Friday, November 20, 2020

Bharatavarsha 75

 లకుమ: బల్లిపాడు రావ లె నా కుదరమ్మా. చేతిలో నాలుగు సినిమాలున్నవి తెలుసా! నాలాటి తారలు అచ్చటికి  వచ్చిన జనులు మూగల్లరి చేయవచ్చు అది నీకే నష్టము.

అరుణ : ఒసేయ్ నేను నేతల్లినే! మీ డైరక్టరుతో మాట్లాడినట్లు నాతో మాట్లాడవలదు .

లకుమ: ఇలాటి ఫెస్టివల్స్ బోర్ అమ్మా!

అరుణ : దేవుడి ఉత్సవము నీకు శిరోభారంగా నున్నదా! నీ వేషాలు నావద్ద చూపుచున్నావా! నీభాషిట్లు దిగజారెనేమి! ఆ ఊరితో మన పూర్వీకులకు, మనకు ఎంత సంబంధము కలదో  నీవు తెలుసు కొందువు. బల్లిపాడు చక్కటి పల్లెటూరు. పల్లెటూరు చూచుటయే కాక హరి కథా గానము వినవచ్చు, నృత్యములు తిలకించవచ్చు.

లకుమ సినిమా తారలకు హరి కథలు సరిపడవు సినిమాల్లో ఒక పాట లో అలంకరణలు నృత్యములు కంటే యుండునా ఆ హరి కథా నృత్యములు?

చలన చిత్రములు గూర్చి నాకే భోదించుచున్నావా? మొండి పిశాచమా ఇంకోక్కసారి నీతో మాట్లాడేదనేమో చూడుము. అని దూరవాణినుత్తరించెను. 

లకుమ మరల తల్లిని దూరవాణిలో పిలిచి, అమ్మా తప్పు అయినది, మాట్లాడవూ  అరుణమ్మా అని బ్రతిమాలెను.  “నే చెప్పిన మాట వినినచో, చెప్పినట్లు నడుచుకొన్నచో నీతో మాటలాడెదను”  “నీవేమి చెప్పిననూ వినెదను తప్పునా!"

అరుణ : నా బంగారు కొండ.. హరికథ సినిమాకేమీ తీసిపోదు తల్లి, ఒక పాత్ర దారి మూడు గంటలు కథా గానం చేస్తూ అనేక పాత్రలలో జీవించి, ముఖములో సాత్వికము, కాలితో నృత్యము , చేతులతో ఆంగికము , ఆకర్షణీయమైన ఆహార్యముతో ఏకకాలంలో నటిస్తాడు , ప్రేక్షకులకు విసుగు కలగకుండా మధ్య మధ్యలో పిట్టకథలతో హాస్యరసాని పోషిస్తూ , సమాజంలో ఉండే కుళ్ళును ఎట్టి చూపుతూ వేదాంత భోద చేస్తూ హరికథను గానం చేస్తాడు.

నేను రేపు సాయంత్రము కల్లా అచ్చటకు జెరెదను రాత్రికి మనమచ్చటనే బసఁజేసి మరుసటి దినమునఉత్సవములలో పాల్గొనవలెను. సాయం సంధ్యా సమయాన దేవాలయమునకు  భూరి విరాళములొసగెడి అరుణతార బల్లిపాడు చేరుకొనెను. ఉత్సవ కమిటీ వారు ధర్మకర్తలు అరుణతార ని విడిది గృహమునకు లాంఛనంగా తీసుకొని పోయిరి. సువిశాలమైన ఉద్యానవము ముందరున్న విశాల ప్రాంగణములో పచ్చిక బైలు గల విడిది గృహము చెట్టు చేమలతో పూల మొక్కలతో అలరారుచున్నది. పొడవాటి ఇనప గేట్లు దాటి లోపాలకి ప్రవేశించు అరుణతారకు అప్పటికే చేరిన బంధుమిత్రులను చూచి మనసు పొంగినది. మాలిని, మంజూష, దామిని   రాధా కృష్ణ గారు కనిపించిరి.  వారు ఆ పచ్చిక బైలు పై కూర్చొని ఆ పరిసరములను చూచుచుండిరి.  అరుణతార కూడా వారిపక్కనే కూర్చొనెను , కమిటీ వారు వెనుదిరిగిరి.

 కొద్దీ సేపట్లో భానోజీరావుగారు కొత్త వేనులో తామా బృందమునంతటినీ తరలించుకొని వచ్చిరి. గేటు అవతల వేను ఆగెన.  గేటులోని వారు వచ్చువారిని చూచుచున్నారు మొదట రంజిని తారు వార కేశవుడు తరువాత భానోజీరావు గారు దిగిరి.  రంజని " మావయ్యా  కాళ్ళు జుంగుకొనిపోవుచున్నవి బస్సులో వచ్చువారము కదా , అందరినీ వెనులో కుక్కి తీసుకొచ్చినావు"   కేశవుడు " కొత్త వేను  కొన్నతరువాత ఆపాటి మోజు ఉండదా!"   నక్క నాగేశ్వర్రావు " ఏమండీ వేను మోజు తీరినదా ! తీరినచో వెనుకకు బస్సులో పోయెదము " అందరూ ఘొల్లు  మని నవ్వినారు. వెనుకగా వచ్చుచున్న పిల్లి పాపాయమ్మ వారందరూ తనని చూచి నవ్వు చున్నారనుకొని " నక్కా , నామీద మళ్లీ వెటకారమా  వేనులో అంతా  నామీదే వేళాకోళము జేసినావుకదా  !" ఏనుగు మీదొట్టు నీగురించి కాదు " అన్నాడు అందరూ మళ్లి  నవ్వినారు.  

బంటి బలరాం,  కొత్త సుబ్బారావు కలిసి వచ్చుచున్నారు  కొత్త " అదిగో ద్వారక ఆలమందలవిగో!”  అని చేయి చూబించి పాడుచూ వచ్చుచున్నాడు. “నాయనా ఈ అతిధి గృహమును ద్వారకనిన మాకభ్యంతరము లేదు కానీ మమ్మాలమందలని చూపించ వలదు.”  అని అప్పుడే మోటారు సైకిల్ పై వచ్చిన అగస్త్యుడు బసవడు అనగా నవ్వులు  పూసినవి.  అరుణతార అగస్త్యుని లకుమ ఏదని సైగ చేయగా అతడు దగ్గరకు పోయి " లకుమ తన డైరక్టర్ కశ్యపునితో వచ్చి స్థానిక హోటల్ లో బసజేసెను, రేపు ఇచ్చటకి  వచ్చును" అని చెప్పెను. అరుణతార ఒక నిట్టూర్పు విడిచెను.  పనివారు అందరికీ కాఫీలు అందజేసి అందరి సామానులు లోపల పెట్టినారు. అందరూ విడిది గృహ ముందటి ప్రాంగణములో పచ్చిక పై కూర్చొని సేదతీ రుచున్నారు.  

రంజిని: నేటి యాంత్రిక యుగమున ఒక ఇంటి వారందరూ కలిపి గడుపుటయే గగనమాయెను ఈ రాత్రికి  ఈ సువిశాల  చావిడి లో అందరమూ కలిసి గడుపుట గొప్పవరము. 

దామిని: మీనాక్షి ఉన్నచో బాగుండెడిది.   

కేశవుడు: గురువుగారున్నచో బాగుండెడిది

మాలిని : వర్షుడి జీవితమునందు శుభ గడియలు నడుచుచున్నవి మీనాక్షి జీవితమూ కుదుటబడుచున్నది వారి జీవితములు సుఖశాంతులతో వర్ధిల్లుననెడి భావన ఎంత హ్లాదమును కలిగించును. వారున్నంత స్థానములకు చేరుటయే కదా మనకు కావలసినది. 

అరుణ: మనిషికి కావలసినది దక్క నప్పుడు ఎక్కడున్ననూ లాభమేమి?

హృద: అరుణ అక్క గారు వర్షుని పుస్తకములను విడుదల చేయుట పెను సంచలనము.  మానవ వనరుల (హెచ్ ఆర్ డీ మినిష్టర్) శాఖామాత్యులు సభకు విచ్చేసినారన్న రాజధాని లో అక్కగారి ప్రభ ఎంతున్నదో తెలియుచున్నది.  అక్కగారి గురించి వినుటయే కానీ చూచుట ఇదే మొదటిసారి. అక్కగారికి అందరు జేజేలు చెప్పండి. అందరూ పెద్ద ఎత్తున హర్షనాదములు  చేసిరి. 

మనమందరము ఒకరి గురించి ఒకరు వినియున్నాము ఇప్పుడు మదనగోపాలుని దయవల్ల కలుసుకొనుటకు అవకాశము కలిగెను.   

హృద: అక్కయ్యగారు మీరు వర్షుడు లేడని మరచి ముంగీస లో వర్షుని చూడవలెను 

కేశ: అట్లే మీనాక్షి లేదని మరచి అగస్త్యలో ఆమెను చూడవలెను.   

మంజు: అగస్త్య వచ్చుచున్నాడా! మీనాక్షి గారు వచ్చినచో తల్లి బిడ్డలు కలుసు కొందురు కదా!

మాలిని: నువ్వు తగ్గుమమ్మ తల్లి ఎచ్చటున్నదో యని వాడికి తపన కలగవలెను. తల్లి కొరకు వాడు తహతహ లాడవలెను.  అంతవరకూ ఎవ్వరూ వాడికి అగస్త్యుడికి   మీనాక్షి జాడ తెలపరాదు ఇదే వర్షుడి ఉద్దేశ్యము ఇదే నా ఉద్దేశ్యము.  మాలిని "అరుణా, ఇంకనూ సుందరి రాలేదేమి ?" అనుచుండగా ఆకాశములో  

  శా.  హోరెత్తిం    చెవిమా   నమాక   శమునం    దంగార    చెంగావి లో

     తీ రే చూ    డగసిం     గనాద     మదియే      దట్టంగ     కర్ణంబు   లం      

      తారాడ       ప్రభవిం     చునుర్ర    నుశబ్ద        ప్రకంప    నే హెచ్చు చూ

      పారాడ     అవరో      హణా క్ర     మము లో   భీతిల్ల      రావీక్ష    కుల్ 

హోరెత్తించె  విమాన మాకశము   నందంగార చెంగావిలో, తీరేచూడగ  సింగనాద మదియే   దట్టంగ   కర్ణంబు లం      తారాడ  ప్రభవించు   నుర్రను శబ్దప్ర కంప నేహెచ్చు చూ  పారాడ   అవరోహణా క్రమము లో   భీతిల్లరా వీక్షకుల్ 

మబ్బులలో  మెరియుచున్న  విమానమగుపించగా  అందరూ  తలయెత్తి పైకిచూచుచుండిరి.  అప్పుడు అరుణ " అంగార (నిప్పు) చెంగావి (మనోజ్ఞమైన ఎర్ర రంగు)లో పోవు విమానము నందెవరున్ననూ  సుందరి అని పిలిచినంతనే ఆమెను  గుర్తు చేయుచూ చెవులందు విమాన ఘంకారము  సింగినాదం వలె  వినిపించుట ఎంత విడ్డూరము."అనెను. మాలిని  విమానము క్రిందకి దిగుచున్నట్లున్నది శబ్దము పెరుగుచున్నది  అనెను. బసవడు "దిగినట్టే దిగి మరల పైకి పోయినది  అయిననూ ఈ పల్లె టూరిలొ విమానమెందుకు దిగును?" అనెను.  

