Monday, July 20, 2020

Bharatavarsha -11

విశాఖపపట్టణ నగరపాలక సభాభవనము (మునిసిపల్ ఆడిటోరియం)విద్యుత్ దీప విరాజమానమై  జిలుగువన్నెలలీనుచున్న  పీతాంబరదారియైన బింబాధరివలె  చూపరులను సమ్మోహన పరుచుచుండెను.   ఎర్రని తివాచీలు పరిచిఉన్న సువిశాల సుందర సభ అంతర్భాగము, వివిధవర్ణ-వస్త్రధారులైన, సాహిత్యానురక్తులతో నిండి చిత్రవర్ణములతో గూడిన  తులిప్స్  వనమువలె నగుపించుచుండెను. కవి, పండిత, కళాకారులు,  కలిసి-పారుచున్న  ఏరులవలె, త్రివేణి సంగమ పవిత్రతను తలపోయుచూ, ఙ్ఞానసింధువున విలీనమగు సాగరగామినివలె కనిపించిరి. దృశ్య మాధ్యమ వార్తప్రతినిధులకు, పాత్రికేయులకు, రాజకీయనాయకులకు, చలనచిత్ర ప్రముఖులకు సభ  అలకనందవలె కానరాగా, విరహోత్కంఠిత నాయిక ప్రియునికొరకు ఎదురుచూచుచున్నట్లు సభారంభమునకొరకు ఎదురు చూచుచుండిరి.  కొండకచో బూతు సంభాషణములను నెరుపుచు కాలహరణము చేయుటకు సభలో దూరిన కొలదిమంది ధూర్తులు  ఆలయమున  మూర్తుల దొంగిలించుటకొచ్చిన చోరుల వలె ఒకరిమొగములొకరు చూచుకొనుచు, పండ్లిగిలించు కొనుచుండ  రసజ్ఞులకు వీరు  తలలో దూరిన పేల వలె నగుపించిరి.  అట్టి నీచులందధముడొక్కడు, ఆంగ్లసర్పద్రస్టుండై  ఆంగ్లమునాలింగనమును జేసుకొని శ్లాఘించుచుండ  " పరపిండము తస్కరింపబూనిన పరేతుఁడి ( ప్రేతాత్మ) వలెనున్న   మ్రుచ్చుడెవ్వఁ డీవు ? " యని బసవడు వ్యాఖ్యానించెను. ఉన్నత రంగస్థలమున కవి పండిత సాహిత్య ద్రష్ట   పరివేష్టితుడయిన   భారతవర్ష మాత్రమువింధ్య శిఖరమున ఒంటికాలిన తపమాచరించుచున్న ఋషి వలె నగుపించెను. సమయము 6 గంటలు కావచ్చుచున్నది. భువన విజయం సాహితీ రూపకం ప్రారంభముకానున్నది.
భారతవర్ష తల్లి మాలిని గారు, చెల్లి మంజూష  తన మిత్రులందరితో ముందరివరసన  కూర్చొని ఉండగా వారి వెనుక  అగస్త్య,  విదిష ,కేశవ , రాఘవ , కూర్చొని ఉండిరి. బసవయ్య ఎచ్చటనూ కూర్చొనక నిలిచిన చోట నిలవక ఆసు యందు కండెవలె తిరుగుచుండెను. బన్నీ వచ్చిఇట్లు  కూర్చొనుము అని అగస్త్య అనగా నేనిపుడు బన్నీయనిన  యూరుకొనను , బసవడని పిలువుము కొంతమంది  మిత్రులు లింకనూ రావలసి యున్నది. నాకు వ్యవధి లేదు అని అనగా "ఇది ఏమి చోద్యము వీడు వెలగబెట్టవలసిన రాచకార్యమేమి కలదు"అని మిత్రులు భావించుచుండ వేదికపైనున్న భారతవర్ష సంకేతమివ్వగా చకచకబోయి బసవడు వేదిక నధిరోహించెను. 

పంచకట్టులో బసవడు గమ్మత్తు నున్నాడు. తెలుగువారికి పంచ కట్టు కడు ముచ్చటగా నుండును అని మిత్రులందరూ అనుకొను చుండ, వేదికపై బసవడు మాట్లాడుటకుపక్రమించెను. “మైక్ మొరాయించెను, పక్కనున్న ఎలెక్ట్రిషన్ ని పిలిచిన యెడల మైక్ సరిచేయును” అని ఒక నిర్వాహకుడు అనగా, బసవడు  ఇట్లనెను

"ఓవిద్యుత్వేత్తా, ధ్వనిపెంపు యంత్రోద్దారకా,సమయపాలనకాటంకమగుచున్నది ధ్వనిపెంపు యంత్రమును సరిజేసి  కవి పండిత వరేణ్యులాశీనులై  విద్వాంస విరాజమానమైన ఈ సాహితీ సభను నిర్విఘ్నమొనర్చ రయమున రమ్ము.” యని ఆశుకవితా ప్రజ్ఞనందరినీ అలరించెను. విద్యుత్వేత్త వచ్చి ధ్వనిపెంపు యంత్రమును సరిజేసినపిమ్మట బసవడు’ "ఎం.ఏ చరిత్రనందు గెలుపొంది, మరల ఎం.ఏ తెలుగు నందు గెలుపొందిన భారతవర్ష ఈ సాహిత్య సభను నిర్వహించుట, అందులకార్ధికసహాయము చేయుచున్న సాహిత్యమండలి అధ్యక్షులు   శ్రీ పైడిరాజుగారికి, ఇతర సభ్యులందరికి నా నమోవాక్కములనర్పించుచున్నాను. పండితులకు  ఉన్నతులకు  వేడుక గల్గించు ఈ సాహితీ రూపకం    ప్రారంభకులకు సదావకాశము.  వేదజ్ఞుఁడు,  అవధాని , కవియైన భారతవర్ష  సరసన నిలుచుటయైన నావంటి అల్పజ్ఞానుల సుకృతము. విద్యాంసుల ఉచ్ఛ్వాసనిశ్వాసములైననూ, విదుషీమణుల నూపురముల ఘోషయైననూ, జ్ఞాన ప్రేరితములు ,స్ఫూర్తిదాయకములు. ఈ తెలుగు సాహిత్య సభకు  మంగళమగుగాక!!! 
   
చంద్ర శేఖర సిద్ధాంతిగారు భువన విజయము సాహితీ రూపకం ఉపోద్ఘాతమునిచ్చుచూ “ఆంధ్ర సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు, సంవిధానాలు, ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. వాటిలో సాహితీ రూపకాలు కొన్ని. రూపకమనిన  నటులు ఆయా పాత్రల రూపములను  ఆరోపించుకొని అభినయించుట. అయితే సాహితీ రూపకాలలో పాల్గొనేవారు ఉద్దండ పండితులు, కవులు. అంతే కాని నటులు కారు. మామూలు నాటకములయినచో  నటులు అవసరమైన వేషధారణ చేసుకుని నాటక రచయిత వ్రాసిన దానిని కంఠస్థం చేసుకుని అభినయించటం జరుగుతుంది. ఈ సాహితీరూపకాలలో పాల్గొనే కవులంతా స్వయంగా రచయితలు కాబట్టి వీరికి మరొకరు వ్రాసియివ్వవలసిన అవసరంలేదు. అప్పటికి అప్పుడు సద్యస్ఫూర్తితో పద్యాలు చెప్పుతూ, చమత్కారాలు సృష్టిస్తూ, కావ్య ప్రసంగాలు చేస్తూ, సమస్యలు పూరిస్తూ సహజమైన సాహితీగోష్ఠిని తలపించే స్థితి ఈ సాహితీ రూపకాల లక్షణం.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని 1952 ప్రాంతాలలో గుంటూరులోని ఆంజనేయులు అనే సంపన్నుడికి పెద్దనాది కవులుగా విశ్వనాథ సత్యనారాయణ వంటి పెద్ద కవులను ఆహ్వానించి రాయలుగా ఎవరైనా సాహితీప్రియుడైన ప్రముఖవ్యక్తిని కూచోబెట్టి గోష్ఠి నిర్వహించిన ఎటులుండునని యోంచించి జమ్మలమడక మాధవరామశర్మ గారిని సంప్రదించగా వారీ బృహత్ రూపకమును  రూపకల్పనచేసిరి. ఆవిధముగా మొట్టమొదటి భువనవిజయ రూపకం గుంటూరులో ప్రారంభమైనది . నాటి  హైకోర్టు నాయమూర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రను పోషించసభ మనోరంజకంగా సాగెను. కవి పండితులందరూ  సాంప్రదాయ సూచకమైన ధోవతి, శాలువా, లాల్చీలే తప్ప ప్రత్యేకమైన వేషధారణ చేసుకోలేదు.

ఆనాటి నుండి భువన విజయము పేరుతో ఆంధ్రరాష్ట్రం నలుమూలలా కొన్ని వేల ప్రదర్శనలు జరిగినవి . తెలుగు రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాలలో తెలుగువారున్న ప్రతిచోటా ఈ సాహితీరూపకం ప్రదర్శింపబడెను. అంతే కాకుండా తానా సంస్థ సహకారంతో అమెరికాలో న్యూయార్క్, పిట్స్‌బర్గ్, న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, డెన్వర్, లాస్ ఏంజిలిస్, శాన్ ఫ్రాన్సిస్కో మొదలైన నగరాలలో ప్రదర్శింపబడినది .” అని ముగించారు  

తదుపరి దామిని శబ్దోద్దరిణి సాధనముకడ  నిలిచి "ఇప్పుడు విఘ్నేశ్వర ప్రార్ధన. మార్దంగికుడు శ్రీ కేశవుడు, వైణికుడు శ్రీ భారతవర్ష వాతాపి గణపతింభజే అనే కృతిని సమర్పించెదరు"అని ప్రకటించెను. కేశవుడు , భారతవర్ష ఇరువురు తివాచీపై కూర్చొని వాతారాగణపతింభజే యని శ్రోతల వీనులవిందుచేసిరి. కేశవుడికి సన్మానం జరిగినది.   సాహిత్య మండలివారు కేశవునికి శాలువాకప్పి నొక జ్ఞాపికనిచ్చినారు. పిదప సభ మొదలైనది. భారతవర్ష పెద్దన పాత్రను పోషించెను. సభ ప్రేక్షకులను  ఆద్యంతం అలరించెను. భారతవర్ష కులపతుల ప్రశంసలు  పొందుటతో సభ ముగిసెను.   
 
ఆరు నెలలలో బసవడిలో  వచ్చిన మార్పునుజూసి   అపరిచితులేమియునూ  ఆశ్చర్యమునొందకున్ననూ  మిత్రులందరూ విస్మయమొందిరి. బసవడి తల్లిదండ్రులు , బుచ్చమ్మ ,సర్రాజు అమితానందమునొందిరి. వారికి గర్వమున కించిత్తు గగుర్పాటు కూడా కలిగెను.  ఆంగ్ల ప్రభావమునున్న రాఘవ, ఆదిత్య మరి కొందరు ఆంగ్లానుకూలముగా మాట్లాడిరి. ఆదిత్య" ఏమి సాధింపనెంచి ఇంత తెలుగు నభ్యసించవలెను, రాఘవను  చూడుము అమెరికా పోయివచ్చినాడు. జీవితమునక్కరకు  వచ్చునది ఆంగ్లమే కానీ తెలుగు కాదు."అనెను. అంతలో  సభకు వచ్చిన తెలుగు విశ్వవిద్యాలం  పాలనాధికారి  భారత వర్షకు  తెలుగు మహాసభల సందర్భంగా నాంపల్లిలోని  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగు కథా, నవలా చర్చాగోష్ఠిలో పాల్గొనవలసిందిగా ఆహ్వాన మిచ్చెను. 

