Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, October 17, 2015

Romantic Love Fantasy - songs by poolabala


1. చందమామ లా  వచ్చావు - చీకటి రాత్రి లో
 ప్రేమ వెన్నెల కురిపించావు  - మత్తెక్కిన కళ్ళతో
 నిలువెల్లా తడిపేసి నను నీతో పెనవేసి  మొత్తంగా  కుదిపేసి
రెక్కలున్నాయని ఎగిరిపోకు  చుక్కలున్నాయని మరిచిపోకు
చందమామ లా  వచ్చావు - చీకటి రాత్రి లో..
 ప్రేమ వెన్నెల కురిపించావు  - మత్తెక్కిన కళ్ళతో.
నేరాలేనని భావించి నేరంకాదని భావించి రెక్కలున్నాయని ఎగిరిపోకు
చుక్కలున్నాయని మరిచిపోకు.....

సల్సా సాంబ డాన్సులతో నను సల సల మరిగించి
నీ తనువుమబ్బుల  పరుపుల పైన నను  మెత్తగ కరిగించి
నీ పరువపు వంపుల గాలం తో  నాహృదయం లాగేసీ
మబ్బులపై  నడిపించి నను అబ్బుర పరిచేసీ  మత్తుల్లో  మున్చేసీ
అందనంత ఎత్తుకు ఎత్తుకుపోయి నీ అక్కున జేరే సమమములో నను  గ్రక్కున వదిలేసీ
రెక్కలున్నాయని ఎగిరిపోకు చుక్కలున్నాయని మరిచిపోకు.....

నేరాలేనని భావించి నేరంకాదని భావించి...
చందమామనే మింగేసి చల్లని వెన్నెల మాయం చేసి
 కోర కోర  చూపుతో  చుర చుర  కాల్చి
చుర కత్తులు విసిరేసి  మన్మధ బాణం వేసేసి
 నెత్తుటి గాయం చేసేసి  నిశీధిలో నను వదిలేసి
రెక్కలున్నాయని ఎగిరిపోకు చుక్కలున్నాయని మరిచిపోకు

చందమామ లా  వచ్చావు - చీకటి రాత్రి లో
 ప్రేమ వెన్నెల కురిపించావు  - మత్తెక్కిన కళ్ళతో
నిలువెల్లా తడిపేసి నను నీతో పెనవేసి  మొత్తం  కుదిపేసి ..

చందమామ లా వస్తాను చీకటి రాత్రి లో
చూపులతో  తడిపేసి నిను మొత్తం కుదిపేసి
చందమామనే మింగేసి నీ హృదయం దోచేసి
నిను పక్షి గా మార్చేసీ నా గూట్లో బంధించి
 పళ్ళే తినిపిస్తా  ప్రేమాటలు ఆడిస్తా..
--------------------------------------------------------------
2.  ఇక్కడేదో దాగుంది ,  నీ కోసం వేచుంది ,  నిన్నేగా చూస్తోంది
దగ్గరగా వస్తోంది అంతలో మాయం అవుతోంది
 అద్దం ముందు నిలుచుంటే అద్దంలోకి  లాగేసి  
ముద్దుల వర్షం కురిపించి నీ  మెడ  కొరికేసి
నిను బయటకి విసిరేస్తుంది  - సెక్సీ సైరన్ సెక్సీ సైరన్

కిటికీ లోంచి చూసింది తోటలో పాట  పాడింది
దగ్గరగా వస్తోంది అంతలో మాయం అవుతోంది
ఇక్కడేదో దాగుంది ,  నీ కోసం వేచుంది ,  నిన్నేగా చూస్తోంది
దగ్గరగా వస్తుంది  అంతలో మాయం అవుతోంది - సెక్సీ సైరన్ సెక్సీ సైరన్

 గోడ మీద నీడ కనిపించి , ఇంట్లో ఏడుపు వినిపించి
 నా గొంతు తడి ఆరింది  గుండె దడ  పెరిగింది
ఇక్కడేదో దాగుంది , నీ కోసం వేచుంది ,  నిన్నేగా చూస్తోంది
దగ్గరగా వస్తుంది  అంతలో మాయం అవుతోంది - సెక్సీ సైరన్ సెక్సీ సైరన్

మేడ  మీద దీపం వెలిగింది అంతలోనే ఆరింది
బాత్రూం లో అర్ధరాత్రి  నీడ జలక్రీడ చేస్తోంది
బయట నుంచి గడియ వేసి  హాల్ లోకి పరిగెడితే
సోఫాలో  కూర్చుంది కనుగీటి నవ్వింది
నగ్నంగా నిలుచుంది అంతలో మాయం అయ్యింది
 - సెక్సీ సైరన్ సెక్సీ సైరన్

  ఈ జనరేషన్  (e- generation) కి నచ్చే పాట

 అ..అ అ ..  ఐ లవ్ మై బాడీ ...హ హ హ
 అ..అ అ ..  ఐ లవ్ మై బాడీ ... హ హ హ
 అ..అ అ ..  ఐ హెట్ ద బుక్స్ హ హ హ

 అ..అ..అ.. ఐ లవ్ హాట్ లుక్స్ హ హ హ
అ..అ అ   ఐ లవ్ టెక్నాలజీ క్లిక్ క్లిక్ క్లిక్ 

అ..అ అ   ఐ యామ్ సో క్రేజీ  క్లిక్ క్లిక్ క్లిక్ 

ఆండ్రాయిడ్ గేమ్స్ నే ఆడుకుంటా.. సెల్ఫీలతో నేను స్నానం చేస్తా
ఫెస్బుక్కు వీధిలో పాడుకుంటా .. సెల్ఫీ లనే నేను లాక్కుంటా

అ..అ అ .. అ ఐ లవ్ మై బాడీ ......హ హ హ
ముందునుంచి పిక్ , వెనకనుంచి పిక్ , టక్ టక్ టక్
టక్ టక్ .టక్ .. డిక్ డిక్ డిక్ ..చిత్తకార్తి కుక్కలన్నీ లుక్ లుక్ లుక్

తక పిక నక తొక .... (ఇంగ్లిష్ ట్యూన్స్ )
come on baby come on baby.
put your body on my body tonight.
rap my body in your legs tonight.

భజగోవిందం ... భజగోవిందం .....( క్లాసికల్ ట్యూన్స్ )
ఆ గోవిందంతటి వాడే .. వీడిముందు ఓడిపోతాడే .. వీడి వొళ్ళంతా వాడే వేడే
(ఇలా దేవుడితో పోలుస్తూ , దేవుడి కంటే గొప్పోడని అర్ధం వచ్చేలా పొగుడుతూ 
పాట సాగుతూ ఉంటుంది ,  హీరో వెకిలిచేష్టలు చేస్తూ ఉంటాడు అది చూసి 
ఈలలు వేస్తూ చొక్కాలు చించుకుంటున్న అభిమానులను చూపిస్తారు) 
(e- generation) ఈ జనరేషన్....ఈ జనరేషన్....ఈ జనరేషన్..



అరవిరిసిన మందారంలా..  

