Wednesday, December 16, 2020

Bharatavarsha 94

 న్యూ ఢిల్లీ నార్త్ అవెన్యూ అరుణతార నివాసం: రాత్రి పెరుగుచున్నది కానీ మాలిని అరుణల ఆసక్తి తరగ కున్నది.  “నేడు నీ బిడ్డ కష్టము  ఫలించింది . జాతీయస్థాయి లో గుర్తింపు లభించినది. జీవిత కాలసాఫల్యము నొందిన వర్షుడు మేడపైన గదిలో ప్రశాంతముగా నిద్రించుచున్నాడు. విదిషయూ క్రింద నా గదిలో ఆదమరిచి  నిద్రించుచున్నది. తల్లికి మాత్రము నిద్ర పట్టకున్నది. అరుణ చెంతనే సోఫాలో కూర్చొన్న మాలినితో అనెను . “నా మనసు  నిండినది, చిత్తశాంతము నొందితిని.  మహానంద డోలికయందు నా మనసు పసిపిల్లవలె ఉయ్యాలలూగుచున్నది.  ఇట్టి వేడుక  బంధుమిత్ర పరివారము వలన ద్విగుణీకృతమైనది, కానీ మధ్యలో నందినితో గొడవ ఎచ్చటికిపోవునో అని భయపడితిని.  తక్షణమే సమసిపోవుట గొప్ప అదృష్టముగా భావించవలెను.”


తార :  ఆ అదృష్టము కూడా ద్విగుణీకృతము అగునేమో ?

మాలిని: నీ ఉద్దేశ్యము నాకర్థము కాకున్నది. 

తార :  అనగా నీకిద్దరు కోడళ్ళు వచ్చుఅవకాశము కలదేమో! వీరిరువురి వాలకం చూసిన ఒకటే హృదయము కొరకు పోటీ పడుచున్నట్లు తోచుచున్నది. 

మాలిని: నందినిదంతయూ చిలిపితనము. ఆమె చిలిపితనము  విదిషను ఆటపట్టించునంతవరకే. కానీ నందిని నాబిడ్డ మంజూష కంటే సరళమైనది , సరసమైనది. 

తార :  కానీ ఆమె పండితురాలు. పాండిత్యమనిన వర్షుడు మైమరచును.  చూచితివికదా 

మాలిని: ఏమమ్మా అరుణమ్మ నీవు నన్ను ఆట పట్టించుచున్నావే పాండిత్యమనిన నా బిడ్డకు ఇష్టమే అట్లని పాండిత్యమున్న వారినందరినీ కట్టుకొనునా? కట్టుకొనిన విదిష ఊరుకోనునా! నందిని పండితురాలయిన విదిష దైవ శక్తి సంపన్నరాలు. 

ఆమె  శక్తి  గూర్చి వినియుంటిని. కానీ చూడలేదు. ఆర్ద్రరాతి కావచ్చుచున్నది పోయి పడుకొనుము నేను రేపు బారామతి పోవలసియున్నది. సాయంత్రమునకు తిరిగి వత్తును. నీవు బారామతి పోవుటకు కుదరదని విదిష చెప్పినది. స్థానిక కార్యక్రమమున్నది వెళ్ళక తప్పదు. అని తార అనెను

                                                                       ***

ఆదిత్యుని కోమల కిరణములు లేలెమ్మని జగతిని తట్టి లేపుచున్నవి.  ఆశిరుడు శిశిర  కాంతను తన లంబ కిరణములతో తాకుచూ  హిమ  బిందువుల తో తడిసిన ఆమె దేహమును ముద్దాడు చుండెను. మాలిని అరుణతారాలు మండువా గదియందు కూర్చొని యుండగా పనివారు కాఫీ అందించుచున్నారు. శుకము చూతవృక్షము పై కూర్చొని తీయని రాగాలాపన చేయుచున్నది  ఒక పరిచారిక చీమ వాసిత  రేఖామార్గమును  ఆహారాన్వేషణకు సాగుచుండెను, ఒక ఛిక్రోదము  ఉన్నత వృక్ష శాఖనధిరోహించి  పారిభద్ర ఫలమునారగించుచుండెను. ఉచ్చాకాశ మునెగురు గరుడ మొకటి శరవేగమున క్రిందకు జారి తన లక్ష్యమును ఛేదించి పైకెగిరిపోయెను. కళాదృష్టి తో చూచిన ఆదిత్యుడు భాగవతార్ అనగా నిర్దేశకుని వలె  జగతి రంగస్థలంపై  పిపీలకాది  ఛిక్రోద,  ఖగ  కరిపర్యంతము నృత్యాభినయ చతుర సంభాషణలతో సాగు  యక్షగానము వలె నగుపించును.  

చ. జగతి  మరాళ  కాంతుల  తొచక్క     గవేడు  కజేయు  చుండగా     

మిగుల వన్నెల కాంతుల నుమెచ్ఛు చుపువ్వు   లుపాడు  వేళలో   

ఖగము రెక్కలు జాచుచి   రుగాలు   లుతావు   లుచల్లు  చుండగా 

సగమ  గుబాధ  జూడమ    నసార      ఉషోద    యవేళ  ప్రకృతిన్   

పికము చేయు గానము నాలకించుచూ  వెండి వెన్నెల కాంతులీను చీర  మరకత రాగ రవిక ధరించి సర్వాంగ స్వర్ణాభరణ భూషిత విదిష అభ్యంగనమొనర్చిన కురులను తుడుచుకొనుచు  ఆహా రమణీయమగు ఈ ప్రకృతిని వర్ణించనచో మనసు ఇంకనూ రంజిల్లును కదా అనుకొనెను.   

ఆ.నిత్య  హృదయా   నందము నిచ్చు  భాష

     ముత్య   పువెలుగు  లీనుచు   ముచ్చ టించి         

     విచ్చి నమసును   మెచ్చుచు వెచ్చ జేయు             

      ఎన్న  డు తరగ   కపారు  ఏఱు  భాష      

"రా అమ్మ కాఫీ త్రాగమ"నుచూ అరుణతార పిలిచి కూర్చోడబెట్టు కొనెను. ఏమే  నాఎదురుగానే కూర్చొందువా ? “ఆమె కూర్చొన మని నది”  “ఆమె కూర్చొని మన్నచో  మా  అత్త వున్నది ఆమె ఎదురుగా నేను కూర్చొనను అని   నీవు చెప్పవలెను కదా”  మాలిని ముఖమున కోపము ప్రస్ఫుటంగా కనిపించుచున్నది.  బేల వలే విదిష లేచి నిలిచినది  అప్పుడు మాలిని " వర్షునికి కాఫీ ఇచ్చుట ఏమియూ లేదా నీవు తాగిన నాబిడ్డకు కాఫీ  ఎవరిచ్చెదరు ? " అనగా  విదిష పెదవులు విచ్చుకొని కనులు మెరిసినవి. 

ఆమెకు మేడెక్కి  ప్రియునివద్దకు పోవలెనని ఉన్ననూ  శంఖిణీ రాక్షసులవలె  కూర్చొన్న ఇద్దరినీ దాటి పోవుట బాగుండదని వేచియుండెను. కాఫీ కప్పు చేతికిచ్చి మాలిని పోయి వర్షునకు ఇచ్చి రమ్మని పంపెను .

"వర్షిణి కి ఇష్టమైన చీర ధరించి  సింగారించుకుని  పోవుచున్నది, అగ్ని పై ఆజ్యమును జల్లు చున్నావు"  “నా కొడుకు పై నాకు నమ్మకముంది” “నాకు లేదమ్మా , ఎంత పండితుడైనా మగబుద్ధి ఎచ్చటికి పోవును?” "ఏమగు నమ్మా వాడే మైననూ ఆడపిల్లా భయపడుటకు , ఆడపిల్ల అట్లు చేసినా అన్నీ అమర్చి పెట్టి పెళ్లి చేయుచున్నాడు , అట్లేమైనా  జరిగినచో వారి  పెళ్లి నేను జరిపింతును సరేనా!"  “ఊ , నీ కోడలికి నీకు లేనిది నాకెందుకు మధ్యన” అని పుల్లవిరుపు మాట లాడుచుండగా “అబ్బబ్బ కాఫీ ఇచ్చుటకు పొయినాదమ్మా , సర్వము అర్పించుటకు కాదు” ఇట్లు వారి హాస్య ములు సాగుచుండగా ఒక కుర్రవాడు " మేడం న్యూస్ పేపర్స్ " అని గాజుబల్లపై పెట్టి వెడలెను. 

ఇవి వార్తలా ! అన్నీ శుభలేఖలువలే నున్నవి. ఆహా !!!!!  అరుణా  నాకొడుకు చిత్రము చూడుము ది  హిందూ  మొదటి పేజీ లో అచ్చువేసినారు.  ఓహో !!!!! ఇంకొక పత్రిక హిందూస్తాన్ టైమ్స్  కూడా వర్షుని గూర్చి వ్రాసినది. అమెరికాలో లూయీవిల్   సాహిత్యోత్సవము న పాల్గొనుటకు వర్షునికి ఆహ్వానము చదువుచూ మాలిని గాలిలో తేలి పోవుచున్నది .  అరుణతార " మాలిని నీవు నేడు భోజనము చేయునట్లు కనబడుటలేదు. " అవును నాకొడుకింత ప్రయోజకుడైనాడు నాకలలు పండినవి నాకు ఆకలి ఎట్లు కలుగును. " మరి ఇంత  ప్రయోజకుడైన కొడుకుకి ఈ సామాన్య మైన  నల్ల పిల్లను ఎట్లు చేసుకొందువు? వేరేదైననూ మంచి సమ్మందం చూడమందువా ?"

ఆహా హా హా .. ఎంత చక్కగా విసిరినావమ్మా వల , నా మనసు కనిపెట్టవలెనని. నాకొడుకు వలచి వరించుచుండగా నాకేమి కష్టము , ఇప్పుడే చెప్పుచున్నాను నాకోడలిని   నల్లపిల్ల అనిన ఊరుకొందును కానీ సామాన్యురాలు అనిన ఊరుకొనను." అనుచుండగా ప్రధాన మంత్రి కార్యాలయము నుండి ఫోను వచ్చినది మాట్లాడినపిదప అరుణతార గుడ్లు తేలవేసి సోఫాలో కూలబడినది. మాలిని కి కంగారు పుట్టి సోఫాలో కూర్చొని నిలువు గుడ్లు వేసిన అరుణతారను కదు పుచుండెను.  గ్రామీణాభివృద్ధి  శాఖా మంత్రి  పదవిని అరుణ తారకి ఇచ్చుచున్నట్లు  సమాచార  మందెనని తెలిపి, నేడు పీ ఎం ఓ కార్యాలయమునకు పోవలెను. అరుణా, మాలా యని ఒకరినొకరు ఆలింగనము చేసుకొనిరి. నా కోడలిని సామాన్యురాలని అంటివే ఆమె అడుగు పెట్టిన తరువాత నీకు మంత్రి పదవి వచ్చినది ఇప్పుడేమందువు ? అని మాలిని తారను అడగగా " ఒప్పుకొందును , కలలోనైననూ ఊహించని పదవి వరించుట చాలా విడ్డూరముగానున్నది " అని అరుణ ఒప్పుకొని  ఈమె గూర్చి నీవు చెప్పిన వన్నీ నేడు నమ్ముచున్నాను అనెను.  

 " బ్రేక్ఫాస్ట్ రెడీ మేడం " అని పనివారి పిలుపు వచ్చెను. మాలిని చెవులు దిబ్బడ వేసినవి వార్తాపత్రికలలో తనయుని చిత్రము మరల మరల చూచి ఆనందించుచున్నది. "వార్తాపత్రికలలో చిత్రములనే  చూచి మురియుచున్నావు మేడమీద ఏ చిత్రములు చేయుచున్నాడో చూడవలెను. నా శోభనం రాత్రి అమ్మలక్కలు అట్లే చూచినారట. ఆ కాలమునందు అది యొక్క ఆన వాయతీ గాయుండెడిది." 

  " ఛీ ఛీ ఆకాలమున పల్లెటూర్లందు అట్లు చేసెడివారు. నేడేట్లు చేయుము గదిలోకి తొంగి మన మెట్లు చూతుము. నాబిడ్డ పుస్తకముల పురుగు , ఎల్లప్పుడు చదువుకొనుచుండును , అది నాకు తెలియును. "

నీవిచ్చటనే యుండుము అరుణతార మేడ పైకి పోయెను.  తలుపు మూసిలేదు తెర మాత్రము అడ్డుగానుండెను. తెరకొద్దిగా తొలగించి అరుణ చూచుచుండెను. 

