Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, November 7, 2025

తెలుగు మనసుకు తెల్లని పంచె...

నాకుసూట్లు నప్పవు- నాకు అంటే నాదేహానికి అని కాదు నామనసుకి. నేను ఎక్కువ గా పంచలే  కడుతుంటాను. ఆత్మానందం కలిగించేది వస్త్ర బంధం. సంప్రదాయ వస్త్రాలు ధరించేది ఎవరినో మెప్పించడానికి కాదు. నన్ను మెప్పించు కోడం కోసం. నా ఆనందం కోసమే.



3 రోజుల్లో ఆరుభాషలు - నిజమేనా?

అపోహలను తొలగించిన సామర్ల కోట  ప్రతిభ  విద్యార్దుల బహుబాషా ప్రదర్శన..

సామర్లకోట ప్రతిభా విద్యానికేతన్  పూలబాలను ఆభాషల శిక్షణ నిమిత్తం ఆహ్వానించగా  3 రోజులు సార్లకోటలో  ఉండి ఆభాషల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు.భాష సాహిత్యం చరిత్ర విద్యార్థుల భవిష్యత్తుకు దేశ భవిష్యత్తుకు చాలా అవసరం అని ఆయన అన్నారు.

ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లీష్ భాషలలో బేసిక్స్  వాక్యనిర్మాణం నేర్చుకుని  బేసిక్స్ అన్నీ పాటల్లా  పాడి 3 రోజుల్లో 6భాషలు వాక్య నిర్మాణం దాకా నేర్చుకోడం సాధ్యం అని నిరూపించారు. ప్రతిభా విద్యానికేతన్ పిల్లలు అభాషలను చాలా చక్కగా నేర్చుకున్నారని పూలబాల చెప్పారు.  . ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ జపనీస్ భాషలను  నేర్చుకున్న విద్యార్దులు భాషల ప్రకారం గ్రూప్స్ గా ప్లకార్డ్స్ పట్టుకొని కూర్చోని ఒకొక్క గ్రూప్ గా కెమెరా ముందుకు వచ్చి వేదికపై తమ భాషలను తడువుకో కుండా  ప్రదర్శించారు.  

.

 ప్రతిభా విద్యా సంస్థల అధినేత  ప్రకాష్  మరియు ఉపాద్యాయులు పిల్లల ప్రతిభను  అభినందించి పోలిగ్లోట్  పూలబాలను ఘనంగా సత్కరించారు.

మానవ సేవ Vs మాధవ సేవ- పూలబాల

 నాది మానవ సేవ ఆవిడది మాధవ సేవ- పూలబాల



చిత్రం లో కనిపిస్తున్న దంపతులు సినిమా స్టార్స్ కాదు

సార్లకోట ప్రతిభా విద్యానికేతన్ ఆహ్వానంఅందుకుని

3 రోజుల విదేశీ భాషా శిక్షణ నిమిత్తం ఇక్కడికివిచ్చేన పూలబాల తాను విద్యార్దులకి సేవచేయ డానికి వస్తే తన భార్య దేవాలయాల సందర్శ నార్ధం తనతో వచ్చినట్టు చెప్పారునేను పాఠ శాలల చుట్టూ తిరిగు తాను ఆవిడ దేవాలయాల చుట్టూ తిరుగుతుంది అన్నారు పూలబాల.

చిత్రం లో కనిపిస్తున్న దంపతులు సినిమా స్టార్స్ కాదు . సమాజానికి రచనలు ద్వారా రోడ్లు గుంతలు పూడ్చడం ద్వారా సేవ చేస్తున్న రచయిత పూలబాల ఆయన భార్య . వివిధ స్కూల్స్లో వర్క్షాప్ ద్వారా ఫారిన్ లాంగ్వేజెస్ భోదిస్తూ ఈయన డబ్బులు తీసుకోరు. పోలీగ్లోట్ రచయితగా సుపరి చితులైన పూలబాల రచనలు చేసి పుస్తకాలు ముద్రించి వాటిని కూడా ఉచితంగా ఇస్తారు.

 

Elite Multilinguagal Program in Pratibha

సామర్లకోట ప్రతిభ విద్యానికేతన్ లో  Multi lingual Workshop  అసలు విషయం తెలిస్తే షాక్ 

భాషా బోధన అస్సలు జరగలేదు  -  వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి గౌరి 

.   

                                                            

ప్రతిభ విద్యానికేతన్ లో నవంబర్ 3 -4–5 తేదీ బహుళ భాషా కార్యక్రమం  జరిగింది. స్కూల్ యాజమాన్యం ఆహ్వానంపై  బహుభాషా కోవిదుడు పూలబాల విజయవాడ నుంచి ఇక్కడకు చేరుకొన్నారు. ప్రతిభా విద్య సంస్థల చైర్మన్ శ్రీ ప్రకాష్ , ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పుష్ప గుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. 