కార్యక్రమ నిర్వాహకులు రాత్రిభోజనములు ఏర్పాటు చేసిరి.  అందరు దగ్గరిలో నున్న భోజన శాలకేగిరి. అచ్చట భోజన శాలలో మరికొద్ది మంది రచయితలు రచయిత్రులు ఉండిరి. అతడు వారిని కూడా ఆహ్వానించి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగు కథా, నవలా చర్చాగోష్ఠిలో పాల్గొనవలసిందిగా కోరి  ఆహ్వానము పంపించెదనని చెప్పెను. అనంతరము వారు పరస్పర చతుర సరస సంవాదము జేయుచూ,  సంతృప్తి చెందక వాదము లోకి దిగగా ఈ వివాదమెచ్చటికి దారితీయునోయని భోజనశాల యాజమాన్యమువారు కలత జెందుచుండిరి. కథకి కాలం మూడిందని కొందరి అభిప్రాయపడగా, భారతవర్ష" అది ఒట్టి భ్రమేనని సమాజాన్ని పాలించెడిది  సాహిత్యమేనని   మనం ఎట్టి సాహిత్యాన్ని ప్రోత్సహించెదమో  అట్టి  సమాజం మన ఎదుట ఆవిష్కృతమగున"ని   అభిప్ర్రాయపడెను. 

పాలనాధికారి చర్చాగోష్ఠి తదుపరి వారము ఇప్పుడు కాదని, భోజనములు కానివ్వమని ఛలోక్తి విసిరెను.  మార్దంగికుడు కేశవుని కూడా మృదంగవాదనమొనర్చుటకు రమ్మని ఆహ్వానించెను.  

Sunday, July 19, 2020

Bharatavarsha -10

జాము రాత్రి దాళువాళించిన నక్షత్ర ముక్తావళి క్రమక్రమముగా కరిగిపోగా, జాముచుక్క  యొక్కటి అంబరమున మిగిలి యున్నది . బాలభానుడాకాశమున కూర్మము వలె ప్రాకుచుండ కెంజాయలలుముకొన్న అంబరముదయరాగము పాడుచుండెను. మలయమారుతాము తాకగ  ప్రక్రుతి యంతయు పులకరించ నల్లంచిగాఁడు(Indian robbin) అల్లన రాగమేదియో పాడుచుండగా, పిగిలి పిట్ట యొకటి బిగ్గరగా కూయుచుండెను. ఆ కూత  ఉదయరాగమందు మేళవించి ఎగయుచున్న  కపిలవర్ణ  తీవ్రతను తెలియజేయుచూ అప్పుడే కండ్లు తెరిచిన అరుణతారకు మేలుకొలుపు రాగమువలెననిపించెను. ప్రకృతి ఎంత ముచ్చటగా నున్నదోకదా!

అరుణతార లేచి దేవునికి నమస్కరించి కేశవుడేల లేవకుండెనో యనుకొని, నిశిరాత్రివరకూ మేలుకొన్నచో ఎట్లు లేవగలడనుకొని కూతురి గదిలోకి బోయెను. లకుమను తట్టి నిద్రలేపి కాఫీ కలిపి ఇచ్చి తానూ కూడా సేవించుచుండెను.   

లకుమ:  ఇది మన స్వగృహమైనచో ఎంత బాగుండును.
అరుణ : ఈ భవంతి వెల ఎంతో తెలియునా? పది కోట్లు.  
లకుమ : పది కోట్లా!!!  అయిననూ మనకి ఇట్టి భవనముండవలెను 
అరుణ : అంత సొమ్ము కుమ్మరించు స్తొమత మనకు ఉండవలెను కదా. 
లకుమ: నాటి చలన చిత్రనటి,  నేటి ప్రముఖ నర్తకీమణి అరుణతార యేనా ఇట్లు మాట్లాడు చున్నది. 
మునుపెప్పుడూ నీవిట్లు మాట్లాడుట వినలేదు.”  
అరుణ : అదియే నేను చేసిన తప్పు , కానీ ఇప్పుడు నీకన్నియునూ జెప్పు సమయ మాసన్నమైనది. 
ఈ భవనమునకు  ఏబదివేలు అద్దె చెల్లించుచున్నాము. ఇంతలో పిల్లవాడు వార్తా పత్రికను తెచ్చి ఇచ్చినాడు. లకుమ, తల్లి ఏడ్చుచున్న చిత్రమును చూసి వార్తను  వడివడిగా చదివి, నీకు చలన చిత్ర రంగమే సరియైనది అనెను. నాకు ఏది సరియైనదో చెప్పువయసు , అనుభవము నీకున్నచో నాకంటే సంతోషించువారెవ్వరు. నడుచు దారిలో  ముళ్లకంచెలున్ననూ కనలేని  మూఢమతివి  నీవు, నల్ల అను తెల్ల అను భేదమెరుగని బేలవు .   పయట మాత్రమే పరికించు నాయుడు,  పెఱిమ (ప్రేమ) జూప పులకించి సర్వమర్పింపదలచినావెంత తెంపరివి నీవు! సినిమా నాయుడన్న నెరుగనివారు లేరు.  వాడు  దర్పకుఁడు మాత్రమే,  దర్శకుడు కాదు.  ఆ కోశాధికారి నిన్నుద్ధరించునని నమ్ముచున్నావు.  గోముఖవ్యాఘ్రము  సంచరించు జనారణ్యమున కారుణ్యమనునది వట్టిమాట. 

పైకి ఆప్యాయత, లోన మాత్సర్యము తో నిండిన ఆ నాయుడు వయోముఖ విష కుంభ ము (పాల లాగా కనిపించే విషముతో నిండిన కుండ) వానికి దూరముగా నుండుము.  కోటిఈశ్వరావు వచ్చుట, చిత్ర తో కలిసి మద్యము సేవించుట, ఇవియన్ని చాలవన్నట్టు ప్రమాదభరితముగా వాహనము నడుపుట. నాయుడుని  రాత్రివేళ  కలుసుకొనెదనని మాటిచ్చుట… అని తల్లి అనుచుండగానే  అందు తప్పేముంది అతడు నాకు అవకాశమి చ్చెదనని మాట ఇచ్చెను. యని లకుమ పలుకగా "  అవకాశమిచ్చుట కాదు  , జీవితమును కూల్చును " అని అరుణతార ఆవేశముగా పలికెను.  

లకుమ: అష్టోత్తరము పూర్తి అయినదా? ఈ ప్రభాత సమయమున ఇట్టి ఉత్పాతము సంభవించునని ఊహించలేకుంటిని. అరుణ  "ఈ చలన చిత్రముల మోజులో నీ చదువే మగునో ఒక్కసారి ఆలోచింపుము" అని తల్లి అనుచుండ “ఇంక నేను చదువజాలను ఈ చదువుకి స్వస్తి పలికి నేను నటనయందు నా భవిష్యత్తును వెదుకు కొనవలెనని  నిర్ణయించుకొంటిని.” యని లకుమ గట్టిగా చెప్పెను. 
ఎంతకు తెగించినాడు నాయుడు నీ చదువుకి చరమగీతమగునని కలనైనా యనుకొనలేదు” నీవు నిర్ణయించుకొన్న అటులనే  కానిమ్ము" లోక కర్తయైననూ మూర్ఖుని  మార్చలేడు, నుదుటినవ్రాసిన వ్రాలు తప్పించ తరమే నూరేళ్లు చింతించినన్" యని కేశవా కేశవా యని పిలుచుచూ కేశవుని గదిలోకిపోయి, అక్కడ పడకపై పడి యున్న యుత్తరమును చదివి " ఆయూ కేశవా ఎంత పని జరిగెను , ఇల్లు విడిచిపెట్టి పోయితివా యని అరుణతార  శోకించుచుండ "బ్రహ్మాండభాండమ్ము పగిలె నన్నట్లు  భువన కంపనము కలుగునట్లు ఎందులకు శోకించెదవు?" అని లకుమ అనుచుండగా అరుణతార చేతిని లకుమ చెంపకాదేశమొనర్చెను. లకుమ కళ్ళు చెమర్చుచుండ, “కేశవుడు పోయినచో తప్పునాదా? అయిననూ   కేశవుడనిన యున్న ప్రేమలో రవ్వంతయిననూ నాపైలేదుకదా. నీతో పడలేకున్నాను నేను కేరళ పోయెదను.   మా నాన్న వద్దకు  పోయెదన” నిన లకుమను   “నీ యూహపోహలకు (ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ణయించుకొనుట) నేను సంతసించితిన” ని అరుణతార మెచ్చుకొనెను. దూరవాణిలో పోలీస్ అధికారితో సంప్రదించి స్నానము చేసి వచ్చుసరికి పోలీస్ అధికారి ఇంటనుండెను. అతడికి కేశవుడి చిత్రమిచ్చి ఎటులైననూ తీసుకురావలెనని కోరెను.
పోలీసు అధికారి వెడలిన పిదప అనునయమున లకుమను తన గదిలోకి తీసుకుపోయి “ నా హితవాక్యము నీకు రుచించనియెడల నీవు అనుభవమున నేర్చుకొనగలవు.” అని అనునయించుచుండగా  లకుమ  “ధూర్జటి మొదట రసికుడై సుఖభోగాలనుభవించి, రాజాశ్రయ సౌఖ్యాలన్నీ చవిచూసి, ముదిమి ముసిరే వేళకు మోక్షకామియై శివభక్తిలో మునిగి  శ్రీకాళహస్తి మాహాత్మ్యము , శ్రీకాళహస్తీశ్వర శతకమును  భక్త్యావేశంలో రచించినట్లు,  వృద్ధనారీ పతివ్రత అన్నట్లు  నీవు యవ్వనంలో అన్ని సుఖములు అనుభవించి , ఇప్పుడు నా జీవితము పాడగునని వంకలు పెట్టుచున్నావు." అని తల్లి పై విరుచుకు పడెను. 

అరుణ మనసు గాయపడిననూ ఓర్చుకొని "సినిమాతారలు అందరినీ ఒక్క గాటనకట్టు లోకరీతి ననుసరించుచున్నావు  నేనటువంటి దానను కాదని చెప్పుకొన్న వలసి వచ్చుచున్నది. అని   గోడ బీరువా తలుపు పక్కకి జార్చగా పాత తైలవర్ణ చిత్రమొకటి కానవచ్చెను.  ఈ చిత్రము మా అమ్మమ్మ మా అమ్మకి ఇవ్వగా మా అమ్మ నాకు ఇచ్చెను. లకుమ ఆ చిత్రమును తేరిపార చూచి  "ఈ నాట్యము భారత నాట్యమే కదా! ఈమె రాజాస్థానమందు నర్తించు రాజనర్తకివలెనున్నది. రాజ నర్తకులనగా వేశ్యలేకదా !"అని లకుమ కించుత్తు  వంచాడించక మాట విసిరెను.

గాయముపై దెబ్బ పడెను అరుణ ప్రాణమువిలవిలలాడెను "రాజ నర్తకులు వేశ్యలుకారు.మిడి మిడి జ్ఞానమున్నవారితో మాట్లాడుట ఎంత కష్టమో ఇప్పుడు తెలియుచున్నది.  అజ్ఞానముతో చరించు  మూర్ఖులు తాము మేధావులని, పాశ్చాత్యులైనచో  మనకన్న తెలివైన వారు అను భావములను ఏర్పరుచుకొందురు. అట్టి వారికి చెప్పి ప్రయోజనమేమి?  నేను చలనచిత్ర రంగమందు ఉండుటచే నీవిట్టి దురభిప్రాయమున కొడిగడిట్టితివి.   చలనచిత్రరంగము నీకు స్వర్గము వలే కనిపించుచున్నది .  ఇప్పుడు నీకు తల్లి మాటలు ఎట్లు రుచించును ?

అని అరుణ బీరువానుండి చిత్రము తీసి  పైట కొంగుతో దానిని  తుడిచి "నువ్వు చూచిన నాట్య భంగిమ కథక్. మొఘల్స్ కాలంలో కథక్ ని బాగా  ఆదరించారు.  అప్పుడు  కథక్ రెండు రకాలుగా ఉండేది. దేవాలయాలలో చేసే భక్తి భావ కథక్ , రాజాస్థానాల్లో చేసే శృంగారభరిత కథక్. నీకంతాయో ఒక్కవిధముగానే కనిపించును.  నువ్వు  నటనని వృత్తి చేసు కొనవలెనని ఉవ్విళ్ళూరుచున్నావు. నాటి  మహానటులు నటనని జీవితముగా చేసుకొనగా, నేటి విద్యార్థులలో అత్యధికులు జీవితాన్ని నటనగా చేసుకొనుచున్నారు. నీవునూ అదే  చేయుచున్నావు. లకుమ  “నేను జీవితమును నటించుచున్నానా?” కాలేజీలకు పోవుటయే కానీ అందు నిజంగా చదువుకొను వారెందరు? చదువునటించుచున్నారు. నువ్వు 18 సంవత్సరముల నుండి  చేయుచున్నదంతా  నటన కాక మరేమి? అని అరుణతార   విస విసా పోయివాహనము  తీసుకుని బైటకు వెడలెను.  

