Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, September 16, 2021

భారతవర్ష భాషా వైవిధ్యం

భారత వర్ష లో వాడిన భాష ఒక్క తీరుగా ఉండదు. పండితులకు పామరులకు వేరు వేరు భాషలు వాడబడ్డాయి. ఇది కాక నేటి ఆధునిక యుగమున మాట్లాడుకొని సినిమాభాష కూడా వాడబడినది పండితుల సంభాషణలు 

ఆ సందీపునెట్లు వలచితివి, అతడియందే  సుగుణములు చూచినావు?  నీ మూలమున  నేడానంద నిలయమున ఆనందము అడుగంటినది. దుస్వప్నమందైననూ ఇట్టి దారుణ పరాభవ మునూహింపమే, అట్టిదారుణము నీమూల ముగా వాటిల్లినది  నీబుద్ధిహీనతకు చిత్తచాంచల్యమునకు హద్దు లేకుండెను. 

మంజూష: సమీరము వలె రేగి  సమీకమును  సృష్టించి ఉగ్ర నరసింహుని వలె ఊగ నేల?  కలము పట్టిన వాడు చేత ఖడ్గము పట్టి అడరి బరి యందు అరిమూహము నదిలించనేల? నీ ఉద్రేకము చాలింపుము. నీ ఉద్రేకమునకు నా జీవితమును హారతి కర్పూరము చేయవలదు. 

మాలిని:  సోమ యజ్ఞాల సోముగ శోభిల్లు పండిత వంశమున బుట్టి సోమమునుజూపిన,  పెంచిన హృదయము తల్లడిల్లె,    సోమకోర్వలేని సుకుమారుడను కొని రాకుమారుని వలే సాకిన నాకుమారుడు  కావ్య కవితా ఛత్రపతి వలె వెలుగొందవలె, తలపులందు గేయములుండవలె తలనిండా గాయములున్నచోహ్లాదమగునా?!

 పామరుల సంభాషణలు 

ఆది : ఒలేయ్ పైడి నీ ల్లొట్రాయే , వేన్నీలు బేగొట్రాయే

పైడి : కుక్కనాఁగ కయ్ కయ్ మనరుత్తావెందుకు. వేన్నీలు వేన్నీలు అనిరిత్తేతొచ్చేత్తాయేట్రా! టవ్వు మీదెట్టేను కూకో! కాళ్ళు సేతులు అన్నీ సరిగ్గున్నాయా ఇరిగిపడిపోనాయాఓపాలి సూసుకో!   ఆ బాబుని సూసి కూడా ఎల్లేర్రా!  బుర్రతక్కు వెధవల్లారా. 

దాసు : ఓలమ్మ  ఇప్పుడేటనకే,  ఒళ్ళంతా పచ్చిపుండైపోనాది, ఇరగ్గొట్టేసాడు. పైడి “ఆ బుద్దప్పుడే టైపోనాదీ కడుపుసేసి ఒగ్గేత్తూ రుకుంటార్రా! నాయం ఉండాలిరా రగి డీసెదవల్లాగా !”

ఆది “బావ మాటలు వినెల్లి దెబ్బైపోనాం  బావో , ఇంకెప్పుడెల్లము ఆవర్స గాడి జోలికి.”  పైడి ఆదితో “ ఇంతకీ మీబావేడిరా , ఈడు ఎక్కడ దూరేశాడ్రా ?” దాసు “ఇంతవరకు ఆ అరుగుమీద దొల్లేడు   ఇప్పుడే లోపలికెల్లిపోనాడు. పైడి “ఏటి తాగేసి తొంగుండిపోనాడేటి? దెబ్బలు తగిలితే ఆడదే సేత్తాడు. పైడి పెంచలయ్య చేతిలో తుపాకీ చూసి “ఒరిదిగో ఎలిపొచ్చినాడ్రా!  ఓలమ్మో టుపాకటు కొచ్చాడు పిచ్చెక్కిపో నాదీడికి.

సినిమాభాష

షిట్! పిచ్చిపుష్పాలే రాత్రిళ్ళు గుడికెళతాయి. మనలాటోల్లు ఏ బార్కో ఎల్లాలి! 

కశ్యపా ఇంత నీచభాషణ మెందుకు, నీ  తీరేమి ఇట్లు జారిపోవుచున్నది ?  ఆంగ్ల మిళిత వ్యవహారికమే మా ఇంట చులకన చేసెదరు ఇంక ఇటువంటి భాష ఆడిన మనకేమి విలువ ఉండును?”

“మీది క్లాసికల్ తెలుగు అంటే గ్రాంధికం, ఒక రకం గా చెప్పాలంటే రాచ భాష ఒకప్పుడు వెర్రి పువ్వులు, వెర్రి పుష్పాలు  ఇలాటి భాష అస్సలు ఉండేది కాదు.నువ్వు అప్డేట్ అవ్వలేదు గానీ  అందరూ అప్డేట్ అయిపోయారు.  ఇప్పుడు సిని మాలు చూసి ఆడవాళ్లు కూడా ఇలాటి భాష ఫ్రీగా ఎక్కడపెడితే అక్కడ మాట్లాడేస్తున్నారు. మనం ఎన్ని బూతులు మాట్లాడిన ప్రజలు మననే కొలుస్తారు.”

ఇందులో చెడిపోవుటకేమున్నది? కళ్యాణోత్సవాల్లో పాల్గోవాలని  ఆమె తపించుచున్నదినాకొరకు ఎదురు చూచుచుండును

నీ యమ్మ ఏటా భాష ? నీ యమ్మ వింటుంటే బ్రహ్మనందం కామెడీలాఉంది. ముందు భాష మార్చునాకు పిచ్చెక్కుతున్నాదిఇంతకీ  హరికథలు వినేస్తే  బాగుపడతారానా మీ అమ్మ ఉద్దేశ్యం?

మన సంస్కృతి సనాతనధర్మము గురించి మనం తెలుసుకోవాలని.

హు.. సనాతన ధర్మం! షిట్! టీవీ కావాలా సనాతనధర్మం కావాలా అంటే విసిరిపారేస్తారు సనాతన ధర్మాన్ని.  అవకాశం వస్తే ఎప్పుడు విదేశాలు దొబ్బేదామా అని చూసేవాళ్ళే, గుంట దొరికితే ఎప్పుడు ఎక్కేద్దామా అని చూసేవాళ్ళే అంతా. ఫకింగ్ హిపోక్రసి! నోరిప్పితే నీతులు,  ఆర్డ నరీ క్లాస్ పూర్ క్లాస్ లో ఇదొక కంపల్షన్

ఈ మూడింటిలో  ఏ భాష బాగుంది? ఏ భాష బాగా రాయగలిగాను?

2 comments:

  1. All slangs are good.But the slang of Bharatavarsha's family is awsome

    ReplyDelete
  2. You are the lover of classical Telugu

    ReplyDelete