Tuesday, September 7, 2021

భారతవర్ష లో స్నేహ ధర్మం - మానవతా విలువలు

 ఒకడు నోరిప్పితే అసభ్యంగా మాట్లాడుతుంటాడు. వాడి ప్రవర్తన చాలా దారుణం గా ఉంటుంది. అలాటి వాడికి సభ్య ప్రవర్తన నేర్పాలంటే మనం ముందుగా ఏంచేస్తాం ? ఏం  చెయ్యాలి?  మంచి భాష నేర్పాలి. తర్వాత సభ్య ప్రవర్తన అదే వస్తుంది.  ఈ రెండు లేని వాడు ఎందుకూ కొఱగాడు. అటువంటి  - ఎందుకు కొరగాని - వ్యక్తి బసవడు.  



మొదటిలో  బసవడి  భాష ప్రవర్తన 

 1. బైక్ కొనలేక పోయావు, థూ! కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కూడా కొనలేకపోయావ్, మా కాలేజీకొచ్చి చూడు ప్రతీ ఎర్రిపప్పకి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అందరూ బైక్ల మీద కాలేజీకి వస్తుంటే నేను మాత్రం మూడేళ్లనుంచి బస్సులలో తిరుగుతున్నాను.   చేతగానప్పుడు పిల్లల్ని  కనకూడదు

2. దీనమ్మ బేక్ లాగ్స్ , ఎప్పుడు బండి కొనమని  అడిగినా , సెల్ కొనమని అడిగినా నాన్న   బేక్ లాగ్స్ అంటాడు. నువ్వు  చెల్లిని చూబెట్టి  నాకు దొబ్బులు పెడతావు. మీరు నాకేమిచ్చారు, కని పడేసారు , ఆఖరికి పేరుకూడా బసవయ్య అట , చెప్పుకోడానికే సిగ్గేస్తోంది , అందుకే బన్నీ అని చెప్పుకుని తిరుగుతున్నాను

2. అక్కడ ప్రోగ్రాం అయిపోయాక బిర్యాని  పెడతారా?" అన్నాడు పక్కనుంచి నడుస్తూ బసవయ్య. ముందే పెడతారు అని  అగస్త్య అనగా బసవయ్య మరి మారు మాటాడకుండా వెంట నడిచెను. వారు ఇరువురు ఆనందనిలయం ...

నేటి దిగజారిన యువతకి ప్రతినిధి బసవడు. ఆంధ్ర రాష్ట్రంలో సగటు యువత కి దర్పణం బసవడు.  ఉచితంగా వచ్చేది ఏది వదలడు. బైక్ సెల్ ఫోన్ కోసం తల్లి తండ్రులని వేధిస్తూ  సినిమా మోజులో పడి సంప్రదాయాలని ద్వేషిస్తూ , తన సంప్రదాయమైన బసవ అనే  పేరుని కూడా కత్తిరించుకుని సినిమావాళ్ళ లా  బన్నీ అని చెప్పుకుంటూ  ఇంజినీరింగ్ పరీక్షలలో డింకీలు కొడుతూ ఉంటాడు. భోజనం ఉచితంగా పెడుతున్నారని  భారతవర్ష ఇంటికి వెళతాడు. అంతే అలాటి మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు    

భారతవర్ష అగస్త్యతో బసవడి గురించి  : 

నీవు అవధానప్రక్రియకు ముందే ఈ విషయము నాతో చెప్పినావు , కానీ వాడు వచ్చిన పనియేమి చదువు అనిన వాడికి చుక్క ఎదురు కదా ! అని భారతవర్ష యనగా వాడిచ్చటకు వచ్చినది తినుటకు మాత్రమే అని అగస్త్య చెప్పెను.  "ఒకడు తిన్నచో మనకు నష్టమేమియునూలేదు కానీ, ఎంతకు చెడినాడోయి, అయ్యయ్యో! రజోగుణముచే ప్రేరేపితుడయ్యి  లోభమున పాతాళము జేరినాడు కదా.  చిన్న పెద్దల మధ్య అంతరం గమనింపక  తల్లిని గొట్టి  హీనుడయ్యి తమస్సున యాతనపడు జీవి   ఉచ్చ నీచ వ్యత్యాసములు గణింపక ఉచితముగా వచ్చినదేదైనా స్వర్గమని భావించును.

ఇలాటి బసవడు సభ్య భాష నేర్చు కోడమే కాకుండా తన  భాషతో అందరినీ ఆశ్చర్య పరుస్తాడు. 

1. కొండకచో బూతు సంభాషణములను నెరుపుచు కాలహరణము చేయుటకు సభలో   నీచులంద ధముడొక్కడు, ఆంగ్లసర్పద్రస్టుండై ఆంగ్లమునాలింగనమును జేసుకొని శ్లాఘించుచుండ  "పరపిండము తస్కరింపబూనిన పరేతుఁడి(ప్రేతాత్మ) వలెనున్న   మ్రుచ్చుడెవ్వఁ డీవు ? " యని బసవడు నిప్పులు కక్కుతాడు  

2.  ఎలెక్ట్రిషన్ ని పిలిచిన యెడల మైక్ సరిచేయును” అని ఒక నిర్వాహకుడు అనగా, బసవడు  ఇట్లనెను

ఓవిద్యుత్వేత్తా, ధ్వనిపెంపు యంత్రోద్దారకా, సమయపాలన కాటంకమగుచున్నది  యంత్రమును సరిజేసి  కవి పండిత వరేణ్యులాశీనులైన ఈ విద్వాంసవిరాజమాన సాహితీసభను నిర్విఘ్నమొనర్చరయమున రమ్ము.”యని ఆశుకవితా ప్రజ్ఞనందరినీ అలరించెను.

3.  భారతవర్ష ఈ సాహిత్య సభను నిర్వహించుటమిక్కిలి ఆనందదాయకము, అందులకార్ధికసహాయము చేయుచున్న సాహిత్యమండలి అధ్యక్షులు. శ్రీ పైడిరాజుగారికి, ఇతర సభ్యులందరికి నా నమోవాక్కముల నర్పించుచున్నాను. పండితులకు  ఉన్నతులకు  వేడుకగల్గించు ఈ సాహితీ రూపకం    ప్రారంభకులకు సదావకాశము.  వేదజ్ఞుఁడు,  అవధాని , కవియైన భారతవర్ష  సరసన నిలుచుటయైన నావంటి అల్పజ్ఞానుల సుకృతము. విద్యాంసుల ఉచ్ఛ్వాసనిశ్వాసములైననూ, విదుషీమణుల నూపురముల ఘోషయైననూ, జ్ఞాన ప్రేరితములు,స్ఫూర్తిదాయకములు. ఈ తెలుగు సాహిత్య సభకు  మంగళమగుగాక!!! 

