Thursday, August 22, 2024

భాషే మన జాతికి నెత్తురు - ఫ్రమ్ ది డైరీ ఆఫ్ పూలబాల

మనకి మన సంస్కృతి కి బంధాలు ప్రబంధాలే.


భాష కోల్పోయిన సమాజం తన ఉనికిని కోల్పోతుంది.

ప్రబంధం అంటే సంస్కృతానికి మాత్రమే చెందిన శైలి. అంటే మన ప్రాచీన భారత శైలి (ఇండియన్ స్టైల్) వేదాలని జర్మన్ లోకి అనువదించిన మేక్స్ ముల్లర్ అన్నట్టు మానవులకు తెలిసిన మొదటి గ్రంధం ఋగ్వేదం. అంటే సంస్కృత బాష ఎంత ప్రాచీనమైనదో చెప్పనక్కరలేదు. సంస్కృతాన్ని ఒక పథకం ప్రకారం నాశనం చేశారు. ఒక బాష నశించిపోతే ఆ లోచనా విధానం ఇంకా జీవన విధానం సమూలంగా మారిపోతుంది. సంస్కృతం అడుగంటి పోయిన తర్వాత భారతదేశానికి పట్టిన దుర్గతి గురించి తెలుసు కుంటే హృదయం ద్రవిస్తుంది.

తెలుగు భాషను పూజకు పనికిరాని పువ్వును చేశారు. చదువుకి పనికి రాణి భాషని చేశారు. తరువాత నిత్య జీవితంలో కూడా పనికి రాని భాషగా తెలుగు భాషను చేట పెయ్యిని చేశారు. ( గడ్డి కూరిన చనిపోయిన దూడ పెయ్యి ). హేపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా. ఇలాటి ఇంగ్లీష్ మాటల తో పాటలు. ఇంగ్లీష్ ట్యూన్స్ కి తెలుగు పాటలు రాయడం. చివరకు చికుబుకు చికుబుకు రైలే అంటూ ఇంగ్లీష్ స్వరం తో తెలుగు పాట. తెలుగు మాట బాణీ స్వరం ఏవీ లేవు. దీనికి తోడు ఎకాడ , (ఎక్కడ ) ఏం దుకు ( ఎందుకు ) అంటూ మాటలు. భాష కోల్పోయిన సమాజం తన ఉనికిని కోల్పోతుంది.
.
వినోదం (సినిమా టీవీ) నేటి మన భాష, ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటే మన భాష మన సంస్కృతిని ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే భాష సంస్కృతికి పునాది. ఎందుకంటే నమస్కారం అనే మాట మన తెలుగుజాతి మర్చిపోయి చాలా కాలం అయింది దాంతో పాటుగా సంస్కారాన్ని కూడా మర్చిపోయి పిల్లలు తమ కంటే చాలా పెద్ద వాళ్ళని వృద్ధుల్ని కూడా హాయ్ అని పలకరించడం ఇంటికి వచ్చే అతిథి వెళుతూ ఉంటే బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పమ్మా అంటూ తల్లిదండ్రులే పిల్లల్ని పోరు పెట్టి మరి నేర్పిస్తున్నారు. ఉంటాము, వెళ్లి రండి అనే మాటలు పోయి బాయ్ బాయ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. క్షేమంగా వెళ్లి రండి అనడానికి ఇష్టపడటం లేదు హ్యాపీ జర్నీ అంటున్నారు. ఓరి దేవుడా అంటే నా మోర్దా కాబోలు ఓ మై గాడ్ అంటున్నారు. మన మాట మన సామెత మన తత్వము మన వేషము ఇప్పుడు కనిపించవు మరి ఇవన్నీ ఏమైపోయాయి. ఒగ్గు కథ బుర్రకథ హరికథ నాటకము నవల ఉన్నప్పుడు భాష ఇంత నాసిగా లేదు. భాష చింత చెట్టు లాగా గట్టిగా ఉండేది. ప్రబంధాల కాలంలో అయితే మర్రి చెట్టు లాగా మహావృక్షంగా ఉండేది . ఉన్నత భాష కథా విలువలు కలిగిన సాహిత్యం ప్రబంధం. మర్రిచెట్టు లాంటిది . మనకి వృక్షాలు ఎంత అవసరమో ప్రబంధాలు అంతేఅవసరం.