 దామిని "సరిగా చూచినచో విమానము దిగుచున్నది”అనెను. “అది సుందరి కావచ్చునేమో" అని హృదయాలజిస్ట్ అనగా  మంజూష  “హాస్యమునకైననూ హద్దుండవలెను కదా దామినీ మీ ఆయనకిక వైద్యము తప్పదు" అనెను. అదివిని కోపముతో మాలిని "ఇంటి వద్ద దామిని అన్నచో ఊరుకొనుచున్నాను ఇచ్చట పేరుపెట్టి పిలిచినచో తాట తీసెదను అక్క అని పిలువుము  " అని మంజూషను హెచ్చరించెను. మంజూష బిక్క మోహము వేయగా దామిని మంజూషను దగ్గరికి తీసుకొని " ఎందుకమ్మా చిన్నదానిని అట్లు బెదిరించెదవు " అనెను. “ఇది చిన్నదా పెండ్లి చేసిన ఇద్దరి పిల్లలను కని  యుండెడిది" అని అరుణతార  దామిని వద్ద 

గారాలు పోవుచున్న మంజూషను చెవి నులిమెను. ఇంతలో కేశవుడు విమానము పడిపోవుచున్నది పడిపోవుచున్నది. అని కేకలు వేసెను, భానోజీరావు గారు మొదట  భయపడి తు.. తు అని ఉమ్ముకొని తరువాత తేరుకొని “ఈ వెదవె వడో గానీ మన నెత్తిపై తారటలాడు చున్నాడు.” అనగా   కళాబృందమంతయూ “మాకెందుకీగోల కూలిన కూలవచ్చు”  అనుచూ విశాల ముందటి  ప్రాంగణము నొదిలి విడిది గృహములోకి పరుగిడిరి నక్క, బంటి, ఏనుగు, కొత్త అందరూ లోనికి పోగా పిల్లి మాత్రము నిర్బీతిగా నిలిచి చూచుచుండెను.

విమానము క్రమముగా క్రిందకు జారుడు బల్ల పైనుండి పిల్లవాడు జారునట్లు జర్రని జారి అందు మనుషులు అగుపడ పిల్లికి కాళ్ళు వణికెను  పిల్లి కూడా లోపలకు పారిపోయెను.  ఆమె లోపలి పరిగెత్తుచుండ అప్పటికే లోపలి చేరిన కళాబృందము " మ్యావ్ .. మ్యాప్ .. " అని అరుచు చుండ అందరూ పెద్దగా పగలబడి నవ్వుకొనిరి.  అరుణ " మన పిల్లే సందేహములేదు చిందులు తొక్కుచున్నది " అనెను. ఈ లోగా పార్వతి తన పెద్దమ్మతో అచ్చటికి చేరెను. పార్వతి "పక్కనున్న హైస్కూల్ ఆటస్థలములో దిగుటకొరకు విమానమును గుండ్రముగా త్రిప్పుచున్నాడు" అనెను. 

పార్వతి  కేశవుని వద్దకుపోయి పలకరించుచుండగా పార్వతి చాలా ఎదిగిపోయెను మంచి ఛాయ దేరి పండువలె నున్నది  అని మాలినిగారు అనగా . “ఏ పండు వలే నున్నది?” అని హృదయాలజిస్ట్ అనగా అరుణతార " మీ ఇంట పండిన సపోటా వలే నున్నది." అనెను   బసవడు అట్లే పార్వతిని  చూచుచూ   మాలినిగారికి దొరికిపోయి తలతిప్పుకొనెను.  అగస్త్యుడు "ఉద్యోగమొచ్చిన పిదప బసవడికి  కూడా కళ  వచ్చెను" అనెను.    

అందరూ పక్కనే ఉన్న విశాల ఆటస్థలమందు ప్రవేశించిరి. అందరూ తలఎత్తి చూచోచూ నిలవగా సుందరి వ్యోమయానమును గుండ్రముగా త్రిప్పుచూ వర్తులాకార సోపానములు దిగునట్లు దింపుచున్నది. దీని వైమానిక వయ్యారమంతయూ వొలక బోయుచున్నది అని మంజూష అనగా ఇప్పుడు దీని వైమానిక కళ అంతయూ చూపిగాని వాలదు అని తార అనెను.  అరుణతార, మాలిని, రంజిని కుటుంబము, కళాబృందమే కాక ఊరి జనులు పిల్లలు అంతా  విమానమును చూచుటకు వచ్చిచేరినారు.

     శా. గాండ్రించం  గపుల     ల్లె మీద       మరియా    గాండ్రింపు   జాల్వారు  చూ

      గుండ్రంగ   దిగుచుం    డగా ప్ర       భలుగాం     గేయాశ్త్ర      నాద శ్రు    తిన్

      చం డ్రాగ్నిన్   కొనివ    చ్చుయాన   మునుకాం   చిరాప్ర     జానీక    మున్

      కండ్రీకా    నవిమా     నమాగ       మగువే      కుప్పించి    లంఘించ   గా         


 గాండ్రించంగ  పులల్లె మీద (ఆకాశములో) మరియా  గాండ్రింపు   జాల్వారుచూ , గుండ్రంగ   దిగుచుండగా  ప్రభలు  గాంగేయాశ్త్ర   నాద శ్రుతిన్ ( భీష్మాస్త్ర శబ్దము తో ) చండ్రాగ్నిన్ కొనివచ్చు  యానమును కాంచి రా ప్రజానీకమున్ కండ్రీకాన( పొలమున)  విమానమాగ మగువే కుప్పించి లంఘించగా. 

సుందరి విమానము నుండి దిగి , తల్లిని దింపి మెల్లగా అరుణతార వద్దకొచ్చి వంగి కాళ్లకు నమస్కరించెను. "ఛీ ఛీ లేమ్మా ఎందుకిదంతా" అని తార అనుచుండగా "అమ్మ మరొక్కసారి నీకాళ్లకు మ్రొక్క నివ్వుము అని వంగిసుందరి తనుసంపాదించిన  పైలట్ అనుమతిని ఆమె కాళ్లవద్ద నుంచి నమస్కరించెను.అయ్యోఇది ప్రభుత్వ(డిజిసిఏ)  మిచ్చిన లైసెన్స్ అమ్మా అని అనుచుండగా  సుందరి కన్నీళ్ల పర్యంతమయ్యెను. 

తే. నీవు గాకప్ర  భుత్వమ నినఎ  టుండు   

మనసు  నిండుగ దయగల మాత  రెండు   

నిమిష  ములునీప దాలంట నిమ్ము, బిడ్డ 

నీఋ  ణమెటులు తీర్చున నెవరి కెరుక

పెద్దల సభలో కూర్చొను పెద్దమ్మ ప్రభుత్వమనిన నీవే కదమ్మా! ఇంకొక రెండు నిమిషములు నీ పాదములంటనిమ్ము తల్లీ, నాబిడ్డ నీ ఋణము ఎట్లు తీర్చునో కదా! యని తులశమ్మగారు వేడుచుండగా అరుణతార పాదములనంటిన బిడ్డ కన్నీరు కార్చుచుండ అరుణతారకు కూడా దుఃఖము పొర్లుకొచ్చెను. దుఃఖమును దాచకుండ పెద్దామె పెట్టునేడ్చు చుండ అందరి నేత్రములు వర్షిచుచుండెను. మానవ సమ్మందముల మాధుర్యమ నిర్వచనీయము. ఇంతలో పిల్లి పాపాయమ్మ” ఇంత  ధైర్య సాహసాలున్న పిల్ల, ఆకాశంనుంచి దిగిన పిల్ల ఇట్లేడ్వవచ్చా?  నేను రంగము మీద తప్ప పైన విడిగా ఏడవనమ్మా? అని సోత్కర్షతో ఓదార్చుచుండెను. ఇదివిని నక్క నాగేశ్వరావుకు కడుపులో దేవి నట్లయ్యెను, "అవునమ్మా సుందరీ ఈవిడ చాలా ధైర్యస్తురాలు ,ఒక్క సారి విమానమెక్కి  స్టార్ట్ చెయ్యమ్మా, ఈవిడ ధైర్యం ఎంతో తెలుస్తుంది ! అనుచుండగా సుందరి నవ్వాపు కొనలేకుండెను.  కొత్తగా వచ్చిన కొత్త సుబ్బారావ్ మ్యాప్ .. అని అరిచెను. దానితో అందరి అశ్రువులు మాయమయ్యి ఎల్లడా నవ్వులు తాండవించెను. అందరు ఆనందముగా విడిది గృహమున కేగిరి.  

Thursday, November 19, 2020

Bharatavarsha -74

 కామాక్షీ నాకూతురికి ఉత్తమ పైలెట్ గా ప్రధమ బహుమతి వచ్చినదే.  బారామతి యందు ఆ బహుమతి తీసుకొను నప్పుడు నేనుండవలెనని పట్టుబట్టగా నేను ఇచ్చటకి వచ్చినాను. కాకినాడ నందు లేను. దగ్గరకి వచ్చు కూతురిని చూసి  “మరల  మాటలాడెదను” అని దూరవాదన నిలిపివేసెను.

సు : అమ్మా  నాశిక్షణ సంస్థ యందు ఉత్తమ వైమానిక విద్యార్థినిగా  ఎంపికచేసి  సత్కరించి నారు అంతే కానీ నాకింకనూ ఉజ్జోగము రాలేదు నేను పైలట్ కానూలేదు. రేపు ఇంకా నూ పరీక్ష కలదు

తు: మొన్ననే ఇంటర్వ్యూ పరీక్ష జరిగెను కదా మరల మరియొక పరీక్షా?

సు : అమ్మా ఇండిగో విమానయాన సంస్థ నందు వైమానికురాలు కావలెనన్న మూడేమి ఖర్మము ముప్పది పరీక్షలైననూ , ముప్పతిప్పలు పెట్టిననూ తప్పవు గాక తప్పవు.

తు: అయినచో ఇంకనూ రెండు పరీక్షలు కలవా? 

సు : భారతదేశమున అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో నందు అవకాశము వచ్చుట పెద్ద దృష్టము గా భావించ వలెను. ఇచ్చట ఎంపిక పరీక్షలు మూడు వలయములలో నుండును. మొదటి పరీక్ష అయినది.  రెండవ పరీక్ష గురుగాం లోగల   కేంద్ర కార్యాలయమందు నిర్వహించ బడును , పిదప ముంబై లో చివరి పరీక్ష. 

తు: ఈ పరీక్షలు చూచి చూచి వెగటగుచున్నది!

సు : ఈ మూడు పరీక్షలే వెగటయినచో మొత్తము పరీక్షలు గూర్చి విన్నచో ఏమందువో! 

మొదటి పరీక్ష  క్లాస్ 2 తరువాత  క్లాస్ 1 మెడికల్స్  పరీక్షలందు నెగ్గి అనంతరము గ్రౌండ్ స్కూల్లో సుమారు 8 నెలలు కూర్చుని 7 వ్రాత పరీక్షలందు గెలుపొంది ఆ తరువాత అన్ని వాతావరణ పరిస్థితులలో 200 గంటలు ఎగరి అన్ని ప్రమాణములు పూరించగా  ఇండిగో  పరీక్షకు హాజరగు అవకాశము వచ్చినది.  నియామక ప్రక్రియ మూడు వలయములు నాలుగు భాగములుగాయుండును అన్నిటా గెలుపొందిన పిదప 2 కోసంవత్సరాలు పైలట్గా ఇత్తురు.  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు నాకిచ్చు లైసెన్స్ కొరకు 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత నొందవలెను ఇండిగో ఉత్తీర్ణత శాతం దాని కంటే చాలా ఎక్కువ. 

తు: ఇంతకీ  నీకిచ్చునది సహ వైమానికురాలిగానా?

సు : అమ్మా తులశమ్మ!  ఊరకనే పైలట్ ఉజ్జోగ మిత్తురా? భారతదేశంలో సుమారు 7000 మంది నిరుద్యోగ సిపిఎల్ కలవారు ఉన్నారని నీకు తెలియునా? సంవత్సరంలో నియామకాలు 30-40 మాత్రమే అని నీకు తెలియునా?

తు: అవన్నీ నాకు తెలియవు నాకూతురు తెలివియందు సరస్వతి, ధైర్యమందు దుర్గ అందమందు అపరంజి బొమ్మ అని తెలియును అని అనుచుండగా “వెవ్వె వెవ్వె” అనుచున్న కూతురిని ఆలింగనము జేసుకొని ముద్దిడెను.