Saturday, July 18, 2020

Bharatavarsha -9

పొద్దుగూకు  సమయమునకు ఇంటికిచేరిన అరుణతార  సర్పము కుబుసమును విడిచినట్లు నిస్పృహాకుబుసమును విడిచి మిక్కిలి యుపశమనమును పొంది  తన తల్లి చిత్రపటమునకు నమస్కరించెను.  అశ్రువులు నిండిన నేత్రములను వత్తుకొనుచున్న కేశవుడు కనిపించెను.

క . దర్పము అంతయు విడిచె   
సర్పము కుబుసము  విడిచెడి   చందం బునన్  
తర్పిత మొందెను  వందన  
మర్పణ జేసెను  నిలిపెను మనసున మాతన్   

ఎదురుగా నున్న దూరదర్శని తెఱయంతట అరుణతార విషాదభరిత వదనమలుముకొని యుండెను, ఆమె కంట కన్నీరు బొటబొటా కారుచుండ, పరితాపమునొంది ఆక్రోశించుచుండెను.  కేశవుడెందుల కేడ్చుచున్నాడో గ్రహించిన అరుణతార వెంటనే దూరదర్శనినాపుజేసెను. పదునారేండ్ల పసివాడు కేశవుని తలనిమిరి లాలనజేయు గా దుఃఖము తగ్గి   తుడుచుకొనెను. 


లకుమ కానరాదేమని అడుగగా చిన్నమ్మగారు స్నేహితులతో బయటకేగినార చెప్పెను. సరే అదియునూ ఒకందుకు మంచిదే యని అనుకొనుచుండ  పరుగు పరుగున లోనికి పోయి వచ్చినాడు. సోఫాలో కూర్చొని కండ్లుమూసుకొన్న అరుణతార తలవెనుకకువాల్చి కొద్ది నిమిషములట్లే ఉండెను. కండ్లుతెరిచి చూచునంతలో కేశవుడు మంచినీరు, తేనీరు అందించెను. తేనీరు త్రాగుచుండగా చిటికలో బోయి వేడినీటిబుగ్గ మీటనొక్కి మృదంగము అందుకొనెను , ఆమె ఎదురుగా నేలపై కూర్చొని గుమికి వాదన (ఎడమ చేతి వైపు దిగువ చివర భాగం తో తట్టడం  ద్వారా ఉత్పత్తి అయ్యే వైవిధ్యమైన మంద్ర స్వరం) తో మొదలెట్టి, పూర్తి చాపు, అరచాపు మార్చి మార్చి తాడించుచూ చివరకు "దృవతాళ" వాదన ప్రారంభించెను  "తక్కడితోం, గిడ తక్కడితోం,  తద్ది తక్కడతోం థళాంగ్ థథ..థరికిట .. " కేశవుడు కన్నులరమూతలై   ఆనంద పారవశుడై  గాలి షడ్జమమై , పక్షులు పంచకమై  కేశవుడు శివాత్మకమై చేయు మృదంగవాదనా ధ్వని యందు అరుణతార మనసు మయూరమై మైమరచి నర్తించెను. "గోపాలుని గీతా భోదవలె ఈ మృదంగ నాదము అలౌకికానందమును  కలిగించి చిత్తనిర్వికార మొనర్చినది.  ఈ రాత్రికి నీవు వండవలదు  నేనే వండెదను"యని జెప్పి భావోద్వేగములను మకిలి వస్త్రములతో పాటు బుట్టదాఖలు చేసి, వేడినీటిబుగ్గ ఆవిరుల స్నానమాచరించి నిర్మలత్వము బొంది గృహా ఆచ్ఛాదనములు ధరించి వంటజేయుచూ లకుమకొరకు ఎదురు చూడసాగెను. 
                      
రాత్రి 9 గంటలు అగుచుండగా దూరవాణి మ్రోగినది లకుమ కలదా? యని నాయుడు అడిగెను. ఆమె ఇచ్చట నుండెనని నీకెవరు చెప్పినారు అని అరుణతార అడుగగా నాయుడు చిన్నగా నవ్వినాడు , " నేను చిత్రనిర్మాణమునకు  కావలిసిన డబ్బు  సమకూర్చుకొనినాను ఎట్లైననూ చిత్రమును నిర్మించి తీరెదను. మినర్వా నందు బసచేసి యున్నను , లకుమ వత్తుననిచెప్పెను, గుర్తుచేయవలెనని చెప్పి ముగించెను. "కామపిశాచి వలె  బంకపీషాణము  వలె తగులుకొన్నాడు  చిత్ర నటనా బులుపున లంపటమున జిక్కెను అని తల్లి మనసు తల్లడిల్లెను. "నేను కాకున్న నాకూతురు , నీ బులబాటము తీరిన పిదప చివరికేమిదక్కునో నాకు బాగా తెలియును , నాకూతురిజోలికి రావలదని తీవ్రముగా  హెచ్చరించి సంభాషణ ముగించెను. 

ట్రింగ్.. ట్రింగ్ .. మరల దూరవాణి మ్రోగుచుండెను. పరికరము నుండి మాట్లాడు సాధనమును లేపి సందేశము విని నివ్వెరపోయెను. అమ్మా  ఎందులకు నిశ్చేష్టటు లైనారు? అని  కేశవుడడిగెను, “లకుమ వాహనమును నడుపుచుండ ప్రమాదం సంభవించెను, వాహనము బురదలో దిగిపోయి  నడువకున్నది”  మరుక్షణము కుర్రవాడు అమ్మగారూ మీరు ఆందోళనలో ఉన్నారు మీరు కోర్చొనిన నేను నడిపెదనని శ్వేతవాహనమును పరుగెత్తించెను. ఒక గంట తర్వాత వూరికి దూరముగా నున్న నిర్జన ప్రదేశమునకు జేరెను. అచ్చట  ముగ్గరు అమ్మాయిలు నిలబడి  యుండిరి, కేశవుడు వారియొద్ద వాహనమును నిలిపగా అరుణతార దిగి లకుమను చూసి ఏమి జరిగెనని కంగారుగా అడిగెను. పక్కనున్న అమ్మాయిలు " ఎవరో తుంటరికుర్రవాళ్లు మమ్ము ఏడిపించవలెనని , కొద్దిగా రాసుకునిపోయినారు , లకుమ కంగారున వాహనమును రహదారిపక్కనున్న గుంతలోకి దింపివేసెను.

 వాహనమును పరికించి చూసి "పెద్ద దెబ్బయే  తగిలినట్లు గోచరించుచున్నది. బురద అంటుకొని ఉండుటవలన స్పష్టముగానగుపడుటలేదుగానీ, ఇది చిన్నగా రాసుకొనిపోవుటకాదు నిజము చెప్పినచో సరే,  లేనిచో మీ తల్లితండ్రులను పిలిచి మాటలాడెదను అని అరుణతార పలుకగా  లకుమ స్నేహితులు  బిక్క మొఖమువేసి " ఇందు మాతప్పుఏమియునూ లేదు మేము ఎంత వద్దని చెప్పిననూ మీ అమ్మాయే వారిని కవ్వించినది. అతి వేగముగా నడుపుచూ వారికి తోవ ఇవ్వక కవ్వించుటవల్ల  స్పర్ధ పెరిగి పందెమునకు  దారితీసేను. అనిచెప్పగా  వారిని  పరిశీలించుచుండగా మాకు పెద్ద దెబ్బలేమియునూ తగలలేదు. కానీ యంత్రము స్తంభించి, వాహన ప్రారంభము కాకున్నది అనిరి. కేశవుడు యంత్రముకప్పు తీసి పనిముట్లనుపయోగించి  పనిచేయుచున్నాడు. 


  "మీ డ్రైవర్ కి మరమత్తు చేయుటవచ్చునా ?" లకుమను ఆమె స్నేహితులడిగిరి .   ఇది చాలా ఖరీదైన వాహనము చెడినచో.... అని వారు భయపడుచుండ "చిన్నమ్మగారు నేను, ఒక యంత్రకారునివద్ద పనిచేయుచుండెడివాడను నేనునూ యంత్రకారుడునే, సందేహము వలదు. అని పని ముగించి యంత్రమును తాళము తో ప్రారంభించెను. బురదనుండి  వాహనమును  తప్పించి చిటికలో రహదారి పై నిలిపెను. పద్మాకరంబున సూర్యదీప్తిచే ప్రకాశించుచున్న తామరలవలె ఆ పూబోణుల మొఖములెల్ల ఆనందమతిశయించ వెలిగిపోయినవి. 

వారిని ఇంటివరకు అనుసరించి జరిగిన విషయమును తల్లితండ్రులకు విశిదీకరించి ఇంటికి జేరుసరికి నిశరాత్రి కావచ్చెను. లకుమ కొంచెము మత్తు లో సోలుతున్నట్టు గమనించెను అది నిద్రమత్తా లేకా నిషామత్తా యనునది తెలియక అరుణతార కలవరపడి, లకుమ స్నానమునకు పోయిన తరువాత కేశవుని ప్రశ్నించగా అపరాహ్ణవేళ విందు జరిగెనని, చిత్ర గారు సీసా పట్టుకుని వచ్చినారని విందులో త్రాగినారని క్లుప్తంగా చెప్పెను. కోశాధికారి కోటీశ్వరరావు గారు కూడా వచ్చెచ్చిరని చెప్పి అయితే  తాను  చెప్పినట్టు చెప్పవలదని కోరెను . లకుమ నేరుగా పడకగదికి పోవుచుండగా వారించి కేశవుడికి లకుమ భోజనము వడ్డించెను, భోజనము ముగించిన పిదప కేశవుడు పోయి పడుకొనెను.      

తల్లీ కూతుళ్ల మధ్య సంభాషణ జరిగెను 
అపరాహ్ణవేళ ఏమి జరిగెను ?
ఏమియునూ జరగలేదు.
ఏమీ జరుగనున్న చిత్ర ఏల వచ్చెను? కోటేశ్వరావు ఏల వచ్చెను?
 నీకివన్నీ ఎవరు జెప్పినారు ?
ఎవడో వల్లకాట్లో రామనాథాయ!  నిజమా అబద్ధమా ?  
మౌనం .... ........ 
వాడికి నీవయసు కూతురున్నదని గమనింపుము.
ఒక్కచరవాణిని కొని ఇమ్మన్న ఇవ్వవు అతడు నాకు విద్యార్థి ఋణమును మంజూరు చేసెను ఇంకనూ ఏమైనా కావలసిన ఇచ్చెదనని వాగ్దానము చేసెను. నేనతడిని ఒక తండ్రివలె చూచుచున్నాను కానీ నువ్వు నేరస్తురాలివలె చూచుచున్నావు. 
నీవతడిని తండ్రివలె చూచుచున్ననూ అతడు నిన్ను కూతురివలె చూచుటలేదు అదితెలియక పిచ్చిదానివలె మాట్లాడుచున్నావు. నామాటలిప్పుడు కఠినముగానే తోచును. అది యట్లుంచిన చిత్ర విందు ఇచ్చుటకు కారణము?
ఆమెకు విడాకులు లభించెను. అందుకే ఆమె పండగ చేసుకొనుచున్నది. ఆ ఒక్క మాట  అరుణతారకు  తన  గడిచిన జీవితము మొత్తమును మనోఫలకము మీద స్సాక్షాత్కరింపజేసెను.  తాను భర్తనుండి విడిపోయిననూ అందుకెన్నడూ ఆనందించలేదు  . ఈమె విడిపోవుటయే కాక విందు కూడా చేసుకొనుచున్నది అరుణ తారకు మెదడు స్తంభించెను  


Friday, July 17, 2020

Bharatavarsha -8

వానకి తడిసిన నల్లని రహదారిపై తెల్లని వాహనము మెల్లగా సాగుచుండ చెరువున బకమువలె మెరియుచుండె. ప్రకృతి చూపరులకు కడు రమ్యముగా నున్నది. రధాన్తరంగమంతయూ నిశ్శబ్దము రాజ్యమేలుచుండ రమణి అంతరంగమున ఆలోచనా తరంగములిట్లు చెలరేగుచుండె “నేడెందుకో మనసు వికలముగా నున్నది, ఈ వర్షమెందులకో తీతువుపిట్టరాయబారము వలె నున్నది, ఇది ఎట్టి దుశ్శకునమో కదా! పార్టీ కార్యక్రమాలకి పిలవకున్ననూ బోయితిని, సమావేశములు జరిగిననూ నిదియె తీరు ఆహ్వానముండదు, మంచిరోజులకొరకు ఆశతో   ఓర్పుగా  ఎదురు చూసిన నాకు నేడంతిమ పరీక్ష వలె దోచుచున్నది.  పెరుగుచున్న తార మనోవేదన వలె వాన క్రమముగా పెరుగుచున్నది.  అట్లు తలచుచుచూ సమావేశమునకు హాజరైన మహిళాధ్యక్షురాలు అరుణతారకు ఘోర పరాభవం ఎదురైనది. వేదికపై నున్నంతసేపూ మనసు విలవిలా లాడినది. 