కాఫీ చల్లారిపోవుచున్నది లెమ్ము  అని బల్లపై కాఫీ కప్పును పెట్టి విదిష వర్షుని చెవిలో  గుసగుసలాడుచుండెను కానీ వర్షుడు లేవకుండెను . తడిసిన కురుల చివరిభాగములతో నిద్రించుచున్న ( నటించుచ్చున్న) అతడి చెవిపై రాసేను. అతడు కనులు తెరుచు సమయమునకు ఆ గదిలో నున్న బీరువా ప్రక్కన దాగొని మరల అతడు కనులు మూసుకొన్న పిదప వచ్చి కురులతో చెంపపై రాసేను. ఇట్లు రెండు సార్లు జరిగిన పిదప మూడవసారి వర్షుడు  తటాలున చెయ్యిజాపి   వెనుకకు పోవుచున్న విదిషను పట్టుకొనబో గా ఆమె పైట అతడి చేత చిక్కెను. 

 వర్షుడు పైటను అట్లు పట్టుకొని మెల్లగా విదిష వద్దకొచ్చెను. పైట వదిలి వెనుకనుండి విదిష నడుముపై చేతులు వేసి , ఆమె మెడపై తన పెదవులనుంచి హత్తుకొనెను. విదిష మంత్రించినట్లు  ఏమాత్రము ప్రతిఘటన లేక మైనపు బొమ్మవలె అతడి శ్వాస యందు కరుగుచుండెను. భ్రమరము పుష్ప ముపై వాలినట్లు వర్షుడు ఆమె మెడపై చెక్కిళ్ళపై వాలి తన పెదవులతో ఆమెను చుంబించు చుండగా అతడి చేతులు ఆమె నడుముపై నర్తించుచుండెను. అరుణతార చటుక్కున  క్రిందకి పోయి మాలినితో " నీవు చెప్పినది నిజమే నీ కొడుకు పుస్తకముల పురుగు అని చెప్పిన నేను నమ్మలేదు కానీ పోయి చూచిన పిదప అదియే నిజమని తేలేను , నీవునూ పోయి చూచిరమ్ము అని చెప్పగా మాలిని చకచకా మెట్లెక్కి తెరచాటునుండి చూచి అవాక్కయ్యేను. "నందిని నిన్ను బావగారు అని పిలుచుచున్నది కదా నాకుకూడా నిన్ను అట్లే పిలవవలెనని యున్నది."అని విదిష అడిగెను.  "నీవు బావా అని పిలువుము" అని వర్షుడు అనెను  విదిష " బావా " అని తమకముగా పిలిచెను. వర్షుడు ఆమెను ఏమిజేసెనో కానీ ఆమె కెవ్వని అరిచెను.    మాలిని వెంటనే గబగబా మేడదిగి వచ్చెను.  ఆమెను చూసి అరుణ తార " నీ మొఖం చూచిన  నీ కొడుకు చాలాముందుకి పోయినట్లున్నదే. బాగుగా చదువుకొనుచున్నాడమ్మా! చిన్నపిల్లవాడనుకొనుచునన్నది !" అని వేళాకోళమాడు చుండగా మాలిని " ఈ సంవత్సరము ఆఖరి ముహూర్తము మంజూషది. వచ్చే సంవత్సరము మొదటి ముహూర్తమునకు వీరికి పెళ్లి జరిపించెదను. " అనెను    


Tuesday, December 15, 2020

Bharatavarsha 93

 వర్షుడు, బసవడు, రాఘవుడు , కేశవుడు , సందీపుడు  రాకి , మీనాక్షి , అరుణ , మాలిని, దామిని , మంజూష  నందిని , వలతి , విదిష  రంజిని  మొత్తము బృందమంతయూ కార్యక్రమమైన పిదప ఒక చోట చేరిరి . స్థానిక టీ  వీ ఛానెల్   ప్రతినిధులు వర్షుని తో మాట్లాడు చుండిరి. మరుసటిదినమున  సాహిత్య చర్చ కొరకు అతడినాహ్వానించుచుండిరి.     ఇంతలో బసవడు "    ఢిల్లీలో ఆంధ్రులకు ఆంధ్ర భవనమన్న కడు  ప్రీతి  అచ్చట నోరూరించు ఆంధ్రా భోజనము లభించును. ఇంక అచ్చట  పిండివంటలు రుచి చెప్పనలవికాదు." అనుచుండగా  " అచ్చటికి పోనిచో ఈ రాత్రికి బసవడికి నిద్ర పట్టుట ఎట్లు" అని రాకి అనెను . మన మింటికి పోయి అచ్చట తినవలెను మీరు అందరూ  రెండు రోజులు  అచ్చటనే బసచే య  వలెను.  "  అని అరుణ తార అనెను. " మాకెట్లు కుదురును మాకు హైద్రాబాదు రవీంద్ర  భారతి యందు  కార్యక్రమములు కలవు  రెండు రోజులుండుటకు మాకెంత మాత్రమూ వీలు పడదు. " అని కేశవుడనెను. దామిని రాధాకృష్ణులు , బసవ రాఘవులు, వలతి  నందినులు  మాకెంత మాత్రము వీలు పడదని వట పాడు చుండగా వర్షుడు  తిరిగి వచ్చుచుండెను . ఆంద్ర భవన్కి   బసవడు అందరినీ తోలుకు పోయెను. అరుణ తార సిబ్బంది ముందుగా వాహనములలో పోయి అచ్చట ఏర్పాట్లు చేయుచుండిరి. ఆమె మాత్రము అందరితో నడుచుచుండెను. ఆంధ్రాభవనము చూడగానే బసవడి హృదయ ముప్పొంగెను వెంటనే


అహో ఆంధ్ర భవనమా! అశోక మార్గమందు విశాల సత్రమా!   భోజన ప్రియులకు భూతల కైలాసమా!  ఆంధ్ర రసనపై నీ రుచులాడు చుండ, ఆ చంద్ర తారార్కమై నీకీర్తి  వెలుగుచుండు. అని ఒక చిన్న ఉపోద్ఘాతముతో తన ఆశు కవితను జమ్మని వదిలెను.

ఆవకాయ చవులు   అప్పడముల కరకరలు 

ఎప్పుడు  వలసిన  అప్పుడు దొరుకుచుండు 

గోంగూర ఘుమ్మని రమ్మని పిలుచు కమ్మని

వంటల ఆంద్ర విందు ఆంధ్రభవనులో ఆరగింతు.

అందరూ ఎంతగానో ఆనందించిననూ రాకి మాత్రము " ఛీ ఛీ ఎప్పుడు డ్రామా కంపెనీవాలే  పెద్ద పెట్టున నోరు పెట్టు ఈ బాలుని ప్రక్కనున్నచో నా తల వ్రక్కలగుచున్నది. అనెను . అదివిన్న కేశవుడు వెంటనే " డ్రామా కంపెనీ అన్న అంత  చులకనగా నున్నదా ? " యని అడిగెను   రాకి  కి జరిగిన పొరపాటు అర్ధమయినది. ఆబ్బె  పొరపాటు పడితిని డ్రామా కంపెనీలవల్లే దేశమిట్లు  సుభిక్షంగా నున్నది అని మాట మార్చగా అందరూ నవ్వుకొని లోపలకు ప్రవేశించిరి అందరూ ఎదురెదురుగా కూర్చొనిన పిదప వారి వారికి ఏమి వలయునో ఆజ్ఞాపించి ఎదురు చూచు చుండిరి.  రాఘవుడు ఆంధ్రభవనముపై ఒక చక్కటి తేటగీతి పద్యము చెప్పెను.

ఆవు  రావుర  ననుజిహ్వ  ఆవ  కాయ

చూడ, పాయస గారులు చూడ ఆగ

లేరు,  గుత్తివం కాయకూ  రార  గించ

ఆంద్ర భవన మింకెట్లు మరువ గలరు

వీడి పద్యములు ఎప్పుడు తుస్సుమను ప్రయోగములేకదా అని బసవడనెను  పద్యమంతయూ బాగున్నది కానీ చివర పాదమందు యతి ఎచ్చటున్నది. అని నందిని  చెప్పగా రాఘవుడు మరల ప్రయత్నించి తప్పు చేసెను .  అందరూ కోరగా కేశవుడు ఆఖరి పాదమును మార్చి ఇట్లు పాడెను,  అయిననూ పద్యము అర్ధవంతము గా కానరాలేదు.  

ఆవు  రావుర  ననుజిహ్వ  ఆవ  కాయ

చూడ, పాయస గారులు చూడ ఆగ

లేరు,  గుత్తివం కాయకూ  రార  గించ

మంచి  బొబ్బట్లు తినెట్లు  మరువ  గలరు

“ఇందు  ఆంధ్రభవనమను మాట మాయమయ్యెను.” అని మంజూష అనగా  కేశవుడు " ఈ పద్యమందు ఆదిలోనే అంసపాదమున్నది. ఇటువంటి పద్యములను నేను మరమత్తు జేయజాలను.” అని తన సొంతగా ఆటవెలది పద్యమును ఇట్లు పాడెను.

ఆ. ఆంధ్ర భవనము  లోపల ఆజ్ఞ  ఇచ్చి    
తెచ్చు లోపు  రుచులు  తెలియ  వచ్చె 
తెలుగు భోజన మందున  తెలుగు భాష 
యందు  రుచులు  చూడ  యొక్క తీరె.     

చివరకి అందరూ వర్షుని వైపు చూడగా వర్షుడు ఒక్క చిటికలో దానిని మార్చి ఇట్లు పాడెను.

ఆవు  రావుర  ననుజిహ్వ  ఆవ  కాయ

చూడ, పాయస గారులు చూడ ఆగ

లేరు,  గుత్తివం కాయకూ  రచవు లూరు

ఆంద్ర భవన  మీతీరు నలరు చుండు.

తేటగీతి చిటికలో సవరించినాడు వర్షుడు . ఆహా ఇందులకే కదా ఇతడికి నేడు పట్టము గట్టిననారు. అని రాధా కృష్ణుడు అనెను. మంజూష అవధానం జేసినవాడు  ఆటవెలదిలు పాడుట ఘనము కాదు అనుచుండగా భోజనములు వచ్చినవి. వారు బల్లలపై పెట్టనంతలో వర్షుడు…

శా. సింగాలే   పదిదూ        కెనాన్ద్ర      భవన        ప్రాకార     మందేల నో  

హంగామా సలిపే         రుకాంత    లుఘన     హ్లాదాన     చెంగల్వ లే     

బంగారు   ప్రభచే          లములం   దునదా    పాడు ప్ర    తాపాల తో 

కంగారె    త్తరచూ           పవింత      జనులే     క్రిగ్గాలి      స్తంబించ దా 

“అబ్బో ఏమి ఇతడి దూకుడు! క్షణకాలంలో ఒక శార్దూలము నొదిలినాడే,” అని మీనాక్షి మెచ్చుకొనుచుండగా “ఒక్కటేమి పది పులులను వదలగలడు”  అని మంజూష అనుచుండగా   “నాబిడ్డ అన్నము తినవలెను ఇట్లు చెప్పి చెప్పి ఎంత చిక్కి పోయెనో కదా.” అని మాలిని గారనెను. అందరూ భోజనము తినసాగిరి  కొలదీసేపు  మాటలాగినవి. బసవడు ప్రపంచ తిండి  పోటీలలో పాల్గొనుచున్నట్లు తినుచుండగా దామిని, అరుణతార , మీనాక్షి విస్తుపోయి చూచుచుండిరి. కేశవునకు చేతినొప్పి అగుటచే రంజిని అతడికి తినిపించుచున్నది. మాలినిగారు అటు చూచుచుండగా కేశవునకు జరిగిన ప్రమాదం గూర్చి చెప్పి “చేతినొప్పి వలన తినలేకుండెను” అనెను మాలినిగారు నవ్వి అందుకు “వివరణ ఏల ఇచ్చుచున్నావు.” అనగా “నాకు కూడా చేతి  నొప్పి కలదు”  అని రాకి  అనగా అందరూ దామిని వైపు చూచి నవ్వ సాగిరి. 


