ఇది ప్రతి ఊరిలో ఉండే
రెస్టారెంట్. అందరికీ తెలియదు. ఇది నిజమా ? చదివితే
మీకే తెలుస్తుంది.
మిట్ట
మధ్యాహ్నం సమయం
1.00 కావస్తోంది. ఒక పోష్ లొకాలిటీ , అందులో
ఒక విశాలమైన వీధి, ఆ వీధిలో ఒక
అందమైన స్త్రీ నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది.
"అమ్మ
ఆటో కావాలా ?" "లేదయ్యా
ఈ వీధిలో భోజనం హోటల్ ఉంది
అంటే వచ్చాను"
"కొంచెం
ముందుకి వెళితే అదుగో అక్కడుందమ్మ"
ఆ స్త్రీ ( ఓ అనామిక) కొంచెం ముందుకి వెళ్ళగానే టోక్యో బాంక్ లా ఐవరీ కాసల్ లాగా
అందంగా కనిపిస్తుంది హోటల్. అబ్బా ఎంతబాగుందో ఈ
హోటల్. తింటే ఇక్కడే తినాలి
అనుకుంటూ హోటల్ లోకి అడుగు
పెడుతుంది. అక్కడ ఒకావిడ ఫ్లోర్
మ్యాపింగ్ చేస్తూ లోపలి రమ్మన్నట్టు
పక్కకి తప్పుకుని నవ్వుతుంది.
ఏదైనా కంపెనీ
చైర్మన్ భార్య అయ్యుండాలి. ఆ
ఖరీదైన నగలు , ఆ చీర అబ్బో అనుకుంటూ హోటల్
లోపలకి చూసింది అంతా తెల్లని
దుస్తులు ధరించి న మగవారు. అంతా పిచ్చెకిస్తున్నారే
అనుకుంటూ లోపలకి ప్రవేశించేంతలో లోపలివారంతా బైటికి హడావుడిగా వచ్చి ఫోటో
లు ఫోటో లు అంటూ
కలియబడ్డారు . వారందరూ చాలా గ్రూప్ ఫోటోస్
తీసుకున్నారు.
ఓ పక్క ఆకలి వేస్తున్నా ఇదంతా
చాలా వింతగా ఉండడం తో ఆ
స్త్రీ ఏమీ ఎదురు చెప్పకుండా
వారితో సహకరించింది వారంతా
లోపాలకి వెళ్లిపోయాకా ," చాలా ఫోటోస్ తీసుకున్నారు
మీ సెల్ఫీ ఒకటీ తీసు కొండి
" అక్కడ తుడిచే చైర్మన్ గారి భార్య. ఎందుకూ
అని కళ్ళతోనే చూసి, చూపుతోనే ప్రశ్నించింది
.
కాష్
కౌంటర్ వద్ద టికెట్ తీసుకుని
చుటూ చూసింది. అందంగా
అలంకరించబడిన పెద్ద
హాలు , తెల్లని ఫ్లోరింగ్ మీద బంగారు పూవులు
తాపడం చేసినట్టు డిసైన్. మొత్తం ఆరు టేబుల్స్ ఉన్నాయి
. ఐదు టేబుల్స్
వద్ద మనుషులున్నారు. ఆశ్చర్యం అంతా మగవారే
, తెల్ల దుస్తులలో ... ఇందాక అనిపించలేదు గానీ ఫెక్షనిస్టుల్లా
ఉన్నారు అనుకుంది.
ఒక వ్యక్తి మాత్రం ఒక ఒక ఎత్తైన
సింగల్ టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నాడు.
అతడు నల్ల బట్టలు వేసుకుని
ఉన్నాడు , జుట్టు నెరిసి ముగ్గు బుట్టలా తెల్లగా ఉంది. ఖాళి
గా ఉన్న టేబుల్ వద్ద
కూర్చుంది.
బాయ్ వచ్చి టికెట్ తీసుకుని
భోజనం తెచ్చాడు. ఎదురుగా మరో హోటల్ కనిపిస్తోది "హోటల్ శ్రీరామ్" అయ్యో నేను
చూడనే లేదే , ఇంతకీ ఈ హోటల్ పేరేంటి ? బోయ్ ని అడుగుదామనుకుంది, ఛా.. బాగోదేమోలే
... అనుకుంటుండగా ఒకాయన పంచకట్టులో వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఇందాకా చూసాను అందరూ
లుంగీల్లో ఉన్నారు , యితడు మాత్రం పంచ కట్టుకున్నాడు. ఇంతకముందు చూసిన వ్యక్తి కాదు.
సర్లే ఎవరైతే తనకెందుకు అనుకుని భోజనం చేయసాగింది. ముద్దా నోట్లో పెట్టుకుంటుండగా తలపైకెత్తి
చూసింది , అతడు తనవైపు చూసి నవ్వాడు .
గబగబా
భోన్చేసి బైటకుపోవాలి అనుకుని
రెండు ముద్దలు నోట్లో పెట్టుకుంది , బాగోలేదు . అవును భోజనం బాగోలేదు. ఆ స్త్రీ మొహం లో అసంతృప్తి
చూసి మరో సారి నవ్వాడు,
ఈ సారి కోపంగాచూసింది. తలతిప్పుకున్నాడు. పప్పు బాగోలేదు , కూర
ట్రై చేద్దాం అనుకుని కోర కలుపుకుంది .. కూరా
ఆంతే , ఈ విషయాలు తెలుకోడానికి
ఎంతసేపు పట్టిందో తెలియదు ఇంకా తినలేను అని
అనుకుంది . వాషబాసిం ఎక్కడ అని అడిగింది
బాయ్ సమాధానం చెప్పకుండా " తినండి మేడం " అన్నం పారేయ కూడదు
" అన్నాడు . వీడెవడు నాకు చెప్పడానికి , తినేలా
ఉందా ఈ భోజనం వెధవ .. ప్రతివాడూ చెప్పేవాడే అనుకుంది.
