Saturday, November 27, 2021

Gone far ahead

Bharatavarsha has gone far ahead.

ఉదయం క్లాసులు, సోషల్ వర్క్ రోడ్డుపని అప్పుడప్పుడు టివి, న్యూస్ పేపర్ వర్క్,  సెమినార్లు.  అలిసిపోయి పడుకుంటున్నాను. పడుకున్నాక సంస్కృత గీతాల తరంగాలులా  తాకుతున్నాయి.  పల్లవి మెదడులోకి ప్రవేశిస్తుంది. ఇంక డెస్క్ దగ్గరకి వెళ్లి కూర్చోడమే.  నాకేంటీ బాధ అని నేను ఎప్పుడూ అనుకోలేదు.  ఆమె నన్ను ఎంచుకున్నదేమో అనిపిస్తుంది.  

అలా గీతాల సంఖ్య పెరిగింది  గీతాలు తో పాటు కథ కూడా చాలా పెంచాను. కథ రాయడానికి ప్రేరణ తులసీగారు అయితే   ఈ గీతాలు సంఖ్య పెంచడం  వెనుక  ప్రేరణ పాడుతా తీయగాలో  శ్రీ బాలసుబ్రమణ్యం గారి మెప్పు పొందిన భీమవరం అమ్మాయి చిరంజీవి శ్రీవల్లి. ఆమె తో,  వాళ్ళ అమ్మగారితో  ఫోనులో మాట్లాడేను. ధనాపేక్షలేని కళారాధకులు వారు. నా పాటలను ఎన్నో సార్లు మెచ్చుకున్నారు. ఈ గీతాలు మా అమ్మాయికి ఎంతగానో నచ్చాయి. అందుకే పరీక్షలు అవుతున్నా రాత్రులు సాధన చేసి పాడింది అని ఆడియోలు పంపారు. 

నేను ఇప్పటికే నెలల తరబడి నప్పని గాయనీ గాయకులని సంగీత దర్శకులని భరించాను. ఏసు క్రీస్తుకి ఎన్ని మేకులు పడ్డాయో తెలీదు గానీ వారితో నా వొళ్ళంతా తూట్లు పడిపోయింది. అలాటి సమయంలో ఇలాటి  గాయనీమణి దొరకడం  నా అదృష్టం. చిరంజీవి శ్రీవల్లి  పాటలను చక్కగా పాడడమే కాకుండా పాటలను ఏంతో అపురూపంగా భావించి ప్రాణం పోసింది.  ఈ గీతాలు చిరంజీవి శ్రీవల్లికే  అంకితం

                                                                    ***

ఉదయము పదిగంటలు మాలినిగారు గృహకృత్యములందు నిమగ్నమయ్యి యుండగా "అమ్మా ఎవరు వచ్చుచున్నారో చూడు"మనుచూ మంజూషతల్లి చెవివద్ద చెప్పెను. మాలినిగారు ప్రవేశ ద్వారమువైపు ద్రుష్టి సారించగా రాచకన్య ధీరత్వము నాయకత్వ ప్రతిభ మూర్తీభవించిన విగ్రహముతో, ముఖములో వ్యంజితముమగు అప్సరకళతో అపూర్వ నూపురనాదములతో తరలివచ్చు నందనమువలె నగుపించిన అరుణతారకు  ఎదురేగి మీరు కబురు పంపిన మీరున్న చోటుకి వచ్చెడివారమని అనుచూ మాలినిగారు ఆమెను  స్వాగతించి లోనికి తోడ్కొని పోయిరి.

 “నాకు విమానాశ్రయమునకు బోవుటకు సమయమున్నది. మీతో మద్యానం వరకు ఉండుటకు వచ్చితిన”నగా విని సంతసించిరి.  కేశవుడు పరుగున వచ్చి అరుణతారను నల్లుకుపోయెను. అట్లు లోనికి పోవుచూ మండువాగది గుమ్మమువద్ద దామినిని చూసి అరుణతార అచ్చెరువొందెను.  వార్తాపత్రిక చూసి తెలుసుకొనుటయే గాని నీవు నాకు చెప్పితివా అని దామిని మూతిముడిచెను. నిన్నవిశ్వవిద్యాలయములో  కార్యక్రమమునకు  వచ్చిన తెలిసెడిది.  

మాలిని వద్ద  కొంత సేపు గడిపి తరువాత నీవద్దకు  వచ్చుటకు నిర్ణయించుకొంటిని. అని చెప్పుచున్ననూ దామిని బింకము వీడదాయెను. అరుణ దామిని చెవి పుచ్చుకొని మెలివేయ సాగెను.

అయ్యో వొదలవే జడల బఱ్ఱె అని గింజు కొనుచుండెను. నన్ను జెడలబర్రె అందువా నీ పేరు వేలుముడి అని అందరికీ చెప్పమందువా అని తార అనెను. చెప్పవలెను చెప్పవలెనని మంజూష మధ్యలో చొ రకొనగా అందరూ నవ్వుకొనిరి. “మాలిని నీవు పరిచయము చేసిన నేస్తమే కదా!   ఆమె పరిస్థితి ఏమైనా తెలుసు కొంటివా?అదియునూ పత్రికలలో చూసి తెల్సుకొందువా! ”అని దామినినడిగి చెవివదిలెను. దామిని చెవి రాసుకొంటూ “అన్నీ తెలుసుకొంటిని అందుకే ఇచ్చటికి వచ్చితిని. ఆ బైరెడ్డి దుమ్ము దులిపినావు కదా అని  ముసి ముసి నవ్వులు నవ్వెను. అందరూ నవ్వుచుండగా మంజూష విలవిల లాడెను. అందరూ లోనికి ప్రవేశించిరి. పిదప ఆమెను వర్ష చదువుకొని గదిలోనికి గొనిపోయి సోఫాపై కూర్చొండబెట్టిరి.  అచ్చటనున్న విదిష నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడి ఉండగా అరుణతార ఆమెను పిలిచి ప్రక్కన కూరొండబొట్టుకొనెను. 

అరుణతార సుదీర్ఘ  వృత్తాంతమును (చంద్రమతి కేశవ  గౌడసోదరుల కథను, భర్త  నిర్వాకమును) వివరించిన పిదప

                                        

"అమ్మ వంటపూర్తి అయినద"ని మంజూష అనగా ఇంకా ఆలస్య మెందులకు  అందరమూ కూర్చొనవచ్చ”ని మాలిని గారనిరి. మాలినిగారు వడ్డన చేయబోగా ఆమెను కూర్చొనబెట్టి  మంజూష, విదిష వడ్డన చేసిరి.  బోజనములైన పిదప అందరూ మండువాగదిలో కూర్చొనిరి. అరుణమ్మమనసు మెత్తబరుచుటకు భారతవర్ష వీణావాదనము మొదలిడెను.