కొద్ది గంటలెట్లు గడిచేనోగాని వేదనాభరిత వేదిక దిగి  భవంతి బయటకు వచ్చిజూడ  వాన ఉదృతి పెరిగి ప్రకృతి ఆమె మనసుకు ప్రతిబింబమువలె నగుపించెను. రధికుడు ఛత్రము  బట్టుకు వచ్చుచుండెను. 
“దయ్యపుతాడిని (ఏడాదిపొడుగున గలలువేసి పిందె పాటుననే రాల్చివేయు తాటిచెట్టు; తప్పిదారి ఒకకాయ నిలిచినా, దానిలో ముంజకట్టి యుండదు) సాకిన ఫలసాయ మీరీతినే యుండునుకదా!  పెదవివిప్పి  పలకరించినారు  కారు  పెద్దలు ముఖము తిప్పిచూచినారుగారు  పిన్నలు. సభ్యులందరూ  కూడఁబలుకుకొన్నట్లు ఏకరీతిన క్షోభ పెట్టినారుకదా!!” పెక్కురాశీనులైన రంగస్థలమున శిరచ్ఛేదానుభూతి బొందిన అరుణతార ముఖము వివర్ణనమయ్యెను.  కాలిక్రింద భూమి కంపించుచుండ శోకభారమున అడుగు లు మందగించ  శరీరభారము అధికమైనట్లు తోచెను. వేదికవీడుచు వెనుదిరిగి చూచిన దృశ్యము -కన్నీటిపొరలయందగుపించిన తోడెంపునవ్వుల(ముసిముసినవ్వుల) మొఖములు అడుగడుకు కనులయందు మెదులుతూ తోడేళ్ళను తలపింప అడుగొక సమ్మెట దెబ్బవలె పడుచుండ , తలలో ముచ్చెమటలు బోయుచుండ అరుణతారకు బాల్యమున గోపాలాచారి గారు చదివించిన పెద్దబాల శిక్ష నందు పద్యము

హా వసుదేవ కుమారక 
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా!

స్ఫురణకు వచ్చెను “సోమినాయుడు ప్రభుత్వమున నీవునూ చొరలేకున్నావా మురారీ! ఈ జిత్తులమారి కత్తెరకాడు  నిన్నునూ వశపరుచుకొనెనా? ప్రాణమును తల్లడపఱచి అహర్నిశములు పార్టీకొరకు శ్రమించి, స్త్రీలోలులెందరో అవమానించిననూ  మారాడక  అవమానములెన్నియో దిగమ్రింగి ఎంత ప్రయాస పడిననూ కడకు మిగిలినదేమి, ఘోర పరాభవము తప్ప.    వేదికపైనున్న నేను తప్ప అందరు ప్రసంగించిరి. అందరికీ  అవకాశ మిచ్చెను నాకు దప్ప. నాకు మాటలాడుటకు అవకామియ్యకున్ననూ నా ఊసైన నెత్త లేదు. సమావేశముముగిసెను , సర్వసంబంధములు ముగిసెను.  అందరినీ కలుపుకు పోవలెనని చెప్పెడి   సోమినాయుడు నన్ను మాత్రము వేఱుపరిచెను.  ఎంగిలి మంగల ము వలే నన్నావల పారవేసెనుకదా! కటకటా!   సోమి నాయుడు ప్రాభవ మున  నాకు పరాభవ ప్రారబ్ధము.”

హృదయాతరంగమున నిప్పు కీలలెగయుచుండ కన్నీరు బొటబొట కారుచుండ ప్రసార మాధ్యమ మిత్రులు రాబందులవలె కమ్ముకొనుచుండ “ఇంతకాలమూ రహస్యముగా రోసి బహిరంగముగా నవ్వితిని నేడా అక్కరతీరిపోయెను” అని భావించి దృశ్యమాధ్యమ బృందములు పరివేష్టిత అరుణతార కడుపుఅవిశిపోవ నిజమును వెల్లడించెను.

పిదప వాహన చోదకునికి  జీతమిచ్చి "ఒక వారంరోజులు నీ తల్లిదండ్రులని చూచిరమ్ము" అని  సెలవుపై పంపి తాళములను తీసుకొని ఆత్మహత్యచేసుకొనుటకు పథక రచన చేసుకొని స్వీయ సారధ్యమున సాగిపోయెను.   
                                              ***
అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ! 

నాకు జీతము ముట్టి ఆరు నెలలాయెను. ఇనుపగజ్జెల తల్లి ఇంటిని వీడదాయెను. నీవలె ఆలోచించిన నేను చచ్చి నేటికారునెలలై యుండవలె. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత యన్నట్లు పైకి చెప్పుకొనుటకు పెద్దదృశ్య మాధ్యమ వార్తా సంస్థ నందు జ్జోగము, వరిష్ఠ పాత్రికేయుడు. ప్రజాదరణలేక అనేక వార్త సంస్థలు దివాళా మార్గమున పయనించుచున్నవి. అందు మా సంస్థ కూడా యున్నది. మాసంస్థను అమ్మివేయుటకు మా యజమాని సిద్ధముగా యున్నాడు కొనుటకు ఎవడైనను రాడా  మాకడగండ్లు దీర వాయని  బేహారుల  వలె ఎదురుచూచుచున్నాము.  మేమె ఆశావాదముతో నుండగా నీకేమివచ్చెను ? అని చిరకాల మిత్రుడు దుర్గా ప్రసాద్  “కొండయెక్కిదూకుటకు నీకేమి ఖర్మము” అని జెబ్బపట్టి లాగి తన కార్యాలయమునకు తీసుకుపోయి ఏకాంతమునందు హితవుజెప్పెను.

"నాది ఆర్థిక సమస్య కాదు, మానసిక సమస్య. ఇంత అవమానమును ఎట్లు సయితును అత్యంత హేయంగా అవమానించబడ్డ స్త్రీ ద్రౌపది.  నాకుజరిగిన అవమానము అంతకంటే ఎక్కువగానున్నది."    

“బలగర్వితుడు, అధికార మదాంధుడు, రావణుడు బలవంతంగా సీత నెత్తుకుపోవుట, ఆ అనుమానముతో సీతను రాముడడవులకు పంపుట అవమానముకాక సన్మానమా? వంచనతో ఇంద్రుడహల్యను బలాత్కరించి చెరుచుట రావణుడు రంభను చెఱుచుట అవమానముకాక సన్మానమా?”
"విశ్వామిత్రునికి  తపోభంగమొనర్చవలెనని  రంభను  ఇంద్రుడాదేశించగా  తన పరువాలన్నీ ప్రదర్శించుచూ  విశ్వామిత్రుడి ఎదుట పాటపాడుతూ నిలుచొనెను. అంతకుముందే మేనక ద్వారా దెబ్బతిన్న విశ్వామిత్రుడు రంభ అందాలను చూసి ఆశపడక  రాయివై పడి యుండుమని శపించెను.  ఫలితముగా  పదివేల ఏళ్ల పాటు రంభ అట్లు  శిలలా ఉండవలసి వచ్చెను "

“ రంభ అడవిలో శిల అయ్యెను కానీ మహాసభలో భర్తల ఎదుట, గొప్ప ధర్మవేత్తలుగా పేరు పొందిన వారు చూస్తుండగానే, గుడ్డలు లాగివేయబడే హీనాతిహీనమైన పరాభవం ద్రౌపదికి జరిగినది .”

"ఓ అదా నీ ఖేదమునకు కారణము అయినచో వినుము చిన్నప్పటి నుంచి ఫూలన్‌ దేవి పశువులు కాచెను, పడవలు నడిపెను . పాములు గొట్టెను, బరువులు మోసెను. పదకొండేళ్ళ వయసులో బాల్య వివాహానికి గురై ముఫ్పై అయిదేళ్ళ వయసున్న భర్త లైంగిక హింసల నెదుర్కొనెను. తండ్రికున్న కొద్దిపాటి ఆస్తినీ కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్ననాడే ప్రశ్నించి దెబ్బలుతినెను . అవహేళనలకు పోలీసుల తప్పుడు కేసులకు  లైంగిక దాడులకు గురయ్యి  సామూహిక అత్యాచారం గావించబడెను ."


"రూప డియోల్ బజాజ్ అనే పరిపాలనాధికారి(IAS)కే తప్పలేదు . పంజాబ్ సింహమని పేరుగాంచిన రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి ( డైరెక్టర్ జనరల్ ) ఆమె పృష్ఠ భాగమును తాకినందు నిస్సహాయముగా  శోకించుట మినహా  ఏమీచేయలేక " ఎంత   ఎత్తుకుపోయిననూ ఆడది చివరకు ఆడదే యని జెప్పి వగచి యుండలేదా" 

"ఢిల్లీకి చెందిన వర్ష జోషి అను మరొక పరిపాలనాధికారిణి ఇటువంటి లైంగిక సమస్యలనెదుర్కొని  ఎంత అవమానమును బొందెనో తెలుసుకొన్నచో నీవిట్లు మాట్లాడవు. గుజరాతుకు చెందిన రిజు బఫ్న అనే మరొక పాలనాధికారిణి ఇటువంటి లైంగిక వేధింపులను ఎదుర్కొని “భారతావనిన ఇటువంటి పురుషపుంగవులు అడుగడుగునా యున్నార”ని వ్యాఖ్యానించి ప్రతి దాడిని ఎదుర్కొనెను. భారతావనిని నిందించుట ను అందరూ తప్పుపట్టగా దిక్కుతోచక క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యను ఉపసంహరించుకొనెను. అనేక స్త్రీలు ఉన్నత స్థానములలోయుండి కూడా  బాధను చెప్పలేని దుస్థితిలో నుండగా నీవు దృశ్యమాధ్యమ ముఖాముఖి నందు సోమినాయుడిని తుత్తునియలు జేసిన వనితావు నీవే నాని మరువకుము. నీకంటే ముందు ఇదే అనుభవము ఎదురైననూ నీవలె మాట్లాడువారెవ్వరునూలేరు.” అని చెప్పి యూరడించెను.

