Friday, January 22, 2021

Bharatavarsha 116

 ముంబయ్ : జుహుబీచ్  స్టార్ ప్లాజా. సమయము ఉదయము 9. 00 గంటలు 

రోహిత్ : ఆషా ! ఎన్ని సార్లు చెప్పాలే మేడంకి సోడా తెమ్మని    

ఆషా : ఎన్ని సార్లు చెప్పేవు, ఒక్కసారే కదా  చెప్పేవు, టిఫిన్లు రెడీ చెయ్యద్దా? మళ్లి గెస్టులు వస్తే అన్నీ రెడీగాఉండాలని అరుస్తావు. ఒసేయ్ అంటున్నావేంటి, మాటలు తిన్నగా రాని!

రోహిత్ : నోరు బాగానే లేస్తోందే !  నిన్ను ఇంకా ఆడదానివని జాలి తలచి ఉండనిచ్చాను ఆ మాగ్బూల్ గాడిని పంపించి నప్పుడే నిన్ను కూడా పంపించి వలసింది. 

సోడా ఇచ్చి వస్తూ ఆషా : వంటకి నీకు సులభంగా మరొకత్తి దొరకలేదు అందుకు ఉంచేవు, నామీద జాలితో కాదు. నీ కాకలి తప్ప జాలెక్కడుంది?   

రోహిత్ : కరక్ట్ గా కేచ్ చేసేవే. మరి అదిగూడ తీర్చేయవే, నీ జీతం పెంచేలాచేస్తాను 

ఆషా : థు ! దరిద్రుడా  రోహిత్ : ఏయ్ 

ఆషా: ఒరేయ్ రోహిత్ నీకు పుణ్యముంటాది లకుమమ్మని నాశనం చేయకురా. 

ఉదయాన్నే పెట్టించేసేవు దుకాణం. నేను పెట్టించడమేంటి నాన్సెన్స్, మొన్న బోటిల్ లేటయితే నన్నే కొట్టింది, అప్పటి నుంచి ఫుల్ బొట్టిల్స్ ఇంటి నిండా పెడుతున్నాను. అయినా ఎప్పటికప్పుడు నీచేతులో ఎంతో కొంత పెడుతోంది కదా ఇంకా ఎందుకే  ఏడుస్తావు ?  క్రెడిట్ కార్డు నాకే ఇచ్చేసింది. గోకడం , స్టాక్ తేడం , మేడం గొంతు తడపడం.

ఆషా: గొంతు తడపడం కాదు గొంతు కొయ్యడం , నువ్వు ఆ కాశ్యప్ కలిసి ముంచేస్తున్నారు. తనకి సినిమాలు వచ్చినా రాకపోయినా మనకి అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తోంది. ఆమె  ఆమె బాగు కోరాలి కదా మనం. ఈలోపున  కొత్తగా పని లో చేరిన అబ్బాయి వచ్చాడు. 

ఆషా: రా రా చిన్న రాజా ఏంటి ఇంత ఆలీసం? 

చి. రా : బస్సు దొరకలేదక్కా!

రోహిత్: బస్సు దొరకక పోతే టేక్సీ కట్టించుకు రావలసింది, రాస్కెల్ ఇంకొకసారి ఆలస్యంగా వస్తే జీతం కత్తిరిస్తాను.  (ఆశా కిసుక్కున నవ్వింది.)  తెలుసే నువ్వెందుకు నవ్వేవో. నేను జీతం కత్తిరించినా మేడం ఒప్పుకోదు, అన్నీ తెలిసి నప్పుడు తిన్నగా టైంకి వచ్చి తెగలడండి. పైగా వీడిని చిన్న రాజా అని పిలవాలట.  చిన్న అని పిలిస్తే సరిపోదట.

చి. రా : నాపేరు చిన్నరాజా కొప్పం పూర్తి పేరుతో పిలవలేనన్నారు సరే. కనీసం చిన్నరాజా అనైనా పిలవండి.      రోహిత్ : నీయబ్బ చిన్నాయే నీకెక్కువరా.  లకుమ "రోహిత్ , రోహిత్ శుభే శుభే క్యా జగడా హో రహా హాయ్  ముఝే శాంతీ ఛాహీయే శాంతీ!"     రోహిత్ "హాఁ మేడం మై లాతా హుమ్" 

" మేడం కి శాంతి  కావాలంటే తెస్తున్నాను అని వెళుతున్నాడు " చి.రా  ఆషా నవ్వుకొనిరి

రోహిత్ కశ్యప్ వచ్చుచుండగా చూసి “ఇంకే శాంతి!  వీడొచ్చాడంటే బుర్ర తినేస్తాడు!”

                                                              ***

కశ్యప్:  మార్నింగ్ బేబీ.  లకుమ: ఏంటి ఇలా వచ్చావు?
కశ్యప్: హైదరాబాదులో ఉండేటప్పుడు నేను ఎక్కడికైనా వెళితే ఎప్పుడొస్తావు అని అడిగేదానివి ఇప్పుడు “ఏంటి ఇలా వచ్చావు” అంటున్నావు. "అది హైద్రాబాద్ ఇది ముంబయ్ , అయినా నేను ముంబై వచ్చినప్పటినుంచి మనం కలిసి ఉండటం లేదు కదా నీకు తీరికున్నపుడు వస్తున్నావు."  "ఆ పండిత్ గాడు నిన్ను బాగా ట్రైన్ చేసాడు." 
"విషయం ఏంటో చెప్పు"  “కన్నా ప్రొడక్షన్స్ కొత్త ఫిలిం స్టార్ట్ చేస్తున్నారు.  అందులో కొత్త పిట్ట కోసం చూస్తున్నారు.”  “అయితే,” “నువ్వు ఆరోల్ చేస్తే బాగుంటాదని” నీకు ఖన్నా ప్రొడక్షన్స్కి సమ్మందం ఏంటి? నువ్వు అందులో డైరెక్టరా, అసిస్టెంట్ డైరెక్టరా?  కనీసం మేనేజర్ వి కూడా కాదు. 
నాది పూరి జగన్నాద్, రాజమౌళి రేంజ్ తెలుగులో పెద్ద డైరెక్టర్ని నన్ను మేనేజర్ తో పోలుస్తావా?

లకుమ: థౌజండ్ వర్డ్స్ ను “అత్తారింటికి దారేది” గా, సహారా ను “కలేజా” గా,  రైజ్  ను “జులాయి” గా వన్స్ అపానే టైం ఇన్ మెక్సికో ను “అతడు” గా  టెన్ థింగ్స్ ఐ హెట్ అబౌట్ యు  ను “నువ్వే నువ్వే” గా తీసిన రాజ మౌళి ప్రతిభ ను నువ్వే చాటవలె. ఇంక పూరి జగన్నాద్ అన్నచో..    పవనుడి భజజతో పైకొచ్చినాడు. అతడి గురించా నాకు చెప్పుచున్నావు మొన్ననే అతడు ఆంగ్ల చిత్రము ఐ బాయ్ ని కాపీ చేసి దొరికినాడు.

కశ్యప్: నీకు తెలుగులో అవకాశములు అడుగంటినవి అది తెలుసుకొనుము.
లకుమ: నాకంటే ముందే నీకు అడుగంటినివి, నీవొక పరాన్నజీవివి, నాకవకాశములు లేకున్ననూ ఎన్నడూ ఇతరుల పై ఆదారపడి జీవించలేదు. నీ కాలం ముగిసి చాలా కాలమయినది , పోవోయీ బడాయి, అది నీవు డైరెక్టరు అనునది నాటి మాట. తెలుగు చిత్ర పరిశ్రమ నందు నీకంటే అద్భుత చిత్రములు తెరకెక్కించి  కీర్తి కెక్కిన  మేటి దర్శకులు నేడెందరో కలరు. వారెవ్వరూ నిన్ను చూచుటకైననూ ఇష్టపడరు.  నీవు దర్శకుడివా నన్ను తార్చి బ్రతుకు కుంటెనకాడివా? 
కశ్యప్: ఆ పండిట్ గాడు నిన్ను చెడ దొబ్బేడు? నీ భాషనీ చెడ దొబ్బేడు , షిట్ షిట్  ఏంటీ తెలుగు?
లకుమ: పండిత్ ను పల్లెత్తు మాటన్నచో సహించునది లేదు. అపురూప గుణ నిధి అతడు. నౌ గెట్ అవుట్ విత్ యువర్ షిట్ అండ్ నెవర్ షో యువర్ పేస్ అగైన్. 

                                                                     ***

నీలఖంటుడు విషమును గొంతులో నిలిపినట్టు మీనాక్షి దుఃఖమును కడుపులో దాచుకొని పియానో వద్ద కూర్చొని ఫిలిం స్కోర్ వ్రాయుచుండెను. పక్కనే అనేక సంగీత పరికరములు కలవు  వాటిమధ్య ఆర్కెస్ట్రేటరు కూర్చొని యు న్నారు . పక్క గదిలో సోఫాలో నిద్రించు చున్నయమునకు ప్రఫుల్ల ఫోన్ చేయుటతో మెలుకువ వచ్చెను.   అమ్మా ఒంటి గంట దాటినది. నేడు రెండు విడతలు ( సెషన్స్ ) రికార్డింగు చేసిన పిమ్మట విమానాశ్రయమునకు పోవుటతో ఎంత అలసినావు, ... యమున మీనాక్షిని సమీపించెను. ఇంకనూ నీవెందుకు మేలుకొని యుంటివి  ఇంటికి పొమ్మని చెప్పిన వినవు కదా , ఇట్లు స్టూడియో లో దేకుచున్న నీ ఆరోగ్యమేమగును. అని వ్రాయుచున్న పెన్సిల్ , స్టాఫ్ ( అడ్డగా గీతలు కొట్టిన కాగితము ) ను పక్కన పడవేసి యమునను పక్క గదిలోకి తీసుకుపోయి , ఈ సారి లేచి వచ్చినచో చూడుము అని గద్దించి మరల పియానో వద్దకు పోయెను. 

 యమున సోఫా పై పడుకొని ఫోను కంపించిన ప్రతి సారి నిలిపి వేయుచున్నది, మూడు సార్లు కంపించిన పిదప చరవాణి నిలిచి పోయెను. రాఘవుని తలచినచో    మగవారి పై  అసహ్యము  కలుగును , ప్రఫుల్లను తలచినచో ఏవగింపు కలుగును  అగస్త్యను తల చినచో  మీనాక్షి గుర్తుకు వచ్చుటచే మెదడు స్తంభించును. ఏ భావము కలుగునో చెప్పుట కష్టము. అతడిని. ఛీ అనుటకు నోరు రాకున్నది. తల్లి  మంచితనము తనయుని కాపాడు చున్నది. పురుషుల చేయి తాకినా చిద్రమానసమందు రుధిర మోడుచున్నది. పెద్దామె అమ్మ పనిచేయుచుండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును అని మరల తలుపు వద్దకు పోయి, కొద్దిగా తలుపు తీసి తొంగి చూచెను.  మీనాక్షి ఫిలిం స్టూడియోలో ఆర్కెస్ట్రేటర్ తో కలసి ఇంకనూ పనిచేయుచున్నది
ఆర్కెస్ట్రేటర్ సీతారాం : సంగీతకారులున్న ఇంకనూ బాగుండెడిది
మీనాక్షి : ఈ సమయమందు మీరుండుటయే గొప్ప , సంగీతకారులను  రేపు పది గంటలకు రప్పించెదము. రేపు రెండు సెషన్స్ చేయవలెను. కో ఆర్డినేటర్ కి చెప్పిన అతడు సంగీత కారులను చూసుకొనును .
సీతారాం : ఇంకనూ పెన్సిల్ తో  స్టాఫ్ పై వ్రాయుచున్నారు మీరు డిజిటల్ కంపోజి షన్ సాఫ్ట్వేర్ వాడినచో మరింత సులభముగా పని చేయగలరు 
అతడట్లు ముగించిన కొద్దీ సేపటికి మీనాక్షి "  ఫిలిం స్కోర్  రచన   అంతయూ పూర్తి అయినది, ఫిలిం డైరెక్టర్ గారు ఇచ్చిన టెంప్ ట్రాక్స్ , కూడా ఫిలిం స్కోర్  రచన లో  జతపరిచినాను.” 
స్పాటింగ్ ఈ సాయకాలమే చేసి, ఈ రాత్రి మూడు గంటల వ్యవధిలో స్కోర్ పూర్తి చేయుటా!!! అని అతడు అచ్చట మూర్ఛగిల్లెను. కొలది సేపటికి తేరుకొని “అమ్మ సెలవు  రేపు కలుసు కొందుము” అనుచూ బయలు దేరెను.  
యమున పిల్లివలె వచ్చి మీనాక్షి పక్కనే నిలిచి ఫ్లాస్క్ నందు తేనీరు  గ్లాసులో పోసి మీనాక్షి కిచ్చెను. మీనాక్షి యమునను కోప్పడ ప్రయత్నించిననూ  కోపము రాకుండెను అది చూచి యమునా నవ్వేను , మీనాక్షి కూడా నవ్వెను. ఇద్దరూ తేనీరు త్రాగుచుండిరి
అమ్మా స్వరకర్తకు ఫిలిం స్కోర్ వ్రాయుటకు పట్టు సమయము ఎంత?   
రెండు వారాలు నుండి మూడు నెలల దాకా సమయము పట్టును.  
నీవు మూడు గంటల్లో ఫిలిం స్కోర్ వ్రాసినచో గిన్నిస్ నందు ఎక్కించవలెను అని అరిచెను. 
ఉష్ మెల్లగా , అట్లు అరచిన అమర్యాదగా యుండును. అని అ నుచున్న మీనాక్షి 
హఠాత్తుగా ఆగిపోయెను , యమున కి విషయము అర్ధమయినది " ఈమెకు  అగస్త్యుడు గుర్తుకువచ్చిన మరల మనసు చెడును " అని తలచి స్కోర్ కాగితములు తన చేతిలోకి తీసుకొనెను. “అమ్మ ఈ సంకేతములకు అర్ధమేమి , వీటినెట్లు అర్ధము చేసుకొనవలెను?”  ఈ ఐదు గీతాల కాగితమును స్టాఫ్ అందురు వీటి మధ్య నాలుగు ఖాళీలు కలవు. ట్రెబల్  క్లెఫ్ , బాస్ క్లెఫ్   అని రెండు ముఖ్యమైన క్లెఫ్ లు కలవు, పియానో , కీ బోర్డు , సెక్సా ఫోన్ , వైలన్ , ఫ్లూట్ వంటి అన్ని ఎక్కువ పిచ్చ్ గల పరికరములు కు సంకేతములను ఇచ్చట వ్రాయుదురు.   ఈ లైన్ల మధ్య ఖాళీలకు పేర్లు కలవు అవి ఈ జీ బీ డీ ఎఫ్.   స్పేస్( లైన్ల మధ్య ఖాళీ )సూచించుటకు  ఈ ఖాళీలలో పేస్ FACE అను అక్షరములు వాడవలెను.

పావు నోటు, అర నోటు పూర్తి నోటు నో ట్ వాల్యూస్ సిగ్నేచర్.  మీనాక్షి అట్లు చెప్పుకు పోవు చుండ గా మీనాక్షి నిత్యమూ చూచు మీనాక్షి వలే కాక  కొత్తగా కనిపించెను. కొలది సమయము  తరువాత “అమ్మ ఇంటికి పోయెదము చాలకు ని పిలవనా ?”

మీనాక్షి “విమానాశ్రయము నుండి వచ్చుచూ మననిచ్చట వదిలి అతడింటికి పోయినాడు, అతడిని ఇప్పుడు పిలిచి ఇబ్బంది పెట్టుట పాపము. నా కింకనూ సౌండ్ ట్రాక్ స్వర కల్పన పని కలదు.” అనె ను.  “ఇప్పుడే కదా పూర్తయినదని చెప్పితివి!” అని యమున తెల్ల బోయెను. 

“పూర్తి అయినది ఫిలిం స్కోర్ మాత్రమే, పూర్తి చేయవలసినది ఫిలిం సౌండ్ ట్రాక్ అనగా పాటలకు సంగీతము. ఈ రాత్రి నాకు శివరాత్రే” అనుచున్న మీనాక్షిని యమున గుండెలకు హత్తుకొనెను. “నిత్యమూ నీ ఇంట నుండుటచే  ఒక అసాధారణ సంగీతరాణి వన్న విషయము మరిచి ప్రవ ర్తించు చుందును. రోజుకొక సినిమా సంగీతము కూర్చుట అనిన అబ్బురమే.  ఇట్టి సంఘటనలు నీ స్తాయిని స్ఫురణకు తెచ్చును. నీ ఇంట ఉండుట ఎంత అదృష్టముమో కదా !
“ఇంటనుండుటయా , చంక నెక్కి ! ముందు చంక దిగుము.” 

“ఊహు .. నాకు ఇప్పుడిప్పుడే  చిత్ర సంగీతము పై అవగాహనా కలుగు చున్నది.  నాకు కూడా నీ అడుగు జాడలలో నడవవలెనని కోరిక కలుగుచున్నది. మొదట సంగీతకారిణి  అవ్వవలెనని హాస్య మునకు అన్న మాటలే నేడు బలమైన కోరికగా రూపుదిద్దుకొనుచున్నవి.   నాకు సంగీత ము నేర్పుటకు వప్పుకొన్నచో చంక దిగెదను.” 