స్వాగతమే స్వాగతమే అంబరమున మెరిసెడి తారకు సంబరమే సంబరమే ఆనంద నిలయములొని.  పాడుచుండగా నిగర్వియైన తార వలదని వారించెను వర్షుని కత్తికి రెండు వైపులా పదునునున్నది. అతడు అరుణను దుర్గగా భావించి ఒక ద్వంద్వార్థ గీతమునాలపించెను

 

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత మాతా

శుంభ - నిశుంభ హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణవర్జిత  గంగాజనిత  విచలిత  రసన  మాతా  

అంబకమునకందక  అంబరమున

సంబరముగ శోభిల్లు మాతా

సంకటములు బాపుటకు తరలొచ్చిన మాతా

మామనసులె ఆనందనిలయమీ వేళా

ఆనందనిలయమునకు సంబరమీ వేళా

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా

నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా

దిగంబర పరంపర సాగించుహేలా

జనయిత్రి ప్రసవిత్రి సావిత్రి మాతా

వరవినుత గుణరహిత తపో జ్వలిత మాతా

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత  మాతా

షుమ్బ  నిషుమ్బ  హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణవర్జిత  గంగా జనిత  విచలిత  రసన  మాతా  

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా

నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా

దిగంబర పరంపర సాగించుహేలా

త్రివేణి సంభవి శాంభవి మహిషాసుర మర్ధిని శాంభవి

కైలాసవాసిని శాంభవీ సింహవాహిని శాంభవి

దుర్గతినాశినీ శాంభవి  శాంభవి శాంభవి శాంభవి.

వర్షుడు పాట ముగించిన పిదప ప్రేమ, సంతోషము, ఆశ్చర్యము  అరుణతారను ముప్పిరిగొన్నవి. వర్షుని ఆశీర్వదించి ఆమె తన  బంగారపుటుంగరమును బహుమతిగా ఇవ్వబోగా వర్షుడు నిరాకరించి, ఒక పుష్పమిచ్చిన చాలుననెను. కానీ పుష్పము వాడిపోవునుకదా యని అరుణతార అనగా  విదిష"అట్లెన్నటికీ కాదు  ఆ బాధ్యత  నాది ఇచ్చి చూడ" మనెను. అరుణతార పుష్పమును ఇచ్చుచుండగా విదిష  చకచకా  చిత్రమును గీచిచూపగా  అచ్చెరువొంది విదిషను ముద్దాడెను.   విమానాశ్రయమునకు బయలుదేరుచుండగా మాలినిగారి చిరు కంటి సైగతో మంజూష పళ్ళెములో చీర జాకెట్టు పసుపు కుంకుమతో వచ్చెను.

ఇప్పుడివన్నీ ఎందులకమ్మా అనుచుండగా ఇంటికొచ్చిన అతిథి  దుర్గతో సమానము గంధము పూసి గౌరవించుట మన సంప్రదాయమని  చెప్పి మాలినిగారు పీట వేసి మంజుష వైపు చూసి ఇచ్చట కూర్చొన్నది దుర్గమ్మ అని చెప్పెను. మంజూష కళ్ళలో ఆనందము తొణికిసలాడెను.  మంజూష అరుణతార పాదములవద్ద కూర్చొని పసుపు రాయుచుండెను. విదిషకి  కూడా ఆమె పాదములు తాకవలెనని మనసు తహతహ లాడుచుండెను. అరుణతార ఆమెవంక చూసి అంగీకార సూచకముగా మందహాసము చేసెను. విదిష ప్రేమ కెరటమై ఆమె పాదములనందుకొని మంజూష తో  కలిసి  మంగల చర్చర్చనము చేయసాగెను. మాలినిగారు పాడుచుండిరి…

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

ఈ దీనుల లోగిలి లోకి  అడుగిడరావమ్మ

నీ అడుగుల సవ్వడి వినగా  చెట్టు చేమ వికసించెనమ్మా 

నీ పాద ముద్రలు పడగా ధర్మం ధరలో  విలసిల్లేనమ్మా

నే  చేసిన పుణ్యము కొలది

నిను కొలిచెడు  భాగ్యము పొందితి నోయమ్మా 

ముష్కర మూకల భంజించి 

విషమును దీసి విదిషను నిలిపితివి

ప్రతప్త మానస దీనులకు ధీమా నిచ్చి ధీటుగ నిలిపితివి

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

పసుపు రాయుచున్నంత సేపు మాలినిగారట్లు పాడుచుండిరి. ఆడపిల్లలిద్దరూ తన్మయత్వముతో పసుపురాయగా మగపిల్లలు పారవశ్యముతో చూచుచుండిరి. పిదప మంజూష బొట్టుపెట్టి చీర జాకెట్టు నిచ్చి గంధము పూసెను.  అరుణతార మనసుపులకరించి  ఈ సరస్వతి నిలయమునకు వచ్చు భాగ్యము నాదమ్మా అనుచూ మాలినిగారిని కౌగలించుకొనెను. కాలినడకనబోవుచున్న ఆమెను చూచి ఒక యోగినివలె నున్నదని అందరు అనుకొనిరి. 

                                                                         ***

Friday, November 19, 2021

Applause @ VVIT

On 17th November 2021 I spent my whole day serving Vasireddy Venkatadri Institutions of Technology. This is purely my service to the field of education.I didn't do it for any sort of monetary benefit. 


I was formally invited  to speak on foreign languages  at VVIT Campus which is on the way to Guntur in a small village called Nambur. It is 50 kilometers one way from VANUKURU whre I live.  I started at 12.00 pm from my place.  The seminar was from 2.00 pm to 4.00 pm.  I reached the college at 1.00 pm.  I met the chairman of the Institutions Mr. Vasireddy Vidya sagar. We had lunch together.   

Lunch with Mr. Vidyasagar the chairman of VVIT


After the lunch I was taken to the auditorium by the students and faculty members. About 300 students attended the seminar on Foreign languages. The students participated enthusiastically in the seminar. I first addressed the students in Spanish later I switched over to German, later to French, Italian and Japanese.   

I finally landed in Telugu after  I speaking in six languages.  Every time I changed the language the students clapped with glee. The sound of claps gave me immense joy. Every time I spoke about the books I wrote in foreign languages or the foreign authors I met,  the seminar hall was electrified. finally when I was speaking about BHRATAVARHA (my Telugu novel under Guinness record  assessment) the claps sounded  louder and continued longer.  The seminar was over at 4.00 pm as planned. I returned home from the college at 7.00 pm. The sound of claps still rings in my heart. 


సేవలో  ఏదో ఒక చిన్న తృప్తి.

Tuesday, November 16, 2021

భారతవర్ష గిన్నిస్ బుక్ అసెస్మెంట్ కి

భారతవర్ష  గిన్నిస్ బుక్ కి ఎందుకు అర్హం ?

