుచూ  మదన గోపాలా యని పాడుచూ పార్వతివలె   నటించుచుండగా బసవడు అగస్త్యు లకు వేయి ఏనుగుల బలము వచ్చెను. దామినితో సహా అందరూ కలసి వర్షుని ఇంటికి మంజూష పెళ్లి చూపులకు బయలుదేరిరి. 


Wednesday, December 2, 2020

Bharatavarsha 85

 మీనంబాకం విమానాశ్రయము: ప్రాతః కాలము 6. 00 గంటలు;  కామరాజ్ టెర్మినల్ ఇండిగో విమాన ప్రయాణీకులతో నిండి యున్నది. బసవడు సోఫాపై వాలి పార్వతి చిత్రములను చూచుచూ మైమరచి ఆమె వీణావాదనమును తన చరవాణి స్వరముగా ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యము పలుమార్లు వినుచున్ననూ చాలకున్నందున మరల ఆమె బల్లిపాడులో చేసిన వీణావాదన సంక్షిప్త చలన చిత్రమను కాంచుచూ ఆమె కన్నుల సోయగమునందు కరగుచుండెను. ఇంతలో 

“This is the final boarding call for passenger Basava booked on flight 372A to Visakha City.  Please proceed to gate 3 immediately. The final checks are being completed and the captain will order for the doors of the aircraft to close in approximately five minutes time. I repeat. This is the final boarding call for Basava Thank you. ప్రకటన ముగియుచుండగానే బసవడు విమానము వద్దకు పరిగెత్తెను.

కిటికీవద్ద తన ఆసనమును కనుగొని సుఖాఆసీనుడై విమాన సేవకురాలు, ఆతిథ్యదాత అతడిని చూచి నవ్వగా అతడు కూడా మందహాసము చేసెను. ప్రయాణీకులందరూ సర్దుకు కూర్చొని బాతాకానీ చెప్పుకొనుచుండిరి. ఇంతలో విమాన ద్వారము మూతబడి బిగించబడెను.

Ladies and gentlemen, welcome onboard Flight from Chennai to Visakha. We are currently third in line for take-off and are expected to be in the air in approximately seven minutes time. We ask that you please fasten your seat belts at this time and secure all baggage underneath your seat or in the overhead compartments.  Please turn off all personal electronic devices, including laptops and cell phones. Smoking is prohibited for the duration of the flight. Thank you for choosing indigo Airlines. Enjoy your flight.

బసవడు రెండు వరసల ముందు నున్న స్థానమందు కూర్చొని తననే చూచుచున్న యువకుని చూచి " ఓరీ రాఘవా ! అని అరిచి తన నడుము బిగింపు సడలించుకొని అతడి కడకేగెను. ఏరా దున్నపోతా ఎంతసేపు చూడవలెను ఏ లోక మందుంటివిరా ? రాఘవ పక్కనున్న ప్రయాణీకుని బుజ్జగించి వెనుక నున్న బసవడి స్థానమున కంపి బసవని చెంత 

చేర్చుకొనెను. బసవడు బల్లిపాడు విషయములను తెలుపుచుండగా “There are six emergency exits on this aircraft. Take a minute to locate the exit closest to you. Note that the nearest exit may be behind you అనుచూ ఒక సేవకి రక్షణ సూచనలిచ్చుచుండగా మరొక సేవకి వాటిని చేసి చూపుచుండెను

Oxygen masks will drop down from above your seat. Place the mask over your mouth and nose, like this. Pull the strap to tighten it. వీరికి పైలెట్లతో సంభందములుండునుకదా అని రాఘవుఁడడగగా “చాలావరకు ఉండునని వారు కలసి పడుకొందురని విన్నాను”  “వీరు ఐదు నక్షత్రముల హోటల్స్ లో బసచేసెదరని అనుచుందురు నిజమేనా?” “నిజమే సంస్థ డైరెక్టరుకు కూడా లేని ఈ సదుపాయము వీరికి కలదు, ఖర్చంతయూ సంస్థేభరించును”   

క్రూ ఆన్ బోర్డ్  కెప్టెన్ విక్రమ్ సింగ్ , కెప్టెన్ సుందరి ఫ్లైట్ అటెండంట్స్  రీనా , రీతూ అని చెప్పి ముగించెను. సుందరి పేరు వినగానే బసడి కళ్ళు వెలిగెను. విమానము పరుగు మొదలిడెను.  ఒక చీటి వ్రాసి అటునిటు తిరుగుచున్న యువతిని బ్రతిమాలి చీటి లోపలికంపను. కాస్సేపటికి సుందరి వచ్చి అతడిని కాకిపిట్ లోనికి కొనిపోయెను. 

సుందరిని ఆ యూనిఫామ్  నందు చూసి బసవడు సంతోషించెను కెప్టెన్ సింగ్ కూడా మితముగా నైననూచక్కగామాట్లాడెను. అప్పుడప్పుడూప్రకటనలు చేయుచూ “ఫ్లైట్ అనౌన్సమెంట్స్ ను ఫ్లైట్ డెక్ అందురు” అని తెలిపెను. బసవడు “వివాహమైనదా?” అని సింగ్ ని అడగగా ఎయిడ్స్ కారణముగా డివోర్స్ నడుచుచున్నదని తెలిపెను. బసవడులిక్కి పడెను.    పైలెట్స్ లో AIDS – Aviation Induced Divorce Syndrome అని వ్యవహరించెదరు. అని సుందరి తెలపగా నవ్వులు విరిసినవి. మా ఉద్యోగ సమయములకు వెగటుబట్టి 30 శాతము భార్యలు విడాకులు కోరుచున్నారు అని కెప్టెన్ సింగ్ అనెను.

