Tuesday, October 10, 2023

Eventus - Sonnet

సెప్టెంబర్ 9 రాత్రి  విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో మా అమ్మాయి ఋగ్వేదం పద్మశ్రీ సంగీతప్రతిభ తో అంతర్జాతీయ పురస్కారం గెలుచుకోవడాన్ని పురస్కరించుకుని ఏర్పాటయిన సభలో  నాకు చిరు సత్కారం జరిగింది.   వేదిక నెక్కి   నా అర్థాంగి వరలక్షి తో కలిసి మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా సన్మాన పత్రాన్ని తీసుకున్నాను (ము).  నిండైన మనసుతో వేదిక పై  పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు అందించిన అజ్ఞాత స్త్రీ మూర్తి ప్రేమకి పులకరించి నా మనసు కురిపించిన  ఆంగ్లకవిత  ఇవెంటస్ ( లాటిన్ )  ఇవెంటస్ అంటే విజయం అని అర్థం.



                                              Eventus 


You never know what a mighty work of love might eventuate

what love’s might can accentuate, you can’t foresee love’s power

the will to strive and the unyielding will that it can effectuate

You never know what is in cover and what bouquets shower.


ప్రేమ యొక్క శక్తి నీలో నిద్రాణంగా ఉన్న దేన్ని 

నిద్ర లేపుతుందో నీకు తెలియదు చెక్కుచెదరని 

విశ్వాసం లేదా మొక్కవోని దీక్ష ఏదైనా కావచ్చు

ఒక దీక్ష సాధించే విజయం పై  ఏ పూలు వర్షిస్తాయో తెలియదు.  


Don’t wait or write for the friend who lives in the trend

Close friends close eyes when you are in the limelight

They spend their time with gigs and tend to pretend

There is nothing before them  though you are in sight 


 ఎంత గొప్ప పని చేసినా  కపట స్నేహితులు పట్టించుకోరు

వాళ్ళ ఆటలో వాళ్ళు మునిగి ఉంటారు. నువ్వు ఎదుగుతుంటే 

వాళ్ళు కళ్ళు మూసుకుంటారు . ఎదురుగా ఉన్నా లేనట్టే 

నటిస్తారు. కపట స్నేహితుల నైజం ఇంతే.  


Fake friends spew silence to blanket your merit

Silence can not the light of  merited  conceal 

Merit is the sun that shines above the blanket 

Fake friends under blanket their nature reveal 


కపట స్నేహితులు నిశ్శబ్దం అనే విషం కక్కుతారు 

నీ ప్రతిభ  అనే వెలుగు పై  మౌనం దుప్పటి కప్పుతారు 

 కపట స్నేహితుల మౌనం ప్రతిభ ప్రకాశాన్ని ఆపలేదు 

 ప్రతిభ  ఆకాశంలో  సూర్యుడిలా ప్రకాశిస్తుంది. 


Silence is the other form of jealousy that plays its part

invoking indifference to kill  great works of art 

When Fake friends like rats and go into their holes

From the unknown masses emerge the genuine souls 

అసూయకి మరో రూపం నిశ్శబ్దం అది కళ  గొంతు 

కోయడానికి ఉదాసీనతను పిలిచి  పీట  వేస్తుంది. 

కపట స్నేహితులు ఎలుకల్లా  కలుగుల్లో  దూరినప్పుడు

జన సమూహం నుంచి నిష్కపట కళాభిమానులు 

 స్వచ్ఛమైన  అభినందన సుమాలు కురిపిస్తారు. 


 The taskmaster never fails Magnum opus

 He blesses the merit and confers Eventus

 ఉద్గ్రంధాలు ఎప్పుడూ  ఓడిపోవు 

దేవుడే వాటికి విజయాన్ని ప్రసాదిస్తాడు 






మల్లాది విష్ణు గారితో చిరు సత్కారం

సెప్టెంబర్ 9వ తారీకు సోమవారం రాత్రి  విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం లోనాకు చిరు సత్కారం జరిగింది.  మా అమ్మాయి ఋగ్వేదం పద్మశ్రీ సంగీతప్రతిభ తో అంతర్జాతీయ పురస్కారం గెలుచుకోవడాన్ని పురస్కరించుకుని ఏర్పాటయిన సభలో    వేదిక నెక్కి  నాలుగు చేతులతో  నా అర్థాంగి వరలక్షి తో కలిసి మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా సన్మాన పత్రాన్ని తీసుకున్నాను (ము). వంద మంది దాకా హాజరైన ఆ సభలో తెలుగు చిత్ర గీతాలు వెల్లువై పొంగాయి. నంది అవార్డు గ్రహీత డాక్టర్ సునీల్ గారు సభ ను నిర్వహించారు. కళావాచస్పతి డాక్టర్ కొప్పుల అశోక్ ఆనంద్ గారు వ్యాఖ్యానం అందరిని ఆకట్టుకుంది.   

                            

నా సాహిత్యాన్ని నిజంగా ఇష్టపడి  చదివి నాకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా  ఎంతో శ్రమతీసుకుని  నాకీ సన్మానం జరిపించారు ఋగ్వేదం కిషోర్ గారు.  నిండైన మనసుతో వేదిక పై  పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు అందించిన అజ్ఞాత స్త్రీ మూర్తి ప్రేమకి పులకరించి నా మనసు కురిపించిన  ఆంగ్లకవిత ఇవెంటస్ (లాటిన్).  ఇవెంటస్ అంటే విజయం అని అర్థం.   










Tuesday, September 26, 2023

The English Conspiracy

యుద్ధం ద్వారా ఒక దేశాన్ని సంపదని కొల్లగొట్టడం, స్త్రీలను చెరపట్టడం చెడగొట్టడం  మామూలే. ప్రపంచ చరిత్ర నిండా ఇప్పటికీ యుద్దాలు రక్తం మరకలు కనిపిస్తాయి.  యుద్ధం అంటే రక్తపాతమే. ఐతే యుద్ధం లేకుండా ఒక్క చుక్క రక్తం చిందకుండా ఒక జాతిని లొంగ దీసుకోడం బానిసలను చేసుకోడం చాలా తెలివైనపని అదే  ఒక జాతి  జ్ఞాన సంపదని కొల్లగొట్టడం  మేథా విహీనులుగా చేసి కాళ్ళ దగ్గర పడేసుకోడం. జ్ఞాన సంపదను కొల్లగొడితే ఏం   జరుగుతుంది? మనిషి మెదడును స్తంబింపజేస్తే  ఏం  జరుగుతుందో అదే జరుగుతుంది. కళ్ళు లేని వాళ్ళైనా  ప్రతిభావంతులుగా  కీర్తి కెక్కినవారిని మనం చూసాం.  కళ్ళు లేని గుడ్డివారిలో  కూడా  గొప్పవారిని చూసాం. మెదడు లేని గొప్పవారిని చూసామా ? అదీ  జ్ఞానం ప్రాముఖ్యత 