నేను 1265 పేజీల భారతవర్ష తెలుగు నవలని  "ట్రాన్స్ లిటి రేషన్"   ద్వారా టైపు చేసి  మైక్రో సాఫ్ట్ వర్డ్ మీద  కంపోజ్ చేసాను.  ఇది ఎంత తప్పో తెలుసు కానీ తప్పలేదు. ఇంత  పెద్ద  తెలుగు నవల ని మైక్రో సాఫ్ట్ వర్డ్ మీద  "ట్రాన్స్ లిటి రేషన్"   ద్వారా టైపు చేస్తే ఎలావుంటుంది ?  నూతులో ఉన్న నీళ్లన్నీ గ్లాస్ తో తోడినట్టుతుంది.  

ఏ పనిచేయడానికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఓ పరికరం ఉంటుంది. 

 నట్లు విప్పాలంటే రెంచ్ కావాలి. పుస్తకాలు కంపోస్ చేయడానికి పేజ్ మేకర్ కావాలి. మైక్రో సాఫ్ట్ వర్డ్ మీద పుస్తకం  కంపోస్ చేస్తే తాటిమట్ట కి ఎదురు దేకినట్టే. దీనికి తోడు ట్రాన్స్ లిటి రేషన్"   ద్వారా టైపు చేయడం ఒకటి.

 మేడ - అని టైపు చేస్తే 1. మెడ  2. మీద 3. మీదా 4.  మేడ  5. మేడా    6. meda ఇలా ఆరు పదాలు ఒక లిస్ట్ వస్తుంది  మనం ఎంచుకోవాలి.  మనం ప్రతి ఎంచుకోకకుండా టైపు చేసుకు వెళ్ళిపోతే వాక్యానికి  ఒక్క పదం కరక్ట్ గా వచ్చి మిగితా అన్ని పదాలు తప్పులే వస్తాయి.   వాక్యంలో  అన్నీ సవరించుకోడమే.  అన్ని వాక్యాల్లోని ఇదే తీరు. ఇలా రెండు లక్షల యాభైవేల పదాలు టైపు చేస్తే మనిషికి పిచ్చెక్కుతుంది  కానీ నవల  గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుంది. తెలుసా !

                                                                          ***

విజయవాడ రచయిత పూలబాల తెలుగు నవల భారతవర్ష  గిన్నిస్ లోకి  

రచనలో రికార్డ్ 

వేయి పేజీలు దాటిన నవలల రచనకు రచయితలు  పది సంవత్సరాలు తీసుకున్నారు 

గాన్ విత్ ద విండ్ 1043 పేజీల నవల రచనకు మిట్చెల్ అనే ఆంగ్ల రచయిత్రి 10 సంవత్సరాలు ,  క్రొక్టర్ అనే అమెరికన్ రచయిత జురాసిక్ పార్క్ రచనకు అంతే సమయం తీసుకున్నారు. ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో లే మిజరబుల్స్ అనే నవలకు 12 సంవత్సరాలు తీసుకున్నారు కాగా  పూలబాల  వృత్తపద్యాలతో  గ్రాంధిక తెలుగు నుపయోగించి వ్రాసిన భారతవర్ష అనే నవలను ఎనిమిది నెలల్లో రచించడమే కాక  సొంతంగా కంపోజ్ చేసి ముద్రించి నాగార్జునా విశ్వవిద్యాలయ తెలుగు పీఠాధిపతి ఆచార్య ఎన్  వి కృష్ణారావుగారు, నందమూరి లక్ష్మి పార్వతి వంటి ప్రముఖులకు అందజేశారు  కూడా. 

 భారతవర్ష ముద్రణ లో కూడా  రికార్డ్ 

నట్లు విప్పాలంటే రెంచ్ కావాలి. పుస్తకాలు కంపోస్ చేయడానికి పేజ్ మేకర్ కావాలి. మైక్రో సాఫ్ట్ వర్డ్ మీద పుస్తకం  కంపోస్ చేస్తే తాటిమట్ట కి ఎదురు దేకినట్టే. దీనికి తోడు ట్రాన్స్ లిటి రేషన్"   ద్వారా  1265  పేజీల తెలుగు నవల టైపు చేయడం అంటే నూతులో ఉన్న నీళ్లన్నీ గ్లాస్ తో తోడినట్టే. 

పై రెండు విషయాలను గిన్నిస్ వారి పరిశీలనలో ఉన్నాయి. విజయవాడ కు చెందిన బహుబాషా కోవిదుడు పూలబాల  భారతదేశం నుండి తొలి ఫ్రెంచ్ నవల వ్రాసి వార్తల్లోకెక్కారు.   పూలబాల కృషి ఫలించాలని విజయవాడకు మరొక సారి అంతర్జాతీయ కీర్తి రావాలని ఆశిద్దాం.


                                                                           ***


Vijayawada author Poolabala's Telugu novel Bharatavarsha for Guinness

Bharatavarsha - a record in writing

It took authors world over ten years to write novels that crossed a thousand pages.  English writer Margaret Mitchell took10 years to write  1043-page novel Gone with the Wind. American author Michael Crichton took the same time to write Jurassic Park. It was written from 1980 to 1990.  In 1993 Spielberg made it a film.  The French author Victor Hugo took 12 years  to write les Miserables.

Poolabala finished his 1265 page novel Bharatavarsha in eight months. He used classical Telugu and metered poems. He also composed the novel, printed it and presented  to eminent personalities like Acharya NV Krishna Rao, Dean of Telugu and oriential languages, Nagarjuna University, and Nandamuri Lakshmi Parvati. Bharatavarsha is the fastest written longest novel. 


 Bharatvarsha - a record in printing 

Just as wrench is needed to loosen the nuts page maker is need to compose books. Poolabala composed Bharatavarsha on Microsoft word. Composing a novel of a great length on Microsoft Word is like a test from hell.  In addition to this, typing two lakh fifty thousand words(2,50,000) in Telugu  through "Transliteration " is like drawing all the  water in the well with a small glass.

The above two things are under their consideration by the Guinness Book of World Records. Poolabala, a polyglot from Vijayawada, was in news for writing the first French novel from Andhrapradesh. Let's hope that Vijayawada wins international fame once again Poolabala's Bharatavarsha.


Tuesday, November 9, 2021

నింగిలో జాబిల్లి

పాండిత్య మనే మడుగులో కవులు కలువలయితే  వారి వికసింపజేసే నింగిలో జాబిల్లి కృష్ణ్ణరాజుగారు.   