   Good afternoon passengers. This is your captain Sundari speaking. First I'd like to welcome everyone on Rightwing Flight 372 A. We are currently cruising at an altitude of 33,000 feet at airspeed of 400 miles per hour. The time is 7:15 am. The weather looks good and with the tailwind on our side we are expecting to land in Visakha approximately in fifteen minutes. We are ahead of schedule. The weather is sunny and the temperature is 25 degrees. If the weather cooperates we should get a great view of the city as we descend. I'll talk to you again before we reach our destination. Until then, sit back, relax and enjoy the rest of the flight. కాక్ పిట్ నుండి బయల్వెడలి బసవడు రాఘవ ప్రక్కన చేరెను.

                                               ***

విశాఖపట్నం విమానాశ్రయము: ఆశాకమునుండి బంతివలె బసవాడూడిపడుట, వానిని ఆటస్థలమందు బంతిని పట్టినట్టు అగస్త్యుడు ఒడిసిపట్టుట, జరిగిన పిమ్మట ముగ్గురు మిత్రులూవిమానాశ్రయమందే ముచ్చటలాడుకొని మురియుచుండగా బసవడు సుందరి గూర్చి తెలిపి ఆమెతో  విమానమందు దిగిన చిత్రమును చూపెను. "ఎంత ఆదరణ కాకిపిట్ నందుకు కొనిపోయి తన చెంత కూర్చొండబెట్టుకొనెను. సొంత అన్న వలె భావించి ఆప్యాయతను కురిపించెనని చెప్పుచూ బసవడు భావావేశమునకు లోనయ్యి ఆశుకవితాధారామృ తమును కురిపించెను. 

సుందరాభిదే చారుగుహే చారుశీలే అసమ వైమానికే ఆకాశ గమనే 

మిత్రప్రియే మనోరమే అతిథి సత్కార పండితే దండువుడుపు మండితే 

చారు సంవాదాభిరామే జితకాశి నే, జీమూత వాసినే, నమస్తే నమః 

"అని బసవడు అనగా అగస్త్యుడు "నీ ఆసు కవితకు సంస్కృత చంద మబ్బేనే, బాగుగానే ఎదుగుచున్నావు!"  అని మెచ్చుకొని "అటువంటి పిల్ల జీవితమున ఉండిన జన్మ ధన్యమగును కదా" అని అనెను. ముగ్గురూ అగస్త్యుడి వాహనమువద్దకు పోయిరి, "వాహనము పాతదివలే నున్నది" "అవును 1962 నాటిది" ముగ్గురూ లోపల కూర్చొనగా కారు కదిలెను. 

బసవడు “అగస్త్య ఇక చెప్పుము, ఏమా నిన్ను వేదించుచున్న అంతుచిక్కని రహస్యము?”

ఒక్క ముక్కలో చెప్పునది కాదు నేను విశాఖ వచ్చి రెండు వారములుగా గమనించుచున్ననూ అంతుచిక్కకున్నది. మానాన్నగారి ఆరోగ్యము క్షీణించుచున్నది . గఆయన భార్య తో విభేదించి గుండెపోటు కొని తెచ్చుకొనెను. వ్యాపారము కూడా దిక్కుతోచని పరిస్థితిలో నున్నది. 

నీ వీ పాత కారు వాడుట చూసినప్పుడే అనుకొంటిని 1962 వ సంవత్సరపు కారు వాడుచున్నావంటే చాలా బాధ కలిగినది. అని రాఘవుడనెను 

అగస్త్యకి తాప  క్రోధ హాసములు ముప్పిరిగొన్నవి " నేనుచెప్పిననూ నీకర్థము కాదు గానీ ఒకసారి  62 వ సంవత్సపు  ఫెర్రారీ  ధర చూసి చెప్పా గలవా ?

రాఘవుడు గూగుల్ తెరచి ఫెర్రారీ 1962 తయారీ ధర అని అన్వేషించగా 48 మిలియన్ డాలర్లు అని చూపగా , కంగారు పడి మరల మరల సరి చూచుకొని 48 మిలియన్ డాలర్లు అనగా ఎన్నిరూపాయలని మార్చి చూడగా 3,53,86,82,400.00 సంఖ్యను చూపెను , మొట్టమొదట వారు 35 కొట్లాయని గుడ్లు తెల్లవేసి పిమ్మట 340 కోట్లని తెలుసుకొని గుండె చిక్కబట్టుకొనిరి. అగస్త్యుడు కారాపగా దిగి కారుని తడిమిచూచి ముద్దాడి ఛాయాచిత్రములు గ్రహించి మరల కారులో కూర్చొనిరి. వ్యాపారము పది రేట్లు పెరిగెను కానీ భాగస్వామ్య వ్యాపారము గా మారిపోయెను. ఎదో కుట్ర  జరుగుచున్నది. మా నాన్న గారి అనారోగ్యము వెనుకకూడా అంతుచిక్కని రహస్యమున్నది. ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి రాజ్యమేలుచున్నది ఇప్పుడు నమ్మకస్తులు కావలెను అందుచే నీ సహాయము కోరి నిన్ను పిలిచితిని. మీ సంస్థ వ్యాపారము ఎన్ని కోట్లుండును. నాలుగు కోట్లనుండి నేనెరుగుదును , నేడు వంద కోట్లు దాటినది.  వంద కోట్ల సంస్థ యజమానికి  300 కోట్ల కారు ఏలనో ?  అప్పు చూపుటకు కొన్నట్లు ఆమె చెప్పుచున్నది.

 రాఘవుడు  “ఈ లెక్కన నీవు విశాఖ పట్టణమున అత్యంత ధనికుడవు వలె నున్నావు” 

అది నాకు తెలియకున్ననూ అత్యంత దరిద్రుడను నేనే , ఒక వైపు తల్లి కనిపించదు , ఒక వైపు తండ్రి ఇట్లాయెను , అతడి కళ్ళలో నీళ్లు తిరిగుచున్నవి , మరొక వైపు .. చెప్పలేక రోధించుచుండెను. నాకు పట్టెడన్నము పెట్టువారు లేరురా! 