అరవిరిసిన మందారంలా  అదృష్టంలా 
నేలవాలిన ఇంద్రధనసులా నింగికెగసిన నిర్మాణంలా 
కొలను నీటిలో కొర్రమీనులా మెరిసావే  మోనాలిసా
మండుటెండలో చల్లగాలిలా  వేకువలో కోకిల పిలుపులా
 వచ్చేవే  అనాలిసా,  నచ్చావే  మనోబాన్ లీసా  

తేనె  పలుకులతో మురిపించి ప్రేమ అత్తరే పూసావే
కుత్తులలో కత్తులు పెట్టి పోయావే మోనాలిసా
చేతులో పెట్టావే హనుమాన్ చాలీసా

ప్రేమంటే గండాలే అడుగడుగునా గుండాలే
అయినా  నువ్వుండాలే నామనసు నిండాలె
మధూలి కా ప్రిన్సెస్ ఆఫ్ జాస్మిన్

కలలలో కవ్వవించి కలిసినను నవ్వించి
సెక్సఫోన్ వాయించి  ఆశలేపూయించి 
ఛాతీపై పచ్చబొట్టులా  కనురెప్పలపై కలరు
 ప్రింటు లా నిలిచావే మోనాలిసా 
సినిమాలకు వచ్చి పాప్కార్న్ తెచ్చి 
పాప్ లో  పాడావే లిసా లలిసా  
 
అరవిరిసిన మందారంలా  అదృష్టంలా 
నేలవాలిన ఇంద్రధనసులా నింగికెగసిన నిర్మాణంలా 
కొలను నీటిలో కొర్రమీనులా మెరిసావే  మోనాలిసా
మైక్రో వేవ్ లా మనసు నే కాల్చావే  అనాలిసా 
కళ్ళల్లో గుళ్ళేసి  గుండెల్లో పేల్చావే మనోబాన్ లీసా 






Sunday, October 4, 2015

Poor fellows




Pullarao, Jogarao, Ramarao are friends. They studied together, lived in the same neighborhood for long time in a small village until they got jobs in Hyderabad.  Their parents are also good friends. The three friends lived in  a congested room in Ameerpeta. Life was clumsy and mechanical in Hyderabad.  If they stay in a good flat or house they will not have anything left to spend on clothes scents, glasses and the like.  Though Pullarao did not like the congested room, he continued in the same room for his friends.  It was a hand to mouth difficult life for Ramarao and Jogarao because they are spend thrifts.  Suddenly when a third person came to stay with them and room became more congested.  They used to call their parents and speak with them occassionly. Pullarao told the parents the facts when they asked about his job and life. Jogarao, Ramarao used to glowrify the city life. When they fifth person came into the same room, Pullarao left the room

Pullarao always told the same thing to his parents when they asked him about life and job. Pullarao always looked quite normal  when they met in their small town.  Jogarao and Ramarao looked like metro sexuals with imported clothes, perfumes and glasses. "Pullarao you are simply a scarecrow before them" said the President. The entire neighborhood looked down upon Pullarao for his appearance. They even laughed at his traditional clothing. 

 It was Dasara vacation they three friends were back in village. they enjoyed together nearly a week before they went back to the city. on a fine evening the three friends met in the paddy fields in the outskirts. "How soon the vacation is over! exclaimed Ramarao " Are you preparing the baggage?" said Jogarao.  Pulla rao said , " I am not going back to the city" Ramarao laughed, " would you like to stayback in this small town and undertake cultivation?" Jogarao said, " people will also laugh at us if you do that" 

Pullarao coolly said " I will never make you ashamed of me, don't worry. I got a job in Bangaluru." that came like a shock to Ramarao and Jogarao.  when pullarao left Ramarao and jogarao had a brainstorming session in local bar.   They decided  to go to the USA but they hardly know that their academic performance can not fetch them a job. The consultant had arranged H1 B visa for them.

Exactly a year after Dasara Ramarao and Jogarao returned to their home town but Pullarao did not come. There is no news from him either. Everybody thought that Pullarao was doing badly. The two friends gave a big show of their American life style and culture. They bought Hundai city car. Using  a motorcycle is not longer vogue and does not suit their status any more.  They even changed their names. Ramarao is no longer Ramarao he is RAMS, Jogarao is no longer jogarao but JAGS. 

They made such a big noise in the entire neighborhood experienced a deafening silence after the ultra fashioned youths left for America.  The next year only Pullarao came to the village but he was jovial.  The grimace on his face is the index of some mystery. Something has happened everybody thought.  Everybody guessed that he has lost his job. Only his father knows the truth to whom Pullarao revealed after much persuasion. The truth is "Rams and Jags were arrested for a fraud in America" " Don't tell anybody" said Pullarao's father. Pullarao left for singapore. Later on he went to work in Germany for three years  and a year in Srilanka also but neither he nor his father has publicized all that.


Eight years later when Pullarao was back in his hometown fortunately he could meet his friends.   Rams and Jags were drinking at the river. They saw Pullarao who appeared in normal clothes. They sighed and said "Poor Pullarao"  You have to change yourself Pullarao, look at us, they said. " Okay, please give me some time. I will go to Amerika, involve in fraud,  go to jail lose job, come back and settle in Bangalore and lie to parents that I still work in America." said pullarao. 

Rams and Jags were speechless and dazed.  Their parents are busy looking for girls for marriage. Pullarao's father a farmer is also looking for a girl for his son. But no girl liked  Pullarao. He and his farmer father looked banal.  Rams and Jags have many American attractions, Day were passing. One day the three friends were walking on the road. The washerwoman exclaimed "DORABABULU" The look alone is enough thought the passers by. 

Rams and Jags got married with a huge dowry but Pullarao remained as a bachlor. Rams and Jags left for US  saying that they will take their wives soon.  Pullarao the scare crow is in his hometown with his money. He undertook developmental work in his village in a small way. He wants to start a small industry. He often walks on the street with traditional clothing( panchakatttu) the villagers still laugh at him. they don't know that they are laughing at their own tradition. they still judge people by looks like the washer woman but pullarao smile at them. 

Saturday, September 12, 2015

IELTS - Vijayawada

I do voluntary work in my free time. I search for free time. I believe such voluntary work brings relations. I do such voluntary work for relations. I  taught in this institution for relations not for money. Service brings friends. I still believe and carry out but it is a big mistake to think that all whom you serve become friends. After meeting hundreds of people you can get a friend who really likes reading. 

Association is Temporary Relation is Permanent

The picture shows students of IELTS. I went here to teaching them with a hope to discover good teacher student relations.  Teaching is  learning. Teaching is not a profession but duty. Profession is a paid responsibility but duty is a moral responsibility. Mother gives birth but teacher gives life. Life demands knowledge. Teaching is not so simple as it looks. A teacher should first motivate the students to work honestly and be open to new knowledge. The teacher should relate to the students honestly lest the student should not maintain relation with the teacher. Without student teacher relation learning doesn't happen. 

Knowledge is the best gift and it is the inexhaustible treasure. The knowledge given by the teacher will be useful not only to you but to people around you provided you have the right attitude. I love what  Vivekananda said " As long I teach so long do I learn." I want to  say "  As long as I teach so long do I love the students. 

Tuesday, September 8, 2015

German Language in Vijayawada


The Hindu reporter and cameraman came to me at 1.00 p.m. today for an interview and interaction with my students. The reporter asked me several questions beginning with why the foreign language learners are on the rise. The interview covered many aspects such as education in Germany, opportunities in India. My German students Mr. Aravind, Mr. Uday, Dr. Ravi kishore, Dr. Jwala and Miss. Deepthi participated in the interview. 

They have answered many questions and explained why they prefer German language, why they chose EFL Vijayawada. Dr.Ravi said that he considers EFL Vijayawada for practical fast track training. Answering a question posed by The Hindu Mr. Aravind said that the learning was more advanced and he could learn faster and better than he hoped. The interview lasted for half an hour. The photographer took several photos




der Reporter aus der Hindu und der Fotograf kam zu mir um 1.00 heute für ein Interview und Interaktion mit meinen Schülern. Der Reporter fragte mich einige Fragen angefangen mit, warum die Fremdsprachenlerner sind im Aufwind. Das Interview behandelte viele Aspekte wie Bildung in Deutschland, Beschäftigungsmöglichkeiten in Indien. Meine deutschen Studenten Herr. Aravind, Herr. Uday, Dr. Ravi Kishore, Dr. Jwala und Fraulein. Deepthi haben in diesem Interview teil genommen
Sie haben viele Fragen beantwortet und erklärte, warum sie vorziehen Deutsch, warum sie EFL Vijayawada wählte. Dr.Ravi sagte, dass EFL Vijayawada gilt als die beste. für die praktische Fast-Track-Training. Auf eine Frage von The Hindu Herr. Aravind, sagte, dass das Lernen ist weiter fortgeschritten und er hat gelernt schneller und besser als er gehofft hat. Das Interview dauerte eine halbe Stunde. Der Fotograf machte mehrere Fotos.