జ్ఞానానికి విజ్ఞానానికి  తేడాలున్నట్లే  పాడిత్యానికి  ప్రతిభ కి తేడా ఉంది. పండితు లంతా ప్రతిభావంతులు కాదు ప్రతిభ అంటే అప్పటికప్పుడు వికసించే బుద్ధి.  అలాగే పాండిత్యం వేఱు  వివేకం వేఱు , పండితులం దరికీ  వివేకముండాలని లేదు చివరిగా మనిషివేఱు మనీషి వేఱు. జీవమున్న ఎవరైనా మనిషే  కానీ మనీషము గలవాడే  మనీషి మనీష అంటే వివేకము (విజ్డం). 

జ్ఞానము, ప్రతిభ, వివేకము కలిగిన చందమామ  రాజుగారు. నెల మీద  కలువ వికసించాలంటే  నింగిలో జాబిలి ఉండాలి. ఆ జాబిలి  ప్రకాశంలో మాత్రమే కలువ మిలమిల మెరుస్తుంది.  పాడిత్యం వికసించాలంటే కృష్ణంరాజు గారు లాంటి జాబిలి అవసరం.  అందుకే అన్నాను  పాండిత్య మనే మడుగులో ఉన్న కవులు కలువలయితే  వారి వికసింపజేసే నింగిలో జాబిల్లి కృష్ణ్ణరాజుగారు. 

నేనెంత శ్రమించినా  ఎంత శోధించినా ఆయనలా ఒక శీర్షిక పెట్టలేను.  ఇది యదార్ధం బుద్ధి కుశలత లేని నాలో ప్రగడ కవితా ప్రతిభకు  ప్రగాఢ సానుభూతి తెలియ జేసు కుంటూ ఆ నీలోత్పల విభునకు  ఉత్పలమాలతో ప్రణమిల్లుతున్నాను. 


రాతిరి  భాతి(ప్రకాశము)  నివ్వగ తొగరాజు (చందమామ)ముదంబున కల్వలెల్ల యా కాంతిని పొంది రాజు (తొగరాజు)నటు (అట్లు) కాంచుచు అందముగా హసించిరి. ఆ రీతిన చూచి రాజు (కృష్ణంరాజు)  అటులే  చిఱునవ్వులు గుప్ప, లేఖకు ల్  ఖ్యాతిని పొంద కేలొసగిరి (ప్రణమిల్లిరి) గారము మించగ  గొప్పబుద్దికిన్.

 

Saturday, November 6, 2021

అగోచర ఆధ్యాత్మిక ప్రయాణం

 అమ్మ అతడి గుండెలో నాట్యమాడింది  దాని ఫలితమే 

అమ్మ మహిమల  అతిపెద్ద  అద్భుత తెలుగు గ్రంథం   భారతవర్ష 

 1265 పేజీల  భారతవర్ష   సరళ గ్రాంథిక  ప్రబంధం

 అచంచల భక్తితో  రోజుకి 20 గంటలు రచన చేస్తూ  ఒక్క ఆంగ్ల పదం లేకుండా   100 పాత్రలతో  రెండువందల వృత్త పద్యాలతో, అష్టాదశ వర్ణనలతో  ఉన్నత సాహిత్య ప్రమాణాలతో  8 నెలలో భారతవర్ష  గ్రంథ రచన పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ కూడా పొందాడు.    ఇంతకీ ఎవరా కవి ?  అతడే 6 విదేశీ భాషలలో  రచనలు చేసిన బహుభాషా కోవిదుడు మాతృభాషా సేవా శిరోమణి బిరుదాంకితుడు విజయవాడ వెంకట కవి, 

అతడి  అసలు పేరు పుట్రేవు వెంకట ప్రసాద్. అతడి కలంపేరు "పూలబాల"  అధికార భాషా సంఘంచే  ఆంధ్ర ప్రభుత్వంచే మాతృభాషా సేవాశిరోమణి అనే బిరుదుని పొందారు. తెలుగు భాషకు పునర్ వైభవాన్ని తీసుకురాడానికి తెలుగు సంప్రదాయాలకు భారతీయసంస్కృతుల పెద్ద పీటవేస్తూ నేటి సమాజానికి మాతృభాష ఎంత అవసరమో,  భాషా సంస్కృతులను కోల్పోయిన జాతి తల్లిదండ్రులు లేని అనాథలా ఎలా తయారవుతుందో కళ్ళకు కట్టి నట్టు 100 పాత్రల దృశ్యకావ్యంలో  వర్ణించారు పూలబాల.   

100 పాత్రల నవలలో అమ్మే ప్రధాన పాత్ర. అమ్మ ప్రధాన పాత్రగా  అమ్మపై   సంస్కృతాంధ్రాలలో హృదయాన్ని అంటుకునే పాటలు పాటలు కీర్తనలు రాశారు.

ఇంటికి వచ్చిన అతిథిని  దుర్గ గా భావించి పాదాలకు పసుపు రాసి సేవించడం ఈ కావ్యం లో  ఒక అద్భుత ఘట్టం. అరుణ తార అనే ఒక ఎం పీ  అవినీతి ఎరుగని  ఒక నిరాడంబర వనిత.  ఒక పేద కుటుంబాని చెందిన  ఒక యువతిని ఒక కీచకుడు  అవమాన  పరచగా ఆ యువతిని  ఆదుకుని ఆ కీచకుడిని శిక్షించి, భంగపడిన యువతిని ఓదార్చడానికి వారి ఇంటికి వస్తుంది. ఆ ఇంటి ఆడపిల్ల లు  కృతజ్ఞతతో   ఆమె  పాదాలను తాకాలని ప్రయత్నిస్తుండగా  అరుణతార  ఒప్పుకోదు. అప్పుడు  మన సంప్రదాయ ప్రకారం ఆమెను ఆ పిల్లల తల్లి మాలిని  కుర్చీలో కూర్చోండ బెడుతుంది. ఇలా మన సంప్రదాయం ఎంత గొప్పగా ఉందొ  అని చూపిస్తాడు కవి.  