 కారు మాఇంటికి పోనీయకున్న మర్యాద దక్కదు, బసవడు ఖంఠము అగ్గిపిడుగువలె ధ్వనించెను. కారు బసవడింటి మార్గము పట్టెను. “నీ సమస్యకి పరిష్కారము  నేను చూపలేకున్ననూ , సమస్యకు మూలమెవరో తేల్చెదను. అని బసవడు హామీ ఇచ్చెను.”         

“రాఘవా!చెన్నపట్నమెందులకేగినావు విశాఖపట్నమెందుకొచ్చినావు "నాసమస్య ఏమని చెప్పవలెను జీవన మరణ సమస్యగా నున్నది నా ఎలక్ట్రానిక్స్ సంస్థకు డబ్బు ముడి సరుకు తో పాటు అన్నీ సమస్యలే, సాంకేతికజ్ఞానమున్న మనిషి తక్షణము కావలెను. చెన్న పట్టణమునకు పోయి అచ్చట నున్న ఒక ఎలక్ట్రానిక్స్ సంస్థను సందర్శించితిని వారి పద్దతి పరిజ్ఞానము నవలంభించి ఉత్పత్తి చేసినచో ఖర్చు సగము కలిసి వచ్చును. సందీపు ని వద్ద సృజనాత్మకత కలదు కానీ వాడు చిల్లరగాతిరుగుచూ ఇవేమియూ పట్టించుకొనకుండెను. సందీపుడున్న ఈ కష్టము గట్టెక్కును కానీ వాడు ఒక వారము రోజులుగా దూరవాణికి కూడా దొరకుండెను. సంస్థకు రోజులు దగ్గర పడినవి. ఇంటికి పోయి అమ్మను నాన్నను చూడవలెను, ఆపిమ్మట సందిగాడి విషయమేమో చూడవలెను అందుకే విశాఖ వచ్చితిని” 

“అయ్యో నేను సాఫ్ట్ వేర్ కాకున్నచో నీకు సాయము చేసెడివాడిని.” “బసవా నీ తెలివితేటలు నే తట్టుకొనేజాలను, అని రాఘవుడనగా ముగ్గురూ నవ్వుకొనిరి. “ఇదియునూ ఒక కష్టమేనా!” అని బసవడనెను. అటుపిమ్మట   “నీ సమస్య ఏమి?” అని బసవని రాఘవుడుడిగెను. “పార్వతి నిచ్చుటకు ఆమె తల్లి చంద్రమతి అప్పుడు అంగీకరించెను కానీ నేడు పార్వతి నాతొ మాటలాడుటకు కూడా అనుమతించకుండెను.” అగస్త్య, రాఘవ పడీపడీ నవ్విరి.

Monday, November 30, 2020

Bharatavarsha 84

 ముంబై అంధేరి లలిత్ సూపర్ ప్రీమియం హోటల్: సంజయ్ సాబ్  దిస్  ఈజ్ లకుమ, లకుమ దిస్ ఈజ్  సంజయ్ సాబ్ ఫేమస్ ప్రొడ్యూసర్. అరవై ఏళ్ళు దాటిన ఆరడుగుల పొడుగు మనిషి , నెరిసినజుట్టు , ఎర్రని రంగు,  పల్చని చర్మం బాత్ సూట్ లో కొద్దిగా  చాతి కనిపిస్తూ  సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న అతడు లేచి హాయ్ బేబీ అంటూ లకుమని  రెండు చేతులూ జాపి అందుకోబోయాడు  , అనుకోని పరిణామం తో లకుమ  వెనక్కి  రాబోయింది , కశ్యప్ ముందుకి తోసాడు అంటే వెళ్లి అతడి కౌగిలి లో ఇరుక్కుంది. ఒక రెండు నిమిషాలు నలిపి ఒక ముద్దు ఇచ్చి వదిలాడు. కశ్యప్ కి లకుమకి కాఫీలు వచ్చాయి. కాఫి తాగే లోపు సంజయ్ స్నానం చేసి వచ్చాడు.  సోఫాలో ఎదురుగా కూర్చుని

అతడు హిందీలో మాట్లాడుతూ " తుం హిందీమే బాత్ కరోగీ ?" కర్ సక్తీహుం మగర్ జ్యాదా నహీ, " హ హ హ హ  కమ్ హో యా జాదా కోయీ బాత్ నహీ, హమ్ కో తేరీ జిస్మ్స్  సే మతలబు హాయ్, జవానీ సే మతలబు హాయ్ , హామే ఫిగర్ ఛాహీయే ఫిగర్, హమారా ఏక్  ఐటెం సాంగ్ ఇసీ హోటల్ మే షూటింగ్ చల్ రహీ హాయ్. అభీ థోడీ దేర్ మే  హమారా డైరెక్టర్ ఆనేవాలహై మై తుమ్కో  కశ్యప్ కీ కహనే పర్ ఏక్ మోకా దేరహాహుమ్ డైరెక్టర్ సే  మిలో మై ఉంసే బాత్ కారూన్గా. ఔర్ ముఝే కుష్ రఖనా.