1190లలో ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ ఖిల్జీ నేతృత్వంలోని ఆక్రమణదారుల దోపిడీ దళం  విశ్వవిద్యాలయాన్ని  ధ్వంసం చేసింది. ఖిల్జీ ఆశ్రమాన్ని పడగొట్టాడు, సన్యాసులను చంపడమేకాక విలువైన లైబ్రరీని తగలబెట్టాడు. నలంద లో చాలా తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. వందల వేల ( బహుశా మిలియన్లు కూడా) విశ్వవిద్యాలయం పూర్తిగా మూడు నెలల పాటు మండింది.   బ్రిటిష్ వాడిది  ఇంకాతెలివైన పధ్ధతి  



డా. మన్మోహన్ ఘోష్ అనే కలకత్తా యూని వర్సిటీ ప్రొఫెసర్  భరతముని వ్రాసిన నాట్య శాస్త్రాని కి  ఆంగ్లానువాదం చేసిన  మేధావి. ఈయన 1925 లో భరతముని నాట్య శాస్త్రాన్ని చదవడం  ప్రారంభించి  చదువుతుండగా 19 సంవత్సరాల తరువాత  1944 లో  ఆ గ్రంధాన్ని  ఆంగ్లానువాదం చేయగలను అనే నమ్మకం వచ్చింది. అలా ఆత్మవిశ్వాసం   వచ్చిన తరువాత  ఆసియాటిక్ సొసైటీ వారికి చెప్పగా వారు అనువాదం చేసే పనిని ఈయనకి అప్పగించారు. 1944 నుండి 1951 వరకు 8 మంది భారతీయ ఆంగ్ల ఆచార్యులు కలిసి (7 సంవత్సరాలు)  శ్రమించి భరతముని నాట్య శాస్త్రాన్ని  భారతదేశానికి , ప్రపంచానికి అందజేశారు. ( 7 March 1835 లో   ఇంగ్లిష్ విద్య పెట్టి  అప్పటికే సంస్కృతాన్ని తొక్కేశారు) మన ప్రాచీన  గ్రంధాలు అనువాదం చేసే శక్తి మనకి లేక చాలా గ్రంధాలు అలాగే ఉండి పోతున్నాయి.

 అంటే ప్రాచీన గ్రంధాలలో ఉండే జ్ఞానం అంతా నాశనమవుతుంది.    

విదేశీ శక్తులకు కావలసింది అదే.  జ్ఞానం అంటే కళ్ళు. కళ్ళు  పీకేసి గుడ్డి  వాళ్ళను చేయడం. తరువాత  ఇంగ్లిష్ నేర్చుకుంటే నే   ఉద్యోగాలు వస్తాయి అని నమ్మించి , ఉద్యోగాలపేరుతో  గింజలు పడేసి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసుకోడం.  తరువాత ఈ గుడ్డివాళ్ళ పిల్లలకి  కళ్ళున్నా తమ సంస్కృతి అంటూ  ఏమీ లేకుండా ఫేషన్ల  పేరుతో మోజు సృష్టించి   సంస్కృతిని కూడా లాగేయడం.  తత్ ఫలితమే  ఇంగ్లిష్ ట్యూన్స్ కి  పొసగని  తెలుగు బూతు మాటలు, ఇంగ్లిష్ పద్ధతిలో పుట్టిన రోజులు, ఇంకా చెప్పాలంటే మన జీవన విధానాన్నే మార్చేశాడు. వాడి తెలివితేటలు అలాంటివి. ఒక్క మాట సృష్టిస్తాడు. ఆ మాట  (గ్లోబలైజేషన్ ) అనగానే  దెబ్బకి నువ్వు గుడ్డలు ఊడదీసుకుని వాడి వెంట పరిగెత్తాల్సిందే.    


ఆఫ్రికన్ కవి "పియానో మరియు డ్రమ్స్" అనే పద్యం లో  ఆఫ్రికన్ సంస్కృతిని  పాశ్చాత్య  సంగీతం  ఎలా దోచేస్తోందో , ప్రపంచీకరణ పేరుతో  ఇంగ్లిష్ వాడు  ఎంత  గందరగోళాన్ని  సృష్టించాడో  స్పష్టంగా వ్రాసాడు . ఇంగ్లిష్ వాడివి మామూలు తెలివి తేటలు కాదురా బాబోయ్  

  

భారతీయ బాషలని సంస్కృతాన్ని తొక్కేసి, తెలుగు, కన్నడ వంటి బాషలని ఎందుకు పనికి రాని బాషలని ప్రచారం చేసి , ఇంగ్లిష్ లో నే చదువుకోవాలని చెప్పేడు. మరి ఇప్పటికీ అదే నమ్ముతు న్నాం కదా ! తెలుగుతల్లి నోరెత్తితే నోటిమీద తంతున్నాం.  మన ఇంగ్లిష్  మీడియం స్కూల్స్ లో తెలుగులో మాట్లాడితే  నోటిమీద తంతారు.   అందుకే అన్నాను ఇంగ్లిష్ వాడివి మామూలు తెలివి తేటలు కాదని.  అవును  తెలుగుని  పూజకు పనికి రాని  పువ్వుని నమ్మించాడు. వాడిమాట నమ్మి   చదువుకు పనికిరాద ని అవతల పారేసిన ఘనులం  మనం. 


పూర్తిగా చంపకుండా లేటిన్ భాషకు పట్టిన గతే  మన భారతీయ భాషలకీ పట్టించారు బ్రిటిష్ వాళ్ళు. ప్రస్తుతం లాటిన్ మాట్లాడేవాళ్ళు ఎవరూ  లేరు కనుక అది మృత భాషే. కానీ ఎక్సటింక్ట్ అంటే కనుమరుగైపోయిన  బాష కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు మెడిసన్ , సైన్స్ , న్యాయ శాస్త్రాలలో గ్రీక్ లాటిన్ పదాలు ఇప్పటికీ కోకొల్లలు. అంటే మనభాషలు  ఉంటాయి కానీ ఇంగ్లిష్ వాడికి పనికొచ్చేలా ఉంటాయి.


Monday, September 25, 2023

మన పిల్లలకు ఇది చాలా అవసరం.