Wednesday, August 14, 2024

వాయిస్ అఫ్ పూలబాల

అచ్చు డిస్కవరీ ఛానల్ వాయిస్ తో దుమ్ము లేపుతున్న తెలుగుగోడు.

అనేక ప్రభుత్వ , ప్రయివేట్ ప్రకటనలకు విద్యా వైద్య సంబంధిత ప్రచార వీడియోలకు,షిరిడి , సత్యసాయి ధార్మిక సంస్థలకు, జీవిత చరిత్రల వీడియోలకు స్వరాన్ని సమకూర్చి,న పూలబాల ఇలాంటి స్వరానికి పేజీకి 5000 ఇస్తారని "వాయిస్ ఈజ్ ఆ బిజినెస్ టూల్, " అని అంటున్నారు



నేర్చుకోవడం ఎలా ?

ఇంగ్లిష్ డిక్షనరీ సీడీలకు, ఇంగ్లిష్ నేర్చుకునే సీడీ లకు రచన వాయిస్ ఓవర్ గా స్వర సహకారాన్ని అందజేసిన పూలబాల తన అనుభవంతో "డైనమిక్స్ అఫ్ ఇంగ్లీష్ స్పీచ్ " అనే పుస్తకాన్ని రచించారు.

పుస్తకంలో ఏముంటాయి ?

44 ఆంగ్లశాబ్దాలు , వాటిని ఉత్పత్తి చేస్తే విధానం , అభ్యాసం చేసే క్రమం , వాయిస్ మోడ్యు లేషన్ , అమెరికన్ ఏక్ సెంట్ , బ్రిటిష్ ఏక్ సెంట్ ఎక్సెర్ సైజెస్ ఇందులో ఉంటాయి. తాను వ్రాసిన "డైనమిక్స్ ఆఫ్ ఇంగ్లిష్" అనే పుస్తకాన్ని, పుస్తకంతో పాటు శిక్షణ కూడా అనేక స్కూల్స్ లో ఉచితంగా కూడా ఇచ్చారు. విద్యాసామాజిక రంగాలలో అనేక మందికి ఉచితంగా సేవలందిస్తున్న పూలబాల కోరితే ఎవరికైనా ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తానని అన్నారు.

అల్ ఇండియా రేడియో లో అనేక ఇంగ్లీష్ టాక్స్ ఇచ్చిన పూలబాల ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లిష్ మరియు జాపనీస్ ఆరు బాషలలో ఏకకాలంలో మాట్లాడే పోలీ గ్లోట్ ( బహుభాషి ) ఆరు రకాల స్వరాలతో ఇంగ్లీష్ మాట్లాడే ఈ ఆరు భాషల పోలీ గ్లోట్ కి. మన అచ్చ తెలుగు సైనికుడికి భారతవర్షకి, ఆయన స్వరం నచ్చితే ఒక లైక్ వేసుకోడం మర్చిపోకండి.

Sunday, August 11, 2024

ఇంగ్లీష్ కి ఏమైనా కొమ్ములున్నాయా ?

ఇంగ్లీష్ కి ఏమైనా కొమ్ములున్నాయా ? - విజయవాడలో (బెంజ్ సర్కిల్ వద్ద) తొలి మరియు అతిపెద్ద ఫారెన్ లాంగ్వేజెస్ స్కూల్ డైరెక్టర్, బహుభాషా కోవిదుడు, బహుళ గ్రంథకర్త పూలబాల.
.
ఇంగ్లీష్ మీడియం కుట్ర - చదువంతా అదే మీడియం లో ఎందుకు ?
జీవితాంతం ఈ బానిసత్వం ఎందుకు ? ఇది కుట్ర మాత్రమే.
నా అభిప్రాయం కాదు అనుభవం చెబుతున్నాను.

