Tuesday, January 12, 2021

Bharatavarsha 111

లోకచక్షువు తన యవ్వన ధవళ మయూఖములతో లోకకల్యాణ ప్రదాయమగు ప్రయాణమునకు శ్రీకారం చుట్టుచుండెను. శ్వేత గృహ ప్రాంగణ పచ్చిక మధ్యన తెల్లని తుషారార్ద్రత తో  నిండిన పాలరాతి బల్ల పై  ఆ సూర్యకాంతి పడి  మెరియుచుడెను.  యమున నిద్రలేచి కాఫీ చేసి మేడపైకి వర్షుని గదిలోకి పోయి చూడగా వర్షుడు అచట లేకుండెను. లంగా పరికిణీ లో గజ్జలు మెల్లన మ్రోగుచుండ మెల్లగా మెట్లు దిగి మండువా గది లోకి వచ్చి విశాలమైన మండువా గది అంతయూ కలియజూసెను. పిదప కిటికీ నుండి బైటకు చూడగా గృహ ప్రాంగణమందు  విశాల పచ్చిక మధ్య  ధవళ వస్త్ర ధారియైన వర్షుడు కనిపించెను. ఒకప్పుడు దూరదర్శన మందు, పత్రికలయందు కనిపించెడి రచయిత , నేడు ఇంటికే  వచ్చి  ఉండుటాయా! నమ్మలేకున్నాను నిన్న చెల్లెమ్మా అన్న అతడి పిలుపు ఇంకనూ చెవులలో తిరుగుచున్నది. 

తెల్లని పంచె గట్టి పొడుగాటి పై లాల్చీ ధరించి వర్షడచట కూర్చొని ఆవరణయందున్న పనస, మామిడి వృక్షాలను, లతిక , లతాంతికలను ప్రాతఃకాల సౌందర్యమును చూచుచుండెను.   ప్రకృతి సౌందర్యమును మంత్రం ముగ్దుడై  చూచుచున్న వర్షుని చెంతకు యమున  మెల్లగా పిల్లివలె అడుగులో అడుగు వేసి వచ్చి, కాఫీ కోప ను పచ్చిక లో నుంచి వెనుకనుండి వర్షుని కళ్ళు మూసి “ఎవరో చెప్పుకొనుము” అనెను. వర్షుడు "తాటకి…పూతకి" అని పేర్లు చెప్పుచుండగా యమున చేతులు తీసి దూరముగా పోయి మొగము త్రిప్పుకొని  నిలిచెను.  వర్షుడు నవ్వుచూ “అమ్ము ఇటురమ్మంచు యముని బిలచి ప్రాతఃకాల సౌందర్యము నాస్వాదించమని పాలరాతి బల్లపై కూచోండ బెట్టి  “ప్రకృ తెంత  రమణీయముగానున్నదో కదా

శా.  ప్రాతఃకా   లమునం  దుకోకి     లములా      ప్రాకార      వృక్షాల   లో

       వైతాళీ    కులవో     లెపల్క     మనసే        భాసిల్లు     గీతమ్ము లన్

       చూతాస్త్రుం డదిగో    కుఠార     పుకొమ్మ      చాటుంగ     దా గాస్త్ర ముల్      

       జాతుర్యం  బుగకూ  ర్చుచుండ  మది యే    స్తంబించె   మోదమ్ము నన్.

ప్రాతఃకాలము నందు  కోకిలములు ప్రాకార వృక్షాల లో ( ఇంటి ఆవరణ యందు గల చెట్లపై) కుహు కుహు అని,  వైతాళీకుల (మహారాజును నిద్రలేపు పాటగాళ్లు)  వోలి  పల్క  మనసే భాసిల్లు గీతమ్ములన్, చూతాస్త్రుండు ( మామిడి పూతను అస్త్రంగా కలవాడు ,మన్మధుడు)  అదిగో  కుఠారపు  కొమ్మ  చాటుంగ  దాగి అస్త్రముల్, చాతుర్యంబుగ        కూర్చుచుండ మదియే స్తంబించె మోదమ్మునన్. 

ఈ ప్రాతఃకాల చిత్రమెంత సమ్మోహనముగానున్నదో! అనుచుండగా ఇదిగో మంచి శార్ధూల పద్యమునకు మంచి కాఫీ అని యమున కోప నందించెను.  వర్షుడు కాఫీ త్రాగుచూ “ఇది శార్ధూల పద్యమని నీకెవరు జెప్పినారు? “నీవు శార్ధూలములను వెంటపెట్టుకొని తిరుగుచుందు వని వినికిడి.”  ఆహా  చెల్లమ్మకు చలాకి తనము పెరిగినదే! అన్నయ్యను చూచిన చెల్లమ్మకు చలాతనము సహజమే కదా! 

“అమ్మ లేచినదా!” “అసలు ఆమె ఎప్పుడు పడుకొనునో ఎప్పుడు లేచునో ఆమెకే తెలియదు , రాత్రంతయూ మేలుకొని తెలవారుతుండగా కొలది సేపు పడుకొనును.” వారిరువురూ పచ్చికలో కూర్చొని కాఫీ సేవించు చుండగా పికము పాడుచుండెను. 

వర్షుడు కాఫీ ముగించిన  పిదప యమున వర్షలు లోనికి వెడలుచుండిరి. “అన్నయ్యా నీవు అమ్మపై కేకలు వేయవలెను.” వర్షుడు " అట్లే, ముందు నేను సమయమునకు పడుకొన్నచో పిదప ఇతరులకు చెప్పవచ్చు"ననెను.  దానితో  ఇరువురూ నవ్వుకొనిరి.  యమున "అన్నయ్య నీవిచ్చటనే యున్నచో మనము ప్రతిదినము ఇట్లే నవ్వుకొనవచ్చును."   “అటులనే నమ్మా నేను వచ్చినది మీకొరకే కదా " అని వర్షుడు అనుచుండగా వారిరువురూ మీనాక్షి శయన మందిరము లోనికి అడుగిడిరి. అప్పుడే రక్షణ గృహ సిబ్బంది తెచ్చి ఇచ్చిన ఆంగ్ల వార్తా పత్రిక మీనాక్షి శయ్య పై పడియున్నది. 

 వార్తా పత్రిక లో ప్రధమముగా ప్రచురింపబడిన వార్త “రియాల్టీ లెవెల్ టూ - రేయింకార్నేషన్ అఫ్ సూపర్ వుమన్- బుక్ సైనింగ్ ఈవెంట్, ఫిబ్రవరి 17 18, హోటల్ రాయల్ ఆర్కిడ్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, బెంగళూరు. 

“ రియాల్టీ లెవెల్ టూ - రీయింకార్నేషన్ అఫ్ సూపర్ వుమన్ అను ఉప శీర్షిక తో ఆంగ్ల నవల విడుదల కానున్నది. అన్నయ్యా ఇదా సంగతి!” అనుచుండగా “అదియే కాదు ఇంకనూ యున్నది అని యమునా చెవిలో మెల్లగా ఎదో చెప్పగా యమున నేత్రములు విప్పారినవి. మీనాక్షి కిలకిలా నవ్వుచుండెను. “వర్షుడు ఎప్పుడూ పుస్తకములచుట్టూ తిరుగుచుండును ఇది తెలియక పాపము నీవు తికమక పడుచున్నావు!” అని మీనాక్షి అనుచుండగా యమున “నేడు అతిముఖ్యమైన పనిపై అతిధులు వచ్చుచున్నారు నీవు త్వరగా జాగు సేయక జలకములాడి  క్రింద మండువా గదిలోకి  రావలెన.”ని చెప్పి అన్నతో  కూడి నిష్క్రమించె ను

                                                                        ***
 పదిమందిని పిలవనిదే ఇంత పెద్దామె పుట్టినరోజు జరుపుట ఎట్లు. 
ఇప్పుడే అతిథులను ఆహ్వానింతును. “ఇంత తక్కువ సమయములోనా?
అది ఎట్లు సాధ్యమగును!” “నీవట్లే చూచుచుండుము అని దూరవాణి చేగొని 
" నవీన్ నేను యమునను  మాట్లాడుచున్నాను”

                                                                       ***
యాబది జన సందోహమువిశాల మండువా గదియందు వేచియున్నారు. వారందరూ పాత్రికేయులు, ఛాయా చిత్ర గ్రాహకులు,  చిత్ర పరిశ్రమ , రికార్డింగ్,  ఆర్కెస్ట్రా ప్రముఖులు, కానీ నేటి మీనాక్షి పుట్టినరోజు పండగ  అతిధులు. “వారందరినీ  చిటికలో ఎట్లు పొందుపరిచినావు? అనుచూ వర్షుడు  అచ్చెరువున చూచుచుండ,  యమున  " నవీను మంచివాడు " అని నవ్వుచూ పలికెను. 
ముదురు ఆకుపచ్చ చీరయందు మీనాక్షి ఆకులమధ్య మల్లె పూవు వలె , కడిగిన ముత్యమువలె కనిపించుచుండెను. మెట్లు దిగుచున్న ఆమె మబ్బుపొరలపై నడుచుచున్న జాబిల్లి వలే ఉండెను. ఆమె మెట్లు దిగుచుండగా ఆహుతులకు వెండి వెన్నెల దిగుచున్నట్లగుపించుచుండెను. అట్లు మండువా గదిలోకి దిగిన ఆ వెండి వెన్నెలయందు వారందరూ చుక్కలవలె వెలవెల  పోవుచుండిరి.  అనూహ్యముగా వచ్చిన జనసందోహమును చూసి మీనాక్షికి విషయము విదితమయ్యెను. పెక్కురు సోఫాలలో కూర్చొనగా కొందరు నిలచే యుండిరి. మీనాక్షి  రాచఠీవి నొలికించు టేకు దివాను పై కూర్చొని  చిటికలో ఈ ఏర్పాట్లు చేసిన పిల్లలను దగ్గరకి తీసుకొని ముద్దాడెను. మానస సరోవరమందు రాయంచ వలెనున్న మీనాక్షిని చూచుటకు రెండు కన్నులు చాలకుండెను. “వీణ కావలెను దొరుకునా?” అని యమునను వర్షుడు అడుగు చుండగా వంటవాడు , చాకలి , డ్రైవర్ మున్నగు  పనివారు  ప్రవేశించిరి. యమున "స్వరరాణి ఇంట సంగీతపరికరముల కేమి కొదవు, అని పనివారిని పిలచి వీణ తెమ్మని చెప్పెను. అందరూ హ్యాపీ బర్త్ డే పాటను మంద్రముగా గానము చేసి శుభాకాంక్షలు తెలియజేసిరి.  చెమ్కీలు దట్టించిన  బూరలను  పేల్చి గా చెమ్కీలు చింది ఆహుతుల శిరములను, గదిని నింపివేసెను.
   
అందరూ చప్పట్లు కొట్టుచుండగా  మండువా గది  అంతయూ  పెద్ద శబ్దములతో కోలాహలంతో నిండిపోయెను.   మీనాక్షి అందరికి నమస్కరించెను. కేక్ కత్తిరించుటకు మీనాక్షి ఇష్టము లేక పోవుటచే, హిందూ సంప్రదాయము ప్రకారము మిఠాయిలు పంచబడినవి. వంటవాడు అందరికీ కాఫీ పల హారములను అందజేసెను. పాత్రికేయులు మీనాక్షి ఛాయా చిత్రములను గ్రహించిరి. కొలదిమంది మీనాక్షి కి పుష్ప గుచ్ఛములను ఇచ్చినారు. వర్షుడు తన ప్రయాణ పేటిక నుండి రవ్వల కంఠాహారమును తీసి దివాన్ పై రాణి పద్మావతి వలె ఆసీనురాలయిన మీనాక్షి కంఠ మందలంకరించెను. పని వారు వీణ మండువా గదిలో అమర్చిరి. ఆహుతుల నందరినీ కూర్చుండమని చెప్పి భారతవర్ష వీణవద్ద కూర్చొనెను. ఇంతలో సందీపుడు,రాఘవ, ప్రఫుల్ల వచ్చి కూర్చొనగా భారతవర్ష వీణ మీటుచూ స్వరరాణి పుట్టినరోజు సందర్భముగా…


   
జగదానందకారకం నీ జననం, మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం
జగదానందకారకం నీ జననం సరస స్వర రాగ – యోగ సంయోగ జన రంజకం II
నీజీవన తత్వము జీవిత లక్ష్యము సృజనాత్మక సుమధుర సంగీతమూ
నీగానమె నీ గమనము, నీ గమనమె గరిమాగమ నిగమ ప్రయాణము II
నీ గానమున విఱియు నవరాగమూ, అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము
నీ గానమున విఱియు నవరాగమూ, గుణ గణ ధనము నీరాగమూ, నవనిధులుకు చూపునది మార్గము,  “మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకరకచ్ఛపౌ, ముకుందకుందనీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ" జగదానందకారకం నీ జననం మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం. 

అతిధులందరూ వెడలినారు. మీనాక్షి పైకి వెడలెను యమున ఆమెననుసరించెను    “అన్నయ్య నీ  జననమును ఎంత గొప్ప గానిర్వచించెను " " నా  లక్ష్యమును  చక్కగా చూపినా  బాధను బాపెను.""మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం." ఆ పాట ఆ భవంతి నందు ఇంకనూ ప్రతిధ్వనించుచుండెను. మీనాక్షి చెవులలో ఆలాపన వలే  తిరుగుచుండెను. 

Sunday, January 10, 2021

Bharatavarsha 110

ముంబాయి:  లకుమ నివాసం: 

కశ్యప్: చుమ్ ఛుమ్ తరువాత సరిగ్గా నాలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి తరువాత ఆగిపోయాయి. ఎందుకు ?  నీ ఒంటెత్తు పోకడలవల్లే. సినిమా స్టార్ సినిమా స్టార్ ఉండాలి. 

లకుమ: సినిమా స్టార్ లా లేనా? రోజూ జిమ్ కి  వెళ్లి  ఫిట్నెస్ మెయింటేన్ చేస్తున్నాను కదా?

షిట్! నేను అందం గురించి మాట్లాడడం లేదు ఏటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. నీ లైఫ్ స్టైల్ ఒక సినిమా తార లైఫ్ స్టైల్ కాదు. ఒంటి పిల్లి రాకాసి లాఎక్కడో ఉంటావు , పార్టీ కల్చర్ కి దూరంగా మడి కట్టుకుకూర్చుంటే ఎలా ? 




లకుమ:పార్ట్ కల్చర్ కి దూరంగా ఉన్నానా?! నిత్యం  పార్టీలలో ములిగి తేలుతున్నాము కదా!

కశ్యప్: కమాన్ బేబ్ , మునిగి తేలడం అంటే నా ఒక్కడితో  కాదు. జుహు బీచ్ లో ఇల్లు తీసుకో  తారలంతా అక్కడే ఉంటారు,  మింగిల్ విత్ పీపుల్ టేక్ ఆ షాట్ అండ్ … 

లకుమ: టేక్ ఆ షాట్ అంటే తాగడం హైద్రాబాద్ లో నీతో కూడిన ప్పటి  నుంచే మొదలెట్టాను

కశ్యప్: ఈ రోజు సాయింకాలం స్వింగర్ కపుల్ పార్టీ ఉంది మనం వెళుతున్నాం  “నేను రాను” 

కశ్యప్: అయితే మిడ్ నైట్ రేవ్ పార్టీ ఉంది దానికి పోదాం టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్  పరిచయమయ్యేది ఇలాటి చోటే. ఇలా తిరిగేవంటే వచ్చే వారంలోగా మరో నాలుగు సినిమాలు నీ చేతిలో ఉంటాయి . త్వరలో నిన్ను టాప్ స్టార్ని చేస్తాను. 

లకుమ: రేవ్ పార్టీ అంటారు బౌన్సుగర్ లాంటి డ్రగ్స్ తాగి చెలరేగిపోతారు , స్వాప్ పార్టీ అంటారు ఆడవాళ్లను మార్చు కుంటారు. అందుకే రేవ్ పార్టీలు, స్వాప్  పార్టీలు నాకు నచ్చవు అని తెగేసి చెప్పేను.   ఇంకొక్క సారి వాటి ఊసెత్తద్దు. 

ఒకే ..చిల్ బేబ్.. చిల్… రేవ్ పార్టీలకి వెళ్లొద్దు కానీ   సంజయ్ భాయ్ దగ్గరకి వెళ్ళు ఈరోజు. అని కశ్యపుడు లకుమ దగ్గరగావచ్చి ఆమె గులాబీ పెదవుల పై  చూపుటి వేలుతో రాస్తుండగా లకుమకి కంపరం పుట్టి " ఛీ .. వెళ్ళు " అని అరిచింది. “యువర్ లైఫ్ , యువర్ కెరీర్  అప్ టు యు” అని కశ్యపుడు  నవ్వుతూ వెళ్ళిపోయాడు. కశ్యప్ వెళ్లి పోయాక తలతిరిగిపోతోంది సాయంకాల పార్టీ లో కాదు ఇప్పుడే తాగాలి తప్పదు అనుకుని కబోర్డ్ లో బాటిలు కోసం చూసింది ఒక్కటీ కనిపించలేదు కోపంతో అరచింది   " రోహిత్ , రోహిత్ " “యస్ మేడం.” ఒక్క బోటిల్ కూడా లేదు ఏంచేస్తున్నావ్ . “అయిపోయాయి మేడం. కొని తేవాలి,  తెస్తాను. ఇప్పుడు ఇంకా ఉదయమే కదా, సాయంకాలం తీసుకొస్తాను.”  ఆ సమాధానంతో లకుమకి మరీ  పిచ్చెక్కిపోయింది రోహిత్  చెంప పేలి పోయింది. “బాటిల్స్ అవ్వకముందే ముందే తెచ్చి ఉంచాల్సిందిపోయి, అయిపోయిన తరువాత కూడా కొని తేడానికి ముహూర్తం కావాలా యూ ఇనెఫిషెన్ట్ రోగ్!”  “మాఫ్ కర్నా మేంసాబ్” 

“భర్తమీజ్,  తుం కిస్ లియే  ఇదర్ మేనేజర్? మేరే సర్ ఫొడ్ రహాహై!! గెట్ అవుట్!!!.”