అని ఆమె కళ్ళలోకి చూస్తుండగా కశ్యప్ ' జీ హా క్యోన్ నహీ, మై సంఝాతాహుమ్ అని లకుమను  బయటకు తీసు కొచ్చేసాడు. క్రిందన గ్రౌండ్ఫ్లోర్ మయసభ ని తలదన్నే విశాల పాలరాతి  సభామంటపం లో నర్తకిలంతా చిన్న దుస్తులు ధరించి  నిలుచున్నారు ,మంచి ఊపున్న  హిందీ పాట పెట్టి , లైట్లు కెమెరా హడావిడి గా ఉంది  ఒక చిన్న టీ వీ లో వాళ్ళ కదలికలను గమనిస్తున్నాడు ఒక వ్యక్తి , కాస్సేపు షూటింగ్ అయ్యింది తరువాత అక్కడ ఉన్న ఒక అక్వేరియం వద్ద కథా నాయకుడు  ప్రతి నాయకుడు తో  " నీ కూతురిని ఇరవై నాలుగు గంటల్లోగా ఎక్కడున్నా లేవదీసుకు పోతా" నని  ని సవాలుచేసే దృశ్యం తీశారు." అది జరిగిన 24 గంటల్లో నీ చెల్లిని మాన భంగం చేస్తానని ప్రతి నాయకుడు  ప్రతి సవాలు చేస్తాడు" కట్ కట్  అరిచాడు డైరక్టర్. కశ్యప్ లకుమని తీసుకెళ్లి వినోద్ కి పరిచయం చేసాడు.

సర్ ఏ హై లకుమ, ఆప్ కో పతా  హై అరుణాజీ , ఓ  అచ్చి  తరహా నాచ్తీహై. మాయ టెలి ఫిలిం మే కియా , అంటుండ గానే  '  ఓ హొ  హొ హొ హొ అంటూ కుర్చీ నుంచి లేచి షేక్ హ్యాండ్  ఇచ్చేడు " ఏ ఉంకీ భేటీ హై " అని కశ్యపుడు పూర్తి చేసెను. " నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు , మీ మదర్ మంచి డాన్సర్ మీరు డాన్స్ బాగా చేస్తారని కశ్యప్ చెప్పాడు. గత వారం మీ మూవీస్ చూసాను ముఖ్యం గా డాన్స్ బిట్స్ సాంగ్స్ చూసాను. మీ డాన్స్ బాగుంది. అని మెచ్చుకొని మధ్యాన్నం ఐటెం సాంగ్ ఉంది షూటింగ్ ప్రారంభిద్దాం ఇక్కడున్న జూనియర్ ఆర్టిస్టులతో కొంత సేపు ప్రాక్ట్స్ చేయండి.  “సార్ నేను హీరోయిన్ రోల్ కోసం వచ్చాను సార్ , అది లేకపోతె చిన్న కామియో రోల్ అయినా వేస్తాను కానీ మొదటి సినిమా ఐటం గర్ల్ అంటే ఇంకా వచ్చే వన్నె అలాటివే  వస్తాయి.” లేదు వస్తాయి అని వినోద్ నమ్మబలికాడు కానీ లకుమ ఒప్పుకోలేదు. " సరే అయితే ఈ రాత్రి రూమ్ నెంబర్ 205 కి రండి మనం డిస్కస్ చేద్దాం. చూద్దాం నెక్స్ట్ ప్రొడక్షన్ ట్రై చేద్దాం. లకుమ వెళ్ళిపోయింది.         

                                                                   ***

ఆ విశాల మంటపంలో కశ్యప్ వినోద్ తప్ప ఎవ్వరూ లేరు "అరే  ఛ త్  పిట్ట ఎగిరిపోయింది  ఏ క్యా హాయ్  కశ్యప్? "  కశ్యప్ "థోడా దాల్ డాల్నా పడేగా, ఏ బ్యూటీ  క్వీన్ హై ఔర్ సెక్సీ భీ హై! ఏ ఐసే నహీ మానేగీ "               

"అరె భాయ్ శ్యామ్  రైటర్ కో బులావ్ అసిస్టెంట్ కి పురమాయించాడు వినోద్ భాయ్ బులార హే హై  రైటర్ ని తీసుకొచ్చాడు "అభీకీ అభీ ఏక్ స్పెషల్ అపెయర్స్ రోల్ బనావో " అన్నాడు వినోద్ భాయ్ రైటర్ తో 

" కితనే స్పెషల్ అపెయర్స్  రకూం  ఆల్రెడీ దో హమే రక్ దియా"   "అరే భాయ్ ఏ దోనొం కో హాఁ నికాల్ దెంగే" 

నీయబ్బ నీకు మధ్యాహ్నం ఒకర్తి ,  రాత్రి ఒకర్తి  కావాలి , నీ  సినిమాల్లో జనాలకి చెప్పే నీతులు  శీలం , మానం  పవిత్రత ఆడదానికి చాలా ముఖ్యం అని చెప్తావు. ఇవి చూసి పిచ్చిపువ్వులు నిజమే అనుకుంటారు అని మనసులో అనుకుంటు జీ సార్ , స్క్రిప్ట్ రాసుకుని  ఇప్పుడే వస్తాను  అని రైటర్  వెళ్ళిపోయాడు    

మొత్తానికి రైటర్ ని రేప్ చేసి రెండు రోల్స్ పెట్టించి ఇద్దరమ్మాయిలని .. ఆ 

హ  హ హ.. మన ఫీల్డ్ లో ఇవన్నీ తప్పవు కశ్యప్ 

నీకు మధ్యాహ్నం ఒకర్తి ,  రాత్రి ఒకర్తి  కావాలి అని నవ్వుతూ రైటర్ అనలేకపోయిన  మాటనే మిత్రుడు కనుక కశ్యప్  అనేశాడు కానీ సమాధానం చాలా గట్టిగా ఇచ్చాడు  వినోద్ భాయ్ " సినిమా వాళ్ళు దేవుళ్ళు ఒకటే "

తో పూజా కరూన్  హారతి ఉతారూన్ ! పది మంది తో సెక్స్  మళ్లీ దేవుళ్లతో పోలిక అన్నాడు నవ్వుతూ కశ్యప్ 

పురాణాలు సమంగా చదువు. చదివినా ఉపయోగం ఉండదు , కలర్ బ్లైండ్  వాడికి  బ్లూ , గ్రీన్,  రెడ్ కనిపించవు. చదివినా నీకు అర్థమయ్యేది ఏమీ ఉండదు. జామర్ ఉన్న ప్రదేశంలో సెల్ ఫోన్ పనిచేయదు . ఇండియా బైటకు వెళ్లి కొంతకాలం అక్కడ నివసించి  ఆలోచించు.   