Friday, July 10, 2015

జర్మన్ కథ - పునర్జన్మ - German Story

పక్షులలో ఇది ఎక్కువ కాలం  జీవించే పక్షి గెద్ద. ఒక గెద్ద  యొక్క జీవిత కాలం 70 సంవత్సరాలు.  40 సంవత్సరాల తరువాత గెద్ద ముసలిది   అవుతుంది. దాని ముక్కు మాంసాన్ని చీల్చడానికి  తగిన వాడిని  కోల్పోతుంది .  గెద్ద గోర్లు చాలా పొడవుగా పెరుగుతాయి మరియు దేనినీ గట్టిగా పట్టుకోలేవు. ఈకలు చాలా మందంగా మరియు భారీగా పెరుగుతాయి కాబట్టి ఎగరడం కష్టం అయిపోతుంది . గెడ్డ ఈ సమస్య నుండి బయటపడటానికి రెండు మార్గాలు ఉన్నాయి.  ఒకటవ మార్గం, గెద్ద  మారకుండా అలాగే ఉండటం అది వేటాడకుండా ఉండడం అంటే ఆహారం లేకుండా ఉండిపోడం. అలా ఐతే అది చనిపోతుంది.   ఇంక రెండవ మార్గం  తనను తాను మార్చుకోవడం .  గెద్ద రెండవదాన్ని ఎన్నుకుంటుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ. అది పర్వతం పైన కూర్చుని దాని ముక్కును పీకేస్తుంది . కొత్త పదునైన ముక్కు కోసం ఈగిల్ వేచి ఉంటుంది.  బలమైన ముక్కును పొందిన తరువాత ఈగిల్  అతిగా పెరిగిన గోర్లు బయటకు లాగేస్తుంది . తర్వాత  అది అవాంఛిత ఈకలను లాగుతుంది. ఈ ప్రక్రియ 150 రోజులు పడుతుంది. కష్టపడి సాధించిన పునర్జన్మతో ఈగిల్ మరో 30 సంవత్సరాలు సంతోషంగా జీవిస్తుంది.
Wiedergeburt des Adlers

Lebensdauer eines Adlers ist 70 Jahre. Dies ist die längste Lebensdauer bei Vögeln. nach 40 Jahren Adler wird alt. Sein Schnabel wird ungeeignet für Reißen Fleisch. die Nägel wachsen zu lang und kann nicht alles fest zu fangen. die Federn wachsen zu dick und schwer werden  damit sie nicht fliegen können. Der Adler ist nur zwei Wege aus dem Problem. er kann ohne Nahrung sterben oder er kann sich ändern. der Adler wählt den zweiten Weg. es ist ein langer Prozess. Er liegt an der Spitze des Berges, und ziehen Sie den Schnabel. der Adler wartet auf den neuen scharfen Schnabel. nach Erhalt der starken Schnabel der Adler zieht die überwucherten Nägel. dann zieht es die unerwünschten Federn. dieser Prozess dauert 150 Tage. mit der Wiedergeburt aus harter Arbeit,  der Adler lebt glücklich für weitere 30 Jahre.


An eagle's life span is 70 years. this is the longest lifespan in birds. After 40 years eagle becomes old. its beak becomes unfit for tearing flesh. the nails grow too long and can not catch anything firmly. the feathers grow too thick and heavy therefore it can not fly. the eagle has just wo ways out of the problem. it can die without food or it can change itself. the eagle chooses the second. it is a long process. it sits on the top of the mountain and pull out its beak. the eagle waits for the new sharp beak. After getting the strong beak the eagle pulls out the overgrown nails. then it pulls the unwanted feathers. this process takes 150 days. with the rebirth it achieved from the hard work the eagle lives happily for another 30 years. 

Tuesday, July 7, 2015

Paris to Vijayawada

 ఫ్రెంచ్ కల్చర్,  విద్య సామాజిక పరిస్తితులగురించి తెలుసుకోవాలనే తపన నాకు ఎప్పటినుంచో ఉంది. అందుకే ఫ్రెంచ్ నేర్చుకున్నాను. చదివి తెసులుకున్నా దాని కంటే, ఫ్రాన్స్ వెళ్ళిన వాళ్ళ ని అడిగి తెలుసుకోడం మంచిది. అంతకంటే అక్కడ ఉంది చదువు కుంటున్న వాళ్ళనుంచి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది.  అనేక మంది ఫ్రాన్స్ లో ఉన్న విద్యార్ధులకు ఫ్రెంచ్ నెర్పాను. వాళ్ళలో ఏ ఒక్కరూ వాళ్ళ పరిస్తితులగురించి గానీ, ఫ్రాన్స్ గురించి గాని రాయలేదు ( అనేక సార్లు  అడిగినా కూడా)  శేషసాయి ప్రనీత్ అందరికంటే భిన్నం. అందుకే పారిస్ నుంచి ప్రణీత్ రాసిన ఈ లేఖ ని పోస్ట్ చేస్తున్నాను. ఎవరో చదివి తెలుసుకుంటారని కాదు. నాకు ప్రతి ఫ్రెంచ్ విద్యార్ధి ఒక పాఠశాల. ఒక తీపి గుర్తు.   
Education in France:

 The people here firstly concentrate on their language. They give a higher importance for it. The colleges try to give practical knowledge by exploring them in industrial training. For example if you consider my college, here students study for 5 years to obtain both bachelors and masters. And at every stage they are involved with an internship. For 1st year it is up to 45 days, 2nd year 2 months, 4th year 4 months and final year 6 months. By doing all these,they get a lot of practical explorer which make companies easy to hire them. This point can be seen only at IIT’s in India.

Coming to children’s education, it is much more with activities, and they taught in French which makes them comfortable to learn. Every village or town is having a library which is free for students, and even parents encourage children to take them to library. Even this can have in India when the children have time to do it, if you consider now there are a few schools which are having libraries and makes the children to learn. The effect of cooperate schools make the children not to learn ethics or moral values, they are just mugging up the subject which makes a child life horrible. At the end of the day he wants patience, how to tackle with different problems in life and how to behave in society.

Culture in France:
            
 The people wish one another with a great smile ‘bonjour, salut’, which is very often in India. I mean with an unknown person. Let me give an example to be more clear ‘I am going out for jogging, I am jogging in the ground where there are some other persons sitting or doing their own work. They saw me and they just greet ‘bonjour or bonne journee’ something like this’. And these try to help you when you are in need. On the first day of my arrival I am just confused after getting down of the tram at 2 A.M in the morning and how to reach the university. As I don’t have any map or taxis that can drop me there. At last I left myself to god and asked for a lift, a man stopped the car and even he knows little English which makes difficult to communicate. He knows the address he offered me to get into the car and I am tensed whether to take it or not. But I made myself strong and get into the car. At most one hour he is searching for the hostel, in the morning I just noticed that it is 400 metres walk. But during night he is unable to find the route into hostel and there is no security guard at that time so he refused me to leave me allow and later he had taken me to a nearby hotel but they are filled, so he is keep on moving searching. I asked him please drop in university I can manage, then he dropped me there and gave his number to contact him in the morning. After few minutes the security guard came and gave me the room so I got the room at 3:10 AM. This example shows how kind they are. Even in India we can see these.

