Tuesday, September 24, 2024

స్పానిష్ పాటతో .. ఏం చెప్పాడంటే

గురు శిష్య బంధాల గురించి స్పానిష్ గీతం వింటే మీకే తెలుస్తుంది




గురు శిష్య బంధాలు ఒకప్పుడుఉన్నతంగా ఉండేవి
కానీ నేడుఅవి పలచబడిపోతున్నాయి మనందరికీ తెలుసు
.
యథారాజ తథా ప్రజా అన్నట్లు, యథా గురు తథా శిష్య! ఉన్నతమైన గురువులు ఉన్నతమైన శిష్యులనే తయారుచేస్తారు కొంత మంది గురువులు శిష్యులకు ప్రేమతో బోధిస్తారు అందుకు ఉదాహరణగా ఇలాటి శిష్యులు కనిపిస్తారు. అలాటి గురువుల్లో పూలబాల ఒకరు.
.
స్పానిష్ బాగానేర్పి తన జీవితంలోకి మార్పు తీసుకు వచ్చి తన జీవితంలో భాగం అయ్యాడని పూలబాలని తన పాటతో సన్మానించిన గొప్పశిష్యుడు ఈ చిత్రంలో చూస్తున్న చంద్రశేఖర్

స్పానిష్ అనువాదకుడిగా పూలబాల

మెక్సికో నుండి వచ్చిన  వ్యవసాయరంగ  శాస్త్రవేత్తల కు  రాష్ట్ర ప్రభుత్వ సంస్థ RYSS తరుపున  స్పానిష్ అనువాదకుడిగా పని చేశారు విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు పూలబాల.  తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడమే కాక వ్యవసాయ క్షేత్రాలలో వారితో తిరుగుతూ తెలుగు రైతులు అవలంబిస్తున్న సహజ వ్యవసాయ పద్దతులను వారి కష్టనష్టాలను స్పానిష్ భాషలో వారికి వివరించారు.  



పనంతా ఏ సీ రూముల్లో అనుకుంటే పొరపాటే 90 శాతం పని మండే ఎండలో పొలాల్లో ఉంటుంది.

ఒక చేతిలో మైకు మరో చేతిలో మంచినీరు .. మండే సూరీడు కింద మరో మండే సూరీడు లా ఎడతెగని పని ఉదయం 9. 00 నుంచి రాత్రి 9. 00 దాకా పని ఉంటుందని హోటల్ కి చేరేసరికి రాత్రి 10. 00 అయ్యేదని చెప్పారు.  ఒకప్పుడు ఫ్రెంచ్ అనువాదకుడిగా ఫ్రెంచ్ సమావేశాల్లో పాల్గొని సేవలందించిన పూలబాల నేడు స్పానిష్ శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు కూడా అవేసేవలు అందించారు. పనంతా శీతల సమావేశ మందిరాల్లోనే కాదు సూరీడు కింద కూడా ఉంటుంది.  పొల్లాల్లో అనేక తెలుగు రైతులు మహిళలు అధికారులు చెప్పిన విషయాలను స్పానిష్ అతిదులకి వారి భాషలో చెప్పడం గొప్ప అనుభూతి ని కలిగించిందని అన్నారు పూలబాల.

అంతవారు రావడం అదృష్టం కాదా !

నేను వారి అభిమానిని అని చెప్పుకోడమే కాక పూలబాల ఆమె పై ఆశువుగా అద్భుతమైన కవిత కూడా చెప్పారు (చివరిలో కవిత ఉంది. ) భారతవర్ష గ్రంథ ఆవిష్కరణ లక్ష్మీ పార్వతి గారి చేతుల మీదుగా కలలో కూడా ఊహించనిది.