 సరే ఇంతకీ నేను తీసుకొచ్చిన అమ్మాయికి కూడా ఒక చిన్న రోల్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత ఆ రోల్ పీకేస్తావ్ అంతేగా?

నో నో నో అలా చెయ్యను నేను తప్పులు చేస్తాను కానీ  అబద్దాలు చెప్పను, చెపితే క్రెడిబిలిటీ పోతుంది ఈ అమ్మాయి నాకు నచ్చింది కొంత కాలం కావాలనిపిస్తోంది అందుకే మంచి రోల్ ఇస్తాను. 

                                                                            *** 

 ఇదంతా ఒక గంటలో జరిగిపోయింది లకుమ తన హోటల్ రూంకి చేరగానే శ్యామ్ నుంచి ఫోన్  ఫోన్ వచ్చింది. లకుమ మళ్ళి లలిత్ సెవెన్ స్టార్ హోటల్ చేరుకొని సెట్ లో ప్రత్యక్షం అయ్యింది.  "నీకు ఈ ఫిలిం లో స్పెషల్ రోల్ సృష్టించి ఇస్తున్నాను , ఇప్పుడు డాన్స్ చేయడానికి అభ్యంతరం లేదుకదా" అన్నాడు వినోద్.  లకుమ సెక్సీ దుస్తులు వేసుకొనిసిద్ధం  అయ్యింది. నిన్న తీసిన పాటే కదా ఇది అన్నాడు కెమెరామెన్. అది తీసేస్తున్నాం ఆ అమ్మాయి రోల్ కట్ చేసేసాను  మరి  డాన్సర్స్  లేరు కదా ఎలా అన్నాడు కెమెరామెన్ . అరే మర్చిపోయాను , ఈ రోజుకి నువ్వు  కూడా వెళ్లొచ్చు కెమెరా  నేను చూసుకుంటాను అని కెమెరామెన్ ని పంపించేశాడు. షీలాకీ జవానీ ని పోలిన సెక్సీ సాంగ్ కి లకుమ లకుమ అత్యద్భుతంగా డాన్స్ చేసింది.   మూడు సార్లు డాన్స్ చేయించాడు. కెమెరా ఆన్ అయినా  చేయలేదు.  ఎక్కడపెడితే అక్కడ తాకుతూ తానూ కూడా డాన్స్ చేసాడు. 

                                                                        ***

“లకుమా ఇదంతా కామన్.” “నేను వీడిని వదలను నన్నెక్కడపెడితే అక్కడ టచ్ చేసేసాడు. నేను కంప్లైంట్ చేస్తాను.” “కంప్లైంట్ చేసి లాభం లేదు, అయినా ఎవరికీ కంప్లైంట్ చేస్తావ్?” “ప్రొడ్యూసర్ తో చెపుతాను!” ఏంటీ ప్రొడ్యూసర్ తో చెపుతావా! నీకో విషయం తెలుసా ప్రొడ్యూసర్ వీడి బాబే! వాడు వీడు కలిసి ఒకే దాన్నితగులుకున్నారు తరువాత కొడుకు దాని పెళ్లి కూడా చేసుకున్నాడు. మన తెలుగు సినిమాల్లో హీరో ధనార్జన తన కొడుకులాగా. ధనార్జన అటు వంటివాడా. కమల వూరుకుందా?  అది బయటకి కనిపించని దొంగ దానికి బాయ్ ఫ్రెండ్స్  ఉన్నారు. హైద్రాబాద్ లో కాస్టింగ్ కౌచ్  గురించి విన్నావా శ్రీరెడ్డి , దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు ముద్దు పెట్టుకున్నాడని కంప్లైంట్ ఇచ్చి బట్టలిప్పుకొని రోడ్డుమీద కూర్చుంది . కవరేజిలిచ్చి చానెల్స్ వాళ్ళ తీ ఆర్ పీలు పెంచుకున్నారు తప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా. రుజువులడిగితే ఫోటోస్ చూపించింది, ఏంజరిగింది , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ ఆవిడని డిస్మిస్ చేసేసాడు.

నాకు చాలా షాకింగ్గా ఉంది సంజయ్ సాబ్ మంచివాడు అని నువ్వంటే వాడొట్టి వెధవ అన్నాను. వినోద్ తో పోలిస్తే వాడు మంచివాడే. వాడు అడిగి ఊరుకున్నాడు. కానీ వీడు మర్యాదగా మాట్లాడి  రప్పించుకుని అంతా  టచ్ చేసేసి చాలా .... చేసాడు. రూంకి రమ్మన్నాడు. 

నువ్వు వచ్చేసావు , ఊ బెట్టు చేయడం మంచిదే . నువ్వు పెద్ద ఫిలిం ఏక్ట్రెస్ వి చిన్న పిల్లలా బాధ పడకూడదు ! లకుమా నువ్వు యాభై ఫిలిమ్స్ లో నటించేవు కదా మొదటి ఫిలిం లో ఎంత గౌరవం పొందావు? యాభయ్యవ ఫిలిం లో ఎంత గౌరవం పొందావు? నువ్వింకా ఇప్పుడే అడుగు పెడుతున్నావు, అది మర్చిపోకు , మనకి ఒక బ్రేక్ వచ్చేవరకు తప్పవు ఈ సమస్యలు , తెలుగులో నీకు ఎవరైనా వేషాలిస్తున్నారా ? ఇప్పుడేమీ రావటం లేదు కదా, ఊరకనే వెయిట్ చేస్తూ కూర్చుంటానంటే పద హైద్రాబాద్ పోదాం. నాడైరెక్షన్ లో నీకెప్పుడూ ఛాన్స్ ఉంటుంది. "వొద్దొద్దు ఇప్పటికే నీకు నాకు అఫైర్స్ ఉన్నాయి అని పేపర్లు ఛానెల్స్  లో  హోరెత్తిపోయింది నేను వేరే ఎక్కడా అవకాశాలు లేక నీకు ఉంపుడు గత్తెగా మారానని అనుకుంటున్నారు." 