 చెంపమీద చేతితో బాటిల్ తేవడానికి రోహిత్ పరిగెడుతుండగా అక్కడే నిలబడి చూస్తున్న ఆషా కిసుక్కున నవ్వింది. “దాని సంగతి చూస్తానే!” అన్న రోహిత్ కళ్ళలో మంటలు చూసింది.

                                                               ***

ఇందిరానగరం లో ఇంద్రాగ్నిని తలపించు ఇంద్రభవన మందు ప్రశాంత చంద్రికలు పరుచుకొని యున్నవి. మీనాక్షి పాలనురుగులాంటి తెల్లని దుప్పటి గప్పిన శయ్య పై పరుండి పుస్తకమును చదువుండెను. యమున మండువా గదిలో పెద్ద కిటికీవద్ద కూర్చొని వర్షుడు వ్రాసిన భక్తి విజయమందలి రుక్మిణీ శృంగార పద్యములను చదువుచూ, “ఆహా! ఎంత ఆహ్లాదంగాయున్నవీ పూలదండలవంటి పద్యములు, ఆ భావ పరిమళము లందునా మనసు ఊయలలూగుచున్నది కదా!” అనుకొని కిటికీ నుండి బైటకు చూచెను. మబ్బు దొంతరల తెలియాడు రేరాజు నింగినేలుచుండెను. ఆభవంతిని నిశ్శబ్దమేలు చుండెను. ఆమె హృదయమును శృంగార మేలు చుండెను. 

పక్కనే వర్షుడు వ్రాసిన తెలుగు  ఆంగ్ల కవితల పుస్తకములు బంతి చామంతుల వలె గుభాళించుచున్నవి. ఇటువంటి భావములు తాకిన స్త్రీల మనసులు పుష్పములవలె వికసించును కదా. ఈ కవితలు వెన్నెలను చూచుచూ కాక వెన్నెలయందు  కూర్చొని చదివినచో ఎంత రమ్యముగా నుండునో  అనుకొనుచూ గడియారం వంక చూచెను. 9 గంటలు   అయ్యెను. అయ్యో పనివారందరూ వెడలినారు  పిచ్చితల్లి ఏమి చేయుచున్నదో పిలచి బువ్వ పెట్టనిచో తినని పసిపిల్ల తల్లివలె యమున చకచకా మీనాక్షి శయన గృహమునకు పోయెను.  26 గదులు గల ఆ భవనమందు ఆమెకు 6 శయన మందిరములు  కలవు. క్రిందనున్న రెండు గదులయందు ఆమె లేకుండుటచే యమున పైకి పోయెను. అచ్చట రెండు మందిరముల తలుపులు మూసి యున్ననూ   ఒక మందిరమందు తలుపు దగ్గరగా చారవేసి యున్నది . యమున ఆ తలుపు వద్ద నిలిచి టక టక తలుపు కొట్టెను. 

స్పందన లేకుండుటచే మెల్లగా తలుపు తెరిచి లోపలకు తొంగి చూచెను. పాలనురుగులాంటి తెల్లని దుప్పటి గప్పిన శయ్య పై  ధవళ కాంతులీను కువలాయాక్షి చేత ఘంటము పూని గువ్వలవంటి తెల్లని కాగితముల పై లిఖించు చుంచుండ యమునకు  సరస్వతి వలే కనిపించెను. ఇట్లు వచ్చుటకు సిగ్గులేదు అని మీనాక్షి కోపము చూపగా మిక్కిలి అదురుచూ  యమున వెనుకకు పోయెను. మీనాక్షి యమునను చిలిపిగా చూచి నవ్వి పక్కన కూర్చొమ్మని కనుసైగ చేసెను. యమున పోయి ఆమె ప్రక్కనే కూర్చొనిన  పిదప " నీవు పనివారివలె  తలుపు తట్ట పని యున్నదా ? నేరుగా తలుపు తీసుకొని రమ్ము అని వాలిన ఆమె చుబుకమును ఎత్తి కళ్ళలోకి చూచి మరల చిలిపిగా నవ్వెను. ఈ సారి యమునా కూడా నవ్వెను.

  “భోజనమునకు పిలుచువరకూ రాకున్నవే మీ అమ్మ నీకు వేళ కు భోజనము చేయుట కూడా నేర్పలేదా? "ఇప్పుడిప్పుడే నేర్పుచున్నది.” "హి హి హి హి , సంతోషించితిని భోజనమునకు లెమ్ము" మీనాక్షి మూతి బిగించెను. నావద్ద ఈ మూతి బిగింపులేమియూ పనికిరావు. లేవనిచో పెద్దదానివని చూడక ఇచ్చట రెండు వడ్డించెదను అని దిండుతో కొట్టసాగెను , మీనాక్షి నవ్వుచూ రెండు చేతులతో అడ్డుకొనుచుండగా , యమున దృష్టి ఎగిరిపోవుచున్న సంగీత సంకేతములున్న కాగితములపై పడెను. పూరెక్కల వలే నున్న ఆ కాగితములను చూచి పూవులు నోరు తెరచి పాడుచున్నట్లనిపించి యమున ఆమెలో సరస్వతికి మనసులో నమోవాకములర్పించుచూ శిల్పం వలె నిలిచిపోయెను.  

మీనాక్షి కది యెంత మాత్రము నచ్చలేదు అప్పుడు ఆమె మరొక దిండు తీసుకొని యమునను కొట్టసాగెను. ఆ పెద్ద శయన మందిరమంతయూ తిరుగుచూ వార్ అట్లాడుకొను చుండగా యమునా దృష్టి రెండవ తలగడ క్రింద నున్న పుస్తకంపై పడెను , వెంటనే దిండు పారవేసి ఆ పుస్తకము వైపు పోవుచుండగా మీనాక్షి అది గ్రహించి ఆమె ఆ పుస్తకమును దక్కించుకొనుటకు పోయెను. ఇద్దరూ ఆ పుస్తకమును సగము సగము దక్కించుకొనిరి. మీనాక్షి శతవిధములు ప్రయత్నించినను ఆ పుస్తకమును యమున లాగి చేజిక్కించుకొనెను. 

ప్రౌఢ శృంగార కథలు అని బిగ్గరగా చదివి ఆమెను ఓరకంట చూచుచూ పుస్తకమును చుంబించెను. మీనాక్షి  సిగ్గుతో కళ్ళు మూసుకొనెను. యమున పుస్తకమును మీనాక్షి  చే తులకు తాకించగా కనులు తెరిచేను. వెంటనే యమున ఆ పుస్తకమును మీనాక్షి చేతులో పెట్ట ఆమెను నుదుటిపై చుంబించెను. ఇంకనూ ఆటపట్టించునేమో అని అనుకొన్న మీనాక్షికి ఆశ్చర్యము కలిగెను. ఇంకానూ  చదవలేదా, నీకెప్పుడూ సంగీతమే,  పోనీ నన్ను చదివి వినిపించమందువా ? అని అడుగగా.   మీనాక్షికి  మరల సిగ్గు ముంచుకొచ్చెను. నిన్నని ఏమి  లాభము ఆ వర్షుడి ననవలెను. అతడు గుండెలు తీసిన బంటు వలే నున్నాడు. ఏమి వ్రాసేనో కదా. ఒక్క సారి చూబింతువా? అని యమున చేయి జాపగా మీనాక్షి తన బెత్తముతో ఒక్క దెబ్బ కొట్టెను. యమున చిన్నపిల్లవలె గెంటి అల్లరి చేయుచుండగా మీనాక్షి ఆమె బుగ్గపై ముద్దిడి. పద పోయి తినవలెను అనెను. నే రాను నన్నేల కొట్టితివి ! అని మారాం చేయసాగెను .  మీనాక్షికి కూడా కోపమొచ్చెను. ఇరువురి కోపములు అలుకగా మారెను. 

  ఇరువురూ మండువా గది యందు  దూరదర్శనము ముందు   కూర్చొనిరి. యమున దూర నియంత్రణను నొక్కగా  వర్షుడు తెరపై ప్రత్యక్షమయ్యెను. వార్తా ప్రసారము వెలువడు చుండెను.  " లూయీ విల్ లో గౌరవ పొరసత్వమును పొందిన      తొలి తెలుగు కవి భారతవర్షకు నగర మేయర్ నగర  తాళాలను అప్పగించారు. భారదేశము రాబోతున్న భారతవర్షకు వచ్చే వారము స్వదేశమందు ఘన సన్మానము ఏర్పాట్లు.. అమెరికాలో లూయీ విల్ యందు స్లగ్గర్ ప్రదర్శన శాలవద్ద వర్షుని చిత్రములను, గ్రెగ్ ఫిషర్ భారతవర్షకు తాళములిచ్చుచున్న చిత్రములను పదే పదే చూపు చుండిరి. యమునా మీనాక్షిలు ఒకరినొకరు చూచుకొని నవ్వుకొనిరి , క్షణములో వారికి అలకలు గుర్తుకువచ్చి మొఖములు తిప్పుకొనిరి.

కొలది సేపు తరువాత  మీనాక్షి " యమునా నాకు హృదయము నిండి పోయినది నాకు ఆకలి లేదు అదియునూ కాక నాకు వేరొక ప్రత్యేక కారణము కలదు . నీవు పోయి అన్నము తినమ్మా " అని అనుచుండగా, "నేను తినను......" అని యమున మొండి కేసెను ." 

"నేను తినిపించినచో ..."  "నీవు తినిపించిననూ తినను" 

నీ అభిమాన రచయిత భారతవర్ష తినిపించినచో ? ఆమాట విన్న యమున మొఖం విప్పారెను.  మరుక్షణము  మొఖం మాడ్చుకొని " భారతవర్ష ఎందులకు వచ్చును ?

“మా యమున ఆకలి తీర్చుటకు అతడిని పంపమని నేను దేవుని ప్రార్ధింతును అని మీనాక్షి దేవునికి దణ్ణము పెట్టుకొనుచుండగా "వంకాయ్" అని యమున మూతి మూడు వంకలు తిప్పెను. ఇంతలో రక్షక గృహమునుండి వచ్చిన రక్షణ సిబ్బంది “ అమ్మ ఎవరో భారతవర్ష అట మీకొరకు వచ్చి గేటువద్ద ఉన్నారు పంపమందురా.” “వలదు అచ్చటనే ఉండమనుము.” అనగా వారు వెడలిపోయిరి. “ఏమే  వంకాయ్ లోనికి తీసుకు రావలెను నాతో  వచ్చెదవా ఇచ్చటనే వుందువా?” 

ఇద్దరూ ప్రవేశద్వారం వద్దకు పోయి వర్షుని గౌరవంగా లోనికి తీసుకువచ్చిరి. మీనాక్షి వర్షునికి దృష్టి తీసెను. మండువాగదిలోకి ప్రవేశించిన పిదప అమ్మాఎంత చిక్కిపోయినావు! అని మీనాక్షిని ముఖమును చేతులలోకి తీసుకొని చూచుచుండెను.   పుత్రవాత్సల్యమును చూ పుచూ  మీనాక్షి అతడిని కౌగిలించుకొనెను. 

నా కొడుకు కి చదువు అబ్బకున్ననూ జ్ఞానసంపన్నుడు గుణ సంపన్నడూ  అయినచో నీవలె నన్ను చూచుకొనెడివాడు. అని మీనాక్షి పొగిలి  వెక్కి వెక్కి ఎడ్వసాగెను.  

మాలిని నీవు వేరు కారమ్మా అన్ని కన్నీరు తుడిచి వర్షుడు మీనాక్షిని గుండెలకు హత్తుకొనెను. ఇదంతయూ ఏమీ అర్ధము కాని యమున పాపము బిత్తరపోయి చూచుచుండగా వర్షుడు ఆమెను " యమునా, ఇట్లు రా అమ్మా ,  " అని యమున తో అనగా యమున తన పేరెట్లు తెలిసెనని ఆశ్చర్యము కలిగిననూ " నీవెంతో బాగాచూచు కొంటున్నావని చెప్పుచుండును." అనుచుండగా “చూడండి సార్ ఈ మీనాక్షి ఎంత మోసము చేసెనో ! " అని వర్షునితో అని   " మోసం, దగా, కుట్ర " అనుచూ మీనాక్షిపై కలియబడెను. అట్లు మీనాక్షి గృహము నవ్వులు పూవు నందనవనముగ మారెను.    పిదప భారతవర్ష వారిద్దరినీ చెరొక వైపు కూర్చోండ బెట్టుకొని ఇద్దరికీ అన్నము తినిపించి తానూ తినెను.  యమునా ఇంకనూ సార్ అనుచుండగా "నన్ను అన్నయ్య అని పిలవ వలెను." అని చెప్పి యముని ఆప్యాయముగా చెల్లెమ్మ అని పిలిచెను. భోజనము లైన పిదప వర్షుడు నిద్రించుచుండగా మీనాక్షి యమునికి, మంజూష కథను వారితో ఆమె బంధమును చెప్పుచుండగా యమున  ఆమె వద్దనే నిద్రించెను.




Friday, January 8, 2021

Bharatavarsha -108

 సుందరి పార్వతీ అపహరణ ఘట్టమును ముగించిన పిదప మాలిని , మంజూష నందినీ శిలా ప్రతిమలువలే బిగుసు కొని చూచుచుండిరి. ముందుగా మాలినిగారు తేరుకొని బాహ్య స్మృతి పొంది " నీ విమానమునందు ఆ పార్వతెట్లు  కూర్చొన్నదో , నీవు చెప్పుచుండగ  నా గుండె ఆగిపోవునేమో అనిపించెను.”  ఇట్టి అసాధారణ ప్రతిభాపాటవములున్న వైమానికురాలిని ఘనముగా సత్కరించవలె "నని నందిని ముందురోజు వస్త్రాలయము నుండి కొనితెచ్చిన ఒక కుంకుమ రంగు చేనేత చీరను పసుపు రంగు రవికను ఇచ్చి  ఒక ముత్యాల హారమును  ఆమె మెడలో వేసి అలంకరించెను.

మాలినిగారు భోజనములు వడ్డించగా అందరూ భోజనములు చేయుచుండిరి. ఇంతకీ పార్వతి ఎచ్చటున్నది అని ముగ్గురు ఆత్రముగా  అడిగిరి, అప్పుడు సుందరి “నేను ఇంటికి వచ్చి చూడగా తాళము పెట్టి యుండుటచే దసపల్లా హోటల్ నందొక గది తీసుకొని యుంచినాను” అని సుందరి చెప్పెను.“వీరిద్దరూ ఎప్ప్పుడూ ఇంటి పట్టునుండక ఆసులో కండెవలె తిరుగుచుందురు. మీరందరు సాయంకాలము పోయి పార్వతిని తీసుకు రావలెను.” అని మాలినిగారు అనుచుండగా “భోజనములైన పిదప పోయెదము.” అని నందిని మంజూషలు అనిరి “లేడికి లేచిందే పరుగన్నట్లున్నది మీవరస సుందరి కి విశ్రాంతి అవసరము సాయకాలమే పోవలెను” అని మాలినిగారు పట్టుపట్టిరి. “లేదు మేము పోయెదము అని మంజూష హఠము  చేయుచుండగా మాలినిగారు విసిగిపోయి మంజూషను గరిటెతో చిన్నగా తలపై మొట్టి " నా మాట వినకున్న నాతో  మాట్లాడవలద”ని మూతి ముడిచినారు. సుందరి అది చూచి ఒకటే నవ్వు చుండెను. ఎట్టకేలకు భోజనములు ముగిసినవి సుందరి కూడా వారితో బయలుదేరెను.

వారు కిలకిలా రావములు చేయుచూ ముగ్గురూ ఇంటి ఆవరణలో నున్న వాహనము వైపు పోవుచున్నారు. మాలినిగారు వారివెంట నడుచుచున్నారు. నందిని “సుందరి నీవు నడిపెదవా?” అని అడిగెను " సుందరి” నాకు లైసెన్స్ లేద"ని  చెప్పెను. మంజూష, నందిని సుందరిని “నీ వద్ద ఉన్న లైసెన్స్ చూపమ”ని కోరగా సుందరి తన పైలెట్ లైసెన్స్ ను తీసి చూపెను. మంజూష నందిని ఆ లైసెన్స్ ను తేరిపార చూచిరి.  విమానము నడుపుటకు ఐదు సంవత్సరములకు పౌర విమాన శాఖవారిచ్చిన అనుమతి. మంజూష  “విమానము లైసెన్స్  చూచుట జీవితములో  ఇదే  మొదటిసారి.  

కారు నడుపుటకు అనుమతి లేదు గానీ విమానము నడుపుటకున్నది. ఇదెట్లున్నదనగా  మజ్జిగున్నదా అని అడిగిన లేదు పెరుగున్నది అన్నట్లున్నది” అనెను. సుందరి మెల్లగా పండ్లికి లించెను. నందిని సుందరిని చూచి పడీపడీ నవ్వు చుండెను. వెనకనే యున్న మాలినిగారు " వీరికి ఇకఇకలు పకపకలు హెచ్చగుచున్నవి.  నందిని  ఇట్లుండెడి పిల్ల కాదు  ఈ మంజూష దానిని చెడగొట్టినది. పార్వతి అనుకూలవతి యగు చక్కటి పిల్ల , పార్వతి వచ్చిన మీ పనిచెప్పెదను” అని సణుగుచుండగా. నందిని “అత్తా నీ ఇంట దీపము పెట్టుకోడలిని  మంచి చేసుకొనక ఇట్లు మాటలాడుట న్యాయమా అని అనుచూ వాహనము నధిరోహించెను. 