కేవలం తెలుగు మీద ప్రేమతో తప్ప వచ్చారు కానీ వేరే రకంగా అయితే నాలాంటి వాళ్ళకి ఆమె గేటు వద్దకు కూడా పోలేని పరిస్థితి. భారతవర్ష ఆవిష్కరణ సభకు ఆవిడ వస్తారు అని ఎదురుచూసే వేళలో నా మనసులో ఒక నిస్పృహ అంతవారు నేను అల్పుడి ని నా చిన్న సభకు వస్తారా అనుకుంటుండగా రైయ్ మంటూ దూసుకొచ్చింది ఒక కారు. అందులోంచి మహాలక్ష్మిలా దిగారు తెలుగు అకాడెమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి గారు.
.
లక్ష్మీ పార్వతి ఈ పేరువింటే ఒక సాహితీ వేత్త నాకు గుర్తొస్తారు. ఆవిడ ఐతిహాసిక రచన శ్రమణకం మనందరికీ గుర్తుంది ఉంటుంది. కానీ దానిని నేను ఆంగ్లంలోకి అనువదిం చానని నేను చెప్పేదాకా ఆమెకు కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నేను వారి అభిమానిని అన్నారు పూలబాల. అలా అనడమే కాకుండా ఎందరిమీదో ఆశువుగా కవితలుచెప్పే పూలబాల లక్ష్మీ పార్వతిగారిపై కవితకూడా చెప్పారు
.
శ్రీకృష్ణుడంటి పతికి ఉత్కృష్టమైన సతి
జిలుగు చీరలు కట్టని తెలుగు బిడ్డ
నిను చూసి మురిసేను తెలుగు గడ్డ అంటూ
సాగే కవిత లో ఆమె నిరాడంబరతను సాహితీ
ప్రతిభను కొనియాడారు.
.
నేను ఆరు విదేశీ భాషలలో రాస్తున్నందుకు నన్ను అభినందించారు. అని సంతోషంగా గతాన్ని గుర్తు చేసుకుని మురిసిపోయారు బహుభాషాకోవిదుడు పూలబాల.


Sunday, September 1, 2024

ఆ చెక్కు మార్చుకోలేదు... ఔదార్యం తో ...

అయినా నాకు మిగిలింది కన్నీరే - రచయిత పూలబాల

భారతవర్ష కు మొదటి గాయనీ మణి లక్ష్మి శ్రీవల్లి. పరిచయం అవసరం లేని ఆంధ్రుల అభిమానాన్ని ఆంధ్రుల అభిమాన గాయకుడు శ్రీ బాలసుబ్రమణ్యం గారి ఆశీస్సులను పొందిన లక్ష్మి శ్రీవల్లి గారిని ఒక్క సారిగా కలవలేకపోయినా అంచలంచలుగా తెలుసుకుని వారి తల్లి తండ్రుల దయతో చివరకు భీమవరం లో వారి ఇంట్లో కలవగలిగాను.
.
భారతవర్ష పాటలు కీర్తనలు పాడించడానికి నెలల అన్వేషణ వెదుకుతూ వెళ్లిన నాకు పాటకు , 50 వేలు లక్ష అడిగేవాళ్ళే దొరికేరు. పాటకి 25 వేలు ఇద్దామని తయారయ్యాను. ఒకావిడ చక్కగా పాడేరు. నేను మా తోడి కోడలు కలిసి పాడతాము. ఇద్దరికీ చెరో పాతిక వేలు ఇవ్వాలి అన్నారు. కొంత మందికి స్వరం బాగుందనే మాటే గానీ పాడే పద్దతి బాగాలేదు. నేను కట్టిన బాణీలు సహజంగా రాస్తున్నప్పడు పుట్టినవి. నేను పాట బాణీతో సహా రాస్తాను. ఎవరైనా అంటే అనుకుంటాను. పాడే వాళ్లు బాణీ కట్టించమని అడిగారు.




.
దాంతో సంగీత గురువుల చుటూ పరిగెత్తాను. వారు బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలన్నారు. స్థూడియోల చుట్టూ పరిగెత్తాను. నా సాహిత్యానికి ఆరెండూ జతపరచిన తరువాత వింటే ... దారుణంగా ఉన్నాయి. నేను రాసిన గీతాలలా లేవు. వాళ్ళిచ్చిన శాంపిల్స్ ఇంకా నాదగ్గర ఉన్నాయి. వింటే బాధే కలిగేది. బాగా పాడే వాళ్ళుంటే బాగుండునని అనేక మందిని కలుస్తూ అనేక ఊర్లు తిరుగుతూ ఉండగా విజయవాడకు చెందిన బుచ్చయ్యాచారి అపాయింట్ మెంట్ దొరికింది.
.
నాగీతాలు బాగున్నాయని మెచ్చుకోడమే కాకుండా నాబాణీలు విన సొంపుగా ఉన్నాయని చెప్పారు. అప్పటికి మూడు నెలలు గడిచిపోయాయి. బాణీలు ఒకే అయితే పాడేవాళ్లు దొరకద్దూ. అన్వేషణ కొనసాగిస్తుండగా ఎట్టకేలకు లక్ష్మి శ్రీవల్లి గారి నాన్న గారి ఫోన్ నెంబర్ దొరికింది. ఆయన భారతవర్ష గురించి విని తెలుగు భాషా సంస్కృతుల గురించి శాస్తీయ సాహిత్యం గురించి నే పడే శ్రమను గుర్తించి వాళ్ళ అమ్మాయికి భారతవర్ష పాటలు పాడమని అనుమతిచ్చేరు.