 అయితే  ఇందులో బాషా బోధన  ఏమీ జరగలేదని కార్యక్రమా న్ని  తుదిదాకా ఆటపాటలతో అలరించి  క్లాస్ రూం ను ఆ స్తలంగా మార్చి పిల్లలను ఆటలలో ముంచెత్తి  ఫ్రెంచ్ ,స్పానిష్ , జర్మన్,  జపానీస్  లో  పాటలు పాడుతూ  నాట్యం చేస్తూ పూలబాల పిల్లలకి  బేసిక్స్ నుంచి బర్త్ డే  సాంగ్స్ దాకా నేర్పారని ఆమె అన్నారు..

ఫన్ లెర్నింగ్ ద్వారా పిల్లలకు మరియు  కార్యక్రమం ఆశయానికి  న్యాయం చేసారని శ్రీమతి గౌరి అన్నారు.  ELITE కార్యక్రమం భాషా సౌందర్యాన్ని పిల్లలకి రుచి చూపాలని చేసిన ప్రయత్నం గా  పేర్కొన్నారు. 

ప్రతిభా  విద్యా సంస్థల ఛైర్మెన్ శ్రీ ప్రకాష్   ఈ   బహుళ భాషా శిక్షణ  పిల్లల్లో నూతన చైతన్యాన్ని  నింపిందని 3 రోజుల్లో ఆరుభాషలు విజయవంతం అయ్యింది. అన్నారు

Welcome scene at Vasavi World School

 

Three day Multilingual Communication Banner at the Entrance of the Vasavi World School


Reception by School Management



Second day School Assembly with the Principal




Second day School Assembly Children 


Poolabala addressing Children on the Second day



Felicitation on the 3rd day








నవయుగ వైతాళికుడు" పూలబాలకు ఘనంగా సన్మానం

 తాను పట్టు సాధించిన 6 విదేశీభాషలను శ్రమ, సమయం వెచ్చించి రాష్ట్ర నలుమూలల పర్యటిస్తూ చిన్నపిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్న నిత్య పర్యాట కుడు "నవయుగ వైతాళికుడు" పూలబాల.

 పాటలు పాడుతూ రాజుని మేలుకొలిపే  గాయకుడుని వైతాళికుడు అనేవారు  నవయుగ వైతాళికుడు అంటే కొత్త యుగాన్ని మేలుకొలిపేవాడని అర్థం. 

అక్టోబర్ 27 28 29 తేదీల్లో మూడురోజులపాటు సాగిన గ్లోబల్ కమ్యూనికేషన్ వర్క్ షాప్ లో విజయవాడ కు చెందిన పోలీగ్లాట్  రచయిత, రెండు ప్రపంచ రికార్డుల విజేత  పూలబాల వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్, ఇటాలియన్ , జాపనీస్ , ఇంగ్లిష్ -  6 విదేశీ భాషలలో శిక్షణ ఇచ్చారు.   

ఆటపాటలతో విద్యార్థులకి  వారి భవిష్యత్ కి అవసరమయ్యే  విదేశీ భాషలలో ఆటపాటలతో శిక్షణ ఇచ్చి నేర్పించగా  వారు నేర్చుకున్న భాషల్ని పిల్లలు చక్కగా ప్రదర్శించారు.   ఉపాధ్యాయులు వాటిని వీడియోలు తీసిన ఉపాధ్యాయులు ఇదంతా నమ్మ సఖ్యంగాలేదు అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.   

మూడో రోజు జరిగిన వీడ్కోలు సభలో వాసవి వరల్డ్ స్కూల్ ( నిర్మల్ ) యాజమాన్యం మరియు ఉపాధ్యాయులచే నవయుగ వైతాళికుడు  పూలబాలకు ఘనంగా జరిగింది.  

ఆ సభలో మాట్లాడుతూ "అందరూ ట్రెండ్ ని అనుసరిస్తారు . కొంతమంది రాబోయే ట్రెండ్ ని ముందుగా గుర్తించి అగ్రగామిగా నిలుస్తారుఫారిన్ లాంగ్వేజెస్ అవసరాన్ని గుర్తించిన వాసవి వరల్డ్ స్కూల్ ని ఇలా ముందు చూపు కలిగి విషనరీ."  అన్నారు . పిల్లలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని కోరుకునే తల్లితండ్రులు ఉండడం సహజం. స్కూల్స్ అలా కోరుకోడం అరుదు. అలాటి అరుదైన స్కూల్స్ లో వాసవి వరల్డ్ స్కూల్ ప్రథమంగా నిలుస్తుంది. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.