పార్వతి బుద్ధిమంతురాలట అదియునూ చూచెదము అనుచూ నవ్వులతో హోటలుకు సాగుచుండిరి. దారంతా ఆమాటలే చెప్పుచూ వాహనమును నడుపుచున్న నందిని వేరొక కారుని డీకొనెను. పోలీసు ప్రత్యక్షమయ్యెను “అదృష్టము బాగుండుటచే ఎవరికీ దెబ్బలు తగలలేదు కానీ నువ్వు  పోలీసు వచ్చి స్టేషనుకు రావలసి యుండునని  నందినిని గద్దించుచూ  వివరములడిగి వ్రాసుకొనుచుండెను. పెంచలయ్య కుమార్తె అని చెప్పగానే అతడి విషణ్ణ వదనమందు నవ్వులు పూసినవి. ఇకపై  మీ బెంజ్ కారు గుర్తు పెట్టుకొందును మీరు వెళ్ళిరండి మేడం. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు నిత్యమూ జరుగుచునే యుండును. అని ఎంతో వినయముగా వారిని సాగనంపెను. సుందరి , మంజూష అచ్చెరువందిరి.  

                                                                    ***

లూయి విల్  : ఢిల్లీలో బయలుదేరిన అమెరికా సంయుక్తరాష్ట్రాల విమానము ఆఫ్ఘనిస్తాన్, టర్కీ , గ్రీస్, ఇటలీ, స్పెయిన్ మీదుగా అట్లాటిక్ మహాసముద్రమును దాటి లాఫాయెట్టి  మీదుగా ఇరువదినాలుగు గంటల సుదీర్ఘ ప్రయాణము పిదప భూగోళమునకావలి వైపునున్న మరియొక నాగరికతను చుంబించుచూ మహమ్మదాలీ అంతర్జాతీయ (లూయీవిల్) విమానాశ్రయమందు వాలెను. చెప్పనలవికాని  విమానాశ్రయ తిన్నమును  నిశ్శబ్ద నిర్మల  భూషణాదులు ద్విగుణీకృతము చేయుచూ  దోడా కొండల మధ్య ప్రవహించు చీనాబ్ నది వలె,  లదాక్  పర్వతముల మధ్య నున్న నీలి పాంగంగ సరస్సువలె, తపస్వినివలె నున్నది.  వర్షుడు విమానము దిగిన  పిదప ఇండియానా విశ్వవిద్యాలయ అధికారులు హార్దిక స్వాగతము పలికి తమ వాహనమందు కొనిపోయి విడిది ఏర్పాటు చేసినారు.  

అంతర్జాతీయ ముష్టియుద్ధ క్రీడాకారుడు మహమ్మదాలీ జన్మస్థలమగు లూయివిల్ అనినచో ముఖ్యముగా గుర్తుకువచ్చునవి, ఆలీ బాల్య గృహము,  స్లగ్గర్  కర్మాగారం మరియు కెంటాకీ  చికెన్ఫ్రై,(KCF) కానీ అచ్చటమరెన్నో చూడవలసిన ప్రదేశములు కలవు. 

నాటి సాయంత్రము ఆరు గంటలకు లోగాన్ ప్రదేశమందు గల ఫోల్కనర్ చిత్రప్రదర్శనశాల లోఇండియానా విశ్వవిద్యాలయము వారిచే నిర్వహించబడుచున్న ఆంగ్ల పద్య సాహిత్య ఉత్సవమునకు అతడిని కొనిపోయిరి. అనేక స్థానిక కవులు కవయిత్రులు  ఆ పద్య సాహిత్య ఉత్సవమందు పాల్గొనిరి. ప్రజలు కూడా ఈ ఉత్సవము తిలకించుటకు పెద్ద సంఖ్యలో   ఉత్సాహముగా వచ్చిరి. నగరమేయరు పారిపాటిగా ఈ సభకు అధ్యక్షత వహించెను. ఆయనకూడా సాహిత్య ప్రియుడు అగుటచే తాను వ్రాసిన ఆంగ్ల పద్యములను చదివి వినిపించెను. చిట్టచివరిగా భారతవర్ష తాను కొత్తగా వ్రాసిన , బ్యూటీ అఫ్  కల్చర్,   పీస్ అండ్ జస్టిస్ అను ఆంగ్ల పద్య సంకలనములనుండి కొన్ని పద్యములను వినిపించగా ఆ భాషా భావ సౌందర్యములందు తడిచి, నాజూకైన లయవిన్యాసభరిత ఆంగ్ల ఉచ్చారణ సొక్కి ఆహుతులు వివశులయ్యిరి. 

 ముగ్ద పారవశ్యమున మునకలయిన మేయరు గారు భారతవర్ష నుండి పుస్తకములను తీసుకొని అందునుండి మరికొన్ని పద్యములను చదివి శ్రోతలకు ఆనందామృతమును పంచి. “ప్రజలందరినీ కలుపు శక్తి కళకు మాత్రమే కలదనిన అతిశయోక్తి కాదు. ఈ ఆంధ్రకవి నేడు లూయివిల్ నగరమునే కాక జన హృదయములను వెలిగించెను. శాంతి మరియు న్యాయం కొరకు కదం త్రొక్కు పదాతి దళముల సృజించిన ఈ కవిని శాంతిసేనాని యనిన అతిశయోక్తి కాదు.  ఈ ప్రపంచ పౌరుని  గుర్తించిన లూయీవిల్ గౌరవము ఇనుమడించునని లూయివిల్ నగర తాళాలను భారతవర్షకు  అందజేసి  అతడిని  నగరగౌరవ పౌరునిగా  ప్రకటించిరి. పిదప భారతవర్ష నగర సందర్శనమునకు ఏర్పాటుచే సిరి.

లూయివిల్ రాజధాని కాకున్ననూ కెంటాకీ రాష్ట్రమందు వంద విభిన్న ఆకర్షణలు గల అద్భుత నగరము. వేయి సంవత్సరముల లూయివిల్ చరిత్రను ప్రదర్శనలద్వారా ప్రతినిత్యము చాటుచు వన్నెల సీతాకోకచిలుకవలె మెరియుచున్న ఫ్రెయిజర్ చరిత్ర ప్రదర్శనశాల యందడు గిడి, ఆంధ్రదేశమందిట్టి ప్రదర్శనశాల యుండవలెననుకొనుచూ  విందు వినోదములకు చిరునామా అయిన  ఫోర్త్ స్ట్రీట్ చూచి అచట ఉన్నత ఆకాశ హార్మ్యము లందు రాత్రంతయూ జరుగు రాసక్రీడల గూర్చి విని  సందర్శకులను అయస్కాంతమువలె ఆకర్శించుచున్న ఆవీధి ని వీడి  రోమన్ శిల్ప కళను చూపు పురాతన లూయి విల్ చారిత్రక  ప్రదర్శనశాల లోనికి పోయెను. భవన నిర్మాణమందు ఆసక్తిగల వారు తప్పక సందర్శించవలసిన ఈ భవనము ప్రాచీన కాలమందు రెండు కుటుంబముల నివాసము. దాని సమీపములోనే కాంకర్డు  కాసల్ అను విక్టోరియా కాల శిల్పకళను ప్రతిబింబించు మరియొక చారిత్రాత్మక రాచ భవనము కలదు.  అందుగల  సప్తవర్ణ నగిషీల చెక్క శిల్పములను జూచుచున్న వర్షుని స్మృతి పథమున విదిష యే మెదలుచుండెను. 

లూయివిల్ బేస్బాల్ క్రీడకు  ప్రపంచ  ప్రసిద్ధి గాంచిన నగరము. ప్రపంచములో అత్యుత్తమ బేస్బాల్ బ్యాట్లు తయారుచేయు స్లగ్గర్  కర్మాగారం మరియు ప్రదర్శనశాలకు బోయి  ఆ ప్రదర్శనశాల పైగోడకు ఆనుకొని యున్న 120 అడుగుల ఎత్తున తాటి చెట్టు పరిమాణమునగల బేస్బాల్ బ్యాట్ ను చూచి వింత గొలుపు ఆ ప్రదర్శన శాల నందు ప్రవేశించెను. పిదప వంద ఎకరముల  మానవ నిర్మిత సున్నపురాయి గుహ ను పెక్కుకళాఖండములకు నిలయమైన కెంటాకీ డెర్బీ ప్రదర్శనశాలను సందర్శించి ప్రత్యేక ఆకర్షణ గానిలచిన బహుమతుల అంగడికి పోయి అందరికీ బహుమతులు కొని వెనుదిరిగెను. కెంటకీ సాహితీ చరిత్రయందు అగ్రస్థానమంది నగరగౌరవ పౌరునిగా లూయీ విల్ నగరము పై తన ముద్రను వేసిన వర్షుడు తనదేశమునకు పోవు విమానమెక్కెను. విమానము గాలిలోకి లేచెను. 

Bharatavarsha 109

ఆనందనిలయం విశాఖపట్నం : భాను డింకనూ కృంగకముందే, సంధ్య కాంతులు మణగక  ముందే  సుందరి, నందిని మంజూష పార్వతిని తోడ్కొని కిలకిలా రావములతో ఆనందానిలయమందు ప్రవేశించుచుండగా మాలిని గారికి సన్నగా వణుకు ప్రారంభమయ్యెను. ముగ్గురు తోనే వేగలేక పోవుచుంటిని ఇంక నాల్గవదెట్లుండునో అనుకొనుచుండగా వారు లోనికి రానేవచ్చిరి.  “ఏమే  పార్వతి ఎట్లెక్కినావే,  గాలిలో తేలుచున్న విమానము! అని మాలినిగారు పార్వతిని చెంతకు తీసుకొనిరి. " వణుకు పుట్టునట్టు వర్ణించినావు  కదా సుందరి, విమానమెక్కవలెనన్న భయము పుట్టుచున్నది " అని మంజూష అనెను. 

సుందరి : పార్వతిని  ఆందోళన వీడమని అందరమూ హోటల్ నుండి ఇంటి వరకూ త్రోవ అంతయూ చెప్పుచేనే యున్ననూ ఇంకా అట్లే యుండెను.  మంజూష : అది ఆందోళన వలే లేదు బసవడిపై  బెంగ పెట్టుకొనెను.  

నందిని : అది బెంగ వలే కాక విరహము వలే నున్నది .  

మాలినిగారు : ఇల్లు వీడివచ్చిన పిల్ల బెదరక ధీమాగా యుండునా? మీ వేళాకోళాలతో పార్వతి మరింత బిగిలి పోవుచున్నది. మీ ముగ్గురు కాస్సేపు నోరు మూసిన అది నోరు విప్పును. అని మాలినిగారు పార్వతిని వంటగదిలోకి కొనిపోయిరి.

కాస్సేపటిలో పార్వతి అందరికీ తేనీరు తెచ్చిచ్చెను. "మన ఇంట కాఫీ తాగుట  పరిపాటి కదా తేనీరు ఏల పంపినావు ?!  కాఫీ పంపుము తల్లీ . నాకు తేనీరు వలదు. అని నందిని అనెను 

మాలినిగారు: కాఫీకి  పాలు ఎక్కువ వలయును అందుకే తేనీరు పంపినాను , పాలు తక్కువగా యున్నవి. 

నందిని :పెళ్లివారింట పంచామృతములు నిండుకున్నచో పంచ మహా పాతకములు చుట్టుకొనును త్వరగా తెప్పించి కాఫి ఇచ్చిన నా ప్రాణములు కుదుట పడును. 

మాలినిగారు: నీవెచ్చట వింటివోగాని, ఇటువంటి సామెతలు నేనెప్పుడూ వినలేదమ్మా. ఈ దగ్గర దుకాణములందు పాలు లేవమ్మా పోయి వచ్చితిని , దూరము పోవలెను. 

నందిని : అత్తమ్మా రెండడుగులు వేసినచో నీ సొమ్ముపోవునా ? పైగా ఇచ్చట చక్కటి సైకిలు కూడా కలదు.  

ఆహా సైకిల్ ఉన్నచో నేను పోయి వత్తును అని సుందరి అనెను నందిని వలదని వారించిననూ వినక విమాన వేగముతో పోయి పాలు కొని తెచ్చెను. పిదప సైకిల్ అచ్చట పెట్టక విన్యాసములు చేయుట ప్రారంభించెను

 ఇంటి ప్రాంగణమందు ముందర ప్రహరీ గోడ వద్ద రాధా మనోహరం నుండి వెనుక ప్రహరీ వద్ద నున్న జాంచెట్టు వరకూ  తొక్కుచూ 30 మీటర్ల దూరము నటునిటు తిరుగుచూ వెనుక  చక్రము పై లేచి ముందు చక్రమును గాలిలో నిలిపి నాలుగు మార్లు  తొక్కి పిదప పథమును మార్చి వర్తులాకారముగ రయమున  గిరగిరా తిరుగుచూ చేతులు వదలి వెనుకకు వాలి  రెండుచుట్లు తిరిగిన పిదప నాలుగు చుట్లు తొక్కి వేగము పెంచి తటాలున ఎగిరి సీటుపై నిలిచి నవ్వుచుండెను. కిటికీ నుంచి మాలిని గారు చేష్టలుడిగి చూచుచుండిరి.    తక్కిన ముగ్గురు అమ్మాయిలు కేరింతలు చప్పట్లు కొట్టుచుండిరి. కొద్దిసేపట్లో వీధిలో పిల్లలు కూడా వచ్చి చూచుచూ ఈలలు వేయుచూ ప్రోత్సహిచుచున్నారు.  మాలినిగారు పరుగు పరుగున బైటకు వచ్చి పిల్లలను వెళ్ళ గొట్టి “సుందరి! విన్యాసములు వలదమ్మా, ఆడపిల్లవి దెబ్బలు తగిలించుకొనినచో కష్టము, దిగమ్మ” అని చెప్పుచుండగా  మంజూష ఆమెనడ్డుకొని “అమ్మా, అమ్మా, వద్దమ్మా అక్క చక్కగా తొక్కుచున్నది” అని మాలినిగారి గెడ్డము క్రింద చేయి వేసి బ్రతిమాలుచూ  లోనికి తీసుకు పోయెను.    కొలది సేపటిలో వీధి పిల్లలు మరల తిరిగి వచ్చినారు. 

ఎట్టకేలకు సుందరి నేలపై విన్యాసములు ముగించి గోడ ఎక్కి సైకిల్ ను  ప్రహరీ గోడ ఎక్కించవలెనని సూచించగా నందిని సైకిల్ ఎత్తి ఇవ్వమని పార్వతిని ఆజ్ఞాపించెను, ఇంటి పెద్ద కి ఇష్టము లేకున్నచో చేయుట ఎట్లని అనుచుండగా   “ పిచ్చిదానాఈ ఇంటి కోడలును నేను  చెప్పినది వినుము.” రేపు బసవని ఇచ్చటికి  రప్పింతును అనగా పార్వతి పార్టీ మార్చుకొనెను. అది చూచుచున్న మాలినిగారు బైటకు వచ్చి నందినితో " ఇట్టి ఆటలు నేనెక్కడా చూడలేదు. మా వర్షుడు అమెరికానుంది వచ్చు చున్నాడు , వాడితో చెప్పెదను వాడు మీ ఆటలు కట్టించును.  అమ్మ అమ్మ! ఆడపిల్లలపై కి  నీకొడుకుని తరిమెదవా! మేము నలుగురం ఒక్కటయ్యి వర్షుని ఒక ఆటాడించెదము. అనగా “బరితెగించిన దానితో మాటలనవసరము నీవు మీఇంటికి పొమ్ము” అని మాలిని చెప్పెను. నందిని " అత్తా ఆడపిల్లలు చీకటి పడిన పిదప బైటకు పోరాదని నీవే చెప్పితివి కదా. " అనెను అహహా పెద్దలనిన  ఏమి గౌరవమే తల్లి అనుచూ సుందరివైపు చూడగా గోడపై సైకిలు త్రొక్కుచుండెను “ఆడపిల్లలు ఇట్లు మగరాయుడివలె  ఏమి పనులమ్మా ఇవి ? అని కేకలు వేయుచుండగా "అమ్మా అమ్మా రెండు చుట్లు  తిరిగి దిగిపోదును అని బ్రతిమాలుచుండగా మాలినిగారు మొఖం మాడ్చుకొని లోపలకి పోయినారు .  

                                                                    ***

ఎం వీ పీ కాలనీ సెక్టార్ ఆరు : సూర్యనారాయణుడు జగములను మేల్కొల్పి సప్తాశ్వ రథారూఢుడై సగముయాత్రను పూర్తి చేసెను కానీ బసవడు మంచము దిగక , ముసుగు తీయక పరితాప హృదయుడై  క్షణ క్షణము దీర్ఘ నిట్టూర్పులు విడుచుచూ  

అగస్త్య: బసవడింత దిగాలుగా కూర్చొనుట నేనెప్పుడూ చూడలేదు ఆ ఆశుకవిత లేమైనవి? ఆ వేగము ఆ ఉత్సాహము ఏమైనవి? 

బసవడు: నాపారు దొరుకు వరకు ఆసుకవితలు,  వ్రాసు కవితలు లేవు. 

బుచ్చమ్మగారు: ఇప్పుడేమైనదని వినమనము (డిప్రెషన్)?  చేయుచున్న ఉద్యోగము మాని ఇట్లు ముండమొపివలె ముసుగువేసుకొని కూర్చుంటివి ?  

చందన : అమ్మా అన్నయ్య ఇంటివద్దనుండి పనిచేయుచున్నాడు దీనినే  వర్క్ ఫ్రొం హోమ్ అందురు.  ఈ బుచ్చమ్మ అందరికీ  కొడుకు ఉద్యోగమూ పోగొట్టుకున్నాడని  చెప్పుచుండును. 