ఈ ఫిలిం లో చెయ్యి నువ్వు తారాపథంలో వెలుగుతావు. థాంక్స్ నువ్వు నాకు ఆ హాప్ ఇస్తున్నావు. చీర్స్ ఫర్ ద హోప్ ఇద్దరూ మొదటి రౌండ్ పూర్తి చేశారు. లకుమ సిగరెట్ వెలిగించింది తమాషాగా పోగొదు లుతోంది . బలే గుందే నీయమ్మ పిట పిట పిట్ట సినిమాకోసం నేర్చుకొన్నావుకదా ఈ సిగరెట్టు , నువ్వు సిగరెట్ తాగుతుంటే చాలా సెక్సీ గా ఉంటావే నిన్ను చూసినోడు ఎవ్వడూ వొదలాలనుకోదు  ఏయ్ అలాఅని నన్ను వాడితో పడుకోమంటావా? రెండవ రౌండ్ పూర్తయ్యి మూడవ రౌండ్ పోసాడు.  షిట్ ఈ హౌస్ వైఫ్ మోరల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకోసం మనలాంటి తారాల కోసం కాదు. ధర్మేంద్ర భార్య ఉంటుండగా ముస్లింగా మతం మారి హేమామాలినిని చేసుకున్నాడు. ఒదులు కున్నాడా? నయనతార కోసమే కదా రెండవ రౌండ్ పూర్తయ్యి మూడవ రౌండ్ పోసాడు.  షిట్ ఈ హౌస్ వైఫ్ మోరల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకోసం మనలాంటి తారాలకోసంకాదు. ధర్మేంద్ర భార్య ఉంటుండగా ముస్లింగా మతం మారి హేమామాలినిని చేసుకున్నాడు. ఒదులు కున్నాడా? నయనతార కోసమే కదా ప్రభుదేవా పెళ్ళానికి విడాకులిచ్చేశాడు. కరీ నా కపూర్ సైఫ్ ఆలీఖాన్ కోసం తన  బాయ్ ఫ్రెండ్ షాహిద్ కపూర్ ని వొదిలేయాలా , సైఫ్ ఆలీఖాన్ కి అమృతా సింగ్ (మొదటి భార్య) తో  పెళ్ళి అయినప్పుడు కరీనా కపూర్ 12 ఏళ్ల   పిల్ల "  హేపీ మేరీడ్ లైఫ్ అంకుల్" అని చెప్పింది. రాజేష్ కన్నకి, దేవానంద్కి ఎన్ని ఖాతాలు ఉన్నాయో లెక్క లేదు. సౌత్ లో  అఫైర్స్ మైంటైన్ చేయడం కమల్ హాసన్ ప్రారంభించాడు అఫైర్స్ మైంటైన్ చేయడంలో కమల్ కి   పీ హెచ్ డి  ఉంది. “ఒరేయ్ నీ కెక్కింది కదా వాగుతున్నావు, నాకు ఎక్కింది, నాకెక్కితే నిద్రొస్తుంది నీకెక్కితే వాగుతావు” అంది లకుమ.

అలా చేస్తే సమాజంలో మనకుండే గౌరవం . షిట్ మన కనిపిస్తే పొంగిపోతారు , మన ఫోటోలు వేసుకుని పత్రికలవాళ్ళు బతుకుతారు, అవి చూసి ప్రజలు మురిసిపోతారు. లక్షలాదిమంది మన అభిమానులని చెప్పుకుంటారు , అవకాశాల్లేనివాడు మన  మీద పడి  ఏడుస్తాడు తప్ప  అవకాశం ఉంటె ఎవ్వడూ వొదులుకోదు . టక్ టక్ టక్ తలుపు చప్పుడు అయ్యింది, లకుమ తలుపు తీసింది. డైరెక్టర్ వినోద్. లకుమ నువ్వు ఒప్పుకున్నదానికంటే ఎక్కువే ఇవ్వాలని నువ్వు కోరినట్టు నీకు హీరోయిన్ రోల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను.   ఆ గుడ్ న్యూస్ నీకు చెపుదామని వచ్చాను.    


Bharatavarsha -83

మధురవాడ క్షేత్ర గృహము బాగుగా రంగు పూసిన బొంగరమువలె నీటియందు తేలుచున్న నౌకావలె మెరియుచుండెను. సందీపుడు ఇచ్చటికి వచ్చుట అరుదు. అందు  మెర్సిడెస్ మహారాణి వసించుచుండును. అప్పుడే వచ్చుచున్న పెంచలయ్య ను చూచి సందీపుడు "నాన్నా నాన్నా దూరవాణికి దొరకక  ఎక్కడ  తిరుగుచున్నావు , రాత్రాంతయూ నీకొరకు ప్రయత్నించుచూ నాకు పిచ్చి పట్టినది, " అయ్యో నీకూ పట్టిందేట్రా  పిచ్చి . అదృట్టం నాకు పట్టిన పిచ్చిఒగ్గేసింది  . అదృష్టం నాకు రేత్రి పట్టిన పిచ్చితో పాటు ఎం ఎల్ ఏ పిచ్చి కూడా ఒగ్గేసింది.  నిన్న  రాత్రి ఈ క్షేత్ర గృహమునకు నీకొరకు వచ్చి చూడగా  అప్పుడే నీవు  బైటికి వెడలినావని ఇచ్చటి కావలి బృందం చెప్పగా నీకొరకు వేచియున్నాను. రాత్రి విహారయాత్రలు చేయుచుంటివా ! అతి ముఖ్యమైన విషయమొకటి చెప్పవలెన" ని కోపముతో రేగుతున్న సందీపునికి రాత్రి జరిగిన సంఘటనను వివరించి,  పోలీసులను ఎట్లు  వేడుకొని పిర్యాదు వెనుకకి తీసుకొనేనో ,  భారతవర్షను విడిపించి ఎట్లు మాలిని గారిని క్షమాపణ వేడుకొనెనో తెలిపి శాంతిపజేసెను. "రేత్రి నిద్రలేదురా నాను  పండుకొంటాను, నువ్వు పడుకోరా ఇంక ఆళ్ళ జోలికెళ్లను. నువ్వు కూడా ఆల్ల గురించి మరిసిపోరా, ఆల్లువద్దు , ఆపిల్ల వద్దు. తొందరలో పాస్టరుగారి అమ్మాయితో నీ  పెళ్లి సేసేస్తాను." అని మంచంపైన వాలుచున్న తండ్రితో  " నాన్నా ఇప్పుడు పెళ్లి మాటపక్కన పెట్టి నేను చెప్పెడిది వినుము చెల్లి గొంతు కోసుకొనుటచే విశాఖపట్నము ఆశుపత్రిలో వేసినాము. " మాట పూర్తి అగుచుండగానే వాహనము విశాఖపట్నము బయలుదేరెను. 