భీమవరంలో వారి ఇంటికి అనుకున్నరోజున వెళ్లి పాటలు చూబించి. నేననుకున్న బాణీల లో పాడి విని పించాను. ఆ బాణీకి దగ్గర రాగం ఎంచుకుని చిన్న చిన్న మార్పులు చేసి పాడి వినిపించించారు శ్రీ వల్లి గారు. కొద్దీ రోజుల తరువాత భీమవరం విష్ణు రేడియోస్టేషన్ రికార్డింగ్ స్టూడియో లో రికార్డింగ్ చేసాము. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళమ్మగారు కూడా ఉన్నారు. ఆ పాటలు వింటుంటే మనసు గాల్లో తేలిపోయింది. పాటల కోసం స్వరాన్వేషణ ముగిసింది. స్వరరాణి దొరికింది. రికార్డింగ్ ముగిసిన తర్వాత శ్రీ వల్లి గారికి కృతఙ్ఞతలు చెప్పి చేతులో ఒక చెక్కు పెట్టాను. ఇంత వరకూ ఆమె ఆ చెక్కు మార్చుకోలేదు.
.

భాషకి అలంకారం అక్షరమా శబ్దమా ?

 చంపక మాలలో  పద్యాన్ని మొదట  ఇలా రాసాను  

చంపకమాల పద్యంలో నజ భజ జ జ ర అనే గణాలు ఉండాలి. 1వ అక్షరానికి 11 వ అక్షరానికి యతి మైత్రి కుదరాలి అనే నియమాలు ఉన్నాయి. క్రింది చంపకమాల 2వ పద్యంలో  అన్ని నియమాలు సరిగానే ఉన్నాయి  కానీ  మొదటి పద్యంలో 2వ పాదంలో యతి మైత్రి  క-కు  హల్లుల వరకూ సరిపోతుంది.  అచ్చు లకు సరిపోదు.  ఇది చాలా సూక్షమైన లోపం.   

 (మొదటి అక్షరంగా   కి వచ్చి నపుడు 11 వ అక్షరం  కె  కానీ గె కానీ రావచ్చు.)  

కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్  -  ఈ పాదం లో "కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్ మార్చేస్తే పద్యం అందం పోతుంది. కు అనే అక్షరం ఒక్కటి ముట్టుకుంటే ఆ తరువాత వచ్చే అన్ని పదాలు మార్చాలి.   మొదటి పద్యం చూడండి. ఇలా ఉంటుంది.   



చ . అనువు గవేడ భారతి  అహార్య మహత్వ కవిత్వ శక్తతన్ 

  కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్

 కనక మునీకృ ప  భృగువు గాదె సనాతని దివ్య బాసటన్ 

మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్


 రెండవపాదంలో మొదటి అక్షరాన్ని సరిచేసి రాసాను . రెండవ సారి పద్యం ఇలా ఉంటుంది.


చ . అనువు గవేడ భారతి  అహార్య మహత్వ కవిత్వ శక్తతన్  

 గొనబ  గుభాష  యునిచ్చె    కుశాగ్ర రసచై     తన్యమున్   

కనక మునీకృ ప  భృగువు గాదె సనాతని దివ్య బాసటన్  

మనము  న బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్


కానీ మొదటిసారి రాసిన పద్యమే బాగుంటుంది. కారణం శబ్దం ముందు ఆ సూక్ష్మ లోపం ఒడిపోతుంది.  పోతన భాగవతం లో కూడా అక్కడక్కడా ఛందస్సు లో కాంప్రమైజ్ అయ్యాడు. మహాను భావుడు ఆయన ముందు నేనెంత ? 