అని తలబాదుకొనుచూ వెడలెను. ఇంతలో ఇంటివద్దనే ఉన్న సర్రాజుగారు వచ్చి " మగాడివికాదా అదికానిచో దాని కంటే రంభ వంటి పిల్లని తెచ్చి పెళ్లి చేసెదను. దుప్పటి ముసుగు వేసుకొని మంచము పై కూర్చొని ఇట్లు కృంగిపోవుట మాని దర్జాగా ఉండుము. మగవానివలె బ్రతకరా,  చవట సన్నాసి! "అని బసవడికి గడ్డిపెట్టి (అగస్త్యుని వైపుతిరిగి) ఆ పిల్ల శని వలే చుట్టుకొన్నది. ఒక్క మారు చూచినంతనే మోహమునందు పడిపోవుటయేనా ? అన్నన్నా ! అగస్త్యుడు ఇట్లే చేయుచున్నావా?  తండ్రి ఆస్తిని నిలుపుటకు తపన  పడుచున్న ఆ కొడుకుని చూచి సిగ్గు తెచ్చుకొనుము. 

ఆ మాటలు వినుచున్న అగస్త్యుని ముఖము పాలిపోయెను, బసవడి వత్తికాలెను (fuse blown off). వారిరువురు ఒకరినొకరు మొఖములు చూచుకొనిరి  

బుచ్చమ్మగారు : మొదటినుండి మాకు ఆ పిల్ల ఇష్టం లేదు బాబూ , పిల్ల బాగున్నది పిల్ల బాగున్నది అని  వీడు వెంట పడుచున్నాడని వప్పుకొంటిమి. 

ఆ మాట విన్న బసవడు "పార్వతేమి తప్పుజేసినది, ఆమెను ఎవరు అపహరించినారో విచారించక మీరిరువురూ ఇట్లు కాస్తావాదము పెట్టుకొనుడు, పోలీసులకు పిర్యాదు చేయమనిన అదియునూ చేసినారు కారు. 

బుచ్చమ్మగారు : చూడు బాబూ ఈ మతిలేని మాటలు, మేమెట్లు చేసెదము పిర్యాదు, పిల్ల మీకేమగునని అడిగినచో ?

అగస్త్యుడు :  బసవ ముసుగు తీసి లెమ్ము,  నేను ఆలోచించి నేడే  ఏదో ఒకటి చేసెదను. 

ఇంతలో బసవడి  చరవాణి మ్రోగెను ఏదో  అపరిచిత సంఖ్య అనుకొనుచూ బసవడు 

చరవాణిని తెరవగా తీయగా పార్వతి గొంతు వినిపించెను “నేను పార్వతిని, “పారూ నేను బసవ”  పార్వతి: నేను క్షేమముగానే యున్నాను త్వరలో మిమ్ముల్ని కలిసెదను, విశాఖ పట్నమందు "అనుచుండగా వాణి అంతమైనది. బసవడి మోము దివిటీ వలె వెలిగిపోవుచున్నది, మనసు గోదారి వలె పొంగుచున్నది. 

అగస్త్య: తప్పడిన లేగదూడ తిరిగి దొరికిన గోమాత వలె, గూడు దొరికిన పక్షి వలె, ఎలకను పట్టిన పిల్లివలె, ఎముక దొరికిన  కుక్కవలె ముదమున ముప్పిరి గొనుచున్నది  “ పారూ పారూ ఏమి హుషారు. పోవలె మనము కలిసి షికారు” అని పాడుచూ, అని బసవడి వైపు చూచెను

బసవ: ఓరీ మిత్ర ద్రోహీ! కష్టములందున్న మిత్రునితోనే పరాచకములాడు అల్ప బుద్దీ! నా పారు దొరుకువరకు నేను పాడరాదు, మేమిరువరమూ కలసి ఆర్ కె బీచ్ లో పాడుకొందుము. విశాఖ పట్టాన ఎచ్చట ఉన్నది నా పారు? నేనట్లు ఎప్పుడు పాడుకొనవలెను?      

అగస్త్య: పాడు పాటలు ఎప్పుడైననూ పాడుకొనవచ్చు. నా పాట్లు చూడుము. వాటాదారులకు తిరగి చెల్లించవలసిన ఓవర్ సబ్ స్క్రిప్షన్ మొత్తమును గడువు దాటిననూ చెల్లించకపోవుటచే విచారణ మొదలయినది. మానాన్నని  అరెస్ట్ చేయు అవకాశములు కలవు.  గ్రేస్ ఇంటికి వచ్చుట కూడా మానివేసినది. 

బసవ: ఆమె ఇంటికే రాకున్నచో, వారిరువురి మధ్యవ్యవహారము చెడినదని అర్థమగుచున్నది  కథ ఇంతదూరం పోయిన పిదప ఉపేక్షింప పనిలేదు.  నేడే పోయి ఇంటిలో పనివారందరినీ తరిమివేసి గృహ ప్రక్షాళనం చేసి పిదప సంస్థ ప్రక్షాళన చేయవలెను. అందుకు మీ నాన్న సహకారము కావలెను. 

                                                                    ***

సుందర శిల్పకళా నైపుణ్యముట్టిపడుచున్న ఆ సుందర సౌధమందు(స్టూడియో) అడుగిడి విద్యుతాలంకృత మనోజ్ఞ భవనాన్తర్భాగ రజిత ప్రదీప్త విమల శోభలందు కనులు చెదురుచుండ యమునకు అదంతయూ స్వప్నగృహ మువలె నగుపించెను. లోపలకి పోవుచుండగా అచ్చట తలమునకలుగా పనిచేయుచున్న అనేక వడ్రంగి, విద్యుత్, శబ్ద, నిశ్శబ్ద, నియంత్రణా కళాకారులను చూచి విభ్రమనొందిన యమునకి మీనాక్షి  ఒక మహా వృక్షమువలే కనిపించెను.  అనేక కళాకారులకు ఆశ్రయ మిచ్చిన ఈ చల్లని వృక్షము ఎప్పటికి వర్ధిల్లవలెనని మనమున దేవుని కోరుచుండగా, మీనాక్షి యమున  చేయి పట్టుకుని లోపలి తీసుకుపోయెను. సువిశాలమైన గదులు శీతల యంత్ర ప్రభావమున ఆహ్లాదపరచుచుండగా, అలంకరణలు తుదిమెరుగులు దిద్దుకొనుచున్నవి. వారిరువురు ఇటుక , చెక్క,  గాజు గదులను దాటి చివరకు వారు ఒక విమానమును పెట్ట గల విశాల  సమావేశ మందిరము లోకి ప్రవేశించిరి. అచట గుల్ల చెక్కగోడలు తో సర్వాలంకృతమై , శబ్ద వర్ధక,  శబ్ద గ్రాహక యంత్రము లమర్చబడి యున్నవి.

శతాధిక సంగీతకారులొక్క సారిగా కొలువుతీరుటకవకాశము ఆ అర్ధవృత్త ఆకార పాలరాతి రంగస్థలం పై అనేక సంగీత సాధనములు అమర్చబడి యున్నవి.  మరో మయసభ వలే , సంగీత భువనము వలే  కాంతులీనుచున్న ఆ మందిరమును చూచి యమున తన్మయమత్వమొందెను. 

యమున: మధ్యలో ఈ వెండితెర ఎందులకు?" 

ప్రకాశ ప్రక్షేపణి ( ప్రొజెక్టర్ ) తో ఈ తెరపై ప్రదర్శించబడు నిశ్శబ్ద(మూగ) చలనచిత్రమునకు శబ్దాలంకరణ   జరుగు ప్రదేశమిదియె. 90 మంది సంగీత కారులు చలన చిత్రముననుసరించి, స్వరకర్త రచించిన సంగీత సంకేతముల (స్కోరుషీట్స్)చూచుచూ నేపధ్యసంగీతమును(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) సమకూర్చెదరు.  మనము విను అనేక పాటలకిది జన్మ స్థలము. ఇప్పుడు నేను  నిలుచున్న   ప్రదేశము  అర్ధవృత్తమునకు మధ్య ప్రదేశము.  నాచుట్టూ వాద్య పరికరములు అమర్చబడి యున్నవి.     నా ఎడమ చేతి వైపు ఫస్ట్ వయోలిన్స్, వాటి పక్కన , సెకండ్ వయోలిన్స్,  కుడు చేతివైపు సెల్లోస్ , డబుల బాస్ యున్నవి, నాయెదురుగా మొదటివరుసలో గాయకులు వారివెనుక వేణువులు, సన్నాయివంటి వుడ్ విండ్  పరికరములు వాటివెనుక , ఫ్రెంచ్ హార్న్స్ , ట్రంబోన్స్ , ట్యూబ్స్, ట్రంపెట్స్, వాటి మధ్య రకరకముల మద్దెలుఉన్నవి. దీనినే ఆర్కెస్ట్రా అందురు.” అని మీనాక్షి వివరించెను.

 “అయినచో ఇవి ప్రతి స్టూడియోనందు ఉండునా?” అని యమున అడిగెను. 

మీనాక్షి : దీనికి పూర్తి స్థాయి ఆర్కెస్ట్రా  ( ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆర్కెస్ట్రా ) అందురు ఇందు 90 మంది సంగీతకారులుందురు. మధ్య స్థాయి ఆర్కెస్ట్రా నందు 45 మంది సంగీత కారులుందురు. బెంగళూరు నందు మనము చూచు ఎక్కువ రికార్డింగ్ స్టూడియోస్ పదిమంది సంగీత కారులు కూడా కూర్చొన వీలులేనంతచిన్నవి. అనగా పూర్తి స్థాయి ఆర్కెస్ట్రా (ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆర్కెస్ట్రా) పనిచేయుటకు అవకాశము గలవి రెండే కలవు మనది మూడవది అని మీనాక్షి చెప్పుచుండగా యమున నేత్రములు విశాలమయ్యెను . 

“మేడం టీ” ఒక అబ్బాయి తేనీరు అందించెను. నవీను కుర్చీలు తెచ్చి వేసి “మేడం కూర్చోండి మీరు నిలబడినచో మాకు కాళ్ళు నొప్పిపుట్టును.” అని నవ్వుతూ అనెను. మీనాక్షి కూడా నవ్వెను. ఇద్దరూ తేనీరు త్రాగుచూ కూర్చొనిరి. యమున తన చేతి సంచిని కుర్చీ వద్ద పెట్టి తేనీరు కోపనందుకొనెను. మీనాక్షి “చెప్పితినా నవీను మంచివాడని ఇప్పటికైనా నమ్మెదవా?” యమునకు మీనాక్షిపై పిచ్చి కోపము కలిగి  “ఛీ ఇటువంటివి చూచి ఇంకనూ  వలలో పడుచున్నావు. తియ్యగా మాట్లాడినచో కోసుకొనుటకు  గొంతునప్పజెప్పెదవు, ఆ విక్రముడట్లే చేసెను కదా!” అని కసిరి వెంటనే స్పృహనొంది " ఒక కనుసైగతో వందలమంది కోవిదులను  శాసించగల వ్యక్తిని ఇట్లు అనుట పాపమని భావించి యమున తలదించుకుని కూర్చునెను. మీనాక్షి జాలిగా చూచుచూ " అట్లు కనిపెట్టిన నాజీవితము ఇట్లెందుకుండును" అని జాలిగా అడుగుచుండగా గంగి గోవు వంటి వ్యక్తిని భాదించితిని అని యమున కళ్ళలో  అపరాధభావం హెచ్చి కన్నీరు సుడులు తిరుగుచుండెను. ఆ కన్నీటిసుడిలలో సంగీత సాధనములన్నియూ కరిగి మీనాక్షిలోకి అంతర్ధానమగుచుండగా మీనాక్షి పద్మముపై కూర్చొన్న సరస్వతి వలే నగుపించెను. యమున ముందుకు వంగగా ఆమె కన్నీరు మీనాక్షి పాదములపై పడెను.

ఇంతలో నవీను పియానో విభాగము వద్ద పని పూర్తి చేసి పియానో కూడా అమర్చెను."మేడం పియానో సిద్దము చూచెదరా?" మీనాక్షి మందగమనమున పియానో వద్దకు పోయి రాగములు పలికించుచూ గానము చేయుచుండగా ఆ విద్యుత్ దీపములమధ్య ఒక విద్యుద్దీపమువలె మెరియుచూ రసరాగసంగీతవెల్లువలోకి తానేపాటై ప్రవహించుచూ యమున తనను అక్కున జేర్చుకొని ఓదార్చుచున్ననుభూతి పొందెను. 

ఆ గొంతుయందే మాధుర్యమున్నదో, ఆ రాగమందే అనురాగమున్నదో యమున మనసు నందు మాలిన్యమంతయూ మాయమయ్యి ఆమె  మనసు మయూరమువలె విప్పారి నర్తించుచుండగా మీనాక్షి వాదనము నిలిపిచిరునవ్వు రువ్వెను. యమున మనసు తేలిక పడెను. వారిరువురూ నడుచుచూ వాహనము వద్దకు చేరుకొనగా డ్రైవర్ తలుపు తీసెను వారు వెనకన కూర్చొనిరి. యమున యధాలాపముగా పైకి చూడగా యమున స్టూడియోస్ అను పేరు కనిపించెను. మాటలకందని భావమేదో యమునను ఆవహించెను. మీనాక్షి "త్యాగరాజనగర్" అనగా ఇన్నోవా బయలుదేరెను.  

                                                                       ***

ఇరువురూ కారు దిగి స్టూడియో లోకి అడుగిడిరి. స్టూడియో మేనేజర్ , చిత్ర దర్శకుడు  నవ్వుతూ నమస్కరించిరి. అంతాసిద్దామా అని మీనాక్షి అడుగగా అంతా సిద్ధం మేడం అందరూ జామ్ రూంలో ఉన్నారు. అని స్టూడియో మేనేజర్ బదులు పలికెను. మీనాక్షి జాంరూంలొకి ప్రవేశించుచుండగా యమున కూడా ఆమెను అనుసరించుచుండెను. స్టూడియో మేనేజర్ యమునను" మేడం మీరు బయట యుండవలెను, లోపల రికార్డింగ్ జరుగును." అని సూచించెను. లోపలి పోయిన  మీనాక్షి వెనుకకు వచ్చి యమునను లోపలి రమ్మనెను. యమున అతడి గొంతు విని, పొద్దున్న ఫోను చేసినది ఇతడే అని గ్రహించెను. లోపల ఆర్కెస్ట్రేటర్ "స్కోర్ షీట్స్(సంగీత సంకేత రచన) ఇవ్వవలసినదిగా కోరగా మీనాక్షి యమున వైపు చూసెను. "పొద్దున్న ఫోన్ చేసిన ఆర్కెస్ట్రేటర్ ఇతడన్నమాట "అనుకొనుచున్న యమునకు తనచేతిసంచి మరిచినట్లు గుర్తుకొచ్చి నెత్తిన పిడుగు పడినట్టయ్యెను. మీనాక్షి    ఏమనునో అని  యమున హడలిననూ అది ఏమీ పట్టించుకొనక మీనాక్షి “సంగీతకారులను ఆర్కెస్ట్రా గదిలోకి పంపక జామ్ రూంలో నుంచవలసిన పనియేమి?” అని కోఆర్డినేటర్ను ప్రశ్నించెను " ఇప్పుడే తరలించుచున్నాను " అని వారందరినీ ఆర్కెస్ట్రా గదిలోకి తీసుకుపోయేను. మీనాక్షి ఒక నాలుగు కాగితములు  తీసుకొని సంకేత భాష లో పాట మొత్తము రచించి  ఇచ్చి  యమునను  ఆర్కెస్ట్రా గదిలోకి కొనిపోయెను. 

సంగీతకారులందరూ సద్దుకొని తమతమ స్థానములందు కూర్చుచున్నారు 

ఆర్కెస్ట్రా గది ఎట్లున్నది అని మీనాక్షి యమునను అడిగెను "యమున స్టూడియోస్ లో సగమున్నది" అని యమున చెప్పెను.  ఇచ్చట సంగీతకారులు కూడా 40 మందే  యున్నారు. “స్కోర్ షీట్స్ ఆర్కెస్ట్రేటర్ ఏమి  చేసుకొనును.” నేను ఇచ్చిన స్కోర్ షీట్ లో అన్ని వాద్యములకు కలిపి సంగీత సంకేతములుండును. ఆయన దానిని ప్రతీ సంగీత వాద్యమునకు విడదీసి, ఎవరు సాధనమునకు తగ్గట్టు వారికి  వ్రాసి ఇచ్చును.” 

సంగీతకారులు అందరూ కూర్చొనిరి, స్కోర్ షీట్స్ వచ్చి చేరినవి. హృదయమును తట్టు సంగీతము నది వలె సన్నగా మొదలయ్యి దుముకుచూ, మలుపులు తిరుగుచూ సాగుచున్నట్టు గలగల పారుచున్నట్టు, వాన కురుయుచున్నటు జడి రేగినట్టు రేగి చల్లారెను. కళాకారులందరూ లేచి గౌరవమును ప్రకటించిరి. ఏమి కళా కుశలత కొద్దీ నిమిషములలో పాటకి సంగీతమును కూచిన ఈమె బ్రహ్మ మానస పుత్రికే కదా అని కో ఆర్డినేటర్ అనుచుండగా యితడు ఆర్ డి బర్మన్ బృందమందు సంగీతకారుడని. ఎవరో చెప్పుచున్నారు 

మీనాక్షి శక్తి సామర్ధ్యములెరి గించుటకు ఈశ్వరుడే ఇట్లుచేసినాడేమో లేనిచో నేను కాగితములచ్చటేల మరువవలెను కనీసము ముఖమునందు విసుగైననూ చూపక అప్పటికప్పుడు వ్రాసి ఇచ్చిన ఈమె ఎంత గొప్పదో కదా "నీ ప్రతిభాపాటవము, నీ సహనము నాకు తీయటి గుణపాఠము" అని అనుకొనుచూ యమున మీనాక్షితో కలసి బైటకు వచ్చుచుండగా మీనాక్షి ఒళ్ళు యమునకు తగిలెను. ఆమె వొళ్ళు కాలిపోవుచుండెను. 