The only difference between India and France is development, as it is a developed country the facilities are high and the opportunities are high. We make (Indians) our life complicated by lots of tensions. As we have to give dowry for our children and everything is more the middle class men salary and parents earn a lot to the next coming generations. Here the government takes taxes while working and once u are out of job, you will be getting pension so that he can live comfortable. As these grew up as an individual from the childhood they don’t bother about their family which is strange for us.


Saturday, May 16, 2015

అయ్యో ! గొల్లపూడి మారుతీరావు

గొల్లపూడి మారుతీ రావు గారు విశేష ప్రతిభా వంతులు. ఆయన ప్రతిభ కు అనే క వర్ణాలు. ఒక నటుడు, నటుడుని మించిన రచయిత, రేడియో కళాకారుడు,  కవి ఆ కవిని మించిన మాతృభాషా ప్రేమికుడు. కానీ ఇవేవీ అతనిలో దేశభక్తి కి సాటి రావు. నటుడు, రచయిత, కవి వగైరా అతనికి దుస్తులు ఆభరణాలు అయితే దేశభక్తి అతనికి కిరీటం లాంటిది. ఆ కిరీట ప్రభావం వల్ల ఆయన నాకు ఎప్పుడూ ఆకాశం అంత ఎత్తు కనిపిస్తూ ఉంటారు.  అయితే ఆకాశం అంత ఎత్తు ఎదిగిన అనేక బచ్చికానీ మంద తో ఆకాసంలో కూడా  ట్రాఫిక్ ఎక్కువయిపోయింది. ఆ  ట్రాఫిక్ లో సినిమా వాళ్ళు,  కట్టుడు పని తో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకుని ఎదిగిపోయిన అనేకులు ఉన్నారు. 

 గొల్లపూడి మారుతీ రావు గారికి ఇతరులకి తేడా ఏంటంటే ఎంత  ఎత్తుకెదిగినా దేశ పటాన్ని, దేశ పథాన్ని నెత్తి మీద పెట్టుకుని దేశానికి  ఒదిగి ఎదగడం.  దేవుడినే కమెడియన్ గా చేసుకునే నేటితరం హీరోలు దేశాన్ని కాలితో తొక్కి పైకి ఎదిగే, వీధి కుక్కల్లాంటి హీరోలు , కులం, కుటుంబం అంటే కర్రల సాయంతో నడిచే అవిటివాల్లు. దేవుడు, మతం దేశం ఇవేవీ కనిపించవు వాళ్లకి, ఎందుకంటే వాళ్లకి ఇవేవీ  వీళ్ళకు  శిరో దార్యం కాదు, ఇవన్నీ వాళ్ళ  బూటు కింద ఉంటాయి. వీళ్ళకంటే  నీచులైన రాజకీయ నాయకులు ఉన్నంత  కాలమూ   కారు తో మట్టి చంపి , కేసులన్నీ  మాపి మన్ను చేసుకోగలవు   అనేక నేరాలు చేసి కోర్టులకి దొరక్కుండా గొప్పవాడిగా చలామణి అవ్వగలరు . ఇది తెలియక కాదు కానీ మారుతీరావు గారు, మాత్రు భాషని వంటి పట్టించుకుని  దేశ భక్తిని తలకి ఎక్కించుకుని బాధపడుతుంటారు . ఇలా

ప్రపంచంలో అన్ని దేశాల జాతీయ గీతాలలోనూ భారత దేశపు జాతీయ గీతం గొప్పగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి సంస్థ (యునెస్కో) ప్రకటించింది. ఇది గర్వకారణం. అయితే మన మాతృవందనం 'వందేమాతరం' కానీ, జాతీయగీతం 'జనగణమన' కానీ దేశం కోసం రాసినవి కావు. అదే విచిత్రం. వందేమాతరం బంకించంద్ర చటర్జీ రాసిన 'ఆనందమఠ్' నవలలో బ్రహ్మచారుల మఠం ప్రార్థ్ధన గీతం.

ఇక - జనగణమన. 1911లో మన దేశంలో జరిగిన 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా రవీంద్రుడు మదనపల్లి థియోసాఫికల్ వసతి గృహంలో కూర్చుని రాసిన గీతం - చక్రవర్తికి నివాళులర్పిస్తూ. మొన్న 2011లో కొన్ని వందల మంది మదనపల్లిలో ఈ గీతాన్ని శతజయంతి సందర్భంగా పాడారు. గీతం 'అధినాయకుని' ఉద్దేశించి రాసినది. మనది మాతృదేశం. నిజానికి 'అధినాయకి' అని ఉండాలి కదా? మిగతా చరణాలలో ఒకచోట 'తవ సింహాసన పాషే' అంటారు కవి - ఆయన సింహాసనాన్ని అధిష్టించే సందర్భం కనుక. 'జయ జయ రాజేశ్వర' అంటారు మరొకచోట.

చిన్నప్పుడు మన నోళ్లలో కదిలే మరో గొప్ప గీతం: 'నమో హిందు మాతా - సుజాతా - నమో జగన్మాతా! విపుల హిమాద్రులె వేణీ భరముగ, గంగా యమునలె కంఠహారముగ, ఘన గోదావరి కటి సూత్రమ్ముగ, కనులకు పండువు ఘటించు మాతా - నమో హిందు మాతా'. రచయిత గరిమెళ్ల సత్యనారాయణ. ఆయన పేరు చాలా మందికి వెంటనే గుర్తురాకపోవచ్చు- 'మాకొద్దీ తెల్లదొరతనమూ' రాసిన కవి. 'అయ్యో - ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా!“ ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా! అంటారు ఆయన అమాయకంగా లేదు ?

అయ్యో సార్ , గొల్లపూడి గారూ అక్కడే ఉండిపోయారా! ప్రజలు అంతా డవలప్ అయిపోయారు సార్, జీన్స్ వేసుకుని, మొబైల్స్ పట్టుకుని హీరోల్లా ఎక్ష్చెంజ్  మేళాలో  నల్లోడి రక్తం ఇచ్చి  తెల్లోడి ఉచ్చ తెచ్చుకునేలా ఉన్నారు.  ఐమేక్స్ సినిమాలో  నీచుల పాదధూళి కోసం డబ్బులు పట్టుకుని క్యూ లలో నిలబడుతున్నారు , తన మతాన్ని , ధర్మాన్ని కాల రాసే , విలువలకి వలువలోలిచి  నీచుల్ని చూసి తరిద్దామని గంగివేర్రులు ఎత్తుతున్నారు. 