ఆ ఇంటి పెద్ద కొడుకు గొప్ప కవి శ్రేష్ఠుడు కథానాయకుడు  అతడి పేరు భారతవర్ష  అతడు సంస్కృతంలో ఆమెను దుష్ట సంహారం చేసిన  దుర్గగా వర్ణిస్తూ 

"త్రిమూర్తి ప్రేరిత , త్రిభువన విలసిత త్రినేత్ర భూషిత మాతా సుంభ  నిసుమ్భ హారిణి ద్వాదశరూపిణి మాతా!  చండ  ముండ సంహారిణీ నిశ్చల రూపిణి మాతా, త్రిగుణ వర్జితా గంగా జనిత విచలిత రసనా మాతా!" ఇలాపాడతాడు.  అని  ప్రౌఢంగా  సంస్కృతంలో    వ్రాసిన కవి  మళ్లీ   ఆ ఇంటి ఆడ పిల్లలు ఇలా పాడతారు అని తెలుగులో   సరళంగా  

"అమ్మా దుర్గా మళ్ళీ రావమ్మా అమ్మా దుర్గా వెళ్ళీ రావమ్మాఈ దీనుల లోగిలి లోకి అడుగిడ రావమ్మా  నీ అడుగుల సవ్వడి వినగా చేస్తూ చేమా పులకించేనమ్మా నీ పాద ముద్రలు పడగా ధర్మం ధరలో విలసిల్లేనమ్మా నీ గజ్జెలు ఘల్ ఘల్ మనగా దుష్ట శక్తులు తొలగే నోయమ్మా ! అమ్మా దుర్గా వెళ్ళీ రావమ్మా, ఈ దీనుల లోగిలి లోకి అడుగిడ రావమ్మా,  నీ విభుని విభూతి పొందుట ఈ జన్మకు గొప్ప అనుభూతోయమ్మా.... " 

అని  రెండు స్థాయిల్లోరాసి  పాఠక  హృదయాలను రంజింపజేసాడు.  

దుర్గమ్మ మీదనే కాక పూలబాల రాముడు కృష్ణుడు మీద కూడా  అనేక గీతాలను కీర్తనలు  వ్రాసాడు .   ఒక్క వాగ్దేవి పైనే   6 పాటలు వ్రాసాడు. పద్యాలకైతే లెక్కేలేదు.


 భారతవర్ష గ్రంధం  సరస్వతి ప్రార్ధనతో  ప్రారంభమవుతుంది . 

చ . అనువుగ వేడ భారతి  సత్కృప నొసంగె కవిత్వ శక్తతన్  
కినుకము వీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
 అనితము నీకృప ధన్యముగాదె సనాతని దివ్య బాసటన్  
మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్

సరిగా వేడుకొనగా సరస్వతి దయతో కవిత్వ సామర్ధ్యమును 
కినుకము వీడి  ( దయతో ) కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమును
అనుగ్రహిచెను. అనితము (సాటిలేనిది ) నీకృప ధన్యముగాదె
 సనాతని( సరస్వతి ) దివ్య బాసటన్ (గొప్ప సాయముతో) 
మనసులో పుట్టిన పద్యాలను మాలగట్టి తల్లి పాదములవద్ద ఉంచెదను.

అని ప్రారంభంలో వ్రాసి చివరలో గ్రంథ రచన ముగిశాక  పద్యాల కోసం వెనక్కి తిరిగి చూసుకోలేదు తరళ మత్తేభ శార్ధూల పద్యాలు సునాయాసంగా వ్రాసాను.


క. అమ్మకు దయకలి గినచో
కమ్మని తేనెల తలంపు కలమున బట్టున్
నెమ్మిక కలిగిన మదిలో
అమ్మయె కొలువ గయుండు అన్నియు తానై

భారతవర్ష లాంటి పెద్ద గ్రంథం రాసే ప్రతిభ నాకు లేదు. అంతా అమ్మ దయే అంటూ భారత వర్ష గ్రంథంసరస్వతి అమ్మ పాదాలవద్ద ఉంచిన ఒక పుష్పం మాత్రమే.అంటాడు పూలబాల

శార్ధూల మత్తేభ ఛందస్సు లో పద్యం రాద్దామనుకుని అలిసి పోయి బల్ల మీద తలవాల్చి పడుకుండిపోయాను. లేచి రాస్తే మొదటి రెండు పాదాలు వచ్చేసేవి. మిగితా రెండు పాదాలకి చుక్కలు కనిపించేవి. ఆమె పాదాలు పట్టుకునేవాడిని అప్పుడు వ్రాసిన పద్యమే ఇది

శా. పూదోట్ల న్దిరుగా డినాత లపులం బ్రోచేవు యేభాగ్య మో
పూదేనం తయున ద్దినాప దములన్ బుట్టేవు తాళంబు గా
స్వాధీనం బుగని మ్ముచంద మికనే ౙాల్వార పారాణిగా నీ
పాదాల ద్దెదని ల్వవమ్మ నిలునా భావాల వేదంబుగా.

రచనలో ఎప్పుడు కష్టం వచ్చినా సరస్వతి మీద కీర్తన రాసేవాడిని. క్రింది గీతం అటువంటిదే అంటాడు రచయిత పూలబాల

"శాంతమానసము నీయవే శారద, నీరద యాన నీదయ రాదా
శాంతమానసము నీయవే శారద, నీరద యాన నీదయ రాదా
కాలము వాలమై రణముకు పిలవ మిత్రుడు శత్రువై విషమును చిందించ
హృదయము రగిలించ జగములు ఇగిలించ .......
శాంతమానసము నీయవే శారద, నీరద యాన నీదయ రాదా "


పెళ్లి చూపుల సందర్భం లో పెళ్లి కూతురు పాడే వీణపాట


ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం

సస్య కేదారముల  పాఱెడి  సారం భవాబ్దినావిక గీతా సారం

విహసిత సుందర వదనం వంశీధర  వర  మదనగోపాలం 

విహసిత సుందర వదనం వంశీధర వర  మదనగోపాలం   

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం



ఛందస్సు కోసం సనాతనిని ఎలా వేడుకున్నానో అలాగే ఆధ్యాత్మిక భావనలు రాసేటప్పుడు దుర్గనే వేడుకున్నాను. విదిష అనే అమ్మాయి కథానాయికి. ఆమె ధ్యానం చేయడం ద్వారా ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం మొదలౌతుంది. ఈ కథలో ఆమె కి దుర్గ పూనుతుంటుంది. దుర్గ పూనిన ఆమెను వర్ణించే ఘటనల్లో నాకు ఒళ్ళు బరువెక్కిపోయేది . వేరే లోకంలోకి వెళ్లిపోయేవాడిని. ఆ వర్ణనలకు పాఠకులు కూడా పులకరించిపోయేవారు. దుర్గ బొమ్మకు చలనం వచ్చి గౌడ సోదరులని ఎలా సంహరిస్తుందో వర్ణించే ఘట్టంలో పాఠకులకు దుర్గ కనిపిస్తుంది. అంతటి దుర్గాస్ఫూర్తి తో వ్రాసిన భారతవర్ష గ్రంథం పాఠకుల గుండెల్లో దుర్గా మాతని ప్రతిస్టహింపజేస్తుంది.