“నీ జ్ఞానముచే నా అజ్ఞాన తిమిరమును తొలగించి  నాబాధను బాపితివి. నేనెంత తాగిననూ మధువు నాలో భాదను తాత్కాలికంగా నుపశమింపజేయునుగానీ నాలో ఆత్మన్యూనతను తొలగించలేదని జెప్పి తనచేతికున్న వజ్రపుటుంగరమును దీసి  "ఇది నేను నీకిచ్చు బహుమతి " యని చెప్పిఅతనికి వజ్రపుటుంగరమును బహూకరించెను. పిదప రాజకీయరంగమున వోడితిని  నన్నేమి  చేయమందువని అడిగెను. అప్పుడు దుర్గా ప్రసాద్ "పొరపడుచున్నావు రాజకీయరంగమున నీవు ఓడలేదు, ఒక పార్టీ పద్ధతులు నీకు సరిపడక వైతొలగినావు.  కనుక నీవు  సైంధవోదకన్యాయనీవు మును పాటించవలెను అనిన సముద్రపునీరు సూర్యరశ్మిచే ఆవిరియై మేఘరూపాన్ని పొంది వర్షించి ఏరుగా పారి తిరిగి సముద్రంలో కలిసినట్లు ఎచ్చట ఓడినామో అచ్చటనే నెగ్గవలె ననుచూ  అని మందహాసమున "పోయిరాగదమ్మా జానకీ!” అని కొంటెగా పాడుచుండ అవ్యక్తమధుర రాగమేదియో స్నేహారాగమయి అంతర్వాహిని వలె హృదయమును తాకి చిత్తవృత్తి(మూడ్ ) నున్నతి జేసెను.   

Wednesday, July 15, 2020

Bharatavarsha -7

పెద్ద బహుళ అంతస్తుల బజారులు  మరియు సాంస్కృతిక కేంద్రాలతో చుట్టుముట్ట బడిన విశాఖపట్నం నగర నడిబొడ్డున  సంపత్ వినాయక దేవాలయానికి  సమీపంలో మేఘాలయ అను విలాస విడిదిగృహం (హోటల్) ఉన్నది. పది గంటలకు సందీపుడు కాఫీ శాలలోకి ప్రవేశించెను.  జాజ్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ   తన స్నేహితుడు రాఘవ  కోసం  ఎదురుచూచుచుండెను.  అతడు ఉద్యోగమునకు ధరకాస్తు చేసుకొనగా వారు ముఖాముకీ మేఘాలయ నందు ఏర్పాటుచేసి పిలిచిరి. ముఖాముకీ పదకొండు గంటలకు అయిననూ సందీపుడు ఒక గంట ముందుగా వచ్చికూర్చొనెను.  


అప్ప్పుడే సబ్బవరం శాసన సభ సభ్యుడు  సింహాచలం  ఫార్ట్యూనర్ వాహనము దిగి తన మందితో లోనికి వచ్చుచున్నాడు. ఆ సమూహము నందు అందరూ తెల్లని బట్టలు ధరించిరి.  తెల్లబట్టలు ధరించిన జంబారాయుడొకడు అతడి వెంట జాగిలమువలె నడుచు చుండెను. రాఘవ  అద్దముల గుండా అంతా చూచుచున్నాడు పోలీసులు సుడిగాలివలె వచ్చి చుట్టుముట్టి అతడికి రక్షణ ఇచ్చుచున్నారు. వారు అతడి వెంట  సేవకులవలె నడుచు చుండిరి. అది చూచి రాఘవకు నిస్పృహతో నవ్వు వచ్చెను. "రాజకీయ నాయకులకు బంటులవలె వ్యవహరించుటకే  వీరు జీతములు తీసుకొనుచున్నారు. సామాన్య ప్రజలను చచ్చిననూపట్టించుకోని  పోలీసులు పదవిలో ఉన్న నేతలు  వచ్చిన చేయు హడావిడి ఇంత  అంత కాదు." అనుకొనెను.   

ఆ సమూహములో నుండి తెల్లని వస్త్రములు ధరించిన యువకుడొకడు అతడిని చూచి నవ్వెను. సందీపుడు తేరిపార చూచి అతడు బైరెడ్డి అని గ్రహించెను.  ఆ సమూహము ఒక సమావేశ మందిరంలోకి వెడలెను. బైరెడ్డి వారితో లోనికి బోక  సందీపుని వద్దకు వచ్చెను.   "ఓరి బైరి ! నీవెప్పుడు రాజకీయములలో చేరితివిరా!" అని సందీపుడు వాడిని డొక్కలో పొడిచెను. "మా అన్న నాగిరెడ్డితో వచ్చితిని. నేడిక్కక పాత్రికేయుల సమావేశము కలదు. మాపార్టీ ఎం పీ గారు కూడా వచ్చుచున్నార"ని  బైరెడ్డి నవ్వెను. 

సందీపు: తగాదాలు, దొమ్మీలకుముందుడువారు మీరు. పాత్రికేయుల సమావేశములో మీ అన్నకేమి పని? నీకేమిపని? 

బైరెడ్డి : అదేం మాట! ఎం. ఎల్. ఏ. గారు ఎచ్చటికి పోయిననూ మా అన్న వెంటబోవునని తెలియదా?  చివరకు  స్నానముల గదికి పోయినను....
 
సందీపు: పోయి వీపు తోమునా? 

బైరెడ్డి :  బైట వేచియుండును. 

సందీపు: యువకునివలె రంగురంగుల ఆధునిక వస్త్రములు ధరించెడి నీవు తెల్ల వస్తములు ధరించి పెద్ద వారితో తిరుగుచున్నావు. కొత్తగా  చర్చ్ స్థాపించినావు కదా దాని ప్రచారము చూచుకొనక   రాజకీయములలో జేరినావే! పెద్ద వాడివైపోయినావురా!  

బైరెడ్డి : పెద్దవాడిపనులు చేయుచున్నానో కుర్రవాడు చేయుపనులు చేయుచున్నానో చూచెదవు రమ్మని సందీపుని చేయిపట్టి కాఫీశాలనుండి విడిది అంతర్భాగము లోనికి తీసుకుపోయెను. వారిరువురూ నడవ (కారిడార్)లో నడుచుచుండిరి. అచ్చటనున్న ఒక గదిలో ఏబీసీ పతాకం నిర్మాత     చలనచిత్ర కథానాయ   నడవకిరువైపులా గదులు కలవు. నడవకిరువైపులా గదులు కలవు. బైరెడ్డి  ఒక గది వద్ద ఆగి  తాళము దిప్పి , కొద్దిగా తలుపు తీసెను. అచ్చట ఒక యువతి అర్థ నగ్నముగా మంచము పై పడుకొని యున్నది.  సందీపుడు  ఖంగు తినెను. బైరెడ్డి తలుపుమూసి 

 సందీపు: ఒరేయ్ వ్యభిచారిణిలతో కూడితివా ?

బైరెడ్డి: ఆమెవ్యభిచారిణి కాదు విద్యార్థిని. ఆమె పేరు సంధ్య లకుమతో కలిసి చదువు కొనుచున్నది .  ఇప్పుడు చెప్పుము, యువకులు చేయుపనులు చేయుచున్నానా? అని వెకిలి నవ్వు నవ్వెను . 

సందీపు: ఇవా యువకులు చేయుపనులు!!! యువతులను చెడగొట్టుచున్నావు కదరా! 

బైరెడ్డి: నేను చెడగొట్టుట ఏమి అది ఒక ఆచార్యుడితో సహజీవనము చేయుచున్నది. ఆయన భార్య అనేక మార్లు రచ్చ జేసినది. అయిననూ వారు సంబంధమును కొనసాగించుటతో  ఠాణాలో పిర్యాదు చేసినది. అట్లు  మాట్లాడుకొనుచూ వారు కాఫీశాలకు పోయిఒక బల్ల వద్ద కూర్చొనిరి. 
  
రాఘవ 10.30 గంటలకు వచ్చెను. "ఏంట్రా ఇంతాలస్యమా! సమయానికి రావాలని తెలీదూ !" అని సందీపుడ డిగెను.   "ఇదేనా అమెరికా  సమయపాలననిన, అమెరికా పోయి వచ్చినావెందుకూ  సిగ్గులేదూ!   అని బైరెడ్డి అనెను.  

"నేను అమెరికా పోయివచ్చినానే కానీ అమెరికావాడిని కాను. భారతీయుడను."అని బైరెడ్డితో అని సందీపు తో "ఒరేయ్ సందీపు నీవు తరగతులకు ఎన్నడైననూ సమయానికి వెళ్లితివా? నీవు నన్నాడువాడవా? నీకుండవలెనురా సిగ్గు!" "మీ చదువులు ముగిసి రెండేళ్లయినది. ఇప్పుడు తరగతుల గోలందుకు ఉద్యోగములు చూచుకొనక"ని బైరెడ్డి అనెను. 
 
రాఘవ: రెండేళ్లనుంచి  ఆ పని మీదే ఉన్నామురా! ఈ సారి విజయము తథ్యము.

బైరెడ్డి: ఎందుకొచ్చిన ఆందోళన,  నావలె  కుటుంబ వ్యాపారము చేసికొనక!  సందీపుడి తండ్రి కోట్లకు పడగలెత్తిన వ్యాపారి, రాఘవ పేరుమోసిన తండ్రి సినిమా దర్శకుడు. మీరు ఉద్యోగముల వెంట పడుట నాకు సిగ్గుగా యున్నది.

సందీపు:మతములు మార్చే చర్చివ్యాపారి మానాన్న.అట్టి వ్యాపారము నేను చేయలేను. 

సినిమా తీయుటకు శక్తి లేకున్ననూ  ఆస్తులమ్ముకొని రోడ్డెక్కిన దర్శకుడు మానాన్న.    

 బైరెడ్డి: అయిననూ ఒకప్పటి పేరుమోసిన  దర్శకేంద్రుడు కదా! 

రాఘవ:  మానాన్న పరదేశి నాయుడు  ఏ పేరు మోసెనో నేను బాగుగా నెఱుగుదును.  పొలము పుట్ర నగ నట్రా  అమ్ముకొని చలనచిత్రములు నిర్మించి దివాలా తీసి   దివాలా నాయుడుగా,  స్త్రీలోలుడగుటచే కాసనోవా అని పేరుమోసెను.   అతడు చేసిన అప్పులను మాకుటుంబము మోయుచున్నది. అతడు అమ్ముటకు  ఒక చిత్ర మందిరము మేముండు  ఇల్లు మాత్రము మిగిలినవి.  అదియునూ అమ్మకముందే నేను ఉద్యోగము  చూసుకొని మా అమ్మను తీసుకు పోవలెను.    

సందీపుడు: నువ్వుండెడిది  పాత పాడి పరిశ్రమ (డైరీ ఫార్మ్) ప్రాంతంలో.  అది ఇక్కడికి దూరం కాదు, అయినా అరగంట ఆలస్యంగా వచ్చితివి. నేను  నేను సబ్బవరం నుండి ఇక్కడికి 10 గంటలకే చేరుకొంటిని.

రాఘవ: నీవు ముందు వచ్చి ఏమి చేయుచున్నావు? కాఫీ తాగి ముఖాముఖీ కి పోవలెను.

సందీపుడు ఏమి చూచినాడో చెప్పెను. బైరెడ్డి ముసిముసి నవ్వులు నవ్వెను. లకుమన్న నీకు పిచ్చని నాకు తెలియును కానీ  లకుమను చెడగొట్టవలదని రాఘవ బైరెడ్డిని వేడెను.  "లకుమ మంజూష వంటి అందగత్తెలను, పెద్ద కుటుంబములవారిని పెండ్లి యాడెదను. నీవలె ఫారెస్టు బంగ్లాలో ప్రశాంతముగా నివసించెదను కానీ చెడగొట్టన" ని బైరెడ్డి నవ్వెను.    

రాఘవ: నేను ఫారెస్ట్ బంగ్లాలో నివసించుట లేదు. ఫారెస్ట్ బంగ్లాదారిలో నివసించుచున్నాను. 

సందీపుడు : "ఓహ్!  ఫారెస్ట్ బంగ్లా దారి కొండలతో మరో అరకు లోయవలె యుండును "

రాఘవ సందీపుడితో: కానీ మీనాన్న చర్చ్ స్థాపించి ప్రశాంతతను పాతిపెట్టి శబ్ద యంత్రములతో మాయ తంత్రములతో  ప్రజలను పిచ్చివాళ్లను చేయుచున్నాడు.

సేవకుడు  అందరికీ  కాఫీ తెచ్చెను. 