Tuesday, May 5, 2015

మర్యాదస్తుడు - చిన్న కథ - పూలబాల


 గోపాలం: అక్క అక్కా  తలుపు కొడుతూ 
కమల : ఆ వచ్చా వచ్చా .. ఎరా తమ్ముడూ నువ్వా ! ఎలాఉన్నావు (తలుపు తీస్తూ) 
 గోపాలం:  బాగున్నాను కమలక్కా 
అత్తయ్య: బాబూ  గోపాలం బాగున్నావా  ఇదేనా రావడం ఏలూరు నుంచి రా .. రా 
 గోపాలం: ఇదే రావడం అత్తయ్యగారూ  ఇప్పుడే  బస్సుకొచ్చాను ఎండలు మండిపోతున్నాయి   
కమల : రా రా లోపలకి రా  తమ్ముడు ఇలా సోఫాలో కూర్చో  ఇదిగో మంచినీళ్లు తాగు . 
మంచినీళ్లు ఇస్తుంది కమల  
కొత్తిల్లు ఎలా ఉంది అక్క నీరు గాలి బాగున్నాయా ?
అన్నీ బాగున్నాయిరా 
 గోపాలం:  బావగారు లేరా ?
కమల :  ఉన్నారు పడుకున్నారు ఆదివారం మధ్యాహ్నం కదా లేపుతాను ఉండు . 
 గోపాలం: వద్దక్కా పడుకొనే తొందరేంలేదు 
కమల : సరే టీ  పెడ తానుండు 
ఏవోయ్ గోపాలం  ఎప్పుడు రావడం 
ఇప్పుడే వచ్చాను బావా  ఏంటి పడుకోలేదా  ?
కాస్సేపు పడుకునే లేచాను లేవోయ్ 
కొత్తిల్లు కొత్త కాలనీ ఎలా ఉంది బావ జీవితం?
చాలా చిరాగా ఉంది . ఇల్లు బాగోలేదా నీరు గాలి అన్ని బాగున్నాయి అని చెప్పేదే అక్క  
అన్నే ఉన్న అల్లుడినోట్లో శని ఉన్నట్టు   నీరు గాలి బాగున్నా ప్రశాంతతే లేదు ?
ఏం  అక్కా గొడవలాడుకుంటున్నారా?
ఛీ ఆప్రశాంతత కాదోయ్ 
వీధిలో కుఱ్ఱవాళ్ల ప్రవర్తన బాగోలేదు  అదిగో వింటున్నావు కదా ఎంత పెద్ద హార్న్ కొడుతున్నాడో  వీధి అంత  ఖాళీ గా ఉంది కదా అంత  హారన్  ఎందుకు చెప్పు?
   ఓహ్ దానిగురించా వదిలేయ్ బావా 
ఎలా వదిలేస్తాం చెప్పు ప్రశాంతతని ఉదయాన్నే మన కాంపౌండ్ వాల్ బయట నిలబడి పూలు కోస్తున్నా పక్కనుంచే ఎవడో పెద్ద హార్న్ కొట్టుకుంటూ వెళుతున్నాడు. ఇంకా తెల్లవారలేదు , అంత పెద్ద హార్న్ కొట్టుకుంటూ ఎందుకు వెళుతున్నావని అడిగితే, ఎకసెక్కంగా మాట్లాడుతున్నాడు. 

పెద్దదాన్ని నేను చెపితే కూడా ముసలిదానివి నీకేంటి సమాధానం చెప్పేది అంటున్నారు.  
ఈ  కుర్రాళ్ళకి పెద్ద్డలంటే బొత్తిగా మర్యాదలేకుండాపోయింది. 
సమాజం అన్న గౌరం లేదు. వాళ్ళ  ఫేషన్లు వాళ్ళ షోకులు సినిమాలే తప్ప ఎవ్వరినీ పట్టించుకునే స్థితిలో లేరు 

ఏంటయ్యా జనార్ధన్, ధనాధన్ మనిపించక పోయావా ? కుర్రాళ్ళు అంటావేంటి, నువ్వేదో ముసలోడిలాగా! అన్నాడు 
ధనాధన్ మనిపించడమా, అంటే ? నేను కామ్ గోయింగ్. తెలుసు కదా. 

నువ్వు  కామ్ గోయింగ్, జన్ట్లమన్ అయితే లాభం లేదు. రఫ్ గా ఉండాలి రౌడీలా ఉండాలి 
నేనుమర్యాదస్తుడిని  మర్యాదస్తుడిలా  ఉంటాను 

అబ్బ బావా నీతో వచ్చిన చిక్కే ఇది , ఈ రోజుల్లో  కామ్ గోయింగ్, జన్ట్లమన్ అయితే మర్యాద ఇవ్వరు. మొన్న  దీపావళి నాడు నీ ఇంటి ముందు.... నీ మీదే ఔ ట్లు పేల్చేశారు   అదే పక్కింట్లో శ్రీదేవి మొగుడు ఉన్నాడు, 
ఎవరు ఆ మటన్ కొట్టు అతనా ? అన్నాడు 
 అతనే, అతడి తో ఎవరైనా పరాచికాలు ఆడగలరా ?


వాడు ఉత్త రౌడీ . వాడి తో మాట్లాడడానికే అందరూ భయపడతారు.
వాడి ముందు అందరూ తిన్నగా మాట్లాడతారు కదా! 
అంటే నేను రౌడీ లా ఉండాలా? రౌడి లా ఉండాలా? అప్పుడు ఇస్తారా మర్యాద? 
కొద్దిరోజులు నీ గెటప్ మర్చి చూడు నీకే తెలుస్తుంది .
ఒరేయ్ పిచ్చి మాటలూ నువ్వు . ఆయన అలాటి పనులు ఏవీ చెయలెరు  
అలాటి పనులు అంటే ? అన్నాడు 
 నీ సలహాకి ఒక నమస్కారం. 
 కంగారు పడకు బావా నువ్వు అలాంటివి ఏమే చేయక్కరలేదు. జస్ట్ , నటిస్తే చాలు. 
ఒరేయ్ చుట్టుపక్కల పరువుగా ఉన్నాం. మాపరువు తీయకురా . 

అక్కా , ఈరోజుల్లో పరువు పరువు అని ప్రాకులాడేవాళ్ళకి  మర్యాద ఇవ్వరయ్యా ఎంత మంది 
రౌడీలకు మర్యాద ఇవ్వటం లేదా మనం. 
నువ్వు వంద చెప్పు వెయ్యి చెప్పు  నేను ఇందుకు ఒప్పుకోను 
సరే అక్కా. (అని అప్పటికి వదిలేసాడు ధనుంజయ్.)
భోజనాలకి లేవండి 

                                                                          ***



కీ మంటూ హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు 
ఖాళీ రోడ్డు మీద ఊరకనే హారన్  ఎందుకయ్యా
పక్కనే వచ్చి నిలిచింది ఒక బండి పక్కింటి అబ్బాయిని బైటకు రమ్మని హారం కొడుతున్నాడు . 
ఏవయ్య అలా చాలాసేపు హర కొట్టకపోతే వెళ్లి పిలవచ్చుకదా 
ఆడే వస్తాడు ఇప్పుడు బండి దిగి నేను లోపాలకి వెళ్ళాలా ?
అబ్బా చెపులు  నొప్పెడుతున్నాయయ్యా ?

పక్కింటి అబ్బాయి  ఒర్ వస్తున్నాను ఉండరా అని అరిచాడు 
కాస్సేపట్లో ఆ అబ్బాయి బైటి కి  వచ్చాడు  ఇద్దరూ బండి పై  వెళ్లిపోయారు.

అమ్మయ్య పోయారు ప్రశాంతంగా ఉంది . 

సార్ ఈ అడ్రస్ ఎక్కడో చెపుతారా ? 
అడ్రస్ అడిగే తప్పుడు కూడా సిగరెట్  ఎందుకు ? సిగరెట్ ఆపవయ్యా ?
 ఈ డ్రస్ ఎక్కడో చూడండిసార్ 
రెండిళ్ళు దాటాక కుడిచేతివైపు సందులో ఉంటుంది 
ఛీ ఒక మర్యాదలేదు సిగరెట్ నామీదే ఊదుతున్నాడు  


                                                                  ****

బావా నువ్వు కాలేజీలో నాటకాలు వేసేవాడివి కదా ? ఇప్పుడు పూర్తిగా వదిలేసావా నాటకాలు. 
  
ఆసక్తి పోయిందా?

ఆసక్తి బోలెడుంది అవకాశాలే లేవు. 

మంచి షార్ట్ ఫిలిం తీస్తున్నాము చేస్తావా? 