ఎదురుగా నవ్వుతూ ప్రఫుల్లకనిపించెను. యమునకు ఆందోళన హెచ్చెను. ఆమె మీనాక్షి  కంటే ముందుగా వడివడిగా పోయి  “ఒకవారంలోగా మీనా కేరళవచ్చును నేనే తీసుకు వచ్చెదను ఇప్పుడు ఆమె మూడుగంటలు నిలబడి మరల జ్వరము తెచ్చుకున్నది. ఇప్పుడు నీతో వచ్చుట కుదరదు అని తెగేసి చెప్పెను. ఆ మాటల తీవ్రత చూసి ప్రఫుల్ల నీవెప్పుడు నాకు మద్దత్తిచ్చినావు రాక్షసీ నా ఉసురు నీకు తగులును." అనుచూ వెడలిపోయెను లేదని చెప్పుట రాని మూగజీవిని తీసుకొని యమున ఇందిరానగర్ బయలుదేరెను     

Wednesday, January 6, 2021

Bharatavarsha 107

 బెంగళూరు మహానగర హృదయాస్తానే ఇందిరనగరే ఆస్తి . ఏతద్ ప్రదేశే బాహుదాన సంపత్పూర్ణ  విలాస భావనాని సన్తి.  తత్ర గృహాణి అన్తరే  మీనాక్ష్యాహ  నూతన  శ్వేత గృహం ఆస్తి.  ఇందిరానగరే  సర్వత్ర  అనేక   ఉత్తమ పాశ్చాత్త్య నృత్య, పలహార, పానశాలాయాం  సన్తి. ఇదం జీవనం నవ నాగరికం చ బహుసుందరం.  

 ఇందిరానగరుఁ నందు మీనాక్షి తెల్లని మహా భవనము రాయంచవలె నగుపించుచుడగా అచ్చట చుట్టూ యున్న  భవనములన్నియూ వెల వెల బోవుచుండెను. ముత్యమువలె మెరియుచున్న ఆ భవనము ముందు ఒక పెద్ద నల్ల ఇనప గేటు ఆ ప్రక్కనే రక్షగృహ ముండవలెనని యమున పట్టుబట్టి ఏర్పాటు జేయించెను. పరిచారిక వలె పనిచేయు మానస పుత్రిక యమున ఆమెను యోగ క్షేమములను చూచుచూ, అవసరమును బట్టి మందలించుచూ కన్నతల్లి బిడ్డను సాకునట్లు సాకుచుండెను. 

మీనాక్షి: యమునా, యమునా, చిన్న కీబోర్డు తెమ్ము, ఆయ్యో  పిలిచిన వినిపించుకొనదుకదా! ఎందుకింత పెద్ద కొంప మనకు, యమునా, యమునా. 

యమున: అచ్చట దూరవాణి ఆగక మ్రోగుచున్నది. ఎడతెరిపి లేని దూర సంభాషణలు నెరుపుచున్నానని అర్థము చేసుకొనవలెను కదా! కోట్లు పోసి కొన్న భవనమును కొంప అనుచున్నది. పైగా ఇంత పెద్ద కొంప ఎందుకని అడుగు చున్నది. అమ్మావెర్రి మీనాక్షీ,   నీవిప్పుడు చిత్రసీమలో వెలుగొందు పెద్ద  స్వర కర్తవి నీవు అద్దె కొంపలందుండక సొంత  భవనముండవలెనని నేనే పోట్లాడి బ్యాంక్ ఋణము పై కొనిపించితిని.

"బ్యాంక్ ఋణము వృధా కదా అని అట్లు అంటిని" ఏమీ వృధా కాదు ఋణము ఉండవలెను, లేనిచో నీవు దాన ధర్మములకు అంతయూ అర్పింతువు , ఆ రాఘవునకు 50 లక్షలు ఇచ్చినావు. వాడు తిరిగిచ్చురకము వలే నాకనిపించలేదు. పైగా పెద్దదానివని ఇంగితము మరచి నీకే లైను వేయుచున్నాడు. ఛీ! ఏమీ మోటు మాటలు. అతడు అగస్త్య వంటివాడు. ఆ విషయము  ప్రపుల్లకి రాఘవునకు ఇద్దరికీ పలు మార్లు చెప్పితిని.  అయిననూ తల కెక్కించు కొనక నీవెంట పడుచున్నారు, అందుకే వైట్ ఫీల్డ్స్ నుండి ఇచ్చటికి మార్చినాను. మంచి పని చేసినావు! వారు మాట వినిపించుకొనలేదు నీవయిననూ మాట విని పించుకొని పియానో కడకు తీసుకు పొమ్ము   లేదా చిన్న కీ బోర్డు తెచ్చి ఇమ్ము “జ్వరముగా ఉన్నప్పుడైననూ విశ్రాంతి తీసుకొనక ఏమీ పెంకితనము, కీబోర్డు, పియానో ఏదియూ ఇచ్చునది లేదు, మంచము పైనుండి దిగవలదు! మాట్లాడక పడుకొని విశ్రాంతి తీసుకొనుము.  

మరల దూరవాణి  మ్రోగుచున్నదినే పోవలెను. అని పోవుచూ వెనుకకు తిరిగి  శయ్య పై సాగిలబడిన చందనము చెక్క వలెనున్న ఆమె చక్కదనమును చూచి మైమరిచి     “కన్నడ చిత్ర పరిశ్రమ నందు వచ్చిన అవకాశమును అంది పుచ్చుకొని అద్భుత స్వరకల్పనతో మరుపురాని బాణీల మెరుపురాణి, శాండల్వుడ్ పరిశ్రమనర్రూ తలూపుచూ కుర్రకారును కుతకుతలాడించు కువలయాక్షి, నాలుకలపై నాట్యమాడుచున్న నవయవ్వనాంగి నేడు వడలి వాలినది చిన్నపిల్లవలె నా చేతులందు అనిన నమ్మబుద్ది కాకున్నది.  బాలభానునివలె నింగికెగయుచున్న ఈ స్వరరాణి ఆరోగ్యము స్థిరముగా చూడు వాసుదేవ!” అని ఇష్టదైవమును వేడుకొను చుండగా కళ్ళు తెరిచిన  మీనాక్షిని “పడుకోమని చెప్పిన నీకు కాదూ!” అని కేకవేసి మండువా గదిలోకి పోయి మ్రోగుచున్న దూరవాణిని అందుకొనెను.   మీనాక్షి ముసుగుతన్ని పసిపిల్లవలె పండుకొనెను. 

హలో ఎవరు ఆర్కెస్ట్రా కోఆర్డినేటరా? నేను యమున, మీనాక్షిగారు నేడు స్టూడియోకి రాలేరు, 

మూడు సార్లుగా మీరు పాడిన పాటే పాడుచున్నారు.  నేను ఆమెతోనే నేరుగా మాట్లాడవలెను 

ఆమె తీవ్రజ్వరంతో భాదపడుచున్నారు, మీరు మూడుసారు చేసిన ముప్పయిసార్లు చేసిన పదినిమిషములలో జ్వరమెట్లు తగ్గిపోవును?  "ఫోను ఆమెకివ్వగలరా, ఆమెతో కొన్ని విషయములు చర్చించవలెను." 

ఆమె నిద్రించుచున్నారు. అని చెప్పి సాధనమును ఠక్కున పెట్టివేసెను. వెనుతిరుగునంతలో మరల గంట మ్రోగుచుండెను.  యమున దూరవాణి తీసి చూసి, మ్రోగుచున్నది  తలుపు వద్దనున్న గంట అని గమనించి పోయి తలుపు తీసి "ఎవరు!  నవీన్  ! అమ్మగారు జ్వరముతో భాదపడుచున్నారు, ఆమె స్టూడియోకి రాలేరు.  అనెను. "  టెక్నిషియన్ నవీన్ అని చెప్పిన ఆమె తప్పక వత్తురు " అని అతడు అక్కడే  సోఫాలో కూర్చొనెను. నిద్రించుచున్న మనిషెట్లువచ్చును అయినా నీకు ఈ కొత్త ఇంటి చిరునామా ఎచ్చట లభించెను. అనుచుండగా మీనాక్షి నవీన్ గొంతు విని బైటకు వచ్చి " నవీన్ పని పూర్తి అయినదా ?" అని అడిగెను. మైకులు , మిక్సర్ , స్పీకర్స్  బిగింపులు పూర్తయినవి ఇంకనూ కీ బోర్డు విభాగము వద్దపనులు పూర్తి కావలెను.  ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పరికరముల కొరకు డబ్బు కావలెను అనగా మీనాక్షి చెక్ వ్రాసి ఇచ్చెను. 

నవీన్ వెనుదిరుగుచూ చూచితివా నా ప్రభ అన్నట్టు యమున వైపు చూచి కనుబొమ్మలనెగురవేసెను , “వచ్చుట లక్షలు లక్షలు పట్టుకుపోవుట అని గిణిగి తలుపు మూసి వెను తిరుగుచుండగా మీనాక్షి జ్వరతీవ్రతకు ఒళ్ళు తూలి కుర్చీలపై పడెను. వెంటనే యమున ఆమెను ఒడిసి పట్టుకుని గదిలోకి కొనిపోయి శయ్య పై పరుండబెట్టెను.   మీనాక్షి మూలుగుచూ మరల లేచెను " ఆ సంగీత సంకేత రచన  (స్కోర్ షీట్స్ ) ను ముద్రించి.. " అని బలహీన స్వరముతో యమునకు చెప్పుచుండగా యమున ముఖము వివర్ణ మయ్యెను.  అది గమనించిన మీనాక్షి “కోప్పడవలదమ్మా  రోజులలో ఈ చలనచిత్రమునకు స్కోర్ పని పూర్తగును, అటుపిమ్మట నీవు చెప్పినట్లే విని విశ్రాంతి  తీసుకొందును.”

యమునకు దుఃఖము పొంగుకువచ్చి దుఖాతిశయముచే గొంతు బొగురుపోయెను. పది రోజులనుండి దినరాత్రులొక్కవిధముగా పని చేయుచున్నావు. యంత్రము లైననూ ఇట్లు పనిచేయునా? ఎవరికొర కింత కష్టపడుచున్నావు.  త్వరలో మన స్టూడియో పని పూర్తయినచో … కాళ్ళు పీకులు తలనొప్పి అనుచూ మరల మంచము పై వాలిపోయేను.   యమున “ఇంకేమీ మాట్లాడవలద”ని అరచి డాక్టర్కి ఫోనుచేసి తిరిగి వచ్చి తలకి తలనొప్పిమందు పూసి తలపెట్టెను. వంటగదిలోకి పోయి కాఫి పెట్టి తెచ్చి ఆమెను లేపి తనపై జారవేసుకొని  కూర్చొండబెట్టి మెల్లగా కాఫి తాగించెను.  " అంత  మనవారని పిచ్చి దానివలె నమ్మి స్టూడియో పని వారికి అడిగినంత ధనము ఇచ్చుచున్నావు. ఆ నవీను లక్షలు పట్టుకుపోవుచున్నాడు , ఏమి పని చేయుచున్నాడో చూచుచున్నావా ? నేను పోయి చూచెదమన్న  నాకింత వరకూ (స్టూడియో) అదెచ్చటున్నదో  తెలియదు. 

“నవీను మంచి వాడమ్మా మొన్ననే నాచేతి సంచి ఒక స్టూడియో నందు మరిచి మరొక స్టూడియోకి పోయినాను ఈ నవీనే తెచ్చి ఇచ్చినాడు.”  “వెర్రి మీనాక్షీ నీకెట్లు చెప్పవలెను. అందరినీ నమ్మవలదని వాడెవడో స్కోర్ కాగితములు తెచ్చి ఇచ్చెనని వాడిని మంచి వాడని నమ్మి వాడికి డబ్బిచ్చినావు, నేనూ మంచిదాననే కాఫీ ఇచ్చితిని కదా, ఈ కొత్త ఇల్లు వ్రాసి ఇచ్చెదవా ? అని అడగగా మీనాక్షి మెల్లగా నవ్వి  " తప్పక ఇచ్చెదను నీ వడిగినచో స్టూడియో కూడా రాసి ఇచ్చెదను నాకొడుకును చేసుకొందువా?" అనగా " హి హి హి అని మీనాక్షిని వెక్కిరించెను.  కాఫి త్రాగుట పూర్తి చేసిన తరువాత వంటవాడు , చాకలి, డ్రైవరు వచ్చినారు. వంటవాడు వచ్చి " అమ్మగారు అని కాఫీ తెచ్చి ఇచ్చినాడు ."  యమునకు పిచ్చి కోపము వచ్చి " నీ సమయము ఎనిమిది గంటలు, గంట ఆలస్యముగా తొమ్మిది గంటలకి వచ్చుట నీకు పరిపాటి అయినది.   అమ్మగారికి వంట్లో బాగుండలేదని ఒక్క రోజైననూ ముందుగా వచ్చినావా?" అని  కేకలు  వేసెను.  డాక్టర్ వచ్చి మీనాక్షిని పరీక్షించి పని ఒత్తిడి వల్ల వచ్చే మామూలు జ్వరమే అని జెప్పి సూది మందిచ్చి వెడలెను.  

ఆకొడుకుకి ఈ తల్లి ఏమయ్యేనో అతి గతి పట్టదు అటువంటి బిడ్డ కొరకు ఈమె పిల్లను చూచుచున్నది , పోనీ నీకైననూ అతడెక్కడున్నాడో తెలిసిన చెప్పుము నేను పోయి చీవాట్లు పెట్టెదను. అని ఎద్దేవాచేసెను. మీనాక్షి మొఖము చిన్నబోయినది ఆమె కంట నీరు అసంకల్పితముగా జాలువారుచుండగా "నాకొడుకు అనేక పెద్ద చిక్కు నెదుర్కొ నుచున్నాడు వాడు ఉత్త అమాయకుడు" అనుచున్న ఆమె వదనము జాలిగొలుపుచున్నది. "నీ కొడుకు ఉత్తముడెనమ్మా, కాస్సేపు పడుకొనిన నీప్రాణము కుదుట పడును. అని పడుకొండబెట్టి దుప్పటి కప్పుచుండగా మీనాక్షి కాళ్లనొప్పులతో బాధ పడుచూ కాళ్ళు నొక్కుకొనుచుండెను. యమున ఆమె ప్రక్కనే కూర్చొని కాళ్ళు నొక్కుచుండగా మీనాక్షి నిద్రలోకి జారెను

ఇంతలో దూరవాణి మ్రోగుచుండగా యమున మండువాగదిలోనికిబోయి సాధనమును తీసెను "నేను స్టూడియో  మేనేజర్ని మేడం ఉన్నారా ? ఒక గంట తరువాత మాట్లాడచ్చు ,  స్టూడియోకి రాలేరు " అయ్యో  అట్లయిన పెద్ద చిక్కు వచ్చిపడును అనుచుండగా  ఠక్కున సాధనమును పెట్టి వేసెను. దూరవాణి  మరల మ్రోగుచుండెను. యమున సాధనమును తీసెను  “నేను ఆర్కెస్ట్రేటర్ రోయ్ ని మీనాక్షి ఉన్నారా ? “యమున పాతపాటే పాడెను” దూరవాణి సాధనమును పెట్టగానే ఎదురుగా నిలి చివున్న రాఘవుని చూచెను. అతడిని చూచిన యమున గతుక్కుమనెను.

అది చూచిన రాఘవుని మొఖము జేగురించెను "చెప్పుకున్న జాడ తెలుసుకొన జాలననుకొంటివా ?” “కొత్త భవనము లోనికి మారినపుడు మాటమాత్రమయిన నాతో చెప్పలేదనిన నన్ను నిరోధించుటకు ఎంత ప్రయత్నించుచున్నావో తెలియుచున్నది. “నిన్ను నిరోధించుటకు ప్రయత్నించుచున్నది నేను కాదు”   అదియునూ తెలియును. ఆమె చరవాణికి కూడా స్పందించకున్నది. “అన్నీ తెలిసి ఇచటకేలవచ్చుచున్నావు?” “ఒక ఆశ ఒక భాద్యత నన్నిచ్చటికి తీసుకువచ్చినవి” “అనుటకు నీకు సిగ్గులేకున్ననూ ఛీ ఛీ వినుటకు నాకు సిగ్గుగాయున్నది. మీనాక్షి గారు నిద్రించుచున్నారు నీవిచ్చట క్షణముము ఉండరాదు.”  “ఇది నీ ఇల్లు వలె ఆజ్ఞాపించుచున్నావే  మీనాక్షి లేచువరకూ నేను ఇచ్చటనే కూర్చొందును”  అని సోఫాలో కూర్చొనెను.  నిన్ను చూచిన ఆమె ఆరోగ్యము మరింత చెడును అని యమున కేకలు వేయగానే పనివారు వచ్చి రాఘవుని మెడ పట్టి బైటకు గెంటిరి. 

                                                                          ***

సందీపుడు: ఇంతకీ ఏమా ఆశ? ఏమా భాద్యత? 

రాఘవుడు: మీనాక్షిని ఒప్పించి పెడ్లాడవలెనన్న ఆశ. 

సందీపుడు:మీ వయో భేదమెఱిగి మాట్లాడుచున్నావా?

