దేవకి అద్దం ముందు నిలబడింది. ఆమె ఒంటిమీద మెరిసే ఎర్రటి చీర, దానికి పూర్తి విరుద్ధంగా ముదురు నల్లటి జాకెట్టు. ఆమె బంగారు వర్ణం ఆ ఎర్రటి చీరకే సవాలు విసురుతున్నట్టుంది. నిండైన స్త్రీత్వంతో ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వయసు నలభై అయిదు అయినా ముప్పై అయిదేళ్ల స్త్రీలా కనిపిస్తోంది. అంతటి రూపం, శరీరాకృతి ఉన్న ఆమె ఇన్నేళ్లుగా ఒంటరి తల్లిగా జీవించిందంటే నమ్మడం కూడా కష్టమే.
ఆమె చిన్న వెండి భరిణ తెరిచి చిటికెడు సింధూరం తీసుకుంది. నుదుటి పాపిటలో దాన్ని పెట్టుకుంటూ ఏదో ఆనందలోకంలోకి వెళ్లిపోయింది. ఆమెను చూస్తున్న కొడుకు చిన్నగా నవ్వాడు. స్త్రీ అందం పురుషుడి కోసమే కానీ అద్దం కోసం కాదన్న భావం ఆ నవ్వులో ఉన్నట్టుగా దేవకికి అనిపించింది.
దేవకి వెంటనే వెనక్కి తిరిగింది. “కన్హయ్యా! ఎందుకు నవ్వుతున్నావు?” అని కాస్త కఠినంగా అడిగింది.
నిజమే. స్త్రీ అందం, ఆకర్షణ ఆమె జీవితంలో ప్రేమను పంచుకునే వ్యక్తితో ముడిపడి ఉంటాయి. కానీ కొందరు దురదృష్టవంతులైన స్త్రీలకు తమ అందాన్ని అద్దంలో చూసుకోవడం తప్ప మరొక అవకాశం ఉండదు. దేవకి కూడా అలాంటి వారిలో ఒకరు.
కన్హయ్య మౌనంగా ఉండిపోయాడు. ఏమీ సమాధానం చెప్పలేదు.
“అచ్చా... ఎప్పుడు లేచావు?” అని దేవకి అడిగింది.
“గంట క్రితం.”
“ఈ రోజు ఏదైనా ఇంటర్వ్యూ ఉందా?”
అతను మళ్లీ మౌనంగా ఉండిపోయాడు.
“నిన్ను అడగడం కూడా అనవసరం. నిద్రలేని నీ కళ్లు చూస్తేనే తెలుస్తోంది. రాత్రి చాలా సేపు ఇంటర్వ్యూకి సిద్ధమవుతూ ఉన్నావు. నీకు మంచి ఉద్యోగం రావాలని నేను దేవుణ్ణి ఎంతగా ప్రార్థిస్తున్నానో! కానీ ఆయన నా ప్రార్థనలు వినడం లేదు,” అంది దేవకి.
“నేను త్వరగా బయలుదేరాలి. ఇంటర్వ్యూ ఫరీదాబాద్‌లో ఉంది,” అన్నాడు కన్హయ్య.
“నీకు టీ ఇస్తాను,” అంటూ దేవకి వంటగదిలోకి వెళ్లింది.
కన్హయ్య బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. అయిదు నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద టీ, అల్పాహారం సిద్ధంగా ఉన్నాయి. కన్హయ్య కూర్చుని తినడం మొదలుపెట్టాడు. దేవకి అతని దగ్గరకు వచ్చి కొంత డబ్బు అతని జేబులో పెట్టి, వెంటనే కుట్టుమిషన్ దగ్గరకు వెళ్లి పని మొదలుపెట్టింది.
అది ఎలక్ట్రిక్ కుట్టుమిషన్. రెడీమేడ్ దుస్తులు కుట్టడంలో దేవకికి మంచి నైపుణ్యం ఉంది.
అల్పాహారం తింటూ కన్హయ్య యథాలాపంగా తల్లివైపు చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆమె పక్కన జీన్స్ ప్యాంట్ల పెద్ద కుప్ప ఉంది. దాని పక్కనే చొక్కాల కుప్ప కూడా కనిపిస్తోంది.
“మా! యే క్యా హై? ప్యాంట్లతో పాటు ఈ షర్ట్లు కూడా ఎందుకు తెచ్చావు?” అన్నాడు.