అన్నాడు. తప్పకుండా? ఏంటి కధ? నా పాత్ర ఏంటి ? నీ పాత్రే , అంటే మద్య తరగతి జంటిల్మన్ రోల్. వెరీ గుడ్ , అన్నాడు జనార్ధన్. కాకపొతే షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. మరి నా ఆఫీసు, ఆదివారాలు , ఇతర సెలవ దినాలు..

ఓ సరే . అన్నాడు జనార్ధన్. కాకపొతే  నీది   కాస్త  విప్లవాత్మక  పాత్ర. అంటే , అన్నాడు జనార్ధన్. అన్యాయాన్ని ఎదిరించే పాత్ర. ఓ అది నాకిష్టమే గా.. అన్నాడు సరే బావా స్క్రిప్ట్ ఇస్తాను షూటింగ్ రెండురోజుల్లో. అన్నాడు ధనుంజయ్. సాయంకాలం 5 అయ్యింది జనార్ధన్ కి సీన్ వివరిస్తున్నాడు ధనుంజయ్. షూటింగ్ మన ఇంటి ముందే. రౌడీ కి బుడ్డి చెప్పే పాత్ర నీది , నువ్వు కూడా తాగుతావు.  అదిగో అతడే రౌడీ మొన్న నువ్వు కలిసిన వ్యక్తే..సరే  కేమెర ఏది? అన్నాడు. అబ్బా అదంతా నేను చూసుకుంటాను లేవయ్యా. తను వచ్చేస్తునాడు , ఉమ్, రంగంలోకి దిగు.

అటుగా వస్తున్న రౌడీ తో గొడవ పెట్టుకున్నాడు. "నేను తాగి ఉన్నాను తెలుసా?" అన్నాడు రౌడీ. "అలాగా? ఇదిగోరా  రోజూ ఈ బ్యాగ్ పట్టుకుని ఆఫీస్ కి ఎందుకు వెళుతున్నాను. ఇందులో లంచ్ ఉంటుందని అందరూ అనుకుంటారు కనీ.."  అంటూ బ్యాగ్ లోంచి బాటిల్ తీసి గడగడ తాగేసి సీసా పక్కన పడేసాడు. "ఒరేయ్ నీ ... " తిట్టాడు రౌడీ. అంతకన్నా దారుణం గా తిట్టాడు జనార్ధన్. చుట్టుపక్కలవాళ్ళు అంతా మేడలెక్కి ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిట్టు కుంటూ పెద్దగా  అరచుకుంటూ గొడవ గొడవ చేస్తున్నారు. జనార్ధన్ అద్బుతంగా నటిస్తున్నాడు. పచ్చి తాగుబోతు మేక వన్నె పులి అనే భావన అందరిలో కలిగింది. రౌడీ చాకు తీసాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తాగి పారేసిన బాటిల్ తీసాడు జనార్ధన్. సీసాని గోడకేసి కొట్టి " ఒరేయ్ నీ ... ఒక వినలేని తిట్టు తిట్టి పగిలిన సీసాతో రౌడీ పై దాడి చేసాడు. రౌడీని ఒక్క పోటు పొడిచాడు. చట్టు పక్కల వాళ్ళు అంటా హడిలిపోయారు. కొంతమంది ఇళ్ళలోకి పోయి తలుపులేసుకున్నారు.  రౌడీ కి రక్తం కారుతున్నాది. పొట్ట లోకి దిగిపోయింది సీస పెంకు. కొంత మంది రౌడీ కి సాయం చేయడానికి ముందుకొచ్చారు. రౌడీ వాళ్ళని గుర్రుగా చూసి,  హేండ్ టూ హేండ్   ఎవాడైనా సరే , అంటూ పిచ్చి పిచ్చి గా అరుస్తుడడంతో వాళ్ళుకూడా వెళ్ళిపోయారు. కాస్సేపట్లో ఎవరో వచ్చి రౌడీని మోసుకుని తీసుకు పోయారు. వీధి వీదంతా ఆశ్చర్యం తో ఉండి పోయింది.

మరుసటి రోజు పోలీసులు జనార్ధన్ ఇంటికి వచ్చారు. జీప్ ఎక్క నని జనార్ధన్ గొడవ చేసాడు. మా బావకు  కార్ ఉంది కారు లో వస్తాడు అని ధనుంజయ్ కూడా వాదించాడు. మళ్ళీ  ఇంకో సీన్ .. వీదంతటికీ .

మరుసటి రోజు లాయర్ వచ్చాడు. జనార్ధన్  వీధిలో నిలబడి పెద్దగా లాయర్ తో మాట్లాడు తున్నాడు, ధనుంజయ్ కెమెరా పట్టుకుని షూట్ చేస్తున్నాడు. అది ఎందుకో  ఆ వీధిలో వాళ్లకి ఏమి అర్ధం కాలేదు. ఎవరికీ తోచినట్టు వాళ్ళు ఊహించుకున్నారు. నాలుగు రోజులు గడవగానే కొంతమంది కార్మికులు ప్లకార్డ్స్ పట్టుకుని జనార్ధన్  డౌన్ డౌన్ అని అరవటం ప్రారంభించేరు. చుట్టూ పక్కలవాళ్ళు వాళ్ళని చుట్టూ ముట్టేరు. జనార్ధన్ మాత్రమూ వాళ్ళని చూసి లోపాలకి వెళ్లి పోయాడు.  ఒక బట్ట తల మనిషి మరొక పెద్దావిడతో అంటున్నాడు " పచ్చి రౌడీ లా తయారయాడు , రోజూ గొడవలే అన్నాడు. మనకెందుకులే బాబు అనవసరమైన గొడవలు, వెనకాతల వాళ్ళావిడ ఉంది , విందంటే గొడవలు. మళ్ళీ దీపావళి వచ్చింది, జనార్ధన్ ఇంటి ముందు ఎవరూ ఔట్లు పెల్చలేదు. రోజూ బైక్ మీద గట్టి గా హార్న్ కొట్టే అబ్బాయి రూటే మార్చేశాడు.  

Sunday, March 15, 2015

పరోల్ మీద పెళ్లి



మేడ మీద ఉంది వెళ్లమ్మా అంది, వేసంగిని చూసిన రామలక్ష్మి. రాస్తున్న కాగితాలలోంచి ఒక్క క్షణం తల ఎత్తి. ఒక చిరునవ్వు గ్రీటింగ్ విసిరి, రెండే రెండు ముక్కలు " మెడ మీద ఉంది వెళ్లమ్మా" అని మళ్ళీ ఉస్త్ర పక్షి లా కాగితాల్లో తల దూర్చింది. మెడ మీద కుర్చీలో కూర్చుని కవితలు చదువుతోంది సివంగి."ఏంటి కలల్లో విహరిస్తున్నావా? " అంది వేసంగి. కాదు కవితల్లో విహరిస్తున్నాను, కాదు ..కాదు విరహిస్తున్నాను.  