సందీపుడు: హెచ్చు వయో బేధమున్న ఎంతో మంది స్త్రీ పురుషులు వివాహము చేసుకొనుటలేదా? ప్రియాంక చోప్రా పది సంవత్సరములు పిన్నవాడైన జోనాస్ ను చేసుకొనలేదా , 47 ఏండ్ల హెడి క్లూమ్  30 సంవత్సరముల  జర్మను సంగీతకారుడు కౌలిటిజ్ ని  చేసుకొనలేదా, 43 ఏండ్ల ప్రపంచ ప్రఖ్యాత  గాయకురాలు షకీరా 30 ఏండ్ల స్పానిష్ సాకర్ ఆటగాడు గెరార్డ్ పీకేను చేసుకొనలేదా?  సామ్ టేలర్ అను 53 సంవత్సరముల చిత్ర నిర్మాత  18 సంవత్సరముల నటుడు ఆరాన్ జాన్సన్ని పెండ్లి చేసుకొనలేదా? ఆమె గర్భవతి కూడా అయ్యెను.  నీవు చెప్పినవన్నీ హాలీవుడ్లో జరుగును ఇచ్చట జరగవు అని సందీపుడు చెప్పగా కబీర్ బేడీ  70 వ పుట్టినరోజునాడు  40 సంవత్సరముల  ప్రవీణ్ దుసంజ్ పెండ్లి చేసుకొనెను.  వారిరువురి మధ్య అంతరము  30  సంవత్సరములు. 

సందీపుడు “ ఇవన్నీ చెప్పిన ఒప్పుకొనునన్నది  నీ   ఆశ. ఆమె వప్పుకొన్నచో చేసుకొనుము” అనెను.  “అందులకు నీ సహకారము కావలెను” అని రాఘవుడనెను.  “ అందులకు  నా సహకారమెందులకు?”  అప్పుడు రాఘవుడు “రెండవది, భాద్యత, ఆమె నాకిచ్చిన డబ్బును తిరిగి ఇచ్చుట నా భాద్యత.  నా భాద్యత నిర్వర్తించిన నా ఆశ నెరవేరును. “డబ్బు తిరిగిచ్చినచో నిన్ను ప్రేమించునా?” “ఆమె నన్ను చిన్న పిల్లవానివలె చూచుట మానవలెనన్న నా ప్రేమ తీవ్రత  తెలియవలెనన్న  తిరిగి ఇచ్చివేయుట తప్పదు” “అదినీ ఇష్టము నీడబ్బు నీకిచ్చెదను కానీ నీవు భాగస్వామ్యము నుండి వైదొలగ వలెను” అని చెప్పి డబ్బిచ్చి రాఘవుని సంతకములు తీసుకొని పంపించెను.

                                                                   ***

 సమయము 12 గంటలు మీనాక్షి నిద్రలేచేను. జ్వర ప్రభావము తగ్గెను, ముఖము కొంచెము తేటపడెను.  నల్లని చీర కట్టి తెల్లని ముత్యమువలె మెరియుచున్నావు అనుచూ ప్రఫుల్ల వచ్చెను. యమున “వద్దన్ననూ బయలుదేరుచున్నావు , ఈ రోజుకి విశ్రాన్తి తీసుకొనిన బాగుండును అని  అనుచుండగా మీనాక్షి చరవాణిలో స్టూడియో మేనేజర్ , ఆర్కెస్ట్రేటర్ , సంగీత కారులు మున్నగు వారితో  " మూడు గంటలకు స్కోర్ రికార్డింగు ఏర్పాటు చేయవలసినది” గా కోరెను. వంటవాడు మీనాక్షికి, యమునకి  పండ్ల రసము తెచ్చి ఇచ్చెను. ప్రఫుల్ల పండ్లరసము తిరస్కరించెను   " యమున భోజనము చేసేనా? అని వంటవాడిని " లేదమ్మా యమునమ్మగారు  ఎంత చెప్పిన వినకున్నారు ." అనెను  " నాకు ఎప్పుడు జ్వరము వచ్చినా ఆమె అట్లే చేయును , ఆమెకి చెప్పి చెప్పి విసుగు వచ్చెను. అని వారితో చెప్పి యమునా స్కోర్ షీట్లు ముద్రించినావా అని అడిగెను. యమునా లోపలి పోయి స్కోరుషీట్స్ ఉన్న చేతిసంచిని తెచ్చెను.  బయలు దేరు చుండగా ప్రఫుల్ల మీనా పది నిమిషములు నీతో మాట్లాడవలెను  నీతో మాట్లాడవలెను. " మరొక సారి కలిసెదము ఇప్పుడామెకు జ్వరముగానున్నది అని యమునా అనగా ప్రఫుల్ల యమున పై ఆగ్రహోదగ్రుడయ్యెను " ఇది నాజీవితమునకు సంబంధించిన విషయము, ఇందు నీ జోక్యమనవసరము , మీనా ఏ చెప్పవలెను. " మాఇద్దరి మధ్య ఏబేధము లేదు ఆమె చెప్పిననూ నేను చెప్పిననూ ఒక్కటే " అని మీనా అనెను. " యమున చేతులు పట్టుకుని ఇవి చేతులు కావు  " అనెను యమునా అవి చేతులే " సరే కానిమ్ము కాళ్ళే పట్టుకొందును  అని కాళ్లు పట్టుకొను చుండగా మీనాక్షి అవాక్కయ్యి అతడిని జబ్బపట్టి  పైకి లాగెను. 


                                                    ***   

సందీపుడు: ఇంతకీ ఏమా ఆశ? ఏమా భాద్యత? 

రాఘవుడు: మీనాక్షిని ఒప్పించి పెడ్లాడవలెనన్న ఆశ. 

మీ వయో భేదమెఱిగి మాట్లాడుచున్నావా?

వయో బేధమున్న ఎంతో  మంది స్త్రీ పురుషులు వివాహము చేసుకొనుటలేదా? ప్రియాంక చోప్రా పది సంవత్సరములు పిన్నవాడైన జోనాస్ ను చేసుకొనలేదా , 47 ఏండ్ల హెడి క్లూమ్  30 సంవత్సరముల  కౌలిటిజ్ అను జర్మను సంగీతకారుని  చేసుకొనలేదా, 43 ఏండ్ల ప్రపంచ ప్రఖ్యాత  గాయకురాలు షకీరా 30 ఏండ్ల స్పానిష్ సాకర్ ఆటగాడు గెరార్డ్ పీకే ను చేసుకొనలేదా అంతెందుకు సామ్ టేలర్ అను 53 సంవత్సరముల చిత్ర నిర్మాత  18 సంవత్సరముల నటుడు ఆరాన్ జాన్సన్ని పెండ్లి చేసుకొనలేదా? ఆమె గర్భవతి కూడా అయ్యెను.  నీవు చెప్పినవన్నీ హాలీవుడ్లో జరుగును ఇచ్చట జరగవు అని సందీపుడు చెప్పగా కబీర్ బేడీ  70 వ పుట్టినరోజునాడు  40 సంవత్సరముల  ప్రవీణ్ దుసంజ్ పెండ్లి చేసుకొనెను.  వారిరువురి మధ్య అంతరము  30  సంవత్సరములు.

 “ ఇవన్నీ చెప్పిన ఆమె ఒప్పుకొనునన్నది నీ ఆశ. ఆమె వప్పుకొన్నచో చేసుకొనుము ”  “అందులకు నీ సహకారము కావలెను” అని రాఘవుడనెను.  “ అందులకు  నా సహకారమెందులకు?”  అప్పుడు రాఘవుడు “రెండవది, భాద్యత  ఆమె నాకిచ్చిన డబ్బును తిరిగి ఇచ్చుటభాద్యత , నా భాద్యత నిర్వర్తించినచో నా ఆశ నెరవేరును. “డబ్బు తిరిగిచ్చినచో నిన్ను ప్రేమించునా?” “ఆమె నన్ను చిన్న పిల్లవానివలె చూచుట మానవలెనన్న, నా ప్రేమ తీవ్రత తెలియవలెనన్న  తిరిగి ఇచ్చివేయుట తప్పదు” “అదినీ ఇష్టము నీడబ్బు నీకిచ్చెదను కానీ నీవు భాగస్వామ్యము నుండి వైదొలగ వలెను” అని చెప్పి డబ్బిచ్చి రాఘవుని సంతకములు తీసుకొని పంపించెను.

                                                         ***

 సమయము 12 గంటలు మీనాక్షి నిద్రలేచేను. జ్వర ప్రభావము తగ్గెను, ముఖము కొంచెము తేటపడెను.  నల్లని చీర కట్టి తెల్లని ముత్యమువలె మెరియుచున్నావు అనుచూ ప్రఫుల్ల వచ్చెను. యమున “వద్దన్ననూ బయలుదేరుచున్నావు , ఈ రోజుకి విశ్రాన్తి తీసుకొనిన బాగుండును అని  అనుచుండగా మీనాక్షి చరవాణిలో స్టూడియో మేనేజర్ , ఆర్కెస్ట్రేటర్ , సంగీత కారులు మున్నగు వారితో  " మూడు గంటలకు స్కోర్ రికార్డింగు ఏర్పాటు చేయవలసినది” గా కోరెను. వంటవాడు మీనాక్షికి, యమునకి  పండ్ల రసము తెచ్చి ఇచ్చెను. ప్రఫుల్ల పండ్లరసము తిరస్కరించెను   " యమున భోజనము చేసేనా? అని వంటవాడిని అడిగెను "లేదమ్మా యమునమ్మగారు  ఎంత చెప్పిన వినకున్నారు ." అనెను  " నాకు ఎప్పుడు జ్వరము వచ్చినా ఆమె అట్లే చేయును , ఆమెకి చెప్పి చెప్పి విసుగు వచ్చెను. అని వారితో చెప్పి యమునా స్కోర్ షీట్లు ముద్రించినావా అని అడిగెను. 

యమునా లోపలి పోయి స్కోరుషీట్స్ ఉన్న చేతిసంచిని తెచ్చెను.  బయలు దేరు చుండగా ప్రఫుల్ల మీనా పది నిమిషములు నీతో మాట్లాడవలెను  నీతో మాట్లాడవలెను. " మరొక సారి కలిసెదము ఇప్పుడామెకు జ్వరముగానున్నది అని యమునా అనగా ప్రఫుల్ల యమున పై ఆగ్రహోదగ్రుడయ్యెను " ఇది నాజీవితమునకు సంబంధించిన విషయము, ఇందు నీ జోక్యమనవసరము , మీనాయే చెప్పవలెను. " మాఇద్దరి మధ్య ఏబేధము లేదు ఆమె చెప్పిననూ నేను చెప్పిననూ ఒక్కటే " అని మీనా అనెను. అప్పుడు ప్రఫుల్ల " యమున చేతులు పట్టుకుని "ఇవి చేతులు కావు  " అనెను. యమున "అవి చేతులే "అనెను .  "సరే కానిమ్ము కాళ్ళే పట్టుకొందును  అని   ప్రఫుల్ల యమున కాళ్లు పట్టుకొను చుండగా మీనాక్షి అవాక్కయ్యి అతడిని జబ్బాపట్టి  పైకి లాగెను.       

ఇప్పుడు స్టూడియోకు వెళ్ళ వలెను మూడు నుండి ఆరు గంటలవరకు సెషన్ కలదు . ఆరుగంటలకు వచ్చిన మనము మాట్లాడుకొనవచ్చును అని అనగా " వలదు వలదు మీ ఇంటివద్ద ఇచ్చట మాటలాడుట కంటే మనము వేరొక చోటకు పోయెదము , నేను ఆరుగంటలకు బూమారేంగ్  స్టూడియోకు వచ్చెదను." అని చెప్పి వెడలెను నేను ఆ స్టూడియో వద్ద రికార్డింగ్ చేయుచున్నట్లు ఇతడి కెట్లు తెలియునని మీనాక్షి ఆశ్చర్య పోయెను .

ఇద్దరూ మౌనముగా ఇన్నోవా  ఎక్కి కూర్చొనిరి. మీనాక్షి  బీ టీ ఎం రోడ్డు అనగా  వాహనము కదిలెను. మొదట మన స్టూడియోకి తీసుకుపోయి నీకు స్టూడియో చూపవలెను. నవీను ఏమి చేయుచున్నాడని నన్ను ఆరడి చేయుచున్నావు అని మీనాక్షి  అనుచుండగా యమున ముసిముసి నవ్వులు నవ్వుచూ  “నిన్ను ఆరళ్ళు పెట్టుటకు ఇద్దరు ఉండగా నేనేల నిన్ను ఆరడి పెట్టవలెను.” అనెను. వారిని గుర్తు చేయగానే మీనాక్షి లో ఆందోళన హెచ్చెను " చూచితివా ఎట్లు తెలుసుకున్నారో కదా ఇల్లు మారినాననేమి ప్రయోజనము? స్టూడియో కూడా ఎట్లు తెలుసుకునేనో  కదా ! “ మోహ భ్రాంతి చే వాతిరువారు దీపము చుటూ తిరుగు పురుగులవలె  నీ చుట్టూ తిరుగుచున్నారు.  మోహ వశమున దిగజారి ఎట్లు నా కాళ్ళపై పడుచున్నాడో తలుచుకొనిన జాలి కలుగుచున్నది. 

 “క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః । స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంత  మోహము కూడదని గీతలో కృష్ణుడు చెప్పెనుకదా వీరికి అంతమోహమేలనో.” “నీ వింత అందముగా ఉన్నచో స్త్రీలకే మోహము కలుగును, పురుషులకు కలుగకుండునా!”  హెలెన్ వలే నీ సౌదర్యము ముగ్ద మనోహరము. హెలెన్ అందము  గ్రీకులు ట్రోజన్ల మధ్య చిచ్చు రగిలించెను. నీ సౌందర్యము ఇద్దరి మగవారిమద్య చిచ్చు రగిలించుచున్నది. నీ అందము నందు శక్తి దాగియున్నది.   

 వీరి మోహము చూచిన పిదప బాగుగా అలంకరించుకొనుట కట్టిపెట్టి తిని. పరుషముగా మాట్లాడకుండుటయే తప్పు అయినచో నేను తప్పే చేసితిని, కానీ  ఇది కూడదని నేరుగా రాఘవునకు చెప్పితిని.  “కానీ కేరళ పోయి ప్రపుల్ల కుటుంబమును కలుసుకొనుటకు ఒప్పుకొనుటచే అతడు ఆశావహుడై యున్నాడు. అందుకు కారణము  నీకునూ తెలియును కదా అతడి తల్లిని కలిసి మాట్లాడి ఇది నాకిష్టము లేదని ఆమెతోనే చెప్పవలెనని చూచుచున్నాను.  ప్రఫుల్ల అరుణ తార సవతి కొడుకని నాకనుమానము యుండెడిది.  

ఒకే పురుషుని అరుణతారాతోనూ వేరొక స్త్రీ తోనూ ఛాయాచిత్రములందు చూచితిని. ఆ మరొక స్త్రీని ప్రఫుల్ల అమ్మ అనుచున్నాడు. ఆ విషయము నేరుగా అడుగుటకు అప్పుడు తప్పు  అనిపించిననూ కొద్దీ కాలము తరువాత ప్రఫుల్లను అడిగినాను. నాకు ఒక విషయము తెలిసెను " ప్రఫుల్ల అరుణతార మేనల్లుడు , ఆ రెండవ స్త్రీ కృష్ణన్ చెల్లి. అని మీనాక్షి అనెను. "కృష్ణన్ అనగా వాడెవడు ?" అని యమున అడిగెను . అరుణ తార మొగుడు.  " అబ్బా చంపుచున్నావు కదమ్మా !"  కృష్ణన్ తన  భార్య అరుణతార తో దిగిన ఫోటో,  చెల్లి తో దిగిన ఫోటో రెండూ చూసి, చెల్లి కొడుకు ప్రఫుల్లను సవితి కొడుకనుకొంటిని.అని గలగలా నవ్వ సాగెను. ఇప్పుడు నీ అనుమానము వీడినది కదా ఇంకనూ ముసుగులో గుద్దులాటెందులకు? కేరళ పోవుటెందులకు?

నీవే చెప్పినావు కదా నా అందమందు శక్తి దాగియున్నదని ఆ శక్తిని కృష్ణన్ పై ప్రయోగించి అరుణకు తన భర్తను బహుమతిగా ఇచ్చెదను. అరుణ తారను తనభర్తను కలపవలెనన్న కోరిక వినినంతనే యమున మది ఉప్పొంగెను, "అందరి జీవితములు గురించి ఆలోచించుచున్నావు నీ గూర్చి ఇట్ల ఆలోచించువారు లేరు కదా!" అని యమున వాపోయెను.  "నాగూర్చి ఆలోచించుటకు నీవు ఉన్నావు కదా " అని మీనాక్షి అనుచుండగా  స్టూడియో వచ్చెను.  డ్రైవరు వాహనమును నిలిపిపెను.


Sunday, January 3, 2021

Bharatavarsha 106

బల్లిపాడు నుండి  చిపిడి మార్గములో గండిపోచమ్మ దేవాలయ సమీపములోని, అన్నదేరపేట మార్గమందు బ్రహ్మంగారి గుడి సమీపములోని, బల్లిపాడు నవగ్రహ దేవాలయము సమీపములో ఇట్లు అనేక ప్రదేశములలో ఇళ్ళు  లోగిళ్ళు కలిగిన గౌడసోదరులు ఎప్పుడు ఎచ్చట ఉందురో చెప్పుట కష్టము. అవసరమును బట్టి వేష, ప్రదేశములను మార్చుటలో ఊసరవెల్లి కేమాత్రము తీసిపోని గౌడసోదరులు నేడు బల్లిపాడునందు గౌడ నివాసమందు బసచేసినారు.