ఆరు నెలలలో బసవడిలో  వచ్చిన మార్పునుజూసి మిత్రులందరూ విస్మయమొందిరి. బసవడి  తల్లిదండ్రులు, బుచ్చమ్మ,సర్రాజు అమితానందమునొందిరి. గర్వమున కించిత్తు గగుర్పాటు కూడా కలిగెను.

  

11 వ భాగం లో సాహిత్య సభ ముగిసిన రాత్రి  ఇంటిదారిలో 

సాహిత్య సభ నుంచి నడుచుకుని వస్తున్నప్పుడు. రాఘవ జెఫ్రీ షాజార్  కాంట్రబురీ టేల్స్ ఆంగ్ల సాహిత్య చరిత్ర లో అత్యంత ప్రాముఖ్యతను కలిగిన గ్రంథరాజమని అనిచెప్పెను.భారతవర్ష  కాంట్రబెరి టేల్స్ గురించి  చెప్తాడు.   బైరిరెడ్డి, సందీప్ లకు భారతవర్ష భాష కొంచము కష్టము అనిపించగా  బసవడు వారికి అర్ధమయ్యే  చలన చిత్ర భాషనందు   ఆద్యంతమూ నవ్వు తెప్పించేలా చెపుతాడు


33 వ భాగం లో రమ్య చందన పుట్టినరోజున 

బుచ్చెమ్మగారు పుణుఁకులు, పాలకాయలు పులిబొంగరములు వంటి పలు భక్ష్యములు జేసినారు, వంటగదిలో పీట వేసి అగస్త్యను పిలిచి ఆరగించమనిజెప్పి “నేడు బసవయ్య చెల్లి రమ్యచందన పుట్టినరోజు  ఒక కవిత చెపుతాడు  "జివజివ జివ జివ లాడుచున్నది దేహము జిల్లని లాగుచున్నది ప్రాణము" అని.  అగస్త్య చెప్పిన కవిత కంపరం కలిగిస్తున్నదని చెప్పి  బసవడు చెప్పే కవిత అతడి భాషా పటిమను చూపించేలా ఉంటుంది బసవడు ఇలా చెప్తాడు 

నీ ఆధర రాజీవముల సొంపారు శోణిమ శోభలు నిర్జించు నింగి కెంజాయలనైన, నీ చలచ్చంచల నేత్ర సౌందర్యచాతుర్యమహిమ అబ్బునే మేటి పద్మంబులకైన, గుబ్బరాసుల రాసికెక్కిన గిబ్బరాసిని గాంచి గుబ్బతిల్లవె రసికడెందంబులెల్ల, నీలజీమూత సంకాశ చారు కేశముల్ నర్తించవే చంచజ్జఘనాంగి జఘనమెల్ల ,  నీ ముత్తెంపు మేని కాంతులన్ చూచి  పాలిపోవె  పారిజాత పుష్పంబులైన  అని చెప్పిన   బసవడి ఆశుకవితావనమున  మరుమల్లి, బంతి, చామంతి, సన్నజాజివంటి పుష్పములు వికసించెను 

50 వ భాగం లో శ్రీ కృష్ణ తులాభారం నాటికలో 

ఇంతలో అయ్యో  శిల వంటి నా శిరమును తాకి నీపాదము కందెనేమోయని వర్షుడు సత్య భామ  పాదములొత్తు చుండెను ప్రముఖ వార్తాపత్రికల పాత్రికేయుల సమూహము అచ్చట మోహరించి ఛాయా చిత్రములు గ్రహించు చుండిరి. కృష్ణుని గాన మాధుర్యము సత్యభామ సౌందర్యమున రసహృదయములు తడిసి ముద్దయినవి  అని ఒక పాత్రికేయుడు ప్రశంసించ బసవడు  లేచి తన ఆశుకవితా ప్రతిభను  చూపి గట్టిగా పద్యమును పాడెను. 

"రంగస్థల మంతయూ  బహుళ కాంతులు  భాసిల్లు చుండ గా నొక్క కాంతయే కాంతి 

నంతయూ గొని  కుందన చందము తులకరించ, కన్నార్ప మరిచె కళామందిరము." 

తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టు కుంటాడు. పార్వతి అనే చిన్నదాని మనసు గెలుచుకుంటాడు. ఆమెని పెళ్ళాడి   ఆమె  మనసులో కోరిక తెలుసుకొని  వీణ బహుమతిగా ఇస్తున్నప్పుడు  అతడు ఎంత సున్నిత మనస్కుడో అర్ధం అవుతుంది  అగస్త్య అనే స్నేహితుడిని  కుట్ర నుంచి  బైటకు లాగడానికి సాయం చేస్తున్నప్పుడు అతడి మంచి తనాన్ని స్నేహ ధర్మాన్ని  మెచ్చుకో కుండా ఉండలేము.  అదే అగస్త్య  తప్పుచేస్తే ( సుందరిని మంచితనాన్ని ఆసరాగా చేసుకొని ఆమె జీవితాన్ని ) అగస్త్య కి బుద్ధి చెప్పడాన్ని చూసినప్పుడు అతడి ధర్మ బుద్ధిని చూస్తాం.   

ఢిల్లీ  ఆంద్రభవన్ లో ,  బల్లిపాడులో , ఆనందనిలయం లో , మధురవాడలో, కలువుప్పల పాడులో  అనేక సందర్భాలలో బసవడు పాడిన ఆశు కవితలు ఒక పుస్తకం గా కూడా వేయొచ్చు. బసవడి  పాత్ర మలసిన తీరు చూస్తే రచయిత రచనలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో  అర్ధం అవుతుంది.  ఇలా ప్రతి పాత్రలోనూ స్నేహ ధర్మం కనిపిస్తుంది . ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు ఒక స్నేహితుడి( భారతవర్ష )వల్ల మారిన బసవడు మరొక స్నేహితుడి (అగస్త్య)ని మారుస్తాడు. ఇలా అనేక పాత్రలు  స్నేహబంధాన్ని సమోన్నతంగా నిలబెట్టి   మానవతావిలువలను ధర్మ బుద్ధిని చాటుతాయి.  

బసవడు పార్వతివద్ద కూర్చొని భోజనము చేయవలెనని   ఉవ్విళ్ళూ రుచుండగా అరుణాతార  బసవని " నీవు ప్రాస మాత్రము కలిగిన   అర్థ రహితమగు కవిత చెప్పినచో పార్వతి ప్రక్కన నేను విస్తరి వేసి వడ్డించెదనని  చెప్పగా బసవడు  కాబూలీవాడిని చూచిన  భ్రాంతి నొంది  " ప్రయత్నించెదన”ని  మొదలు పెట్టెను.      

బండ గుండెల బలగ జిలగారిపోవగా 

చెలఁగి రగిలెడి గుండె కొదడు మదడు

విప్ప లగలగ  లాగ చుట్ట చుట్టెది పట్ట,  

పట్ట కొలది కొట్ట కొట్ట  కొట్టగ పెట్ట ఎలుగెత్తి 

పలుగెత్తి పరిగెత్తి వంచి తుంచి పెంచి 

పంచి పోరా, వీరా, సూరా. 