 మాటలు  తూటాలకంటే అణు బాంబులకంటే చాలా శక్తివంతమైనవి. భాష మన జాతి శ్వాస , మన ఉనికి  ఆత్మ నిగ్రహం , ఇంద్రియ నిగ్రహం , సత్యవాకుపాలన , తపోబలం బ్రహ్మచర్యం ఇలాటి మాటలకి నేడు కాలం చెల్లిపోయింది.  ఇంద్రియ నిగ్రహం   బ్రహ్మచర్యం బూతుమాటలు.  ఇప్పుడు అలాటి మాటలు మాట్లాడితే  ఛి ఛీ   అంటారు.

మంచి ఫిగర్ , కెవ్వు కేక , ఫుల్ ఎంజాయ్  ఆన్ లిమిటెడ్ ఫన్ ,   ఇలాటిమాటలే సినిమా  వ్యాపార ప్రపంచం  పుట్టిస్తున్నది.  మాటలు    విలువలని నిలబెడతాయి, మన సంస్కృతిని   

పాత మాటలు , పాత పాటలు మనకెందుకనుకుంటున్నాము.  మనం డవలప్ అయిపోయాము అనుకుంటున్నాము.  సెల్ ఫోన్ , కంప్యూటర్,  కారు  రూపంలో మన డవలెప్ మెంట్ కనిపిస్తున్నాయి.    కానీ ఇది మన ఫిజికల్  డవలెప్ మెంట్ మాత్రమే.  నోరిప్పితే తెలుస్తుంది మన మెంటల్ డవలెప్ మెంట్ ,  మన ప్రవర్తనలో మన సాంస్కృతిక  కార్యక్రమాల్లో మోరల్ డవలెప్ మెంట్  కనిపిస్తాయి. కానీ మన సాంస్కృతిక కార్యక్రమాలు కాలక్రమేణా బ్రష్టు పట్టిపోయాయి



 


ఒక్క మంచి పాటతో  మొదలు పెడతారు , తరువాత అసలు స్వరూపం బయటపెడతారు.  వల్గర్ ఇంగ్లిష్ మాటలు భావజాలం గల పాటలు ,  హెవీ డ్రమ్స్ , ఫాస్ట్ బీట్ , సినిమా స్టెప్స్ మొదలెట్టే స్తారు . ఆధునిక సినిమా పాటలు మోజు తో  అచ్చతెలుగు   మరియు సంస్కారం చచ్చిపోతున్నాయి  మంచి మాటలు మంచి సాహిత్యం నేడు చాలా అవసరం  మంచి సాహిత్యం జాతికి పోషకాహారం , మంచి కవులు జాతికి వెన్నెముక.

 

భారతాన్ని తెలుగులో రచించిన  నన్నయ్య గొప్ప సాహిత్య విలువలున్న కవిపండితుడు.  వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు,  సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.  ఆయన బిరుదులకి అర్థం చెప్పడానికి నాలాటి అల్పకవికి సాధ్యం కాదు. ఆదిపర్వం సభా పర్వం , అరణ్య పర్వం - రాసి నన్నయ్య 11 శతబ్దం లో చనిపోతే ఎర్రన అనువదించే వరకు తెలుగు ప్రజలు ఒక శతాబ్దానికి పైగా ఈ చివరి అనువాదం లేకుండానే ఉన్నారు.

డాక్టర్ మన్మోహన్ ఘోష్ అనే   కలకత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్  భరతముని వ్రాసిన నాట్య శాస్త్రాన్ని    ఆంగ్లానువాదం చేసిన  మేధావి .  ఈయన 1925 లో భరతముని నాట్య శాస్త్రాన్ని చదవడం  ప్రారంభించి  చదువుతుండగా 19 సంవత్సరాల తరువాత  1944 లో  ఆ గ్రంధాన్ని  ఆంగ్లానువాదం చేయగలను అనే నమ్మకం వచ్చింది. అలా ఆత్మవిశ్వాసం   వచ్చిన తరువాత  ఆసియాటిక్ సొసైటీ వారికి చెప్పగా వారు అనువాదం చేసే పనిని ఈయనకి అప్పగించారు. 1944 నుండి 1951 వరకు 8 మంది భారతీయ ఆంగ్ల ఆచార్యులు కలిసి (7 సంవత్సరాలు)  శ్రమించి భరతముని నాట్య శాస్త్రాన్ని  భారతదేశానికి, ప్రపంచానికి అందజేశారు. నేటికీ కూడా భారతదేశంలో అనేక ప్రాచీన గ్రంధాలు అనువాదం చేయగల వారు లేక అలా ఉండిపోయాయి.

 నేను  భారతవర్ష అనే విలువలతో కూడిన అచ్చ తెలుగు లో అతిపెద్ద  గ్రంధాన్ని వ్రాసిన అనుభవంతో ఒక్క మాట చెపుతున్నాను.  మన పిల్లలకి  ఆధునిక సినిమాగీతాలతో వచ్చే ఆధునికత కంటే  పాతగీతాలతో స్వచ్ఛమైన తెలుగుతో వచ్చే సంస్కారం చాలా విలువైనది. 

Monday, September 11, 2023

A- Z Reasons why India is down

1 Anti nationalism   :  America craze

2. Begging Class bought by Business Class

3. Cinema and Caste Craze  

4.  Dogs - Celibrity Dogs ; Secular Dogs ; Intellectual Dogs work against country

5.English medium - says that English is knowledge  it is job, food and status

6. Family Rule  Freedom of Speech  , Foreign Funds

7. Government weak  ,corrupt  and puppet in the hands of capitalists

8. Hindu Phobia  - The word Hindu is taboo.







9. Internal enemy, Invisible enemies.   

10. Jourlanism - every world has price

11. Killer politicians - Highest Political murders in India.

12. Laws are biased and unequal - 

13. Minorities  - undefinale and unstoppable

14. National unity and character are weak

15. Over morality show - practice nil 

16. Poverty - is the life of Politics

17. Questionable Education -  Slave making goal.

18. Religion is above law.  

19.  Slave Employment. 

20. Turky on duty 

21. Utopian culture  - Great culture is promoted not practiced

22. Vegetable Democracy

23. Woman respect drama

24.  Xenomania - admiration for foreign music , foreign countries,  culture , clothes 

25.  Youth illiteracy - most of our graduates are illiterates 

26. Zero social responsibility 

  

Monday, August 28, 2023

Scotspine international School

విజయవాడలో పేరెన్నిక గల   స్కాట్స్ పైన్  అంతర్జాతీయ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిమ గారు  ఇండియన్ సోనెటీర్ అనే ఆంగ్ల పద్య కావ్యానికి నాకు రెండవ ప్రపంచ రికార్డు వచ్చినందుకు  పాఠశాల సమావేశంలో నన్ను అభినందించి నాకు పాఠశాల జ్ఞాపికను మొక్కను బహూకరించారు.  స్కాట్స్ పైన్ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. 