ఎవరైనా గురువుని ఇట్లు… అని మీనాక్షి అనుచుండగానే యమునా ఆమె కౌగిలి వీడి కాళ్లకు నమ స్కరించెను. మీ నాక్షి ఆమెను లేవనెత్తి గుండెలకు హత్తు కొని " నీ స్థానమిచ్చట " అనెను. “ఇట్లు చిటికలో సంగీతము సమకూర్చుచున్నయెడల బాలీవుడ్ ఏమి హాలీ వుడ్ కూడా నిన్ను వీడదు”   

నీ నమ్మకము దర్శక నిర్మాతలకు కలిగిన నాడు ఇంతకంటే వేగముగా సంగీతము (ఫిల్మ్ స్కోర్) సమకూరును.  ఇంత కంటే వేగముగానా? యమునకు అయోమయముగా నున్నది.

మీనాక్షి పెదవులు విచ్చినవి, పిచ్చిపిల్ల అను మాటలు వినిపించినవి. పియానో వద్ద  కూర్చొన్న మీనాక్షి  వేళ్ళు పియానో మెట్లపై  నర్తించుచుండెను " అభం శుభం తెలియని పిచ్చి పిల్ల .. అది చెరువులో ఈదుతున్న చేపపిల్ల అను స్వరాలు పలికించుచుండగా     యమున ఆమె ప్రక్కన మరొ క చిన్న బల్లపై కూర్చొని ఆమె మెత్తని భుజముపై చుబుకమునుంచి  చెంపకు చెంప నానించి ఆస్వరములందు కరుగు చుండగా 

మీనాక్షి “స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క E.T. ఎక్స్ట్రా-టెరెస్ట్రియల్, జాన్ విలియమ్స్ సంగీతానికి సరిపోయేలా సవరించబడింది. స్పీల్బర్గ్ విలియమ్స్కు సంగీతంతో పూర్తి స్వేచ్ఛను ఇచ్చెను. చిత్రం లేకనే క్యూ ను రికార్డ్ చేయమని కోరాడు; సంగీతానికి సరిపోయేలా స్పీల్బర్గ్ ఆ సన్నివేశాన్ని తిరిగి సవరించెను.

నిజమా సంగీతమును బట్టి చిత్రమును కత్తిరించుటా నమ్మలేకున్నాను! 

“నమ్మలేని నిజాలే అద్భుతాలు”

“రేపు కేరళ పోవుటకు వీలు లేకుండుటచే ఎల్లుండి వచ్చుచున్నానని నా గొంతుపై కూర్చొన్నమళయాళ మాంత్రికునకు తెలుపుము” ఇద్దరూ చాలా సేపు నవ్వుకొనిరి. పిదప యమునా నిద్రలోకి జారుట , మీనాక్షి పాటలకు స్వరములల్లుట తో తెల్లవారినది.

                                                           ***

నీ బతుకు బల్లిపాడులో తెల్లారిపోతాదే. నా పార్వతిని ఎత్తుకెళ్ళి నా పెళ్లి చెడగొడతావే.  ఈ రాత్రంతా నీకు శివ రాత్రే. 
అన్నవెనక్కి చూడకున్న  రోడ్డు చూసి నడుపన్నా. విశాఖపట్నంలో నే పనిపూర్తి చేద్దామంటే వినకుండా ఈ మారుతీ వేన్  లో అంతదూరం తీసికెళుతున్నావ్. 

ఓరి పిచ్చివాడా! లాడ్జీలు క్షేమము కాదు, నేడు ఆధాకార్డులు , ఫోటోలు కూడా అడుగు చున్నారు, మనకెంతమాత్రమూ కుదరదు. పిల్ల అందము చూచినా నోరూరుచున్నచో వేనులోనే పని కానిమ్ము . 
వద్దన్నా దీని కాళ్లకు చేతులకు కట్లు నోటిలో గుడ్డ ఉన్నంతవరకే మనకు క్షేమము , విప్పినచో  ఏమగునో మరచితివా?
ఆమ్మో! గుర్తు కు వచ్చిన వణుకు పుట్టుచున్నది,  ఇద్దరిపై పడి తుని లో ఎట్లు కొట్టిన్దిరా. దీన్నిఏట్లో మరల బంధించి తిమి. మన వారు నలుగురు ఉండగా, బల్లిపాడునందే  దీని పని పట్టవలెను.


దీనికి కొంచము నోట్లో విష్కీ  పోసినచో  మేలు కదా , అట్లే చేసెదము కానీ బల్లిపాడు పోయిన తరువాత మాత్రమే. మార్గ మధ్యమున దీనిని తాకుట క్షేమము కాదు. 

Wednesday, January 20, 2021

Bharatavarsha 115

 బెంగుళూరు, ఇందిరానగరు, సమయము రాత్రి 8.00 గంటలు.  ఇన్నోవా మీనాక్షి విలాసము నుండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు బయలు దేరు చుండెను. వర్షుడు తెల్లని సంప్రదాయ వస్త్రములను ధరించగా, మీనాక్షి చెంగావి చేలమునందు మెరియుచుండెను. లేతాకుపచ్చ పరికిణీ పై నారింజవర్ణ వోణీ ధరించి వర్షుని చక్ర సంకల్పిత ప్రయాణ పేటికను యమున త్రోయుచుండెను. వారు ముగ్గురు ప్రాంగణములో నున్నవాహనమును సమీపించిరి.  చాలకుడు పేటికను అందుకొని వాహనమందుంచెను. 

“నన్ను సాగనంపవలసిన పని ఏమి కలదు? నీ బిడ్డను  ఇట్లు అతిథి వలె చూచుచున్నావే!” అనుచున్ననూ మీనాక్షి మౌనముగా వాహనము నధిరోహించెను. వర్షుడు వాహనమునెక్కగా యమున కూడా అన్నయ్య ప్రక్కనే కూర్చొనెను. అప్పుడు వర్షుడు యమున వైపు తిరిగి   “యమునమ్మ విశ్రాంతి తీసుకొనుమని నీవైనా ఈ మీనాక్షికి చెప్పవమ్మా” అనగా యమున , “ఎంతమాట, అన్నయ్యని చెప్పి ఆదరణ , సత్కారము మరిచెదమా!” అని సాగదీయుచూ చెప్పెను.  అట్లు ఎంతచెప్పిననూ వినక వర్షుని సాగనంపుటకు మీనాక్షి యమునలు సిద్దపడిరి.  వాహనము వెనుకవరసలో వారు మువ్వురూ కూర్చొనిరి , తలుపులు మోసుకొన్నవి. శ్వేత వస్త్రములు ధరించిన చోదకుడు వాహన వేగవర్ధనిని (vehicle accelerator)  ఒత్తగా నల్లని చక్రములు పరిభ్రమించుచూ వాహనము కదిలెను.


వర్షుడు వెడచుండగా  ఇంతులిరువురికీ రెండు రోజులనుండి పొందిన ఆనందామృతమును కోల్పోవుచున్న ట్లుండుటచే వాహనమందు నిస్సంకుడు (మౌనము) రాజ్యమేలు చుండెను.  ఎన్ని చక్కని విషయములను తెలియజేసినాడు,ఎన్ని సాహిత్య సుధలను చిలికినాడు. ఇతిహాస, తత్వ, సాంకేతిక, కవితా, సాహిత్యములను గ్రోలిన మధుపమితడు. అయిననూ ఏమి లాభము ఈ రాత్రికుండి రేపు పొమ్మన్ననూ మాటవినని మొండివాడని యమున  తలచుచుండెను. ఇంతలో వర్షుని  చరవాణి మ్రోగగా  విదిష తో  ఒక్క నిమిషము మాటలాడి నవ్వుచూ ముగించెను.  “అన్నయ్యా ! ఒక్కసారి నేను మాటలాడెదను" అని యమున చరవాణిని చేగొనబోయెను.  వర్షుడు" అయ్యో ముందుగా చెప్పవలసినది, మరి ముగించితినే! మరల చేయమందువా?” అని అడగగా యమున మూతి మూడు వంకరలు తిప్పెను. 

మ.  వనవా  సాన  

మనసా  రాపిలి

అనురా   గాలను 

అనుకో  నాథిధ్య   

“ఆహా! చూడుము తడిసిన దేహముపై సబ్బుబిళ్ళ జారుచున్నట్టు రహదారిపై  వాహనమెట్లు  ఎట్లు జారుచున్నదో!” అనుచూ వర్షుడు యమున దృష్టి మరల్చ ప్రయత్నించు చుండగా మీనాక్షి ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. “ఎంత తుంటరివయ్యా మారాము చేయుచున్న చిన్నపిల్లకి, గిలక్కాయ చూపి ఆడించినట్టు, రహదారులు, కారులు చూపి నన్ను ఏమార్చుచున్నావు. నేనిచ్చిటిపిల్లనే, బెంగుళూరు నందు రహదారులన్నీ ఇట్లే చక్కగా ఉండును." అనెను.   

 “విశాఖనందు మువ్వవాని పాలెము, డాబాగార్డెన్స్ వలె;  హైదరాబాద్ నందు ఫిలింనగర్ , మణికొండ వలె;   బొంబాయి నందు జుహు బీచ్,  బాంద్రా వలె ;   ఢిల్లీ నందు గ్రేటర్ కైలాష్ , నార్త్ అవెన్యూ వలె బెంగుళూరు నందు సదాశివనగరు, ఇందిరానగరు అత్యంత శ్రేష్టమైన విలాస ప్రదేశములు. అత్యంత ధనిక రాచ, బుధ వాణిజ్య వర్గముల కాలవాలమీ రెండు ప్రదేశములు. రాయలకు చెన్నమదేవి, తిరుమలదేవి అను ఇరువురు రాణుల వలె,  బెంగుళూరుకు  సదాశివనగరు, ఇందిరానగరు రాణులు. అని చెప్పుచుండగా మీనాక్షి మనసులో "ఈ పిల్లవాడు మాటల మాంత్రికుడివలె నున్నాడే." అనుకొనెను.   


మీనాక్షి  ముఖమున విషాదమలుముకొనుటకు కారణము యమునకు అవగతమయ్యెను. అందుచే ఆమె  మాట మార్చుటకు మీనాక్షి తో  "నాకొక ధర్మ సందేహమున్నది నీ జ్ఞాననిధిని అడుగమందువా ? అనెను

మీనాక్షి యమున వైపు కొరడా ఝుళిపించినట్లు చూపు రువ్వి ఏమి అడిగిననూ అడగవచ్చు అని కరవాలము తో వేటు వేసినట్టు జెప్పెను. “శ్రీ కృష్ణ దేవరాయలు కెంతమంది భార్యలని నేను అంతర్జాలమందు ఒక గంట సేపు వెతకవలసి వచ్చినది.  ఆరుగురు, భార్యలని కొంతమంది, పన్నెడు మంది భార్యలని కొంతమంది వ్రాసినారు. తీవ్ర ముగా వెదకులాడిన పిమ్మట రాయలుకిరువరు భార్యలని  వారి పేర్లు తిరుమల దేవి , చిన్నమ  దేవి అని తెలిసినది.  ఏ రాజు చరిత్ర చూసుకున్ననూ ఇట్లే ఎందుకు  ఉన్నది ?”

మీనాక్షి  మరల మౌనముద్ర లో కూర్చొని మరల ఆలోచనలో ములిగిపోయెను

వర్షుడు:  ఇదా నీ  ధర్మ సందేహము?!     

యమున: నాసందేహమదికాదు రాయలు హైందవరాజు కదా అతదికిద్దరు భార్యలైట్లుండిరి? 

వర్షుడు:  చాలా చరిత్ర చదివినదే చెల్లమ్మ! 1960 లో భారత పార్లమెంట్ నందు ముస్లింలకు  తప్ప  హిందువులకు రెండు వివాహములు చెల్లవని చట్టము చేయువరకు, సామాన్య హిందువులు కూడా బాహాటంగా రెండు మూడు వివాహములు చేసుకొనెడివారు. ఇంక రాజుల సంగతి అడుగపని ఏమున్నది? ఏ రాజుకు చూచిననూ పది మంది  భార్యలుండుట సామాన్యముగా కనిపించును , ఏ కాల మందైననూ  ఏ దేశమందైననూ అట్లు లేనివారే అరుదు.  

యమున మీనాక్షి వైపు చూచెను ఆమె మనసింకనూ విషాదరాగమునఆలాపించుచున్నది.

యమున : నాకింకొక సందేహము, మన చరిత పురాణములందు ఎచ్చట చూచిననూ పురుషుల వలే ఎక్కువ వివాహములు చేసుకున్న, (ఎక్కువ భర్తలు గల  స్త్రీలు)  ఎందుకులేరు?

"ద్రౌపది కలదు కదా"   అనుచు మీనాక్షి బాహ్య ప్రపంచములోకి వచ్చెను

యమున : ఎంత సేపు చెప్పిననూ ఒక్క స్త్రీ గూర్చి చెప్పుచుందురు.

విలువిద్యలో అర్జునునకు సాటియగు నితంతు మహారాజు ఐదుగురు కుమారులగు  సాల్వేయ , శ్రుతసేన, సురసేన, తిందుసరస, అతిసరసులను  శిబి  చక్రవర్తి  కుమార్తె బౌమస్వి  స్వయంవరమున వివాహమాడెను. యయాతి కుమార్తె మాధవి వివాహమాడ కనే ఐదుగురు భర్తలతో బిడ్డలను కన్నది. కుంతీ, మాద్రి, అంబిక అంబాలిక ఇట్లు అనేక మంది  అని వర్షుడు  చెప్పుచుండగా

యమున :  పిల్లలను కనిపెట్టుట  గూర్చి కాక జీవితము కొరకు  వివాహము చేసుకొన్న స్త్రీలు ఎందుకు కానరారు? 

వర్షుడు: నాడు సార్వభౌములైననూ , సామాన్యులైననూ సంతాన చింత ఎక్కువగా యుండెడిది , స్త్రీ పురుష సంగమము భోగము కొరకు అనెడి భావన పిదపకాలమందు ప్రభలిపోయినది. అప్పుడు రాజుల పాలనే తప్ప ప్రజా ప్రభుత్వములు లేవు , రాజుకు వారసులుండుట తప్పని సరి కావున వారు పుత్ర సంతానము కొరకు పడరాని పాట్లు  పడుచుండెడివారు. మహాభారతంలో కుంతి మరియు పాండురాజు మధ్య   "స్త్రీ   బిడ్డల  కొరకు  గర్భం ధరించే అనేక మార్గాల గూర్చి"  చర్చకలదు.  తన భర్త ద్వారా, పండితుని ద్వారా, డబ్బు కొరకు మరొక వ్యక్తి నుండి గర్భము ధరించుట, భర్త మరణానంతరము  కుటుంబాన్ని విస్తరించుట కొరకు గర్భం ధరించుట , పెళ్ళికి ముందే భార్య ద్వారా పుట్టిన బిడ్డను శ్వీకరించుట, దత్తతచేసుకొనుట , డబ్బు ద్వారా పిల్లవాడిని కొనుట, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఇతరుల కుమారుడిగా ఇచ్చుట, గర్భిణీ స్త్రీని వివాహం చేసుకొనుట  పిల్లలను పొందు మార్గములు. ఒక్కొక్క వంశమందు మహాపురుషులుండెడివారు. అందుచే వంశమునకు , గుణ గణములకు అంతటి ప్రాముఖ్యత యుండెడిది.  

మీనాక్షి పూర్తి గా నిమగ్న మయ్యి వినుచుండెను ఆమె ముఖమున విషాద ఛాయాలంతరించినవి. “చాలా సేపటివరకూ నీ మనసిచ్చటలేదు. అనుచుండగా " మరి ఎచ్చటికి పోయెను?" అని యమున అడుగుచుండగా, వర్షుడు ఆమె వైపు తిరిగి " ఉష్... హాస్యమాడరాదు అమ్మ మౌనరాగమందు భైరవరాగము దాగి యున్నది " 

యమున: నా స్థాయికి రావయ్యా స్వామీ అట్లు చెప్పిన నాకేమి అర్ధమగును? " 

మార్జా లము అనిన బిడాలమనినట్టు  

వర్షుడు " భైరవరాగమనగా విషాదము   అమ్మ బాధను గమనించితివా ?"  అని అడిగెను. ఆమె మౌనముగా ఉన్నదనిన ఎప్పుడూ కొడుకు గూర్చి చింతించు చుండును. నేనెంత చెప్పిననూ ఆమె అట్లే ఉందును , నేను ఓదార్చి న యెడల దుఃఖము పెరిగి కన్నీరు పెట్టుకొనును.  అందుచే నేను కూడా కొలది సేపు మౌనము వహించి యుందును. 


అమ్మని ఊరడించు  వయసు జ్ఞానము అనుభవము లేకున్ననూ, మనసున్నది , అది అమ్మ ఎప్పుడూ అర్ధము చేసుకొనును !" అని యమున ఏడ్వ సాగెను. మీనాక్షి భోరున విలపించుచూ యమునను గుండెలకు హత్తుకొనెను.  చాలకుడు కంగారుపడి వాహనమును  నిలి పివేసెను. వర్షుడు వాహనము కిటికీ నుండి బయటకు చూచెను. వాహనము యెలహంక చేరెను. “సమయము 8.30. గంటలయ్యెను, పోనిమ్ము నాయినా” అనగానే వాహనము మరల బయలుదేరెను. 