ఇంత అర్థ రహితమగు కవితను మేమెచ్చటనూ వినలేదని అందరూ ద్రువీకరించగా  అందరి నవ్వులమధ్య వారిద్దరినీ  ఒక దరికి చేర్చి  అరుణ వడ్డించుచుండెను. 

అందులో సందీపుడి పాత్ర ఒకటి. 

సందీపుడు  సంస్కారానికి మారుపేరు.      

సందీపుడి పాత్ర కవితలు చెప్పదు . తల్లి వయసు మనసు   ఉన్న మీనాక్షి కి  రాఘవుడు ఆకర్షితుడైనప్పుడు అది తప్పు అని సూటిగా చెపుతాడు.   మీనాక్షి సందీపుడిని   తన బంగళాకి ఆహ్వానించినప్పుడు మితంగా మాట్లాడి మర్యాదగా నడుచుకుంటాడు. మీనాక్షి ఎంత శ్రీమంతురాలో తెలుసు , ఆమెకు డబ్బు ఇవ్వాలనున్నా సందీపుడు చెయ్యిజాపే  రకం కాదు   తన  కష్టం మీద తన కాళ్ళ మీద నిలబడే రకం.  రాఘవుడితో వ్యాపార వ్యవహారాలు మాట్లాడుతున్నప్పుడు కరుకుగా  మాట్లాడతాడు. అతడి పద్దతి నచ్చలేదని సూటిగా చెప్పి డబ్బు ఇచ్చేసి పంపించేసి వ్యాపారం తన సొంతం చేసుకుంటాడు.  సందీపుడు మితంగా సూటిగా మాట్లాడే రకం కష్టపడి పని చేసే రకం. 

బసవడి పాత్ర తో పోలిస్తే కొంచెం నిడివి లో తక్కువగా ఉంటుంది కానీ గుణం లో కాదు. చెల్లి నందిని పథకంలో భాగంగా  భారతవర్ష చెల్లి మంజూష ని ప్రేమలోకి దింపినా పెళ్లి చేసుకోవాలనే యోచిస్తాడు తప్ప మంజూషని మోసగించాలని చూడడు. మంజూష ని పెళ్లి చేసుకుని ఆమె అల్లరి అంతా స్నేహితుడు  భారతవర్ష మీద గౌరవంతో  భరించి మంచి భర్తగా  ఉంటాడు. భార్య చెపింది కదా అని స్నేహితుడి భారతవర్ష నుంచి ప్రయోజనం పొందాలని చూడడు.  సందీపుడి తక్కెట్లో  స్నేహం  ప్రేమ  సమంగా తూగుతాయి. బసవడితో సమంగా తూగే పాత్ర సందీపుడి పాత్ర. 

ప్రౌఢ స్త్రీల పాత్రలలో ఘనమైన పాత్రలు అరుణతార, మీనాక్షి.

అరుణతార ఔదార్యానికి  మీనాక్షి ఉదాత్తతకి మారుపేర్లగా నిలిచే పాత్రలు. ఇద్దరు భర్తలకి దూరమైన స్త్రీలు. తంజావూరు  ఉన్నత పండిత  కుటుంబంలో  పుట్టిన ఆగర్భ శ్రీమంతురాలు మీనాక్షి. ఆమె  భర్త దక్షిణామూర్తి యవ్వనస్తురాలి మోజులోపడి మీనాక్షిలాంటి పద్మాన్ని గచ్ఛపిక్కలాంటి గ్రేస్ కోసం వదులుకుంటాడు. మంచి గంధం చెట్టు తనని నరికేస్తున్నా సువాసనని వెదజల్లుతుంది మీనాక్షి కూడా అలాగే విడాకుల తో పాటు తన ఆస్తి కూడా భర్తకి ఇచ్చేస్తుంది.  ఉదాత్తత వల్ల సంక్రమించిన పేదరికంతో  మురికివాడలో  పంకంలో పద్మంలా ఉన్నా  అసమాన సంగీత ప్రతిభతో సూర్యుడిలా సినీ ప్రపంచంలో  ఉదయిస్తుంది. టట్ట.. టాడా వంటి  సంగీతంతో కుర్రకారు నరాలను మీటే జేను స్వరరాణి బిరుదాంకిత, నాద బ్రహ్మ.కోటీశ్వరురాలైనా ధనాన్ని కాక గుణాలని అంటిపెట్టుకుని బ్రతుకుతుంది ఈ మంచి గంధం చెట్టు. అహంకారంతో అరుణతారని వీడిన ఆమె భర్తని సక్రమ మార్గంలో  పెట్టే పద్దతి, అందుకు ఆమె పడిన శ్రమ పాఠకుడి గుండెల్లో నిరంతరం నిలిచిపోతుంది. మీనాక్షి - స్నేహధర్మం, మానవతా ధర్మం, మమకారం  కలసి  ప్రవహించే త్రివేణి సంగమం . భారతవర్ష కోవెలలో  మీనాక్షి కాంతులీనే దీపం.

చారుమతి - అరుణతార 

దేవదాసి చారుమతి ఇంటిలో ఆపద ధర్మంగా ఒక రాత్రి  తలదాచుకున్న అరుణతారకు ఆమె కుటుంబంతో  శాశ్వత సంబంధం ఏర్పడుతుంది.  ఆ దేవదాసి ఆ రాత్రే  కన్ను మూయడం  ఒక  కారణం గా కనిపించినా అది బాహ్యం మాత్రమే. అంతర్లీనం గా ఉండే  మరో కారణం అరుణతార ఔదార్యం . 

గొప్ప వితరణ శీలి సంఘ సేవకురాలు అయినా చారుమతి అడిగిన వారికి లేదనకుండా ఇచ్చితనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా  చనిపోతుంది.  అంత ఉత్తమురాలి  ఇంట చనిపోయే నాటి రాత్రి  అరుణ తార అతిధి.  మీరు దేవుడిని నమ్మితే ఇది విధి అని చెప్పచ్చు.  ఒక నాట్య ప్రదర్శన ఇవ్వడానికి ఆ మారుమూల పల్లెకి  వెళ్లి  ఆమె గుడిసెకి చేరడం దైవికం.   చని పోయే టప్పుడు కూడా  కర్ణుడు తన పన్ను దానం చేసినట్టు, ఇవ్వడానికి ఆమె వద్ద ఏమీ లేకపోయినా, తన గుడిసెలో తలదాచుకునే చోటిచ్చి చనిపోతుంది.  ఆమె ఒక అనాధ బాలుడిని చేరదీస్తుంది. అరుణతార చారుమతి అంత్య క్రియలు నిర్వహించి . ఆ పిల్లవాడు  కేశవుడుని తన కొడుకులా చూసుకుంటుంది. తన కూతురు చదువుకోకపోయినా పేదరాలయిన సుందరిని లక్షలు ఖర్చు చేసి పైలెట్ ని చేస్తుంది .  ఎం పీ గా ఉన్నా  కేంద్రమంత్రిణి  అయినా సీదా సాదాగానే బ్రతుకుతుంది, మధ్యతరగతి వారితోనే తిరుగుతుంది.  