సందీపు:వాళ్ళు కేవలం ప్రార్థనలు చేయడం లేదు. మత మార్పిడులు చేయుచున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భూములను ఆక్రమించింది. మిషనరీలు మనసులను ఆక్రమించుచున్నారు. భారతదేశంలో మహమ్మారి సమయంలో 50,000 గ్రామాలలో 50,000 చర్చిలను నిర్మించారు. ఈ మహమ్మారి గత 25 సంవత్సరాలలో కంటే ఎక్కువ మత మార్పిడులకు కారణమైనది. ఈ మహమ్మారి వారికి మత మార్పిడిలో విజయం సాధించడానికి వీలు కల్పించినది. 

రాఘవ: వారు విష్ణు సహస్రనామాన్ని క్రీస్తు  నామావళిగా  క్రీస్తు ను విష్ణువు యొక్క తాజా అవతారంగా నమ్మించి గ్రామస్తులను మోసగించుచున్నారు. మొన్ననే సరస్వతి వీణను యేసు చేతిలో బెట్టి సరస్వతీ పూజకు బదులు యేసు పూజ నిర్వహించించినారు.  వారిప్రచారము వారు జేసుకొనక  విగ్రహారాధనను దెయ్యాల ఆరాధన అని జెప్పుచూ  హిందూ మతంపై ద్వేషాన్ని వ్యాపింపజేయుచున్నారు. అంతేకాక  జీవితంలోని అన్ని కష్టాలకు కారణం 'అబద్ధపు దేవుళ్లను' పూజించటే యని నమ్మబలికి ప్రజలను క్రైస్తవం  లోకి మార్చుచున్నారు . 

సందీపు:   గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 60% కంటే ఎక్కువ మంది క్రైస్తవ మతంలోకి మారిరి. ఆంధ్రప్రదేశ్‌లో 10,000 పెద్ద మరియు సంపన్న చర్చిలు కలవు.

రాఘవ:  క్రైస్తవ మిషనరీలు హిందూ లేదా బౌద్ధ లేదా సిక్కులు అధికంగా ఉన్న గ్రామాలను ఎంచుకొందురు. మహమ్మదీయులున్న ప్రాంతములకు, ఊళ్లకు వీరు బోరు. 

బైరెడ్డి :  ఎక్కువగా  ప్రజలు ఈ మధ్య క్రైస్తవం లోకి  వచ్చుచున్నారు.  అందుకే నేను చర్చ్ స్థాపించితిని. 

రాఘవ: వారెక్కడ వచ్చుచున్నారు ఎరవేసిచేపను లాగినట్టు మీరు లాగుచున్నారు.  కానీ ఎట్లన్నది అంతు చిక్క కున్నది.   

బైరెడ్డి : మతం మారు వారికి లేని సమస్య మీకేల? 

సందీపు: ఇది చట్టవిరుద్ధం కాదా! మాయ మాటలు చెప్పి మతం మార్చుట చట్ట విరుద్ధము. దానికి శిక్ష పడును.

బైరెడ్డి: నీ బొంద, నేటి ఉదయము ఆరు గంటలకు  వాహన పందెములు జరిగినవి ఆశీలుమెట్ట విశ్వవిద్యాలం దారిగుండా పెక్కు మంది విద్యార్థీ విద్యార్థినులు ఈ పోటీలో పాల్గొనిరి.ఇంత  బాహాటంగా  ద్విచక్రికా పందెములు పలుమార్లు జరిగినప్పటికీ చట్టము ఏమి జేసినది ? అంతెందులకు  ఈ పత్రికా సమావేశము ఎందులకు తెలుసునా?

ముఖ్యమంత్రి సోమినాయుడి కొడుకు స్త్రీలోలుడని తెలియును కదా. అతడు ప్రజా దర్బారు నిర్వహించునపుడు వచ్చిన ఒక స్త్రీని తన పడక గదికి లాక్కొని పోయెను.  అవి బైటకి పొక్కగా,  అతడి రాసలీలలను ప్రతిపక్ష  నాయకుడు ప్రశ్నించెను.  దానితో స్థానిక నాయకులు ప్రతిపక్ష నాయకుణ్ణి హెచ్చరించుచూ, ముఖ్యమంత్రి కొడుకు గొప్పతనమును తెలియజేయుటకు ఈ పత్రికా సమావేశము నిర్వహించుచున్నారు. 
     
రాఘవ: ఓరి కీచకులారా! ముఖ్యమంత్రి కొడుకు గొప్పవాడా!! 

బైరెడ్డి:  రాజకీయ నాయకులందరూ   కూడా  గొప్పవారేకదా !!! సినిమా దర్శకులుకూడా గొప్పవారే.  ఆ శ్లేష కర్థము తెలిసిన రాఘవ తలదించుకొనెను. అప్పుడే కాఫీ కోపములు తీసుకుపోవుటకు వచ్చిన సేవకుడు వారనేమున్నది నేటి కాలమున విద్యార్థులు కూడా గొప్పవారే" అని నవ్వుతూ చల్లగా వెడలిపోయెను. 

చట్టము పోలీసులకు పట్టదు.  తప్పుచేసిననూ ఎవ్వరినీ పట్టుకొనరు. కానీ  నీకు  నీతి  యుండవలెను కదా. 

బైరెడ్డి: ఎందుకు పట్టుకొనరు అమాయకులను పట్టుకొందురు. ఆయేషా హత్యలో ఏమి జరిగినది? అటులనే  నేటి ఉదయమున సూర్యోదయమునకు ముందు సాగర తీర రహదారి లో ద్విచక్రికా విన్యాసములు చేయుచున్న లకుమను మరికొందరు విద్యార్థులను పోలీసులు వాహనం మెక్కించినారు.

 రాఘవ: అయ్యో మరి నీవు ఏమిచేయుచున్నావు? 

బైరెడ్డి: నేను పందెములో వాయువేగముతో నడుపుచున్నాను. నేనెట్లు ఆపగలను?అయినా లకుమతల్లి కథానాయకి రాజకీయ నాయకురాలు కూతురు గూర్చి  ఆమె చూసుకొనును. మనకెందుకా సమస్య"ని బైరెడ్డి అచ్చటకు వచ్చిన స్త్రీ తో వెడలి పోయెను. 

రాఘవ: నీకు నీ అన్నకు ఏ సమస్య లేదు! అని నిర్వేదంగా నవ్వుచుండెను 

సందీపుడు: వాడికి సమస్య లేదు!  సమస్య నీకే, ఎందుకనిన వాడు  మాదక ద్రవ్యముల  వ్యాపారంలో ఉన్నాడు. వాడి స్నేహితులు కూడా అదే పని  చేస్తున్నారు. 

నిజమా అని రాఘవ నిర్ఘాంతపోవగా మరి అతడి విలాసములకు డబ్బెక్కడినుంచి వచ్చుచున్నది? అని సందీపుడనెను. 

సందీపుడు: పోలీసులకు చిక్కువారు అమాయకులే. నాయస్థానములు కూడా చిన్నవారినే సులభముగా శిక్షించును. రాజస్థాన్లో దినేష్ కుమార్ గుప్త అను న్యాయమూర్తి,  వ్యాపార దిగ్గజం అదానీ తప్పు ఉన్న కారణంగా జరిమానా విధించెను.  కానీ  తీర్పు ఇచ్చిన రోజే ఆ న్యాయమూర్తి బదిలీ అయ్యెను. తరువాత అతడిచ్చిన తీర్పు  కొట్టివేయబడెను.  ఢిల్లీ న్యాయమూర్తి వర్మ గారింట్లో పెద్ద ధనాగారమే  దొరికిననూ ఆయనను కేవలము బదిలీ చేసి సరిపుచ్చినారు.  

రాఘవ: ఈ రోజుల్లో చాలా మంది కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యములు సరఫరా చేయుచున్నారని చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు బహిరంగంగా  మాదక ద్రవ్యములమ్ముతున్నారు. పది శాతం మాదక ద్రవ్యములు చెన్నై   కళాశాలలకు చేరుచున్నవి.  పంజాబ్‌లో 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది మాదక ద్రవ్యములకు బానిసలని, పంజాబ్‌లో ప్రతి మూడవ విద్యార్థి మాదక ద్రవ్యములకు బానిసని పంజాబ్ హైకోర్టు చెప్పినది. ఉడతా పంజాబ్ చిత్రము నందదియే చూపినారు.  ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మరియు విశాఖపట్నంలోని విద్యార్థులు మాదక ద్రవ్యముల సరఫరా చేయుచున్నారని వార్తాపత్రికలందు వ్రాసినారు, కానీ మనలో ఒకరు డ్రగ్స్ వ్యాపారంచేయుచుట  నిజంగా దిగ్భ్రాంతికరం.

 సందీపుడు:  ఇకపై అతను మనలో ఒకడు కాదు.

                                                                  ***

[11:05 pm, 5/1/2026] Polabala: హైదరాబాద్ - జూబ్లీ హిల్స్

జూబ్లీహిల్స్లోని వెలుగు దేశంపార్టీ భవనం బహుళ రంగులతో చూపరులనబ్బురపరుచు చుండెను. పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ధరించి పార్టీ మహిళా కార్యకర్తలు హడావిడిగా తరలివచ్చుచున్నారు. వెలుగు దేశం పార్టీ మహిళా విభాగం అధినేత్రి అరుణతార ఇచ్చిన పిలుపు నందు కొని వారందరూ అత్యవసర సమావేశమునకు హాజరగుచున్నారు.

కార్యాలయ ప్రాంగణం కార్లు, స్కూటర్లతో నిండిపోయింది. భవనం లోపల ప్రతి కుర్చీకి మైకులమర్చిన పెద్ద రౌండ్ టేబుల్ టేబుల్ ఉంది. ప్రతిపక్ష నేత మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడినది అరుణతార వాచ్ 10.00 గంటలు చూపుచు చుండెను. గుండ్రని బల్ల చుట్టూ ఉన్నవద్ద అన్ని కుర్చీలు
[11:06 pm, 5/1/2026] Polabala: గుండ్రని బల్ల చుట్టూ ఉన్నవద్ద అన్ని కుర్చీలు మహిళా కార్యకర్తలతో నిండి యుండెను. మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు, ఛాయగ్రాహిణులతో హాలు నిండిపోయినది.

అరుణతార మాట్లాడుతూ "బాలికల దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. పదేళ్ల క్రితం నా సినీ జీవితం నిలిచిపోయిన పిదప సమాజంలోని బలహీనవర్గ మైన స్త్రీలకు సేవ చేయుటకు ఈ పార్టీలో చేరితిని. మహిళల సమస్యలపై నేను చిత్తశుద్ధితో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాను, వారితరుపున అనేక న్యాయపోరాటం చేసినాను.
[11:07 pm, 5/1/2026] Polabala: శాస్త్రీయ నృత్యమునకు అవకాశములు మృగ్యమయిన పిదప నాకు కథా నాయికి పాత్రలు వచ్చినవి. నా లక్ష్యం డబ్బు అయితే నేను ఆ పాత్రలను అంగీకరిం చి యుండెడిదానను. నా లక్ష్యం డబ్బు కాదని ఒక దశాబ్దం పాటు నా పనితో నేను నిరూపించితిని. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు ఎన్నడూ బలహీనులే. మహిళా సంక్షేమము కొరకు పని చేయుట నాకు మిక్కిలి ఆనందము. నాకు అట్టి అవకాశము నిచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు.

మీరు నన్ను నమ్మి నా 10 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు ధన్యవాదములు. మనము మన చిత్తశుద్ధితో మహిళల్లో విశ్వాసాన్ని చూరగొన్నాము. తత్ ఫలితముగా నేడు మన పార్టీ అధికారంలోనున్నది. ఎప్పటికీ మనం నమ్మకాన్ని నిలబెట్టు కోవలెను.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్త్రీలు అవమానాలు ఎదుర్కొన్నారు. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పటికీ నేడు మనం అదే దుష్ప్రవర్తనను ఎదుర్కొంటున్నాము. సిద్దిపేట బాలికపై అత్యాచారం ఘటనపై రాష్ట్రంలో పెద్ద దుమారం చెలరేగిన సంగతి మీ అందరికి తెలిసిందే. రాష్ట్రంలో తరుచుగా జరుగుతున్న అత్యాచారాలపై రాష్ట్రంలో కలకలం రేగు చున్నది.