“మోహనము తొలగగా, లకుమ కొరకు పాడిన మోహన రాగమువీడి   తండ్రి సేవలో   దివ్యమైన తోడి రాగమునఆలాపించుచున్నాడు.  ఇప్పుడు నీకొడుకు వాస్తవ ప్రపంచములోకి అడుగిడినాడు.  అగ్నియందు కాలిన కుప్యము. బాధ్యతల దాగలి పై  బాధల  సమ్మెట దెబ్బలు అతడిని తీర్చిదిద్దుచున్నవి. ఇకపై నీకొడుకు తప్పులు చేయడు , కానీ అతడు  ముందు చేసిన తప్పులకు ఇతరుల జీవితములు బలి అగుచున్నవి. ఆ తప్పు దిద్దుకొన వలెను. అందుకు నీవే భాద్యత తీసుకొనవలెను.  ఆ నష్టమునకు ఎంత డబ్బయిననూ నేను భరించెదను. అని మీనాక్షి అనుచుండగా, వర్షుడు " డబ్బు ఆ సమస్యను పరిష్కరించ జాలదు" అని చెప్పుచుండగా మీనాక్షి చరవాణి మ్రోగెను. 

ఓ! తారా , ఎచ్చటనుండి , .. మేము విమానాశ్రయమునకు పోవుచున్నాము , వర్షుడు పది గంటలకు విశాఖ కెగురుచున్నాడు.  తరువాత కొలది సేపు మీనాక్షి బదులైననూ పలక విను చుండెను. శుభవార్తే చెప్పినావు. నీకు కూడా నేనొక శుభవార్త తెలిపెదను. ఇప్పుడు చెప్పజాలను. నీ ఇంటికి వచ్చి నీ చెవిలో చెప్పెదను. నీకు కొక  బహుమతినిచ్చిన శ్వీకరింతువు కదా?  ఇచ్చిన మాట మరువరాదు. మనమిద్దరమూ కలసి విశాఖ పోయెదము. అట్లు అరుణతారతో కొలది సేపు మాట్లాడి వర్షుని వైపు కొరకొరా చూచెను.

నీవు మధ్యానము ఇండియా గేటువద్ద కనిపించినావని అరుణతార చెప్పెను.  నీవు పెద్దలతో చెప్పకూడని పనులు కూడా చేయుచున్నావా? ఏ ఇంగ్లీషు తారామణి తో తిరుగుచున్నావయ్యా ?  ఢిల్లీ ఎందుకు పోయినావయ్యా ? వర్షుడి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యెను. నీళ్లు నములుచూ అయోమయముగా చూచుచూ   “నామీద నమ్మకము లేదా?” అనుచున్న అతడి మొఖం చూచి మీనాక్షి "నాయనా నీమీద నమ్మకమున్నది  నీవు వెళ్లిన పని విజయవంతమగును అని కూడా నమ్మకమున్నది. నీవు చెప్పవలదని అనుకొన్నచో నేనీవిషయము ఎవ్వరికి చెప్పుదానను కాదు కదా నాకైననూ చెప్పి ఉండవచ్చు కదా ? "అని మీనాక్షి అనగా వర్షుడు “పని పూర్తి అయిన పిదప తెలపవలెనని  " అని  నీళ్లు నములుచుండెను .

అరుణ తార చూచెను , నీకు తెలిపెను , మీ ఇద్దరికీ తెలిసెను. నాకు చెప్పుటకు మీకిష్టము లేకున్నచో చెప్పవలదు అని యమున ముఖం తిప్పుకొనెను, “నాచిట్టి చెల్లి” అని వర్షుడు చుబుకమును పట్టి త్రిప్పుచుండగా " నీ ముద్దులు ఏమీ వలదు ఫో , మీ ఇద్దరూ తోడు దొంగలు " అని యమున ముఖము దాచుకొనెను. 

అన్నయ్యది  ఎదో ప్రేమ వ్యవహారమమ్మా అని మీనాక్షి సర్ది చెప్పబోగా యమున " హి హి హి , నీ కట్టు కథలు  నాకేమీ వలదులే” అని తన చేతిలో పుస్తకమును చూపుచూ "అట్లేమైననూ చేసిన చో మావదిన   తాటతీసి తాంబూలమిచ్చును ఆమె కళ్ళు కప్పుట మీ తరము కాదు , సరే, మీరు చెప్పనిచో  నేను ఆమెతో మాట్లాడి విషయమును తెలుసు కొందును." అని తెగేసి చెప్పెను. వర్షుడు “ ద్రోహీ ఎంతకు తెగింతివే , అన్నా వదినల మధ్య అంటించుచున్నావు" 

మీనాక్షి “వర్షుడు  ఢిల్లీలో   ధోల్పూర్ హౌస్కు పోయి అచ్చట జరుగు ఐ ఏ ఎస్ అంతిమ పరీక్ష,  (ఇంటర్వ్యూ) కు హాజర య్యెనని  తెలిపెను. 

యమున "నీవు నీ స్థాయికి తగ్గ పని చేసినావు, నావంటి వారు ప్రయత్నించిన అది అత్యాశ అగును గానీ నీవంటి వారు ప్రయత్నించకున్న అది తప్పే అగును.”  

ఈమె రెండు సార్లు పోయి తప్పినది అని మీనాక్షి అనగా యమున పరీక్ష కఠినముగా నుండునని ప్రత్యేకించి చెప్పపని లేదు. రెండు సంవత్సరముల క్రితము నేను పరీక్ష వ్రాయుచున్నప్పుడు   రెండు లక్షలమంది ప్రాధిమిక పరీక్షకు హాజరు కాగా ముఖ్య పరీక్షకు పది వేల మంది చేరగలిగిరి. చివరి మౌఖకిక పరీక్షులకు రెండు వేల మంది మాత్రమే చేరుకొనిరి. “ఇప్పుడూ అట్లే యున్నది అని వర్షుడనెను.” మీనాక్షి “ఈ మౌఖిక పరీక్ష ఫలితములు ఎప్పుడు వెలువరించెదరు ?”  వర్షుడు “ఒక వారము లో, ఆపై 15 వారములు డెహ్రాడూన్ లో శిక్షణ ఉండును.”

                                                                    ***

ఇన్నోవా కెంపెగౌడ విమానాశ్రయము చేరెను. గడియారం సమయము 9.00 గంటలు చూపుచుండెను.  విమానాశ్రయములో నున్న మాల్గుడి పలహార శాల యందు ప్రవేశించి  అల్పాహారం తీసుకొనుచుండిరి.  మీనాక్షి , యమున ప్రక్క ప్రక్కన కూర్చొనగా  వారికెదురుగా వర్షుడు కూర్చొనెను. పలహారసాలంతయూ  ఖాళీగా యున్నది  "60 నిముషముల ముందు బోర్డింగ్ పాస్ తీసుకొనవలెను కదా?" అని యమున అడిగెను. "30 నిమిషముల ముందు కూడా తీసికొన వచ్చునని వర్షుడనెను." తినుట ముగిసిన పిదప నీవు రక్షణ తనికీ ( సెక్యూరిటీ చెక్) పూర్తి చేసుకొని ప్రవేశించవలెను. అని మీనాక్షి అనెను.


ముగ్గురు మౌనముగా తినుట ముగించి ఫలహారశాల బయట విశాల ప్రదేశములో నిలుచుని యుండిరి   "నా పుట్టినరోజు ఇంత ఆనందముగా జరుగునని కలనైనా ఊహించలేదు. వర్షుని వీణాగానము నా మదిలో ఇంకనూ మ్రోగుచున్నది." అను చుండగా యమున"నందికొండలలో మేఘమండలములో పాడిన పాట విని నామనసు పులకరించింది.  పూర్తిగా అర్ధము కాకున్ననూ వినుటకు ఎంతో బాగున్నది
మీనాక్షి: అర్ధము కాకపోవుటకు ఏమున్నది మా తాతగారు సోమయాజులు ,అమ్మమ్మ సోమిదమ్మ 
వర్షుడు: యమునా  ఆపదములకు అర్థము తెలియునా? 
యమున: అవి వారి పేర్లనుకొనునుచున్నాను.
వర్షుడు: యజ్ఞము చేసిన పురుషుని సోమయాజులు అని, స్త్రీని  సోమిదమ్మ అని పిలుతురు. ఈమె ముత్తాత తండ్రి కేరళ రాచకుటుంబమునకు సంస్కృతము, ఆంగ్లము భోదించుచుచూ పద్మనాభస్వామి దేవాలయమందు అరుచుకునిగా నుండెడివారు. ఆంగ్లేయులు వచ్చినపుడు ఆంగ్లము వచ్చుటచే రాజుకు దుబాషీగా పనిచేయుచుండెడి వారు. ఈమె ముత్తాతగారు  గొప్ప సంస్కృతాంధ్రములందు గొప్ప పండితుడే కాక నైఘంటికుడు.  ఒక ఆంగ్ల దొరవద్ద దుబాషీగా పనిచేయుచుండెడివారు. మొట్టమొదటి తెలుగు ఆంగ్ల నిఘంటువు వీరు వ్రాసినదే. 

యమున: అమ్మ ఏమియూ చెప్పదు.  యెచ్చటైనా కష్టము కలిగిన చో నిశ్శబ్దముగా మాయమగును, లేదని, పొమ్మని చెప్పుటరాదు.
వర్షుడు: ఈమె సున్నిత మనస్కురాలని చెప్పుటకు కొంత జాగు చేసితిని. కానీ నేడిక చెప్పక తప్పదు అని అగస్త్యు సుందరిని ఏమిచేసెనో చెప్పెను.
యమున: ఈమె కడుపున అటు వంటి బిడ్డ పుట్టుట  విడ్డూరము గానున్నది. అను చుండగా మీనాక్షి కాళ్లక్రింద భూమి కంపించుచుండెను
మీది గొప్ప వంశము అను భావన నీకున్నచో, ఆ వంశ కీర్తిని నిలుపు భారము స్వీకరింపుము. నేటి వారికి వంశ పూర్వజులతో వారి కీర్తి ప్రతిష్టలతో పని లేదు, వారికి కావలసినది శారీరక సుఖము మాత్రమే. దానికొరకే కల్లా కపటమెరుగని గుణవతి అయిన సుందరిని లొంగదీసుకొనెను. కృతజ్ఞత అనెడి  బలహీనత తో తనను అర్పించుకొనిన సాధ్వి సుందరి.  
పైకి నవ్వుచున్ననూ ఆపిల్లని కనిపించని వైరాగ్యము అలుము కొన్నది.  పైకి ఆమె ఆటలే కనిపించుచున్ననూ ఆమె ఉద్యోగమునకు రాజీనామా చేసెను. భారత వైమానిక దళములో చేరి యుద్ధమునందు మరణించవలెనని చావును లక్ష్యముగా చేసుకొని బ్రతుకుచున్నది.  అంత గుణవతి ఉత్తమురాలిని కోడలు గాపొందవలెనన్న నీవు నీవు ఆమెను ఒప్పించుటకు ఏ మైననూ చేయవలెను. నీ వంశము నిలుపు కొను అవకాశము, తప్పుదిద్దు కొను అవకాశము ఇంకనూ కలవు. మంజూషవివాహము లో ఆమెను ఒప్పించి వివాహము చేయవలెను. అని వెడలు చుండగా , మీనాక్షి గుండె బ్రద్దలైనది, మానసము అగ్ని గుండమయి దహించు చుండగా పట్టుతప్పి నే లకొరుగు చుండెను.  యమున ఆమెను పట్టుకొని పక్కనే ఉన్న పొడవాటి కూర్చొను బల్లపై  వాల్చెను  

                                                             ***
వర్షుడు విమానమందు ప్రవేశిం చెను.  చరవాణిని విమాన శైలి ( మోడ్)  లో నుంచుచుండగా వచ్చిన సందేశమును చూసి నమ్మలేక పోయెను. మరల నిదానముగా చదివి నివ్వెరపోయెను. కళ్ళుతిరుగుచుండగా మరొకసారి సందేశమును చదివెను " సుందరిని గౌడ సోదరులు బీచ్ వద్ద నుండి అపహరించుకు పోయినారు" వర్షుని శరీరమును నిస్త్రాణ కమ్ముకొను చుండగా విమానము గాలిలోకి లేచెను. అప్పుడే స్పృహలోకి వచ్చిన మీనాక్షి ఎగురు చున్న విమానమును చేష్ట  లుడిగి చూచు చుండెను.   

Saturday, January 16, 2021

Bharatavarsha 114

 అబ్బబ్బ ఈ పిల్లలకి చెప్పువారెవ్వరూ లేకున్నారు!   చూడమ్మా ఆ ఇకఇకలూ పకపకలు ద్విచక్రికు తాళము వేసితిని లేకున్నచో ఇంటి ఆవరణలో దొమ్మరిసాని వలె ప్రదర్శన చేయుచున్నారు పోనే లేమ్మా చిన్న పిల్లలు ఆడుకొనుచున్నారు. అనుచూ ఇంటికి వచ్చిన పొరుగామె వెడలెను. ఆమెను సాగనంపుతూ బైటకువచ్చిన మాలిని జాంచెట్టు కొమ్మలపై వ్రేల్లాడుచున్న పార్వతి సుందరిలను చూసి” ఏమీ కోతి చేష్టలు అవ్వ ఈడొచ్చిన పిల్లలు ఇట్లు చెట్లెక్కిన చూచినవారు ఏమనుకొందురు!”  “అమ్మా కసరత్తు చేయుచున్నామమ్మా వైమానికులకు శిక్షణ తో పాటు కసరత్తుకూడా ఉండును. నిత్యమూ చేయవలె ను”  “నీ శిక్షకుడు చెట్లెక్కమని చెప్పినాడా? చెట్ల కొమ్మలపై వ్రేళ్ళాడుట ప్రమాదం కాదా! ఇట్లు మతిమాలిన పనులు చేయుచూ నా ప్రాణములు తీయుచున్నారు”

ఈ పార్వతి చెప్పెనమ్మా నేను నేలపై కసరత్తులు చేసుకొనుచుండగా తానే  చెట్టెక్కి చూపి పైకి రమ్మని పిలచినది. “అయ్యయ్యో జారి పడిన ఏమగును? దిగి స్నానములు చేసినచో అల్పాహారం తినవచ్చు పెసరట్లు వేయుచున్నాను”

Nandini - Art - poolabala

సుందరి చెట్టు పైనుంచి మాలిని గారి ప్రక్కకి  దుమికి "అబ్బా పెసరట్లనిన నాకు చాలా ఇష్టము" అనును ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయి చూచుచుండగా సుందరి లోనికి పోయెను. పార్వతి మాత్రమే ఇంకనూ చెట్టు పైనే యున్నది " చెట్లెక్కుట ఎప్పుడు  నేర్చినావే  దిగవే చెట్టు." మాలిని గారు  బెత్తము తీసుకుని కేకలు వేయుచున్నారు  సరిగ్గా అప్పుడే మెర్సిడెస్ బెంజ్ వచ్చి ముంగిట నిలిచెను . నందిని నీలి పరికిణి పై చెంగావి చేలము ధరించి తళ తళ మెరియుచు తన చురుకైన లేడి కన్నులను రెపరెప లాడించుచూ బెరుకుగా మాలిని గారి వైపు చూచుచూ, “ఈ బెత్తమును చూచినా నాకు భయము వేయుచున్నది” అని బెత్తమును లాగి ఆవల పారవేసెను.  నాగు పాము వంటి పెద్ద జడ, నాజూకు మెడ, గుబ్బెత్తులూగుచుండ నాట్యము చేయుచూ “మరి పిల్లలను ఏమిచేయమందువు ఇట్లు నాట్యము చేయమందువా?” అని అడుగు చుండగా, పార్వతి చెట్టు పైనుండి “నేను చెట్లెక్కుట చిన్నప్పటి నుండే నేర్చితిని. బల్లి పాడు లో మాఇంటివద్ద నున్న ఆడపడుచులందరూ చెట్లెక్కువారే.”  చెట్టు పైనుండి దూకి మాలిని గారి వద్దకు వచ్చి” చెట్టు పై నుండి దూకుట  మాత్రమూ అక్క (సుందరి)ను  చూచి ఇప్పుడే నేర్చుకొంటిని.  

సుందరి అప్పుడే స్నానము చేసి  పేంటు , చొక్కా  వేసుకొని  వచ్చినది  "నీకు  పేంటు , చొక్కా  ఎక్కడివమ్మా" అన్నయ్య బట్టలు ధరించినాను " వాడి పెట్టికి  తాళము పెట్టిన గా నీ , వాడి బట్టలు వాడికి దక్కవు "    పార్వతీ నీవు కూడా స్నానము చేసి రమ్ము అని ఆమెను లోనికి నెట్టెను.

మంజూష అప్పుడే నిద్రలేచి స్నానాలగది వద్దకు పోయెను అచ్చటనే సుందరి నందిని పార్వతితో కబుర్లు మొదలు పెట్టినారు. " లోపల అది స్నానము చేయుచుండగా మీ ముగ్గురూ అచ్చట నిలబడి ఏమిచేయుచున్నారే " మాలిని గారు కేకలు వేయగా " వీపు తోముచున్నాము " అని నందిని అనుచూ మా అందరికీ  పెసరట్లు వేయుచున్నారా ?" అని అడిగెను . స్నానాలగదిలో నుండి పార్వతి " సబ్బు అరిగి పోయినది" అని అరిచెను  

సుందరి  పాత సబ్బు పారవేయుమని  కొత్త సబ్బు తెచ్చి ఇచ్చెను.   నందిని " ఆ పాత సబ్బు పారివేయుటకు బదులు నీ బసవడికి చ్చినచో అతడు దానిని పెట్టెలో భద్రముగా దాచుకొనును."అనెను. " అరిగి పోయిన సబ్బు కు అంత ప్రత్యేకత కలదా?" అని సుందరీ మంజూష  ఆశ్చర్య పోవుచుండగా  నందిని ఒక దండకమునాలపించసాగెను. 