.

వాసవి వరల్డ్ స్కూల్ లో ప్రతివారిలోనూ,ముఖ్యంగా టీచర్లలో నేర్చుకోవాలనే తపన కనిపించింది. టీచర్ల నన్ను వెన్నంటి ఉండి పిల్లలను కంట్రలో చేస్తూ నేను చెపుతున్న అన్ని విషయాలనూ అర్ధం చేసుకుంటూ వాళ్ళు కూడా నోట్స్ రాసుకు నేవారు. వాసవి వరల్డ్ స్కూల్ నాకు ఆనందాన్ని సంతృప్తిని మిగిల్చింది మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు. అన్నారు పోలి గ్లోట్ పూలబాల.


సేవచేయడానికి నేనెప్పుడూ సిద్ధం -పూలబాల

డబ్బుకి నో చెప్పి సొంతపనులు పక్కన పెట్టి

సమాజానికి సమయాన్ని శ్రమని వెచ్చించి

భాష నేర్ప ని చదువు చదువు కాదు అంటూ....         

          

విదేశీ భాషల ద్వారా తెలుగు భాష గొప్పతాన్ని సాహిత్య మహాత్యాన్ని నేటి తరానికి చెపుతూ దేశభక్తిని చాటే భాషా సైనికుడు పూలబాలమన అవసరం లేకపోతే మన ఫోన్ కాల్ కూడా తీయని రోజుల్లో తన సొంత పని పక్కన పెట్టి దూరప్రదేశమైన నిర్మల్ వచ్చారువాసవి వరల్డ్ స్కూల్ లోపిల్లలని ఆటపాటలతో అలరిస్తూ భాషానైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. విద్యలో దేశ ఔౌన్నత్యం ఉండదో అది విద్య కాదు. నీతిలో దేశభక్తి ఉండదో అది నీతి కాదుభాష నేర్ప ని చదువు చదువు కాదు. అన్నారు పూలబాల

పిల్లలకి భాషసాహిత్యం రెండూ అవసరమే అన్నారు ఆయన. నేటి చదువులో భాషని అటకెక్కించి ఇంజనీరింగ్ మెడిసన్ కలలు అమ్ముతూ సమాజాన్ని చంపుతున్నారు. మానవ వికాసానికి అవసరమైన భాషని ఉద్యోగ అవకాశాల కోసం అవసరాలకి మాత్రం నేర్పుతుంటే విద్య మార్కులకి పరిమితమై విద్యావంతులు కూడా పిచ్చి సినిమాలు చూస్తూ అమెరికా వెళ్ళినా ఆకు రౌడీల ప్రవర్తనే చూపిస్తూ సినిమాలలో అంట కాగుతూ పుస్తక పఠనాన్ని విలువలని పోగొట్టు కున్నారు. అందుకే దశలో భాషా సాహిత్యం చాలా అవసరం అన్నారు పూలబాల

మనిషి ఆలోచనలను, అనుభూతులను, భావోద్వేగాలను మలచి మానవతను వెలుగులోనికి తెచ్చేది సాహిత్యం. సమాజం యొక్క ఆత్మ, సంస్కృతి, చరిత్రకు ప్రతిబింబం సాహిత్యం. .

సాహిత్యం మనిషిని చీకటి నుండి వెలుగుకు తీసుకువెళ్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, నీతి బోధిస్తుంది నీతిలో దేశభక్తి ఉండదో అది నీతి కాదు. విద్యలో దేశ ఔౌన్నత్యం ఉండదో అది విద్య కాదు. దేశభక్తిని మానవ హృదయంలో నింపుతుంది.

తెలుగు సాహిత్యంలో నన్నయ నుండి నేటి దాకా అనేక మహానుభావులు తమ రచనలతో సమాజాన్ని మేలుకొలిపారు. వారి రచనలు మన సంస్కృతి, మన చరిత్ర, మన విలువల సాక్ష్యాలు.

అంతిమంగా, సాహిత్యం లేకపోతే జీవితం నిస్సారంగా మారుతుంది. మనిషి ఆత్మను ప్రేరేపించే శక్తి సాహిత్యంలో ఉంది. మనసుకు శాంతి నిచ్చే దివ్య ఔషదం జీవితానికి దిశనీ చూపించే దివ్య దీపం దేశానికి రక్షణ కవచం సాత్యంఅందుకే నేటి ట్రెండ్ అయిన ఫారిన్ లాంగ్వేజెస్ ద్వారా పిల్లలకు మాత్ర భాష మాతృభూమి గొప్పతాన్ని కూడా వివరిస్తున్నాను అన్నారు పూలబాల