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అంటే? మీ నాన్న కవి, మీ అమ్మ రచయిత్రి, నువ్వు అదే బాటలో నడుస్తున్నావు కదా." “ఇంతకీ మీ నాన్న ఇంట్లో లేనట్టున్నాడు.” “నాన్నకవి సమ్మేళనానికి వెళ్ళాడు.” కిసుక్కున నవ్వింది వేసంగి.  వీకెండ్స్ లో  కె ఎఫ్ సి లో తిని ... అంటూ మధ్యలోనే ఆపేసింది వేసంగి.  ఏం? నువ్వు నడవటం లేదా మీ అమ్మ నాన్న బాటలో? అవును నడుస్తున్నాను. నేను కూడా మా నాన్న లాగే అమెరికా వెళతాను. ఇంతకీ, ముహూర్తాలు పెట్టేసారని ఉత్తరం రాసావు. మీ మద్య ఏమైనా సాగుతోందా? ఫోన్ చేస్తున్నాడా, లేదా నీ లాగే ఉత్తరాలేనాఅమ్మ తల్లీ నీ ఉత్తరాలు చూసి  నవ్వుతున్నారు అంతా, చక్కగా మెయిల్ పెట్టచ్చుకదే!? ఆయనకు మాట్లాడ దానికి కుదరదుట. అయినా కలం కాయితం తో రాస్తే నవ్వేది ఎవరు? " ఎవరా నా స్నేహితులు." అంది వేసంగి. 
 ముహూర్తాలు పెట్టుకున్నాక కబురు లేదు కాకరకాయ లేదు. అంది వేసంగి.   అంటే అంతకముందు కబుర్లు ఉండేవి అనా నీ ఉద్దేశం ? అడిగింది సివంగి.  ఆయన పరిస్థితి అర్ధం చేసుకున్నాకే నాకు కూడా మనశ్శాంతి కుదిరింది. అని ముక్తాయించిన్ది. ఇంతకీ ఫోటో ఏదైనా ఉంటె చూపిస్తావా? చూసి తరిస్తాను. అయ్యో అడగలేదు. ఛీ అడగడం ఏంటి దరిద్రంగా! ఎప్పుడైనా కలిసినపుడు తీసుకోవలసింది. కలవడమా, ఇంకా నయం! ఫోన్లో కూడా మాట్లాడడానికి తీరికుండదు ఆయనకీ.  అంత బిజీ గా ఉండేవాడు పెళ్లి చూపులకి ఎలావచ్చాడో ? ఎలాగో వచ్చాడు.  అంత బిజీ గా ఉంటాడా? బిజీ కాదె బందీ. బందీ అంటే? ఇదే మాట నాన్నని అడిగితె అదంతే ఆటను ఒక ఖైదీ అని నాన్న చెప్పారు. 

" ఇంతకీ పెళ్ళికి రాగలడా ?" నవ్వింది వేసంగి ." చాల్లే సంతోషించాం గానీ!" కసిరింది సివంగి. " ఇప్పుడు సంతోషం గానే ఉంటుందమ్మా, పెళ్ళయిన తరువాత కాపురం చేయడానికి  కుదరకపోతే అప్పుడు కూడా సంతోషంగానే ఉంటావా అని!"  కానీ నాన్న ఆయన్ని ఆదర్శ  భావాలు , విశాల దృక్పధం ఉన్నాయని నాకు సమగ్గా సరిపోతాడని చెప్పారు." ఉ , ఉ " మూతి విరిచింది వేసంగి. చూడు తల్లీ మీ నాన్న గొప్ప కవి కావచ్చు, మీ అమ్మ రచయిత్రి కావచ్చు, విశాల హ్బావాలు ఉండనూ వచ్చు, కానీ ఈ దాగుడు మూతల పెళ్ళిళ్ళు ఏంటి? ఇంతకీ ఎం వెలగ బెడుతునాడు? ఉరిమింది వేసంగి." ఎవరు?" అమాయకగా అడిగింది సివంగి. చిర్రెత్తుకొంచ్చిన్ది వేసంగికి " నీ మొగుడు" అంది కసిగా. " నీకు తెలుసుకదే నాన్నగారు అన్నీ శ్లేష,   అలంకార బద్దంగా మాట్లాడతారు.

 " ఎయ్ షటప్ , నీకేమైనా పిచ్చా ఖైదీ ని చేసుకోడానికి, ఛందో బద్దంగా మాట్లాడడానికి మీ ఫెమలీ అంతటికి ఓపిక ఉందేమోగానీ నాకులేదు"  అంది వేసంగి. అంతలో వచ్చారు మేడమీదకి రామలక్ష్మి, రామానుజం దంపతులు. సివంగి కి  కాబోయే భర్తను  పరోల్ మీద బైటకు తీసుకురావాలి ప్రస్తుతానికి ఖైదీ.  పెళ్ళికి పరోల్ దొరుకుతుంది అంది రామలక్ష్మి. ఇదేం సమ్మందం రా బాబు! అంది వేసంగి. “ అవునమ్మా, అహ్ హ  హ  ఊహల  ఊచలు వెనక , అక్షర రక్షక బటుల కాపలాలో ఖైదీ అమ్మా. అతను కూడా రచయితే అహ్ హ  హ ” నవ్వుతూ అన్నాడు రామానుజం. “అయినా సరే పొద్దు గూకులా రాతేనా”  మీ అమ్మ అమెరిక కంపనీ, మీ నాన్న యు కె కంపని కి రాత్రీ పగలు చేయడంలేదా చాకిరి.   ఈ  సారి అందరూ నవ్వారు. 

Thursday, March 12, 2015

అవిభక్త కవలలు

కాశిపతి నర్సీపట్నం అడ్డ రోడ్డు దగ్గర బస్సు  దిగి రిక్షా కోసం చూసాడు. రఘుపతి ఇల్లు మూడు మైళ్ళు ఉంటుంది. ఎక్సప్రేస్ బస్సు వెళ్ళదు. విలేజ్  సర్వీస్ అంత తొందరగా దొరకదు. ఇదివరకు ఎక్కువగా  రిక్షాలే ఉండేవి. ఇప్పుడు రిక్షాలు బాగా తగ్గి పోయాయి. ఎక్కడ చూసినా ఆటోలే. బాబూ రిక్షా రమ్మంటారాఒక ముసలాయన రిక్షా ముందు నిలిపాడు. అరవై పై మాటే అయినా రిక్షా లాగుతునాడంటే .. ప్చ్ బేరమాడ  దలుచుకోలేదు. ఎక్కి కూర్చున్నాడు. అయ్యాగారూ, ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు రిక్షా ఆయన సాహేబుపేట. రిక్షా కదిలింది.

ఎక్కడికి పోవాలి బాబూ అన్నాడు పెద్దయన  రఘువపతి అని అన్నాడు కాశీపతి . అతడు ముగించకముందే ఓహో ఆయన ఏ మౌతారు  మీకు అడిగాడు పెద్దాయన.   నా స్నేహితుడు , వాడు నీకుతెలుసా ? అన్నాడు కాశీపతి.   "ఆయన గురించి తెలీనోడు ఎవడండి. గుడి దగ్గరే  ఆయన ఇల్లు. ఎప్పుడూ నా రిచ్చా ఎక్కుతాడు బాబు, ఆటోలు ఎక్కడు." అన్నాడు పెద్దాయన. "అవును, వాడిదంతా పాత పద్ధతి, సెల్ ఫోన్ వాడదు, పల్లెటూరు వదలడు, రిటైర్ అయినతరువాత వ్యవసాయం చూసుకుంటూ అడ్డరోడ్డు దగ్గర సెటిలయ్యాడు. " అన్నాడు కాశీపతి . 

కొత్త రోడ్డు మీద రిక్షా మెత్తగా సాగిపోతున్నాది. రోడ్డుకి ఇరువైపులా పొలాలు, పచ్చని చెట్లు. ప్రాణం లేచోస్తున్నాది.  "ఈ మద్దిన కొడుకు పిల్లలని తీసుకొని వచ్చాడు బాబూ. వేసవి సెలవలు కదా పిల్లల్ని ఇక్కడ వొదిలేసి ఎల్లాడు."  "ఓహో అయితే మనవలతో ఆడుకుంటున్నాడన్నమాట."  "ఇక్కడే బాబూ దిగండి. ఆ ఎదురుగా కనిపించేదే ఇల్లు.' అన్నాడు పెద్దాయన.  డబ్బిచ్చి రిక్షాని  పంపించేసి  ఎదురుగా ఉన్న  ఇంటిని ఒక్కాసారి పరీక్షగా చూసాడు. ఇంటిముందు విశాలమైన ఆవరణ. ఇంటి ముందు అందమైన తోట. ఇంటి చుటూ ఫెన్సింగ్. ఫెన్సింగ్ తలుపు తీసుకుని లోపాలకి అడుగు పెట్టాడు.   