“పడుచు దేహమంతయూ తాకి  నురుగగా ప్రాకి, ఔష్ఠ ములు నాకి

 కంబు కంఠంబు పై  జారి మధురాంగముల జేరి , 

గిరగిరా తిరిగి జరాజరా ప్రాకి నడుము పై నర్తించి , 

నాభి అంతయూ నిండి   ఊరువుల పై  పొంగి   

 దిండీర భిండీర మై  పెక్కు కోణాలు శోధించి,  మోహ బాణాలు సంధించి  

 నీ   నిమ్నోన్నతములు సేవించి ,  నీ చేతిలో వొరిగి నీ వొంటిపై  కరిగి 

నీ ఇంపైన సొంపుల కు   గంభీరవంపులకు   గంబూర  పరిమళములద్దు, మెరుగులేదిద్దు సబ్బు, స్త్రీలు వాడినా,  ఎంత అరిగినా,  కొంత తరిగినా, ముక్కలుగ విరిగినా, ఏంతో  కొంత మిగులు,  అదియే   పురుషులకు ఇంపు   ఉత్సాహమే నింపు  ఉల్లాసమే పెంచు  ” సబ్బు బహు  చిన్న  విషయమ్ము ,స్త్రీ వాడిన సశేషమ్ము,  పురుషునకదియే  విశేషమ్ము. పార్వతీ సబ్బు పారెయ్యకుమ్ము  అదియే బసవడికి సొమ్ము 

అని సబ్బు దండకమును    చదువుచుండగా మాలినిగారు చెవులు మూసుకొని “అచ్చట ఆపుము తల్లీ నీ దండకములకొక దండము సబ్బు నురుగ కళ్ళ లోకి పోయి కనులు  మండు  చున్నవి . చిన్న పిల్లలు చెడిపోవుచున్నారు” అని కేకలు వేసిన పిమ్మట అంతయూ సద్దు మణిగినది.

                                                                  ***

అందరూ వంటగదిలో క్రింద కూర్చొని పెసరట్లు తినుచుండగా, పార్వతి " నేడు ఆయనకి  మన చిరునామా ఇవ్వక తప్పదు, అడిగిన బహుమతులు చెప్పిన చోటకి పంపెను కదా" కానీ కారు తీసుకొని రమ్మని చెప్పెదను” అని నందిని చెప్పుచుండగా " అయ్యో వారి వద్ద కారు లేకున్నచో?!”   “బల్లి పాడులో అతడిని ప్రశ్నలు అడుగుచుండగా నీవిట్లే వీగిపోయినావని వింటిని , ఆ మెతకతన మి చ్చట  చూపవలదు.” అతడి తంటములెట్లు పడవలెనో అతడికి తెలియును, చెప్పినది చేయుట అడిగినది ఇచ్చుట మగవారికి నేర్పవలెను అనుచూ   నందిని  మగవారినెట్లు చెప్పుచేతలలో ఉంచుకొనవలెనో సులభ సూత్రములు చెప్పుచుండెను ఇంతలో దామిని వచ్చెను. “దామినీ నీకునూ పెసరట్లు వేసెదను కూర్చొనుమ 'ని మాలిని పీట వేసెను. పెసరట్లు తినుచూ సుందరి,  నందినితో  "అక్కా మధురాంగములనిన ఏమి?" అని అడిగెను, మంజూష నాకు కూడా మధురంగములనిన అర్థము తెలియదు అనుచుండగా. దామిని కూడా ఆ పదమునకు అర్ధము తెలుసుకొనుటకు మిక్కిలి కుతూహలము చూపుచుండెను. మీ ఇద్దరికీ వాతలు పెట్టెదను అని సుందరిని దామినిని మందలించుచూ, మాలిని అట్లకాడ  చూపెను. “ఏమే మంజూషని వదిలి వేసినావు అది కూడా అడిగినది కదా, నీకూతురని దానిని వదిలివేసినావా ?” అని దామిని అనెను.  మంజూషను   దండించరాదు  కారణము  చూచి గ్రహించవలెను అనగా పార్వతి " నాకు అర్థమైనది నాకు అర్థమైనది " అని అరుచుచుండగా " అబ్బా నాకునూ  అర్థమైనది , బల్లిపాడు పిల్లకు మునుపెంతో  సిగ్గరి , ఇప్పుడు నోరు పెరిగినది  " అనుచూ " అట్లయిన అదే కారణమున నన్ను కూడా  దండించరాదు " అని దామిని అనుచుండగా మాలిని కళ్ళు విప్పారినవి. “నీవు కూడా ?” అని మాలినిగారు దామిని వైపు చూడగా అవును అని దామిని సిగ్గుతో తలా ఊపేను. 

సుందరి నీవు పెసరట్లు వేసి పట్టుకుని రావలెను మేము పడక గదిలో కూర్చొని విశ్రాంతి తీసుకొందుము అని మాలిని నోట్లో పంచదార జల్లు చుండెను. సుందరి "నాకు రాదే ఎట్లు చేయవలెను ?" అను చుండగా మాలిని గారు " నేర్చుకొనవే , ఆ నందినితో తిరుగుట తగ్గించి నేర్చుకొనిన  సులభముగా   వచ్చును " అని నెత్తిపై ఒక్కటి మొట్టినారు " 

నందిని "అట్లైనచో నీవు విమానము నడుపుట సుందరివద్ద నేర్చుకొనుము , నేర్చుకొనిన సులభముగా వచ్చును." అనెను.  “అబ్బబా! ఇదమ్మ దీనివరుస” అని మాలిని విసిగిపోవుచుండగా “కోడలు అత్తతో సరసమాడరాదా?” అని నందిని దామినితో అనెను” మాలినిగారు " నేనే కోడలు నీవే అత్తవలే నున్నావు." దామిని గర్భవతి అయినది అన్న శుభవార్త విని ఆమెను తీసుకొని పడక గదిలోకి పోయి ముచ్చట లాడుచుండగా నందిని పెసరట్లు వేసి వారిరువురికీ అందించెను. “నీకు సంతానము కుండుటచే అందరమూ చిన్నబోయినాము, నేడెంత  శుభదినము , ఎంత శుభవార్త తెచ్చినావు అని స్నేహితురాలిని మాలిమి చేసెను.”

“ఎం ఎల్ ఏ కూతురినని చూడక నాచే వంట పని కూడా చేయించుచున్నావు!” అని అలక ప్రారంభించెను. అప్పుడే ఆనంద నిలయ ప్రాగణంలోనికి లేండ్ రోవర్ వాహనము ప్రవేశించెను. అందరూ బయటకు వచ్చి చూసిరి. ఆ వాహనమును విదిష నడుపుకొని వచ్చుట అందరినీ అబ్బుర పరచగా ఆ వాహనమునుండి విదిష తో కూడి వచ్చిన మరొక స్త్రీ అందరినీ మరింత అబ్బుర పరిను.    ఆమే నందిని తల్లి పైడమ్మగారు.

వారిరువురినీ చూడగానే నందిని కుతూహలము కుత్తకయందు కుంభకము కాగా   బకము వలె నిలిచెను.  సబ్బు దండకమునకు చెప్పిన పండితురాలికి మబ్బు పట్టెను.    రాధామనోహరమల మెరుపు ద్విగిణీ కృతమయ్యెను.  మూల మూలల నున్న  విరులన్ని వికసించి హసించుచున్నవి. “ఆనందనిలయమునకు పెళ్లికళ వచ్చినది రండి రండి” అంచు మాలిని గారు ఎదురేగి పైడమ్మను సాదరముగా ఆహ్వానించుచుండగా విదిష మాలిని గారి పాదములకు నమస్కరించెను. అది చూసి మంజూష పైడమ్మగారి పాదములకు నమస్కరించుచుండగా ఆమె మంజూషను వారించి చెంతకు తీసుకొనిరి. 

అత్తకాడ ఉంటాను, అత్తకాడ ఉంటాను, అంతాది అమ్మా  మా నందిని , నా నొద్దమంతే మావు  నల్ల గుంటాము   సూత్తన్నారు కదా.     నాకేటి మీనాగ బాస్సొచ్చా  మీ పద్ధతొచ్చామీరా బేమ్మర్లు.  

కులము దేమున్నదమ్మ, గుణముండవలెను కానీ, మీరు నలుపైననూ మీ మనసు మల్లి పువ్వు వలే తెల్లగా మెరియుచుండునుఅని మాలిని గారు పైడమ్మను కౌగిలించుకొనిరి. నా కూతురికి నా రంగు రానేదు తెల్లగుంటాది, ఆ కిట్ట పరమాత్మ దయవల్ల,  నీ కొడుకు పున్నె ము సరస్వతి కటాచ్చముంది, మంచి కోడలుపిల్ల లొత్తంది. అనుచుండగా “మాలినిగారు వియ్యపురాలిని లోనికి తీసుకొని పోయి పడకగదిలో మంచముపై కూర్చోండ బెట్టి “వదినగారి పట్టు చీర చాలా బాగున్నదే, వారిని కూడా తీసుకొచ్చిన బాగుండెడిది, అన్నయ్యగారు బాగున్నారా?” అడుగగా విదిష " ఈ మధ్య కొంచెము పని వత్తిడి పెరిగి ఖాళీ లేకుండెను , ఒక పక్క చర్చ్ లను , మరొక ప్రక్క రాజకీయములను చూచుకొనవలెను   కదా!

ఈ మద్దెన చర్చీలేటి బాగోనేవమ్మా  అమెరికా ఓల్లు  డబ్బు ఆపేసినారు , అల్లు పంపిత్తే  ఇక్కడ మనోళ్లు ఖర్చు లెట్టి పెచారాలు సేత్తారు, డబ్బిచ్చి సెడగొడతాన్నారమ్మా  అంటా ది,  మా నందిని. అనుచూ మాలినిగారి చెవి లో గుసగుసగా " ఈ గుంట సిన్నబొమ్మేటి , ఇదే ఆ అమెరికా  ఓల్లకి ఈల్లు  డబ్బు లెలాగా నొక్కేత్తన్నారో  రాసేసింది ఉత్తరము. "  ఆ మాట వినిపించకున్ననూ తనగురించి ఎదో చెప్పుచున్నది అర్థమయ్యిన నందిని కి తాపము హెచ్చి "అమ్మా మనము ఎం ఎల్ ఏ గారి కుటుంబమని మరువరాదు "అనుచూ పైడమ్మగారిపై పడి “నీకెక్కడికి వచ్చిననూ ఏదేదో మాట్లాడుచుందువు నీకుమాట్లాడుట రాదు, ఇంటికి పోయెదమ పద పద అని తొందర చేయుచుండెను. అది చూసి  మాలినిగారికి సెగలు రేగినవి “ఆమె ప్రపంచము బహు స్వల్పము,  పాపము, తన పిల్లలులే తన సంపద. కల్లా కపటము లేని ఆమె తన బిడ్డలగూర్చి చెప్పుకొని మురియుచున్నది. అందుకు నీవెందుకు కినుక వహించవలెను” అని మాలినిగారు అనగా , దామిని " ఆమె పేరు లో నే కాక గుణము కూడా బంగారమున్నది  , ఆమె ఎంతో  చక్కగా మాట్లాడు చున్నది అనెను. సుందరి, పార్వతి, లు ఏమియూ అర్ధము కాకపోవుటచే తెల్ల  మొఖం వేసిరి. మంజూష కాఫీ చేసి అత్తగారికి ఇచ్చెను.  

కాఫీ త్రాగుచు పైడమ్మగారు “ కోటి రూపాయ లొట్టుకోని  తెల్ల కోడలుపిల్ల ఒత్తంది, ఇంకేటి కావాలి? మా యజమాని ఎగిరి గెంతేత్తన్నాడు.”   పిల్లలందరూ చుట్టూ చేరి ఆలకించుచుండిరి కానీ పిల్లలందరికీ ఆ భాష,  విషయము రెండూ అర్ధము కాక  తెల్ల మొఖములు వేసిరి  . 

మాలిని గారు " వియ్యపురాళ్లు ఇరువురూ మాట్లాడుకొనుచుండగా మధ్యలో పిల్లలు దూరవలదు పిల్లలు వలే నున్నచో మంచిదనగా, నందిని ముఖము ఎర్రబారెను" ఇదంతయూ ఆ వర్షుని పని, ఈ నాటకుమునకంతయూ అతడే సూత్రధారి అని సుందరి,  పార్వతి మంజూషలతో అనుచుండగా విదిష విని "అయ్యూ, వర్షుని ఒక ఆడించు భామకు ఎన్ని కష్టములొచ్చెనో " అనెను. 

"ఇందులో నీ మోసము కూడా యున్నది "అని ఉక్రోషముతో మీదకు వచ్చుచున్న నందినిని విదిష కను సైగ చేసి సోఫాలో కూర్చుండ బెట్టెను. నందిని మంత్ర ముగ్ద వలె సోఫాలో కూర్చొనెను. విదిష ఆమె ప్రక్కనే కూర్చొని తలనిమురుచూ " కొంత సేపు పడుకొని ప్రశాంతతను పొందుము, అత్తతో పోట్లాడినది చాలు అమ్మతో, కలిసి ఆడుకొనుము" అని కళ్ళలో కళ్ళు పెట్టి చూచుచుండ, ఏ దివ్య శక్తి ఆకనులయందు కదలాడుచుండెనో నందినిని మెల్లగా మగత కమ్మెను. ఆమె కన్నులు మూతపడుచుండగా సోఫాలో అట్లే పడుకొనెను. కాలము స్తంభించెను. అందరూ అవ్యక్త అతులిత అలౌకికానంద డోలికలలో తెలియాడిరి.

నందిని నిద్ర లేచి చూసుసరికి మాలిని గారు పైడమ్మ ఆనంద నిలయము ఆవరణ లో  పాశ్చాత్య నాట్యము  చేయుచుండిరి.  నందిని తన కళ్ళనుతానే నమ్మలేక కళ్ళను నులిమి చూడగా నాట్యము వేగము పెరిగినది. మాలినిగారు ఊపులో జయమాలినిని మించి నారు.   వారి నాట్యము ముగిసి న పిదప పైడమ్మ దామిని తో కూడి నృత్యము చేయుచుండిరి. 

పిదప పైడమ్మ గారు చలవ కళ్లజోడు ధరించి విదిషను కూడి హంస నడకలు నడుచుచుండగా నందిని లేచి మాలినిగారి పట్టు చీర ధరించి తల్లి వద్దకు పోయెను.  విదిష ప్రక్కకు తప్పుకొనెను. నందిని తల్లితో కొంతసేపు అట్లాటలాడెను.  అట్లు వియ్యాలవారి ఆటలు పూర్తి అయిన పిదప పైడమ్మ "ఇక సెలవు పెళ్ళిలో కలుసు కొందుము అని "నందిని కారులో వెడలెను. తుఫాను వెలసెను.  మాలిని గారు విదిషను కౌగిట చేర్చుకొనిరి. 

Thursday, January 14, 2021

Bharatavarsha 113

 రాఘవుడు, ప్రఫుల్ల, సందీపుడు వర్షునితో మాటలాడుచు మండువాలో కూర్చొని యున్నారు యమున వచ్చి మీనాక్షి సందీపుని పిలుచుచున్నదని తెలపగా సందీపుడు మండువాగదిలో నున్న మెట్లెక్కి మేడపైకి పోయెను. రాఘవుడు   ప్రఫుల్ల కూడా సెలవు తీసుకొని బైటకు వెడలుచుండగా వర్షుడు మేడపైకి పోయెను. మీనాక్షి సందీపునీతో ”నీకు పెండ్లి కుదిరినదని వినియుంటిని” “అవునమ్మా వచ్చే వారమే  పెండ్లి మీరు తప్పక రావ లెను”  అనుచున్న సందీపునకు హేమ భూషణములున్న పేటికను ఇచ్చి “ఈ మంజూషమును చిరుకానుకగా పెండ్లి కూతురికివ్వవలెను” అనెను.  సందీపుడు స్వీకరించకుండుటచే, మీనాక్షి "ఈ కానుక పెండ్లి కుమారునకు,ఈ కానుకను స్వీకరింపుము" అనుచూ అతడికి చెక్కును బహూకరించెను.  " జగన్మాతవంటి  మీ ఆశీర్వచనం మొక్కటి చాలదా! ఇంత కీర్తి ప్రతిష్టలున్న స్వరరాణి  నావంటి  వాడిని ఇంటికి పిలుచుటయే గొప్ప. మాపెండ్లి కి వచ్చి మమ్మాశీర్వదించిన అదియే పదివేల”నుచూ చెక్కును తిరిగి ఇచ్చి  ఆమె కాళ్లకు నమస్కరించెను. అది చూచి మీనాక్షి హృదయము ఎంతో ఉప్పొంగె ను. ఆమె కళ్ళు చెమర్చెను భారతవర్ష తలుపువద్దనుండి అంతయూ చూచుచూ వారిని సమీపించెను. 