నందిని మాత్రము తన వేళ్ళ వీణియలు మీటుచున్నది.  “అందరి కళ్ళు మా మంజూష పై నే యున్నవి దిష్టి తీయవలెను ' అని దామిని అనెను. “అయినచో ఎత్తుకొని తినిపించుము.” అని రాకి “అనగా ఆపని సందీపుడు చూసుకొనును.” అని వలతి అనెను. "దిష్టి తగిలినది వర్షునకు అందరి కళ్ళు వాడిపైనే యున్నవి ముందు వాడికి దిష్టి తీయవలెను." అని మాలిని అనెను 

బావగారి సంగతి నాకు వదిలిపెట్టవలెను అని నందిని అనుచుండగా విదిష బెదుర కళ్ళ జింక వలె వర్షుని చూచెను. వర్షుడు విదిష వైపు ప్రేమగా చూచుచుండెను.  అందరూ భోజనములు ముగించిన పిమ్మట ఆవరణలో చెట్ల క్రింద నిలిచిరి. అరుణ, మీనా, మీఠాపాన్, తినుచున్నారు. రంజని ఒక మీఠాపాన్ తెచ్చి కేశవునకిచ్చెను. నందిని ఐదు వేళ్ళకు చిలకలు చుట్టిన  తమల పాకులతో  వర్షుని  వద్దకొచ్చి  నోటికందించుచుండెను. విదిష నందిని చేతి వేళ్ళ నుండి

" హు ఏమీ బహిరంగ కుతూహలము. వర్షుడు నావాడు” అనుచూ   ఆ చిలకలూడబీకి కింద పారవేసెను.నందిని  త్రాచువలె లేచెను “వర్షుడు నీవాడా నీకిచ్చి కట్టబెట్టినారా? లేక మంజూషవలె ప్రధానమయినదా?” వారిద్దరి మధ్య ఘర్షణ  పెరుగుచుండగా మాలినిగారు నందినిని ప్రక్కకు కొనిపోయినారు.   విదిష ఆమె వంక కోపముగా చూచుచుండెను. 

రాధాకృష్ణ కేశవునితో " పోయి సముదాయించరాదూ  నీవునూ వారింటి మనిషి వేకదా " అని కేశవుని ఎగదోసినారు. అప్పుడు కేశవుడు " మా గురువుగారే  మిన్న కుండినారు. నాకేల ముప్పు నేనునూ మిన్న కుందును గాక" అనెను.   మంజూష, విదిషతో  "వరసకి బావగారే  కదా చిలక చుట్టి ఇచ్చిన ఏమగును?” మాలినిగారు వారికి సద్దిచెప్పగా అందరూ ఒక చోట చేరినారు. అరుణతారగారు  "నేడు ఎంత   శుభ దినము ఇట్లు మనసు ఇట్లు స్వల్ప విషయములకు పాడుచేసుకొని అమృత తుల్యమైన ఆనందమును జారవిడుచుకొనుచున్నారు .  మీరు అతడిని  గౌరవమందిన చోటనే గాయపరుచుచున్నారు. మాలిని తల్లి మనసు  ఎంత దుఃఖించును ఆలో చించినారా ? ఆడవారి నేమీయూ అనలేక   వర్షుడు దూరంగాపోయినాడు. 

కోటి రూపాయలు కట్నమిచ్చుటకు అన్నకావలెను. అతడు రేయింబవళ్లు కష్టపడినా శ్రమను మీకొరకు ఉపయోగించుచుండగా కించిత్తు గర్వమును తగ్గించుకొని అతడికి  ఆనందమును పంచలేకున్నారు. నలభై గెడ్డములు  ఒక చోట ఉ న్న నూ భయమే లేదు కానీ నాలుగు కొప్పు లు ఒకచోట ఉన్న చో  ఇట్లే ఉండును అన్న సామెతను నిజము చేసినారు.

 అని చెప్పుచుండగా నందిని విదిష మంజూష వర్షుని వద్దకు పోయి అతడిని తీసుకు వచ్చిరి.

అన్నను  మంజూష నవ్వించ  యత్నించి విఫలమయ్యెను. నందిని సంస్కృత శ్లోకమును గానము చేసెను.


సనాతన  తనయే,  సాహిత్య శైలే  నందిని మానస  జేతే 

 సుందర వదనే  భారతవర్షే  భక్తి   విజయ వనమాలీ 

పండిత  హృదయే  భగవతి  సదనే  క్షమస్తత్వమ్ ఆచార్యం


వర్షుని వదనమందు విషాదము ఛాయలంతరించినవి. వర్షుని పెదవులపై  నవ్వులు పూచినవి. రంజిని “క్షణములలో వర్షునెట్లు మార్చినదో నందిని జాణ  సుమీ”  నీకంటే జాణను కాను  లేవమ్మాగురువుగారు సాహిత్య ప్రియులు. అందునా సంస్కృతమన్న గురువుగారి కి భక్తి ఎక్కువ. మాలినిగారి మనసు పొంగినది.  మంజూష , విదిష , నందిని లు  వర్షుని  విజయమును కొనియాడిరి. వారి మువ్వురిని చంటకు తీసుకొని వారి భుజములపై చేయివేసి ఒక కుటుంబ సభ్యులవలె మురిసి సేద  తీరెను.   మరల అందరూ కొలది సేపు ఆనంద గగన విహారం జేసిరి    


 నందిని మంజూష విశాఖ పోయెదమని , రాఘవుడు సందీపుడు  బెంగుళూరు పోయెదమని బయలు దేరి వెడలిరి. మీనాక్షి కూడా బెంగళూరు పోవుటకు వారితో కలిసెను. 

మాలిని విదిష పక్కపక్కనే నిలబడి యుండిరి అరుణతార వారి వద్ద కొచ్చి " వర్షు డొక వారము ఇచ్చటనే ఉండవలెను కదా, ఈవారము రోజులు మీరు మాఇంటివద్దనే ఉండ   వలెనని చెప్పుచుండగా , కేశవుడు రంజిని తో " ఈ డాక్టరు వలే నేను వెర్రి మొఖమును కాను  మనమునూ  నాలుగు రోజులిచ్చటనే  యుండి ఢిల్లీ చూచి పోయెదము అని  మాలిని గారితో మాత్రము"   మేము హైదరాబాదు పోవలెను మాకు విమానము సిద్ధముగానున్నది " అని చెప్పి బయలుదేరెను.  రాధాకృష్ణ దామినితో " ఆకేశవుని వలే నేను వెర్రి మొఖ మును కాను , అతడెప్పుడూ  డప్పు వాయించుకు తిరుగును, శృంగారమనునది ఉండవలెను. మనమునూ  నాలుగు రోజులిచ్చటనే  యుండి ఢిల్లీ చూచి పోయెదము అని  మాలిని గారితో మాత్రము  "   మేము విశాఖ కు  పోవలెను మాకు విమానము సిద్ధముగానున్నది. "అని చెప్పి బయలుదేరిరి. బసవడు కూడా అందరివద్ద సెలవు తీసుకొని   చెన్నపట్నము పోయెను.  అరుణతార వాహనము ప్రవేశ ద్వారము వద్ద నిలిచి యున్నది. వాహనమందు వర్షుడు విదిష , మాలిని తార కూర్చొనగా వాహనము నార్త్ ఎవెన్యూ ఎం పీ నివాసముల వైపు సాగి పోయెను.


Sunday, December 13, 2020

bharatavarsha 92

శిల్ప నిర్మాణ  సౌష్టవమును కలిగి  సాహిత్య సంగీత కళా హారముల కాంతులీను యోష,   త్రివేణీ సంగమ ఘోషను ముహుర్భాషా శ్వాస లో నిలిపి భారత రాజధాని యందు సాహిత్య జ్ఞాన జిజ్ఞాసులకు  సోపానములవలె  జిగజిగ లాడు జియ్య వలె, సనాతని విశ్వరూపమువలె   వెలుగుచు భూరి నగరు యొకటి కోపర్నికస్ మార్గమందు కళాదేవళ ధ్వజ స్తంభమువలె నిలిచియుండెను. 

లలిత్ కళ అకాడమీ, సాహిత్య కళ  అకాడమీ మరియు సంగీత నాటక్ అకాడమీ అను  మూడు జాతీయ అకాడమీల ను కలిగి యుండు Y- ఆకారపు భవనమదియె. అదియే భారతదేశపు ప్రఖ్యాత కవీంద్రుడు రవీంద్రుడు విశ్వవ్యాప్త మొన ర్చిన, భారత కీర్తిని సాదృశ్యకము చేయు హిమాలయము.  1963 లో రూపొందించ బడిన రవీంద్రభవన్  మండి హౌస్ నుండి,  పటౌడీ హౌస్ వద్ద అశోక్ మార్గమందు గల ఆంద్ర భవ నము నుండి నడక దూరమునున్నది. విశాలత పచ్చదనం చూపరుల నాకట్టుకొను రవీంద్రభవనమందు 490 మంది కూర్చొను సామర్థ్య మున్న సభాభవనము (ఆడిటోరియము), బహిరంగ రంగస్థలము( ఓపెన్ ఎయిర్ థియేటర్)  కలవు. 


పొద్దు క్రుంగినది. సభాభవనమంతయూ పూర్తిగా నిండినది. విచ్చేసినవారు  కవి పండితవరేణ్యులు , రచయితలు , మేధావులు , బహు గ్రంథ కర్తలు , బహు సన్మాన గ్రహీతలు బహుపదవీ అలంకృతులు. దీర్ఘ చతురస్రాకారపు సభా వేదికపైన ఇరువది మంది  పెద్దలు కైవారం వెంబడి వేసిన ఆసనముపైఁ కూర్చొని యుండిరి . ఆ వేదిక మధ్యలో ఒక పెద్ద గాజు ఫలముగల కాఫీ బల్ల వద్ద మూడు ఉచితాసనములపై అకాడమీ అధ్యక్షులు , ఉపాధ్యక్షులు మరియు ముఖ్య అతిథి ఆసీనులై ఉండిరి.  

రంగస్థలం నుండి మొదటి రెండవ వరుసనందు పాత్రి కేయులు , దృశ్య మాధ్యమ వార్తా ప్రతినిధులు వారి వారి సిబ్బందితో ఛాయాగ్రహణ  ఏర్పాట్లు గావించుకుని సిద్ధముగా యుండిరి. ముందు నుండి ఎడమవైపు మూడవ వరుసలో బసవ కేశవ, సందీప రాఘవులు కూర్చొని యుండిరి. "హృదయాలజిస్ట్ కు వచ్చినాడు కానీ ఎచ్చటు న్నాడో ఎవరికీ తెలియకుండెను. అటువంటి సందిగ్ద సమూహమందు విదిష వలతి యుండిరి. వారు పన్నెండవ వరసలో        కూర్చొనిరి.  అగస్త్య  లకుమ విదిష లు రాలేక పోయినార"ని అందరూ అనుకొను చుండగా సభ ప్రారంభ మయ్యెను.  . 

 లంగా వోణీ ధరించిన ఒక తీగబోడి ఒక కోకిల కంఠి విఘ్నేశ్వర ప్రార్ధన రాగయుక్తముగా వీనుల విందుగా ఆలపించెను.

  శరణం శరణం గజవదానా శరణం శరణం మూషిక వాహన 

  మోదక భోజనమ్ అంకుశధారి మునిజనపూజిత బహుఫల దాతం

  గౌరీ సుకుమారం పరమ దయాకరం ఆనంద కైలాస మేరు నిరత సితం.

వేదికపై ఒక వారగా మైక్ వద్ద తెల్లని సూట్ ధరించి సెక్రటరీ నిలిచి “Now I request the president of the sahitya academy to welcome the chief guest of the today’s function అనెను ఒక సభ్యురాలు పుష్పగుచ్ఛమును ఒక అట్టపెట్టెను తీసుకొని వచ్చి సెక్రటరీ కివ్వగా, వారిరువురూ వేదికపైనున్న అకాడమీ ఆద్యక్షునికి అందజేయగా ఆయన తనపక్కనే కూర్చొనియున్న ముఖ్యఅతిధికి అందజేయుటకు లేచెను, ముఖ్య అతిథి  కూడా లేచెను  అధ్యక్షుడు ముఖ్య అతిధి కి పుష్పగుచ్ఛమును జ్ఞాపికను అందజేసెను. పిమ్మట వారిరువురూ పరస్పరము వందనమొనర్చుకొని ఆసనములపై కూర్చొనిరి.

సెక్రటరీ మరల మైక్ వద్దకొచ్చి  “ president of the Sahitya academy ..vice president of the academy chief guest of today’s function , respected writers , members of sahitya academy and winners of sahitya academy awards of previous years …a warm welcome to you all. తరువాత అతడు ముఖ్య అతిథి  గొప్పతనమును అతడు చేసిన సాహిత్య సేవను అతడు అలంకరించిన పదవులను చెప్పుచుండగా సభికులందరూ ఆశ్చర్యమునకు లోనయ్యిరి అతడి ప్రసంగము కొనసాగుచుండెను. 