నావద్ద ఫ్రెంచ్ జర్మన్ వంటి భాషలను రెండు లేదా మూడు నెలలు నేర్చుకుని విదేశాల్లో చదువుకో గలుగు తున్నారు ఉదోగాలు చేయగలుగుతున్నారు. జర్మన్ లేదా ఫ్రెంచ్ మీడియం లో ఎవరూ చదువుకోడం లేదు.


తెలుగు మాట్లాడడానికి అనుమతించని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలని ఇప్పటికీ చూస్తున్నాం , మాట్లాడితే పిల్లవాడి మెడలో తెలుగు మాట్లాడను అని బోర్డు కట్టి ఊరేగించిన పాఠశాలలనీ చూసాం. తెలుగు తల్లి నోటికి తాళం వేసి తెలుగువాడిని కాపలాగా పెట్టి వెళ్లిన ఇంగ్లిష్ వాడిని , కోట్లాది మంది భారతీయులను చంపిన ఇంగ్లీష్ వాడిని స్మరిస్తున్నాం, వాడి బాష నేర్చుకుని తరిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోపోతే ఉద్యోగం రాదు అని చదువు ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నాం.

ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే ఉద్యోగం మాట అటుంచి ఇంగ్లిష్ కూడా సమంగా రాడంలేదు. ఆంగ్ల నాగరికతా వ్యామోహాన్ని సినిమా తో పెంచుతున్నాం. వచ్చిన ఆవగింజంత ఆంగ్లభాష ను గుమ్మడికాయంత చూపిస్తూ జాతి మొత్తం వాళ్ళ లా వేషాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇదంతా చూసి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కూడా బానిసత్వం వదల్లేదనిపించి . అందుకే అచ్చతెలుగులో భారతవర్ష అనే గ్రంథం రాయడం జరిగింది.

మన భాష మన ధర్మము. ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనమని తెలియజెప్పి అట్టి ధర్మమునకు మూలము సంస్కృతి అని, ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజెప్పే సరళగ్రాంధిక ప్రబంధం , వేయి కవితల సమాహారం , అచ్చతెలుగు మాధుర్యం భారతవర్ష.
.
పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధకావ్యం భారతవర్ష.

"భారతవర్ష " ఇంత పెద్ద గ్రంథాన్ని (1265 పేజీలు ) చదవడం కూడా అంతసులభం కాదు అందుకే ఒక సాంస్కృతిక కార్యక్రముద్వారా సంగీత నృత్త్యములతో వృత్త పద్యములతో ప్రదర్శిస్తే తెలుగు భాషా మాధుర్యమును ఆస్వాదిస్తారు కదా.

"ఇలా క్షీణిస్తున్న తెలుగు భాషకు అడుగంటుతున్న సంప్రదాయాలకు ఊపిరిలూదడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న తరుణంలో తెలుగు వారి స్పందన కరువయ్యింది . ఒక సాంస్కృతిక కార్యక్రమానికి స్కూల్ లో ఒక గంట అవకాశం ఇవ్వమని యాజమాన్యాలని కోరినప్పుడు చీదరించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలావుందంటే ఫారిన్ లాంగ్వేజెస్ అంటే పరిగెత్తుకొస్తున్నారు తెలుగు ఊసెత్తితే తల తిప్పుకుని పోతున్నారు. " అంటున్నారు ఈజీ ఫారెన్ లాంగ్వేజెస్ వ్యవస్థాపకులు పూలబాల.