కాళ్ళ వద్దనున్న సందీపుని పొదివి పట్టి లేవనెత్తి "బాహ్య ప్రపంచము అట్లు పిలుచుచున్ననూ  నేను నీకు స్వరరాణిని కాదు నేను నీకు అత్తయ్యను,  వర్షుడు , మంజూష నాకు బిడ్డలు , మా అమ్మాయిని చేసుకొనుచున్న నీవు ఈ ఇంటికి  అల్లుడివి. నాబిడ్డ మంజూష అదృష్టవంతురాలు వర్షుడు "అని చెప్పుచూ వర్షునితో "నీవు మంచి  నిర్ణయము తీసుకొంటివి " అని అభినందించెను. భారతవర్ష నేత్రము లార్ద్రము లగుచుండగా సందీపుని సమీపించి"  ఆమె  అగస్త్య తల్లి అని మెల్లగా చెప్పెను. సందీపుడు నెత్తిన పిడుగుపడ్డట్టు క్రుంగి భాదతో విలవిలలాడుచూ "రాఘవుడు ఎంత వల్లని పని చేయుచున్నాడు, తల్లి వంటి ఆమెను ప్రేమించుటయా!" ఆ నీచుని కటకటాల వెనుకకు నెట్టించవలెను. అని సందీపుడు అనుచుండగా. “అతడు జైల్లో  కూర్చొని ఏడ్చుచున్న మనకేమి వచ్చును  నాయనా”  అని మీనాక్షి అనెను.  

ఇంతలో గృహ ప్రాంగణము నందు కేకలు పెనుగులాట వినిపించినవి, మొదటి అంతస్తు కిటికీ నుండి మీనాక్షి యమున వర్ష సందీపులు క్రిందకు చూచిరి. రాఘవుడు, ప్రఫుల్ల బాహాబాహీకి దిగినారు. రక్షణ గృహ సిబ్బంది పరుగు పరుగున పోయి  వారిని వెనుకకు లాగుచున్నారు. ఆ జట్టు నాయకుడు పరుగు పరుగున వచ్చి ద్వారము వద్ద నిలిచి "మేడం, వారు మా చేయిదాటిపోవుచున్నారు మీరు అనుమతించిన పోలీసులను రప్పించెదము, మీరే ఫోను చేసిన మరీ మంచిది పోలీసులు వెంటనే వచ్చెదరు." అనెను. భారతవర్ష, యమున, సందీపులు అవాక్కయ్యి చూచుచుండిరి.  మీనాక్షి ముందుగా తేరుకొని " పోలీసులు వలదు నేనే వచ్చుచున్నాను” అని రక్షణాధికారిని పంపివేసి క్రిందకు వెళ్లి వారిరువురినీ ప్రేమగా తోడ్కొని వచ్చెను. “మనమందరమూ కలిసి భోజనము చేయవలెను” అని పనివారితో అందరికీ వడ్డించమనెను. సందీపుని భోజనమునకు ఉండమని పట్టు బట్టిననూ ఉండక "అత్తా, నాకొరకు పని చూచుచుండును, సమస్యలు నన్ను పిలుచుచున్నవి, భాగస్తులు అచ్చోసిన ఆంబోతులవలె తిరుగుటవలన (రాఘవుని వైపు చూచుచూ), పని భారమంతయూ నాపై పడెను. ఇప్పుడు నేను ఒక్కడినే అన్ని పనులు చూసుకొనవలెను.  పెండ్లి అయిన పిదప మీ అమ్మాయిని తీసుకొని తప్పక వత్తును. అని సందీపుడు నిష్క్రమించెను.

భోజనములు వడ్డించుచుండగా ప్రఫుల్ల 'నేను పోయివత్తును.ఎల్లుండి కేరళ పోవుచున్నాను, వచ్చిన నూ రాకున్ననూ, మాట నిలుపుకొన్ననూ నిలుపుకోకున్ననూ నీ ఇష్టము" అని ప్రఫుల్ల వెడలెను. ప్రఫుల్ల వెడలుచుండగా రాఘవ "నీవు పోయి పుణ్యము కట్టుకొనుము, నేను మీనాక్షితో చాలా విషయములు మాట్లాడవలసి యున్నది." అనెను. కోపముగా చూసి  ప్రఫుల్ల వెడలిపోయెను. 

రేగిన జుత్తు, నలిగినా దుస్తులు మొఖం పై దెబ్బలు చూచిన మీనాక్షి నీవెందుకు అతడితో గొడవ పడుచున్నావు అని అడిగెను.  అతడే నాతొ గొడవ పడుచున్నాడు, నన్నిచ్చటికి రావలదని నిరోధించుటకు అతడెవడు? నా భాగస్వామ్యమును ఒదులు కొంటిని , భవిష్యతు యందు డబ్బు యందు ,  ఆశ వదులు కొని ( నీవే కావలెనని వచ్చితిని) అని చెప్ప బోవుచుండగా  భారతవర్ష చొరకొని “పుట్టిన రోజు నాడు నీవు ఇట్లు చేయుట మమ్మందరినీ కలిచివేయుచున్నది.” అని రాఘవుని మందలించెను.  రాఘవుడు క్షమించమని మీనాక్షిని కోరి ఒక చెక్కును భోజనములు బల్ల పై నుంచి మారు మాట్లాడక వెడలిపోయెను. “నేనిచ్చిన డబ్బుని తిప్పి ఇచ్చినాడు అని మీనాక్షి అనగా   “ఒక తుఫాను ముగిసినది.” అని యమున నిట్టూర్చెను.  

వర్షుడు మాట మార్చవలెనని “తుఫాను అనిన నాకు లూయీ విల్ నుండి వెనుకకు వచ్చుచున్న విమాన ప్రమాద సంఘటన గుర్తు వచ్చుచున్నది.” అనెను.  మీనాక్షి " నీవెక్కిన విమానమునకు ప్రమాదమా?!" అనుచుండగా, “ ఎక్కువగా విదేశములు పోవలదన్నయ్యా !" అని యమున అనెను. 

ఇంతలో యమున తల్లిదండ్రులు కళ్యాణి, వనమాలి వచ్చి మీనాక్షికి పుట్టిన రోజు దీవెనలందజేసిరి. యమున వారితో " ప్రొద్దున్న రమ్మంటే ఇప్పుడు వచ్చినారు" అని నిష్టూరమాడుచుండగా మీనాక్షి " తప్పమ్మా పెద్దవారితో అట్లనరాదు ఎప్పుడో ఒకప్పుడు వచ్చినారు కదా?" భారతవర్ష "తల్లి తండ్రులు కనిపించిన ఎవరైననూ చిన్న పిల్ల లయిపోదురు. అయిననూ అంతా మన మంచికే మీరు చాలా మంచి సమయమునకు వచ్చినారు.” అనగా యమున "మంచి సమయమనగా ?"  తుఫాను వెలసిన పిదప వచ్చుట మంచిదే కదా అని వర్షుడనగా యమున సంతోషించెను కానీ విమానంలో తుఫాను గూర్చి చెప్పమనెను. వారికి కూడా భోజనములు వడ్డించగా అందరూ కలిసి తినసాగిరి. వనమాలి చేతి సంచి యందు ఎదో వెతుకుచుండిరి. “ప్రమాదం ఎట్లు జరిగెను? అని మీనాక్షి అడిగెను. అప్పుడు వర్షుడు " ప్రమాదం తృటిలో తప్పెను.  విమానము అట్లాంటిక్ సముద్రము పై ఎగురుచున్నప్పుడు రాత్రి మెరుపులుతో కూడిన వాన పడుచుండెను, పెనుగాలులకు విమానము నడిసంద్రములో నావవలె ఊగిసలాడెను, ప్రయాణీకులందరూ ప్రాణములరచేతిలో పెట్టుకొని కూర్చొనిరి. మీనాక్షి , యమున రాఘవుని గొడవ మరచి రెప్పవేయక వినుచుండిరి. ఆపై ఏమిజరిగెను అని అడుగగా భోజనములు చేసిన పిదప చెప్పెదను అని వర్షుడు అనెను. భోజనములు చేసిన పిదప వెండి గిన్నెలలో పాశయము వచ్చెను. 

వర్షుడు “పాయసము తిన్న పిదప మనము హోటల్ రాయల్ ఆర్కిడ్ కు పోవలెను.   అక్కడ ఒక గంట నవలపై సంతకము జేయు కార్యక్రమము కలదు ఆపై మనము స్వేచ్ఛపక్షులవలె విహరించెదము. నేడొక్కదినము నీవు స్టూడియో ఊసెత్తరాదు. రేపు నీ ఇష్టము అందుకు అంగీకరించినచొ విమాన ప్రమాదం ఎట్లు తప్పించితినో మీకు చెప్పెదను. అని భారతవర్ష అనగా మీనాక్షి నవ్వి సరే అనెను.

మరల వనమాలీ ఎదో వెతుకుచుండిరి. మీనాక్షి మీరు దేనికొరకు వెదుకుచున్నారు? అని అడుగగా కళ్యాణి " ఈయనకి మతిమరపు ఎక్కువ,  బహుమతి మరచి వచ్చినారు. అని విచారించుచుండగా, మీనాక్షి "మీ అమ్మాయి నాకు పెద్ద బహుమతి, ప్రేమ కంటే పెద్ద బహుమతి ఏముండును ఇచ్చుట మీ అమ్మాయి ఎంత ప్రేమించుచున్నదో ఎంత సేవించుచున్నదో. యని పొంగిపోవుచుండగా, కళ్యాణి “అంతా ప్రేమనుకొనుచున్నారు. అందు స్వార్ధము కూడా ఉన్నది”  “స్వార్ధమా!!” యని మీనాక్షి అచ్చెరువందెను. వనమాలి  “స్వార్ధమేనమ్మా ఎందుకు చేయుచున్నదో ఎప్పుడైననూ విచారించితిరా?" “లేదు ఇప్పుడు విచారించెదను , ఎందుకమ్మా నాకు ఇంత  సేవ చేయుచున్నావు ?" అని మీనాక్షి యమునను అడిగెను.

లక్ష్మి కాంత్  ప్యారేలాల్ ,రాజ్ కోటి , కళ్యాన్జీ ఆనంద్జి , రాజన్ నాగేంద్ర , శంకర్ జైకిషన్, బప్పిలహిరి " ఇట్లు సాధారణంగా సంగీత దర్శకులు జంటకవులవలె ఇద్దరిద్దరు ఉందురు . అట్లే నేను కూడా నీతో కూడి సంగీత దర్శకురాలిన య్యెదను. అని యమున గడగడా సంగీత ద్వయముల పేర్లు చెప్పెను.  మీనాక్షి కిలకిలా నవ్వుచుండగా యమున ఆమె వైపు అయోమయంగా చూచుచుండెను. చివరకు బప్పి లాహిరి ఒకేవ్యక్తి అని తెలుసుకొని యమున కూడా నవ్వెను. 

విమాన ప్రమాదము నీవు ఎట్లు తప్పిచితివి అని యమున కుతూహలంగా అడుగగా ఎచ్చటికి పోయిననూ ఆవు గడ్డివలె విమాన ప్రమాదము వదలకున్నది అని వాహనంలో చెప్పెదను అని యముని ఊరించెను. 

యమున తలిదండ్రులు వెడలిన పిదప ఇన్నోవా వాహనము బయలుదేరినది. డ్రైవర్ నడుపుచుండగా ముగ్గురూ వెనుక కూర్చొనిరి. ఇక నైనా చెప్పెదవా ? ఇంకనూ ఊరింతువా ? అని యమున నిష్టూరములాడుచుండగా మీనాక్షి నవ్వాగకుండెను. ఎట్టకేలకు వర్షుడు నోరువిప్పెను " చెల్లెమ్మా , అని నుదుటిపై చేయి వేసి చూసి “చాలా వేడిగా నున్నదే!”  “అయిననూ మాట ఇచ్చిన పిదప నిలుపు కొనక తప్పదు కదా!  నేను విమానములో కూర్చొని నవల చదువు కొనుచున్నాను. ఆ నవల మూసి వేయుటతో ఆ తుఫాను పోయినది. అని జెప్పెను. "నిజమా ?" "ఆ తుఫాను, పెను గాలి, ప్రయాణీకులు భీతిల్లుట ఆ నవల యందొక సన్నివేశము. అందుచే ఆ నవలను మూసివేసినాను. మూసివేసి  ప్రశాంతముగా నిద్రించినాను. యమునకు పట్టరాని కోపము వచ్చి అన్నయ్యను పిడిగుద్దులు గుద్ద సాగెను. వాహనమంతయూ నవ్వుల దీపావళి.

                                                                      ***

వాహనము హోటల్ రాయల్ ఆర్కిడ్ చేరుకొనెను. రచయిత సంతకము చేయు కార్యక్రమమునకు మంచి స్పందన లభించెను. జూలియా రాబర్ట్స్ అని ఒక హిందుత్వమును శ్వీకరించిన అమెరికా నటీమణి ఆ పుస్తకమునకు ప్రొఫెసర్ రాజు వ్రాసిన ముందుమాట చదివి  అది వాస్తవ సంఘటనలాధారముగా వ్రాయబడినది  అని తెలుసుకొని, ఆపుస్తకము నందలి పునర్జన్మల గూర్చి అనేక విషయములడిగి తెలుసుకొనెను.  సవ్య సాచి ముఖర్జీ అను ఫేషన్ డిజైనర్. ఐ ఐ స్ సి సైటిస్ట్లు మరికొందరు సాంకేతిక , రాజకీయ ప్రముఖుల వారసులు కూడా ఆ కార్యక్రమమునకు వచ్చిరి. మీనాక్షి ప్రక్కనుండుటచే అనేక ప్రముఖులు ఆమెతో మాటలాడుటకు ఉవ్విళ్ళూరుచుండుటచే నిర్వాహకులు ఆమెను యము ననూ హోటల్ నందు గల వనము, ఈతకొలను, బిలియర్డ్స్ గది వంటివి  చూపుచూ కాలయాపన చేయుటకు తంటాలు పడుచుండిరి.
 కార్యక్రమము ముగిసిన పిదప వారు ప్రకృతి అందాలకు ఆలవాలమై నంది కొండలకు పో వలెనని వర్షుడు సూచిం
చెను. ఇన్నోవా అరువది కిలోమీటర్ల దూరములోనున్న నంది కొండలకు సాగుచుండెను. మల్లేశ్వరం రహదారి లో హెబ్బల్,  యెలహంక దాటి , నంజనగూడు  రాఘవేంద్ర స్వామి  ఆలయమును దాటుచున్నది. అచ్చటికి సమీపములో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము  ఉండుటచే ఆకాశమున  విమానములెగురుచూ కనువిందు చుండెను. ఎత్తైన నీలగిరితైల వృక్షములు రహదారికిరువైపులా స్వాగత తోరణములవలె నిటారుగా నిలిచి స్వాగత గీతము నాలపించుచున్నవి. వర్షుడు వాహనము అద్దాలనుదించగా పిల్లగాలులు నీలగిరి సువాసనలతో సన్నాయి ఊదుచూ మదిని పులకరింపజేయుచున్నవి. యమునకు హోటల్ నందు నిర్వాహకుల అవస్థలు గుర్తువచ్చి నవ్వసాగెను. పిమ్మట ముగ్గురూ కొండ పైకెక్కు వరకూ ఆవిషయమును తలుచుకొని నవ్వుచునే యుండిరి. అమ్మ నీ పుట్టిన రోజు ఇట్లు నవ్వులతో గడవవలెను. అని తల్లిని చెల్లిని గుండెలకు హత్తుకొనెను. సమయ మంతయూ నవ్వులలో కరిగిపోయెను వాహనము నంది కొండలనధిరోహించెను 1478 మీటర్లు ఎత్తుకు చేరి వాహనమును నిలిచెను.

కారు దిగి పచ్చిక పై నడుచుచుండగా శీతాలవాయువులు వారిని తాకుచుండెను. మబ్బులలో దాగి నీలి కొండలు దోబూచు లాడుచుండెను, ప్రకృతి రమణీయత శృంగార భావాలను తట్టి లేపుచుండగా వారు మెల్లగా నడుచుచూ ఒక ఎత్తైన ప్రదేశమును చేరినారు. 



అచ్చట వారు మబ్బులపై తేలాడుచున్న అంబరమణిని చూచిరి. “మనము మబ్బులపై నిలబడి సూర్యుని చూచుచున్న బ్రాంతి కలుగు చున్నది.” అనుచూ మీనాక్షి కేరింతలు కొట్టసాగెను. నీవు నవ్వుచున్నచో పద్మములు వికసించుచున్నట్లు, పారిజాతములు రాలుచున్నట్లు ఉన్నది అనుచూ అచ్చటనే ఉన్న కుర్చీలలో కూర్చొనిరి. కాళ్లక్రింద మబ్బులు ప్రాకుచున్నవి అని అనుచున్న మీనాక్షిని చూచిన యమున “తప్పంతా రాఘవుడిదే కాదన్నయ్యా” అనెను. "అయినచో నాదా? నేను ఇకపై ఈ నగలు ఈ అలంకారములు  ధరించను. ఈ ఖంఠా భరణము ఏల అలంకరించితివి? ” అని  కినుక వహించెను. 
 
“తప్పు నీదు కాదమ్మా ఆ బ్రహ్మ దేముడిది. నీకు అందము సంగీతము రెండు రెండు వరములు. ప్రకృతిని  చూచి నీవు ఎట్లు పరవసించితివి? అట్లే నీ అందమును చూచి ప్రపంచము పరవసించును. అందు కొండొకచో రాఘవుని వంటి దుర్బలుడు మతి చెడి  ఆత్మ నిగ్రహము కోల్పోయినచో నీ వెందుకు అలంకరణలు తీసివేయవలెను? కామ సూత్రలో వాత్సాయనుడు ముష్టివారు చుటూ ఉన్నారని వంట చేసుకొనుట మానరాదనెను.” అని వర్షుడు ముగించెను.