 రెండంతస్తుల గౌడనివాసము చుట్టూ కొబ్బరి చెట్లు, పాత ప్రహరీ గోడచూచినవారు అది పాత ఇల్లని ఇట్టే చెప్పగలరు.  ఆ ఇల్లు వారు  బెదిరించి వశపరుచుకొన్నదని  వారిని తెలిసినవారు ఎవరైననూ చెప్పగలరు. గౌడసోదరులిరువురు కాఫీ బల్లవద్ద కూర్చొని కాఫీ త్రాగుచూ  వార్తా పత్రికలూ చదువుచుండిరి  “కట్ట, ఈ  చోద్యము  చూడుమ”నుచూ కొలాయి గౌడ దినపత్రికను కట్ట ముఖంపై విసురుగా కొట్టెను. కట్ట ఆ దినపత్రికను తెరచి చూచి, దిగ్గని లాగి చెంపపై కొట్టినట్టు అదిరిపడి “ఆ నాట్యగత్తె  మంత్రి అయి కూర్చున్నది, మనకి శని దాపురించినది.” అని నుదుటిపై అరచేతితో కొట్టుకొనెను.   

కొలాయి గౌడ: మంచికి వారికి రోజులు కావు! దుష్టులకే దశతిరుగుచున్నది. ఆమె దశ తిరిగి ఆమె  కేంద్ర మంత్రి అయినది. మనకి చెడ్డ కాలము దాపురించినది. మనమిక తగ్గక తప్పదు, ఆ పార్వతి కావలెనన్న మనమే సొమ్ము ఎదురిచ్చుకొని మన కార్యము సాధించవలెను.

కట్ట: చంద్రమతి మనకిచ్చిన మాట మీరినచో ఏమగునో ఆమెకు తెలియును.

కొలాయి: వెర్రిబాగులవలెనున్నావే ఇప్పుడా అరుణతార మంత్రి అయినది.  చంద్రమతిని ఇంకనూ భయపించచవలెననుకొనుట మూర్ఖత్వమగును. నీవెప్పుడూ ఒక స్త్రీ నీకు భార్య కావలెనని  కల్లోనైనా అనుకొనలేదు. ముప్పయి దాటిన పిదప నీకీకోరిక ఎందుకొచ్చేనో, నీకోరిక తీరవలెనన్న రాజీ పడక తప్పదు. 

కట్ట: రాజే వచ్చి అడిగిన  రాజీ  యనునది కట్టగౌడ జీవితములో లేదు

కొలాయి: లేనిచో పార్వతిని మరిచిపొమ్ము. 

కట్ట: పార్వతిది మరిచిపోవు అందము కాదు పాలకోవాలాంటి చిన్నది దానిని మరువగలనా !

కొలాయి: ఆ పార్వతి నీకు దక్కవలెనన్న చంద్రమతిని , ఆమె కూతురుని అల్లుడిని  ప్రసన్నము చేసుకొని వెనువెంటనే నీవు పార్వతిని పెళ్లి చేసుకొనవలెను. 

కట్ట: అవును వారు అరుణతారనాశ్రయించిన  మన ఆటలుసాగవు. త్వరలో పెళ్లి కొక పెట్టుడు ముహూర్తము చూసుకొని మదన గోపాల స్వామి ఆలయమందు పెళ్లాడిన .. 

కొలాయి: మన వూరి దేవాలయములోనా! అదెంత మాత్రము శ్రేయస్కరము కాదు. నాయస్థానమున వాయిదాకి హాజరుగుచున్నట్టు క్రమముతప్పక వారముకొకసారి హాజరుగు ఆ బసవడు మరల వచ్చి గొడవ చేయడని నమ్మ కమేమియునూ లేదు. ఎవరు రచ్చచేసిననూ ఈ విషయమందు ఈ ఊరివారు మనకు మద్దత్తు ఇచ్చువారు కాదు. అందుచే మైసూరువద్దనున్నచాముండేశ్వరి దేవాలయములో నీ పెళ్లి జరిపించెదను. పెళ్లి చేసుకొని, నీ భార్యను  మన గ్రామము హూటగల్లి లో నున్న మన స్వగృహమునకు కొనిపొమ్ము.

“ఒక పది ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అల్లుడిని , నగలు చీరలు కానుకలిచ్చి వీరిచేత పెళ్ళికి అవును అనిపించవలెను.” అని కొలాయిగౌడ అనగా “అయినచో బయలుదేరుము” అనుచూ కట్ట గౌడ కుర్చీపైనుండి లేచెను. 

పిచ్చికన్నా! మనము నేరుగా పోయినచో మన విలువపోవుటయే కాక ప్రభావవంతముగా యుండదు. అందుకే హరికథా భాగవతార్ని  పంప  నిశ్చయించినాను. 

భాగవతార్ ఎందుకు పోవును అతడితో ఈమధ్యనే ఘర్షణ పడి చేయికూడా చేసుకొంటిమి కదా

తనపొలము తనకిచ్చివేసి, కొంత డబ్బిచ్చి మధ్యవర్తిగా పంపెదము.  సోదరా కొలాయి గౌడ  నీ  ఎత్తుగడ  అద్భుతము.

                                                                      ***
భాగవతార్  అన్నియూ చెప్పినాడా, సుకన్యకీ నగలు ఎట్లుండును?
సుకన్య : నగలు చక్కగా యున్నవి, నాకే  నగలైననూ చక్కగా నప్పును. అన్నిటికంటే రవ్వల హారము ముచ్చటగాయున్నది. దండవంకీలు  కూడా ఉన్నచో బాగుండెడిది.   
చంద్రమతి: అంతదూరం పెళ్లి అనిన ఎంత కష్టమో కదా! 
సుకన్య , చక్రి:  పార్వతిని మైసూరు  తీసుకుపోవుట కూడా  కష్టమే కదా.   
కట్ట : పెళ్లి అయినచో ప్రతిఏడాది మీకిటువంటి నగలు కానుకలు వచ్చును 
కొలాయి గౌడ : కష్టమే కానీ అదియే శ్రేష్టము, పార్వతికి పెళ్ళి అని చెప్పకుండిన మంచిది. 
చంద్రమతి:  గట్టిగా మాట్లాడవలదు పార్వతి లోపల గదిలోనున్నది.  
సుకన్య: ఆమె  గాఢ నిద్రలో నున్నది అది మొద్దు నిద్ర పోవును. 
రేపు 8. 40 నిమిషములకు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయము లో బయలుదేరు ఇండిగో విమానము నకు బయలుదేరిన 10. 30 ఆ విమానము బెంగళూరు చేరును. అచ్చటనుంచి మైసూరు ఒకే బస్సులో పోవలెను. మీరు 8. 00  గంటలకు రేపు మధురపూడి విమానాశ్రయములో నుండవలెను.రేపు  మనము రాజమండ్రి విడి విడిగా పోవ లెను.  చాముండిగుడివరకు ఒకే వాహనమందు ప్రయాణించిననూ కలుసుకొనరాదు.

                                                      ***
అన్నయ్యా , నేను పార్వతిని ఎచ్చటున్నావు ?
నేను మీ అమ్మ అరుణతారమ్మ ఇంట హస్తినాపురమునందున్నాను. ఇంకనూ మూడు దినములుండవలెను. నీవెట్లున్నావు ? మీ పెద్దమ్మ క్షేమమేనా?
మా పెద్దమ్మ దిబ్బరొట్టెవలె దిట్టముగానే యున్నది కానీ నాపరిస్థితే అంతుచిక్కకున్నది 
రేపు మైసూరు వద్ద చాముండి ఆలయము సందర్శించవలెనని కొనిపోవుచున్నది. మా అక్క , మా బావ చక్రవంతుడు కూడా వచ్చుచున్నారు. గౌడ సోదరులు వచ్చి మా పెద్దమ్మకు , అక్కకు కానుకలు సమర్పించిరి.  నేను నిద్రించుచున్నానని భావించి పెళ్లి మాటలాడుకొనిరి. 
వర్ష: మంచి పనాయెను, ముల్లును ముల్లుతోనే తీయవలెను , నేను సుందరిని కొండపైకి పంపుచున్నాను. సుందరిని చూచితివికదా. ఆమె వచ్చిన విమానములో రావచ్చును. నిన్ను  గుర్తు పట్టుటకు వీలుగా  పెద్ద ఎర్రగుడ్డ మెడలో వేసుకొని యుండవలెను. చిన్న చేతి అద్దము తో సూర్యకాంతిని విమానము పైకి ప్రసరింపజేసిన ఆమెకు నిన్ను కను గొనుట  మరింత సులభమగును. సుందరి అసామాన్యురాలు.  ధైర్యముగా నుండి పెద్దమ్మకనుమానము రాకుండా మెలగవలెను.
                                                                     ***

చాముండీ కొండపైకి గౌడసోదరులు , పార్వతి కుటుంబము చేరినారు. కొండపైకి చేరిన ఆపిదప  "శుభవార్త" అనుచూ పెద్దమ్మ పార్వతికి పెళ్ళివిషయమును తెలియజేసెను. పార్వతి అతడికింకనూ భయపడవలెనా నేను అరుణమ్మతో మాట్లాడి నా విషయమును చూచుకొందును అనగా " పెళ్ళివిషములో మాట ఇచ్చి తప్పరాదు , మాట ఇచ్చితిమికదా అనుచున్న పెద్దమ్మపై పార్వతికి ఏవగింపు కలిగెను. కానీ అన్నయ్య చెప్పిన మాట గుర్తుకువచ్చి కిమ్మనక నవ్వుచు మెలుగుచుండెను.
 మధ్యానము అయినది.  ముహూర్తములేవియూ లేనప్పటికీ పెద్దవాడైన కొలాయి దేవస్థానమువారితో సంప్రదించుటకు  దేవాలయములోకి పోయెను. మిగిలినవారంతా దేవాలయము బైట యుండిరి.  చముండేశ్వరి ఆలయం సముద్ర మట్టానికి 3,489 అడుగుల ఎత్తులో మైసూర్ కి 13 కిలోమీటర్ల దూరంలో  ఉన్న చాముండి కొండ పైభాగంలో ఉన్నది. 1008 మెట్లు గల ఆ ఎత్తైన మహీధరాలయ ప్రాంగణము సువిశాలముగానున్నది. 5 మీటర్ల ఎత్తుగల నంది, ఎత్తైన గోపురము, చల్లని గాలి మనసునాహ్లాదపరుచుచున్నవి.     

సుకన్య: కొండపైనుండి ఎటు చూచినా  కొండలు కనపడుచున్నవి.  ఇచ్చటనుండి క్రిందకు చూచిన కళ్ళు తిరుగుచున్నవి. దూరముగా  మైసూరు పట్టణము కనిపించుచున్నది.  పార్వతి , చంద్రమతి, సుకన్య , చక్రి కట్ట గౌడ ప్రక్రుతి సౌందర్యమును చూచుచుండిరి. 



ఇంతలో దూరమునుండి పిచుకలు వలే  రెండు విమానములు వచ్చుచు కనిపించుచుండెను. మరు క్షణములో ఒక విమానము  ఆలయముపై తిరుగుచూ విన్యాసములు చేయుచుండెను. ఆ శబ్దమునకు భక్తులందరూ గుమిగూడిరి. "అక్టోబరు 8 వ  తేదీన వాయుసేన దినమునాడు భారత  వాయుసేన నిర్వహించు విన్యాసములవలె నున్నవ"నుచూ అచ్చటున్నవారు అందరూ ఆ విన్యాసములు చూచు చుండిరి. 

మరియొక విమానమందున్న సుందరి క్రిందనున్నమెడలో ఎర్రగుడ్డ చుట్టుకున్న  స్త్రీని  చూచెను. కానీ ఎర్రవస్త్రములు ధరించిన స్త్రీలు ఆ ప్రదేశమందు ఇంకనూ కనిపించుటచే సుందరికి అందు పార్వతి ఎవరని సందేహము కలిగెను.పార్వ  తి తన చేతిలోనున్న అద్దమును పైకి చూపెను. సుందరి విమానమును నిట్టనిలువుగా క్రిందకి దించి విమానము తోక  భాగము నేలకి రెండడుగుల ఎత్తులో నిలిపి యుంచెను. తోకపై కాలు పెట్టి  కాకిపిట్  తలుపుతీసుకొని కూర్చొనుట చాలా సులభము కానీ పార్వతి ఎక్కలేకుండుటచే సుందరి విమానమును పైకి లేపెను.  తేజస్ మార్క్ 2 జెట్ , విమాన విన్యాసములకనువైన ( ఏరోబాటిక్ ) విమానమగుటచే సునాయాసముగా పైకి లేచి మేఘమండలములోకి పోయెను.
 
మొదటి విమానములో నున్నస్క్వాడ్రన్ లీడర్  స్నేహ  అందరినీ ఆకర్షించు చున్నది. ఆమె తన విమానమును బారెల్ రోల్ చేసెను, అనగా పొర్లు దండములు పెట్టు భక్తుడు నేలపైబడి దొర్లినట్టు విమానము గాలిలో పలుమార్లు దొర్లించెను. లూప్స్  , స్పిన్ లతో డచ్ రోల్స్తో ఆకట్టుకొని అందరినీ కట్టి పడవేసెను. జనులందరూ గుమిగూడి కనురెప్పవేయక తాటిచెట్టు ఎత్తులో జరుగుచున్న వొళ్ళు గగుర్పొడుచు అద్భుత ఉచిత విమాన విన్యాసములు  తిలకించుచుండిరి. మరుక్షణములో విమానము నింగిలోకెగసెను. పైకి పోయి చుక్క అయినపిదప తిరిగి నేలపైకి (నోస్ డైవ్) నిటారుగా 90 డిగ్రీ లలో వచ్చుచుండెను నేలను గుద్దుకొని ముక్కలాగునేమో అని అందరూ  భయపడుచుండగా విమానము అటి ట్యూడ్  రికవరీ( చాలా క్రిందకు వచ్చి లేదా   స్పిన్ నుంచి తిరిగి యధాస్థితిని పొందు) పొందెను.
 


సుందరి రెండసారి క్రిందకు వచ్చినపుడు తానే తలుపుతీసి ఉంచగా పార్వతి తన ఇంటి పెరటి జాంచెట్టు ఎక్కినంత సులభముగా తలుపు వరకు ఎక్కెను కానీ లోపలకు ప్రాకలేకుండెను అదిచూసి సుందరి (బారెల్ రోల్ ). అటుపక్కకు  వాల్చెను దానితో పార్వతి కాక్ పిట్లోనికి జారిపడెను. సుందరి తలుపు మూసి యంత్రవేగమును పెంచ గానే విమానము మబ్బులలోకి చేరెను. 
 
కొలాయి గౌడ పెళ్ళికి  ఏర్పాట్లు చేసుకొని బయటకు వచ్చి పార్వతిని తీసుకొని రమ్మని చంద్రమతిని  అడుగగా సుకన్య  చక్రి అచ్చట చుట్టూ చూచుచుండిరి. పార్వతి విమానమెక్కుట  చూచిన ఒక చిన్న పిల్లవాడు తన చేతిని ఆకాశములోకి చూపుచుండెను. పార్వతి మబ్బులలో నున్నది  సుందరి విమానము లేజీ ఎయిట్ , డచ్ రోల్ వంటి మెనూవర్లతో  మైసూర్ వైపు దూసుకుపోయేను.  స్నేహ కూడా తన విమానమును సుందరికి సమాంతరంగా ఎగిరించుచుండెను. రెండు విమానములూ  అట్లు ఆకాశములో సాగుటచూచి భక్తులు నివ్వెరపోయిరి.

                                                                    ***

విమానములు ప్రఖ్యాతిగాంచిన లలితమహల్ పేలస్ మీదుగా పోవుచుండెను. చాముండి కొండలకు 9 కి.మీ.  దూరములో నున్న లలితా మహల్ మైసూర్ లోని రెండవ అతిపెద్ద ప్యాలెస్. మైసూర్ నగరానికి తూర్పున ఉన్న చాముండి కొండల సమీపంలో ఉంది. 1921 లో మైసూర్ మహారాజా హిస్ హైనెస్ కృష్ణరాజ వడయార్ IV ఆదేశాల మేరకు ఈ ప్యాలెస్ నిర్మించబడింది. పునరుజ్జీవన నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ప్యాలెస్కు కేంద్ర గోపురం ముఖ్య ఆకర్షణ. ఇంగ్లీష్ మనోర్ మరియు ఇటాలియన్ పాలాజ్జోస్లను ప్రతిబింబించుచుండెను  “ఈ రెండు అంతస్తుల స్వేత సౌధము పచ్చని పచ్చికపై తెల్లని ముత్యారాసివలె నగుపించుచున్నది” అని పార్వతి సుందరితో అనుచుండగా ఆ పేలస్ పైకప్పుకు వెంట్రుకవాసి ఎత్తులో సుందరి దూసుకుపోయెను. పార్వతికి కళ్ళు మైకముకమ్మెను. మరుక్షణములో విమానము మైసూర్ పేలస్ పై ఆకాశమందు తేలుచుండెను. మైసూరు పెళుసు పళ్ళెములో పెట్టిన మైసూర్ పాక్ వాలే కనిపించెను. కొద్దిసేపు అచ్చట ఎగిరిన తరువాత  విమానము జగన్మోహన్ పేలస్ , జయలక్ష్మి విలాస్ మెన్షన్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భవంతులపై  ఆకాశమందు  దొర్లుచుడెను. 

సుందరి వైమానికురాలివలెకాక విమాన నర్తకురాలివలె నున్నావు , విమానంతో ఇట్లు శాస్త్రీయ పాశ్చాత్త్య నృత్యములను చేయించుట కనీవిని ఎరుగము. అనుచుండగా విమానము  ఫోక్ లోర్ మ్యూజియం ప్రాగణమందు ప్రవేశించెను . దీపావళీ సిసింద్రీవలె తక్కువ త్తులో తారాట్లాడుచూ నిటారుగా నిలిచి గిరికీలు తిరుగుచూ అమాంతము ఆకాశములోకి దూసుకుపోయి పట్టుతప్పి నేలపై పడుచున్నట్టుగా  భూమికి అత్యంత సమీపములోకి వచ్చి తారాజువ్వ వలే పైకి లేచెను.  "ఇచ్చట భూమ్యాకర్షణశక్తి ఉన్నదాన్ని సందేహము కలుగుచున్నది , ఇది తారాజువ్వ వలె ఎట్లు పైకి లేచుచున్నది " అని పార్వతి ఆశ్చర్యపోయుచుండగా "జెట్ యంత్రమనిన మంత్రమే కదా!"  