 ఇట్టి కీలక తరుణంలో అత్యాధార బాధితురాలిపై ప్రతిపక్ష పార్టీ నేత బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. న్యాయం జరిగే వరకు ఉద్యమిద్దాం. వినతి పత్రం సమర్పించేందుకు నేడు గవర్నర్ను కలువవలెను. నేను కేంద్ర అధికార పార్టీ చైర్పర్సను, ప్రధానిని కూడా కలిసిదను, అత్యాచార బాధితురాలికి న్యాయం చేయమని కోరెదను." ప్రసార మాధ్యమములు ఆమె ప్రసంగమును ప్రత్యక్ష ప్రసారం చేయుచున్నవి.

మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య ఇట్లనెను.

"ఆడది పక్కలోకి పనికొస్తుందను నటుడు, కనిపిస్తే కడు పుచేసేయాలి అన్న నటుడు, అత్యాచారం చేయడం మగవారి హక్కు(బాయ్స్ ఆర్ బాయ్స్) అన్న రాజకీయ నాయకుడు మన దేశంలో జెండా ఎగిరినంత స్వేచ్ఛగా తిరుగుచుందురు. నేడు బాధ్యతాయుతమైన పదవిలో నున్న ప్రతిపక్ష పార్టీ నాయకు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు జేసెను.

ఇదేమియూ కొత్తకాకున్ననూ ప్రతిఘటన తప్పకున్నది. పిలిచి మందలించు శక్తిఉన్న న్యాయమూర్తులు మౌనము వహించుట మనవంటి వారు రచ్చకెక్కుట ఆంధ్రనాట సర్వ సామాన్యమ"ని సౌభాగ్య ముగించుచుండగా ఒక మహిళ, చిత్ర గ్రాహిణి ముందుకు వచ్చి "పార్టీని విడిచిపెట్టిన జిల్లా అధ్యక్షురాలిపై ముఖ్యమంత్రి కుమారుడి అనుచిత వ్యాఖ్యలపై మీరు ఎందుకు మౌనంగాఉన్నార?"ని ప్రశ్నించెను. దాంతో పార్టీ కార్యాలయం లో పెద్ద దుమారం రేగెను.


అరుణ తార వేదిక దిగి ఆ మహిళ వద్దకు వెళ్లి ఆమెను హాల్ నుండి బయటకు పంపుచుండగా ఆమె చరవాణి మ్రోగెను. " ఒక అమ్మాయి ఏడుపు వినిపించెను. "ఎవరు నువ్వు?" ఏడుపు తప్ప సమాధానము లేకపోవుటచే అరుణతార, "నాకు సమయం లేదు. నువ్వెవరో చెప్పు? 

లకుమ: అమ్మా, నీకు సమయమెప్పుడుండెను? నన్ను దామిని వద్ద  పారవేసి,  నీవు హాయిగా తిరుగుచున్నావు. 

అరుణతార "ఏమైంది లకుమా?" అని ఆందోళనా స్వరముతో అడిగెను 

చెప్పిన మాట విని అరుణకు చీకట్లు కమ్మినవి...ఇంతలో లకుమ " పోలీసులకు ఫోన్ లో  ఒక్క మాట చెప్పిన " అట్టిపనులు చేయుట నాకు చేతకాదు" అని అరుణ అను చుండగా,  లకుమ పెట్టివేసెను. అరుణ మూగబోయెను, 




                                                                   ***

భారతవర్ష లకుమను విడిపించుటకు న్యాయవాదితో ఠాణాకి  పోయి అచ్చట హేమ, సంధ్యలను చూసెను.  పోలీసు అధికారి భారతవర్ష ను చూచి "  భారతర్ష మీరా !  ఏమైనా పుస్తక విడుదల కార్యక్రమమా!"  "కాదండి  విద్యార్థినీ విడుదల కార్యక్రమము" అనెను.  హేమ సంధ్యలు అప్పుడే తమ న్యాయవాదితో మరొక పెద్దాయనతో  బయటకు పోవుచుండిరి.  వర్షుడు విషయము విచారించగా ఠాణా  అధికారి చెప్పిన మాటలు విని  నివ్వెరపోయెను. "హేమ తాగి వాహనము నడుపుచూ పట్టుబడెను.   సంధ్య ఎవరితోనో సహజీవనం చేయుచుండెను. 

నెత్తిన పిడుగుపడి వానివలె వర్షుడు  చూచుచుండగా ఠాణా  అధికారి "సంధ్య తండ్రి  ఉత్తముడు.  స్త్రీ స్వేచ్ఛపై  ఉదారంగా ఉపన్యసించుటయే  కాక  అభ్యాసములో  కూడా చూపుచున్నాడు. వర్షుడి ముఖము తెల్లబారెను "అనగా అర్థమేమి?" అని వర్షుడు అడిగెను.  "అనగా అతడు కూడా  ఇట్టి సంబంధములను కలిగి యున్నాడు.  అందుచే అతడు కూతురికి గట్టిగా జెప్పక  మెతక వైఖరి చూపును. యథారాజా తథా ప్రజా!    ఇదియే నేటి సమాజము"  అధికారి వివరించెను. 

"భాద్యలేని తలితండ్రులు , సచ్చీలత లేని నాయకులు  వేలంవెర్రి విద్య , చెత్త చలన చిత్రములు సమాజమునకీ గతి పట్టించినవ"ని పోలీసు ఠాణా నుండి భారతవర్ష లకుమను, స్నేహాను విడిపించెను.   ఆ రాత్రి లకుమను దామిని వద్దకు తీసుకువెళ్లి అప్పగించెను.                                                          

దామిని ఆవిషయమును దూరవాణిలో అరుణకు తెలియజేసెను.  అరుణ డగ్గుత్తికపడి విలపించసాగెను. దామిని గ్రాహకమును లకుమకు అందించెను. ఇప్పుడు ఏమైనదని ఎందుకు  రోదించుచున్నావు?  అని లకుమ తల్లినడిగెను. "నీవు ఎద్దువి, మొద్దువి  సుద్ధవి. నీ కెంత జెప్పిననూ జీవితం అవగతము కాకున్నద"ని అరుణతార నీతి చంద్రిక  పోసి తలంటెను. 

అరుణతార గొంతులో కోపము కంటే  బాధ,  బాధ కంటే ఆందోళన ధ్వనించు చున్నవి. లకుమ బెల్లంకొట్టిన రాయివలె, కొయ్య బొమ్మవలె నిలిచి కిమ్మనక వినుచుండెను. ఆమె ఉదాసీనత  దామినిని దబ్బలము వలే గుచ్చెను. లకుమ చేతి నుంచి గ్రాహకమును కోడిపిల్లని గ్రద్ద తన్నుకుపోయినట్టు లాక్కుని "చెవిటివాని ముందు శంఖ మూదినట్లు ఎందుకీ వృధా  ప్రయాస?  నీ కూతురు కంగదు. ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు."అనెను.    అరుణ   "దాని కనులకు వయసు పొరలు కమ్మినవి. చదువు మానిపించి  పెళ్లిచేసినగాని దాని తిక్క కుదరద"నెను. 

వర్షుడు గ్రాహకమును చేకొని  "లకుమ వాహన పందెములలో పాల్గొనలేదు. ఆమెకు వాహన క్రీడాశక్తి (మోటార్ స్పోర్ట్స్)మెండు.  అది ప్రమాద కరమే కానీ చట్టవిరుద్ధం కాదు. పందేలు జరుగుతున్న తప్పుడు సమయంలో ఆమె  సముద్ర తీరము వద్దకు వచ్చెను. క్రీడా దుస్తులు ధరించి యుండుటచే ఆమెను పోలీసులు తీసుకోపోయినారు. అది యాదృచ్ఛికం!"అని అరుణను అనునయించసాగెను. 

కూతురు  ఠాణాకు వెళ్లిన   విషయం అరుణను కలచివేసెను. లకుమ ప్రవర్తనకు   ఆవేదన జెంది దామినితో "చదువు కంటే సంస్కారము, ప్రవర్తన ముఖ్యము. దానికి చెడు  స్నేహములబ్బినవి. చెడు స్నేహములు దెచ్చు చేటు తల్లిదండ్రుల గుండెల్లో కత్తిపోటేకదా! చదువు మానిపించి దానికి కల్యాణము చేయవలె" ననెను.  ఆ మాటలు విని లకుమ "నీవు ఇప్పుడు చేయుచున్నది అదేకదా! క్షవర కళ్యాణము చేయుచున్నావు. ఎప్పుడూ జీవితము అద్దమువంటిది, ఆడది అరిటాకు వంటిదని
ఇట్లు  పెద్దలు కాలము చెల్లిన సామెతలు చెప్పుచూ ముందు తరములకాంతిని హరించి తిరోగమనము పట్టించుచున్నారు . నాడు కౌరవులు నిండు కొలువులో కోడలిని కోకలిప్పి అవమానించిరి. నేడు నీవు కూతురిని అందరిలో అవమానించుచున్నావు. రాజకీయ ప్రాబల్యమున్ననూ పట్టించుకొనక నా ఖర్మకు నన్ను విడిచిపెట్టినావు. సంధ్య తండ్రి ఠాణాకు వచ్చి ఆమెను ఒక్క మాట అనకనే తీసుకుపో యెన"ననెను. 

అది వాక్ధాటి యో వాగ్దాడి యో కాని  ఆ వాక్కులు శరములవలె అరుణ హృదయమును చీల్చినవి.  లకుమ వైఖరి  వెల్లడయ్యి  అరుణ  కనుల ముందు అరుణ  ప్రకాశము అంతరించి అంధకారమలిమెను. లజ్జావహమగు లకుమ అత్తిపిత్తి మాటలకు అరుణ  అత్తపత్తి రెమ్మ వలె కృంగి  పరితాపము చెందెను.  "ఔరా ! ఔన్నత్యమనిన అదిగదా!  నేటి తరానికి ఆదర్శమనిన అదియేకదా! " అనెను. మాటల  తేలు మనసుని కుట్టిన పరితాపము పొక్కుట సహజమే కదా! " అరుణ మాటలు  కూతురికి మాట్లు వేసెను.  

లకుమ తూటాలు లేని  ఖాళీ ఫిరంగి వలె నిలిచెను అరుణ శివంగివలె రేగి  భారతవర్షతో "ఆ  మొండిని, శిఖండిని  స్టేషన్ నుండి ఎందుకు తీసుకువచ్చితివి? దాన్ని స్టేషన్‌లోనే పడి ఉండనిచ్చిన బుద్ధి వచ్చెడిది" అని అరుణ నిస్సహాయముగా అరవసాగెను.  

మాలిని  " లకుమ   మంచి పిల్ల. పిల్లలిట్లు చెడిపోవుచున్నారనిన కాలప్రభావమే! వర్షుడు ఏమైనా కొత్తవిషయములు చెప్పినా లకుమ శ్రద్దగా వినియా నందించును. నేటి 
 కాలంలో లోకజ్ఞానం, గురుశిష్య సంబంధములులేని, కంఠస్తపు చదువులతో పిల్లలు  తావులేని పూవులవలె, వ్యక్తిత్వము, ఆత్మ బలము, జీవిత గమ్యము లేక  జీవన యాత్ర సాగించుచున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యముగా బ్రతుకుతల్లిదండ్రుల పిల్లలు ఇంకెట్లుందురు .  అమాయకులనాడిపోసుకొనుట అనుచితము. పిల్లలను పెంచుట ఈ దామినికేమి తెలియును క్రమశిక్షణ అనిన కేకలు వేయుట అనుకొను మూఢ వనిత. మీ అమ్మాయికి మాయింట నుండి చదువుకొనవచ్చును. చక్కగా చదువుకొని మిమ్మలిని మించి పోవును. మిమ్మలిని నేనెరుగను కానీ దామిని నాబాల్య స్నేహితురాలు నాకు మీ గురించి చెప్పుచుండును"మాలిని నోట వచ్చు మాటలు పూజా మంత్రములవలె నున్నవి.   అరుణతో సహా అందరూ ఊపిరి నిలిపి వినుచుండిరి. 