“కామశాస్త్ర మాట వర్షుని నోట విన్న యమున ఆశ్చర్యముతో “కామశాస్త్ర స్త్రీలు  చదువవచ్చా?” అని అడిగెను. “కామశాస్త్ర హిందూ పురుషార్ధ శాస్త్రములను వివరించిన శాస్త్రము. కామసూత్ర చదివినచో మనుధర్మములో గల లోపములను తెలుసుకొన గలము.

"మనుధర్మములో లోపములను మనమెందుకు తెలుసుకొనవలెను?"
ఎందువలననగా మన సమాజము ఇంకనూ ఆ ప్రభావముననే యున్నది స్త్రీలు అది అనుసరించుచున్నారు. వేయేల అమ్మ కలత చెందుటకు కారణము కూడా అదియే. చూచుట, వినికిడి,  స్పర్శ , రుచి మరియు వాసన, అను ఐదు  ఇంద్రియముల   మనస్సు ఆత్మతో కలిసి పొందు స్పృహను కామమందురు. మీనాక్షి ఓర్చుకొన జాలక కుర్చీనుండి లేచి దగ్గరలో పచ్చికపై నడయాడసాగెను.

సంతానము కొరకు మాత్రమే స్త్రీపురుషులు కలవవలెనన్న మనువు పరపురుషులను కోరిన స్త్రీని ముక్కు చెవులు కోయవలెనని హిసించవలెనని చెప్పెను.  పురుషుని తో సుఖములేని స్త్రీ అతడిని విడిచిపెట్టునని చెప్పి వాత్సాయ నుడు మనువు కంటే కొన్ని కాంతి సంవత్సరముల ముందుండెను. వాత్సాయనుడు స్త్రీపురుషులు సంతానము కొరకు మాత్రమే కలిసినచో జంతువులకు మనుషులకు భేదముండదని, కామము జీవిత సాఫల్యతా లక్ష్యము అని చెప్పెను. కామసూత్ర స్త్రీ స్వేచ్ఛను ప్రోత్సహించిన గ్రంధము. యమునా పోయి మీనాక్షిని కొనివచ్చి కుర్చీ యందు కూర్చోండ  బెట్టి " అన్నయ్య రెండు శాస్త్రముల మధ్య అంతరమును చెప్పినాడు , ఏమీ తెలుసుకొనక ఎందుకట్లు తిరుగుచున్నావు అని ముద్దుగా  మందలించెను అయిననూ మీనాక్షి కినుక వీడ కుండెను. మీనాక్షి ప్రకృతిని చూచి పరవసించుచుండగా    వర్షుడు ఆమెను తన గానమందు సేదతీర్చేను. 

సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ, రాగాల కూనలమ్మ
గారాలు సేయరమ్మ రాగాలు పూయు నమ్మ   2
సృష్టించెను బ్రహ్మ ఇది పట్టుతేనే కొమ్మ అందాల కోయిలమ్మ
అమ్మమ్మ చూడరమ్మ అజంత శిల్పమమ్మ ఇది జాతి సంపదమ్మ 
యాగాలు చేయ జేజెమ్మ జెజ్జరిల్లి జేజి తిమ్మనిచ్చెనమ్మ ఈ కొమ్మ 
ఆ సోమిదమ్మ కొమ్మ, కమ్మ నైన రాగాలకు పెమ్మి ఈ అమ్మ                     
చిమ్మ చిమ్మ ప్రోది చేసి ఇమ్ముగ తరతరాల కిమ్మ 
  
వర్షుడు పాడుట పూర్తి చేయగానే మీనాక్షికి సిగ్గు, ఆశ్చర్యము దుగుణము లయినవి . ప్రక్రుతి రమణీయత చూచుచూ ఆ పాట విన్న మీనాక్షిమనసు గువ్వ వలే రివ్వని స్వేచ్చా కాశములోకి ఎగిరి పోయినది. పిదప వారు గంగవంశపు రాజు కట్టిన నందిదుర్గమును భోగనందీశ్వరాలయమును చూచి ఇందిరానగరుకు ప్రయాణమయ్యిరి. తిరుగు ప్రయాణ మంతయూ మీనాక్షిని ఘాడనిర్ద్ర ఆవహించెను. భాద వీడిన మీనాక్షి మనసు  తేట పడి  అది ఆమె  ముఖములో స్పష్టంగా  కనిపించుచుండెను. పిల్లలిద్దరూ తల్లి ముఖమును ముద్దాడిరి.

                                                                    ***
మరుసటిరోజు మీనాక్షి జన్మ దిన వేడుకలు అన్ని ప్రముఖ వార్తాపత్రికలలోను వెలువడినవి. కాఫీ తాగుచూ ముగ్గురూ తమ పుట్టినరోజు చిత్రములను వార్తాపత్రికలలో చూచుకొనుచుండిరి. దివాను పై మీనాక్షి పట్టుచీరలో కూర్చొన్న చిత్ర ము మహారాణి వలే అగు పించుచుండగా అనేక సంఘటనల దృశ్య మాలిక ఆమె మదిలో మెదిలెను. 
వర్షుడు: మంజూష వివాహము సమీపించుచున్నది  24 వ తారీకున రాత్రి అనగా ఇంకనూ వారము రోజులైనా లేదు , ఈ రోజు సాయంత్రము తో ఇచ్చట నవల సంతకముల కార్యక్రమము ముగిసైనా పిదప నీకు కనిపించి బయలుదేరెదను. నీతో ముఖ్యమైన విషయమొకటి చెప్పవలెను , అని  "యమునా , నీవు నేటి సాయంత్రము నాతో  వచ్చెదవా ?" 
యమున: ఆమ్మో అమ్మను విడిచి నేను రాను. అర్ధ రాత్రి వరకూ  దూరవాణి అట్లే మ్రోగుచుండెను.  అమ్మకు నేను కుడిభుజముగా నుండవలెను . అనేక రికార్డింగ్ కార్యక్రమములు కలవు.   
వర్షుడు : అమ్మ దగ్గర ఉన్నచో ఒత్తి సంగీతమే నమ్మా! అచ్చట నీఈడు పిల్లలే అంతా , సంగీతముతో పాటు నాట్యము కూడా చేయుచున్నారు. 
మీనాక్షి: మీ ఇద్దరు వెడలినచో ఈ ఇల్లు చిన్న బోవును. నేనొక్కతి నీ ఉండలేను బాబూ అనుచుండగా వర్షుడి చరవాణి మ్రోగెను. మాలిని గారు ఆందోళన పూరిత స్వరముతో  "బాబూ ఇచ్చట ఆడపిల్లల కిష్కిందకాండ నేను  తట్టుకొన జాలను. నీవు వెంటనే వచ్చి వీరిని చక్కదిద్ద వలెను.  ఇల్లు పీకి పందిరి వేయు చున్నారు."  ఈ పెండ్లి అయ్యిన పిదప నేను ఎదో ఒక  ఆశ్రమము చూచు కొందును.  అని వాపోవుచుండగా నేను నేడే వచ్చుచున్నాను , నేను రాక ముందే నీ సమస్య తీరిపోవును , కంగారు పడవలదు అని చెప్పి ముగించి చూడమ్మా నీవు నలుగురు ఉన్నచో బాగుండునను కొనుచు న్నావు అచ్చట మా అమ్మ ఒంటరిగా ఉన్నచో ప్రశాంతముగా నుండునని వాపోవుచున్నది. 

మీనాక్షి గారు నవ్వుచూ "పెళ్లి ఇంట సందడి ఉండవలెను కదా! తొమ్మిది గంటలగుచున్నది.” అనుచూ యమునతో కలసి స్టూడియోకి బయలు దేరిరి. 

Tuesday, January 12, 2021

Bharatavarsha 111

లోకచక్షువు తన యవ్వన ధవళ మయూఖములతో లోకకల్యాణ ప్రదాయమగు ప్రయాణమునకు శ్రీకారం చుట్టుచుండెను. శ్వేత గృహ ప్రాంగణ పచ్చిక మధ్యన తెల్లని తుషారార్ద్రత తో  నిండిన పాలరాతి బల్ల పై  ఆ సూర్యకాంతి పడి  మెరియుచుడెను.  యమున నిద్రలేచి కాఫీ చేసి మేడపైకి వర్షుని గదిలోకి పోయి చూడగా వర్షుడు అచట లేకుండెను. లంగా పరికిణీ లో గజ్జలు మెల్లన మ్రోగుచుండ మెల్లగా మెట్లు దిగి మండువా గది లోకి వచ్చి విశాలమైన మండువా గది అంతయూ కలియజూసెను. పిదప కిటికీ నుండి బైటకు చూడగా గృహ ప్రాంగణమందు  విశాల పచ్చిక మధ్య  ధవళ వస్త్ర ధారియైన వర్షుడు కనిపించెను. ఒకప్పుడు దూరదర్శన మందు, పత్రికలయందు కనిపించెడి రచయిత , నేడు ఇంటికే  వచ్చి  ఉండుటాయా! నమ్మలేకున్నాను నిన్న చెల్లెమ్మా అన్న అతడి పిలుపు ఇంకనూ చెవులలో తిరుగుచున్నది. 

తెల్లని పంచె గట్టి పొడుగాటి పై లాల్చీ ధరించి వర్షడచట కూర్చొని ఆవరణయందున్న పనస, మామిడి వృక్షాలను, లతిక , లతాంతికలను ప్రాతఃకాల సౌందర్యమును చూచుచుండెను.   ప్రకృతి సౌందర్యమును మంత్రం ముగ్దుడై  చూచుచున్న వర్షుని చెంతకు యమున  మెల్లగా పిల్లివలె అడుగులో అడుగు వేసి వచ్చి, కాఫీ కోప ను పచ్చిక లో నుంచి వెనుకనుండి వర్షుని కళ్ళు మూసి “ఎవరో చెప్పుకొనుము” అనెను. వర్షుడు "తాటకి…పూతకి" అని పేర్లు చెప్పుచుండగా యమున చేతులు తీసి దూరముగా పోయి మొగము త్రిప్పుకొని  నిలిచెను.  వర్షుడు నవ్వుచూ “అమ్ము ఇటురమ్మంచు యముని బిలచి ప్రాతఃకాల సౌందర్యము నాస్వాదించమని పాలరాతి బల్లపై కూచోండ బెట్టి  “ప్రకృ తెంత  రమణీయముగానున్నదో కదా

శా.  ప్రాతఃకా   లమునం  దుకోకి     లములా      ప్రాకార      వృక్షాల   లో

       వైతాళీ    కులవో     లెపల్క     మనసే        భాసిల్లు     గీతమ్ము లన్

       చూతాస్త్రుం డదిగో    కుఠార     పుకొమ్మ      చాటుంగ     దా గాస్త్ర ముల్      

       జాతుర్యం  బుగకూ  ర్చుచుండ  మది యే    స్తంబించె   మోదమ్ము నన్.

ప్రాతఃకాలము నందు  కోకిలములు ప్రాకార వృక్షాల లో ( ఇంటి ఆవరణ యందు గల చెట్లపై) కుహు కుహు అని,  వైతాళీకుల (మహారాజును నిద్రలేపు పాటగాళ్లు)  వోలి  పల్క  మనసే భాసిల్లు గీతమ్ములన్, చూతాస్త్రుండు ( మామిడి పూతను అస్త్రంగా కలవాడు ,మన్మధుడు)  అదిగో  కుఠారపు  కొమ్మ  చాటుంగ  దాగి అస్త్రముల్, చాతుర్యంబుగ        కూర్చుచుండ మదియే స్తంబించె మోదమ్మునన్. 

ఈ ప్రాతఃకాల చిత్రమెంత సమ్మోహనముగానున్నదో! అనుచుండగా ఇదిగో మంచి శార్ధూల పద్యమునకు మంచి కాఫీ అని యమున కోప నందించెను.  వర్షుడు కాఫీ త్రాగుచూ “ఇది శార్ధూల పద్యమని నీకెవరు జెప్పినారు? “నీవు శార్ధూలములను వెంటపెట్టుకొని తిరుగుచుందు వని వినికిడి.”  ఆహా  చెల్లమ్మకు చలాకి తనము పెరిగినదే! అన్నయ్యను చూచిన చెల్లమ్మకు చలాతనము సహజమే కదా! 

“అమ్మ లేచినదా!” “అసలు ఆమె ఎప్పుడు పడుకొనునో ఎప్పుడు లేచునో ఆమెకే తెలియదు , రాత్రంతయూ మేలుకొని తెలవారుతుండగా కొలది సేపు పడుకొనును.” వారిరువురూ పచ్చికలో కూర్చొని కాఫీ సేవించు చుండగా పికము పాడుచుండెను. 

వర్షుడు కాఫీ ముగించిన  పిదప యమున వర్షలు లోనికి వెడలుచుండిరి. “అన్నయ్యా నీవు అమ్మపై కేకలు వేయవలెను.” వర్షుడు " అట్లే, ముందు నేను సమయమునకు పడుకొన్నచో పిదప ఇతరులకు చెప్పవచ్చు"ననెను.  దానితో  ఇరువురూ నవ్వుకొనిరి.  యమున "అన్నయ్య నీవిచ్చటనే యున్నచో మనము ప్రతిదినము ఇట్లే నవ్వుకొనవచ్చును."   “అటులనే నమ్మా నేను వచ్చినది మీకొరకే కదా " అని వర్షుడు అనుచుండగా వారిరువురూ మీనాక్షి శయన మందిరము లోనికి అడుగిడిరి. అప్పుడే రక్షణ గృహ సిబ్బంది తెచ్చి ఇచ్చిన ఆంగ్ల వార్తా పత్రిక మీనాక్షి శయ్య పై పడియున్నది. 

 వార్తా పత్రిక లో ప్రధమముగా ప్రచురింపబడిన వార్త “రియాల్టీ లెవెల్ టూ - రేయింకార్నేషన్ అఫ్ సూపర్ వుమన్- బుక్ సైనింగ్ ఈవెంట్, ఫిబ్రవరి 17 18, హోటల్ రాయల్ ఆర్కిడ్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, బెంగళూరు. 

“ రియాల్టీ లెవెల్ టూ - రీయింకార్నేషన్ అఫ్ సూపర్ వుమన్ అను ఉప శీర్షిక తో ఆంగ్ల నవల విడుదల కానున్నది. అన్నయ్యా ఇదా సంగతి!” అనుచుండగా “అదియే కాదు ఇంకనూ యున్నది అని యమునా చెవిలో మెల్లగా ఎదో చెప్పగా యమున నేత్రములు విప్పారినవి. మీనాక్షి కిలకిలా నవ్వుచుండెను. “వర్షుడు ఎప్పుడూ పుస్తకములచుట్టూ తిరుగుచుండును ఇది తెలియక పాపము నీవు తికమక పడుచున్నావు!” అని మీనాక్షి అనుచుండగా యమున “నేడు అతిముఖ్యమైన పనిపై అతిధులు వచ్చుచున్నారు నీవు త్వరగా జాగు సేయక జలకములాడి  క్రింద మండువా గదిలోకి  రావలెన.”ని చెప్పి అన్నతో  కూడి నిష్క్రమించె ను

                                                                        ***
 పదిమందిని పిలవనిదే ఇంత పెద్దామె పుట్టినరోజు జరుపుట ఎట్లు. 
ఇప్పుడే అతిథులను ఆహ్వానింతును. “ఇంత తక్కువ సమయములోనా?
అది ఎట్లు సాధ్యమగును!” “నీవట్లే చూచుచుండుము అని దూరవాణి చేగొని 
" నవీన్ నేను యమునను  మాట్లాడుచున్నాను”

                                                                       ***
యాబది జన సందోహమువిశాల మండువా గదియందు వేచియున్నారు. వారందరూ పాత్రికేయులు, ఛాయా చిత్ర గ్రాహకులు,  చిత్ర పరిశ్రమ , రికార్డింగ్,  ఆర్కెస్ట్రా ప్రముఖులు, కానీ నేటి మీనాక్షి పుట్టినరోజు పండగ  అతిధులు. “వారందరినీ  చిటికలో ఎట్లు పొందుపరిచినావు? అనుచూ వర్షుడు  అచ్చెరువున చూచుచుండ,  యమున  " నవీను మంచివాడు " అని నవ్వుచూ పలికెను. 
ముదురు ఆకుపచ్చ చీరయందు మీనాక్షి ఆకులమధ్య మల్లె పూవు వలె , కడిగిన ముత్యమువలె కనిపించుచుండెను. మెట్లు దిగుచున్న ఆమె మబ్బుపొరలపై నడుచుచున్న జాబిల్లి వలే ఉండెను. ఆమె మెట్లు దిగుచుండగా ఆహుతులకు వెండి వెన్నెల దిగుచున్నట్లగుపించుచుండెను. అట్లు మండువా గదిలోకి దిగిన ఆ వెండి వెన్నెలయందు వారందరూ చుక్కలవలె వెలవెల  పోవుచుండిరి.  అనూహ్యముగా వచ్చిన జనసందోహమును చూసి మీనాక్షికి విషయము విదితమయ్యెను. పెక్కురు సోఫాలలో కూర్చొనగా కొందరు నిలచే యుండిరి. మీనాక్షి  రాచఠీవి నొలికించు టేకు దివాను పై కూర్చొని  చిటికలో ఈ ఏర్పాట్లు చేసిన పిల్లలను దగ్గరకి తీసుకొని ముద్దాడెను. మానస సరోవరమందు రాయంచ వలెనున్న మీనాక్షిని చూచుటకు రెండు కన్నులు చాలకుండెను. “వీణ కావలెను దొరుకునా?” అని యమునను వర్షుడు అడుగు చుండగా వంటవాడు , చాకలి , డ్రైవర్ మున్నగు  పనివారు  ప్రవేశించిరి. యమున "స్వరరాణి ఇంట సంగీతపరికరముల కేమి కొదవు, అని పనివారిని పిలచి వీణ తెమ్మని చెప్పెను. అందరూ హ్యాపీ బర్త్ డే పాటను మంద్రముగా గానము చేసి శుభాకాంక్షలు తెలియజేసిరి.  చెమ్కీలు దట్టించిన  బూరలను  పేల్చి గా చెమ్కీలు చింది ఆహుతుల శిరములను, గదిని నింపివేసెను.
   