మాలినిగారు "  చూచితివా తారా మంజూషను పంపి విదిష ను పిలిచిననూ రాలేదు”

వర్షుడు పిలవవలెనని ఆమె అనుకొనుచున్నదేమో?

వర్షుడే మంజుషని పంపినాడు, అది విదిష వద్దకు పోవుట నేను చూసితిని  వెంట దీసుకు రమ్మని చెప్పిన నూ  విదిష ని తీసుకురాక వంటరిగా వచ్చినది. తార వెనుకకి తిరిగి చూసి మీ అమ్మాయి వెనుక నే యున్నది నందినితో కలిసి నవ్వులాటలో ములిగినది దామిని " ఇంకా చిన్నతనము కొంచెము వయసు రావలెను " అని అనుచుండగా మాలిని ఆమె వైపు కొరకొరా చూచెను.

He held many positions later on. He was pillar of the academy in good times and drastic times. we miss you  sir but we still need his guidance. వ్రాసిన కొన్ని  గొప్ప  పుస్తకముల గూర్చి చెప్పి ముగించి సభికులందరినీ ఒక్కసారి లేచి కరతాళ ధ్వనులు చేయమని కోరగా సభికులందరూ లేచిరి. దామిని వేడుకకు తిరిగి చూడగా వలతి  పక్కనే నిలుచున్న విదిష కనిపించెను. ఆ విషయమును మాలినిగారికి తెలుపగానే క్షణామాలసించక పోయి విదిషను తీసుకువచ్చి ఆమె స్థానములో దామినిని కూర్చోండ బెట్టెను. ఇంకనూ కరతాళ ధ్వనుల సద్దు మణగ కుండుటచే అందరూ వేదికపై కి చూచు చుండిరి. కొద్దీ క్షణముల పిదప అందరూ స్థలములలో కూర్చొనిరి. అరుణతార తలతిప్పి ప్రక్కనే కూర్చొని యున్న  విదిషను చూసి ఆశ్చర్యపోయేను.  

 Sahitya Akademi, the highest and the most prestigious national academy of letters in India, established in 1954, which has published around 6000 books till date, roughly one book per 19 hours in 24 Indian languages besides organizing a variety of workshops, seminars, conferences and talks on Indian literature and bestowing the most consecrated national literary awards each year. సెక్రటరీ సాహిత్య అకాడెమీ గొప్పతనమును గూర్చి చెప్పుచుండెను.


మాలినిగారు విదిషతో "  నీవిచ్చట లేకున్నా వర్షుడి మనసు వికలమగును , మన కనుల వెలుగు చూడవలెనని , మన ఆనందమున ఆనందమండవలెనని అతడి ఆశను నిరాశచేయువా ఈ సమయము మరల వచ్చునా తల్లీ అని చెప్పి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని పట్టుకుని యుండెను. మీనాక్షి ఆమె ఆపేక్షను కని పరవశమొందుచుండెను.

సుందరి , రంజని ఆదృశ్యము చూసి మోసిముసి నవ్వులు నవ్వుకొని "  ఎంత గట్టిదమ్మా మాలిని , క్షణములో కోడలిని పట్టి తెచ్చెను , కట్టి కూర్చొండబెట్టెను " అనుకోను చుండగా మాలిని వారిని పట్టించుకొనక పిల్లలవలె  వారిని చూచెను.

Among the winning books are six poetry collections, four novels and six books of short stories, besides two books each of essays and criticism. The awards were recommended by distinguished jury members representing 23 Indian languages and approved by the Executive Board of the Akademi, under its President

మొట్టమొదట అస్సామీ రచయిత ని వేదికపైకి ఆహ్వానించిరి. కుల్ధర్ సైనిక వచ్చి వేదిక పై  రచయితల కొరకు ఆసనము పై కూర్చొనగా అకాడమీ ప్రెసిడెంట్ శాలువాకప్పి , జ్ఞాపికను అందజేసెను.   “డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పని చేసిన సైకిక , విశిష్ట సేవలకు గాను భారత  రాష్ట్రపతి నుండి  మెడల్ ను అందుకొని, కథ అవార్డు అందుకొనెను.” అని సెక్రటరి ప్రకటించెను. తరువాత ఢోగ్రి , బోడో భాషల రచయితలను ఆహ్వానించిరి  సెక్రెట్రీ  మైక్  వద్దనుండి ఆహ్వానించుట రచయిత వేదిక మధ్య లో నున్న కుర్చీ పై కూర్చొనుట పక్కనే ఉన్న ప్రెసిడెంట్ ఆ రచయితకు శాలువాకప్పి పురస్కారం అందజేయుట జరిగెను.

The award in Telugu goes to Bhakti Vijayam , Telugu poetry. Now I welcome Bharatvarsha on to the dias. వర్షుడు పంచె కట్టులో వేదికమద్యలోకి వచ్చి కూర్చొనెను . భారత వర్ష కళ్ళు తల్లి కొరకు విదిష కొరకు వెదుకు చుండెను.  మాలిని గారి కళ్ళు వర్షుడి కళ్ళు కలిసినవి  మాలినిగారి కళ్ళు వర్షిచుచుండెను.  తరువాత వర్షుడి కళ్ళు  విదిష కళ్ళు కలిసెను విదిష కళ్లు   మెరియుచుండెను. వర్షుడి గుండె నిండెను. సీక్రెట్రీ వర్షునిగూర్చి ఎదో చెప్పుచున్నారు  కానీ మాలినిగారికి విదిషకి అతడి గురించి తెలుసుకొనవలసినదేమియునూ లేదన్నట్టు తృప్తిగా చూసుకొని మురిసిపోవుచున్నారు . మీనాక్షి, అరుణతార ఆమె మొఖం లోకి చూచి ఆమె ఆనందమును అబ్బురంగా చూచిరి. 

వారి సరసన కూర్చొనుట ఒక యోగముగా భావించవలెను. మరట్టి సభాభవనమునున్న   సభావేదిక పై నీకొడుకు కు సన్మానము జరుగుట చూడవలెను. అని మీనాక్షి తారలు మాలినిని అభినందించిరి. విదిష కూడా అదృష్టవశమున ఇచ్చట నుండుటచే అంతయూ సవ్యముగా జరిగినట్లు భావించవచ్చు నని వారు అనుకొనిరి.

తరువాత వై ప్రెసిడెంట్ గారు హిందీలో సభనుద్దేశించి ప్రసంగించిరి “వచ్చే వారం  జరిగే కార్యక్రమంలో రచయితలకు ఫలకం,  లక్ష రూపాయల చెక్కుతో కూడిన ఈ అవార్డును రచయితలకు అందజేయబడును” అని తెలపగా సభ ముగిసెను. 

Bharatavarsha 91

తూర్పుతీర మెల్లయు  వెలుగు రేఖలు ప్రసరించుచుండెను.  తీరరేఖ వెంబడున్న పాథోరాశి ఎల్లయూ తళతళ మెరియుచుండెను.  "విశాఖపట్నము తూర్పుతీర రత్నమను పేరు సార్ధకం చేసుకొనెను " అని ఫెర్రారీ నడుపుచున్న అగస్త్యడు బసవడితో అనెను. మువ్వవాని పాలెమందు బసవడింటివద్ద బయలుదేరిన  ఫెర్రారీ వాయువేగమున పోవుచున్నది. మద్దిలపాలెము, అక్కయ్య పాలెము , తాటిచెట్ల పాలెము, మర్రిపాలెము  దాటి కొత్తరోడ్డు వైపు దూసుకు పోవుచున్నది. "అగస్త్య నీవు నిన్ననే విదిష వద్దకు పోయినావు కదా మరల నేడేల వచ్చుచుంటివి?" బసవడు అడగగా  "నీవు పార్వతి గూర్చి అడుగుటకు పోవుచుంటివి కదా,  నాకునూ లకుమగూర్చి అడుగవలెనని ఆలోచన కలిగినది, నిన్న కేవలము మా నాన్న ఆరోగ్యము ఆస్తి గూర్చి అడిగితిని గాని లకమగూర్చి అడుగుట మరిచితిని. తల్లి లేకుండుట ఎంత భాధాకరమో మనని ప్రేమించువారొక్కరూ  లేకుండుట ఎంత దుర్భరమో కదా అని అగస్త్యుడు అనుచుండగా,  "లకుమ తో గడిపినపుడు అమ్మ గుర్తుకు రాలేదు కానీ  ఆమె బొంబాయి పోయిన పిదప నేడు నీకమ్మ గుర్తుకువచ్చుచున్నది. సిగ్గులేని  మొగమన్న నీదేకదా!అని అనుచూ  అయిననూ నీకు చిన్నమ్మ ఉన్నది కదా అని బసవడు  వెటకారపు మాట నొకటి తగిలించెను. అదివిన్న అగస్త్యునకు కారము రాసినట్లయ్యెను. ఈమెను అమ్మ అని మరొక సారనినచో మర్యాద దక్కదుఅని అగస్త్యుడు మొఖం మాడ్చుకొని ఆక్రోశించుచూ  "తల్లి అనిన నా తల్లి మీనాక్షి" అని అగస్త్యుడు గర్వంగా  చెప్పెను. ఎంతకాదన్ననూ మీ నాన్న చేపట్టిన  గ్రేస్ కూడా నీకు తల్లే కదా , కాకున్నచో సవతి తల్లి .. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అని ఆశుకవితాలతో ఆట పట్టించు చుండగా   ఫెరారీ కొత్తరోడ్డు చేరినది. బసవడు “కారాపిన అల్పాహారం తిని పోయెదము. ఇచ్చట దేవీవిలాస్నందు దోసెలు బాగుండును. బుచ్చిరాజు పాలెమందు తోపుడుబండి పై అమ్ము గారెలు అమ్మ చేతి వంటవలె కమ్మగా యుండును.” 

అని చెప్పుచుండగా, కారాపి  , తిండి గూర్చి వర్ణించుకున్నచో నీకు పుణ్యముండును.  మెక్కిరమ్ము అని హోటల్ముందు కారాపగా బసవడు లోపలకి పోయెను.   అచ్చటనున్న వారు ఆ కారు చుట్టూ చేరినారు. అందిద్దరు ఆంగ్లవార్తా పత్రిక పాత్రి కేయులు కలరు. " 1962 తయారీ ఫెరారీ ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కారు. గత కొద్దీ కాలంగా మీరీ ఫెరారీ వాడుచూ నగరమందు  పెను సంచలనమగు చున్నారు, మాపాత్రికేయులకు చిక్కక తుర్రు మనుచున్నారు " అని అగస్త్యని వాహనంతో  ఛాయాచిత్రములను గ్రహించి, కొన్ని  వివరములడిగి తెలుసుకొని వెడలిరి. 

బసవడు బయటకు వచ్చి వాహనమెక్కెను. "విదిష ధ్యానములోకి పోయినచో పడ్డ శ్రమ అంతయూ వృధా అగును.   కావున నేరుగా సబ్బవరం పోవలెను."  అని వాహనమును నడప సాగెను. ఫెరారీ వాయువేగమున నైరుతి దిక్కుగా సాగి కొలది సేపటిలో సబ్బవరం చేరెను.

                                                                    ***

నంది నాటకోత్సవాల్లో పాల్గొని భానోదయ కళాబృందము కర్నూలు నుండి హైద్రాబాద్ వేనులో వెనుతిరుగుచుండెను.  కేశవుడు, రంజిని కాక నక్క నాగేశ్వరరావు , పిల్లి పాపాయమ్మ , కొత్త సుబ్బారావు ముగ్గురే వాహనమందుండిరి. వాహన చాలకుడు మస్తాన్ వాహనమును నిదానముగా నడుపుచు “భా ఆ ఆ నోజీగారు కూడా వచ్చిన బా ఆ ఆ గుండెడిది.” “భానోజీరావు గారు నిన్ననే హైద్రాబాదునందు కొంత మంది మన కళాకారులతో కలిసి రంగసాయి థియేటర్ ఫెస్టివల్ లోపాల్గొని అలసినారు.” అని రంజిని చెప్పెను.  “ఆ ఉత్సవము కూడా నందిఉత్సవము వలే నుండునా? నా ఆ ఆ  కు నూ నటించ వలెననున్నది.” మస్తాన్ నత్తిగా మాట్లాడుచూ వాహనమందున్న కళా కారులందరికి వినోదమందిచుచున్నాడు. 

“నీవు నటించెదవా?” అని పాపాయమ్మ అడుగగా సుబ్బారావు "రంగస్థలమున ఎవరి సంభాషణలు వారే చెప్పుకొన వలెను. నీవు చలచిత్ర రంగమందు ప్రయత్నించవచ్చు.” అనెను వాహనమందు ముసిముసి నవ్వులు నెలకొన్నవి. 