Scotspine International School in Vijayawada is situated in Kanuru.   The  Principal of the  School  Mrs. Pratima  congratulated me on getting the second world record for my English poetry compilation  "Indian Sonneteer" and presented me  a school memento. 

Sunday, August 13, 2023

శ్రీ కాళ హస్తీశ్వర శతకం - అలౌకికానందం

 శ్రీ కాళ  హస్తీశ్వర శతకం -అలౌకికానందం - పూలబాల.


వేద ఘోషలాటి ఆధ్యాత్మిక స్రవంతి .

ఫ్రెంచ్ , జర్మన్ , జాపనీస్ వంటి విదేశీ భాషలలో రచనలు, సైన్స్ ఫిక్షన్ , వండర్ కిడ్స్ , మూన్ లైట్ స్టోరీస్ వంటి పిల్లల కథలు , భారతవర్ష, వనశృంగారం  వంటి  శృంగార రచనలు, మహాకవి వంటి విప్లవ కవితలు,   మన జానపదాలు వంటి జానపద గీతాలు  ఇలా నేను  వ్రాసిన అన్ని రచనలూ లౌకికమే.  కానీ శ్రీకాళ హస్తీశ్వర శతకం  వీటన్నిటికీ పూర్తిగా భిన్నం. దీని గురించి రెండు  ముక్కల్లో చెప్పాలంటే  ఆధ్యాత్మికం  అలౌకికానందం.   

శ్రీ కాళ హస్తి వెళ్లాలని  శివుని  సందర్శించాలని ఎన్నిసార్లు అనుకున్నా కుదరలేదు. ఒక సారి తిరుపతి శ్రీ కాళ హస్తి  రెండూ చూడాలని బయలుదేరి తిరుపతి  మాత్రమే చూసి  వెనక్కి వచ్చే యాల్సి వచ్చింది.   అందుకే శివుని మీద భక్తితో వ్రాసిన ఈ శతకానికి  శ్రీ కాళ  హస్తీశ్వర శతకం ని పేరు పెట్టుకున్నారు. శార్ధూల ఛందస్సు లో  ఒక్క పద్యం వ్రాయడమే నాకు  కష్టం.  ఒక శతకం వ్రాయడం చాలా కష్టమే కానీ వాగ్దేవి కృపతో శివయ్య ఆశీస్సులతో ప్రయత్నిస్తున్నాను.

ఈ శతకంలో మనుషులు కలియుగంలో ఇతరులను వంచిస్తూ  ఎలా దిగజారి ఆత్మా నాశనాన్ని కొనితెచ్చు కుంటున్నారో  చెబుతూ,  క్షుద్రానందాల  వేటాపి,  సాత్వికానందాలతో  సరిపుచ్చుకుని  యోగులందరికీ తొలియోగి అయిన  శివుని ప్రార్థించమని  శివునికి గల అనేక నామాలతో పద్యాలు 


తలపుల లో సజీవులు  తలంప తరాల తరాల కుమార్గ దర్శకుల్     

అలసటలేక  పిల్లల నపారనురాగ నురక్తు లతోడి పెంచియా     

పిలుపు వినంగ  కోరితపియించెడి బిడ్డల నీడ నెవీడి  స్వర్గవా    

సులయి  నపుణ్య  మూర్తుల  శుభస్మ  రణంబు గనెంచి జేసెదన్



మెళ్ళోవే లబడే టినాగ ములతో మేనంత శామీల  మై

జళ్ళోన ల్లన పా రుగంగ  నెలవై   జంజాడి  నేత్రంబు  లై        

కళ్ళందవ్యయవ త్సలమ్మ  ధికమౌ కారుణ్య భావంబు తో 

ఒళ్ళంతా పులకించుకంచు గదరా ఓఈశ  నీరూపు కాంచ  

.

నిక్షేపం బుగ నీ వుయోగు లమనో నేత్రంబు నీవే వి రూ 

పాక్షాప శ్చిమది  క్కురక్ష కరుణన్  పాలించు నా ఆత్మ నే 

ద్రాక్షారా మవిరా మపాహి  కనినా ద్యానంబు యోగీశ  నీ

 దీక్షన్ నా  కొసగ త్రి శూల  ధరనే  తీర్థంబు లేజుట్టి తిన్


భోళాశం కరఓ శివయ్య గరళం భోక్తవ్య మున్ జేసి కా  

 పాళీకా చితివీ ధరాత  లమునే పాపాల బాపేదొ రా

 నాళగ్రో  లకదం బ వాద్య ములని న్నారాధ   నేజేతు రా

భోళాశం కరఓ  గిరీస  వినరా   భోగాలు నేకోర రా


భక్తేహృ   దయమె   ల్ల నేత్ర    ములలో   భాసిల్లు కారుణ్య  మే  

ముక్తేగ   ల్గునుచూ   డ పుణ్య  వదనం బున్పొం గు  హాసంబు నా  

శక్తే చూ   పునుధ      ర్మకార్య    పరుడే    శంభోశి    వాశంక  రా

రక్తేచూ     పుచునీ    యదీవె     నలనే    రావయ్య   గంగాధ   రా


ఉండేకా లముకొ ద్దిపాటి నరుడా  ఊలాడు  బ్రాంతేలరా

 గుండారం బికచీ కిపోయె మనసా కూలేటి కాలంబు లో

 పుండాకో రుతలం పులేమ రచిసం పూర్ణంబు గాశంక రున్

 గుండెల్లో ప్రతిష్టిం చిపాడ నరుడా గుంజాట నేవీ డురా

.

ఢంఢంఢ మరుకా ద్వని ప్రి యశివా డప్పేసి పాడేను నే 

ఢంఢండ మ్మనునా ధమేవి నుచుయా డేనంబర మం 

గూఢంబౌ లయకా    రకాశి  వశివా  ఘోరా తి


రౌద్రాకా రముకా టివాస ముశివా  రైగప్పు  నీరూప మే 

ఉద్రేకం బగుకా ళరూప  నినుచూ డూరంత జాగారమే 

నిద్రాహా రమలే త్యజించి  జనులే   నేత్రంబు లన్ మూయరే 

రుద్రాయం చునమో   శివాయ నినుశి రోధార్య  మే జేయ రే

.

9. కాశీనా థమహే శముజ్జగములన్ కాపాడుముక్కంటి  వార 

ణాశీది వ్యపురాధిపా మహిమ వీణాపాణి  వర్ణింప వీగె   

శ్రీశైలా   ధిపదే   వదేవ  తరమా శ్రీకాళ హస్తీశ్వ  రా 

విశ్వామి  త్రువర్ణిం పనెవ్వ  రితరం  బింకీశ్వ  రా బ్రోవ రా    

.            