సు : నేడు నేను గురుగావ్ పోయివత్తును  

తు: అది ఇచ్చట కలదా, బారామతి బొంబాయి వద్ద , గురుగావ్ ఢిల్లీ వద్ద నున్నవి. కనీసము 1400 కిలోమీటర్ల దూరముండును.  ఈరోజే ఎట్లు పోయెదవు?

సు : సుందరి ప్రయాణము లన్నియూ నాటికల్ మెయిల్స్ లో నే యుండును అని కన్ను కొట్టెను. 

తు: అనగా నీవు రైలులో పోవుటలేదా?

సు : సుందరి ఎచ్చటికి పోయిననూ ఆకాశమార్గమునే నని తలంచవలెను.  

తు: నీకు దూకుడెక్కువగుచున్నది బల్లిపాడు పోయి అక్కడ ముక్కుతాడు వేయ వలెను. 

సు : అరుణమ్మ బల్లిపాడు పోవలెనని చెప్పినది. ఎంపికయ్యి, ఉద్యోగమున జేరుటకు సమయమివ్వనున్నచో ఏమి చేయవలెను. బల్లిపాడు ఎందులకు పోవలెనని నాకు బెంగగా యున్నది.   

తు:ఈ కీళ్ల వాతముతో ఎట్లు పోవలెనో యని నాకు బెంగగా యున్నది. కాకినాడలో ఉన్నచో బాగుండెడిది బల్లిపాడచ్చటికి దగ్గర కానీ ఇప్పుడు జూడుము బారామతి నుండి బల్లిపాడు పోవలెనన్నా ఎన్ని గంటలు కూర్చొనవలెనో? కానీ  ఉత్సవము కనుల వైభవముగా జరుగునని అరుణమ్మ చెప్పెను.  ఒక్క సారైననూ చూచి తీరవలెనని ఆమె చెప్పెను

సు :అట్లయిన నేను నందినిని పిలుతును , ఆమె కూడా అందరిని కలువ వచ్చును 

Bharatavarsha -73

రాక్షసీ! నీ ప్రియుని కౌగిలి చేరెదనని ఒట్టుపెట్టి నెరవేర్చుకొన్నావు హోటల్లో నీ ప్రియుడు నిన్నెత్తు  కొనెనని , హత్తుకొనెనని మృదుమధుర కుసుమ కావ్యమువలె   వ్రాసినావు.  నేను కూడా ఒక ఒట్టు పెట్టుకొంటిని.  నాకు ప్రియుడు లేడు కానీ విమానమే నా ప్రియుడు.

పట్టణాల్లో తిరుగుతున్నప్పుడు సినిమాలు, కాఫీ హోటల్స్, షాపింగ్ మాల్స్,  వంతెనలు  గురుతులుగా యుండి నీకు మార్గమును సూచించుచుండును. కొత్తగా ఒక నగరంలోకి పోయినప్పుడు త్రోవ మరచు అవకాశము కలదు. అప్పుడు నీవు వాహనమును నిలిపి ఎవరినైననూ అడిగినచో నీకు దారితెలిపెదరు, దయగలవారైనచో గొనిపోయి చూబింతురు. గగన తల మున  మేఘ మార్గమునట్టి దయగలవారెవరుందురు? మార్గమును సూచించు గురుతులుండవు, వ్యోమయానమును నిలప వీలుండదు.  గతించిన కాలము, నాటికల్  ఛార్ట్స్ (ఇవి రోడ్ మేప్స్ వంటివి)  ఆధారముగా వైమానికులు (పైలట్స్) విమాన యానమును (ఏరియల్ నేవిగేషన్) సాగింతురు. ఆందొక్కరవ్వ పొరపాటు జరిగినచో ఏమగునో తెలియునా?

 నేను మొన్న రాత్రాకాశమున ఎగురుచుండగా నాకెందులకో దారితప్పితినని సందేహమొచ్చెను. గతించిన కాలము గణించు పద్ధతిన గమ్యమునకు పోవుచున్న నేను తరంగ మార్గదర్శన నియంత్రణకు తూర్పు దిశగా ఎగురుచున్నానని తెలపగా వారు నేను పశ్చిమాన సముద్రముపై నూరు నాటికల్ మైళ్ళు  పైబడి పోవుచున్ననై తెలిపినారు. హతవిధీ! ఇకపై తరంగ మార్గదర్శనమున ఎగరవలెనని ఒట్టు పెట్టుకొంటిని. 

ఇంతకీ నీప్రియుని ఎట్లు జాలమందు బంధించితివో నాకు చెప్పనే లేదు   

ఉత్తరము పూర్తిచేసి వెనుకకు తిరిగి చూడగా తులశమ్మగారు దూరవాణి సంవాదమునందు చెప్పు మాటలు విని అవాక్కయ్యెను.  

గతించిన కాలము గణించు పద్ధతిన  (TTL. total time lapsed) 

Tuesday, November 17, 2020

Bharatavarsha 72

చెన్నపట్టణము: జగద్విఖ్యాత అర్ధ సహస్ర భాగ్య సంస్థలందు యాక్సెంచర్ యనొక ఒక బహుళజాతి సంస్థ పంచ శత సహస్త్ర ఉద్యోగులను కలిగి నూటఇరవై దేశాలలో ఖాతాదారులకు సేవ లందించుచూ సాలుకు మూడు వందల కోట్ల ఆదాయమును పొందు చున్నది. అట్టి మేటి సంస్థ నందు దళపతిగా పదోన్నతి పొందిన బసవడు సాంకేతిక హరిత వనమందు ప్రమోదసమ్మేళనములో 

నీలి సూటు ధరించి మెడకట్టు (neck tie) తో,  ఉంగరముల జుత్తు తో   వేదికపై నిలచి యుండెను.  వారిలో చురుకుగల సభ్యు డొకడు మరొకడితో "ఈ నీలిసూటునందు బసవడు  ఆకర్షణీయము గానున్ననూ  ఏదోవెలితి కనబడుచున్నది." అని వంక పట్టెను. " ఉద్యోగమందు ఎత్తు పెరిగిననూ ఇతడి ఎత్తు 5 అడుగుల 7అంగుళములు   వద్ద నిలచిపొయినది. పొట్టిగాగా నుండుటయె తప్ప మరి ఏ వంక లేని  నెలవంక." అని మరొకడు బసవని వెనకేసుకువచ్చెను. వారి మాటలు విన్న బసవడు " నా ఎత్తు ఇంగ్లాండ్ ప్రధాని ఎత్తు,  కాని అతడివలె ఉబ్బిన రబ్బరు బంతి వలే లెకుండుట నా అదృష్టము అని చమత్కరించెను" అతడి చేతిలో శబ్ద వర్ధని యుండుటచేఆ మాటలు అందరికి వినబడుటచే ఆ ప్రదేశమంతయూ హాస్య కరతాళ ద్వనులతో నిండెను. సభ చిత్రీకరణ మొదలయ్యెను. బసవడు తన ఉంగరముల జుత్తు  సవరించుకొని. దృశ్య చిత్రీకరణ జరుగుచుండగా  నూర్వురు శిష్టజనము నుద్దేశించి

 " నేటి ఈ సభకు విచ్చేసిన అందరికీ వందనములు  నాకు గురుతుల్య  హితుడు   భాషా కోవిదుడు , సహస్రావధాని  భారతవర్ష  వ్రాసిన  నూరు ఆంగ్ల పద్యములను  హార్పర్ కొలిన్స్  యను  ప్రపంచ ప్రసిద్ధ ప్రకాశకులు రెండు పుస్తకములగా ముద్రించి  దేశ రాజధాని నగరమందు విడుదల  చేసియున్నారు. ఆ పుస్తకములను మీకు అందజేసితిని, మీ చేతుల్లో గల పుస్తకములను చూచుకొన్నచో    సభాముఖహముగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి వ్రాసిన ఈ రెండు సంకలనములందు గల పద్యములను మచ్చుకు కొన్ని చదివి  చర్చిం చుటయే ఈ సాహిత్య గోష్ఠి  ముఖ్యోద్దేశము.

వేదికపై బసవడుకాక చేరువైపులా ఇద్దరిద్దరు కూర్చొని ఉండిరి. ఛాయాగ్రహణము జరుగుచున్నది అందరి చేతులలో పుస్తకములు కల కల లాడు చున్నవి.  విచ్చేసిన వారిలో వేదికనలకరించిన ఆంగ్ల పండితుడు వడివేలు“ నేను మీకు కొత్తకాదు, భారతవర్ష   చెన్నపట్టణమునకు కొత్తకాదు, మన మద్రాసు విద్యాలయమున పలు మార్లు అవధాన కార్య క్రమములను నిర్వహించెను. ఇప్పుడు విడుదల యిన రెండు సంకలనములు    ఒకటి - డెడ్ ట్రీ పొయెమ్స్  - ఇవి   నైరాశ్య కవితలు. రెండు రివర్ సైడ్  సాంగ్స్   ఉత్సాహ, శృంగార  గీతములు. 

Fast and fast I run

The cobble stones are no fun

I have no bouquet in my hand , 

with my heart I wanna stand 

dumb by your tomb. 

ఇవి నాకు నచ్చిన కవిత నుండి ముఖ్యమైన పాదములు. ఈ కవిత లో ప్రేమికుడు తన ప్రియురాలిని చూచుటకు రాత్రి పోవుచున్నాడు, కవిత అతడి పరుగును రాత్రిని రాళ్ళను వర్ణించుచుండును  చివరి వాక్ష్యము చివరి అక్షరము దాకా అతడి ప్రేయసి చనిపోయినదని తెలుపడు

Eternal wait   

Hurry up time run fast  

I am low, you are slow

Oh no, hurry up and go

Ich warte auf dich leide 

bei der Leichenhalle

శాశ్వత నిరీక్షణ అను ఈ పద్యమందు ప్రేయసి కొరకు ఎదురుచూచు కవి సమయమును త్వరపడమని తొందరపెట్టుట వింతగా తోచును. ఈ పద్యమునందుకూడా చివరిదాకా కవి మార్చరీ వద్ద ఎదురు చూచుచున్నాడన్న విషయము తెల్పడు. ఆమెను చూడవలె, కాలమా త్వరపడి నన్ను గొనిపొమ్ము అనగా పరోక్షంగా కడతేర్చమని సరదా స్వరమున అడుగుట అతడి వైరాగ్య నిర్భీతి లను చూపుచున్నదని అందరు ఆంగ్ల కవితను ఆస్వాదించిరి కానీ “ఆంగ్లపద్యములందు జర్మన్ పదములు వాడుట తగునా?” అని ఒకామె తుచ్చ ప్రశ్న సంధించెను. అప్పుడు బసవడు” ఇలియట్ వ్రాసిన వేస్ట్ లాండ్ పద్య సంకలనము చదివితివా అందు బరియల్ ఆఫ్ ద డెడ్ , డెత్ బై వాఁటర్ , గేమ్ ఆఫ్ చెస్ పద్యములను చదివిన అందు సాంబరఁగ్జీ , హోఫ్ట్ గార్టెన్ ,హైమాట్ సు , ఓ వైలెస్ట్ డు వంటి ఎన్నో జర్మన్ మాటలు కనిపించును. అందుచే ఇది సంప్రదాయ విరుద్ధము ఎంత మాత్రము కాదు”

Kick me out of your Heart

Kick me out of your unwilling heart

I may from the apex of love fall apart, 

Let the stones of truth into me pierce

After the dainty bonds of love destroy, 

My blood should speak the truth

ఇది హృదయ విదారకమైన, దుఃఖపూరితమైన కవిత , నీమనసునందు నాకు స్థానమివ్వకున్న నన్ను విసిరి వేయుము, పోయి నిజమను పణుకు కురాళ్ల పై పడి  మరణింతును అని వ్రాసెను. ఇట్లు వ్రాయుటలో కపటప్రేమ పట్ల కవి వైరాగమును ప్రదర్శించుచూ మృత్యువునాశ్రయించెను.