మార్గమంతయూ పెంచలయ్య లబోదిబో మనుచూ వాహనమును నడుపుచుండెనుఆసుపత్రి చేరగానే ఒక్క ఉదుటున లంఘించి వైద్యులని కలిసి నందిని నుంచి న ప్రత్యేక గదికి పోయి ఆమెను చూచి విలపించసాగెను. అక్కడున్న డాక్టరు గారు ఆమె నిద్రించుచున్నదని జెప్పి  నోరు పెట్టరాదని హెచ్చరించి ఆపై అతడిని ఓదార్చి వెడలిరి . అప్పుడు గాని అతడు చేతికి కట్టు కట్టుకొని ప్రక్కనే ఉన్న భారతవర్షను గమనించలేదు. 

మీరు ఈ దెబ్బలతో విశ్రాంతి తీసుకొనక ఇట్లు వచ్చినారేమీ అని అడుగగా చేతియెముక సూక్ష్మముగా బీటవారినది ,గాయములు మందు రాసి  కట్టుకట్టి  నేటికి విశ్రాంతి తీసుకొని రేపు పొమ్మనిరి నేను అమ్మ చెల్లితో క్రింది అంతస్తులో నున్నాము , ఇంటికి  పోవుచూ నందినిని చూచిపోవలెనని వచ్చితిని

 ఏమండీ భారతవర్షగారు   నేను చేసిన పొరపాటుకు నాబిడ్డ బలిఅగుచున్నది అని వర్షునితో అనుచుండగా మందులు కొనుటకు క్రిందకి పోయి న పైడమ్మ సందీపునితో కలిసి వచ్చెను. మంజూష మాలినిగారు కూడా వెంట వచ్చిరి.  

పైడమ్మ:  రేత్రంతా పోనాపీసి  తొంగుండిపోనావు ఇప్పుడు తీరికయ్యిందేటి  ఆబాబుకి కుడి సెయ్యిరిగిపోనాది బుర్ర కి బొక్కడిపోనాది నువ్వు సేసింది పొరపాటు కాదు పాపం, పాపం సేసినోన్నిఆ పెబువు సమించడు అని పైడమ్మ భర్తను తూర్పారబట్టెను .

మారిపోయినోణ్ని అంటే నీకే పాపమే పైడి “అనుచుండగా సందీపుడు విదిష ఉదంతమునెఱిగించి నాన్న మారుట కాదమ్మా ఆ ఆదిపరాశక్తి నేమి చేయజాలక గత్యంతరం లేక పోలీసులవద్దకి పోయి పిర్యాదు వాపసు తీసుకొనెను.  దాసుకి, ఆది మావకి ఆరూపము చూచి జ్వరము వచ్చి నోటిమాట పడిపోయెను. 

పైడి :ఓలమ్మోలమ్మో, ఆ దేవుడమ్మ జోలికెల్ల కురా నల్లని నలిపినట్టు నలిపేత్తాది!

నందిని కళ్ళు తెరచి "ఇంకా నన్ను చూడ్డానికి వచ్చారా అమ్మా నామీద మీకు జాలిగిననూ నాపై నాకే అసహ్యము కలుగుచున్నది. నాకు జీవితమూ పై విరక్తి కలుగుచున్నది కలుగుచున్నది. 

పైడి :అవన్నీ మరిసిపోయే నువ్వు బతకాలి నువ్వేటి తప్పుసెయ్యనేదే 

సందీ : చెల్లి,  నీవట్లనినచో నేను వర్షను కొట్టినాను నేనేమి చేయవలె ? నాకునూ బ్రతుకన్న చీదర పుట్టుచున్నది!

పెంచ :ఎట్రా చిన్న  తప్పు సేసినోళ్లంతా సచ్చిపోతామంటారు పెంచలయ్య తల్లడిల్లిపోయెను 

మాలి: తప్పమ్మా చిన్నపిల్లలు ఏంటో జీవితము మీ ముందున్నది మీరు తల్లిదండ్రులముంద ట్లు మాట్లాడరాదు. మీ కుటుంబము పచ్చగా ఉండవలెను.  