లేవబోతుంటే
" తినండి " అన్నాడు ఎదురుగా కూచున్న పెద్దమనిషి. " తినాల్సిందే అన్నట్టు ఉంది ఆ స్వరం.
అప్పుడు వచ్చింది అసలైన కోపం , పోరా
గొట్టం అనుకుని వాష్ బేసిన్ వైపు
నడిచింది. వాష్
బేసిన్ వైపు వెళ్లొద్దు అనేక
ఖంఠాలు . అది వాషబేసిన్ నా
లేకా సిన్ నా. ఆమె
రెండు అడుగులు వేయగానే అడ్డంగా నిలబడ్డారు ఆ తెల్ల బట్టలేసుకున్న
పెద్ద మనుషులు.
ఆకలితో
వెళ్లొద్దు , భోజనం పారేయ కూడదు
, అన్నం పరబ్రహ్మ స్వరూపం .... చాలా నీతులు చెప్తున్నారు.
" మీకేంటి సమ్మందం నేను నా భోజనం
నా ఇష్టం , నా ఆకలి నా ఇష్టం
, కావాలంటే తింటాను , లేక పొతే పస్తుంటాను.”
అంది . నీతులు డోస్ పెరిగింది తప్ప
ఎవ్వరూ తగ్గలేదు. “ఆ ఎదురుగా హోటల్
ఉంది కదా అందులో తింటాను
లెండయ్యా , నచ్చని భోజనం చేయమని నన్ను
ఇబ్బంది పెట్టకండి అంది”. అంతా చుట్టుముట్టి వాదనకి దిగారు
. వాదన కాస్త దౌర్జన్యం లోకి దిగే లా ఉంది. చైర్మనుగారి భార్య ( ఫ్లోర్ మ్యాపింగ్ లేడీ ) వారివంక చూస్తుంది ఆమె చెవిలో ఇయర్
ఫోన్స్ .. మ్యూజిక్ వింటోంది.
గోడగడియారావంక చూస్తూ ఉండిపోయింది.
ఆ తెల్ల ముగ్గుబుట్ట , నల్ల
బట్టలాయన్ని కలవాలనుకుంది , అయ్యో కాళ్ళు
ముందుకు సాగటం లేదు నేలకు అంటుకుపోయాయి. ఆయన్ను పిలవాలని
అనుకుంది , గొంతు పెగలలేదు. గోడగడియారం
వేగం పెరిగింది , సీలింగ్ ఫ్యాన్ తో పోటీపడి తిరుగుతోంది.
అనామిక స్త్రీ కి బుర్ర తిరుగుతోంది. ఇది
హోటలా ? చెప్పండి ఇది కసాయి కొట్టా?
ఆ తెల్ల ముగ్గుబుట్ట , నల్ల
బట్టలాయన్ని కలవాలనుకుంది , అయ్యో కాళ్ళు
ముందుకు సాగటం లేదు నేలకు అంటుకుపోయాయి. ఆయన్ను పిలవాలని
అనుకుంది , గొంతు పెగలలేదు. గోడగడియారం
వేగం పెరిగింది , సీలింగ్ ఫ్యాన్ తో పోటీపడి తిరుగుతోంది.
అనామిక స్త్రీ కి బుర్ర తిరుగుతోంది. ఇది
హోటలా ? చెప్పండి ఇది కసాయి కొట్టా
?
తనయెదురుగా
కూర్చుని భోజనం చేసిన వ్యక్తి
రింగ్ లీడర్ లా కనిపించాడు
. అతడు మరీ
దౌర్జన్యం గా ప్రవర్తిస్తున్నాడు. అతడి చెయ్యి
ఆ స్త్రీ పీకమీదకి
చేరుకుంటూ న్నది. ప్రాణ భీతి తో ఆ మొఖం పాలిపోయింది , అతడి చెయ్యి ఆమె పీక పైన బిగుస్తోది
. ఈ లోగా ఆమె పెద్ద గా కేకపెట్టి హోటల్ బైటకి
పరిగెత్తింది. నేను ఇలా ఉన్నాను ఏంటి అంది ఆ అనామిక తన ముడుతలు పడ్డ దేహం చూసుకుంటూ. "రూపం ఒక్కటే చూసుకుంటున్నావు నీ లో జీవ కళ ఎంత తగ్గి పోయిందో చూసుకో
?" అంది చైర్ మన్ గారి భార్య. "ఎలాఉండేదానివో తెలుసా ?" " తెలియదు నారూపం నావ్యక్తిత్వం
అన్నీ మర్చిపోయాను కానీ ఇప్పుడు అర్ధం అయ్యింది నువ్వు నన్ను సెల్ఫీ ఎందుకు
తీసుకోమన్నావో ?" అంది అనామిక . She lifted her head up casually just then a gust of wind had blown up the saree covering the hotel sign board. The name of the restaurant was revealed." పెళ్లి రెస్టారంట్" అనే అక్షరాల చూసి అనామిక మౌనంగా కూలబడింది.