My Honeymoon

I drive slowly on the night of rain,

 Ogling at her sweet mane

The moon is splendor!, 

The nature is wet and naked

She leans her head on my shoulder, 

In her sweet breath I smolder

 No more I can write about my honeymoon

ఇది సున్నిత శృంగారము . శృంగార యాత్రకు పోవు జంటకు తీయని రాత్రి కలుగు అనుభవములను సున్నితముగా వ్రాసెను.ఇంకెంత మాత్రమే వ్రాయలేను అనుటలో సభ్యత తో కూడిన  శృంగారము దాగి యున్నది. 

 Up! up! cheer up my friend, 

Yesterday was not the end

you just learn to transcend, 

you are my beautiful friend

Sad thoughts are like dark spots,

 Right now remove the nasty dots

ఇది ఉల్లాస భరితమైన కవిత , నైరాశ్యమును వదిలించి ఆశను నింపు కవిత ఈ కవితలన్నీ అంత్య ప్రాసను కలిగి యుండి  నిత్యమూ వాడు పదములతో చదువుటకు సులభముగా నున్నవనుచూ బసవడిచ్చిన  విందారగించి పుస్తకములను ఇంటికి గొనిపోయిరి. 

                                                                       ***

హైదరాబాదు:భక్తచింతామణి నాటకమును ప్రదర్శించబోవుచూ అభ్యాసము కొరకు భానోదయ కళాబృందము వారందరూ లాంకో హిల్స్ లో రంజినిగారింట కలిసినారు.  రంజనిగారు అందరికీ  మిఠాయి పొట్లము భారతవర్ష ఆంగ్ల కవితా పుస్తకములు పంచి విషయమును వివరించగా, తమ శ్రీకృష్ణ పాత్రధారి ఉన్నత కీర్తిని పొందెనని తెలిసి హర్షమును తెలియజేసిరి. కేశవుడు రెండు కవితలను చదివి వినిపించెను. భానోజీరావుగారు రంజని ఇచ్చిన జీతాల చెక్కులను పంచిపెట్టిరి.

                                                                     ***

విశాఖపట్నము:  భారత మెడికల్ కౌన్సిల్  విశాఖపట్నం చాఫ్టర్ కొత్త కార్య నిర్వాహక వర్గం ఎన్నికయ్యెను. ఈ కార్య నిర్వాహక వర్గం రెండు సంవత్సరాలు  పాటు కొనసాగును. 1600 సభ్యులు గల విశాఖపట్నం చాఫ్టర్ లో కొత్త ప్రెసిడెంట్ గా డాక్టర్ రాధాకృష్ణ కార్డియాలజిస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ మాధవి , సెక్రెటరీ గా డాక్టర్  చేనులు ఎంపికైనారు. 

 పూర్తిగా నిండిన కాన్ఫెరెన్స్ హాల్ లో అందరూ డాక్టర్లే కాగా డాక్టర్ కానీ డొక్కరే - దామిని,  సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ రాధాకృష్ణ   " నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు నేటినుండి మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ  డయాబెటీస్  మరియు కేన్సర్  కార్యక్రమములను చేపట్టి అమలు జరపవలెను అని ప్రారంభించి కొలది సేపు మాట్లాడిన పిమ్మట తన సహాయకుడికి సైగ చేయగా అతడు ఒక బుట్టతో పుస్తకములను తెచ్చి డాక్టర్లందరికీ పంచెను. ప్రపంచ ప్రసిద్ధ ప్రకాశకులచే ముద్రించ బడిన ఈ ఆంగ్ల కవితా సంకలనాలు మీకు కానుకగా ఇచ్చు చున్నాను. ఈ రచయిత  మా అబ్బాయి భారతవర్ష అని సగర్వంగా తెలియజేసెను. రమణకి తాను రావణుడివలేకాక  రమణ వలే  కనిపించెను ,  కార్డియాలజిస్ట్ లో హృదయాలజిస్టు  కానరాలేదు

తిరిగి వెనుకకు బోవుచుండగా దారిలో హృదయాలజిస్ట్ డామినితో "  భారత వర్ష  ఉద్యోగమును తిరస్కరించి  డబ్బును విరాళముగా ఇచ్చివేయుట ఎంత మంచియ్యెనుకదా  అనగా దామిని  "  అవి శ్వీకరించినచో  అతడి వ్యక్తిత్వము  చిన్న బోయెడిది కదా " అనెను  

                                                                       *** 

బెంగళూరు: హోసూర్ మార్గమందు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్ ఒకటి లో గల రాఘవ ఎలెక్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ స్థాపకుడు రాఘవ అబ్బురంగా తన చేతిలో నున్న రివర్సైడ్ సాంగ్స్ , డెడ్ ట్రీ పొయెమ్స్  పుస్తకములను మార్చి  మార్చి చూచు చుండెను. పని ముగిసిన పిదప బయలుదేరుటకు ముందు చెప్పి పోవలెనని వచ్చిన ఇద్దరు డైరక్టర్లను తే నీరు త్రాగి పొండని కూర్చొన మనెను. “ నమగే  ప్రతిదినవూ తుంబ సమస్య గళివే !  ఎ ష్టు బారి కేళ బేకు? (ఎన్ని సార్లు వినవలెను)  టీ   త్రాగిన పాపానికి  నిన్ననే విన్న సమస్యలు మరల వినవలెనన్న..” శేషు అనుచుండగా సంస్థ స్థాపకుని అట్లు అగౌరవపర్చుట తో యమున “నీవు బైసరిద్దరే హోగ బహదు.” అనగా అతడు కూర్చొనెను, పిదప యమున కూడా కూర్చొనెను. టీ తాగిన పిదప

రాఘవ "నాతో చదువుకున్న చిన్న నాటి స్నేహితుడు నేడు ప్రపంచ వ్యాప్తమగుచున్నాడు"
“విలక్షణ వాగిర బేకు (అదృష్టమన్న అట్లుండవలెను)  నాను కూడా సాగష్టు బరిదిద్దేనే (నేను కూడా చాలా వ్రాసితిని ) అని  శేషు అనగా పక్క నున్న యమున ఆగక నవ్వుచూనే ఉండెను. ఛీఛీ ఈరోజు అస్సలు బాగుండలేదు అని లేచి యమునా వైపు గుడ్లురిమి చూచుచూ వెడలిపోయెను. 

మన రంగమందు స్వశక్తి, శాస్త్రపరిజ్ఞానమును నమ్ము వాడు కావలెను కానీ ఎక్కడ దొరికినాడు నీకీ నస హింస ! 
ఎక్కడ దొరికినాడు కాదు ఇప్పుడు వీడి నెట్లు వదిలించుకొన వలెనన్నది ముఖ్యము. సంవత్సరము క్రితము నేనుప్రారంభించునప్పుడు నావద్ద ఏమియునూ లేదు.
ఏమియునూ లేదనుట ఎందుకు బుర్రఉన్నది కదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  బెంగుళూరు వారు మెచ్చిన బుర్ర  నేడు ఈ సంస్థలో నేనుండుటకు కారణము నీ కొత్త పరికరములు ఈ సంస్థలకు రెక్కలిచ్చుని ఆశతో మాత్రమే .
బుర్ర మాత్రమే ఉండినా చాలునా ? నావద్ద పైసా పెట్టుబడి లేకుండెను. 
ఇదేమి చోద్యము మీది కలిగిన కుటుంబమే కదా , అమెరికా కూడా పంపినారు .
అవును అచ్చట  అంట్లు కూడా తోమినాను, రెండు సార్లు అమెరికా పోయి మోసపోయి వచ్చిన వెధవనెప్పుడైనా చూచితివా? అది నేనే. 2015 లో ఫార్మింగ్టన్  నకిలీ విశ్వవిద్యాలయము గూర్చి వార్తలు వచ్చినవి కదా ?  
అవును విసామోసముల కుట్రను చేదించుటకు రహస్య కార్యాచరణ పథకమును రచించి  ఫార్మింగ్టన్ ను  స్థాపించినది హోంలాడ్ సెక్యూరిటీ అనగా అమెరికా ప్రభుత్వమే. 
ఆ వలలో చిక్కిన 161 మంది భారతీయ విద్యార్థులలో నేనొకడ్ని.  మా తాత ముత్తాతలు జమిందారులు.  దాన ధర్మములు జేసి వారు సింగములవలె జీవించిననూ నా తండ్రి స్త్రీ , చిత్ర వ్యామోహము నందు బడి ఆస్తి సర్వనాశనము  జేసి అప్పులు జెసి నన్ను అమెరికా పంపెను. ఇంట్లో ఈగలమోత  పైన పల్లకీల మోత. 
మీ నాన్న గారి చిత్ర నిర్మాత అని వినియుంటిని. ఎప్పుడడిగిననూ అతడి పేరు ఎందుకు దాటవేయుచున్నావు , నేడెట్లయిననూ చెప్పవలెను !!
నీవెవ్వరితోనూ చెప్ప వలదనుచూ పేరు చెప్పగా యమున ఖంగు తినెను "కానీ అతడు గొప్ప ధనికుడు అని చిత్ర పరిశ్రమ చెప్పుకొనుచున్నదే!
హహ్హ హ్హ హ్హ చిత్రపరిశ్రమలో పెద్దలు మరణించిన పిదపే వారి కథలు బైటకు వచ్చును.మా నాన్నకు లేని షోకులు  చూపుట  వెన్నతో పెట్టిన విద్య నన్ను కూడా ఆమార్గముననే నడిపించెను. నేను కళ్ళు తెరచి నాకాళ్ళ మీద నిలబడ వలెనని చూడగా   పైసా పెట్టుబడి లేకుండెను. ప్రధానమంత్రి కొత్తసంస్థలకిచ్చు ఋణము ఎట్లు తెచ్చుకొనవలెనో తెలియని నాకు  శేషు మార్గ దర్శనకు చేసి పుణ్యము కట్టుకొనెను. 
మరి నీ మిత్రుడు ఎవరో ఆర్ధిక  సహాయము చేసెనని అప్పట్లో  చెప్పినావు కదా.
అవును ప్రభుత్వమూ ఋణము ఇచ్చిననూ మనము పెట్టుబడి పెట్టవలెను కదా ప్రారంభ పెట్టుబడి ఇచ్చి దైవము వలే ఆదు కొన్న మిత్రుడు ఇదిగో అని చిత్రమును చూపెను. కానీ నేటి వరకు నాతొ ఆడుకొనుచున్నాడు.  వాడి బుర్రఎలక్ట్రానిక్స్ నందు పాదరసము వలే పని చేయును. 

అతడు ఇచ్చటికి వచ్చి నాతొ చేదోడు వాదోడుగా ఉండవచ్చుకదా ?

అట్లుండవలెనన్న వాడి తండ్రి వాడిని వదలవలెను కదా, అచ్చట వాడొక జాలమందు చిక్కెను లే అది యొక్క పెద్దకథ. “చూచినచో పెద్దలే పిల్లలను పాడు చేయుచున్నారని సందేహముగా యున్నది. సరే నేను ఇంకనూ 16 కిలోమీటర్ల దూరమునున్న వైట్ఫీల్డస్ కు   పోవలెను అని యమున బయలు దేరెను.