సాహిత్య పరంగా చూస్తే భారతవర్ష గీతాలు శంకరాభరణం చిత్రంలో గీతాలతో పోటీపడే విధంగా ఉంటాయి/ భర్త అక్రమ సంబంధం కారణంగా విడిపోయి వంటరి తనం అనుభవిస్తుంది మీనాక్షి అనే ఒక గొప్ప ఇల్లాలు. స్వయం కృషితో సంగీత ప్రపంచంలో సూర్యుడు లా వెలుగుతున్నా సిరులెన్ని ఉన్నా వంటరి తనం తో విచారంగా ఉన్న ఆమె ఇంటికి కథానాయకుడు భారతవర్ష వెళ్లి ఆమెను అమ్మ అని పిలిచి తన పాడిత్యంతో ఆమెను అలరిస్తాడు. అతడు మీనాక్షి పుట్టినరోజునాడు పా డే వీణపాట

జగదానందకారకం నీ జననం   మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం

జగదానందకారకం నీ జననం,  మధుర సురరాగ  స్వర కల్ప సృజనాత్మకం

నీజీవన తత్వము జీవిత లక్ష్యము సృజనాత్మక సుమధుర సంగీతమూ

నీగానమె నీ గమనము, నీ గమనమె గరిమాగమ నిగమ ప్రయాణము 

నీ గానమున విఱియు నవరాగమూ  అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము  

జగదానందకారకం నీ జననం ... 


అంగయార్ కన్నె  పశ్చాత్తాపముతో  రాముని పై పాడినపాట  


నీలమేఘ శ్యామా రామా నీ మనసెట్లు తెలుసుకొందు  నన్నెట్లు మలచుకొందు   

రఘుకులతిలకా రామచంద్రమా  సుగుణము లొలకే  రాజచంద్రమా

నీలమేఘ శ్యామా రామా  నిను ఎట్లు  తెలుసుకొందు నామనసెట్లు తెలుపుకొందు

చల్లని చూపుల మెల్లని స్వామి  ఏ వనములలో తిరగను నీ కై, 

ఇలా అనేక పాటలు, పద్యాలు, సాహిత్య సరదాల మధ్య కదిలే కావ్యంలో రాజకీయం వికట్టహాసంచేస్తుంది సినిమా రంగం కంపుకొడుతుందికుటుంబ కథ కన్నీళ్లు పెట్టిస్తుంది పాండిత్యం చల్లని వెన్నెల కురిపిస్తుంది . శృంగారం మత్తెక్కించి మంటై మండుతుంది. ఆద్యాత్మికత ఆత్మను స్పృశిస్తుంది

నవరసాలతో ఘన కావ్య రచన చేసిన పూలబాల మనలో భాషే మన సంస్కృతి, మనలో భక్తే మనలో శక్తి అన్నాడు. అమ్మపై అచంచల భక్తి తో  రాసిన  భారతవర్ష ప్రబంధం చదవడం ఒక ఆధ్యాత్మికానుభూతి అంటున్నారు చదివిన పాఠకులు.  


 పతాక సన్నివేశం  - ముగింపు  గానం

 భారత వర్షం సారంగం పద తారంగం 

భారత వర్షం పద రంగం పద చదరంగం 

వినువీధి కెగసిన వీరతురంగం విశ్వమానవుని వీరంగం 

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

కౌముది లో కమ్మదనం కౌగిలిలో వెచ్చదనం

అనురాగముతో నీ మెడకి  పూసిన శ్రీ గంధం

రాగాలల్లిన ప్రణయ మారుతం , నీ మనసు కట్టిన  మంగళ సూత్రం

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

భారత వర్షం సారంగం పద తారంగం - 

భారత వర్షం పద రంగం పద చదరంగం -

కృతకర్మ కూర్చిన  ద్రుతవిలంబితం  

స్రుతి స్మృతి సంగమ రాగ చోదితం 


ఈ పాటలన్నీ  గొప్ప గాయనీ మణులతో పాడించి  ఆడియో వీడియో రూపంలో అందరికీ ఉచితంగా అందజేస్తున్నారు విజయవాడకు చెందిన  బహుభాషా కోవిదుడు పూలబాల.  ఈ పద్యాలను ధారణ చేసి , టీ  వీ కార్యక్రమాల్లో నూ   వేదికలమీద పాడి తెలుగు భాషతో అలరించి ఆకట్టుకుంటున్నారు పూలబాల      1265 పేజీల పెద్ద గ్రంధాన్ని చదవడం కష్టం అని 145 పేజీల చిన్న గ్రంధంగా కూడా వ్రాసి అనేక మందికి ఉచితంగా పంచుతున్నారు. ఎవ్వరు వేదిక ఇచ్చినా ఒక   గంట సమయంలో ఒక సాంస్కృతిక కార్యక్రమంగా నృత్య గానాలతో కవితలతో కథలతో ఒక రూపకంలా   ఉచితంగా భారతవర్ష ని ప్రదర్శించిచూపుతున్నారు/ 

 తెలుగు భాష భారతీయ సంస్కృతి పై అభిమానమున్న ఎవరైనా 9700877409 అనే నెంబర్ కి ఫోన్ చేసి పూలబాలకి ఒక అవకాశం ఇవ్వగలరు 


దేవుడు ప్రతి అమ్మాయికి తగిన వరుణ్ణి ఎక్కడో పుట్టించే ఉంటాడు అంటుంటారు కదా?  పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటే ఇదే. మనం పిల్లలని రుణసృణాల బంధం అని నమ్ముతాం. ఇలా  భారతీయులు ఆధ్యాత్మికతను ఆలింగనం చేసుకుంటారు. మరి అదే ఆధ్యాత్మికత ఈ గ్రంధంలో గంధంలా కలిసి గుబాళి స్తుంది.  అందుకే భారతవర్ష ఆధ్యాత్మిక కావ్యం. ఆచార్య ఎన్ . వి కృష్ణారావు గారు అందుకనే భారతవర్ష ని "భారతీయ ఆత్మ" అన్నారు.  

నాస్తికులు పాశ్చాత్త్య విజ్ఞానం తమకు పూర్తిగా తెలియకున్నా భారతీయ విజ్ఞానాన్ని గెలిచేస్తుంటారు.  భారతీయ శాస్త్రాల ప్రకారం చెప్పే ఫలితాలు (పంచాంగం నుండి గ్రహణాలు ) ఆధునిక శాస్త్రీయ విజ్ఞాన ఫలితాలతో సరిపోతున్నాయి కదా. అందు చేత నాస్తికులు కూడా చదివి ఆనందించే గ్రంధం భారతవర్ష.   