“కోయీ నహీ బేటా. ఈ షర్ట్లకు బటన్లు పెట్టాలి,” అంది దేవకి సాధారణంగా.
తన పుట్టినరోజుకు మోటార్‌సైకిల్ కొనివ్వాలని తల్లి అనుకుంటోందని కన్హయ్యకు తెలుసు.
“నువ్వు ఇంత పని చేయడం నేను చూడలేను. నాకు మోటార్‌సైకిల్ వద్దు,” అన్నాడు.
దేవకి అతనివైపు చూసింది.
“హుమ్... నీ అమ్మ కష్టపడటం నువ్వు చూడలేవు. నా కొడుకు బస్సుల్లో తిరుగుతూ కష్టపడటం నేను చూడలేను.”
కన్హయ్య గొంతు బరువెక్కింది.
“నాన్న నిన్ను వదిలి వెళ్లినప్పటి నుంచి పదేళ్లకు పైగా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు. నా చదువు భారమంతా నీ భుజాల మీద వేసుకున్నావు. నేను చదువు పూర్తి చేశాను. కానీ ఉద్యోగం సంపాదించలేకపోయాను. ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయాను. బంధువులూ, స్నేహితులూ నన్ను పనికిమాలినవాడని, తిరుగుబోతని అంటున్నారు.”
ఆ మాటలు చెప్పేసరికి కన్హయ్య ముఖం బాధతో ముడుచుకుపోయింది. గొంతు బిగుసుకుంది.
దేవకి ఒక్కసారిగా ఆవేశపడింది.
“నా కొడుకును పనికిమాలినవాడని అనడానికి వాళ్లకు ఎంత ధైర్యం! వాళ్లను ముక్కలు ముక్కలు చేస్తాను!” అంది.
కన్హయ్య ఫైల్ తీసుకొని బయలుదేరబోతుండగా దేవకి అతన్ని ఆపింది.
“బేటా... ఒక్కసారి మూడో అంతస్తులో ఉండే మేను కలవకూడదా?”
“మా!” దాదాపు అరిచాడు కన్హయ్య. “నన్ను ఆమె దగ్గరకు ఎందుకు పంపాలనుకుంటున్నావో నాకు తెలుసు. నాకు కాల్‌సెంటర్‌లో పని చేయడం ఇష్టం లేదు. అంతేకాదు, ఎవరి సిఫారసుతోనూ ఉద్యోగం సంపాదించడం నాకు ఇష్టం లేదు.”
అంటూ తలుపు దగ్గరకు వెళ్లిపోయాడు.
“ఉద్యోగం కోసం ఆమెను కలవమని నేను చెప్పడం లేదు. నేను చేసిన టీ ఆమెకు ఇచ్చిరా, అంతే,” అంది దేవకి.
“మై నహీ జావూంగా, మా!” అన్నాడు తలుపు తెరుస్తూ.
“అమ్మాయిలతో మాట్లాడటానికే ఇంత భయపడితే నీకు పెళ్లి చేయడానికి అమ్మాయిని నేను ఎలా వెతకాలి?”
“ముందు నువ్వు పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా ఉండు.”
“హాయ్ హాయ్! నా పెళ్లా? క్యా బాత్ కర్ రహే హో?” అంటూ దేవకి నిశ్చేష్టురాలైంది.
కన్హయ్య తలుపు మూసి వెళ్లిపోయాడు.
ఉదయం ఎనిమిది గంటలకు మ్యాపుయి నిద్రలేచేసరికి మేఘన అప్పటికే ఉద్యోగానికి వెళ్లిపోయింది.
“ఓహ్! ఈ అమ్మాయి అప్పుడే పనికి వెళ్లిపోయిందా!” అనుకుంటూ మ్యాపుయి వంటగదిలోకి వెళ్లింది. టీ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. స్టవ్ వెలిగించిందో లేదో కాలి పట్టీల శబ్దం వినిపించింది. అది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే దేవకి అని ఆమెకు వెంటనే అర్థమైంది.
మ్యాపుయి వెళ్లి తలుపు తెరిచింది. తలుపు ముందు దేవతలా కనిపిస్తున్న దేవకి నిలబడి ఉంది.
“ఓహ్! మిర్చీ ఆంటీ! రండి... రండి!” అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లింది.
ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. దేవకి కొంచెం సిగ్గుపడినట్టుగా ముఖం పెట్టింది.