                                                               ***

బెంగుళూరు వైట్ఫీల్డస్ : ఓక్ వుడ్ రెసిడెన్సీ - యమున పిల్లిలా అడుగులేసుకుంటూ మెల్లగా వంటగదిలో వంట చేయుచున్న స్త్రీ కళ్ళు మూసెను " ఏయ్ వదులు, వేపుడు మాడిపోవును  " నేను వదలను మీకొరకేమి తెచ్చితినో  చెప్పినచో వదిలెదను. ” "అటులనా అంటూ ఆమె అట్ల కాడ యమున చేతిమీద పెట్ట గనే "అమ్మా!  ఇట్లు రోజూ వాత లు పెట్టినచో   నన్నెవరు   పెండ్లి చేసుకొందురు? “ఎవడో ఒకడు చేసుకొనును ఎవ్వరూ చేసు కొననిచో నాకొడుకు చేసుకొనును.” “మరి మీ అబ్బాయి మంచి వాడేనా ?” “చాలా మంచివాడు”

 అయినా నీవు మీ సంస్థ అధిపతిని ప్రేమించుచున్నావు కదా? “అవును అతడి తెలివి చురుకు గలవాడు”  అవి  ఉన్నచో  ఏమి లాభము మనసు ఉండవలెను కదా ?
మనసుకూడా యున్నది, నేనొకసారి అతడిని ఇంటికి తీసుకు వచ్చెదను. 
సరే ఇంతకీ ఇప్పుడేమి తెచ్చితివి?
చెప్పు కొనవలెను?  అని పక్కనే బల్ల మీద ఉన్న పుస్తకాలు చూచి “ అరె ఇవెట్లు వచ్చినవి?” 
 “అనగా నీవు తెచ్చినవి కూడా ఈ పుస్తక ములేనా ?” 
అవును, మా సంస్థ అధినేత వీటిని నాకిచ్చెను. అతడు ఈ రచయిత చిన్ననాటి స్నేహితులట 
నాకెంత గర్వముగా ఉన్నదో తెలుసా! మరొక ప్రక్క మీరు ఒక పెద్ద మ్యూజిక్ బ్యాండ్ లో సంగీతకారిణి  !  “  నా సంగత ట్లుండనిమ్ము  , అతడంత  పెద్ద రచయితా ?”
యమున “ఏమి మాట్లాడుచున్నారు  ! టీ వీలో చూచినారా? ఇందాకనే  నేను మాఇంటిలో టీ వీ లో చూచితిని . ఢిల్లీ లో కేంద్రమంత్రి, ఎం పీ గారి చేతుల మీద ఈ పుస్తకాలు విడుదలయినవి!” యమున అట్లనగా మీనాక్షి  “ఓ అట్లయినచో ఈ సారి మన ఇంటికి పిలిచెదము? “మనము పిలిచినా అతడెందుకు వచ్చును?”  “సరే పిలిచి చూచెదముఈ పద్యములు నీవు చదివి వినిపించుము నేను సంగీతము సమకూర్చెదను. అట్లు వారిరువురూ ఆంగ్ల కవితలను పాడుకొనుచుండగా ఇరుగు పొరుగు అంతా చేరి ఆ సంగీత గాన ప్రభావమున మైమరచి ఆనందించిరి.   

                                                                  ***

హైద్రాబాద్ బంజారా హిల్స్ : “అమ్మగారు పని అయిపోయినది నేను వెళ్లుచున్నాను.” 
రెండు రోజులు నీవు రానవసరం లేదు ముంబాయి లో షూటింగ్ కలదు.
అలాగేనమ్మా  బాబు గారు   మీకిమ్మని ఈ పుస్తకాలని ఇచ్చారు. 
ఏ బాబుగారే , కశ్యప్ బాబా , అగస్త్య బాబా ?
మొన్న మీతో గొడవాడి  వెళ్లి పోయిన బాబుగారు .  ఓ ఆ బాబా ఆతను అగస్త్య బాబు, పేర్లు గుర్తుంచుకోవే అని తాగిన మత్తు స్వరమున అని ఆ పుస్తకములను చేతిలోకి తీసుకొని చూచుచూ. “ఏవన్నా అడిగాడా? “ ఇంకా కశ్యప్ బాబుగారు రాత్రి పూట  ఉంటున్నారా ?” అని అడిగారండి   ఇంతలో  కశ్యప్ వచ్చి "ఎంతసేపు  డార్లింగ్  ఈ నస  “యు గో డామ్  సర్వెంట్ మెయిడ్”  “అమ్మగారూ అయ్యగారు బాగా తూలుతున్నారు అమ్మా” "నోర్మూసుకుని నువ్వు వెళ్లవే, ఇదిగో ఈ పుస్తకాలు తీసుకునిపో మీ పిల్లలుచదువుకుంటారు."  అలాగే నమ్మా.


     


Sunday, November 15, 2020

Bharatavarsha 71

వలతి కి విదిష మొఖము కుంపట్లో మాడిన  జొన్న కండి వలె కనిపించుచుండ " అయ్యో హార్పర్ కొలిన్ ప్రచురణలు గూర్చి చెప్పకుండిన బాగుండెడిది " అని అనెను.  విదిష తోక  తొక్కిన  త్రాచు వలె లేచి పుస్తక ప్రచురణలు గూర్చి నాకేల  చింత  " ఆ నందిని ఏమన్నదో  చెప్పుము"  “ఇప్పటికి పదిసార్లు చెప్పితిని , కంచము లో  భోజనముమున్నది తినక ఎందుకిట్లు కలత చెందుచున్నావు ?"   "ఆ నందిని ఏమన్నదో  చెప్పుము" అని విదిష మరల అదే పాట పాడు చుండెను. 

మారెమ్మ : ఇప్పుడాయన ధనికుడైనాడని సంతోషించవలెనుకదా. 

విదిష: బల్ల పైనున్న మంచినీటి గ్లాసును తోసి వేసి " బికారి అయిన నేమి కోటీశ్వరుడైననేమి ,నాకేమి ఒరిగెను?        ఆ నందినితో ఊరేగి సర్వనాశనమై పోవును గాక నాకేమి ?  ఆ నందిని  ఏమన్నదో  చెప్పుము?

వలతి : అతడికెట్లు సాయపడవలెనో వారెవ్వరికీ తెలియదు.

విదిష: అదికాదు , అటుపిమ్మట ఏమనెను ?

వలతి: నాప్రియు నికొరకు ఏమి జేసినానో, ఇప్పుడేమి చేయ బోవుచున్నానో చూడుము  నా మనసు నా ఆడతనము చూపెదను”అని అనెను. 

వలతి:  ఆపిమ్మట ఏమి జరిగెను?

వలతి:  ఈమె నాశిష్యురాలే" యని వర్షుడామెను అభిమానంతో దగ్గరకి తీసుకొనెను.

విదిష:  ఆపిమ్మట ఏమి జరిగెను?

వలతి:  నందిని కళ్ళు తిరిగి క్రింద పడిపోయెను వర్షుడు ఆమె నెత్తుకొనెను 

మారెమ్మ :  వలతి తో ఎందుకమ్మా మాత కి అవన్నీ చెప్పినారు 

విదిష : ఏమే , నేను మాత వలె కనిపించుచున్నానా? ఆ నందిని  అమ్మాయి వలే కనిపించు చున్నదా అని చండ కోపమున లేచెను,  మాలిని  గారు రాకుండిన ఏమిజరుగునో తెలియదు గానీ ..

మారెమ్మ, వలతి : మీ అత్తగారు వచ్చినారు.  మీ అత్తగారు వచ్చినారు అనుచూ పెద్ద గండ ము గడిచెనని జారుకొనిరి.  

మాలిని విదిషను గుండెలకు హత్తుకొని నేనొచ్చేసాను కదా అని ముద్దాడి ఓదార్చెను. విదిషకు కన్నీరు ఆగకుండెను "అత్తయ్య  మీరు నా కండగా నిలవకున్న నా పరిస్థితి నేడు ఎట్లుండెడిది?" అనుచున్న ఆమెతో " నిన్ను ఎప్పుడో మాఇంటి కోడలనుకొంటిమి"  ఇలా కూర్చో అమ్మా  అని ముద్దలు కలిపి తినిపించసాగెను.  

“ఒకప్పుడు వాడి గూర్చి నాకు చాలా దిగులుండెడిది. ఆకతాయిగా తిరుగు వాడే ఉజ్జోగమ యిననూ  జేసుకొని వచ్చు ,  వర్షుని విషయమెట్లు కాదు. ప్రపంచములోనే పేరెన్నిక గన్న ప్రకాశకులట వారు , మా అబ్బాయి పుస్తకములను ముద్రించుటయేకాక సంపాదకునిగా భాద్యతలు కూడా ఇచ్చినారు. ఆ  గోపాలుని దయ వల్ల నా చింతలన్నీ తీరినవి.  ఇంక త్వరలో మీ వివాహము జరిపించినచో నాకు , తిండి మానివేయుట ఈ అలకలు  ఉండవు.” 

విదిష  మొఖం వెలిగి పోవుచున్నది.  ఏడుపు ఛాయలు మాటు మాయమైనవి " చాలు చాలు కడుపు నిండినది"  అని తినుట ఆపివేసెను  

మాలిని : ఒక్క మొట్టికాయ పెట్టి , పెళ్లి కూతురనిన ఎట్లుండవలెను ? ఆ నందినిని చూడుము గిత్త వలే నున్నది.   

విదిష : దాని దేమున్నది. నేను గజమువలె నుండెదను. 

మారెమ్మ : అమ్మాయిగారు , వారు వచ్చుచున్నారు ?

విదిష : వారానిన ఎవరు? పేరు లేదా ?

 మారెమ్మ : అదేనమ్మా మిమ్మల్ని కట్టుకోబోయేవారు. మారెమ్మ వెడలెను 

 విదిష : అయ్యో అత్తయ్యా మీరు తెరవెనుక దాగవలెను 

మాలిని : నాకు చేత కాదమ్మా  ఈ నక్కు ట దాగుడుమూతలు 

విదిష : అయ్యో అత్తయ్యా మీకు మొక్కెదను  ఆయన ఎప్పుడోగాని రారు అని మాలినిగారిని తెరవెనుకకి నెట్టి వేసెను.

వర్షుడు: విదిషా!!! భోజనము తినకున్నావని  తెలిసెను అలిగితివా ! 

విదిష మొఖం పక్కకు త్రిప్పుకొని కూర్చొనెను.

నాకు తెలుసు తెలుసు నీ అలక ఎట్లు పోగొట్టవలెనో అని చుబుకం పట్టి ఆమె మొఖమును తనవైపు త్రిప్పుకొనెను. వర్షుని స్పర్శ తగలగానే ఆమె కన్నులు వాలినవి ఊపిరి మందగించి నది. ఒళ్ళు వేడెక్కినది. “అన్నం తినవూ”  "ఊహు” బల్లవద్దనుంచి లేచి గోడకున్న  అద్దము వద్దకు పోయి చేతులు రెండు వెనుకకు పెట్టి  నిలిచెను. 

శ్యామల నునుమేను కాంతులీన స్నిగ్ద పెందొడ లందము పిలుచుచుండ కప్పుఁ  భాసురమగు బావడ యెడలించి  ఊరువుల  హత్తుకొనగ, కంభ దృఢ బింకము కనుల కాల్చుచుండ కౌను క్రిందకు జార చేలము చిక్కిన నడుము చక్కదనము రెచ్చగొట్ట ,  జీరాడు పావడ  నత  నాభి ని జూప, జిలుగు పైట తొలగి కుందనపు కుటములు జూపె.    విటప అధరములు విభుని రాక  చూచి వణుకు చుండ  భోగ్య లావణ్య మంత  కను విందు జేయ నిగ్రహమేపాటి  నిలుచు మరుని అవసరము లేక  మగతనమును మేలుకొనదా 

అట్లు చిరు అంగల ఆ అంగనను సమీపించి ఆమె అందము తడిమి   అంగాగమును చుంబిచు చుండ ఆ జవ్వని అడ్డు చెప్పక   మెలికల కుంతలములు వలే మెలికలు తిరుగుచుండె.  మధుర లాలసనొందుచు మత్తుకనులెత్తి ప్రియుని ఓరకంట చూడ, కనులు కనులు కలిసె.  రాజుకొని అగ్గి రగిలే ప్రియుడు. కాంక్ష జ్వాలాలందు సిగ్గు మాడిపోగ  మరుని బలముగ లాగి బాహువుల బందించె. మెరుపు తాకిడి వలె తెరచాటునున్న ప్రౌఢ గుర్తుకొచ్చి ఆపమని వారించుచున్న వినక హత్తుకొని వీడాడాయే. శ్వాస స్తంభించి మగువ ఉక్కిరి బిక్కిర గుచు అతడి అధరమును కాటు వేసె, కెవ్వ నరచి వర్షుడు ప్రియురాలి కౌగిలి తొలగె.   పిదప  ఆమెను తన చేతులలో ఎత్తుకొని బల్లవద్దకు తీసుకొని పోయి భోజనము గోరుముద్దలు చేసి తినిపించెను. 