గ్రామీణ శాఖా మంత్రిగా బేంకాక్ సమావేశానికి వెళుతున్నప్పుడు, సహాయమంత్రి, సెక్రటరీ బేంకాక్ చాలా రొమాంటిక్గా  ఉంటుంది  మీరు అక్కడ అన్నీ సందర్శించుటకు  ఏర్పాట్లు చేస్తున్నాము అని చెపుతారు అప్పుడు అరుణతార   There is nothing romantic about underdevelopment and rural poverty అంటుంది ఈ మాటలు   వృత్తి పట్ల ఆమెకు గల అంకితభావాన్ని సూచిస్తాయి. మంత్రిగా , మనిషిగా , అయోగ్యుడైనా భర్త కి (దూరమైన) భార్యగా తనగురించి  కలత చెందకుండా  ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కుంటుంది.  పెడదారిపట్టిన కూతురి తల్లిగా కూతురిగురించి ఆలోచిస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ ఆ వయసు అమ్మాయి సుందరి ని కూతురు గా భావించి ధర్మ బుద్ధితో బ్రతుకుతుంది . ధర్మో  రక్షతి రక్షితః అన్నట్టు  ఆమె జీవితం లో వెన్నెల కాస్తుంది. గంగా నది కాశీ పట్టణాన్ని పునీతం చేసినట్టు అరుణతార భారతవర్ష గ్రంధాన్ని పునీతం చేసే పాత్ర.   

భారత వర్ష లో  రెండవ తరం  పడుచు స్త్రీలలో అత్యుత్తమ పాత్ర సుందరి పాత్ర.     మొదటి తరం ప్రౌఢల సరసన నిలబడగల పాత్ర  సుందరి పాత్ర . తనను నిలబెట్టిన వారిని  నెలకొరగాలి అనే అత్యంత కృతజ్ఞాతా  భావంగల పాత్ర.  సహాయం చేసిన వారి ఋణం తీర్చుకోవాలని చూసే పవిత్రమైన పాత్ర  . to be continued

భారతవర్షలొ అన్ని పాత్రలు గూర్చి  చదివితే  ఎలా ఉంటుందో చదివిన వాళ్ళే చెప్పాలి.  


Friday, September 3, 2021

Among the World's Best Books

When she had ankle pain doctors advised her rest. She started writing something. She never thought it would be a novel of immense popularity. She never thought of publishing it. 

I am talking about Margaret Michelle's Pulitzer prize winning novel - Gone with the Wind.  Margaret wrote 1047 page novel for 10 years. She never thought of publishing it. 


Victor Hugo planned his novel Les Miserbles in 1830. It took 17 years for him to write 1462 pages novel Les Miserables. It is the epic novel of France.  Scholars and writers said that more than a quarter of the novel—by one count 955 of 1462  pages—is devoted to essays that argue a moral point or display Hugo's encyclopedic knowledge but do not advance the plot, nor even a subplot. 

 

Michael Crichton started writing the 448 page Science fiction novel in 1980. It took 10 yrs  for him to finish his novel Jurassic Park.  In 1990 he published his novel.  ​In 1993 Steven Spielberg adapted the book into the blockbuster film Jurassic Park.



I started writing Bharatavarsha just to spend Corona home stay meaningfully.  I never knew that one day it would be such a big Novel and makes a niche in Telugu Literature. Bharatavarsha is now making ripples. Soon Bharatavarsha will reach its rightful place in world literature and stands tall among world's best books.   Big books or epics take years for completion but Bharatavarsha is written in just 8 months. 


                                                 Prologue of Bharatavarsha

పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని  సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి  తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధ కావ్యం భారతవర్ష.   స్నేహ ధర్మానికి ప్రేమబంధాలకి పెద్ద పీటవేసి మానవసంబంధాలకు బ్రహ్మ రథం పడు తుంది ఈ  ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  

ఆద్యంతం ఉత్కంఠతో సాగే పండిత కుటుంబాల కథ. ప్రేమ, శృంగారాలను   పాండిత్యం తో రంగరించి  సాహిత్య సరదాలు అద్దిన ఈ కథ ఆధ్యాత్మిక, వైద్య,   వైమానిక, సాంకేతిక రంగాల్లో అత్యంత కీలక విషయజ్ఞానాన్ని హృద్యమైన భాష తో మేళవించిన బహు విషయ జ్ఞాన భండారం భారతవర్ష. 

దక్షిణ మూర్తి  పాత్ర  క్రోధము కామము క్షణికావేశములు, ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనము అని తెలియజెపితే పాత్ర అట్టి ధర్మమునకు మూలము సంస్కృతి అని, ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజెప్పేపాత్ర,  కథా నాయకుడు భారతవర్ష పాత్ర. మాతృ మూర్తికి మాతృభాషకు బేధము చూపని పాత్ర,  ప్రేమ స్నేహ సౌరభాలను పరిమళించే    భారతవర్ష పాత్ర. 

కాయ కష్టం చేసే నిరుపేద స్థితినుంచి  కోటీశ్వరుని స్థితికి చేరిన సాహితీ కెరటం భారతవర్ష.  కటిక పేద స్థితిలో, కుబేర స్థితిలో తొణకని నిండు హృదయం భారతవర్ష. డబ్బు సంపాదించడం ఒక్కటే గొప్ప కాదు దాన్ని  ఖర్చు పెట్టె మార్గం కూడా ఉన్నతంగా ఉన్నప్పుడే మనిషి ఉన్నతుడవుతాడు. చిత్ర సీమలో వెలిగి, నేలరాలిన కథానాయిక లకుమ ని, అద్భుత సాహస వైమానికురాలు సుందరిని , తన మిత్రుడు ప్రేమించిన పల్లెటూరి పిల్ల పార్వతిని తన సొంత చెల్లెళ్ళవలె భావించుకుని వారి పెళ్ళిళ్ళకి మార్గం సుగమం చేసి,  సొంతచెల్లి మంజూష తో పాటుగా వారికి కట్నకానుకలు  ఇచ్చి ఉప్పొంగే హృదయంతో పెళ్లిళ్లు చేసిన అన్న మనసు భారతవర్ష.  అతడే అతడే వర్షుడు రా విలక్షణ అక్షర యోధుడు రా , సాహిత్య ప్రియధీరుడు రా అని   రడగప్రాస పద్యంలో రచయిత చెప్పిన మాటలు అతడికి సరిగ్గా సరిపోతాయి. 