యంత్రమో మంత్రమో   ఇంక నాకు చెమటలు పట్టి గుండె కొట్టుకొను వేగము పెరిగెను.  అన్నపిదప విమానము నిలకడగా గాలిలో తెలుచుండెను.  " బృందావన్ గార్డెన్ చూచి పోయెదము" అని సుందరి అనెను. " బృందావనమూ వలదు ఏమీవలదు నన్ను విశాఖపట్నము కొనిపొమ్ము"  అమ్మ ఎంత మాట  అన్నీ చూపి బృందావనం చూపకున్న నాకు మాట వచ్చును, అది చూచిన పిదప  బెంగళూరు లో  ఈ విన్యాస విమానము అప్పగించి మనము ప్రయాణీకుల విమానంలో ఇంటికి పోయెదము. అని స్నేహాకు బృందావనం పోవుచున్నామని రేడియో తరంగ సందేశమందించెను. వేరొక విమానంలో నున్న వారితో మాట్లాడుట వీలుపడు నా అన్నట్లు చూచు చున్న పార్వతి తో    "250 నాటికల్ మైళ్ళ దూరం 36,000 అడుగులు ఎత్తు వరకూ సందేశములు  సాధ్యమగున"ని తెలిపి సుందరి పార్వతికి కన్ను కొట్టెను.  

కొద్ది క్షణాలలోఫోక్ లోర్  మ్యూజియం నుండి 16 కిలోమీటర్లు దూరములోగల బృందావన్ గార్డెన్స్ పై సుందరి విమానమును  ( లేజీ ఎయిట్) మెల్లని  గిరికీలు కొట్టుచుచుండెను.  కొద్ది  క్షణములైననూ కాకుండా ఎట్లు చేరుకొనుచున్నావు అని పార్వతి సుందరిని తడియారిన గొంతుతో అడిగెను   “మన విమానము పేరు  తేజస్.  తేజస్ పేరు నీవు వినియె యుందువు. ఇది ఐదవ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్.  దీని గరిష్ట వేగము ఏంతో  చెప్పుకొనుము?” అని అడుగు చుండగా పార్వతికి సన్నగా వణుకు పుట్టెను. ఒక క్షణమాగి సుందరి 2222 kmph. అని చెప్పి యధాప్రకారం విన్యాసములు చేయించుచుండెను . ఈ గోదావరి పిల్ల కంటే  గౌడలే మెరుగు ఈ గోదావరి పిల్ల భారీ నుండి నన్ను రక్షించు చాముండేశ్వరీ అని దణ్ణం పెట్టుకొనెను. ఆ విమానమును అనేకకోణములలో వాల్చి వంచి దొర్లించి , పైకి మబ్బులలోకి ఎగరవేసి పిదప కింద పడవేసి చిన్న పిల్లవాడు బంతి తో ఆడుకొన్నటుగా క్రీడించిన పిదప బెంగుళూర్ వైపు మరలించెను 
 
 87 వ వైమానికదళం స్క్వాడ్రన్ లీడర్ స్నేహ ను అనుసరించి సుందరి తన  తేజస్ విమానమును  ఉత్తర బెంగళూ రులోని యలహంక వైమానిక దళం స్టేషన్లో దింపెను.  విమానములు రెండు నేల వాలిన పిదప, స్నేహ  "ఈ రోజు ఎయిర్ షో కార్యక్రమాన్ని తిలకించుటకు  రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ గారు వచ్చియున్నారు, పదినిమిషములు ఉన్నచో  ఎయిర్ షో కార్యక్రమాన్ని తిలకించవచ్చు" అని పార్వతితో అనెను. సుందరి "నాకు ఒక అవకాశమిచ్చిన విమానవిన్యాసములు చేయవలెననునది అనుచుండగా " ఇప్పటివరకు చేసినవి చాలా తల్లీ , ఇంకనూ చేయవలెనట " అని పార్వతి సుందరివైపు భీతిల్లి చూచుచుండెను.  స్నేహ నవ్వి వారిని సాగనంపెను. ఏకబిగిన ఢిల్లీ విశాఖ విమానం వలె గుక్క త్రిప్పుకొనక జరిగినదంతయూ చెప్పి సుందరి "అట్లు పార్వతీ అపహరణ పర్వము ముగిసెను. అని ముగించెను. 


Friday, January 1, 2021

Bharatavarsha -105

  వాల్తేరు అప్ ల్యాండ్స్ నందు సర్క్యూట్ హౌస్ అనిన తెలియనివారుండరు. అవి ప్రభుత్వ అతిధి గృహములని తెలిసినవారెందరు? ఆ అత్యుత్తమ అతిధి గృహముల చెంత వాటిని తలదన్ను మరియొక  విలాస విశ్రాంత గృహము యోచింపగలవారు ఆ పట్టణమునందు అత్యంత ధనికులై యుండవలెననునది లోక విదితము. డచ్ వారి   నిర్మాణ సౌదర్యమొలికించుచు, పెద్ద స్తంభములు కలిగిన  ఆ సువిశాల    రెండంతస్తుల భవనము రాజ ప్రాసాదమువలె నుండును.   చుట్టూ పెద్ద ప్రహరీ గోడ,  దాటిలోనికి పోయిన పిమ్మట పచ్చటి  పచ్చిక ప్రాంగణముతో చలనచిత్రశాల (స్టూడియో) వలే నగుపించును.  ఆ విలాసగృహము నందొకొక వృద్ధ కాపరి  నాలుగు కుక్కలను సాకుచూ  చిన్న అలికిడైననూ తన గ్రద్ద కళ్ళతో చుట్టూ పరికించుచూ  యాంత్రిక పర్యవేక్షణా నేత్రములనే  చిత్తు జేయుచుండును. 

“నిన్ను మామూలు జిలేబి అనుట పెద్ద తప్పిదము,  వయసు పాకము కారు జిలేబీ అనవలెను” “మరి నిన్నేమనవలెను పాకము కొరకు వచ్చు చీమ అనవలెనా?” అని తన ప్రియునితో వాహనమందు కూర్చొన్న  గ్రేస్ చతుర సంభాషణచేయుచూ వాహనమును నడుపుచున్న అతడి ముక్కును పట్టి వత్తెను. వారిరువురూ విలాసముగా నవ్వుకొనిరి. నల్లని కాటుక కనులు విందుకు రమ్మని ఆహ్వానము పలుకుచుండ జీవముట్టిపడు చున్న  జిలేబీ లేత గులాబీ  పెదవుల నందుకొన్న ఆ వలకాడు  గాఢముగా చుంబించ బోవు చుండగా " రహదారి ప్రణయము ప్రమాద కరమ"నుచూ అతడి పెదవులకు అరచేతిని అడ్డుపెట్టి " బంగాళా దగ్గరలోనే యున్నది కదా అనుచుండగా  వాహనము సంపత్ వినాయకుని గుడి దాటి కొండవంటి ఎగుడు దారిలో ముందుకి సాగి  సర్క్యూట్  హౌస్ వద్ద మలుపు తిరిగి “గ్రేస్ విల్లా” పెద్ద గేటు ముందు నిలిపెను. కొద్దీ క్షణములలో గేటు తెరుచుకొనెను. వృద్ధ కాపరి తన కుక్కలతో సహా ఆమెకు ప్రణామము జేసెను. “నాలుగు కుక్కలూ బాగున్నవి” అని అతడు అనగా గ్రాస్ " ఐదు కుక్కలు " అనెను. అతడి దృష్టిలో ఆ బంగళాలో నుండు జీవులు ఐదు. ఒక మనిషి నాలుగు కుక్కలు. కానీ జిలేబీ దృష్టిలో ఆ భవనమందుండునవి ఐదు కుక్కలు మాత్రమే. 


వారు ఆ భవనంలో మొట్ట మొదటనున్న విశాల సమావేశమందిరములోకి ప్రవేశించిరి. ఆ మందిరము గోడలు నలువైపులా నృత్య భంగిమల లోనున్న అర్ధనగ్న స్త్రీల చిత్రములతో అందముగా అలంకరించబడి ఒక చోట  శిలువ వేయబడిన చిన్న క్రీస్తు ప్రతిమ జేగంటవలే నున్నది.  ఆ మందిరము  మధ్యలో నల్ల మద్ది చెక్కతో చేయబడి నగిషీలతో నిగ నిగ లాడుచున్న బల్లపై  పియానో ఆ ప్రక్కనే కూర్చొనుటకు చిన్నబల్ల ఉన్నవి.  ఐదువందల మంది కూర్చొనగల ఆ సమావేశ మందిరమున  పాలరాతి నేలపై నీడలు తేలుచుండెను.  గ్రేస్  తనకిష్టమైన ఒక ఊరువును , అర్ధ వక్షము లను చూపు  నల్లని సముద్రకన్య చేలము ధరించి ప్రియుని క్రీగంట చూచుచూ, నడిచి వచ్చు చుండగా అతడి కన్నులలో విద్యత్ ఘాతము  తగిలి  వెన్నులోకి ప్రాకినది.  పియానోవద్ద కూర్చొని, పియానో మెట్లు నొక్కుచూ జిలేబీ…

అమెరికా దేశ సుప్రసిద్ద గాయకురాలు డోరిస్ డే పాడిన పాత గీతము పాడుచుండెను. జిలేబి స్వరము ఆ భవనము నందు ప్రతిధ్వనించుచు సన్నగా గేటు వరకు వినిపించుచుడెను.  

You work and work  For years and years

You're always on the go You never take the minute off

Too busy making dough Someday you'll say

You'll have your fun When you're a millionaire 

భవనముముందర భాగమునున్న స్తంభముల వద్ద కుక్కలతో కూర్చొని చుట్ట  కాల్చుచూ కళ్ళు మూసుకొని కాలు ఊపుచూ ఆవృధుడు మైమరచి వినుచుండెను. ఇంతలో నల్లని వస్త్రములు ధరించిన యువకుడు తన పిల్లి కాళ్లతో నిశ్శబ్దముగా కదులుచూ గేటు ముందునే నిలిపి యున్న వాహనమును సమీపించెను, ఆ  ఫెరారీ వాహనమును చూడగానే అతడికి నేత్రములు విప్పారినవి, శ్వాస స్తంభించెను వెంటనే తన రహస్య కెమెరాతో అతడు దాని చిత్రములను గ్రహించెను. అతడు తన చరవాణి కంపనమును గ్రహించి సందేశము వచ్చినదని గమనించి. వచ్చుచున్నానని తిరుగు సందేశము పంపెను.   
Imagine all the fun you'll have  In your 'ol rocking chair
Enjoy yourself  It's later than you think
Enjoy yourself  While you're still in the pink

ఆమె కోకిల కంఠమున జాలువారు శృంగార వేదాంత  భావ పూరితమైన ఆ ఆంగ్ల గీతము విన్నఆమె ప్రియుడు “ఎంతో చిన్నది జీవితం  ఇంకా చిన్నది యౌవనం  ఆగదు ఆగదు యౌవనం… మధువులు నిండిన అధరం అన్నిటిలోఅతి మధు రము అనుభవించరా జీవితం”  అనెడి ఘంటాసాల గీతము వలే నున్నది. అని పాడి వినిపించెను. 

జిలేబి తియ్యగా నవ్వుచూ ఘంటసాల గానమందు భక్తి భావము పండును.  "మరి   శృంగారము" అని ఆమె ప్రియుడు అడగగా  జిలేబీ కిలకిలా నవ్వుచూ అదికూడా భక్తి వలే నుండును.  ఆస్కార్ వైల్డ్ చెప్పినట్టు  " వాట్ ఈజ్ రొమాన్స్  ఫర్ ద పూర్ , రొమాన్స్ ఈజ్ ఫర్ ద రిచ్  రొమాన్స్ పాడిన చేసిన మనవంటి ఐశ్వర్యవంతులే చేయవలెను  "అతడట్లే మైమరచి  చూచుచుండగా "సుందర్ నీవు కూడా దక్షిణామూర్తి వలె రాత్రంతయూ రాచ్చిప్ప వలె నిలిచి యుందువా? అని క్రీగంట చూచుచూ అడిగెను. అతడు మెల్లగా వెనుకనుండి ఆమెను హత్తుకొనెను. 

                                                                       ***

యితడు దక్షిణామూర్తి గారి కొడుకు అగస్త్య, అతడు బసవ వీరిద్దరూ మిత్రులు. అగస్త్య, బసవలను సత్యమూర్తి గూఢచారి కి పరిచయము చేసెను. నేను అగస్త్య , నేను బసవ, నేను జే అని ఒకరితో ఒకరు కరచాలనం చేసుకొనిరి. జే మొరటుగా నల్లగా లావుగా  పొడవుగా ఉండెను. అతడితో కరచాలనము   మిత్రులిద్దరికీ ఉక్కు చేతిని పట్టుకొన్న భావ నను కలిగించెను. "ఇప్పుడు నొమ్మిదిన్నర కావస్తున్నది వేళ మించిపోవుచున్నది కావునా భోజనము చేయుచూ మాట్లాడుకొనుట ఉత్తమము” అని సత్యమూర్తి సూచించెను. 
సత్యమూర్తిగారిల్లు మెడపైనే అగుటతో అందరినీ  మేడపైకి కొనిపోయెను.  అందరూ భోజనముల బల్ల  వద్ద   కూర్చొనగా ఒక్క నిమిషము అని జే తన బట్టల క్రింద తొడుగుకొన్న  రబ్బరు తొడుగు గాలి తీసివేసి సన్నగా మారిపోయెను. సంచిలో ఒకడబ్బా నుండి కొంత ద్రవమును దూదిపై వేసి మొఖమును పెదవులను బాగా రుద్దగా నల్లగా తారు రోడ్డు వలెనున్న జే మొఖం తెల్లగా మల్లె పూవువలె మారిపోయెను. కోమలత్వము అతడి మొఖంలో తొంగిచూచుచుండగా బసవలు ఇద్దరు తమను తాము గిల్లి చూసుకొనిరి.   “మన కళ్ళముందు ఈ పనులు చేయకున్నచో యితడు ఆ నల్లని మొద్దు వంటి వ్యక్తి అని చెప్పినా నమ్మెడివారము కాదు. జే అందముగా నవ్వి “ఈ వృత్తియందు ఒకే విధముగా కనిపించిన ప్రమాదము, ఒకే ఆకారము గల వ్యక్తి ని తరుచుగా చూచినా జనులు శంకింతురు. అందుకే ఎక్కువ కాలము ఒక వ్యక్తి ని అనుసరించునప్పుడు  వేరు వేరు  వేషములు వేయవలెను.  

భోజనము లు వడ్డించు చుండగా చచచకా రహస్య కెమెరాతో తీసిన  ఫెరారీ చిత్రములను  చిన్న ద్రోణు కెమెరా ఉపయోగించి గేటు వెలుపలనుంచే  తీసిన  సుందర్ జిలేబీల చిత్రములను  చరవాణి యందు చూపగా అగస్త్య బసవల మొఖములు కళ  తప్పినవి. గ్రేస్ ముగ్గురు ప్రియులని కలిగి యున్నది, అందు ఇద్దరు శ్యామ్ మరియు సుందర్ . వారిరువురూ డైరెక్టర్లే కాక కుట్రదారులే. మూడవ వ్యక్తి ఎవరో తెలియదు. ఇంకనూ కనిపెట్టవలసి యున్నది. వారి ముగ్గురి వాటాల మొత్తము దక్షిణామూర్తి గారి వాటాలకు ఇంచుమించు సరి సాటి. మరి కొన్ని షేర్లను వారి కొని  వారు సంస్థనుండి దక్షిణామూర్తిని బైటకు పంపవలెనని చూచి అది కుదరకపోవుటచే సంస్థ నిధులను  వేరొక సంస్థకు మళ్ళించుచూ  మాతృ సంస్థను దోచుకొనుటయే కాక, సంస్థ నిధులలో నుండి డబ్బును వాడి దక్షిణామూర్తి గారి పేరు మీద  కారు కొని రెండు విధములుగా ఆయనను ఇరికించినారు. 

బసవడు " రెండు రకములుగా ఇరికించుట అనగా ?"
సంస్థ నిధులను వ్యక్తి గత అవసరములకు వాడుకొనుట శిక్షార్హమైన నేరము. అందుకు అతడు జైలుకు పోవలసి యుండును. రెండవది ఫెర్రారీ కారు…  అని జే  కొద్దిసేపు ఆపి ఊపిరి తీసుకొనుచుండగా తక్కిన అందరూ ఊపిరి తీయుట మరిచి విన సాగిరి.  కరకర నములుట కూడా మాని అందరూ చెవులు నిక్కించి వినుచుండగా అగస్త్య గొంతులో నున్న మంచినీరు  మింగుట కూడా ఆపి విను చుండెను. జే కొంచము సేపు మౌనము వహించి పిదప " ఆ కారు లండన్ లో దొంగిలించబడినది, శ్రీలంక మీదుగా ఇచ్చటకి  దొంగ రవాణా చేయబడినది. ఇంతలో బసవడి  చరవాణి మోగుచుండెను. జె స్నానముల గదిలోకి వెళ్లెను. అవతలివైపు పార్వతి గొంతు ఒక్క క్షణము వినిపించి మూగ బోయే ను. బసవడు మిక్కిలి ఆందోళన చెందుచుండగా పక్క నుంచి ఒక స్త్రీ చేయి ఊపి వెడలుచుండెను. అతడే జే అని అతడు వెడలిన పిదప వారికి తెలిసెను.    

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...