“కేశవా నీవునూ రంగసాయి థియేటర్ ఫెస్టివల్ లోపాల్గొని కదా, మరి నీవు విశ్రాంతి  తీసుకొనకపోతివా? నీవునూ అలిసితివేమో? నేను ఒక మాసమునుండి రంగుకు రంగస్థలముకూ దూరముగా యున్నాను, మరల ఇదిగో నంది ఉత్సవములతో..  ” అని నక్క  అనెను.

కళాభారతి ఆడిటోరియం నందు విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖతో కలిసి నిర్వహించినది.   ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహిం చిరి.  మధ్యాహ్నం 3. 00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరిగినవి. అని అడిగిన ప్రశ్నతో పొంతనలేని సమాధానమునిచ్చెను.

ప్రశ్న కార్యక్రమము గూర్చికాదు. నీవునూ అలిసితివేమో? మరి నీవు విశ్రాంతి తీసుకొనకపోతివా? అని కొత్త సుబ్బా రావు కేశవునకు నక్క నాగేశ్వరావు అడిగిన ప్రశ్నను గుర్తు చేసెను. "రంజని గారిని నీడవలె కేశవుడు అంటిపెట్టుకొని యుండును, ఆమె ఎచ్చటున్న కేశవుడచ్చ టే యుండును. అని పాపాయమ్మ అనుచూ నీవు ఇంకనూ కొత్త సుబ్బా రావు అనుకొనుచున్నావా   పాత సుబ్బారావు ! " సుబ్బారావు ఆమెను పాపి పాపాయమ్మ అని అనుటతో ఇద్దరి మధ్య కీచులాట మొదలయినది. 

“అబ్బబ్బ ఎప్పుడూ వాదులాటలేనా, కేశవుడు నిద్రించుచున్నాడు.  మస్తాన్ని చూచి మౌనము నేర్చుకొనుడు” అని రంజిని అనగా వారందరూ నవ్వుకొనిరి. ఇంతలో రంజిని గారి ప్రక్కనే కూర్చొని యున్న కేశవుడు ఆమె భుజము పై సోలి నిద్రించ సాగెను.

“కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల రంగస్థల కళాకారులతో పోటీపడి తన నటప్రావీణ్య మును పౌరాణిక పద్యము లను ప్రదర్శించి కేశవ బ్రహ్మ (రావణ బ్రహ్మ వలె)పేగులు చించుకొనెను.” అని కొత్త సుబ్బారావు చమత్కరించెను. ఆసియాబుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పవలెనని తాను ప్రదర్శించు కళ వివరములను తెలుపుచూ కేశవుడు న్యాయ మూర్తులకు అభ్యర్ధన పంపగా, వారి వద్దనుండి స్పందన లభించెను. అని రంజిని గారు చెప్పగా నాగేశ్వరరావు "ఎందుకొచ్చిన ఆరాటమిది"అని నవ్వుచుండగా,   పాపాయమ్మ "కేశవుడు  కళాపిపాసి అతనికి కళాతృష్ణ యున్నదినీకు భోగలాలసత స్వార్ధము తప్ప కళాతృష్ణ  లేదు .  ఇతరుల కళాతృష్ణను అల్పముగా చేసి మాట్లాడుట నీకు తగదు. అయినా భోగలాలస పెచ్చరిల్లి స్వార్ధ పరుల ప్రాబల్యము ప్రపంచమున నానాటికీ పెరుగుచున్నది. ఇట్టివారు క్షణమాలోచించక , కించిత్తు  వెనుదీయక సద్భుద్ది ని భంజించుచున్నారు.  అని గీత శ్లోకము నాలపించెను.  

       “యజన్తే సాత్వికా దేవాన్యక్ష, రక్షాంసి రాజసాః | ప్రేతాన్భూత గణాంశ్చాన్యే  యజన్తే తామసా జనాః ||”

 సత్వ గుణము గలవారు  దేవతలను , రజోగుణము గలవారు యక్షులను రాక్షసులను , తమో గుణము గలవారు భూతప్రేతములను ఆరాధించెదరు అని దీని భావము. అని ముగించెను. రంజని ఆమెను ఆశ్చర్యముగా చూచుచుండెను.  

అందరినీ వినోదపరుచుటకు మన పేగులు చించుకొనుచున్నాము, మరల పోటీలు రికార్డులు నెలకొల్పుట బ్రద్దలుగొట్టుట అని జెప్పి మన బుర్రలు బ్రద్దలు గొట్టుకొనుచున్నాము.రంజిని గారు మీవలె శ్రీ మంతుడినైనచో నేనీ నాటకమును పండించుట గాక నాజీవితమును పండించుకొందును. అని నక్క అనుచుండెను.

ఇంతలో ఒక పెద్ద సరుకులను కొనిపోవుచున్న పెద్ద లారీ మీదకు వచ్చుట గమనించి మస్తాన్ వేన్ ను రహదారి పై నుండి పక్కకు  దింపి మరల ఎక్కించెను  అందువల్ల   వేన్ పెద్ద కుదుపు పొంది ఆసనములపై కూర్చున్నవారు    క్రిందకు విసిరివేయబడిరి . కేశవుడు చేతిపై ఆనుకొనగా చేతికి దెబ్బ తగిలెను, రంజిని కాలు సీటు క్రింద చిక్కుకొని మెలితిరిగి నొప్పిచేసెను. మరల ఏట్లో రెక్కుకొని సర్దుకొని కూర్చొనిరి. మస్తాన్ ని అందరూ నిందిచుచుండగా రంజని "మీచేతిలో చక్రమున్న మీరంతకంటే ఏమిచేతురో ఆలోచించవలె"నని అందరినీ మందలించెను.

మృత్యువు తృటిలో తప్పిన పిదప వాహనమందు ఆధ్యాత్మిక మేఘములలుముకొన్నవి. "మానవ జీవితమూ క్షణ భంగురము అందుచే మనము జీవితమునాస్వాదించవలెను" అని సుబ్బారావు అనగా నక్క " నేను చక్కటి తిండి  తీర్థముతో  నాజీవితమును ఆనందించెదను, మరి నీవెట్లు ఆనందించుచున్నావు అని  సుబ్బారావుని  అడగగా " నేను నా ఫ్రెండ్ తో ..... అని కొత్త చెప్పెను. కేశవుడు నవ్వి నిద్రలోకి జారుకొనెను. 

                                                                      ***

సబ్బవరం చేరిన మిత్రు లిద్దరూ ఊరంతయూ జన సమ్మర్దమును చూచినారు. ఏదో రాజకీయ సభ ఉన్నదేమో వాహన సమ్మర్దము జనసమ్మర్దము హెచ్చుగా యున్నవి. ప్రముఖల వాహనములు రోడ్లపై తిరిగాడు చున్నవి. అనుకొనుచూ కొత్తగా శేషాచలము నిర్మించిన ఆశ్రమము ప్రారంభోత్సవమని గుడ్డ పతాకములపైన వ్రాసి, తోరణములు కట్టియుండుటచే చూచి వారచ్చటికి   పోయిరి. కొండల మధ్య నున్న ఇరువది ఎకరముల  స్థలమందు ఆశ్రమము నిర్మించబడినది.  పెద్ద ప్రహరీ గోడ, చక్రములపై దొర్లు  ఇనుపగేటు,  దాటి లోపలకు పోయిన పూలమొక్కలతో  ఉద్యానవనము, మధ్య జలాశయము,  దాటిన పిదప  పెద్దచెట్లతో తపోవనము,   కూర్చొనుటకు పాలరాతి బల్లలు,  ఇంకనూ లోపలి పోగా  శివాలయము  దాటిన పిదప పెద్ద భవనము. సాధు, బైరాగి భక్త జనముతో , సందర్శకులతో ఆశ్రమమంతయూ కోలాహలంగా నుండెను.  ఇంతలో డగ డగ డగ డగ మనుచు ఆకాశమందు పెద్ద రెక్కల చప్పుడు అగుచుండెను. బసవ కేశవులు తల ఎత్తి  చూసి ఉదగ్ర వాహన ( హెలి కాఫ్టర్ ) మొకటి  నేరుగా పోయి ఆశ్రమమునందు వాలెను.   ముఖ్య మంత్రి గారు .. ముఖ్యమంత్రి గారు అని మాటలు వినబడినవి. బసవడు అగస్త్యతో “ఆమె మనతో చదువుకొన్న విదిషేనా అని పించుచున్నది , ముఖ్యమంత్రే  వచ్చి చూచుచుండగా మనము వేచి చూచుటకూడా దండగ మననెవరు పట్టించుకొందురు.”అనెను. “ చూచుచున్నాము కదా ముఖ్యమంత్రులు ఇట్లు తయారయినారేమి!  సన్యాసులు అమ్మలచుట్టూ తిరుగుట తప్ప  వీరికేమి పనిలేకుండెను.” ఆగస్త్యు డనెను .

అనేకమంది జనులు తిరిగి  వెడలుచుండిరి.  కొంతమంది స్త్రీలు శివాలయములో కూర్చొని "ఈ శివాలయము పాతది వలే నున్నది, అని ఒక స్త్రీ అనగా  పాతదే ఒకప్పుడు అమ్మ ( విదిష) తన ఇంటినుంచి ఇచ్చటికి వచ్చి దర్శనము చేసుకొనెడిది, నేడాస్థలమును చలము గారు పొంది ఆశ్రమ నిర్మాణము చేసినా రు." అని మరొక యువతి అనెను.

ఒక చోట అన్న దానకార్యక్రమము జరుగుచున్నది. బసవడు అగస్త్య ఆ ప్రక్కగా ఒక చిన్న సమూహము కనిపించెను . శేషాచలం చుట్టూ పలువురు చేరి మాట్లాడు చుండిరి. పెంచలయ్య కూడా అందులో కలడు. వారిరువురూ వెనుదిరిగ నిశ్చయించుకొని గేటు వద్దకు చేరు సమయమునకు  ఉదగ్ర వాహన మెగిరిపోయెను  వెనుతిరిగి చూడగా విదిష వారి వెనుకనుండెను. భోజనములు కొనిపోయి విదిష వడ్డన గావించెను, అచ్చట వలతి కూడా వడ్డన చేయుచుండెను. భోజనములైన పిదప. ఆశ్రమమంతయూ ఖాళీ అగుచుండెను వారందరూ తపో వనమునకు చేరి ఒక చెట్టు క్రింద పాలరాతి బల్లపై కూర్చొనిరి .  

                                                                 ***

వేను  రంజిని గారిల్లు చేరెను. రంజిని గారు కాలు నొప్పిచే నడవలేక మెక్కుచుండగా కేశవుడు తన భుజము పై ఆమె చేతిని వేసుకొని ఊతమిచ్చి లోపలి గొనిపోయెను.   వాహనము   కళాకారులను తీసుకొని పోవుచుండెను  నక్క " కేశవుడు నక్క తోకను తొక్కినాడు ఐశ్వర్యవంతురాలైన స్త్రీ  " అను చుండగా  కొత్త " మొదట మనుషులను మనుషులుగా చూచుట నేర్చుకొనుము  నీకు ఆరోగ్యము చెడి నెలకాలము పని చేయకున్ననూ  జీతమిచ్చి ఆదరణ చూపినది. డబ్బున్నచో  విలాసజీవితమును గడిపవలెనని నీవు కోరుకొనుచున్నావు. అదే డబ్బు ఆమె వద్ద ఉన్ననూ నీవంటి అనేక పేద కళాకారు లను ఆదుకొనుచున్నది. మనిషి వలె ఆలోచింపుము."అని సుబ్బారావు హితవు పలికెను.  

రంజిని కేశవులు ఇంటిలోకి ప్రవేశించిరి. స్నానములయిన పిదప  రంజిని,  చేతి నొప్పితో భాధ పడుచున్న  కేశవునకు తానే  స్వయముగా తినిపించెను. కేశవుడు ఆమెను గదిలో మంచమువరకూ నడిపించుకునిపోయి మంచము పై పరుండబెట్టి బెణికిన ఆమె పాదమునకు మందు పూసి సేవచేసి ,  నొప్పి తగ్గకున్న   రేపు సాయంత్రము ఢిల్లీ లో జరుగు సభకు పోవలదు . అని చెప్పి కేశవుడు  వెను దిరగగా కేశవా ఇటు రమ్ము అని పిలచి నుదుటిపై ముద్దాడెను.