“అబ్బాయిలందరూ మిమ్మల్ని ‘మిర్చీ ఆంటీ’ అని పిలుస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది?” అని మ్యాపుయి సరదాగా అడిగింది.
“నాకు సిగ్గేస్తుంది. అయినా నువ్వు అబ్బాయివి కాదు కదా!” అంది దేవకి.
“నేను అబ్బాయినై ఉంటే మిమ్మల్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునేదాన్ని!” అంది మ్యాపుయి.
దేవకి నవ్వుతూ వంటగదిలో నుంచి రెండు కప్పులు తెచ్చి వాటిలో టీ పోసింది.
“మేఘనను లేపు. మీ ఇద్దరి కోసం టీ తెచ్చాను,” అంది.
“ఆమె వెళ్లిపోయింది. ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఫస్ట్ షిఫ్ట్.”
“అయితే ఈ రెండో కప్పు ఏం చేయాలి?” అడిగింది దేవకి.
“మీరే తాగండి.”
ఇద్దరూ టీ తాగడం మొదలుపెట్టారు.
అంతలో సోఫా పక్కన ఉన్న టేబుల్ మీద ఒక చిన్న కాగితం దేవకి కంటపడింది. దాన్ని తీసి మ్యాపుయికి ఇచ్చింది.
మే, మ్యాపుయికి రాసిన నోట్ అది. మ్యాపుయి దాన్ని గట్టిగా చదివింది.
“నీతో గడిపిన సమయం చాలా బాగుంది. థాంక్స్. ఉదయం షిఫ్ట్ కారణంగా కనీసం నీకు ముఖం కూడా చూపించకుండా వెళ్లిపోయాను, సారీ. వీకెండ్స్‌లో మనం కలిసి ఎంజాయ్ చేద్దాం. — మే.”
చదవడం పూర్తికాగానే దేవకి నవ్వింది.
“దోస్తీ హో గయా?”
“అవును. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆమె షిఫ్ట్ డ్యూటీలు చూస్తే యంత్రంలా అనిపించేది. నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఆమె ఇంట్లో ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆమె నిద్రపోతుంది లేదా ఏదో పనిమీద బయటకు వెళ్తుంది.”
దేవకి నవ్వింది.
“ఆమె నీతో ఉండడం మొదలుపెట్టి కొన్ని వారాలే అయ్యాయి కదా! స్నేహం ఏర్పడటానికి కొంత సమయం పడుతుంది. ఇక్కట్టా ఖానా హై, పీనా హై... తబ్ బఢేగా ప్యార్! ఇంతకీ మీరిద్దరూ కలిసి ఎక్కడ తిన్నారు?”
“ఇక్కట్టా ఖాయా నహీ... మగర్ ఇక్కట్టా పీనా షురూ కర్ దియా! కలిసి తినలేదు కానీ కలిసి తాగడం మాత్రం మొదలుపెట్టేశాం,” అంది మ్యాపుయి నవ్వుతూ.
ఆ తర్వాత ఒక్కసారిగా దేవకిని చూసింది.
“యే సబ్ ఛోడ్! మీరు ఎందుకు పెళ్లి చేసుకోరు?”
“హాయ్... హాయ్... ఇంత పెద్ద కొడుకు ఉండగా నేనెలా పెళ్లి చేసుకుంటాను? వాడు నా గురించి ఏమనుకుంటాడు? ప్రపంచం ఏమనుకుంటుంది?”
“కానీ మీకు పెళ్లి చేసుకోవాలని, జీవితంలో ఒక తోడు ఉండాలని అనిపించదా? చూడండి దేవకి, మీ కొడుకు గురించి నాకు తెలియదు. నేను అతన్ని చూడలేదు, మాట్లాడలేదు కూడా. కానీ మన కోరికలనూ, ఆశలనూ మనలోనే దాచిపెట్టి అణచుకుంటూ ఉంటే అది మనసుకూ ఆరోగ్యానికీ మంచిది కాదు.”
దేవకి మ్యాపుయిని చూస్తూ నవ్వింది.
“నువ్వు చాలా ఓపెన్‌గా ఉంటావు. నీ వ్యక్తిత్వాన్ని దాచుకోవు. కానీ అందరూ నీలాగా ఉండలేరు.”
“మీరు నాకు చాలా ఇష్టం, నా స్వీట్ సిస్టర్! టీకి థాంక్స్. ఇక నేను ఆఫీసుకు వెళ్లాలి.”