టక్..టక్.. తలుపు కొట్టాడు. తలుపుతీసి రండి అంకుల్ అన్నారు ఇద్దరు పిల్లలు. అంకుల్ కాదు  తాతగారూ అనాలి. మీ తాత లేడా? అడిగాడు కాశీపతి.  "తాతగారూ నానమ్మ గుడికి వెళ్ళారు. కూర్చోండి తాతగారూ!" అని ఇద్దరూ కలిసి కుర్చీ తీసుకొస్తున్నారు. 

పిల్లలూ బాగున్నారా మీ ఇద్దరూ ! మీ పేర్లు ఏంటి?  వంశీకృష్ణ. ఓ హో వంశి, కృష్ణ. మంచి పెర్లు.  అన్నాడు కాశీపతి.  ప్లాస్టిక్ కుర్చీని ఇద్దరు లాగడం ఎందుకు? మేము ఇద్దరం కాదు తాతగారూ. అదేంటి మీరు ఇద్దరు కాదా? అన్నాడు కాశీ పతి  ' ఏమో మాకే తెలీదు అది మీరే చెప్పాలి అన్నారు పిల్లలు ఏక  స్వరంతో.  పిల్లలో ఏదో తేడా గమనించాడు  ఇప్పుడు అర్ధమయ్యింది. "మేమిద్దరం ఇలా కలిసే పుట్టాము. పదేళ్లనుంచి ఇలా అన్ని పనులు కలిసే చేసుకుంటున్నాము." అన్నారు పిల్లలు. ఆశ్చర్య పోయాడు కాశీపతి.  "ఎక్కడో విన్నాను, కానీ ఎప్పుడూ చూడలేదు."  అన్నాడు . "కూచోండి తాతగారూ, తీరికగా ఆశ్చర్య పోదురు."  అని  టీ వీ   ఎదురుగా కుర్చీ వేసారు.

“మమ్మల్ని అవిభక్త కవలలు అంటారు మంచినీళ్ళు తీసుకోండి” ఇద్దరూ కలిసి వెళ్లి తెచ్చి ఇచ్చారు. ఇద్దరూ కలిసి టేబుల్ మీద ఉన్న రిమోట్ తో  టీ వీ ఆన్ చేసారు. అబ్బాయిలు మరి పడుకునే టప్పుడు మీకు ఇబ్బంది ఉండదా?  సమాధానం చెప్పలేదు. సి. డీ ప్లేయర్ లో  ఎదో తెలుగు సినిమా పెట్టారు.  "చారులత" తెలుగు సినిమా. 

ఇప్పుడెందుకు అనబోయాడు. చూడండి తాతగారూ మీకు ఒక ఐడియా వస్తుంది. అంటూ కొంచం కొంచం ఫార్వార్డ్ చేస్తూ  ముఖ్యమైన ఘట్టాలు చూపించారు. బుర్ర తిరిగిపోతోంది." సినిమా కూడా ఇదే కాన్సెప్ట్." అప్రయత్నంగా మాటలు బయటకి వచ్చేసాయి. 

చిన్న తేడా ఉంది తాతగారూ, చారులత అక్కచెల్లిల్లు, ఒకేసారి పుడితే అక్కచేల్లిల్లు అనరు తాతగారూ. ఇంకేం అనాలోయ్.  గుడ్డొచ్చి  పిల్లనెక్కి రించడం అంటే ఇదే కాబోలు. మనవలు తాతకి భాష నేర్పడం.  అనుకున్నాడు మనసులో. 

"ఇద్దరి దేహాలు అతుక్కు ని పుడితే  అవిభక్త కవలలు  అనాలి."  అన్నారు పిల్లలు.   సినిమా ఒక షాక్ అయితే, ఎదురుగా ఉన్న పిల్లలు మరో షాక్, ఇందులోనే భాష దిద్దుబాటు. విచిత్ర మానసిక పరిస్థితిలో పడ్డాడు. కంగారూ, ఆశ్చర్యం, చిరాకు అనీ కలిసి మనసుని మెలి తిప్పుతున్నాయి. "నెమ్మది తాతగారూ నెమ్మది మీకు కొత్త కదా అలాగే ఉంటుంది." అన్నారు పిల్లలు. ఈ పిల్లలేన్టిరా బాబూ. వెళ్ళు పిల్లలా పిడుగులా. నా మనసులో మాటలను పసిగట్టి మరీ సమాధానాలు చెప్పేస్తున్నారు.అనుకున్నాడు కాశీపతి. "ఇంకో గ్లాసు మంచినీళ్ళు ఇమ్మంటారా తాతగారూ." అన్నాడు వంశీకృష్ణ. ఇంతలో తలుపు శబ్దం అయ్యింది.

అమ్మో తాతగారు నానమ్మ వచ్చేసారు. వంశి కృష్ణ విడిపోయి పెరటి నుచి  చెరో దిక్కుకి పారిపొయారు. కాశీపతి కి తల తిరిగిపోతోంది . అదేంటి  వాళ్లిద్దరూ ఎలా చీలిపోయారు.  ఎదురుగా స్నేహితుడు రఘుపతి ." ఒరేయ్ రఘుపతి  భూమి గుండ్రముగా ఉండునా లేక గుండ్రముగా తిరుగునా ?" అంటూ నేలమీద పడిపోయాడు. 

మా వెధవాయిలు అవిభక్త కవలలు నాటకం ఆడారా? రఘుపతి భార్య కాశీపతి మొఖాన నీళ్ళు కొట్టింది." కాస్త  నీరు తాగండి అన్నయ్యగారు!" అంది. " నామోఖన్న కాస్త కాఫీ కొట్టమ్మా"  అన్నాడు కాశీపతి.  అవునులే మా వాళ్ళు షాకులు ఇచ్చే టప్పుడు నీళ్ళు కూడా ఇస్తారు. అంచేత కాఫీ తాగితే గానీ తెరుకోలేవు.

 కాశీపతి  కాఫీ తాగి కప్పు కింద పెట్టె లోపు పెరటిలోనుంచి వంశి కృష్ణ లని వెంట పెట్టుకొచ్చాడు రఘుపతి. తాతగారిని ఆటపట్టిస్తారా. సారీ చెప్పండి భాడవల్లారా అని వారి చెవులు మెలిపెట్టాడు రఘుపతి. సారీ తాతగారూ బిక్క మొహాలు వేసారు పిల్లలు. ఇలారండి పిల్లలు అవిభక్త కవలలు లా ఎలా అతుక్కున్నారు రా?" అని అడిగాడు కాశీపతి . " ఓ అదా, ఇలా అంటూ ఇద్దరి చొక్కాలకు నడుం దగ్గర ఉన్న పెద్ద కన్నాలు చూపి, వాటిలోంచి చేతులు దూర్చి ఒకరి నడుము మరొకరు పట్టుకున్నారు." మళ్ళీ అవిభక్త కవలలం అయిపోయాము " అన్నారు.   మీరు భవిష్యత్తులో  సినిమాల్లో నటించొచ్చురా  అన్నాడు కాశీపతి  ప్రేమగా వారి తలా నిమురుతూ. భవిష్యత్తు లో ఎందుకు ఇప్పుడే సినిమా చూపిస్తుంటేను అన్నాడు రఘుపతి. ఇద్దరూ చాలాసేపు నవ్వుకున్నారు.