10 . ప్రాయంబ న్న నదెం తకాల ములిప్త పాటేగ దాసత్య మే

కాయంబం తయువన్నె తగ్గి ముసలై గాయంబుగావించ గా 

 సాయంచే యదువై ద్యమెల్ల వెలకే సాయంబు చిక్కదే

 సాయంసం ధ్యకు శం కరాము రిప పా సాకంగ కాయంబు బొగ్గే క ద


11. గర్వంబే లమను ష్యుడెవ్వ డిలలో గాడే అ మర్త్యుడు తా  

సర్వంబంచపురూపమంచు దేహమన్ సంప్రీతితో గొల్వనా 

పర్వం బెల్లనుయ వ్వనజ్వ లనమే  పాడెక్కు దాకుండ దే  

సర్వస్వం  బనిన మ్మి దాచి నదగ్ని  సంబ్రంబు గావించ దా


12. మాభాగ్యం బునద క్కెదక్ష కరుణా వాత్సల్య ధారామృ తం 

సంభావిం పవిరా గ కల్ప విభవా సంపూర్ణ మోక్షామృతం 

 మాభూతం బులదృం చిమాత లపులం వసించ నీ నామమే

 ఏ భాగ్యంబొ ద్దు శివా అనన్య సులభా ఈశా

 

చావేనా డునుజె ప్పిరాదుమనుజుల్ చావాల నెంతేడ్చినన్

 పూవే రా లదుగా శివాజ్ఞ వరకే పువ్వై న నవ్వేను పూ తావేలే

 కసుమా ల కెట్లు పరమా ర్ధం బొచ్చు పారేటి   జీవాత్మ  పరమా

ర్థమెట్లు  బడయున్ శివాయ ప్రార్ధింపకన్


. ఓకాలే చితమం టలోని  శవమా ఉన్నంత  కాలాన్ని లా 

 బాకాలే గుడిలో నకట్టి  బతుకే  భాజాల మోతల్లొ  ఏ  

వాకాట్లన్బ్రతుకీ డ్చి తీవిచితిలో వాగ్వాద ముల్ వీడు 

మా పోకార గ్ని కబూ డిదేమిగులులే ఫొమ్మింక నీ మూట తో 

.

15 ద్యావాక్షం బులనిం డినాప్ర ణవ నా  ధంబున్ త్రి ధామున్ త లం

చావామా ర్థవిభున్ అనుని త్యమనో సామీప్య  తన్ బొంద గన్


16  కైలాస మ్మునమే ఘుమండ లములో  కైవార  మంతాస రా  

గాలాడెన్ సతితో  ఉమాప తిసరా  గా లాడు చున్ జేసె   నా 


ఆరంభిం సారంభం తనెరిం   కృురంబై స్వయం ఆధారం బౌ


17 బూరాయం దునగా లినింపె నరుడా భూమంత మింగే టి యా

 కారాడా శనువీ డునీటి బుడగే కాయంబు భూమంత యూ 

కారాగా రముజీ వుడందు మసలున్ గంట మ్రో గంగ నే 

దూరాభా రములే కసాగ  వలెలే  తోడుండు నీపుణ్యమే 



18 తాకే నం దమునీ వయస్సు కనులన్ తల్లింక చేదాయె నా

 పాకేపి ల్లడిసా కినేర్పె నడకల్ ప్రాణంబ నేపెంచ గా

 సోకేము ఖ్యమనా లిహత్తు వడలే శుష్కంబు దేహంబు కా

 గాకాడే పిలిచే టికాల మున ఖర్మంబు వేటాడ దా!

.

19.భూలోకం బునునీ చబుద్దు లనుసం పూర్ణంబు గాకమ్మ గా 

 నాలోచిం పరుశం కరావి రుగడే నాస్వార్థ మేచిత్త మున్  

మాలిన్యం బునొన ర్చ మార్గ మొకటే భారంబు నీ  వేలోకా ల.........



20. అంగాగంబు

 బంగారంబు

 శృంగారంబు

 బృంగారం


శా. క్షుద్రానం  దములం  దగోరి పురుషుల్  క్షోభించి యార్జించు చూ  

బద్రంబు    క్షయమ     వ్వతాగి  జనులం   వంచించి జీవించు చుండ్రు   

రుద్రానీ  కృపకో   రినిన్ను  దినము   ప్రార్ధించ లోభంబు అంతంబ గున్    

నిద్రాణం   బుగను న్నబుద్ధి  బలమం  తవృద్దౌ   నీకృపన్ నిక్కంబు గన్  



జనులను పదవి వేషం చూపి హంగామా చేసి దోచుకుంటే కాలుడు ( యముడు)కుంభీ పాకంతో సంభావిస్తాడని ( సత్కరిస్తాడని) చెప్పే పద్యం.



శా. గంభీరం   బుగవే   షమేసి  జనులన్ గాండ్రించి  ఏమార్చినన్

రంభారా    విడిజే   సిపెంచ సిరులన్  యాశూలి  కాగ్రహ  మొచ్చు  

కుంభీపా    కములో కినెట్టి  నరులన్ కుంపట్లో దుర్మార్గు లన్   

సంభావిం చునుకా  లుడంచు తెలిపెన్ శాస్త్రంబు స్పష్ఠంబు  గాన్  

.

శివుడిమీద మనసు లగ్నం చేస్తే  చావు కూడా దరి చేరదు అని చెప్పే పద్యం.  

 

శా.  చావేలే  దుగదా  స్మరింప  శివునా చారంబు   గానిత్య మున్

    త్రోవేదా  అరుణా త్మజు డై  నను బో తోడుండ  నీనామ మే

    పోవేళ    స్మరణం  బుమోక్ష  మొసగున్  భూతాత్ము గానంబు నన్

   చావేజే    రదుఖా  యమింక  నరుడా చచ్చేది   కాయమ్ము  రా

.