నంది: నాన్న మొదట గురువుగారిపై బురద జల్లించితివి , తరువాత వారి తల్లిని అవమానించితివి , తరువాత ఆయనని జైల్లో వేయించితివి. నేడు వారు మనకుటుంబము చల్లగా ఉండవలెనని దీవించుచున్నారు. క్రీస్తు నీ బోధలోనే తప్ప నీ ఆచరణనందెచ్చటనూ కనిపించుటలేదు 

వర్ష: నందిని నీవెక్కువ మాట్లాడరాదని డాక్టర్లు చెప్పినారుకదా  మాట్లాడవలదు గాయము లోతుగా కానందున కొద్దిగా కుట్లు పడినవి అని పెంచలయ్యవైపు చూచి చెప్పి, నీ అల్లరి ఎక్కువగుచున్నది ఇప్పుడవన్నీ తలచి వగచి పనేమి కలదు ? గతం గతః  నేనవి ఎప్పుడో మరిచితిని.  అని నందినికి చెప్పెను   

మీరుచెప్పినచో తప్పక పాటింతును అని మాటలాపి  సైగతో  సందీపుని పిలిచి   మంజూష చేతిని అతడి చేతులో నుంచెను. పైడమ్మ ఈ బంగారు బొమ్మే  నాకోడలు  అని  మంజూషని దగ్గరకు తీసుకొనగా భారతవర్ష మొఖము ఎర్ర బారెను. అది చూచి  నందిని మొఖమున నిరాశ తొంగి చూచూచెను. పెంచలయ్య లోక్యమెరిగిన వాడగుటచే  క్షణామా లసించక మాలినిగారి పాదములపై బడి క్షమాపణ వేడెను. అప్పుడు మాలినిగారు చిన్నగా నవ్విరి అది చూచి  వర్షుడు నవ్వెను , వర్షుని చూసి నందిని నవ్వెను, నందినిని చూచి పెంచలయ్య నవ్వెను , అది చూచి సందీపుడు తన చేతిలో నున్న  మంజూష చేతిని మెల్లగా  నొక్కెను , మంజూష  సిగ్గిల్లెను. ఆమె బుగ్గలెర్రబారెను.   

                                                                            ***

ఇంతలో డాక్టర్ గారు వచ్చి భారతవర్షను  తన  గదికి పోయి విశ్రాంతి తీసుకొని సాయంత్రము ఇంటికి పంపెదమని తెలిపిరి.   పైడమ్మ , మాలిని రాత్రి నిద్రలేమిన  బడలికతో ఎక్కువసేపు కూర్చొనలేకపోవుటచే వారునూ  సందీపుని మంజూషని తీసుకొని ఇళ్ళకేగిరి.  డాక్టరు గారు పెంచలయ్య మాత్రమే నందిని గదిలో నుండగా 

పెంచలయ్య : డాక్టరుగారు మా అమ్మాయి కేమీ కాదుకదా ! గొప్ప పండితురాలు 

 అని మెచ్చుకొనుచూ అతడికేమీ తెలియదనుకొని ఆ వర్షుడి వల్లే నాకూతురికీ 

గతి పెట్టెనని  అతడిని నిందించుచుండగా డాక్టరు " అయ్యా పెంచలయ్యగారు మీసంగతి మీకుటుంబ సభ్యులు చెప్పుచుండగా  ఇప్పుడే తెలిసినది కానీ భారతవర్ష నాకెప్పుడో తెలియును. అతడి గూర్చి నా ఒక్కడికే కాక జగమంతటికీ  తెలియును. అనుచుండగా 

పెంచలయ్య " మీ యభిమాన మలగుంది , జగమంతా తెలిసిపోయే కత ఎక్కడుంది ?" అని " నా పోగ్రాంలు కూడా టీ వీ లో ఒత్తంతాయి  అండీ. , మీరెప్పుడు సూడనేదేటి ?

అయ్యా మీరు డబ్బు చెల్లించి వారి సమయమును కొనుక్కొని ప్రోగ్రామ్లు ఇచ్చుచున్నారు , దానికి మీరింత బడాయి పోవుచున్నారు. ఆయనకీ సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడెను. ఆయనకీ తెలిసిననూ సందర్భము కాదని మీకు చెప్పలేదు . 

ఎందుకు సెప్పనేదు అవునెందుకు  సెప్పనేదు అని అతడి ప్రాణము తీయుచుండగా " Empty vessels make much noise" అను సామెత కర్దము తెలియునా? అని  అడిగెను  తెలియదని పెంచలయ్య  చెప్పగా మీ అమ్మాయి నడిగి తెలుసుకొనుడని చెప్పి వెడలిపోయెను. నందిని అంతయూ విని ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. ఇంతలో పెంచలయ్య వాహనమును చూసి పసిగట్టిన వర్షుని అభిమానులు పెంచలయ్య నశించాలి అని అతడి కారు వద్ద అరుచు చుండగా రక్షణ అధికారులు వారిని  ఆసుపత్రి బయిటకు పంపివేసిరి . అయిననూ వారు కదలక ఆసుపత్రి ముందు నిలిచి అరుచుచుండిరి. రెండవ అంతస్తునుండి ఇది చూచినా పెంచలయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పది నట్లయ్యెను. అతడాముదము తాగినట్టు మొఖం పెట్టగా నందిని " నాన్న విచారించ పనిలేదు  ఈ ఆసుపత్రికి వెనుక త్రోవ ఎచ్చటున్నదో  తెలుసుకొనుము " అనగా పెంచలయ్య మొఖం వెలిగిపోయెను. 

అతడు వెడలినపిమ్మట నందిని వర్షుని గదిలోకి పోయిఅతడి చెక్కిట ముద్దిడగా వర్షుడు తీవ్ర కలతనొందెను నీవు పడుకొని యుండక ఇచ్చటికేలా వచ్చితివి అని ముద్దుగా కసరగా "ఇప్పుడు పోవుచున్నాను మనమిద్దరమూ ఒక కుటుంబమగుచున్నాము, అప్పుడు అధికారికంగా మీ ఇంటికొచ్చెదను, మరదలినప్పుడెట్లు  పొమ్మందురు బావగారు  అని  కొంటెగా చూచుచూ అభినందనలు తెలిపి తన గదికేగెను. 

   

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...