ధనం పుష్కలంగా ఉండి భోగలాలస తతో అందాల వెంట పడి తల్లిని నిర్లక్ష్యం చేసిన అగస్త్య కు బుద్ధివచ్చేలా చేసి, డబ్బులేక తల్లితండ్రులు ఫోను , బైకు కొనివ్వలేకపోడంతో వారిపేదరికాన్ని నిస్సహాయతను అర్ధం చేసుకోకుండా వారిని దుర్భాషలాడిన బసవడికి మంచి భాషతో స్ఫూర్తి నిచ్చి, అతడిలో కవితా జ్యోతి వెలిగించి సన్మార్గంలో కి నడిపించిన భారతవర్ష  అనాధ మార్దంగికుడు కేశవుడి అక్కున జేర్చుకుంటాడు. మిత్రులని ప్రేమతో సన్మార్గం లో నడిపిస్తే అతడిని ప్రేమించిన నందిని అనే పాత్ర  అతడిని దక్కించుకోవాలని సంస్కృత  కవయిత్రిగా మారుతుంది.   సాహిత్య మార్గంలో కవితా గంధం వెదజల్లుతూ వర్షుడిని అల్లుకుపోవాలని ప్రయత్నిస్తుంటుంది.  అతడి పద్యాలని , గ్రాంధిక భాషని ఇష్టపడిన    మరీదు అనే చోరుడు కూడా సన్మార్గంలో పడతాడు.  ఇలా అనేక  పాత్రలకి  మార్గదర్శకుడయిన  భారతవర్ష   పాత్ర  కథకి  సెంట్రల్ కంబస్టన్ పోయింట్ అని స్పష్టంగా కనిపిస్తుంది.  

ఈ కథలో  భాషా స్థాయి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.  కథా నాయకుడు భారతవర్ష  గొప్ప పండితుడు. అతడి భాషా స్థాయి వేరు.  శార్దూల  మత్తేభ ఛందస్సు పద్యాలు అతడి స్థాయి.  బసవడు కేవలం ఆశుకవితా పండితుడు. ఛందస్సు లేని మనోరంజకమైన ప్రాస పద్యాలు  అతడి స్థాయి.  కేశవుడు  కళా కారుడు.  ఒక మాదిరి పండితుడు. ఆటవెలది తేటగీతి లతో పాటు ఉత్పలమాల చంపకమాల పద్యాలు  అతడి స్థాయి.   నందిని కథా నాయకుడి ప్రేమ పొందడం కోసం సంస్కృతం నేర్చుకుంటుంది.  ఆమె సంస్కృతంలో గాయత్రి మంత్రం నుంచి , భజగోవిందం , జయ దేవుని అష్టపదులను ముమ్మూర్తులా పోలిన సంస్కృత గీతాలను పాడుతుంది. ఈ అన్ని ఛందస్సులలో  రచయిత వ్రాసి తీరాలి రాసాడు. కానీ ఎలా? ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలియదు. ఒక్క సరస్వతికే  తెలుసు.  

మానవ విలువలకు భారతీయ సంస్కృతికి అద్దంపట్టే  భారతవర్ష  శృంగారంతో మనసునుమెలిపెట్టే   మన్మథ శరం. మనోరంజనం పొందిన పాఠకుల మనోఫలకంపై శాశ్వత ముద్ర గానిలిచిపోయే  ప్రబంధ కావ్యం    


Monday, August 30, 2021

French beauty @ Vijayawada

I am composing my french poems into a book. Probably I wrote 40 poems. I have to collect  french poems lying in face book and in other websites like poem hunter. You can expect a book of french poesy. So far no ex phonic writer ( one who writes in foreign languages) has written in three languages. check the ex phonic writers list available on internet) I think you will be happy to note that there is  only one ex phonic writer in the world who wrote in six foreign languages and he belongs to you. 


1.La vue de ma fenetre


Voici la vue du ciel de ma fenetre

Here is the view of the sky from my window

la nature sourit ici, Le ciel vêt de orange
the nature smiles here, the sky is dressed in orange
le bel or de ses feux. les collines bleues couvrent
the beautiful gold of its fires. the blue hills cover
Les champs changent de vêtements
while the fields change clothes
que seront prêts pour la prochaine récolte
theywill be ready for the next harvest.
il est délicieux, Je suis chanceux,
es-tu jaloux?


La nuit brûlée

le ciel était ambré et romantique et ressemblait à une belle botique les nuages sont des écorces d'orange Je conduisais dans le crépuscule doré qui me rappelle sa peau de beurre le vent chantait une chanson d'amour j'ai atteint la destination l'attendit avec préoccupation J'étais en voiture dans la grande rue la lumière dans le ciel a disparu il n'y a pas de lumière au dessus viendra-t-elle ? j'ai été un peu déçu soudain, j'ai vu un flash ci-dessous. elle a souri mon cœur a palpité elle ressemblait à un ange avec son odeur elle est entrée la voiture le vent s'est arrêté la voiture va doucement sur autoroute lumineux nous sommes heureux l'unité efface dénuement je l'ai touchée lentement sur ses belles cuisses elle a touché mes cuisses elle a fait un maléfice le ciel pleut des fleurs d'eau elle a chuchoté à mon oreille je suis devenu une abeille
il pleuvait devant la voiture
dans la voiture la nuit brûle.


ఆన్లైన్ క్లాసులు - online corporatism

మొదలయిపోయాయి ఆన్లైన్ క్లాసులు.

కరోనా కదలికలను ఆపేసింది కదలికలను ఆపేసినా క్లాసులు నడపగల తోపులు కార్పరేటులు
ప్రత్యక్ష తరగతి లేని గతి , సాధిస్తాడా విద్యార్థి ప్రగతి? కొర్పో రేటు మాయలో పడ్డాక అద్భుతాలు ఆర్డర్ ఇచ్చి పార్సిల్ కట్టించుకున్నట్టే . అసలు కొర్పోరేటు ఎందుకు ? దానికి అంత రేటు ఎందుకు?

అసలు పిల్లలకి మంచి మార్కులు వొస్తాయనే కార్పోరేటు స్కూల్ లో జేరుస్తారు తల్లిదండ్రులు. అందుకే అక్కడ తెలివి తక్కువ పిల్లలకి కూడా మంచి మార్కులు ఎలా వస్తాయి?

ఒక్కొక్క స్కూల్ ది ఒక్కొక్క స్టైల్ . ఒక్కొక్కడిది ఒక్కొక్క దందా.
కొన్ని కార్పోరేటు స్కూళ్ల లో పరీక్ష పేపర్లు ముందుగానే విద్యార్థులకు సప్ప్లై చేస్తారు కొన్ని కార్పోరేటు స్కూళ్ల లో పరీక్ష పేపర్లు ముందుగానే అమ్ముతారు. మరికొన్ని కార్పోరేటు స్కూళ్ల లో టీచర్లు ఒక చేత్తో బ్లు పెన్ మరో చేత్తో రెడ్ పెన్ పట్టుకుని పరీక్ష పేపర్లు దిద్దుతారు. బ్లు పెన్ తో విద్యార్థి తప్పుని సరి చేసి, రెడ్ పెన్ తో మార్కులు వేసేస్తే తల్లితండ్రులకి చమ్మగా ఉంటుంది.
డబ్బిచ్చి మార్కులు కొనుక్కునే మూర్ఖుల సంత నేటి విద్యావ్యాపారం. ఈ కడుపు కక్కుర్తి వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతూ నీఛాతినీచంగా జాతిఛాతి పై గజ్జి కురుపులా, తొడలమధ్య కడ్రాయర్ ఒరుపులా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతా మంటూ సాగిస్తున్నారు చీకటి వ్యాపారం. ఇక్కడ జ్ఞానము అనే మాట వినిపిస్తే వొట్టు, మెమొరీ కోసం పడతారు కుస్తీ పట్టు.