  పాశ్చాత్య నాగరికతను  వెనకేసుకు రావడానికి   స్త్రీ లోలతే కారణంఅని తెలియజేసే పద్యం 


శా.  వ్యామోహం  బునకా   మకౌతు కపువా  మాచార  నుష్టాన  మంత  

ఆమోదం  బనిప  ల్కుచూ,శి   వశివా   ఆలోచ లేమార్చు చుండ్రు      

ప్రమోదం  బునుగో   రినిత్య  మదన ప్రభావ చిత్తంబు నన్  

స్త్రీ మోహం  బునఇ   చ్ఛయంత పెరగ  స్త్రీలోలు లీరీతి  గన్

   

శా. దీపాలే  వెలిగిం  చనే ర్చి సిరిరా  దీవించ మంచు మృ క్ష  

పాపాలే    క్షయమొం   దగోరి   ఇలలో   పాపత్ము  లాశంక  రున్ 

కాపాడం  చుతలొం   చివేడ   ఎటులా  కాపాలి  మొరాల కించు

శాపాల  న్నియుజు   ట్టుముట్టి   కరిచే  సర్పాలై  బంధించ గన్ 


శా. చీరేగ  ట్టినితం  బిదారి    నటబో     చిత్రంబు  చూపించ గన్

వీరోల్లా సమునొం   దివీధి   శునకా   వేశంబు జూపించు చుండ్రు

చోరాధ  ములని  త్యమిట్లు   విరలిన్ శూన్యాత్ము  లైక్రుంగు చుండ్రు

పారాణిం  పరెకుం  కుమద్ది     నొసటన్  పాపాత్మ   శోభిల్ల  గన్


శా. ధనాశా    అడిమో  హమంట  మనుజుల్   ధాసోహ   మైబ్రాంతి చే   

అన్యాయ  మ్మనిదె   ల్సిజేతు  రుకదా    అన్యాత్తు లైజచ్చు  చూ

విన్యాస  మ్ములుజే  యశూన్య మునటె  వ్రేళ్ళాడి  రోదించు  చుండ్రు       

అన్యాక్రాం  తముజే     యనాత్మ    లకటా  ఆక్రంద ముల్జేయ గన్      

                                     

 శా.  ప్రలాపిం  చెడిఊ  రమూక  లనిషా   ప్రచార సంఘాల నమ్మి 

ప్రలోభా   లకులొం    గిఆత్మ నొదిలా  బ్రాంతుల్లొ జీవించు చూ 

విలాపిం   చుఅనా ధజీవు    లమనో   వేదనా మూలమ్ము లన్ని  

కాలాత్మ కృపచే  సవిత్తు  మొఱచే    కాలేను  నిశ్శేష   మై 


 శా. సారాయం  గడివ  ద్దజేరి   దళముల్  జామంత  వెచ్చించు చుండ్రు 

బారాది      ద్రవిణం   బుజేర    పురుషుల్  వారాంగ   నల్గూడు చుండ్రు 

పారాపా    రపు సొ     మ్ములున్న  జనులే    పక్షాలు  పెట్టింక   నెగ్గి   

నేరాలె  న్నియొజే    సి భూగృ      హముల   న్వేసారు చుండ్రీ శ్వరా    

      


10. శా.చోరాధ  మునిఏ     రికోరి      తమలో     చోరోత్త    ముండీత డంచు    

చోరాగ్రే   సునికా   సనంబు   నొసగన్      చోరుండు  ధీరుఁడ   గున్

ధారాళం  బుగ ఓ   టువేయు    జనులం  తాచోరు లైయొప్ప గన్         

చూరాడ   శ్ర మయే   దిరా శి      వశివా         చోరుండు  రాజేగ   దా                       

                                                                        

11. శా.   కాషాయం బనఏ    వగించి      కడకే   గాల్చేవు    దేశాన్ని వి  

ద్వేషజ్వా  లలకా  హుతిచ్చి  ఒరిగే    దేహాన్ని  మోహించ చూ         

పాషాణ హ్రదయం బుతోబ్ర     తకగన్    పాడెక్క   కాలంబు  నీ    

ఘోషప్ర      మథనా  థుకెగ్గు   కలగన్   ఘోరా తి ఘోరంబ గు  


12. శా. శంభోశం   కరపా    హిమాంశు  భకరా   సర్వాంగ  కైలాస వాస 

గంభీరం  బుగజూ  సినీచ   తలపుల్    గాల్చుము  కేదార  నాథ

సాంబాసం  భవమా   పరార్థ   పథమున్  సాహిత్య సావాస మన్

సంభారిం   పగసా   ద్యమానొ  సగుమా  చంద్రధ  రానీకృ  పన్ 

                                        

13. శా. పింజారీ   నటనా   లిజూప   పురుషుల్     వింజామ  రల్దెచ్చి  ధాత్రి  

రంజిల్లె    ననిమొ   క్కపెక్కు   మగువల్     లాస్యాల  కామాత్రు  లన్  

భంజించా    నరజా   లమంద     చటనే      బంధింప భస్మాంగు నమ్మి   

పూజింపన్   దయతో    డిమోక్ష    మొసగున్     భోగార్తి  భంజించు చున్                                                                  


14. శా. యంత్రాలే   లుజగం   బులన్ని   కలికా   లంబున్  యంత్రాల నమ్మి  

మంత్రాలే   లనిఈ      శ్వరాయ    నుటకే  మాత్రంబు  నిచ్చేక  ల్గక                  

తంత్రాలన్ నెరన        మ్మినాశ    నమనం   దాతంత్ర  ముల్ వీగ                                                        

మంత్రాలే  మెరుగం     చుజేరి    జనులా     భస్మాంగు   పూజించ రే  


15. శా.  వానాకా  లపువి   ద్య నేర్చి  జనులా    పాలాక్షు    శోధింప మాని    

జ్ఞానాన్వే  షులమం  చుమూఢ  మతితో  సాంకేతి   కప్రజ్ఞ  బట్టి                       

సూన్యా కా  శమునం  దురిత్త    జగముల్    శోధించి  జీవాత్మ నొడ్డి   

విన్యాస   మ్ములుజే    యనిల్పి    గొనియా    విశ్వాత్మ    శోధింప రే


16. శా. వాతఃవే  గమునం  దిపారు మెకమే  వ్యాఘ్రంబు  చేజిక్కి జచ్చు   

కాంతామో  హమునం  దుబడ్డ పురుషుల్   కాలాంత  కుల్వీరు  లైన    

కాంతారం  బునకం   దకంబు  నబడ్డ    కాళింగ  మున్ బోలి ఆయు     

వంతాచి   క్కగశం      కరాత   మనుతా    వంచించు  కొంచుండ్రు   


 17. శా. సారాధా  రలుపో  సికోట్ల  ధనమే సంకోచ  మేలేక  జల్లి         

బేరాలా   టలగ   ద్దెనెక్కి     కొలిచే     వీరాభి   మానుల్ మొల్వ    

తారాజు  వ్వనుపో  లినింగి  కెగసి     ధాత్రంత  పాలింతు  నంచు      

కారాగా  రమునం  దుకూలి  అచటన్   కాలాత్ము   యోచింప రే  


18. శా . మందార మ్ము గమ   బ్బు పట్ట  నభమున్    పాణింద  మంబట్టు 

    బంధాల  న్నియుజు  ట్టుముట్ట మనసున్   మాయంత కమ్మేయ దే 

    బృందార మ్ము గజిం  కతాల్పు  దయజూ  పంగవై   రాగ్యంబు సోకు  

    బంధాల  న్నియువీ  డుకోర్కె లడుగున్     పంథాలు మారింకపోవు 

       