(అంటే మనోజ్ఞమైన భాష అని అర్థం)




Friday, August 23, 2024

భారతవర్ష భారతీయ ఆత్మకు ప్రతీక - ఆచార్య కృష్ణారావు .

పుస్తకం చేతికి శోభ , మెదడుకి మేత , మనసుకి తోవ మొత్తంగా మనిషికి జ్ఞానం.

అటువంటి చేతికి శోభను చేకూర్చి, మేధను పెంచి, త్రోవను చూపించి, జ్ఞానం కలిగించి, చివరకు మోక్షం ప్రసాదించే ఆక్షర సాక్షాత్కారం భారత వర్ష గ్రంథం.
.
'భారత వర్ష' ' చక్కని వచన ప్రబంధం. ఆధునిక కాలంలో గ్రాంధికం రాయబడిన కావ్యం.

చక్కటి గద్యం , ఛందోబద్ధమైన పద్యాలు, సంస్కృత శ్లోకాలు , గీతాలు, మంచి వర్షనలతో నిండి వెలుగులీను తెలుగు కావ్యం.




భారత వర్షను చదివిన త ర్వాత మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి . ఇందులో ప్రేమ, శృంగారం, ఆధ్యాత్మక దృష్టి, ధర్మ ప్రబోధం, సంస్కృతి పరిరక్షణ, ఆధునిక, భాషా పోషకత్వం, శాస్త్రజ్ఞాన మున్నగు ఎన్నో అంశాలు ఆలోబింపజేస్తాయి.ఇన్ని అంశాలు ప్రక్షిప్తం చేయబడిన మానవతా ప్రబోధ కావ్యం భారతవర్ష. ఎన్నో పాత్రలు , మరెన్నో సందరాలలో, ఎన్నో సన్నివేశాలతో చదువరులకు ఉత్సుకతను కలిగిస్తూ సాగిపోయే రచన.
.
ఉత్తమోత్తము మైన భారతీయ సంస్కృతిని ఉ న్నతమైన తెలుగు భాషా సౌందర్యాన్ని అత్యున్నతమైన మానవతా విలువలను అత్యవసరమైన మనిషి ధర్మాన్ని తెలియ జేస్తూ గుర్తు చేస్తూ, వికసింప జేస్తూ హృదయ వైశాల్యాన్ని పెంచే కావ్యం - భారతవర్ష.
.
ఖారతవర్ష, విదిష, నంది ని, లకుమ, ఆరుణ తార, మీనాక్షి, రాఘవ , కేశవుడు, నాయుడు, మొదలగు వంద పాత్రలను అనుసంధానిస్తూ, మనవుని సకల లక్షణాలనూ స్పష్టంగా వ్యక్తీకరించిన మృహత్ గ్రంథం.
.
కథానాయకుడు భారతవర్ష ఉత్తమ శ్రేణి సంస్కారవంతుడు. భారతీయల సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని, భారతీయ శాస్త్ర జ్ఞానాన్ని, భారతీయ ఆధ్యాత్మిక చింతనను ఆశ్ర యించినవాడు. మనవ జన్మ సార్థకతను గుర్తించినవాడు, ఆచరణవాది అతి సామన్య స్థితి నుండి అత్యున్నత స్థాయికి చేరినా మనిషిగా కర్తవ్యం మీరని స్థితప్రజ్ఞుడు . ఎదుటి వారికి చేతనైన సాయం చేసే కారుణ్యమూర్తి. మనుషులందరూ బాగుండాలని సమాజం పురోగతిలో సాగలని కాంక్షించే మననతామూర్తి. అందర్నీ సమనంగా గౌరవించి, ఆదరించే ఉదారమూర్తి.
.
శాంతి, సహనం, ధర్మం, ధైర్యం, ప్రేమ, కరుణ , ఆధ్యాత్మికత అభ్యదయం, మోక్షం - అన్నీ కలసిన స్థిత ప్రజ్ఞతే భారతీయ ఆత్మ. ఆ ఆత్మమ ప్రతికగా నిలిచే పాత్ర భారత వర్ష. భారత వర్ష. అందరూ తప్పక చదవవలసిన కావ్యం
.
భారత వర్ష కావ్యం భారతీయ సంస్కృతిని, భారత ధర్మాన్ని, మాతృ భాషా ఒన్నత్యాన్ని ప్రకటించే భారతీయ దర్పణం.