నాయాల్ది , విమానం ఎక్కిస్తే దొంగ పోలీసులముందు నిజం కక్కేసినట్టు , వీపు విమానం మోతెక్కిస్తే ముక్కున పెట్టినదంతా స్టూడెంట్ పరీక్షల్లో కక్కేస్తాడు. చదువు అనే పదానికి అర్ధం తీసేసి, అర్థమే (డబ్బు) పరమార్ధం అని, తమ స్వార్ధం చూసుకోగలిగే కోర్పరేటు విద్యా వ్యాపారులు.

ఆలోచన , తార్కిక శక్తి లేని , దేశచరిత్ర, సంస్కృతి తెలియని మనోవికాశంలేని ఒక వ్యాపకాన్ని వాళ్ళ నెత్తిన పెట్టి రోజంతా రుద్ది రుద్ది , కరుడుగట్టిన భట్టీ పద్దతులలో నెట్టి నెట్టి, చివరాఖరకు కాయితాలు చేతుల్లో పెట్టి వాళ్ళను కాయితం పువ్వులను చేసి తల్లి తండ్రులను వెర్రి పువ్వులను చేస్తున్నంత కాలం మన పిల్లలకి జపాన్లో పిల్లలాగా, క్రియేటివిటీ ,క్రమశిక్షణ , కామన్ సెన్స్ ఎప్పుడు అబ్బుతాయి? దేశానికీ పనికొచ్చే పౌరులని తయారు చేయగలరా ఈ దళారులు?
కరోనా కుచ్ కరోనా .

Friday, August 27, 2021

సొంత వదిననే పెళ్లాడిన రాజు కథ

పెళ్లి రాజకీయం , చావు పండగ , దేవుడు దిష్టి బొమ్మ,  ఇదీ ఈ రాజు యవ్వారం నమ్మలేక పోతున్నారా   ఇది కథ కాదు  జరిగిన చరిత్ర చదవితే మీకే తెలుస్తుంది 

ఇది క్వీన్ ఎలిజబెత్ తండ్రి 8వ హెన్రీ కథ. క్వీన్ ఎలిజబెత్  మంచిదేమోగానీ 8వ హెన్రీ  మాత్రం పరమ దుర్మార్గుడు. ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆరు పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు దుర్మార్గుడు అనడంలేదు చాలా తేడా మనిషి. అంత  తేడా మనిషి ఎలా అయ్యాడంటే అతని తండ్రి అంతకంటే తేడా మనిషి. ఎనిమిదవ హెన్రీ తండ్రి 7వ హెన్రీ. 

7వ హెన్రీకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఆర్థర్, చిన్న కొడుకు 8వ హెన్రీ  

పెద్దకొడుకు ఆర్థర్ కి స్పానిష్ యువరాణి   కేథరీన్ ఆరగాన్తో  పెళ్లి చేసాడు పెళ్లైన 5 నెలలకే ఆర్థర్  చనిపోయాడు. పెద్దకొడుకు చనిపోగానే విధవరాలయిన కోడలు కేథరీన్ ఆరగాన్ ని  చేసుకుంటాన ని మామగారు 7వ హెన్రి  తెగబడిపోవడం, ఆమె తల్లి తండ్రులు ఇసాబెల్ ఫెర్డినాండ్ ఒప్పుకోక పోయేసరికి  తూచ్ నేను చేసుకోను  నా రెండవ కొడుకు   అయిన  8 వ హెన్రి కి చేసుకుంటానని మాటమార్చడం   8 వ హెన్రి కి వయసు (అప్పటికి ఇంకా పదేళ్లే) చాలకపోవడంతో  మరొక ఐదు ఏళ్ళు ఆగాలని నిర్ణయించుకోడం తీరా  8 వ హెన్రి కి 15 ఏళ్ళు వచ్చాక   కేథరీన్ తల్లి ఇసాబెల్  చనిపోయినందున  ఆమెకు  ఆస్తి రాదని భావించి  కేథరీన్ ను నేనుచేసుకోనని 8 వ హెన్రి ప్రకటించడం  ఫెర్డినాండ్ తన కూతురికి పదవి ఆస్తి కట్టబెట్టగానే  8 వ హెన్రి తన వదిన కేథరీన్ ఆరగాన్ ని కట్టేసుకోడం  ఇలా జరిగింది 8 వ హెన్రి  పెళ్లి.    ఏంట్రా  ఇంత  గజిబిజి  పెళ్లి అనుకుంటున్నారా?   కానీ ఇది మొదటిపెళ్లి  మాత్రమే ఈయన ఇంకా అయిదు పెళ్లిళ్లు చేసుకు న్నాడు. మొత్తం 6 పెళ్లిళ్లు చేసుకున్న 8 హెన్రి చరిత్ర తెలుసుకుంటే  ఇంగ్లాండ్ చరిత్ర , అప్పటి పెళ్లిళ్ల చరిత్ర తెలుసుకున్నట్టే...

మొదటి వివాహం  దారుణం   రెండవ వివాహం రణమే .  ప్రాసకోసం అనడం లేదు నిజంగా 8 వ హేన్రీ యుద్ధమే చేసాడు. 

హెన్రీ VIII తన రెండవ వివాహం కోసం చర్చికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు.


ఆమెను మోహింపజేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనేకేథరీన్‌తో తన వివాహాన్ని రద్దు చేసుకోవడంపై దృష్టి పెట్టాడు,  పోప్ క్లెమెంట్ VII హెన్రీ వివాహాన్ని రద్దు చేయడంలో చాలా జాప్యం చేస్తున్నాడు క్లెమెంట్ వివాహాన్ని రద్దు చేయడని స్పష్టంగా తెలియగానే, హెన్రీ ఇంగ్లండ్‌లోని రోమన్  కాథలిక్ చర్చి యొక్క అధికారాన్ని విచ్ఛిన్నం చేశాడు. మఠాలు మరియు నన్నరీలను  మూసివేసాడు. ఈ వివాహం  కొరకు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్  స్థాపించాడు    చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌పై సర్వాధికారాలు రాజువే అని పార్లమెంట్ లో చట్టం చేసాడు.  చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌పై నియంత్రణ సాధించాడు. ఆన్బోలియాన్ ను  పెంబ్రోక్ యొక్క మార్క్వెస్‌గా చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు.