19. శా. వేళాకో    ళముజే  సిపెద్ద    నివయో    బేధమ్ము  జూడక   వాగి    

             జైళ్లంబ   డ్డవినీ  తిమంతు  నిలలో    జైజైని    నాదమ్ము జేయు 

             క్రుళ్ళిపో  యినపా  డుజాతి   మదిలో   క్రూరమృ  గావేశ  మున్     

            వేళాకో    ళపుబు     ద్ధిదిద్ద      గ మహా     పింగాక్ష   నిన్  వేడె దన్                                         



  20. శా . సంపత్తే     నిఖిల   మ్మనెంచి  పురుషుల్  సంసార మేసత్య  మంచు

             వెంపర్లా  డచుకూ     డబెట్టి      సిరులన్     వేలాది  రొక్కంబు  పా 

             రంపర్య   మ్ముగని  వ్వకాంక్ష   పెరుగున్      రాదింక వైరాగ్య ము 

             వెంపర్లా   డచుసం   పాదించు చుసుతుల్  వేసారు  చుండ్రీశ్వ రా  


21. శా. రూపాయా  టలవి   శ్వసించి  జనులే   లోపంబు  లంజూడ  రెట్టి           

            వ్యాపారమై  ననుజే  యుచుందు రటులే   భద్రేసు   నమ్మింక యా                           

           రూపంబున్  మనమున్  తలంచు టకుయే   లోపంబు అడ్డొచ్చు నో                   

            కాపాలీ      నినుచి    త్తమందు   నిలపనీ   కటాక్ష  మేకావ  లెనయ్య     


22. శా.సామాన్య  ప్రతిభా  విశేష ములనే  చాలించి  వాదంబు లా, ప 

సామాన్య  ప్రమథ   గణశ    క్తులనే    శాసించు   ఫాలాక్షు దక్ష      

జామాతన్   పరమే   శుపాద  ములనా   శ్రయింతు   జ్ఞానార్థి యై  

కామాక్షీ   పతి కా  టిభూడి  దనిచ్చి  కారుణ్య  మున్ జూప వయ్య


23. పొంగేను  త్రిపురా  రిశీర్ష  మునయా పొంగేటి  గంగను జూడ 

వంగేను     జగమం  తచూడ మనసే వాలేను పాదాల చెంత                                                      

ఊగాడే      జటలొం   కచూడ   మదిలో ఉన్మత్త  రూపముం నిల్ప     

భోగాలే    లయవీ   తరాగ  సిరులన్   పూర్ణవై   రాగ్యము నిమ్మ

 

24. లెక్కింపొ  క్కడువీ  తరాగ       మునుకో     రిశ్రీక  రున్వేడు  కో            

ట్లొక్కండే   తపమా  చరించు  నిలలో   డోలాయ మానంబు వీడం 

దొక్కండే   అనుభూ  తిచెందు      తాలును   తూర్పాఱ   బట్టి 

చొక్కించా త్మలలా  టలోచ  నునియా  జోటింగు  


25. సౌఖ్యాలే  పరమా        ర్థమంచు   కలలన్  సాకార ముంజేయ ఘోర     

సంఖ్యాక  మగుపా      పకార్య    ములజే   సామ్లేచ్ఛ  సౌజన్య  మంది    

విఖ్యాత    మ్మగుయో    గసిద్ధి    యుతపో    మోక్షంబు   లన్వీడి  నీచ 

లక్ష్యాలం   బడిపో        యికాన    రికకా       లాత్మప్ర     భావంబు నే   


26. కాలక్షే    పముకో    రిలాల  పరమే    గావించి భోగవి  లాసమ్ము లం 

      దేలక్షే    పముజే   యచిత్త    మునుమ   త్తేగమ్మ  ధనార్జ   నం                          

       బేలక్ష్య మ్మనిన   మ్మి              నెటుగం  భీరంబు     


27. తెల్సే  దేహమశాశ్వతమ్ము ని   నరుల్  తేజమ్ము   మక్కిల్లు దాఁక        

తెల్సేకో   ర్కెలకొ     క్కిరాల    కెరగా       దేహమ్ము   నర్పించు చుండ్రు  

జల్సా  లేమియు   వీడలేక       తమతే    జమ్మా రు  అంత్యక్ష ణాన    

కల్సేరా    నివివే      కమత్త     మిల్లగన్     కాట్రేనొ    డిన్వాలు చుండ్రు


 ఈ శరీరం  నేను కాదు అని తెలిసిన మనిషి నిస్సహాయుడై కోర్కెల కొక్కిరాయిలకు తన దేహాన్ని అప్పగించి జీవిత అస్తమించిన పిదప వల్లకాడుచేరి కాట్రేని ఒడిలో  దీర్ఘ నిద్రలో కి జారుకుంటారు. శరీరముతో అంటకాగకూడదు శరీరం మనం కాదు  శరీరంలో లో ఉన్న చైతన్యం మాత్రమే మనం.


28. వేరేదే    మియుకా   దుదేహ   మనగా   వెంటాడి   పీడించు చీడ   

పారేఏ   రువలే      యుగాల   పడిజీ   వాత్మప్ర     వాహంబు సాగు     

వేరేరూ  పముయ   బ్బవాస    నలతో    వేటాడు   దేహంబు  దాట

దారేదీ   మరియా    త్మయోగ  ధనభూ   తాత్మకృ  పాక్షంబు  లేక


29. వందేరు ద్రమహా   శివంప     శుపతిం     మాహాత్మ  యంశంక రం

వందేరు ద్రఉమా  పతింభ    యహరం   వాతాత్మ    జారూప భక్త 

మందారా గ్రనమో  గిరీశ         నభవా       భస్మాంగ   ప్రాజంగ మోహ 

బంధాలే   విడ కో    రువార      కుసదా     ఫాలాక్ష   మోక్షమ్ము నిమ్ము. 


కాపాలీ శ్వరచూ డవయ్య  పరలో  కప్రాప్త మేకోరి  ప్రా 

ర్థింపస్వ  ర్గముద   క్క దెవ్వ  డికిన ర్ధింపన్ కు తంత్రము   వీ  

డాపాలా క్షుడుమె చ్చు ధర్మ మును వీ డాపదల్


30. ఆరంభిం 

సారంభం

 కృురంబై 

 ఆధారం 


 అనేక శరీరాలగుండా మన ఆత్మ యుగయుగాలుగా ప్రవహించే నది.  కానీ శరీరమే మనం అనే బ్రాంతి లో నే మనం జీవిస్తాము. ఒక పీడలా  మనని పట్టుకు పీడిస్తున్నది మన శరీరం మాత్రమే. శరీరం ఒక చీడ.  యోగధనుడు ప్రథమ యోగి అయిన ఈశ్వరుని కృపలేనిదే ఈ శరీరాన్ని దాటలేము.    