                                                                     ***

కొలది సమయము తరువాత బసవడు " నావిషమెట్లున్నదో జూడుము నోటివరకు వచ్చిన కూడు తినుటకు లేకుండెను ,నిన్నటివరకూ పార్వతినిచ్చెదనని చెప్పిన చంద్రమతి నేడు కుదరదు పొమ్మనుచున్నది అనెను. పార్వతి కిష్టమైన ఆమెట్లు ఆపగలదు. అనగా గౌడ సోదరుల విషయము చెప్పగా విదిష  నవ్వసాగెను. " పార్వతి ఇచ్చటికి వచ్చును నీవు చింతించవలదు అని చెప్పగా అగస్త్యుడు " నాకు  లకుమ దక్కు మార్గమేదైననూ కలదా  యని చాలావిచారముగాయున్నది అని చెప్పుచుండగా విదిష మొఖము నందు నవ్వు మాయమయ్యెను , మెల్లగా మొఖం బిగుసుకొనెను , కనులు ఎరుపెక్కేను వలతి విషయము గ్రహించి ' రేపు మేము ఢిల్లీ పోవలెను వర్షునకు పురస్కారము  కలదు ' అని మాట మార్చి అగస్త్యుని పొమ్మని సైగ చేసెను .

 అగస్త్యుడు అర్థము జేసుకొనక " లకుమ మనసు మార్చమని వేడుకొనుచుండగా ఎరుపెక్కిన విదిష కనులు విశాలమ గుచుండగా  ఒక్క సారిగా ఆమె లేచి నిలిచెను. పదడుగుల ఎత్తు విగ్రహము కనిపించుచుండ   అగస్త్యునికి దిక్దిగంతముల చీకట్లలిమి కనులు కానకుండెను.  అగస్త్యుడు పైకి చూడగా విదిష  తల చెట్టు శిఖర మంత ఎత్తులో కానవచ్చెను. అగస్త్యుడు చేష్టలుడిగి ఆమె పాదములపైన బడెను. బసవడు దుర్గా స్తోత్రమును చదివి ఆమెను శాంతింప  అగస్త్యుని బైటకు తీసుకువచ్చెను. పిదప అగస్త్యుడు ఇల్లు చేరువరకూ ఏమియూ మాట్లాడక రాయివలె కూర్చొనగా బసవడే  కారు నడిపెను. 

Friday, December 11, 2020

Bharatavarsha -90

బసవడు బల్లిపాడులో బస్సు దిగి చేతి గడియారమందుసమయము చూచుకొనగా మధ్యానము మూడు గంటలు కావచ్చుచుండెను.   భుజాన సంచితో, నల్లని అద్దము లతో హనుమంతుని విగ్రహము దాటి, గ్రామములోనికి పోవుచుండగా గ్రామస్తులు కొత్త మనిషని  వింతగా చూచుచుండిరి వారి చూపులు దాటి  కోనేరు దాటి లోపలి సాగుచుండెను.  కొలది దూరము సాగిన పిదప జనసంచార మంతరించెను.  బసవడి బూట్ల చప్పుడు వినిపించు చుండెను గులక రాళ్ళ బాటలో ఆటలాడుచున్న పాలపిట్టల పరిగెడుచున్నవి. బసవడు తలతిప్పి చూడగా చుట్టూ సాలములల్లిన క్షేత్రములు. ఆ శాఖలందు దాగిన గువ్వలు బసవని చూచి నవ్వినవి. అతడు సమీపించుచుండగానే గులక రాళ్ళ బాటలో ఆటలాడుచున్న పాలపిట్టలు తుర్రుమన్నవి. లజ్జావతి కాలికి తగిలి సిగ్గుతో ముడుచుకొన్నది.

లజ్జావతి యందు పార్వతి లజ్జాముకులిత వదనము కనిపించెను.  చంద్రమతి వాలకతనము స్ఫురించెను. కనిపెంచ కున్ననూ కన్నె పిల్ల మనసును శాసించుచున్నది. ఈమె మనసు కఠిన కాచకము ఎట్లు సహింతుమీ అరాచకము. ఇట్లు చింతాక్రాంతుడైన బసవని 

కర్ణము నేదో అవ్యక్త మధుర ధ్వని తాకి అతడి బిగిసిన స్వాంతమును సాంత్వన పరుచుచున్నది. చిక్కని  శాలముల వాలి చూపుకి చిక్కక కలకణ్ఠ కూయుచున్నది. కొలది దూరములో మదనగోపాలుని దేవాలయము కనిపించెను. బసవని మది పులకించెను. అతడియందు ఆసుకవి ఉదయించెను.

 “ఏమీ ప్రకృతి అందము ఏమీ శృంగనాదము తాక డెందము గలుగు మోదము

  ఏమీ చిత్రవాలము ఏమీ మాపటికాలము చూపె చిత్రవిచిత్ర జాలము  

  ఏమీ శుభ సూచకము ఏమీ మధుర వాచకము ఏమో మదన ప్రేరితము”                                             

ముందుకి సాగుచున్న బసవడి మదిలో ఆలోచనలు సుడులు తిరుగుచుండెను. “తల్లి తండ్రులతో పోయి కలిసి నప్పుడు కుదిరదు పొమ్మన్నది ఇప్పుడేది దారి” యని యోచించి తికమక పడుచూ మొదట మదన గోపాలుని ఆలయమునకేగి ఆ స్వామి దర్శనము జేసుకొని “పార్వతిని బడయు మార్గము చూపమ” ని వేడఎదో శక్తి పుట్టి నేరుగా పార్వతి ఇంటికి పోయెను. కానీ నేరుగా లోపలికి పోక ప్రాంగణ మందున్నమొక్కల చాటున నక్కి పిల్లివలె మెల్లగా కదులు కిటికీ వద్ద నక్క వలె నక్కి వినుచుండెను. ఇంతలో పార్వతి ఏడుపు వినిపించెను. తలయెత్తి కిటికీ నుండి లోపలి చూచెను

విశాలమైన గదియందు పార్వతి, చంద్రమతి, అరుణతార, ఆమె ప్రక్కన తుమ్మ మొద్దువలెనున్న ఒక పురుషుడు కనిపించగా అరుణతార ఇచ్చటమిచేయుచుండెనో అనుకొనెను కానీ పరికించి చూడగా చూచుటకు అరుణ తారవలెనున్ననూ  ఈమె అరుణతార కాదు,   పిన్న వయస్కురాలు. కొంత సేపటికి ఆమె చంద్రమతి కూతురు సుకన్యఅని, ఆమె ప్రక్కనున్న వ్యక్తి చంద్రమతి అల్లుడు చక్రవంతుడు అని, వారు అమెరికానుండి వచ్చినారని అర్థమయ్యెను. 

చక్రవంతుడు : పార్వతి , నీవు బసవని మరచిపోవలెను 

చంద్రమతి : ఇంకాతని ఊసేంతమాత్రము ఎత్తవలదు 

సుకన్య :  అతడిని మార్చుటయే కాక గౌడను వివాహమాడవలెను. 

పార్వతి :  అందరిముందు బసవని కిచ్చిచేయుట కొప్పుకొని ఇప్పుడు వలదనుచున్నావు . నేనతడినే చేసికొందును. 

చక్రవంతుడు :   పార్వతి!  మూర్ఖము వహించవలదు. పర్యావశానములూహించిన ఇట్లు మాట్లాడవు. నీ పై కట్ట గౌడ మనసు పడెను.  వాడికి తరగని ఆస్తి ఉన్నది. నిన్ను పువ్వులలో పెట్టుకొని చూచుకొనును. వాడిని కాదన్నచో కోట్ల  విలువ చేయు మా  పొలములు మాకు దక్కనివ్వడు. అది తెలిసికొని మాట్లాడవలెను. 

డబ్బు  కొరకు నామనసును ఎట్లు  చంపుకొందును ?

కోట్లనిన  ఖాతరు లేకుండెను చూడెట్లు మాట్లాడుచున్నదో. అని చక్రవంతుడు సుకన్యతో అనగా సుకన్య పార్వతినొక్క బుగ్గ పోటుపొడిచెను. అది చూచి బసవడి  ప్రాణము విలవిల లాడెను. " ఒరేయ్ జాంబవంతుని వలె నున్నావు  నీవు చక్రవంతుడివి కాదురా, జాంబవంతుడివి, అల్పబుద్ధి." అని బసవడు తన మనసులో అనుకొనెను.

పార్వతి: ఆ పొలములు మా అమ్మ చారుమతి ఆస్తి అవి మా పొలములు   

చంద్రమతి పార్వతినురిమి చూచి. “డబ్బు అన్నచో లేక లేకుండెను, డబ్బుకొరకు మనసును చంపుకోకున్న, ఆ గౌడ మనుషులను చంపును. భాగవతార్ నేమిజేసినాడో ఎరుగవా? బసవని చేసుకొన్న అందరికి ముప్పువాటిల్లును” అనెను.

ఇంతలో సుకన్య  " చక్రీ , కిటివద్ద ఎవడో  తచ్చాడుచున్నాడు " అని తెలపగా  చక్రి బిగ్గరగా కేకలు వేయసాగెను. పార్వతి కూడా బసవని చూచి " వీరు మూర్ఖులు  నీవు పారిపొమ్ము " అనెను. కానీ బసవడు లోపలిప్రవేశించి  " నేనంతయూ వింటిని " అని చంద్రమతితో పలికెను.  అప్పుడు చంద్రమతి " అంతయూ వింటివి కదా , మరొక సారి ఈ ఛాయలకు  రావలదు అని హెచ్చరించెను. బసవడు ఊరుకొనువాడు కాదు , మాటకు మాట జెప్పెను. చక్రి రెచ్చెను. బసవని రెండు గుద్దులు గుద్దెను పిమ్మట  "మూడవగుడ్డు గుద్దినచో నేలకొరిగె దవు.  పొమ్ము" అనెను. 

బసవడు ఓర్చుకొని నిలబడి చక్రిని ఒక్క గుద్దు గుద్దగా అతడు నెలకొరిగెను. " మీరు పార్వతిని హింసించుచున్నారని బలవంతపు పెళ్ళికి పాల్పడుచున్నారని నేను పోలీసులకు తెలిపెదను. అని పార్వతికి "నీవు ధైర్యముగా నుండుమ"ని జెప్పి వెడలిపోవుచుండెను.   సుకన్య చక్రిని లేవనెత్తెను.  పోలీసులకు తెలిపిననూ  గౌడకేమీ కాదురా.   నేను గౌడకు తెలిపినచో   నీవీ వూరు దాటగలవేమో చూడుము. అని గౌడకు దూరవాణి యందు విషయమునెఱిగించి  "క్షేమమముగా  నీ వీ వూరు దాటి  నాకు ఫోను చేసిన నేను నీవున్నచోటు కి  పిల్లని తెచ్చి నీకప్పగింతు"ననెను.  

                                                                      ***
బసవడు మరల ఆలయమునకు పోయి చాలాసేపు అక్కడ కూర్చొనెను.  ఇంతలో చీకటి పడెను. బసవడు గోపాలుని ప్రార్ధించి బస్సెక్కుటకు పోవుచుండగా రౌడీలవలె నున్న ఇద్దరు వ్యక్తులు అతడిననుసరించు చుండిరి . బసవడది గమనించిననూ గమనించనట్లు ముందుకు సాగు చుండెను. గులకరాళ్ల బాటపై అతడి బూట్లు చప్పుడు తప్ప ఏమీ వినరాకుండెను. అతడి అడుగుల లయయందే వారు అడుగులు వేయుచున్నారు. వారు గౌడసోదరులని అతడి మనసు దృఢముగా చెప్పుచున్నది. బసవడు ఆగెను. వెంక అడుగుల చప్పుడు ఆగినది. బసవడు తన సంచి నుండి ఒక పెద్ద వత్తిగల  శక్తి వంతమైన  దీపావళి బాంబును, సిగరెట్టును ఒకేసారి వెలిగించి వెనుక కొన్ని అడుగుల దూరములోనున్న గౌడసోదరులపై విసిరెను. ఆపేలుడుకి వారి కళ్ళు బైరులు క్రమ్మి ప్రక్కనున్న నీటి గుంటలో పడిరి. బసవడు ముందుకి సాగిపోయెను.

                                                                     ***

అగస్త్యుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచెను. "ఇదంతయూ స్వప్నమా?" ఇంకనూ నిజమనుకొంటిని. అయిననూ తెల్లవారుఝామున వచ్చు కళలు నిజమగునని ఒక నమ్మకము కలదు అనుకోని బసవడికి దూరవాణి కలిపెను. బసవడికి విషమునెఱిగించగా అతడు " నీవేమి చూచినావో ఖచ్చితముగా  అదే జరిగెను. ఏమి జరిగేనా ఖచ్చితముగా అదియే చూచితివి " అని చెప్పగా బసవడు ఖంగు తినెను. 