అందరూ చప్పట్లు కొట్టుచుండగా  మండువా గది  అంతయూ  పెద్ద శబ్దములతో కోలాహలంతో నిండిపోయెను.   మీనాక్షి అందరికి నమస్కరించెను. కేక్ కత్తిరించుటకు మీనాక్షి ఇష్టము లేక పోవుటచే, హిందూ సంప్రదాయము ప్రకారము మిఠాయిలు పంచబడినవి. వంటవాడు అందరికీ కాఫీ పల హారములను అందజేసెను. పాత్రికేయులు మీనాక్షి ఛాయా చిత్రములను గ్రహించిరి. కొలదిమంది మీనాక్షి కి పుష్ప గుచ్ఛములను ఇచ్చినారు. వర్షుడు తన ప్రయాణ పేటిక నుండి రవ్వల కంఠాహారమును తీసి దివాన్ పై రాణి పద్మావతి వలె ఆసీనురాలయిన మీనాక్షి కంఠ మందలంకరించెను. పని వారు వీణ మండువా గదిలో అమర్చిరి. ఆహుతుల నందరినీ కూర్చుండమని చెప్పి భారతవర్ష వీణవద్ద కూర్చొనెను. ఇంతలో సందీపుడు,రాఘవ, ప్రఫుల్ల వచ్చి కూర్చొనగా భారతవర్ష వీణ మీటుచూ స్వరరాణి పుట్టినరోజు సందర్భముగా…


   
జగదానందకారకం నీ జననం, మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం
జగదానందకారకం నీ జననం సరస స్వర రాగ – యోగ సంయోగ జన రంజకం II
నీజీవన తత్వము జీవిత లక్ష్యము సృజనాత్మక సుమధుర సంగీతమూ
నీగానమె నీ గమనము, నీ గమనమె గరిమాగమ నిగమ ప్రయాణము II
నీ గానమున విఱియు నవరాగమూ, అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము
నీ గానమున విఱియు నవరాగమూ, గుణ గణ ధనము నీరాగమూ, నవనిధులుకు చూపునది మార్గము,  “మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకరకచ్ఛపౌ, ముకుందకుందనీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ" జగదానందకారకం నీ జననం మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం. 

అతిధులందరూ వెడలినారు. మీనాక్షి పైకి వెడలెను యమున ఆమెననుసరించెను    “అన్నయ్య నీ  జననమును ఎంత గొప్ప గానిర్వచించెను " " నా  లక్ష్యమును  చక్కగా చూపినా  బాధను బాపెను.""మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం." ఆ పాట ఆ భవంతి నందు ఇంకనూ ప్రతిధ్వనించుచుండెను. మీనాక్షి చెవులలో ఆలాపన వలే  తిరుగుచుండెను. 

Sunday, January 10, 2021

Bharatavarsha 110

ముంబాయి:  లకుమ నివాసం: 

కశ్యప్: చుమ్ ఛుమ్ తరువాత సరిగ్గా నాలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి తరువాత ఆగిపోయాయి. ఎందుకు ?  నీ ఒంటెత్తు పోకడలవల్లే. సినిమా స్టార్ సినిమా స్టార్ ఉండాలి. 

లకుమ: సినిమా స్టార్ లా లేనా? రోజూ జిమ్ కి  వెళ్లి  ఫిట్నెస్ మెయింటేన్ చేస్తున్నాను కదా?

షిట్! నేను అందం గురించి మాట్లాడడం లేదు ఏటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. నీ లైఫ్ స్టైల్ ఒక సినిమా తార లైఫ్ స్టైల్ కాదు. ఒంటి పిల్లి రాకాసి లాఎక్కడో ఉంటావు , పార్టీ కల్చర్ కి దూరంగా మడి కట్టుకుకూర్చుంటే ఎలా ? 




లకుమ:పార్ట్ కల్చర్ కి దూరంగా ఉన్నానా?! నిత్యం  పార్టీలలో ములిగి తేలుతున్నాము కదా!

కశ్యప్: కమాన్ బేబ్ , మునిగి తేలడం అంటే నా ఒక్కడితో  కాదు. జుహు బీచ్ లో ఇల్లు తీసుకో  తారలంతా అక్కడే ఉంటారు,  మింగిల్ విత్ పీపుల్ టేక్ ఆ షాట్ అండ్ … 

లకుమ: టేక్ ఆ షాట్ అంటే తాగడం హైద్రాబాద్ లో నీతో కూడిన ప్పటి  నుంచే మొదలెట్టాను

కశ్యప్: ఈ రోజు సాయింకాలం స్వింగర్ కపుల్ పార్టీ ఉంది మనం వెళుతున్నాం  “నేను రాను” 

కశ్యప్: అయితే మిడ్ నైట్ రేవ్ పార్టీ ఉంది దానికి పోదాం టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్  పరిచయమయ్యేది ఇలాటి చోటే. ఇలా తిరిగేవంటే వచ్చే వారంలోగా మరో నాలుగు సినిమాలు నీ చేతిలో ఉంటాయి . త్వరలో నిన్ను టాప్ స్టార్ని చేస్తాను. 

లకుమ: రేవ్ పార్టీ అంటారు బౌన్సుగర్ లాంటి డ్రగ్స్ తాగి చెలరేగిపోతారు , స్వాప్ పార్టీ అంటారు ఆడవాళ్లను మార్చు కుంటారు. అందుకే రేవ్ పార్టీలు, స్వాప్  పార్టీలు నాకు నచ్చవు అని తెగేసి చెప్పేను.   ఇంకొక్క సారి వాటి ఊసెత్తద్దు. 

ఒకే ..చిల్ బేబ్.. చిల్… రేవ్ పార్టీలకి వెళ్లొద్దు కానీ   సంజయ్ భాయ్ దగ్గరకి వెళ్ళు ఈరోజు. అని కశ్యపుడు లకుమ దగ్గరగావచ్చి ఆమె గులాబీ పెదవుల పై  చూపుటి వేలుతో రాస్తుండగా లకుమకి కంపరం పుట్టి " ఛీ .. వెళ్ళు " అని అరిచింది. “యువర్ లైఫ్ , యువర్ కెరీర్  అప్ టు యు” అని కశ్యపుడు  నవ్వుతూ వెళ్ళిపోయాడు. కశ్యప్ వెళ్లి పోయాక తలతిరిగిపోతోంది సాయంకాల పార్టీ లో కాదు ఇప్పుడే తాగాలి తప్పదు అనుకుని కబోర్డ్ లో బాటిలు కోసం చూసింది ఒక్కటీ కనిపించలేదు కోపంతో అరచింది   " రోహిత్ , రోహిత్ " “యస్ మేడం.” ఒక్క బోటిల్ కూడా లేదు ఏంచేస్తున్నావ్ . “అయిపోయాయి మేడం. కొని తేవాలి,  తెస్తాను. ఇప్పుడు ఇంకా ఉదయమే కదా, సాయంకాలం తీసుకొస్తాను.”  ఆ సమాధానంతో లకుమకి మరీ  పిచ్చెక్కిపోయింది రోహిత్  చెంప పేలి పోయింది. “బాటిల్స్ అవ్వకముందే ముందే తెచ్చి ఉంచాల్సిందిపోయి, అయిపోయిన తరువాత కూడా కొని తేడానికి ముహూర్తం కావాలా యూ ఇనెఫిషెన్ట్ రోగ్!”  “మాఫ్ కర్నా మేంసాబ్” 

“భర్తమీజ్,  తుం కిస్ లియే  ఇదర్ మేనేజర్? మేరే సర్ ఫొడ్ రహాహై!! గెట్ అవుట్!!!.”

 చెంపమీద చేతితో బాటిల్ తేవడానికి రోహిత్ పరిగెడుతుండగా అక్కడే నిలబడి చూస్తున్న ఆషా కిసుక్కున నవ్వింది. “దాని సంగతి చూస్తానే!” అన్న రోహిత్ కళ్ళలో మంటలు చూసింది.

                                                               ***

ఇందిరానగరం లో ఇంద్రాగ్నిని తలపించు ఇంద్రభవన మందు ప్రశాంత చంద్రికలు పరుచుకొని యున్నవి. మీనాక్షి పాలనురుగులాంటి తెల్లని దుప్పటి గప్పిన శయ్య పై పరుండి పుస్తకమును చదువుండెను. యమున మండువా గదిలో పెద్ద కిటికీవద్ద కూర్చొని వర్షుడు వ్రాసిన భక్తి విజయమందలి రుక్మిణీ శృంగార పద్యములను చదువుచూ, “ఆహా! ఎంత ఆహ్లాదంగాయున్నవీ పూలదండలవంటి పద్యములు, ఆ భావ పరిమళము లందునా మనసు ఊయలలూగుచున్నది కదా!” అనుకొని కిటికీ నుండి బైటకు చూచెను. మబ్బు దొంతరల తెలియాడు రేరాజు నింగినేలుచుండెను. ఆభవంతిని నిశ్శబ్దమేలు చుండెను. ఆమె హృదయమును శృంగార మేలు చుండెను. 

పక్కనే వర్షుడు వ్రాసిన తెలుగు  ఆంగ్ల కవితల పుస్తకములు బంతి చామంతుల వలె గుభాళించుచున్నవి. ఇటువంటి భావములు తాకిన స్త్రీల మనసులు పుష్పములవలె వికసించును కదా. ఈ కవితలు వెన్నెలను చూచుచూ కాక వెన్నెలయందు  కూర్చొని చదివినచో ఎంత రమ్యముగా నుండునో  అనుకొనుచూ గడియారం వంక చూచెను. 9 గంటలు   అయ్యెను. అయ్యో పనివారందరూ వెడలినారు  పిచ్చితల్లి ఏమి చేయుచున్నదో పిలచి బువ్వ పెట్టనిచో తినని పసిపిల్ల తల్లివలె యమున చకచకా మీనాక్షి శయన గృహమునకు పోయెను.  26 గదులు గల ఆ భవనమందు ఆమెకు 6 శయన మందిరములు  కలవు. క్రిందనున్న రెండు గదులయందు ఆమె లేకుండుటచే యమున పైకి పోయెను. అచ్చట రెండు మందిరముల తలుపులు మూసి యున్ననూ   ఒక మందిరమందు తలుపు దగ్గరగా చారవేసి యున్నది . యమున ఆ తలుపు వద్ద నిలిచి టక టక తలుపు కొట్టెను. 

స్పందన లేకుండుటచే మెల్లగా తలుపు తెరిచి లోపలకు తొంగి చూచెను. పాలనురుగులాంటి తెల్లని దుప్పటి గప్పిన శయ్య పై  ధవళ కాంతులీను కువలాయాక్షి చేత ఘంటము పూని గువ్వలవంటి తెల్లని కాగితముల పై లిఖించు చుంచుండ యమునకు  సరస్వతి వలే కనిపించెను. ఇట్లు వచ్చుటకు సిగ్గులేదు అని మీనాక్షి కోపము చూపగా మిక్కిలి అదురుచూ  యమున వెనుకకు పోయెను. మీనాక్షి యమునను చిలిపిగా చూచి నవ్వి పక్కన కూర్చొమ్మని కనుసైగ చేసెను. యమున పోయి ఆమె ప్రక్కనే కూర్చొనిన  పిదప " నీవు పనివారివలె  తలుపు తట్ట పని యున్నదా ? నేరుగా తలుపు తీసుకొని రమ్ము అని వాలిన ఆమె చుబుకమును ఎత్తి కళ్ళలోకి చూచి మరల చిలిపిగా నవ్వెను. ఈ సారి యమునా కూడా నవ్వెను.

  “భోజనమునకు పిలుచువరకూ రాకున్నవే మీ అమ్మ నీకు వేళ కు భోజనము చేయుట కూడా నేర్పలేదా? "ఇప్పుడిప్పుడే నేర్పుచున్నది.” "హి హి హి హి , సంతోషించితిని భోజనమునకు లెమ్ము" మీనాక్షి మూతి బిగించెను. నావద్ద ఈ మూతి బిగింపులేమియూ పనికిరావు. లేవనిచో పెద్దదానివని చూడక ఇచ్చట రెండు వడ్డించెదను అని దిండుతో కొట్టసాగెను , మీనాక్షి నవ్వుచూ రెండు చేతులతో అడ్డుకొనుచుండగా , యమున దృష్టి ఎగిరిపోవుచున్న సంగీత సంకేతములున్న కాగితములపై పడెను. పూరెక్కల వలే నున్న ఆ కాగితములను చూచి పూవులు నోరు తెరచి పాడుచున్నట్లనిపించి యమున ఆమెలో సరస్వతికి మనసులో నమోవాకములర్పించుచూ శిల్పం వలె నిలిచిపోయెను.  

మీనాక్షి కది యెంత మాత్రము నచ్చలేదు అప్పుడు ఆమె మరొక దిండు తీసుకొని యమునను కొట్టసాగెను. ఆ పెద్ద శయన మందిరమంతయూ తిరుగుచూ వార్ అట్లాడుకొను చుండగా యమునా దృష్టి రెండవ తలగడ క్రింద నున్న పుస్తకంపై పడెను , వెంటనే దిండు పారవేసి ఆ పుస్తకము వైపు పోవుచుండగా మీనాక్షి అది గ్రహించి ఆమె ఆ పుస్తకమును దక్కించుకొనుటకు పోయెను. ఇద్దరూ ఆ పుస్తకమును సగము సగము దక్కించుకొనిరి. మీనాక్షి శతవిధములు ప్రయత్నించినను ఆ పుస్తకమును యమున లాగి చేజిక్కించుకొనెను. 

ప్రౌఢ శృంగార కథలు అని బిగ్గరగా చదివి ఆమెను ఓరకంట చూచుచూ పుస్తకమును చుంబించెను. మీనాక్షి  సిగ్గుతో కళ్ళు మూసుకొనెను. యమున పుస్తకమును మీనాక్షి  చే తులకు తాకించగా కనులు తెరిచేను. వెంటనే యమున ఆ పుస్తకమును మీనాక్షి చేతులో పెట్ట ఆమెను నుదుటిపై చుంబించెను. ఇంకనూ ఆటపట్టించునేమో అని అనుకొన్న మీనాక్షికి ఆశ్చర్యము కలిగెను. ఇంకానూ  చదవలేదా, నీకెప్పుడూ సంగీతమే,  పోనీ నన్ను చదివి వినిపించమందువా ? అని అడుగగా.   మీనాక్షికి  మరల సిగ్గు ముంచుకొచ్చెను. నిన్నని ఏమి  లాభము ఆ వర్షుడి ననవలెను. అతడు గుండెలు తీసిన బంటు వలే నున్నాడు. ఏమి వ్రాసేనో కదా. ఒక్క సారి చూబింతువా? అని యమున చేయి జాపగా మీనాక్షి తన బెత్తముతో ఒక్క దెబ్బ కొట్టెను. యమున చిన్నపిల్లవలె గెంటి అల్లరి చేయుచుండగా మీనాక్షి ఆమె బుగ్గపై ముద్దిడి. పద పోయి తినవలెను అనెను. నే రాను నన్నేల కొట్టితివి ! అని మారాం చేయసాగెను .  మీనాక్షికి కూడా కోపమొచ్చెను. ఇరువురి కోపములు అలుకగా మారెను. 

  ఇరువురూ మండువా గది యందు  దూరదర్శనము ముందు   కూర్చొనిరి. యమున దూర నియంత్రణను నొక్కగా  వర్షుడు తెరపై ప్రత్యక్షమయ్యెను. వార్తా ప్రసారము వెలువడు చుండెను.  " లూయీ విల్ లో గౌరవ పొరసత్వమును పొందిన      తొలి తెలుగు కవి భారతవర్షకు నగర మేయర్ నగర  తాళాలను అప్పగించారు. భారదేశము రాబోతున్న భారతవర్షకు వచ్చే వారము స్వదేశమందు ఘన సన్మానము ఏర్పాట్లు.. అమెరికాలో లూయీ విల్ యందు స్లగ్గర్ ప్రదర్శన శాలవద్ద వర్షుని చిత్రములను, గ్రెగ్ ఫిషర్ భారతవర్షకు తాళములిచ్చుచున్న చిత్రములను పదే పదే చూపు చుండిరి. యమునా మీనాక్షిలు ఒకరినొకరు చూచుకొని నవ్వుకొనిరి , క్షణములో వారికి అలకలు గుర్తుకువచ్చి మొఖములు తిప్పుకొనిరి.