రెండవ భార్య ఆన్బోలియాన్ శిరచ్చేదం 

ఇంత  కిందా మీదా  పడి కేథరీన్ ను పెళ్ళాడి ఆమె  ఆడపిల్లలను కన్నదని మగ   బిడ్డలనివ్వ లేద ని విడాకులిచ్చి.  ఆన్బోలియాన్ బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లాడాడు. ఆమె కూడా ఆడబిడ్డకే  జన్మ నిచ్చింది ఆ ఆడ బిడ్డే  ఎలిజబెత్. ఆపై  ఎంత  ప్రయత్నించినా ఆమెకు గర్భం నిలవలేదు ఆమెకు మగపిల్లలు కలగలేదు. మగపిల్లలు కలగకపోతే ఆయనకు చిర్రెత్తుకొ చ్చేసింది . ఆమె మీద దేశద్రోహం నేరం మోపి పట్టపగలే తల తీయించేశాడు.  

మూడవ భార్య: జేన్ సేమౌర్: 

 శిరచ్ఛేదం చేసిన తర్వాత అతను జేన్‌నుసేమౌర్ ను  వివాహం చేసుకున్నాడు. జేన్ సేమౌర్ ఒక మగ శిశువును ప్రసవించింది, కానీ ప్రసవించిన వెంటనే  జేన్‌  మరణించింది.

నాల్గవ భార్య : హెన్రీ VIII అన్నే ఆఫ్ క్లీవ్స్‌ని వివాహం చేసుకున్నాడు కానీ అతను ఆమెకు విడాకులు ఇచ్చాడు. వారికి వివాహం ఐయ్యింది గానీ దాంపత్యం కుదరలేదు. ఆమె రాజు సోదరి అని చెప్పుకుంటూ కోటలో    

 ఒక భవంతిలో  బ్రతికింది.   అదృష్టవశాత్తూ అతను ఆమెను చంపలేదు.

ఐదవ భార్య : హెన్రీ VIII హెన్రీ హోవార్డ్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె కూడా వారసుడిని  ఇవ్వడంలో లో విఫలమవడంతో ఆమెకు  శిరచ్ఛేదం జరిగింది.

ఆరవ భార్య : మరణానికి కొన్ని నెలల ముందు హెన్రీ VIII కేథరీన్ పర్‌ని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత ఒక సంవత్సరం కూడా జీవించలేదు. అతని మరణానంతరం కేథరీన్ పార్ ఇంగ్లండ్ రాణి అయింది.

ఇంగ్లండ్ రాజ కుటుంబాల కథలు రక్తం మరియు కన్నీళ్లతో తడిసిపోయాయి. ప్రేమ మరియు ఆప్యాయత లేని వివాహం. వివాహం పూర్తిగా రాజకీయమైనది మరియు శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించే వారసులను ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించబడింది.


Marriage was completely political. When and where?

Now marriage is personal as well as social but once upon a time it was completely political. 

 You may not believe it unless you read story from the history of England. 

Is there anyone who does not know the name of Queen Elizabeth?

This is the story of Elizabeth and her husband the Monarch of England Henry VIII. 

Do you know how many wives Henry VIII has? He has six wives.



Henry VIII parents

Henry VII of England and Elizabeth York got two sons Arthur and Henry VIII. 

Henry divorced two of his wives (Catherine of Aragon and Anne of Cleves), he had two of his wives executed (Anne Boleyn and Catherine Howard) and one of his wives (Jane Seymour) died shortly after childbirth. His last wife (Catherine Parr) outlived him.

 Henry VII  chose Spanish pincess Catherine Aragon  the daughter of  Spanish king Ferdinando  and Isabella .   Henry VII ( the father) preferred   Catherine Aragon to his son  Arthur the Prince of Wales, because England was neither rich nor strong at that time. Most alliances  among kings were taking places for political and economic reasons.  Henry VII took huge dowry for his son Arthur.  Arthur was married to isabella.  They married in 1501, but Arthur died five months later in 1502.   But Arthur died months after his marriage leaving Catherine behind. 

Father in law wanted to marry his daughter inlaw. 

Henry VII wanted to marry his son’s widow Catherine but her parents refused. in inevitable conditions Henry VII then proposed to marry Catherine to his younger son Henry VIII.  But Henry VIII was 10 years old while Catherine was 16. Ferdinand's  refusal to pay the full dowry prevented the marriage from taking place until her fiancé assumed the throne as Henry VIII in 1509. The pope also permitted the marriage after Henry VIII attained 15 years. 

Henry VIII refuses to marry 

On his 15th Birthday Henry VIII declared that he would not marry Catherine. (Her mother Isabel died. Henry was not sure about her regency) Catherine lived miserably for two years.  But later Ferdinand gave her a prominent role and made her Ambassador.  Then Henry VIII married her but his marriages did not stop with Catherine. In fact Henry  VIII has six marriages. 

Henry VIII first married Catherine Aragon who is his brother’s wife.  

Catherine gave birth to six children, including two sons, but all except Mary (later queen of England, 1553–58)  died in early infancy.  Henry’s desire for a legitimate male heir prompted him in 1527 to appeal to Rome for an annulment on the grounds that the marriage had violated the biblical prohibition against a union between a man and his brother’s widow.  Catherine appealed to Pope Clement VII, contending that her marriage to Henry was valid because the previous marriage to Arthur had never been consummated. For seven years the pope avoided issuing the annulment.  Finally Henry separated from Catherine in July 1531. On May 23, 1533—five months after he married Anne Boleyn—he had his own archbishop  annul the marriage to Catherine. Parliament passed the Act of Supremacy repudiating all papal jurisdiction in England and making the king head of the English church.

 

Anneboleyn was educated in France, she  was maid of honour to Queen Claude of France. Anne was to marry her Irish cousin James Butler, 9th Earl of Ormond; the marriage plans were broken off, and instead she secured a post at court as maid of honour to Henry VIII's wife, Catherine of Aragon.

Henry VIII revolted  against Church for his second marriage.

Henry VIII began his pursuit of Anne. She resisted his attempts to seduce her, refusing to become his mistress, as her sister Mary had previously been. Henry soon focused his desires on annulling his marriage to Catherine so he would be free to marry Anne. but he failed to obtain an annulment of Henry's marriage from Pope Clement VII . When it became clear that Clement would not annul the marriage, Henry broke the Catholic Church's power in England and closed the monasteries and the nunneries.  As a result of this marriage, the first break between the Church of England and Rome took place, and the king took control of the Church of England.  Henry made Anne the Marquess of Pembroke and married her.

How and Why Elezabeth was killed?