" నిన్న నీగూర్చి ,  నా సమస్య పరిష్కారము గూర్చి విదిష వద్దకు పోయితిని. నా భవిష్యత్తును తెలిపమని  కన్నీరు పెట్టుకొనగా, నీకే  తెలియును అని మాటఇచ్చి పంపెను. ఇది ఖచ్చితముగా ఆమె పనే అని ఇప్పుడు తెలియుచున్నది. " అనగా బసవడి పై ఉల్కాపాతము కురిసెను. విదిషా విదిషా నాకు నీవే దిక్కని విదిష వద్దకు బయలు దేరెను.  

Thursday, December 10, 2020

Bharatavarsha 89

నిగనిగ లాడు పసిమి దేహము, నవనవ లాడు పూరేకుల పెదవులు, దంతములు మిలమిల మెరియు ముత్యాల సరులు, గలగల పారు సెలయేరు నగవులు, మిరపపండు రవిక, కుంభస్తనద్వయము, చూచుకములును దాచలేని జాలువారు పారదర్శక రజత శ్వేత చేలము, చిత్తిని చిట్టిచేఁతలు మేని మెరుపులు చూడ నీలాకాశము నేల వాలినట్లున్నది. 

ఘనస్తనముల జంబునేత్రి మీనాక్షి దీర్ఘ కుంతలములను సడలించ కీకారణ్యమును తలపించు యా నిబిడ కేశములు సైకత పిరుదులపై బడి నర్తించుచుండగా ఆ గజయాన మంద గమనమున మిద్దెపై హిరణ్య సమయమున సంచ రించు చుండెను. 

 స్వతంత్ర మంత్ర తంత్ర సంగీత ప్రపంచ రాజు, ఇందిరమందిర సున్దరాకారుడు విపుల మానస శతానందుడు, జనమా నస చోరుడు ప్రఫుల్ల నామధేయుడు వెనక నుంచి మీనాక్షిని సమీపించి ఉఫ్ అని చెవిలో గాలి ఊదగా మీనాక్షి అదిరి పడి ప్రఫుల్లపై త్రుళ్ళి పడి  సిగ్గుతో " ఈ చిన్న పిల్లవాడి చేష్టలు ఇంకెంతకాలం చేసెదవు ?" అనుచున్న ఆమె చేతిలో ఒక ఖంఠ హారమునుంచెను. “ఇట్టి బహుమతులు వలదని మీ కు పలుమార్లు చెప్పిననూ వినరు కదా!”

అని త్రిప్పి ఇచ్చుచుండగా “అదిగో మరల నన్ను మీరు అనుచున్నావు మనమిద్దరమూ ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా ము, ఎన్ని గంటలు కలిసి సాధన చేసి, ఎన్ని గంటలు ప్రయాణము చేసినాము ఇంకనూ మనమధ్య మీరు అవసరమా? ఈ చిరు కానుక స్వీకరింపుము.

ఉమ్ , సరే , ఇంతకీ ఇప్పుడు ఈబహుమ తెందుకు తెచ్చినావు ?

మన సంస్థ  ప్రతినిధి కార్యక్రమ నిర్వాహకుడు  మీనన్ మన విదేశీ కార్యక్రమ పరంపరను ఏర్పాటు చేయుటలో సఫల తనొందెను. ఇకపై మన విదేశ కార్యక్రమములు మొదలు కాబోవుచున్నవి.  కువైట్ , బెహ్రెయిన్ , దుబాయ్ , లండన్ , మారిషస్ , సిషెల్ల్స్ బ్రుక్లిన్ నందు కూడా మనము   ప్రదర్శనలివ్వబోవుచున్నాము. మన ఆఖరి దేశీ ప్రదర్శన రేపు ముంబై పాటిల్ స్టేడియం నందు కలదు ఒక సారి మన స్థూడియోకి పోయి రావలెను.

ఇందు నేను చేసినది ఏమున్నది ? నా పియానో వాదనము నేను చేసినాను.

 సంగీత తిలకమై మన మ్యూజిక్ బ్యాండ్ కి తలమాణికమై వెలుగొందు కంపోసర్ పియానిస్ట్ వి,మన మ్యూజిక్ బ్యాండ్ ఇట్లు వెలుగొందుచున్నదన్న దానికి కారణము నీవే. నీకుగాక ఇంకెవరికి ఇవ్వవలెను బహుమతులు!

ఏ పట్టణము ప్రదర్శనకి పోయిననూ  అచ్చట వస్త్రములు కొని ఇచ్చుచున్నావు , మొన్న భోపాల్ ప్రదర్శనకు నేను రాకున్ననూ నాకు ఈ వెండి వెలుగు చీరను ఎర్ర రవికను కొని ఇచ్చినావు

ఒక కర్మాగారమందు బహిరంగ రంగస్థలమును  ఏర్పాటుచేసి నారు. అది చిన్న రంగస్థలం నీవంటి వనితకు నప్పునది కాదు. 

వట్టి మొద్దు బుర్ర నీవు ఇచ్చిన  చీర రవికను ధరించినాను ఎట్లున్నది ?

సంధ్య కాంతులందు సేదతీరుచున్న పడుచందములను మించు మీనాక్షి ప్రౌఢ అందములు కాంచిన గుండెలు గండెలు పడుచుండెను.   

మీనా ఇట్లు మాట్లాడిన నీ చెవులు మెలి పెట్టెదను నీవు మా అగస్త్య వంటి వాడవు అని ప్రఫుల్ల చెవి అందుకొనెను. 

 ఒక వారము నుండి అహోరాత్రములు శ్రమించి కొత్త పాటలుకు స్వర కల్పన జేసి అలసి  చిక్కిననూ నీ చక్కదన మెచ్చటికి పోవును ఈ చీరయందు అప్సరస వలే నున్నావు.

  కానీ ఇప్పుడు మనము స్టూడియోకి వెళ్లవలెను . మన కొత్తగా ఆల్బమ్ విడుదల కార్యక్రమమున్నది. కానీ నిన్ను రమ్మనుటకు మనసొప్పకున్నది. 

స్టూడియో చెంతనే యున్నది కదా, ఈ కార్యక్రమము లేకున్ననూ ఇప్పుడు సంద్యాసమయము కావున నిద్రించ తగదు. పదపోయెదము అనుచూ మీనాక్షి మిద్దె దిగుచుండగా ప్రఫుల్ల ఆమె వెంట నడిచెను. కదులుచున్న ఆమె జఘన లయ యందు చిక్కిన కనులు సోపానములను గమనించకుండుటవల్ల నడక లయ తప్పి జారిపడెను. 

మీనాక్షి అతడిని లేవనెత్తి మెల్లగా తన భుజముపై అతడి చేతినుంచి క్రిందకు తీసుకుపోవు చుండెను. " నీవిట్లు హత్తుకు తీసుకుపోయినచో  ఎన్నిసార్లయినా పరవశమే " యని వినిపించినట్లు మెల్లగా అనెను. ఇద్దరూ క్రిందకు మీనాక్షి ఇంటిలోనికేగినారు.

 ప్రఫుల్లని మీనాక్షి సోఫాలో కూర్చొండబెట్టెను. ప్రఫుల్ల తలయెత్తి చూడగా ఎదురుగా చదువుకొనుబల్లవద్ద  యమున ఒక డజను పుస్తకములను పెట్టుకొని చదువు కొనుచున్నది.

ప్రఫుల్ల ఆమెను చూచి నవ్వెను యమున  అతడిని చూచి పళ్ళికిలించి " హ హ హ .. చూసుకొని నడుచుట చేతకాదా ఎత్తుకొని మెట్లు దింపవలెనా ?" అనెను . లేడి  డిటెక్టివ్ వలే నున్నావే  నాప్రాణమునకు ఇదెక్కడ దాపురించెనో అని ప్రఫుల్ల అనుచుండగా” సమయమున్న కేరళ పోరాదా మీఅమ్మ వద్ద గడపరాదా, ఆమె మాటి మాటికీ ఇక్కడికి ఫోను చేయుచున్నది మీనాక్షిగారి  వెంట పడుచున్నావని  ఆవిడకి కూడా తెలియవలెనా?

ఆవిడకెప్పుడో తెలిసెను. ఇక మీనాని తీసుకెళ్లి ఆమెకు చూపవలెను.  నీవు ఎప్పుడూ ఇక్కడే గబ్బిలమువలె చూరు పట్టుకొని వెళ్లడుచున్నావెందుకు మీ ఇల్లు పక్కనే కదా పోరాదూ.

నన్ను గబ్బిలమందువా నీవే గబ్బిలము, నీవే జాగిలము అని యమున ప్రఫుల్లను దూషించ సాగెను “అవును నేను జాగిలము నీవు బిడాలము అందులకే నీకూ నాకూ ఈ వాదులాట” టులిద్దరిమధ్య వాదముపెరిగి తారాస్థాయికి పోయినది.

“అబ్బబ్బ ఎప్పుడు చూచినా కుక్క పిల్లిలా ఈ కొట్లాటలు,  ప్రపుల్లకి వేడి నీరు   కాపడము పెట్టవలెను.” అని మీనాక్షి అనగా “ఇట్లు ఇచ్చిన నేను పెట్టెదను” అని యమున మీనాక్షి చేతినుండి గిన్నె అందుకొని సోఫావద్ద నున్న బల్లపై పెట్టి కాపడము పెట్టసాగెను. 

మీనాక్షి బల్లపై నున్న పుస్తకములను చూచుచూ కూర్చుండెను. అవన్నియూ భారతవర్ష వ్రాసిన పుస్తకములు ఇన్ని పుస్తకములు వ్రాసెనా?  తెలుగు ఇంగ్లిష్  పద్యముల సంకలనములు , పౌరాణిక నాటకములు , హాస్య కథలు , మూన్ లైట్ స్టోరీస్ - ఇంగ్లీష్ చిన్న కథలు , తెలుగు  చిన్న పిల్ల కథలు , సేవ్ ఎర్త్  , సైన్స్ ఫిక్షన్   జానపదములు , బుర్రకథలు ,వ్యాసములు , వ్యాకరణము  చివరిగా  ప్రౌఢ శృంగార కథలు, అవన్నీ చూచుచూ మీనాక్షి" మావర్షుడు  ఇటువంటి కథలు కూడా వ్రాయనా ?  అనుచూ ప్రౌఢ శృంగార కథల పుస్తకమును తరువాత చదువుటకు కొంగు క్రింద దాచి యుంచెను. వెంటనే యమున " ఆ పుస్తకము అడుగుటకు సిగ్గుగానున్నదా?" అని వెనుకకి తిరగకనే అనగా “ఇది మనిషా లేక కర్ణ పిశాచమా అని సందేహము కలుగుచున్నది” అని ప్రఫుల్ల అనెను. “ ఛీ ఛీ   నాకే మీ వలదమ్మా” అని మీనా ఆపుస్తకమును బల్లపై పెట్టి వంటగదిలోకి పోయెను.

ఆ పుస్తకమును పట్టుకుని వంటగదిలోకి వెళ్లిన యమున మీనాక్షి తో " శృంగారమనిన విషము కాదు చదివిన వారు వెలయాళ్లు కారు ఏల ఇప్పటికే మీరు వివాహము చేసుకొని యుండవలసినది , మీకున్న ఆస్తి అందము చూసి వలచి వచ్చువారు అనేకులుందురు. ప్రఫుల్ల ఇచ్చటికి ఎందుకు వచ్చుచున్నాడో తెలియునా?

మందమతిని కాదు లేవమ్మా , అతడి మనసు ఈ మధ్యనే గ్రహించితిని. కానీ 

 మీ భర్త కు మీకు విడాకులయినవి, మీ భర్త కానీ  కొడుకు కానీ   మీగురించి  పట్టించుకొనక ఎవరి దారి వారు చూచుకొనుచున్నారు, మీరు సంస్కృతి సంప్రదాయములని మీన మేషములు లెక్కించుచున్నారు. 

 అది  కాదమ్మా ఒకనాడు స్టూడియో లో అతడి కంప్యూటర్ నందు అతడి కుటుంబ చిత్రములు రెండు  బైటపడినవి. 