Friday, August 9, 2024

వింటే ఫిదా పాటకు జీవం పోసిన గాయని

ప్రముఖ సంగీత విద్వాంసులు ఎన్‌సీహెచ్‌ బుచ్చయాచార్యులు వద్ద కర్ణాటక సంగీతంలో నేర్చుకుని  అనేక  సంగీత కార్యక్రమాలలో పాడి  శ్రోతల మనసులను గెలుచుకున్న ఈ గాన సరస్వతి   పేరు రుగ్వేదం పద్మశ్రీ. 2024 లో మార్చి 8 వ తారీకున విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని  పురస్కరించుకొని స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో  పద్మశ్రీ నాన్‌ స్టాప్  గా  116 మంది తెలుగు సినీ నేపధ్య గాయనీమణులు ఆలపించిన గీతాలను ఏకగళంతో ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు విదేశాల్లోను కూడా తెలుగు పాటలను వినిపించి కీర్తి గడించిన ఈమె  భారతవర్ష పాటలను అద్భుతంగా ఆలపించిశ్రోతలను అనేక సార్లు  మంత్రం ముగ్దులను చేశారు.  పద్మశ్రీ  గారు  భారతవర్ష పాటలకు ప్రాణం  పోశారు  ఆమె భారతవర్ష పాటలు  పాడడం నిజం గా నేను చేసుకున్న అదృష్టం అన్నారు భారతవర్ష గ్రంథ రచయిత పూలబాల.


దుర్గమ్మను చూచిన అనుభూతి కలిగించే - కృష్ణశ్రీ  పాట. 

. 

 భారతవర్ష గ్రంథానికి  అందం, కీర్తనలకు కీర్తి  - కృష్ణశ్రీ .  

. 

పిన్న వయసులోనే  దుర్లభమైన  గాత్ర  మాధుర్యాన్ని, కీర్తిని  ప్రతిష్టలను ఆర్జించిన గాయనీ మణి కృష్ణశ్రీ.   ఈ గాయని గురించి రెండు మాటల్లో చెప్పాలంటే  గొంతులో నిండా తీయని రాగాలు,  ఇంట్లో నిండా  బంగారు పతకాలు అదే  మన ఋగ్వేదం కృష్ణశ్రీ.  అక్కతో కలిసి వచ్చి భారతవర్ష లో శాస్త్రీయ గీతాలని పాడి పులకరించే లా చేస  ప్రతిభ ఆమెకు ఉంది.   గొంతు లో రాగాలు , ఇంట్లో పతాకాలు చాలా మందికి ఉంటాయి గుండెల్లో ప్రేమ  లేకపోతె ఒక చిన్న లైక్ కూడా కొట్టలేము.  ఇక్క డ అమ్మాయి చిన్న పిల్ల. నాన్న అనుమతి లేనిదే ఆ అమ్మాయి అగ్గిపెట్టి కూడా అందించదు.    

"పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి ...   ఈ డైలాగు ఎక్కడో విన్నటుంది  కదూ.  ఈ డైలాగుని వేదికపై చెప్పడం  గొప్పకాదు   విని చప్పట్లు  కొట్టేసి తమ పని చూసుకోడం గొప్పకాదు.   నేటికాలంలో అలాంటి వాళ్ళే  ఎక్కువ  ఆ మాటను మనసులో పెట్టుకుని ఆచరణలో పెట్టేవాళ్లు బహు తక్కువ  వాళ్ళే మహానుభావులు,  కర్మ యోగులు.  అటువంటి వారిలో ఒకరు ఋగ్వేదం కిషోర్ గారు.   కృష్ణ శ్రీ  నాన్న గారు.  వేద సంప్రదాయాలను  , సనాతన ధర్మాన్ని డైలాగుల్లో కాకుండా  చేతల్లో చూపించే మనిషి.   "అందుకే భారతవర్ష గ్రంథంలో  శాస్త్రీయ సాహిత్యాన్ని తన చేయి అందినంతవరకు పైకెత్తారు." అన్నారు రచయిత పూలబాల. 

సనాతన ధర్మానికి  సనాతన భాష, సాహిత్యం, సంప్రాయాదాయం చాలాముఖ్యం. అలనాటి పురాతన సంస్కృత కావ్య సంప్రదాయమే  ప్రబంధం.   భారతవర్ష  అనే తెలుగు గ్రంథం  ఈ కోవకుచెందినదే. ఉన్నత బాష  కథా విలువలున్నదే  ప్రబంధం.  భారతీయ సంస్కృతి ఇందులోనే దాగి ఉంది.    

