నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము అనే కావ్యము రచించాడు.
ఇది భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాల గ్రంధం 127 పేజీల పుస్తకం. తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.
ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠానపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు.
కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలాహలునికి, శుక్తిమతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ వృత్తాంతం.
శుక్తిమతి యొక్క నిత్యనిర్మలాకార కాంతిధార కు కోలాహలుడు వశుడవుతాడు శుక్తిమతి తనని ఆదరిస్తుందని కోలాహలు డనుకుంటాడు ఆమె అభిమతం తెలుసుకోకుండా ఆమెను పొందడానికి నిశ్చితాత్ముడు అవుతాడు కోలాహలుడు. శుక్తిమతీ కోలాహల వృత్తాంతాన్నికొందరు రసాభాసమన్నారు.
నదులకు, పర్వతాలకు ప్రణయం పొసగదని శుక్తిమతి అభిప్రాయం. పర్వతాలకు, నదులకు సఖ్యమా? వినటానికే బాగోలేదు. పర్వతాల నుండి నదులు పల్లానికి ప్రవహిస్తాయి.ఆ నదీ జలం పర్వతానికెక్కడం ప్రకృతి విరుద్ధం. జన్య జనక సంబంధంలో పుత్రికా వాత్సల్యం ఉండాలి కాని అనుచతిమైన ప్రణయానురాగం ఉండకూడదని శుక్తిమతి గట్టిగా చెపుతుంది. వావి వరసలు తెలిసి వర్తించాలని బోధిస్తుంది. మదనవికారంలో గౌరవాన్ని మరచిపోకూడదు అంటుంది. పుణ్యదేశాలు తిరిగి భర్తృవియోగ తపనంచేత భర్తను (సముద్రుని) వెదకికొనిపోయె అభిసారికనని అంటుంది. దీనికి కోలాహలుడు తనది జన్మజన్మలప్రేమ అని అతడు చివరికి బలముతో ఆమెను పొందుతాడు.
P. B. షెల్లీ (1792-1822) అనే ఆంగ్ల కవి అరిథుసా అనే పద్యం వ్రాసారు. రామరాజభూషణుడు భట్టుమూర్తి (1510 and 1580 ) వసుచరిత్రలో అదే వ్రాసారు. విశ్వనాథ కిన్నెరసాని (1984) పద్యంలో చిన్న తేడాలతో అదే వ్రాసారు. ముగ్గురు మూడు కాలాలకు ప్రదేశాలకు చెందినవారు.
అరిథుసా అనే నదిని ఆల్ఫీయస్ అనే పర్వతుడు (పర్వతం) ప్రేమిస్తాడు. ఆల్ఫీయస్ టైటాన్ తెథిస్ ల కొడుకు . పెండ్లి అయినవాడు. అరిథుసా ఆర్టిమిస్ ( డయానా) అనుచరురాలు. డయానా అంటే చంద్రవతి . (మన భాషలో చంద్రుడు.) డయానా రెటిన్యు లో ( రెటిన్యు అంటే అనుచర గణం ) భాగమైన అరిథుసాను నది గా మార్చేస్తుంది. అరిథుసా పరుగెత్తి పరిగెత్తి (ప్రవహించి ప్రవహించి)ఎంత దూరంపోతుంది అయినా ఆల్ఫీయస్ వదలడు. వెంట పడుతుంటాడు. అరిథుసా చివరకు సముద్రంలో కలిసిపోతుంది. అయినా ఆల్ఫీయస్ వదలదు. అతడుకూడా నదిగా మారి ఆమెను అందుకుంటాడు. అరిథుసా కిన్నెరసాని దాదాపు ఒకటే.
కిన్నెరసాని పాటలు విన్నారా ? కిన్నెరసాని వచ్చిందమ్మా .. పాట విన్నారా? కొంత మంది విని ఉంటారు ( సినిమా పాట కదా) కిన్నెరసాని విశ్వనాథ సత్యనారాయణ సృజన అని తెలుసా ? కిన్నెరసాని పాటల్లో కథ ఏంటో తెలుసా?
భద్రాచలం వెళ్లే వారికి కిన్నెరసాని వాగు కనిపిస్తుంది. అది గోదావరికి ఉపనది. ఆ వాగు అందానికి ముగ్దుడై న విశ్వనాథ కిన్నెరసాని పాటలు అనే 32 పేజీల చిన్న పుస్తకం వ్రాసారు.
కిన్నెర వివాహిత. ఒకనాడు అత్త వేసిన నింద భరించలేక ఇల్లు వీడి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడే పాటతో కథ ప్రారంభం అవుతుంది. భర్త ఆమెను ఆపడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. పట్టుకోబోయేలోపు కిన్నెర నదిగా మారి ప్రవహించడం మొదలు బడుతుంది. భర్త ఆమె కోసం పాదాలపై పడినట్టు ఏడ్చినట్టు అయినా కిన్నెర ఆగక సాగి పోయినట్టు వ్రాసారు. ఆ భర్త అక్కడే శిలైపోయినట్టు వర్ణించారు.
కిన్నెర నడకలో వయ్యారం , నాట్య వడిలో అబ్దుత సంగీతం , ఆలాపడుతూ దూర తీరాలకు సాగిపోతుంది. కడలి సమీపిస్తుండగా ఆమె పాట విని కడలి రాజు పొంగి పోయి తనలో కలసి సొంతం కాబోతున్నందు కు ఉప్పొంగి పోతాడు. కామంతో చెలరేగిపోతాడు. కిన్నెర జరగబోతున్న ప్రమాదం గ్రహించి తన తొందరపాటుకు చింతిస్తుంది
You are a good analyzer sir. Well compared two stories.
ReplyDeleteThank you
ReplyDelete