"మీ మనసు వెన్నవంటిది. మీ దీవెన  వెన్నెల కంటే చల్లన"ని మాలినితో పలికి "లకుమా వింటివా మాలినిగారు నీకు అమ్మ, వర్షుడు అన్నయ్య, మంజు చెల్లి. వారి స్నేహము నీ అదృష్టము. వారింటి వాతావరణమే క్రమశిక్షణ వారితో సంభాషణే చదువు. "అని చెప్పెను. దామిని లకుమవైపు తిరిగి పరీక్షలుముగిసినవి కదా   హైదరాబాదు పోయి సెలవులలో అమ్మవద్ద ఉండి రమ్ము. ఇకనైననూ మగరాయుడి వలె కాక ఆడపిల్లవలె యుండవలెన"ని లకుమ బుగ్గలు పొడిచెను. లకుమ చెంపలు రుద్దుకొను 
చుండగా  మాలిని లకుమ చెంపపై ముద్దుపెట్టుకొనెను. 

                                                                ***

గచ్చిబౌలినందు“ద్వారక” యనునొక విలాసహార్మ్యము చక్కని ఉపవనముతో  విరించి యాత్మను ఆవిష్కరించుచున్నది. తారాధిపుడు వెలసిపోయిననూ మబ్బు మందారముగా నుండుటచే సూర్య ప్రభ కానరాకుండెను.  చెట్లమధ్య కౌజు పిట్టలు కూయుచుండెను చల్లగాలి వీచుచూ  తెరిచివుంచిన కిటికీల ద్వారా శయన మందిర లోపలకి వచ్చి పలుచని లోవస్త్రములతో నిద్రించుచున్న లకుమని తాకెను. లకుమ కనులుతెరిచి కిటికీ గుండా ఆకాశమును  చూచి  చిటపట చినుకులు విని అతిశయపడి చిందులువారి, తల్లి గుర్తుకురాగా రాగమతిశయించి అమ్మా, అమ్మా  అని పిలుచుచు  ప్రక్కనున్న పడకగదిలోకి పరుగు తీసెను. పడక ఖాళీగా అగుపడుటతో ఆమె డెందము శూన్య మాయెను. ముఖమున నిరాశ అలుముకొనగా " అమ్మ ఎప్పుడు ఆడి  తప్పదు నేడేల ఇట్లు జరిగెనని అనుకొనుచుండగా మృదంగ వాదము ఆలాపన వలే వినుపించుచున్నది. ఎక్కడ చచ్చెనో కదా ఈ  కేశవుడు అనుకొనుచూ పక్కనున్న మరొక పడక గది తలుపు తోసెను. 



అచ్చట కేశవుడను పదునారేండ్ల  పిల్లవాడు మృదంగ వాదనము చేయుచూ కనిపించెను. లకుమను చూడగానే కేశవుడు వాదనమాపి " రాత్రి మీరు భోజనము చేసి పడుకొన్న తరువాత అమ్మగారు వచ్చినార"ని చెప్పెను. ఇంతలో  పూజ గదిలో గంట మ్రోగుతున్న చప్పుడయ్యెను.   లకుమ లేడిపిల్లవలె    తల్లివద్దకు పరుగెత్తెను. స్నానం చేయకుండా పూజా మందిరమునడుగిడరాదని చెప్పిననూ, వద్దని వారించుచున్ననూ, లకుమ తువ్వాయి వలె దుముకుచూ చిలకవలె కిలకిలా రావములు చేయుచూ తల్లిపైబడెను. 

"అతిగా లాలించుటవల్ల పూర్తిగా చెడినావు స్నానము చేసిరమ్మ"ని అరుణ ఘీంకరించెను. అయిననూ లకుమ పట్టించుకొనలేదు. తల్లి కఠిన మభినయించి ననూ "ఉహు ...హూ.. యని ఊగుచూ తల్లి వద్దనే చిందులు వేయుచుడెను "అతి గారభమున నెత్తి  నెక్కించుకొంటిని కదా! అని కూతురుని ప్రేమతో కౌగిలించుకొని ముద్దాడెను. ప్రేమచందన చర్చనమున లకుమ ఓలలాడుచుండగా 

"దృతరాష్ట్రుని గారాబము దుర్యోధనునకు  చేటు దెచ్చెనని మరువకుము." అని మెల్లగా లకుమ చెవియొద్ద చెప్పెను. నీ బాల్య మిత్రురాలు దామిని నీకు తెలుగు నంటించగా అది నా కంటించినావు, ఇప్పుడు పురాణములు అంటించుచున్నావు"  అని లకుమ హాస్యమాడుచూ "త్వరలో నీవు హరికథా భాగవతారిణివి అగుదువేమోయని సందేహము కలుగుచున్నది." అనెను. 

తల్లి ఉత్తుత్తి  కోపముతో కూతురివెంట  పడగా కూతురు చిక్కక ఇల్లంతయూ పరుగెడుచుండెను.  బల్లలు కుర్చీల చుట్టూ తిరుగుతూ, పక్కలమీద నుంచి దుముకుతూ పరిగెడుచున్న లకుమ వెంట పడుచూ "నీకూ.. నీకూ..  దేహశుద్ధి చేయవలె"ననుచుండగా లకుమ స్త్నానలగదిలోకి దూరి "నా దేహశుద్ది నేను చేసికొందును నీకెందుకు శ్రమ!" అని తలుపువేసుకొనెను.

ప్రియ తులోరుకములను(ఫేవరెట్ జీన్స్)బిగుతైన అంతర్యుక్తము(టీ షర్ట్)ను  ధరించి వచ్చిన లకుమని చూసి అరుణతార  “ సిపాయి దళమున జేరినావా? దండయాత్రకు పోవునట్లు ఎందులకీ   ఆహార్యము?! గృహ వస్త్రములు ధరించుట మెరుగు కదా! ఈ వస్త్రములు ఏమిబాగున్నవి?"  అనెను. "వెండితెర తారవు  నీవు ఇట్టి సాధారణ చీర ధరించుట ఏమిబాగున్నది?   నీవు తులోరుకములను ధరించినచో
అయస్కాంతమువలె ఆకర్షించగలవు. నీవు చేయవలసిన పనిని నేను చేయుచున్నాను."   "ఆకర్షించి ఏమి జేయవలెను! అని అరుణ తార జీవము లేని నవ్వు నవ్వెను. ఆ నవ్వు ఎంత నీరు పోసిననూ ఓటికుండ నిండునా! అన్నట్టున్నది.

"నేను చలన చిత్రములలో మాత్రమే అధునాతన వస్త్రములను ధరించితిని. నిత్య జీవితములో  ఎచ్చటికి పోయిననూ మన సంప్రదాయముననుసరించి చీర కట్టుకొని పోయెదను." అనెను.


కేశవుడు వార్తాపత్రిక వచ్చెనని లకుమ చేతినందుంచెను.  పత్రికలో నొక ఠావు  కాగితమంతయూ అరుణతార బొమ్మలతో కూడిన వ్యాసము చూసి" లకుమ నా స్నేహితురాండ్రు అందరూ  నా అదృష్టమును కొనియాడుచున్నారు. నేను కూడా చలన చిత్రములలో చేరినచో ఆంధ్రావని అంతయూ జై జై నాదములు చేయును." అనెను ఒక్కరోజులో ఈ మందమతిని ఉద్దరించుట సాధ్యమనుకొని మిన్నకుండెను. లకుమకు ఉల్లాసము జచ్చి అల్లాటము గల్గి చేతిలో నున్నదూరనియంత్రకమును నొక్కి గోడపైనున్న దూరదర్శనమును ప్రారంభించెను. మాయ విజయోత్సవకార్యక్రమము ప్రసారమగుచుండెను అరుణతార ముఖము పదేపదే తెరపై  మెరియుచుండెను. ఆమె వంపుసొంపులు ప్రస్ఫుటమగుచుండ అకస్మాత్తుగా " వేదికపై ఆమె ప్రక్కనే కూర్చున్న వ్యక్తిని జూసి " అమ్మా  నీతో పాటు యున్నది నాయుడుగారు కదూ?  నీవు సిఫార్సు చేసిన నాయడుగారు కాదనరు, అమ్మ అమ్మా ...అని  బ్రతిమాలుతున్న లకుమ చిత్త చాపల్యమునకు ఎట్లడ్డుకట్ట వేయవలెనో తెలియక, ఆమె చేతిలోనున్న  దూరనియంత్రకమును  చివాలున లాగి అంకించుకొని ఒక్క కసురున పథమును (ఛానెల్)మార్చెను. "హైదరాబాద్లో నేడు  వెలుగు  పార్టీ సమావేశమునకు   ఏర్పాట్లన్నీ పూర్తి అయినవి అని సంధానకర్త వెలుగు  పక్షం (పార్టీ) మహిళాధ్యక్షురాలు అరుణతార  దృశ్యపరిషద్  ను  పదే పదే  చూపుతూ  ఏదో చెప్పుచుండెను. 

రాజకీయములలో చేరెదవా అట్లయిననూ మంచి పేరు సంపాదించుకొనవచ్చు? అనెను. లకుమ" ఛీ వెధవ రాజకీయములు నాకు సరిపడవు. చలన చిత్రములే నా అభిమతము." అనెను 
 
నా పూర్వపాపకార్యములు నిన్ను వెంటాడుచున్నావన్నమాట, పెద్దలు చేసిన పాపములు పిల్లలకు తగులని మా అమ్మ  చెప్పెడిది.  పైమెరుగులు చూసి  నేను వెళ్లెడిమార్గమున వెళ్లవలెనని ఉవ్విళ్లూరు చున్నావు  నేను నడిచిన  మార్గము మిక్కిలి ప్రమాదకరమ"ని అరుణ అనెను.  "అమ్మ చూపిన మార్గమున నడిచిన అది శ్రేయస్కరమ"ని కేశవుడు నోరుజారెను.      

ఆ మాట లకుమకు ఆవకాయ కారమువలె తోచి హృదయము భగ్గుమని మండి కేశవుని  చెంప పగులగొట్టెను. అరుణ లకుమవైపు ఉరిమి చూచెను.  


నీవు విశాఖ పట్నము పొమ్ము   నా ప్రాణాలుతినివేయుచున్నావు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చెనని నీ సెలవలు నా ప్రాణమునకు వచ్చినవి. నేను చదువుకోక  ఈవృతిలోకి వచ్చితిని , వృత్తికోసం వేషం తప్పుటలేదు. ఈవృత్తి కంటే కత్తులపై నడుచుట మిన్న, నిన్ను చదివించుకుంటున్నది గౌరవంగా బ్రతుకుటకు  ఈ రొంపియందు లాగుటకు కాద"ని అరుణతార అరిచెను . 

"డబ్బున్నచో చదువుకోకున్నను  గౌరవము,  గౌరవ డాక్టరేటు పొందవచ్చు. డాక్టర్ అరుణతార అని వ్రాసుకొనవచ్చు. డబ్బు ఉన్నచో అన్నీ సుసాధ్యమగును కదా."అని లకుమ బదులు పలికెను. 

ఇరువురికీ  ఫలహారము పట్టుకొచ్చిన కేశవుడు వాటిని బల్లపైనుంచి " చిన్నమ్మగారూ మీరు కోప్పడనన్నచో నాదొకమాటనెను.  లకుమ సరే చెప్పమనెను.  కేశవుడు "గౌరవ డాక్టరేటును పేరుముందు వ్రాసుకొన రాదు, కార్డులపై ముద్రించ రాదు, అది విద్యాసంబంధిత  అర్హత కానందున చట్టప్రకారం అట్లు చేయకూడదనెను.

నీవా నాకు మంచి చెడ్డలు చెప్పుచున్నావు అని లకుమ కేశవుడి  చెంప చెళ్లు మనిపించెను.కేశవుడు తలదించుకుని వంటగదిలోకి వెడలిపోయెను. అంతలో వాహన చాలకుడు వచ్చెను. అరుణ సమావేశమునకు సమయమగు చున్నది "అహంకార తిమిరము నిన్ను కమ్మివేసినది. నీ చేయి తరుచుగా లేచుచున్నది." అరుణతార లకుమను గద్దించి  పార్టీ సమావేశమునకు బయలుదేరెను. 

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...