Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, August 22, 2024

భాషే మన జాతికి నెత్తురు - ఫ్రమ్ ది డైరీ ఆఫ్ పూలబాల

మనకి మన సంస్కృతి కి బంధాలు ప్రబంధాలే.


భాష కోల్పోయిన సమాజం తన ఉనికిని కోల్పోతుంది.

ప్రబంధం అంటే సంస్కృతానికి మాత్రమే చెందిన శైలి. అంటే మన ప్రాచీన భారత శైలి (ఇండియన్ స్టైల్) వేదాలని జర్మన్ లోకి అనువదించిన మేక్స్ ముల్లర్ అన్నట్టు మానవులకు తెలిసిన మొదటి గ్రంధం ఋగ్వేదం. అంటే సంస్కృత బాష ఎంత ప్రాచీనమైనదో చెప్పనక్కరలేదు. సంస్కృతాన్ని ఒక పథకం ప్రకారం నాశనం చేశారు. ఒక బాష నశించిపోతే ఆ లోచనా విధానం ఇంకా జీవన విధానం సమూలంగా మారిపోతుంది. సంస్కృతం అడుగంటి పోయిన తర్వాత భారతదేశానికి పట్టిన దుర్గతి గురించి తెలుసు కుంటే హృదయం ద్రవిస్తుంది.

తెలుగు భాషను పూజకు పనికిరాని పువ్వును చేశారు. చదువుకి పనికి రాణి భాషని చేశారు. తరువాత నిత్య జీవితంలో కూడా పనికి రాని భాషగా తెలుగు భాషను చేట పెయ్యిని చేశారు. ( గడ్డి కూరిన చనిపోయిన దూడ పెయ్యి ). హేపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా. ఇలాటి ఇంగ్లీష్ మాటల తో పాటలు. ఇంగ్లీష్ ట్యూన్స్ కి తెలుగు పాటలు రాయడం. చివరకు చికుబుకు చికుబుకు రైలే అంటూ ఇంగ్లీష్ స్వరం తో తెలుగు పాట. తెలుగు మాట బాణీ స్వరం ఏవీ లేవు. దీనికి తోడు ఎకాడ , (ఎక్కడ ) ఏం దుకు ( ఎందుకు ) అంటూ మాటలు. భాష కోల్పోయిన సమాజం తన ఉనికిని కోల్పోతుంది.
.
వినోదం (సినిమా టీవీ) నేటి మన భాష, ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటే మన భాష మన సంస్కృతిని ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే భాష సంస్కృతికి పునాది. ఎందుకంటే నమస్కారం అనే మాట మన తెలుగుజాతి మర్చిపోయి చాలా కాలం అయింది దాంతో పాటుగా సంస్కారాన్ని కూడా మర్చిపోయి పిల్లలు తమ కంటే చాలా పెద్ద వాళ్ళని వృద్ధుల్ని కూడా హాయ్ అని పలకరించడం ఇంటికి వచ్చే అతిథి వెళుతూ ఉంటే బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పమ్మా అంటూ తల్లిదండ్రులే పిల్లల్ని పోరు పెట్టి మరి నేర్పిస్తున్నారు. ఉంటాము, వెళ్లి రండి అనే మాటలు పోయి బాయ్ బాయ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. క్షేమంగా వెళ్లి రండి అనడానికి ఇష్టపడటం లేదు హ్యాపీ జర్నీ అంటున్నారు. ఓరి దేవుడా అంటే నా మోర్దా కాబోలు ఓ మై గాడ్ అంటున్నారు. మన మాట మన సామెత మన తత్వము మన వేషము ఇప్పుడు కనిపించవు మరి ఇవన్నీ ఏమైపోయాయి. ఒగ్గు కథ బుర్రకథ హరికథ నాటకము నవల ఉన్నప్పుడు భాష ఇంత నాసిగా లేదు. భాష చింత చెట్టు లాగా గట్టిగా ఉండేది. ప్రబంధాల కాలంలో అయితే మర్రి చెట్టు లాగా మహావృక్షంగా ఉండేది . ఉన్నత భాష కథా విలువలు కలిగిన సాహిత్యం ప్రబంధం. మర్రిచెట్టు లాంటిది . మనకి వృక్షాలు ఎంత అవసరమో ప్రబంధాలు అంతేఅవసరం.

No comments:

Post a Comment