స్థూలంగా చూస్తే విదిష వర్షలది ఒక జన్మ సంబంధంగా కనిపిస్తుంది సూక్ష్మ పరిశీలన చేస్తే అంటే నవలలో వివిధ భాగాలలో ఉన్న  విదిష ప్రస్థానాన్ని ఒకచోట చేర్చి చూస్తే విదిష వర్షలది ఒక జన్మ సంబంధం కాదు జన్మ జన్మల సంబంధం అని తెలుస్తుంది. అగోచర ఆధ్యాత్మిక ప్రయాణమే వారి ( అందరి)జీవితాలు.  అనేక జన్మలలోంచి, దేహాలలోంచి కాలాలలోంచి, వారి ఆత్మలు ప్రయాణం చేస్తుంటాయి. ఎహే ఆత్మలు లేవు ఏమీలేవని కొట్టి పారేస్తే చెప్పలేము. ఆత్మలని నమ్మబట్టే కదా ప్రపంచంలో ప్రతి మతంలో కర్మకాండలు ఉన్నాయి. బైబిల్, కురాన్ గీత కూడా ఆత్మలున్నాయని, ప్రునర్జన్మలు ఉన్నాయని నమ్మాయి కదా!   సరే నండి నమ్మాము. మరి వాటిని తెలుసుకోడం ఎలా ?

వెంటనే తెలియాలంటే కుదరదు. యోగసాధన ద్వారా ద్వారా తెలుసుకోవచ్చు. అందుకు సమయం వెచ్చించాలి, ఏకాగ్రత కావాలి,  పరిపక్వత రావాలి. అన్నిటికీ మించి యోగ్యతో యోగమో ఉండాలి. సంగీత సాధన మొదలుపెట్టిన అందరికీ సంగీతం అబ్బుతుందా? 

విదిషకి భవిష్య వాణి విద్య యోగ్యత ఉంది రాలేదు యోగం ఉండి  వచ్చింది. తల్లి ఆత్మ కనిపించడం వెనుక ఆమె (కృషి) యోగ్యత ఏముంది?  చనిపోయిన తల్లి  కనిపిస్తు న్నాదని చెపితే అందరూ ఆమె మానసిక స్థితిని శంకిస్తారు. ఆమె కూడా కర్మ కాండ  చేయించే బ్రహ్మగారిని ఆత్మలుంటాయా అని అడుగుతుంది. అమ్మ ఆత్మ కనిపించడం నిజం అని నమ్మడానికి కూడా ఆమెకి సమయం పడుతుంది.  ఆవిషయం తెలియగానే తండ్రి కూతురిని మాతనిచేసి భవిష్యవాణి  అని వ్యాపారం మొదలెట్టేస్తాడు. ఇది మామూలే కదా పేడ పిడకలకి డిమాండ్ ఉంటే బజాజ్ కంపెనీ, గాద్రెజ్ కంపెనీ అన్నే రంగంలోకి దిగుతాయి. దేనికి డిమాండ్ ఉంటే దానితోనే వ్యాపారం చేస్తారు.  కానీ ఈ వ్యాపారం ఆమెకి ఇష్టం ఉండదు "అమ్మ కనిపిస్తేనే భవిష్యవాణి చెపుతాను నాకు ఏ మహిమలు లేవు" అని చెపుతుంటుంది. పరిమళ బాబా దగ్గర ఏడుస్తుంది. మెల్లగా సాధనలోకి దిగుతుంది. నిద్రాహారాలుమాని సాధనలో రోజులు, వారలతరబడి ములిగిపోతుంది.   

                                     


          

 ప్రకృతి మూడు రూపాలతో ప్రకటితమవుతుంది. మొదటిది ఇంద్రియాలతో తెలిసికోబడే స్థూల ప్రకృతి. రెండవది ఇంద్రియాలకు అతీతమైన సూక్ష్మ ప్రకృతి. ఇది అంతర్గతమైనది, అత్యంత శక్తివంతమైనది. మూడవది మూల ప్రకృతి (spirit)ఇది  శాశ్వతం, స్థిరమైంది. ఇది సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారం. దీనికి వినాశనము లేదు. ఐతే అందరూ ఈ ఆధ్యాత్మిక విషయాలని నమ్మాలని లేదు. పాపులర్ అయిన విషయాలనే జనబాహుళ్యం నమ్ముతుంది. మతం బాగా పాపులర్ అయ్యింది కనుక దాన్ని అందరూ సులభంగా నమ్ముతారు.  విశ్వాసాలు  సమాజంద్వారా సంక్రమిస్తాయి.  మతం అనేది మన పూర్వీకుల డెడ్-ఎండ్ మార్గం. ఆధ్యాత్మికత వ్యక్తిగత మైనది. హింగోరి చెప్పినట్టు మతం అంతమైనప్పుడు ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది.మతం అనేది జైలు లాటిది. ఐతే ఎత్తైన జైలు గోడను దూకి తప్పించుకునే ఖైదీలు ఎంతమంది ఉంటారు? అలాగే మతంగోడ దూకి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించే వారి సంఖ్య కూడా తక్కువ. కానీ విదిష ప్రవేశిస్తుంది.  

ఆరవది ఏడవవ అధ్యాయము మార్మికదర్పణ సాధన, విదిష సాధన గురించి చాలా  విషయాలు చెపుతుంది. అక్కడినుంచి విదిష వర్షలది జన్మజన్మల సంబంధం అని విదిషకి అవగతమౌతూ ఉంటుంది. యోగ సాధనలో  అనేక జన్మలు ఒక లిప్త కాలం ఆమె స్మృతి పథంలో మెరిసి పోతాయి.

"బాంబుల మ్రోత బెర్లిను పట్టణమున మ్రోగుచుండగ జనులంత పరుగు దీయ 

భీతి నొందగ పరుగిడి ప్రాణమొదిలె చూచిచూచిక ప్రియుని జాడలేక"


అనే తేటగీతి విదిష బెర్లిన్ లో పుట్టి చనిపోయినట్టు చెపుతోంది. పదకొండవవ శతాబ్దమందు కశ్మీర మందు మదనాభిరామ కుమార్తె  గా జన్మించి బిల్హణుని ప్రేమించిన యామినీ పూర్ణతిలక గాను,1590 లో తూర్పుగోదావరి ముంగండగ్రహారం చెందిన ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన పండితుడు జగన్నాధ రాయలుని ప్రేమించిన చక్రవర్తి షా జెహాన్ కుమార్తె యువరాణి లవాంగికా గాను 

ప్రాచీన గ్రీకుపురాణ వీరుడు, మానవాతీత సంగీత నైపుణ్యాలను కలిగిన ఆర్ఫియస్ ను  పెళ్లాడిన యూరిడిసి గాను. (అతను గొప్ప కవీశ్వరుడు. అపోలో ఓర్ఫియస్కు తన వీణను బహూకరించెను. యూరిడిసి వివాహమైన కొలది దినము లకే పాముకాటుతో మరణించెను.) 