ఆత్మేనీ వనిన  మ్మినాక  మరికా 


ఈ శరీరం నేను కాదు అని మనసుని నమ్మించడం చాలా కష్టం దానికి దైవప్రార్ధన తోపాటు వైరాగ్యం కూడాకావాలి . 


కష్టాలనుంచి తప్పించుకుని సుఖాలకోసం ప్రాకులాడితే వచ్చే ప్రయోజనం ఏంటి . సుఖాల తర్వాత మల్లె కష్టాలు వస్తాయి. 


4. కష్టాలని స్ఫూర్తి గాతీసుకుని వైరాగ్యాన్ని వెతుక్కోవాలి వేమన, ధూర్జటి  లాంటి ఎంతోమంది కవులు వైరాగ్యాన్ని పొందారు  


5. ఎక్కువకాలం బ్రతకడం కోసం  నానాబాధలు పడి  ఆరోగ్యం సంపాదించినా  ప్రమాదంజరిగి మనిషి ఆయువు తీరిపోతుంది 

ఆరోగ్యం కోసం కాక వైరాగ్యం కోసం తపించాలి 


 6. తెగింపు  ధైర్యాన్నిస్తుంది. చావంటే భయంలేదని డంబాలు చెప్పడం మనసుని బండబార్చడం  వైరాగ్యం చావుని సులభం చేస్తుంది. చావుకోసం  ఎదురుచూసేలాచేస్తుంది. ఎక్కువ కాలామ్ బ్రతికి ఉండడం కూడా ఏమీ ప్రయోజనం లేదు 

  

7. మండూకం నేలమీద నీటిలోను ఉన్నట్టుగా మనిషి భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల్లో ఉండాలి. భౌతిక ప్రపంచంలో మనిషి తక్కువ ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంట ఎక్కువ ఉంటాడు. 


 8. బరువు హెచ్చు ఉన్న పెద్ద నౌక  , కనిపించకుండా సముద్రం లో   పైభాగం ఎంత ఉంటుందో నీటికింద కూడా అంటే ఉంటుంది. జ్ఞానం బాగా ఉన్న పండితుడు  కూడా అలాగే ఆధ్యాత్మిక సముద్రంలో మునిగి ఉంటాడు. 


9. మనిషి అందం కోసం ఆరాటపడుతున్నప్పుడు ఇతరులను మెప్పించడానికి తాపత్రయ పడుతున్నాడని గ్రహించాలి . అంతరాత్మను పమెప్పించే పనులు చేయడం లేదని కూడా గ్రహించాలి.  అందుకు కారణం వైరాగ్యం లేకపోడమే 


10. వైరాగ్యం ఎందుకుండాలి వైరాగ్యంతో భయం నశించి స్వేచ్ఛ వస్తుంది. నిజమైన ఆనందం లభిస్తుంది 


11. నిజమైన  లోతైన వైరాగ్యం ఆత్మానుభూతిని క్షణకాలమైనా కలుగజేస్తుంది. 

ఆత్మానుభవం కలిగినవాడు నీచమనుషుల మెప్పుకోసం తపించడు 


12. ఈ లోకంలో పేరు సంపాదించుకోడం కూడా  ఇక్కడ వరకే పనిచేస్తుంది, కీర్తి  జ్ఞానం రాదు , జ్ఞానం వాళ్ళ కీర్తి వస్తుంది. జ్ఞానంలేని కీర్తి దండగ. 


13. అనేక రకాల విషయాలు వాటి జ్ఞానాలు,  భౌతిక ప్రపంచంలో వాటి విలువ  వేరువేరుగా ఉంటాయి. ఏ జ్ఞానం సంపాదించినా  సేవచేసి డబ్బు సంపా దించడంకోసమే. ఆత్మజ్ఞానంతో డబ్బు సంపాదించరు.  అందుకే ఆత్మ జ్ఞానంకంటే  గొప్పది ఏదీ లేదు.  



 14. భౌతిక మానసిక అనుభవాలద్వారా సుఖం జ్ఞానం సంపాదించవచ్చు. 

తినడం తాగడం , ప్రయాణించడం అన్నీ సుఖాన్నిస్తాయి. చదవడం , వినడం , ఆలోచించడం అన్నీ జ్ఞానంతో పాటు హాయినిస్తాయి 


15. సుఖం కంటే  ఆనందాన్ని మనసు ఆలింగనం చేసుకుంటే మనిషికి సూక్ష్మం లో మొఖం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనిషి సుఖంకోసం పడరాని పాట్లు పడుతుంటాడు. 

   

16.  సుఖం రెండూ  కోరుకుని  కష్టాలు కొనితెచ్చుకోడం  ఎవరికీ  ఇష్టం ఉండదు ఆనందం  సుఖం కంటే గొప్పది అని  వదిలేయాలని ఉన్నా సుఖాలని త్యజించే  దైర్యం లేక  కష్టాలు పడుతుంటారు


17. ఎక్కడికీ కదలకుండా కూర్చోడం శరీరానికి ఎంత కష్టమో మనసుకు కూడా ఓయీ విషయం మీద ఉండడం  అంతే  కష్టం. 


18. అభౌతిక మైన ఆత్మని భౌతిక మైన  శరీరంతో  అనుభూతి చెందడం కష్టమే ఆత్మని అనుభూతిచెందడం చీకటిలో చూడడానికి ప్రయత్నించడం కంటే కష్టం.  


19.   ఆత్మని అనుభూతి పొందినవారు తమ ఉనికిని బాహ్య స్పృహను మరిచిపోతారు. మరి ఆత్మని అనుభూతి చెందినది ఎవరు?

 

20.  అహం అనేది , సూర్యునిలా భౌతిక ప్రపంచం లో  అస్తమించినప్పుడు   ఆత్మజ్ఞానం ఉదయించి భూమి కి ఉన్న మరో తలంలో ప్రకాశిస్తుంది   


            

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః!

ఉభయోరపి దృష్టోఽన్తఃత్వనయో స్తత్త్వదర్శిభిః!!


తాః అసత్యమైనది లేనేలేదు. సత్యం అనేది ఉండకపోదు. తత్వవేత్తలు ఈ రెండింటి తత్వమును శ్రద్థగా అధ్యయనము చేసి విషయమును ధృవీకరించిరి.    



సర్పాల   ల్లినఘో   రునిప్ర   మథుని స్కందంబు లంజూడ గా 

ఘోరాకృ  తైమహా    భయాన కములై   క్రూరంబు   గా                                          

  

కర్పూరా రతిని  చ్చికష్ట  ములుదీ     



                                                                      



                 

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...