Bharatavarsha -70

విశాఖపట్నం ద గ్రీన్  పార్క్  హోటల్ : ఇంద్రభవన తళుకులను పుణికిపుచ్చుకుని పట్టణ  నడిబొడ్డున కులుకుచున్నది. ఆదు నక్షత్రముల భావన రాజ మందు పలహార శాలలో   విందారగించు వారి నడుమ మందకొడిగా కూర్చున్న నందిని మదహాసమును చూసి   


వలతి: ఇక వర్షునికి సాయపడుటసాధ్యము భానోజీ గారు, అరుణతార , రంజిని అందరు గురువుగారి (భారతవర్ష)   విద్వత్తు ను ఎంతగానో ప్రేమిం చుచున్నారు. ఎట్లయిననూ సాయపడవలెనని వారు చేయని ప్రయత్న ము లేదు! సన్మాన సభలో ఉక్కు కర్మాగార డైరక్టర్ గారు సలహాదారుగా గౌరవ పదవినివ్వజూపగా వర్షుడు తిరస్కరించెను. చివరికి తనకొచ్చిన నగదు బహుమతిని కూడా మజ్దూర్ సంఘమునకు కానుకగా ఇచ్చివేసెను. 

నందిని: మంచి పని జేసెను  హ హ్హ హ్హ హ్హ   హ్హ హ్హ హ్హ 

తే. మంచి పనిజేసె నెఱకాడు పణము తిప్పి     (పణము = డబ్బు)

    ఇచ్చె తెలియక వగచెద రేల జనులు        (వగచెదరు + ఏల)

    జ్ఞాన సిరులున్న వానిక జ్జ్ఞాన మందు      (వానికి + అజ్జ్ఞాన)

    వలతి  వలవల  వలసిన  వలతు రింక

ఆసువుగా తేటగీతిలు  రువ్వుచున్నావే! ఆయన నాకు నీకు గురువు వని మరిచి నవ్వుచున్నావా! రవ్వంత ఉపకార మొనర్పక సాయపడువారిని గేలిచేయుట కసాయితనము. మనసున్న ఆడతనమన్నది చూపుట నేర్వవలెను.  కిల్ బిల్ చిత్రము నందు ఉమా థుర్మాన్ వాలే నగుపించుచున్నావు !

ఇంకా నయము సైకోలో నార్మన్ బేట్స్ లా ఉన్నాననలేదు. హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ అతడు నాకు ప్రియుడని  నీవు మరిచి న నేను మరువను. అతడికి సాయపడుట దుర్లభ మే  గాక దుస్సాహసము. సహాయము లను విరాళ ములను స్వీకరించడు నా వర్షుడు. అతడికెట్లు సాయపడవలెనో వారెవ్వరికీ తెలియదు.

అవును ఉద్యోగమూడబీకించుట నీకే తెలియును అనుచుండగా నందిని ఆశువుగా 

 తే. జంటగ  వచ్చిన   ధనకీర్తి  జూడ పాడు         

ఉద్యో  గములేల జేతురు ఊడి గముగ 

నగుబ  డుకొలది సేపుండి నవ్వి పొమ్ము 

ఏడ్చి నదిజాలి కవలతి  ఏడ్పు విడుము          

ఆశువుగా తేటగీతులు రువ్వుచూ,  పలుమార్లు వలతీ వలతీ యని (పద్యములందు) నాపేరు పెట్టి పిలుచుచూ  హాలీ వుడ్ చిత్రముల అలవోకగా నందిపుచ్చుకొను నందిని వందనమమ్మా !  చిన్నదానివని అనుకొనుట నాదే తప్పు, నీ ప్రియుడు వచ్చు చున్నా డు   నేను పోయివత్తును అనుచుండగా “ కొలది సేపు ఉండవమ్మా  నేను నాప్రియు నికొరకు ఏమి జేసినానో , ఇప్పుడేమి చేయ బోవుచున్నానో చూడుము   నా మనసు నా ఆడతనము చూపెదను” అని నందిని వలతి  తో కన్ను గీటుచూ అనెను.

వర్షుడు రాగానే ఒక బల్లవద్ద కూర్చొని యున్న చొక్కాపాన్టున దోపిన శ్వేతజాతి  పొడుగరొకడు లేచి అతడి వద్దకేగి కరచాలనం జేసి “హలొ ఐ యాం రేమండ్ ఫ్రమ్  హార్పర్ కొలిన్స్ ఇండియా లిమిటెడ్. హౌ డూ యు డూ మిస్టర్ భారతవర్ష ?”

“ఓ హౌ డూ యు డూ?”   అని వర్షుడు కరచాలనం జేయుచుండ  రేమండ్ రంగు  కాగితమందు చుట్టిన పుస్తకములను వర్షునకిచ్చి తన బల్లవద్దకు కొనిపోయెను. 

రేమండ్: వియ్ హాడ్ బీన్ డిస్కసింగ్  థి పబ్లికేషన్ అఫ్ యువర్ వర్క్ .   హియర్ ఇట్ ఈస్  టేక్ అ  లుక్.

వర్ష : ఫెంటాస్టిక్,  మై ఇంగ్లీష్ పోయెమ్స్ అండ్ స్టోరీస్ ఫైనల్లీ గాట్ పబ్లిష్డ్ .   ఐ యామ్ సో గ్లాడ్ !!

రేమండ్: వియ్ టూ, హియర్ ఈజ్ వన్ మోర్  గుడ్ న్యూస్ అని ఒక పొట్లమును  వర్షుని చేతులో నుంచి ఆ చెక్ రెమ్యూనరేషన్ ఫ్రమ్ హార్పర్ కోలిన్స్  ఓపెన్ అండ్ సీ అనుచుండగా

వర్షుడు దానిని ప్రక్కన బెట్టి “యు ప్రోమిస్డ్ టు ఇంట్రొడ్యూస్ ద నోబెల్ లేడి హు సేంట్ మై వర్క్స్ టు యు ఇన్ యువర్ ఫార్మేట్ కలెక్టింగ్ ఫ్రమ్  మై బ్లాగ్, ఐ మస్ట్ థాంక్ హర్.”

రేమండ్ :షూర్ బట్ హేవ్ యు డెలీట్డ్ ది పబ్లిష్డ్ పోయెమ్స్ ఫ్రొం యువర్ బ్లాగ్ 

ఎస్ ఐ డిడ్. హావెన్ట్ యు చేక్డ్. ఐ డిలీట్డ్ అల్ ద స్టోరీస్ టూ 

ప్రక్కనే మరొక బల్లవద్ద కూర్చొన్న నందిని వలతితో "కవరువిప్పి చూడడే పిచ్చిమొద్దు!" అని అసహనంగా అనుచుండగా 

వలతి: ఆ తెల్లవాడు చెక్ అని చెప్పినాడు కదా  ఐదు వేలో పది వేలో యుండును అని ఉదాసీనంగా చెప్పిన  వలతికి నందిని తన చరవాణియందు హాప్పర్ కొలిన్స్ వారిచ్చు ప్రతిఫలము చూపెను " Harper Collins pays authors  $55,000 annually which is 8% higher than the national average"  అని గూగుల్ లో చూపగా వలతి కి కళ్ళు తిరిగెను. ఇంతలో మిస్ నందిని  నందిని  అని గట్టిగ రేమాండ్స్ పిలవగా నందిని వారివద్దకు పోయెను

"ఈమె నాశిష్యురాలే" యని వర్షుడామెను అభిమానంతో దగ్గరకి తీసుకొనగా నందిని వర్షునికి అతుకుకొని వలతి వైపు చూసెను. పిమ్మట పుస్తకావిష్కరణ కు ఢిల్లీ రావలసిందిగా భరతవర్షను ఆహ్వానించి రేమండ్ నిష్క్రమించెను.

నందిని రెండు పుస్తకములను వర్షుని చేతిలో నుంచుచూ " గురువుగారు నేను మీ ఆంగ్ల పద్యములను , కథలను తెలుగీకరించితిని ముద్రణ చేయించితిని " అని పుస్తకములనిచ్చి అతడి కాళ్లకు నమస్కరించెను. 

వర్షుడు ఆమెను జబ్బలు పట్టి పైకి లేపి " కథలు తెలుగీకరించడమనిన సరే , కానీ వంద పద్యములను ఎట్లు తెలుగీకరించినావే పిల్లా"  అని పుస్తకము విప్పి చూసిన  ఒక పద్యమును చదివిన వర్షుని నోరు అచ్చెరువున క్షణ కాలము తెరుచుకొనెను. 

పిదప వర్షుడు తన మెడలో నున్న బంగారు గొలుసును తీసి బహుమతి గా నందిని కివ్వగా నందిని మెడ నందించెను.  వర్షుడామె  మెడలో వేయుచుండగా ఆమె కళ్ళు వర్షిచుచున్నవి. వర్షుడు డామె చెక్కిళ్ళపైగారు అశ్రుధారలతుడిచి ఆమెను ఓదార్చెను. ఎన్నిదినములు , రాత్రులు శ్రమించినావో కదా అని అతడు ఆమె చేతుల నందుకొని  “ నేను బహుమతిగా వచ్చిన  ధనము స్వీకరించ నందుకు ఎందరో బాధపడిరి. ధనము సంపాదించుటకు మార్గము ఉన్నతమైనదై యుండవలను కదా అనుచున్న అతడితో నందిని ఆశువుగా ఒక శార్దూల పద్యమును చెప్పెను.

        శా.రూపాయే   తనదే        వుడంచు     ఖలుడా    రూపాయి     నర్చించ    డే  

         రూపాయే   తనల         క్ష్యమంచు   జనులా      రూపాయి     నార్జించ    రే   

         పాపాల     భైర వుం       డుమార్చు   మతమా    రూపాయి     నాశించు   చూ

          గోపాలా     మరిసా         హితీప్రి       యుని కా    గామేది       గాలించ    గా    

“గురువును మించిన శిష్యురాలివగుము” అని పండిత కీర్తనీయురాలివై వర్ధిల్లమని ఆశీర్వదిం చుచుండగా వలతి వచ్చి చెంగట నిలిచెను. భారతవర్ష అబ్రమున నామెను చూచుచుండ వెంటనే నందిని కళ్ళు తిరిగి క్రింద పడిపోయెను వర్షుడు ఆమెను రెండు చేతులలో నెత్తుకొనగా  నందిని ప్రియుని హత్తుకొని వలతి  వైపు కొంటెగా చూసెను. 

గామేది ( గాము + ఏది ) = మోహమేది 


Friday, November 13, 2020

Bharatavarsha -69

గ్రీష్మతాపము ఎడారిని తలపింపజేయుచుచున్నది. ప్రకృతంతయూ కళతప్పి పచ్చదన మెచ్చటనూ కానరాకున్నది.  బడబాగ్నిని జతగూడిన గాలి  అంబుకంటకము (మొసలి) వలె కరకర నములుచూ ప్రాణసంకటముగా మారినది. గాడుపులు గూబలలోనికి గుచ్చి సూళపు పోట్లను తలపింపజేయుచున్నవి. నాటికాలమున గ్రీష్మతాపమునకు బెజవాడను చిరునామా గా  చెప్పుకొనెడివారు. నేడు విశాఖకూడా శీతల వైభవమును  కోల్పోయి గాడి పొయ్యి వలే మారినది. దయ్యములైననూ తిరగని శూన్య  రహదారి విధవరాలి వైనమును చూపుచున్నది.