దేవకి తన ఇంటికి వెళ్లిపోయింది. మ్యాపుయి బాత్‌రూమ్‌లోకి వెళ్లింది.
“కైరా! ఇంకా మంచం మీదే ఉన్నావా? మనం ఇరవై అయిదు కిలోమీటర్లు ప్రయాణించాలి.”
మానాలిని కైరా బెడ్‌రూమ్‌లోకి వచ్చింది. తెల్లటి చీర, నల్లటి జాకెట్టులో ఆమె అప్పుడే వికసించిన కమలంలా కనిపిస్తోంది. కానీ కైరా మాత్రం నీరసంగా కనిపించింది.
మానాలిని ఆమె దగ్గరకు వచ్చింది.
“నేను రెడీ అయ్యాను. నువ్వు ఆఫీసుకు రావా?” అని గట్టిగా అడిగింది.
“నో బాబా! ఈ రోజు ఆఫీసుకు రాలేను. నాకు ఆరోగ్యం బాగోలేదు,” అంది కైరా.
మానాలిని ఆమె నుదుటి మీద చేయి పెట్టి చూసింది.
“జ్వరం ఏమీ లేదే! అయినా డాక్టర్ దగ్గరకు వెళ్లు లేదా మందులు వేసుకో. ఏదైనా సహాయం కావాలంటే నాకు మెసేజ్ చెయ్యి.”
మానాలిని లంచ్‌బాక్స్ తీసుకొని బయలుదేరింది. తలుపు వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చింది.
“నీ కోసం నేను కూడా ఈ రోజు ఇంట్లో ఉండిపోనా?” అడిగింది.
“చల్! ఏయ్, కోయీ నహీ!” అంటూ కైరా ఆమెను తలుపు వరకు తరిమింది.
లిఫ్ట్ కిందికి వెళ్లగానే కైరా తన బెడ్‌రూమ్‌లోకి పరుగెత్తి ఆనందంతో గంతేసింది. అప్పుడే ఆమె మొబైల్ స్క్రీన్ వెలిగింది. అగర్వాల్ నుంచి మెసేజ్ వచ్చింది.
“నేను దారిలో ఉన్నాను.”
కైరా ఆ మెసేజ్‌ను గట్టిగా చదివి ఎంతో ఉత్సాహంగా స్నానానికి వెళ్లింది.
స్నానం చేసి చిన్న దుస్తుల్లో అద్దం ముందు నిలబడినప్పుడు ఆమె అప్సరసలా కనిపించింది. తన శరీరాకృతిని అద్దంలో చూసుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి తన రూపాన్ని పరిశీలించుకుంది.
ఎదురుచూస్తున్న క్షణాల ఊహతో ఆమె శరీరం పులకరిస్తోంది. వెన్నెముక మీదుగా ఏదో తెలియని ఉద్వేగం పరుగెడుతోంది. గడిచే ప్రతి నిమిషంతో గుండె వేగం పెరుగుతోంది. ఆమె గుండె మీద చేయి వేసుకుంది. అది వేగంగా కొట్టుకుంటోంది.
కాలింగ్‌బెల్ మోగింది.
కైరా తలుపు దగ్గరకు పరుగెత్తింది. కానీ ఒక్కసారిగా మానాలిని గుర్తుకు వచ్చింది. ఆమెకు తెలియకుండా తాను చేస్తున్న పని గుర్తొచ్చి కైరాలో అపరాధభావం కలిగింది.
తలుపు కన్నంలోంచి బయటకు చూసింది. అక్కడ నిలబడిన ఆకర్షణీయమైన వ్యక్తిని చూసి ఒక్క క్షణం మైమరచిపోయింది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిచిపోయినట్టయింది.
తలుపు తెరిచింది.
అగర్వాల్ లోపలికి అడుగుపెట్టాడు. అతని వ్యక్తిత్వంలో ఏదో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం కనిపించాయి. అతను కైరాను చిన్నపిల్లలా ఎత్తుకొని బెడ్‌రూమ్ వైపు తీసుకెళ్లాడు.
“కాస్త ఆగలేవా?” అంది కైరా.
“నేను ఆగగలను. కానీ సమయం ఆగదు,” అన్నాడు.
అతను ఆమెను మంచం మీద దించాడు. కైరా అతని ఆవేశాన్ని గమనించింది. ఇద్దరి మధ్య ఆకర్షణ ఒక్కసారిగా తీవ్రమైంది. అతను ఆమెను ముద్దులతో ముంచెత్తబోతుండగా కైరా ఒక్కసారిగా అతన్ని ఆపింది.