Anne was crowned Queen of England on 1 June 1533. On 7 September, she gave birth to the future Queen Elizabeth I. Henry was disappointed to have a daughter rather than a son but hoped a son would follow and professed to love Elizabeth. Anne subsequently had three miscarriages and by March 1536, 

Henry VIII had Anne investigated for high treason in April 1536. On 2 May, she was arrested and sent to the Tower of London, where she was tried before a jury of peers, including Henry Percy, her former betrothed, and her uncle Thomas Howard, 3rd Duke of Norfolk; she was convicted on 15 May and beheaded four days later. 

Third wife : Jane Seymour: Henry was courting Jane Seymour. In order to marry Seymour, After beheading Anne he marriage Jane.  Jane seymour delivered a boy baby but died soon after delivery. 

Fourth wife  : Henry VIII married Anne of Cleves but he divorsed her. Their marriage was not consummated. She went as king's sister. Thankfully He did not kill her. 


Fifth wife : Henry VIII married Henry Howard. but had her beheaded as she too failed to produce heir. 

Sixth wife : A few months before death Henry VIII married Catherine Parr. He hardly lived a year after the marriage . After his death Catherine parr became the queen of England. 

IN The tales of England royal families are soaked in blood and tears. Marrige sans love and affection. Marriage completely political and meant for producing heirs protecting the kingdom ffrom enemies. 


Monday, August 23, 2021

అరిథూసా - కిన్నెరసాని - వసుచరిత్రము ఒకటే

నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము అనే కావ్యము రచించాడు.


ఇది భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామరాజభూషణుడు  విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాల గ్రంధం  127 పేజీల పుస్తకం.  తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠానపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. 

కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలాహలునికి, శుక్తిమతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ వృత్తాంతం.

శుక్తిమతి యొక్క నిత్యనిర్మలాకార కాంతిధార కు కోలాహలుడు వశుడవుతాడు  శుక్తిమతి తనని ఆదరిస్తుందని కోలాహలు డనుకుంటాడు  ఆమె అభిమతం తెలుసుకోకుండా ఆమెను పొందడానికి నిశ్చితాత్ముడు అవుతాడు కోలాహలుడు. శుక్తిమతీ కోలాహల వృత్తాంతాన్నికొందరు  రసాభాసమన్నారు.

నదులకు, పర్వతాలకు ప్రణయం పొసగదని శుక్తిమతి అభిప్రాయం. పర్వతాలకు, నదులకు సఖ్యమా? వినటానికే బాగోలేదు.  పర్వతాల నుండి నదులు పల్లానికి ప్రవహిస్తాయి.ఆ నదీ జలం పర్వతానికెక్కడం ప్రకృతి విరుద్ధం. జన్య జనక సంబంధంలో పుత్రికా వాత్సల్యం ఉండాలి కాని అనుచతిమైన ప్రణయానురాగం ఉండకూడదని శుక్తిమతి గట్టిగా చెపుతుంది. వావి వరసలు తెలిసి వర్తించాలని బోధిస్తుంది. మదనవికారంలో గౌరవాన్ని మరచిపోకూడదు అంటుంది. పుణ్యదేశాలు తిరిగి భర్తృవియోగ తపనంచేత భర్తను (సముద్రుని) వెదకికొనిపోయె అభిసారికనని అంటుంది.  దీనికి కోలాహలుడు తనది  జన్మజన్మలప్రేమ అని అతడు చివరికి బలముతో ఆమెను  పొందుతాడు. 







P. B. షెల్లీ  (1792-1822) అనే ఆంగ్ల కవి అరిథుసా అనే పద్యం వ్రాసారు. రామరాజభూషణుడు భట్టుమూర్తి (1510 and 1580 ) వసుచరిత్రలో అదే వ్రాసారు. విశ్వనాథ కిన్నెరసాని (1984) పద్యంలో చిన్న తేడాలతో అదే వ్రాసారు. ముగ్గురు మూడు కాలాలకు ప్రదేశాలకు చెందినవారు.

అరిథుసా అనే నదిని ఆల్ఫీయస్ అనే పర్వతుడు (పర్వతం) ప్రేమిస్తాడు. ఆల్ఫీయస్ టైటాన్ తెథిస్ ల కొడుకు . పెండ్లి అయినవాడు. అరిథుసా ఆర్టిమిస్ ( డయానా) అనుచరురాలు. డయానా అంటే చంద్రవతి . (మన భాషలో చంద్రుడు.) డయానా రెటిన్యు లో ( రెటిన్యు అంటే అనుచర గణం ) భాగమైన అరిథుసాను నది గా మార్చేస్తుంది. అరిథుసా పరుగెత్తి పరిగెత్తి (ప్రవహించి ప్రవహించి)ఎంత దూరంపోతుంది అయినా ఆల్ఫీయస్ వదలడు. వెంట పడుతుంటాడు. అరిథుసా చివరకు సముద్రంలో కలిసిపోతుంది. అయినా ఆల్ఫీయస్ వదలదు. అతడుకూడా నదిగా మారి ఆమెను అందుకుంటాడు. అరిథుసా కిన్నెరసాని దాదాపు ఒకటే.

కిన్నెరసాని పాటలు విన్నారా ? కిన్నెరసాని వచ్చిందమ్మా .. పాట విన్నారా? కొంత మంది విని ఉంటారు ( సినిమా పాట కదా) కిన్నెరసాని విశ్వనాథ సత్యనారాయణ సృజన అని తెలుసా ? కిన్నెరసాని పాటల్లో కథ ఏంటో తెలుసా?


భద్రాచలం వెళ్లే వారికి కిన్నెరసాని వాగు కనిపిస్తుంది. అది గోదావరికి ఉపనది. ఆ వాగు అందానికి ముగ్దుడై న విశ్వనాథ కిన్నెరసాని పాటలు అనే 32 పేజీల చిన్న పుస్తకం వ్రాసారు. కిన్నెర వివాహిత. ఒకనాడు అత్త వేసిన నింద భరించలేక ఇల్లు వీడి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడే పాటతో కథ ప్రారంభం అవుతుంది. భర్త ఆమెను ఆపడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. పట్టుకోబోయేలోపు కిన్నెర నదిగా మారి ప్రవహించడం మొదలు బడుతుంది. భర్త ఆమె కోసం పాదాలపై పడినట్టు ఏడ్చినట్టు అయినా కిన్నెర ఆగక సాగి పోయినట్టు వ్రాసారు. ఆ భర్త అక్కడే శిలైపోయినట్టు వర్ణించారు. కిన్నెర నడకలో వయ్యారం , నాట్య వడిలో అబ్దుత సంగీతం , ఆలాపడుతూ దూర తీరాలకు సాగిపోతుంది. కడలి సమీపిస్తుండగా ఆమె పాట విని కడలి రాజు పొంగి పోయి తనలో కలసి సొంతం కాబోతున్నందు కు ఉప్పొంగి పోతాడు. కామంతో చెలరేగిపోతాడు. కిన్నెర జరగబోతున్న ప్రమాదం గ్రహించి తన తొందరపాటుకు చింతిస్తుంది


Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...