 

మ. బెజవా డెండలు  జూసినం తటనె   బెంబేలె   త్తుటఖా   యమే        

నిజమా  డంగవి    శాఖప    ట్నమున నూనేడ   ట్టికాల     మొచ్చె       

రజ నీ     గంధము రాలిపో  యినది    గారాల    కుగాడ్పొ  చ్చెసా    

రజమే     పూసుకు  దారిలో  నడవ     మారాడ   కరొట్టే   యగున్       


ఎం. జి. హెక్టర్ వాహనము కదన తురగము వలె కదం తొక్కుచున్నది. దామిని, మీనాక్షి వెనక కూర్చొని యుండ గా  ఉల్లాసము హృదయమునూపుచుండ  దామిని హృదయేశ్వరుడు నవతేరును నడుపు చుండెను.  మధ్యాహ్నం కావచ్చు చున్నది...


మనుజుడు కానరాడు మద్దెల పాళెమందు 

రహదా రెడారిని తలపించ రణ తురగమల్లె 

లంఘించె నవ శకటము లంకకేగు పవన        

సుతుడల్లె వేగముక నింతులు తల్లడిల్ల


అల్లరి వలదని వల్లరి  గిల్లుచు చల్లగ   

 హెచ్చరించ  వల్లదె గయక హెక్టారది   

మార దతడి తీరు వేగము మీరి మీరి   

తట్టెనొక తట్టను పట్టెను పోలీసు జూసి


ఇసుకతోట వద్ద శకటమాపి  వికట   

మాడుచు నడిగె  నెంత రుసుము

నెపమున కిచ్చెద  రాయమన నెమ్మి

చూపి  పోలీసు వద్దకొచ్చి చెమ్మగిల్లె


కాయము పరపర కోయు దొర   

నాతల్లిని కాపాడిన దొర పోరా 

ఆగక నెచ్చట నీ సతులు సుతులు

చల్లగుండ మెల్లగ పోరా వీరా


                                   

దామిని "మీనా, ఈరోజు నీ ముఖము ఎంత కళ కళ లాడు చున్నాదో చెప్పనలవి కాదు. నీ మనసు ఎంత గంతులు వేయుచున్నదో నీ ముఖమే చెప్పుచున్నది. హృదయాలిజిస్టు “పేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్" అని ఊరకనే అన్నారా మన పెద్దలు.” అనెను.  “అట్లన్నది ఇంగిలీషువారు. వారు మన పెద్దలెట్లగుదురు?” అని మీనాక్షి అనగా, దామిని చొరుకొని “మీనాక్షి,  నువ్వూరుకొనుము నీకు పుణ్యముండును ఇతగాడెప్పుడూ ఏదో ఒక కథతో సిద్ధముగా నుండును"  హృదయాలజిస్ట్ "అయ్యో నన్ను చెప్పనివ్వకున్నారే" అనుచుండగా  దామిని విరుచుకుపడి " అయ్యా ఇంగ్లీషువారే మన పెద్దలు " ఇంక బండి ముందుకి పోనిచ్చిన మంచిది " అనెను. 

అటులనా  అని  ఐ వాంట్ టు సి ద స్కై  అని హృదయాలిజిస్టు అనుటతోనే శకటపు పై కప్పు తెరుచుకొనెను.  వెనక కూర్చొనియున్న దామిని, మీనాక్షి తుళ్ళి పడి,  అబ్బుర పడి చూచుచుండిరి.  ఎం జి హెక్టర్ సాంకేతిక పరిజ్ఞానము  తొంబది  మౌఖిక ఆజ్ఞలను స్వీకరించి అమలుపరచగలదు. లెఫ్ట్ విండో ఓపెన్ , రైట్ విండో క్లోజ్, ఆటో ఏ సి ఆన్ , రేడియో ఆన్ అని  అల్లరి చేయుచుండెను. వాహనము ఆ ఆజ్ఞలను తూ.ఛతప్పక అమలు చేయుచుండెను.

 చిన్నపిల్ల వాడివలె రేగుచున్న అతడిని చూచి మీనాక్షి నవ్వుచూ " ఎట్లు వేగుచున్నావమ్మా ఇతడితో " అని దామిని చెవులో చెప్పెను. హృదయాలజిస్ట్ అక్కసుతో వాహనము నిలిపివేసెను. దామిని " ఏమొచ్చెను ?" అనగా రాధాకృష్ణ "యంత్రమునకే మొచ్చెనో తెలియదు, ఆగిపోయినది ." అనెను.  అప్పుడు మీనాక్షి " మీ ఇద్దరూ ఇద్దరే.  మీరిట్లు వాదులాడుకొనుటకు కారణము మన పురాణములందు చెప్పబడినది. అనెను. అది చెప్పమని హృదయాలజిస్ట్ పట్టు బట్టగా " దామిని నెత్తిన చేతులేసుకుని " దొందు దొందే " అనుచుండగా “ అది చెప్పవలెనన్న బండి ముందుకు సాగవలెను " అని మీనాక్షి అనెను. బండి కదిలెను. " దామినికి ఆశ్చర్యము సిగ్గు కలిగెను" చూడమ్మా ఆయన చేయు పనులిట్లున్నవి" అనుచుండగా 

మీనాక్షి " నేను దామిని కథ చెప్పు చున్నాను. దామిని శని దేవుని  భార్య. శని గొప్ప శివభక్తుడు. అతడు సతతము చిత్తము శివునిపై నుంచి ధ్యానించు చుండెను. ఒక నాడు దామిని యముని కోరి  పిలుచుచుండ అతడు పట్టించుకొనక శివ ధ్యానములో యుండెను. అంతట దామినికి ఆగ్రహము కలిగి తన భర్త వైపు ఎవ్వరూ చూడకుండు నట్లు శాపమిచ్చెను. అట్లు సువర లోకమందు భర్తతో గొడవ పడిన దామిని భూలోకమున విశాఖపట్టనమున ఇంకనూ వేడిగా భర్త ని ఆడిపోసుకొను చున్నది."  అందరు నవ్వుకొనుచుండగా హెక్టార్ మువ్వ వాని పాళెమందు  “రవళి ఆర్కెస్ట్రా” ముందు నిలిచెను. కారు దిగి వారా భవనమందు ప్రవేశించిరి. సంగీత ఉద్యానవనం వలే నున్న ఆ సువిశాల మహలు నందు పది మంది కళాకారులు వివిధ ప్రదేశములలో కూర్చొని సాధన జేయుచుండిరి.   లోపలకి ప్రవేశించి నా మువ్వురిని కని అచ్చట మురళీ సాధన చేయుచున్న శ్యామల మురళినాపి వచ్చి "ఈరోజేమియూ కార్యక్రమము లేదే!” అనుచూ సోఫాలో కూర్చుండబెట్టెను. పిమ్మట మీనాక్షి "ఈరోజు ప్రఫుల్ల  వచ్చుచున్నారు కదా వారిని కలుసుకొనుటకు వచ్చితిని. " అని చెప్పెను

శ్యామ: ఓహో! ఆ  కేరళ మ్యూజిక్ బ్యాండ్ అధినేత ప్రఫుల్ల ఆ.. గుర్తుకు వచ్చెను,  ఇప్పుడే వచ్చెదరు, వ్యాస్ గారు అతడిని   తీసుకు వచ్చుచున్నారు.  మావంటి పిన్న వయస్కులకి   దుర్లభము కానీ  మీవంటి   ప్రౌఢ  సంగీతకారులు  తప్పక ఆ బ్యాండ్ నందుండవలయును.

ఒక మూల రిథమ్స్ మీటుచున్న సాంబ మీనాక్షిని గాంచి వద్దకు వచ్చి" బాగున్నారా !  అని తానూ ఒక సోఫాలో కూర్చొనెను. 

మీనా: శ్యామ, సంగీతపరిణితికి ప్రౌఢ కళాకారులని పిల్ల కళాకారులని వ్యత్యాసము కూడదు సృజనాత్మకత కు ఆలంబన సాధన గానీ వయసు కాదు సుమీ !   

సాంబ :  ఆర్కెస్ట్రా యందు సృజనాత్మక అవాంచితము, అనుకరణే ఉచితము. చిత్రగీతములు యథా తథముగా అనుకరించకున్న  మా తథాగతుఁడు ఒప్పునా! జనులు మెచ్చెదరా!

ఇంతలో ఉంగరముల జుట్టు, కోటేరువంటి ముక్కు, కోల ముఖముతో ఆరడుగుల వ్యక్తిని తోడ్కొని రవళి ఆర్కెస్ట్రా అధినేత లోకడుగిడెను. వారిని చూచి కళాకారులందరూ వారిని చుట్టిరి. వ్యాసుడు ప్రఫుల్లను మీనాక్షికి పరిచయము జేసెను తదుపరి ఒక్కొక్కరిని అతడికి పరిచయము చేయుచుండెను. ప్రఫుల్ల ను చూచినామెకు అగస్త్య గుర్తుకొచ్చెను.   అతడికి మాత్రము మీనాక్షి అప్సరసవలె కనిపించెను.   


ఉ.  బంగరు  చేలమే      తొలగ     బంగరు       బంతుల    భా సమే     లదా           

     మంగళ  క్షేత్రమే      కనుల    ముంగిట     బంగరు     కాంతులీ   నగా

     పొంగద  నుల్లమే     హొయలు  మోహము  గొల్పగ     నోపత    రమే

     భంగము నొందరా     వయసు  వాసన       కడ్డుగ      నిల్వనే    లనో

మీనాక్షి బంగారు వన్నె చీరయందు బంగారము వలే మెరయుచుండెను. ఆమె పైట తొలగి  వెలువడు బంగారు బంతుల  భాసము, చూచువారి కనులను ఏలుచున్నది. బంగరు     కాంతులీను మంగళ వక్ష క్షేత్రమే కనుల ముంగిట నిల్వగా నుల్లము పొంగదా? హొయలు  మోహము  గొల్పగా  నోప తరమే? అట్టి అందగత్తె వయసున అధికురాలైనచో భంగము నొందరా? (అయ్యో నావయసుదైనచో ఏట్లో ఒప్పించి పెండ్లిచేసుకొందునుకదా) వయసు  వాసన ( కోరిక)  కడ్డుగ  నిల్వనేలనో! 

అందరికీ  కాఫీలు వచ్చినవి  అందరూ ఎవరి స్థానములకు వారు పోయిన పిదప వ్యాసుడు , ప్రఫుల్ల మీనాక్షి వారి కున్న రంగస్థలం పై  సమావేశమయ్యినారు . 

ప్రఫుల్ల : వ్యాసుడు మీ సృజనాత్మకతను  ఆకాశమునకెత్తు చుండ ఎట్లయిననూ మీ కచేరీ చూడవలెనని  వరుసగా మీ ప్రదర్శనలు చూచితిని. మీరు చేసిన జింగిల్స్ సంగీతమును విని అబ్బురపడితిని. మీరు నిత్యమూ మనోరంజనమగు కొత్త బాణీలు రూపొందినురని విని ఇప్పటికీ నమ్మజాలకున్నాను. 

వ్యాసుడు : మొన్న కూర్చిన కె ఎఫ్ సి జింగిల్ ఒక్కమారు వినిపించవలెను. 

మీనాక్షి : అది పాతది , నిన్న కూర్చిన ఒక కొత్త జింగిల్ వినిపించెదను అని కీబోర్డుపై వేళ్ళు జింకల గుంపుల వలే పారించగా , గంగా ప్రవాహము వలే సంగీత ఘరితో  ఆ గది  అంతయూ నిండెను.  ఆరోహణావరోహముల తో ఊయలలూగించుచూ క్రమేపి పతాక స్థాయికి తీసుకు పోయి ఉవ్వెత్తునెగసి తీరంపై విరుచుకు పడిన కెరటమువలె ఒక్క సారిగా క్రింద పడి  గాజు జుతొట్టె నేలపడి పగిలి నట్టు ఆగగా  అందరూ  ఉద్విగ్నత తో కరతాళ ధ్వనులు చేసిరి. 