“స్టాప్!”
“నాకు ఆగాలని లేదు,” అన్నాడు అతను.
కైరా వెంటనే లివింగ్‌రూమ్‌లోకి వెళ్లి సోఫాలో కూర్చుంది. అతను ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె అతన్ని వెనక్కి నెట్టింది. అగర్వాల్‌కు ఏమీ అర్థం కాలేదు.
“నాకూ ఆగాలని లేదు. కానీ...” అంటూ కైరా మాట మధ్యలోనే ఆపేసింది.
అతను ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఆమె మనసులో ఏదో సందేహం ఉందని అతనికి అర్థమైంది.
“స్నేహానికి సంబంధించిన నీతి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు మానాలినిని మోసం చేయడం లేదు,” అన్నాడు.
కైరా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
“ఆమె పేరు నీకు ఎలా తెలుసు?”
“ఆ విషయాలన్నీ తర్వాత చెబుతాను,” అన్నాడు అగర్వాల్.
ఆమెవైపు చూస్తూ కొనసాగించాడు.
“కాలం మన అందాన్ని నెమ్మదిగా తీసుకుపోతుంది. అందుకే మనకు దొరికిన జీవితాన్ని మనసారా ఆస్వాదించాలి,” అన్నాడు.
కైరా అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది.
“ఇదంతా ఇప్పటికీ నాకు వింతగానే అనిపిస్తోంది. స్కార్లెట్ బార్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మనం అనుకోకుండా కలిశాం. నువ్వు నన్ను కారులో ఇంటి దగ్గర దింపావు. జిమ్‌లో మనం కలవడం కూడా యాదృచ్ఛికమే. మన మొదటి సాన్నిహిత్యం కూడా అలాగే జరిగింది. ఇప్పటికీ నీ పూర్తి పేరు కూడా నాకు తెలియదు!” అంది కైరా.
అగర్వాల్ నవ్వాడు.
“ఓహ్! అదే నిన్ను ఇబ్బంది పెడుతోందా? అయితే విను. నేను మయూర్ అగర్వాల్, మిస్ కైరా ఛటోపాధ్యాయ్. మాది మధ్యప్రదేశ్. మా నాన్న గిరీష్ అగర్వాల్. ఆయన ఇండోర్ హైకోర్టులో లాయర్. మా అమ్మ మహారాణి లక్ష్మీబాయి పీజీ కాలేజీలో ప్రొఫెసర్. ఇంకా నా గోత్రం, మిగతా వివరాలు కూడా కావాలా?” అని సరదాగా అడిగాడు.
కైరా ముఖంలో అప్పటివరకు కనిపించిన ఉద్విగ్నత కొంచెం తగ్గింది.
“సారీ అగర్వాల్... ఐ మీన్, మయూర్ అగర్వాల్. కానీ నా అపార్ట్‌మెంట్‌లో కాకుండా మనం ఏదైనా హోటల్‌కు వెళ్లడం మంచిదని అనుకుంటున్నాను.”
మయూర్ ముఖంలో నిరాశ కనిపించింది.
“కైరా, హోటళ్లలో చాలా వివరాలు, ఐడీ ప్రూఫ్‌లు అడుగుతారు. అది మంచిది కాదు. నా ఫ్లాట్‌కు కూడా వెళ్లలేం. మా అమ్మానాన్న నన్ను చూడటానికి వచ్చారు. ఇప్పుడు వాళ్లు ఇంట్లోనే ఉన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే నా స్నేహితుడి ఇంటికి వెళ్లవచ్చు.”
కైరా కొంతసేపు మౌనంగా ఉండిపోయింది.
మయూర్ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాడు. కైరా మొదట అతన్ని ఆపింది. కానీ ఇద్దరి మధ్య ఉన్న ఆకర్షణ మళ్లీ వారిని దగ్గరకు తీసుకొచ్చింది.
ఇద్దరూ లేచి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కొన్ని క్షణాలు పరస్పరం ముద్దుల్లో మునిగిపోయారు.
“లెట్స్ గో,” అంది కైరా.
ఇద్దరూ అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
Like Bharatavarsha in this story also we are seeing different characters.What is the purpose of Devaki character?What is going to happen between Manlini, Kyra and Mayur Agarwal? Waiting with suspense for the conclusion.
ReplyDelete