నేటి తరం దారి మళ్లిన  హింస్మాత్మక ఆంగ్ల చిత్రకథల నకళ్లను చూసి దిగజారిపోతున్నాదని  భారతవర్ష ప్రబంధం వ్రాయడమేకాక   ఒక జీవిత ధ్యేయంగా   పెట్టుకుని  దానిని తెలుగు వారికి  చేరడానికి  కృషి చేస్తున్నారు వెంకట్ పూలబాల.   సినిమాతీస్తే మరో శంకరా భరణం లా ఉంటుంది. తెలుగు వారు ఆదరిస్తే అంత  కన్నా బాగుంటుంది.   

 నాటి శాస్త్రీయ సాహిత్యాన్ని   శాస్త్రీయ సంగీతాన్ని ఆదరిస్తారా ?  

ఇంకా అలాటి మనసున్న మహానుభావులున్నారు. 

ఎందరో మహానుభావులు  అందరికి వందనాలు.         

Wednesday, August 7, 2024

Rapes around the world

                               



                         


                                 
                       

Friday, July 26, 2024

The shocking stories of IAS

THE UNPRECENTED STORIES OF IAS 


Jugarat IAS officer Rajitt kumar's wife Surya who 'eloped' with her gangster lover was wanted by the Tamil Nadu Police in an abduction case of a 14-year-old teenage boy in Madurai. It sounds strange but true.  Surya, returned to her husband's residence to evade arrest but her husband Ranjitkumar refused her. Surya committed suicide. Surya is 45-year-old woman  who had allegedly eloped with her gangster boyfriend nine months ago,  died on Saturday in the hospital. 


IAS officer Puja Khedkar, accused of using fraudulent means to clear her civil services exam.  RTI activist from Pune Vijay kumbhar, whose exposed the IAS probationer Dr Puja Khedkar has shaken the Indian administrative system and the government. It has called for a setting up of a Commission headed by a sitting Supreme Court judge to proble into the issue. The nation was startled at the misuse of fraudulent certificates - pertaining to caste, disability, sports, and other special categories— used to gain undue advantages, and gain concessions, ultimately leading to unfairly gaining the job  of power and prestige. 


Her attitude betrayed her to the public and her shocking behaviour and fraud to the media. Her demands have demeaned her position and raised doubts in the mind of the Chief secretary another IAS. She demanded for a special chamber with police gaurd and arranged for herself a blue VIP lamp on her private Audi car. More shocking is her occupying municial land and building a mansion even while she is in probation.  

Tuesday, July 23, 2024

A Similar incident in the life of Poolabala

 బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు. నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని  అనుకున్నారు  కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.. చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు.

'నేనే' అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 'ఎందుకు లాగానో చెప్పనా... కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది' అని ఆ వ్యక్తి చెప్పాడు. నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు. రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరం దూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి.

ఈ ఘటనలో చైన్ లాగిన ఆ వ్యక్తి పేరు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.


                                                 

ఇలాంటి సంఘటనే నా జీవితంలో జరిగింది. ఒక అమెరికన్ తానేదో పండితుడిని అనుకుని భారతీయుల ఇంగ్లిష్ ని చులకన చేసి మాట్లాడాడు. అప్పుడు నేను ఈ పేరా చెప్పి అర్థం చెప్పమని అడిగితే చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అర్థం చెప్పలేకపోయాడు. తరువాత నేనెవరో తెలుసుకుని సారీ చెప్పాడు అది మీరు కూడా చదవండి. 

If you're a true connoisseur or a critic you neither adjudge like a curmudgeon nor contort the the cryptic talent behind a curio you know for sure either to prevaricate or to connive is to disparage the prodigy moreover it isn't felony to commend the métier of a doyen. like a fair gourmet who would appraise the finesse of the culinary you would acquiesce the corollary of your position and conciliate yourself like a conscript and carry out your duty.



Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...