జర్మనీదేశపు మహాకవిగా ప్రసిద్ధికెక్కిన గూఠను  1770 లో  కలుసుకొని  ప్రేమించిన పద్దెనిమిదేళ్ల ఫ్రెడెరిక్ బ్రియాగాను. (బ్రియా ఎదురుచూచుచు మరణించెను) 

విదిష ఆత్మ ప్రస్థానం విశ్లేషిస్తే ఆమె గ్రీస్ లో ఒకసారి, జర్మనీలో రెండుసార్లు, అమెరికా లో ఒక సారి భారతదేశంలోమూడు సార్లు పుట్టిందని తెలుస్తుంది.  గ్రీకు పురాణం కాలం లో 900 బి.సి లో గ్రీస్ లో ఒకసారి, 17వ శతాబ్దంలో  స్ట్రోబోర్గ్ లో ఒకసారి,19వ శతాబ్దం లో బెర్లిన్ లో రెండవ ప్రపంచయుద్ధ కాలంలో మరొక సారి, 15 వ శతాబ్దంలో రాయలు ఆస్థాన నర్తకి గా ఒకసారి  16 వ శతాబ్దంలో జహంగీర్ కుమార్తె లవంగిక గా  మరికసారి,  20 వ శతాబ్దంలో అమెరికాలో లో వ్యోమగామిగా ఒకసారి జన్మించిన విదిష 21వ శతాబ్దంలో మళ్ళీ భారతదేశంలోనే జన్మించింది. విదిష అన్ని జన్మలలో పండితులనే  ప్రేమించింది. ఆమె పాండిత్యాన్నేవలచిందా? పండితులని ప్రేమించిందా? విదిష దేవత ఐతే చనిపోయి నట్టేనా? మరింత ఆసక్తి కరమైన భారతవర్ష -2 లో చదవండి. 




గురుచరణములకు సుమవర్ణమాల

భారతవర్ష  పూర్తిగా చదివి ముద్ర వేసి మూడు పేజీలు ఇచ్చిన గురువు గారు నాకోసం ఎంత శ్రమ తీసుకున్నారో  కదా! నాలాటి అనామకుడికి మీరు ఇంత  సమయం వెచ్చిస్తారని కలలో కూడా అనుకోలేదు. ముత్యముల వంటి  మీ పదాలు చూసి తెలుగు తల్లి నవ్వులనుకున్నాను. మూడు పుటల వ్రాసిన మీచేతులు తెలుగుతల్లి చేతి చేమంతులను  కున్నాను.



                                     గురువుగారి చరణాలకు వర్ణమాలలో సుమమాల



అ - ఆ 

అన్యభాషల్లో వ్రాసినా  -  ఆనందం దొరకలేదు. 

 ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ లో పుస్తకాలు  వ్రాసాను,  పద్యాలు వ్రాసాను.  ఇంగ్లీషులో పుస్తకాలు వ్రాసాను,  న్యూస్పేపర్లలో  వ్యాసాలూ వ్రాసాను.  అప్పుడు పొందిన ఆనందం  భారతవర్ష వ్రాసినప్పుడు కలిగిన ఆనందంతో పోలిస్తే చాలా తక్కువ. 

ఇ - ఈ 

ఇప్పుడు కలిగిన -  ఈ ఆనందాన్ని చెప్పడానికి నాకు స్ఫురించిన ఒకే ఒక మాట "బాల్యంలో మా అమ్మ  నన్నెత్తుకొని  ముద్దాడినట్టుంది.  

ఉ - ఊ 

ఉన్నపళంగా ఆశుకవితలు ఎన్నో వ్రాసాను.  ఊహించినా ఇప్పుడేమీ తట్టడంలేదు. ఉన్న మాట చెప్పాలంటే మనసు ఊయలూగేస్తోంది.    

ఋ - ౠ

ఋషి వంటి మీ కరస్పర్శ  భారతవర్ష గ్రంధానికి కలిగి గ్రంధపు ౠ ఛందము పెరిగింది.  

ఎ- ఏ  - ఐ 

ఎగ్గులు ( దోషాలు )  ఏఱుగొని ( వరద ప్రవాహంలో కొట్టుకొని పోవు) గ్రంధం గంధం పూసుకొంది.  మీ ప్రోత్సాహంతో సవరణలు చేసిముద్రణా దోషాలు దిద్ది  అక్కడక్కగా శైలి  సవరించుకో గలిగాను. ఐనా ఇదంతా  మీ దయేకదా !                                                      

ఎలక  పరిమాణం ఇతర భాషల్లో వ్రాసినప్పుడు కలిగిన ఆనందం                                                          ఏనుగు  పరిమాణం తెలుగులో పుస్తకం వ్రాసినప్పుడు కలిగిన ఆనందం.                                              ఎలక - ఏనుగు , పోలికేలేదు తెలుగు తెలుగే. 

ఒ - ఓ  - ఔ 

ఒనరారు పదములతో ఎనలేని ఓర్పుతో  ఓరుదీర్చి మీరిచ్చిన ముందుమాట  నా తెలుగు రచనకి  మీరిచ్చిన  అక్షరదీవెనలు జంకు తో  వేచియున్న నాకు మంచి ఔషధం లా పనిచేసి నాలో ఉల్లాసాన్నినింపింది.    

అం - అః                                                                                                                                        అంతాయత్తైన(సొంపైన ) మీ ముందుమాట  నాకు అందుమాటా!  మీ పేరిమి అద్భుతః                     

అందుకే  మందాక్రాంతమందు గురువర్యులకు పూలబాల పాదాక్రాంతము  

UUU     UII          III          UUI     UUI     UU

శ్రీమంతం  బౌనెన    రుగన      పత్రంబు  లేకాంచ  చిత్త 

మేమందా రంబగు    చదవ     నామ్రేడి    తంబౌగు  ణంబు               

హేమంబే  యంచుతొ లగగ    దాహేఠ    ముల్లాస మెల్ల  

ఆమంత్రి  తంబౌము  దముగ   తెల్గంద   మేలెకృ  తినే

శ్రీమంతంబగు పత్రములను చూచిన మనస్సు ఆనందమును పొందుచున్నది.

 మీరు వ్రాసిన మూడు పత్రములనూ తెలుగందం పరిపాలించుచూ ఆనందమును ఆమంత్రించుచుండగా (నాలో) హేఠము తనంత తానే తొలగి పోయెను.  


Monday, November 1, 2021

లాటానుప్రాస: హల్లులు జంట

 తాత్పర్య భేదంతో కూడుకున్న హల్లుల జంట అవ్యవధానంగా ప్రయోగించిన అలంకారం లాటానుప్రాసము

                                        

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;

విష్ణునాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;

భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి


                          

కాంక్షను  తొణికించు   కన్నులు కన్నులు; మురిపించి ఇచ్చేటి ముద్దు ముద్దు 

సరసమా డునపుడు  సమయము సమయము; వలకాని  పలుకుల వలపు వలపు

ప్రేయసి  నిముద్దిడు  పెదవులు పెదవులు; జతగాడు  చూపించు  జగము జగము 

అభికుని సరసన   హాసము హాసము;  పరిణేత  తోడిదే బతుకు బతుకు. 



Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...