మొదటిచిత్రమందు   మాకు అత్యంత ఆప్తులైన అరుణతార నల్ల చొక్కా వేసుకున్నఒక వ్యక్తి తో బహుశా తన భర్తతో దిగిన ఫోటో కావచ్చు. రెండవ చిత్రమందు అదే నల్ల చొక్కా వ్యక్తి  వేరొక యువతితో కనిపించెను. ఆ రెండవ యువతిని ప్రఫుల్ల మా అమ్మ అని అనుచున్నాడు

యమున “ఆమె భర్త రెండవ వివాహము చేసుకొని యుండవచ్చు. అతడు    ఏమి చేయుచుండివారు?” 

మీనాక్షి “ఒకప్పుడు చిత్ర సీమయందు  దర్శకత్వము చేయుచుండివారు.”

వెంటనే యమున “ప్రఫుల్ల మీ  నాన్నగారు ఏమి చేయుచున్నారు? అని వంటగది లోంచి అరిచెను. “పోలీసు శాఖ యందు పనిచేయవలసినదానవు”   అని మీనా మెచ్చుకొనెను.

“ప్రస్తుతము ఇంటిలో వంట చేయుచున్నారు. ఒకప్పుడు చిత్ర సీమయందు డైరక్షన్ చేయుచుండివారు.” అని ప్రఫుల్ల బదులు పలికెను. కొలది సేపటికి వారు ముగ్గురు  నీలి ఆడి వాహనమందు స్టూడియోకి పోవుచున్నారు " రామే శ్వరము పోయిన శనేశ్వరం తప్పదన్నట్టు "అని ప్రఫుల్ల తన ప్రక్కన కూర్చొన్న యమునను చూచుచూ అనెను " హి హి హి అని యమున పండ్లు ఇకిలించెను.

Wednesday, December 9, 2020

Bharatavarsha - 88

 రాఘవ సందీపులు క్షేత్ర గృహమునందు తామర కొలను వద్ద చెట్ల క్రింద కూర్చొని యుండిరి . సూర్యుడు నడి నెత్తికి చేరుచుండెను. చెరువులో తామరాలన్నీ ఎర్రని కాంతులీనుచున్నవి. చెరువు లో నీరు తెమ్మెర తాకిడికి అల్లన కదులుచూ సూర్య ప్రభావమును పరావర్తించుచూ  మిరిమిట్లు గొలుపుచున్నది. రాఘవుఁడడిగిన ప్రశ్నకు సాందీపుని కి మెదడు స్థంభించెను, గాలి కూడా స్థంభించెను. నిశ్శబ్ధమావరించెను.  రాఘవుని మొఖము చూడలేక  సందీపుడు  ప్రక్కకు  చూచుచుండెను. అచ్చటి పచ్చిక బైలునందు కేకిలి యొకటి మందగమనమున తిరుగుచూ వారివద్దకొచ్చెను.

 రాఘవుడు “ ఆహా ఈ నీలగ్రీవము (నెమలి) ఎంత ముచ్చట గొలుపుచున్నది. నీ క్షేత్ర గృహము మైమరపు కలిగించు చున్నది.” సందీపుడు  “ఈ నెమలి నా చెల్లి నెచ్చెలి. ఆమెకు నెమలి యన్న నెమలి పించదారి యన్న ప్రాణము. ఈ ప్రాణమునొదిలి నందినెచ్చటికి పోయెనో తెలుసా! మంజూష వద్దకి , ఆమె ఇప్పుడు వదినను విడిచి ఉండుటలేదు. రాఘవుడు “ఇంతకూ నేనడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చినావు కాదు.” సందీపుడింకనూ సిగ్గు పడుచుండగా  “ఇప్పుడు పెండ్లి కుదిరినది కదా ఇంక బెరుకేలా?” అనెను.

నీవు సోలార్ పేనల్స్ ఉతిపాదన గూర్చి అడిగినావు కదా దాని పోజెక్ట్ రిపోర్ట్ తయారు చేయుచున్నాను. భారత దేశము నందు సోలార్ పేనల్స్ వ్యాపారము 163 బిలియన్ డాలర్స్  వరకు విస్తరించింది. కానీ పేనల్స్  కంటే సోలార్ పత్రములు  , (ఫోల్డబుల్ సోలార్ పేనల్స్)  భవిష్యత్తులో ఊపందుకొనును 

 నేనడిగినది నీవు మంజూషనెట్లు వశపరుచుకొంటివి? మీరెక్కడకలిసినారని నీవు తెలివిగా మాటమార్చి వ్యాపారము గూర్చి చెప్పుచున్నావు.   బెంగళూరు నందుండి వ్యాపారవిషయములతో బుర్రపిచ్చెక్కించుకొనుటయే తప్ప నాకింకొ కటి తెలియదు. ఈ ప్రశాంత వాతావరణము నందైననూ కొలదీసేపు వ్యాపారవిషయములు ప్రక్కనపెట్టి జీవితము నకు శోభగూర్చు ప్రణయ శృంగారముల గూర్చి మాట్లాడుము.

అట్లయిన నీవు నీ ప్రేయసి గూర్చి చెప్పినచో నీవడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పెదను. అని సందీపుడనెను. నా ప్రేయసి ఎవరూ లేరని రాఘవుడు మొదట బుకాయించిననూ పిదప "నన్ను యమున అనొక యువతి ప్రేమించు చున్నది కానీ నేనామెను ప్రేమనుంచుటలేదు. దానికి కూడా రెండు కారణములున్నవి. అందు పెద్ద రహస్యము దాగియున్నది. కానీ  ఆరహస్యము చెప్పవలెనన్న నేనడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్పుము అనెను.

నీ క్షేత్ర గృహము ఈ ప్రశాంత వాతావరణము మైమరపు కలిగించుచున్నదంటివి కదా, ఇచ్చటనే నేను మంజూష కలిసి నాము. “ఇది నందినికి తెలిసిన ప్రమాదమే” అని రాఘవుడనుచుండగా ఇదొక చిదంబర రహస్యము కలదు అని సందీపు డనెను. 

“నీకునూ రహస్యము కలదా అది ఏదో త్వరగా చెప్పుము” అని రాఘవుడనెను

ఇందు నందిని హస్తము కలదు అనగా ఆమె నాకు ప్రోత్సాహము తో పాటు సహకారము కూడా లభించినది. “కానీ మంజూష కు నేనన్నచో పిచ్చి మోజు కలదు అందు నందిని పాత్ర ఏమియునూ లేదు.” 

అది నిన్న పెళ్లి చూపులయందే తెలిసెను. కానీ పెళ్ళికి ముందే సంగమమందు ఎవరి పాత్ర కలదు ? మంజూష పూర్తిగా నీవశమైనది ఏ మంత్రము వేసినావో! 

నీవా మంత్రమునిప్పుడు బెంగుళూరు నందెవరిపై ప్రయోగించవలెను? ప్రకృతి ప్రేరణ తప్ప మంత్రమేదియునూ లేదు. ఒకరి ఒడిలో ఒకరు ఒదిగి ఇచ్చటనే  వెచ్చని ముచ్చటలాడుకొను చుండగా స్త్రీ ప్రేరణను కాదను శక్తి ఎవరికుండును!

అట్లయిన మంజూషయే మంత్రము వేసెనన్నమాట,  

మంత్రము సంగతటుండనిమ్ము ముందు నీ  సంగతి చెప్పుము. 

యమున నేను ప్రయోజకుడినని సంస్థను వృద్ధిలోకి తీసుకు వచ్చెదనని ముచ్చటపడుచున్నది. అనగా నాకంటే నా నైపుణ్యమందు ఆమెకు ఆసక్తి ఎక్కువ.  సంస్థ  వ్యాపారము తగ్గుచున్నదన్నమాట వాస్తవము. అందుకు కారణముకంపెనీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో లేకుండుటయే. నాకు నీపై నమ్మకమున్నది. నీవొచ్చిన ఆ సమస్య అధిగమించవచ్చు. ఆమెకు నాయందు ఎంత ఆసక్తి యున్నదో తెలుసుకొనుటకు సంస్థ పతనము సమీపించుచున్నది అని చెప్పితిని. నేను ఇచ్చటికి వచ్చుటకు ముందు యమున తన ఇంటికి పిలచి ఆమె అత్తకు పరిచయము చేసెను, ఆమెఅత్త అంద చందములు చూచినపిమ్మట నాకు మతి పోయినది. ఈ సారి బెంగుళూరు పోయిన పిదప ఆమెను పెండ్లి యాడుటకు అడిగెదను.  

ఆమె వయసులో సగముండునా నీకు, ఆమెను వలచినావు ! పైగా పెండ్లి ఆడె దనానుచున్నావు.  

ఆమెకు సుమారు ఒక నలభై ఐదు యాబది సంవత్సరము లుండవచ్చును. ఆమె అందము నన్ను కట్టి పడవేచినది , నావిషయమందు నీవన్నదే - స్త్రీ ప్రేరణ - అధికముగా నున్నది. అమెరికాలో నేనున్నప్పుడు లేత ప్రాయమునున్న యువకులు పెక్కురు పెద్ద స్త్రీలను పెండ్లి యాడుట చూచితిని.  మన మిచ్చట ఈ పురుషాధిక్య ప్రపంచమందు ముసలి హీరోలు లేత హీరోయిన్లను ప్రేమించుట చూచి  ఇచ్చట మనకది వింతగా తోచుచుండును.

నీవామెనొ దులున్నట్లు లేవు. నీ ప్రేమయందు రాజీ పడునట్లు లేవు.

ప్రేమయందు నీవు రాజీ పడినావా?  బసవడు పార్వతి కొరకు బల్లిపాడు పరిగెత్తలేదా? వాడు రాజీ పడినాడా? నేనేల రాజీ పడవలెను? ఆమె గూర్చి యమునా ద్వారా నేనంతయూ విచారించితిని. ఆమె భర్తనుండి విడాకులు పొంది చాలా ఏండ్ల నుండి వంటిరి జీవితమును గడుపుచున్నది. ఆమె అందము ఎంత గొప్పదో మనసంత కంటే గొప్పది.

 అది నీకెట్లు తెలియును? ఆమె మనసును బూతద్దమందు చూచితివా?  ఇంకనూ  ఆమెకు కోరికలే ముండును? 

నందిని నాగూర్చి ఆమెకంతయూ తెలిపెను.  ఆమె నాకు పెద్దమొత్తములో ధన సాయము చేసెను. ఆమె మనసు వెన్న అని తెలుపుటకింకేమి కావలెను? ఆమె మనసును బూతద్దమందు చూచితివా అని అడిగినావు, ఆమెకు కోరికలింకే ముండుననుచున్నావు ఆమె కోరికలను నీవు బూతద్దమందు చూచితివా ? రాఘవుడు ముఖము ఖండించుకుని అట్లు చెప్పుచుండగా సందీపుడు వాడి ఉక్రోషమును చూచి పడి పడి నవ్వుచుండెను.

అప్పుడు రాఘవుడు " అవునురా నీకు లడ్డు లాంటి పిల్ల దొరికెను  సమ్మందం కుదిరెను. ఇతరులను చూచి నవ్వకేమి చేసెదవు. సందీపుని నవ్వింకనూ పెరిగెను. " హ హ హ్హ హ్హ ఇంతకీ బసవడు రేపు మరలివచ్చునా బల్లిపాడునందే స్థిరపడునా? వెడలి పోవుచున్న రాఘవుని " విమానములో పోరా , నీవు రెక్కలు కట్టుకొని ఎగిరెదవేమో?" నా పెండ్లికి తప్పక రావలెను "   అనుచూ రాఘవుని ఆట పట్టించి  అతడిని కారులో వదిలి పెట్టుటకు విశాఖ పట్టణము  విమానాశ్రయము తీసికొనిపోయెను. మార్గమద్యములో ఎన్  ఏ డీ  కూడలి వద్ద ఇద్దరూ కలసి భోజనము చేసిన పిదప విమానము వచ్చువరకూ సందీపుడు రాఘవునితో గడిపి రాఘవుడు విమానమెక్కుటకు బోవుచుండగా " రేపు ఢిల్లీ పోవు పనియున్నది,  అచ్చట రవీంద్ర భవన్ లో బావగారికి సాహిత్య అకాడమీ పురస్కారం కలదు.   లేనిచో నీతో బెంగళూరు  వచ్చెడి వాడనే.  రెండురోజులలో బెంగుళూరు నందు వాలెదను. కంపెనీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగును. అందుకు ఎంత శ్రమ ధనాదు లైననూ వెచ్చింతును అని అతడికి భరోసా ఇచ్చి " ఇంతకూ నీవు వలచిన ఆమె పేరేమి ?" " మీనాక్షి " అనిచెప్పి రాఘవుడు వెడలెను  

Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...