కొలది సేపు తరువాత  మీనాక్షి " యమునా నాకు హృదయము నిండి పోయినది నాకు ఆకలి లేదు అదియునూ కాక నాకు వేరొక ప్రత్యేక కారణము కలదు . నీవు పోయి అన్నము తినమ్మా " అని అనుచుండగా, "నేను తినను......" అని యమున మొండి కేసెను ." 

"నేను తినిపించినచో ..."  "నీవు తినిపించిననూ తినను" 

నీ అభిమాన రచయిత భారతవర్ష తినిపించినచో ? ఆమాట విన్న యమున మొఖం విప్పారెను.  మరుక్షణము  మొఖం మాడ్చుకొని " భారతవర్ష ఎందులకు వచ్చును ?

“మా యమున ఆకలి తీర్చుటకు అతడిని పంపమని నేను దేవుని ప్రార్ధింతును అని మీనాక్షి దేవునికి దణ్ణము పెట్టుకొనుచుండగా "వంకాయ్" అని యమున మూతి మూడు వంకలు తిప్పెను. ఇంతలో రక్షక గృహమునుండి వచ్చిన రక్షణ సిబ్బంది “ అమ్మ ఎవరో భారతవర్ష అట మీకొరకు వచ్చి గేటువద్ద ఉన్నారు పంపమందురా.” “వలదు అచ్చటనే ఉండమనుము.” అనగా వారు వెడలిపోయిరి. “ఏమే  వంకాయ్ లోనికి తీసుకు రావలెను నాతో  వచ్చెదవా ఇచ్చటనే వుందువా?” 

ఇద్దరూ ప్రవేశద్వారం వద్దకు పోయి వర్షుని గౌరవంగా లోనికి తీసుకువచ్చిరి. మీనాక్షి వర్షునికి దృష్టి తీసెను. మండువాగదిలోకి ప్రవేశించిన పిదప అమ్మాఎంత చిక్కిపోయినావు! అని మీనాక్షిని ముఖమును చేతులలోకి తీసుకొని చూచుచుండెను.   పుత్రవాత్సల్యమును చూ పుచూ  మీనాక్షి అతడిని కౌగిలించుకొనెను. 

నా కొడుకు కి చదువు అబ్బకున్ననూ జ్ఞానసంపన్నుడు గుణ సంపన్నడూ  అయినచో నీవలె నన్ను చూచుకొనెడివాడు. అని మీనాక్షి పొగిలి  వెక్కి వెక్కి ఎడ్వసాగెను.  

మాలిని నీవు వేరు కారమ్మా అన్ని కన్నీరు తుడిచి వర్షుడు మీనాక్షిని గుండెలకు హత్తుకొనెను. ఇదంతయూ ఏమీ అర్ధము కాని యమున పాపము బిత్తరపోయి చూచుచుండగా వర్షుడు ఆమెను " యమునా, ఇట్లు రా అమ్మా ,  " అని యమున తో అనగా యమున తన పేరెట్లు తెలిసెనని ఆశ్చర్యము కలిగిననూ " నీవెంతో బాగాచూచు కొంటున్నావని చెప్పుచుండును." అనుచుండగా “చూడండి సార్ ఈ మీనాక్షి ఎంత మోసము చేసెనో ! " అని వర్షునితో అని   " మోసం, దగా, కుట్ర " అనుచూ మీనాక్షిపై కలియబడెను. అట్లు మీనాక్షి గృహము నవ్వులు పూవు నందనవనముగ మారెను.    పిదప భారతవర్ష వారిద్దరినీ చెరొక వైపు కూర్చోండ బెట్టుకొని ఇద్దరికీ అన్నము తినిపించి తానూ తినెను.  యమునా ఇంకనూ సార్ అనుచుండగా "నన్ను అన్నయ్య అని పిలవ వలెను." అని చెప్పి యముని ఆప్యాయముగా చెల్లెమ్మ అని పిలిచెను. భోజనము లైన పిదప వర్షుడు నిద్రించుచుండగా మీనాక్షి యమునికి, మంజూష కథను వారితో ఆమె బంధమును చెప్పుచుండగా యమున  ఆమె వద్దనే నిద్రించెను.




Friday, January 8, 2021

Bharatavarsha -108

 సుందరి పార్వతీ అపహరణ ఘట్టమును ముగించిన పిదప మాలిని , మంజూష నందినీ శిలా ప్రతిమలువలే బిగుసు కొని చూచుచుండిరి. ముందుగా మాలినిగారు తేరుకొని బాహ్య స్మృతి పొంది " నీ విమానమునందు ఆ పార్వతెట్లు  కూర్చొన్నదో , నీవు చెప్పుచుండగ  నా గుండె ఆగిపోవునేమో అనిపించెను.”  ఇట్టి అసాధారణ ప్రతిభాపాటవములున్న వైమానికురాలిని ఘనముగా సత్కరించవలె "నని నందిని ముందురోజు వస్త్రాలయము నుండి కొనితెచ్చిన ఒక కుంకుమ రంగు చేనేత చీరను పసుపు రంగు రవికను ఇచ్చి  ఒక ముత్యాల హారమును  ఆమె మెడలో వేసి అలంకరించెను.

మాలినిగారు భోజనములు వడ్డించగా అందరూ భోజనములు చేయుచుండిరి. ఇంతకీ పార్వతి ఎచ్చటున్నది అని ముగ్గురు ఆత్రముగా  అడిగిరి, అప్పుడు సుందరి “నేను ఇంటికి వచ్చి చూడగా తాళము పెట్టి యుండుటచే దసపల్లా హోటల్ నందొక గది తీసుకొని యుంచినాను” అని సుందరి చెప్పెను.“వీరిద్దరూ ఎప్ప్పుడూ ఇంటి పట్టునుండక ఆసులో కండెవలె తిరుగుచుందురు. మీరందరు సాయంకాలము పోయి పార్వతిని తీసుకు రావలెను.” అని మాలినిగారు అనుచుండగా “భోజనములైన పిదప పోయెదము.” అని నందిని మంజూషలు అనిరి “లేడికి లేచిందే పరుగన్నట్లున్నది మీవరస సుందరి కి విశ్రాంతి అవసరము సాయకాలమే పోవలెను” అని మాలినిగారు పట్టుపట్టిరి. “లేదు మేము పోయెదము అని మంజూష హఠము  చేయుచుండగా మాలినిగారు విసిగిపోయి మంజూషను గరిటెతో చిన్నగా తలపై మొట్టి " నా మాట వినకున్న నాతో  మాట్లాడవలద”ని మూతి ముడిచినారు. సుందరి అది చూచి ఒకటే నవ్వు చుండెను. ఎట్టకేలకు భోజనములు ముగిసినవి సుందరి కూడా వారితో బయలుదేరెను.

వారు కిలకిలా రావములు చేయుచూ ముగ్గురూ ఇంటి ఆవరణలో నున్న వాహనము వైపు పోవుచున్నారు. మాలినిగారు వారివెంట నడుచుచున్నారు. నందిని “సుందరి నీవు నడిపెదవా?” అని అడిగెను " సుందరి” నాకు లైసెన్స్ లేద"ని  చెప్పెను. మంజూష, నందిని సుందరిని “నీ వద్ద ఉన్న లైసెన్స్ చూపమ”ని కోరగా సుందరి తన పైలెట్ లైసెన్స్ ను తీసి చూపెను. మంజూష నందిని ఆ లైసెన్స్ ను తేరిపార చూచిరి.  విమానము నడుపుటకు ఐదు సంవత్సరములకు పౌర విమాన శాఖవారిచ్చిన అనుమతి. మంజూష  “విమానము లైసెన్స్  చూచుట జీవితములో  ఇదే  మొదటిసారి.  

కారు నడుపుటకు అనుమతి లేదు గానీ విమానము నడుపుటకున్నది. ఇదెట్లున్నదనగా  మజ్జిగున్నదా అని అడిగిన లేదు పెరుగున్నది అన్నట్లున్నది” అనెను. సుందరి మెల్లగా పండ్లికి లించెను. నందిని సుందరిని చూచి పడీపడీ నవ్వు చుండెను. వెనకనే యున్న మాలినిగారు " వీరికి ఇకఇకలు పకపకలు హెచ్చగుచున్నవి.  నందిని  ఇట్లుండెడి పిల్ల కాదు  ఈ మంజూష దానిని చెడగొట్టినది. పార్వతి అనుకూలవతి యగు చక్కటి పిల్ల , పార్వతి వచ్చిన మీ పనిచెప్పెదను” అని సణుగుచుండగా. నందిని “అత్తా నీ ఇంట దీపము పెట్టుకోడలిని  మంచి చేసుకొనక ఇట్లు మాటలాడుట న్యాయమా అని అనుచూ వాహనము నధిరోహించెను. 

పార్వతి బుద్ధిమంతురాలట అదియునూ చూచెదము అనుచూ నవ్వులతో హోటలుకు సాగుచుండిరి. దారంతా ఆమాటలే చెప్పుచూ వాహనమును నడుపుచున్న నందిని వేరొక కారుని డీకొనెను. పోలీసు ప్రత్యక్షమయ్యెను “అదృష్టము బాగుండుటచే ఎవరికీ దెబ్బలు తగలలేదు కానీ నువ్వు  పోలీసు వచ్చి స్టేషనుకు రావలసి యుండునని  నందినిని గద్దించుచూ  వివరములడిగి వ్రాసుకొనుచుండెను. పెంచలయ్య కుమార్తె అని చెప్పగానే అతడి విషణ్ణ వదనమందు నవ్వులు పూసినవి. ఇకపై  మీ బెంజ్ కారు గుర్తు పెట్టుకొందును మీరు వెళ్ళిరండి మేడం. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు నిత్యమూ జరుగుచునే యుండును. అని ఎంతో వినయముగా వారిని సాగనంపెను. సుందరి , మంజూష అచ్చెరువందిరి.  

                                                                    ***

లూయి విల్  : ఢిల్లీలో బయలుదేరిన అమెరికా సంయుక్తరాష్ట్రాల విమానము ఆఫ్ఘనిస్తాన్, టర్కీ , గ్రీస్, ఇటలీ, స్పెయిన్ మీదుగా అట్లాటిక్ మహాసముద్రమును దాటి లాఫాయెట్టి  మీదుగా ఇరువదినాలుగు గంటల సుదీర్ఘ ప్రయాణము పిదప భూగోళమునకావలి వైపునున్న మరియొక నాగరికతను చుంబించుచూ మహమ్మదాలీ అంతర్జాతీయ (లూయీవిల్) విమానాశ్రయమందు వాలెను. చెప్పనలవికాని  విమానాశ్రయ తిన్నమును  నిశ్శబ్ద నిర్మల  భూషణాదులు ద్విగుణీకృతము చేయుచూ  దోడా కొండల మధ్య ప్రవహించు చీనాబ్ నది వలె,  లదాక్  పర్వతముల మధ్య నున్న నీలి పాంగంగ సరస్సువలె, తపస్వినివలె నున్నది.  వర్షుడు విమానము దిగిన  పిదప ఇండియానా విశ్వవిద్యాలయ అధికారులు హార్దిక స్వాగతము పలికి తమ వాహనమందు కొనిపోయి విడిది ఏర్పాటు చేసినారు.  

అంతర్జాతీయ ముష్టియుద్ధ క్రీడాకారుడు మహమ్మదాలీ జన్మస్థలమగు లూయివిల్ అనినచో ముఖ్యముగా గుర్తుకువచ్చునవి, ఆలీ బాల్య గృహము,  స్లగ్గర్  కర్మాగారం మరియు కెంటాకీ  చికెన్ఫ్రై,(KCF) కానీ అచ్చటమరెన్నో చూడవలసిన ప్రదేశములు కలవు. 

నాటి సాయంత్రము ఆరు గంటలకు లోగాన్ ప్రదేశమందు గల ఫోల్కనర్ చిత్రప్రదర్శనశాల లోఇండియానా విశ్వవిద్యాలయము వారిచే నిర్వహించబడుచున్న ఆంగ్ల పద్య సాహిత్య ఉత్సవమునకు అతడిని కొనిపోయిరి. అనేక స్థానిక కవులు కవయిత్రులు  ఆ పద్య సాహిత్య ఉత్సవమందు పాల్గొనిరి. ప్రజలు కూడా ఈ ఉత్సవము తిలకించుటకు పెద్ద సంఖ్యలో   ఉత్సాహముగా వచ్చిరి. నగరమేయరు పారిపాటిగా ఈ సభకు అధ్యక్షత వహించెను. ఆయనకూడా సాహిత్య ప్రియుడు అగుటచే తాను వ్రాసిన ఆంగ్ల పద్యములను చదివి వినిపించెను. చిట్టచివరిగా భారతవర్ష తాను కొత్తగా వ్రాసిన , బ్యూటీ అఫ్  కల్చర్,   పీస్ అండ్ జస్టిస్ అను ఆంగ్ల పద్య సంకలనములనుండి కొన్ని పద్యములను వినిపించగా ఆ భాషా భావ సౌందర్యములందు తడిచి, నాజూకైన లయవిన్యాసభరిత ఆంగ్ల ఉచ్చారణ సొక్కి ఆహుతులు వివశులయ్యిరి. 

 ముగ్ద పారవశ్యమున మునకలయిన మేయరు గారు భారతవర్ష నుండి పుస్తకములను తీసుకొని అందునుండి మరికొన్ని పద్యములను చదివి శ్రోతలకు ఆనందామృతమును పంచి. “ప్రజలందరినీ కలుపు శక్తి కళకు మాత్రమే కలదనిన అతిశయోక్తి కాదు. ఈ ఆంధ్రకవి నేడు లూయివిల్ నగరమునే కాక జన హృదయములను వెలిగించెను. శాంతి మరియు న్యాయం కొరకు కదం త్రొక్కు పదాతి దళముల సృజించిన ఈ కవిని శాంతిసేనాని యనిన అతిశయోక్తి కాదు.  ఈ ప్రపంచ పౌరుని  గుర్తించిన లూయీవిల్ గౌరవము ఇనుమడించునని లూయివిల్ నగర తాళాలను భారతవర్షకు  అందజేసి  అతడిని  నగరగౌరవ పౌరునిగా  ప్రకటించిరి. పిదప భారతవర్ష నగర సందర్శనమునకు ఏర్పాటుచే సిరి.

లూయివిల్ రాజధాని కాకున్ననూ కెంటాకీ రాష్ట్రమందు వంద విభిన్న ఆకర్షణలు గల అద్భుత నగరము. వేయి సంవత్సరముల లూయివిల్ చరిత్రను ప్రదర్శనలద్వారా ప్రతినిత్యము చాటుచు వన్నెల సీతాకోకచిలుకవలె మెరియుచున్న ఫ్రెయిజర్ చరిత్ర ప్రదర్శనశాల యందడు గిడి, ఆంధ్రదేశమందిట్టి ప్రదర్శనశాల యుండవలెననుకొనుచూ  విందు వినోదములకు చిరునామా అయిన  ఫోర్త్ స్ట్రీట్ చూచి అచట ఉన్నత ఆకాశ హార్మ్యము లందు రాత్రంతయూ జరుగు రాసక్రీడల గూర్చి విని  సందర్శకులను అయస్కాంతమువలె ఆకర్శించుచున్న ఆవీధి ని వీడి  రోమన్ శిల్ప కళను చూపు పురాతన లూయి విల్ చారిత్రక  ప్రదర్శనశాల లోనికి పోయెను. భవన నిర్మాణమందు ఆసక్తిగల వారు తప్పక సందర్శించవలసిన ఈ భవనము ప్రాచీన కాలమందు రెండు కుటుంబముల నివాసము. దాని సమీపములోనే కాంకర్డు  కాసల్ అను విక్టోరియా కాల శిల్పకళను ప్రతిబింబించు మరియొక చారిత్రాత్మక రాచ భవనము కలదు.  అందుగల  సప్తవర్ణ నగిషీల చెక్క శిల్పములను జూచుచున్న వర్షుని స్మృతి పథమున విదిష యే మెదలుచుండెను. 

లూయివిల్ బేస్బాల్ క్రీడకు  ప్రపంచ  ప్రసిద్ధి గాంచిన నగరము. ప్రపంచములో అత్యుత్తమ బేస్బాల్ బ్యాట్లు తయారుచేయు స్లగ్గర్  కర్మాగారం మరియు ప్రదర్శనశాలకు బోయి  ఆ ప్రదర్శనశాల పైగోడకు ఆనుకొని యున్న 120 అడుగుల ఎత్తున తాటి చెట్టు పరిమాణమునగల బేస్బాల్ బ్యాట్ ను చూచి వింత గొలుపు ఆ ప్రదర్శన శాల నందు ప్రవేశించెను. పిదప వంద ఎకరముల  మానవ నిర్మిత సున్నపురాయి గుహ ను పెక్కుకళాఖండములకు నిలయమైన కెంటాకీ డెర్బీ ప్రదర్శనశాలను సందర్శించి ప్రత్యేక ఆకర్షణ గానిలచిన బహుమతుల అంగడికి పోయి అందరికీ బహుమతులు కొని వెనుదిరిగెను. కెంటకీ సాహితీ చరిత్రయందు అగ్రస్థానమంది నగరగౌరవ పౌరునిగా లూయీ విల్ నగరము పై తన ముద్రను వేసిన వర్షుడు తనదేశమునకు పోవు విమానమెక్కెను. విమానము గాలిలోకి లేచెను. 

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...