Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, July 23, 2024

A Similar incident in the life of Poolabala

 బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది. అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు. నల్లటి చర్మరంగు కలిగి, సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్లు.. అతడో తెలివితక్కువవాడని, నిరక్షరాస్యుడని  అనుకున్నారు  కానీ, ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు.. చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు.

'నేనే' అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 'ఎందుకు లాగానో చెప్పనా... కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది' అని ఆ వ్యక్తి చెప్పాడు. నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు. రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండూ దూరం దూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి.

ఈ ఘటనలో చైన్ లాగిన ఆ వ్యక్తి పేరు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.


                                                 

ఇలాంటి సంఘటనే నా జీవితంలో జరిగింది. ఒక అమెరికన్ తానేదో పండితుడిని అనుకుని భారతీయుల ఇంగ్లిష్ ని చులకన చేసి మాట్లాడాడు. అప్పుడు నేను ఈ పేరా చెప్పి అర్థం చెప్పమని అడిగితే చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అర్థం చెప్పలేకపోయాడు. తరువాత నేనెవరో తెలుసుకుని సారీ చెప్పాడు అది మీరు కూడా చదవండి. 

If you're a true connoisseur or a critic you neither adjudge like a curmudgeon nor contort the the cryptic talent behind a curio you know for sure either to prevaricate or to connive is to disparage the prodigy moreover it isn't felony to commend the métier of a doyen. like a fair gourmet who would appraise the finesse of the culinary you would acquiesce the corollary of your position and conciliate yourself like a conscript and carry out your duty.



No comments:

Post a Comment