భారతవర్ష  పూర్తిగా చదివి మూడు పేజీలు ఇచ్చిన గురువు గారు నాకోసం ఎంతశ్రమ తీసుకు న్నారో  కదా!
నాలాటి అనామకుడికి మీరు ఇంత  సమయం వెచ్చిస్తారని కలలోకూడా అనుకోలేదు. ముత్యముల వంటి  మీ పదాలు చూసి తెలుగు తల్లి నవ్వులనుకున్నాను. మూడు పుటల వ్రాసిన మీచేతులు తెలుగుతల్లి చేతి చేమంతులను కున్నాను.

                                      గురువుగారి చరణాలకు వర్ణమాలలో సుమమాల

అ -ఆ అన్యభాషల్లోవ్రాసినా  -  ఆనందం దొరకలేదు. 

ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్.  ఇంగ్లీషులో పుస్తకాలు వ్రాసాను,  అప్పుడు పొందిన ఆనందం  భారతవర్ష వ్రాసినప్పుడు కలిగిన ఆనందంతో పోలిస్తే చాలా తక్కువ. 

ఇ -ఈ  ఇప్పుడు కలిగిన -  ఈ ఆనందాన్ని చెప్పడానికి నాకు స్ఫురించిన ఒకే ఒక మాట

"బాల్యంలో మా అమ్మ  నన్నెత్తుకొని  ముద్దాడినట్టుంది.  

ఉ - ఊ ఉన్న మాట చెప్పాలంటే మనసు ఊయలూగేస్తోంది.    

ఋ - ౠ

ఋషి వంటి ఆచార్య కృష్ణారావు గారి కరస్పర్శ  తన గ్రంధపు ౠ ఛందము పెరిగింది.  

ఎ- ఏ  - ఐ 

ఎగ్గులు ( దోషాలు )  ఏఱుగొని ( వరద ప్రవాహంలో కొట్టుకొని పోవు) గ్రంధం గంధం పూసుకొంది. 

ఒ - ఓ  - ఔ 

ఒనరారు పదములతో ఎనలేని ఓర్పుతో  ఓరుదీర్చి మీరిచ్చిన  అక్షరదీవెన ముందుమాట

అం అః     అంతాయత్తైన(సొంపైన ) మీ ముందుమాట  నాకు అందుమాటా! 

అందుకే 

మందాక్రాంతమందు గురువర్యులకు పూలబాల పాదాక్రాంతము  

UUU     UII         II          UUI     UUI   UU

శ్రీమంతం  బౌనెన    రుగన      పత్రంబు  లేకాంచ  చిత్త 

మేమందా రంబగు    చదవ     నామ్రేడి    తంబౌగు  ణంబు             

హేమంబే  యంచుతొ లగగ    దాహేఠ    ముల్లాస మెల్ల  

ఆమంత్రి  తంబౌము  దముగ   తెల్గంద   మేలెకృ  తినే

శ్రీమంతంబగుపత్రములను చూచిన మనస్సు ఆనందమును పొందుచున్నది.

 మీరు వ్రాసిన మూడు పత్రములనూ తెలుగందం పరిపాలించుచూ ఆనందమును ఆమంత్రించుచుండగా (నాలో) హేఠము తనంత తానే తొలగి పోయెను.  

Thursday, August 22, 2024

అమ్మ దయ ఎలా ఉంటుందో ఒక్క పద్యంలో

అమ్మ దయ ఉంటే కవి పడుకున్న కలం రాస్తుందనే పద్యం .



.

క. అమ్మకు దయకలి గినచో
కమ్మని తేనెల తలంపు కలమున బట్టున్
నెమ్మిక కలిగిన మదిలో
అమ్మయె కొలువ గయుండు అన్నియు తానై

.
భారతవర్ష లాంటి పెద్ద గ్రంథం రాసే ప్రతిభ నాకు లేదు. అంతా అమ్మ దయే అంటూ భారతవర్ష సరస్వతి అమ్మ పాదాలవద్ద ఉంచిన ఒక పుష్పం మాత్రమే. అన్నారు పూలబాల.

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...