తదుపరి ప్రఫుల్ల  ఒక భుజముకు  గిటారు , మరొక భుజముకు .  ఆల్టో సాక్సాఫోను ,  మోకాటి  జేబులో మురళి , మరొక చేత బరోకె  ట్రంపెట్ నడుమున దోపిన జాజ్ స్టిక్స్ తో రంగముపై ప్రత్యక్షమయ్యెను. 

షాన్త్  దు  లినోస్  స్వరమును  (1944 లో ఫ్రెంచ్ స్వరకర్త ఆండ్రే జోలివెట్  వేణువు మరియు పియానో కోసం స్వరకల్పన  తరువాత దీనిని జీన్-పియెర్ రాంపాల్   వేణువు, వయోలిన్, సెల్లో  కోసం లిప్యంతరీకరించాడు.  అప్పటి నుండి ఈ అత్యంత సంక్లిష్ట స్వరము  ఆధునిక వేణువుల కచేరీలకు అలంకారమైనది )   వేణు నాదమున  వెల్లువవలె సాగించుచూ, పిదప  సాక్సాఫోనుతో బి ఫ్లాట్ మేజర్ తో ప్రారంభించి ఆక్టేవ్ తొమ్మిదవ స్కెల్ డిగ్రీ ని అందుకొని అందు సరిగమ పదని  పలికిం చి ఆపి,  ఫిల్లీ  జోన్స్   టోనీ విలియమ్స్   రో హైన్స్   లయతో దరువులు వేయునట్లు జాజ్ మ్రోగించెను అట్లు ఐదు ల వాద్యము నొక్క సారి వాయించి అందరిని ఆశ్చర్య పరిచెను. మీనాక్షి అతడి విద్వత్తును గ్రహించి రెండు చేతులు జోడించి మ్రొక్కెను. 

వ్యాస్ మిగితా విషయములు మాట్లా డును అని చెప్పి అతడు బయటకు పోయి  సిగరెట్టు పెదవులమధ్య పెట్టుకొనగా  హృదయాలజిస్ట్  అప్పుడే తన సిగరెట్టు ను ముట్టించుకొని అదే అగ్గిపుల్లతో ప్రఫుల్ల సిగరెట్టును ముట్టించి " ఈ ఆర్కెస్ట్రా ను నడుపుచున్న గ్యాస్ నా మిత్రుడు  మిత్రుడి మిత్రుడు మిత్రుడేకదా అందుచే మనమిద్దరమూ మిత్రులం "  అని తన ధోరణిలో మాట్లాడసాగెను.   

లోపల మీనాక్షి “విదేశములలో మ్యూజిక్ బ్యాండ్స్ ఎక్కువగా నగు పడును  భారత దేశమున ఈ సంగీత బృందములు బహు తక్కువ , వేళ్ళ పై లెక్కింప వచ్చు, మన దేశమున  సంగీతమునకు ఎందుకీ దురవస్థ ? “

భారతమంతయూ   నొక్క  రీతిగా నీతిమాలిన చలనచిత్రముల నీలి నీడలు కమ్ముకొనగా ,  కమ్మని సంగీతము    పంజరమున చిక్కిన పక్షివలె గిలగిలా తనుకొనుచున్నది. సూపర్ స్టార్, మెగా స్టార్ అని బిరుదు లు తగిలించుకొని  కథా నాయకులని చెప్పుకొను కళా ద్రోహులు నాటకమును  పాడెపై పరుండబెట్టి శవయాత్ర  చేయుచున్నారు.  వీరికి అతుకుల  నటనకి  కోట్లేలయీయవలె నని ఒక్కడూ అడుగువాడు  లేడు . వీరు ఉపాద్యాయులకంటే గొప్పవారా కారే ? వీరికి పదివేల నెలసరి జీతముపై ప్రభుత్వ కొలువిచ్చిన వీరెంతటి ఘనులో లోకమునకు తెలియవచ్చును. 

ఈ గ్రూప్ లో చేరుట మంచిదా? ఇచ్చటన్నియూ  సజావుగా సాగునా? బాగుండునా?

ఈ బ్యాండ్ గురించి విన్నచో మీరు ఇది ఎంత మంచి అవకాసమో గ్రహించగలరు. 

చూచితిరి కదా  పది కచేరీలు  మాతో చేసినారు ఏదో   డబ్బు ముట్టెనను మాటే గానీ మా ఆర్కెస్ట్రా లో మీ ప్రతిభ వెలవెల పోవుటయే తప్ప మీకొరుగునదేమియునూ లేదు. మ్యూజిక్ బ్యాండ్ నందు  డబ్బు తో పాటుగా సృజనాత్మకతకు అవకాశముండును, మాతో యున్నచో ఈ అనుకరణ విద్య యందు బడి ఉన్న విద్వత్తు సర్వనాశనమగును. మీనాక్షికి తండ్రి గుర్తుకొచ్చెను .

ఇక డబ్బు విషయము కూడా చెప్పవలెను కదా. భారత దేశమున  వేళ్ళ పై లెక్కింప గల మ్యూజిక్ బ్యాండ్ లలో అగ్రగణ్యమైన బ్యాండ్ ప్రఫుల్ల.  వీరికి సాలుకు  సుమారు ఇరువది ప్రదర్శనలుండును. ప్రదర్శనకు వీరు పది లక్షలు నుండి పాతిక లక్షలు దాకా వసూలు చేసెదరు. అన్ని ఖర్చులు తానే  భరించి  ఆ మొత్తమును ఐదుగురి సభ్యులకు  పంచుట ఆనవాయితీ గా ఆ బ్యాండ్ ను నడుపు చున్న ప్రఫుల్ల ను చూసినారు కదా 

మీనాక్షి: అతడి  ప్రదర్శన యందు  సృజనాత్మకత , సృజనాత్మకత  యందు కళాతృష్ణ కనిపించెను. అని ఒప్పందంపై సంతకమును చేయగా ఐదు లక్షల చెక్కును అందజేసెను.

వ్యాసుడు: వీరికి బెంగుళూరునందు కార్యక్రమములు తరుచుగా నుండును , కావునా మీరు బెంగుళూరు నందు ఉండవలెను , మీ విమాన టికెట్లు రెండు రోజులలో నేను హృదయాలజిస్ట్ కు అందజేసెదను. గ్యాస్ గ్యాస్ అయినదా మీ పని , మేము ఉక్కు క్లబ్ నందు కార్యక్రమమునకు పోవలెను  అనుచూ వ్యాస్ నోటిలో అప్పుడే వెలిగించిన సిగరెట్టును లాగివేసి " నీకు పొగ త్రాగరాదని చెప్పినన్ను కదా నాముందే సిగరెట్టూ కాల్చెదవా ' యని పరిగెత్తుచుండగా వ్యాస్ వెంట పడెను. అడ్డు వచ్చిన పని వాడి చేతిలో బూజులు దులుపు కర్ర ను లాక్కొని మేడపైకి పోయి అచ్చట సిగరెట్టును పారవేసి క్రిందకు వచ్చెను. 

దామిని : ఛీ ఛీ చిన్న పిల్ల వానివలె ఎట్లు పరిగెడుచున్నాడో  చూడుము 

మీనాక్షి " ఇంకా పిల్లలులేరని అనుట ఎందులకు  మీ శోభనమేట్లు జరిగేనో ?

దామిని వెంటనే కొంగును లాగి కప్పుకొని "ఏమిటా పాడు ప్రశ్న  ?"

మీనాక్షి: నీవు పైట ఎందుకు కప్పుకొన్నావు , ఎదో జరిగి ఉండును , ఇంత  చిలిపి మనిషి  మొదటి రాతి ఏమి చేసెనో?

దామిని : రాత్రి పరుగులు తీయలేదు పగలు సిగ్గు తీసెను , నాకంటే ముందు నిద్ర లేచి నా చీర నెత్తుకు  పోయెను. నేను బయటకు రాలేక గదిలోనే ఉండిపోగా మా అత్తగారు కంగారు పది తలుపు బాడుచుండగా , దుప్పటి చుట్టుకుని ఆమెకు విషయమును చెప్పగా ఆమె చీర ఇచ్చెను. 

మీనాక్షికి నవ్వాగలేదు . ముగ్గురు బయటకు వచ్చుచుండగా ప్రఫుల్ల  చేయి వూపుచుండెను " పుల్ల , ఆరోగ్యము జాగ్ర త్తగా చూసుకొనుము" అని చెప్పి వాహనమును తెచ్చి నిలిపేను. దామిని మీనాక్షిలు వెనక కూచోన్నాగా వాహనము ఉక్కు క్లబ్ ను చేరెను. 

పది కిలో మీటర్లు  విస్తీర్ణము గల వి ఎస్ పి  టి ( స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ ) నందు  ఐదవ సెక్టారు ఉక్కు క్లబ్  నందు వర్షునకు ఘన సన్మానము జరిగెను. మంజూష , మాలిని , రంజని,  కేశవుడు, భానోజీరావుగారు , కళాకారుల బృందం , భారతవర్ష పనిచేయు మజ్దూర్ సంఘము , కళాభిమానులు  ఇంకనూ పత్రకారులు,  దృశ్యమాధ్యమ వార్తా ప్రతినిధులు , హాజరు అయ్యిరి 600 మంది కూర్చొనుటకు( సిట్టింగ్ కెపాసిటీ ) 900 మంది నిలబడి యుండుటకు ( ఫ్లోటింగ్ కెపాసిటీ ) వసతిగల క్లబ్ మండపము పూర్తిగా నిండిపోయి నందిని ఉన్ననూ ఎవరికీ కాన రాలేదు. కార్యక్రమము మొత్తము   వార్త దృశ్య ప్రసారము గావించబడెను. కర్మాగారం  ఆరుగురు డైరెక్టర్లలో ఒక్కరైన  పట్నాయక్ గారు కాలభై మాని డాక్టర్  భానోజీరావు మిత్రులు.  

" ఒక  పండిత వరేణ్యుడు  , సాహితీవేత్త , శతావధాని రాష్ట్ర ప్రజలు మెచ్చిన  శ్రీకృష్ణ పాత్రధారి ఇచ్చట ఈ ఉక్కు కర్మాగారమందు  శారీరక శ్రమ చేయుచున్నడిని తెల్సి తల్లడిల్లినాను. ఈ సన్మానము చేయుట మన అందరి అదృష్టము. భారతవర్షని డైరక్టర్ కి  సలహాదారుగా నియమించుచున్నాను" అని అతడి అంగీకారమును కోరెను. వర్ష మాట్లాడుచూ  " డైరక్టరుగారి కళాభిమానానికి , భాషాభి మానానికి వందనములు ,  సహృదయముతో వారిచ్చిన పదవికి కృతఙ్ఞతలు కానీ ఈ కర్మాగారమందు సలహాదారులు గా  సాంకేతిక   నిపుణులను  నియమించుకొనుట నేనెరుగుదును భాషావేత్త ఒక్క రవ్వయిననూ ఉపయోగములేదు నాకు సహాయపడవలెనన్న వారి మంచి బుద్ధి , ఔదార్యమునకు కృతఙ్ఞతలు కానీ ఆపదవి నేను చేపట్టజాలను, అని సున్నితముగా తిరస్కరించెను. పిదప కళాకారులందరికి సన్మానమును జరిగినవి. సత్య భామ పాత్రధారి వేదికపైకి పోగా పలువురు హర్షధ్వనులు చేసిరి. రంజని కి కేశవునకు కూడా సన్మానము జరిగెను.  వర్షుడు కూడా కేశవునకు ఒక శాలువా కప్పెను. చివరిగా పట్నాయక్ గారు భారతవర్షకు ఒక లక్షరూపాయలు బహుమతి గానివ్వగా వర్షుడా పైకమును మజ్దూర్ సంఘమునకు కానుకగానిచ్చెను. సభ ముగిసెను.    





Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...